బీజేపీలో చేరికపై కమలనాథ్ యూటర్న్ తీసుకున్నారు. సోమవారం రాహుల్ గాందీ, మల్లికార్జునతో కమల్ నాథ్ భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని వెల్లడించారు కమల్‌నాథ్.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. పార్టీ వీడనున్న సీనియర్ నేత కమల్‌నాథ్.. కొడుకుతోపాటు బీజేపీలోకి మాజీ సీఎం.. గత రెండు రోజులుగా వినిపిస్తున్న వార్తలివీ..
ఈటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత పార్టీ చీఫ్ పదవి నుంచి తనను తొలగించడంతో అధిష్టానంపై కోపం ఉన్న మాజీ సీఎం కమల్‌నాథ్ తన కుమారుడు నకుల్‌నాథ్‌తో కలిసి బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి తోడు రాష్ట్రం నుంచి రాజ్యసభకు అవకాశం ఇస్తారనుకుంటే కమల్‌నాథ్‌కు హస్తం మొండిచేయి చూపడంతో ఆయన మరింత అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
తాజాగా కమల్‌నాథ్ పార్టీ వీడటంపై క్లారిటీ వచ్చింది. సోమవారం రాహుల్ గాందీ, మల్లికార్జున కమల్ నాథ్‌తో భేటీ అయి బుజ్జగించారు. దీంతో బీజేపీలో చేరికపై కమలనాథ్ యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని వెల్లడించారు.
అంతకముందే కమల్‌నాథ్ ఏ పార్టీలో చేరడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్ ఆదివారం సాయంత్రం వెల్లడించారు. ప్రస్తుత మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ‘'ఇది కమల్‌నాథ్‌పై జరిగిన కుట్ర. నేను ఆయనతో మాట్లాడాను. ఇవన్నీ వదంతులు మాత్రమేనని, తాను కాంగ్రెస్ వ్యక్తినని, కాంగ్రెస్ వ్యక్తిగా కొనసాగుతానని.. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ భావజాలాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ఇది ఆయన సొంత ఆలోచనలు, ఆయనే ఇదంతా చెప్పారు’ అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment