Kamal Nath
-
బీజేపీలో చేరికపై కమలనాథ్ యూటర్న్..
బీజేపీలో చేరికపై కమలనాథ్ యూటర్న్ తీసుకున్నారు. సోమవారం రాహుల్ గాందీ, మల్లికార్జునతో కమల్ నాథ్ భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని వెల్లడించారు కమల్‌నాథ్. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. పార్టీ వీడనున్న సీనియర్ నేత కమల్‌నాథ్.. కొడుకుతోపాటు బీజేపీలోకి మాజీ సీఎం.. గత రెండు రోజులుగా వినిపిస్తున్న వార్తలివీ.. ఈటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత పార్టీ చీఫ్ పదవి నుంచి తనను తొలగించడంతో అధిష్టానంపై కోపం ఉన్న మాజీ సీఎం కమల్‌నాథ్ తన కుమారుడు నకుల్‌నాథ్‌తో కలిసి బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి తోడు రాష్ట్రం నుంచి రాజ్యసభకు అవకాశం ఇస్తారనుకుంటే కమల్‌నాథ్‌కు హస్తం మొండిచేయి చూపడంతో ఆయన మరింత అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తాజాగా కమల్‌నాథ్ పార్టీ వీడటంపై క్లారిటీ వచ్చింది. సోమవారం రాహుల్ గాందీ, మల్లికార్జున కమల్ నాథ్‌తో భేటీ అయి బుజ్జగించారు. దీంతో బీజేపీలో చేరికపై కమలనాథ్ యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని వెల్లడించారు. అంతకముందే కమల్‌నాథ్ ఏ పార్టీలో చేరడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్ ఆదివారం సాయంత్రం వెల్లడించారు. ప్రస్తుత మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ‘'ఇది కమల్‌నాథ్‌పై జరిగిన కుట్ర. నేను ఆయనతో మాట్లాడాను. ఇవన్నీ వదంతులు మాత్రమేనని, తాను కాంగ్రెస్ వ్యక్తినని, కాంగ్రెస్ వ్యక్తిగా కొనసాగుతానని.. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ భావజాలాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ఇది ఆయన సొంత ఆలోచనలు, ఆయనే ఇదంతా చెప్పారు’ అని వెల్లడించారు. చదవండి: చండీగఢ్ మేయర్ రాజీనామా ఆసక్తికరంగా రాజకీయాలు -
ఉత్కంఠ.. కమల్‌నాథ్‌కు మద్దతుగా ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
భోపాల్: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా?. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, అతని కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్‌తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు గుప్పు మంటున్నాయి. ఈ క్రమంలో కమల్‌నాథ్ వర్గం ఎమ్మెల్యేలు కొందరు ఆదివారం ఢిల్లీకి చేరుకోవడంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లోని రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. వీరంతా పార్టీ హైకమాండ్ ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, కమల్‌నాథ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడరంటూ తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. ‘ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు భయపడి ఆయన పార్టీ మారే వ్యక్తి కాదని.. అవన్నీ ఊహాగానాలే అంటూ కొట్టిపారేశారు. కాగా, కమల్‌నాథ్‌కు మాజీ మీడియా సలహాదారు, ప్రస్తుత బీజేపీ అధికార ప్రతినిధి అయిన నరేంద్ర సలూజా.. కమల్‌నాథ్, ఆయన కుమారుడు, ఛింద్వారా కాంగ్రెస్ ఎంపీ నకుల్‌నాథ్‌లతో దిగిన భోపాల్‌లో దిగిన ఒక ఫొటోను ‘ఎక్స్’లో పోస్ట్‌చేసి దానికి ‘జై శ్రీరామ్’ అని ట్వీట్‌చేశారు. దీంతో తండ్రీకొడుకులు కమలం గూటికి చేరుకుంటున్నారని వార్తలు మొదలయ్యాయి. వీటికి బలం చేకూరుస్తూ నకుల్‌నాథ్ తన ‘ఎక్స్(పాత ట్విట్టర్)’ ఖాతా వివరాల్లో కాంగ్రెస్ పదాన్ని తొలగించారు. ముందస్తు షెడ్యూల్ లేకుండా హడావుడిగా ఇద్దరూ ఢిల్లీకి వచ్చారు. రాగానే మీడియా కమల్‌ను ప్రశ్నించింది. మీరు పార్టీ మారుతున్నారా? అన్న ప్రశ్నకు ‘‘అలాంటిదేమైనా ఉంటే ముందు మీకే చెబుతా’ అని అన్నారు గానీ పార్టీని వీడట్లేదనే సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. రాజ్యసభ సీటు ఆశించి భంగపడినందుకే కమల్‌నాథ్ పార్టీని వీడుతున్నారని మరో విశ్లేషణ వినిపించింది. బీజేపీలోకి వస్తామంటే ఇప్పుడే మీకు స్వాగతం పలుకుతామని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ శుక్రవారం వ్యాఖ్యానించడం తెల్సిందే. గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు కమల్‌నాథ్ బాధ్యుడని రాహుల్ భావిస్తున్నారని, అందుకే కమల్‌ను తప్పించి జీతూ పట్వారీకి కాంగ్రెస్ మధ్యప్రదేశ్ చీఫ్ పదవి కట్టబెట్టారని వార్తలొచ్చాయి. ఇదీ చదవండి: అత్యంత ప్రజాదారణ కలిగిన సీఎం ఎవరో తెలుసా? -
కమల్‌నాథ్ బాటలో ఎంపీ మనీష్ తీవారీ?
కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ పార్టీ మారబోతున్నారని వర్తాలు వెలువడ్డాయి. ఆయన కాంగ్రెస్‌కు రాజానామా చేసి.. బీజేపీలో చేరుబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ మనీష్ తివారీపై జరుగుతున్న ప్రచారం అసత్యమని ఆయన ఆఫీసు వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఎంపీ మనీష్ తివారీపై జరుగుతున్న పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించింది. అదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. బీజేపీలో చేరి.. లూథియానా స్థానంలో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. ‘మనీష్ పార్టీ మారి బీజేపీలో చేరుతారనేది నిరధారమైన విషయం. ఆయన తన నియోజకవర్గంలో పూర్తి దృష్టి పెట్టారు. గత రాత్రి మనీష్ తివారీ తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు’ అని ఎంపీ కార్యాలయం పేర్కొంది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఆయన కుమారుడు నకుల్, ఇతర ఎంపీలు కూడా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కూడా పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ మీద వచ్చిన ప్రచారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ఖండించారు. కమల్‌నాథ్‌పై జరుగుతున్న ప్రచారం నిరాధారమైందని స్పష్టం చేశారు. కనీసం కలలో కూడా కమల్‌నాథ్ బీజేపీలో చేరరని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేత కమల్ నాథ్, తన కొడుకు నకుల్‌తో శనివారం ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా బీజేపీలో చేరుతారని పెద్ద ఎత్తున జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బీజేపీ పార్టీలో చేరటం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. ఇక.. కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ లోక్‌సభ ఎన్నికల్లో తగిన ప్రభావం చూపలేకపోతుందని రాజకీయా విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
నేడు మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో భారీ మార్పులు?
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయని సమాచారం. దానికి నేటి నుంచే శ్రీకారం పడేలా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, అతని కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్‌తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు గుప్పు మంటున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ నష్టం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, అతని కుమారుడు ఎంపీ నకుల్‌నాథ్ ఆదివారం (ఫిబ్రవరి 18) బీజేపీలో చేరవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కమల్‌నాథ్, నకుల్‌నాథ్‌లు బీజేపీలో చేరవచ్చనే వార్తలు గుప్పుమంటున్నాయి. కమల్‌నాథ్, ఆయన కుమారుడు నకుల్‌నాథ్ బీజేపీలో చేసే కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా హాజరుకానున్నారు. కమల్ నాథ్ తనయుడు నకుల్ నాథ్ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ బయో నుండి కాంగ్రెస్ పేరును తొలగించారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై కమల్ నాథ్ ఆందోళన చెందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. కమల్‌నాథ్‌కు కంచుకోటగా పేరుగాంచిన చింద్వారాలో ఇది జరిగింది. నకుల్‌నాథ్ గట్టిపోటీ ఎదుర్కొన్నాక విజయం సాధించారు. కమల్‌నాథ్ తొమ్మిది సార్లు ఎంపీగా పని చేశారు. ఆయన కుమారుడు నకుల్ నాథ్ 2019 ఎన్నికల్లో లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. -
‘కమలం’ చెంతకు కమల్‌నాథ్?
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలాంటిదేమీ లేదని కమల్‌నాథ్ ఆ వార్తలను కొట్టిపారేశారు. అయితే శనివారం జరిగిన పరిణామాలు చూస్తుంటే ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషణలు వినవచ్చాయి. అసలేం జరిగింది? కమల్‌నాథ్‌కు మాజీ మీడియా సలహాదారు, ప్రస్తుత బీజేపీ అధికార ప్రతినిధి అయిన నరేంద్ర సలూజా.. కమల్‌నాథ్, ఆయన కుమారుడు, ఛింద్వారా కాంగ్రెస్ ఎంపీ నకుల్‌నాథ్‌లతో దిగిన భోపాల్‌లో దిగిన ఒక ఫొటోను ‘ఎక్స్’లో పోస్ట్‌చేసి దానికి ‘జై శ్రీరామ్’ అని ట్వీట్‌చేశారు. దీంతో తండ్రీకొడుకులు కమలం గూటికి చేరుకుంటున్నారని వార్తలు మొదలయ్యాయి. వీటికి బలం చేకూరుస్తూ నకుల్‌నాథ్ తన ‘ఎక్స్(పాత ట్విట్టర్)’ ఖాతా వివరాల్లో కాంగ్రెస్ పదాన్ని తొలగించారు. ముందస్తు షెడ్యూల్ లేకుండా హడావుడిగా ఇద్దరూ ఢిల్లీకి వచ్చారు. రాగానే మీడియా కమల్‌ను ప్రశ్నించింది. మీరు పార్టీ మారుతున్నారా? అన్న ప్రశ్నకు ‘‘ అలాంటిదేమైనా ఉంటే ముందు మీకే చెబుతా’ అని అన్నారుగానీ పార్టీని వీడట్లేదనే సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. రాజ్యసభ సీటు ఆశించి భంగపడినందుకే కమల్‌నాథ్ పార్టీని వీడుతున్నారని మరో విశ్లేషణ వినిపించింది. బీజేపీలోకి వస్తామంటే ఇప్పుడే మీకు స్వాగతం పలుకుతామని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ శుక్రవారం వ్యాఖ్యానించడం తెల్సిందే. గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు కమల్‌నాథ్ బాధ్యుడని రాహుల్ భావిస్తున్నారని, అందుకే కమల్‌ను తప్పించి జీతూ పట్వారీకి కాంగ్రెస్ మధ్యప్రదేశ్ చీఫ్ పదవి కట్టబెట్టారని వార్తలొచ్చాయి. అన్నీ అసత్యాలు : జీతూ పట్వారీ ఇలాంటి వార్తలను కాంగ్రెస్ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు జీతూ పటా్వరీ తోసిపుచ్చారు. ‘‘ కాంగ్రెస్‌తో కమల్‌నాథ్ బంధం ఈనాటిది కాదు. ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీతో కలిసి డెహ్రాడూన్ డూన్ స్కూల్లో చదివారు. ఒకానొక సమయంలో కమల్ నా మూడో కుమారుడు అంటూ స్వయంగా ఇందిరగాం«దీనే వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్‌ను వీడుతారా?’’ అని మీడియానే పట్వారీ నిలదీశారు. ‘‘రాజ్యసభ సీటు ఇవ్వలేదన్నది అవాస్తం. నిజానికి ఆ స్థానం కోసం నామినేషన్ వేసిన పార్టీ కోశాధికారి అశోక్‌సింగ్ పేరును బలపరిచింది కమల్‌నాథే’’ అని పటా్వరీ వివరణ ఇచ్చారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో అనుబంధమున్న కమల్ ఛింద్వారా నుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచారు. 2019లో ఆ స్థానం నుంచి కమల్ కుమారుడు నకుల్ గెలిచారు. ఈ ఒక్కస్థానం తప్ప రాష్ట్రంలోని మిగతా 28 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. -
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్!
-
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్‌నాథ్ పార్టీని వీడనున్నట్టు సమాచారం. ఆయన కుమారుడు ఎంపీ నకుల్‌నాథ్‌తో కలిసి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా ఈ కథనాలు వెలువడుతున్నప్పటికీ తాజాగా.. నకుల్ నాథ్ తన ట్వీటర్ బయో నుంచి కాంగ్రెస్ పేరును తొలగించారు. దీంతో తండ్రీ, కుమారులిద్దరూ బీజేపీలోకి వెళ్లడం దాదాపు ఖాయమైందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కమల్‌నాథ్, నకుల్‌నాథ్‌లు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడటంతో దీంతో ఆ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ క్రమంలో మధ్య ప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఇదీ చదవండి: రాహుల్, ప్రియాంక మధ్య విబేధాలు? బీజేపీ సందేహం వెనుక ఏముంది? -
Video: పార్టీ కార్యాలయంలోనే కాంగ్రెస్ నేతల ఘర్షణ
భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ అధ్యక్షుడు కమల్ నాథ్ మద్దతుదారుల మధ్య వివాదం చెలరేగింది. నేతలు ఒకరిపై మరొకరు కుర్చీలతో కొట్టుకున్నారు. రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికార ప్రతినిధి షహర్యార్ ఖాన్, కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాల విభాగం మాజీ అధ్యక్షుడు ప్రదీప్ అహిర్వార్ మధ్య వివాదం చెలరేగింది. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై దిగ్విజయ్ సింగ్‌ని ప్రదీప్ దుర్భాషలాడాడని షహర్వార్ ఖాన్ ఆరోపించారు. కార్యాలయంలోనే నేతలు వాగ్వాదానికి దిగారు. మాటలు తీవ్రస్థాయికి చేరాక ఘర్షణకు దిగారు. కుర్చీలతో కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఇతర నేతలు, సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. कमलनाथ जी समर्थक द्वारा दिग्विजय सिंह जी को गाली बकने को लेकर पीसीसी में जमकर चले लात-ठूँसे... कुर्सियाँ चली , जमकर एक दूसरे को गालियाँ बकी गई... बीचबचाव करने आये कमलनाथ समर्थक एक नेता को भी लात-ठूँसें पड़े... pic.twitter.com/wtWQ0sFsWp — Narendra Saluja (@NarendraSaluja) January 29, 2024 మధ్యప్రదేశ్‌లో గత నవంబర్ 17న ఎన్నికలు జరిగాయి. బీజేపీ గణవిజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఉన్న కమల్ నాథ్ సారథ్యంలో దిగ్విజయ్ సింగ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ జాతీయ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ప్రచారంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఈడీ ముందు హాజరైన లాలూ కుమారుడు -
మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా జితూ పట్వారీ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో పీసీసీ చీఫ్ కమల్ నాథ్‌కు అధిష్టానం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో జితూ పటా్వరీకి బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ చీఫ్ ఖర్గే శనివారం ఆదేశాలిచ్చారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లలో విజయం సాధించగా, కాంగ్రెస్‌కు 66 సీట్లే దక్కిన సంగతి తెలిసిందే. -
MP: కమల్ నాథ్‌ను తప్పించిన కాంగ్రెస్
బోఫాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్(77)ను తప్పించింది ఆ పార్టీ అధిష్టానం. కొత్త చీఫ్‌గా జీతూ పట్వారీ(50) పేరును ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే శనివారం సాయంత్రం ప్రకటించారు. జీతూ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని, కమల్ నాథ్ ఇంతకాలం అందించిన సేవలు ప్రశంసనీయమని ఆయన తెలిపారాయన. ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కమల్ నాథ్ రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ, అది జరగలేదు. ఇప్పుడు ఆయన్ని తప్పించి ఆ బాధ్యతల్ని.. మాజీ మంత్రి అయిన జీతూ పట్వారీకి అప్పజెప్పారు. రాహుల్ గాంధీతో జీతూ పట్వారీ (ఫైల్ ఫొటో) జీతూ పట్వారీ తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో కొత్త రక్తం ఎక్కించే క్రమంలోనే ఓడిపోయినా.. జీతూనే పార్టీ చీఫ్‌గా అధిష్టానం ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. -
ఎంపీసీసీ చీఫ్ పదవికి కమల్‌నాథ్ రాజీనామా?
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. 230 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 66 సీట్లకే పరిమితమైంది. దీంతో మధ్యప్రదేశ్‌లో ఓటమికి బాధ్యతవహిస్తూ.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఖాళీగా మారిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను మరో నేతకు అప్పగించనున్నట్లు హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కమల్‌నాథ్ మంగళవారం.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ఇతర సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. వారి భేటీ అనంతరం రాజీనామా చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఢిల్లీ హైకమాండ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
'ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో 50 ఓట్లు కూడా రాలేదు'
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అవకతవకలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. తమ నేతలతో సమీక్ష నిర్వహించిన తర్వాతే మాట్లాడతానని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే స్బందించారు. చిప్ ఉన్న ఎలాంటి యంత్రాన్నైనా హ్యాక్ చేయవచ్చని ఆయన అన్నారు. ఈవీఎంల విశ్వసనీయతపై ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లకు గాను బీజేపీ 163 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 66 సీట్లకే పరిమితమైంది. Any Machine with a Chip can be hacked. I have opposed voting by EVM since 2003. Can we allow our Indian Democracy to be controlled by Professional Hackers! This is the Fundamental Question which all Political Parties have to address to. Hon ECI and Hon Supreme Court would you… https://t.co/8dnBNJjVTQ — digvijaya singh (@digvijaya_28) December 5, 2023 మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీని సూచించాయి. కానీ వాస్తవంగా బీజేపీ పూర్తి ఏకపక్ష మెజారిటీని సాధించింది. ఈ ఫలితంపై కాంగ్రెస్ నాయకులతో పార్టీ ప్రచార సారథి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. భారీ అపజయం వెనకు ఉన్న కారణాలను విశ్లేషించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నట్లు కనిపించినప్పటికీ ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయని కమల్ నాథ్ చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని చెబుతున్నారు. నిజానికి ఇది ఎలా సాధ్యమైతుందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Rajasthan Politics : రాజస్థాన్‌కు యూపీ సీఎం.. కారణమిదే! -
కమల్‌నాథ్‌పై కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం!
భోపాల్: మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ హై కమాండ్ కూడా ఆయనపై గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారమే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి తన రాజీనామాను కమల్‌నాథ్ సమర్పించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ కార్యకర్తలను కలవకుండా కమల్‌నాథ్ వెళ్లి సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలవడంపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కమల్‌నాథ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా,2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 114 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. కమల్‌నాథ్ సీఎం పదవి చేపట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడి మళ్లీ బీజేపీ పగ్గాలు చేపట్టింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 163 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ 66 సీట్లకు పడిపోయి ఘోర పరాజయం పాలైంది. ఇదీచదవండి..ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసం ఖాళీ -
Madhya Pradesh: ఆసక్తికర పరిణామం.. సీఎంను కలిసిన పీసీసీ చీఫ్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మాజీ సీఎం, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్ కలిశారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసానికి సోమవారం వచ్చిన కమల్‌నాథ్ ఆయనకు పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్.. కమల్‌నాథ్‌ను సాదరంగా ఆహ్వానిస్తూ ఇంట్లోకి తీసుకెళ్లారు. మధ్యప్రదేశ్ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ తిరుగులేని విజయాన్ని సొంత చేసుకుంది. 230 స్థానాలకు గానూ ఏకంగా 163 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టుకుంది. కాగా కమల్‌నాథ్ సారధ్యంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలకే పరిమితమైంది. #WATCH | Madhya Pradesh | State Congress president Kamal Nath meets Chief Minister Shivraj Singh Chouhan at his residence in Bhopal. The party registered a thumping majority in the state election, winning 163 of the total 230 seats. pic.twitter.com/CSTFecTjKC — ANI (@ANI) December 4, 2023 -
కాంగ్రెస్ ఓటమికి కమల్‌నాథ్ కారణం.. సంజయ్ రౌత్
Madhya Pradesh Elections results: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కారణమని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కొన్ని సీట్లను ‘ఇండియా’ (INDIA) కూటమిలోని భాగస్వామ్యులతో పంచుకుని ఉంటే మరోలా ఉండేదన్నారు. మిత్రపక్షాల పట్ల పాత పార్టీ తన వైఖరిని పునరాలోచించాలని కూడా ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో సమాజ్‌వాదీ పార్టీతో సీట్లు పంచుకోవాలనే ఆలోచనను కమల్‌నాథ్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ వంటి నేతలు చురుగ్గా ప్రచారం చేసినప్పటికీ మధ్యప్రదేశ్‌లో ఓటమికి కమల్‌నాథ్ కారణమని, విపక్ష కూటమితో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. అఖిలేష్ పార్టీకి (సమాజ్‌వాదీ పార్టీ) కొన్ని ప్రాంతాలలో మంచి మద్దతు ఉందని, ఆ పార్టీకి కంచుకోటలుగా పేరుగాంచిన 10-12 స్థానాలు ఉన్నాయన్నారు. కానీ దీనిని కమల్‌నాథ్ వ్యతిరేకించారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు విలువైన గుణపాఠం చెబుతాయని, రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి సమిష్టిగా పాల్గొనాలని రౌత్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ తన వ్యూహాన్ని పునరాలోచించాలని, మిత్రపక్షాల వైపు దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాహుల్ గాంధీ “పనౌటీ” వ్యాఖ్య మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలను దెబ్బతీసిందనే ఆరోపణలను రౌత్ తోసిపుచ్చారు. “అలా అయితే, ఆ వ్యాఖ్య తెలంగాణలో ఎందుకు దెబ్బతీయలేదని ప్రశ్నించారు. కాగా డిసెంబరు 6న ఇండియా బ్లాక్ సమావేశానికి పిలుపునిచ్చామని, ఈ సమావేశంలో పలు విషయాలు చర్చిస్తామని రౌత్ తెలిపారు. -
Madhya Pradesh: కాబోయే సీఎం.. కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం!
భోపాల్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు భోపాల్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బయట కాబోయే ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు శుభాకాంక్షలు అంటూ పోస్టరు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌లో 230 శాసనసభ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరుగుతుంది. కాగా గురువారం విడుదలైన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఎగ్జిట్‌పోల్స్‌తో సంబంధం లేకుండా ఎవరికివారే తమ పార్టీలు గెలుస్తాయని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ప్రకటన చేస్తున్నారు. తమ పార్టీ భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటుందని మధ్యప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించగా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్.. తనకు రాష్ట్ర ఓటర్లపై పూర్తి విశ్వాసం ఉందని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. A poster congratulating Kamal Nath and portraying him as the next Chief Minister of Madhya Pradesh has been put up by a Congress worker outside the Congress office in Bhopal. pic.twitter.com/pX41zyoZgg — ANI (@ANI) December 2, 2023 -
Madhya Pradesh: పట్టుమని 15 నెలలు.. గత జ్ఞాపకం వెంటాడుతుందా?
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. 230 స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 17న పోలింగ్ జరగగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. గత రెండు దశాబ్దాలుగా తమకు కంచుకోటగా ఉన్న రాష్ట్రాన్ని బీజేపీ నిలుపుకోనుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పట్టుమని 15 నెలలు కూడా మనుగడ సాగించలేకపోయింది. జ్యోతిరాదిత్య సింధియా తన విధేయులైన ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. 2023లో పెరిగిన ఓటింగ్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అత్యధిక ఓటింగ్ జరిగింది. గతంలో కంటే ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేశారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 76.22 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 74.97 శాతం ఓటింగ్ జరిగింది. 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. అదే రోజున ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. మిజోరంలో కౌంటింగ్‌ను ఒకరోజు వాయిదా వేశారు. 2,533 మంది అభ్యర్థులు మధ్యప్రదేశ్‌లోని 230 నియోజకవర్గాల్లో 2,533 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉన్నప్పటికీ బహుజన సమాజ్ పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ఆద్మీ వంటి పార్టీలు కూడా గణనీయమైన స్థానాల్లో పోటీ చేశాయి. కాగా ఈ ఎన్నికల్లో 5.59 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ వరుస విజయాలకు బ్రేకులు మధ్యప్రదేశ్‌లో వరుసగా మూడు పర్యాయాలు గెలుస్తూ వచ్చిన బీజేపీకి 2018లో కాంగ్రెస్ బ్రేకులు వేయగలిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ కేవలం 109 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే 116 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను మాత్రం కాంగ్రెస్ అందుకోలేకపోయింది. స్వతంత్రులు, ఇతర పార్టీల ఎమ్మెల్యేల సాయంతో కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఎంతోకాలం నిలవలేదు. పార్టీలో కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా తనతో సహా 21 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. దీంతో పట్టుమని 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. -
Madhya Pradesh: ఐ డోంట్ కేర్.. మాజీ సీఎం వ్యాఖ్యలు
భోపాల్: తాను ఏ ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోనని, మధ్యప్రదేశ్ ఓటర్లపై తనకు నమ్మకం ఉందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఆయన స్పందించారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధికం బీజేపీకే ఆధిక్యాన్ని ఇచ్చాయి. అత్యధిక సీట్లతో ఆ పార్టీనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనాలను ప్రకటించాయి. మరోవైపు కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ గణనీయ స్థానాలు సాధిస్తుందని అంచనా వేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌పై కమల్‌నాథ్ మాట్లాడుతూ ‘నేను ఏ పోల్ (ఎగ్జిట్) గురించి పట్టించుకోను. మధ్యప్రదేశ్ ఓటర్లపై నాకు నమ్మకం ఉంది’ అన్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ టచ్‌లో ఉందా అనే ప్రశ్నకు బదులిస్తూ అలా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా కనీసం 140 సీట్లతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇండోర్-1 నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శుక్లా విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి కైలాష్ విజయవర్గియాదే పైచేయిగా ఎగ్జిట్ పోల్ ఫలితాలలో వచ్చినప్పటికీ ఆయన దేశానికి బలమైన నాయకుడు అవుతాడేమో కాని తన అసెంబ్లీ నియోజకవర్గానికి కాదని, అక్కడ తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగబోతోంది. -
MP: నడిపించేది విజన్.. టెలివిజన్ కాదు.. కమల్‌నాథ్ గీతోపదేశం!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఏర్పాటుకు ప్రజలు అంతా సిద్ధం చేశారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్ పేర్కొన్నారు. బీజేపీ గెలుస్తుందంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోవచ్చని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ మేరకు కమల్‌నాథ్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో గురువారం ఓ పోస్టు పెట్టారు. ‘కాంగ్రెస్ కార్యకర్తలందరికీ వారి బలాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ప్రజలే కాంగ్రెస్ శక్తి. మీ (కార్యకర్తలు) కృషి, అంకితభావం కారణంగానే ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేశారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఆమోద ముద్ర వేస్తారు’ అన్నారు. దేశాన్ని నడిపించేది విజన్ అని, టెలివిజన్ కాదని పేర్కొన్న కమల్ నాథ్.. "కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాయి. మరికొన్ని భిన్న అంచనాలను ప్రకటించాయి. వీటిని పట్టించుకోవద్దు" అని సూచించారు. ‘అర్జునిడి లాగా లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఓట్ల లెక్కింపు రోజున పూర్తి దృష్టిని కేంద్రీకరించి, కాంగ్రెస్‌కు వచ్చిన ప్రతి ఓటును సరిగ్గా లెక్కించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూసుకోవాలి’ అని కార్యకర్తలకు గీతోపదేశం చేశారు. -
సీఎం శివరాజ్ సింగ్ మంచి నటుడు: కమల్‌నాథ్
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రజలు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కమల్‌నాథ్ అన్నారు. అయితే సీఎం కుర్చీపోయినా శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉద్యోగానికి ఢోకా లేదని నాథ్ చెప్పారు. శివరాజ్‌సింగ్ మంచి నటుడని, సీఎం పదవి పోయిన తర్వాత ముంబై వెళ్లి సినిమాల్లో ట్రై చేసుకోవచ్చని కమల్‌నాథ్ చమత్కరించారు. సాగర్ జిల్లాలోని రేహ్లీ అసెంబ్లీ స్థానంలో ప్రచారం సందర్భంగా కమల్‌నాథ్ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఇంటికెళ్లడానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉందన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన శివరాజ్‌సింగ్ కనీసం బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా నింపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల వేళ మళ్లీ శివరాజ్‌సింగ్ చౌహాన్ హామీల మెషీన్ డబుల్ స్పీడ్‌తో పనిచేస్తోందని, దీనిని ప్రజలు గమనించాలని కమల్‌నాథ్ కోరారు.మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. గతంలో సీఎంగా పనిచేసిన కమల్‌నాథ్ కాంగ్రెస్ తరపున మళ్లీ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. ఇదీ చదవండి..కుప్పకూలిన చార్దామ్ టన్నెల్..చిక్కుకున్న 40 మంది -
ఏ ఒక్కరినీ వదిలిపెట్టం! అధికారులకు కాంగ్రెస్ చీఫ్ వార్నింగ్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ స్థానిక అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టబోమని, తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని హెచ్చరించారు. పృథ్వీపూర్, నివారీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో శుక్రవారం (నవంబర్ 10) జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇంక ఆరు రోజులే.. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక అధికారును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘పృథ్వీపూర్, నివారి అధికారులకు నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. శ్రద్ధగా వినండి. ఇంక ఆరు రోజులే ఉన్నాయి. అప్పటిదాకా మీరు ఏం చేస్తారో చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని ఏం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు’ అని హెచ్చరించారు. అధికారులు తమను వేధిస్తున్నారని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కమలనాథ్ ఈ హెచ్చరికలు చేశారు. అయితే, ఆయన అధికార యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం ఇదే తొలిసారి కాదు. గత సెప్టెంబర్ నెలలోనూ కమలనాథ్ ఇలాంటి వార్నింగే ఇచ్చారు. ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని, సాగర్ జిల్లాలో అధికారుల వేధింపులను గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు. కాగా నవంబర్ 17న మధ్య ప్రదేశ్‌లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండూ పూర్తి స్థాయిలో ప్రచారంలో నిమగ్నమయ్యాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. -
50 శాతం కమీషన్ల పాలన : కమల్‌నాథ్
నర్సింగాపూర్: మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ పాలనలో 50 శాతం కమీషన్ల రాజ్యం నడుస్తోందంటూ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఆరోపించారు. చౌహాన్ అవినీతి పాలన రాష్ట్ర భవిష్యత్తును అంధకారమయం చేసిందన్నారు. బుధవారం నర్సింగాపూర్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో యువత, రైతులు, అన్ని సామాజిక వర్గాల భవిష్యత్తును బీజేపీ పాలన సర్వనాశనం చేసిందన్నారు. కేవలం బీజేపీ నేతలు, అధికార పెద్దలు మాత్రమే అభివృద్ధి చెందారని ఆరోపించారు. 18 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి వ్యవస్థ వంటివన్నీ పూర్తిగా పట్టాలు తప్పాయన్నారు. అబద్ధపు పథకాలను ప్రకటించనిదే చౌహాన్‌కు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. -
దిగ్విజయ్–కమల్నాథ్లది జై– వీరూ బంధం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ల పాత్రపై మరోసారి చర్చ మొదలైంది. దిగ్విజయ్, కమల్‌నాథ్‌ల మధ్య రాజకీయ సమీకరణాలను.. బ్లాక్ బస్టర్ ‘షోలే’ చిత్రంలోని ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్లు పోషించిన జై, వీరూ పాత్రల మధ్య బంధంతో కాంగ్రెస్ పార్టీ పోల్చింది. రాష్ట్రంలో టిక్కెట్ల కేటాయింపులో ఇద్దరు నేతల మధ్య విభేదాల వార్తలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా శనివారం పైవ్యాఖ్యలు చేశారు. ‘షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్‌ల మధ్య విలన్ గబ్బర్ సింగ్ ఎలా గొడవ పెట్టలేకపోయాడో.. రాష్ట్రంలో గబ్బర్ సింగ్ వంటి బీజేపీ కూడా మధ్య విభేదాలను సృష్టించలేకపోయింది’ అంటూ వ్యాఖ్యానించారు. -
ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు? గాంధీ కుటుంబానికి ఎలా దగ్గరయ్యారు?
అది 2018వ సంవత్సరం.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 15 ఏళ్ల సుదీర్ఘ ప్రవాసం ముగిసింది. కమల్ నాథ్ అధికారం చేజిక్కించుకున్నారు. 2018 డిసెంబర్లో రాష్ట్ర 31వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్నాళ్ల తర్వాత దక్కిన అధికారం కాంగ్రెస్ చేతిలో 15 నెలలు మాత్రమే ఉంది. మరోసారి భారతీయ జనతా పార్టీ (బీజెపీ) ప్రభుత్వం ఏర్పడింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఒకటిన్నర దశాబ్దం తర్వాత కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించిన కమల్‌నాథ్‌ను ఒకప్పుడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ‘మూడవ కుమారుడు’ అనేవారు. అంతటి ఘనత సాధించిన కమల్ నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ ఇప్పుడు మరోసారి ఎన్నికల రంగంలోకి దిగనుంది. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన కమల్ నాథ్ 1946 నవంబర్ 18న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించారు. పాఠశాల విద్య తరువాత కమల్ నాథ్ కోల్‌కతాకు వెళ్లి, అక్కడ సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి బీకామ్ పూర్తి చేశారు. 1973, జనవరి 27న అల్కా నాథ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నకుల్ నాథ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. కమల్ నాథ్ ఛింద్వారా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో 9 సార్లు గెలిచి ఎంపీ అయ్యారు. 1980లో తొలిసారి ఇక్కడ గెలిచారు. అప్పుడు అతని వయస్సు కేవలం 34 సంవత్సరాలు. 1997 ఉప ఎన్నికలను మినహాయిస్తే చింద్వారాలో విజయపథంలో దూసుకెళ్లిన నేత కమల్ నాథ్. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కింది. పర్యావరణం, జౌళి, వాణిజ్యం, రోడ్డు రవాణా, రహదారుల వంటి కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు ఆయనకు లభించాయి. ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న నేతగా కమల్‌నాథ్ పేరు తెచ్చుకున్నారు. పాఠశాల రోజుల్లో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీతో ఏర్పడిన స్నేహం కమల్ నాథ్ రాజకీయ జీవితానికి పునాది వేసింది. సంక్షోభ సమయాల్లో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన కమల్‌నాథ్.. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా మారారు. ఎమర్జెన్సీ ముగిసినప్పుడు కాంగ్రెస్‌కు గడ్డుకాలం ఎదురైంది. అదే సమయంలో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. ఇందిరాగాంధీపై వయసు ప్రభావం పడింది. ఉమ్మడి ప్రతిపక్షం ముందు కాంగ్రెస్ బలహీనపడింది. అలాంటి సమయంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కమల్‌నాథ్ పార్టీకి అండగా నిలిచారు. దీనికి ప్రతిఫలంగా ఇందిరాగాంధీ ఆయనకు చింద్వారా లోక్‌సభ టిక్కెట్ ఇవ్వడంతో కమల్‌నాథ్ రాజకీయ ప్రయాణం మొదలైంది. 2018లో కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. కమల్‌నాథ్ పేరిట రూ.7.09 కోట్ల విలువైన చరాస్తులు, రూ.181 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. కమల్‌నాథ్, ఆయన కుటుంబం పేరిట మొత్తం 23 కంపెనీలు, ట్రస్టులు రిజిస్టర్ అయ్యాయి. ఆయనకు చింద్వారా జిల్లాలో దాదాపు 63 ఎకరాల భూమి కూడా ఉంది. ఇది కూడా చదవండి: బ్రిటీషర్లను తరిమికొట్టిన చీమలు? ‘సిపాయిల తిరుగుబాటు’లో ఏం జరిగింది? -
ఎన్నికల్లో గెలుపు కోసం తాంత్రిక పూజలా?
భోపాల్: కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ తన గెలుపుకోసం మంత్ర పూజలు చేయిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు వైరల్‌గా మారాయి. ఉజ్జయినిలోని ఓ శ్మశానంలో ఓ తాంత్రికుడు కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ చిత్రపటం ఎదురుగా పెట్టుకుని నిమ్మకాయలు, పూలు, క్షుద్రపూజల సామగ్రితో పూజలు చేస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కమల్‌నాథ్ ముఖ్యమంత్రి కావాలనే ఈ పూజలు జరిపిస్తున్నట్లు తాంత్రిక పూజారి భయ్యూ మహరాజ్ ‘ఇండియా టుడే’టీవీ ప్రతినిధికి చెప్పడం విశేషం. ఈ వ్యవహారంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ‘ఎవరైనా భక్తి మార్గంలో లేదా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వాలనుకుంటే, దానిని స్వచ్ఛంగా, ధర్మబద్ధంగా నిర్వహించుకోవాలి. అదికాదని, ఇలా క్షుద్రపూజలు చేయడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది’అని పేర్కొన్నారు. ‘మేం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు చేరువవుతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవలు చేయాలి. వారి విశ్వాసాన్ని గెలుచుకోవడానికి, వారికి సేవ చేయడానికి ఇదే మార్గం. కొందరు మాత్రం శ్మశానవాటికలో ‘తాంత్రిక క్రియ’లు నిర్వహిస్తున్నారు. వీటితో దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా ఉపయోగముందా?’అని చౌహాన్ ప్రశ్నించారు. -
ఎన్నికల హామీలపై... మధ్యప్రదేశ్‌లో నేతల మాటల యుద్ధం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా, పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల హామీలపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఉచిత విద్య, విద్యార్థులకు నగదు పురస్కారాలు వంటి కాంగ్రెస్, ప్రియాంకా గాంధీ ఇచి్చన ఎన్నికల హామీలపై సీఎం చౌహాన్ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గతంలో గాంధీ కుటుంబం ప్రతి ఒక్కరినీ మోసం చేసింది. తాజాగా గాంధీ కుటుంబాన్ని సైతం పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ మోసం చేస్తున్నారు. తప్పుడు హామీలిచ్చేలా వారిపై ఒత్తిడి తెస్తున్నారు’అని ఆరోపణలు చేశారు. మాండ్లాలో ఈ నెల 12న జరిగిన ర్యాలీలో ప్రియాంకా గాంధీ ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందజేస్తామని ప్రకటించడం ఆ తర్వాత దానిని పలు మార్లు మార్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సీఎం విమర్శలపై కమల్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై సీఎం చౌహాన్ అనుచిత భాషను వాడారని ఆరోపించారు. తమ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేయదని స్పష్టం చేశారు. సీఎం చౌహాన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రియాంకా గాంధీ సైతం విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీలో మాదిరిగా తమ పారీ్టలో నియంతృత్వానికి చోటులేదన్నారు. కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ఎందుకు నిలిపివేశారని సీఎం చౌహాన్‌ను ఆమె ప్రశ్నించారు. తమ పార్టీ విద్య, చిన్నారులు, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతుంటే ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం చౌహాన్ ఇటువంటి విషయాలను ప్రస్తావిస్తున్నారంటూ ఆమె ‘ఎక్స్’లో పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి విద్యారి్థకి ఉపకారవేతనం అందజేస్తుందని హామీ ఇచ్చారు.నవంబర్ 17వ తేదీన రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. -
మీరొక డమ్మీ సీఎం.. అందుకే పక్కన పెట్టేశారు
భోపాల్: ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మన రాష్ట్రం ఎప్పుడు వచ్చినా నోటికొచ్చిన అబద్దాలు చెప్పడంతో ప్రధానికి మీ విషయం అర్థమైందని మీరు ముఖ్యమంత్రే కానీ డమ్మీ ముఖ్యమంత్రి అని అన్నారు. డమ్మీ సీఎం.. ఈరోజు 'జన ఆశీర్వాద యాత్ర' ముగింపు సందర్బంగా ప్రధాని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్న నేపథ్యంలో ఎక్కడా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్ ఉనికి కనిపించడంలేదని చెబుతూ ఆయనొక అబద్దాలు కోరు అని ప్రధానికి అర్థమైందని అందుకే ప్రచార కార్యక్రమంలో ఈయన లేకుండా జాగ్రత్త పడ్డారని చెప్పుకొచ్చారు. మీరు ముఖ్యమంత్రే కానీ అసలు ముఖ్యమంత్రి కాదని అందుకే బీజేపీ నేత అమిత్ షా ఎన్నికలు పూర్తైన తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామన్నట్టు గుర్తు చేశారు. అన్నీ అబద్దాలే.. మీరు అబద్ధాలతో ప్రధానిని చాలా ఇబ్బంది పెట్టారని రైతుల ఆదాయం రెట్టింపయ్యిందని మీరు చెబితే నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రైతుల ఆదాయం గణనీయంగా తగ్గినట్లు ఆయనకు తెలిసిపోయిందని పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గాయని మీరు చెప్పినవి కూడా అబద్ధాలేనని ఆయనకు తెలిసిపోయిందన్నారు. ప్రధానికి అర్ధమైపోయింది.. అన్నిటినీ మించి ప్రధాని బుందేల్‌ఖండ్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బుందేల్‌ఖండ్‌పై నిర్లక్ష్య వైఖరితో వ్యవహారించిందని ఏకంగా ప్రధానితోనే చెప్పించారు. కానీ కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం బుందేల్‌ఖండ్‌కు రూ.7,600 కోట్లు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇలా నోటికొచ్చిన అబద్దాలు చెప్పడం వల్లనే ప్రధాని సీఎంను పక్కన పెట్టేశారని అన్నారు. ఇది కూడా చదవండి: ‘మామూలు రైళ్లకే రంగులేసి వందేభారత్‌గా దోపిడీ’ -
‘ఇండియా’ కూటమి బహిరంగ సభ వాయిదా
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అక్టోబర్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ వాయిదా పడింది. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ శనివారం ఈ విషయం ప్రకటించారు. బహిరంగ సభ ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా చెప్పారు. భోపాల్‌లో ఉమ్మడిగా భారీ సభ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని ఇండియా కూటమి పక్షాలు ఇటీవలే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్ పార్టీకి చురకలంటించిన ఆ పార్టీ సీనియర్ నేత
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. హిందూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ నేతలు హిందూత్వ మంత్రాన్ని జపిస్తుండటంపై ఆ పార్టీ సీనియర్ నేత అజీజ్ ఖురేషి తమ పార్టీపైనే విమర్శలు చేయడం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఇటీవల కాలంలో ఎక్కువగా హిందూ దేవాలయాలను సందర్శిస్తూ హిందుత్వ అస్త్రాన్ని ప్రయోగించడాన్ని తప్పుబట్టారు సీనియర్ కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషి(82). మంత్రిగానూ, ఎంపీగానూ, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ గానూ సేవలందించిన అజీజ్ ఖురేషీ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని మీరు చెప్పిందల్లా చెయ్యడానికి ముస్లింలు మీ బానిసలు కాదని. కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఈ విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. పోలీస్ శాఖలోనూ, రక్షణ శాఖలోనూ, బ్యాంకుల్లోనూ ముస్లింలకు ఉద్యోగాలు రావు, వారికి కనీసం బ్యాంకు లోనులు కూడా రావు.. అలాంటప్పుడు మీకు ఎందుకు ఓటు వెయ్యాలని ప్రశ్నించారు. ముస్లింల ఇళ్ళు, దుకాణాలు, మందిరాలు తగలబెడుతూ వారి పిల్లలను అనాధలుగా చేస్తుంటే చూస్తూ ఉంటారనుకోకండి. వారేమీ పిరికివారు కాదు. 22 కోట్ల మందిలో 2 కోట్లు మంది ప్రాణాలర్పిస్తే పోయేదేమీ లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ లీడర్లు గురించి మాట్లాడుతూ.. ఈ మధ్య వారు కొత్తగా హిందూత్వ మంత్రాన్ని జపిస్తున్నారు. పార్టీ ఆఫీసుల్లో దేవుళ్ళ ప్రతిమలు ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల కోసం దిగజారడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత కేకే మిశ్రా స్పందిస్తూ అది ఆయన అభిప్రాయమని కాంగ్రెస్ ఎప్పుడూ లౌకికవాదాన్ని విశ్వసిస్తుందని అన్నారు. ఇక బీజేపీ నేత నరేంద్ర సాలూజ అజీజ్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి మైరిటీలను బుజ్జగించే రాజకీయాలు అలవాటేనని రాహుల్ గాంధీ, కమల్ నాథ్ సహా కాంగ్రెస్ నాయకులంతా ఎన్నికల నేపథ్యంలో హిందువుల అవతారం ఎత్తుతారని మధ్యప్రదేశ్‌లో ఉండే 82 శాతం హిందూ ఓటర్లను ప్రభావితం చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని ఆయన అన్నారు. చేతనైతే ఖురేషీ అడిగిన దానికి సమాధానం చెప్పాలని అన్నారు. ఇది కూడా చదవండి: మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది మృతి -
బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత
భోపాల్: ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగలింది. బీజేపీ నేత సినిమా రేంజ్లో 400 కార్ల క్వానాయ్‌తో బయలుదేరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొన్ని నెల్లలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నేత కాంగ్రెస్‌లో చేరడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు.. ఆయన కాన్వాయ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ నేత జైజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు సింగ్. గురువారం ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికల సందర్భంగా 400 కార్ల కాన్వాయ్‌తో దాదాపు 300 కిలోమీటర్లు సైరన్ వేసుకుంటూ ప్రయాణించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక, ఆయనను మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ పార్టీలోకి ఆహ్వానించారు. రాజధాని భోపాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బైజ్నాథ్ సింగ్ తన బలప్రదర్శన చేశారు. శివ్‌పురి జిల్లా నుంచి 400 వందల కార్లతో 300 కిలోమీటర్ల దూరం ఉన్న భోపాల్‌కు భారీ ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా కార్లకు సైరన్ వేసుకుంటూ ప్రయాణించారు. ఈ ర్యాలీలో భాగంగా మార్గ మధ్యలో అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. 15 మంది జిల్లా స్థాయి నేతలు, ఇతర కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాకు చెందిన బైజ్నాథ్ అక్కడ పేరున్న నేత. ఆయనకు గ్రౌండ్ లెవల్ నుంచి ప్రజల మద్దతు ఉంది. కాగా, అంతకుముందు 2020లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు చేసి బీజేపీలోకి వెళ్లడంతో కమల్‌నాథ్ సర్కారు కూలిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బైజ్నాథ్ సింగ్ కూడా సింధియా వెంటనే బీజేపీలో చేరారు. అనంతరం, బీజేపీలో ఆయనకు తగిన గుర్తింపు లభించకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఇక, బైజ్నాథ్ సింగ్ కార్ల ర్యాలీపై బీజేపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో ఆయనపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇలా సైరన్ల వాడటమేంటని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ప్రజలకు అసౌకర్యం కల్పించేలా సైరన్లు వినియోగించడం కాంగ్రెస్ పార్టీ నేతల మనస్తత్వమని మండిపడింది. Madhya Pradesh: BJP leader Baijnath Singh heads to rejoin Congress in 400-car convoy.pic.twitter.com/a7cofthV0R — Annu Kaushik (@AnnuKaushik253) June 15, 2023 ఇది కూడా చదవండి: బసవరాజ బొమ్మైతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రహస్య భేటీ.. -
బాహాటంగా పోలీసు అధికారులపై మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బహిరంగా ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, అందరీ ఖాతాలను లెక్కిస్తా! అంటూ బెందిరింపులకు దిగారు. అంతేగాదు తాను ఎవ్వరిని వదిలిపెట్టను అని కూడా చెప్పారు. అందువల్ల ఎవ్వరూ కూడా తమ దూకుడుకి భయాందోళనలకు గురికావద్దని చెప్పాలనుకుంటున్నా అన్నారు. ఈ విషయాలను ముఖ్యంగా పోలీసు అధికారులందరూ చెవులు రిక్కరించి వినాలనే చెబుతున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో భారతీయ జనతా పార్టీ ప్రతినిధి షెహజాద్ పూనావల్లా మాజీ సీఎం కమల్‌నాథ్ తన అప్రజాస్వామిక ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌ని మరోసారి చూపించుకున్నారంటూ విమర్శించారు. ఆయన ఇలా అధికారులను బెదిరింపులకు గురిచేయడం తొలిసారి కాదని, 2021లో కూడా ఇలానే అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. పూనావల్లా కాంగ్రెస్‌కి గట్టి కౌంటరిచ్చేలా.. ఆ పార్టీ ఎప్పుడూ ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌ను, బెదిరింపులు, ప్రతికార రాజకీయాలను విశ్వసిస్తుందని ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలో లేనప్పుడే.. పోలీసు అధికారులను, పరిపాలను బాహటం బెదిరింపులకు గురిచేస్తే..ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అయినా ప్రేమతో ఓటర్లను ఆకర్షించాలి గానీ బెదిరింపులతో కాదని కమల్‌నాథ్‌కి సూచించారు. అంతేగాదు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రకటనలకు మద్ధతిస్తుందా? లేదా ఖండిస్తుందా? అనే విషయం గురించి ఆ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. (చదవండి: మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. అందుకే ఆమె నోరుమెదపరు.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..) -
‘భారత్ జోడో యాత్రతో చచ్చిపోతున్నాం’.. మాజీ సీఎం వీడియో వైరల్
భోపాల్: కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టారు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఈ యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ సహా పలువురు రాష్ట్ర నేతలు యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కమల్‌నాథ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. జోడో యాత్రపై కమల్‌నాథ్ అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘గత వారం రోజులుగా మేం చచ్చిపోతున్నాం’ అని ఆయన అన్నట్లుగా వీడియో ఉంది. ఈ వీడియో ప్రకారం.. ప్రదీప్ మిశ్రా అనే పండింతుడితో కమల్‌నాథ్ మాట్లాడుతున్నారు. ‘గత ఏడు రోజులుగా మేం చచ్చిపోతున్నాం. దాంట్లో రెండు నిబంధనలుంటాయి. రోజూ ఉదయం 6 గంటలకే యాత్ర ప్రారంభించాలి. రోజుకు కనీసం 24 గంటలు నడవాలి. మధ్యప్రదేశ్‌లో యాత్ర కోసం రాహుల్ మూడు ప్రీ కండిషన్లు పెట్టారు. ఆదివాసీ వీరుడు తాంత్య భిల్ జన్మస్థలం, ఓంకారేశ్వర, మహంకాళీ ఆలయాలను సందర్శించాలని చెప్పారు.’అని కమల్‌నాథ్ పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ కావటంతో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ మంత్రి నరోత్తమ్ మిశ్రా. ‘కమల్‌నాథ్ జీ.. మీ వీడియో చూశాను. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. శారీరకంగా బలహీనంగా ఉన్నవారిని యాత్రలో పాల్గొనేలా రాహుల్ బలవంతపెట్టొద్దని ప్రార్థిస్తున్నా. మీ యాత్ర ఎవరికీ హాని కలగకుండా చూసుకోండి’అని విమర్శించారు. Bharat Jodo Yatra: कमल नाथ का वीडियो वायरल, बोले- हम तो सात दिन से मर रहे हैं https://t.co/UChv8Xf1mL#KamalNath #BharatJodoYatra #MadhyaPradesh #Naidunia pic.twitter.com/mOX1m9SZrR — NaiDunia (@Nai_Dunia) December 1, 2022 ఇదీ చదవండి: శశి థరూర్‌కు తప్పని చిక్కులు.. సునంద మృతి కేసులో కోర్టు నోటీసులు -
పార్టీ అధ్యక్ష బరిలో అందుకే నిలవటం లేదు: కమల్‌నాథ్
భోపాల్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఎంత మంది ఉండనున్నారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ క్రమంలో సోనియా గాంధీతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ భేటీ కావటం పలు ఊహాగానాలకు తావిచ్చింది. కమల్‌నాథ్ సైతం పోటీలో నిలువనున్నారని వినబడింది. అయితే.. తనకు అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదని.. తన దృష్టి అంతా వచ్చే ఏడాది జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని కమల్‌నాథ్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించడం వల్లే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజస్థాన్ పరిణామాలతో కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన భోపాల్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీతో మాట్లాడి పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను కోరాను. అప్పుడే ఈ గందరగోళానికి తెరపడుతుందని చెప్పాను. పార్టీలో పరిణామాలు సంక్లిష్టంగా మారుతున్నాయని కూడా ఆయనకు వివరించాను. అయితే, అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి రాహుల్ సుముఖంగా లేనని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉండాలనుకోవడంలేదు గనకే ఎన్నికలు జరుగుతున్నాయి. ‘ అని తెలిపారు కమల్‌నాథ్. మరి జేపీ నడ్డా ఎలాంటి ఎన్నిక జరగకుండానే భాజపా అధ్యక్షుడయ్యారు కదా అని విమర్శలు చేశారు. ఎన్నికల విషయం పక్కనబెడితే.. నడ్డాను అధ్యక్షుడిని చేసే ముందు భాజపా 10మంది నేతల అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని కమల్‌నాథ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు మీరెందుకు పోటీ చేయట్లేదని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఇటీవల తాను ఢిల్లీకి వెళ్లి సోనియాతో చర్చలు జరిపిన విషయాన్ని వెల్లడించారు కమల్‌నాథ్. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 12 నెలల సమయం ఉందని.. ఈ సమయంలో తాను మధ్యప్రదేశ్‌ను వదిలిపెట్టబోనన్నారు. ఒకవేళ తాను అధ్యక్ష పదవి చేపడితే తన దృష్టంతా మధ్యప్రదేశ్ వైపు ఉండదని.. ఆ పరిస్థితి తనకు ఇష్టంలేదని స్పష్టంచేశారు. అందుకే అధ్యక్ష బాధ్యతలు తీసుకొనేందుకు తాను సిద్ధంగా లేనట్టు స్పష్టంచేశారు. మధ్యప్రదేశ్ నుంచి తన దృష్టిని వేరే వైపు పెట్టదలచుకోలేదన్నారు. ఆయన్నే అడగండి.. ఏఐసీసీ కొత్త అధ్యక్షుడు ఎవరైనా తొలుత త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలపైనే దృష్టిపెట్టాల్సి ఉంటుందని కమల్‌నాథ్ సూచించారు. అలాగే, ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేయాల్సి ఉందన్నారు. ఈక్రమంలోనే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ వేస్తారా? అని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదన్నారు. శశిథరూర్ నామినేషన్ గురించి ప్రస్తావించగా.. ఆయనతో చర్చించానని.. ఎన్నికలు ఉన్నందునే ఆయన నామినేషన్ వేయాలనుకొంటున్నారన్నారు. దిగ్విజయ్ సింగ్ పోటీచేసే అవకాశం ఉందా? అని అడగ్గా.. ఆయనకు ఇష్టం ఉందో లేదో దిగ్విజయ్‌నే అడగాలని సమాధానమిచ్చారు. రాజస్థాన్‌లో ఏర్పడిన పరిస్థితులకు గెహ్లాట్‌కు క్లీన్ చిట్ ఇస్తారా అని అడగగా.. ఆ రాష్ట్ర విషయాల్లో తాను కలుగజేసుకోబోనని, మధ్యప్రదేశ్‌పైనే తన దృష్టంతా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్? -
గెహ్లాట్ క్షమాపణ!.. బీజేపీ స్పందన
న్యూఢిల్లీ/జైపూర్: ఆదివారం రాత్రి జరిగిన హైడ్రామా.. రాజస్థాన్ రాజకీయాన్ని కీలక మలుపు తిప్పింది. సచిన్ పైలట్‌కు సీఎం బాధ్యతలు అప్పజెప్పాలన్న అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గెహ్లాట్ వర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేల రాజీనామా కలకలం రేపింది. ఆపై ఇవాళంతా ఢిల్లీ పెద్దల రాజస్థాన్ పర్యటన నేపథ్యంలో పెద్ద హైడ్రామానే నడిచింది. అయితే ఈ పరిణామాలపై బీజేపీ నేత అమిత్ మాలవియా స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం అశోక్ గెహ్లాట్ నామినేషన్ వేస్తారో? లేదో? తెలియదు. కానీ.. ఆయన వర్గం మాత్రం సోనియా గాంధీ రాజకీయ స్థాయిని అమాంతం తగ్గించేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఎవరు అధ్యక్షుడు అయినా సరే.. బలహీనంగా ఉన్న గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా తిరుగుబాటు తలెత్తే అవకాశాలే ఎక్కువంటూ జోస్యం చెప్పారు. అంతేకాదు.. తమను తాము అజేయంగా భావిస్తూ వచ్చిన గాంధీ కుటుంబం ఇప్పుడు కుప్పకూలిందని ఎద్దేవా చేశారాయన. अशोक गहलोत कांग्रेस अध्यक्ष चुनाव के लिए नामांकन करें या नहीं, पर उनकी बग़ावत ने सोनिया गांधी के राजनीतिक कद को बहुत छोटा कर दिया है। अब अध्यक्ष कोई भी बने, लेकिन कमज़ोर गांधी परिवार के ख़िलाफ़ बग़ावत फिर हो सकती है। गांधी परिवार का तथाकथित ‘अजेय’ आभामंडल अब ध्वस्त हो चुका है। — Amit Malviya (@amitmalviya) September 26, 2022 గెహ్లాట్ క్షమాపణ! ఇదిలా ఉంటే.. రాజస్థాన్ గ్రూప్ రాజకీయంపై అధిష్టానం సీరియస్‌గా ఉంది. గెహ్లాట్ మద్దతుదారులకు ఇప్పటికే హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ పరిణామాలను పార్టీ సీనియర్లు అజయ్ మాకెన్, మల్లికార్జున ఖర్గేలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వివరించారు. ఈ క్రమంలో లిఖితపూర్వక నివేదిక ఇవ్వాలని సోనియా స్వయంగా గెహ్లాట్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక సోమవారం మధ్యాహ్నం పార్టీ కీలక నేత మల్లికార్జున ఖర్గే, గెహ్లాట్‌ను కలిసి రెబల్ పరిణామాలపై చర్చించారు. అయితే ఈ చర్చల్లోనే ఆయన క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల తిరుగుబాటుపై ఖర్గేకు అశోక్ గెహ్లాట్ క్షమాపణ చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తనకు సంబంధం లేదని, జరిగి ఉండాల్సింది కాదని గెహ్లాట్.. జరిగిన పరిణామాలపై తాను కలత చెందినట్లు ఖర్గే వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే ఇకపై తన చేతుల్లో ఏం లేదని ఆయన పేర్కొన్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఇక ఈ సంక్షోభ పరిష్కారానికి కాంగ్రెస్ సీనియర్ కమల్‌నాథ్ మధ్యవర్తిత్వం వహించే ఛాన్స్ ఉంది. కానీ, కమల్‌నాథ్ మాత్రం ఈ పరిణామాలపై పెదవి విప్పడం లేదు. అంతేకాదు.. అధ్యక్ష పోటీ నుంచి గెహ్లాట్ తప్పుకోవడం కూడా దాదాపుగా ఖరారైనట్లు సమాచారం అందుతోంది. పార్టీలో తిరుగుబాటు కలకలం రేపడం, పైగా సీనియర్ల నుంచి అభ్యంతరాల నేపథ్యంలో ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో.. దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఉండే అవకాశం ఉందన్న కథనాలు వెలువడుతున్నాయి. -
అనూహ్య పరిణామం.. కీలక పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హఠాత్తుగా ఆయన అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను హైకమాండ్‌కు కూడా పంపించారు. అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ కమల్‌నాథ్ రాజీనామాను ఆమోదించడంతో పాటు డాక్టర్ గోవింద్ సింగ్‌ను తదుపరి సీఎల్పీ నాయకుడిగా నియమించింది. కాగా కమల్‌నాథ్ సడన్‌గా తన పదవికి రాజీనామా ఎందుకు చేశారనే సమాచారం తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఏప్రిల్ 28న కమల్‌నాథ్‌కు రాసిన లేఖలో.. కాంగ్రెస్ అధిష్టానం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రతి పక్షనాయకుడి పదవికి మీరు చేసిన రాజీనామాను తక్షణమే ఆమోదించింది. సీఎల్పీ నాయకుడిగా మీరందించిన సహాయ సహకారాన్ని పార్టీ ధన్యవాదాలు తెలుపుతోందని అన్నారు. ఇకపై మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేతగా గోవింద్ సింగ్ కొనసాగనున్నారు. చదవండి: BSP Mayawati: దేశానికి ప్రధాని కావాలన్నదే నా డ్రీమ్.. -
Let's have a race: సీఎం చౌహాన్‌కు కమల్‌నాథ్ చాలెంజ్
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ (74)ఆరోగ్యంపై పదేపదే కామెంట్లు చేస్తున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్(62)కు కమల్‌నాథ్ ఓ చాలెంజ్ విసిరారు. ‘నా ఆరోగ్యంపై పెద్ద చర్చ జరుగుతోంది. కమల్‌నాథ్ అనారోగ్యంతో ఉన్నారు, వృద్ధుడయ్యాడని చౌహాన్ అంటున్నారు. మీకు నేను చాలెంజ్ విసురుతున్నాను. ఇద్దరం కలసి పరుగుపందెంలో పాల్గొందాం. చదవండి: రైతుల ఆందోళనలో ఘర్షణ.. 8 మంది మృతి నాకు న్యూమోనియా ఉంది. అది తప్ప మిగిలిన రిపోర్టులు అన్ని సాధారణంగానే ఉన్నాయి. న్యూమోనియా ఉన్నందునే పోస్ట్ కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాను. కాంగ్రెస్ పార్టీతో ఉన్న బాధ్యతల రీత్యా ఢిల్లీలో ఉన్నాను తప్ప ఆరోగ్యం గురించి కాదు’ అని పేర్కొన్నారు. కమల్ అనారోగ్యంతో ఉన్నారని చౌహాన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
సోనియాతో కమల్‌నాథ్ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. పార్టీలో కమల్‌నాథ్ మరింత కీలకం కానున్నా రంటూ ఊహాగానాలు వెల్లువెత్తు తున్న సమ యంలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో ప్రక్షాళన జరగా లంటూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతలు సహా అందరితోనూ కమల్‌నాథ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. కొందరు ప్రతిపక్ష పార్టీల నేతలతోనూ మంచి సంబంధాలున్న కమల్‌నాథ్‌తో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోనియా ప్రత్యేకంగా సమావేశం కావడం గమనార్హం. -
ఆసుపత్రిలో మాజీ సీఎం: క్ష్రీణించిన ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీ నొప్పి కారణంగా బుధవారం ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో శ్వాసకోశ విభాగానికి తరలించి సీనియర్ వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కమల్‌నాథ్ ఆరోగ్యం క్షీణిచిందని కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలుజా ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో పలువురు కాంగ్రస్ నేతలు కమల్ నాథ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కమల్‌నాథ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. కాగా కోవిడ్-19ను రాజకీయం చేశారనే ఆరోపణలపై కమల్ నాథ్‌పై గత నెల( మే 24న) కేసు నమోంది. కరోనా వాస్తవ లెక్కలను వెల్లడించాలన్నందుకు తనపై కేసులు పెడుతున్నారని, దేశద్రేహి అంటున్నారని కమల్‌నాథ్ బీజేపీ సర్కార్‌పై మండిపడ్డారు. మరోవైపు చాలా కాలంగా ఢిల్లీలో ఉంటున్న కమల్ నాథ్‌కు హనీ ట్రాప్ కేసులో సిట్ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. पूर्व मुख्यमंत्री श्री कमलनाथ जी के अस्वस्थ होने की सूचना मिली है। मैं ईश्वर से प्रार्थना करता हूँ कि वे उन्हें शीघ्र ही पूर्ण स्वस्थ करें। @OfficeOfKNath — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 9, 2021 -
Kamal Nath: ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు!
భోపాల్: కోవిడ్-19ను రాజకీయం చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్‌పై మే 24న కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే దీనిపై కమల్ నాథ్ శనివారం స్పందించారు. కరోనాకు సంబంధించిన వాత్సవ లెక్కలను వెల్లడించాలని కోరితే బీజేపీ పాలకులు తనపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంతో గొప్ప దేశమైన భారత్‌లో ప్రస్తుత పరిస్థితులపై ప్రశ్నిస్తే తనను దేశద్రేహి అంటున్నారని అన్నారు. కోవిడ్ కారణంగా ఎంతో మంది ప్రజలు మరణిస్తున్నారు. వాటి వివరాలను అడిగితే రాజకీయాలు చేస్తున్నానని అంటున్నారంటూ విమర్షించారు. వ్యాక్సిన్లకు సంబంధించిన వివరాలను అడిగితే తప్పేంటని కమల్ నాథ్ ప్రశ్నించారు. ఇక శుక్రవారం "మేరా భారత్ మహాన్ నహీ హై, బాడ్నం హై (నా దేశం గొప్పది కాదు..అపఖ్యాతి పాలైనది) అనే వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. (చదవండి: కరోనా విజృంభణ..భయాందోళనలో గ్రామస్తులు) -
CM Chauhan: జనాలు చస్తుంటే..రాజకీయాలా!
భోపాల్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ప్రాణవాయువు అందక వందలాది మంది కరోనా బాధితులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే కోవిడ్‌పై రాజకీయ వివాదానికి తెరలేపిన 'కాంగ్రెస్ టూల్‌కిట్' వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య చెలరేగిన మాటల యుద్ధం చల్లారడం లేదు. నిన్నటి వరకు ట్విట్టర్ వేదికగా టూల్‌కిట్ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న పార్టీలు ఇప్పుడు కరోనా మ్యూటెంట్ పేరిట దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో లక్ష మందికి పైగా ప్రజలు మరణించారు. చైనీస్ కరోనాగా ప్రారంభమై, ఇప్పుడు ఇండియన్ వేరియంట్ కరోనాగా మారింది. దీన్ని చూసి ప్రధాని, రాష్ట్రపతి భయపడుతున్నారు అంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ విమర్శించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. ఓ వైపు జనాలు ప్రాణాలు కోల్పోతుంటే..కాంగ్రెస్ పార్టీ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటుందని మండిపడ్డారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన కరోనా ‘‘ఇండియన్ వేరియంట్’’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. దీనిపై సోనియా గాంధీ స్పందించకుండా ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తోందని దుయ్యబట్టారు. కమల్ నాథ్ మాటలను సోనియా అంగీకరిస్తుందా అంటూ ప్రశ్నించారు. ఇక ఈ రోజు రాష్ట్రంలో 7000 మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారన్నారు. కొత్తగా 2,936 కరోనా కేసులు మంది కరోనా బారిన పడినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4.2 కి పడిపోయిందని పేర్కొన్నారు. అయిన్పటికీ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. (చదవండి: Toolkit రగడ: దుమ్మెత్తి పోసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ) -
Toolkit రగడ: దుమ్మెత్తి పోసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ
న్యూఢిల్లీ: కోవిడ్‌పై రాజకీయ వివాదానికి తెరలేపిన 'కాంగ్రెస్ టూల్‌కిట్' వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య చెలరేగిన మాటల యుద్ధం చల్లారడం లేదు. నిన్నటి వరకు ట్విట్టర్ వేదికగా టూల్‌కిట్ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న పార్టీలు ఇప్పుడు కరోనా మ్యూటెంట్ పేరిట దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ట్విట్టర్ లేబుల్‌తో ఈ గొడవ సమసిపోతుంది అనుకుంటున్న సమయంలో టూల్‌కిట్ వివాదాన్ని తిరగదోడారు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా. ఈరోజు ఆయన భోపాల్‌లో మాట్లాడుతూ ‘‘ఇండియన్ వేరియంట్ అనే వైరస్ లేకున్నా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్... ఇండియన్ వేరియంట్, సింగపూర్ వేరియంట్ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కూడా ఇలాగే చెప్పారు. టూల్‌కిట్‌తో కమల్‌నాథ్‌కి సంబంధం ఉందని చెప్పడానికి ఇంతకంటే వేరే ఆధారం లేదు’’ అంటూ విమర్శించారు. కమల్ నాథ్ కౌంటర్.. నరోత్తం మిశ్రా ప్రకటనపై ఘాటుగా స్పందించారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్. ఈ వైరస్‌ని మొదట చైనా వైరస్ అన్నారు. ఇప్పుడు ఇండియన్ వేరియంట్ వంతు వచ్చింది. మన శాస్త్రవేత్తలు, డాక్టర్లు కూడా న్యూ స్ట్రెయిన్‌ని ఇండియన్ వేరియంట్ అనే పిలుస్తున్నారు. కేవలం బీజేపీనే దీన్ని అంగీకరించడం లేదు. మన ప్రధానికయితే ఇండియన్ వేరియంట్ అంటేనే భయం పట్టుకుంది. అందుకే టూల్‌కిట్ అంటూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారంటూ’’ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు కమల్‌నాథ్. ఏమిటీ వేరియంట్.. వైరస్లు సర్వసాధారణంగా వెనువెంటనే వాటి రూపాన్ని మార్చుకుంటాయి. వాటినే స్ట్రెయిన్, మ్యూటెంట్‌గా పిలుస్తారు. ఇండియాలో వచ్చిన కరోనా మ్యూటెంట్‌కి సాంకేతికంగా బీ.1.167 గా గుర్తించారు. అయితే మీడియాతో పాటు సోషల్ మీడియాలో దీన్ని ఇండియన్ వేరియంట్‌గానే పేర్కొంటున్నాయి. ఇండియన్ వేరియంట్ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించనప్పుడు ... ఆ పేరు ఎందుకు ఉపయోగిస్తున్నారని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడైనా ఇండియన్ వేరియంట్ అనే పదం కనిపిస్తే తొలగించాలని లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ని హెచ్చరించింది కేంద్రం. చదవండి: ట్విట్టర్.. నీకిది సరికాదు: కేంద్రం -
2024 ఎన్నికల్లో ప్రధాని రేసులో దీదీ?
ఇండోర్: ‘పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు జాతీయ నేత. మమత ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక య్యారు. ఆమె కేవలం ప్రధానిని మాత్రమే గాక మోదీ మంత్రివర్గాన్ని, కేంద్ర సంస్థలైన సీబీఐ, ఈడీలనూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిం చారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ బుధవారం వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు మమతను ప్రధాని అభ్యర్థిగా యూపీఏ నిలబెడుతుందా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఆ విషయం ఇప్పుడే తెలియ దని, యూపీఏ సరైన సమయంలోనే తమ అభ్యర్థిని ప్రకటిస్తుందని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో చెలరేగిన రాజకీయ హింస గురించి తాను మమతతో మాట్లాడి నట్లు తెలిపారు. హింసను ఎంచుకోవడం తప్పని, హింస నుంచి దూరంగా ఉండేలా అందరిని కోరాల్సిందిగా మమతకు సూచించి నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌ను సందర్శిం చాల్సిందిగా ఆమెను కోరినట్లు తెలిపారు. -
మమత ఇప్పుడు జాతీయ నేత: కమల్‌నాథ్
ఇండోర్: ‘పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు జాతీయ నేత. మమత ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక య్యారు. ఆమె కేవలం ప్రధానిని మాత్రమే గాక మోదీ మంత్రివర్గాన్ని, కేంద్ర సంస్థలైన సీబీఐ, ఈడీలనూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిం చారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ బుధవారం వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు మమతను ప్రధాని అభ్యర్థిగా యూపీఏ నిలబెడుతుందా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఆ విషయం ఇప్పుడే తెలియదని, యూపీఏ సరైన సమయంలోనే తమ అభ్యర్థిని ప్రకటిస్తుందని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో చెలరేగిన రాజకీయ హింస గురించి తాను మమతతో మాట్లాడి నట్లు తెలిపారు. హింసను ఎంచుకోవడం తప్పని, హింస నుంచి దూరంగా ఉండేలా అందరిని కోరాల్సిందిగా మమతకు సూచించి నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌ను సందర్శిం చాల్సిందిగా ఆమెను కోరినట్లు తెలిపారు. చదవండి: (జాతీయ స్థాయి లాక్‌డౌన్‌కు ప్రధాని మోదీపై ఒత్తిడి) -
కుప్పకూలిన లిఫ్ట్.. మాజీ సీఎంకు తప్పిన ముప్పు
భోపాల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన ఎక్కిన లిప్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కొన్ని అడుగుల కిందకు పడిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వివరాలు.. కమల్ నాథ్ ఆదివారం ఇండోర్‌లోని డీఎన్ఎస్ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అప్పుడు ఆయనతో పాటు జితు పట్వారీ, సజ్జన్ సింగ్ వర్మ, విశాల్ పటేల్, వినయ్ బకాలివాల్ తదితర నేతలు ఉన్నారు. వీరంతా ఆస్పత్రిలోని లిఫ్ట్ ఎక్కారు. కాసేపటికే లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు పడిపోయింది. దాంతో లిఫ్ట్ డోర్స్ జామ్ అయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి.. వారిని బయటకు తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఇక ప్రమాదంపై డీఎన్ఎస్ ఆస్పత్రి హెడ్ మాట్లాడుతూ ‘‘కమల్ నాథ్ తన బృందంతో కలిసి లిఫ్ట్ ఎక్కే సమయానికే దానిలో 10 మంది ఉన్నారు. ఆ తర్వాత కమల్ నాథ్‌తో పాటు మరి కొందరు లిఫ్ట్ ఎక్కారు. ఓవర్‌లోడ్ కావడంతో లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లోకి పడిపోయింది’’ అని తెలిపారు. అనంతరం కమల్ నాథ్ మాట్లాడుతూ.. ‘‘ఆంజనేయుడి దయ వల్ల ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాను. హనుమంతుడి దయ నా మీద ఎప్పుడు ఉంటుంది’’ అని తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివారజ్సింగ్ చౌహాన్ ఆయనకు ఫోన్ చేసి.. క్షేమ సమాచారం తెలుసుకున్నారు. చదవండి: ఆమె ఓ ఐటెం..! సిగ్నల్స్ అందక మంత్రి పాట్లు, ఫోటోలు వైరల్ -
ఉప ఎన్నికల్లో బీజేపీ హవా
ఆ ఇద్దరు పెద్దలు ఇక ఢిల్లీకి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే కాంగ్రెస్ నాయకులు తమ ఓటమిని అంగీకరించినట్లే అన్నారు రాష్ట్ర మంత్రి నరోత్తం మిశ్రా. ఇక దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ ఢిల్లీకి వెళ్లాల్సిందే అన్నారు. మధ్యప్రదేశ్‌లో గెలుపు తమదే అని స్పష్టం చేశారు. యూపీలో అధిక్యంలో కొనసాగుతున్నబీజేపీ లక్నో: మద్యప్రదేశ్తోపాటు గుజరాత్లో 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 7, మణిపూర్‌లో 4, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 2, నాగాలాండ్‌లో 2, ఒడిశాలో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, హర్యానాలో 1 ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఇక ప్రస్తుతం యూపీలో 4 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగతుండగా.. ఎస్పీ 2 స్థానాల్లో.. బీఎస్పీ 1 చోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. గుజరాత్లో బీజేపీ 7 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన కమల్‌నాథ్ కౌంటింగ్ జరుగుతున్నందున మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. మధ్యప్రదేశ్‌లోని 28 సీట్లలో 18 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 18 స్థానాల్లో.. కాంగ్రెస్ 8, బీఎస్పీ 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగతున్న బీజేపీ మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ 9 స్థానాలోల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ ఒక్క చోట ఆధిక్యంలో ఉంది. భోపాల్: మధ్యప్రదేశ్‌లోనూ 28 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏడు నెలల క్రితం జ్యోతిరాదిత్య సింధియా.. కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి.. తన వర్గంతో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం బీజేపీ తరపున 107, కాంగ్రెస్ పార్టీ తరపున 87మంది ఎమ్మెల్యేలున్నారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ మరో 8 సీట్లు గెలుచుకోవాలి. ఒకవేళ 28 స్థానాల్లో ఎక్కువ చోట్ల కాంగ్రెస్ నెగ్గితే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే అవకాశముంటుంది. వీటిలో 27 చోట్ల ఇదివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏ వర్గానికి అనుకూలంగా రానున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. -
బై పోల్స్: ఫలితం ప్రభుత్వాన్ని కూల్చుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు ప్రధాన పార్టీల నడుమ మరోసారి రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. 94 అసెంబ్లీ స్థానాలకు బిహార్‌లో రెండోదశ పోలింగ్ ప్రారంభమవ్వగా.. ఈ స్థానాలు జేడీయూ, ఆర్జేడీకి ఎంతో ముఖ్యమైనవి. ఎన్డీయే తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు కేంద్రమంత్రులు సైతం ఆయా నియోజకవర్గల్లో సుడిగాలి పర్యటన చేశారు. జేడీయూ-బీజేపీ అభ్యర్థుల విజయానికి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీకి రెండోదశ పోలింగ్ అత్యంత కీలమైనది. కూటమి తరుఫున తేజస్వీ అన్నీ తానై ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. ఇక 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి ఇప్పటికే తొలిదశ పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. మరోవైపు మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రత్యేక దృష్టికి ఆకర్షించాయి. కమల్‌నాథ్ సర్కార్‌ను కూల్చి బీజేపీ గూటికి చేరిన 25 మంది ఎమ్మెల్యే రాజీనామాతో ఈ ఎన్నికలు అనివార్యం అయ్యాయి. మరో మూడు స్థానాలు కలుపుకుని మొత్తం 28 స్థానాలకు పోలింగ్ ఇదివరకే మొదలైంది. ఈ ఎన్నికను అధికార బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 28 స్థానాల్లో తొమ్మిదింటిలో గెలిస్తే శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన జ్యోతిరాధిత్య సింధియాకూ ఈ ఎన్నిక కీలకమైనది. ఆయన వర్గంగా భావిస్తున్న ఎమ్మెల్యేలంతా పోటీలో ఉండటంతో బీజేపీ నాయకత్వంలో వారి గెలుపు బాధ్యతను యువ నేతపై మోపింది. కాంగ్రెస్ నుంచి అవమానానికి గురై తిరుగుబాటు చేసిన సింధియా ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుని హస్తం పార్టీని కోలుకోలేని దెబ్బ తీయాలని కసితో రగిలిపోతున్నారు. అదే స్థాయిలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం సైతం జోరుగా నిర్వహించారు. మరోవైపు చేతిలో ఉన్న అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఉప ఎన్నికలు జరుగుతున్న 28 సీట్లు గెలిచినా మ్యాజిక్ ఫిగర్‌కు ఒక్క అడుగు దూరంలో ఆ పార్టీ నిలిచిపోతుంది. అయినప్పట్టికీ స్వతంత్రుల మద్దతులో మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కమల్‌నాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికలు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని మారుస్తాయా? లేక ఏకపక్ష తీర్పు రానుందా అనేది వేచి చూడాలి. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగటం గమనార్హం. మరోవైపు గుజరాత్(8), కర్ణాటక(2), చత్తీస్‌గఢ్(1), ఉత్తర ప్రదేశ్(7), జార్ఖండ్(2), నాగాలాండ్(2), హరియాణా(1), ఒడిశా(2), తెలంగాణ (దుబ్బాక)ల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. -
ఆయన స్టార్‌క్యాంపెయినర్ కాదనే అధికారం ఈసీకి లేదు
న్యూఢిల్లీ: ఇటీవల బీజేపీ మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించారన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి తొలగిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నాయకుడి ప్రచార స్థాయిని నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్‌కి లేదని కోర్టు స్పష్టం చేసింది. తనని స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి తొలగించడాన్ని కమల్‌నాథ్ కోర్టులో సవాల్ చేశారు. అయితే ఎన్నికల ప్రచారం ముగిసి, మంగళవారం ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమల్‌నాథ్ ఎన్నికల కమిషన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ చెల్లుబాటు కాదని, ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం తాము చర్యలు చేపట్టామని కమిషన్ తరఫున వాదిస్తోన్న న్యాయవాది ద్వివేదీ కోర్టుకి తెలిపారు. అయితే ఒక నాయకుడి ప్రచార స్థాయిని నిర్ణయించే అధికారం ఈసీకి ఉందా? అంటూ కమల్‌నాథ్ లేవనెత్తిన ప్రశ్నతో సుప్రీంకోర్టు పిటిషన్‌ను విచారించింది. వారి నాయకుడెవరో నిర్ణయించే అధికారం ఆ పార్టీకే ఉంటుంది తప్ప, ఆ అధికారం ఈసీ కి ఉండదని ఈసీ తరఫున హాజరైన న్యాయవాదికి కోర్టు తేల్చి చెప్పింది. అక్టోబర్ 13న కమల్‌నాథ్ బీజేపీకి వ్యతిరేకంగా చేసిన ఉపన్యాసంపై ఆధారపడి, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఈసీ ఆదేశాలు జారీచేసిందని కమల్‌నాథ్ పేర్కొన్నారు. ‘బాబ్రీ’ మాజీ జడ్జికి భద్రత పొడిగింపు కుదరదు బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ సీనియర్ నాయకులు ఆడ్వాణీసహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన మాజీ ప్రత్యేక జడ్జి జస్టిస్ ఎస్కే యాదవ్‌కు భద్రత పొడిగించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బాబ్రీ కేసు సున్నితమైన అంశం కనుక, అటువంటి కేసులో తాను తీర్పునిచ్చినందున తనకు వ్యక్తిగత భద్రత కొనసాగించాలంటూ జస్టిస్ యాదవ్ సుప్రీంకోర్టును కోరారు. లేఖలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా భద్రత పొడిగింపు సాధ్యం కాదని కోర్టు త్రిసభ్య బెంచ్ తెలిపింది. -
ఈసీకి ఆ అధికారం లేదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ 'స్టార్ క్యాంపెయినర్' హోదాను రద్దు చేస్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు 'స్టే' విధించింది. ‘స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి అభ్యర్థిని తొలగించడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు.. నాయకుల హోదాపై ఈసీకి నిర్ణయాధికారం ఎక్కడిది’ అని కోర్టు ప్రశ్నించింది. ఈసీకి ఆ నిర్ణయాధికారం లేనందున... కమల్ నాథ్ స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేయడంపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే నేత్రుత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం కమల్ నాథ్ పిటిషన్‌పై సోమవారం(నవంబర్ 2) విచారణ చేపట్టింది. (చదవండి: ‘స్టార్’ హోదా రద్దుపై సుప్రీంకోర్టుకు కమల్‌నాథ్) మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత ఇమర్తి దేవిని 'ఐటెం' అని కమల్ నాథ్ విమర్శించడం తీవ్ర దుమారం రేకెత్తించింది. దీనిపై బీజేపీ నేతలు ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేయడంతో... కమిషన్ కమల్ నాథ్ వివరణ కోరింది. అయితే ఆయన వివరణపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఈసీ.. ఆయన స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కమల్ నాథ్ శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 'ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌ను నియమించుకోవడం రాజకీయ పార్టీలకు ఉన్న హక్కు. ఇందులో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోకూడదు. ఒకరకంగా ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం లాంటిదే' అని కమల్ నాథ్ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. -
‘స్టార్’ హోదా రద్దుపై సుప్రీంకోర్టుకు కమల్‌నాథ్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచారంలో తన స్టార్ క్యాంపెయినర్ హోదాను ఎన్నికల సంఘం (ఈసీ) రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 13వ తేదీ నాటి తన ప్రసంగంపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్య తీసుకుంటున్నట్లు తెలిపిన ఈసీ.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తన వాదన వినకుండా ఇలాంటి చర్య తీసుకున్నట్లు ప్రకటించడం ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ఈసీ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌నుద్దేశించి మాఫియా, కల్తీకోరు అంటూ కమల్‌నాథ్ తూలనాడటాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల కమల్‌నాథ్ రాష్ట్ర మహిళా మంత్రి, బీజేపీ అభ్యర్థిని ఇమార్తీదేవిని ‘ఐటెం’ అంటూ పేర్కొనడం వివాదాస్పదం అయింది. నిబంధనావళిని ఆయన పలుమార్లు అతిక్రమించారంటూ ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు చర్య తీసుకుంటున్నట్లు ఈసీ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ క్యాంపెయినర్ హోదా ఉన్న నేత ప్రచార ఖర్చును సంబంధిత రాజకీయ పార్టీ భరిస్తుంది. ఆ హోదా లేకుంటే ఆ నేత ప్రచార ఖర్చంతా ఆ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి ఖర్చు కిందికే వస్తుంది. మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3వ తేదీన జరిగే ఉప ఎన్నికలకు ప్రచార గడువు నవంబర్ ఒకటో తేదీతో ముగియనుంది. -
కాంగ్రెస్‌కి షాకిచ్చిన ఎన్నికల కమిషన్
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కమల్ నాథ్‌కు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగాను కమల్ నాథ్ స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక మహిళా అభ్యర్థిని ‘ఐటెం’ అంటూ సంభోదించడం పట్ల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళ పట్ల ఇలాంటి పదాలను వాడటం కమిషన్ జారీ చేసిన నియమాలను ఉల్లంఘించడమే అని పేర్కొంది. రాజకీయ పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ, కమల్ నాథ్ ప్రవర్తనా నియమావళి నిబంధనలను పదేపదే ఉల్లంఘించారని తెలిపింది. (చదవండి: ‘ఐటెం’ వ్యాఖ్యలపై కమల్ నాథ్ వివరణ) అలానే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కూడా కమల్ నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక ఇప్పటి నుంచి కమల్ నాథ్ ఏదైనా నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటే.. మొత్తం వ్యయాన్ని ఆ నియోజకవర్గ అభ్యర్థినే భరించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ తన ఉత్తర్వలో స్పష్టం చేసింది. అలానే ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు హుందాగా, గౌరవప్రదంగా మెలగడం కోసం అందరి ఏకాభిప్రాయంతో ప్రవర్తనా నియమావళిని రూపొందించారని.. ఇది అనేక దశాబ్దాలుగా అమలులో ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. -
‘పదవి వద్దు, పార్టీలో తగిన గౌరవం ఉంది’
భోపాల్: ఏ పదవులు ఆశించి తాను బీజేపీలో చేరాలేదని, ఆ పార్టీలో తనకు చాలా గౌరవం లభిస్తునందుకు ఆనందంగా ఉందని మధ్య ప్రదేశ్ ఫైర్ బ్రాండ్ జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. మధ్యప్రదేశ్ ఉపఎన్నికల నేపథ్యంలో ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఆయన కేవలం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. తన తండ్రి లాగానే తనకి కూడా ఏ పదవి కాంక్ష లేదని అన్నారు. మీకు క్యాబినేట్ మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. మీరు ఎలా భావిస్తున్నారు అని ప్రశ్నించగా తాను పదవి కోసం పార్టీ మారలేదని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చిందని కానీ వాటిని నెరవేర్చలేదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న రైతులను, మహిళలను, నిరుద్యోగులను కమల్‌నాథ్ ప్రభుత్వం మోసం చేసిందని, అలాంటి పార్టీకి బుద్ధి చెప్పడానికే తాను పార్టీ మారినట్లు చెప్పారు. ఇక పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ గురించి ప్రశ్నించగా పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పమని ఆదేశించిన కమల్‌నాధ్ చెప్పలేదని, అలాంటి దురుసు ప్రవర్తన కలిగిన నేతను తానెప్పుడు చూడలేదని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీకి మహిళలలు అన్నా, దళితులు అన్నా గౌరవం లేదని అందుకే కింది స్థాయి నుంచి ఎదిగిన మహిళను ఐటెమ్ అని సంబోధించడం బట్టే ఆ విషయం అర్థమవుతుందని అన్నారు. ఈ ఎన్నికలలో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు. చదవండి: ‘నాకు ఉప ముఖ్యమంత్రి ఆఫర్ ఇచ్చారు’ -
‘ఐటెం’ వ్యాఖ్యలపై కమల్‌నాథ్ విచారం
సాక్షి, భోపాల్: మధ్యప్రదేశ్ మంత్రి ఇమార్తీదేవిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజుకున్న హై-వోల్టేజ్ డ్రామా అనంతరం మాజీ ముఖ్యమంత్రి యూ టర్న్ తీసుకున్నారు. ఆ మహిళా మంత్రిని అగౌరవపరిచేలా తానేమీ మాట్లాడలేదని, క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. (‘కమల్ నాథ్ వ్యాఖ్యలను సమర్ధించను’) ఆదివారం జరిగిన ఉప ఎన్నికల ప్రచార ర్యాలీలో మంత్రి ఇమార్తీదేవిని కమల్‌నాథ్ ‘ఐటెం’ అంటూ అగౌరవంగా సంబోధించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఆ భాష సరైంది కాదన్నారు. అవమానకరంగా మాట్లాడిన కమల్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. -
‘ఐటెం’ వ్యాఖ్యలపై రాహుల్ విచారం
వయనాద్ : మధ్య్రప్రదేశ్ మంత్రి, ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవిపై కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన ఐటెం వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ మంగళవారం స్పందించారు. ఉప ఎన్నికలకు ముందు కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ‘కమల్‌నాథ్ జీ మా పార్టీ వ్యక్తే అయినా ఆయన వాడిన పదజాలాన్ని తాను సహించనని, దాన్ని ప్రశంసించలేమ’ని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆయన ఎవరైనా కమల్ నాథ్ వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. చదవండి : ‘సర్కార్ వారి దౌర్జన్యం’ దాబ్రాలో ఆదివారం ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా కమల్ నాథ్ మాట్లాడుతూ ఇమర్తి దేవిని ఉద్దేశించి ఐటెం అని వ్యాఖ్యానించడం దుమారం రేపింది. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రాజే సాధారణ వ్యక్తి కాగా తన ప్రత్యర్థి మాత్రం ఓ ఐటెం అని కమల్ నాథ్ వ్యాఖ్యానించారు. కమల్ నాథ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ సోమవారం మౌన దీక్ష చేపట్టారు. ఇక తన వ్యాఖ్యలపై వివాదం నెలకొనడంతో కమల్ నాథ్ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ అవమానించలేదని, పేరు గుర్తుకురాకపోవడంతో తన చేతిలో ఉన్న జాబితాలో ఉన్న విధంగా ఐటెం నెంబర్ వన్, టూ అని చదివానని, ఇది అవమానించడమా అని ప్రశ్నించారు. -
ఆమె ఓ ఐటెం..!
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్ర మహిళా మంత్రి ఇమార్తీ దేవిపై మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నవంబర్ 3వ తేదీన రాష్ట్రంలోని 28 స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఇమార్తీదేవి కూడా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కమల్‌నాథ్.. తమ పార్టీ అభ్యర్థి చాలా మంచి వ్యక్తి కాగా, ప్రత్యర్థి (బీజేపీకి చెందిన ఇమార్తీ దేవి) ‘ఐటెం’ అంటూ తూలనాడారు. దీనిపై బీజేపీ మండిపడింది. దళిత మంత్రిని కించపరిచేలా మాట్లాడిన కమల్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కమల్ వ్యాఖ్యలకు నిరసనగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రులు, బీజేపీ నేతలు జ్యోతిరాదిత్య సిందియా తదితరులు సోమవారం రెండు గంటల మౌనదీక్ష చేపట్టారు. కమల్‌నాథ్‌పై చర్య తీసుకోవాలని సీఎం చౌహాన్.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు. దళిత మహిళల హక్కుల కోసం తరచూ గళమెత్తుతున్న కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ కమల్‌నాథ్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలన్నారు. హరిజన మహిళను గౌరవించడం తెలియని కమల్‌నాథ్‌ను అన్ని బాధ్యతల నుంచి తప్పించాలని ఇమార్తీ దేవి కాంగ్రెస్ పార్టీని కోరారు. సీఎం పదవి కోల్పోయాక కమల్ మతి తప్పిందని ఇమార్తీ అన్నారు. కమల్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ ఖండించింది. ఆయనకు నోటీసులు జారీ చేయడంతోపాటు తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది. సమగ్ర నివేదిక కోరిన ఈసీ ఎన్నికల ప్రచారంలో మహిళా అభ్యర్థిపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అందించాలని మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారిని ఆదేశించింది. ‘ఈ అంశంపై మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఇప్పటికే నివేదిక అందజేశారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. మంగళవారం అందే నివేదికను బట్టి ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయం పరిశీలిస్తాం’అని తెలిపింది. -
‘ఐటెం’ వ్యాఖ్యలపై కమల్ నాథ్ వివరణ
భోపాల్ : మధ్యప్రదేశ్ మంత్రి ఇమర్తి దేవిపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మాజీ సీఎం కమల్ నాథ్ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ అవమానించలేదని, క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను మాట్లాడిన అంశంలో ఎవరినీ అవమానపరిచే వ్యాఖ్యలు లేవని, అసలు ఆ వ్యక్తి పేరేంటో కూడా తనకు గుర్తులేదని చెప్పుకొచ్చారు. తన చేతిలో ఉన్న జాబితా చూపుతూ ఇందులో ఐటెం నెంబర్ వన్, టూ అంటూ పేర్లున్నాయి..ఇది అవమానించడం అవుతుందా అని ప్రశ్నించారు. శివరాజ్ చౌహాన్ తప్పులు వెతుకుతున్నారని, కమల్‌నాథ్ ఏ ఒక్కరినీ అవమానించ లేదని అన్నారు. వాస్తవాలతోనే ఆయన మీ లోపాలు బయటపెడతారని వ్యాఖ్యానించారు. కాగా, ఆదివారం గ్వాలియర్ దాబ్రా పట్టణంలో నిర్వహించిన ఉప ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కమల్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆయన తమ ప్రత్యర్థి ఇమర్తి దేవిని ఉద్దేశిస్తూ ‘ఐటం’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కమల్ నాథ్ వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఇమర్తి దేవిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం రెండు గంటలపాటు మౌన దీక్ష చేపట్టారు. ఇక జ్యోతిరాదిత్య సింధియాకు విధేయురాలైన ఇమార్తి దేవి, మరో 21 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్, రాష్ట్ర అసెంబ్లీకి రాజీనామా చేసి, కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టి.. మార్చిలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరుగుతుంది. చదవండి : మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు -
మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు
-
ఆమె ఓ ‘ఐటం’.. సీఎం మౌన వ్రతం
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాష్ట్ర మంత్రి ఇమర్తి దేవిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం రెండు గంటలపాటు మౌనవ్రత దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ.. ‘మాజీ సీఎం వ్యాఖ్యలు ఆయన వంకర బుద్ధిని, నీచ మనస్తత్వాన్ని చూపిస్తున్నాయి. కమల్ నాథ్ వ్యాఖ్యలు కేవలం ఇమర్తి దేవికి మాత్రమే కాదు గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రతి మహిళ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి’ అంటూ ఆదివారం ట్వీట్ చేశారు. ఇంతకు వివాదం ఏంటంటే ఆదివారం గ్వాలియర్ దాబ్రా పట్టణంలో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో మాజీ సీఎం కమల్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆయన తమ ప్రత్యర్థి ఇమర్తి దేవిని ఉద్దేశిస్తూ ‘ఐటం’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘మా పార్టీ తరఫున బరిలో ఓ సాధారణ వ్యక్తి నిలచారు.. కానీ అవతలి క్యాండెట్ ఓ ఐటం’ అంటూ కమల్‌నాథ్ తన నోటి దురుసును ప్రదర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో చౌహాన్, కమల్ నాథ్ వ్యాఖ్యలపై స్పందించారు. ‘మీ ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ వక్ర బుద్ధి, నీచ మనస్తత్వం మరోసారి తెర మీదకు వచ్చింది. మీరు అవమానించింది ఇమర్తి దేవిని మాత్రమే కాదు.. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రతి సోదరిని. మహిళలతో గౌరవంతో ఆడుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు కమల్ నాథ్ జీ’ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీనిపై ఆదివారం బీజేపీ ప్రతినిధి బృందం భోపాల్‌లో ఎన్నికల సంఘం అధికారులను కలుసుకుని నాథ్‌పై "మహిళలు, దళితులను అవమానించారని" ఫిర్యాదు చేశారు. (చదవండి: దళిత మహిళపై దాడి.. వీడియో షేర్ చేసిన మాజీ సీఎం) జ్యోతిరాదిత్య సింధియాకు విధేయురాలైన ఇమార్తి దేవి, మరో 21 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్, రాష్ట్ర అసెంబ్లీకి రాజీనామా చేసి, కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టి.. మార్చిలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరుగుతుంది. -
దళిత మహిళపై దాడి..
-
దళిత మహిళపై దాడి.. వీడియో షేర్ చేసిన మాజీ సీఎం
భోపాల్ : దళిత మహిళపై బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారని, బాధితురాలి కూతురు తమ తల్లినిపై దాడి చేయొద్దని వేడుకున్నా.. వదల్లేదని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌ఓ వీడియోను ట్వీటర్లో షేర్ చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆడపడుచులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కమల్‌నాథ్ పోస్ట్ చేసిన వీడియోలో ఓ మహిళపై ఓ వ్యక్తి దాడికి దిగాడు. ఆమెను నెట్టేస్తూ తీవ్రంగా కొట్టాడు. ఊడిపోతున్న తన పంచెను సరిచేసుకుంటూ మరీ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలి కుమార్తె... తన తల్లిని విడిచిపెట్టాలంటూ గట్టిగా కేకలు పెట్టింది. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు.(చదవండి : మనిషి పెరిగినా బుద్ధి పెరగకపోతే ఇంతే..) ఈవీడియోను కమల్‌నాథ్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘బేతుల్ జిల్లాలోని శోభాపూర్ లో బీజేపీ నాయకులపై నిరసన వ్యక్తం చేసినందుకు ఒక దళిత మహిళ, ఆమె కుమార్తెపై ఆ పార్టీ నాయకులు బహిరంగంగా దాడి చేశారని హిందీలో ట్వీట్ చేశారు. దళిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆ నాయకులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పైగా దాడికి పాల్పడిన నేతలకు పోలీసులు అండగా నిలిచారని ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘శివరాజ్ జీ, మీ ప్రభుత్వంలో సోదరీమణులకు తరచూ ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. పోలీసులు నిందితులకు రక్షణ కల్పిస్తున్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకొని సదరు మహిళలకు, ఆమె కుమార్తెకు న్యాయం చేయాలి’అని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కమల్‌నాథ్ డిమాండ్ చేశారు. -
దళిత దంపతులపై జులుం
-
‘చావు తప్ప మరో దారి లేదు’
భోపాల్: చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్తో నాశనం చేయడం చూసి ఆ దళిత దంపతులు తట్టుకోలేకపోయారు. సొంత బిడ్డను చంపుతున్నట్లే భావించారు. ఆ ఘోరాన్ని చూడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అధికారుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. రామ్ కుమార్ అహిర్వార్, సావిత్రి దేవి దంపతులు కొన్నేళ్లుగా రెండు బిఘాల(5.5 ఎకరాలు) ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 2018లో ప్రభుత్వం ఆ భూమిని ఓ కాలేజీ కోసం కేటాయించింది. దాంతో ఆ భూమిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు రామ్ కుమార్ దంపతులకు సూచించారు. కానీ వాళ్లు అంగీకరించకపోవడంతో.. రెండు రోజుల క్రితం రాష్ట్ర రెవెన్యూ అధికారులు పోలీసులతో వచ్చి భూమిని ఖాళీ చేయాల్సిందిగా రామ్ కుమార్ దంపతులను బెదిరించారు. ఈ క్రమంలో బుల్డోజర్తో వారి పంటను నాశనం చేసే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు, రామ్ కుమార్ దంపతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ‘మాకు మూడు లక్షల రూపాయల అప్పు ఉంది. దాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటే.. మేం ఎలా బతకాలి. చావు తప్ప మాకు వేరే దారి లేదు’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా రామ్ కుమార్ మీద దాడి చేశారు. అడ్డుకోబోయిన సావిత్రి దేవిని అసభ్యకరమైన మాటలతో అవమానించారు. చివరకు బుల్డోజర్తో పంటను నాశనం చేసేందుకు ప్రయత్నించారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన ఆ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దాంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రామ్‌కుమార్ దంపతుల మీద దాడి చేసిన పోలీసులకు జిల్లా కలెక్టర్ క్లీన్‌చీట్ ఇవ్వడం మరింత వివాదాస్పదంగా మారింది. (మృతదేహం కళ్లు పీక్కుతిన్న చీమలు!) దాంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా రంగంలోకి దిగారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నింటికంటే ముందుగా పోలీసులకు క్లీన్‌చీట్ ఇచ్చిన కలెక్టర్‌ను, ఎస్పీని సస్పెండ్ చేశారు. తల్లిదండ్రులను కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలను కూడా పోలీసులు అవమానించారు. అవతలకు ఈడ్చిపారేశారు. ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ సీఎం కమల్‌నాథ్ రాష్ట్రంలో జంగిల్‌రాజా పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ‘దళిత దంపతుల మీద పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఏంటిది జంగిల్ రాజా. ఒకవేళ వారు ప్రభుత్వ భూమినే సాగు చేస్తున్నారనుకుందా. దాన్ని చట్టబద్దంగా పరిష్కరించుకోవాలి. అంతకాని జాలీ, దయ లేకుండా ఆ దంపతులను, వారి పిల్లలను కొట్టడం న్యాయం కాదు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.(కమల్‌ను కాపాడిన ‘కరోనా’) దీని గురించి ప్రభుత్వ అధికారులను ప్రశ్నించగా.. ‘లోకల్ గ్యాంగ్‌స్టర్ ఒకడు దాదాపు 4.5 బిఘాల(12.5ఎకరాలు) భూమిని ఆక్రమించుకున్నాడు. రామ్ విలాస్ దందపతులను వాడుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు అప్పులపాలైన రామ్ విలాస్ దంపతులను వాడుకుంటున్నాడు’ అని తెలిపారు. -
‘నా చుట్టూ గద్దలు తిరుగుతున్నాయి’
భోపాల్: బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ కొత్త కేబినెట్లో తన అనుచరులకు సముచిత స్థానం లభించిన నేపథ్యంలో.. ‘టైగర్ అభీ జిందా హై’ అంటూ జ్యోతిరాదిత్య గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అదే విధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ వాగ్గాదానాలు మరిచిన విషయం ప్రజలకు తెలుసునంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో జ్యోతిరాదిత్య వ్యాఖ్యలను తిప్పికొడుతూ ‘‘ఏ పులి బతికి ఉంది’’ అని కమల్‌నాథ్ ఎద్దేవా చేయగా.. ‘‘నిజమైన పులి వ్యక్తిత్వం ఏంటో తెలుసా’’ అంటూ డిగ్గీరాజా ట్విటర్ వేదికగా స్పందించారు. (టైగర్ అభీ జిందా హై: జ్యోతిరాదిత్య) ‘‘వేటపై నిషేధం లేని సమయంలో నేను, మాధవరావు సింధియా(జ్యోతిరాదిత్య తండ్రి) పులులను వేటాడేవాళ్లం. అయితే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వన్యప్రాణి సంరక్షణ చట్టం తీసుకువచ్చిన తర్వాత నుంచి కేవలం కెమెరాలో షూట్ చేస్తున్నా. నిజమైన పులి క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అడవిలో అదొక్కటే ఉంటుంది’’ అంటూ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక ఈ ఇద్దరు నేతల వ్యంగ్యాస్త్రాలకు జ్యోతిరాదిత్య శుక్రవారం ధీటుగా బదులిచ్చారు.(‘ఏ పులి బతికుంది పేపర్ మీదా? సర్కస్ లోనా?’) బీజేపీ వర్చువల్ ర్యాలీలో మాట్లాడిన ఆయన.. ‘‘నా చుట్టూ ఎన్నో గద్దలు తిరుగుతూ ఉంటాయి. దాడి చేస్తూ ఉంటాయి. మాంసం ఉన్న వాళ్ల చుట్టే పక్షులు ఆహారం కోసం తిరుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కమల్‌నాథ్, దిగ్విజయ సింగ్‌కు మరోసారి గుర్తు చేస్తున్నా. టైగర్ అభీ జిందాహై’’ అంటూ విమర్శలు తిప్పికొట్టారు. కాగా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సింధియా.. మార్చిలో కమల్‌నాథ్‌తో విభేదాలు తలెత్తిన క్రమంలో.. 22 ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జ్యోతిరాదిత్య బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
‘ఏ పులి బతికుంది పేపర్ మీదా? సర్కస్ లోనా?’
భోపాల్: బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియాపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాధ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సింధియా మార్చిలో కమల్‌నాధ్ అధ్యక్షతన అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి 22 ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ సీఎంగా ఎన్నికయ్యారు. బీజేపీలో చేరిన చాలామంది ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు సంపాదించి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జ్యోతిరాధిత్య ‘సింధియా టైగర్ అభి జిందాహై’ (టైగర్ ఇంకా బతికే ఉంది) అంటూ వ్యాఖ్యనించారు. దీనిపై స్పందించిన కమల్‌నాధ్ ‘ఏ టైగర్ బతికి ఉంది. పేపర్ మీద ఉన్నదా? సర్కస్‌లో ఉన్నదా?’ అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. మన దేశంలో రెండు రకాల గుర్రాలు ఉంటాయని, ఒకటి పెళ్లి ఊరేగింపులో ఉండేది, మరొకటి రేసులో ఉండేది అంటూ కమల్‌నాధ్ వ్యాఖ్యానించారు. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధాని నరేంద్రమోదీ మీద కూడా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (టైగర్ అభీ జిందా హై: జ్యోతిరాదిత్య) తాను టీ ఎప్పుడూ అమ్మలేదు అన్న కమల్‌నాధ్ ... కొంతమంది తమకు తాము టైగర్స్ అని చెప్పుకుంటున్నారని, అయితే తాను టైగర్‌ను కాదని, పేపర్ మీద ఉండే టైగర్‌ను కూడా కాదని, జస్ట్ కమల్‌నాధ్‌ని అని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఏంటనేది ప్రజలకు తెలుసని అన్నారు.ఇలాంటి సంఘటనలు మధ్యప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ గురించి మాట్లాడుతూ, అది బేరసారాల ప్రభుత్వమని, అందులో ఉన్నవారు ఎమ్మెల్యేలు కాదని, బేరమాడి కొనుకున్నవారు అని కమల్‌నాధ్ అన్నారు. (కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా మార్క్!) -
టైగర్ అభీ జిందా హై: జ్యోతిరాదిత్య
భోపాల్: ‘‘కమల్‌నాథ్ లేదా దిగ్విజయ్ సింగ్ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు నాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 15 నెలల్లో వారు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. వారి స్వప్రయోజనాల కోసమే వారు పనిచేశారు. ఒకసారి గతంలో వారు చేసిన వాగ్దానాలు, వాటిని విస్మరించిన చరిత్రను పరిశీలించుకోవాలి. అయితే నేను వాళ్లకు ఓ మాట చెప్పాలనుకుంటున్నా. ‘టైగర్ అభీ జిందా హై’ (పులి ఇంకా బతికే ఉంది)’’ అంటూ బీజేపీ ఎంపీ జోత్యిరాదిత్య సింధియా కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. తమ ప్రభుత్వంలో అర్హుడైన ప్రతీ పౌరుడికి అన్ని విధాలా లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. కాగా మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు గురువారం కేబినెట్ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో కొత్తగా 28 మందికి మంత్రులుగా పనిచేసే అవకాశం లభించింది. వీరిలో అత్యధికులు జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన జ్యోతిరాదిత్య సింధియా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ కేబినెట్ కేవలం నాయకుల బృందం మాత్రమే కాదు. ఇది ప్రజల కోసం పనిచేసే టీం. వాళ్లు మంత్రులు కాదు.. ప్రజాసేవకులు. ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. అట్టడుగు వర్గాలకు కూడా సంక్షేమ ఫలాలు అందుతాయి. 100 రోజుల పాలనలో శివరాజ్ సింగ్ ప్రభుత్వం కరోనాతో సమర్థవంతంగా పోరాడింది. సాధ్యమైనంత వరకు రైతులకు అండగా నిలబడింది. వచ్చే నాలుగేళ్లలో మరింత సమర్థవంతంగా పాలన కొనసాగుతుంది’’ అని చెప్పుకొచ్చారు. (కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా మార్క్!) ఇక సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సింధియా.. మార్చిలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు బయటకు రావడంతో కమల్‌నాథ్ సర్కారు కుప్పకూలగా.. బలం నిరూపించుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సింధియా ఎంపీగా ఎన్నికకాగా.. ఆయన మద్దతుదారులు ఈరోజు మంత్రులుగా అవకాశం దక్కించుకోవడం గమనార్హం. కాగా సింధియా కరోనా బారిన పడి కోలుకున్న విషయం విదితమే. -
వాళ్లిదరి ఆచూకీ చెబితే రూ. 21 వేలు!
భోపాల్: ‘‘మహమ్మారి కరోనా సంక్షోభ సమయంలో కనిపించకుండా పోయిన చింద్వారా ఎమ్మెల్యే, ఎంపీ కోసం స్థానిక ప్రజలు వెదుకులాట ప్రారంభించారు. వాళ్లను చింద్వారాకు తీసుకువచ్చిన వారికి 21,000 క్యాష్ రివార్డు ఇస్తాం’’ అంటూ చింద్వారా నియోజకవర్గం ప్రజలు పలుచోట్ల పోస్టర్లు అంటించారు. విపత్కర సమయంలో తమకు అండగా నిలవకుండా బాధ్యతారాహిత్యానికి పాల్పడ్డారంటూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఆయన కుమారుడు నకుల్‌నాథ్ ఫొటోలను పోస్టర్లపై ముద్రించి నిరసన తెలిపారు. కాగా చింద్వారా శాసన సభ స్థానం నుంచి కమల్‌నాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందగా.. లోక్‌సభ స్థానం నుంచి ఆయన తనయుడు నకుల్‌నాథ్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.('కళ్ల ముందే ప్రాణం పోతుంటే ఏం చేయలేకపోయా') ఈ క్రమంలో లాక్డౌన్ కారణంగా తాము కష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదంటూ వీరిద్దరిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ ఇలా పోస్టర్లు వేయించారు. ఇక పోస్టర్లపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ నాయకులే ఈ చర్యకు పాల్పడ్డారంటూ విమర్శలు గుప్పించారు. అయితే బీజేపీ నేతలు ఆ విమర్శలను కొట్టిపారేశారు. ఆ పోస్టర్లతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన జ్యోతిరాదిత్యా సింధియా కమల్‌నాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో కమల్ సర్కారు కూలిపోగా.. ఆయన రాజీనామా అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.(మిగిలిన టెన్త్ పరీక్షలు రద్దు.. సీఎం కీలక నిర్ణయం) -
బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్నారు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార పీఠాన్ని మళ్లీ దక్కించుకుంటామని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఖాళీ అయిన 24 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. (కొడుక్కి బుద్ధి చెప్పిన మాజీ మంత్రి) సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి వైదొలిగి బీజేపీలో చేరడంతో 22 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అసెంబ్లీకి రాజీనామా చేయడంతో మార్చి 20న కమల్‌నాథ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో మరో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించాల్సివుంది. (స్పెషల్ ట్రైన్ ఎక్కాలంటే.. ఇవి పాటించాలి) తనపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారని కమల్‌నాథ్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ కోల్పోయిన 22 అసెంబ్లీ స్థానాలను తిరిగి దక్కించుకుంటామన్నారు. బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. తనపై జరిగిన తిరుగుబాబు గురించి చెబుతూ.. ‘నేను చాలా బాధ పడ్డాను. బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగిపోతారని ఊహించలేకపోయాను. నాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. కానీ ప్రలోభాలు పెట్టడం తనకు తెలియద’ని కమల్‌నాథ్ అన్నారు. -
కరోనా పాజిటివ్: ఆ జర్నలిస్టుపై ఎఫ్ఐఆర్
భోపాల్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ జర్నలిస్టుపై మధ్యప్రదేశ్‌లో కేసు నమోదైంది. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలతో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్ ముఖ్యమంత్రి స్థానంలో చివరిసారిగా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశానికి సదరు జర్నలిస్టు హాజరయ్యారు. ఆ తర్వాత ఆ జర్నలిస్టులో కరోనా లక్షణాలు బయటపడటంతో వైరస్ నిర్ధారణ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. విషయం తెలుసుకున్న అధికారులు జర్నలిస్టు వివరాలపై ఆరా తీయగా.. లండన్ నుంచి వచ్చిన కూతురితో సదరు వ్యక్తి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారని తేలింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రెస్‌మీట్‌కు హాజరై నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. (లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన సబ్ కలెక్టర్?! ) ఇదిలా ఉండగా భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య శనివారం ఉదయానికి 873కు చేరింది. 19 మరణాలు సంభవించాయి. ఇక దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 159కు చేరుకుంది. శనివారం కొత్తగా అక్కడ ఆరు కేసులు(ముంబై-5, నాగ్‌పూర్-1)నమోదయ్యాయి.(కరోనా: 873కు చేరిన కేసులు.. 19 మంది మృతి) చదవండి: కరోనా: ఊపిరితిత్తులు ఎంతగా నాశనమయ్యాయో.. మహమ్మారి తొలి ఫొటోలు విడుదల -
జనతా కర్ఫ్యూని పాటించండి
భోపాల్: మధ్యప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహానే అని సూచన ప్రాయంగా తెలుస్తోంది. ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూని పాటించండంటూ చౌహాన్ ప్రజలను కోరడం ఆ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాజీనామా లేఖను గవర్నర్‌కి సమర్పించిన అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా ఆదివారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావాలనీ, ఎవ్వరూ బయటకు రాకూడదనీ, జనతా కర్ఫ్యూ పాటించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుని ప్రజలంతా పాటించాలంటూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజలను కోరారు. అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలిందనీ, అందులో బీజేపీ పాత్ర లేదన్నారు. అయితే తమ పార్టీ శాసనసభ్యులకు బీజేపీ డబ్బులు ఎరగా వేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌కి ఎవరు సీఎం కావాలనే విషయంలోనూ చౌహాన్‌కీ, మిశ్రాకీ విభేదాలున్నాయని దిగ్విజయ్ అన్నారు. -
కమల్‌నాథ్ రాజీనామా
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి కమల్‌నాథ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ లాల్జీ టాండన్‌కి కమల్‌నాథ్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్టు రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. దీంతో గత కొద్దిరోజులుగా మధ్యప్రదేశ్‌లో నెలకొన్న నాటకీయ పరిణామాలకు తెరపడింది. కమల్ నాథ్ రాజీనామాతో 15 నెలల కాంగ్రెస్ పాలన అర్థాంతరంగా ముగిసే పరిస్థితి ఏర్పడింది. 22 మంది శాసనసభ్యుల రాజీనామా చేయడంతో బలపరీక్షకు సుప్రీంకోర్టు శుక్రవారం సమయమిచ్చింది. కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్‌పార్టీ శుక్రవారం సాయంత్రం ఐదుగంటలకు అసెంబ్లీలో తన మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు గడువునిచ్చిన మరునాడే కమల్‌నాథ్ రాజీనామాకు ఉపక్రమించారు. గవర్నర్‌కి సమర్పించిన రాజీనామా పత్రంలో ‘నా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజాస్వామిక విలువలతో కూడిన, స్వచ్ఛమైన రాజకీయాలు నెరపాను. వాటికే ప్రాముఖ్యతనిచ్చాను. ఐతే గత రెండు వారాల్లో ప్రజాస్వామ్య విలువలకు స్వస్తిపలికే సరికొత్త అధ్యాయానికి బీజేపీ తెరతీసింది’ అని కమల్‌నాథ్ ఆరోపించారు. గవర్నర్‌కి రాజీనామా సమర్పించిన కమల్‌నాథ్ మధ్యప్రదేశ్‌కి కాబోయే నూతన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి తన తోడ్పాటునందిస్తానని తెలిపారు. ఈ రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కి అందజేయడానికి ముందు కమల్‌నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రపన్ని ప్రజాస్వామిక విలువలను ఖూనీ చేసిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభానికి జ్యోతిరాదిత్య సింధియా కారకుడంటూ నిందించారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో ఆయనకు అనుకూలంగా 22 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బలపరీక్షకు సిద్ధం కమ్మంటూ సుప్రీంకోర్టు కమల్‌నాథ్ ప్రభుత్వానికి గురువారం గడువునిచ్చింది. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ శాసనసభలో 16 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. విశ్వాసపరీక్ష కోసం మధ్యాహ్నం రెండు గంటలకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశమైంది. కమల్‌నాథ్ రాజీనామాతో రాష్ట్ర అసెంబ్లీ వాయిదాపడింది. ఒంటిగంట ప్రాంతంలో కమల్‌నాథ్ గవర్నర్‌కి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్టు తెలిపిన స్పీకర్ ఎన్.పి. ప్రజాపతి, కమల్‌నాథ్ రాజీనామాతో ఆ ఆవశ్యకత లేదని వెల్లడించారు. -
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భంగపాటు
అధికారాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి కమల్‌నాథ్ శుక్రవారం రాజీనామా చేయకతప్పలేదు. ఆరుగురు మంత్రులతోసహా 23మంది ఎమ్మెల్యేలు కర్ణాటకలోని రిసార్ట్‌కు వలసపోయి, కమల్‌నాథ్ నాయకత్వంలో తమకు విశ్వాసం లేదని పదిరోజులక్రితం ప్రకటించినప్పటినుంచీ రాష్ట్రం రాజకీయ సంక్షోభంలో పడిపోయింది. వారితో మాట్లాడటానికి, వెనక్కు తీసుకురావడానికి దిగ్విజయ్‌సింగ్ మొదలుకొని కొందరు కాంగ్రెస్ నాయ కులు చేసిన ప్రయత్నం ఫలించకపోగా...రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను నేరుగా కలిసి తమ నిర్ణయం ఇష్టపూర్వకమైనదని, దాని వెనక ఎవరి ఒత్తిళ్లూ లేవని చెప్పే సంప్రదాయంనుంచి సుప్రీం కోర్టు మినహాయింపు ఇవ్వడంతో కమల్‌నాథ్ ప్రభుత్వ పతనం ఖాయమైపోయింది. వారు నేరుగా రాలేకపోతే వీడియో కాల్ ద్వారా వారి అభిప్రాయాలు తీసుకోమని సుప్రీంకోర్టు సూచించగా స్పీకర్ ఎన్పీ ప్రజాపతి నిరాకరించారు. రాజీనామాలను ధ్రువీకరించడానికి భోపాల్‌లో అడుగుపెట్టిన ప్పుడు ఆ ఎమ్మెల్యేలను ఒప్పించవచ్చని కాంగ్రెస్ భావించింది. తిరుగుబాటు చేసిన చాలామందిలో అంతర్మథనం మొదలైందని, సభలో ఓటింగ్ జరిగినప్పుడు కాంగ్రెస్ సత్తా ఏమిటో తేలుతుందని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అంతకు కొన్ని రోజుల ముందు చెప్పడంలోని అంతరార్థం ఇదే. కానీ ధర్మాసనం నుంచి వచ్చిన వీడియో కాల్ ప్రతిపాదనతో కాంగ్రెస్ ఆశలు కల్లలయ్యాయి. ఆరుగురు మంత్రులూ శాసనసభ్యత్వాలకు చేసిన రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. మిగిలిన వారిపై ఒత్తిళ్లు లేవని స్పీకర్ వ్యక్తిగతంగా సంతృప్తి చెందాల్సివుంటుందని ఆయన తరఫు న్యాయ వాది చేసిన వాదనను ధర్మాసనం అంగీకరించలేదు. సభకు రావాలా వద్దా అనేది ఎమ్మెల్యేల ఇష్ట మని, హాజరుకావాలనుకున్నవారికి రక్షణ కల్పించాలని కర్ణాటక, మధ్యప్రదేశ్ డీజీపీలను ఆదేశిం చింది. పైగా సభలో ఓటింగ్ తప్ప మరేదీ చేపట్టడానికి వీల్లేదని, అది కూడా చేతులెత్తడం ద్వారా మాత్రమే జరగాలని, దీన్నంతటినీ వీడియో తీయాలని ఆదేశించింది. అధికార పక్షాలనుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం, ప్రభుత్వాలను కూల్చడం మన దేశంలో కొత్తేమీ కాదు. అలా ఫిరాయించినవారిని వెనక్కు తీసుకురావడానికి అధికార పక్షాలనుంచి ప్రయత్నాలూ రివాజే. కానీ మధ్యప్రదేశ్ డ్రామాలో మొదటి సగం మాత్రమే జరిగింది. వెళ్లిన వారంతా కర్ణాటక విడిది నుంచి వెనక్కు రావడానికి, కాంగ్రెస్ పెద్దల్ని కలవడానికి నిరాకరించారు. రాజీనామాల సంగతిని ధ్రువీకరించడానికి స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు కూడా సిద్ధపడలేదు. ఫిరాయింపులకు పాల్పడితే శాసనసభ్యత్వం కోల్పోయేవిధంగా చట్టం తీసుకొచ్చిన కాంగ్రెసే అంతకు ముందూ, ఆ తర్వాతా కూడా ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించింది. ప్రభుత్వాల భవిత వ్యాన్ని రాజ్భవన్లే తేల్చే సంప్రదాయాన్ని కూడా ఆ పార్టీయే మొదలుపెట్టింది. ఇలా ప్రభుత్వాలను ఇష్టానుసారం బర్తరఫ్ చేయడానికి వీల్లేదని, బలాబలాలు చట్టసభల్లోనే తేలాలని ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేశాక ఈ ధోరణి తగ్గింది. అయితే పూర్తిగా కనుమరుగు కాలేదు. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ కూటమికి నాయకత్వంవహిస్తున్న బీజేపీ ఆ ఎత్తుగడలకే కొత్త పద్ధతులు జోడించింది. 60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 42 స్థానాలు గెల్చుకున్న కాంగ్రెస్‌ను నాలుగేళ్లక్రితం సునాయాసంగా అధికారం నుంచి దించేయగలిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు తగి నన్ని స్థానాలు గెల్చుకోని గోవాలో కూడా అది అధికారం తెచ్చుకోగలిగింది. కర్ణాటకలో సరేసరి. అక్కడ 14 నెలలపాటు కొనసాగిన కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని నిరుడు జూలైలో కూల్చడంలోనూ ఈ కొత్త ఎత్తుగడలే అక్కరకొచ్చాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో సైతం బీజేపీ ఈ ఎత్తుగడలనే అనుసరించింది. మధ్యప్రదేశ్ సంక్షోభం హఠాత్తుగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల పర్యవసానంగా జరిగినట్టు కనబడినా 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఇందుకు సంబంధించిన బీజాలు పడ్డాయి. అక్కడ ముగ్గురు నేతలు–దిగ్విజయ్‌సింగ్, కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా శిబి రాలుగా కాంగ్రెస్ చీలిపోయింది. ఎన్నికల సమయంలో కాబోయే సీఎం జ్యోతిరాదిత్యేనని రాహుల్ గాంధీ అందరిలోనూ అభిప్రాయం కలిగించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు గెల్చుకోగా, బీజేపీ 109కి పరిమితమైంది. సీఎం పీఠంపై ఎవరుండాలో మీరే నిర్ణయించాలని రాహుల్‌గాంధీని లెజిస్లేచర్ పార్టీ ఏకగ్రీవంగా కోరినా, ఆయన ఆ పని చేయలేకపోయారు. కమల్‌నాథ్ వైపే సోనియా గాంధీ మొగ్గు చూపడం, అందుకోసం రాహుల్‌పై ఒత్తిడి తీసుకురావడం పర్యవసానంగానే ఇలా జరిగింది. రాజీ మార్గంగా ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని జ్యోతిరాదిత్యను ఒప్పించినా, అయితే తమ వర్గంనుంచి కూడా మరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని దిగ్విజయ్‌సింగ్ డిమాండ్ చేశారు. దీంతో జ్యోతిరాదిత్య వెనకడుగు వేశారు. ఆయనకు కనీసం రాజ్యసభ స్థానాన్ని ఇస్తామని కూడా పార్టీ హామీ ఇవ్వలేకపోయింది. ముగ్గురు నేతల తీరువల్ల ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వున్నా అధిష్టానం మేల్కొనలేదు. ఈ పరిస్థితిని తనకనుకూలంగా మలుచుకోవడంలో బీజేపీ విజయం సాధించింది. ఆయన్ను తమ పార్టీలో చేర్చుకుని ఎంపీగా అవకాశమిచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు గనుక ఆ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం వుంది. అయితే వాటిల్లో ఎన్నిటిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోగలదన్నదాన్ని బట్టి మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ భవితవ్యం ఆధారపడివుంటుంది. పార్టీలో ఉన్నన్నాళ్లూ జ్యోతిరాదిత్యకు పొగబెట్టిన ఇద్దరు సీనియర్ నేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్‌సింగ్‌లు ఆ ఉప ఎన్నికల్లో ఏమేరకు తమ సత్తా చాటుతారో చూడాల్సివుంది. అంతకన్నా ముందు మరింతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు పోకుండా చూడటం వారికి పెద్ద పరీక్ష. -
అమిత్ షా వ్యూహం.. బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం!
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాజీనామా చేయడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష బీజేపీకి మార్గం సుగమమైంది. కమల్‌నాథ్ రాజీనామా అనంతరం ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌కు విజ్ఞప్తి చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శనివారం లేదా ఆదివారమే గవర్నర్ లాల్జీ టాండన్‌తో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడం, ఆయనతోపాటు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. (సీఎం పదవికి కమల్‌నాథ్ రాజీనామా) బీజేపీ సంబరాలు.. ఈ నేపథ్యంలో కమల్ సర్కార్ వెంటనే బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వివాదానికి తెరపడింది. సుప్రీం ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం లోగా అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని ధర్మాసనం స్పీకర్ ఎస్పీ ప్రజాపతిని ఆదేశించింది. ఈ క్రమంలోనే 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. దీంతో బలపరీక్షలో నెగ్గడం కష్టతరంగా భావించిన కమల్‌నాథ్.. దానికి ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో శివరాజ్ సింగ్ నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు విజయ సంకేతం చూపుతూ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కమళానికి లైన్ క్లియర్.. అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం బీజేపీ సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఆరుగురు మంత్రులతో పాటు 16 మంది శాసనసభ్యులు (మొత్తం 22) రాజీనామాతో అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 206కి చేరింది. వీరిలో కాంగ్రెస్‌కు 92 మంది, బీజేపీకి 107 మంది సభ్యుల మద్దతు ఉంది. నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఓ ఎస్పీ సభ్యుడు మొన్నటి వరకు కమల్నాథ సర్కార్‌కు మద్దతు ప్రకటించగా.. తాజా పరిణామాల నేపథ్యంలో వారు బీజేపీ వెంట ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సభలో 104 మంది సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది. దీంతో బీజేపీకి ఉన్న సభ్యులతో సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. (స్పీకర్ కీలక నిర్ణయం: కమల్ రాజీనామా..!) కర్ణాటక వ్యూహాలే అమలు.. కాగా కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ అక్కడ ప్రయోగించిన వ్యూహాలనే మధ్యప్రదేశ్‌లోనూ అమలు చేసింది. ముందుగా అసంతృప్తులపై వలవేసిన బీజేపీ.. ఆ తరువాత పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలను ప్రభుత్వంపై ఉసిగొలిపేలా ఎత్తులు వేసింది. ఈ క్రమంలో అప్పటికే సీఎం కమల్‌నాథ్‌పై పీకల్లోతు కోపంతో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్యా సింధియాను బీజేపీలో చేర్చుకోవడంలో ఆ పార్టీ నేతలు విజయవంతం అయ్యారు. దీనికి అనుగుణంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనలతో శివరాజ్‌సింగ్ చౌహాన్ చక్రం తిప్పారు. చివరికి కర్ణాటకలో చోటుచుసుకున్న పరిణామాలే మధ్యప్రదేశ్‌లోనూ రిపీటైయ్యాయి. అంతిమంగా బీజేపీ ఖాతాలోకి మరో రాష్ట్రం వచ్చి చేరబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (సింధియా నిష్క్రమణతో ‘చేతి’కి చిక్కులు) -
మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ రాజీనామా
-
సీఎం పదవికి కమల్‌నాథ్ రాజీనామా
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం నాటికి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. రాజీనామాలు చేయడంతో కమల్‌నాథ్ సర్కార్ మైనార్టీలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సరిపడ బలం లేకపోవడంతో శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ లాల్జీ టాండన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడంతో కమల్‌నాథ్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కాగా సీఎంగా ప్రమాణం చేసిన 15 నెలల్లోనే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. గత నెల రోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకే విధంగా గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వెంటనే సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను చక్కదిద్దేందుకు సభలో విశ్వాస పరీక్ష జరపాలని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం సభాపతిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం కమల్‌నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గడిచిన 15 నెలల్లో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, అయినా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు పన్నిందన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కర్ణాటకలో బంధించారని ఆరోపించారు. ఐదేళ్ల పాటు పరిపాలన చేయాలని ప్రజలకు తమకు అధికారం కట్టబెట్టారని, కానీ తనకు వ్యతిరేకంగా బీజేపీ కుట్రచేసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా బీజేపీ నాయకులు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడ్డారు. (16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలకు స్పీకర్ ఆమోదం) కాగా గురువారం అర్థరాత్రి రాష్ట్రంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్ ప్రజాపతి.. గత రాత్రి మిగిలిన 16మంది శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించారు. దీంతో అసెంబ్లీలో సంఖ్యాపరంగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సభలో మెజార్టీకి కావాల్సిన సభ్యలు సంఖ్య 104కి పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ 92 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉండగా.. ప్రతిపక్ష బీజేపీకి సొంతగా 107 ఎమ్మెల్యేలతో పాటు, నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీస్పీ, ఓ ఎస్పీ సభ్యుడి మద్దతుగా కూడా ఉంది. దీంతో సభలో మారిన సమీకరణల దృష్ట్యా బలపరీక్షలో కమల్‌నాథ్ ప్రభుత్వం గెలుపొందడం అంత తేలిక కాదని తేలిపోయింది. దీంతో బలపరీక్షకు ముందే రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో భోపాల్‌లో మీడియా సమావేశం నిర్వహించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
స్పీకర్ కీలక నిర్ణయం: కమల్ రాజీనామా..!
భోపాల్ : ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనాపై పెద్ద చర్చ జరుగుతుండగా... మధ్యప్రదేశ్‌లో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో ఇబ్బందుల్లో పడ్డ కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నేడు (శుక్రవారం) కఠిన పరీక్షను ఎదుర్కొనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ ఎస్పీ ప్రజాపతి నేడు బలపరీక్షను చేపట్టనున్నారు. గత నెల రోజులుగా సాగుతున్న ఈ తతంగానికి ముగింపు పలకే విధంగా గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వంపై ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వెంటనే సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రంలోగా అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం సభాపతిని ఆదేశించింది. (నేడు మధ్యప్రదేశ్‌లో బలపరీక్ష) రాజీనామాల ఆమోదం.. ఈ నేపథ్యంలోనే గురువారం అర్థరాత్రి రాష్ట్రంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్ ప్రజాపతి.. గత రాత్రి మిగిలిన 16మంది శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించారు. దీంతో అసెంబ్లీలో సంఖ్యాపరంగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సభలో మెజార్టీకి కావాల్సిన సభ్యలు సంఖ్య 104కి పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ 92 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉండగా.. ప్రతిపక్ష బీజేపీకి సొంతగా 107 ఎమ్మెల్యేలతో పాటు, నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీస్పీ, ఓ ఎస్పీ సభ్యుడి మద్దతుగా కూడా ఉంది. దీంతో సభలో మారిన సమీకరణల దృష్ట్యా బలపరీక్షలో కమల్‌నాథ్ ప్రభుత్వం గెలుపొందడం అంతతేలిక కాదు. (బలపరీక్షపై వైఖరేంటి?) కమల్‌నాథ్ రాజీనామా..? ఈ పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష కంటే ముందే ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్ రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిస్తున్నాయి. ప్రభుత్వానికి మద్దతు లేకపోవడంతో.. బలపరీక్ష వరకూ వెళ్లి భంగపడటం కన్నా ముందే రాజీనామా చేయడం సబబు అని ప్రభుత్వ వర్గాలు సూచించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై స్పీకర్ ప్రజాపతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం మధ్యాహ్నాం కమల్‌నాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. కీలక ప్రకటన చేస్తారని అన్నారు. దీంతో రాజీనామా చేస్తారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సీఎం మంతనాలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడం, ఆయనతోపాటు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. -
నేడు మధ్యప్రదేశ్‌లో బలపరీక్ష
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి, బలం నిరూపణ జరపాలని స్పీకర్ ఎన్పీ ప్రజాపతిని ఆదేశించింది. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడం, ఆయనతోపాటు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసెంబ్లీని 26వ తేదీకి స్పీకర్ వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మరో ఎంపీ పిటిషన్లు వేశారు. గురువారం ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం దాదాపు 8 సూచనలను వెలువరించింది. ‘అనిశ్చిత పరిస్థితులను చక్కదిద్దేందుకు సభలో విశ్వాస పరీక్ష జరపాలని సూచిస్తున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సభ మద్దతు ఉన్నదీ లేనిదీ నిర్ధారించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. సభ్యులు చేతులు ఎత్తి విశ్వాసం ప్రకటించాలి’అని స్పీకర్‌ను ధర్మాసనం ఆదేశించింది. ‘బెంగళూరులో ప్రస్తుతం మకాం వేసి ఉన్న 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎలాంటి ఒత్తిడులు, అడ్డంకులు లేకుండా చూడాలి. ఇతర పౌరుల మారిదిగానే వారిని స్వేచ్ఛగా ఉండనివ్వాలి’అని మధ్యప్రదేశ్, కర్ణాటక డీజీపీలను ఆదేశించింది. ‘అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలనుకున్న ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలి. సభా కార్యక్రమాలను వీడియో తీయించాలి. నిబంధనలకు లోబడి విశ్వాస పరీక్షను లైవ్‌లో కూడా ప్రసారం చేయవచ్చు. విశ్వాస పరీక్ష సమయంలో సభలో శాంతి, భద్రతలకు విఘాతం కలగరాదు. ఈ కార్యక్రమాలన్నీ మార్చి 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ముగియాలి. ఈ సమాచారాన్ని గవర్నర్‌కు తెలియజేయాలి’అని స్పీకర్‌కు, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. -
ఎమ్మెల్యేలను నిర్బంధించవద్దు
భోపాల్/న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు వేదికగా మధ్యప్రదేశ్ రాజకీయం బుధవారం ఆసక్తికర పరిణామాలకు దారితీసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై వాడివేడి వాదనలు జరిగాయి. కమల్‌నాథ్ ప్రభుత్వం మనుగడ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల చేతుల్లో ఉందని కోర్టు అంగీకరిస్తూనే.. బలపరీక్షను నిర్ణయించే అసెంబ్లీ కార్యకలాపాల్లోకి తాము రాదల్చుకోలేదని స్పష్టంచేసింది. అయితే అసమ్మతి ఎమ్మెల్యేలు వారి ఇష్టప్రకారం స్వేచ్ఛగా ఓటు వేయడానికి ఎలాంటి పరిస్థితులు కల్పిస్తారని ప్రశ్నించింది. ‘రెబెల్ ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లాలా లేదా అనేది వారి ఇష్టం. వారిని నిర్బంధంలో ఉంచారన్న ఆరోపణలు వచ్చినప్పుడు వారు స్వేచ్ఛగా ఉన్నారా లేదా అనేది మేము చూడాలి. వారిని నిర్బంధంలో ఉంచకూడదు’అని స్పష్టంచేసింది. రెబెల్ ఎమ్మెల్యేలను గురువారం జడ్జి చాంబర్లో హాజరుపరుస్తామని మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన ప్రతిపాదనను కోర్టు తోసిపుచ్చింది. వారు నిర్బంధంలో లేరని ఎలా నమ్మాలో చెప్పాలంటూ చౌహాన్ తరఫు లాయర్ ముకుల్ రోహత్గీని అడిగింది. అయితే వారు స్వచ్ఛందంగానే బెంగళూరులో ఉన్నారని, నిర్బంధంలో లేరని ఆయన సమాధానం ఇచ్చారు. రెబెల్ ఎమ్మెల్యేల లాయర్ మణిందర్ సింగ్ కల్పించుకొని, స్పీకర్ ముందుకు తమ ఎమ్మెల్యేలు రాబోవడం లేదని, కొందరి రాజీనామాలను స్వీకరించి మరికొందరివి ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను నిర్బంధంలో ఉంచిందని, వారిని కలిసేందుకు అనుమతించేలా కేంద్రానికి, కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేయగా.. రాజ్యాంగపరంగా ఎదురయ్యే అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేగానీ.. కాంగ్రెస్ నేతలతో కలవబోమని తిరుగుబాటు ఎమ్మెల్యేలు వాదించారు. బీజేపీ హిట్లర్ పోకడ: కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలున్న∙రిసార్ట్ వద్ద ఆ పార్టీ నేత దిగ్విజయ్‌సింగ్ ఆందోళనకు దిగగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిగ్విజయ్‌ను అరెస్ట్ చేయడం బీజేపీ హిట్లర్ తరహా నియంతృత్వ పోకడలకు నిదర్శనమని సీఎం కమల్‌నాథ్ అన్నారు. ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించి ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్.. అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతిని కొనియాడారు. -
బలపరీక్షపై వైఖరేంటి?
న్యూఢిల్లీ/భోపాల్/బెంగళూరు/ముంబై: మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తక్షణమే విశ్వాస పరీక్ష జరపాలన్న విషయంలో వైఖరి తెలపాల్సిందిగా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. ఈ విషయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకల్లా సమాధానం ఇవ్వాలంటూ సీఎం కమల్‌నాథ్‌కు, స్పీకర్ ప్రజాపతి, అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు పంపింది. గవర్నర్ టాండన్ సూచనలను పట్టించుకోకుండా కరోనా వైరస్ నేపథ్యంలో స్పీకర్ సభను 26వ తేదీ వరకు వాయిదా వేయడంతో మాజీ సీఎం శివరాజ్ సుప్రీం తలుపుతట్టారు. పిటిషనర్ల తరఫున ముకుల్ రోహత్గీ, మిశ్రా సౌరభ్‌ల వాదనలు విన్న ధర్మాసనం.. ‘అత్యవసర పరిస్థితుల దృష్ట్యా నోటీసులు ఇచ్చాం. వీటికి ఈ నెల 18వ తేదీ ఉదయం 10.30లోగా సమాధానం అందాలి’ అని ఆదేశించింది. రోహత్గీ తన వాదన వినిపిస్తూ..‘ఇలాంటి సందర్భాల్లో బలనిరూపణ జరపడం సమంజసం. కానీ, అవతలి పక్షం(కమల్‌నాథ్ ప్రభుత్వం) అందుకు సిద్ధంగా లేదు. వారు కావాలనే కోర్టును ఆశ్రయించలేదు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే’అని అన్నారు. సభ విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం ఇంకా కొనసాగడం అనైతికం, అప్రజాస్వామికం, అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. ‘గతంలో ఇలాంటి కేసులపై అర్ధరాత్రి కూడా విచారణ చేపట్టిన కోర్టు..బల నిరూపణకు ఆదేశాలు జారీ చేసింది’ అని అన్నారు. స్పందించిన ధర్మాసనం.. ‘రేపు ఉదయమే విచారణ చేపడతాం’అని తెలిపింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తమకూ అవకాశం కల్పించాలంటూ 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన వినతిని కోర్టు ఆమోదించింది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్, తమ రాజీనామాలను పెండింగ్‌లో ఉంచడానికి ఎటువంటి కారణాలు లేవని వారు తెలిపారు. మా ఎమ్మెల్యేలతో మాట్లాడనివ్వండి: కాంగ్రెస్ బెంగళూరులో మకాం వేసిన తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ సమావేశాల్లో ఆ ఎమ్మెల్యేలు పాల్గొనేలా ఆదేశించాలని కోరింది. కాగా, బలపరీక్ష నిరూపించుకోవాలంటూ గవర్నర్ రాసిన లేఖను ముఖ్యమంత్రి కమల్‌నాథ్ స్పీకర్‌కు పంపించారు. ‘అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాక, మీరు చేసిన సూచనలపై తగు చర్యలు తీసుకోవాలంటూ ఆ లేఖను స్పీకర్‌కు పంపా’అంటూ గవర్నర్‌కు బదులిచ్చినట్లు వెల్లడించారు. విశ్వాసపరీక్షపై గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని కమల్ అన్నారు. మరో 20 మంది సిద్ధం: తిరుగుబాటు ఎమ్మెల్యేలు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను వీడి వచ్చేందుకు మరో 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రకటించారు. జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా రాజీనామాలు సమర్పించి, బెంగళూరు రిసార్టులో మకాం వేసిన 22 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ..‘కొద్ది రోజుల్లోనే మరో 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన చేరనున్నారని తెలిపారు. అయితే, వారిని కాంగ్రెస్ బందీలుగా ఉంచింది. మా నేత జ్యోతిరాదిత్య సింధియా. ఆయన వల్లే మేం రాజకీయాల్లో ఉన్నాం. బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాం’అని తెలిపారు. -
కమల్‌ను కాపాడిన ‘కరోనా’
భోపాల్/న్యూఢిల్లీ: మధ్య ప్రదేశ్ రాజకీయాల్లో సోమవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరోనా వైరస్ కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాత్కాలికంగా ఆదుకుంది. విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని గవర్నర్ లాల్జీ టాండన్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను ఆదేశించిన నేపథ్యంలో.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభను మార్చి 26 వరకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రజాపతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అంతకుముందు, కోవిడ్–19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వవ్యాప్త మహమ్మారిగా నిర్ధారించిందని, ఆ వైరస్ వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో.. రాజస్తాన్, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారని మంత్రి గోవింద్ సింగ్ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు, మంగళవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఆదేశిస్తూ గవర్నర్ టాండన్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు సోమవారం మరో లేఖ రాశారు. విశ్వాస పరీక్ష జరపనట్లయితే.. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్లు భావించాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడడంతో బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని, తక్షణమే బల నిరూపణకు ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. నిమిషం పాటే గవర్నర్ ప్రసంగం: బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ సభను ఉద్దేశించి ఇచ్చే ప్రసంగం సోమవారం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఒక్క నిమిషం పాటే కొనసాగింది. అధికార, విపక్ష సభ్యుల నినాదాలు, వాగ్వివాదాల గందరగోళం మధ్య ఒక నిమిషంలోనే గవర్నర్ లాల్జీ టాండన్ తన ప్రసంగాన్ని ముగించి, వెళ్లిపోయారు. ఆ తరువాత, సోమవారమే బల నిరూపణ జరగాలని బీజేపీ చీఫ్ విప్ నరోత్తమ్ మిశ్రా, సభలో విపక్ష నేత గోపాల భార్గవ డిమాండ్ చేశారు. అనంతరం, గందరగోళం మధ్యనే కరోనా వైరస్ ముప్పును శాసనసభ వ్యవహారాల మంత్రి గోవింద్ సింగ్ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. దాంతో సభను 26 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్ వద్దకు బీజేపీ నేతలు: ఆ తరువాత, శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో 106 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ నివాసానికి వెళ్లి, తక్షణమే విశ్వాస పరీక్ష జరగాలని ఆదేశించాలని అభ్యర్థించారు. మరోవైపు, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసుల సాయంతో కర్నాటకలో బీజేపీ నిర్బంధించిందని, ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష రాజ్యాంగవిరుద్ధం అవుతుందని కమల్‌నాథ్ గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. -
‘రేపటిలోగా బలం నిరూపించుకోవాల్సిందే’
భోపాల్ : రాజకీయ సంక్షోభం నెలకొన్న మధ్యప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం కమల్‌నాథ్ రేపటిలోగా(మంగళవారం) అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని గవర్నర్ లాల్జీ టాండన్ మరోసారి ఆదేశించారు. ఈ మేరకు కమల్‌నాథ్‌కు ఆయన సోమవారం ఓ లేఖ రాశారు. కాగా, గవర్నర్ గత ఆదేశాల ప్రకారం కమల్‌నాథ్ సోమవారం శాసనసభలో విశ్వాస పరీక్ష ఎదుర్కొవాల్సి ఉండింది. అయితే సోమవారం ఉదయం ప్రారంభమైన మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను.. కరోనా వైరస్ నివారణలో భాగంగా స్పీకర్ మార్చి 26వ తేదీకి వాయిదా వేశారు. దీంతో నేడు శాసనసభలో కమల్‌నాథ్ బలపరీక్ష జరగలేదు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ బలపరీక్ష నిర్వహించాలని మరోసారి ఆదేశించారు. ఒకవేళ ప్రభుత్వ యత్రాంగం బలపరీక్షను నిర్వహించకపోతే.. కమల్‌నాథ్ అసెంబ్లీలో మెజారిటీ లేనట్టుగా భావించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పలువురు తమ పదవులకు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. కాంగ్రెలో కీలక నేతగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడంతో ఇది మరింత ముదిరింది. మరోవైపు రాజీనామా చేసిన మొత్తం 22 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకూ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దీంతో మధ్యప్రదేశ్ శాసనసభలో సభ్యుల సంఖ్య ప్రస్తుతం 222కు పడిపోయింది. చదవండి : కమల్‌నాథ్ బలపరీక్షకు బ్రేక్ మధ్యప్రదేశ్ హైడ్రామా : సుప్రీంను ఆశ్రయించిన బీజేపీ -
కమల్‌నాథ్ బలపరీక్షకు బ్రేక్
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం ఎదుర్కోవాల్సిన బలపరీక్షకు బ్రేక్ పడింది. అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ ప్రజాపతి ఈనెల 26వరకూ వాయిదా వేశారు. అంతకుముందు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ లాల్జీ టాండన్ రాజ్యాంగం నిర్ధేశించిన నియమాలను అందరూ గౌరవించి మధ్యప్రదేశ్ ప్రతిష్టను నిలపాలని సూచిస్తూ బలపరీక్ష తక్షణమే చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. కాగా స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోరాదని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ గవర్నర్ లాల్జీ టాండన్‌కు రాసిన లేఖలో కోరారు. ఇక సభను గౌరవించాలని కాంగ్రెస్ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా సోమవారం బలపరీక్ష జరపాలని పట్టుపట్టిన గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. బీజేపీ సభ్యుల అభ్యంతరాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నినాదాల మధ్య సభను ఈనెల 26కు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. 22 మంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో బీజేపీ గూటికి చేరడంతో విశ్వాస పరీక్షపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. మరోవైపు రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకూ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో సభలో సభ్యుల సంఖ్య 222కు పడిపోగా.. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ మార్క్ 112. దీంతో మిగిలిన ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది.ఇక తమ ప్రభుత్వానికి ఢోకా లేదని బలపరీక్షకు తాను సిద్ధమని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ పేర్కొనగా, ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే బలపరీక్షకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకాడుతోందని మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. చదవండి : కమల్‌నాథ్‌కు ‘కోవిడ్’ ఊరట? -
ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు
భోపాల్ : ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదకర కరోనా వైరస్ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ తగిన చర్యలను చేపడుతున్నాయి. భారత్‌లోనూ కరోనా ప్రభావం రోజురోజుకూ పోరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 107 కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడికి భారత ప్రభుత్వం కీలక చర్యలను చేపడుతోంది. వైరస్ లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి.. వైద్యుల పర్యవేక్షలో ఉంచుతోంది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుడటంతో.. కరోనా భయం అసెంబ్లీనీ తాకింది. దీంతో ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. (నేడు ‘బల నిరూపణ’ ఉంటుందా?) రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైపూర్‌లో, బీజేపీ ఎమ్మెల్యేలు హర్యానాలో, తిరుగుబాటు సభ్యులు బెంగళూరు గత పదిరోజుల పాటు క్యాంపు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసిన ఎమ్మెల్యేలకు ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తరుణ్ భానోత్ ఆదివారం రాత్రి తెలిపారు. సమావేశాలకు ముందు ప్రత్యేక వైద్యం బృందం శాసనసభ్యులందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష ఉంటుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. దీనిపై అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతి తుది నిర్ణయం తీసుకోనున్నారు. (ఉత్కంఠగా బలపరీక్ష.. క్యాంపులకు ఎమ్మెల్యేలు) -
మధ్యప్రదేశ్‌లో హైడ్రామా..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీలో సోమవారం బలనిరూపణ చేసుకోవాలని పాలక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశించిన క్రమంలో బలపరీక్ష జరిగే దాఖలాలు కనిపించడం లేదు. అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన సభా కార్యక్రమాల (లిస్ట్ ఆఫ్ బిజినెస్) జాబితాలో విశ్వాసతీర్మానం ప్రస్తావన లేకపోవడం ఈ సందేహాలకు తావిస్తోంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం, ఆయన ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం గురించే హౌస్ బిజినెస్ జాబితాలో పొందుపరిచారు. స్పీకర్ ఎన్పీ ప్రజాపతి సైతం విశ్వాస పరీక్షపై నోరు మెదపకుండా రేపు (సోమవారం) ఏం జరుగుతుందో మీరే చూస్తారని వ్యాఖ్యానించడం గమనార్హం. 22 మంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో బీజేపీ గూటికి చేరడంతో విశ్వాస పరీక్షపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు ఎలక్ర్టానిక్ ఓటింగ్ వ్యవస్థ పనిచేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలపడంతో అసెంబ్లీలో చేతులు ఎత్తడం ద్వారా బలపరీక్ష చేపట్టాలని రాష్ట్ర గవర్నర్ ఎల్జీ టాండన్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకూ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో సభలో సభ్యుల సంఖ్య 222కు పడిపోగా ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ మార్క్ 112. ఇక తమ ప్రభుత్వానికి ఢోకా లేదని బలపరీక్షకు తాను సిద్ధమని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ పేర్కొనగా, ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే బలపరీక్షకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకాడుతోందని మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. చదవండి : ఉత్కంఠగా బలపరీక్ష.. క్యాంపులకు ఎమ్మెల్యేలు -
నేడు ‘బల నిరూపణ’ ఉంటుందా?
భోపాల్: రాజకీయ సంక్షోభం నెలకొన్న మధ్యప్రదేశ్‌లో నేటి(సోమవారం) నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. సభను ఉద్దేశించి ఉదయం తాను ప్రసంగించిన అనంతరం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గవర్నర్ లాల్జీ టాండన్ శనివారం రాత్రి ఆదేశించారు. ‘నా ప్రసంగం ముగియగానే, విశ్వాస పరీక్ష ప్రక్రియను ప్రారంభించాలి. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 16న అది జరగాలి. వాయిదా వేయకూడదు’ అని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు పంపిన లేఖలో ఆయన విస్పష్టంగా పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవడంపై తన నిర్ణయం సోమవారం ప్రకటిస్తానని స్పీకర్ ఎన్పీ ప్రజాపతి వెల్లడించారు. దాంతో సోమవారం విశ్వాస పరీక్ష జరుగుతుందా? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 22 మంది రాజీనామా చేయడం, దాంతో మిగిలిన ఎమ్మెల్యేలను రాజస్తాన్ రాజధాని జైపూర్‌కు కాంగ్రెస్ తరలించడం తెలిసిందే. వారంతా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేం దుకు వీలుగా ఆదివారం తిరిగివచ్చారు. వారిని ఇళ్లకు పంపిం చకుండా, భోపాల్‌లోని ఒక హోటల్‌కు తరలించారు. రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురి రాజీనామాలను మాత్రమే స్పీకర్ ఆమోదించారు. కాగా, సభ్యులంతా హాజరై, పార్టీ నిర్ణయం మేరకు ఓటేయాలని కాంగ్రెస్, బీజేపీ విప్ జారీ చేశాయి. కాగా, విశ్వాస పరీక్షకు సంబంధించిన విషయం అసెంబ్లీ సెక్రటేరియట్ ఆదివారం రాత్రి విడుదల చేసిన ‘సభాకార్యక్రమాల జాబితా’లో లేకపోవడం గమనార్హం. గవర్నర్ ప్రసంగం, ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశాలే అందులో ఉన్నాయి. ఈ రోజు డౌటే..: సోమవారం ముఖ్యమంత్రి కమల్‌నాథ్ విశ్వాస పరీక్షను ఎదుర్కోకపోవచ్చని తెలుస్తోంది. సోమవారం బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించినప్పటికీ.. తుది నిర్ణయాధికారం స్పీకర్‌కే ఉంటుందని రాష్ట్ర మంత్రి పీసీ శర్మ పేర్కొన్నారు. అయితే, ముందుగా ఎమ్మెల్యేలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు జరపాలన్నారు. ఈ బల నిరూపణ సోమవారం జరగదని, ఈ అంశం కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు సంకేతాలిచ్చారు. మరోవైపు, గవర్నర్ ప్రసంగం పూర్తి కాగానే, విశ్వాస పరీక్ష జరపాలని డిమాండ్ చేస్తూ, సభాకార్యక్రమాలను బీజేపీ అడ్డుకునే అవకాశముంది. విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఆదేశిస్తూ సీఎం కమల్‌నాథ్‌కు గవర్నర్ టాండన్ రాసిన లేఖలో.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో మాత్రమే బల నిరూపణ జరగాలని ఆదేశించారు. అసెంబ్లీలో 228 మంది సభ్యులుండగా, ఆరుగురి రాజీనామాలు ఆమోదం పొందడంతో అది 222కి చేరింది. మిగతా 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలూ ఆమోదం పొందితే ఆ సంఖ్య 206కి చేరుతుంది. అప్పుడు మెజారిటీకి అవసరమైన మ్యాజిక్ నంబర్ 104 అవుతుంది. బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. రాజీనామాలకు ముందు సభలో కాంగ్రెస్ బలం 114. అందరి రాజీనామాలు ఆమోదం పొందితే అది 92కి చేరుతుంది. అలాగే, నలుగురు స్వతంత్ర, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఎటువైపు నిలుస్తారన్నదీ ప్రశ్నార్థకమే. గుజరాత్ లో కాంగ్రెస్‌కు షాక్ అహ్మదాబాద్: రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గుజరాత్లో షాక్ తగిలింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలను ఆమోదించినట్లు స్పీకర్ త్రివేదీ తెలిపారు. దీంతో సభలో కాంగ్రెస్ బలం 73నుంచి 69కి చేరింది. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టే అవకాశముందనే భయంతో కాంగ్రెస్ 14 మంది ఎమ్మెల్యేలను జైపూర్‌కు తరలించింది. గుజరాత్ నుంచి బీజేపీ ముగ్గురు అభ్యర్థులను రాజ్యసభ బరిలో నిలిపింది. అయితే, వారిలో ఇద్దరిని మాత్రమే బీజేపీ గెలిపించుకోగలదు. -
ఉత్కంఠగా బలపరీక్ష.. క్యాంపులకు ఎమ్మెల్యేలు
భోపాల్ : రాజకీయ సంక్షోభం నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లో అనుహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సర్కార్ సంకటంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశాల మేరకు సోమవారం శాసనసభలో విశ్వాసపరీక్ష జరుపనున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. కమల్‌నాథ్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన 22 మంది ఎమ్మెల్యేలు ఆదివారం భోపాల్ చేరుకున్నారు. జ్యోతిరాదిత్యా సింధియా అనుకూల వర్గంగా భావిస్తున్న వీరంతా బెంగళూరులోని రిసార్టులో ఇన్నిరోజులు గడిపారు. మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్ వెంట ఉన్న శాసన సభ్యులను సీఎం కమల్‌నాథ్ జైపూర్ క్యాంపుకు తరలించారు. విశ్వాస పరీక్షకు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో బీజేపీ భేరసారాలు నుంచి తమ సభ్యులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. (విశ్వాస పరీక్షకు సిద్ధం) సోమవారం అసెంబ్లీలో స్పీకర్ నర్మద ప్రసాద్ ప్రజాపతి సమక్షంలో బలపరీక్ష జరుగనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కమల్‌నాథ్ మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి.. బలపరీక్షపై అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులతో చర్చించారు. బల పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ తమ పార్టీ సభ్యులకు విప్ జారీచేసింది. మరోవైపు తమ ఎమ్మెల్యేలతో బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ భోపాల్‌లోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏ పార్టీకి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తమకు సింధియాపై అభిమానం మాత్రమే ఉందని, ఆయనతో పాటు బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఓ తిరుగుబాటు ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠ రేకిత్తిస్తున్నాయి. దీంతో 22 మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతు లభిస్తుందని భావించిన కమళ దళానికి భంగపాటు ఎదురైంది. (ఆ 22 మందికి నోటీసులు) మరోవైపు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్న ఎస్పీ, బీఎస్సీ, స్వతంత్ర ఎమ్మెల్యేలతో శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇదివరకే సంప్రదింపులు జరిపి.. వారిని బీజేపీ గూటికి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆరుగురు మంత్రులను కమల్‌నాథ్ ఇదివరకే మంత్రిమండలి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. వీరంతా తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు సమర్పించారు. కాగా మొత్తం 228 సభ్యులు గల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114, బీజేపీకి 107 మంది సభ్యుల మద్దతు ఉంది. అయితే 22 మంది కాంగ్రెస్ సభ్యుల రాజీనామాతో కమల్‌నాథ్ సర్కార్ మైనార్టీలో పడిపోయింది. (జ్యోతిరాదిత్య సింధియాకు షాక్..!) -
కమల్‌నాథ్‌కు ‘కోవిడ్’ ఊరట?
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వానికి కోవిడ్‌తో తాత్కాలిక ఊరట లభించనుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ నెల 16వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలు కానుండగా ఎమ్మెల్యేల వేరు కుంపటితో ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. కోవిడ్ భయంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తత ప్రకటించాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పలు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన కీలకమైన బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయనున్నట్లు సూచనప్రాయంగా ప్రకటించింది. శనివారం మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి తరుణ్ భానోత్ మీడియాతో మాట్లాడారు. ‘వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపైనా నిపుణులతో చర్చిస్తున్నాం’ అని తెలిపారు. అసెంబ్లీ వాయిదాపడితే విశ్వాస పరీక్షను ఎదుర్కొనే అవసరం కూడా ప్రస్తుతానికి కమల్‌నాథ్ ప్రభుత్వానికి తప్పనుంది. విశ్వాసపరీక్ష జరపాలి: బీజేపీ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గం గవర్నర్ టాండన్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ప్రభుత్వం మైనారిటీలో పడింది. బడ్జెట్ సమావేశాలకు ముందుగా ఆదివారమే బలపరీక్ష చేపట్టాలి’ అని గవర్నర్‌ను కోరామన్నారు. కాగా, శుక్రవారం సాయంత్రం విమానాశ్రయం నుంచి వెళ్తున్న బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఎదుట నల్ల జెండాలు ప్రదర్శించిన 35 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
విశ్వాస పరీక్షకు సిద్ధం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజకీయాలు రసకందా యంలో పడ్డాయి. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నామంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన గవర్నర్ లాల్జీ టాండన్‌ని కలిసి ఓ లేఖ అందజేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ నిర్బంధంలో ఉంచి బేరసారా లాడుతోందని ఆరోపించారు. ఈనెల 3, 4 తేదీల నుంచి 10వ తేదీ వరకు జరిగిన పరిణామాలను ఆ లేఖలో వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పడిందన్నారు. బెంగుళూరులో నిర్బంధంలో ఉంచిన 22 మంది ఎమ్మెల్యేలను విడుదల చేయాల్సిందిగా గవర్నర్‌ని కోరినట్టు వెల్లడించారు. ఏ క్షణంలోనైనా విశ్వాస పరీక్ష జరగొచ్చని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కోరిన మేరకు జ్యోతిరా దిత్య సింధియాకు అనుకూ లంగా రాజీనామా సమర్పించిన 22 మందిలో ఆరుగురు మంత్రులను తొలగించినట్లు గవర్నర్ కార్యాలయం ప్రకటించిం ది. ఇదిలా ఉండగా, మంత్రులతో సహా శాసన సభ్యులు బెంగళూరులోని రిసార్ట్స్‌లో తాము బందీలుగా ఉంచామంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. భోపాల్ బయలుదేరిన ఆరుగురు మంత్రులు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందజేసేందుకు బెంగళూరు రిసార్టులో ఉన్న ఆరుగురు మంత్రులు భోపాల్ బయలుదేరారు. వీరి రాక సందర్భంగా భోపాల్, బెంగళూరు విమానాశ్రయాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారంలోగా తన ముందు వ్యక్తిగతం గా హాజరవ్వాల్సిందిగా రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ శాసనసభ్యులకు స్పీకర్ ప్రజాపతి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభకు సింధియా నామినేషన్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, ఉన్నారు. -
గవర్నర్‌తో కమల్‌నాథ్ భేటీ
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్‌తో శుక్రవారం సమావేశమై అసెంబ్లీ వేదికగా జరిగే బలపరీక్షపై చర్చించారు. జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన క్రమంలో కమల్‌నాథ్ సర్కార్ సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడనుంది. మరోవైపు స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతి ఎదుట హాజరై రాజీనామాలు సమర్పించేందుకు రెబెల్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన డెడ్‌లైన్ దగ్గరపడటంతో హోలీ విరామం అనంతరం గవర్నర్ లాల్జీ టాండన్ భోపాల్‌కు చేరుకోవడంతో రాజకీయ పరిణామాలు జోరందుకున్నాయి. ఇక బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ బేరసారాలకు పాల్పడుతోందని గవర్నర్‌కు రాసిన లేఖలో సీఎం కమల్‌నాథ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అనైతిక, చట్టవిరుద్ధంగా బేరసారాలకు దిగుతోందని లేఖలో దుయ్యబట్టారు. స్పీకర్ నిర్ణయం ప్రకారం ఈ నెల 16న అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానని ఈ లేఖలో సీఎం పేర్కొన్నారు. ప్రజాస్వామ్య, శాసన వ్యవస్థలను పరిరక్షిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడటంలో ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడువబోమని తాను మధ్యప్రదేశ్ ప్రజలకు హామీ ఇస్తున్నానని అన్నారు. కాగా రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆరుగురు మంత్రులు సహా 13 మందికి శుక్ర, శనివారాల్లో తన ఎదుట హాజరు కావాలని మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా తనను కలిసి రాజీనామాలు సమర్పించాలని ఆయన చెబుతున్నారు.నిబంధనలు, ఆధారాలను పరిశీలించిన మీదట వారి రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ చెప్పారు. చదవండి : ఆపరేషన్ కమల్.. కాంగ్రెస్‌కు రంగుపడింది -
వాళ్లు మళ్లీ కాంగ్రెస్ గూటికే: సీఎం తనయుడు
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తనయుడు, ఎంపీ నకుల్ నాథ్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుకుంటారని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా, 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో కమల్‌నాథ్ సర్కారు మైనార్టీలో పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై నకుల్ నాథ్ బుధవారం పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘కమల్‌నాథ్ ప్రభుత్వానికి వచ్చి ఢోకా ఏమీలేదు. సర్కారు కచ్చితంగా నిలదొక్కుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలు స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. నిజానికి వాళ్లు వ్యక్తిగతంగా ఆయనను సంప్రదించలేదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న 92 మంది ఎమ్మెల్యేలను మేం కాపాడుకుంటాం’’ అని నకుల్‌నాథ్ పేర్కొన్నారు. (‘నా మేనల్లుడిదీ అదే పరిస్థితి.. పిచ్చోళ్లం కాదు’ ) కాగా అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. స్వతంత్రులు, బీజేపీయేతర పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 228(మొత్తం- 230 స్థానాలు.. ఇద్దరు సభ్యులు చనిపోవడంతో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి). ఇందులో తిరుగుబాటు బావుటా ఎగురువేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే సభలో సభ్యుల సంఖ్య 206కు చేరుకుంటుంది. అదే విధంగా కాంగ్రెస్ సొంత బలం 92కు పడిపోతుంది. ఇదే సమయంలో బీజేపీకి అసెంబ్లీలో 107 సభ్యుల బలం ఉంది. ఈ క్రమంలో మ్యాజిక్ ఫిగర్ 104 అయినప్పటికీ.. స్పీకర్ నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉన్న నేపథ్యంలో... స్వతంత్రులు, బీఎస్పీ, ఎస్పీకి చెందిన ఏడుగురు సభ్యులను తమవైపునకు తిప్పుకొనేందుకు ఇరుపార్టీలు రంగంలోకి దిగినట్లు సమాచారం.(ఆపరేషన్ కమల్.. కాంగ్రెస్‌కు రంగుపడింది) మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం: వరుస కథనాల కోసం క్లిక్ చేయండి -
ఆపరేషన్ కమల్.. కాంగ్రెస్‌కు రంగుపడింది
దేశమంతా హోలీ సంబరాల్లో ఉన్న వేళ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇటు కమల్‌నాథ్ సర్కార్ సంక్షోభం.. అటు బీజేపీలో సంబరాలు.. వెరసి మధ్యప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని మోదీతో భేటీ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించగానే బీజేపీ కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. మరోవైపు తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. అధికార కాంగ్రెస్‌కి రాజీనామా చేస్తూ 22 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు లేఖలు పంపడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఉత్కంఠ కొనసాగుతుండగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆరుగురు మంత్రులను తక్షణమే తొలగించాలని కోరుతూ సీఎం కమల్‌నాథ్.. గవర్నర్ లాల్జీ టాండన్‌కు లేఖ రాశారు. మొత్తంగా 15 నెలల కమల్‌నాథ్ సర్కారు పాలన కూల్చివేత అంచున ఊగిసలాడుతోంది. న్యూఢిల్లీ/భోపాల్: దేశమంతా హోలీ వేడుకల్లో ఉన్న వేళ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత మధ్యప్రదేశ్‌లో ఏర్పాటైన 15 నెలల కాంగ్రెస్ సర్కారు పతనం అంచున చేరింది. గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం కాంగ్రెస్‌ను వీడటం.. ఆ వెంటనే ఆయనకు మద్దతుగా 22 మంది శాసన సభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్‌కు లేఖలు పంపడంతో సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రాజీనామాలు చేసిన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. రాజీనామాలు ఆమోదం పొందితే కాంగ్రెస్ ప్రభుత్వం 92 మంది సొంత ఎమ్మెల్యేలతో మైనార్టీలో పడుతుంది. కాంగ్రెస్‌కు ప్రస్తుతం మద్దతిస్తున్న ఏడుగురు ఇతర సభ్యుల మద్దతు కీలకం కానుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ శాసన సభా పక్ష సమావేశాలను నిర్వహించి తమ ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతానికి తరలించాలని నిర్ణయించాయి. అమిత్ షాతో భేటీ అనంతరం ప్రధాని వద్దకు.. సింధియా ఉదయం తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం వారిద్దరూ కలసి ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకుని ఆయనతో దాదాపు గంటపాటు చర్చించారు. అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షురాలు సోనియాకు సింధియా లేఖ పంపారు. ‘18 ఏళ్లుగా కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నా. ఇక ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ప్రస్తుత పరిస్థితిల్లో ఇంకా పార్టీలో కొనసాగితే దేశ, రాష్ట్ర ప్రజలకు సేవ చేయలేనని అనిపిస్తోంది. నా ప్రజలు, కార్యకర్తల కోసం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మెరుగని భావిస్తున్నా. ఇన్నాళ్లూ దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా’ అని లేఖలో సింధియా పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి సింధియా బహిష్కరణను సోనియా ఆమోదించినట్లు ఏఐసీసీ తెలిపింది. రాజ్యసభకు జ్యోతిరాదిత్య! జ్యోతిరాదిత్య నేడో రేపో బీజేపీలో చేరవచ్చని, ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ నామినేషన్ల దాఖలుకు ఈనెల 13తో గడువు ముగుస్తున్నందున ఈలోపే ఆయన కచ్చితంగా బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. సింధియా నిర్ణయాన్ని ‘ఘర్ వాపసీ’గా ఆయన మేనత్త, బీజేపీ ఎమ్మెల్యే యశోధరా రాజే అభివర్ణించారు. తన తండ్రి, దివంగత కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా 75వ జయంతి రోజే జ్యోతిరాదిత్య పార్టీతో బంధాన్ని తెంచుకోవడం గమనార్హం. స్వతంత్రులు, ఇతరులు కీలకం ప్రస్తుతం 228 మంది ఎమ్మెల్యేలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తిరుగుబాటుకు ముందు కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉండగా తాజా రాజీనామాలతో సొంత బలం 92కి పడిపోయింది. సభలో బల నిరూపణకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 104 కాగా బీజేపీకి ఇప్పటికే 107 మంది సభ్యులున్నారు. నలుగురు స్వతంత్రులతోపాటు ఇద్దరు బీఎస్పీ సభ్యులు, సమాజ్‌వాదీ పార్టీకి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటివరకు మద్దతిస్తున్నారు. తాజాగా బీఎస్పీ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ కుశావహ, సమాజ్‌వాదీ శాసన సభ్యు డు రాజేశ్ శుక్లా మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్సింగ్తో సమావేశం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్‌కు లేఖలు అందించిన బీజేపీ నేతల బృందం కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన 19 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను బీజేపీ నేతల బృందం మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతికి అందచేసింది. రాజీనామా లేఖలు అందాయని, నియమ నిబంధనలను అనుసరించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తెలిపారు. సీనియర్ బీజేపీ నేత భూపేంద్రసింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలతో ప్రత్యేక విమానంలో భోపాల్ చేరుకున్నట్లు పార్టీ ఎమ్మెల్యే విశ్వాస్ సారంగ్ తెలిపారు. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేరుగా రాజీనామాలు అందించారు. ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ, భూపేంద్రసింగ్, నరోత్తమ్ మిశ్రా, సారంగ్‌తో కూడిన బృందం స్పీకర్ నివాసానికి చేరుకుని కాంగ్రెస్ సభ్యుల రాజీనామాలను అందచేసింది. ఒకవైపు ఈ ఉత్కంఠ కొనసాగుతుండగా మరోవైపు కాంగ్రెస్ రాజీనామా చేసిన ఆరుగురు మంత్రులను తక్షణమే తొలగించాలని కోరుతూ కమల్‌నాథ్ గవర్నర్‌కు లేఖ రాశారు. పోలీస్ రక్షణ కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు పోలీస్ రక్షణ కల్పించాలని కోరుతూ బెంగళూరు చేరుకున్న 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటక డీజీపీకి లేఖ రాశారు. ఓ అత్యవసర పని నిమిత్తం తాము కర్ణాటకకు స్వచ్ఛందంగా వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. బెంగళూరు పరిసరాల్లో తాము స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా భద్రత కల్పించాలని ఈనెల 9వ తేదీతో ఉన్న లేఖలో కోరారు. వీరిలో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు సింధియాను బుజ్జగించేందుకు రాజస్తాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ను దూతగా పంపినా ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ఆ యత్నాలు ఫలించలేదని తెలిపాయి. ‘మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం త్వరలోనే పరిష్కారమై నేతల మధ్య తలెత్తిన విబేధాలు ముగుస్తాయని భావిస్తున్నా. ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చేందుకు రాష్ట్రానికి స్థిరమైన సర్కారు అవసరం’అని సచిన్ పైలట్ ట్విట్టర్లో పేర్కొన్నారు. నిజమైన కాంగ్రెస్ నేతలెవరూ పార్టీని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్లరని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు మంగళవారం జ్యోతిరాదిత్య తండ్రి మాధవ్‌రావ్ సింధియా జయంతి సందర్భంగా ఆయన రాజకీయ చాణక్యుడని ప్రశంసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ ట్వీట్ చేసింది. మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా ట్వీట్ చేసిన వారిలో ఉన్నారు. ఎగసిన అసంతృప్తి: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో పాత తరానికి చెందిన సీఎం కమల్‌నాథ్‌తో సింధియాకు దీర్ఘకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఎన్నికల అనంతరం స్వల్ప మెజార్టీతో కమల్‌నాథ్ పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వంలో సింధియా మద్దతుదారులను పక్కనబెట్టడం, రాష్ట్ర కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు కూడా దక్కకపోవడంతో ఆయన శిబిరంలో అసంతృప్తి రాజుకుంది. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కూడా ఈ విషయాలను పట్టించుకోకపోవడంతో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాజా పరిణామాలతో నేతలను ఏకతాటిపై నడపటంలో నాయకత్వ లేమి మరోసారి బయటపడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. లక్నో హోలీ వేడుకల్లో గవర్నర్ లాల్జీ రాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తున్నామని, ఏ నిర్ణయమైనా రాజ్‌భవన్ చేరుకున్నాక తీసుకుంటానని లక్నోలో హోలీ వేడుకల్లో పాల్గొన్న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం నేను ప్రేక్షకుడిని మాత్రమే. అక్కడకు (భోపాల్) చేరుకున్నాక అన్నీ గమనించాక స్పందిస్తా’అని చెప్పారు. సర్కార్‌కు ముప్పులేదు: సీఎం కమల్ ‘‘నా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నా. వారిని బందీలుగా ఉంచారు. లేదంటే ఎమ్మెల్యేలు బెంగళూరులో ఎందుకు ఉంటారు?’అని సీఎం కమల్‌నాధ్ మంగళవారం రాత్రి పేర్కొన్నారు. తమ రాజీనామా లేఖలను బెంగళూరులోని రిసార్ట్‌లో మీడియాకు చూపిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చదవండి: సింధియా టైమ్స్ బీజేపీలో సింధియాలు.. సింధియాలో బీజేపీ -
కాంగ్రెస్ స్వయంకృతం
కాంగ్రెస్‌కు సాక్షాత్తూ అధిష్టానమే సమస్యగా మారిన వేళ మధ్యప్రదేశ్‌లోని ఆ పార్టీ విభాగంలో ఉన్నట్టుండి ముసలం బయల్దేరి, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పుట్టి మునగడం ఎవరికీ ఆశ్చర్యం కలి గించదు. అక్కడేం జరుగుతోందో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని అయోమయంలో సారథులు కూరుకుపోయివుండగానే, కమల్‌నాథ్ కేబినెట్లోని ఆరుగురు మంత్రులతోసహా 17 మంది ఎమ్మెల్యేలు బెంగళూరుకు ఎగిరిపోయారు. ఈ సంఖ్య చూస్తుండగానే 21కి చేరింది. వారంతా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తామంటున్నారు. ఈ డ్రామాకు కథానాయకుడైన జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం కాంగ్రెస్‌కు చెల్లుచీటీ ఇచ్చి బీజేపీవైపు అడుగులేస్తున్నారు. ఆ పార్టీ టికెట్‌పై రాజ్యసభకు ఎన్నిక కావడం సింధియాకు ఇక రోజుల్లో పని. రాజీనామా సంగతి తెలిశాక, ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఒక ప్రకటన చేసి పరువు కాపాడుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ నాయకత్వం! ఏమైతేనేం 230మంది సభ్యులుండే అసెంబ్లీలో 114మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ బలం 93కి పడిపోయింది. మరో 30మంది కాషాయ తీర్థం తీసుకోవడానికి సంసిద్ధులవుతున్నారని బీజేపీ నేతలు చెప్పే మాటల్లో నిజమెంతోగానీ... ఈ దశలో స్పీకర్‌ది కీలకపాత్ర. మధ్యప్రదేశ్ డ్రామా ఎన్నాళ్లు కొనసాగాలో ఆయన చర్యలే నిర్దేశిస్తాయి. ఆ తర్వాతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందా లేక అర్ధాంతరంగా ఎన్నికలొస్తాయా అన్నది తేలుతుంది. ఇదంతా బీజేపీ కుట్రని ఎంపీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ ఆరోపిస్తున్నారు. కానీ ఈ పరిణామాలకు బీజేపీని నిందించి ప్రయోజనం లేదు. ఏమీ లేని గోవాలోనే పావులు కదిపి అధికారం చేజిక్కించుకోగలిగిన బీజేపీ... అధికారం అంచుల వరకూ వెళ్లి ఆగిపోయిన మధ్యప్రదేశ్‌లో మౌనంగా ఉంటుందనుకోవడం తెలివితక్కువతనం. గతవారం ఎనిమిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అర్ధరాత్రి గురుగ్రామ్‌లోని హోటల్‌కు తరలించిన ఉదంతంలో ఎలాగోలా కాంగ్రెస్ పరువు కాపాడుకోగలిగింది. వారందరినీ వెనక్కు తీసుకు రాగలిగింది. ఈసారి మాత్రం పరిస్థితి చేయి దాటిపోయింది. మధ్యప్రదేశ్‌లో పార్టీ కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య, దిగ్విజయ్‌సింగ్ వర్గాలుగా చీలిపోయిందని, ఆ ఇద్దరూ ఏకమై జ్యోతిరాదిత్యను ఇరకాటంలోకి నెట్టారని పార్టీ సారథులకు తెలియందేమీ కాదు. కేబినెట్లో కీలక పదవులన్నీ కమల్‌నాథ్, దిగ్విజయ్ అనుచర ఎమ్మెల్యేలకే దక్కాయి. పర్యవసానంగా జ్యోతిరాదిత్యలో ఏర్పడ్డ అసంతృప్తిని పారదోలడానికి, ఆయన వర్గానికి కూడా తగిన అవకాశాలివ్వడానికి పార్టీ పెద్దలు ప్రయత్నించలేదు. పైపెచ్చు సోనియా, రాహుల్‌గాంధీలను కలిసి తన గోడు వెళ్లబోసుకుందామని సింధియా చేసిన ప్రయత్నం ఫలించలేదు. పార్టీలో తాను సంతృప్తిగా లేనని సింధియా కొద్దికాలంనుంచి పరోక్షంగా చెబుతూనేవున్నారు. కేంద్ర ప్రభుత్వం 370 అధికరణను రద్దు చేసి కశ్మీర్ పత్రిపత్తిని మార్చినప్పుడు పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యానించి ఆయన కలకలం సృష్టించారు. ఆ తర్వాత కూడా ఆయన పార్టీకి దూరంగానే వుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోనే కాదు... అధికారం ఉందా లేదా అన్న తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఇలా అంతఃకలహాలతో సతమతమవుతోంది. వాస్తవానికిది కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయిన పాత తరం నేతలకూ, పార్టీ కోసం శ్రమిస్తూ అందులో తమ భవిష్యత్తును వెదుక్కుంటున్న యువతరానికీ మధ్య సాగుతున్న సంకుల సమరం. చుట్టూ చేరిన వందిమాగధుల బృందగానం తప్ప మరేమీ వినడానికి ఇచ్చగించని అధినేత్రి సోనియాగాంధీకి ఈ యువతరమంటే మొదటినుంచీ అనేకానేక శంకలు. సొంతంగా ఆలోచించేవారన్నా, స్వతంత్రంగా ఎదుగుతారనుకున్నా వారిని దూరం పెట్టడం ఆమె ఒక విధానంగా మార్చుకున్నారు. పార్టీలో యువతరానికి ప్రాధాన్యమిస్తానని, వారసత్వాన్ని పక్కనబెట్టి పనిచేయడం ఒక్కటే ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్పిన రాహుల్‌గాంధీ పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోవడం, అడుగడుగునా తల్లి జోక్యం పెరగడం చూశాక చాన్నాళ్లక్రితమే కాడి పారేశారు. అడపా దడపా మీడియానుద్దేశించి మాట్లాడటం తప్ప పార్టీలో జరిగే ఏ విషయాలు తనకు పట్టనట్టు ఆయన వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వర్గంగా ముద్రపడి, కేవలం అందువల్లనే నిరాదరణకు గురవుతున్న నేతలకు వేరే ప్రత్యామ్నాయం ఏముంటుంది? ఎన్నికలకు ముందు జ్యోతిరాదిత్యకు పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించి, ఫలితాల తర్వాత ఆయనకే పట్టం గడతామన్న అభిప్రాయం కలిగించిన కాంగ్రెస్...అటుపై ఆ యువ నాయకుడిని పక్కకు నెట్టి కమల్‌నాథ్‌ని పీఠం ఎక్కించింది. మధ్యప్రదేశ్‌నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యే అవకాశం వుండగా, ఖచ్చితంగా వస్తుందనుకున్న ఒక్క సీటుకూ దిగ్విజయ్‌సింగ్ కాచుక్కూర్చున్నారు. ఆయనకు అది దక్కకుండా చేయడానికి ప్రియాంకగాంధీ పోటీ చేయాలన్న డిమాండు ఈమధ్యే బయల్దేరింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన జ్యోతిరాదిత్య ప్రస్తుత పరిస్థితుల్లో తనకు రాజ్యసభ అవకాశం రావడం అసాధ్యమని గ్రహించివుంటారు. ఈ పార్టీలో తనకు రాజకీయంగా భవిష్యత్తు లేదన్న నిర్ణయానికొచ్చివుంటారు. రాజస్తాన్‌లోనూ సచిన్ పైలెట్‌కు ఇలాంటి పరిస్థితే వుంది. అధికారం లేకుండా బతకలేనని జ్యోతిరాదిత్య నిరూపించారని, అలాంటి నేతలు ఎవరైనా పార్టీని వదిలిపోవచ్చని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ చేసిన వ్యాఖ్యానం ఎవరినుద్దేశించి చేసిందో సచిన్ పైలెట్ గ్రహించకపోరు. మధ్యప్రదేశ్ డ్రామా పూర్తయ్యాక రాజస్థాన్‌లో అది మొదలైనా ఆశ్చర్యం లేదు. కనీసం ఈ దశలోనైనా కాంగ్రెస్ అధినాయకత్వం మేల్కొనకపోతే, జనంలో పలుకుబడివున్న నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించి దానికి జవసత్వాలు కలిగించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించకపోతే పార్టీ కనుమరుగు కావడం ఖాయం. -
కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కమల్‌నాథ్ సర్కార్
-
రాజ్యసభకు సింధియా.. కేంద్రమంత్రి పదవి!
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభానికి కేంద్రబిందువైన జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో సింధియా కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమైపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈరోజు (మంగళవారం) సాయంత్రం 6 గంటల తరువాత బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన 20 ఎమ్మెల్యేలు తమ రాజీనామాను స్పీకర్‌కు పంపించారు. రాజీనామా చేసిన వారిలో మంత్రులు కూడా ఉండటంతో వారందరినీ మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎంకు గవర్నర్ టాండన్ లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ.. కేంద్రమంత్రి..! సింధియా అనుచరవర్గంగా భావిస్తున్న రెబల్ ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం బెంగళూరు రిసార్టులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా చేసిన వెంటనే వారంతా కూడా గుడ్‌బై చెప్పడంతో తిరుగుబాటు సభ్యులతో కలిసి సింధియా బీజేపీ గూటికి చేరతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా జ్యోతిరాధిత్యను రాజ్యసభకు పంపేందుకు కేంద్ర పెద్దలు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ నెలఖరులో జరిగే రాజ్యసభ ఎన్నికల్లోనే ఆయన్ని నామినేట్ చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ బీజేపీ చేరితే కేంద్రమంత్రివర్గంలోనూ సింధియాకు చోటు కల్పించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ పెద్దలతో సింధియా అవగహన కుదుర్చుకున్నట్లు తెలిసింది. చిచ్చుపెట్టినే సీఎం పీఠం.. మరోవైపు వరుస ఓటములతో కుదేలవుతున్న గ్రాండ్ఓల్డ్ పార్టీకి సింధియా ఊహించని షాక్ ఇచ్చారు. సీఎం కుర్చి తనదేనంటూ గత ఎన్నికల్లో ప్రచారాన్ని భుజాలకెత్తుకుని ముందుండి నడిపించిన మహరాజ్ సింధియా.. సీఎం సీటు దక్కకపోవడంతో అధిష్టానంపై గతకొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ఇదే సరైన సమయంగా భావించి చాకచక్యంగా పావులుకదిపారు. దీంతో కమల్‌నాథ్ సీఎం కుర్చికి సంకటం ఏర్పడింది. సింధియా వ్యూహాలు ఫలించినట్లయితే ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్ రాజీనామా చేయకతప్పదు. ఇదిలావుండగా కమల్‌నాథ్ సర్కార్ మైనార్టీలో పడిపోయిందని, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ శాసనసభ్యులు గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. తాజా పరిణామాలతో దేశ రాజకీయాలన్నీ మధ్యప్రదేశ్ చూట్టు తిరుగుతున్నాయి. -
‘ఐదేళ్లూ అధికారంలో ఉంటాం’
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌పై ఆ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు బావుటా ఎగరవేసిన క్రమంలో పెను సంక్షోభం నెలకొంది. సింధియాకు మద్దతిస్తున్న 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూర్‌లో మకాం వేశారు. కాగా కమల్‌నాథ్ సర్కార్‌కు ఎలాంటి ముప్పూలేదని, కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్ల పరిపాలనను పూర్తిచేస్తుందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత పీసీ శర్మ స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చలు జరుగుతున్నాయని తమ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభంపై పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ పలువురు పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక జ్యోతిరాదిత్య సింధియా హోంమంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సింధియా సహకరిస్తారని భావిస్తున్నారు. చదవండి : ‘సింధియాకు స్వైన్ ప్లూ వచ్చింది’ -
‘సింధియాకు స్వైన్ ప్లూ వచ్చింది’
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరిస్తే.. వారికే జనమే బుద్ధి చెబుతారని దిగ్గీ రాజా పేర్కొన్నారు. నిజమైన వ్యక్తులే పార్టీలో ఉంటారని.. మిగతా వారు కాంగ్రెస్‌ను వీడి వెళ్లొచ్చని వ్యాఖ్యానించారు. పరోక్షంగా తాజా సంక్షోభానికి కారణమని భావిస్తున్న ఆ పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.17 మందిఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తోన్న సింధియాను కలిసేందుకు తాము ప్రయత్నించామని.. కానీ, అతను అందుబాటులోకి రాలేదని తెలిపారు. సింధియాకు స్వైన్ ప్లూ ఉన్నట్టుంది.. అందుకే తమతో మాట్లాడటం వీలుకావడం లేదు అని తనదైనశైలిలో సెటైర్ వేశారు. (చదవండి : కమల్ సర్కార్‌లో సింధియా చిచ్చు) ‘ఎవరైతే మధ్యప్రదేశ్ ఓటర్ల తీర్పును ధిక్కరిస్తారో.. వారికి ప్రజలు కచ్చితంగా బుద్ది చెబుతారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పటికీ పార్టీలోనే ఉంటారు. మధ్యప్రదేశ్‌లో పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది. సింథియాను కలిసేందుకు ప్రయత్నించాం. కానీ ఆయనకు స్వైన్ ప్లూ సోకినట్లు చెప్పారు. అందుకే ఆయన మాతో మాట్లాడలేకపోతున్నారు’ అని దిగ్విజయ్ అన్నారు. కాగా, మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్యా సింధియా, ఆరుగురు మంత్రులు సహా మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో సోమవారం బెంగళూరుకు వచ్చి, రోడ్డు మార్గంలో బెంగళూరు రాజానుకుంటె సమీపంలో ఉన్న ఓ రిసార్టుకు వెళ్లారు. వీరిని సంప్రందించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వారు టచ్‌లోకి రావడంలేదు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న కమల్‌నాథ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని సోమవారం రాత్రి భోపాల్ చేరుకున్నారు. వెంటనే దిగ్విజయ్‌సింగ్ తదితర సీనియర్ నేతలతో తన నివాసంలో రెండు గంటలపాటు అత్యవసర సమాలోచనలు జరిపారు. రాత్రి 10 గంటలకు కేబినెట్ భేటీ ఏర్పాటుచేసి, వివిధ పరిణామాలపై చర్చించారు. అనంతరం, హాజరైన 22 మంది మంత్రులు రాజీనామా చేశారు. దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. ఫలితంగా అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం ఉంది. బెంగళూరు రిసార్టులో ఉన్న సింధియా వర్గం ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని కమల్‌నాథ్ శిబిరం చెబుతోంది. సింధియాను శాంతింపజేసేందుకు పీసీసీ అధ్యక్ష పదవి లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మరోవైపు, సింధియా బీజేపీలో చేరతారని.. ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. -
కమల్ సర్కార్‌లో సింధియా చిచ్చు
భోపాల్/సాక్షి, బెంగళూరు: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్యసభ ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీ కీలకనేత జ్యోతిరాదిత్య సింధియా, ఆరుగురు మంత్రులు సహా మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు సోమవారం బెంగళూరుకు మకాం మార్చారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలను వలలో వేసుకుంటోందంటూ ఇటీవల కాంగ్రెస్ ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగివచ్చి సర్కారుకు మద్దతు పలకడం తెలిసిందే. అసెంబ్లీలో బొటాబొటీ మెజారిటీ ఉన్న కమల్‌నాథ్ ప్రభుత్వానికి ఈ పరిణామం షాక్ ఇచ్చింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న కమల్‌నాథ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని సోమవారం రాత్రి భోపాల్ చేరుకున్నారు. వెంటనే దిగ్విజయ్‌సింగ్ తదితర సీనియర్ నేతలతో తన నివాసంలో రెండు గంటలపాటు అత్యవసర సమాలోచనలు జరిపారు. రాత్రి 10 గంటలకు కేబినెట్ భేటీ ఏర్పాటుచేసి, వివిధ పరిణామాలపై చర్చించారు. అనంతరం, హాజరైన 22 మంది మంత్రులు రాజీనామా చేశారు. దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. ఫలితంగా అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం ఉంది. బెంగళూరు రిసార్టులో ఉన్న సింధియా వర్గం ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని కమల్‌నాథ్ శిబిరం చెబుతోంది. సింధియాను శాంతింపజేసేందుకు పీసీసీ అధ్యక్ష పదవి లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మరోవైపు, సింధియా బీజేపీలో చేరతారని.. ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. రిసార్టులో మకాం కాంగ్రెస్ అసంతృప్త నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులైన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో సోమవారం బెంగళూరుకు వచ్చి, రోడ్డు మార్గంలో బెంగళూరు రాజానుకుంటె సమీపంలో ఉన్న ఓ రిసార్టుకు వెళ్లారు. ఆరోగ్య, కార్మిక, రవాణా, మహిళా శిశు సంక్షేమ, ఆహార, పౌర సరఫరాలు, విద్యా శాఖలకు చెందిన ఆరుగురు మంత్రులు తులసి సిలావత్, మహేంద్ర సింగ్ సిసోడియా, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, ఇమార్తీ దేవి, ప్రద్యుమ్నసింగ్ తోమర్, ప్రభురా చౌధరితోపాటు ఎమ్మెల్యేలు సింథియా వెంట ఉన్నారు. వీరి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండగా, సింథియా మాత్రం ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం లేదని పీటీఐ తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో జ్యోతిరాదిత్య సింధియా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, కర్ణాటక సీఎల్పీ నేత సిద్ధరామయ్యతో ఫోన్లో మాట్లాడారు. బెంగళూరు వచ్చిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు తమకు అందుబాటులో లేరని సిద్ధరామయ్య చెప్పినట్లు సమాచారం. అనంతరం మాజీ మంత్రి జి.పరమేశ్వర్, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావుకు భోపాల్ రావాల్సిందిగా నాయకత్వం నుంచి పిలుపు వచ్చింది. ఏమిటీ సమస్య? సీఎం కమల్‌నాథ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా నిర్వహిస్తున్నారు. ఈ పదవి కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని మొత్తం మూడు రాజ్యసభ (కాంగ్రెస్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్, బీజేపీకి చెందిన ప్రభాత్ ఝా, సత్యనారాయణ్ జతియా) సీట్ల కోసం ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత బలాబలాల ప్రకారం.. కాంగ్రెస్, బీజేపీ చెరో సీటు గెలుచుకోవడం ఖాయం. తాజా పరిణామంతో కాంగ్రెస్‌కు మూడో సీటు దక్కడం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ యత్నిస్తోందనే అనుమానాలు ఉన్నాయి. పరిస్థితిని పార్టీ చీఫ్ సోనియాకు వివరించేందుకు కమల్‌నాథ్ ఆదివారం ఢిల్లీ వెళ్లారు. ఆయన 12న తిరిగి రావాల్సి ఉంది. నేడు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ 16న రాష్ట్ర బడ్జెట్, 26న రాజ్యసభ ఎన్నికలపై చర్చించేందుకు మంగళవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకునే అవకాశాలున్నాయి. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠీ, శరద్ కోల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన జరిగిన బీజేపీ సమావేశానికి సైతం వీరు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ నేతల్లోనూ ఉత్కంఠ పెరిగింది. రెండు రాజ్యసభ సీట్ల కోసం పార్టీ నేతలు రాంమాధవ్, కైలావ్ విజయ్‌వర్గీయ సహా 22 మంది పేర్లను సోమవారం రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపింది. -
రాజకీయ సంక్షోభం: 18 ఎమ్మెల్యేలు మిస్సింగ్
భోపాల్ : సంక్షోభం దిశగా మధ్యప్రదేశ్ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుండి సంకటంలో పడిపోయింది. గతవారం పదిమంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో మొదలైన ఈ వ్యవహరం సోమవారం నాటికి మరో కీలక మలుపు తిరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా వర్గంలోని 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 6 మంది కేబినెట్ మంత్రులు ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. అయితే వీరంతా ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలివెళ్లినట్టు తెలుస్తోంది. వీరందరూ సింధియా అండతో రెబెల్ ఎమ్మెల్యేలుగా మారి కమల్‌నాథ్ సర్కారుకు సవాల్ విసురుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. అయితే కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సింధియాతో కలిసి బీజేపీ కుట్రపన్నిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు జరుగుతున్నా సింధియా ఢిల్లీలోనే ఉండిపోయారు. బీజేపీ నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సంక్షోభానికి సింధియానే కారణమని కాంగ్రెస్‌లోని ఓ వర్గం అనుమానిస్తోంది. మరోవైపు కమల్‌నాథ్ ప్రభుత్వానికి అసెంబ్లీలో సరపడ బలం లేదని బీజేపీ వాదిస్తోంది. ప్రభుత్వంపై చాలామంది సభ్యులు అసంతృప్తితో ఉన్నారని చెబుతోంది. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుని అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని బీజేపీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. సింధియా వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో బీజేపీ అనుసరించిన వ్యూహాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తునట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాగా మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో 114 మంది ఎమ్మెల్యేలను గెలుపొంది.. స్వతంత్రులు, బీఎస్పీ సభ్యుల మద్దతుతో ప్రభుత్వం నెట్టకొస్తోంది. బీజేపీకి 107 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో ఓ పదిమంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
‘మాట వినకపోవడంతోనే నా రిసార్టును కూల్చేశారు’
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అధికార పీఠాన్ని లాక్కోవడానికి బీజేపీ ఆపరేషన్ కమలం కుట్రకు తెరలేపిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పాఠక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హెచ్చరికలకు లొంగకపోవడంతోనే బంధవాఘర్‌లో ఉన్న తన రిసార్టును అక్రమ నిర్మాణం పేరిట కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా చచ్చే వరకు తాను బీజేపీలో కొనసాగుతానని ఆయన స్సష్టం చేశారు. గురువారం తనను ఎత్తుకెళ్తేందుకు కాంగ్రెస్ వర్గం ప్రయత్నించిందని, తనకు ప్రాణ భయం ఉందని ఎమ్మెల్యే ట్విటర్ వేదికగా చెప్పుకొచ్చారు. (చదవండి: ప్రభుత్వాన్ని కూలిస్తే ఎమ్మెల్యేకు రూ.45కోట్లు) కాగా, అక్రమంగా రిసార్టు నిర్మాణం చేశారని పేర్కొంటూ కమల్‌నాథ్ ప్రభుత్వం బంధవాఘర్‌లో ఉన్న సంజయ్ పాఠక్ రిసార్టును శనివారం కూల్చివేసింది. ఇక రిసార్టు కూల్చివేతతో పాటు.. సంజయ్ కలిగి ఉన్న ఇనుప ఖనిజం లీజులను కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. విజయ్‌రాఘవ్‌ఘర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంజయ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంజయ్ 2014లో బీజేపీలో చేరారు. 2016లో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. (చదవండి: మధ్యప్రదేశ్‌లో మళ్లీ ఆపరేషన్ కమలం ?) BJP MLA Sanjay Pathak: There is a lot of pressure on me. I am being asked to quit BJP&to join Congress party, if I don't do that then such actions will be taken against me&my family members. There's constant threat to my life. I will die but will never quit BJP. #MadhyaPradesh https://t.co/BOhUXrlLWe pic.twitter.com/EV3LoMrlcJ — ANI (@ANI) March 7, 2020 -
'మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు'
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న కాంగ్రెస్ ఆరోపణలతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తమ ప్రభుత్వంలోని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు బలవంతంగా తీసుకెళ్లి హర్యానాలోని ఒక హోటల్లో నిర్భందించారని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి జితూ పట్వారీ పేర్కొన్నారు. 'మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, మంత్రులు నరోత్తం మిశ్రా, భూపేంద్ర సింగ్, రామ్‌పాల్ సింగ్ సహా మరికొంత మంది సీనియర్ బీజేపీ నేతలు కలిసి మా పార్టీకి చెందిన నలుగురు, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఇద్దరు, సమాజ్‌వాది నుంచి ఒకరు, మరొక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను హర్యానాలోని ఒక హోటల్‌కు తరలించారు. కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు.తీసుకెళ్లొద్దని చెప్పినా వినకుండా మమ్మల్ని హోటల్‌కు తరలించారని ఒక ఎమ్మెల్యే మాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వారిని వెంటనే వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.ఇప్పటికే నలుగురు తిరిగొచ్చారు' అని పట్వారీ పేర్కొన్నారు. (ప్రభుత్వాన్ని కూలిస్తే ఎమ్మెల్యేకు రూ.45కోట్లు) అంతకుముందు మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. అధికార కూటమిలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను బీజేపీ నాయకులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారని ఆరోపించారు. కుట్రలో భాగంగా బారీ మొత్తంలో నగదు ఇవ్వజూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను తిరిగి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నేతలు హరియాణాలోని హోటల్‌కు వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడి పోలీసులు అడ్డుకున్నట్లు వార్తలు వచ్చినట్లు తెలిసింది. (ప్రధాని మోదీకి ఎంపీ ముఖ్యమంత్రి సవాల్!) కాగా దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ స్పందించారు. మధ్యప్రదేశ్‌లో మా ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వల వేస్తుందని, తమకు ఫ్రీ మనీ వస్తోందని ఎమ్మెల్యేలు తనతో చెబుతున్నారని ఆయన అన్నారు. ఎవరు పార్టీలో నుంచి వెళ్లిపోయినా మా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంలేదని కమల్‌నాథ్ పేర్కొన్నారు. #WATCH Haryana: Madhya Pradesh Ministers&Congress leaders Jitu Patwari&Jaivardhan Singh leave from ITC Resort in Gurugram's Manesar,taking suspended BSP MLA Ramabai with them.8 MLAs from MP are reportedly being held against their will by BJP at the hotel,Ramabai being one of them pic.twitter.com/VUivVHsaA4 — ANI (@ANI) March 3, 2020 -
ప్రధాని మోదీకి ఎంపీ ముఖ్యమంత్రి సవాల్!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను రాజకీయంగా వాడుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దాడికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. భారత సైన్యంపై తనకు ఎనలేని గౌరవం ఉందని, అదే సమయంలో కేంద్ర వైఖరిపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. మీడియాలో వచ్చిన కథనాలను నమ్మలేమని, సర్జికల్ స్ట్రైక్స్‌ను చేపట్టామని చెప్పుకుంటున్న కేంద్రం ఇంతవరకు ఫోటో, గణాంక ఆధారాలను ఎందుకు బయటపెట్టలేదని విమర్శించారు. అంతా మీడియాలో గొప్పలు చెప్పుకున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. కాగా, ఉరి సెక్టార్‌లోని భారత ఆర్మీ స్థావరాలపై 2016లో పాకిస్థాన్ టెర్రరిస్ట్‌లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దానికి ప్రతిగా భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టింది. పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పింది. ఇక గతేడాది పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన బాలాకోట్‌పై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. జైషే శిక్షణా శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదులను భారత వాయుసేన దళాలు మట్టుబెట్టాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, బాలాకోట్ దాడులకు సంబంధించి కూడా పక్కా ఆధారాలు లభించలేదు. ఉరి ఘటన.. సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘ఉరి’ ఘన విజయం సాధించింది. చదవండి: సీఎంపై విచారణకు హోంశాఖ ఆమోదం -
జ్యోతిరాదిత్య X కమల్‌నాథ్
న్యూఢిల్లీ/గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లో రైతు రుణ మాఫీ, ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ వంటి ఎన్నికల హామీలను ప్రభుత్వం నెరవేర్చకుంటే ఆందోళనలు చేపడతామంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా చేసిన హెచ్చరికపై రాష్ట్ర సీఎం కమల్‌నాథ్ స్పందించారు. ‘ఆయన (సింధియా) తనకు నచ్చినట్లు చేయొచ్చు. ఆయన్ను ముందుగా ఆందోళనలకు దిగనివ్వండి. చూద్దాం’ అని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఐదేళ్లకు వర్తించేదే తప్ప ఐదు నెలలకు కాదంటూ వ్యాఖ్యానించారు. పంటనష్టం సర్వే, రైతు రుణమాఫీ విషయంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరచూ సింధియా తప్పుపడుతున్నారు. సోనియానే చూసుకుంటారు! మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని పార్టీ చీఫ్ సోనియా నియమిస్తారని ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కమల్‌నాథ్ శనివారం గ్వాలియర్‌లో చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు రేసులో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన పైవిధంగా స్పందించారు. -
కమల్‌నాథ్ ప్రచారం చేస్తే అడ్డుకుంటాం..
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఫిబ్రవరి 8న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ప్రచారం చేస్తే అడ్డుకుంటామని ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ హెచ్చరించింది. ఢిల్లీ ప్రచార బాధ్యతలను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో కమల్‌నాథ్ పేరు ఉండడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఢిల్లీలో కమల్‌నాథ్ ఎక్కడ ప్రచారం చేసినా అడ్డుకుంటామని అకాలీ దల్ నాయకుడు, ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ మాజిందర్ సింగ్ సిర్సా స్పష్టం చేశారు. సిర్సా మాట్లాడుతూ..సిక్కుల ఊచకోతకు కారణమైన వారిని కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. కమల్‌నాథ్ నేరాలను రుజువు చేయడానికి తాము ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనకు సీఎం పదవి ఇచ్చిందని విమర్శించారు. -
‘రాత్రయితే తాగుడే.. లేదంటే కుదరదే..!’
భోపాల్ : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు పెంచేందుకు సీఎం కమల్‌నాథ్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి గోపాల్ సింగ్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. మద్య నిషేదం చేసేందుకు తాను వ్యతిరేకమని.. మనిషికి నచ్చిన మద్యం సేవించేందుకు అడ్డుచెప్పొద్దని ఆయన పేర్కొన్నారు. ఒక మనిషి తనకు నచ్చిన ఆహారాన్ని తినేందుకు, నచ్చిన మద్యాన్ని తాగేందుకు స్వతంత్ర భారత్‌లో అన్ని హక్కులు కలిగి ఉన్నాడని మంత్రి సెలవిచ్చారు. ఎవరి బలవంతం మీదనో ప్రజలు మందు కొట్టరని.. అలాంటప్పుడు మందు తాగొద్దని ఎవరినీ కట్టడి చేయలేమని అన్నారు. ‘రాత్రి పూట ఒక పెగ్ వేయనిదే కుదరదు. రోజూరాత్రి ఒక్క గ్లాస్ మందు కూడా తాగకుంటే ఆ మరుసటి రోజంతా అదోలా ఉంటుంది. ఈ సంగతి నా మిత్రుడొకరు చెప్పారు’అని గోపాల్ సింగ్ తెలిపారు. శారీరకంగా, మానసికంగా తగిలిన గాయాల్ని మాన్పడానికి చాలామంది మద్యం సేవిస్తారని చెప్పారు. ఆరోగ్యంగా ఉండటానికి డాక్టర్ల సలహామేరకు రోజూ పెగ్గు వేయాల్సిందేనని ఎంతోమంది చెప్పినట్టు ఆయన వెల్లడించారు.కాగా, మద్యం దుకాణాలను పెంచాలనే ప్రభుత్వ నిర్ణయంపై మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ మండిపడ్డారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి మద్యం అమ్మకాలను విచ్చలవిడి చేస్తే.. మధ్యప్రదేశ్ కాస్తా.. మదిర(మద్యం)ప్రదేశ్ అవుతుందని ఎద్దేవా చేశారు. -
ప్లీజ్ నన్ను వదిలేయండి..!
భోపాల్: ఓ బాలుడిని పోలీసులు చెప్పులతో కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అతడిని హింసిస్తున్న పోలీసుల తీరుపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 20 రోజుల క్రితం జరిగిన ఈ అమానుష ఘటన వెలుగులోకి రావడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వివరాలు.... రాష్ట్రంలోని దామో జిల్లాకు చెందిన బాలుడిని పోలీసు స్టేషనుకు తీసుకువచ్చారు. అనంతరం మఫ్తీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు అతడిని ఇష్టారీతిన కొట్టారు. చెప్పులు, కర్రలతో కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు. నొప్పి తాళలేక.. తనను వదిలివేయమంటూ బాలుడు ఏడుడస్తున్నా పట్టించుకోకుండా దాష్టీకానికి పాల్పడ్డారు. ఆ తర్వాత.. అతడు యూనిఫాంలో ఉన్న మరో పోలీసు అధికారి కాళ్లపై పడి క్షమాపణలు అడగడంతో కాస్త శాంతించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ స్పందించారు. వీడియోలో ఉన్న కానిస్టేబుళ్లను మహేశ్ యాదవ్, మనీవ్ గాంధర్వ్గా గుర్తించామని తెలిపారు. ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఈ ఘటనపై ట్విటర్లో స్పందించారు. ఈ మేరకు... ‘ దామో జిల్లాలో పోలీసులు అమాయకపు బాలుడిని కొడుతున్న వీడియో నా దృష్టికి వచ్చింది. ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించాం. ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదు. ఇది క్షమించరాని నేరం. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. -
ఎన్నార్సీ లేని ఎన్పీఆర్ ఓకే
భోపాల్/బెంగళూరు/లక్నో/ వాషింగ్టన్: జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) బదులు జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) అమలు చేయాలని తమ పార్టీ కోరుకుంటోందని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ప్రకటించారు. ఎన్పీఆర్తో కలిపి ఎన్నార్సీని చేపట్టడంపై వెనుక మోదీ ప్రభుత్వ ఉద్దేశాలపై∙అనుమానం వ్యక్తం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా భోపాల్‌లో బుధవారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారీ ర్యాలీకి ఆయన నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఏఏలో లొసుగులున్నాయి. ఎన్పీఆర్ను మేం కోరుకుంటున్నాం. అయితే, ఎన్నార్సీతో కలిపి కాదు. కేంద్రం రెంటినీ కలిపి తేవడం వెనుక కేంద్రం ఉద్దేశం స్పష్టమవుతోంది. సీఏఏ, ఎన్నార్సీ వంటి చట్టాలు గతంలో ఎన్నడూ లేవు’ అని అన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో సీఏఏను అమలు చేయబోదన్నారు. అపోహలు దూరం చేసేందుకు: దుష్ప్రచారం, అపోహల కారణంగానే భారత్‌లో ఎన్నార్సీ, సీఏఏపై ఆందోళనలు చెలరేగాయంటూ భారతీయ అమెరికన్లు పేర్కొన్నారు. అమెరికాలోని పలు నగరాల్లో ఎన్నార్సీ, సీఏఏ అనుకూల ర్యాలీలు చేపట్టారు. డల్లాస్, షికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్, అట్లాంటా, శాన్‌జోస్ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముస్లింలను భారత్ నుంచి వెళ్లగొడతారనే అపోహలు, వామపక్ష సంస్థల ప్రచారం కారణంగా భారత్‌లో నిరసనలు జరుగుతున్నాయని వినీత్ అనే నిర్వాహకుడు తెలిపారు. పథకం ప్రకారం అల్లర్లు: మంగళూరులో పోలీసుల కాల్పుల ఘటనపై దర్యాప్తు నివేదిక అందే వరకు కాల్పుల్లో మృతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారాన్ని నిలిపివేస్తున్నట్లు కర్ణాటక సీఎం యడియూరప్ప చెప్పారు. ‘నేరస్తులకు పరిహారం క్షమార్హం కాని నేరం. మంగళూరు అల్లర్లు పథకం ప్రకారం జరిగాయి. ఆనాడు ఆందోళనకారులు పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. వారిని వదలం’ అని అన్నారు. 60 మందికి యూపీ సర్కారు నోటీసులు సీఏఏకి వ్యతిరేకంగా రాంపూర్, గోరఖ్‌పూర్‌లలో జరిగిన ఆందోళనల్లో హింసకు కారణమైన 60 మందికి యూపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం నియమించిన అధికారులు..అల్లర్ల కారణంగా రూ.25 లక్షల మేర ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లినట్లు తేల్చారు. దీంతో ఇందుకు కారణమైన 28 మందికి బుధవారం నోటీసులిచ్చారు. దీనిపై వారు వారంలోగా వివరణ అయినా ఇవ్వాలి లేదా నష్టాన్ని చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. లేకుంటే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయన్నారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన అల్లర్లకు కారకులుగా గుర్తించిన 33 మందికి పోలీసులు నోటీసులిచ్చారు. -
భోపాల్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ: ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబావుటా ఎగురవేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు, వారిని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు తరలిస్తోంది. మొత్తం 44 మంది ఎమ్మెల్యేలను విమానం ద్వారా పంపేందుకు సిద్ధం అయింది. మధ్యప్రదేశ్ సీఎంగా కాంగ్రెస్‌కు చెందిన కమల్ నాథ్ ఉండడంతో భోపాల్ సరైన రక్షణ ప్రాంతమని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ వ్యవహారాలను కమల్‌నాథ్‌తో పాటు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ కూడా పరిశీలిస్తున్నారు. -
గుడ్లు తినేవారు రాక్షసులు: బీజేపీ నేత
న్యూఢిల్లీ : గుడ్లు తినేవారు రాక్షసులంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో రోజువారీ ఆహారంలో గుడ్లను చేరుస్తూ.. కమల్‌నాథ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భార్గవ్ విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో మాంసాహారం తీసుకోవడం నిషేదమన్నారు. తన కుల నియమాలలో భాగంగా వెల్లుల్లి, ఉల్లిపాయలను సైతం తాను తీసుకోనని అన్నారు. మరోవైపు మహిళ శిశు సంక్షేమ మంత్రి ఇమ్రితా దేవి ఆలోచన మేరకు మెరుగైన పోషకాహారాన్ని అందించడంలో భాగంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు గుడ్లను ఆహారంలో చేర్చింది. అయితే ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భార్గవ.. గుడ్లు, మాంసం తినే విధంగా ప్రభుత్వం పిల్లలను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఆహారంలో గుడ్లను చేర్చడాన్ని మరో బీజేపీ నాయకుడు కైలాష్ విజయవర్గియా తప్పుబట్టారు. ఈ నిర్ణయం మత విశ్వాసాలకు విఘాతం కలిగిస్తుందని ఆయన విమర్శించారు. అయితే బీజేపీ నాయకుల ఆరోపణలపై ఇమ్రితా దేవి ఘాటుగా స్పందించారు. బీజేపీ చేస్తున్న విమర్శలను తాను పట్టించుకోనని ఆమె అన్నారు. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులకు మెరుగైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివని.. తాను కూడా రోజు ఆహారంలో గుడ్లు తీసుకుంటానని ఇమ్రితా చెప్పారు. మరోవైపు పోషకాహార లోపంతో బాధపడే దేశాలలో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ దిగువున భారత్ ఉండడం విచారించే అంశమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
మృతదేహం కళ్లు పీక్కుతిన్న చీమలు!
భోపాల్: శివపురి జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. వైద్యం కోసం వచ్చిన రోగిపై ఆస్పత్రి సిబ్బంది చూపిన నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. ఆస్పత్రిలో మృతి చెందిన రోగి మృతదేహం కంటిని చీమలు పీక్కుతుంటున్నా పట్టించుకోకుండా.. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది వైఖరిపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘స్థానిక శివపురి జిల్లా ఆస్పత్రిలో రోగి మృతదేహం కంటిని చీమలు కుట్టేస్తున్నాఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చేయడం దారుణం. ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం మానవత్వానికి సిగ్గుచేటు. ఈ ఘటనకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆస్పత్రి అధికారులను ఆదేశిస్తున్నాను. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని’ కమల్‌నాథ్ ట్విట్ చేశారు. తీవ్రమైన క్షయ వ్యాధితో బాధపడుతున్న బాల్‌చంద్ర లోధి (50) మంగళవారం ఉదయం శివపురి జిల్లా ఆస్పత్రి చేరారు. ఆస్పత్రిలో చేరిన ఐదు గంటల లోపు ఆ రోగి మృతి చెందారు. దీంతో అదే వార్డులో చికిత్స పొందుతున్న సదరు రోగులు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది మృతదేహన్ని తీయటం పట్ల నిర్లక్ష్యం వహించారు. అయితే మృతదేహాన్ని మార్చరీకి తరలించకుండా అదే వార్డులో ఓ మూలగా పడేశారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్ కూడా రోగి మృత దేహాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆ మృతదేహంపై చీమలు పాకుతూ.. కళ్లను పీకే ప్రయత్నం చేశాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మృతుడి (బాల్‌చంద్ర లోధి) భార్య ఆ చీమలను పారదోలింది. ఈ సంఘటన మొత్తాన్ని రికార్డు చేసిన కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇటువంటి హృదయవిదారకమైన ఘటన చోటుచేసువడానికి కారణమైన ఆస్పత్రి సిబ్బందిపై సీఎం కమల్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. తక్షణమే విచారణ జరిపి ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఓ సర్జర్తో సహా అయిదుగురు మెడికోలపై సస్పెన్షన్ వేటు పడింది. -
పీసీసీ పదవికి ఆయన సమర్థుడే : కమల్‌నాథ్
సాక్షి, ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో వివాదాలపై ఆ పార్టీ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ స్పందించారు. ఇలాంటివి తమ పార్టీలోనే కాదు ప్రతీ పార్టీలోనూ ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం ఓ మీడియా చానెల్‌తో ఆయన మాట్లాడారు. జ్యోతిరాదిత్య సింధియాతో విభేదాల గురించి విలేకరులు ప్రశ్నించగా.. అదేం పెద్ద సమస్య కాదని కొట్టిపారేశారు. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ పదవిని సింధియాకు ఇచ్చే అవకాశముందా అన్న ప్రశ్నకు ఎందుకుఇవ్వకూడదని తిరిగి ప్రశ్నించారు. ఆయనకు అనుభవముంది. నాయకత్వ లక్షణాలున్నాయి. తనకంటూ ఓ టీమ్ ఉందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ పదవి ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దే ఉంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాహుల్‌గాంధీకి సన్నిహితుడిగా పేరున్న సింధియా సీఎం కావాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అధిష్టానం కమల్‌నాథ్‌ను ఎంపిక చేసింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పుడు సింధియా పార్టీ వైఖరికి వ్యతిరేకంగా కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించారు. ఇది సింధియాకు మైనస్‌గా మారిందని పార్టీ వర్గాల సమాచారం. అంతేకాక ఇటీవల వచ్చిన వర్షాలకు మధ్యప్రదేశ్‌లో రైతులకు పంట నష్టం వాటిల్లింది. ఈ విషయంలో ప్రభుత్వ చర్యల పట్ల సింధియా అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద ప్రభావంపై వెంటనే సర్వే నిర్వహించి బాధితులను ఆదుకోవాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ విషయం కమల్‌నాథ్ ముందుంచగా, రుతుపవనాలు ఇంకా తిరుగుముఖం పట్టలేదు. ఇప్పుడు సర్వే నిర్వహించినా తర్వాత మళ్లీ వరదలొస్తే రీసర్వే నిర్వహించమని డిమాండ్ చేస్తారు. అలా కాకుండా పరిస్థితులు సద్దుమణిగాక ఒకే సారి సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలపై కమల్‌నాథ్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. -
‘వారు ఆలయాల్లో అత్యాచారాలు చేస్తారు’
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలు ధరించి.. పొడులమ్ముకునేవారు.. ఆలయాల్లో అత్యాచారాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌ని ఉద్దేశిస్తూ.. దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సమాగమ్ కార్యక్రమానికి దిగ్విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ.. ‘పురాతన సనాతన ధర్మాన్ని విస్మరించే వారిని దేవుడు కూడా క్షమించాడు. ప్రస్తుత సమాజంలో కాషాయ వస్త్రాలు ధరించి పొడులమ్ముకునే వారు కొందరు ఆలయాల్లో అత్యాచారాలు చేస్తున్నారు. అలానే కొందరు వ్యక్తులు జై శ్రీ రాం నినాదాన్ని హై జాక్ చేశారు. రాముడి పేరిట నినాదాలు చేసే వీరు సీతను ఎందుకు మర్చిపోతున్నారు’ అని దిగ్విజయ్ ప్రశ్నించారు. దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ వేదిక మీదనే ఉండటం విశేషం. అలానే ఈ కార్యక్రమానికి హాజరైన కంప్యూటర్ బాబా సాధువుల తరఫున మాట్లాడుతూ.. ఆలయాలకు ప్రభుత్వ భూముల్ని కేటాయించాలని.. వాటికి ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని.. అంతేకాక సాధువులుకు కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. #WATCH Digvijaya Singh, Congress in Bhopal: Today, people are wearing saffron clothes and raping, rapes are happening inside temples, is this our religion? Those who have defamed our 'Sanatan Dharma', not even god will forgive them. pic.twitter.com/psAQcd1R7p — ANI (@ANI) September 17, 2019 -
కమల్‌నాథ్‌పై సిక్కు అల్లర్ల కేసు!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీలో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కమల్‌నాథ్‌పై నమోదైన కేసును రీ–ఓపెన్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారించనుంది. కమల్‌నాథ్ కేసుతో పాటు మరో 6 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులను సిట్ పునర్విచారణ జరపనుంది. ఈ విషయమై ఢిల్లీ సిక్కుల గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, అకాలీదళ్ ఎమ్మెల్యే మన్జిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ..‘1984 అల్లర్ల కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై నమోదైన కేసును సిట్ పునర్విచారించనుంది. సిక్కుల ఊచకోతకు సంబంధించి 7 కేసుల్లో నిందితులైన ఐదుగురికి కమల్‌నాథ్ ఆశ్రయం కల్పించారు. గతేడాది నేనుచేసిన విజ్ఞప్తి మేరకు స్పందించిన హోంశాఖ, తాజా సాక్ష్యాల ఆధారంగా మళ్లీ విచారణ జరిపేందుకు వీలుగా కేసు నంబర్ 601/84ను రీ–ఓపెన్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇది అకాలీదళ్ సాధించిన విజయమే. ఈ కేసును మళ్లీ విచారించనున్న సిట్‌కు ధన్యవాదాలు. సిక్కులను కమల్‌నాథ్ చంపుతుండగా చూసిన సాక్షులు ధైర్యంగా ముందుకు రండి. భయపడాల్సిన పనిలేదు. కమల్‌నాథ్ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు ముక్తియార్ సింగ్, సంజయ్ సూరీ సిట్ ముందు హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చేందుకు అంగీకరించారు. త్వరలోనే కమల్‌నాథ్ అరెస్ట్ అవుతారు. కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు పట్టిన గతే(యావజ్జీవ శిక్ష) కమల్‌నాథ్‌కు పడుతుంది. ’ అని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెంటనే కమల్‌నాథ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలనీ, విచారణ నిష్పక్షపాతంగా సాగేందుకు సహకరించాలని మన్జిందర్ సింగ్ కోరారు. కమల్‌నాథ్‌ను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో దాక్కున్న ఖలిస్తాన్ ఉగ్రవాది జర్నైల్‌సింగ్ బింద్రన్‌వాలేను పట్టుకునేందుకు ప్రధాని ఇందిర ఆదేశాలతో ఆర్మీ ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను చేపట్టింది. ఆపరేషన్‌లో స్వర్ణ దేవాలయం తీవ్రంగా దెబ్బతినడం, ఆర్మీ బూట్లతో ఆలయంలోకి వెళ్లడంతో ఈ చర్యను తమ మతంపై దాడిగా సిక్కులు భావించారు. ఈ క్రమంలో 1984, అక్టోబర్ 31న సిక్కు మతస్తులైన సొంత బాడీగార్డులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఇందిరాగాంధీని కాల్చిచంపారు. దీంతో దేశవ్యాప్తంగా సిక్కు మతస్తులు లక్ష్యంగా అల్లరిమూకలు దాడులకు తెగబడ్డాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అల్లర్లలో దేశవ్యాప్తంగా 3,500 మంది సిక్కులు చనిపోగా, ఒక్క ఢిల్లీలోనే 2,800 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ ఢిల్లీలోని రాకాబ్‌గంజ్ గురుద్వారా వద్ద కమల్‌నాథ్ నేతృత్వంలో విధ్వంసానికి దిగిన అల్లరిమూక ఇద్దరు సిక్కులను చంపేసింది. ఈ ఘటనపై 2000లో బీజేపీ ప్రభుత్వం నానావతి కమిషన్‌ను నియమించింది. ఈ సందర్భంగా కమిషన్ ముందు విచారణకు హాజరైన కమల్‌నాథ్.. ‘ఆ రోజున నేను ఘటనాస్థలిలోనే ఉన్నా. ఆవేశంతో ఊగిపోతున్న అల్లరిమూకను శాంతింపజేసేందుకు ప్రయత్నించా’ అని వాంగ్మూలమిచ్చారు. చివరికి నానావతి కమిషన్ ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కమల్‌నాథ్‌ను ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద విడిచిపెట్టింది. తాజాగా ఈ కేసులో కమల్‌నాథ్ పాత్రకు సంబంధించి కొత్త ఆధారాలున్నాయని భావించిన కేంద్రం, కేసును రీ–ఓపెన్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
కమల్‌నాథ్‌కు తిరిగి కష్టాలు
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు తిరిగి కష్టాలు మొదలైనట్లు కనిపిస్తున్నాయి.1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం చెలరేగిన సిక్కు అల్లర్ల కేసును తిరిగి విచారించడానికి కేంద్ర హోంశాఖ తాజాగా ఆమోద ముద్రవేసింది. ఆ కేసుకు సంబంధించి ఆయనపై ఉన్న ఆరోపణలను విచారించేందుకు హోంశాఖ అనుమతిచ్చింది. దీనిపై ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు మజీందర్ సింగ్ మాట్లాడుతూ.. కమల్‌నాథ్‌పై వచ్చిన ఆరోపణలపై 601/84 నెంబరుతో నమోదై ఉన్న కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం తిరిగి విచారణ ప్రారంభిస్తుందన్నారు. కమలనాథ్కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను కూడా వారు పరిశీలించనున్నట్లు తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే రెండు సాక్ష్యాలను తాము దర్యాప్తు బృందానికి సమర్పించినట్లు మజీందర్ వెల్లడించారు. సాక్ష్యం చెప్పేందుకు దైర్యంగా ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి గతంలో కూడా విచారణ నిమిత్తం మజీందర్ హోంశాఖను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దర్యాప్తు బృందంతో తాము చర్చించామని, వారు తమకు ఒక ప్రత్యేక తేదీని కేటాయిస్తామన్నారని మజీందర్ తెలిపారు. సిక్కు అల్లర్లతో సంబంధం కలిగి ఉన్న కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ సీఎంను చేసి సిక్కుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందని ఆరోపించారు. వెంటనే కమల్‌నాథ్‌చే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి సిక్కులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని మజీందర్ డిమాండ్ చేశారు. -
డిగ్గీ రాజా Vs సింధియా.. రంగంలోకి సోనియా
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఆ పార్టీ తాత్కాలిక జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ తాజాగా మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర యూనిట్లో తలెత్తిన అంతర్గత కుమ్ములాటలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే, పార్టీ సీనియర్ నేతలైన జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్ మధ్య ప్రస్తుతం విభేదాలు తారస్థాయికి చేరిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో దిగ్విజయ్ జోక్యం పెరిగిపోయిందని ఇటీవల మధ్యప్రదేశ్ అటవీశాఖ మంత్రి ఉమంగ్ సింగార్ వ్యాఖ్యలు చేయగా.. ఆ వ్యాఖ్యలను సింధియా బాహాటంగా సమర్థించారు. దీనికి దిగ్విజయ్ ఘాటుగా స్పందిస్తూ.. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైన చర్యలు తీసుకోవాల్సిందేనని సింధియాను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోనియా కమల్‌నాథ్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతం వారం రోజుల్లో వీరు రెండోసారి భేటీ కావడం గమనార్హం. రాష్ట్ర పీసీసీలో ప్రస్తుతం నెలకొన్న విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యంపై సోనియా ఆందోళన వ్యక్తం చేసినట్టు కమల్‌నాథ్ ఈ భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. పార్టీలోని విభేదాలను రూపుమాపి.. తిరిగి పార్టీని గాడిలో పెట్టేందుకు సోనియా అంతర్గతంగా చర్యలు తీసుకుంటున్నారని, అందులో భాగంగానే ఆమె మధ్యప్రదేశ్ సీఎంతో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
కమల్‌నాథ్‌పై వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ జ్యోతిరాదిత్య సింధియా మరోసారి సీఎం కమల్‌నాథ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కమల్‌నాథ్ బయటివారి కంటే సొంత మంత్రుల అభిప్రాయాలకే విలువివ్వాలని సూచించారు. పార్టీలో అంతర్గత విభేధాలపై సింధియా స్పందిస్తూ ఇరువర్గాల వాదనకు సీఎం ప్రాధాన్యతనిచ్చి వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్లాలన్నారు. పార్టీలో బయటవారి ప్రమేయానికి కమల్‌నాథ్ ఇకనైనా ముగింపు పలికితే బాగుంటుందన్నారు. పదిహేనేళ్లు కష్టపడి పార్టిని అధికారంలోకి తీసుకొచ్చామన్న సంగతిని సీఎం గుర్తించాలన్నారు. వేగంగా అభివృద్ది చేయాలన్న కాంగ్రెస్ నాయకుల ఆశలను నిజం చేయాలన్నారు. విభేదాలను పక్కనపెట్టి అందరు సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. అదే విధంగా పార్టీ మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్ రాజకీయాలలో కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేసులో ఇద్దరు ముందున్నవారే. అయితే అనూహ్యంగా కమల్‌నాథ్‌కు సీఎం పదవి వరించిన విషయం విదితమే. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఉమాంగ్ సింగర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఉమాంగ్ ఆరోపణలకు సింధియా మద్దతివ్వడం విశేషం. -
‘మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు’
భోపాల్: తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటున్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్. మధ్యప్రదేశ్ రాజకీయాలలో కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలకు ప్రత్యేక గుర్తుంపు ఉంది. సీఎం రేసులో ఇద్దరు ముందంజలో ఉన్నారు. అయితే అనూహ్యంగా కమల్‌నాథ్‌కు సీఎం పదవి వచ్చిన నేపథ్యంలో రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ తెలపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కమల్‌నాథ్ సమావేశం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని త్వరలో ఎన్నుకోనున్నట్లు సీఎం తెలిపారు. ముఖ్యనేత జ్యోతిరాదిత్య సింధియాకు కీలక పదవి ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం వైపు ఆలోచించే అవకాశం ఉందన్న విలేకరుల ప్రశ్నలకు కమల్‌నాథ్ స్పందిస్తూ నాకు తెలిసి అతనికి ఎవరిపైన కోపం ఉండే అవకాశం లేదని అన్నారు. ఈ మధ్య ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సింధియా స్వాగతిస్తూనే తాను కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితిలో వీడబోనని స్పష్టం చేశారు. సింధియాను రాష్ట్ర రాజకీయాల నుంచి పక్కనపెడితే తనతో సహా 500మంది కార్యకర్తలు రాజీనామా చేస్తారని కాంగ్రెస్ నాయకుడు అశోక్ దాంగీ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత ముఖ్యమంత్రి రేసులో ముందున్న సింధియాకు పదవి దక్కకపోగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా రాకపోవడం గమనార్హం. కానీ, 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి ప్రియాంకాగాంధీ వాద్రాతో నాయకత్వం వహించే అవకాశం కల్పించిందని కొందరు పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో సింధియా తన సొంత నియోజకవర్గమైన గుణాను కోల్పోయిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక ఎంపీ సీటు సీఎం కమల్‌నాథ్ కుమారుడు లోక్‌నాథ్‌ది కావడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ భోపాల్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. అయితే మధ్యప్రదేశ్ అధ్యక్ష పదవికి అర్జున్ సింగ్ తనయుడు అజయ్‌సింగ్‌కు దిగ్విజయ్ మద్దతు తెలుపుతున్నారు. త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే నాయకుల బాధ్యతను సింధియాకు అప్పగించారు. -
మేనల్లుడి వ్యాపారంతో సంబంధం లేదు: ముఖ్యమంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు, వ్యాపారవేత్త రతుల్ పురిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ అధికారులు బ్యాంక్ మోసం కేసులో సోమవారం అర్థరాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే రతుల్ పూరి అరెస్టు నేపథ్యంలో తన మేనల్లుడి వ్యాపారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను వాటాదారుడి కానని కమల్ నాథ్ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వక చర్య అని, ఈ విషయంలో కోర్టులపై తనకు పూర్తి నమ్మకం ఉందని రతుల్ పూరి అరెస్టుపై ఆయన అభిప్రాయపడ్డారు. చదవండి: సీఎం మేనల్లుడికి ఈడీ షాక్ కాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన 354 కోట్ల రూపాయల బ్యాంకు మోసం కేసులో రతుల్ పురి, అతని తండ్రి దీపక్ పురి, తల్లి నీతా (నాథ్ సోదరి), ఇతరులపై గతవారం (ఆగస్టు 17న) సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో రతుల్ పూరిని మూడు ప్రధాన కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేస్తున్నాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసుకు సంబంధించి రతుల్ పూరిని విడిగా విచారిస్తున్నారు. అంతేకాక సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే కారణంగా అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరైన తర్వాత అతడిని నిందితుడుగా అరెస్టు చేశారు. ఈ మేరకు పూరీని కస్టడీలోకి (అదుపులో) తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. మరోవైపు రతుల్ పురి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. -
సీఎం మేనల్లుడికి ఈడీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు, వ్యాపారవేత్త రతుల్ పురిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ అధికారులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద సోమవారం అర్థరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నామని అధికారులు మంగళవారం తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన 354 కోట్ల రూపాయల బ్యాంకు మోసం కేసులో రతుల్ పురి, అతని తండ్రి దీపక్ పురి, తల్లి నీతా (నాథ్ సోదరి), ఇతరులపై గతవారం (ఆగస్టు 17న) సీబీఐ కేసు నమోదు చేసింది. రతుల్ పురిపై రూ.354కోట్ల బ్యాంకు కుంభకోణం ఆరోపణలున్నాయి. మోసర్ బేర్ కంపెనీకి రతుల్ పురి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న సమయంలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని దుర్వినియోగం చేశారని అభియోగం. ఈ కేసులో ఆయనతో పాటు మోసర్ బేర్ సంస్థకు చెందిన మరో నలుగురు డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇందులో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ పురి, డైరెక్టర్స్ నీతా పురి, సంజయ్ జైన్, వినీత్ శర్మ ఉన్నారు.ఇదే కేసుకు సంబంధించి సీబీఐ ఆదివారం,సోమవారం ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రతుల్ పూరి 2012 లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయగా, అతని తల్లిదండ్రులు బోర్డులో కొనసాగుతున్నారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు రతుల్ పురి ఆరెస్ట్ దురదృష్టకరమని మోసర్ బేర్ ప్రకటించింది. తాము చట్టపరమైన అన్ని నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) లో ఉండగా తాజా కేసు ఉద్దేశపూర్వంగా నమోదు చేశారని ఆరోపించింది. కాగా కాంపాక్ట్ డిస్క్‌లు, డివిడిలు, సాలిడ్ స్టేట్ స్టోరేజ్ పరికరాల వంటి ఆప్టికల్ స్టోరేజ్ మీడియా తయారీలో కంపెనీ మోజర్ బేర్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది ఈ సంస్థ మూతపడింది. రతుల్ పురిపై అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం ఆరోపణలు కూడా ఉన్నాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ ముడుపులు మోసర్ బేర్ సంస్థ ద్వారానే చేతులు మారాయని విచారణలో తేలింది. ఇదే కేసుకు సంబంధించి ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
సీఎం మేనల్లుడి ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పూరి, ఆయన కంపెనీలకు చెందిన రూ 254 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయ పన్ను శాఖకు చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయని ఐటీ అధికారులు పేర్కొన్నారు. అగస్టా వెస్ట్‌లాండ్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు రాజేష్ సక్సేనా ద్వారా ఎఫ్‌డీఐల రూపంలో అక్రమ నగదును దేశానికి తీసుకువచ్చారని వెల్లడించారు. అగస్టా వెస్ట్‌లాండ్ ఒప్పందంలో సమకూరిన లంచాల సొమ్మును దారిమళ్లించడంలో రతుల్ పూరి పాత్రపై ఐటీ, ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాగా తాను రాజకీయ నేత బంధువనే కారణంతో ఈడీ తనను వేధిస్తోందని ఆరోపిస్తూ రతుల్ పూరీ ఈనెల 27న ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు రతుల్ పూరి దర్యాప్తునకు సహకరించడం లేదని, వాస్తవాలు వెల్లడించడం లేదని ఈడీ వాదిస్తోంది. పూరి బెయిల్ దరఖాస్తును ప్రస్తుతం ఢిల్లీ కోర్టు విచారిస్తోంది. -
‘మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు’
భోపాల్ : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ కూలిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సీఎం కమల్ నాథ్ విపక్ష నేత గోపాల్ భార్గవ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బుధవారం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కమల్ నాథ్ మాట్లాడుతూ తన ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని తేల్చిచెప్పారు. మధ్యప్రదేశ్ అభివృద్ధికి పాటుపడుతూ ఐదేళ్ల పదవీకాలాన్ని తమ ప్రభుత్వం పూర్తిచేస్తుందని పేర్కొన్నారు. సీఎం ప్రసంగానికి బీజేపీ నేత గోపాల్ భార్గవ అడ్డు తగులుతూ నెంబర్ వన్, నెంబర్ టూ నుంచి ఉత్తర్వులు వస్తే ఈ ప్రభుత్వం ఒక్క రోజు కూడా అధికారంలో ఉండదని అన్నారు. విపక్ష నేత వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపిన ముఖ్యమంత్రి దమ్ముంటే తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాల్ విసిరారు. కాగా మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో లుకలుకలున్నాయని మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో చౌహాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
రాహుల్‌కు బుజ్జగింపులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్న రాహుల్ గాంధీని బుజ్జగించేందుకు సోమవారం కాంగ్రెస్ ముఖ్యమంత్రులంతా రంగంలోకి దిగారు. రాజస్తాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిల సీఎంలు వరుసగా అశోక్ గహ్లోత్, అమరీందర్ సింగ్, కమల్‌నాథ్, భూపేశ్ బఘేల్, వి.నారాయణస్వామిలు రాహుల్‌ను ఢిల్లీలో కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమిపై వారు దాదాపు రెండు గంటలపాటు చర్చించి, తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాల్సిందిగా రాహుల్‌ను వారంతా అభ్యర్థించారు. భేటీ అనంతరం గహ్లోత్ మాట్లాడుతూ ‘మేమంతా రాహుల్‌తో మనసువిప్పి మాట్లాడుకున్నాం. పార్టీ కార్యకర్తల అభిప్రాయాల గురించి కూడా రాహుల్‌కు వివరించాం. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరాం. ఆయన మా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ మాత్రమే పార్టీని నడిపించగలరని గట్టిగా నమ్ముతున్నాం’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని రాహుల్ చెప్పడం, అప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు ఆయనను బుజ్జగిస్తుండటం తెలిసిందే. ఇటీవలే 150 మంది కాంగ్రెస్ నాయకులు కూడా ఓటమికి తమదే బాధ్యత అంటూ రాజీనామా చేయడం తెలిసిందే. -
దమ్ముంటే ఆ పనిచేయండి : ఎంపీ సీఎం
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామని భీరాలు పలుకుతున్న బీజేపీ నేతలు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. వట్టి మాటలు కట్టిపెట్టాలని హితవు పలికారు. ఇండోర్‌లో శనివారం జరిగిన ఇండియా టుడే మైండ్ రాక్స్-2019 కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘మా ప్రభుత్వాన్ని కూల్చుతామని మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్, కైలాష్ విజయ్వార్గియా పలు సందర్భాల్లో హెచ్చరించారు. మరి అంత దమ్ముంటే ఎందుకు ఆగుతున్నారు. మాపై కనికరం చూపుతున్నారా. ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ప్రజలు మాపై విశ్వాసం ఉంచారు కాబట్టే అధికారంలో ఉన్నాం. కార్యకర్తల్లో జోష్ పెంచడానికే బీజేపీ నేతలు పసలేని మాటలు చెప్తున్నారు’అన్నారు.మరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలెందుకు ఆదరించలేదన్న ప్రశ్నకు.. ‘రాష్ట్ర, జాతీయ రాజకీయాలు ఒకేలా ఉండవు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించినంత మాత్రాన లోక్‌సభ ఎన్నికల్లో అలాగే జరగాలని లేదు. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయవాదం ప్రధానపాత్ర పోషిస్తుంది. అయితే, బీజేపీ ఒక్కటే జాతి కోసం పనిచేస్తున్నట్టు కాదు’అన్నారు. -
పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమే : కమల్‌నాథ్
భోపాల్ : రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ముందుకొచ్చారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కమల్‌నాథ్ వెల్లడించారు. గురువారం భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఓటమికి నేను పూర్తి భాధ్యత వహిస్తున్నాను. రాహుల్ గాంధీ నిర్ణయం సరైందే. ఎంపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాన’ని తెలిపారు. పార్టీలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు ఎవరూ కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతిత తెలిసిందే. అంతేకాకుండా అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కమల్‌నాథ్ కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని 29 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించింది. కాగా, కాంగ్రెస్ అధిష్టానం 2018 ఏప్రిల్‌లో కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షునిగా నియమించింది. అయితే గతేడాది డిసెంబర్లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన ఎంపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ముందుకొచ్చారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కమల్‌నాథ్‌ను ఆ పదవిలో కొనసాగాలని కోరింది. -
ఆ సీఎంకు మాజీ సీఎం క్లాస్
భోపాల్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ హాజరు కాకపోవడాన్ని మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తప్పుపట్టారు. యోగ చేయడంద్వారా రాష్ట్ర ప్రజలు, యువత ఫిట్‌గా ఉండేలా ముఖ్యమంత్రి కమల్ నాథ్జీ ప్రోత్సహించి ఉండాల్సిందని చౌహాన్ వ్యాఖ్యానించారు. కేవలం అధికార యంత్రాంగాన్ని నడిపించడం ఒక్కటే సీఎం పని కాదని, రాష్ట్రానికి ఓ దశా-దిశను నిర్ధేశం చేయాల్సిన గురుతర బాధ్యత ఆయనపై ఉందని అన్నారు. యోగ కార్యక్రమంలో పాల్గొనకుండా ఆయన తన సంకుచిత మనస్తత్వాన్ని వెల్లడించారని చౌహాన్ ఆక్షేపించారు. భోపాల్‌లోని లాల్ పరేడ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఏర్పాటు చేయకపోవడం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని ఏ ఒక్క పార్టీకో చెందిన వ్యక్తి కాదని, దేశ ప్రజలందరికీ ఆయన ప్రధాని అని విపక్షం అర్దం చేసుకోవాలని చురకలు వేశారు. ప్రధాని మోదీ చొరవతోనే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినం ప్రకటించిందని గుర్తుచేశారు. -
ఓటమితో కాంగ్రెస్ శిబిరంలో కాక..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌లో కాక రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని 29 స్ధానాలకు గాను 28 స్ధానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ పావులు కదుపుతోందన్న వార్తలు కాంగ్రెస్‌లో గుబులు రేపుతుండగా, పార్టీలో అంతర్గత పోరు పతాకస్ధాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. యువ నేత, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కీలక బాధ్యతలు అప్పగించాలని 72 ఏళ్ల కమల్ నాథ్ నేతృత్వంలో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని సింధియా వర్గం డిమాండ్ చేస్తుండటం ఆ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపొందిన అనంతరం యువనేత జ్యోతిరాదిత్య సింధియా, కమల్ నాథ్‌ల మధ్య స్వయంగా పార్టీ చీఫ్ రాహుల్ సయోధ్య కుదిర్చినా ఇరు వర్గాలకు పొసగకపోవడం ఎంపీ కాంగ్రెస్‌లో గుబులు రేపుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం నేపథ్యంలో జ్యోతిరాదిత్యకు మధ్యప్రదేశ్ పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ ఊపందుకోవడం కమల్ నాథ్ వర్గీయులకు మింగుడుపడటం లేదు. మరోవైపు పార్టీ ఓటమిపై అభ్యర్ధులతో కమల్ నాథ్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో జ్యోతిరాదిత్యకు సన్నిహితులైన మంత్రులు యువనేత జ్యోతిరాదిత్యకు రాష్ట్ర పార్టీ చీఫ్‌గా నియమించాలనే డిమాండ్‌ను ముందుకుతేవడం కమల్ నాథ్‌కు ఇబ్బందికరంగా పరిణమించింది. మధ్యప్రదేశ్ పార్టీ చీఫ్‌గానూ కమల్ నాథ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
కమల్ నాధ్‌కు కీలక బాధ్యతల అప్పగింత
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకీ విస్పష్ట మెజారిటీ రాకుంటే బీజేపీయేతర పార్టీలతో కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నాన్ బీజేపీ అలయన్స్ ఏర్పాటు దిశగా చర్చలు జరిపేందుకు మధ్యప్రదేశ్ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాధ్‌కు యూపీఏ చీఫ్ సోనియా గాంధీ బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం హంగ్ పార్లమెంట్ అనివార్యమైతే చిన్న, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే కసరత్తును కమల్ నాధ్‌కు సోనియా అప్పగించినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో ఎన్డీఏయేతర పక్షాలు, తటస్ధంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లకు కీలకంగా మారనున్నాయి. కేంద్రంలో ఎవరు అధికార పగ్గాలు చేపడతారో నిర్ణయించే కీలక పార్టీలుగా ఇవి అవతరిస్తాయి. ఇక హంగ్ పార్లమెంట్ అనివార్యమైతే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా పార్టీకి మద్దతును కూడగట్టే ప్రక్రియను కమల్ నాధ్ సమర్ధంగా ముందుకు తీసుకువెళతారని సోనియా భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఉజ్జయినిలో ప్రియాంక ప్రత్యేక పూజలు
ఉజ్జయిని(మధ్యప్రదేశ్): కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. సార్వత్రిక ఎన్నికల ఏడో విడత ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ నేడు ఉజ్జయినిలో పర్యటించారు. ఈ సందర్భంగా మహాకాళేశ్వర ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు గంటకు పైగా ప్రియాంక పూజలో పాల్గొన్నారు. ఆమెతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. అనంతరం ఉజ్జయినిలో జరిగిన రోడ్ షోలో ఆమె ప్రసంగించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో మెజారిటీ లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉజ్జయిని లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాబులాల్ మాలవ్యా బరిలో నిలిపింది. ఏడో విడతలో భాగంగా మే 19న ఉజ్జయినిలో పోలింగ్ జరగనుంది. -
మోదీ గుజరాత్‌కు తిరిగి వెళ్లడం ఖాయం
భోపాల్: మాజీ ప్రధానిరాజీవ్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ఆరోపణలు అరాచకంగా ఉంటున్నాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌నేత కమల్‌నాథ్ అన్నారు. ‘ఇటీవలి కాలంలో మోదీ మాటలు చూస్తుంటే ఒకటి అర్థమవుతున్నది. మోదీ కోపంగా ఉన్నారు. గుజరాత్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్లే సమయం వచ్చిందని ఆయనకు తెలుస్తోంది’అని కమల్‌నాథ్ పేర్కొన్నారు. పీటీఐకి ఆయన గురువారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘మోదీ తన స్థాయి ని మర్చిపోవడం బాధాకరం. ఆయన ఆరోపణలు చేస్తున్న విధానం అరాచకం. మోదీ ఇప్పుడు యువత గురించి, రైతుల గురించి, వ్యాపారుల గురించి మా ట్లాడటం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు’అని కమల్‌నాథ్ అన్నా రు. గత శనివారం మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాపగఢ్ జిల్లాలో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఓ అవినీతిపరుడిగా పేరుమోసి చనిపోయారని అన్నారు. మోదీ భవిష్యత్తు గురించి కమల్‌నాథ్‌ను అడగ్గా, ‘ఒక్కటైతే కచ్చితంగా చెప్పగలను. మోదీ ఇంటికి (గుజరాత్‌కు) తిరిగి వెళ్లనున్నారు’ అని అన్నారు. భోపాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్‌పై బీజేపీ తరఫున ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పోటీ చేస్తుండటంపై కమల్‌నాథ్ మాట్లాడుతూ ‘భోపాల్‌లో బీజేపీకి అభ్యర్థులే లేరు. అందుకే పార్టీలో చేరిన మరుసటి రోజే ప్రజ్ఞతో వారు నామినేషన్ వేయించారు. ఆమెను తమ అభ్యర్థిగా నిలపడం ద్వారా, హిందూత్వ రాజకీయాలు చేసి, ప్రజల మధ్య చిచ్చుపెట్టాలన్నదే తమ లక్ష్యమనే సందేశాన్ని బీజేపీ ఇచ్చింది’అని విమర్శించారు. మా ఉమ్మడి లక్ష్యం బీజేపీ ఓటమి.. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన లోకేంద్ర సింగ్ రాజ్‌పుత్, నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున బీఎస్పీ తరఫున పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆ నియోజకవర్గంలో బీఎస్పీకి అభ్యర్థే లేకుండాపోగా, కాంగ్రెస్ తరఫున జ్యోతిరాదిత్య సింధియా పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతుండటం తెలిసిందే. తమ అభ్యర్థి కాంగ్రెస్ లో చేరడంతో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి హెచ్చరించారు. ‘ఆ అభ్యర్థి కాంగ్రెస్‌లో చేరాలనుకున్నాడు. కాంగ్రెస్, బీఎస్పీల ఉమ్మడి లక్ష్యం బీజేపీని ఓడించటం. బీజేపీకి లాభం చేకూర్చేలా మాయావతి ఏమీ చేయరని నా నమ్మకం’ కమల్ నాథ్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్‌సభ స్థానాలకుగాను కాంగ్రెస్ 22 సీట్లు గెలుస్తుందన్నారు. -
హామీలు నెరవేర్చకుంటే బట్టలిప్పి కొట్టండి!
ధనోరా: లోక్‌సభ ఎన్నికల్లో ఛింద్వారా నుంచి తన కుమారుడు నకుల్‌నాథ్‌ను గెలిపించాలని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ప్రజలను కోరారు. ఒకవేళ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే అతని దుస్తులను చించివేసి శిక్షించాలని సూచించారు. ధనోరా గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఛింద్వారా నియోజకవర్గంతో తన 40 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కమల్‌నాథ్..‘నకుల్ ప్రస్తుతమిక్కడ లేకపోయినా మీకు సేవ చేస్తాడు. నకుల్‌కు ఆ బాధ్యతను నేను అప్పగించాను. మీరిచ్చిన శక్తి, ప్రేమ వల్లే నేను ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను. మనం త్వరలోనే సరికొత్త చరిత్రను సృష్టించడంతో పాటు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం’ అని అన్నారు. -
‘పని చేయకపోతే చొక్కా పట్టుకోండి’
భోపాల్ : తన కుమారుడు నియోజకవర్గ అభివృద్ధికి పని చేయకుంటే అతని చొక్కా పట్టుకుని నిలదీయండని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎం కమల్‌నాధ్ అన్నారు. చింద్వారా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న కుమారుడు నకుల్ తరపున కమల్‌నాధ్ ప్రచార సభల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చింద్వారాతో నాలుగు దశాబ్ధాల అనుబంధం ఉన్న తాను ఇప్పుడు తన కుమారుడిని నియోజకవర్గానికి అప్పగిస్తున్నానని చెప్పారు. చింద్వారా ప్రజలు పంచిన ప్రేమ, ఆప్యాయతలతోనే తాను ఈస్ధాయికి ఎదిగానని, ఈ బాధ్యతలను ఇప్పుడు తన కుమారుడు నకుల్‌కు అప్పగిస్తున్నానని కమల్‌నాధ్ స్ధానికులతో చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ చౌహన్లు ప్రజల్ని మభ్యపెట్టడం మినహా చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొమ్మిది సార్లు ప్రాతినిధ్యం వహించిన కమల్‌నాధ్ ప్రస్తుతం తన కుమారుడి కోసం ఈ స్ధానాన్ని వదులుకున్నారు. మరోవైపు సీఎం కమల్‌నాధ్ చింద్వారా అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. -
ప్రచారానికి మళ్లిన ప్రభుత్వ నిధులు!
భోపాల్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాలపై జరిపిన ఐటీ సోదాల్లో రోజుకొకటి చొప్పున విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఉద్దేశించిన నిధుల్ని ప్రచారానికి దారి మళ్లించినట్లు అనుమానాలు రేకిత్తిస్తున్న కీలక డైరీ తాజాగా బయటపడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడి వద్ద నుంచి ఈ డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ప్రజా పనులు, మైనింగ్, ఎక్సైజ్, రవాణా, ఇంధనం ఇలా పలు విభాగాలకు కేటాయించిన నిధులు ఒక వైపు, ఖర్చులు మరోవైపు డైరీలో రాసి ఉన్నట్లు గుర్తించారు. ఖర్చుల్లో పీసీసీ, ఢిల్లీ–ఏఐసీసీ పేర్లు ప్రస్తావించడం సంచలనం రేపుతోంది. ఢిల్లీ–మధ్యప్రదేశ్ మధ్య అక్రమ నగదు చెలామణికి పాల్పడుతూ రూ.281 కోట్ల విలువైన నగదును అక్రమంగా నిల్వచేసిన వ్యవస్థీకృత రాకెట్‌ను గుర్తించినట్లు అధికారులు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఎన్నికల వేళ ఎన్ఫోర్స్మెంట్ సంస్థల సోదాలు తటస్థంగా ఉండాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు స్పందిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం బదులు పంపింది. మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి నగదు అక్రమ రవాణా జరుగుతోందని విశ్వసనీయ సమాచారం అందడంతోనే సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 50 చోట్ల జరిగిన ఐటీ దాడులు మరో రెండు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది. విపక్షాలను అడ్డుకునేందుకే: అహ్మద్ పటేల్ విపక్ష నాయకులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకునేందుకే ఆదాయ పన్ను ఎగవేత పేరిట సోదాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ ఆరోపించారు. ఐటీ దాడులకు భయపడేది లేదని, ఎన్నికలకు ముందు రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం బీజేపీలో నెలకొన్న నిరాశ, నిస్పృహలను సూచిస్తున్నాయని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దేశ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
అవి రాజకీయ దాడులే..
ఇండోర్ : మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాధ్‌కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) ప్రవీణ్ కక్కర్ తన నివాసాలు, కార్యాలయాలపై రెండు రోజులు జరిగిన ఐటీ దాడులు రాజకీయ కోణంలో జరిగనవేనని పేర్కొన్నారు. ఆదాయ పన్ను అధికారులు రెండు రోజుల పాటు సాగించిన దాడులు, సోదాల్లో వారు ఎలాంటి పత్రాలను సీజ్ చేయలేదని, నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోలేదని చెప్పారు. ఈ దాడులను ఆయన పూర్తిగా పొలిటికల్ ఆపరేషన్‌గా అభివర్ణించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందం ఇండోర్‌లోని కక్కర్ నివాసాలతో పాటు కమల్‌నాధ్‌కు మాజీ సలహాదారు ఆర్కే మిగ్లానీ ఢిల్లీ నివాసంపై ఆదివారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు ఇండోర్, భోపాల్, గోవా, ఢిల్లీ వంటి పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు దాడులు నిర్వహించారు. కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాలపై నిర్వహించిన సోదాల్లో రూ.281 కోట్ల విలువైన నగదును అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించామని ఐటీ అధికారులు చెప్పారు. ఈ నిధుల్ని సేకరించేందుకు విస్తృతంగా వ్యవస్థీకృత రాకెట్ ఒకటి నడుస్తోందని తెలిపారు. ఆదివారం నాటి దాడుల్లో లెక్కల్లో చూపని రూ.14.6 కోట్ల నగదు, మధ్యప్రదేశ్–ఢిల్లీ మధ్య జరిగిన అనుమానిత లావాదేవీలకు సంబంధించిన కంప్యూటర్ ఫైల్స్‌ను జప్తు చేసినట్లు వెల్లడించారు. -
కమల్‌నాధ్ సన్నిహితులపై కొనసాగుతున్న ఐటీ దాడులు
భోపాల్ : మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సంబంధీకుల ఇళ్లు, ఆఫీస్లపై ఆదివారం ఆదాయ పన్ను శాఖ చేపట్టిన దాడులు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాధ్ ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ సహచరుడు అశ్వని శర్మ నివాసం సహా మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోమవారం ఉదయం నుంచి దాడులు కొనసాగిస్తున్నారు. అశ్వని శర్మ, ప్రవీణ్ కక్కర్ నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, ఆదాయ పన్ను ఎగవేత, నగదు అక్రమ చలామణి ఆరోపణలపై ఆదివారం ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో 50 చోట్ల ఐటీ అధికారులు, పోలీసులు సోదాలు చేశారు. దాడుల్లో లెక్కల్లో చూపని రూ. 14 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇండోర్, భోపాల్, గోవా, ఢిల్లీలో సోదాల్లో కమల్‌నాథ్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) ప్రవీణ్ కక్కడ్, మాజీ సలహాదారు రాజేంద్ర మిగ్లానీ ఇళ్లలో సోదాలు చేశారు. ఇక ప్రవీణ్ కక్కర్‌కు అత్యంత సన్నిహితుడైన అశ్విన్ శర్మ నివాసంపై ఆదివారం ఐటీ దాడులు జరిపేందుకు వెళ్లిన అధికారులతో ఇరు పక్షాల మధ్య మీడియా సమక్షంలోనే అరగంటకు పైగా వాగ్వాదం సాగింది. అశ్విన్ శర్మ వ్యాపారవేత్త కావడం గమనార్హం. మరోవైపు సీఎం సన్నిహితులపై ఐటీ దాడుల నేపథ్యంలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఏం చేస్తోందో కమల్‌నాథ్ సారథ్యంలో మధ్యప్రదేశ్‌లోనూ అదే జరుగుతోందని దుయ్యబట్టారు. -
టఫెస్ట్ సీటు నుంచి దిగ్విజయ్ పోటీ!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్వజయ్ సింగ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. అత్యంత పోటీ ఉండే లోక్‌సభ స్థానం (టఫెస్ట్ సీటు) నుంచి పోటీ చేయాలని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ విసిరిన చాలెంజ్‌ను దిగ్విజయ్ సింగ్ నాలుగు రోజుల కిందట స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను భోపాల్ నుంచి కాంగ్రెస్ బరిలోకి దింపింది. గట్టి పోటీ ఉండే స్థానం నుంచి పోటీ చేయాలన్న తన సవాలును దిగ్విజయ్ స్వీకరించడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సీఎం కమల్‌నాథ్ శనివారం విలేకరులకు తెలిపారు. ‘చాలెంజ్‌లు స్వీకరించడం నా అలవాటు. 1977లో జనతా పార్టీ ప్రభంజనం వీచినప్పటికీ.. రాంగఢ్ నియోజకవర్గం నుంచి నేను గెలుపొందాను. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన స్థానంలో పోటీకి సిద్ధంగా ఉన్నాను’ అని దిగ్విజయ్ ట్విటర్లో తెలిపారు. భోపాల్ మధ్యప్రదేశ్‌లో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అలోక్ సంజార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భోపాల్‌తోపాటు ఇండోర్, విదిశా నియోజకవర్గాల్లో గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో భోపాల్‌లో కాంగ్రెస్ నుంచి మాజీ రాష్ట్రపతి దివంగత శంకర్ దయాల్ శర్మ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో భోపాల్ నుంచి దిగ్విజయ్‌ను కమల్‌నాథ్ బరిలోకి దింపుతున్నారు. కమల్‌నాథ్ సీఎం పదవి చేపట్టిన తర్వాత దిగ్విజయ్‌తో ఆయనకు విభేదాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు రానున్న ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తాయని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. -
ప్రియాంక ఎంట్రీతో బీజేపీకి షాక్ : కమల్ నాథ్
దావోస్ : యూపీ (తూర్పు) కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం బీజేపీకి చావుదెబ్బ వంటిదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్నారు. అత్యధిక లోక్‌సభ సీట్లున్న యూపీలో ప్రియాంక ఆగమనం ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి ఎదురుదెబ్బేనని వ్యాఖ్యానించారు. ప్రియాంక నేతృత్వంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ అత్యధిక స్ధానాలు కైవసం చేసుకుంటుందని కమల్ నాథ్ ధీమా వ్యక్తం చేశారు. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పార్టీని సమర్ధంగా నడిపించడంలో విఫలమైనందునే ప్రియాంక గాంధీని తెరపైకి తెచ్చారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
సింధియా-చౌహాన్ భేటీ వెనుక ఆంతర్యం ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పై జ్యోతిరాదిత్య సింధియా అసంతృప్తితో ఉన్నారా? మధ్యప్రదేశ్ సీఎం పదవి దక్కలేదన్న బాధ వెంటాడుతోందా? బీజేపీ సీనియర్ నేత శివరాజ్‌చౌహాన్‌తో సింధియా భేటీ ఆంతర్యం ఏంటి? మర్యాదపూర్వకంగా కలిశామని నేతలు చెబుతున్నా.. రాజకీయ కారణం ఉందన్న ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ యువనేత, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, మాజీ సీఎం , బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలువడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భోపాల్‌కి దూరంగా ఉండే సింధియా సోమవారం సిటీకొచ్చారు. తన సన్నిహితులను కలిసిన తర్వాత చౌహాన్ ఇంటికి వెళ్లారు. దాదాపు 40 నిమిషాలపాటు వీరిద్దరూ చర్చలు జరిపారు. తర్వాత బయటకొచ్చిన చౌహాన్, సింధియా.. మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పారు. అనంతరం కారు వరకూ వెళ్లి సింధియాకు వీడ్కోలు పలికారు శివరాజ్‌సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ప్రస్తుతం దావోస్‌లో ఉన్నారు. ఆయన రాష్ట్రంలో లేని సమయంలో సింధియా.. చౌహాన్‌ను కలవడం హాట్ టాపిక్‌గా మారింది. మర్యాదపూర్వకంగానే కలిశామని ఇద్దరు నేతలూ చెబుతున్నా.. రాజకీయ నేపథ్యం ఉండే ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరదించి ఇటీవలే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా కీలకంగా వ్యవహరించారు. సీఎం పదవి కోసం ఇద్దరూ పోటీపడ్డారు. చివరికి సీనియర్ అయిన కమల్‌నాథ్ వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపింది. ఇది సింధియా వర్గీయులను ఒకింత అసంతృప్తికి గురిచేసింది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన సింధియా.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడాలని అనుచరులకు సర్దిచెప్పుకున్నారు. తాజాగా ఆయన చౌహాన్‌తో భేటీ అవడంతో ఈ విషయం మళ్లీ తెరమీదకి వచ్చింది. కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తి కారణంగానే సింధియా.. చౌహాన్‌ను కలిశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను అస్థిరపరచాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్నదే త్వరలో మధ్యప్రదేశ్‌లోనూ జరిగే అవకాశం ఉందని కోల్‌కతాలో జరిగిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి హెచ్చరించారు. ఒక్క సీటే తేడా అయినా, మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్ సంకీర్ణ ప్రభుత్వమే. ఎస్పీ, బీఎస్పీ సహకారంతో కమల్‌నాథ్ ప్రభుత్వం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సింధియా ఎర్రజెండా చూపిస్తే, ప్రభుత్వం పడిపోవడం ఖాయం. అందుకే, సింధియా- చౌహాన్ భేటీ ఆసక్తికరంగా మారింది. అయితే, అభివృద్ధి కార్యక్రమాల్లో చౌహాన్ మద్దతు కోరేందుకే సింధియా ఆయనను కలిశారని.. పుకార్లు నమ్మొద్దని కాంగ్రెస్ చెబుతోంది. -
కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు.. ఇదిగో సాక్ష్యాలు!
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న హిందూత్వ, జాతీయవాదాన్ని ఎలా త్రిప్పికొట్టాలో తెలియక కాంగ్రెస్ పార్టీ తికమక పడుతోంది. ఆవిర్భావం నుంచి పార్టీకి పునాదులుగా ఉన్న లౌకికవాదం, జాతీయవాదం, లింగ సమానత్వం, మానవ హక్కులకు తిలోదకాలిస్తోంది. అధికారం కోసం అంగలారుస్తూ బీజేపీకన్నా ఎక్కువగా ఆత్మవంచనకు పాల్పడుతోంది. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఓ విధానం, రాష్ట్రాల స్థాయిలో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా మరో విధానం అంటూ కొత్త పాటను అందుకుంది. కాంగ్రెస్ పార్టీలో పేరుకుపోతున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు మొట్టమొదటిసారిగా ప్రజల ముందు జనవరి మూడవ తేదీన బయటపడ్డాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి యాభై ఏళ్లకు లోపున్న ఇద్దరు మహిళలు ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు పాటిస్తున్న ‘నిరసన దినం’లో భాగంగా కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు నల్లబ్యాడ్జీలు ధరించి పార్లమెంట్‌కు వచ్చారు. పార్లమెంట్ ఆవరణలోనే వారిని సోనియాగాంధీ అడ్డుకుని ఆ బ్యాడ్జీలను తీసి వేయించారు. అయ్యప్ప ఆలయానికి సంబంధించిన నిరసన కేరళ వరకే పరిమితం కావాలని, జాతీయస్థాయిలో ఆడ, మగ మధ్య లింగ వివక్ష చూపకూడదని ఆమె హితవు చెప్పారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల ఆడవారిని అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు పాలకపక్ష బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఒకే తీరుగా స్పందించాయి. ఇరు పార్టీలు తీర్పును హర్షించాయి. కేరళ భక్తులు తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడంతో బీజేపీ ముందుగా ప్లేటు ఫిరాయించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ప్లేటు ఫిరాయించింది. పదేళ్ల నుంచి యాభై ఏళ్ల లోపు మహిళలను అనుమతించరాదనే అయ్యప్ప ఆలయ సంప్రదాయాన్ని తాను గౌరవిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి ఒకటవ తేదీన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇదే విషయమై రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నించగా మహిళల పట్ల వివక్ష చూపకూడదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, కేరళ కాంగ్రెస్ ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నదని, పార్టీ అభిప్రాయమే తనదని చెప్పారు. దీన్నే ద్వంద్వ ప్రమాణాలంటారు. వ్యక్తిగతంగా గాంధీల అభిప్రాయం ఏదైనా ఉండవచ్చు. దాన్ని ఎవరూ కాదనరు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒకే అభిప్రాయం ఉండాలి. ఓటు రాజకీయాల కోసం ఏకాభిప్రాయాన్ని వదిలిపెట్టడమే ద్వంద్వ ప్రమాణాలను దగ్గరికి తీసుకోవడం అవుతుంది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తోంది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రతి నెల మొదటి రోజు రాష్ట్ర సచివాలయంలో ‘వందేమాతరం’ గీతాలాపనను రద్దు చేశారు. గీతాలాపన చేయడమే దేశభక్తికి రుజువు కాదంటూ 2005 సంవత్సరం నుంచి బీజేపీ ప్రభుత్వం ఆచరిస్తున్న సంప్రదాయాన్ని ఆయన పక్కన పడేశారు. ఇక ప్రతినెల బీజేపీ శాసన సభ్యులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌవాన్ ప్రకటించగానే కమల్ నాథ్ మాట మార్చారు. మరింత మెరుగ్గా ‘వందేమాతరం’ గీతాలాపన ఉండాలన్న ఉద్దేశంతోనే తాను దీన్ని వాయిదా వేశానంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసు బ్యాండుతో ఓ కిలోమీటరు మార్చింగ్తో వందేమాతరం గీతాలాపనను ప్రవేశపెట్టారు. రాజస్థాన్‌లో పశువులను అక్రమంగా తరలించారన్న అనుమానంపైన సాగిర్ ఖాన్ అనే ముస్లిం యువకుడిని ఇటీవల ఓ హిందూత్వ మూక అన్యాయంగా కొట్టి చంపేస్తే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ మౌనం పాటించింది. గతంలోనయితే కాంగ్రెస్ నాయకులు బాధితుడి ఇంటికెళ్లి పరామర్శించేవారు, నిరసన యాత్ర జరిపేవారు. హిందూ అగ్రవర్ణాలను ఆకట్టుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ తన సిద్దాంతాలకు తిలోదకాలిస్తోందని అర్థం అవుతోంది. కానీ ద్వంద్వ ప్రమాణాల వల్ల కొత్త వర్గాల మద్దతు లభిస్తుందో, లేదో చెప్పలేంగానీ ఉన్న వర్గాల మద్దతు ఊడిపోయే ప్రమాదం ఉంటుందన్నది మరచిపోరాదు. -
‘సిక్కు వ్యతిరేక అల్లర్ల నిందితుడికి అందలం’
చండీగఢ్ : మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొన్న నేతను కాంగ్రెస్ సీఎంను చేసిందని పరోక్షంగా కమల్ నాథ్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో గురువారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పట్ల పంజాబ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్‌కు న్యాయస్ధానం ఇటీవల జీవిత ఖైదు విధించడాన్ని ప్రస్తావిస్తూ గాంధీ కుటుంబ సూచనలతో ఈ కేసుకు సంబంధించిన నిందితుల ఫైళ్లను సమాధి చేశారని, ఎన్డీఏ ప్రభుత్వం ఆయా కేసులను తిరగదోడిందని చెప్పారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో నిందితులను కాపాడేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలూ చేసిందని ఆరోపించారు. గతంలో గరీబీ హఠావో నినాదంతో హడావిడి చేసిన కాంగ్రెస్ ఇప్పుడు రైతు రుణాల మాఫీ పేరుతో లాలీపాప్ స్కీమ్‌లతో ముందుకొస్తోందన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో రుణ మాఫీ హామీతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
15 ఏళ్ల తర్వాత చెప్పులు తొడిగాడు..!
భోపాల్ : పార్టీ గెలుపు కోసం నాయకుల కంటే ఎక్కువ కార్యకర్తలే కృషి చేస్తారు. ఈ క్రమంలో గెలుపు కోసం పూజలు, యాగాలు చేసేవారు కొందరైతే భీష్మ ప్రతిజ్ఞలు చేసేవారు మరి కొందరు. మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ గెలిస్తేనే గడ్డం గీసుకుంటానని ఓ నాయకుడు.. ఓడిపోతే పీక కోసుకుంటానంటూ మరో నాయకుడు శపథాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవన్ని జరిగేవి కావని జనాలకు కూడా తెలుసు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కార్యకర్త మాత్రం చేసిన శపథాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏకంగా 15 ఏళ్ల పాటు చెప్పులు లేకుండా తిరిగాడు. వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2003లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ 15 ఏళ్ల తర్వాత తిరిగి విజయం సాధించింది. 2003లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లకు గాను కాంగ్రెస్ కేవలం 38 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. అంత ఘోరంగా ఓటమి పాలయ్యంది. ఆ ఫలితాలకు బాధ్యత వహిస్తూ అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయనని, దశాబ్దం పాటు రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోనని అన్నారు. ఈ క్రమంలోనే దుర్గా లాల్ కిరార్ అనే కాంగ్రెస్ కార్యకర్త కూడా రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. దాని ప్రకారం ఆయన ఈ 15 ఏళ్లు చెప్పులు లేకుండానే తిరిగారు. ఎట్టకేలకు ఈ ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో దుర్గాలాల్ తన 15 ఏళ్ల శపథానికి స్వస్తి పలికారు. బుధవారం కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ సమక్షంలో దుర్గా లాల్ బూట్లు వేసుకున్నారు. ఈ విషయం గురించి కమల్ నాథ్ తన ట్విటర్లో ‘కాంగ్రెస్ కోసం రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమించిన ఇలాంటి కార్యకర్తలందరికి సాల్యూట్ చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. -
మంత్రివర్గ విస్తరణ.. ఇద్దరు మహిళలకు చోటు
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మంగళవారం మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. 28 ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించిన ఆయన.. తన మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ రాజ్‌భవన్‌లో వీరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. సజ్జన్ సింగ్ వర్మ, విజయలక్ష్మీ సాధూ, హుకుమ్ సింగ్ కరడ, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, బాలా బచ్చన్, అరిఫ్ అకిల్, ప్రదీప్ జైస్వాల్, ఇమ్రతీ దేవి తదితర ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కాగా పదిహేనేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబరు 17న కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టారు. -
ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ప్రముఖ నేతలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వార్షిక సమావేశాలు వచ్చే నెల 21 నుంచి 25వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పట్టణంలో జరగనున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ కిమ్ సహా ఆరుగురు సంయుక్తంగా అధ్యక్షత వహిచనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాధిపతులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, పౌర సమాజం ప్రముఖులు కలసి 3,000 మంది వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ‘ప్రపంచీకరణ 4.0: నాలుగో పారిశ్రామిక విప్లవం దశలో ప్రపంచ స్వరూపం’ ఈ కార్యక్రమం ప్రధాన అంశంగా ఉంటుంది. వాతావరణం మార్పులు, జీవ వైవిధ్యం, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాల నష్టం అంశాలను పరిష్కరించాల్సి ఉందని ప్రపంచ ఆర్థిక ఫోరం వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లౌస్ ష్వాబ్ పేర్కొన్నారు. కేటీఆర్, లోకేశ్ సైతం...: భారత్ నుంచి పాల్గొనే వారిలో అరుణ్ జైట్లీతోపాటు కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమల్‌నాథ్, చంద్రబాబునాయుడు, దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారు. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, కేటీఆర్ సైతం హాజరు కానున్నారు. వ్యాపార ప్రముఖులు అజీమ్ ప్రేమ్‌జీ, ముకేశ్ అంబానీ దంపతులు, ఉదయ్ కోటక్, గౌతం అదానీ, లక్ష్మీ మిట్టల్, నందన్ నీలేకని, ఆనంద్ మహీంద్రా, అజయ్ పిరమల్ కూడా పాలు పంచుకోనున్నారు. -
ఒకరికి జైలు, మరొకరికి పదవా!?
సాక్షి, న్యూఢిల్లీ : సోమవారం నాడు దేశంలో రెండు విభిన్న పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడగా, అదే కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్‌కు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి లభించింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులను విచారించిన నానావతి కమిషన్ అందులో కమల్ నాథ్ హస్తం ఉందనడానికి సరైన ఆధారాలు లభించలేదని పేర్కొంది. అంతేగానీ అతను నిర్దోషి అని తేల్చలేదు. సజ్జన్ కుమార్ హస్తముందన్న విషయాన్ని నానావతి కమిషన్ అనుమానించడంతో సీబీఐ దర్యాప్తు జరిపి ఆధారాలను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో సజ్జన్ కుమార్‌కు హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ జర్నలిస్ట్ సహా పలువురు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఢిల్లీలోని గురుద్వార్‌పై దాడి చేసిన అల్లరి మూకను రెచ్చగొడుతూ కమల్‌నాథ్ ప్రసంగించారు. అదే పని చేసిన సజ్జన్ కుమార్‌కు శిక్ష పడింది. అదే పని చేసినట్లు సాక్షులు చెబుతున్నట్లు కమల్ నాథ్ శిక్ష నుంచి తప్పించుకోవడంతోపాటు సీఎం పదవి అనే రివార్డు కూడా లభించింది. ఈ దేశంలో నేరం చేసి తప్పించుకునే అవకాశాలు రాజకీయ నాయకులకే ఎక్కువగా ఉన్నాయి. 1984 నాటి అల్లర్ల బాధితులు అవిశ్రాంతంగా పోరాడడం వల్ల 2000 సంవత్సరంలో కేంద్రం నానావతి కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సజ్జన్ కుమార్ కేసును సీబీఐ దర్యాప్తు జరపడం, కేంద్రంలో గత నాలుగేళ్లుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల రెండు కేసులను తప్పించుకున్నా మూడో కేసులో సజ్జన్ కుమార్‌కు శిక్ష పడింది. నేరం చేసిన రాజకీయ నాయకులను ఓ రాజకీయ వ్యవస్థ వెనకేసుకు రావడం వల్ల ఒకరు తప్పించుకోగలిగారు. ప్రత్యర్థికి శిక్ష పడాలని అదే రాజకీయ వ్యవస్థ కోరుకోవడం వల్ల మరొకరికి శిక్ష పడింది. ఇందులో బీజేపీ ప్రభుత్వం నిజం పక్కన నిలబడిందని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సజ్జన్ కుమార్‌కు శిక్ష విధించిన హైకోర్టే, ఇంతకుముందు దేశంలో, అంటే 1993లో ముంబైలో, 2002లో గుజరాత్, 2008లో కంధమాల్, 2013లో ముజాఫర్ నగర్లో జరిగిన అల్లర్లను ప్రస్థావించింది. ఈ అన్ని అల్లర్లు ఓ మైనారిటీ మతానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లే కాకుండా అన్నింటిలోనూ బీజేపీ హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి, కొన్నింట్లో కేసులు కూడా కొనసాగుతున్నాయి. అలాంటి బీజేపీని రానున్న ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ ‘హస్తం’ ముందుగా శుభ్రంగా ఉండాలి. -
రైతు రుణమాఫీపైనే సీఎం తొలి సంతకం!
భోపాల్ : మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ సమక్షంలో సీఎంగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలకు మందు వాగ్దానం చేసినట్టుగానే... ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కమల్‌నాథ్ రైతు రుణమాఫీపై తొలి సంతకం చేశారు. తద్వారా రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణభారం తప్పిందని సీఎంవో అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఇక కమల్‌నాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ కార్యదర్శి మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు హాజరయ్యారు. కాగా 1984 సిక్కు వ్యతిరేక ఘర్షణల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ను దోషిగా తేలుస్తూ ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టిపారేస్తూ ఆయనకు జీవిత ఖైదు విధించింది. అయితే సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుతో కమల్‌నాథ్‌కు కూడా సంబంధాలు ఉన్నాయంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, సీఎం కమల్‌నాథ్ లక్ష్యంగా ప్రతిపక్ష బీజేపీ విమర్శల దాడికి దిగింది. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టు తీర్పును రాజకీయం చేయొద్దని హితవు పలికారు. -
‘తాను ప్రధాని కావాలని రాహుల్ అనలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని భావి ప్రధానిగా ప్రకటించి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విపక్షాల్లో చిచ్చు రాజేశారు. స్టాలిన్ ప్రకటనపై పలు విపక్ష పార్టీలు మండిపడుతుండగా, కాంగ్రెస్ నేతలు సైతం వివరణలతో ముందుకొస్తున్నారు. రాహుల్ ఎన్నడూ తాను ప్రధాని కావాలని కోరుకుంటున్నట్టు చెప్పలేదని మధ్యప్రదేశ్ సీఎం పగ్గాలు చేపట్టిన కమల్ నాథ్ పేర్కొన్నారు. రాహుల్ సహా కాంగ్రెస్ నేతలెవరూ ప్రధాని పదవిపై తొందరపాటుతో లేరని చెప్పారు. ప్రధాని పదవిని కోరుకుంటున్నట్టు రాహుల్ ఎన్నడూ పెదవివిప్పలేదని..భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపుల అనంతరం తీసుకునే నిర్ణయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన నిర్ణయంపై ఇప్పుడే పేర్ల గురించి కసరత్తు చేయడం తొందరపాటు అవుతుందని అన్నారు. రాహుల్ ప్రధాని అభ్యర్ధిగా డీఎంకే ప్రతిపాదించడంపై బీఎస్పీ, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్‌ల గైర్హాజరుకు స్టాలిన్ ప్రతిపాదనే కారణమనే వార్తలను కమల్ నాథ్ తోసిపుచ్చారు. వారు వ్యక్తిగత కారణాలతోనే ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని చెప్పారు. -
నేడే కమల్‌నాథ్ ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని జంబోరీ మైదానంలో ఈ వేడుక ఉంటుందనీ, ప్రమాణ స్వీకారానికి ముందు సర్వమత ప్రార్థనలు ఉంటాయని కాంగ్రెస్ నాయకురాలు శోభా ఓజా ఆదివారం చెప్పారు. కమల్‌నాథ్ ప్రమాణం చేశాక గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆ ప్రాంగణం నుంచి వెళ్లిపోతారనీ, అనంతరం కమల్‌నాథ్‌తోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని శోభా చెప్పారు. ఇతర మంత్రులెవరూ లేకుండా కమల్‌నాథ్ మాత్రమే సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవె గౌడ, కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి తదితరులు ప్రమాణ స్వీకార వేడుకకు రానున్నారని ఓజా చెప్పారు. ఇటీవలి మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించి సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగిపోయినప్పటికీ బీఎస్పీ, ఎస్పీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. 15 వరుస సంవత్సరాల బీజేపీ పాలన తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే ఏర్పాటు కాబోతోంది. వింధ్య ప్రాంతంలో ఓటింగ్ సరళిపై విచారణ మధ్యప్రదేశ్‌లోని వింధ్య ప్రాంతంలో కాంగ్రెస్‌కు అతి తక్కువ సీట్లు రావడంతో ఈ ప్రాంతంలోని ఓటింగ్ సరళిపై విచారణ జరిపించనున్నట్లు కమల్‌నా«ద్ తెలిపారు. ఇక్కడి ఈవీఎంలపై తమకు అనుమానాలున్నాయన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 30 శాసనసభ నియోజకవర్గాలుండగా కాంగ్రెస్‌కు కేవలం 6 సీట్లే దక్కాయి. -
చింద్వాడా నుంచే కమల్‌నాథ్ పోటీ
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని తన సొంత జిల్లా చింద్వాడాలో కాంగ్రెస్ అత్యధిక ఆధిక్యంతో గెలుపొందిన నియోజకవర్గం నుంచి తాను త్వరలో పోటీ చేస్తానని మధ్యప్రదేశ్ కాబోయే సీఎం కమల్‌నాథ్ చెప్పారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో కమల్‌నాథ్ పోటీ చేయకపోయినప్పటికీ ఆయనను మధ్యప్రదేశ్ సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడం తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం సీఎం పదవిలో ఆయన కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోపు శాసనసభకు ఎన్నిక కావడం తప్పనిసరి. ఇక చింద్వాడా జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలుండగా, వాటిలో నాలుగు ఎస్సీ/ఎస్టీ రిజర్వ్డు స్థానాలు. దీంతో మిగిలిన మూడు స్థానాలైన చింద్వాడా, చౌరాయ్, సౌన్సర్లలో ఏదో ఓ చోటు నుంచి కమల్ చేయొచ్చు. ఈ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవగా, ఈ మూడింటిలో అత్యధిక ఆధిక్యం కాంగ్రెస్‌కు చింద్వాడాలోనే లభించింది. కమల్ ఇల్లు, ఓటరు జాబితాలో పేరు చింద్వాడాలో ఉన్నాయి. దీంతో ఆయన అక్కడి నుంచే పోటీ చేసి శాసనసభకు ఎన్నికవుతారని సమాచారం. చింద్వాడాలో కాంగ్రెస్ తరఫున శాసనసభకు ఎన్నికైన దీపక్ సక్సేనా తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయక తప్పని పరిస్థితి. ప్రమాణానికి రాహుల్, మమత కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులకు కూడా కమల్‌నాథ్ ఆహ్వానాలు పంపారని సమాచారం. -
సింధియాలకు అందని సీఎం
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం పీఠం సింధియా కుటుంబాన్ని ఊరిస్తోంది. సీఎం అవుతారని అందరూ భావించినా జ్యోతిరాదిత్య సింధియాను కాదని సీనియర్ అయిన కమల్‌నాథ్‌ను అధిష్టానం ఎంపిక చేసింది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవ్‌రావు సింధియాకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పట్లో అర్జున్‌సింగ్ ఆయనకు సీఎం పీఠం దక్కకుండా చక్రం తిప్పారు. సీఎం రేసులో కమల్‌నాథ్‌తో పోటాపోటీగా తుదిదాకా జ్యోతిరాదిత్య ముందున్నారు. గుణ ఎంపీ అయిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలు తీసుకుని, పార్టీని విజయతీరాలకు నడిపించారు. 9 పర్యాయాలు ఎంపీ అయిన కమల్‌నాథ్ తన సీనియారిటీతోపాటు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు పొందడం ద్వారా సీఎం రేసులో పైచేయి సాధించారు. జ్యోతిరాదిత్యను సీఎం పీఠం ఎక్కిస్తే రాష్ట్రంలో అతిపిన్న వయస్కుడైన సీఎంగా రికార్డు సృష్టించేవారు. అయితే, కమల్‌నాథ్(72)వైపే అధిష్టానం మొగ్గు చూపింది. 1989లో జ్యోతిరాదిత్య తండ్రి మాధవ్‌రావు సింధియా విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. అప్పట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్‌సింగ్ చుర్హాత్ లాటరీ స్కాంలో ఇరుక్కోవడంతో పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే, గ్వాలియర్ రాచకుటుంబానికి చెందిన మాధవ్‌రావు సింధియాకు సీఎం కుర్చీ అప్పగించరాదనే హామీని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నుంచి తీసుకున్న తర్వాతే అర్జున్‌సింగ్ పదవి నుంచి వైదొలిగారు. అంతేకాదు, తన వర్గం ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయాలు చేశారు. సీఎం పదవి తనకే దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్న మాధవ్‌రావు సింధియా కూడా భోపాల్‌లో మద్దతుదారులతో వేరుగా మకాం వేశారు. అయితే, అధిష్టానం మోతీలాల్ వోరాను ముఖ్యమంత్రిగా ఎంపికచేయడంతో మాధవ్‌రావు సింధియా తీవ్ర నిరాశ చెందారు. గ్వాలియర్ సంస్థానాధీశుల వారసుడు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన నానమ్మ రాజమాత విజయరాజే సింధియా జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1971 ఎన్నికల్లో జనసంఘ్ తరఫున విజయరాజేతోపాటు మాధవ్‌రావు సింధియా కూడా పోటీ చేసి, గెలుపొందారు. అప్పట్లో ఇందిర ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన అతికొద్ది మందిలో వీరు కూడా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విజయరాజేను కూడా ప్రభుత్వం జైలుపాలు చేసింది. అయితే, మాధవ్‌రావు సింధియా 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన తోబుట్టువులు వసుంధరా రాజే, యశోధరా రాజే బీజేపీలో చేరారు. -
‘పార్టీకి పట్టం కట్టేందుకే పాటుపడ్డా’
న్యూఢిల్లీ : పార్టీని అధికారంలోకి తేవడానికే కసితో పనిచేశానని, సీఎం పదవిని చేపట్టాలనే దాహం తనకు లేదని మధ్యప్రదేశ్ సీఎం పగ్గాలు చేపట్టనున్న కమల్‌నాథ్ పేర్కొన్నారు. తాను దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నానని, మధ్యప్రదేశ్‌లో తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ముందుకెళ్లానన్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సీఎం ఆశావహులు జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్‌లకు ప్రభుత్వంలో ఎలా భాగస్వామ్యం కల్పిస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ ప్రభుత్వంలో అందరికీ ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పారు. పార్టీలో సింధియా క్యాంప్, దిగ్విజయ్ క్యాంప్, కమల్‌నాథ్ క్యాంప్ అంటూ ఏమీ లేవన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. మోదీ, అమిత్ షా విన్నింగ్ కాంబినేషన్‌కు మధ్యప్రదేశ్‌లో చెక్ పెట్టామని చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గవర్నర్‌ను కలవడంపై కమల్‌నాథ్ స్పందిస్తూ గోవాలో బీజేపీకి తగినంత సంఖ్యాబలం లేకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేశారని, మధ్యప్రదేశ్‌లో తమకు తగినంత మెజారిటీ ఉన్నందునే గవర్నర్‌తో భేటీ అయ్యామన్నారు. మాయావతితో తాను మాట్లాడానని, తమకు మద్దతు ఇచ్చేందుకు ఆమె అంగీకరించారని, ఎస్పీ సైతం సహకరించేందుకు ముందుకువచ్చిందని అన్నారు. వారు బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని చెప్పారు. తమ ప్రభుత్వంలో అన్ని కులాలు, మతాలకు సమ ప్రాతినిధ్యం ఉంటుందని కమల్‌నాథ్ వెల్లడించారు. అవి తప్పుడు ఆరోపణలు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తనపై ఎలాంటి అభియోగాలు లేవని, తనపై ఆరోపణలున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. సిక్కు వ్యతిరేక ఘర్షణలపై ఏర్పాటైన నానావతి కమిషన్ సరైన ఆధారాలు లేవంటూ కమల్‌నాథ్‌పై అభియోగాలను తోసిపుచ్చింది. కాగా సిక్కుల ఊచకోతలో ప్రమేయం ఉన్న కమల్‌నాథ్‌కు మధ్యప్రదేశ్ సీఎం పదవి కట్టబెట్టడాన్ని సిక్కు సంఘాల ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్‌ను ఎంపిక చేస్తే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఢిల్లీకి చెందిన అకాలీదళ్ నేత మంజిందర్ సింగ్ సిర్సా హెచ్చరించారు. -
పైలట్, సింధియాలకు డిప్యూటీలతో సరి..?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్ వైపు మొగ్గుచూపిన కాంగ్రెస్ హైకమాండ్, రాజస్ధాన్‌లోనూ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. మధ్యప్రదేశ్, రాజస్ధాన్‌లో సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న యువ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్లను డిప్యూటీ సీఎంలుగా నియమించేందుకు మొగ్గుచూపుతోంది. సీఎం రేసులో ముందున్న సీనియర్లకు అవకాశం ఇస్తూ యువ నేతలను ఉప ముఖ్యమంత్రి పదవులతో సంతృప్తిపరచాలన్నది రాహుల్ వ్యూహంగా చెబుతున్నారు. మరోవైపు రాజస్ధాన్, మధ్యప్రదేశ్‌లలో సీఎం పదవికి తీవ్రంగా పోటీపడుతున్న యువ నేతలు సచిన్ పైలట్, సింధియాలు అనుచరగణంతో దేశ రాజధానికి చేరుకోవడంతో కసరత్తు సంక్లిష్టంగా మారింది. రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. యువనేతలు పైలట్, సింధియాలను పార్టీ పక్కనపెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి అనుచరులు ఏఐసీసీ కార్యాలయం వద్ద నినాదాలతో హోరెత్తించారు. సీనియర్లకు సహకరించాల్సిందిగా పైలట్, సింధియాలను రాహుల్ సహా అగ్రనేతలు బుజ్జగిస్తున్నట్టు సమాచారం. -
మధ్యప్రదేశ్ కొత్త సీఎం ఎవరు?
-
కమల్‌నాథ్.. కాంగ్రెస్ తురుపుముక్క
సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన 72 ఏళ్ల కమల్‌నాథ్ పటిష్టమైన వ్యూహరచనతో ఎన్నికల్లో పార్టీ విజయానికి బాటలు వేశారు. రాష్ట్ర ప్రజల్లో మంచి పట్టున్న శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఎదుర్కోవడానికి, ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఆయన పలు ప్రణాళికలు, పథకాలు రూపొందించారు. పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరాటాల్ని, అంతర్గత కుమ్ములాటలను నివారించి నేతలందరికీ ఏకతాటిపై నడిపించారు. ఫలితాల అనంతరం సీఎం పీఠంపై పోరులో ముందున్నారు. అప్పుడు ఇందిరకు.. ఇప్పుడు రాహుల్‌కు! 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఇందిరా గాంధీకి ఎంతగానో సహకరించిన కమల్‌నాథ్ దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మధ్య ప్రదేశ్‌లో బీజేపీ సర్కారును ఎదుర్కోవడానికి ఆ ఇందిరా గాంధీ మనుమడు రాహుల్ గాంధీకి అండగా నిలవడం విశేషం. లోక్‌సభలో సీనియర్ మోస్ట్ సభ్యుడయిన కమల్ నాథ్ ఇందిర కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. సంజయ్‌గాంధీ, కమల్‌నాథ్‌లు ఇందిరా గాంధీకి రెండు చేతులని అప్పట్లో పార్టీ నేతలు అభివర్ణించేవారు. కమల్‌నాథ్‌ను ఇందిరాగాంధీ తన మూడో కుమారుడని చెప్పేవాడని చెప్పుకుంటుంటారు. 1980లో మొదటి సారి చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయిన కమల్‌నాథ్ ఇంతవరకు 9 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి లోక్‌సభకు వెళ్లారు. యూపీఏ హయాంలో మంత్రిగా పని చేశారు. కేంద్రంలో యూపీఏ సర్కారు నిలదొక్కుకోవడానికి ప్రధాన శక్తిగా వ్యవహరించారు. డూన్ స్కూల్ స్నేహం... ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మహేంద్రనాథ్, లీనా నాథ్ దంపతులకు జన్మించిన కమల్‌నాథ్ డూన్ స్కూల్లో చదివారు. కోల్‌కతా యూనివర్సిటీ కాలేజీలో బీకాం చేశారు. కమల్ సతీమణి అల్కానాథ్. వీరికి ఇద్దరు కొడుకులు. 1968లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కమల్‌నాథ్ అనతికాలంలోనే పార్టీ పెద్దలకు సన్నిహితుడయ్యారు. కమల్‌కు డూన్ స్కూల్లో ఇందిర కొడుకు సంజయ్ ఆప్తమిత్రుడు. తద్వారా గాంధీ కుటుంబానికి సన్నిహితుడయ్యారు. సంజయ్ గాంధీ కోటరీలో ముఖ్యుడిగా పేరు పొందారు. 2009–11 మధ్య కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. వికీలీక్స్ దుమారం.. కేంద్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా వ్యవహరించిన కమల్‌నాథ్‌కు అమెరికా తొత్తు అని, దేశానికి సంబంధించిన పలు రహస్యాలను అమెరికాకు చేరవేసేవాడని ‘వికీలీక్స్’ వెల్లడించడం అప్పట్లో(1976) తీవ్ర సంచలనం కలిగించింది.గతంలో యూపీఏ సర్కారుపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు ప్రభుత్వానికి మద్దతివ్వడం కోసం కమల్‌నాథ్ కొందరు ఎంపీలకు లంచాలిచ్చారని కూడా వార్తలు వచ్చాయి. రాడియా టేపుల వ్యవహారంలో నాథ్ పేరు వినపడింది. పర్యావరణ మంత్రిగా ఉండగా పర్యావరణ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం, పర్యావరణ మదింపును ప్రవేశపెట్టడం, పర్యావరణ బ్రిగేడ్లు ఏర్పాటు చేయడం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జౌళిశాఖ సహాయ మంత్రి హోదాలో నూతన జౌళి విధానం తెచ్చారు. ఆయన హయాంలో పత్తి ఎగుమతులు పతాక స్థాయికి చేరాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా ఎఫ్‌డీఐలు 7 ఏడు రెట్లు పెరిగేలా చూశారు. విదేశీ వాణిజ్య విధానాన్ని తెచ్చి ఎగుమతుల పెంపు, భారీగా ఉపాధి కల్పనకు దోహదపడ్డారు. రచయిత కూడా.. వందల కోట్లకు అధిపతి అయిన కమల్‌నాథ్ రాజకీయ నాయకుడిగానే కాక పారిశ్రామిక వేత్తగా, వ్యవసాయదారుడిగా, సామాజిక సేవకుడిగా కూడా రాణించారు. ‘ఇండియాస్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్’, ‘ఇండియాస్ సెంచరీ’, ‘భారత్ కీ శతాబ్ది’ పేరుతో పుస్తకాలు కూడా రాశారు. -
మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌దే
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్‌లో మంగళవారం ఎంతో ఉత్కంఠతో సాగిన ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం వరకు కొనసాగింది. ఊహించినట్లుగానే ఏ పార్టీకీ సాధారణ ఆధిక్యం దక్కకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. మొత్తం 230 సీట్లున్న శాసనసభలో సాధారణ ఆధిక్యానికి 116 సీట్లు అవసరం కాగా, కాంగ్రెస్ 114 సీట్లు సాధించి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మెజారిటీ మార్కుకు కేవలం రెండే సీట్ల దూరంలో ఆగిపోయింది. బీజేపీ 109 స్థానాల్లో గెలిచింది. అయితే ఈ రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు మాత్రం బీజేపీకే పడ్డాయి. కాషాయ పార్టీ 41 శాతం ఓట్లు దక్కించుకోగా, కాంగ్రెస్‌కు 40.9 శాతం ఓట్లు వచ్చినప్పటికీ బీజేపీ కన్నా 7 సీట్లు అధికంగా గెలుపొందింది. బీఎస్పీకి 2, ఎస్పీకి 1 సీటు దక్కగా, నాలుగు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఏ పార్టీకీ సాధారణ ఆధిక్యం లభించకపోవడంతో బీఎస్పీ, ఎస్పీలతోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలకు ప్రాధాన్యమేర్పడింది. అయితే తాము కాంగ్రెస్‌కే మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు బీఎస్పీ, ఎస్పీలు ప్రకటించాయి. స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా తమకే ఉందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ తెలిపారు. 15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైంది. బీజేపీని గద్దె దింపేందుకే: మాయావతి మధ్యప్రదేశ్‌లోనే కాక అవసరమైతే రాజస్తాన్‌లో కూడా కాంగ్రెస్‌కు తాము మద్దతివ్వాలని నిర్ణయించినట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు కూడా తమకు నచ్చవనీ, కేవలం బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదన్న పట్టుదలతోనే కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించామని మాయావతి తెలిపారు. కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల పాలనతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనేందుకు నిదర్శనమే తాజా ఎన్నికల ఫలితాలని ఆమె పేర్కొన్నారు. శివరాజ్ సింగ్ రాజీనామా ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇప్పటికి వరుసగా 13 ఏళ్లపాటు మధ్యప్రదేశ్‌కు సీఎంగా ఉన్నారు. ‘నా రాజీనామాను గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు సమర్పించాను. బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. పార్టీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు. ప్రజలు కూడా మాపై ప్రేమ చూపారు. కానీ మేం కనీసం అత్యధిక సీట్లు కూడా గెలవలేదు. కమల్‌నాథ్‌కు అభినందనలు. ప్రచారంలో హామీ ఇచ్చినట్లు రైతు రుణమాఫీని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోపు అమలు చేయాలి’ అని చౌహాన్ విలేకరులతో అన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలోని 10 మందికి పైగా ప్రముఖులు ఈ ఎన్నికల్లో ఓటమిపాలవడం గమనార్హం. రాహుల్‌కు సీఎం ఎంపిక బాధ్యత 15 ఏళ్ల అనంతరం మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుండటంతో ఆ రాష్ట్రానికి సీఎంను ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. కాంగ్రెస్ కేంద్ర కమిటీ పరిశీలకులు ఏకే ఆంటోనీ, భన్వర్ జితేంద్ర సింగ్‌ల పర్యవేక్షణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం బుధవారం భోపాల్‌లో జరిగింది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను రాహుల్ గాంధీకే అప్పగిస్తున్నట్లు ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌తోపాటు కాంగ్రెస్ ఎంపీ, రాహుల్‌గాంధీకి సన్నిహితుడు జ్యోతిరాదిత్య సింధియాలు మధ్యప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి రేసులో ఉండటం తెలిసిందే. రుణమాఫీ హామీతోనే గెలుపు! మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రుణమాఫీ హామీనే ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదిరోజుల్లోనే రైతు రుణాలను మాఫీ చేస్తామని రాహుల్ ఎన్నికల ప్రచారంలో హమీనిచ్చారు. దీంతో రైతులంతా గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ మహాసంఘ్ అధ్యక్షుడు శివ కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. రుణమాఫీ అవుతుంద న్న ఉద్దేశంతో రైతులు ప్రస్తుతం తమ వద్ద ఉన్న వరి పంట దిగుబడులను కూడా అమ్మకుండా అలాగే పెట్టుకున్నారు. ఈ వడ్లను అమ్మితే ఆ సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తుంది. బ్యాంకులు రుణం కంతును వారి ఖాతాల్లోంచి తీసుకుంటాయి. ఈ కారణంతో రైతులు తమ దిగుబడిని కూడా అమ్మకుండా అలాగే పెట్టుకున్నారని శర్మ చెప్పారు. రుణమాఫీ సాధ్యం కాని హామీ అని శివరాజ్ సింగ్ గతంలో అన్నారు.