ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని ‘అర్బన్ నక్సల్’ నడుపుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన ఆరోపణలను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసే హక్కు ప్రధాని మోదీకి లేదని మండిపడ్డారు. ‘అర్జన్ నక్సల్’ పేరుతో కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయటం బీజేపీకి ఓ అలవాటుగా మారిందని అన్నారు. ‘‘ప్రధాని మోదీ ఎప్పుడూ కాంగ్రెస్‌ను అర్బన్ నక్సల్ పార్టీగా ముద్ర వేస్తారు. అది ఆయనకు అలవాటే. అలా అయితే ఆయన సొంత పార్టీ సంగతేంటి? బీజేపీ అనేది ఉగ్రవాదుల పార్టీ, హత్యలకు పాల్పడుతోంది. కాంగ్రెస్‌పై ఆరోపణలు చేసే హక్కు మోదీకి లేదు’’ అని ఖర్గే కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్న సమయంలో అక్టోబర్ 5న మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని వాషిమ్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ నియంత్రిస్తోంది. ఆ పార్టీ ప్రమాదకరమైన ఎజెండాను ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలి. కాంగ్రెస్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఆ పార్టీ దేశాన్ని విభజించాలనుకుంటోంది. అందుకే ప్రజలను విభజించాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ కుట్రను భగ్నం చేయడానికి ఐక్యంగా ఉండాలి’’ అని అని అన్నారు.
అదేవిధంగా అక్టోబరు 9న జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత కూడా మోదీ.. కాంగ్రెస్‌పై అర్బన్ నక్సల్స్‌ను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ వర్చువల్ మాట్లాడారు. ‘‘ హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం దేశంలోని మూడ్‌ని తెలియజేస్తోంది. కాంగ్రెస్ , అర్బన్ నక్సల్స్ విద్వేషపూరిత కుట్రలకు తాము బలికాబోమని ప్రజలు చూపించారు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment