
ఉక్కు మనిషికి మోదీ నివాళి
న్యూఢిల్లీ: భారత ఉక్కుమనిషి, మాజీ ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ 65వ వర్దంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. పటేల్కు మోదీ సెల్యూట్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సమగ్రత, సమైక్యత అంశాలతో పాటు తన విలువైన సేవలను మనం స్మరించుకోవాలన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో పోరును కొనసాగించిన పటేల్, అనంతరం భారత జాతిని ఏకతాటిపైకి తీసుకొచ్చాడని పటేల్ గొప్పతనాన్ని, ఆయన సేవల్ని ప్రధాని మోదీ కొనియాడారు.
On his Punya Tithi, salutations to Sardar Patel. We remember his exemplary service & are inspired by his message of unity & integration.
— Narendra Modi (@narendramodi) December 15, 2015