శ్యాం పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం | Congress In Firefighting Mode Over Sam Pitroda Remarks on inheritance tax | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ vs బీజేపీ.. శ్యాం పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం

Published Thu, Apr 25 2024 5:25 PM | Last Updated on Thu, Apr 25 2024 5:25 PM

Congress In Firefighting Mode Over Sam Pitroda Remarks on inheritance tax - Sakshi

రాహుల్‌ గాంధీ చేసిన సంపద పునఃపంపిణీ వ్యాఖ్యల వివాదం చల్లారక ముందే కాంగ్రెస్‌  సీనియర్‌ నేత శ్యాం పిట్రోడా తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

‘అమెరికాలో వారసత్వ ట్యాక్స్‌ ఉంటుంది. ఒక  వ్యక్తి సుమారు 100 మిలియన్‌ డాలర్ల సంపద ఉండి అతను మరణిస్తే అందులో 55 శాతం ప్రభుత్వానికి వెళ్లుతుంది. మిగతా 45 శాతం మాత్రం అతని కుటుంబానికి చెందుతుంది. ఇది ఇక్కడి అసక్తికరమైన చట్టం.  మరణించిన వ్యక్తి  కొంత సంపద ప్రభుత్వానికి వెళుతంది.  అయితే ఇటువంటి చట్టం భారత్‌లో లేదు. అందుకే సంపద పునఃపంపిణీపై భారత్‌లో చర్చ జరుగుతోంది. అందుకే మేము సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడుతున్నాం. పేదవాళ్ల ప్రయోజనాలకే తప్ప ధనవంతుల కోసం కాదు’ అని అన్నారు

 

 

దీంతో ఒక్కసారిగా శ్యాం పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలతో విరుచుకుపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన విజయ్ సంకల్ప్ శంఖనాద్ మహార్యాలీలో పొల్గొని.. శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు చేశారు. ‘మధ్య తరగతి ప్రజలపై  పన్నులు విధించాలని కొంత కాలం కిందట యువరాజు(రాహుల్‌ గాంధీ), రాజ కుటుంబం సలహాదారు( శ్యాంపిట్రోడా) చెప్పారు. కాంగ్రెస్‌ ఇప్పుడు వారసత్వ పన్ను విధించడం గురించి మాట్లాడుతోంది. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందిన సంపదపై పన్ను విధించాలని చెబుతోంది.

... ప్రజలు సంపద.. వారి పిల్లలకు లభించదు. వ్యక్తులు బతికి ఉన్నప్పుడే కాకుండా మరణించిన తర్వాత కూడా వారి డబ్బును దోచుకోవడం కాంగ్రెస్ పార్టీ సూత్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ వారి పూర్వీకుల ఆస్తి అని.. గాంధీ కుటుంబాన్ని భావిస్తున్నారు. దాన్ని వారి పిల్లలకు అందించారు. కానీ భారతీయులు తమ ఆస్తుల్ని వారి పిల్లలకు ఇవ్వడానికి మాత్రం కాంగ్రెస్‌ ఇష్టపడటం లేదు’ అని మోదీ ధ్వజమెత్తారు.

 

 

 

‘ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్ధమై దోపిడి చేయటమే’ అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు.

 

 

‘భారతదేశాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించకుంది. శ్యాం పిట్రోడా సంపద పునఃపంపిణీ కోసం 50 శాతం వారసత్వపు పన్నును సమర్థించారు. మనం కష్టార్జితంలో 50 శాతం ప్రభుత్వం తీసుకుంటుంది. కాంగ్రెస్ గెలిస్తే మరింత పెరుగుతుంది’ అని బీజేపీ నేత  అమిత్ మాల్వియ విమర్శలు చేశారు.

 

 

శ్యాం పిట్రోడా  వ్యాఖ్యల కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ‘ శ్యాం పిట్రోడా ప్రపంచంలో చాలా మందికి మెంటర్‌, ఒక తత్వవేత్త, గైడ్‌. ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి అభ్రిపాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది. ఆయన చేసిన  వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీకి సంబంధం లేవు. కేవలం అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలుగానే పరిగణించాలి’ అని కాంగ్రెస్‌ అగ్రనేత జైరాం రమేష్‌ వివరణ ఇచ్చారు.

 

 

తాను చేసిన వ్యాఖ్యలపై శ్యాం పిట్రోడా స్పందించారు. ‘కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్న అబద్ధాల నుంచి దృష్టి మళ్లించడానికి  యూఎస్‌లో వారసత్వ పన్ను గురించి చేసిన వ్యాఖ్యలను మోదీ అనుకూల మీడియా వక్రీకరించటం దురదృష్టకరం’ అని అన్నారు.

 

 

ఇటీవల  ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సంపద పునఃపంపిణీ చేస్తామన్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని ఎ‍న్నకల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ప్రతిక్ష కూటమి అధికారంలోకి వస్తే..  దేశ సంపదను చొరబాటు దారులు, ఎక్కువ మంది పిల్లలు  ఉ‍న్న వారికి దోచిపెడుతుందన్నారు. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement