
సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకార్థం నిర్మిస్తున్న స్టాచు ఆఫ్ యూనిటి
న్యూఢిల్లీ : ‘నెహ్రూ కుటుంబం సర్దార్ పటేల్‌ను చాలా అవమానించింది. ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన మరో వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రాహన్ని ‘మేడ్ ఇన్ చైనా’ అంటున్నారు.. ఇది వారి దేశ భక్తి’ అంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, రాహుల్ గాంధీపై మండి పడ్డారు. అమిత్ షా ఇంతలా కోప్పడ్డానికి కారణం కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలే. మహారాష్ట్రలో ఓ కార్యక్రమానికి హాజరైన రాహుల్ గాంధీ ‘మన మన బట్టలు, చెప్పులు, ఫోన్ అన్ని మేడ్ ఇన్ చైనానే. అలానే నరేంద్ర మోదీ గుజరాత్‌లో ప్రపంచంలోనే అతి ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. కానీ ఈ విగ్రహం కూడా మేడ్ ఇన్ చైనానే. భారత స్వాతంత్ర్య సమరయోధుని విగ్రహాన్ని చైనాలో తయారు చేయించి ఆయనను అవమానిస్తున్నారు’ అంటూ పేర్కొన్నాడు.
ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ అమిత్ షా ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్యనంతరం సంస్థానాలను విలీనం చేసి.. దేశ ఐక్యత కోసం పాటు పడ్డారు. కానీ నెహ్రూ కుటుంబం ఆయన కీర్తిని ప్రజల మనసుల్లోంచి తుడిచిపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. బీజేపీ ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్ధం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటి’ విగ్రహాన్ని నిర్మిస్తుంది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం. ఇందుకోసం ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. కానీ ఈ పని రాహుల్ గాంధీ కుటుంబానికి ఇష్టం లేదు. అందుకే రాహుల్ గాంధీ ఈ విగ్రహాన్ని ‘మేడ్ ఇన్ చైనా’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది వారి దేశ భక్తి’ అంటూ అమిత్ షా రాహుల్ గాంధీపై మండి పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment