
'పటేల్ ఏపార్టీ వాడైనా తీవ్ర అన్యాయం జరిగింది'
గుజరాత్ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ప్రధాని మన్మోహన్ సింగ్ మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం కాస్తా మరింత ముదురుతోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని అందిపుచ్చుకునే విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ పడుతూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు మీడియాతో మాట్లాడిన మోడీ.. మన దేశ వారసత్వాన్నివిడగొడుతూ ప్రధాని మాట్లాడటం సరికాదన్నారు. సర్థార్ పటేల్ ఏ పార్టీలో ఉన్నా ఆయనకు తీవ్ర అన్యాయం జరిగిందన్న సంగతి గుర్తించుకోవాలన్నారు. దేశాన్ని సంక్లిష్ట పరిస్థితుల నుంచి కాపాడటానికి కృషి చేసిన భగత్ సింగ్, రాణా ప్రతాప్, శివాజీలు బీజేపీ వ్యక్తులు కాకపోయినా వారిని తాము గౌరవిస్తామని మోడీ తెలిపారు. ఇదిలా ఉండగా సర్ధార్ పటేల్ లౌకికవాది అన్న ప్రధాని వ్యాఖ్యలను మాత్రం మోడీ ప్రశంసించారు. పటేల్ ఎప్పడూ లౌకికవాద భావ జాలానికి కృషి చేశారని ఆయన తెలిపారు.
ఆ విషయంపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ల మధ్య మంగళవారం ఒకే వేదికపై నుంచి మాటల యుద్ధం జరిగింది.