సామ్రాజ్య భారతి: ముఖ్యమైన ఘట్టాలు, చట్టాలు, జననాలు | Azadi Ka Amrit Mahotsav Sardar Vallabhbhai Patel Birth Arya Samaj Establishment | Sakshi
Sakshi News home page

సామ్రాజ్య భారతి: ముఖ్యమైన ఘట్టాలు, చట్టాలు, జననాలు

Published Sun, Jun 19 2022 1:07 PM | Last Updated on Sun, Jun 19 2022 1:26 PM

Azadi Ka Amrit Mahotsav Sardar Vallabhbhai Patel Birth Arya Samaj Establishment - Sakshi

ఘట్టాలు
► వేల్స్‌ రాకుమారుడు ఆల్బర్ట్‌ ఎడ్వర్డ్‌ (ఫొటోలో ఏనుగు పాదం వైపు నిలబడి ఉన్న వ్యక్తి)  ఇండియాను సందర్శించారు. ఇండియా రాణి క్వీన్‌ విక్టోరియా తరఫున ఆ రాజమాత కుమారుడైన ఆల్బర్ట్‌ ఎడ్వర్డ్‌ అధికారిక హోదాలో ఇండియా వచ్చి, ఇండియా నచ్చి ఇక్కడే ఏడాది పాటు ఉండి వెళ్లారు.

► ఇప్పటి ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ ‘ముహమ్మదన్‌ ఆంగ్లో–ఓరియెంటల్‌ కాలేజ్‌’ స్థాపించారు. ఆ కాలే జే 1920లో ‘అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ’గా మారింది. 

► స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. 

చట్టాలు
► మెజారిటీ యాక్ట్, టోల్స్‌ ఆన్‌ రోడ్స్‌ అండ్‌ బ్రిడ్జెస్‌ యాక్ట్‌

జననాలు
సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌: రాజనీతి జ్ఞులు, భారతదేశ తొలి ఉప ప్రధాని. నందకిశోర్‌ బల్‌ : ఒరియా కవి; అన్వర్‌ షా కశ్మీరీ : కశ్మీరీ ముస్లిం పండితులు, ఢిల్లీలోని మదరసా అమీనియాకు తొలి ప్రిన్సిపాల్‌ (ఉత్తర ప్రదేశ్‌); తేజ్‌ బహదుర్‌ సప్రూ: స్వాతంత్య్ర సమరయోధులు, న్యాయవాది, రాజకీయవేత్త, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన నిపుణులలో ఒకరు; హమిద్‌ అలీఖాన్‌ బహదూర్‌ : రాంపుర్‌ సంస్థానాదీశులు; రాజా సర్‌ మార్తాండ భైరవ తొండైమాన్‌ బహదూర్‌ : పుదుక్కోట్టై సంస్థానాధీశులు; దౌలత్‌ సింగ్‌ : ఐదర్‌ మహారాజు, కమాండర్‌ (గుజరాత్‌); టి.విజయ రాఘవాచార్య : ఐ.ఎ.ఎస్, కొచ్చిన్‌ దివాను (తమిళనాడు).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement