వల్లభాయ్‌ పటేల్, పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్‌ నివాళి | CM Jagan Floral Tributes to Sardar Vallabhbhai Patel and Potti Sriramulu | Sakshi
Sakshi News home page

వల్లభాయ్‌ పటేల్, పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్‌ నివాళి

Published Thu, Dec 15 2022 11:26 AM | Last Updated on Thu, Dec 15 2022 11:36 AM

CM Jagan Floral Tributes to Sardar Vallabhbhai Patel and Potti Sriramulu - Sakshi

సాక్షి, తాడేపల్లి: భారతరత్న సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఇరువురి చిత్రపటాలకు పూలు సమర్పించి అంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో  ఆర్టీఐ కమిషనర్‌ రేపాల శ్రీనివాసరావు, ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్, నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్‌ పాల్గొన్నారు. 

చదవండి: (రాష్ట్రానికి విశాఖే భవిష్యత్‌.. త్వరలోనే వైజాగ్‌ నుంచి పరిపాలన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement