Urban Naxals
-
‘అర్బన్ నక్సల్స్’ ఆరోపణలు.. ప్రధాని మోదీకి ఖర్గే కౌంటర్
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని ‘అర్బన్ నక్సల్’ నడుపుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన ఆరోపణలను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసే హక్కు ప్రధాని మోదీకి లేదని మండిపడ్డారు. ‘అర్జన్ నక్సల్’ పేరుతో కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయటం బీజేపీకి ఓ అలవాటుగా మారిందని అన్నారు. ‘‘ప్రధాని మోదీ ఎప్పుడూ కాంగ్రెస్‌ను అర్బన్ నక్సల్ పార్టీగా ముద్ర వేస్తారు. అది ఆయనకు అలవాటే. అలా అయితే ఆయన సొంత పార్టీ సంగతేంటి? బీజేపీ అనేది ఉగ్రవాదుల పార్టీ, హత్యలకు పాల్పడుతోంది. కాంగ్రెస్‌పై ఆరోపణలు చేసే హక్కు మోదీకి లేదు’’ అని ఖర్గే కౌంటర్ ఇచ్చారు.అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్న సమయంలో అక్టోబర్ 5న మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని వాషిమ్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ నియంత్రిస్తోంది. ఆ పార్టీ ప్రమాదకరమైన ఎజెండాను ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలి. కాంగ్రెస్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఆ పార్టీ దేశాన్ని విభజించాలనుకుంటోంది. అందుకే ప్రజలను విభజించాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ కుట్రను భగ్నం చేయడానికి ఐక్యంగా ఉండాలి’’ అని అని అన్నారు.అదేవిధంగా అక్టోబరు 9న జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత కూడా మోదీ.. కాంగ్రెస్‌పై అర్బన్ నక్సల్స్‌ను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ వర్చువల్ మాట్లాడారు. ‘‘ హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం దేశంలోని మూడ్‌ని తెలియజేస్తోంది. కాంగ్రెస్ , అర్బన్ నక్సల్స్ విద్వేషపూరిత కుట్రలకు తాము బలికాబోమని ప్రజలు చూపించారు’’ అని అన్నారు. -
అర్బన్ నక్సల్స్, తుక్డే గ్యాంగ్ కాంగ్రెస్‌ను నడిపిస్తున్నాయి
వార్ధా: విపక్ష కాంగ్రెస్‌లోకి విద్వేష భూతం ప్రవేశించిందని, అర్బన్ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్ (సమాజాన్ని విచి్ఛన్నం చేసే శక్తులు) ఆ పార్టీని నడిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘కాంగ్రెస్ అత్యంత అవినీతి పార్టీ. కాంగ్రెస్ రాజ కుటుంబం అత్యంత అవినీతి కుటుంబం’’ అని ధ్వజమెత్తారు. ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’కు ఏడాది పూర్తయిన మహారాష్ట్రలోని వార్ధాలో శుక్రవారం బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు విదేశీ గడ్డపై దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రాహుల్‌గాంధీని ఉద్దేశించి ఆరోపించారు. ‘‘గణపతి పూజను సైతం కాంగ్రెస్ ద్వేషిస్తోంది. నేను గణపతి పూజలో పాల్గొంటే కాంగ్రెస్ నాయకులు బుజ్జగింపు రాజకీయాల కోసం నాపై ఆరోపణలకు దిగారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో వినాయక విగ్రహాన్ని పోలీసు జీపెక్కించారు. అయినా మహారాష్ట్రలోని కాంగ్రెస్ మిత్రపక్షాలు నోరు విప్పలేదు. తెలంగాణలో ఇచ్చిన ఎన్నికల హామీలను అధికారంలోకి రాగానే పక్కన పెట్టింది. కాంగ్రెస్ అంటే అబద్ధం, మోసం’’ అని దుయ్యబట్టారు.అంతర్జాతీయ స్థాయికి మన వస్త్ర పరిశ్రమవిశ్వకర్మ యోజనతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అధికంగా లబ్ధి పొందుతున్నారని మోదీ తెలిపారు. ‘‘మన వస్త్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ఏడాది కాలంలో 20 లక్షల మందికిపైగా విశ్వకర్మ యోజనలో చేరారు. 8 లక్షల మంది నైపుణ్య శిక్షణ పొందారు’’ అని వెల్లడించారు. -
సాయిబాబాకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు సంబంధాల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.‘‘ సాయిబాబాపై మోపిన నేరాలు చాలా తీవ్రమైనవి. సమాజ ప్రయోజనాలకు, దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేవి. నేర తీవ్రత తదితరాలను పరిగణనలోకి తీసుకోకుండా సాంకేతికాంశాల ఆధారంగా బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది’’ అంటూ తప్పుబట్టింది. అంగవైకల్యం, అనారోగ్య కారణాల రీత్యా తనను కనీసం గృహ నిర్భంధంలో ఉంచాలన్న సాయిబాబా విజ్ఞప్తినీ తిరస్కరించింది. బెయిల్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. దాంతో సాయిబాబా తదితరులు నాగపూర్ సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. ఆయనను 2014 ఫిబ్రవరిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును దురదృష్టకరంగా వామపక్ష కార్యకర్తలు, సానుభూతిపరులు అభివర్ణించారు. తీర్పును నిరసిస్తూ సాయిబాబా విడుదల కోసం ఢిల్లీ యూనివర్సిటీలో ధర్నా చేసిన 40 మంది విద్యార్థులు, అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరాలు సాయిబాబాతో సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఈ నెల 14న తీర్పు ఇవ్వడం తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శనివారం సెలవు దినమైనా న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం దీనిపై అత్యవసరంగా విచారణ జరిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ‘‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ప్రకారం సాయిబాబాను విచారించడానికి ముందుగా అనుమతి పొందలేదనే కారణంతో నిర్దోషిగా ప్రకటించడం సరికాదు. కేసులోని యథార్థాలను పరిశీలించకుండా కేవలం సాంకేతిక అంశాల ఆధారంగా హైకోర్టు తీర్పు చెప్పింది. యూఏపీఏ చట్టం ప్రకారం అనుమతి పొందకపోవడాన్ని ట్రయల్ కోర్టులో గానీ, ఇతర కోర్టుల్లో గానీ సాయిబాబా సవాల్ చేయలేదు. కస్టడీలోకి తీసుకున్నాక ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేస్తే కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు యూఏపీఏ సెక్షన్ 43(సీ)ని వర్తింపజేసిన దృష్ట్యా సెక్షన్ 465 ప్రకారం సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేయడం సరికాదు’’ అన్నారు. సాయిబాబా తరఫు న్యాయవాది ఆర్.బసంత్ దీనిపై అభ్యంతరం తెలిపారు. ‘‘సాయిబాబాకు 52 ఏళ్లు. 90 శాతం శారీరక వైకల్యముంది. పెళ్లి కాని 23 ఏళ్ల కూతురుంది. అనారోగ్యంతో చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. ఆయనకు నేర చరిత్ర లేదు. ఏడేళ్లకు పైగా జైళ్లో ఉన్నారు. రోజువారీ పనులూ చేసుకోలేకపోతున్నారు. షరతులతోనైనా ఇంటి వద్దే ఉండేందుకు అనుమతివ్వాలి’’ అని కోరారు. మెదడు చాలా డేంజరస్: ధర్మాసనం ఈ వాదనలపై సొలిసిటర్ జనరల్ అభ్యంతరం తెలిపారు. ‘‘ఇటీవల అర్బన్ నక్సల్స్ ఎక్కువగా గృహ నిర్భంధాలు కోరుతున్నారు. వారు ఇంట్లో ఉండే మెదడు సాయంతో ప్రతిదీ చేస్తారు. ఫోన్లు కూడా వాడుకుంటారు. కాబట్టి గృహ నిర్బంధానికి అవకాశం ఇవ్వొద్దు’’ అని కోరారు. ‘‘జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాద ఉద్యమంతోనూ సాయిబాబాకు సంబంధముంది. మావోయిస్టు కమాండర్ల భేటీలను ఏర్పాటు చేయడం వంటి పనులతో దేశ ప్రజాస్వామిక వ్యవస్థపై యుద్ధానికి తోడ్పాటునందించారు. మావోయిస్టులకు ఆయన మేధో శక్తిగా ఉంటూ వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చారు’’ అని ఆరోపించారు. మెదడు చాలా ప్రమాదకరమైనదని జస్టిస్ షా అన్నారు. ఉగ్రవాద లేక మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినంతవరకు మెదడే సర్వస్వమని అభిప్రాయపడ్డారు. గృహ నిర్బంధం విజ్ఞప్తిని తిరస్కరించారు. సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే నిందితులను దోషులుగా నిర్ధారించారన్నారు. ‘‘హైకోర్టు కూడా సాయిబాబా తదితరులపై కేసులను కొట్టేయలేదు. కింది కోర్టు నిర్ధారించిన అంశాలను తోసిపుచ్చలేదు. కేవలం వారి విడుదలకు మాత్రమే ఆదేశించింది’’ అని ధర్మాసనం గుర్తు చేసింది. విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. -
గుజరాత్‌పై అర్బన్ నక్సల్స్ కన్ను: మోదీ
బరూచ్(గుజరాత్): కొత్త రూపంలో అర్బన్ నక్సల్స్ తొలిసారిగా గుజరాత్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ బరూచ్ జిల్లాలో దేశంలోనే తొలి బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘ అర్బన్ నక్సల్ కన్ను గుజరాత్‌పై పడింది. శక్తియుక్తులున్న గుజరాతీ అమాయక ఆదివాసీ యువతను వారు లక్ష్యంగా చేసుకుందామనుకుంటున్నారు. అయితే వీరి ఆటలు ఇక్కడ సాగవు. వారిని రాష్ట్రం తరిమికొడుతుంది’ అని మోదీ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా గుజరాత్ ఎన్నికల బరిలో దిగుతున్న నేపథ్యంలో ఆప్‌నుద్దేశిస్తూ మోదీ ఈ పరోక్ష వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్‌ను మేథాపాట్కర్ వంటి వారు అడ్డుకోవడాన్ని అభివృద్ధి నిరోధక అర్బన్ నక్సలైట్లుగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అభివర్ణించారు. మేథా పాట్కర్ గతంలో ఆప్ టికెట్‌పై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. బరూచ్ ఫార్మా పార్క్ అందుబాటులోకి వచ్చాక బల్క్ డ్రగ్స్‌లో భారత్ స్వావలంబన సాధిస్తుందని మోదీ అన్నారు. పటేల్ ఏకంచేశారు. కానీ నెహ్రూ.. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో సోమవారం ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘సర్దార్ పటేల్ సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేశారు. కానీ ఒక్క వ్యక్తి జమ్మూకశ్మీర్ అంశాన్ని నెత్తినేసుకుని ఎటూ తేల్చకుండా వదిలేశారు’ అని నెహ్రూపై విమర్శలు చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న కశ్మీర్ సమస్యను పటేల్ స్ఫూర్తితో పరిష్కరించి ఆయనకు నివాళులర్పించానన్నారు. -
‘సర్దార్ సరోవర్‌ను అడ్డుకున్న..అర్బన్ నక్సల్స్’
అహ్మదాబాద్: నర్మదా నదిపై తలపెట్టిన సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని రాజకీయ అండ ఉన్న అర్బన్ నక్సల్స్ (అభివృద్ధి నిరోధక శక్తులు) ఏళ్ల తరబడి అడ్డుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వారు ఇప్పటికీ ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం పర్యావరణ మంత్రుల జాతీయ సదస్సును గుజరాత్‌లోని నర్మదా జిల్లా ఏక్తా నగర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు. వివిధ సంస్థల అండతో అర్బన్ నక్సల్స్ సాగిస్తున్న ప్రచారం కారణంగా అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయన్నారు. వీరు న్యాయవ్యవస్థ, ప్రపంచబ్యాంకులను సైతం ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. జాప్యం వల్ల సమయం, పెద్ద మొత్తంలో డబ్బు వృథా అవుతోందన్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యావరణ అనుమతుల కోసం 6 వేల దరఖాస్తులు, మరో 6,500 దరఖాస్తులు అటవీ శాఖ అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇదీ చదవండి: సీఎంగా నా వారసుడిని వారే నిర్ణయిస్తారు: గెహ్లాట్ -
అర్బన్ నక్సల్స్తోనే హిందుత్వానికి ముప్పు
సాక్షి, హైదరాబాద్: దళితులు, ఆదివాసీలు హిందువులు కాదంటూ అర్బన్ నక్సలైట్లు విషప్రచారం చేస్తున్నారని, వారివల్లే హిందుత్వానికి ముప్పు పొంచి ఉందని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధానకార్యదర్శి మిలింద్ పరండేజీ అన్నారు. ఆదివారం హైదరాబాద్ కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల పండుగలు అతి ప్రాచీనమైనవని, దాదాపు రెండు వేల ఏళ్ల నుంచి విదేశీ దురాక్రమణలను ఎదుర్కొంటూ హిందువులు తమ సంప్రదాయాలను కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని 185 జిల్లాల్లో హిందువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, కశీ్మర్, అరుణాచల్ ప్రదేశ్, దక్షిణ బిహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో హిందువుల పండుగలను స్వేచ్ఛగా జరగనివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల్లో ‘మేం ఏ మతానికి చెందని వారం కాదు’ అని చెప్పేవారి సంఖ్య కోట్లలో ఉందని, వారంతా హిందువులేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు స్థానుమలై, రాఘవులు, సత్యంజీ, కేశవ్హెడ్గే, యాదిరెడ్డి, జగదీశ్వర్, రాజేశ్వర్‌రెడ్డి, పగుడాకుల బాలస్వామి, బజరంగ్దళ్ రాష్ట్ర కో కన్వీనర్ శివరాములు పాల్గొన్నారు. -
‘అర్బన్ నక్సల్స్తోనే జేఎన్యూకు అపకీర్తి’
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూలో ఈనెల 5న చోటుచేసుకున్న హింసాకాండపై ఏబీవీపీ, వామపక్ష విద్యార్ధుల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. అర్బన్ నక్సల్స్ జేఎన్యూకు చెడ్డపేరు తీసుకువస్తున్నారని బీజేపీ అనుబంధ ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి అన్నారు. ప్రతిష్టాత్మక జేఎన్‌యూ విద్యార్ధులుగా తాము గర్విస్తున్నామని సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె పేర్కొన్నారు. అథ్యాపకులు సైతం తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జేఎన్‌యూ విద్యార్ధులపై తమ కార్యకర్తలు ముసుగు దాడులకు పాల్పడ్డారన్న విద్యార్ధుల ఆరోపణలను ఏబీవీపీ తోసిపుచ్చింది. యూనిటీ ఎగనెస్ట్ లెఫ్ట్ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో ఛాటింగ్‌ను మార్ఫింగ్ చేశారని ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సిద్ధార్ధ్ యాదవ్ చెప్పుకొచ్చారు. మరోవైపు జేఎన్‌యూ క్యాంపస్‌లో దాడిపై పోలీసుల దర్యాప్తును జేఎన్‌యూ విద్యార్ధి సంఘం తప్పుపట్టింది. దాడికి గురైన బాధితులపైనే అభియోగాలు మోపుతూ పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. దాడి జరిగిన రోజు పోలీసులు, సెక్యూరిటీ గార్డులు బాధితులను కాపాడేందుకు ముందుకు రాలేదని ఆరోపించింది. -
ప్రముఖ చరిత్రకారుడిపై బీజేపీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ట్విటర్ వేదికగా ఆయనను అర్బన్ నక్సలైట్‌గా వర్ణించింది. ఆయన చీకటి ప్రపంచాన్ని నడుపుతున్నాడని ఆరోపించింది. ఈ మేరకు కర్ణాటక బీజేపీ శాఖ శనివారం తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘‘ప్రశ్న: మీరు ఎవరు?. జవాబు: నా పేరు రామచంద్ర గుహ. చీకటి ప్రపంచంలో కార్యకలాపాలు నిర్వహించే అర్బన్ నక్సల్స్ గురించి సామాన్యులకు తెలియదు. తమ యజమానుల తరఫున హింసను ప్రేరేపించడం, ఆందోళనలు జరపడం ద్వారా తమ ఉనికిని ప్రదర్శించుకుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. ఇప్పుడు వారంతా బయటికి వస్తున్నారు..’ అంటూ వ్యాఖ్యానించింది. దీనికి తోడు ఆయన మాట్లాడుతున్న ఓ వీడియోను కూడా ట్విటర్లో షేర్ చేసిది. కాగా ప్రభుత్వ నిషేధాజ్ఞలను ధిక్కరించి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రామచంద్ర గుహను బెంగళూరు పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తనను నిర్బంధించడం తీవ్ర అప్రజాస్వామికమనీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. -
వరవరరావుపై పుణే పోలీసుల చార్జిషీట్
పుణే : బీమా కొరేగావ్ కేసులో అర్బన్ నక్సల్స్‌పై పుణే పోలీసులు 1837 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేశారు. పౌరహక్కుల కార్యకర్త, విరసం నేత వరవరరావు, గణపతి, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నోన్ గోన్సాల్వ్స్పై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. బీమా కొరేగావ్ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే అభియోగంపై వరవరరావు సహా పలువురు హక్కుల కార్యకర్తలను గత ఏడాది పుణే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో విప్లవ సంఘాల నేతలకు సంబంధాలున్నాయని, మావోయిస్టుల లేఖ ఆధారంగానే అర్బన్ నక్సల్స్‌ను అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతుండగా, అకారణంగా తమను అరెస్ట్ చేశారని, మావోయిస్టుల లేఖ కల్పితమని వరవరరావు గతంలో పేర్కొన్నారు. -
అర్బన్ నక్సల్స్ అసలు లక్ష్యం!
కొంత కాలం క్రితం బెంగళూరు నగరంలో జరిగిన నిరసన ప్రదర్శనలో బహిరంగంగా సినీ నటుడు రచయిత కవి గిరీష్ కర్నాడ్, స్వామి అగ్నివేశ్ మరికొందరు మేమూ అర్బన్ నక్సల్స్ అంటూ మెడలో ప్లే కార్డులు ధరిం చారు. ‘అర్బన్ నక్సల్స్’, ‘హాఫ్ మావోయిస్ట్స్’ అనే పదాలు నేడు దేశమంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. నగర ప్రాంతాలలో స్థావరాల గురించి ఒకటిన్నర దశాబ్దం క్రితం మావోయిస్టులు కన్న కల ఇప్పుడు ఫలిస్తున్నది. ఉగ్రవాద ధోరణులకు జనామోదం సమకూర్చడమే అర్బన్ నక్సల్స్ ప్రథమ కర్తవ్యం. వీరి అర్బన్ పర్స్పెక్టివ్ పత్రం ప్రకారం పట్టణాలలో, నగరాలలో అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేయాలి. కార్యకర్తలను సేకరించడంతో పాటు, నాయకత్వాన్ని అభివృద్ది చేసే పని జరగాలి. సెక్యులర్ శక్తులను, పీడనకు గురి అవుతున్న అల్పసంఖ్యాక వర్గాలను హిందూ ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఏకం చేయాలి. 2004లో నాటి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటి నుంచి నగరాలు, పట్టణాలపై దృష్టి కేంద్రీకరించడం కోసం నక్సల్స్ అధినాయకత్వం శ్రమిస్తూనే ఉంది. పథకం ప్రకారం ఎంపిక చేసిన తమ నాయకులను కొందరిని జనజీవన స్రవంతిలో కలిపి దేశవ్యాప్తంగా తమ పోరాట పంథాను మార్చి భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో వివిధ ప్రజా ఉద్యమాలకు నేతృత్వం వహిస్తూ భారత ప్రభుత్వంపై తమ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. సంఘ పరివార సంస్థలపై అక్కసును వెళ్లగక్కడం అర్బన్ నక్సల్స్ వ్యూహం. రచయితలను, మేధావులను విద్యార్థులను ‘బ్రెయిన్ వాష్’ చేసి అడవులకు పంపే ప్రయత్నంలో అర్బన్ నక్సల్స్ సఫలీకృతం అవుతున్నారా అనిపిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో ఒకప్పటి రాడికల్ విద్యార్థి సంఘం పాత్రను అధ్యాపకులు, మేధావుల రూపంలో కొందరు అర్బన్ నక్సల్స్ పోషిస్తున్నారు. నక్సలైట్ల ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రారంభమైన మొదటి రోజుల నుంచే ఇప్పటి అర్బన్ నక్సల్స్ కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. వీరు గతంలో హక్కుల ఉద్యమకారులుగా చెలామణీ అయ్యారు. సకల వ్యవహారాలను చట్టాలకతీతంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ముసుగులో కోర్టుల బయట రాజకీయ రచ్చ ద్వారా తేల్చుకుంటామని భావిస్తున్నారు. మరోవైపున చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళే మార్గంలో అర్బన్ నక్సల్స్ సమస్యకు సరైన పరి ష్కారాలు లభిస్తాయని ఆశిద్దాం. -కొట్టె మురళీకృష్ణ, కరీంనగర్ మొబైల్ : 94417 26741 -
ఛత్తీస్‌గఢ్‌లో హైదరాబాద్ వాసి అరెస్టు
-
ఛత్తీస్‌గఢ్‌లో హైదరాబాద్ వాసి అరెస్టు
రాయ్‌పూర్ : మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తుండగా నక్కా వెంకట్రావు అనే వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ వాసి అయిన వెంకట్రావు అర్బన్ నక్సలిజం వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడని... అతడిని అరెస్టు చేయడం ద్వారా అర్బన్ నక్సల్స్ నెట్‌వర్క్‌ను బ్రేక్ చేశామని ఛత్తీస్‌గఢ్ ఐజీ ఎస్పీ సింగ్ తెలిపారు. ఎన్జీఆర్ఐలో ఉద్యోగం చేస్తున్న నక్కా వెంకట్రావు 2016, 2017లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశం అయినట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు నక్కా పనిచేశాడని ఐజీ వెల్లడించారు. కాగా వెంకట్రావు సోదరుడు పౌరహక్కుల సంఘం కార్యకర్తగా పనిచేస్తున్నట్లు సమాచారం. -
దిగ్విజయ్ సింగ్‌ను ప్రశ్నించనున్న పూణే పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ : అర్బన్ నక్సల్స్ కేసుకు సంబంధించి పూణే పోలీసులు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ను ప్రశ్నించనున్నారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న లేఖలో స్నేహితుడి నెంబర్‌గా పేర్కొన్న ఫోన్ నెంబర్ దిగ్విజయ్ సింగ్‌కు చెందినదిగా పోలీసుల విచారణలో వెల్లడైందని డీసీపీ సుహాస్ బావ్చే చెప్పారు. అయితే ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, దీనిపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని పూణే పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థుల ద్వారా దేశవ్యాప్త నిరసనలకు సహకరించేందుకు కాంగ్రెస్ నేతలు సుముఖంగా ఉన్నారని కామ్రేడ్ సురేంద్రకు కామ్రేడ్ ప్రకాష్ రాసినట్టుగా చెబుతున్నఈ లేఖలో ప్రస్తావించారు. ఇటీవల అరెస్ట్ అయిన కార్యకర్తలకు మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయనే ఆధారాల కోసం పూణే పోలీసులు ఈ లేఖను కోర్టులో సమర్పించారు. కాగా లేఖలో పేర్కొన్న ఫోన్ నెంబర్ దిగ్విజయ్ సింగ్‌దేననే వార్తల నేపథ్యంలో దీంతో తనకెలాంటి సంబంధం లేదని దిగ్విజయ్ తోసిపుచ్చారు. -
అర్బన్ నక్సల్స్‌కు కాంగ్రెస్ వత్తాసు
జగ్దల్పూర్: ఆదివాసీ యువత జీవితాల్ని నాశనం చేసిన అర్బన్ నక్సలైట్లకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ గిరిజన తెగల సంస్కృతిని హేళనచేసిందని మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్తర్‌లోని జగ్దల్పూర్లో ప్రచార కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. మావోల సమస్యను సాకుగా చూపి గత ప్రభుత్వాలు బస్తర్ అభివృద్ధికి చొరవ చూపలేదన్నారు. నక్సల్స్‌ను దుష్ట మనసు కలిగిన రాక్షసులుగా అభివర్ణించిన మోదీ...బస్తర్‌లో బీజేపీ కాకుండా ఎవరు గెలిచినా ఆ ప్రాంత అభివృద్ధి కలలకు విఘాతం కలుగుతుందన్నారు. ఇటీవల ఛత్తీసగఢ్లో మావోల దాడిలో మరణించిన దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహూకు నివాళులర్పించారు. వాళ్ల దృష్టిలో ఓటుబ్యాంకే.. దళితులు, బలహీన వర్గాలు, గిరిజనుల గురించి మాట్లాడే కాంగ్రెస్ వారిని మనుషులుగా కాకుండా ఓటుబ్యాంకుగానే చూస్తోందని మోదీ విమర్శించారు. ‘ఆదివాసీల సంప్రదాయాల్ని కాంగ్రెస్ ఎందుకు హేళన చేసిందో నాకు అర్థం కాలేదు. ఓసారి ఈశాన్య భారత్‌లో జరిగిన కార్యక్రమంలో ఆదివాసీల సంప్రదాయ తలపాగా ధరించినప్పుడు కాంగ్రెస్ నాయకులు నా వేషధారణను చూసి నవ్వుకున్నారు. ఇది ఆదివాసీల సంప్రదాయాలను అవమానించడమే. ఏసీ గదుల్లో ఉంటూ తమ పిల్లల్ని విదేశాల్లో చదివించుకుంటున్న అర్బన్ నక్సలైట్లు స్థానిక యువతను రిమోట్ కంట్రోల్‌గా వాడుకుంటున్నారు. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటుంటే, కాంగ్రెస్ మద్దతిస్తోంది’ అని అన్నారు. మరోవైపు, సోదరసోదరీమణుల బంధానికి ప్రతీక అయిన ‘భాయ్ దూజ్’ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మేమే నక్సల్స్ బాధితులం: కాంగ్రెస్ అర్బన్ నక్సలైట్లకు కాంగ్రెస్ మద్దతిస్తోందన్న మోదీ వ్యాఖ్యలను ఆ పార్టీ తిప్పికొట్టింది. 2013లో నక్సల్స్ హింసలో కాంగ్రెస్ 25 మందికి పైగా నాయకుల్ని కోల్పోయిందని తెలిపింది. నక్సలిజం సమస్యను పరిష్కరించడంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోదీ తనకే సొంతమైన ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించింది. మోదీ అసమ్మతిని సహించలేరని, ఆయన విధానాల్ని ప్రశ్నించినవారిని జాతి వ్యతిరేకులు, అర్బన్ మావోయిస్టులని ముద్ర వేస్తున్నారని సీపీఎం నాయకురాలు బృందా కారత్ అన్నారు. -
‘అర్బన్ నక్సల్’ అంటే ఏంటి?: రొమిలా థాపర్
న్యూఢిల్లీ: ‘అర్బన్ నక్సల్’ అనే మాటకు అర్థం ఏమిటో చెప్పాలని ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనతోపాటు తనవంటి కార్యకర్తలకు ఆ మాటకు నిర్వచనం తెలియదని అన్నారు. వామపక్ష అనుకూల కార్యకర్తల గృహ నిర్బంధానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో థాపర్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘అర్బన్ నక్సల్ అని పిలవడం తేలికైపోయింది. అర్బన్ నక్సల్స్ అంటే వారికి అర్థం తెలుసా? ముందుగా ప్రభుత్వాన్ని ఆ మాటకు అర్థం చెప్పమనండి. ఆ కేటగిరీలో మేమెలా ఉంటామో, అర్బన్ నక్సల్స్ ఎలా అయ్యామో చెప్పమనండి. అర్బన్ నక్సల్ నిర్వచనం ప్రభుత్వానికీ తెలియదా లేదా మాకు అర్థం కాలేదా చెప్పమనండి’ అని అన్నారు. సమాజంలో మంచి కోసం పోరాడుతున్న వారికి అర్బన్ నక్సల్స్ అని పేరు పెట్టటం వెనుక రాజకీయ కారణాలున్నాయని ఆమె ఆరోపించారు. -
వరవరరావుపై ఒక్క కేసూ నిలువలేదు
సాక్షి, న్యూఢిల్లీ : భీమా కోరేగావ్ అల్లర్లకు సంబంధించిన హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విరసం నేత వరవరరావు, మరో నలుగురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు పలు అభియోగాలు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్న భారీ అభియోగంతోపాటు నేపాల్, మణిపూర్‌ల నుంచి నక్సలైట్లకు ఆయుధాలను సరఫరా చేయడంలో సహకరిస్తున్నారని, అర్బన్ మావోయిస్టుల కార్యకలాపాలకు నిధులిస్తున్నారన్నది ఇతర అభియోగాలు. ప్రస్తుతం వీరంత గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం 78 ఏళ్ల వరవరరావు గత 48 ఏళ్ల కాలంలో దాదాపు 25 కేసులను ఎదుర్కొన్నారు. ఏ ఒక్క కేసుల్లోనూ ఆయన దోషిగా తేలలేదు. ఆయనపై అన్ని కేసులను కోర్టులు కొట్టివేశాయి. ఒక్క 2005 సంవత్సరంలోనే వరవరరావుపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. చిలకలూరిపేట, అచ్చంపేట పోలీసు స్టేషన్లపై నక్సలైట్ల దాడి, ఒంగోలు వద్ద ఓ సీనియర్ పోలీసు అధికారి కాన్వాయ్‌పై నక్సలైట్ల దాడి, బాలానగర్‌లో ఓ పోలీసు కాల్చివేత సంఘటనల నేపథ్యంలో వరవరరావుపై ఈ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు పోలీసులు, ముగ్గురు పౌరులు మరణించిన చిలుకలూరి పేట పోలీసు స్టేషన్‌పై దాడికి నక్సలైట్లను వరవర రావు రెచ్చగొట్టడమే కాకుండా ఎప్పటికప్పుడు వారికి డైరెక్షన్ ఇచ్చారని, ఇందులో ఇతర విరసం సభ్యుల పాత్ర కూడా ఉందన్నది ప్రధాన ఆరోపణ. పోలీసు స్టేషన్ పేల్చివేతకు నక్సలైట్లకు సెల్‌ఫోన్ ద్వారా డైరెక్షన్ ఇచ్చినట్లు సబ్ డివిజనల్ స్థాయి పోలీసు అధికారి స్వయంగా ఆరోపణలు చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించిన అచ్చంపేట పోలీసు స్టేషన్‌పై దాడిని కూడా వరవరరావు ప్రోత్సహించారని మరో కేసు దాఖలు చేశారు. ముగ్గురు పౌరుల మరణానికి దారితీసిన ఒంగోలు సమీపంలో ఎస్పీ కాన్వాయ్‌పై జరిగిన దాడికి వరవరరావుతోపాటు మరో విరసం నేత కళ్యాణ్‌రావు బాధ్యులని నేరారోపణలు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి లొంగిపోయిన ఇద్దరు నక్సలైట్లను విలేకరుల సమావేశంలో హాజరుపరిచారు. దాడికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న వరవరరావు ఇంట్లో జరిగిన రహస్య సమావేశంలో తాము పాల్గొన్నట్లు ఆ ఇద్దరు నక్సలైట్లు వెల్లడించారు. వరవరరావు కుట్ర కారణంగానే కానిస్టేబుల్‌ను కాల్చివేసిందనేది మరో కేసు. ఈ కేసుల్లోని లొసుగులను మీడియా పట్టుకొని వాటిని విస్తృతంగా ప్రచారం చేయడంలో పోలీసులు విచారణకు ముందే మూడు కేసులను ఉప సంహరించుకున్నారు. ఒంగోలులో ఎస్పీ కాన్వాయ్‌పై జరిగిన దాడి కేసులో మాత్రం వరవరరావుపై కొన్నేళ్ల పాటు విచారణ కొనసాగింది. ఆ కేసు నుంచి కూడా ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారు. హత్యలకు, హత్యాయత్నాలకు ప్రోత్సహించారని, రెచ్చగొట్టారంటూ అంతకుముందు దాఖలైన నాలుగు కేసులు కూడా కోర్టు ముందు నిలబలేక పోయాయి. ఆయుధాల సరఫరా కేసులు ఆయుధాల డీలర్లతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆయుధాల చట్టం–1959, పేలుడు పదార్థాల చట్టం–1908, కింద వరవర రావుపై దాదాపు తొమ్మిది కేసులను దాఖలు చేశారు. 1985లో ఆర్ఎస్యూ విద్యార్థి లాకప్ మరణానికి నిరసనగా చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయడం కోసం వరవరరావు స్వయంగా బాంబులు పంచారన్నది కూడా ఓ కేసు. 1974 నాటి సికిందరాబాద్ కుట్ర కేసు, 1986 నాటి నామ్‌నగర్ కుట్ర కేసు వీటిలో ప్రధానమైనవి. హత్య, హత్యాయత్నాలు, దోపిడీలను ప్రోత్సహించడం, కుట్ర పన్నడంతోపాటు దేశద్రోహం అభియోగాలను కూడా ఆయనపై మోపారు. వీటిలో ఏ ఒక్క కేసు కూడా కోర్టు ముందు నిలబడలేదు. దాదాపు ఇప్పుడు కూడా ఆయనపై ఇలాంటి కేసులనే పుణె పోలీసులు దాఖలు చేశారు. మావోయిస్టు కార్యకలాపాలకు నిధులు సమీకరిస్తున్నారన్నది కాస్త కొత్త కేసు. 1998లో కాలేజీ అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసి, పింఛను డబ్బులతో బతుకుతున్న వరవరరావు, మావోయిస్టులకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్నది ఆయన కుటుంబ సభ్యుల ప్రశ్న. ఇదివరకటిలా ఈ కేసు నుంచి కూడా ఆయన నిర్దోషిగా విడుదలవుతారని వారు ఆశిస్తున్నారు. -
నకిలీ ఎన్కౌంటర్లే గుజరాత్ నమూనా
సాక్షి, భోపాల్ : తనను నక్సల్స్‌తో సంబంధాలున్నట్లు రుజువైతే తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సవాలు విసిరారు. అతనపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని, తనను దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు నక్సల్స్‌తో సంబంధాలున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంభిత్ పాత్ర ఇటీవల పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ మంగళవారం మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ సందర్భంగా తనపై చేస్తున్న ఆరోపణలు నిజమైతే తనను వెంటనే అరెస్ట్ చేయాలని కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు. అర్బన్ నక్సల్స్ పేరుతో పలువురు ప్రజా సంఘాల నేతల అరెస్ట్‌లపై ఆయన స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసుకునే గుజరాత్ నమూనా పాలన అంటే ఇదేనని వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్లో నకిలీ ఎన్కౌంటర్లు జరిపారని.. మోదీని హత్యచేస్తారన్న అర్బన్ నక్సల్స్‌పై ఆరోపణలు కూడా నకిలీవే అని అన్నారు. -
వాళ్లు సాక్షులా..??!
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల దేశంలోని ఆరు నగరాల్లో పుణె పోలీసులు దాడులు నిర్వహించి, పది మంది సామాజిక కార్యకర్తల ఇళ్లలో సోదాలు నిర్వహించి వారిలో ఐదుగురిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు అనుసరించిన తీరు చూస్తుంటే చట్టం గురించి అంతో ఇంతో తెలిసిన ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ విషయాలు తెలిసి.. పోలీసు వర్గాలే ఆశ్చర్యపోయినా ఆశ్చర్యపోవాల్సింది లేదు! సామాజిక కార్యకర్తల ఇళ్ల సోదాల సందర్భంగా, వారి అరెస్ట్‌ల సందర్భంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 41 బీ సెక్షన్ ప్రకారం కుటుంబసభ్యుల్లో ఒకరు లేదా స్థానికంగా పలుకుబడి కలిగిన వ్యక్తి ఎవరైనా సాక్షిగా సంతకం చేయడం తప్పనిసరి. అయితే ఆగస్టు 28వ తేదీన ఐదుగురు సామాజిక కార్యకర్తల అరెస్ట్ సందర్భంగా పంచనామా లేదా అరెస్ట్ ధ్రువపత్రంపై, స్వాధీన వస్తువల జాబితా పత్రాలపై పుణె మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ ప్యూన్, ఓ క్లర్క్, ప్రభుత్వ బీజే వైద్య కళాశాలకు చెందిన ఓ క్లర్క్, ఓ టెక్నీషియన్లతోపాటు ఎక్కడ పనిచేస్తారో కూడా తెలియని మరో నలుగురు యువకులు సంతకాలు చేశారు. పుణెకు చెందిన వీరంతా పుణె పోలీసులతోపాటు వచ్చిన సాక్షులు. అరెస్టైన ఐదుగురు సామాజిక కార్యకర్తల్లో ఒకరైన గౌతమ్ నవ్లేఖ విడిగా వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఇటీవల ఢిల్లీ హైకోర్టు సాక్షుల అంశాన్ని అండర్లైన్ చేసుకుంది. పుణె పోలీసులు తమ వెంట తీసుకొచ్చిన కేసు పత్రాలు, కేసుకు సంబంధించిన నోటీసులు అన్ని కూడా మరాఠీ భాషలోనే ఉన్నాయి. చట్టం ప్రకారం నిందితులకు తెల్సిన బాషలోనే అవి తర్జుమా అయి ఉండాలి. ఇలా సాక్షులను వెంట తీసుకెళ్లడం తమకు కొత్త కాదని, తాము మహారాష్ట్రలో ఈ పద్ధతిని ఎప్పటి నుంచో పాటిస్తున్నామని పుణె పోలీసు జాయింట్ కమిషనర్ శివాజీ బోడఖే వ్యాఖ్యానించారు. తాము సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులనే సాక్షులుగా ఎంపిక చేసుకుంటామని, వారికైతే కేసు పట్ల, విచారణ పట్ల అవగాహన ఉంటుందని అన్నారు. ఇలాంటి సాక్షులు చట్టవిరుద్ధమని నిందితుల తరఫు న్యాయవాది కామిని జైస్వాల్ చెప్పారు. పోలీసులు తెచ్చుకునే సాక్షులు వారి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగే అవకాశం ఉంటుందని, పోలీసుల ఏజెంట్లుగా వ్యవహరించే వాళ్లు నిందితుల పక్షాన ఎలా సాక్షులుగా నిలుస్తారని ప్రశ్నించారు. వీరే సాక్షులు ఫరీదాబాద్‌లో మానవ హక్కుల న్యాయవాది సుధా భరద్వాజ్‌ను అరెస్ట్ చేసినప్పుడు పుణె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విశ్వరామ్బాగ్ వార్డు ఆఫీసులో పనిచేస్తున్న రవిదాస్ థానే అనే జూనియర్ క్లర్క్, అదే ఆఫీసులో పనిచేస్తున్న ప్యూన్ హర్షాల్ కదమ్ సాక్షులుగా వ్యవహరించారు. ఇద్దరు ఉద్యోగులను సాక్షులుగా పంపించాలంటూ పుణె పోలీసు కమిషనర్ కార్యాలయం నుంచి తమ కార్యాలయానికి ఓ లేఖ వచ్చిందని, అందుకని తమను పంపించారని హర్షాల్ కదమ్ తెలిపారు. ఇంతకుముందు కూడా రెండు, మూడుసార్లు పోలీసులు సాక్షిగా పిలిస్తే వెళ్లానని, అయితే పుణె దాటి బయటకు రావడం మాత్రం ఇదే మొదటి సారని ఆయన చెప్పారు. వరవర రావు అరెస్ట్ సందర్భంగా.... విరసం సభ్యుడు, రచయిత వరవర రావు అరెస్ట్ సందర్భంగా పంచనామా పత్రంలో పుణె వాసులైన గజేంద్ర కాంబ్లే (49), అల్తాఫ్ భగవాన్ (51)లను సాక్షులుగా చూపారు. వారు ఉద్యోగం చేస్తున్నారని ఉన్నది కానీ ఎక్కడ, ఏం చేస్తున్నారో వివరాలు లేవు. పంచనామాపై వరవర రావు మేనల్లుడు ఎన్. వేణుగోపాల్ సంతకం చేశారు. అయితే ఎవరి ఇళ్లయితే సోదా చేశారో వారికి మరాఠీ రాదనే వ్యాఖ్యం రాసి ఆయన సంతకం చేసినట్లు ఉంది. ఏడు పేజీల పంచనామాపై ప్రతి పేజీలో