న్యూఢిల్లీ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 69వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంట్ ఆవరణలో నిర్వహించిన మహాపరినిర్వాన్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం జరిగింది.
ప్రధాని మోదీ, ఖర్గే పరస్పరం పలకరించుకొని కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను కెమెరామెన్లు క్లిక్‌మనిపించడంతో.. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ కార్యక్రమానికి మోదీ, ఖర్గేతోపాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఖర్గే మోదీ వద్దకు వచ్చి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు నవ్వుతూ ముచ్చటించారు. రాజకీయాల్లో ఎప్పుడూ పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకొనే నేతలు ఇలా ఒకేచోట అభివాదం చేస్తూ నవ్వుకుంటున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.. మరోవైపు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంబేద్కర్‌కు నివాళులర్పించారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi, Vice President Jagdeep Dhankhar, Former President Ram Nath Kovind, Congress President Mallikarjun Kharge and Lok Sabha Speaker Om Birla at the Parliament House Lawns as they pay tribute to Dr BR Ambedkar on the occasion of 69th… pic.twitter.com/TUrefyCY1m
— ANI (@ANI) December 6, 2024
Comments
Please login to add a commentAdd a comment