బోఫాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్(77)ను తప్పించింది ఆ పార్టీ అధిష్టానం. కొత్త చీఫ్‌గా జీతూ పట్వారీ(50) పేరును ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే శనివారం సాయంత్రం ప్రకటించారు. జీతూ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని, కమల్ నాథ్ ఇంతకాలం అందించిన సేవలు ప్రశంసనీయమని ఆయన తెలిపారాయన.
ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కమల్ నాథ్ రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ, అది జరగలేదు. ఇప్పుడు ఆయన్ని తప్పించి ఆ బాధ్యతల్ని.. మాజీ మంత్రి అయిన జీతూ పట్వారీకి అప్పజెప్పారు.
రాహుల్ గాంధీతో జీతూ పట్వారీ (ఫైల్ ఫొటో)
జీతూ పట్వారీ తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో కొత్త రక్తం ఎక్కించే క్రమంలోనే ఓడిపోయినా.. జీతూనే పార్టీ చీఫ్‌గా అధిష్టానం ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment