నకిలీ ఎన్‌కౌంటర్లే గుజరాత్‌ నమూనా | Digvijay Singh Challenge Arrest Me If I Have Links With Naxals | Sakshi
Sakshi News home page

నకిలీ ఎన్‌కౌంటర్లే గుజరాత్‌ నమూనా

Published Wed, Sep 5 2018 10:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Digvijay Singh Challenge Arrest Me If I Have Links With Naxals - Sakshi

దిగ్విజయ్‌ సింగ్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, భోపాల్‌ : తనను నక్సల్స్‌తో సంబంధాలున్నట్లు రుజువైతే తక్షణమే అరెస్ట్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ సవాలు విసిరారు. అతనపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని, తనను దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలకు నక్సల్స్‌తో సంబంధాలున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంభిత్‌ పాత్ర ఇటీవల పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌ సింగ్‌ మంగళవారం మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ సందర్భంగా తనపై చేస్తున్న ఆరోపణలు నిజమైతే తనను వెంటనే అరెస్ట్‌ చేయాలని కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి  సవాలు విసిరారు.

అర్బన్‌ నక్సల్స్‌ పేరుతో పలువురు ప్రజా సంఘాల నేతల అరెస్ట్‌లపై ఆయన స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసుకునే గుజరాత్‌ నమూనా పాలన అంటే ఇదేనని వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్‌లో నకిలీ ఎన్‌కౌంటర్లు జరిపారని.. మోదీని హత్యచేస్తారన్న అర్బన్‌ నక్సల్స్‌పై ఆరోపణలు కూడా నకిలీవే అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement