Sardar Vallabhbhai Patel
-
రాజరికం నుంచి జనతా సర్కార్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఐదు వందలకు పైగా స్వతంత్ర రాజ్యాలు ప్రిన్సిలీ స్టేట్స్ పేరుతో ఉన్నాయి. వీటిని దేశంలో విలీనం చేయడానికి అప్పటి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నించారు. ఈమేరకు నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి బస్తర్ మహారాజుగా ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్ హాజరై విలీన ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో దేశంలో 13వ పెద్దరాజ్యంగా ఉన్న బస్తర్ స్టేట్ భారత్‌లో 1948 జనవరి 1న విలీనమైంది.ప్రవీర్సేన పేరుతో పోటీఓ వైపు మహారాజుగా కొనసాగుతూనే మరోవైపు 1957లో కాంగ్రెస్ పార్టీ తరఫున జగదల్పూర్ స్థానం నుంచి ప్రవీర్‌చంద్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే మహారాజుగా తనకు దక్కాల్సిన హక్కుల విషయంలో భారత ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేక ఇరు పక్షాల మధ్య అనుమాన బీజాలు మొలకెత్తాయి. మరోవైపు బ్రిటీష్ కాలం నుంచి ఉన్న బైలడిల్లా గనులపై పట్టు కోసం కేంద్రం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో ఇటు కేంద్రం, అటు బస్తర్ మహారాజు మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు పక్కాగా అమలు చేయాలని మహారాజు ప్రవీర్‌చంద్ర గళం విప్పడం మొదలెట్టారు. ఆ తర్వాత అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ప్రవీర్సేన పేరు మీద అభ్యర్థులను బరిలో నిలబెట్టి 11 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో బస్తర్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు.హత్యకు గురైన నాటి బస్తర్ మహారాజు ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్ కేంద్రంపై పోరాటంరాజా ప్రవీర్‌చంద్ర లెవీ విధానాన్ని వ్యతిరేకిస్తూ చిత్రకూట్ జలపాతం దగ్గరున్న లోహండిగూడా దగ్గర వేలాది మందితో బహిరంగసభ నిర్వహించారు. ఆ తర్వాత రైళ్లలో న్యూఢిల్లీ వరకు పెద్ద సంఖ్యలో ఆదివాసీలను తీసుకెళ్లి పార్లమెంట్ ముందు భారీ నిరసన వ్యక్తం చేశారు. దీంతో బస్తర్‌లో అశాంతికి కారణం అవుతున్నాడనే నెపంతో ప్రవీర్చంద్రను అరెస్ట్ చేసి నర్సింగాపూర్ జైల్లో బంధించారు. మహారాజుపై దేశద్రోహి అనే ముద్రను వేసి జైలులో పెట్టడంతో బస్తర్ అట్టుడికిపోయింది. ప్రజాగ్రహం అంతకంతకూ పెరుగుతుండటంతో రాజును విడుదల చేసిన ప్రభుత్వం ఆయనకు ఉన్న హోదాలను రద్దు చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది.నక్సల్బరీబస్తర్ మహారాజు ప్రవీర్‌చంద్ర మహారాజ హత్య జరిగిన మరుసటి ఏడాదే బెంగాల్లో చారుమజుందార్ ఆధ్వర్యంలో 1967లో నక్సల్బరీ పోరాటం మొదలైంది. వర్గశత్రువు రక్తంలో చేతులు ముంచనిదే విప్లవం రాదంటూ ఆయుధాలు ఎక్కుపెట్టిన చారుమజుందార్ భావావేశం అనతికాలంలోనే ఆంధప్రదేశ్‌ను చుట్టుముట్టింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. ఇక్కడి పల్లెల్లో విప్లవాగ్నులు రగిలించిన నక్సలైట్లు, గతంలో అన్నమదేవుడు నడిచిన పాతదారిలోనే వరంగల్ మీదుగా గోదావరి దాటి బస్తర్ అడవుల్లోకి 1980వ దశకంలో వెళ్లారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వ పాలనలో అధికారుల దాష్టీకాలతో విసిగిపోయిన ఆదివాసీలకు విప్లవ భావాలు కొత్త దారిని చూపాయి. ఫలితంగా పదిహేనేళ్లు గడిచే సరికి అక్కడ నక్సలైట్లకు కంచుకోటగా మారింది. జనతా సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి మావోయిస్టులు చేరుకున్నారు. దీనికి ప్రతిగా అప్పుడు ఆపరేషన్ గ్రీన్‌హంట్ ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఇరువర్గాల మధ్య పోరులో బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారుతోంది. ఇప్పటి వరకు అన్ని వైపుల నుంచి ఏడువేల ఐదు వందల మంది చనిపోయారు.మహారాజు హత్యమహారాజునైన తన హక్కులకే దిక్కు లేనప్పుడు ఇక ఆదివాసీల çపరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే భావనతో ధిక్కార స్వరాన్ని రాజా ప్రవీర్‌చంద్ర మరింతగా పెంచారు. ఈ క్రమంలో ప్యాలెస్‌లో మద్దతుదారులతో ఆందోళన చేస్తున్న ప్రవీర్చంద్రను పోలీసు దళాలు చుట్టుముట్టాయి. ఆందోళనకారుల్లో కొందరిని విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆదివాసీలు బాణం, బల్లెం చేతబట్టి పోలీసులపైకి దాడికి సిద్ధమయ్యారు. ఆదివాసీ సైన్యంతో రాజు తమపై దాడికి దిగారని, ఫలితంగా ఆత్మరక్షణ కోసం తాము కాల్పులు జరిపామంటూ పోలీసులు చెప్పారు. 1966 మార్చి 25న జరిగిన ఈ కాల్పుల్లో మహారాజు ప్రవీర్ చంద్ర చనిపోయారు. ఈ ఘటనతో సుమారు 650 ఏళ్లుగా సాగుతున్న రాజరిక పాలన స్థానంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన బస్తర్‌లో మొదలైంది. -
వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: భారతరత్న సర్ధార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఇరువురి చిత్రపటాలకు పూలు సమర్పించి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ రేపాల శ్రీనివాసరావు, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పాల్గొన్నారు. చదవండి: (రాష్ట్రానికి విశాఖే భవిష్యత్.. త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన) -
తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన సెప్టెంబర్ 17.. అసలేం జరిగింది?
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా? నిజాం రాజు పాలన ఎలా అంతమయ్యింది? సాయుధ పోరాటం ఏమేరకు నిజాంను గద్దె దించగలిగింది? హైదరాబాద్‌పై పోలీస్ యాక్షన్ పేరుతో జరిగింది ఏంటి? నిజాంపై యుద్ధం చేయడంలో నెహ్రూ-పటేల్ పాత్ర ఏంటి? అసలు సెప్టెంబర్-17న ఏంజరిగింది? సెప్టెంబర్-17. తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. శతాబ్దాల బానిస సంకెళ్లను తుంచేసిన ఉద్విగ్న సందర్భం. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణం. రాజరికం పరిసమాప్తమై ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన అద్భుత పరిణామం. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. నా దేశం భారతదేశం అని గర్వంగా ప్రతీ తెలంగాణా పౌరుడు నినదించిన తారీఖు సెప్టెంబర్-17. అందుకే తెలంగాణా చరిత్రలో ఈ తేదీ సువర్ణాక్షర లిఖితం. సెప్టెంబర్ -17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిందా లేక తెలంగాణా ప్రజలకు నిజాం కబంధ హస్తాల నుంచి విమోచనం లభించిందా అనే అంశంపై భిన్న వాదనలున్నాయి. దీనిపై వాదించేవారు ఎవరైనా తమకు అనుకూలమైన వాదనలనే తెరమీదికి తీసుకువస్తారు. 1948 సెప్టెంబర్-17న పోలీసు చర్యతో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. దీంతో తెలంగాణా ప్రాంతం భారతదేశంలో విలీనమైనపోయినట్లేనని చాలా మంది వాదన. అందుకే సెప్టెంబర్-17ను విలీన దినోత్సవంగా జరపాలంటారు. అయితే సెప్టెంబర్-17న తెలంగాణా పూర్తిగా భారతదేశంలో విలీనం కాలేదనేది కూడా అంతే వాస్తవం. సాంకేతికంగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చేవరకు తెలంగాణా నిజాం పాలనలోనే ఉంది. అయితే పేరుకే నిజాం ప్రభువు అయినప్పటికీ ఇక్కడ పౌరప్రభుత్వం ఏర్పాటు నుంచి సైనిక శక్తి అంతా భారత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో నిజాం దుష్టపాలన నుంచి ఖాసీం రజ్వీలాంటి రజాకార్ నాయకుల నుంచి తెలంగాణా ప్రజలు విముక్తి పొందారు. అందుకే సెప్టెంబర్-17ను విమోచన దినంగా పరిగణించాలని మరికొందరివాదన. సెప్టెంబర్-17న తెలంగాణా విలీనం జరిగిందా లేక విమోచన జరిగిందా అనే చర్చ సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది. అయితే 1948 సెప్టెంబర్-13 నుంచి 17వ తేదీ వరకు జరిగిన పోలీసు చర్య వల్లే తెలంగాణా నిజాం పాలన నుంచి విముక్తి పొందిందనేది అందరూ అంగీకరించే వాస్తవం. హైదరాబాద్ సంస్థానంను చుట్టుముట్టిన భారత సైన్యం హైదరాబాద్ నగరానికి చేరుకుని నిజాంను లొంగదీసుకున్న ఆపరేషన్ పోలో తెలంగాణా చరిత్ర గతిని మార్చేసింది. తెలంగాణా ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రసాదించింది. ఇంతటి కీలక పరిణామాలకు కేంద్రబిందువైన ఆపరేషన్ పోలోకు ముందు చాలా తతంగమే నడిచింది. అయితే ఆపరేషన్ పోలో 5 రోజుల్లో ముగిసిపోయినా సైనిక చర్య తప్పదనే సంకేతాలు 13 నెలల ముందే అంటే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే కనిపించాయి. -
సామ్రాజ్య భారతి: ముఖ్యమైన ఘట్టాలు, చట్టాలు, జననాలు
ఘట్టాలు ► వేల్స్ రాకుమారుడు ఆల్బర్ట్ ఎడ్వర్డ్ (ఫొటోలో ఏనుగు పాదం వైపు నిలబడి ఉన్న వ్యక్తి) ఇండియాను సందర్శించారు. ఇండియా రాణి క్వీన్ విక్టోరియా తరఫున ఆ రాజమాత కుమారుడైన ఆల్బర్ట్ ఎడ్వర్డ్ అధికారిక హోదాలో ఇండియా వచ్చి, ఇండియా నచ్చి ఇక్కడే ఏడాది పాటు ఉండి వెళ్లారు. ► ఇప్పటి ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ‘ముహమ్మదన్ ఆంగ్లో–ఓరియెంటల్ కాలేజ్’ స్థాపించారు. ఆ కాలే జే 1920లో ‘అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ’గా మారింది. ► స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. చట్టాలు ► మెజారిటీ యాక్ట్, టోల్స్ ఆన్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ యాక్ట్ జననాలు ► సర్దార్ వల్లభాయ్ పటేల్: రాజనీతి జ్ఞులు, భారతదేశ తొలి ఉప ప్రధాని. నందకిశోర్ బల్ : ఒరియా కవి; అన్వర్ షా కశ్మీరీ : కశ్మీరీ ముస్లిం పండితులు, ఢిల్లీలోని మదరసా అమీనియాకు తొలి ప్రిన్సిపాల్ (ఉత్తర ప్రదేశ్); తేజ్ బహదుర్ సప్రూ: స్వాతంత్య్ర సమరయోధులు, న్యాయవాది, రాజకీయవేత్త, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన నిపుణులలో ఒకరు; హమిద్ అలీఖాన్ బహదూర్ : రాంపుర్ సంస్థానాదీశులు; రాజా సర్ మార్తాండ భైరవ తొండైమాన్ బహదూర్ : పుదుక్కోట్టై సంస్థానాధీశులు; దౌలత్ సింగ్ : ఐదర్ మహారాజు, కమాండర్ (గుజరాత్); టి.విజయ రాఘవాచార్య : ఐ.ఎ.ఎస్, కొచ్చిన్ దివాను (తమిళనాడు). -
సర్దార్ పటేల్ మరికొంత కాలం బతికుంటే.. గోవా విమోచన ముందే జరిగేది
పనాజి: సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ మరికొంత కాలం బతికుంటే పోర్చుగీసు పాలన నుంచి గోవా విమోచన ముందే జరిగేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మనకు 1947 స్వాతంత్య్రం వచ్చినప్పటికీ గోవా చాలాకాలం పోర్చుగీసు పాలనలోనే ఉండిపోయింది. భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ను చేపట్టి 1961 డిసెంబరు 19న గోవాకు వలసపాలన నుంచి విముక్తి కల్పించింది. గోవా భారత్‌లో భాగమైంది. ఆదివారం 60వ గోవా విమోచన దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మోదీ మాట్లాడుతూ... సర్దార్ పటేల్ గనక మరికొన్ని రోజులు బతికి ఉంటే గోవా ప్రజలు 1961 కంటే చాలాముందుగానే స్వేచ్ఛావాయువులు పీల్చేవారని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పనిచేసిన పటేల్ 1950 డిసెంబరు 15న తుదిశ్వాస విడిచారు. నిజాం పాలనలోని ప్రస్తుత తెలంగాణ, మరఠ్వాడా, కల్యాణ కర్ణాటక (ఐదు జిల్లాలు)తో సహా దేశంలోని పలు సంస్థానాలను భారత్‌లో విలీనం చేసి పటేల్ ఉక్కుమనిషిగా పేరొందారు. గోవా విమోచన ఆలస్యం కావడానికి నెహ్రూయే కారణమని గతంలో పలువురు బీజేపీ అన్నారు. గోవా విమోచన కోసం పోరాడిన స్థానికులకు, ఇతర ప్రాంతాల వారికి నివాళులర్పించిన మోదీ వారి కృషిని కొనియాడారు. భారత స్వాతంత్య్రంతో గోవా విమోచన పోరాటం ఆగిపోకుండా నాటి సమరయోధులు చూసుకున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చినా... దేశంలోని ఒక భాగమైన గోవా (డయ్యూ– డామన్తో కలిసి) ఇంకా పరాయిపాలనలోనే ఉందనే భావనతో స్వతంత్ర ఫలాలను భారతీయులు పూర్తిగా ఆస్వాదించలేకపోయారన్నారు. అందుకే పలువురు స్వాతంత్య్ర సమరయోధులు సర్వస్వం వదిలి గోవా ప్రజలతో కలిసి విమోచన కోసం పోరాడారన్నారు. శతాబ్దాల తరబడి వలస పాలకుల ఆధీనంలో ఉన్నప్పటికీ గోవా ప్రజలు తమ భారతీయతను మర్చిపోలేదన్నారు. అలాగే మొఘలాయిల పాలనలో మగ్గిన భారత్ కూడా గోవాను ఏనాడూ మరువలేదన్నారు. సుపరిపాలనలో పలు అంశాల్లో ముందంజలో ఉన్నందుకు గోవా ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు. తలసరి ఆదాయం, బడుల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు, ప్రతి గడపకూ వెళ్లి చెత్త సేకరణ, ఆహార భద్రత అంశాల్లో గోవా అగ్రస్థానాన ఉందని మోదీ వివరించారు. దివంగత మాజీ సీఎం మనోహర్ పారిక్కర్‌ను గుర్తుచేసుకున్నారు. గోవాకు ఉన్న వనరులు, అవకాశాలను చక్కగా గుర్తించి అభివృద్ధి పథాన నడిపారని పారిక్కర్‌ను కొనియాడారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ మిరామర్‌లో వాయుసేన, నావికాదళ విన్యాసాలను తిలకించారు. -
పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్.. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదే విధంగా భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఓటీఎస్‌తో పేదలకు రూ.16 వేల కోట్ల లబ్ధి -
స్వేచ్ఛా విగ్రహం కంటే ఐక్యతా విగ్రహమే ఘనం
అహ్మదాబాద్: అమెరికాలోని స్వేచ్ఛా విగ్రహం(స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ) కంటే గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని(స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) సందర్శించడానికే ఎక్కువ మంది వస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గుజరాత్‌లోని గిరిజన ప్రాంతమైన కేవాడియాలో నెలకొల్పిన ఈ విగ్రహాన్ని 2018 అక్టోబర్‌లో ప్రారంభించగా, ఇప్పటివరకు 50 లక్షల మంది సందర్శించారని పేర్కొన్నారు. అహ్మదాబాద్, వారణాసి, దాదర్, హజ్రత్ నిజాముద్దీన్, రేవా, చెన్నై, ప్రతాప్‌నగర్ ప్రాంతాలను కేవాడియాతో అనుసంధానించేందుకుగాను కొత్తగా 8 రైళ్లను ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ రైళ్లతో ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐక్యతా విగ్రహాన్ని చూసేందుకు వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నిత్యం లక్ష మంది ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తారని ఒక సర్వేలో తేలిందని వివరించారు. దబోయి, చందోడ్, కేవాడియా రైల్వే స్టేషన్లను, దబోయి–చందోడ్, చందోడ్–కేవాడియా బ్రాడ్‌గేజ్ లైన్లను, నూతనంగా విద్యుదీకరించిన ప్రతాప్‌నగర్–కేవాడియా సెక్షన్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఒకే గమ్యస్థానానికి చేరుకునే 8 రైళ్లకు ఒకే సమయంలో పచ్చజెండా ఊపడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. కేవాడియా అనేది ఇకపై మారుమూల చిన్న పట్టణం కాదని, ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారబోతోందని స్పష్టం చేశారు. పర్యావరణ హిత రైల్వే ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. అందుకు కేవాడియా రైల్వే స్టేషన్ ఒక ఉదాహరణ అని చెప్పారు. మోదీ ప్రారంభించిన 8 రైళ్లలో అహ్మదాబాద్–కేవాడియా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. ఈ రైల్లో ప్రత్యేక ఏమిటంటే ఇందులో విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నాయి. కోచ్ కిటీకలు, తలుపులే కాకుండా పైభాగాన్ని కూడా అద్దాలతోనే తీర్చిదిద్దారు. -
పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్వాతంత్ర్య సమరయోధులు, భారత తొలి హోం మంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్, ఆంధ్ర రాష్ట్ర సాధనలో అమరుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి పాల్గొన్నారు. చదవండి: (వైఎస్సార్ పంటల బీమాను ప్రారంభించిన సీఎం జగన్) -
పటేల్‌కు ప్రధాని మోదీ నివాళి
గాంధీనగర్ : దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. గుజరాత్‌లోని ప్రఖ్యాత ఐక్యతా విగ్రహం వద్ద నిర్వహించిన ఏక్తా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏక్తా దివస్ పరేడ్‌లో పాల్గొని.. ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నివాళులర్పించారు. మోదీ రాక సందర్భంగా పటేల్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు దేశ వ్యాప్తంగా పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఐక్యతా శిల్పం దగ్గర పర్యాటక కేంద్రాలు కెవడియా(గుజరాత్): రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నర్మద జిల్లాలోని ప్రఖ్యాత ‘ఐక్యతాశిల్పం(స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)’కి దగ్గరలో నాలుగు పర్యాటక ప్రదేశాలను ప్రారంభించారు. ఔషధ మొక్కలతో 17 ఎకరాల్లో విస్తరించిన ఆరోగ్య వనాన్ని మొదట ప్రారంభించారు. ఈ ఆరోగ్య వనంలో 380 రకాలకు చెందిన సుమారు ఐదు లక్షల ఔషధ మొక్కలున్నాయి. ఆ తరువాత, వివిధ రాష్ట్రాల చేనేత, చేతి వృత్తుల ఉత్పత్తులను పర్యాటకులు కొనుగోలు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఏక్తామాల్‌ను ప్రారంభించారు. ప్రధానితో పాటు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఈ రెండంతస్తుల భవనంలోని పలు ప్రదర్శన శాలలను సందర్శించారు. అనంతరం 35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన చిన్నారుల పౌష్టికాహార పార్క్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ తరహా టెక్నాలజీ ఆధారిత థీమ్ పార్క్ ప్రపంచంలోనే మొదటిదిగా భావిస్తున్నారు. ‘సరైన పోషణ.. దేశానికి వెలుగు’ నినాద స్ఫూర్తితో చిన్నారులను ఆకర్షించే 47 రకాల ఆకర్షణలు ఇందులో ఉన్నాయి. అనంతరం 375 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ‘జంగిల్ సఫారీ’ని మోదీ ప్రారంభించారు. ఈ అత్యాధునిక జంతు ప్రదర్శన శాలలో పులులు, సింహాలు సహా 100 జంతు, పక్షి జాతులు ఉన్నాయి. మరి కొన్ని కార్యక్రమాల్లో ప్రధాని శనివారం పాల్గొననున్నారు -
భారత ఐక్యతా వారధి సర్దార్ పటేల్
సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప దేశభక్తుడు, రాజనీతి జ్ఞుడు. దేశ సమగ్రత, సమైక్య తపట్ల దృఢమైన సంకల్పం, ఆయన దూరదృష్టి, చాతుర్యం దేశాన్ని తొలినాళ్లలో పలు విపత్కర సమస్యలని ఎదుర్కొని ముందుకు నడిపించడానికి ఇతోధికంగా తోడ్పడ్డాయి. ప్రముఖంగా రెండు ఘట నలను ప్రస్తావిస్తాను. గుజరాత్‌లోని జాం నగర్ పూర్వ రాజైన జాం సాహిబ్‌కు సంబంధించినది. అధికార బది లీకి ఇంకా రెండు నెలలు గడువు ఉండగా,ఈలోపే కతియవార్ రాష్ట్రాలన్నింటినీ కలిపి పాకిస్తాన్ సహా యంతో ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని తోటి సంస్థానాధీశులను కలవబోతున్నాడని తెలుసుకొన్న పటేల్ ఇక సమయాన్ని వృథాచేయకుండా జాం సాహిబ్ సోదరుడైన కల్నల్ హిమ్మత్ సింగ్ ద్వారా వారిని తన ఇంటికి విందుకి తీసుకురావాలని కోరాడు. భోజనసందర్భంలో పటేల్ తన ఆత్మీయతతో, ప్రేమతో జాంసాహిబ్, మహారాణి వారి హృదయాలని గెలుచుకున్నాడు. దీంతో జాంసాహిబ్ స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలనే ప్రణాళికను విరమించుకున్నాడు. మరో సంఘటన షేక్ అబ్దుల్లాకు సంబంధించినది. రాజ్యాంగ పరిషత్తులో ఆర్టికల్ 370ని చర్చిస్తున్న సమయంలో అసహనంతో ఉన్న షేక్ అబ్దుల్లా తన స్థానం నుండి లేచి, ‘నేను తిరిగి కశ్మీరుకు వెళుతున్నాను’ అని సభలో ప్రకటించాడు. దీంతో ప్రధాని నెహ్రూ లేని కారణంగా అక్కడే ఉన్న పటేల్.. కశ్మీర్ వెళ్లడానికి రైలు పెట్టెలో కూర్చున్న అబ్దుల్లాకు ‘ఈరోజు సభను వదిలివెళ్లగలవు కానీ ఢిల్లీని మాత్రం విడిచి వెళ్ళలేవు’ అనే సందేశాన్ని తెలియజేశారు. దాని పరిణామాలను గ్రహించిన షేక్ అబ్దుల్లా రైలు నుంచి దిగి తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. అంతటి గట్టి సందేశాన్ని నిర్భీతితో ఇవ్వగల ధీశాలి పటేల్. జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచనలను, భావాలను సరైన దృష్టికోణం నుండి అర్థం చేసుకున్న రాజకీయ నాయకులలో సర్దార్ పటేల్ ఒకరు. గాంధీజీ స్వరాజ్యం నుంచి సురాజ్యం గురించి చెబితే, సర్దార్ పటేల్ గారు స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్పు చేసే సుపరిపాలనకు, సంస్కరణకు దారితీసిన ఆద్యుడు. వల్లభాయ్ పటేల్ 1917 నవంబర్‌లో మొదటిసారి గాంధీజీతో పరిచయం ఏర్పడ్డప్పుడు ఆ సమయంలో వారి వేషధారణ హ్యాట్, సూట్, బూట్, ఇంగ్లిష్తో పాశ్చాత్యమైనది. కానీ గాంధీజీ సంపర్కంతో పూర్తిగా పరివర్తన చెంది ఖాదీ, ధోతి, కుర్తా, చెప్పులు స్వీకరించి స్వదేశీ వస్త్రధారణలోకి వచ్చారు. గాంధీజీ సత్య, అహింస సిద్ధాం తాల ప్రభావంతో, పటేల్ విదేశీ వస్తువులని, దుస్తుల్ని బహిష్కరించినారు. జాతీయ వ్యవహారాలలో అత్యంత కఠినంగా వ్యవహరించే పటేల్ వ్యక్తిగత విషయాలలో మాత్రం మృదువుగా ఉండే వారు. పటేల్‌తో సమావేశమై సంభాషించిన తర్వాత.. మన దేశ భవిష్యత్తు సరైన నాయకత్వం చేతుల్లో సురక్షితంగా ఉందని భావిస్తున్నాను అని జంషెడ్ జీ టాటా అన్నారు. భారత్ తొలి హోంమంత్రిగా వ్యవహరించే రోజుల్లో తన ఇంటికి ఔపచారికంగా నలభై–యాభై మంది ఐసీఎస్ అధికారులను పిలిపించుకొని వారితో దేశ ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా సేవా భావనతో, మెలగాల్సి ఉంటుందనీ, మంత్రులు ఐదేళ్లకు వస్తుంటారు పోతుం టారు కానీ మీరు ఈ వ్యవస్థలో దీర్ఘకాలంగా పని చేసేవారు, అందుకే స్వతంత్రంగా నియమావళి ప్రకారం మెలగాలనీ కోరారు. 565 పైగా సంస్థానాలను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడం వారి దృఢమైన సంకల్ప శక్తికి, నాయకత్వ సామర్థ్యాలకు నిదర్శనాలు. జూనాగఢ్ సంస్థానం సౌరాష్ట్రకు సమీపంలో ఉన్న ఒక చిన్న రాచరిక రాజ్యం. దాని నవాబు పాకిస్తాన్లో విలీనం చేస్తామని ప్రకటించినప్పుడు అత్యధిక ప్రజలు భారత్‌లోనే విలీనం కావాలని కోరుకున్నారు. అపుడు పటేల్ భారత సైన్యాన్ని జూనాగఢ్ సంస్థానానికి పంపి 1947 నవంబర్ 9న జూనాగఢ్‌ను భారతదేశంలో విలీనం చేశారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబు తమ సంస్థానానికి సొంత కరెన్సీ, రైల్వే సైనిక వ్యవస్థను కలిగి ఉండడంతో హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటిం చుకోవాలనే వాంఛ. అతను విలీనం కాకుండా భారత యూనియన్‌తో సంబంధాలు మాత్రమే కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని పటేల్ గ్రహించి నిజాంకు సమయం ఇవ్వడం ఉత్తమమని భావించారు. లార్డ్ మౌంట్‌బాటన్, నె్రçహూ సైతం నిజాంకు సాన్నిహిత్యంగా ఉండేవారు. వారు పటేల్‌తో చర్చలు జరిపి హైదరాబాద్ సంస్థానంపై సైనికచర్య ఉండవద్దని నిర్ణయించారు. దీన్ని ఆసరాగా తీసుకున్న నిజాం నవాబు ఒకవైపు విదేశాలతో సంబంధాలు నెరపుతూ మరోవైపు ఆయుధాలు కొనుగోలు చేస్తూ తన సైనిక శక్తిని పెంచుకొన్నారు. సంస్థానంలో హిందూ ప్రజలపై పైశాచిక దాడులను చేసి, మతాంతరీకరణలను ప్రోత్సహించారు. ఇంకోపక్కన ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌ను స్థాపిం పజేశారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లను పెంపొందింప జేశారు. దీన్నంతటినీ పటేల్ బాగా గమనిస్తూ హైదరాబాద్ రాష్ట్రానికి మిలిటరీ జనరల్‌గా మున్షిని నియమించారు. ఆయన హైదరాబాద్ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారాన్ని ఇచ్చేవారు. ఆనాటి వైస్రాయి లార్డ్ మౌంట్ బాటన్ పదవీ కాలం ముగిసిన వెంటనే ఇక పాత ఒప్పం దాలు చెల్లిపోయాయని భావించిన సర్దార్ పటేల్ సాహసంతో ఆపరేషన్ పోలో అనే సైనిక చర్యను చేపట్టి రజాకార్లను అంతం చేసి హైదరాబాద్ సంస్థానాన్ని 17 సెప్టెం బర్ 1948 న భారత యూనియన్‌లో విలీనం చేసి మువ్వన్నెల భారత పతాకాన్ని ఎగరవేయించారు. అలాగే గుజరాత్‌లోని ఖేడా, బార్డోలీ ప్రాంతంలో గాంధీజీ ప్రేరణతో పటేల్ నడిపిన సత్యాగ్రహం, అపూర్వమైన రైతాంగ ఉద్యమం ఆయనకు చరిత్రలో చిరస్థానం కల్పిం చాయి. భారత ప్రభుత్వం 1991లో సర్దార్ పటేల్‌ను ‘భారత రత్న’తో సత్కరించింది. ఆయన జన్మదినాన్ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటాము, ఈ భావాం జలితో ఆయనకు నివాళులు అర్పిస్తూ వారికి శత కోటి వందనాలు సమర్పించుకుందాం. -బండారు దత్తాత్రేయ వ్యాసకర్త గవర్నర్, హిమాచల్‌ప్రదేశ్ -
అమ్మకానికి పటేల్ విగ్రహం..!
గాంధీనగర్ : భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మికంగా నిర్మించిన ఐక్యత విగ్రహం (సర్దార్ వల్లభాయ్ పటేల్) విగ్రహాన్ని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టారు. విగ్రహం ధరని రూ.30వేల కోట్లుగా నిర్ధారించారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో బాధితులకు వైద్య సదుపాయాలు, ఆస్పత్రుల నిర్మాణానికి ఈ నిధులను ఉపయోగించాలని భావించారు. అయితే పటేల్ విగ్రహాన్ని ఓఎల్ఎక్స్లో పెట్టింది ఓ నెటిజన్. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం ఓఎల్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టాడు. ‘ఎమర్జెన్సీ... స్టాచ్చూ ఆఫ్ యూనిటీ విగ్రహం అమ్మబడును. ఇది కావాలనుకున్న వారు రూ.30వేల కోట్లు చెల్లిస్తే సరిపోతుంది’ అని పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారడంతో.. ఫేక్ పోస్ట్‌గా గుర్తించి ఒఎల్ఎక్స్ సంస్థ ఆ పోస్ట్‌ను వెంటనే తొలగించింది. కాగా పటేల్ విగ్రహాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. కాగా ఓఎల్ఎక్స్ లో దీని ఖరీదుని రూ.30వేల కోట్లుగా నిర్ధారించడంతో తొలుత చూసిన వారంతా షాక్‌కి గురయ్యారు. భారత్ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అంకితమిస్తూ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. 182 మీటర్ల ఎత్తయిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా గుర్తింపు పొందింది. గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ దీవిలో దీన్ని నిర్మించారు. కాగా దీనిని ఆవిష్కరించిన దగ్గర నుంచి పర్యటకులు ద్వారా ఇప్పటి వరకు 82 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని నిర్వహకులు తెలుపుతున్నారు. -
పటేల్ స్ఫూర్తితోనే ‘370’ రద్దు
కేవాడియా/న్యూఢిల్లీ: సర్దార్ పటేల్ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్‌కు సంబంధించి ఇతర కీలక నిర్ణయాలను తీసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. పటేల్ కృషి ఫలితంగానే భారత సమాఖ్యలో విలీనమైన తెలంగాణ రాష్ట్రం విమోచన దినం జరుపుకుంటోందని తెలిపారు. 69వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం సొంతరాష్ట్రం గుజరాత్లో పర్యటించారు. సర్దార్ సరోవర్ జలాశయం వద్ద నర్మదా మాతకు పూజలు చేసి, ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. పలువురు ప్రముఖులు ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నర్మదా సరోవర్ జలాశయం పూర్తిగా(138.68 మీటర్లు) నిండిన సందర్భంగా మంగళవారం కేవాడియాలో చేపట్టిన ‘నమామి దేవి నర్మదే మహోత్సవ్’లో మోదీ పాల్గొన్నారు. 2017లో డ్యామ్ ఎత్తు పెంచాక పూర్తిగా నిండటం ఇదే తొలిసారి. అనంతరం ఆయన సర్దార్ సరోవర్ డ్యామ్‌ను, ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పటేల్ విగ్రహాన్ని బటర్‌ఫ్లై పార్కును సందర్శించి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు. కాషాయ రంగులో ఉండే ‘టైగర్ బటర్‌ఫ్లై’ని రాష్ట్ర సీతాకోక చిలుకగా ప్రకటించారు. పటేల్ కృషి ఫలితంగా భారత సమాఖ్యలో విలీనమైన తెలంగాణ ఏటా సెప్టెంబర్ 17వ తేదీన విమోచన దినం జరుపుకుంటోందన్నారు. సర్దార్ సరోవర్ జలాశయంతో గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ ప్రజల అవసరాలు తీరుతాయని తెలిపారు. ప్రముఖుల శుభాకాంక్షలు బీజేపీ చీఫ్ అమిత్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్, బీఎస్పీ చీఫ్ మాయావతి, బెంగాల్, తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ సీఎంలు మమతా బెనర్జీ, చంద్రశేఖర్‌రావు, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్ తదితరులు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ బర్త్‌డే సందర్భంగా ఢిల్లీలో వేర్వేరు చోట్ల బీజేపీ నేతలు కేక్‌లు కట్‌చేశారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో 370 కిలోల కేక్ కట్‌చేశారు. తల్లితో కలిసి భోజనం పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మాతృమూర్తి హీరాబెన్‌ను కలుసుకున్నారు. అహ్మదాబాద్ సమీపంలోని రాయిసన్ గ్రామంలోని సోదరుడు పంకజ్ ఇంట్లో ఉంటు న్న తల్లితో ప్రధాని అరగంటపాటు గడిపారు. శిరసు వంచి, చేతులు జోడించిన మోదీని హీరాబెన్ దీవించారు. అనంతరం తల్లితో కలిసి మోదీ భోజనం చేశారు. -
నెహ్రూను తగ్గించాలని కాదు
సాక్షి, బళ్లారి/అమ్రేలీ/బాగల్‌కోట: భారత తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాధాన్యతను తగ్గించేందుకు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించలేదని ప్రధాని మోదీ తెలిపారు. సర్దార్ పటేల్ తమ నాయకుడని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు, గుజరాత్లో నర్మదా నదీతీరాన నిర్మించిన పటేల్ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని ఇప్పటివరకూ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించిన మోదీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో 75 శాతం పోలింగ్.. గతంలో పుణే, అహ్మదాబాద్, జమ్మూలో తరచూ బాంబు పేలుళ్లు జరిగేవి. కానీ గత ఐదేళ్లలో ఒక్క బాంబు దాడి జరిగినట్లైనా మీరు విన్నారా? కశ్మీర్లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సందర్భంగా ఒక్క హింసాత్మక ఘటన జరగలేదు. నేను పటేల్ విగ్రహాన్ని నెహ్రూను తక్కువ చేయడానికి నిర్మించలేదు. పటేల్ విగ్రహం ఎంత ఎత్తుగా ఉందంటే, మీరు(కాంగ్రెస్ నేతలు) ఇకపై ఇతరులను తక్కువ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు’ అని అన్నారు. గుజరాత్ నన్ను దృఢంగా మార్చింది 2017లో చైనాతో డోక్లామ్ ఉద్రిక్తత సందర్భంగా కటువుగా, దృఢంగా వ్యవహరించేలా గుజరాత్ నన్ను తయారుచేసింది. గుజరాత్ ప్రజలు నాలో నైతిక విలువలను పెంపొందింపజేశారు. ఇందుకు నేను కృతజ్ఞతలు చెబుతున్నా. దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామనీ, కశ్మీర్లో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (అఫ్సా) తొలగిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అదే జరిగితే అమర్నాథ్ యాత్రికులను ఉగ్రవాదులు చంపేయరా? వైష్ణోదేవి ఆలయాన్ని భక్తులు ప్రశాంతంగా దర్శించుకోగలరా?’’ అని ప్రశ్నించారు. కేంద్రంలో మరోసారి బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మోదీ కర్ణాటక ప్రజలకు పిలుపునిచ్చారు. బాగల్‌కోట, ఛిక్కొడి, బెళగావిల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ..‘కేంద్రంలో కాంగ్రెస్ బలహీన, నిస్సహాయ ప్రధానిని నియమించాలని అనుకుంటోంది. బలమైన ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఢిల్లీ(కేంద్రం) వైపు చూడండి. బలహీనమైన ప్రభుత్వం ఎలా ఉంటుందంటే బెంగళూరువైపు చూడండి’ అని తెలిపారు. ఆమ్రేలీలో పార్లమెంటు భవంతి ఆకృతిలో జ్ఞాపికను అందుకుంటున్న ప్రధాని మోదీ -
నేనో శిల్పిని మాత్రమే..
జూబ్లీహిల్స్: నదులన్నీ సముద్రంలో కలిసినట్లు చిత్రకారులు, కళాకారులను ఒక్కచోట చేర్చడంలో ఆర్ట్‌గ్యాలరీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని సుప్రసిద్ధ శిల్పకారుడు, గుజరాత్లో సర్ధార్ పటేల్ విగ్రహ శిల్పి, పద్మభూషణ్ రామ్‌సుతార్ పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మూలగుండం ఆర్ట్ గ్యాలరీని ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అరేబియా సముద్రతీరం ముంబైలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు పనుల్లో తీరిక లేకుండా ఉన్నానని చెప్పారు. గుజరాత్‌లోని నర్మదానది తీరంలో సర్ధార్ పటేల్ విగ్రహం ఏర్పాటు, స్థలం ఎంపిక ప్రధాని మోదీ నిర్ణయమన్నారు. తాను కేవలం విగ్రహ శిల్పిని మాత్రమే అని అన్నారు. చిన్నప్పుడు తాను విగ్రహాలు చేస్తుండగా పలువురు చూసి మెచ్చుకోవడంతో తాను ఇదే వృత్తిని ఎంచుకున్నానని, ఇష్టంతోనే ఈ వయస్సులో కూడా చురుగ్గా పని చేస్తున్నట్లు చెప్పారు. గ్యాలరీలోని చిత్రాలను వీక్షించారు. గ్యాలరీ నిర్వాహకులు మూలగుండం శాంతి, కృష్ణ, ప్రముఖ చిత్రకారుడు జగదీష్‌మిట్టల్, చరిత్రకారుడు వేదకుమార్, మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ, పలువురు కళాప్రియులు పాల్గొన్నారు. -
ఓటు సిరామరక కాదు.. మన హక్కు
ప్రజలందరికీ ఓటుహక్కు కోసం పోరాడిన బాబాసాహెబ్ అంబేడ్కర్ సార్వత్రిక ఓటింగ్ హక్కు ప్రాథమిక హక్కుల్లో ఉండాలని ప్రతిపాదించారు. కానీ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ లాంటి వాళ్ళు ఒప్పుకోకుండా ఆర్టికల్ 326గా ఉంచారు. దాని ఫలితాన్ని మనం ఈనాటికీ అనుభవించాల్సి వస్తోంది. ఆ ఒక్కతప్పిదం కారణంగానే అధికారపక్షం ఇష్టారాజ్యంగా ఓట్లను గల్లంతు చేసే పరిస్థితులేర్పడ్డాయి. ఓటు హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చి ఉంటే కులం పేరుతోనో, మతం పేరుతోనో, తమ వర్గం కాదనో, తమ పార్టీకి చెందిన వాళ్ళు కారనో అవలీలగా వేల సంఖ్యలో ఓట్లను గల్లంతుచేసే దుస్సాహసానికి ఒడిగట్టేవారు కాదు. మగధ రాజ్యంలోని రాజగృహంలో విశ్రాంతి తీసుకొంటున్న శాక్యముని గౌతమ బుద్ధుని దగ్గరికి మగధ దేశరాజు ప్రసేనజిత్తు తన ప్రధాన వస్సకరను పంపించారు. ‘‘వజ్జి రిపబ్లిక్ మీద దాడిచేసి వాళ్ళకు తగు గుణపాఠం చెప్పాలని ప్రసేన జిత్తుకు ఆలోచన ఉందని, ఆ విష యమై మీ సలహా కావాలని రాజు కోరుతున్నారు.’’ అని వస్సకర బుద్ధునితో ప్రస్తావించారు. వజ్జి రిపబ్లిక్ స్వతంత్రంగా పాలన సాగి స్తున్నది. అందువల్ల దానిని జయించి, మగధలో కలుపుకోవాలని ప్రసేన జిత్తు పథకం వేశారు. వస్సకర అడిగిన సలహాకు గౌతమ బుద్దుడు నేరుగా సమాధానం చెప్పలేదు కానీ తన ప్రథమ శిష్యుడైన ఆనందునితో చర్చించాడు. ఈ çసందర్భంగా గౌతమ బుద్ధుడు ఆనందుడిని ఏడు ప్రశ్నలు అడిగాడు. అవి... 1) వజ్జి రిపబ్లిక్ ప్రజలు క్రమం తప్పకుండా సమావేశాలు జరుపుతుంటారా? 2) ఏకపక్షంగా కాకుండా చర్చల ద్వారా సమష్టి నిర్ణయాలు తీసుకుంటారా? 3) మోసంతో కాకుండా, మంచి మార్గంలో వ్యాపారాలను, వృత్తులను సాగిస్తున్నారా? 4) ఒకసారి సమష్టిగా తీసు కున్న నిర్ణయాలను ఉల్లంఘన లేకుండా అమలు చేస్తున్నారా? 5) పెద్దలను గౌరవించి, వారి మాటలకు విలువనిస్తున్నారా? పూర్వకాలం నుంచి తమ పెద్దలు నిర్మించిన ప్రార్థనామందిరాలను కాపాడుకుంటు న్నారా? 6) మహిళలనూ, పిల్లలనూ గౌరవిస్తూ, బాధ్యతగా చూసుకుం టున్నారా? 7) జ్ఞానులకు, గురువులకు రక్షణ కల్పిస్తూ, వారిని గౌర విస్తూ వారు సూచించిన మార్గాలను అనుసరిస్తున్నారా? అని బుద్దుడు, ఆనందుడిని ప్రశ్నించారు. దానికి ఆనందుడు ‘అవును’ అని సమాధా నమిచ్చాడు. మీరు అడిగిన విషయాలన్నింటిలోనూ వారు అగ్రగామి గానే ఉన్నారని ఆనందుడు బదులిచ్చాడు. ఇది విన్న బుద్ధుడు ‘‘వజ్జి ప్రజలు ఆ విషయాలను పాటిస్తున్నంత కాలం వారిది ప్రగతి పథమే తప్ప వారికి పతనం అనేదే లేదని తేల్చి చెపుతాడు. వారిని ఎవరూ జయించలేరని కూడా స్పష్టం చేస్తాడు. మగధరాజు ప్రసేన జిత్తు ప్ర«ధాని వస్సకరకు బుద్ధుని అంతరంగం అర్థమైపోయింది. అదే విషయాన్ని మగధ రాజుకు చెప్పి, వజ్జి రిపబ్లిక్ మీద దాడిని నిలిపి వేశారు. ఒకదేశం గానీ, రాజ్యంగానీ, ప్రాంతంగానీ ప్రగతిదారిలో వెళ్లా లన్నా, విజేతగా నిలబడాలన్నా ప్రజలే కేంద్రబిందువుగా పరిపాలన సాగాలి. అదేవిధంగా పాలనలో ప్రజలు భాగస్వాములు కావాలి. పాలకులకు ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఉండాలి. ప్రజాక్షేమం కోసమే రాజ్యాలు, ప్రభుత్వాలు పనిచేయాలనేది బుద్ధుడి బోధన ఉద్దేశ్యం. ఇటువంటి పాలన కోసం ప్రపంచ చరిత్రలోనూ, భారత రాజకీయ ప్రస్తానంలోనూ ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అటువంటి అనుభవాన్నే మనకు సామ్రాట్ అశోకుని పాలన కూడా అందించింది. అయితే చాలా వందల ఏళ్ళు మన దేశాన్ని నియంతృత్వం, అరాచకం రాజ్యమేలాయి. వాటన్నింటినీ దాటుకొని, అనేకానేక అవరోధాలను అధిగమించి ఈ రోజు భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థలో తన మను గడను కొనసాగిస్తున్నది. అయితే ఇందులో కూడా అనేక లోపాలూ, పరిమితులూ ఉండవచ్చు కానీ ప్రజాస్వామ్య ఆలోచనలతో ఒక నిర్మా ణాత్మకమైన రాజ్యాంగం వెలుగులో మనం పాలన సాగిస్తున్నామన్నది మాత్రం వాస్తవం. అలాంటి ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల ప్రక్రియ కీలకం. అందులో భాగంగానే మన దేశ పార్లమెంటులో భాగమైన లోక్ సభకు పదిహేడవ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఓటింగ్ ఒక ముఖ్యమైన అంశం. మన దేశంలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఓటు హక్కు అందరికీ లేదు. అది కొందరి హక్కుగానే ఉండేది. మనదేశంలో మొదటిసారిగా 1920లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కేవలం విద్యావంతులూ, భూములూ, వ్యాపారాలూ, ఆస్తిపా స్తులూ ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. అయితే సామా న్యుడి ఓటు హక్కుకోసం సార్వత్రిక ఒటింగ్ (వయోజన ఓటింగ్) వచ్చేవరకూ నిరంతరం తపించిన మహానుభావుడు అంబేడ్కర్. భారత ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలనే ఉద్దే శ్యంతో బ్రిటిష్ పాలకులు సౌత్‌బరో అనే రాజకీయ నిపుణుని నాయ కత్వంలో 1919లో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ సిఫారసులకు అను గుణంగా బ్రిటిష్ పాలకులు 1920లో ఎన్నికలు నిర్వహించారు. అంట రాని కులాలలో పుట్టి అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువును అభ్యసించి, తన జాతి రక్షణే జీవిత లక్ష్యంగా తుది శ్వాస వరకూ పోరాడిన వ్యక్తి డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్. కేవలం 28 ఏళ్ల వయస్సులో తన జాతి జనుల విముక్తికోసమే కాక దేశంలోని అన్ని వర్గాల ప్రజలకోసం పరితపించారు అంబేడ్కర్. 1919లో సౌత్‌బరో కమి టీకి సమర్పించిన వినతిపత్రంలో యువ అంబేడ్కర్ తన ప్రజాస్వామ్య తాత్వికతకు పునాదులు వేశారు. ఆ పునాదులే భారతదేశ ప్రజాస్వామ్య సాధనమైన రాజ్యాంగాన్ని రచించడానికి ఆధారమయ్యాయి. అవే పునా దులు నేటికీ మన దేశ ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టడానికి సాధనా లవుతున్నాయి. ప్రజాస్వామ్యమంటే ప్రజలకు ప్రాతినిధ్యం ఉండాలనీ, ఏదో కొద్ది మందికి మాత్రమే ఉండే ఓటు హక్కు నియంతృత్వానికి, కొద్ది మంది ఆలోచనల ప్రకారమే పాలన సాగించే నిరంకుశ విధానానికీ మాత్రమే ఉపయోగపడుతుందనీ అంబేడ్కర్ వాదించారు. అంతేకాకుండా, అంట రానితనం, వివక్షతో తరతరాలుగా దాస్యాన్ని అనుభవిస్తున్న అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని కూడా ఆయన వాదించారు. కానీ సౌత్ బరో కమిటీ ఆ ప్రాధాన్యతలను తోసిపుచ్చింది. ఆ తర్వాత 1928లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ జాన్ సైమన్ ఛైర్మన్‌గా మరొక కమిటీని భార తదేశానికి పంపించింది. ఆ కమిషన్‌ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరిం చింది. అయితే స్వాతంత్య్రం రావాలనే లక్ష్యంతో పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నమూనా రాజ్యాంగాన్ని తయారు చేయడానికి మోతీలాల్ నెహ్రూ నాయకత్వంలో 1928 మే నెలలో ఒక కమిటీని వేసింది. అందులో అన్ని పక్షాలకు అవకాశాలను కల్పించారు. సర్ అలీ అమన్, తేజ్ బహదూర్ సఫ్రూ, సుభాష్ చంద్రబోస్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి జవహర్ లాల్ నెహ్రూ కార్యదర్శిగా పనిచేశారు. ఇదే కమిటీలో జయకర్, అనీబి సెంట్ కొంత ఆలస్యంగా చేరారు. అయితే ఈ కమిటీ రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలో 21 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత ఆ విషయం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ బీఆర్ అంబేడ్కర్ 1928లో మళ్ళీ ఒకసారి సైమన్ కమిషన్ ముందు హాజరై అందరికీ ఓటు హక్కు కల్పించాలనే విషయమై మరింత శక్తివంతంగా వినిపించారు. అంతే కాకుండా 1930, 31 సంవత్సరాలలో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో అణగారిన వర్గాలతోపాటు అందరికీ పాలనలో భాగస్వామ్యం దక్కాలని వాదించారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వం అందరికీ ఓటు హక్కు అనే విషయాన్ని పట్టించుకోలేదు. 1935లో మొదటి సారిగా వచ్చిన ‘భారత చట్టం’లోనూ సార్వత్రిక ఓటింగ్‌కు అవకాశం రాలేదు. 1937లో, 1946లో జరిగిన ఎన్నికల్లో కూడా విద్యా వంతులకు, వ్యాపారులకు, భూస్వాములకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. వాళ్ళ ప్రతినిధులు మాత్రమే పార్లమెంటులో అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1947లో భారతదేశం స్వాతంత్య్రం సాధించడంతో నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకునే అవకాశం మనకు దక్కింది. అనేక దేశాల్లో వచ్చిన విప్లవాలు, మార్పులు, పరిణామాలను అర్థం చేసుకొని ఒక రాజ్యాంగం ఆవశ్యకతను గుర్తించి, దాన్ని యుద్ధప్రాతిపదికన లిఖిం చడం మొదలైంది. ఆ రాజ్యాంగ రచనకు అంబేడ్కర్ నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. 1919 నుంచి ఎంతో తపనతో ప్రతి పాదిస్తూ వచ్చిన సార్వత్రిక ఓటింగ్ విధానానికి సుదీర్ఘకాలం తరువాత అవకాశం లభించింది. అంబేడ్కర్ ఆ ఓటింగ్ హక్కును ప్రాథమిక హక్కుల్లో ఉండాలని ప్రతిపాదించారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. కాంగ్రెస్ 1928లో రూపొందిం చిన రాజ్యాంగానికి భిన్నంగా పటేల్ వ్యవహరించారు. సార్వత్రిక ఓటింగ్ హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చకుండా, ఆర్టికల్ 326గా ఉంచారు. దీనివల్ల కలిగిన నష్టాన్ని తరతరాలుగా సామాన్యుడు భరిస్తూ వస్తున్నాడు. దాని ఫలితాన్ని మనం ఈనాటికీ అనుభవించాల్సి వస్తోంద న్నది తాజా పరిస్థితులను చూస్తే అర్థం అవుతుంది. ఆ ఒక్కతప్పిదం కారణంగానే అధికారపక్షం ఇష్టారాజ్యంగా ఓట్లను గల్లంతు చేసే పరిస్థి తులేర్పడ్డాయి. కులం పేరుతోనో, మతం పేరుతోనో, తమ వర్గం కాదనో, తమ పార్టీకి చెందిన వాళ్ళు కారనో అవలీలగా వేల సంఖ్యలో ఓట్లను గల్లంతుచేసే దుస్సాహసానికి ఒడిగట్టేవారు కాదు. అసలీ దుర్మా ర్గపుటాలోచనలకు అవకాశం ఉండేదే కాదు. ఓటు హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చి ఉంటే, రాజ్యాంగంలో 226వ ఆర్టికల్ ప్రకారం ఎవరైనా ఓటు హక్కును కోల్పోయి ఉన్నా ఓటరు లిస్టులో తమ పేరు గురించి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న ఓట్ల గల్లంతు వివాదానికి న్యాయపరమైన పరిష్కారం లభించేది. మన రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల్లో చేర్చిన విషయాలపట్ల మాత్రమే హైకోర్టు, సుప్రీంకోర్టులు బాధ్యత వహిస్తాయి. ఆనాడు అంబేడ్కర్ చేసిన ఆలో చనను ఈసారి కొలువుదీరే పార్లమెంటు చర్చించి, సార్వత్రిక ఓటింగ్‌ను ప్రాథమిక హక్కుల్లో చేర్చే ప్రయత్నం చేయాలి. వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య , సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
వన్నెతగ్గని కుస్తీ పోటీలు
అత్తాపూర్: మూడురోజుల పాటు కొనసాగిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ కేసరి కుస్తీ పోటీలు శనివారం అర్ధరాత్రి ముగిశాయి. అత్తాపూర్ రాంబాగ్‌లో నిర్వహించిన ఈ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.జనార్దన్‌రెడ్డి, కార్పొరేటర్ రావుల విజయజంగయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టైటిల్‌ను కేవల్యాదవ్ గెలుచుకోగా రన్నర్‌గా వెంకటేష్ నిలిచారు. మహిళా విభాగంలో రోహిణి సత్యశివయాదవ్ టైటిల్..రన్నర్‌గా కార ణ్య నిలిచారు. బాలకేసరి టైటిల్‌ను అక్షిత్కుమా ర్ గెలుపొందారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ.. ప్రాచీన క్రీడల్లో కుస్తీ పోటీలకు ఎంతో చరిత్ర ఉందన్నారు. నేడు క్రీడారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చినా కుస్తీ పోటీలకు ఏమాత్రం వన్నె తగ్గలేదన్నారు. నాటినుంచి నేటి వరకు పోటీ సరళి ఒకేలా ఉందన్నారు. శారీర ధృడత్వానికి కుస్తీ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయని చెప్పారు. నేటి యువత తమ విలువైన సమయాన్ని కంప్యూటర్లతో వృథా చేసుకోవద్దని సూచిం చారు. పోటీ ప్రపంచంలో విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని ఆయన అభిప్రా యపడ్డారు. పోటీల ద్వారానే మెరుగైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వై.శ్రీధర్, మల్లారెడ్డి, కొమురయ్య, శ్రీనివాస్‌యాదవ్, అభిమన్యు, వనం శ్రీరామ్‌రెడ్డి, వెంకటేష్, వాసు, బాలుగౌడ్, శ్రీకాంత్, విజయ్‌కుమార్, జగన్, కిరణ్చారీ, సిద్దేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
‘కేరళకు లేవన్నారు.. స్టాచ్యూకి రూ. 3000 కోట్లు ఎక్కడివి’
బెంగళూరు : వరదలతో అతాలకుతలమైన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన పీఎం విగ్రహం నిర్మాణం కోసం మాత్రం మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇలాంటి విచక్షణ లేని నాయకున్ని మీరు ఎక్కడైనా.. ఎప్పుడైనా చూశారా అంటూ నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడాన్ని తప్పు పడుతూ ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. కేరళను వరదలు ముంచేత్తినప్పుడు ముందు కేవలం 100 కోట్ల రూపాయలు.. ఆపై రూ. 500 కోట్ల సాయాన్ని ప్రకటించిన మోదీ సర్దార్ పటేల్ విగ్రహం కోసం ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. విచక్షణ జ్ఞానం ఉన్న నాయకుడేవరైనా ఇలాంటి పని చేస్తారా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. STATUE or HUMAN BEING.. Dear TROLLS..and FAKE NEWS FACTORY OWNERS who distorted what I said in an interaction on GOD.. WOMEN n RELIGION.... will you try DISTORTING this one too OR does it not serve your purpose ..#justasking pic.twitter.com/MT9360f8Qf — Prakash Raj (@prakashraaj) November 9, 2018 -
స్టాచ్యూ ఆఫ్ యూనిటీ: వారికి వచ్చిన నష్టం ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలలు వ్యాపించి దిగంతాలకు తాకేలా అత్యంత ఎల్తైన అద్భుత కళాఖండంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్వాతంత్య్ర సమర యోధుడు, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తే ఆ పరిసరాల్లోని దాదాపు 20 గ్రామాల ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? విగ్రహావిష్కరణ సభను అడ్డుకునేందుకు సిద్ధమైన వారిలో దాదాపు మూడు వందల యాభై మంది ఆదివాసీ రైతులను ముందుగానే అరెస్ట్ చేసి పోలీసులు ఎందుకు 20 గంటల పాటు నిర్బంధించారు ? వారికి వచ్చిన నష్టం ఏమిటీ? వారికి బుధవారం నాడు విగ్రహావిష్కరణ రోజే తక్షణం ముంచుకొచ్చిన నష్టం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా సరోవర్ డ్యామ్ గేట్లు తెరవడం. సర్దార్ సరోవర్ పటేల్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో సర్మదా నది నీళ్లతో నిండుగా కనిపించడం కోసం సరోవర్ డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆ కారణంగా సమీపంలో మూడు గ్రామాల్లోని దాదాపు 30 మంది రైతుల పంటలు పూర్తిగా నీటిలో మునిగి పోయాయని పిపాలయ పోలీసు స్టేషన్ నిర్బంధం నుంచి బుధవారం సాయంత్రం విడుదలైన రైతు నాయకుడు లఖాన్ ముసాఫిర్ తెలిపారు. ఆయనతోపాటు 24 మంది ఆదివాసీలను పిపాలయ పోలీసు స్టేషన్లో 20 గంటలపాటు నిర్బంధించారు. నర్మదా జిల్లా అంతటా దాదాపు 350 మంది ఆదివాసీ రైతులను పోలీసులు నిర్బంధించారని పటేల్ విగ్రహానికి 8 కిలోమీటర్ల దూరంలోని గురుదేశ్వర్ గ్రామానికి చెందిన లఖాన్ తెలిపారు. పటేల్ విగ్రహం ఉన్న పరిసర ప్రాంతాలను టూరిస్ట్ జోన్‌గా అభివద్ధి చేయడం వల్ల ఇల్లు వాకిలినే కాకుండా పచ్చటి పంట పొలాలను కూడా కోల్పోతున్నామని ఆదివాసీ రైతులు ఆందోళన చేస్తున్నారు. నీటిలో మునుగుతున్న 13 గ్రామాలు సర్దార్ పటేల్ విగ్రహం పరిసరాల్లో టూరిజం అభివద్ధిలో భాగంగా ‘వాలీ ఆఫ్ ఫ్లవర్స్’ను, ‘టెంట్ సిటీ’ నిర్మాణ పనులు చేపట్టారు. టెంట్ సిటీలో ప్రతి రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ అతిథి గహంతోపాటు పర్యాటక శాఖల గెస్ట్‌హౌజ్‌లు, ప్రైవేటు, ప్రభుత్వ రిస్టారెంట్లు నిర్మిస్తారు. బోటు షికార్ల కోసం ఓ సరస్సు నిర్మాణం పనులు కూడా చేపడుతున్నారు. ఈ పనుల సాకారం కోసం పటేల్ విగ్రహం ఉన్న కెవాడియాకు సరిగ్గా ఆరు కిలోమీటర్ల దూరంలో, గురుదేశ్వర్ గ్రామానికి సమీపంలో ఓ చిన్న డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. ఆ తర్వాత సరోవర్ డ్యామ్ నుంచి నీళ్లను విడుదల చేసి చిన్న డ్యామ్ వరకు నీళ్లు నిండుగా ఉండేలా చేస్తారు. దాదాపు పూర్తి కావచ్చిన ఈ చిన్న డ్యామ్ నిర్మాణం వల్ల ఇప్పటికే ఆరు గ్రామాలు నీటిలో మునిగిపోగా, డ్యామ్ నిర్మాణం పూర్తయి, నీటిని విడుదల చేస్తే మరో ఏడు గ్రామాలు నీటిలో మునిగిపోతాయి. పటేల్ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా దాదాపు 20 గ్రామాలు నష్టపోతుంటే పరోక్షంగా పరిసరాల్లో 70 ఆదివాసీ గ్రామాలు నష్టపోతున్నాయి. అందుకనే ఆ గ్రామాల ప్రజలంతా బుధవారం నాడు అన్నం వండుకోకుండా పస్తులుండి నిరసన తెలిపారు. 22 గ్రామాల సర్పంచ్ల లేఖ భారత దేశ కీర్తి ప్రతిష్టల కోసం తరతరాలుగా ఇక్కడే జీవిస్తున్న తమ కడుపులు కొట్టవద్దంటూ ఇటీవల 22 గ్రామాల ప్రజలు తమ సర్పంచ్ల సంతకాలతో ప్రధాని పేరిట ఓ బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు. ‘మా పరిసర గ్రామాల ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని పలు గ్రామాలకు పాఠశాల, వైద్యశాలల వసతులే కాకుండా కనీసం మంచి నీటి సౌకర్యం కూడా లేదు. ప్రజలు కష్టపడి సంపాదించి పన్నులు కడితే ఆ సొమ్మును మీరు ఇలా వధా చేయడం భావ్యం కాదు. పటేల్ ప్రాజెక్టు పూర్తయితే మా వ్యవసాయానికే కాదు, మాకు మంచినీటి కూడా సరోవర్ నది నుంచి ఒక్క చుక్కా దొరకదు. సరోవర్ కెనాల్ నెట్‌వర్క్‌ను (20 వేల కిలోమీటర్ల కెనాల్‌ను పూర్తి చేయాల్సి ఉంది) పూర్తి చేయడానికి నిధులు లేవనే సర్కార్, పటేల్ ప్రాజెక్టుకు మాత్రం మూడు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి ? అందుకనే మిమ్మల్ని 31వ తేదీన అతిథిగా ఆహ్వానించడం లేదు. అయినా మీరొస్తే మీ కార్యక్రమాన్ని మేం బహిష్కరిస్తాం’ అని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. నష్టపరిహారం ఊసేలేదు! పటేల్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న ప్రజలకు నష్టపరిహారం ఇచ్చే అంశాన్ని గుజరాత్ ప్రభుత్వం ఇంకా తేల్చడం లేదు. ప్రజలు తమకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ నష్టపరిహారం కోసం ఆర్జీలు పెట్టుకుంటే పరిశీలిస్తాంగానీ, ప్రాజెక్టు వద్దూ నష్టపరిహారం వద్దంటే తాము మాత్రం ఏం చేయగలమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 1990 దశకంలో సరోవర్ డ్యామ్‌ను నిర్మించడం వల్ల గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని 42 వేల కుటుంబాలు, దాదాపు రెండు లక్షల మంది నిర్వాసితులకు ఎక్కడో దూరాన పట్టాలిచ్చారని, వ్యవసాయం చేసుకునే భూమికి, ఇళ్ల స్థలాలకు మధ్య కొన్ని కిలోమీటర్ల దూరం ఉందని ఆదివాసీ రైతులు తెలిపారు. దేశాన్నే కుదిపేసేలా ఆందోళన చేస్తే వారికి దక్కింది ఆ మాత్రం నష్టపరిహారమని, ఇక తమకు ఏపాటి పరిహారం దొరకుతుందని వారు ప్రశ్నించారు. -
బాహుబలి
-
‘ఉక్కుమనిషి’కి సమున్నత నివాళి
‘ఉక్కు మనిషి’, ఈ దేశ సమైక్యత, సమగ్రతల కోసం అలుపెరగకుండా శ్రమించిన స్వాతంత్య్ర సమరయోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అతి ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు. నర్మదా నదీతీరాన సర్దార్ సరోవర్ డ్యాం సమీపాన ఈ భారీ విగ్రహం కోసం 3,400మంది కార్మికులు నలభై రెండు నెలలుగా రాత్రింబగళ్లు శ్రమించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అందరూ ఊహించినట్టు నరేంద్ర మోదీ తన 55 నిమిషాల ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలేమీ చేయలేదు. అలాగని తనను విమర్శిస్తున్నవారిని ఊరకే వదిలేయలేదు. తమ ప్రభుత్వం జాతీయ నేతలకు సము న్నతమైన స్మృతి చిహ్నాలను నిర్మించాలని ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తుంటే దీన్నంతటినీ కొందరు రాజకీయ సులోచనాలతో పరికించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని చెప్పారు. ‘‘మేమేమైనా తీవ్రమైన నేరం చేశామా అని మాకే అనిపించే స్థాయిలో వీరి విమర్శలుంటున్నాయి’’ అని మోదీ అన్నారు. పటేల్ ఈ దేశాన్ని సమైక్యపరచకపోతే జునాగఢ్‌లో సింహాలను చూడ్డానికి, గుజరాత్‌లోని సోమ నాథ్ దేవాలయంలో ప్రార్ధించుకోవడానికి, హైదరాబాద్‌లో చార్మినార్ చూడటానికి వీసాలు తీసు కోవాల్సి వచ్చేదని ఆయన ప్రజలకు గుర్తుచేశారు. సర్దార్ పటేల్ విషయంలో బీజేపీకి ఉన్న అభిప్రాయాలు, వాటి వెనకున్న కారణాలు ఎవరికీ తెలియనివి కాదు. బీజేపీ పూర్వరూపమైన జనసంఘ్ కాలం నుంచే ఈ అభిప్రాయాలున్నాయి. అయిదేళ్ల క్రితం అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ పాల్గొన్న సభలో నరేంద్రమోదీ మాట్లాడుతూ పటేల్ తొలి ప్రధాని అయివుంటే ఈ దేశ ముఖచిత్రం మరోలా ఉండేదంటూ వ్యాఖ్యానించినప్పుడు దానిపై పెద్ద దుమారమే లేచింది. అంతేకాదు...దేశానికి ఇప్పుడు కావలసింది ‘పటేల్ తరహా సెక్యులరిజం’ తప్ప ‘ఓటు బ్యాంకు సెక్యులరిజం’ కాదని కూడా అప్పట్లో ఆయన చెప్పారు. ఈ బాణాలు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను, కాంగ్రెస్‌ను ఉద్దేశించినవేనని ఎవరికైనా అర్ధమవుతుంది. నెహ్రు గురించి బీజేపీకి లేదా మోదీకి మాత్రమే కాదు...వేరేవారికి కూడా ఇటువంటి అభిప్రాయాలున్నాయి. నెహ్రూ కేబినెట్లో పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆ రోజుల్లోనే నెహ్రూ పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారని, ఆయన బదులు పటేల్ ప్రధాని అయివుంటే బాగుండేదని అన్నారని ఆజాద్‌కు కార్యదర్శిగా పనిచేసి, అనంతరకాలంలో కేంద్ర విద్యామంత్రిగా ఉన్న హుమాయూన్ కబీర్ ఒక సందర్భంలో చెప్పారు. నిజానికి పటేల్ భావ జాలానికీ, ఆజాద్ భావజాలానికీ ఏమాత్రం పొసగదు. లౌకికవాదిగా ఆయన జవహర్లాల్ నెహ్రూకే సన్నిహితుడు. పటేల్ ప్రవచించిన స్వేచ్ఛా వ్యాపార విధానాలను నెహ్రూతోపాటు వ్యతిరేకించినవాడు. స్వాతంత్య్రోద్యమానికి సారధ్యంవహించి, అనంతరకాలంలో దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ నాయకుల్లో ఇలా విరుద్ధ భావజాలాలు, అవగాహనలు ఉండేవి. అందులో అసహజమూ లేదు. వైపరీత్యమూ లేదు. అందరి ఉమ్మడి లక్ష్యమూ సమున్నతమైన, పటిష్టమైన నవభారత నిర్మాణమే. వారంతా పదహారణాల దేశభక్తులు. కశ్మీర్ విషయంలో, విభ జన సమయంలో పాకిస్తాన్‌కు చెల్లించాల్సిన రూ. 64 కోట్ల పరిహారం విషయంలో, అలీనో ద్యమంవైపు మొగ్గుచూపడంలో, చైనాతో చెలిమి విషయంలో వారిమధ్య ఉన్నవి భిన్నాభిప్రాయాలే తప్ప అభిప్రాయభేదాలు కాదు. భారత్‌లో విలీనమయ్యేదిలేదన్న పలు సంస్థానాలను దారికి తేవడంలో పటేల్ పాత్ర ఎనలేనిది. చివరివరకూ మొండికేసిన హైదరాబాద్, జునాగఢ్ సంస్థానా ధీశులపై బలప్రయోగానికి పూనుకున్నారు. అయితే నరేంద్రమోదీ, బీజేపీ సర్దార్ పటేల్ పేరెత్తినప్పుడల్లా ఆయన తమవాడని తరచు భుజాలు తడుముకుంటున్న కాంగ్రెస్‌ను గురించి చెప్పుకోవాలి. స్వాతంత్య్రోద్యమంలో నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలు...సామ్యవాద, లౌకిక భారత్‌ను నిర్మించడానికి నెహ్రూ చేసిన ఎనలేని కృషి దాచేస్తే దాగనివి. అలాగని అదే స్వాతంత్య్రోద్యమంలో ఆయనతో సమానంగా పాలు పంచు కున్న షహీద్ భగత్‌సింగ్, నేతాజీ సుభాస్‌చంద్ర బోస్, ఆజాద్, సర్దార్ పటేల్, లాల్‌బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల కృషిని తక్కువ చేసి చూడటం లేదా విస్మరించటం క్షమిం చరాని నేరం. ఆ పని కాంగ్రెస్ చేసింది. ఆ నాయకుల పట్ల అలవిమాలిన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వారి వర్ధంతులూ, జయంతులనాడైనా వారి కృషిని ఘనంగా స్మరించుకోవాలని, ఈ దేశ నిర్మాణానికి వారు దోహ దపడ్డ తీరును చాటిచెప్పాలని ఆ పార్టీ, దాని నేతృత్వంలోని ప్రభుత్వాలూ ఏనాడూ అనుకోలేదు. మొక్కుబడి నివాళులతో సరిపెట్టడమే రివాజైంది. కనీసం 2009లో బీజేపీ తమ ప్రధాని అభ్యర్థిగా ఎల్కే అద్వానీని రంగంలోకి దింపి, ఆయన్ను ‘అభినవ సర్దార్’గా అభివర్ణించడం మొదలుపెట్టా కైనా కాంగ్రెస్ మేల్కొనలేదు. ఎప్పటినుంచో తనకలవాటైన విధానాలనే కొనసాగించింది. 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా రంగప్రవేశం చేసి, పిడుగులు కురిపిం చడం మొదలెట్టాక పటేల్ చరిత్రను, ఇతర నాయకుల చరిత్రను పఠించడం ప్రారంభించింది. ఇటు బీజేపీ కూడా సర్దార్ పటేల్‌కు ప్రాముఖ్యం ఇస్తూనే చరిత్రలో నెహ్రు స్థానాన్ని తక్కువ చేసి చూపడానికి వీలైనప్పుడల్లా ప్రయత్నిస్తూనే ఉంది. ఒకరకంగా ఆ పార్టీ కాంగ్రెస్ ఇంతక్రితం చేసిన తప్పునే మరో పద్ధతిలో చేస్తోంది. గత పాలకులు విస్మరించిన స్వాతంత్య్రోద్యమ సారథు లను, వారి కృషిని వెలికితీయాల్సిందే. దాన్నెవరూ కాదనరు. కానీ అందుకోసం నెహ్రూ వంటి శిఖరసమానుల పాత్రను తగ్గించి చూపనవసరం లేదు. నరేంద్రమోదీ బుధవారం ప్రతిష్టించిన ‘ఐక్యతా ప్రతిమ’ 597 అడుగులతో ఇప్పటికైతే ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం. ఈ ప్రతిమ కాలావధుల్ని దాటి ఐక్యతా పరిమళాలు వెదజల్లాలంటే... జన హృదయాల ఐక్యతకు అది స్ఫూర్తి నీయాలంటే ఆ దిశగా ప్రభుత్వాల కార్యాచరణ ముఖ్యం. -
‘శివభక్తా.. నువ్వు పూజలు చేయాలన్నా వీసా ఉండాల్సిందే’
అహ్మదాబాద్ : ఉక్కు మనిషి, భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ‘ఐక్యతా విగ్రహం – స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా మోదీ ఒకవేళ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ లేకపోతే ఈ శివభక్తులు గుజరాత్ సోమ్‌నాథ్ ఆలయంలో పూజలు నిర్వహించాలన్నా.. హైదరాబాద్ చార్మినార్‌ను సందర్శించాలన్న వీసా తీసుకోవాల్సివచ్చేదంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి చురకలంటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘దేశాన్ని సమైక్యంగా ఉంచటానికి పాటుపడిన నేతకు నివాళి అర్పించడం వారి దృష్టిలో పెద్ద నేరం అయ్యింది. దేశ సమగ్రతకు పాటుపడిన మహా నాయకుని గురించి కూడా రాజకీయాలు చేయడం దురదృష్టకరం. ఒక వేళ సర్దార్ పటేల్ గనక దేశ ఐక్యత కోసం పాటు పడకపోతే నేడు గిర్ అభయారణ్యంలోని పులులను, సింహాలను చూడాలన్న.. ఈ సోకాల్డ్ శివభక్తులు సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించాలన్నా.. హైదరాబాద్ చార్మినార్‌ను సందర్శించాలన్న వీసాలు తీసుకోవాల్సి వచ్చేద’ని గుర్తు చేశారు. -
ఉక్కుమనిషి విగ్రహావిష్కరణ చేసిన ప్రధాని
-
ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
-
కలిసి ఉండాలనే సందేశమే ఈ విగ్రహం : మోదీ
అహ్మదాబాద్: ఉక్కు మనిషి, భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు. అనంతరం పటేల్ 143వ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో ఉన్న సాధు బెట్లో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మించారు. 2013 అక్టోబర్ 31 న ప్రధాని మోదీ ఐక్యతా విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. మోదీ ప్రసంగం.. ‘ఈ ఏడాది సర్దార్ పటేల్ జయంతి మరింత ప్రత్యేకమైనది. 130 కోట్ల భారతీయుల ఆశీస్సులతో ఈ రోజు ఐక్యతా విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. నర్మదా నది తీరాన ఏర్పాటు చేసుకున్న ఈ మహా విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినది. భూమి పుత్రుడు సర్దార్ పటేల్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వైనం మనకు కనిపిస్తోంది. ఆయన ఎల్లప్పుడూ మనకు మార్గదర్శనం చేస్తూ, స్ఫూర్తిని అందిస్తూ వుంటారు. సర్దార్ పటేల్ కు ఘన నివాళి అర్పించేందుకు రూపొందిన ఈ మహా విగ్రహాన్ని వాస్తవ రూపంలోకి తేవడానికి రాత్రి పగలూ అనే తేడా లేకుండా పని చేసిన వారందరికీ నా అభినందనలు. ఈ విశిష్టమైన ప్రాజెక్టుకోసం పునాది రాయి వేసిన 2013 అక్టోబర్ నెల 31వ తేదీ నాకు గుర్తుకొస్తోంది. ఆ రోజున మొదలైన ఈ భారీ ప్రాజెక్టు రికార్డు టైములో పూర్తయింది. ఇది ప్రతి భారతీయునికి గర్వకారణమైన విషయం. రాబోయే రోజుల్లో ఈ మహా విగ్రహాన్ని సందర్శించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఐకమత్యానికి, మన మాతృ భూమి భౌగోళిక సమగ్రతకు, దేశ ప్రజల ఐకమత్యానికీ ఈ ఐక్యతా విగ్రహం సంకేతంగా నిలుస్తోంది. అనైక్యత కారణంగా విడిపోతే మనకు మనమే మొహం చూపించుకోలేమనీ, సమాధానం చెప్పుకోలేమనీ.. అదే కలిసి వుంటే ప్రపంచాన్ని ధీటుగా ఎదుర్కోవచ్చుననే సందేశాన్ని ఈ విగ్రహం అందిస్తోంది. ఐకమత్యంతో మాత్రమే అభివృద్ధిని, ప్రాభవాన్ని సాధించి ఉన్నత శిఖరాలను అధిగమించగలం’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఆధునిక భారతదేశ నిర్మాత, మహోన్నత ఐక్యతావాదికి ప్రత్యేక నివాళి. 1947 సంవత్సరాన్ని తీసుకుంటే.. ఈ ఏడాది మొదటి అర్ధభాగం భారతదేశ చరిత్రలోనే కీలక సమయం. వలస పాలన తప్పనిసరి పరిస్థితుల్లో ముగియనున్న సమయమది. అంతే కాదు భారతదేశ విభజన కూడా తప్పనిసరి అయింది. అయితే అంతుపట్టని విషయమేమిటంటే భారతదేశం నుంచి విడిపోయే ప్రాంతాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటాయేమోననేది. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆహార కొరత సర్వసాధారణమైంది. అయితే అన్నిటికన్నా ఎక్కువగా ఆందోళన కలిగించిన విషయం భారతదేశ ఐక్యత ప్రమాదంలో పడడం. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. నూతన ప్రస్థానం మొదలైంది. కానీ ఆ సమయానికి జాతి నిర్మాణమనేది సుదూరంగానే వుండిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి మొదటి హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు సర్దార్ పటేల్. ఆ వెంటనే ఆయన పరిపాలనాపరమైన నియమ నిబంధనల తయారీకి ఒక వేదికను రూపొందించారు. రాష్ట్రాల వ్యవహారాలను చూసే విభాగం (స్టేట్స్ డిపార్ట్ మెంట్) ఏర్పడింది. నాటికి దేశంలో గల 550 సంస్థానాలతో సంప్రదింపులు చేయడమే ఈ విభాగం ముఖ్యమైన పని. పరిమాణం, జనాభా, భౌగోళిక, ఆర్ధిక స్థితిగతులు మొదలైనవాటి పరంగా చూసినప్పుడు ఈ సంస్థానాలు వేటికవే ప్రత్యేకంగా ఉండేవి. సర్దార్ పటేల్ తనదైన శైలిలో వ్యవహరిస్తూ తన పనిని ఎంతో ఖచ్చితత్వంతో, దృఢంగా, పరిపాలనాపరమైన సామర్థ్యంతో నిర్వహించారు. సమయం చాలా తక్కువ. చేయాల్సిన పని బ్రహ్మాండమైనది. కానీ ఆ పనిని చేస్తున్న వ్యక్తి కూడా సామాన్యుడు కాదు. ఆయన సర్దార్ పటేల్. భారతదేశం సమున్నతంగా నిలబడాలన్న ఆకాంక్షతో పని చేశారు. ఒకదాని తర్వాత మరొకటి...అప్పటికి వున్న అన్నిసంస్థానాలతో సర్దార్, ఆయన బృంద సభ్యులు సంప్రదింపులు జరిపి...అన్నిటినీ భారతదేశంలో ఐక్యం చేశారు.సర్దార్ పటేల్ అవిశ్రాంతంగా పని చేయడంవల్లనే ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశ చిత్ర పటం ఆ ఆకారంలో మనకు కనిపిస్తోంది.’ అని ప్రధాని ప్రసంగించారు. ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కంటే పొడవు.. ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటుచేసిన ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కంటే ఇది రెట్టింపు పొడవు. వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి సర్దార్ డ్యామ్ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు. 30 పవిత్ర నదీ జలాలతో పటేల్ విగ్రహానికి అభిషేకం చేశారు. 37 మంది సర్దార్ పటేల్ కుటుంబ సభ్యులు ఈ విగ్రహ ఆవష్కరణ మహోత్సవంలో పాల్గొన్నారు. పటేల్ జయంతి, విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అన్ని జిల్లాల్లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం చేపట్టారు. కాగా, స్థానిక నర్మదా జిల్లాలోని గిరిజనులు సర్దార్ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాజెక్టు పేరుతో సహజ వనరులను నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఐక్యతా విగ్రహం విశేషాలు.. విగ్రహ నిర్మాణానికి అయిన ఖర్చు రూ. 2979 కోట్లు విగ్రహం ఎత్తు : 597 అడుగులు (82 మీటర్లు) మొత్తం మెటీరియల్ : 3550 టన్నుల ఇత్తడి, 18 వేల టన్నుల రీ ఇన్ఫోర్స్డ్ స్టీల్ ,6 వేల స్ట్రక్చరల్ స్టీల్, 2 లక్షల 12 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడారు. 250 మంది ఇంజనీర్లు.. 3400 మంది వర్కర్లు 3 సంవత్సరాల 9 నెలలపాటు పనిచేసి విగ్రహ నిర్మాణం చేశారు. 6.5 తీవ్రతతో భూకంపం సంభవించినా ఈ విగ్రహం తట్టుకుని నిలబడుతుంది. గంటకు 180 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరదు. -
పటేల్ మహా విగ్రహానికి నిరసన సెగ
అహ్మదాబాద్: ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటు చేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో గిరిజన కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారన్న అనుమానంతో నర్మదా జిల్లాలో 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. భిలిస్తాన్ టైగర్ సేన(బీటీఎస్) జిల్లా అధ్యక్షుడు మహేశ్ గాగుభాయ్, ఉపాధ్యక్షుడు మహేంద్ర వాసవతో పాటు మరో రెండు సంఘాలకు చెందిన సభ్యులు అరెస్టైన వారిలో ఉన్నారు. గాంధీయవాది చునీ వైద్య కుమార్తెలు నీతా విరోధి, మోదితా విరోధిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సోషల్ మీడియా ద్వారా ఆందోళనలకు జనాన్ని పోగు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా వీరిని అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ) చెందిన ఝగదియా ఎమ్మెల్యే చోటూభాయ్ వాసవ కుమారుడు మహేశ్ వాసవ 2017లో బీటీఎస్‌ను స్థాపించారు. అత్యంత ఎత్తైన పటేట్ విగ్రహావిష్కరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునివ్వడంతో తాపీ జిల్లాలోని య్యరా ప్రాంతానికి చెందిన 10 మంది శిరోముండనం చేయించుకుని మద్దతు తెలిపారు. విగ్రహంతో ఒరిగేదేంటి? ‘సర్దార్ పటేల్‌కు మేము వ్యతిరేకం కాదు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకం. గుజరాత్లో గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాసింది. రాజ్యాంగంలోని 244(1) ఆర్టికల్‌ను ప్రభుత్వం అమలు చేయాలన్న మా ప్రధాన డిమాండ్. దీన్ని అమలు చేసిన తర్వాత పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోండి. ‘ఐక్యతా విగ్రహం’తో గిరిజనులకు ఏవిధంగా మేలు జరుగుతుంది? గిరిజనుల సమస్యలపై ప్రభుత్వ స్పష్టమైన వైఖరి వెల్లడించాలి. గిరిజనుల హక్కుల సాధన కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నాం. ఫలితంగా ఎంతో మంది గిరిజనుల మద్దతు పొందగలిగామ’ని చోటూభాయ్ వాసవ పేర్కొన్నారు. తన కుమారుడు మహేశ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనాజీ గమిత్, ఆనంద్ చౌదరితో కలిసి సూరత్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీకి బహిరంగ లేఖ కాగా, ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఆవిష్కరణను వ్యతిరేకిస్తూ నర్మదా సరోవర్ డ్యామ్‌కు సమీపంలోని 22 గ్రామాలకు చెందిన ప్రజలు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుతో సహజ వనరులను నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖపై 22 గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు సంతకాలు చేశారు. స్థానిక గిరిజన నాయకులు కూడా ఐక్యతా విగ్రహావిష్కరణను వ్యతిరేకించారు. ‘ఈ రోజును బ్లాక్ డే పాటించాలని గిరిజనులు నిర్ణయించారు. ప్రతి గ్రామంలోని గిరిజనులు ఈరోజు నిరహారదీక్ష చేయనున్నారు. మా ఆందోళన ఒక్కరోజుతో ఆగదు. మరిన్ని రోజుల పాటు పోరాటం కొనసాగిస్తాం. గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నీటి సమస్యలపై కూడా ఆందోళన కొసాగుతుంద’ని చోటూభాయ్ స్పష్టం చేశారు. -
నేడు పటేల్ విగ్రహావిష్కరణ
అహ్మదాబాద్: ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. పటేల్ జయంతి సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో ఉన్న సాధు బెట్లో ఈ విగ్రహాన్ని కట్టారు. ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటుచేసిన ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కంటే ఇది రెట్టింపు పొడవు. వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి సర్దార్ డ్యామ్ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు. స్థానిక నర్మదా జిల్లాలోని గిరిజనులు సర్దార్ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాజెక్టు పేరుతో సహజ వనరులను నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు. -
భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీక
న్యూఢిల్లీ: ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’(ఐక్యతా విగ్రహం) కేవలం సర్దార్ వల్లభ్‌భాయ్‌కి మాత్రమే ఘన నివాళే అని కాకుండా భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలకూ గొప్ప ప్రతీక అని నిర్మాణరంగ దిగ్గజం ఎల్అండ్టీ పేర్కొంది. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందిన చైనా స్ప్రింగ్ దేవాలయాల్లో ఉన్న బుద్ధ విగ్రహం (153 మీ.) నిర్మాణానికి 11 ఏళ్లు పడితే..ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ ఎల్అండ్టీ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని కేవలం 33 నెలల్లోనే పూర్తి చేసినట్లు వెల్లడించింది. విగ్రహాన్ని రోడ్డు మార్గంలో నుంచి చూస్తే 182 మీటర్లు, నదీ మార్గం నుంచి చూస్తే 208.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (93 మీ.) కంటే ఇది రెట్టింపు ఎత్తు ఉంటుంది. రూ.2,989 కోట్లతో నిర్మితమైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని అక్టోబర్ 31న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ స్టాట్యూను 5 జోన్లుగా విభజించారు. మొదటి జోన్లో మెమోరియల్ గార్డెన్, మ్యూజియం, రెండో జోన్లో 149 మీ. విగ్రహమే ఉంటుంది. మూడో జోన్లో 153 మీ. వరకు గ్యాలరీ, నాలుగో జోన్లో మెయింట నెన్స్ ఏరియా, ఐదో జోన్లో పటేల్ భుజాలు, తల ఉంటుందని ఎల్అండ్టీ పేర్కొంది. గ్యాలరీలో ఒకేసారి 200 మంది తిరగవచ్చు. -
సర్దార్ పటేల్‌ని గౌరవించడం వారికి నచ్చదు : అమిత్ షా
న్యూఢిల్లీ : ‘నెహ్రూ కుటుంబం సర్దార్ పటేల్‌ను చాలా అవమానించింది. ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన మరో వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రాహన్ని ‘మేడ్ ఇన్ చైనా’ అంటున్నారు.. ఇది వారి దేశ భక్తి’ అంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, రాహుల్ గాంధీపై మండి పడ్డారు. అమిత్ షా ఇంతలా కోప్పడ్డానికి కారణం కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలే. మహారాష్ట్రలో ఓ కార్యక్రమానికి హాజరైన రాహుల్ గాంధీ ‘మన మన బట్టలు, చెప్పులు, ఫోన్ అన్ని మేడ్ ఇన్ చైనానే. అలానే నరేంద్ర మోదీ గుజరాత్లో ప్రపంచంలోనే అతి ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. కానీ ఈ విగ్రహం కూడా మేడ్ ఇన్ చైనానే. భారత స్వాతంత్ర్య సమరయోధుని విగ్రహాన్ని చైనాలో తయారు చేయించి ఆయనను అవమానిస్తున్నారు’ అంటూ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ అమిత్ షా ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్యనంతరం సంస్థానాలను విలీనం చేసి.. దేశ ఐక్యత కోసం పాటు పడ్డారు. కానీ నెహ్రూ కుటుంబం ఆయన కీర్తిని ప్రజల మనసుల్లోంచి తుడిచిపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. బీజేపీ ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్ధం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటి’ విగ్రహాన్ని నిర్మిస్తుంది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం. ఇందుకోసం ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. కానీ ఈ పని రాహుల్ గాంధీ కుటుంబానికి ఇష్టం లేదు. అందుకే రాహుల్ గాంధీ ఈ విగ్రహాన్ని ‘మేడ్ ఇన్ చైనా’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది వారి దేశ భక్తి’ అంటూ అమిత్ షా రాహుల్ గాంధీపై మండి పడ్డారు. -
టర్కీ, పాక్ నుంచి విమానంలో ఆయుధాలు!
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి నిజాం ఒప్పుకోలేదు. కానీ నాటి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సైనిక చర్యతో తలవంచాల్సి వచ్చింది. బ్రిటిష్ పాలకులు భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడానికి నిర్ణయించినప్పుడు దేశంలోని సంస్థానాలకు రెండు ఆప్షన్లు ఇచ్చారు. స్వతంత్రంగా కొనసాగడమా?... భారత్‌లో విలీనమవడమా? తేల్చుకోవాలన్నారు. కశ్మీర్, హైదరాబాద్ మినహా అన్ని సంస్థానాలు విలీనమయ్యాయి. ఈ రెండు సంస్థానాలు దేశంలోని ఇతర సంస్థానాలతో పోల్చితే చాలా పెద్దవి. స్వాతంత్రానికి ముందే బ్రిటిష్ పాలనలో చెన్నై, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ నగరాలు బాగా అభివృద్ధి చెందాయి. కానీ హైదరాబాద్ సంస్థానం దాదాపు 200 ఏళ్లు కుతుబ్ షాహీ, 224 ఏళ్లు ఆసిఫ్ జాహీల పాలనలో ఉంది. అయినా ఇతర నగరాలు, సంస్థానాల కంటే హైదరాబాద్ మెరుగ్గానే ఉంది. హైదరాబాద్ సంస్థానంలో రోడ్లు, బస్సు, రైలు, విమానయానం కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల పరిశ్రమలు, కర్మాగారాలు, ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలున్నాయి. సాగు, తాగు నీటి ప్రాజెక్టులు పుష్కలంగా ఉన్నాయి. రైతులకు నరకం.. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ పాలనలో జమిందార్, జాగీర్ వ్యవస్థ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులు పండించిన పంటలపై విపరీతంగా పన్నులు వసూళ్లు చేశారు. పంట పండించిన రైతుకే అన్నం లభించేది కాదు. రైతుల జీవితాలు నరకప్రాయంగా ఉండేవి. సంస్థానం విలీనమైతే ఈ వ్యవస్థ పోతుందని తమకు స్వేచ్ఛ లభిస్తుందని రైతులు భావించారు. ఈ క్రమంలోనే దేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. ఈ సమయంలో నిజాం రాజు ఏ నిర్ణయం తీసుకోలేదు. సంప్రదింపుల తరువాత భారత్ ప్రభుత్వం, హైదరాబాద్ సంస్థానం మధ్య 1947, నవంబర్ 29న ఒప్పందం కుదిరింది. ఈ మేరకు హైదరాబాద్ సంస్థానం యథాతథంగా కొనసాగాలని నిర్ణయించారు. భారత దేశంలో విలీనం... నాటి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో కలపాలని నిర్ణయించాడు. మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో సైన్యాన్ని హైదరాబాద్ పంపాలని ఆదేశాలిచ్చారు. భారత సైన్యం అన్ని రకాల ఆయుధాలతో బయలుదేరింది. నిజాం తన సంస్థానానికి టర్కీ, పాకిస్తాన్ నుంచి మద్దతు లభిస్తుందని భావించాడు. నిజాంకు చెందిన సిడ్నీ కాటన్ విమానం ఆ దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలు తీసుకొని వస్తుందని అనుకున్నారు. ఈ రెండూ జరగలేదు. అప్పటికే రజాకార్ల దౌర్జన్యంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, మరోవైపు భారత సైన్యంతో మన సైన్యం పోటీపడలేదని సైన్యాధిపతి అల్ ఇద్రూస్ నిజాం తెలియజేశారు. భారత సైన్యం సునాయాసంగా నిజాం సంస్థానంలో ప్రవేశించింది. 1948, సెప్టెంబర్ 17న సాయంత్రం ఏడు గంటలకు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ నిజాం పాలన ఇంతటితో అంతమైందని, నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైందని ప్రకటించారు. ఈ పని ఇది వరకే చేయాల్సిందని, అలా చేయనందుకు విచారిస్తున్నామని ఐక్యరాజ్యసమితిలో పెట్టిన అన్ని కేసులను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం హైదరాబాద్ సంస్థాన సైన్యాధిపతి అల్ ఇద్రూస్ భారత సైన్యా«ధిపతి ముందు తన సైన్యంతో సహా లొంగిపొయాడు. మేజర్ జనరల్ జె.ఎన్ చౌదరి హైదరాబాద్ సైనిక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1949 వరకు కొనసాగారు. అనంతరం 1950 జనవరిలో భారత ప్రభుత్వ సీనియర్ అధికారి ఎం.కె. వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించింది. తర్వాత 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. రజాకార్లతో .. ముస్లిం సముదాయంలోని అన్ని వర్గాలను తమ సమస్యల పరిష్కారానికి ఒకే వేదికపైకి తీసుకురావడానికి 1924లో బహదూర్ యార్ జంగ్ మజ్లీస్–ఏ–ఇత్తేహదుల్ ముస్లిమీన్ సంస్థను స్థాపించారు. 1944లో బహదూర్ యార్ జంగ్ మృతి చెందడంతో మజ్లిస్ పగ్గాలు ఖాసీం రజ్వీ చేతికొచ్చాయి. అప్పటికే స్వాతంత్ర ఉద్యమం తారస్థాయికి చేరింది. బ్రిటిష్ పాలకులు దేశం విడిచి వెళ్లిపోతున్నట్లు ప్రచారం జరిగింది. హైదరాబాద్ సంస్థానం కూడా దేశంలో కలిస్తే మన పరిస్థితి దారుణం అయిపోతుందని ముస్లింలను రజ్వీ రెచ్చగొట్టాడు. రజాకార్ (స్వచ్ఛంద) అనే గ్రూప్‌ను తయారు చేసి వారికి కర్ర, ఆయుధాల శిక్షణ ఇచ్చాడు. దేశానికి అనుకూల నినాదాలు చేసిన వారిపై రజాకార్లు దాడులు చేయడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం అయిన తరువాత ఖాసీం రజ్వీని జైలులో పెట్టారు. ఆరేళ్ల తర్వాత విడుదలై పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడే మరణించాడు. -
‘హైదరాబాద్ బదులు పాక్‌కు కశ్మీర్’
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ కశ్మీర్ అంశంపై మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కశ్మీర్ స్వాతంత్ర్యంపై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ వైఖరిని సోజ్ సమర్ధించిన సంగతి తెలిసిందే. సోజ్ రచించిన ‘గ్లిమ్ప్సెస్ ఆఫ్ హిస్టరీ అండ్ స్టోరీ ఆఫ్ స్ట్రగుల్’ పుస్తకావిష్కరణ సభ సోమవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కశ్మీర్‌ను పాక్‌కు ఇచ్చేందుకు సిద్దమయ్యారని సంచలన కామెంట్ చేశారు. ‘హైదరాబాద్‌కు బదులు పాక్‌కు కశ్మీర్‌ను ఇచ్చేలా పటేల్ ప్రతిపాదించారు. అప్పటి పాక్ ప్రధాని లిఖ్వాత్ అలీఖాన్‌తో చర్చలు జరిపేటప్పుడు పటేల్ హైదరాబాద్ ప్రస్తావన తీసుకురావద్దని కోరారు. హైదరాబాద్ బదులు కశ్మీర్‌ను పాక్ తీసుకోవచ్చన్నారు. ఖాన్ యుద్ద సన్నాహాలు ప్రారంభించినప్పటికీ.. పటేల్ మాత్రం ఆ దిశలో చర్యలు చేపట్టలేద’ని సోజ్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ముషార్రఫ్‌ను సమర్ధిస్తూ సోజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా సోజ్ వ్యాఖ్యలపై స్పందించడానికి వెనుకాడుతోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మాత్రం జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ కమిటీ సోజ్‌పై తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేశ్ హాజరయ్యారు. -
దేశ చరిత్రనే మార్చేస్తున్నారు!!
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్‌కు ఇంకా అధికారికంగా స్వాతంత్య్రం రాకముందు అంటే, 1946లో ప్రభుత్వంలో నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ముందుకు రాగా, 16 మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్లో ఒక్కరు మాత్రమే ఆయనకు అనుకూలంగా ఓటేశారు. మిగతా 15 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఓటేశారు. పోటీ నుంచి తప్పుకోవాలంటూ జాతిపిత మహాత్మా గాంధీ చేసిన విజ్ఞప్తి మేరకు పటేల్ తప్పుకున్నారు. పదవి పండిట్‌ను వరించింది’ ఇంటర్నెట్లో విస్తతంగా ప్రచారంలో ఉన్న కథ ఇది. ఈ కథను మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా నమ్మారు. సర్దార్ పటేల్ దేశానికి తొలి ప్రధాన మంత్రి కావాల్సిన వారని, అందుకు ఆయన్ని అడ్డుకున్నారని, లేకపోతే పటేల్, నెహ్రూకన్నా సమర్థుడైన ప్రధాని అయ్యేవారని మోదీ వ్యాఖ్యానాలు కూడా చేశారు. గతేడాది పటేల్ వర్ధంతి సందర్భంగానే కాకుండా ఈ అక్టోబర్ 31వ తేదీన జరిగిన జయంతి సందర్భంగా కూడా ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోదీ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే మన ప్రధాన మంత్రిగా ఆయన్ని దేశ ప్రజలు కాకుండా రాష్ట్ర బీజేపీ శాఖలన్నీ కలిసి ఎన్నుకున్నట్లుగా ఉంది. అసలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కలిసి దేశ ప్రధానిని ఎన్నుకోవడం ఏమిటీ? ఇంకా కావాలనుకుంటే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించవచ్చు. అలా అనుకున్నాగానీ నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులే ఎన్నుకునేవారు. నెహ్రూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంతకన్నా కాదు. అప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడిగా జీబీ కృపలాని ఎన్నికయ్యారు. మరి 1946లో జరిగిందేమిటీ? బ్రిటీష్ వైస్రాయ్ ఎన్నుకున్నారు గాంధీ తర్వాత అంతటి ప్రజాదరణ కలిగిన పండిట్ నెహ్రూ నాయకత్వాన అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1947, ఆగస్టు 15 వ తేదీన దేశ ప్రధాన మంత్రిగా నెహ్రూ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నాడు పటేల్ కన్నా నెహ్రూకే ఎక్కువ ప్రజాదరణ ఉందనడానికి పటేల్ అమెరికా జర్నలిస్ట్ విన్సెంట్ షీన్‌తో చేసిన వ్యాఖ్యలే సాక్ష్యం. ముంబైలో జరిగిన కాంగ్రెస్ మహా సమ్మేళనానికి లక్షలాది మంది ప్రజలు హాజరుకావడాన్ని అమెరికా జర్నలిస్ట్ ప్రశ్నించినప్పుడు ‘వీరంతా నా కోసం రాలేదు. నేను మాస్ లీడర్‌ను కాను. నెహ్రూగారి కోసం వచ్చారు’ అని వ్యాఖ్యానించారు. పటేల్ మొదటి నుంచి కాంగ్రెస్ వాదే ‘నాడు వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉక్కులాంటి బలమైన సంకల్పం కలిగిన సర్దార్ పటేల్ లాంటి వ్యక్తులు ఆరోజుల్లో మాకుండడం మా అదృష్టం’ అని 1966లో ఆరెస్సెస్ సుప్రీం ఎంఎస్ గోవాల్కర్ ‘బంచ్ ఆఫ్ థాట్స్’ అనే పుస్తకంలో రాశారు. ఆయన ఈ వ్యాక్యం ఏ ఉద్దేశంతో రాశారో తెలియదుగానీ గోవాల్కర్‌ను గురువుగా భావించే నరేంద్ర మోదీ కూడా ఆయన మాటల్ని నమ్మారు. ఆరెస్సెస్ సిద్ధాంతం పటేల్‌కు నచ్చిందని భావించి పటేల్ భజన ప్రారంభించారు. ఆరెస్సెస్ వారిని దారితప్పిన దేశభక్తులుగా భావించిన పటేల్, గాంధీ హత్యకు సరిగ్గా మూడు వారాల ముందే వారిని కాంగ్రెస్ పార్టీలోకి కూడా ఆహ్వానించారు. అయితే జాతిపిత గాంధీ హత్యానంతరం డిప్యూటి ప్రధాన మంత్రి హోదాలో హోం శాఖను నిర్వహిస్తున్న పటేల్ ఆరెస్సెస్ నిషేధించారు. ఆరెస్సెస్ భావజాలాన్ని వ్యతిరేకిస్తూ 1948, జూలై 18న భవిష్యత్ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద ముఖర్జీకి లేఖ కూడా రాశారు. ‘హిందూ మహాసభకు చెందిన తీవ్రభావాజాలం కలిగిన వ్యక్తులే గాంధీ హత్యకు కుట్రదారులని నేను భావిస్తున్నాను. ఆరెస్సెస్ కార్యకలాపాలు ప్రభుత్వం, రాజ్యం మనుగడకు ప్రమాదకరంగా తయారయ్యాయి’ అని సర్దార్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎప్పటికీ రామన్న హామీపై ఆరెస్సెస్‌పై ఏడాదిన్నర తర్వాత ఆయన నిషేధాన్ని ఎత్తివేశారు. ఏడాది తిరక్కముందే ఆరెస్సెస్ ఈ హామీని తుంగలో తొక్కింది. రాజకీయాల్లో పాల్గొనేందుకు జనసంఘ్‌ను తీసుకొచ్చింది. నాటి జనసంఘ్‌యే నేటి బీజేపీ. పటేల్ చనిపోయే వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. దేశ విభజనను అంగీకరించిందే పటేల్ దేశ విభజనను పండిట్ నెహ్రూ కోరుకోవడం వల్లనే పాకిస్థాన్ ఏర్పడిందని, అందుకని ఆయన్ని చంపాలనుకున్న నాథూరామ్ గాడ్సే ఆయనకు బదులుగా గాంధీని హత్య చేశారంటూ కేరళ ఆరెస్సెస్ పత్రిక ఇటీవల సరికొత్త కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. పటేల్ దేశ విభజనను వ్యతిరేకించారని కూడా పేర్కొంది. గోవాల్కర్ వ్యాఖ్యలను నమ్మినట్లే మన మోదీ కేరళ ఆరెస్సెస్ వ్యాఖ్యలను నమ్మారు. ఆయన దేశం ఐక్యత కోసం కషి చేశారంటూ నిన్నటి ప్రసంగానికి మెరుగులు దిద్దారు. 1946, డిసెంబర్లోనే పటేల్ దేశ విభజనకు అంగీకరించారు. ఆయన వైఖరి పట్ల మొదటి నుంచి దేశ విభజనను వ్యతిరేకించిన అబుల్ కలాం ఆజాద్ బాధను వ్యక్తం చేశారు. తాను రాసిన లేఖకు ‘మనం అంగీకరించినా, లేకపోయినా భారత్‌లో రెండు దేశాలు ఉన్నాయి’ అంటూ పటేల్ సమాధానం ఇవ్వడం పట్ల ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్’ పేరిట తాను రాసిన జ్ఞాపకాల్లో అబుల్ కలాం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆరు నెలలకు నెహ్రూ దేశ విభజనకు అంగీకరించారు. దాంతో వీపీ మీనన్ నాయకత్వాన దేశ విభజన ప్రణాళిక రూపొందింది. బాబ్రీ మసీదును ధ్వంసం చేయాలనలేదు 1949లో కొంతమంది బృందం బాబ్రీ మసీదులోకి జొరబడి అక్కడ రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో కొంత గొడవ జరిగింది. ఆ తర్వాత నెల రోజులకు ఈ అంశంపై అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జీబీ పంత్‌కు పటేల్ ఓ హెచ్చరిక లేఖ రాశారు. ‘ఇలాంటి సమస్యలను బలప్రయోగం ద్వారా పరిష్కరించుకునే ప్రసక్తే లేదు. ఏదైనా ముస్లింలను కూడా విశ్వాసంలోకి తీసుకొని సామరస్యంగా, శాంతియుతంగా పరిష్కరించుకోవడం మంచిది’ అన్నారు. దీనికి ఆరెస్సెస్ శక్తులు ఆనాడే బాబ్రీ విధ్వంసానికి పటేల్ ఒప్పుకున్నారని ఎక్కడలేని ప్రచారం చేస్తోంది. ఇలాంటి ప్రచారాలన్నీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టితోనేనని, 14 శాతమున్న పటేళ్లను మెప్పించడం కోసమే పటేల్ గురించి మాట్లాడుతున్నారని ఎవరైనా గ్రహించవచ్చు. -
పటేల్ కీర్తిని మసకబార్చే కుట్ర
న్యూఢిల్లీ: భారత తొలి హోంమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతిష్టను మసకబార్చేందుకు కొన్ని పార్టీలు, ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నించాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఏకం చేసే పనిలో పటేల్ పాత్రను చరిత్ర నుంచి తొలగించే పని చేశారని మండిపడ్డారు. గుజరాత్ ఎన్నికల సమయంలో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంగళవారం ఢిల్లీలో పటేల్ 142వ జయంతి సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం నుంచి.. ఇండియాగేట్ వరకు జరిగిన ఐక్యతా పరుగును మోదీ ప్రారంభించారు. ‘తొలి కేంద్ర హోం మంత్రి రాజనీతిజ్ఞత, రాజకీయ చతురత కారణంగానే దేశం నేడు ఐక్యంగా ఉంది. దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలనుకున్న వలసపాలకుల ఆలోచన కార్యరూపం దాల్చకుండా పటేల్ వ్యవహరించిన తీరు అద్భుతం. కానీ పటేల్ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలు జరిగాయి. పటేల్ చేసిన సేవలను మరిచిపోయేలా చేశారు. కానీ సర్దార్ సర్దారే. ఏ ప్రభుత్వమైనా, పార్టీ అయినా గుర్తింపునిచ్చినా ఇవ్వకపోయినా.. దేశ నిర్మాణంలో ఆయన పాత్రను యువత ఎన్నటికీ మరవదు’ అని ప్రధాని పేర్కొన్నారు. అన్ని మార్గాలను అనుసరించి.. స్వాతంత్య్రానంతరం భారతంలోని ఎన్నో సమస్యల పరిష్కారంలో, దేశాన్ని ఏకం చేయటంలో ఆయన పాత్ర మరవలేనిదని మోదీ అన్నారు. ‘బ్రిటిష్ ప్రభుత్వం దేశాన్ని చిన్న రాజ్యాలుగా విభజించాలనుకుంది. కానీ పటేల్ సామ, దాన, భేద, దండ, రాజనీతిలనుపయోగించి తక్కువ సమయంలోనే రాజ్యాలను కలిపేశారు’ అని ఆయన చెప్పారు. తరతరాలుగా భారతీయులు పటేల్‌ను గుర్తుచేసుకుంటూనే ఉన్నారన్నారు. అంతకుముందు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పార్లమెంటు స్ట్రీట్ లోని పటేల్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ మండిపాటు పటేల్ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేశారన్న మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. సర్దార్ పటేల్ పేరును మోదీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించింది. గాంధీ హత్య తర్వాత పటేల్ ఆరెస్సెస్‌పై నిషేధం విధించిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించింది. ‘సంఘ్ నేతల ప్రసంగాలు విషపూరితం. వీటి కారణంగానే గాంధీ హత్యకు గురయ్యారు’ అని పటేల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ట్వీట్ చేసింది. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆరెస్సెస్ పాత్రేంటో తెలపాలని ప్రశ్నించింది. అది 125 కోట్ల ప్రజల బాధ్యత భిన్నత్వంలో భారత శక్తి దాగి ఉందన్న మోదీ.. ‘వివిధ భాషలు, ప్రాంతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన శైలులు, ఆహారపు అలవాట్లున్నప్పటికీ అవన్నీ మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. భిన్నత్వమే భారత్‌కు గర్వకారణం’ అని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో ఒకే విశ్వాసంతో ఉన్న వారు కూడా ఒకరినొకరు చంపుకుంటారని చెప్పిన మోదీ.. భారత్‌లో భిన్న విశ్వాసాల ప్రజలు ఐకమత్యంతో జీవిస్తుండటం గొప్ప విషయమన్నారు. దేశం ఎప్పటికీ ఐక్యంగా ఉండేలా 125 కోట్ల మంది ప్రజలు బాధ్యత తీసుకోవాలని ప్రధాని సూచించారు. తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కూడా భారత్ ఒకే దేశంగా ఉండటానికి పటేల్ నేతృత్వమే కారణమని పేర్కొన్న విషయాన్నీ మోదీ గుర్తుచేశారు. సమావేశం ప్రారంభంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మోదీ నివాళులర్పించారు. స్వాతంత్య్రానంతరం రేగిన మత కలహాలను సైతం పటేల్ సమర్థవంతంగా అదుపులోకి తీసుకొచ్చారని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. అక్టోబర్ 31ని కేంద్ర ప్రభుత్వం ‘రాష్ట్రీయ ఏకతా దివస్’గా జరుపుతోంది. కేంద్ర మంత్రులు అనంతకుమార్, విజయ్ గోయల్, రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్, హర్దీప్ పురీతోపాటు ఉన్నతాధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. సర్దార్ సింగ్, దీపా కర్మాకర్, సురేశ్ రైనా, కరణం మల్లీశ్వరి తదితరులు హాజరయ్యారు. ఈ పరుగులో పాల్గొనటం గర్వంగా ఉందని సర్దార్ సింగ్, దీపా కర్మాకర్ పేర్కొన్నారు. -
పటేల్ వల్లే తెలంగాణ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ స్టేట్‌ను విలీనం చేసే విశేష కృషిని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేయకపోయి ఉంటే ప్రస్తుత తెలంగాణలో పరిస్థితులు ఇప్పటి మాదిరిగా ఉండేవి కావని కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్‌ప్రసాద్ వ్యాఖ్యానించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని శుక్రవారం బీజేపీ లీగల్, ఐటీ, ఇంటలెక్చువల్ సెల్ల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘సర్దార్ పటేల్-ఇంట్రికసీస్, ఇంపెరెటీవ్స్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్’ అనే అంశంపై రవిశంకర్‌ప్రసాద్ ప్రసంగించారు. నేటికీ విభజనవాదం, అల్లర్లు, ఆందోళనలు కొనసాగి ఉంటే, పాకిస్తాన్లోనో, స్వతంత్ర రాజ్యంగానో హైదరాబాద్ ఉండి ఉంటే ప్రస్తుత తెలంగాణలో ఐటీ, ఇతర రంగాల్లో అభివృద్ది జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. కశ్మీర్ అంశాన్ని కూడా అప్పటి ప్రధాని నెహ్రూకు బదులు పటేల్‌కు అప్పగించి ఉంటే అక్కడ ప్రస్తుత అలజడి ఉండేది కాదన్నారు. పటేల్ 563 సంస్థానాలను విలీనం చేస్తే, అప్పట్లో నెహ్రూ పర్యవేక్షణలో ఉన్న కశ్మీర్ సమస్య నేటికీ పరిష్కారం కాకుండా ఉందన్నారు. పటేల్‌ను మహాత్మాగాంధీ తొలి ప్రధానిని చేసి ఉంటే దేశ ముఖచిత్రమే మరో విధం గా ఉండేదన్నారు. ఉప ప్రధానిగా, కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన మూడేళ్ల కాలంలోనే 563 సంస్థానాలను విలీనం చేసి భారత్‌కు సమగ్ర స్వరూపం, సంపూర్ణత్వాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పటేల్ అని కొనియాడారు. బ్రిటీష్ కాలం నాటి ఐసీఎస్ సర్వీసు స్థానంలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనన్నారు. కాంగ్రెస్‌కు పటేల్ విపక్షమా, స్వపక్షమా? కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ స్వపక్షమా? విపక్షమా? అని రవిశంకర్‌ప్రసాద్ ప్రశ్నించారు. పటేల్‌ను కాంగ్రెస్ మరిచిపోయిందని, ఆయ న జయంతిని రాష్ట్రీయ ఏక్తా దివస్‌గా బీజేపీ నిర్వహించడాన్ని జీర్ణించుకోలేక పోతోందన్నారు. దేశం కోసం ఎంతో కృషి చేసిన పటేల్ కు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల తర్వాత భారతరత్న 1991లో వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. అదీ కూడా నెహ్రూ కుటుంబానికి చెందని పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా ఇది వచ్చిందన్న విషయాన్ని గమనించాలని చెప్పారు. చరిత్రను విస్మరించిన టీఆర్ఎస్: లక్ష్మణ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్రను విస్మరించి, ఖాసిం రజ్వీ వారసత్వంగా వచ్చిన ఎంఐఎం ఒత్తిళ్లకు తలొగ్గి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదన్నారు. నాడు పటేల్ పెట్టిన భిక్షతోనే హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైందని, ఆ విధంగా జరగకపోతే హైదరాబాద్ ఉండేదా? తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ సీఎం అయ్యే వారా? అని ప్రశ్నించారు. భారత జాతి, సంస్కృతికి పటేల్ ఆత్మ అని మరో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. జాతి నిర్మాణానికి పటేల్ పునాదిరాయిగా నిలిచారన్నారు. బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పటేల్ గొప్ప దార్శనికుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి, ప్రొ.బి.సత్యనారాయణ, జీజీకే టెక్నాలజీస్ మేనేజింగ్ పార్టనర్ రఘు వీరబెల్లి, బీజేపీ లీగల్ సెల్ రవీందర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కు పిడుగు
-
'సీఎం, మంత్రులు ఎందుకు పాల్గొనలేదు?'
హైదరాబాద్ : స్వాతంత్య్ర సమరయోధుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఎందుకు పాల్గొనలేదో తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాలని బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. దేశ ఐక్యతకు నిరంతరం కృషి చేసిన సర్దార్ పటేల్ జయంతిని దేశవ్యాప్తంగా రాష్ట్రీయ ఏక్తా దినోత్సవం’ పేరిట నిర్వహించాలని కేంద్రం, ప్రధాని మోదీ ప్రకటించినా అందులో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని ప్రశ్నించారు. పటేల్ జయంతిని పురస్కరించుకుని సోమవారం అసెంబ్లీ సమీపంలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, జి. కిషన్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు, పేరాల శేఖర్‌రావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం లభించడానికి పటేల్ శక్తియుక్తులే కారణమన్నారు. పటేల్ కృషి లేకుండా తెలంగాణ లేదని, కేసీఆర్‌కు కూడా సీఎం అయ్యే అవకాశం ఉండేదా అని నిలదీశారు. ఈ అంశాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఆత్మావలోకనం చేసుకోవాలని హితవుపలికారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రజలు, పార్టీలు జరుపుకుంటున్నా, మజ్లీస్ ఒత్తిడితో ఓట్ల రాజకీయాలకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని ప్రజలకు అర్థమైందన్నారు. ఇది ఆనాటి పోరాట యోధులను అవమానపరచడమేనని ధ్వజమెత్తారు. ఇటువంటి సంకుచిత భావాల వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పటేల్ అకుంఠిత దీక్షతో దేశంలోని 500కు పైగా సంస్థానాలు విలీనమయ్యాయన్నారు. పటేల్ సరైన చర్య తీసుకోకుండా నిజాం నవాబ్ లొంగిపోయే వాడు కాదని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడి ఉండేది కాదన్నారు. మురళీధర్‌రావు ప్రసంగిస్తూ దేశ ఐఖ్యత, అఖండతకు పటేల్ చేసిన సాహసోపేత చర్యలను అందరూ గుర్తుంచుకోవాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. అలాగే బీజేపీ కార్యాలయంలోనూ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు నివాళులర్పించారు. -
'ఆయన తొలి ప్రధాని అయ్యుంటే బాగుండేది'
న్యూఢిల్లీ : సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశ తొలి ప్రధాని అయి ఉంటే బాగుండని దేశ ప్రజలు భావిస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. సర్దార్ పటేల్ 141వ జయంతి సందర్భంగా తన శాఖ అధికారులు, సిబ్బందితో వెంకయ్య సోమవారం రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశ నిర్మాణంలో వల్లభాయ్ పటేల్ వంటి నేతలు చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సి ఉందన్నారు. దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న గొప్ప నాయకులైన పటేల్, సుభాష్ చంద్రబోస్, బీఆర్ అంబేద్కర్, పండిత్ ధ్యాన్ దయాళ్ ఉపాధ్యాయ తదితరులకు జీవించి ఉన్నకాలంలో సముచిత గౌరవం దక్కలేదన్నారు. వారి కృషిని, ఔచిత్యాన్ని దేశ ప్రజలు స్మరించుకోవాల్సి ఉందన్నారు. పటేల్ ఒక్కడే ప్రయత్నం చేసి దేశాన్ని ఏకతాటిపై నిలబెట్టి, అన్ని సంస్థానాలను భారత దేశంలో విలీనం చేసి దేశ ఐకమత్యాన్ని నిలబెట్టిన మహానాయకుడని వెంకయ్య ప్రశంసించారు. స్వతంత్రం అనంతరం ఆయన మూడేళ్లే జీవించి ఉన్నారని, ఎక్కువ కాలం ఉండి ఉంటే దేశం ఈ రోజు ఎదుర్కొంటున్న సవాళ్లు ఉత్పన్నమయ్యేవి కావని అభిప్రాయపడ్డారు. దేశ ముఖచిత్రమే మరోరకంగా ఉండేదని, పటేల్ దేశ తొలి ప్రధాని అయి ఉంటే బాగుండేదని అన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనించడమే ఆయనకు అర్పించే నివాళి అని, ఆశ్రిత పక్ష పాతానికి, వారసత్వ రాజకీయాలకు చోటివ్వకుండా వ్యవహరించారన్నారు. అనంతరం వెంకయ్య..ఉద్యోగులతో అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. -
‘ఉక్కు మనిషి’ విగ్రహావిష్కరణ
ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని రామంతాపూర్ ప్రధాన రహదారిలో కేంద్రమంత్రి దత్తాత్రేయ ఆవిష్కరిస్తారని ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు. శనివారం ఉదయం 6.30 గంటలకు విగ్రహావిష్కరణ అనంతరం 5000 మందితో తిరంగా యాత్రను మంత్రి ప్రారంభిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. -
ఉక్కు మనిషికి మోదీ నివాళి
న్యూఢిల్లీ: భారత ఉక్కుమనిషి, మాజీ ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ 65వ వర్దంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. పటేల్‌కు మోదీ సెల్యూట్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సమగ్రత, సమైక్యత అంశాలతో పాటు తన విలువైన సేవలను మనం స్మరించుకోవాలన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో పోరును కొనసాగించిన పటేల్, అనంతరం భారత జాతిని ఏకతాటిపైకి తీసుకొచ్చాడని పటేల్ గొప్పతనాన్ని, ఆయన సేవల్ని ప్రధాని మోదీ కొనియాడారు. On his Punya Tithi, salutations to Sardar Patel. We remember his exemplary service & are inspired by his message of unity & integration. — Narendra Modi (@narendramodi) December 15, 2015 -
ఉక్కు మనిషి
-
'మతపరమైన జాతీయ వాదాన్ని ప్రోత్సహిస్తున్నారు'
హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. మతపరమైన జాతీయ వాదాన్ని మోదీ సర్కారు ప్రోత్సహిస్తుందని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. సోమవారం ఇందిరాభవన్ లో పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి కార్యక్రమానికి పలువురు ఏపీసీసీ నేతలు హాజరై నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన రామచంద్రయ్య.. వివిధ సంస్థానాలుగా ఉన్న దేశాన్ని ఏకం చేసి లౌకితత్వాన్ని పట్టిష్టం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం పటేల్ ఆశయస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ అజెండాను బీజేపీ అమలు చేయాలని యత్నిస్తోందని దుయ్యబట్టారు. దేశ సమగ్రతను కాపాడే విధంగా మోదీ సర్కారు వ్యవహరించాలని ఆయన సూచించారు. -
అది దేశ సమైక్యతకు గొడ్డలిపెట్టు
సిక్కుల ఊచకోతపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య ఘనంగా సర్దార్ పటేల్ 139వ జయంతి వేడుకలు పటేల్‌చౌక్ వద్ద మోదీ నివాళి, ‘జాతీయ ఐక్యతా దినం’గా ప్రకటన ఐక్యతా పరుగులోనూ పాల్గొన్న ప్రధాని న్యూఢిల్లీ: శతాబ్దాలుగా అల్లుకుపోయిన భారత సమైక్యతా భావనకు సరిగ్గా 30 ఏళ్ల క్రితం జరిగిన సిక్కుల ఊచకోత ఘటన గొడ్డలిపెట్టువంటిదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 139వ జయంతి సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని పటేల్‌చౌక్ వద్ద నిర్వహించిన ‘సమైక్యతా పరుగు’ కార్యక్రమంలో ప్రధాని స్వయంగా పాల్గొన్నారు. ఉక్కుమనిషి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తొలి హోంమంత్రిగా దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చిన సర్దార్ పటేల్‌ను విస్మరించలేమని, ఆయన లేకుండా దేశ చరిత్ర లేదని మోదీ అన్నారు. స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత దేశాన్ని ముక్కలు చేయాలని బ్రిటిషర్లు ప్రయత్నిస్తే పటేల్ ఒక్కరే ధైర్యంగా ఆ పరిస్థితిని చక్కదిద్దారని, దాదాపు 550 చిన్న చిన్న సంస్థానాలను దేశంలో విలీనం చేశారని కొనియాడారు. అందుకే ఆయన జయంతిని ‘జాతీయ ఐక్యతా దినం(నేషనల్ యునిటీ డే)’గా పాటించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇదే రోజున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని జరుపుకొంటారని, అయితే ఆమె హత్యానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల విషయాన్ని మాత్రం మరుగున పడేశారని ఆయన వ్యాఖ్యానించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు సర్దార్ పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారని, అయితే దురదృష్టవశాత్తూ మూడు దశాబ్దాల క్రితం ఆయన జయంతి నాడే సాటి భారతీయులు కొందరు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. అది ఏ ఒక్క వర్గానికో తగిలిన గాయం కాదని, శతాబ్దాలుగా పెనవేసుకున్న జాతీయ సమగ్రతా గుండెల్లో దిగిన గునపంలాంటిదని మోదీ వ్యాఖ్యానించారు. రాజకీయపరంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా జాతీయ సమగ్రత కోసమే పటేల్ పాటుపడ్డారని గుర్తు చేశారు. చరిత్రను మరచిన ఏ దేశం కూడా మరో చరిత్రను సృష్టించలేదన్న విషయాన్ని మనం మరవద్దన్నారు. స్వాతంత్య్రోద్యమం సందర్భంగా పటేల్‌పైనే మహాత్మాగాంధీ భరోసా పెట్టుకున్నారని, ఆయన ప్రణాళికల వల్లే దండి యాత్ర విజయవంతమైందని మోదీ పేర్కొన్నారు. వివేకానందుడు లేకుండా రామకృష్ణ పరమహంస ఎలా అసంపూర్ణుడో, అలాగే సర్దార్ పటేల్ లేకుండా మహాత్ముడు కూడా అసంపూర్ణుడే అని అభిప్రాయపడ్డారు. పూర్వం చాణక్యుడిలాగే పటేల్ కూడా తన శక్తియుక్తులు ప్రదర్శించి దేశ విభజన సమయంలో భారత్‌ను ఐక్యంగా ఉంచారని కొనియాడారు. అంతకుముందు ప్రధానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వాగతం పలికారు. సమైక్యతా పరుగులో ప్రముఖ క్రీడాకారులు సుశీల్‌కుమార్, విజేందర్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్యతా పరుగులో పాల్గొన్న వారందరితో ప్రధాని ‘ఐక్యతా ప్రమాణం’ చేయించారు. ‘సర్దార్ స్మృతిశాల’గా పటేల్ స్కూలు నడియూడ్(గుజరాత్): స్వతంత్ర భారతదేశం తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్ చదువుకున్న ప్రాథమిక పాఠశాల ఇపుడు స్మారక చిహ్నంగా వూరింది. గుజరాత్ రాష్ట్రం, కరంసద్ జిల్లాలోని పటేల్ పూర్వీకుల గ్రావుమైన కరంసద్లోని ఈ పాఠశాలలో పటేల్ ఒకటవ తరగతినుంచి ఆరవ తరగతి వరకూ (1882నుంచి1888వరకూ)చదువుకున్నారు. సంరక్షణ కరువై శిథిలావస్థకుచేరి, చెత్తదిబ్బలా తయూరైన ఈ పాఠసాల భవనాన్ని కోటీ 20లక్షల రూపాయుల వ్యయుంతో ‘సర్దార్ స్మృతి శాల’గా తీర్చిదిద్దారు. పటేల్ జయుంతిని పురస్కరించుకుని ఈ స్మారక చిహ్నాన్ని గుజరాత్ వుుఖ్యవుంత్రి ఆనందీబెన్ పటేల్ శుక్రవారం ప్రారంభించారు. పటేల్ వస్తువులు ప్రధానికి అప్పగింత న్యూఢిల్లీ: దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉపయోగించిన పలు వస్తువులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్వీకరించారు. పటేల్ వాడిన ప్లేట్లు, కప్‌లు, సాసర్లతోపాటు మరికొన్ని వస్తువులను మంజరి ట్రస్ట్‌కు చెందిన షీలా ఘటాటే ప్రధానికి ఆయన నివాసంలో అందించినట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పటేల్ మనవడు బిపిన్ దహ్యాభాయ్ పటేల్, ఆయన భార్య లూయ్ వీలునామాలో పేర్కొన్న ప్రకారం ఆ వస్తువులను ఘటాటే గతంలో అందుకున్నారు. ఈ వస్తువులను అందుకున్న అనంతరం మోదీ ఫేస్బుక్లో స్పందిస్తూ దేశ వారసత్వ సంపదలో ఈ వస్తువులు ప్రత్యేక భాగమన్నారు. అంతకుముందు పటేల్ 139వ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి, పార్లమెంటులోని ఆయన చిత్రపటానికి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. -
ఐక్యత పరిరక్షణకు పాటుపడాలి: ఎల్జీ
న్యూఢిల్లీ: జాతీయ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభ్‌భాయ్ 139వ జయంతి సందర్భంగా ఎల్జీ... రాజ్‌నివాస్‌లో శుక్రవారం తన సిబ్బంది ‘రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవ’ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జంగ్ మాట్లాడుతూ చరిత్రను మరిచిన జాతి కొత్త చరిత్రను సృష్టించలేదంటూ 30 సంవత్సరాల నాటి సిక్కుల ఊచకోత, అనంతరం ఆనాటి ప్రధానమంత్రి ఇంది రాగాంధీ హత్య ఘటనను ఆయన ప్రస్తావించారు. మరోవైపు రాజ్నివాస్తోపాటు ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన వివిధ కార్యాలయాల్లోనూ అధికారులతోపాటు సిబ్బం ది రాష్ట్రీయ ఏక్త దివస్ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఉపకులపతి దినేష్ సింగ్.. దేశ తొలి హోం శాఖ మంత్రికి ఘననివాళులర్పించారు. విశ్వవిద్యాలయంలోని వివిధ శాఖలతోపాటు దీని పరిధిలోని వివిధ కళాశాలల్లో రాష్ట్రీయ ఏక్త దివస్ ప్రమాణ కార్యక్రమం జరిగింది. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ... సర్దార్ వల్లభ్‌భాయ్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా ప్రకటించిన సంగతి విదితమే. యూనిటీ రన్‌కు రాష్ట్రపతి పచ్చజెండా సర్దార్ వల్లభ్‌భాయ్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ వద్ద శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ‘యూనిటీ ఫర్ రన్’ను ప్రారంభించారు. ఈ రన్లో దాదాపు రెండు వేలమంది ఔత్సాహికులు పాల్గొన్నారు. -
'పటేల్ లేకుంటే హైదరాబాద్ భారత్‌లో కలిసేదికాదు'
హైదరాబాద్: దేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ భారత్‌లో విలీనమయ్యేదికాదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం పటేల్ 139 జయంతి సందర్భంగా రాజ్‌నాథ్ హైదరాబాద్‌లో సమైక్యత పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా పటేల్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనమైందని అన్నారు. పటేల్ లేకుంటే హైదరాబాద్ భారత్‌లో కలిసేదికాదని చెప్పారు. పటేల్ 70 రోజుల్లో 562 సంస్థానాలను భారత్‌లో విలీనం చేశారని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో నిర్వహించిన పరేడ్‌లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. -
పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారత్‌లో విలీనం
హైదరాబాద్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో జాతీయ సమైక్యతా పరుగును ప్రారంభించారు. అంతకు ముందు ఆయన అసెంబ్లీ ముందున్న పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ఐకమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ జయంతి హైదరాబాద్‌లో జరుపుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారతదేశంలో విలీనమైందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ విభజన సమయంలో పటేల్ కీలక పాత్ర వహించారని కొనియాడారు. మోదీ సంకల్పించిన జాతీయ ఐక్యతా పరుగును విజయవంతం చేయాలని రాజ్‌నాథ్ కోరారు. ఐక్యతా రన్ పటేల్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ వరకు కొనసాగుతుంది. పటేల్ జయంతిని జాతీయ ఏక్తా దివస్‌గా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ప్రజల్లో సమైక్యతా భావాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు నగరానికి చెందిన బీజేపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ రాజేంద్ర నగర్ లోని సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు. 66వ బ్యాచ్ ఐపీఎస్ లు శిక్షణ పూర్తి చేసుకోగా,ఈ ముగింపు కార్యక్రమంలో రాజ్ నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
సంకల్పబలుడు
భారతదేశంలో ఐక్యత గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు దేశ జాతీయోద్యమంలోను, ఆ తర్వాత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం మాత్రమే మొదటి నిలువెత్తు ప్రతిమలా దర్శనమిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాకుండా... స్వాతంత్య్రానంతరం, మొరాయించిన సంస్థానాలకు ముకుతాడు వేసి మరీ భారతదేశంలో విలీనం చేయడంలోని దృఢ సంకల్పం ఆయనలోని ఉక్కు మనిషిని ప్రపంచానికి చూపింది. మనుషుల్ని, ప్రాంతాలను కలిపి ఉంచడానికి పటేల్ ఈ దేశపు తొలి హోమ్ మంత్రిగా కఠినమైన నిర్ణయాలే తీసుకున్నారు. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాలలో చెలరేగిన అల్లర్లను కూడా తొలి ఉప ప్రధానిగా ఆయన ఎంతో సమర్థంగా అణచివేయగలిగారు. మరణించిన నాలుగు దశాబ్దాల తర్వాత పటేల్‌కు భారతరత్న లభించి ఉండవచ్చు కానీ, అందుకు సమానమైన గౌరవం ఈ ఏడాది నుంచి ఆయనను చిరస్మరణీయం చేయబోతోంది. పటేల్ జన్మించిన అక్టోబర్ 31 వ తేదీని ఏటా రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతాదినం)గా జరుపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోపక్క మధ్య గుజరాత్‌లోని నర్మదా నది ఆనకట్టకు మూడు కి.మీ. సమీపంలో ఉన్న సాధు ద్వీపంలో 2,989 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 182 మీటర్ల (597 అడుగులు) ఎత్తున ఏర్పాటు చేయ తలపెట్టిన పటేల్ ఐక్యతా ప్రతిమ నిర్మాణ పనులను గత సోమవారమే గుజరాత్ ప్రభుత్వం ఎల్ అండ్ టి సంస్థకు అప్పగించింది. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’కి రెండింతల ఎత్తు ఉండే ఈ విగ్రహం 2018లో పూర్తయ్యాక, ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా ఎత్తై స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ రికార్డును మించిపోతుంది. పటేల్‌లోని శిఖర సమాన దృఢచిత్తానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ఛాయామాత్రమైన ప్రతిరూపంగా నిలవగలుగుతుంది. 1875లో గుజరాత్‌లోని నడియాడ్‌లో జన్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంగ్లండ్‌లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించి, తిరిగి ఇండియాకు వచ్చాక క్రియాశీలక ఉద్యమ రాజకీయాల్లో పాల్గొన్నారు. రాజనీతిజ్ఞుడిగా ఎదిగారు. దేశ పౌరుల ప్రథమ విధి తమ దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడమేనని పటేల్ అంటారు. -
ముక్కలు కానివ్వం
అఖండ కర్ణాటక విడిపోదు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం హై-క విమోచన దినోత్సవంలో సీఎం సిద్ధరామయ్య రాయచూరు రూరల్ : ఎలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని, అఖండ కర్ణాటక ఎప్పటికీ విడిపోదని రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. గుల్బర్గాలో బుధవారం నిర్వహించిన హై-క విమోచన దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. అంతకు ముందు పటేల్ రోడ్డులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉత్తర కర్నాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి ఉమేష్ కత్తి.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయంపై ఎం దుకు నోరు విప్పలేదని సీఎం ప్రశ్నిం చారు. అన్నదమ్ముల్లా మెలుగుతున్న కన్నడిగుల మధ్య ఉమేష్ కత్తి చిచ్చు రాజేస్తున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే మాటలతో అలజడి సృష్టించవద్దని హితవు పలికారు. హై-క అభివృద్ధికి బోర్డు ఏర్పాటు చేసి రూ.600 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం రూ.150 కోట్లు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. రాయచూరులో ఐఐటీ, ఎయిమ్స్ సంస్థల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. నవంబర్‌లో మంత్రి వర్గ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అతివృష్టి, అనావృష్టి పీడిత ప్రాంతాల్లో నష్టంపై అంచనాలను వారం రోజుల్లో సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. -
‘ఆపరేషన్ పోలో’ మొదలైంది ఇలా..
* సైనిక చర్యకు తలవంచిన ఏడో నిజాం * రజాకార్ల ఆగడాలు అంతమైన రోజు * స్వేచ్ఛావాయువులు పీల్చిన హైదరాబాదీలుభారత్ వశమైన హైదరాబాద్ సంస్థానం * ‘సెప్టెంబర్ 17’ ప్రత్యేకం సాక్షి, సిటీబ్యూరో: 1947లో దేశానికి స్వాతంత్య్ర వచ్చినా హైదరాబాదీలు మాత్రం రజాకార్ల ఆగడాలకు బలయ్యారు. వారి వేధింపు లను భరించలేక విసిగి వేసారి పోయారు. విముక్తి కోసం కలలుగన్నారు. వారు అనుకున్నట్టుగానే 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజు లొంగుబాటుతో ప్రజలంతా స్వేచ్ఛా వాయువులు పీల్చారు. భారత సైన్యం నలువైపుల నుంచి హైదరాబాద్‌ను ముట్టడించడంతో ఎట్టకేలకు ఏడో నిజాం వెన్నుచూపాడు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవడంతో జనమంతా పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. మువ్వన్నెల జెండాలతో పరుగులు తీశారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ‘ఆపరేషన్ పోలో’ మొదలైంది ఇలా.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13 తెల్లవారుజామున ‘ఆపరేషన్ పోలో’ పేరిట సైనిక చర్యకు దిగింది. అప్పటి హోంమంత్రి సర్ధార్ వల్లబ్భాయి పటేల్ ఆదేశాల మేరకు భారత సైన్యం నాలుగు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్దుర్గ్ కోటను స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపునకు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ.రుద్ర మద్రాస్ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్‌ను ముట్టడించింది. అయినా చివరి క్షణం వరకు నిజాం ప్రభుత్వం పోరాటాన్ని కొనసాగించింది. సెప్టెంబర్ 14న: దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్ , వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలను సైన్యం తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ దాడిని ఎదిరించలేక నిజాం సైనికులు పరుగులు తీశారు. కనిపించిన రోడ్లను, వంతెనలను ధ్వంసం చేశారు. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాల్లో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఆకాశంలో తిరుగుతున్న భారత యుద్ధ విమానాలకు తమ ఉనికి తెలిస్తే బాంబులు వేస్తారనే భయంతో రజాకార్లు ఇళ్లల్లో లైట్లు ఆర్పేయాలని హెచ్చరించారు. సెప్టెంబర్ 16న: ఆ రోజు రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్‌ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల వశమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో మందుపాతర్లు పేల్చి సైన్యాన్ని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. కానీ సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. గత్యంతరం లేక ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న: ఆ రోజు సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్‌లోకి ప్రవేశించడంతో నగర వాసుల్లో ఉత్సాహం ఉరకలేసింది. అడుగడుగునా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్‌కు భారత సైన్యం కవాతు చేసింది. అదే రోజు సాయంత్రం రేడియో ప్రసంగంతో.. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటల సమయంలో నిజాం హైదరాబాద్ రేడియోలో ప్రసంగించారు. ‘నా ప్రియమైన ప్రజలారా!.. నా ప్రభుత్వం రాజీనామా ఇచ్చింది. ఈ పని ఇదివరకే చేయాల్సింది. ఆలస్యమైనందుకు విచారిస్తున్నా. యుద్ధం నుంచి నా సైన్యాన్ని విరమించుకుంటున్నా. ఐక్యరాజ్యసమితిలో పెట్టిన కేసు కూడా ఉపసంహరించుకుంటున్నా’ అని ప్రకటించారు. ఆ మరుసటి రోజు ఆయన గవర్నర్ జనరల్ రాజగోపాలాచారిని క లిశారు. -
సర్దార్ పటేల్‌ను హైజాక్ చేసిన మోడీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైజాక్ చేశారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. పటేల్ పేరును ప్రస్తావించడానికి మోడీకి నైతిక హక్కు లేదని విమర్శించారు. ఇక్కడి నందినీ లేఔట్లో కాంగ్రెస్ పార్టీ 129వ వ్యవస్థాపక దినోత్సవం, జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. సర్దార్ పటేల్ ఇంకా బతికి ఉంటే మోడీపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఉండేవారని అన్నారు. మాజీ ఉప ప్రధాని ఎల్కే. అద్వానీని బీజేపీ వారు ఉక్కు మనిషి అని సంబోధించడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడిన పటేల్ ఒక్కరే ఉక్కు మనిషి అని పేర్కొన్నారు. ఈ దేశంలో మరొకరు ఉక్కు మనిషి కాలేరని తెలిపారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర మాట్లాడుతూ.. కాంగ్రెస్ లేని దేశాన్ని నిర్మిస్తామని మోడీ ప్రగల్బాలు పలకడం హాస్యాస్పదమన్నారు. ఆయన కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమేనని, ప్రధాని కాదని దెప్పి పొడిచారు. కాంగ్రెస్ చరిత్రను తెలియని వారే పార్టీని విమర్శిస్తుంటారని అన్నారు. త్యాగం, బలిదానాలతో దేశం పురోభివృద్ధికి కాంగ్రెస్ శ్రమించిందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడానికి కృషి చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. -
‘సమైక్య’ గళం!
సాక్షి, చెన్నై : భారత మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా సమైక్య మినీ మారథాన్‌కు ఆదివారం బీజేపీ పిలుపునిచ్చింది. రాష్ర్టంలో 67 చోట్ల ఈ మారథాన్ నిర్వహించారు. కోయంబత్తూరు రేస్ కోర్సు రోడ్డులో, తంజావూరు కుంభకోణంలో, ఈరోడ్ గోబి చెట్టి పాళయంలో, వేలూరు రాణి పేటలో, తిరునల్వేలి తారాపురం, పుదుచ్చేరి బీచ్ రోడ్డులో, చెన్నై మెరీనా తీరంలో వేలాది మందితో మినీ రన్ విజయవంతంగా నిర్వహించారు. సమైక్య పరుగు బీజేపీ నాయకులతో పాటుగా పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు ఉదయాన్నే మెరీనా తీరం చేరుకున్నారు. మూడు వేల మంది వరకు యువత, విద్యార్థులు తరలి వచ్చి దేశ సమైక్యత నినాదాలతో హోరెత్తించారు. మెరీనా తీరం వెంబడి పరుగులు తీశారు. బీజేపీ అధికార ప్రతినిధి నిర్మల సీతారామన్ ఈ రన్‌ను ప్రారంభించారు. జాతీయ నాయకుడు ఇలగణేషన్, జాతీయ కార్యదర్శి తమిళి సై సౌందరరాజన్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, ఉపాధ్యక్షుడు హెచ్ రాజా, రాష్ట్ర కార్యదర్శి వానతీ శ్రీనివాసన్, వాణిజ్య సంఘం నాయకుడు వెల్లయ్యన్, పురట్చి భారత నేత జగన్ మూర్తి, మాజీ డీజీపీలు నటరాజ్, బాలచంద్రన్, న్యాయవాద సంఘం అధ్యక్షుడు పాల్ కనకరాజ్ తదితర ప్రముఖులు యువత, విద్యార్థులతో కలసి ఈ రన్లో పరుగులు తీశారు. ఇనుము, మట్టి సేకరణ గుజరాత్లో నిర్మించ తలబెట్టిన సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహం కోసం ఇనుము, మట్టి సేకరణకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. ఈ విషయమై బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్, రాష్ట్ర కార్యదర్శి వానతీ శ్రీనివాసన్ మాట్లాడుతూ, నర్మదా నదీ తీరంలో ఉక్కు మనిషి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన విషయం తెలిసిందేనని గుర్తు చేశారు. దేశ సమైక్యతను కాంక్షిస్తూ రాష్ట్రంలో చేపట్టిన మినీ మారథాన్‌కు విశేష స్పందన వచ్చిందన్నారు. రన్ ఫర్ యునిటీ అంటూ మోడీ ఇచ్చిన పిలుపుతో యువత కదలి వచ్చిందన్నారు. వల్లయ్ పటేల్ విగ్రహానికి రాష్ట్రంలోని పన్నెండు వేల ఐదు వందల గ్రామాల్లోని రైతుల నుంచి పాత ఇనుప సామన్లు, అన్ని గ్రామాల నుంచి పంట పొలాల్లో పిడికెడు చొప్పున మట్టి సేకరణకు శ్రీకారం చుట్టామన్నారు. పొత్తుల చర్చా? ఈ మినీ మారథాన్ ఆసక్తికర రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచింది. పలు చోట్ల ఎండీఎంకే, పురట్చి భారతం కట్చిలతో పాటుగా పలు ప్రజా సంఘాలు ఇందులో భాగస్వాములు అయ్యాయి. పుదుచ్చేరిలో జరిగిన మారథాన్‌లో ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి పాల్గొని చర్చకు తెర లేపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజే పీతో కలసి అడుగులు వేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చాటేందుకే ఆయన ఈ రన్లో పాల్గొన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో జోరుగా సాగుతున్న బీజేపీతో పొత్తు కథనాలపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి తమిళి సై సౌందరరాజన్ స్పందిస్తూ, పొత్తులపై ఇంత వరకు ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఎండీఎంకే నేత వైగో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన మాట వాస్తవమేనన్నారు. ఇది వరకు జరిగిన ఎన్నికల నుంచి ఆయన తమ వెంటే ఉన్నారని చెప్పారు. అంతేగానీ, ప్రత్యేకంగా ఏ ఒక్కపార్టీతోను రాష్ట్రంలో పొత్తుల గురించి ఇంత వరకు ఎలాంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు. పొత్తుల వ్యవహారం అధిష్టానం చేతిలో ఉందన్నారు. బీజేపీ జాతీయ నాయకుడు ఇలగణేషన్ పేర్కొంటూ, రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే రహిత కూటమి ఏర్పాటు లక్ష్యంగా ఇక్కడి నేతలందరూ ముందుకె ళుతున్నామని, అయితే, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందేనని పేర్కొనడం గమనార్హం. -
బీజేపీది సమైక్య పరుగు కాదు విభజన పరుగు :హరికృష్ణ
దేశవ్యాప్తంగా బీజేపీది సమైక్యత పరుగు అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ పార్టీ విభజన పరుగు చేస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నందమూరి హరికృష్ణ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ... రాష్ట్ర విభజనపై బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని తప్పు పట్టారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాని ఆయన బీజేపీ పార్టీ పెద్దలకు హితవు పలికారు. దేశాన్ని సమైక్యంగా ఉంచే క్రమంలో సర్థార్ పటేల్ అనుసరించిన వైఖరిని ఈ సందర్బంగా హరికృష్ణ గుర్తు చేశారు. పటేల్ అనుసరించిన వైఖరిని ఆ పార్టీ నాయకులు అభినందిస్తు, మరో వైపు ఆంధ్రప్రదేశ్ విభజనకు మద్దతు ఇస్తామంటూ బీజేపీ న్యాయకులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్థార్ వల్లబాయ్ పటేల్ 63వ వర్థంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సమైక్యత పరుగును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నందమూరి హరికృష్ణపై విధంగా వ్యాఖ్యానించారు. -
దేశ సమైక్యతలో పటేల్ పాత్ర అమోఘం:మోడీ
భారతదేశాన్ని సమైక్యం ఉంచేందుకు కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సర్థార్ వల్లబాయ్ పటేల్ అవిరాళా కృషి చేశారని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వెల్లడించారు. వల్లబాయ్ పటేల్ 63వ వర్థంతి సందర్భంగా ఆదివారం వడోదరాలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ యూనిటీని మోడీ జెండా ఊపి ప్రారంభించారు.అంతకు మందు ఆయన ప్రసంగిస్తూ... దేశాన్ని సమైక్యంగా ఉంచే క్రమంలో వల్లబాయ్ పటేల్ రైతులను భాగస్వాములుగా చేసిన తీరను ఈ సందర్భంగా మోడీ కొనియాడారు. ఆయన వర్థంతి సందర్భంగా దేశ ప్రజల్లో సమైక్యతను పెంపొందించేందుకు రూపొందించిన పరుగుగా ఆయన అభివర్ణించారు. భారతీయుల ఆశలు, ఆశయాలకు తీరేందుకు ఉద్దేశించిన కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వెయ్యి ప్రాంతాల్లో రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తున్నట్లు మోడీ వెల్లడించారు. అలాగే అలహాబాద్‌లో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీని బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ ప్రారంభించారు. ముంబైలో ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ప్రారంభించారు. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొంది. -
పటేల్ విగ్రహానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల వర్క్‌షాపు
-
పండిట్, పటేల్ వేర్వేరు
భారతదేశమనే నావను నడిపించగల సమర్థుడు నెహ్రూగారేనని భావించి నెహ్రూయే తన రాజకీయ వారసుడని గాంధీజీ నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. నరేంద్ర మోడీ ఈ గొప్ప సత్యాన్ని నేటి తరం భారతీయుల నుంచి దాచిపెట్టాడు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేం ద్ర మోడీ ఇటీవల ఒక వివా దాన్ని రెచ్చగొట్టాడు. నెహ్రూ (నవంబర్ 14, 1889- మే 27, 1964) కాకుండా సర్దార్ వల్ల భాయ్ పటేల్ (అక్టోబర్ 31, 1875- డిసెంబర్ 15, 1950) మన మొదటి ప్రధాని అయి ఉంటే దేశం నేడు ఇలా ఉండేది కాదు, అద్భుతంగా ఉండేదన్నాడు. అద్భుతం కాదు, అల్ల కల్లోలంగా ఉండేదేమోనన్నది సెక్యులరిస్టుల అభిప్రా యం. 2014 ఎన్నికల్లో నెగ్గి, మోడీని ఢిల్లీ పీఠం ఎక్కించా లన్నది బీజేపీ వ్యూహం. అదే జరిగితే అంతకంటే దౌర్భా గ్యం మరొకటి ఉండదు. భారతీయులు గాంధీజీని జాతిపితగాను, నెహ్రూజీని నవభారత నిర్మాతగానూ చూస్తారు. గాంధీ, నెహ్రూలు లేని భారత్‌ను ఊహించుకోలేం. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారత్ నుంచి ‘క్విట్’ చేయించిన ఘనత గాంధీజీకి దక్కింది. స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ ఒక ఉజ్వలమైన పాత్ర పోషించారు. నెహ్రూ లౌకిక, ప్రజాస్వా మ్య భావనకు ప్రతీకగా నిలిచాడు. బూర్జువా రాజ్యాంగమే అయినా అది చారిత్రకంగా ఒక గొప్ప ముందడుగుగా, ఒక మంచి రాజ్యాంగాన్ని రచింపజేశాడు. కాంగ్రెసేతర మేథోసంపన్నులను అనేక మందిని రాజ్యాంగ రచనలో భాగస్వాములను చేశాడు. భారతదేశంలో గొప్ప మేధావి, దళిత వర్గానికి చెందిన అంబేద్కర్‌ను రాజ్యాంగ రచనా సంఘానికి సారథిని చేశాడు. హిందూ మహాసభ అధ్య క్షులు శ్యాంప్రసాద్ ముఖర్జీని కూడా ఈ రచనా వ్యాసంగం లో భాగస్వామిని చేశాడు. 1948లో గాంధీజీ హత్యానం తరం హిందూ మతోన్మాదాన్ని నిరసిస్తూ శ్యాంప్రసాద్ హిందూ మహాసభకు రాజీనామా చేశాడు. ఆరోగ్యకర స్పర్థ నెహ్రూ కూడా గాంధీజీతో విభేదించాడు. 1922లో చౌరీ చౌరా సంఘటన తర్వాత గాంధీజీ సహాయ నిరాకరణో ద్యమాన్ని ఆపేశాడు. దీనితో ఖిన్నులైన మోతీలాల్ లాంటి నేతలెందరో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి స్వరాజ్య పార్టీని స్థాపించుకున్నారు. గాంధీజీ నిర్ణయంతో విభేదించినప్ప టికీ నెహ్రూ గాంధీజీని అంటి పెట్టుకునే ఉన్నారు. కాం గ్రెస్ అధ్యక్ష స్థానానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య, సుభాష్ చంద్రబోస్ మధ్య తీవ్రమైన పోటీ జరిగినప్పుడు గాంధీజీ సీతారామయ్యకు మద్దతివ్వగా, నెహ్రూ బోసుకు మద్దతిచ్చాడు. సీతారామయ్య ఓటమితో ఖంగుతిన్న గాం ధీజీ బోసు ఏర్పరచిన వర్కింగ్ కమిటీని బహిష్కరిం చాడు. ఈ ఉదంతంలో గాంధీజీతో నెహ్రూ విభేదించాడు. బోసు కాంగ్రెస్‌ను వీడి ఫార్వర్డ్ బ్లాక్‌ను స్థాపించగా, నెహ్రూ కాంగ్రెస్‌లోనే కొనసాగాడు. గాంధీజీ కాంగ్రెస్ లోని మితవాద నాయకుల పట్ల అభిమానం ప్రకటిస్తే, కాంగ్రెస్‌లోని అతివాదులు, బయట ఉన్న అతివాదులు నెహ్రూ పట్ల గౌరవం ప్రకటించారు. భారతదేశమనే నావను నడిపించగల సమర్థుడు నెహ్రూగారేనని భావించి నెహ్రూయే తన రాజకీయ వారసుడని గాంధీజీ నిర్ద్వం ద్వంగా ప్రకటించాడు. నరేంద్ర మోడీ ఈ గొప్ప సత్యాన్ని నేటి తరం భారతీయుల నుంచి దాచిపెట్టాడు. నెహ్రూ గొప్ప దార్శనికుడు. గొప్ప భావుకుడు. సోవియెట్ అభిమాని. ప్రపంచంలో, ముఖ్యంగా ఆఫ్రికాలో జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటాలకు నెహ్రూయే మద్ద తు ప్రకటించాడు. పీఎల్‌ఓను గుర్తించి ఆదరించాడు. సూయజ్ కాలువను జాతీయం చేసిన ఈజిప్టు అధ్యక్షుడు నాజర్‌కు మద్దతు పలికాడు. స్పెయిన్ రిపబ్లికన్ పార్టీ పట్ల సౌహార్ద్రతను ప్రకటించడమే కాకుండా, అంతర్యుద్ధం కొనసాగుతూ ఉండగా స్పెయిన్ సిటీ బార్సిలోనా కెళ్లి రిప బ్లికన్ల మధ్య నిలిచాడు. తన భార్య కమల జబ్బు పడి స్విట్జర్లాండ్‌లో ఉన్నప్పుడు నెహ్రూ వెళ్లారు. ఇటలీ ఫాసిస్టు నియంత ముస్సోలినీ ఆహ్వానించినా నెహ్రూ తిరస్కరిం చాడు. సామ్రాజ్య కూటమి ఆటలు సాగకుండా అలీన విధానాన్ని రూపొందించడంలో మేటి పాత్ర వహించాడు. నవభారత నిర్మాత భారత పునర్నిర్మాణంలో నెహ్రూ కీలకపాత్ర పోషించాడు. సోవియెట్ అండతో, సోవియెట్ అనుభవంతో పారిశ్రామి కాభివృద్ధికి కీలకమైన భారీ పరిశ్రమల స్థాపనకు పూనుకు న్నాడు. వ్యవసాయరంగ ఉద్దీపనగా కీలకమైన భారీ నీటి పారుదల ప్రాజెక్టుల స్థాపనకు పూనుకొని ప్రాజెక్టులే ఆధు నిక దేవాలయాలన్న భావనకు శ్రీకారం చుట్టారు. భారతీ యుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి శాస్త్ర, సాంకేతిక రంగాలలో అనేక సంస్థలను నెహ్రూ స్థాపించాడు. నెహ్రూకు బదులు పటేలు ప్రధాని అయి ఉంటే మన దేశం కూడా పాకి స్థాన్ లాగా హిందూత్వ దేశంగా పతనమై ఉండేది. నాడు ముస్లింలీగ్ మతతత్వ పార్టీ కాగా, నేడు బీజేపీ మతతత్వ పార్టీగా ఉంది. సంస్థానాలన్నీ భారత్‌లో విలీనమై భారత్ ఒక బలమైన దేశంగా రూపొందించడంలో పటేల్ పాత్రను విస్మరించలేం. కానీ నెహ్రూ తోడ్పాటుతోనే ఇదంతా జరిగింది. నైజాం నవా బును లొంగదీసు కోవడానికి జరిగిన పోలీసు చర్య మంచిదే గానీ, ఆ తర్వా త కమ్యూనిస్టులపై సాగించిన మారణకాండకు పటేలే బాధ్యుడన్న వాస్తవాన్ని విస్మరించలేం. ఈ సంస్థానాధీశుడు ముస్లిం కావటంవల్ల బీజేపీ సైనిక చర్యను బలపరుస్తున్నదేగానీ, సంస్థానాధీశుడు హిందువు అయినట్లయితే బీజేపీ వైఖరి ఇలా ఉండేదా? సెక్యులర్ జాతీయవాది అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర రెండవ కూర్పులో కొన్ని నగ్నసత్యాలను బయటపెట్టాడు. గాంధీ జీ చేపట్టిన చరిత్రాత్మక నిరాహారదీక్ష తర్వాత జనవరి 20వ తేదీన బిర్లా భవనం నుంచి సాయంకాలపు ప్రార్ధనా స్థలానికి గాంధీజీని మోసుకెళ్లారు. 79 ఏళ్ల గాంధీజీ ఈ దీక్షతో అంతగా బలహీనపడ్డాడు. ప్రార్థనా స్థలానికి కొంత దూరంలో ఒక బాంబుపేలింది. అది వేసిన వాడు పం జాబ్ కాందిశీకుడు మదన్‌లాల్. అతడు దొరికిపోయాడు. గాంధీజీని హత్య చేయాలన్న పెద్ద కుట్రలో భాగంగా ఇది జరిగింది. హోంమంత్రిగా ఉన్న పటేల్ కుట్రను దర్యాప్తు చేసి ఉంటే ఆ తర్వాత పదిరోజులకు గాంధీజీ హత్య జరి గేది కాదని ఆజాద్ రాశాడు. 1937లో జరిగిన ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ ఏడు రాష్ట్రాల్లో గెలిచి మంత్రి వర్గాలను స్థాపించింది. ఆ వరసలో బొంబాయిలో కాంగ్రెస్ గెలిస్తే, ముఖ్య మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న సమస్య వస్తే అందుకు తగిన వ్యక్తి నారి మన్‌గా ఆజాద్ భావించారు. కానీ పటేల్ జోక్యంతో బీజే ఖేర్‌ను ముఖ్య మంత్రిగా చేశారు. నారిమన్ పార్సీ కాబట్టి అతన్ని తోసిపుచ్చి హిందువైన ఖేర్‌ను ముఖ్యమంత్రిని చేయడంలో పటేల్ పక్షపాతాన్ని చూపించాడని ఆజాద్ ఆరోపణ. ఒకటి నిజం. దేశాభిమానంలో నాటి మన పార్టీలు వేటికీ తీసిపోవు. కానీ నెహ్రూకు బదులు పటేల్ ప్రధాని అయి ఉన్నట్లయితే సెక్యులరిజం మను గడ వేరుగా ఉండేది. చరిత్ర తెలియకనే... నెహ్రూ సెక్యులరిస్టు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యవాది మాత్రమే కాదు, భారతదేశంలో సోషలిజాన్ని కాంక్షించాడు. నెహ్రూ జాతీయ చరిత్ర మాత్రమే కాదు. ప్రపంచ చరిత్ర కూడా రాశాడు. చరిత్ర చీకటి కోణాలను అర్ధం చేసు కోవడానికి మార్క్సిజం ఇచ్చిన వెలుగు తనకు తోడ్పడిందని నెహ్రూ రాసుకు న్నాడు. పుట్టి పెరిగిన వాతావరణం వల్ల తాము నిఖార్సయిన సోషలిస్టులం కాలేకపోయానని తన పరిమితుల్ని అంగీకరించాడు. సోవియెట్ ప్రయోగం విఫలమైనా, సోషలిజందే అంతిమ విజయమని రాశాడు. తన గ్రంథం ముగిం పులో లెనిన్‌ను ఉటం కించాడు. ఎన్ని ఉన్నా నెహ్రూను పటేల్‌తో పోల్చడం అవి వేకం. నెహ్రూ, పటేళ్ల మధ్య హస్తి మశకమంత తేడా ఉంది. ఆధునిక భారతదేశ చరిత్ర తెలియని అజ్ఞానులు మాత్రమే ఆ ఇద్దరి మధ్య పోలిక తెస్తారు. వీరు చరిత్రను అధ్యయనం చేయడం తక్షణావసరం. - ఎన్.శివరామిరెడ్డి మాజీ శాసన సభ్యులు -
పటేల్ ఆశయాలను సాకారం చేయండి: ప్రణబ్ ముఖర్జీ
శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌లకు రాష్ర్టపతి ప్రణబ్ ఉద్బోధ సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఆశయాల సాధన కోసం ప్రొబెషనరీ ఐపీఎస్‌లు కృషి చేయాలని, ఆయన ఆశయాలు ఇప్పటికీ ఆచరణీయాలేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పటేల్ చెప్పినట్లుగా పోలీసులు, సివిల్ సర్వీసు అధికారులు రాజకీయాలు, మతతత్వ కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. అవినీతి, పక్షపాతంగా వ్యవహరించకుండా విధులను నిర్వర్తించాలని సూచించారు. మంగళవారమిక్కడ సర్దార్ వల్లభాయ్‌పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 65వ బ్యాచ్‌కి చెందిన 136 మంది ఐపీఎస్ ప్రొబెషనరీ అధికారులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఐపీఎస్ ప్రొబెషనరీల పాసింగ్ అవుట్ పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు పోలీసులు మరింత సమర్థంగా పనిచేయాలన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘‘భారత పోలీసులకు గర్వించదగ్గ చరిత్ర ఉంది. పోలీసులంటే చట్టాలను అమలుపరిచేవారు మాత్రమే కాదు. దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. దేశంలో అభివృద్ధి, శాంతియుత వాతావరణం కల్పించడంలో పోలీసుల పాత్రే కీలకం. పోలీసుల పనితీరు దేశ ప్రతిష్టను పెంచేలా ఉండాలి’’ అని అన్నారు. మహిళలు, బాలలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలను అరికట్టేందుకు కేంద్రం కొత్త చట్టాలను రూపొందించిందని వివరించారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కఠిన శిక్షలుపడేలా చట్టాలను సవరించినట్లు తెలిపారు. పాసింగ్ అవుట్ పరేడ్‌లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, మంత్రి జె.గీతారెడ్డి, డీజీపీ బి.ప్రసాదరావు, పోలీసు అకాడమీ డెరైక్టర్ సుభాష్ గోస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆల్ రౌండర్‌గా షాలినీ అగ్నిహోత్రి పాసింగ్ అవుట్ పరేడ్‌కు కమాండర్‌గా వ్యవహరించిన షాలినీ అగ్నిహోత్రి అంతర్గత శిక్షణ సమయంలో అనేక అవార్డులు పొంది ఆల్ రౌండర్‌గా నిలిచారు. హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన షాలినీ ఏకంగా ఏడు అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మొత్తం 136 మంది ఐపీఎస్ ప్రొబెషనరీలలో 114 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. 25 ఏళ్లులోపు వారు 8 మంది ఉన్నారు. 25-28 వయస్సు మధ్యలో 52 మంది ఉన్నారు. గతంలో వివిధ ఉద్యోగాల్లో ఉండి ఐపీఎస్‌కు ఎంపికైనవారు 104 మంది ఉన్నారు. వీరితోపాటు రాయల్ భూటాన్ ప్రొబెషనరీలు 04, మాల్దీవులకు చెందినవారు 03, నేపాల్‌కు చెందిన ఐదుగురు కూడా శిక్షణ పూర్తిచేసుకున్నారు. రాష్ట్రపతికి వీడ్కోలు.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండ్రోజుల రాష్ట్ర పర్యటన ముగిసింది. నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ అధికారుల పరేడ్‌లో పాల్గొన్న అనంతరం ఆయన నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, ఎంపీలు వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, వివేక్ తదితరులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. రాష్ట్ర పర్యటనను ముగించుకుని వెళుతున్న రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు చేప్పే కార్యక్రమానికి సీమాంధ్ర మంత్రులు, నేతలు ముఖం చాటేయడం చర్చనీయాంశమైంది. -
పటేల్‌ను ‘మతతత్వవాది’ అన్న నెహ్రూ!
బ్లాగులో అద్వానీ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత మొట్టమొదటి హోం మంత్రి, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు సంబంధించి బీజేపీ మరో వివాదం లేవనెత్తింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. పటేల్‌ను ‘పూర్తి మతతత్వవాది’ అని అన్నారని బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ తన తాజా బ్లాగ్ పోస్టింగ్‌లో ఆరోపించారు. స్వాతంత్య్రానంతరం హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోనికి తెచ్చుకునేందుకు వీలుగా సైన్యాన్ని పంపాలని పటేల్ సూచించిన నేపథ్యంలో నెహ్రూ ఆ విధంగా వ్యాఖ్యానించారని ఎంకేకే నాయర్ రాసిన ఓ పుస్తకాన్ని (ద స్టోరీ ఆఫ్ యాన్ ఎరా టోల్డ్ వితవుట్ ఇల్ విల్) ఉటంకిస్తూ అద్వానీ పేర్కొన్నారు. హైదరాబాద్‌పై పోలీసు చర్యకు ముందు జరిగిన కేబినెట్ భేటీలో నెహ్రూ, పటేల్‌ల మధ్య జరిగిన తీవ్ర వాగ్వివాదం వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘దేశ స్వాతంత్య్రానంతరం పాకిస్థాన్‌తో కలిసిపోవాలని భావించిన నిజాం ఈ మేరకు పొరుగు దేశానికి రహస్య దూత ఒకర్ని పంపించారు. పెద్దమొత్తంలో డబ్బును కూడా అక్కడి ప్రభుత్వానికి బదలాయించారు. పలువురు నిజాం అధికారులు స్థానిక ప్రజలపై యథేచ్చగా అత్యాచారాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయాలన్నిటినీ పటేల్ కేబినెట్ దృష్టికి తెచ్చారు. హైదరాబాద్‌లో భయానక పాలనకు తెరదించేందుకు తక్షణమే అక్కడికి సైన్యాన్ని పంపాలని డిమాండ్ చేశారు. సాధారణంగా మృదుభాషి అయిన నెహ్రూ నిగ్రహాన్ని కోల్పోయారు. ‘‘నువ్వో పూర్తి మతతత్వవాదివి. నేనెప్పుడూ నీ సిఫారసును అంగీకరించను..’’ అని అన్నారు. పటేల్ మరో మాట మాట్లాడకుండా తన కాగితాలు తీసుకుని వెళ్లిపోయారు..’ అని అద్వానీ తెలిపారు. పటేల్‌ను హిందూత్వ భావాలు కలిగిన వ్యక్తిగా తెరపైకి తెచ్చేందుకు ఇటీవల కొంతకాలంగా బీజేపీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌కు సైన్యాన్ని పంపేలా అప్పటి గవర్నర్ జనరల్ రాజాజీ నెహ్రూను ఒప్పించారని అద్వానీ పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌లో పరిస్థితి అంతకంతకూ విషమిస్తుండటంతో నెహ్రూ, పటేల్ ఇద్దరినీ రాజాజీ రాష్ట్రపతి భవన్‌కు పిలిపించారు. అప్పటికి రెండ్రోజుల ముందు రజాకార్లు ఓ కాన్వెంట్కు చెందిన 70 ఏళ్ల నన్లపై అత్యాచారానికి తెగబడటాన్ని నిరసిస్తూ బ్రిటిష్ హైకమిషనర్ రాసిన ఓ లేఖను సిద్ధంగా ఉంచుకున్నారు. పటేల్ సన్నిహిత అధికారి వి.పి.మీనన్ ఆ లేఖను కేబినెట్ భేటీకి ముందు రాజాజీకి అందజేశారు. భేటీలో రాజాజీ తనదైన శైలిలో హైదరాబాద్‌లో పరిస్థితిని వర్ణించి చెప్పారు. అయితే నెహ్రూ అంతర్జాతీయంగా ఉత్పన్నమయ్యే ఇబ్బందుల దృష్ట్యా తటపటాయించారు. ఆ సమయంలో రాజాజీ తురుపు ముక్క (లేఖ)ను బయటకు తీశారు. ఆ లేఖను చదివిన నెహ్రూ ముఖం ఎర్రబడింది. కుర్చీలోంచి వేగంగా లేచి పిడికిలి బిగించి బల్లపై కొట్టారు. ‘‘ఇంకో క్షణం కూడా వృధా చేయడానికి వీల్లేదు. వారికి గుణపాఠం చెబుతాం..’’ అని అన్నారు. ఆ వెంటనే రాజాజీ పథకం మేరకు ముందుకువెళ్లాల్సిందిగా కమాండర్ ఇన్ చీఫ్‌కు చెప్పాలని మీనన్‌ను ఆదేశించారు..’ అని నాయర్ పుస్తకాన్ని ఉటంకిస్తూ అద్వానీ తెలిపారు. -
రాజకీయ అస్పృశ్యతను నిర్మూలించాలి
కేవాడియా(గుజరాత్): రాజకీయ అస్పృశ్యతను నిర్మూలించాల్సిన సమయం వచ్చిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ‘అసృ్పశ్యత నిర్మూలనకు మహాత్మాగాంధీ జీవితాంతం కృషిచేశారు. ఇప్పుడది రాజకీయాల్లోకి వచ్చి చేరింది. ఈ రాజకీయ అంటరానితనాన్ని నిర్మూలించాల్సిన సమయమొచ్చింది’ అన్నారు. గోధ్రా అల్లర్లను చూపుతూ.. మోడీని చాలా పార్టీలు రాజకీయంగా దూరం పెడ్తున్న నేపథ్యంలో.. మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గుజరాత్‌లోని నర్మద డ్యామ్ దగ్గరలో భారత ప్రథమ ఉపప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ ఏర్పాటుకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ మరోసారి పటేల్ వారసత్వ అంశాన్ని లేవనెత్తారు. పటేల్ లౌకికవాది అనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే ఆయనది ఓట్‌బ్యాంక్ లౌకికవాదం కాదని ఆయన వ్యాఖ్యానించారు. రెండ్రోజుల క్రితం గుజరాత్లో సర్దార్ పటేల్ పేరున ఏర్పాటుచేసిన మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ల మధ్య పటేల్ విషయంపై ఎత్తిపొడుపుల ఉదంతం జరిగిన విషయం తెలిసిందే. ప్రథమ ప్రధాని పటేల్ అయ్యుంటే దేశ ముఖచిత్రం వేరేలా ఉండేదన్న మోడీ వ్యాఖ్యకు.. పటేల్ నిజమైన లౌకికవాది, జీవితాంతం కాంగ్రెస్‌వాదిగానే ఉన్నారంటూ ప్రధాని స్పందించిన విషయం కూడా తెలిసిందే. ఆ రోజునాటి ప్రధాని వ్యాఖ్యలపై మోడీ గురువారం స్పందించారు. ‘నిజమే. పటేల్ లౌకికవాది అన్న ప్రధాని వాదనను మేమూ ఒప్పుకుంటాం. అయితే, పటేల్ ఆచరించిన లౌకికవాదం సోమ్‌నాథ్ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునే సెక్యులరిజం కాదు. పటేల్ లౌకికవాదం దేశాన్ని విభజించేది కాదు.. దేశాన్ని ఐక్యపరిచేది. పటేల్‌ను ఏ ఒక్క పార్టీకో సంబంధించిన వారనడం ఆయనను అవమానపర్చడమే. ఆయన గొప్పదనం దేశ చరిత్రతో అనుసంధానించతగ్గది’ అన్నారు. అయితే, ఆయన సేవలకు చరిత్రలో తగిన స్థానం దక్కలేదన్నారు. పటేల్ ప్రసంగ రికార్డును కార్యక్రమంలో వినిపించారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘సర్దార్ స్వరాన్ని చాలా సంవత్సరాలు నొక్కిపట్టి ఉంచారు. ఇక్కడికొచ్చిన చాలా మంది ఆయన గొంతును మొదటిసారి వింటున్నారు కావచ్చు’ అని నెహ్రూ, గాంధీ వారసత్వ రాజకీయాలపై మోడీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గుజరాత్ ప్రభావంతోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా మీడియాలో పటేల్ జయంతి ప్రకటనలు కనిపిస్తున్నాయన్నారు. సంప్రదాయంగా బీజేపీకి దూరంగా ఉండే ముస్లింలు, దళితులకు దగ్గరయ్యేందుకు మోడీ ప్రయత్నించారు. ఐక్యతారాగాన్ని పదేపదే వినిపించడంతో పాటు, అంబేద్కర్ సేవలను కొనియాడారు. ప్రధానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సర్దార్ సరోవర్ డ్యామ్‌కు గేట్లను ఏర్పాటు చేయడం లేదని ఆయన కేంద్రాన్ని విమర్శించారు. అద్వానీ తన ప్రసంగంలో మోడీని మరోసారి ప్రశంసించారు. ప్రపంచంలోనే ఎత్తై పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించిన మోడీని అభినందిస్తున్నానన్నారు. మరోవైపు, పాట్నా పేలుళ్ల బాధితులను పరామర్శించేందుకు బీహార్ వస్తున్న మోడీని రాష్ట్ర ప్రభుత్వ అతిధిగా గౌరవిస్తామని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం సేవలందిస్తామని పేర్కొంది. పటేల్‌ది మానవత్వం .. మోడీది అహంకారం: కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ మధ్య పటేల్ వారసత్వ యుద్ధం తీవ్రమైంది. రాజకీయ ప్రయోజనాల కోసం పటేల్ పేరును మోడీ వాడుకుంటున్నాడని కాంగ్రెస్ దుయ్యబట్టింది. అన్యాపదేశంగా 2002 గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ.. 1947 దేశ విభజన సమయంలో పటేల్ వేలాది ముస్లింలను కాపాడారని గుర్తుచేసింది. సర్దార్ పటేల్ మానవత్వానికి ప్రతీక అయితే.. మోడీ స్వాతిశయానికి, అహంకారానికి ప్రతీక అని పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ ట్వీట్ చేశారు. పటేల్ నిరాడంబర జీవన విధానాన్ని.. మోడీ ధరించే డిజైనర్ దుస్తులు, బ్రాండెడ్ కళ్లజోళ్లతో పోల్చి ఎద్దేవా చేశారు. -
'పటేల్ ఏపార్టీ వాడైనా తీవ్ర అన్యాయం జరిగింది'
గుజరాత్ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ప్రధాని మన్మోహన్ సింగ్ మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం కాస్తా మరింత ముదురుతోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని అందిపుచ్చుకునే విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ పడుతూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు మీడియాతో మాట్లాడిన మోడీ.. మన దేశ వారసత్వాన్నివిడగొడుతూ ప్రధాని మాట్లాడటం సరికాదన్నారు. సర్థార్ పటేల్ ఏ పార్టీలో ఉన్నా ఆయనకు తీవ్ర అన్యాయం జరిగిందన్న సంగతి గుర్తించుకోవాలన్నారు. దేశాన్ని సంక్లిష్ట పరిస్థితుల నుంచి కాపాడటానికి కృషి చేసిన భగత్ సింగ్, రాణా ప్రతాప్, శివాజీలు బీజేపీ వ్యక్తులు కాకపోయినా వారిని తాము గౌరవిస్తామని మోడీ తెలిపారు. ఇదిలా ఉండగా సర్ధార్ పటేల్ లౌకికవాది అన్న ప్రధాని వ్యాఖ్యలను మాత్రం మోడీ ప్రశంసించారు. పటేల్ ఎప్పడూ లౌకికవాద భావ జాలానికి కృషి చేశారని ఆయన తెలిపారు. ఆ విషయంపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ల మధ్య మంగళవారం ఒకే వేదికపై నుంచి మాటల యుద్ధం జరిగింది. -
ఇందిర, పటేల్‌కు ప్రముఖుల ఘన నివాళి
న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 29వ వర్థంతి సందర్భంగా ఇందిరకు ప్రముఖులు నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని శక్తిఘాట్ వద్ద గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు ...ఇందిరకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. ఇక ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో ఆయనకు ప్రముఖులు అంజలి ఘటించారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, స్పీకర్ మీరాకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక గాంధీభవన్లోనూ ఇందిరాగాంధీ వర్థంతితో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పలువురు మంత్రులు హాజరు అయ్యారు. -
597 అడుగుల ఎత్తు... రూ.2,500 కోట్లు
అహ్మదాబాద్: గుజరాత్లో భారత తొలి ఉపప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని (597 అడుగులు) ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా నేడు జరగనుంది. పటేల్ జయంతి రోజే ఈ కార్యక్రమం చేపట్టడం తనకెంతో సంతోషంగా ఉందని మోడీ వ్యాఖ్యానించారు. నర్మద డ్యామ్‌కు అభిముఖంగా, సాధు బెట్ అనే రాతి ద్వీపం వద్ద ఏర్పాటు చేయనున్న ఈ ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (ఐక్యతా శిల్పం)’ ప్రపంచంలోనే ఎత్తై విగ్రహాల్లో ఒకటిగా నిలవనుంది. ఈ శిల్పం న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెండు రెట్లు ఎక్కువ ఎత్తు ఉంటుంది. విగ్రహం మొత్తం ఎత్తు 240 మీటర్లు కాగా, పునాది భాగం 59 మీటర్లు, శిల్పం 182 మీటర్ల (597 అడుగులు) ఎత్తు ఉంటాయి. వ్యవసాయంలో ఉపయోగించి, ప్రస్తుతం వాడుకలో లేని ఇనుప పరికరాలను విగ్రహ ఏర్పాటు కోసం పంపించాల్సిందిగా మోడీ దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఇప్పటికే కోరారు. ఉక్కు, ఆర్సీసీలతో నిర్మించిన విగ్రహానికి కాంస్య పూత పూస్తారు. బుర్జ్ ఖలీఫా నిర్మాణాన్ని పర్యవేక్షించిన టర్నర్ కన్స్ట్రక్షన్స్, మైకేల్ గ్రేవ్స్ అండ్ అసోసియేట్స్, మీన్‌హార్ట్ గ్రూప్‌లు ఈ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారు. నిర్మాణం పూర్తి కావడానికి మొత్తం 56 నెలల సమయం పడుతుంది. అందులో నిర్మాణ ప్రణాళిక రూపకల్పనకే 15 నెలలు పడుతుంది. విగ్రహం లోపల ఒకటి, బాల్కనీలో ఒకటి మొత్తం రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. శిల్పంతో పాటు ఒక స్మారక కేంద్రాన్ని, ఎమ్యూజ్మెంట్ పార్క్‌ను, హోటల్‌ను, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్ అంచనా ఖర్చు రూ.2500 కోట్లు. -
పటేల్ ప్రధాని అయ్యుంటే !
దేశ ముఖచిత్రం మరోలా ఉండేది పటేల్ సాధించిన ఐక్యత, సమగ్రతలు ఇప్పుడు తీవ్రవాదం, ఉగ్రవాదం వల్ల ప్రమాదంలో పడ్డాయి - నరేంద్ర మోడీ పటేల్ అన్ని సిద్ధాంతాలను గౌరవించారు. పేదలను అభిమానించేవారు. ఆ లక్షణాలే ఇప్పుడు దేశంలో మృగ్యమయ్యాయి -మన్మోహన్ అహ్మదాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని అందిపుచ్చుకునే విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ పడుతున్నాయి. ఆ విషయంపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ల మధ్య మంగళవారం ఒకే వేదికపై నుంచి మాటల యుద్ధం జరిగింది. అహ్మదాబాద్‌లో సర్దార్ పటేల్ పేరుతో ఏర్పాటు చేసిన ఒక మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఈ మాటల యుద్ధం చోటు చేసుకుంది. సర్దార్ పటేల్ ప్రథమ ప్రధాని అయి ఉంటే దేశ భవిష్యత్తు మరోలా ఉండేదని మోడీ పేర్కొనగా.. పటేల్ లౌకిక, ఉదార వాదాన్ని గుర్తు చేస్తూ, వాటిపై మోడీ హక్కును ప్రధాని ప్రశ్నించారు. కార్యక్రమంలో మొదట మోడీ ప్రసంగిస్తూ.. ‘భారతీయులందరిదీ ఒకటే బాధ. పటేల్ ప్రథమ ప్రధాని కాలేనందుకు ప్రతీ భారతీయుడు ఇప్పటికీ బాధపడుతున్నాడు. ఆయన ప్రథమ ప్రధాని అయి ఉంటే భారతదేశ ముఖచిత్రం మరోలా ఉండేది’ అన్నారు. దేశాన్ని ఐక్యం చేసిన ఘనత పటేల్‌దేనని ప్రశంసించారు. పటేల్ సాధించిన ఐక్యత, సమగ్రత ఇప్పుడు తీవ్రవాదం, ఉగ్రవాదం వల్ల ప్రమాదంలో పడ్డాయని మోడీ ఆందోళన వ్యక్తంచేశారు. జవహర్లాల్ నెహ్రూ పేరెత్తకుండానే ఆయనపై మోడీ విమర్శలు గుప్పించడంతో ప్రధాని మన్మోహన్ స్పందించారు. ‘సర్దార్ పటేల్ కాంగ్రెస్‌వాది. ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు జీవితాంతం కృషిచేశారు. ఆయన నిజమైన లౌకికవాది. ఉదారవాది. సైద్ధాంతిక వైరుధ్యం ఉన్నవారిని కూడా ఆయన గౌరవించేవారు. దేశ సమగ్రతపై ఆయనకు అపార నమ్మకం. దేశం మొత్తాన్ని ఒక గ్రామమని, అన్ని మతాల ప్రజలు బంధువులు, స్నేహితులని ఆయన నమ్మేవారు’ అంటూ మోడీకి చురకలేశారు. దాదాపు 500 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత పటేల్‌దేనన్నారు. మహాత్మాగాంధీ, పటేల్, నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్‌లకు దేశ సమగ్రతపై గట్టి నమ్మకముండేదన్నారు. ‘వారు అన్ని సిద్ధాంతాలను గౌరవించారు. పేదలను అభిమానించేవారు. ఆ లక్షణాలే ఇప్పుడు దేశంలో మృగ్యమయ్యాయి’ అని మన్మోహన్ వ్యాఖ్యానించారు. నెహ్రూ, పటేల్‌ల మధ్య విభేదాలున్నా, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించేవారన్నారు. అంతకుముందు మోడీ మాట్లాడుతూ.. మావోయిజం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం అని ప్రధాని మన్మోహన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ‘సమర్థ పాలనకు ఇచ్చే పురస్కారాలనేకం మీ హయాంలో గుజరాత్ రాష్ట్రానికి దక్కాయి. అందుకు కృతజ్ఞతలు’ అని మన్మోహన్సింగ్ను ఉద్దేశించి మోడీ అన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా మన్మోహన్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. హైజాక్ చేసేందుకే: కాంగ్రెస్ మరోవైపు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని హైజాక్ చేసేందుకు మోడీ, బీజేపీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. పటేల్ వారసత్వం కాంగ్రెస్‌కే చెందుతుందని స్పష్టం చేసింది. ‘మహాత్మాగాంధీని చంపింది ఆరెస్సెస్ చిందించిన మత విద్వేష విషమేన’ని పటేల్ వ్యాఖ్యానించిన విషయాన్ని పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ న్యూఢిల్లీలో గుర్తుచేశారు. ఆరెస్సెస్‌ను నిషేధించింది కూడా పటేలేనన్నారు. ‘ఇటుకలను సేకరించిన బీజేపీ అయోధ్యలో రామమందిరం నిర్మించలేదు. ఆ ఇటుకలను అమ్ముకుంది. ఇప్పుడు పటేల్ విగ్రహ ఏర్పాటు కోసం ఇనుమును సేకరిస్తోంది. తరువాత ఆ ఇనుమును కూడా అమ్ముకుంటారు’ అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. పటేల్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి మోడీ పంపిన ఆహ్వానాన్ని కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ తిరస్కరించారు. మోడీకి లభిస్తున్న ప్రాచుర్యాన్ని చూసి.. : వెంకయ్య మోడీకి లభిస్తున్న ప్రజాభిమానాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు విమర్శించారు. సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. పటేల్ దేశం గర్వించదగిన మహనీయుడన్నారు. మహాత్మాగాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉన్నట్టు కాంగ్రెస్ దుష్ర్పచారాన్ని చేస్తోందన్నారు. -
'సర్ధార్ పటేల్ విగ్రహనికి గురువారం భూమి పూజ'
భారత మొట్టమొదటి హోం శాఖ మంత్రి, ఉక్కుమనిషి సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహా ఏర్పాటుకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ గురువారం నర్మదా నదీ తీరంలో భూమి పూజ నిర్వహిస్తారని ఆ విగ్రహ కమిటీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. సర్థార్ పటేల్ 138వ జయంతి సందర్బంగా ఆ విగ్రహ ఏర్పాటుకు గుజరాత్ ప్రభుత్వం నడుంబిగించిందని తెలిపారు. ఆ విగ్రహనికి స్టాట్యు ఆఫ్ యూనిటీగా నామకరణం చేసినట్లు వివరించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టిస్తుందన్నారు. దేశంలోని దాదాపు 7 లక్షల గ్రామాలకు చెందిన రైతులు ఆ విగ్రహం కోసం ఉక్కును విరాళంగా అందజేశారన్నారు. ఆ విగ్రహ ఏర్పాటులో అయా గ్రామల ప్రజల పాత్ర మరువలేనిదని డా. లక్ష్మణ్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. -
ఒకే వేదికపై మన్మోహన్, మోడీలు!
భారత ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీలు ఓ సభలో ఒకే వేదికపై కనిపించనున్నారు. అక్టోబర్ 29 తేదిన ఆహ్మదాబాదలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఓ మ్యూజియంను అంకితం చేసే కార్యక్రమంలో మన్మోహన్, మోడీలు పాల్గొననున్నారు. ఈ మ్యూజియాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్ సొసైటీ నిర్మించింది. ఈ సొసైటికి చైర్మన్ గా ఉన్న కేంద్ర మంత్రి దిన్షా పటేల్ మోడీని కలిసి ప్రత్యేక అతిధిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం జరిగిన రెండు రోజుల తర్వాత అక్టోబర్ 31 తేదిన సర్దోవర్ సరోవర్ డ్యామ్ సమీపంలో అతిపెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి మోడీ శంకుస్తాపన చేయనున్నారు. -
లిబర్టీ స్టాట్యూ కంటే పెద్దదిగా సర్దార్ పటేల్ విగ్రహం!
హర్యానా: దేశ ప్రజలను ఐక్యతగా ఉంచడానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక చిహ్నంగా నిర్మిస్తామని.. ఆ విగ్రహం న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే పెద్దగా ఉంటుంది అని నరేంద్రమోడీ హర్యానాలోని ఓ సభలో తెలిపారు. ఆసభలో మాట్లాడుతూ 'అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతలు పెద్దదిగా సర్ఱార్ పటేల్ ఐక్యత స్మారక చిహ్నం ఉంటుంది' అని బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ అన్నారు. దేశానికి తొలి హోంమంత్రిగా సేవలందించిన సర్దార్ పటేల్.. దేశ ఐక్యత కోసం పాటు పడ్డారని.. అయితే ఆయన సేవలను ప్రభుత్వాలు మరిచిపోయాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కు దేశంలోని రైతులందరూ తమ నాగళ్ల నుంచి చిన్న ఇనుము ముక్కను పంపించాలని.. ప్రతి గ్రామం నుంచి 200-300 గ్రాముల ఇనుముని సేకరిస్తాం అని తెలిపారు. న్యూయార్క్ నగరంలోని లిబర్టీస్ అనే రోమన్ దేవత విగ్రహం 1886 సంవత్సరలో అమెరికా దేశానికి ఫ్రాన్స్ ప్రజలు బహుమతిగా ఇచ్చారు. -
గాంధీ, పటేల్ కాంగ్రెస్ సొంతం కాదు: నరేంద్రమోడీ
సాక్షి, హైదరాబాద్: ‘‘మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయులు ఎవరికీ సొంతం కాదు. వాళ్లు కాంగ్రెస్ సొంత మనుషులెలా అవుతారు? దేశంలోని ప్రతి మనిషికీ సొంతమవుతారు. వాళ్లు యుగపురుషులు. విశ్వ సంపద’’ అని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ సారథి నరేంద్ర మోడీ అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల ప్రాంగణంలో ఉక్కుమనిషి సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేసిన పటేల్ గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో అహ్మదాబాద్‌లో ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అది అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెట్టింపు సైజులో ఉంటుందన్నారు. అక్టోబర్ 21న పనులు ప్రారంభించి నాలుగైదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని వివరించారు. పటేల్ లేకుంటే హైదరాబాద్ ఏమై ఉండేదోనని మోడీ అన్నారు. ‘‘హైదరాబాద్‌తో సహా వందలాది సంస్థానాలను భారత్‌లో విలీనం చేసి దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు పటేల్ కృషి చేశారు. తొలి ప్రధాని నెహ్రూ మాత్రం ఒక్క సంస్థానాన్ని కూడా విలీనం చేయలేకపోయారు. కాశ్మీర్‌ను విలీనం చేసే బాధ్యతలను తీసుకున్న నెహ్రూ ఆ పనిని సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. ఇప్పుడక్కడి పరిస్థితేమిటో అందరికీ తెలుసు. పటేల్ విగ్రహ ఏర్పాటుకు వేల కోట్లు అవసరమా అని కొందరంటున్నారు. పారిస్‌లో ఈఫిల్ టవర్ కట్టినప్పుడు కూడా ఇదే విమర్శ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రపంచమంతా వెళ్లి అక్కడ సేదదీరుతోంది. పటేల్ విగ్రహం నిర్మించిన తర్వాత కూడా ప్రపంచమంతా అక్కడకు రావాల్సిందే. ఆయన గురించి తెలుసుకోవాల్సిందే’’ అని మోడీ అన్నారు. పటేల్ విగ్రహ నిర్మాణంలో దేశంలోని ఏడు లక్షల గ్రామాలూ భాగస్వాములు కావాలని కోరారు. విగ్రహం కోసం రైతుల నాగళ్ల నుంచి తీసిన ఇనుమును భిక్ష అడుగుతున్నానన్నారు. కనీసం ఒకో గ్రామం 100 గ్రాముల ఇనుమయినా ఇవ్వాలని అభ్యర్థించారు. ‘యుగ పురుషులకు అత్యుత్తమ శ్రద్ధాంజలి ఘటించినప్పుడే వారి గొప్పదనం అర్థమవుతుంది. ప్రపంచంలో ఏ నాయకుడికి అలాంటి శ్రద్ధాంజలి లభిస్తుందా అని బాగా ఆలోచిస్తే, అది పటేల్‌కు మాత్రమేనని అర్థమైంది. ఎందుకంటే ఆయన మన నుంచి దూరమై దశాబ్దాలు గడిచినా, ‘పటేల్ ఉండుంటేనా’ అని ఇప్పుడు కూడా ప్రజలు అనుకుంటుంటారు. దేశం సమస్యల్లో ఉన్నప్పుడల్లా ప్రజలకు పటేల్ గుర్తుకొస్తారు. ఇప్పటి 20, 25 ఏళ్ల యువకులు పటేల్‌ను చూడకపోవచ్చు. ఆయన గురించి వినకపోవచ్చు. కానీ వారు కూడా ‘పటేల్ ఉంటే ఎలా ఉండేదో, ఆయన దేశానికి తొలి ప్రధాని అయి ఉంటే ఏమై ఉండేదో అని ఆలోచిస్తున్నారు. ఇంత కన్నా శ్రద్ధాంజలి ఏముంటుంది?’’ అని మోడీ అన్నారు. దేశంలో నగరాభివృద్ధికి బీజం వేసింది పటేలేనని, అహ్మదాబాద్ మున్సిపాలిటీ చైర్మన్‌గా 1930లోనే మహిళలకు స్థానిక సంస్థల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. తనకు జన్మనిచ్చిన దేవుడు చిన్న చిన్న ఆలోచనలు చేసే మెదడు మాత్రం ఇవ్వలేదన్నారు. కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల వైస్ ప్రెసిడెంట్ జె.నరసింహారావు, కార్యదర్శి టి.హరిహరశర్మ, డెరైక్టర్లు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీకి బాలయ్య శుభలేఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం హైదరాబాద్‌లో గుజరాత్ సీఎం నరేంద్రమోడీని కలిసి ఈ నెల 21న జరగనున్న తన రెండో కుమార్తె తేజస్విని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. మోడీని కలిసిన ప్రముఖుల్లో దర్శకుడు కె.రాఘవేంద్రరావు, మోహన్‌బాబు కుటుంబసభ్యులు, అల్లు అరవింద్, కీరవాణి, జగపతిబాబు, దిల్ రాజు, సి.కల్యాణ్, వి.వి.వినాయక్, బండ్ల గణేష్, డి.రామానాయుడు, డి.సురేశ్ బాబు, రానా, రాంగోపాల్‌వర్మ, కోట , పూరీ జగన్నాథ్, అలీ, కె.ఎల్.నారాయణ, సుమన్, గౌతమి, ఏవీఎస్, మురళీమోహన్ ఉన్నారు. ప్రముఖులతో భేటీ.. కేర్ ఆసుపత్రి చైర్మన్ సోమరాజు, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య, రిటైర్డ్ పోలీస్ అధికారి గోపీనాథ్‌రెడ్డి, ఈనాడు సంస్థల యజమాని రామోజీరావు కుమారుడు సి.హెచ్ కిరణ్, హెచ్ఎంటీవీ సీఈవో రామచంద్రమూర్తి, నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ రాజం తదితరులతో పాటు పలు రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులు మోడీతో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సి.హెచ్.విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, నాగం జనార్దన్‌రెడ్డి, నాయకులు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, కృష్ణంరాజు తదితరులు కూడా హోటల్లో మోడీని కలిశారు. సాయంత్రం 3.45 గంటలకు మోడీ బహిరంగ సభకు బయల్దేరి వెళ్లారు. -
నెహ్రూపై నరేంద్ర మోడీ వివాదస్పద వ్యాఖ్యలు!
'ఉక్కు మనిషి' సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో హిమాయత్ నగర్ లోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల ప్రాంగణంలో సర్దార్ పటేల్ విగ్రహవిష్కరణ చేసిన తర్వాత మాట్లాడుతూ..కాశ్మీర్ సమస్య ఇప్పటికి రావణకాష్టంలా మండటానికి కారణం జవహర్ లాల్ నెహ్లూ' అని వ్యాఖ్యలు చేశారు. భారత దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి ప్రధాని అయ్యుంటే బాగుండేదని అన్ని తరాల యువత భావిస్తునే ఉంది అని మోడీ వ్యాఖ్యానించారు. నిజాం ప్రభుత్వంపై సైనిక చర్య ప్రతిపాదనను అప్పటి ప్రధాని నెహ్రూ అడ్డుకున్నాడని.. అయితే నెహ్రూ విదేశాలకు వెళ్లిన సమయంలో సర్ధార్ పటేల్ అదను చూసి నిజాం ప్రభుత్వం సైనిక చర్య ద్వారా హైదరాబాద్ స్టేట్ కు విమోచనం కలిగించారని.. సర్దార్ నిర్ణయం వలన మనమందరం క్షేమంగా ఉన్నాం అని మోడీ అన్నారు. 500 సంస్థానాలను భారత్ లో కలిపే పనిని పటేల్ కు నెహ్రూ అప్పగించారని అయితే కాశ్మీర్ సమస్యను తన వద్దే ఉంచుకున్నారన్నారు. పటేల్ తనకు అప్పగించిన పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడని..అయితే నెహ్రూ మాత్రం కాశ్మీర్ సమస్యను ఎప్పటికి పరిష్కరించలేకపోయాడని మోడీ వ్యాఖ్యానించాడు. ఇప్పటికి కాశ్మీర్ పండితులు వేధింపులకు గురవ్వడం చూస్తే.. సర్దార్ పటేల్ గుర్తుకు వస్తాడన్నారు. దేశ నిర్మాణంలో పటేల్ సేవలు రాజకీయ కారణాల వల్ల వెలుగులోకి రాలేదని మోడీ విమర్శించారు. భారత దేశ చరిత్రలో చాణక్యుడి తర్వాత దేశాన్ని ఐక్యం చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక్కరే అని అన్నారు. పటేల్ సేవలకు గుర్తుగా స్టాట్యూ ఆఫ్ యూనిటిని గుజరాత్ ప్రభుత్వం నిర్మించడానికి సిద్దమవుతోందన్నారు. స్టాట్యూ ఆఫ్ యూనిటి విగ్రహ కార్యక్రమం ఆక్టోబర్ 31 తేదిన ఆరంభం అవుతుందని మోడీ తెలిపారు.