భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ అధ్యక్షుడు కమల్ నాథ్ మద్దతుదారుల మధ్య వివాదం చెలరేగింది. నేతలు ఒకరిపై మరొకరు కుర్చీలతో కొట్టుకున్నారు. రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అధికార ప్రతినిధి షహర్యార్ ఖాన్, కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాల విభాగం మాజీ అధ్యక్షుడు ప్రదీప్ అహిర్వార్ మధ్య వివాదం చెలరేగింది. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై దిగ్విజయ్ సింగ్‌ని ప్రదీప్ దుర్భాషలాడాడని షహర్వార్ ఖాన్ ఆరోపించారు. కార్యాలయంలోనే నేతలు వాగ్వాదానికి దిగారు. మాటలు తీవ్రస్థాయికి చేరాక ఘర్షణకు దిగారు. కుర్చీలతో కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఇతర నేతలు, సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు.
कमलनाथ जी समर्थक द्वारा दिग्विजय सिंह जी को गाली बकने को लेकर पीसीसी में जमकर चले लात-ठूँसे...
— Narendra Saluja (@NarendraSaluja) January 29, 2024
कुर्सियाँ चली , जमकर एक दूसरे को गालियाँ बकी गई...
बीचबचाव करने आये कमलनाथ समर्थक एक नेता को भी लात-ठूँसें पड़े... pic.twitter.com/wtWQ0sFsWp
మధ్యప్రదేశ్‌లో గత నవంబర్ 17న ఎన్నికలు జరిగాయి. బీజేపీ గణవిజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఉన్న కమల్ నాథ్ సారథ్యంలో దిగ్విజయ్ సింగ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ జాతీయ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ప్రచారంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఈడీ ముందు హాజరైన లాలూ కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment