సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని శనివారం కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆవిష్కరిస్తారు.
ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని రామంతాపూర్ ప్రధాన రహదారిలో కేంద్రమంత్రి దత్తాత్రేయ ఆవిష్కరిస్తారని ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు. శనివారం ఉదయం 6.30 గంటలకు విగ్రహావిష్కరణ అనంతరం 5000 మందితో తిరంగా యాత్రను మంత్రి ప్రారంభిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు.