ముంబయి: రాహుల్‌గాంధీ నాలుగు తరాలొచ్చినా జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరించలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(నవంబర్ 11) ముంబయిలో నిర్వహించిన ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు.
‘ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం నిర్మూలించారు.మీ నాలుగు తరాలొచ్చినా కశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ సాధ్యం కాదని రాహుల్‌కు చెబుతున్నా.బీజేపీకి రాజకీయ అధికారం కన్నా కశ్మీర్ సమస్యే హృదయానికి దగ్గరగా ఉంటుంది’అని అమిత్ షా అన్నారు. కాగా, ఇటీవలే మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేశారు.
వృద్ధులకు పెన్షన్ పెంపు, మహిళలకు నగదు బదిలీ వంటి హామీలను బీజేపీ ఇచ్చింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. 23న ఫలితాలు వెలువడనున్నాయి. మహాయుతి(ఎన్డీఏ), మహావికాస్ అఘూడీ(ఎంవీఏ) కూటములు ఎన్నికల్లో పోటీపడుతున్నాయి.
ఇదీ చదవండి: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం.. కన్నెత్తి చూడని సెలబ్రిటీలు
Comments
Please login to add a commentAdd a comment