పోలీసులు సంతకాలు చేశారు. ఒక్క ఏడో పేజీలోనే వరవర రావు భార్య హేమలత సంతకం తీసుకున్నారు. పోలీసులు మోసం చేయదల్చుకుంటే లోపలి ఆరు పేజీలు మార్చుకోవచ్చన్నమాట. వరవర రావు అల్లుడు, సీనియర్ జర్నలిస్ట్ కేవీ కూర్మనాథ్ ఇంటి సోదా సందర్భంగా పుణె వాసులైన జగదీశ్ ఎల్వేకర్, భజరంగ్ ధాల్వేలను పోలీసులు సాక్షులుగా చూపారు. తన ఇంట్లో రెండు వేల పుస్తకాలుండగా, వాటిలో 40 పుస్తకాలనే ఏరి పోలీసులు తీసుకెళ్లారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికే పోలీసులు ఇలా వ్యవహరించారని కూర్మనాథ్ మీడియాతో వ్యాఖ్యానించారు. రాంచీలో సోదా సందర్భంగా రాంచీలో సామాజిక కార్యకర్త స్థాన్ స్వామి ఇంటి సోదా సందర్భంగా సాక్షులుగా ప్రభుత్వ బీజే వైద్య కళాశాల ఆస్పత్రిలో సీనియర్ క్లర్క్‌గా పనిచేస్తున్న నంద్కిషోర్ అగార్కర్ (57), ససూన్ ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మోహన్ గినులే (56)లను చూపారు. గౌతమ్ అరెస్ట్ సందర్భంగా జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌతమ్‌ను ఢిల్లీలో అరెస్ట్ చేసినప్పుడు రాందాస్ షెల్కే (34), అప్పారావు రాథోడ్ (27)లను సాక్షులుగా చూపారు. వారిని కూడా పుణె వాసులుగా పేర్కొన్నారుగానీ వారికి సంబంధించి ఎలాంటి వివరాలు లేవు. మిగతావారి అరెస్ట్‌ల సందర్భంగా కూడా పుణె వాసులనే సాక్షులుగా చూపారు. చడవండి: వరవర రావు తదితరులు విడుదలయ్యేనా? -
మోదీకి ‘పనికొచ్చే మూర్ఖులు’
ముస్లింను శత్రువుగా చిత్రించే అసలు ఫార్ములా పాతబడింది. అందుకే దేశ ఉనికికి ముప్పు కలిగించే మరో శత్రువును ‘కనిపెట్టాల్సిన’ అవసరం ఏర్పడింది. మావోయిస్టుల్ని అలా చూపించవచ్చు. వారికి ఇస్లామిక్ తీవ్రవాదంతో సంబంధం అంటగడితే మరీ మంచిది. ఉద్యోగాలు అడిగే యువతను ‘అవతల దేశం నాశనం చేయడానికి కుట్ర జరుగుతుంటే ఇలాంటివి అడుగుతారా... మీ దేశభక్తి ఏమైంద’ని ప్రశ్నిస్తే సరి! అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ సాధించింది అంతంత మాత్రమే. నిజంగా ప్రమాదకరమైన శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కనపడుతూ మళ్లీ గెలిపించమని ప్రజలను కోరడం ఒక్కటే బీజేపీ ముందున్న మార్గం. జనం కూడా శక్తిమంతమైన శత్రువును ‘చూపిస్తే’ పాలకపక్షం వైఫల్యాన్ని మన్నిస్తారు. బోల్షివిక్ విప్లవం సమయంలో తమకు అనుకూలంగా మాట్లాడే కమ్యూనిస్టులు కాని నవ ఉదారవాదులను సోవి యెట్ విప్లవ నేత లెనిన్ ‘పనికొచ్చే మూర్ఖులు’ అని పిలిచేవారని చెబు తారు. ఇండియాలో గత రెండు దశాబ్దాలుగా పట్టణప్రాంతాలకు చెందిన వామపక్ష, ఉదారవాద మేధావులను హిందుత్వ మద్దతుదారులైన బుద్ధిజీవులు ఇలాగే (యూజ్‌ఫుల్ ఇడియట్స్) పిలుస్తున్నారు. వారికి ‘అర్బన్ నక్సల్స్’ అనే కొత్త పేరు పెట్టడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం పాక్షిక విజయమే సాధించింది. వారు అర్బన్ నక్సల్సా, కాదా అనే విషయం పక్కన పెడితే, ఈ మేధావులను బీజేపీ/ఆరెస్సెస్ పనికొచ్చే మూర్ఖులు అనడం సబబేనని ఇప్పుడందుతున్న సమాచారం చెబుతోంది. అయితే ‘గొప్ప భారత విప్లవానికి’ వారు పనికొచ్చే మూర్ఖులు కాదు. వారిలో అతికొద్ది మంది మాత్రమే ఇంకా రెండు మూడు కేంద్ర విశ్వ విద్యాలయాలకే పరిమితమై కనిపిస్తున్నారు. అలాగే, బస్తర్ వంటి ఆదివాసీలు నివసించే ఒకట్రెండు అటవీ ప్రాంతాల్లో కొద్దిమంది మరింత ప్రమాదకరమైన రీతిలో ఉంటున్నారు. ఇలాంటి చోట్ల వారు బీజేపీకి ఉపయోగపడే మూర్ఖులుగా కనిపిస్తున్నారు. పట్టణ నక్సల్ లేదా గ్రామీణ నక్సల్ అంటూ ఎవరూ ఉండరు. నక్సలైట్ నక్సలైటే గాక మావో యిస్టు కూడా. అలా ఉండటం ఏమీ నేరం కాదు. ఎలాంటి నమ్మకాలున్నా, ఆ విశ్వాసాల గురించి బహిరంగంగా ప్రకటించినా ఏ చట్టంగాని, చట్టవ్యతి రేక కార్యకలాపాల నిరోధక చట్టంగాని ఎవరినీ భారత జైళ్లలో పెట్టలేవు. కశ్మీర్‌ను ఇండియా చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకుందని లేదా మన ప్రజాస్వామ్యం బూటకమని మీరు బాహాటంగా చెప్పవచ్చు. అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ సాధించింది అంతంత మాత్రమే. నిజంగా ప్రమాదకరమైన శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తు న్నట్టు కనపడుతూ మళ్లీ గెలిపించమని ప్రజలను కోరడం ఒక్కటే బీజేపీ ముందున్న మార్గం. జనం కూడా శక్తిమంతమైన శత్రువును ‘చూపిస్తే’ పాల కపక్షం వైఫల్యాన్ని మన్నిస్తారు. దేశాన్ని కాపాడటానికి ఓటేస్తారు. అందుకే 1984లో సిక్కు ఉగ్రవాదాన్ని దృష్టిలో పెట్టుకుని ‘రాజీవ్గాంధీకా ఎలాన్/నహీ బనేగా’ అనే నినాదం కాంగ్రెస్‌ను గెలి పించింది. ముస్లింను శత్రువుగా చిత్రించే కాషాయపక్షం అసలు ఫార్ములా పాతబడిపోయింది. ముస్లిం అంటే పాకిస్థాన్–అంటే కశ్మీర్ వేర్పాటువాది–అంటే ఉగ్ర వాది–అంటే లష్కరే తోయిబా/అల్‌కాయిదా/ ఐసిస్ అనే సూత్రంతో వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రాగలమన్న విశ్వాసం బీజేపీకి లేదు. అదీగాక, హిందువులం దరూ కులం వంటి అంశాలను విస్మరించి ముస్లిం లంటే భయపడిపోయే పరిస్థితుల్లో లేరు. ముస్లింలపై వ్యతిరేకత కొనసాగేలా చేయ డానికి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉండేలా చూస్తూ, పాక్ సైనికులపై మెరుపు దాడులు చేయడం అంత తేలిక కాదు. పాక్‌పై భారత్ విరుచుకుపడితే దాన్ని ఆదుకోవడానికి చైనా సిద్ధంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆధారపడే పరిస్థితి లేదు. కాబట్టి, భారతదేశ ఉనికికి ముప్పుగా కనిపించే మరో శత్రువును కనిపెట్టాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. మావోయిస్టులను అలా చూపించవచ్చు. ఇస్లామిక్ తీవ్రవాదంతో వారికి సంబంధం అంటగడితే మరీ మంచిది. ఇలా చేశాక ‘దేశాన్ని నాశనం చేయడానికి కుట్ర జరుగుతుంటే మీరు ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడుతున్నారు. మీ దేశభక్తి ఏమైంది’ అంటూ పాలకపక్షం నేతలు ప్రశ్నించే అవకాశం ఉంది. 1980ల ఆఖరులో రాజీవ్‌గాంధీ పలుకు బడి తగ్గిపోయాక ‘కులం వల్ల విడిపోయిన ప్రజ లను కలపడానికి మతాన్ని బీజేపీ ఉపయోగించు కోగలదా?’ అనే ప్రశ్న తలెత్తింది. అయోధ్యతో ఎల్‌కె ఆడ్వాణీ ఆ పనిచేశారు. 2004 ఎన్నికలనాటికి బీజే పీకి జనాదరణ తగ్గిపోయింది. పదేళ్ల తర్వాత నరేంద్రమోదీ బీజేపీని గెలిపించారు. ఆయన వ్యక్తిగత విజయాలు, జనాకర్షణ శక్తి హిందూ ఓటర్లను ఆకట్టుకున్నాయి. బలమైన సర్కారు, వికాసం అందిస్తానన్న వాగ్దానం ఆచరణలో సాధించింది సగమే. అందుకు పాలకపక్షానికి కొత్త శత్రువు అవసరమైంది. ముస్లింలకు మావోయిస్టులను కలపడం ద్వారా 2019 ఎన్నికల్లో విజయం సాధించాలని పాలకపక్షం భావిస్తోంది. ‘దేశం తీవ్ర ప్రమాదంలో ఉంద’నే ప్రచారంతో ఈ ఎన్నికల్లో గెలవాలని ఆశిస్తోంది. మావోయిస్టు అనే ఒక్క మాటతోనే ప్రజలను భయపెట్టి కాషాయపక్షంవైపునకు మళ్లించడం కుదరని పని. కాలేజీల్లో ఏమాత్రం ప్రమాదకరంగా కనిపించని మావోయిస్టులను మనం చూశాం. అయితే, నక్సలైట్లు ఆయుధాలతో తిరుగుతారు కాబట్టి వారిని చూస్తే భయమేస్తుంది. కాని, మనకు వారు కనపడరు. టీవీ స్క్రీన్లు, ట్విటర్లో కూడా కనిపించరు. నక్సల్స్ పేరుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో జనాన్ని బెదరగొట్టలేం. అందుకే అర్బన్ నక్సల్ అనే ప్రాణి పుట్టుకొచ్చింది. రెండున్నరేళ్ల క్రితం ఢిల్లీ జేఎన్‌యూలో జరిగిన ఘటనలు ఇక్కడ ప్రస్తావించాలి. వామపక్ష మేధావులు అభిమానించే ఉర్దూ కవి ఆగా షాహీద్ అలీ స్మారక కార్యక్రమం సందర్భంగా అప్పుడు కశ్మీర్ స్వాతంత్య్రంపై చర్చించి, మద్దతు ఇచ్చే విషయంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ‘భారత్ ముక్కలు ముక్కలవుతుంది, ఇన్షాల్లా– ఇన్షాల్లా’ అని కొందరు యువకులు నినాదాలు చేస్తున్నట్టు చూపే వీడియో హఠాత్తుగా ప్రత్యక్షమైంది. దీంతో ఇద్దరు వామపక్ష విద్యార్థినేతలను (వారిలో ఒకరు ముస్లిం) అరెస్ట్ చేసి, వారిపై రాజద్రోహం వంటి కేసులు బనాయించారు. మరిన్ని వీడియోలు పుట్టుకొచ్చాయి. కశ్మీర్‌కు స్వాతంత్య్రం కావాలని డిమాండ్ చేస్తున్న తన విద్యార్థులను ప్రశంసిస్తూ ఓ మహిళా ప్రొఫెసర్ మాట్లాడుతున్న మరో వీడియో దర్శనమిచ్చింది. ఇండియాను ముక్కలు ముక్కలు చేయడానికి దేశవ్యతిరేక ముస్లింలతో తీవ్రవాద, వామపక్ష మేధావులు చేతులు కలిపారనే కొత్త సిద్ధాంతానికి ఇలా రూపకల్పన జరిగింది. కశ్మీర్, బస్తర్ సంక్షోభాలను న్యూఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పుణె నగరాల్లోని ఈ శక్తులు కుమ్మక్క య్యాయని, ఢిల్లీలోని జేఎన్‌యూ ఈ కార్యకలా పాలకు కేంద్రస్థానమైందనే ప్రచారం చేశారు. దీనికితోడు కశ్మీరీ వేర్పాటువాదం గురించి మాట్లాడటం ద్వారా తీవ్రవాద వామ పక్ష మేధావులు పరోక్షంగా, సర్కారీ అనుకూల టీవీ చానళ్లు ప్రత్యక్షంగా పాలపక్ష కొత్త ప్రచార వ్యూహం విజయవంతమయ్యేలా చేశాయి. నేడు అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఇస్లామిక్ తీవ్రవాదం అంతం చేస్తుందని, పూర్వపు సోవియెట్ యూనియన్ వల్లకాని అనేక పనులు దీనివల్ల పూర్తవుతాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్షాలు నమ్ముతున్నాయి. ఇండియాలో కూడా ఇలాంటి ఆశలున్నవారు లేకపోలేదు. ఆయుధాలు పట్టిన కశ్మీరీలను, బస్తర్ ఆది వాసీలను ప్రభుత్వ సాయుధ బలగాలు చంపేస్తుంటే మాట్లాడేవారు లేరు. భారత సర్కారుతో ఎవరు పోరుకు తలపడినా మనవంటి కొద్దిమంది మేధా వులు మాత్రమే అందుకు ‘మూల కారణాల’ గురించి ఆలోచిస్తారు. కుట్ర పేరుతో ప్రభుత్వం అరెస్టు చేసిన హక్కుల నేతలు కూడా ఈలోగా కోర్టుల జోక్యంతో విడుదలవుతారు. ఫలితంగా మోదీ సర్కారు నైతికంగానే గాక కోర్టుల్లో కూడా ఈసారి ఓడిపోతుంది. అయినా పాలక పక్షం దిగులుపడదు. ఇది ఇప్పటికిప్పుడు పూర్తి చేయాల్సిన ‘ఆపరేషన్ రెడ్ హంట్’ కాదు. అందుకే ప్రభుత్వ ప్రచార వ్యూహంలో తమకు తెలియకుండానే భాగమైన వామపక్ష మేధావులు చివరికి పాలకపక్షానికి లెనిన్ చెప్పినట్టు ‘పనికొచ్చే మూర్ఖులు’గా మారినట్టవుతుంది. - శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
‘వారిని అరెస్ట్ చేస్తే దేశంలోని జైళ్లు సరిపోవు’
సాక్షి, న్యూఢిల్లీ : మవోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవల పలువురు ప్రజా సంఘాల నేతలను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. విరసం నేత వరవరరావుతో సహా అరెస్ట్‌యిన వారిని అర్బన్ నక్సలైట్స్ అని పోలీసులు వ్యాఖ్యానించడంతో కొందరు ‘మీటూ అర్బన్ నక్సల్’ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్యాగ్స్ చేశారు. దీనిపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వారిపై పలు వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సల్ పేరుతో వారిన అరెస్ట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘పోలీసులు వారిని మాత్రమే అరెస్ట్ చేయగలరు. వారి ఆలోచనలను అరెస్ట్ చేయలేరు. ఆ విధంగా ఆలోచించే ప్రజలను కూడా అరెస్ట్ చేస్తే దేశంలో ఉన్న జైళ్లు సరిపోవు. జాతిపిత మహాత్మ గాంధీని ఈ దేశంలో హత్య చేశారు. గాంధీని హత్య చేసిన వారే నేడు అధికారంలో ఉన్నారు. వారిని అరెస్ట్ చేయగలమా?’’ అని ప్రశ్నించారు. దేశ సంపదను కాజేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, చోక్సీలను ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుందని ఆమె ప్రశ్నించారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ప్రజా సంఘాల నేతలను మాత్రం ప్రభుత్వం కుట్ర పూరితంగా అణచివేస్తోందని అన్నారు. ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా బీమా-కోరేగావ్ ఘటనతో వారికి ఎలాంటి సంబంధం లేదని, ప్రధాని హత్యకు వారు ప్రయత్నించారన్న వార్త తనకు వింతగా అనిపించిందని స్వర భాస్కర్ వ్యాఖ్యానించారు. -
ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!!
‘బాత్రూంకి వెళ్తాననడంతో ఓ వ్యక్తి నా వెనకాలే వచ్చాడు. తలుపు తెరిచే ఉంచాలంటూ నాకు చెప్పాడు. అదే విధంగా నా భార్య పవన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తూ... మీ భర్త దళితుడు. మీరేమో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. మరి మీరెందుకు సంప్రదాయాలు పాటించరు? మంగళ సూత్రం ఎందుకు ధరించరు? కమ్యూనిస్టు అయితే కావచ్చు గానీ హిందూ సంప్రదాయాలు పాటించాలి కదా’ - ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ సాక్షి, హైదరాబాద్ : భీమా- కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో.. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతలను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మేధావులు.. ప్రభుత్వం, పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పౌరహక్కుల నేతలపై అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్లో ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వరవరరావు అల్లుడు, ఇఫ్లూ(ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ) ప్రొఫెసర్ సత్యనారాయణ.. తన ఇంట్లో సోదాలు చేసిన సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అది అరెస్టు వారెంటు కాదు.. మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ పుణె నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్‌లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కూతురు పవన, అల్లుడు సత్యనారాయణ ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ విషయం గురించి సత్యనారాయణ మాట్లాడుతూ... వరవరరావుకు అల్లుడినైన నేరానికే పోలీసులు తన పట్ల ఈ విధంగా ప్రవర్తించారేమో అంటూ సోదాలు నిర్వహించిన తీరును మీడియాకు వివరించారు. ‘ ఆరోజు(మంగళవారం) ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయంలో.. సుమారు 20 మంది పోలీసులు (10 మంది మహారాష్ట్ర, 10 మంది తెలంగాణ పోలీసులు)ఇఫ్లూ స్టాఫ్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మరాఠీ భాషలో ఉన్న ఓ కాగితాన్ని సర్చ్ వారెంట్ అంటూ నా చేతిలో పెట్టి ఇంట్లోకి వచ్చి, సోదాలు మొదలుపెట్టారు. ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ కట్ చేశారు. మా దగ్గర ఉన్న మొబైల్స్, ల్యాప్టాప్స్ తీసేసుకున్నారు. ఈ- మెయిల్ ఐడీలు బ్లాక్ చేశారు. అయితే పోలీసులు నాకు ఇచ్చింది సెర్చ్ వారెంట్ కాదని, ఓ పోలీసు ఉన్నతాధికారి రాసి ఇచ్చిన స్టేట్మెంట్ అని తర్వాత తెలిసిందని’ సత్యనారాయణ చెప్పారు. బాత్రూం డోర్ తెరచి ఉంచాలంటూ.. ‘బ్రష్ చేసుకునేందుకు, బట్టలు మార్చుకునేందుకు కూడా అనుమతించలేదు. బాత్రూంకి వెళ్తాననడంతో ఓ వ్యక్తి నా వెనకాలే వచ్చాడు. తలుపు తెరిచే ఉంచాలంటూ నాకు చెప్పాడు. అదే విధంగా నా భార్య పవన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తూ... మీ భర్త దళితుడు. మీరేమో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. మరి మీరెందుకు సంప్రదాయాలు పాటించరు? మంగళ సూత్రం ఎందుకు ధరించరు? కమ్యూనిస్టు అయితే కావచ్చు గానీ హిందూ సంప్రదాయాలు పాటించాలి కదా’ అంటూ తన భార్య పవనను మనోవేదనకు గురిచేశారని సత్యనారాయణ ఆరోపించారు. ఇన్నేళ్ల సర్వీసులో ఒక్క మచ్చ కూడా లేదు.. 30 ఏళ్ల సర్వీసులో తనపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, కేవలం వరవరరావు అల్లుడనే ఒకే ఒక్క కారణం చేత తనను టార్గెట్ చేశారని విమర్శించారు. తనలాంటి అమాయకుల మీద లేనిపోని నిందలు మోపి, గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుంటే ఏ కోర్టులకు కూడా పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నువ్వు మేధావి అవ్వాలని ఎందుకు అనుకున్నావ్. నీ గదిలో అంబేద్కర్, ఫూలే దంపతుల ఫొటోలు ఎందుకున్నాయి. ప్రొఫెసర్‌గా సంపాదిస్తున్నది సరిపోవడం లేదా? మావో సాహిత్యం ఎందుకు చదువుతున్నావ్? వేరే పనులేమీ లేవా అంటూ ఒక ఉగ్రవాదిని ప్రశ్నించినట్లు తనను కూడా ప్రశ్నించారంటూ’ పోలీసుల తీరుపై సత్యనారాయణ మండిపడ్డారు. ఈ ఘటనతో క్యాంపస్ అంతా ఉలిక్కి పడింది. సత్యనారాయణ ఇంట్లో సోదాలు జరపటానికి పోలీసులు రావడంతో క్యాంపస్‌లోని విద్యార్థులంతా భయభ్రాంతులకు గురయ్యారని ఇఫ్లూ ప్రొఫెసర్ సుజాత ముకిరి అన్నారు. సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. -
ట్విట్టర్లో ‘మీటూ అర్బన్ నక్సల్’ ట్రెండింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల కార్యకర్తలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వీరిపై అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో పలువురు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. దీంతో ట్విట్టర్లో ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. తొలుత బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ..‘అర్బన్ నక్సల్స్‌కు మద్దతు ఇస్తున్నవారి జాబితా రూపొందించేందుకు చురుకైన యువతీయువకులు కొందరు నాకు కావాలి. సాయం చేయాలనుకున్నవారు నాకు సందేశం పంపండి’ అని ట్వీట్ చేశారు. దీంతో జర్నలిస్టులు, విద్యార్థులు, హక్కుల కార్యకర్తలు సహా చాలామంది అగ్నిహోత్రిపై మండిపడ్డారు. హక్కుల కార్యకర్తలకు తమ మద్దతును తెలియజేసేందుకు వేలాది మంది ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాగ్‌ట్యాగ్‌ను ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 55,000 మంది ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్వీట్ చేశారు. 128 సంస్థలకు మావోలతో సంబంధాలు! మావోలతో సంబంధాలున్నాయని భావిస్తున్న 128 సంస్థలతో 2012లో యూపీఏ ప్రభుత్వం జాబితా రూపొందించిందని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కొందరు ఆ సంస్థల సభ్యులు ఉన్నారన్నారు. మావోలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో పౌరహక్కుల కార్యకర్తలను అరెస్ట్‌చేయడంతో విమర్శలు వస్తున్న నేపథ్యంలో అధికారులు యూపీఏ నాటి జాబితాను తెర మీదికి తెచ్చారు. ‘మావోయిస్టులతో సంబంధాలున్నాయని భావిస్తున్న 128 సంస్థలను 2012లోనే యూపీఏ ప్రభుత్వం గుర్తించింది. వాటి కోసం పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆనాడే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది. జాబితాలో ఉన్న సంస్థల కోసం పనిచేస్తున్న వారిలో వరవరరావు, సుధా భరద్వాజ్, సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొన్సాల్వెజ్, మహేశ్ రౌత్‌లు కూడా ఉన్నారు’ అని తన వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు.