state president
-
సైద్ధాంతిక బలమా? ప్రజల్లో గుర్తింపా..?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవ రు నియమితులౌతారనేది ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ పదవి కోసం ఆ పార్టీ పాత, కొత్త నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. జాతీయ నాయకత్వం ఈ నెలాఖరులోగా రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. పోలింగ్ బూత్‌ల ఎన్నికలు, మండల పార్టీ అధ్యక్షుల ఎంపికను రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే పూర్తి చేసింది. జిల్లా అధ్యక్షుల నియామకం కోసం ఐదుగురు చొప్పున నాయకుల పేర్లతో జాబితాను సిద్ధం చేసి జాతీయ నాయకత్వానికి పంపించింది. వారంలోగానే వీరిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుడిని కూడా నియమిస్తారని సమాచారం.మొగ్గు ఎటువైపో..!బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. గత రెండు, మూడేళ్లలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులు కూడా పదవిని ఆశిస్తున్నారు. పార్టీలో చేరాక గత ఎన్ని కల్లో కొందరు ఎంపీలుగా గెలిచారు. మరికొందరు ఇతర పదవుల్లో కొనసా గుతున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తు న్న కార్యకలాపాల్లో చురు గ్గా పాల్గొంటూ పార్టీ అగ్రనేతలకు చేరువైన వారు న్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల (2028) కల్లా పార్టీని పూర్తిగా క్రియాశీలం చేసి ప్రజల మద్ద తు కూడగట్టడంతో పాటు..రాష్ట్రంలో బీజేపీని అధి కారంలోకి తీసుకు వచ్చే సత్తా గల నేతకు పార్టీ పగ్గా లు అప్పగించాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. మరోవైపు పార్టీ కార్యకలాపాల్లో సై ద్ధాంతిక అంశాలకు ప్రాధాన్యత ఉన్నందున.. ఏళ్ల పాటు పార్టీ లోనే ఉంటూ, సిద్ధాంతాలకు విలువ నిచ్చే పాత నాయకులకే అధ్యక్ష పగ్గాలు అప్పగించా లని ఓ వర్గం బలంగా వాదిస్తోంది. దీంతో రాష్ట్ర అధ్యక్షు డిగా సైద్ధాంతిక నేపథ్యం ఉన్న పార్టీ పాత నే తకు అవకాశం వస్తుందా? లేక రాష్ట్రంలో రాజకీ యంగా పట్టు, ప్రజల్లో గుర్తింపు ఉన్న కొత్త నేతకు అవకాశం లభిస్తుందా? అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యనేతల మధ్య తీవ్ర పోటీఎంపీలు ఈటల రాజేందర్, అర్వింద్ ధర్మపురి, రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఈ పదవి కోసం ప్రధానంగా పోటీపడుతు న్నారు. తాను పోటీలో లేనని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ ఇప్పటికే వివరణ ఇచ్చి నప్పటికీ.. మళ్లీ ఆయన్నే రాష్ట్ర అధ్యక్షుడిగా నియ మించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. కీలక నేత కిషన్‌రెడ్డికి కేంద్రమంత్రిగా, మరో నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి బీజేఎల్పీనేతగా అవకాశం కల్పించినందున. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక మాత్రం బీసీ వర్గాల నుంచే ఉంటుందనే వాదన పార్టీ ముఖ్య నాయకుల్లో బలంగా వినిపి స్తోంది. మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినందు న.. రాష్ట్ర బీసీ జనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న ముదిరాజ్ సామాజికవర్గ నేత ఈటలకు ఈ పదవి దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోవై పు ఎంపీ రఘునందన్‌రావు పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎప్పుడు అవకాశం వచ్చినా.. బీఆర్ ఎస్, కాంగ్రెస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడు తున్నారు. దీంతో పాటు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూ డా ఉండటం కలిసొచ్చే అంశంగా పేర్కొంటున్నారు. ఆయనతో పాటు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కూ డా ఆ రెండు పార్టీలపై ఘాటుగా విమర్శలు చేస్తార న్న అభిప్రాయం ఉంది. ఇక మాజీ ఎమ్మెల్సీ రామ చందర్రావు.. ఏబీవీపీ నుంచి మొదలుపెట్టి ఎప్ప ట్నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారని, సౌమ్యు డు, అందరితోనూ సఖ్యత ఉన్న నాయకుడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఏపీ బీజేపీలో నాయకత్వ మార్పు!?
సాక్షి, అమరావతి: బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఈ నెలాఖరులోగా ఎన్నిక జరగనుంది. అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి స్థానంలో కొత్త వారు నియమితులవుతారని పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం సాగుతోంది. 2023 జూలైలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆమెను కొనసాగించే అవకాశం లేకపోలేదని కూడా కొందరు నేతలు అంటున్నారు. అయితే, పురందేశ్వరి పార్టీ అధ్యక్ష బాధ్యతల కంటే.. కేంద్ర మంత్రివర్గంలో చోటుకోసమే ఎక్కువ ఆసక్తితో ఉన్నారని చెబుతున్నారు. కాగా.. పార్టీ అధ్యక్ష పదవి కోసం దాదాపు 10 మంది వరకు పోటీ పడుతున్నట్టు పేర్కొంటున్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్న విష్ణువర్థన్‌రెడ్డితో పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మండల కమిటీల ఎన్నిక పూర్తవగా, వచ్చే వారంలో జిల్లా అధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలోనే ఏకాభిప్రాయం ప్రకారమే బీజేపీ జిల్లా అధ్యక్ష పదవులకు ఎన్నిక పూర్తి చేసేందుకు పార్టీ నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఇప్పటికీ రాష్ట్ర పార్టీలో పలువురు సీనియర్ నాయకులు ఈ నెల 3, 4 తేదీల్లో వివిధ జిల్లాల్లో పర్యటించి నేతల అభిప్రాయాల మేరకు ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్ష పదవులకు పేర్లను రాష్ట్ర పార్టీకి నివేదిక రూపంలో అందజేశారని సమాచారం. నివేదికలో సూచించిన పేర్లపై కొద్ది రోజుల క్రితం పార్టీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాశ్ నేతృత్వంలో కోర్‌కమిటీ సమావేశమై చర్చించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే వారం, పది రోజుల్లోనే జిల్లాల అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియామకం కానున్నట్టు ఆ పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోమవా రం ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈటల సమావేశం కానున్నారు. అనంతరం ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జి.కిషన్‌రెడ్డికి మళ్లీ కేంద్ర కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి, పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని జాతీయ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఆదివారం తనకు సన్నిహితులైన అస్సాం సీఎం, అధిష్టానం దూత హిమంత బిశ్వతో ఈటల భేటీ అయిన సందర్భంగా జాతీయ నాయకత్వం ఆలోచనలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. అంతకుముందు అమిత్ షా కూడా ఈటలతో ఫోన్లో మాట్లాడి ఈ అంశాలను వివరించినట్టు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పుంజుకుందని.. పార్టీ శ్రేణులను పూర్తిస్థాయిలో సమాయత్తం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని వారిద్దరు సూచించినట్టు సమాచారం. కేంద్ర మంత్రి పదవి ఆశించినా.. ఈటల రాజేందర్ తొలుత కేంద్ర మంత్రి పదవి ఆశించారు. కానీ పార్టీ అగ్ర నాయకత్వం ఒప్పించడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆయన సిద్ధమైనట్టు పార్టీ నాయకులు చెప్తున్నారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడంపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అంటున్నారు.దాదాపు ఇరవై ఏళ్లపాటు టీఆర్ఎస్లో, తెలంగాణ ఉద్యమ సమయంలో గుర్తింపుతోపాటు కేసీఆర్ కేబినెట్లో నంబర్ టూగా కొనసాగిన నేపథ్యంలో.. ఈటలకు ఉన్న విస్తృత పరిచయాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, సమర్థవంతమైన నాయకుడిగా ఉన్న ఇమేజీ పార్టీ పురోగతికి దోహదపడతాయని భావిస్తున్నట్టు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈటలకున్న గుర్తింపు, వివిధ సామాజిక వర్గాలతో ముఖ్యంగా బీసీ వర్గాలు, సంఘాలతో మంచి సంబంధాలు ఉండటం కూడా బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. -
కాంగ్రెస్‌ను వీడనున్న మరో ఎమ్మెల్యే?
