ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన విద్వేశపూరిత వ్యాఖ్యలను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా ఖండిచారు. ప్రతిపక్షాలు, ఓ వర్గం ప్రజలపై ప్రధాని మోదీ చేసిన విద్వేశపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని ఆఫీసు గౌరవాన్ని దిగజార్చాయి. ఇలా గౌరవాన్ని దిగజార్చిన తొలి ప్రధాని మోదీ అని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పంజాబ్ ప్రజలకు లేఖ రాశారు.
‘‘ ప్రధాని మోదీ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి దేశ ప్రజల్లో విభజన తీసుకువచ్చే విద్వేశ వ్యాఖ్యలు. 2022 వరకు మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు. మోదీ విధానాల వల్ల గత పదేళ్లలో రైతులు ఆదాయం దారుణంగా తగ్గిపోయింది. రోజుకు జాతీయ సగటు రైతు ఆదాయం రూ. 27 ఉంటే, సగటు అప్పు మాత్రం రూ. 27 వేలు ఉంది. ఇందనం, ఎరువులు అన్నింటి ధరలు పెరిగాయి. దీంతో రైతుల ఆదాయం తగ్గిపోయింది. పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. జీఎస్టీ, నోట్ల రద్దు, కరోనాను సరిగా ఎదుర్కొకపోవటం వల్ల దేశం దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లింది.
గ్రోత్ రేట్ కూడా పడిపోయింది. సుమారు 750 మంది రైతుల ఢిల్లీ సరిహద్దుల్లో మృతి చెందారు. లాఠీలు, రబ్బరు బుల్లెట్లతోనే కాకుండా ప్రధాని మోదీ తన మాటలతో రైతులపై దాడి చేశారు. రైతులను ‘‘ఆందోళన జీవులు’’ అని అవమానించారు. తమను సంప్రదించకుండా చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు కోరారు. గడిచిన పదేళ్లలో పంజాబ్, పంజాబ్ ప్రజలను బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా దూషించింది’’ అని మన్మోహన్ సింగ్ తెలిపారు.
ఏప్రిల్‌లో మోదీ రాజస్థాన్‌లోని ఎన్నికల ప్రచార ర్యాలీలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. దేశ సంపదను ఎక్కువ మంది పిల్లలు కనేవారికి పంచిపెడతారని అన్నారు. ముస్లీంలకు తొలి ప్రాధాన్యమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించినట్లు కూడా మోదీ ఆరోపణులు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment