ఒకే వేదికపై మన్మోహన్, మోడీలు!
భారత ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీలు ఓ సభలో ఒకే వేదికపై కనిపించనున్నారు. అక్టోబర్ 29 తేదిన ఆహ్మదాబాదలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఓ మ్యూజియంను అంకితం చేసే కార్యక్రమంలో మన్మోహన్, మోడీలు పాల్గొననున్నారు. ఈ మ్యూజియాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్ సొసైటీ నిర్మించింది. ఈ సొసైటికి చైర్మన్ గా ఉన్న కేంద్ర మంత్రి దిన్షా పటేల్ మోడీని కలిసి ప్రత్యేక అతిధిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమం జరిగిన రెండు రోజుల తర్వాత అక్టోబర్ 31 తేదిన సర్దోవర్ సరోవర్ డ్యామ్ సమీపంలో అతిపెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి మోడీ శంకుస్తాపన చేయనున్నారు.