బీహార్ కాంగ్రెస్ నేతల్లో తిరుగుబాటు ధోరణి బయటపడింది. పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను నిలదీస్తూ ఎమ్మెల్యే ప్రతిమా దాస్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. బీహార్‌లో ఉండే నేతనే రాష్ట్ర అధ్యక్ష పదవిలో నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ అఖిలేష్ సింగ్‌కు కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేలను కూడా కలవడానికి సమయం ఉండటం లేదని ప్రతిమాదాస్ ఎద్దేవా చేశారు. శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులెవరూ నామినేషన్ వేయకపోవడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొందని అన్నారు. గతంలో కాంగ్రెస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు ఉండేవారని నాడు కూడా మండలిలో భాగస్వామ్యం ఉండేదన్నారు. ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శాసనమండలిలో పార్టీకి చెందిన సభ్యులెవరికీ చోటు కల్పించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర పార్టీలో ఇంకా సంస్థాగత విస్తరణ జరగలేదని, బీహార్‌లో ఉండాల్సిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఢిల్లీలో మాత్రమే కనిపిస్తారని ఆరోపించారు. అఖిలేష్ సింగ్ కారణంగానే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడారని ప్రతిమా దాస్ పేర్కొన్నారు. ఈ విమర్శలు చూస్తుంటే ప్రతిమా దాస్ కూడా పార్టీని వీడుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. -
MP: కమల్ నాథ్‌ను తప్పించిన కాంగ్రెస్
బోఫాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్(77)ను తప్పించింది ఆ పార్టీ అధిష్టానం. కొత్త చీఫ్‌గా జీతూ పట్వారీ(50) పేరును ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే శనివారం సాయంత్రం ప్రకటించారు. జీతూ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని, కమల్ నాథ్ ఇంతకాలం అందించిన సేవలు ప్రశంసనీయమని ఆయన తెలిపారాయన. ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కమల్ నాథ్ రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ, అది జరగలేదు. ఇప్పుడు ఆయన్ని తప్పించి ఆ బాధ్యతల్ని.. మాజీ మంత్రి అయిన జీతూ పట్వారీకి అప్పజెప్పారు. రాహుల్ గాంధీతో జీతూ పట్వారీ (ఫైల్ ఫొటో) జీతూ పట్వారీ తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో కొత్త రక్తం ఎక్కించే క్రమంలోనే ఓడిపోయినా.. జీతూనే పార్టీ చీఫ్‌గా అధిష్టానం ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. -
రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి కొనసాగింపు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని కొనసాగించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. కాగా అందుకు ఆయన అంగీకరించారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. గతంలో బండి సంజయ్ స్థానంలో నియమించినప్పుడే.. శాసనసభ ఎన్నికల దాకే ఆ బాధ్యతలు నిర్వహిస్తానని కిషన్‌రెడ్డి నాయకత్వానికి చెప్పారని, అదీగాక ఈ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు సాధించక పోవడంతో తనను బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా కోరారని తెలిసింది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పూర్తి సమయం కేటాయించాలని కిషన్‌రెడ్డి భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా కొనసాగాలని నాయకత్వం ఆయనకు నచ్చజెప్పినట్టు సమాచారం. దీంతో పార్లమెంటు ఎన్నికల దాకా కొనసాగేందుకు ఆయన ఒప్పుకున్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరో 3, 4 నెలల్లోనే ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో.. ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధ్యక్షుడు కుదురుకోవడం సాధ్యం కాదని బీజేపీ నాయకత్వం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కీలకమైన ఎన్నికలు కావడంతో పాటు తెలంగాణ నుంచి అధిక సీట్లు (గతంలో గెలిచిన 4 సీట్ల కంటే ఎక్కువగా) గెలిచేందుకు అవకాశం ఉందన్న అంచనాల మధ్య కిషన్‌రెడ్డినే కొనసాగించాలని భావించినట్టు సమాచారం. -
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా యడియూరప్ప తనయుడు
సాక్షి, ఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా విజయేంద్ర యడియూరప్పను నియమించింది అధిష్టానం. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తనయుడే ఈ విజయేంద్ర. నళిన్ కటీల్‌ను తప్పించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయేంద్రకు కర్ణాటక పగ్గాలు అప్పజెప్పింది కమల అధిష్టానం. విజయేంద్ర ఈ ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. షికారిపుర నుంచి 11 వేల మెజార్టీతో నెగ్గారు. 2018లో ఇదే నియోజకవర్గం నుంచి యడియూరప్ప పోటీ చేసి గెలుపొందారు. న్యాయ విద్యను అభ్యసించిన విజయేంద్ర.. పార్టీ యువ విభాగం భారతీయ జనతా యువ మోర్చా కర్ణాటక యూనిట్‌కు జనరల్ సెక్రటరీగా పని చేశారు. ఆపై 2020 నుంచి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. యడియూరప్ప పెద్ద కొడుకు రాఘవేంద్ర కూడా రాజకీయాల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. షిమోగా నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారాయన. -
గవర్నర్‌కు డీఎంకే ఫైల్స్–2
సాక్షి, చెన్నై: డీఎంకే అవినీతి అక్రమాలు ఫైల్స్ –2 పేరుతో ఏకంగా ఓ ట్రంక్ పెట్టెలో ఆధారాలను పెట్టి మరీ రాజ్‌భవన్‌లో బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు అన్నామలై బుధవారం గవర్నర్‌కు సమరి్పంచడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో తొమ్మిది మంది రాష్ట్ర మంత్రుల అవినీతికి సంబంధించిన వివరాలు, మూడు ప్రాజెక్టుల్లో చోటుసుకున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వివరాలు.. అవినీతి అక్రమాలు.. పేరుతో సీఎం స్టాలిన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు, డీఎంకే పార్టికి సంబంధించిన ఆస్తులు, పలువురు ఎంపీల అక్రమార్జన వివరాలను డీఎంకే ఫైల్స్ –1 పేరుతో ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విడుదల చేశారు. ఈ సమయంలో త్వరలో డీఎంకే ఫైల్స్– 2 కూడా బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు. డీఎంకే ఫైల్స్ వ్యవహారంలో అన్నామలైపై డీఎంకే పార్టీ వర్గాలు పరువునష్టం దావా కూడా వేశాయి. ఈ పరిస్థితుల్లో ఇది వరకు మీడియా ముందు ఫైల్స్– 1ను విడుదల చేసిన అన్నామలై ఈసారి రూటు మార్చారు. డీఎంకే ఫైల్స్– 2 పేరుతో ఒక ట్రంక్ పెట్టెలో కొన్ని పత్రాలను పెట్టి పెట్టి మరీ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు అందజేశారు. అలాగే ఇటీవల కాలంలో మూడు ప్రాజెక్టుల్లో రూ. 5,600 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొంటూ, ఆ వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఆయనే ఇక తెలంగాణలో బీజేపీ గేమ్‌ఛేంజర్!
తెలంగాణ బీజేపీ నేతల్లో కిషన్‌రెడ్డి సీనియర్ లీడర్. ప్రస్తుతం కేంద్ర మంత్రి కూడా. కానీ, ఎన్నికల దృష్ట్యా ఆయనకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యత అప్పగించడం సరైన చర్యగా బీజేపీ అధిష్టానం భావించింది. బీఆర్ఎస్ను, కేసీఆర్ అండ్ కోను దూకుడు స్వభావంతో ఎదుర్కొంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న బండి సంజయ్‌ను తప్పించి.. సౌమ్యుడైన కిషన్‌రెడ్డిని ఎంపిక చేయడం ఆశ్చర్యపరిచినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీ ఈజ్ ద రైట్ ఛాయిస్ అని కాషాయం పార్టీ ఒక అంచనాకి రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిని విశ్లేషిస్తే.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లాలని.. బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ క్యాడర్ ఓ గందరగోళంలోకి కూరుకుపోయిందనే భావన బీజేపీ హైకమాండ్‌లో నెలకొంది. అదే టైంలో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో అప్రమత్తమైంది. వీటికి తోడు బండి చుట్టూరా నెలకొన్న వివాదాలు, ఇతర పార్టీల నుంచి చేరికలు ఆగిపోవడం, కీలక నేతల నుంచి అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఈ తరుణంలోనే బండిని సైడ్ చేస్తూనే.. నేతల మధ్య ఎలాంటి అంసతృప్తి లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకే వివాదరహితుడైన కిషన్‌రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది. ► ఆరంభం నుంచి బీజేపీతోనే కిషన్‌రెడ్డి ప్రయాణం కొనసాగుతోంది. బీజేపీ ఆవిర్భావ సమయంలో సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. పార్టీ అప్పగించిన ప్రతి పని, బాధ్యతను శ్రద్ధతో నిర్వర్తిస్తూ క్రమశిక్షణగల పార్టీ నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత.. ఈ రాష్ట్రం నుంచి కేంద్రమంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్తి కిషన్‌రెడ్డి. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘంగా పార్టీతో అనుబంధం తర్వాత ఈ హోదా దక్కింది. అప్పటిదాకా ఎంతో ఓపికగా ఉన్నారాయన. ► వీటన్నింటికి తోడు.. ఆరేళ్లపాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొనసాగించినా అనుభవమూ ఉంది. ఆ సమయంలో ఆయన వివాదాల్లేకుండా పార్టీని ముందుకు నడిపించారు. అన్నింటికంటే ముఖ్యమైంది.. ప్రత్యర్థులపై సహేతుకమైన విమర్శలు గుప్పించడంలో కిషన్‌రెడ్డి దూకుడునే ప్రదర్శిస్తారు. ముఖ్యంగా కేసీఆర్‌కు పదునైన చురకలనే అంటిస్తారాయన. అందుకే.. బీజేపీ కార్యకర్తలంతా ‘కిషనన్నా’అని ఆప్యాయంగా పిలుచుకునే గంగాపురం కిషన్‌రెడ్డిని.. వచ్చే ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా బీజేపీ భావిస్తోంది. ఆయన నాయకత్వంపైనే పూర్తి భరోసా పెట్టుకుంది కూడా. జోడు పదువులు? గతానికి భిన్నంగా ఒకరికి ఒకే పదవి అనే అంశంపై బీజేపీ అధినాయకత్వం పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. అలాంటి చోట రాష్ట్ర అధ్యక్షులకు ప్రొటోకాల్ పరంగా ఇబ్బంది లేకుండా ఉండేలా కేంద్రమంత్రి పదవితో పాటు.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. అలా.. కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే రెండు పదవుల్లోనూ కొనసాగించే అవకాశం ఉంది. మోదీతోనూ ప్రత్యేక అనుబంధం.. ప్రధాని నరేంద్ర మోదీతో కిషన్‌రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పనిచేసిన సమయంలో మోదీకి దగ్గరయ్యారు. అప్పట్లో బీజేపీ జాతీయ నేతలంతా కలసి పర్యటించిన నేపథ్యంలో మోదీ, కిషన్‌రెడ్డి ఒకే గదిలో బస చేసిన సందర్భం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలా వారిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడానికి అది కూడా ఒక కారణమైందన్న చర్చ గతంలో జోరుగా నడిచింది కూడా. కిషన్‌రెడ్డి కంప్లీట్ ప్రొఫైల్ జననం : జూన్ 15, 1964 తల్లిదండ్రులు: స్వామిరెడ్డి, ఆండాళమ్మ భార్య: కావ్య, పిల్లలు: వైష్ణవి, తన్మయ్ రాజకీయ ప్రవేశం: 1977లో జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీలో చేరిక 1980 : భారతీయ జనతా పార్టీ పూర్తికాల కార్యకర్తగా నమోదు 1980 - 83 : యువ మోర్చా రంగారెడ్డి కమిటీ కోశాధికారి, కన్వీనర్ 1986 - 90 : యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు 1990 - 92: యువ మోర్చా జాతీయ కార్యదర్శి 1992 - 94: యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు 1994 - 2001: యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి 2001 - 02: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి 2002: యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు 2003 - 05: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి 2004: మొదటిసారిగా హిమాయత్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నిక 2010 - 14: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 2009, 2014: అంబర్‌పేట ఎమ్మెల్యే 2018: అంబర్‌పేట అసెంబ్లీ ఎన్నికల్లో 1,016 ఓట్ల తేడాతో ఓటమి 2019: సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా విజయం.. కేంద్ర మంత్రి పదవి 2023, జులై 5: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు ఇదీ చదవండి: బండి సంజయ్‌ను ఎందుకు తప్పించారు? -
అక్కడ ఓటర్లను ఎలాగూ మార్చలేం... అందుకే మిమ్మల్ని మారుస్తున్నాం... కంగ్రాట్స్
అక్కడ ఓటర్లను ఎలాగూ మార్చలేం... అందుకే మిమ్మల్ని మారుస్తున్నాం... కంగ్రాట్స్ -
టార్గెట్ 2024.. బీజేపీ మరో కీలక నిర్ణయం
దేశంలో 2024లో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే ఎలక్షన్ ప్లాన్ షురూ చేసింది. దేశంలో బీజేపీ అధికారంలోలేని రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది. ఈ క్రమంలో మూడు రాష్ట్రాల్లో కొత్తగా బీజేపీ అధ్యక్షులను నియమించింది. ఆయా రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా పనిచేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ రాష్ట్ర యూనిట్లకు కొత్త చీఫ్‌ల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఢిల్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, లోక్‌సభ ఎంపీ సీపీ జోషి రాజస్థాన్ బీజేపీ చీఫ్‌గా నియమితులయ్యారు. ఇక, బీహార్‌కు సంజయ్ జైస్వాల్ స్థానంలో బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు సామ్రాట్ చౌదరిని రాష్ట్ర చీఫ్‌గా అధిష్టానం ఖరారు చేసింది. కాగా, రాజస్థాన్‌లో జైపూర్‌లోని అంబర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్న సతీష్ పూనియా స్థానంలో సీపీ జోషికి అవకాశం ఇచ్చారు. మరోవైపు, బీజేపీ ఒడిశా యూనిట్ అధ్యక్షుడిగా మాజీ రాష్ట్ర మంత్రి మన్మోహన్ సమాల్ స్థానం దక్కించుకున్నారు. भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने राजस्थान में श्री सीपी जोशी, बिहार में श्री सम्राट चौधरी, ओड़िशा में श्री मनमोहन सामल और दिल्ली में श्री वीरेन्द्र सचदेवा को पार्टी का नया प्रदेश अध्यक्ष नियुक्त किया है। pic.twitter.com/l9AN7X8suM — BJP (@BJP4India) March 23, 2023 -
అప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్: తరుణ్ చుగ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది సంస్థాగత ఎన్నికలు జరిగే దాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జీ తరుణ్ చుగ్ వెల్లడించారు. గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ 2024లో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ‘ప్రజాగోస– బీజేపీ భరోసా’పేరిట నిర్వహిస్తున్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ మీటింగ్‌ల ద్వారా కేసీఆర్ సర్కార్‌కు చివరి మేకు దించేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్నారు. వచ్చే నెల 11వ తేదీ నాటికి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతుండటంతో ఆయన పదవీకాలం ముగియనుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 2024 జూన్ వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను కొనసాగిస్తూ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంజయ్ పదవీకాలాన్ని పొడిగిస్తారనే చర్చ కొంతకాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. వచ్చేనెల మొదటివారంలో అధ్యక్షుడిగా సంజయ్ పదవీకాలం పొడిగింపునకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. చదవండి Hyderabad: మామిడి చెట్టు తెచ్చిన తంటా!.. మేడ మీద ఆకులు పడుతున్నాయని -
ఇప్పుడే షో మొదలైంది.. వారంలో ఇద్దరు మంత్రుల అవినీతి చిట్టా!
సాక్షి, చెన్నై: మరో వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల అవినీతి జాబితాను విడుదల చేయనున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. ఇది కాస్త ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. అలాగే, మంగళవారం చలో సచివాలయం నినాదంతో పాదయాత్రకు బీజేపీ నిర్ణయించింది. డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. ఈకాలంలో మంత్రి రాజకన్నప్పన్ శాఖలో మాత్రమే మార్పు జరిగింది. మరో మంత్రి శివ శంకర్‌కు రాజకన్నప్పన్ శాఖ బాధ్యతల్ని అప్పగించారు. ఈ పరిస్థితుల్లో గత వారం రోజులుగా జూన్‌లో మంత్రి వర్గంలో మార్పు ఉండొచ్చని, నలుగురు మంత్రుల పనితీరుపై సీఎం స్టాలిన్ అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఇద్దరు మంత్రుల అవినీతి జాబితా తమకు చిక్కిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆదివారం ప్రకటించడం ఉత్కంఠ కలిగిస్తోంది. ఆధారాలతో.. డీఎంకే ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేదని సీఎం స్టాలిన్ పేర్కొంటున్నారని, అయితే ఇద్దరు మంత్రుల అవినీతి జాబితా తమకు చిక్కిందని బీజేపీ అ«ధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. వారి అవినీతికి సంబంధించిన సమగ్ర వివరాలు, ఆధారాలను వారంలో బయట పెడుతామని స్పష్టం చేశారు. దీంతో ఆ మంత్రులు ఎవరు..? ఆ శాఖలు ఏమిటో..? అన్న చర్చ ప్రారంభమైంది. అదే సమయంలో కేంద్ర పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ సచివాలయం వైపుగా పాదయాత్రకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈనెల 31న వళ్లువర్ కోట్టం నుంచి ఉదయం 11 గంటలకు చలో సచివాలయం పయనం చేపట్టనున్నామని అన్నామలై ప్రకటించారు. చదవండి: తల్లి గుండె బద్ధలైంది: హృదయ విదారకం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో -
కార్మికుల ఆధ్వర్యంలో..ఈనెల 15న బైక్ ర్యాలీ
సాక్షి, వైజాగ్ : ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఎక్కువ శాతం కార్మిక వర్గాలు మేలు పొందాయని వైయస్సార్ టియుసీ రాష్ట్ర్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 18 వేలు వేతనం ఇస్తామని అమలు చేసిన నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి అనూహ్య మేలు చేశారని తెలిపారు. ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు గౌతంరెడ్డి పేర్కొన్నారు. (నంద్యాల: ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలం) విజయవాడ కేంద్రంగా ఓ మాఫియా జగన్ మోహన్‌రెడ్డిపై విషం చిమ్ముతున్నారని, కార్మికులకు జరిగిన మేలుపై చర్చకు రండి అంటూ టిడిపి నాయకులకు గౌతమ్ రెడ్డి సవాలు విసిరారు. ఐటి హబ్ పేరిట విశాఖలో నిధులు దోచుకున్న ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ ఫైర్ అయ్యారు. ఈ నెల 24న హాకర్స్ కు పదివేలు ఇవ్వడం కూడా పాదయాత్ర ఫలితమేనన్నారు. ఇప్పుడు కార్మికలు జయహో జగన్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోదీ కూడా సీఎం జగన్ మోహన్‌రెడ్డి పాలనను అభినందించడం నిజాయితీ పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు. (‘ప్రజా సంకల్ప యాత్ర’పై దేవిశ్రీ పాట) -
సందిగ్ధంలో టీడీపీ అధ్యక్షుడి ఎంపిక!
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై సందిగ్థత ఏర్పడింది. ఈ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై చంద్రబాబు తర్జనభర్జనలు పడుతూ ఇంతవరకూ ఒక నిర్ణయానికి రాలేకపోయినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. నిజానికి మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ కమిటీ, ఏపీ, తెలంగాణ అధ్యక్షులు, కమిటీల ఎన్నికను పూర్తిచేయాల్సి వుంది. కానీ, కరోనా పేరుతో వాటన్నింటినీ వాయిదా వేశారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక లాంఛనమే అయినా ఏపీ అధ్యక్షుడి ఎంపికపై కొంత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న కళా వెంకట్రావును తప్పించాలని గతంలోనే నిర్ణయించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ను అధ్యక్షుడిగా నియమించినా ఇప్పుడు ప్రతిపక్షంలో ఆయన ఆ పదవికి సరిపోడనే అభిప్రాయం వచ్చింది. దీనికితోడు ఆయన ఓటమిపాలవడం, ఓడిపోయిన నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం సరికాదని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. (రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారు 63.49 శాతం) అచ్చెన్నాయుడుపై పునరాలోచన ఈ నేపథ్యంలో.. అచ్చెన్నాయుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని ఆలోచన చేశారు. అయితే, ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఈ మార్పు చేయకుండా కొద్దిరోజుల తర్వాత చేద్దామని ఆగారు. గత వారం జరిగిన మహానాడులో దీనిపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కానీ.. అన్ని కమిటీల నియామకాన్ని వాయిదా వేశారు. బీసీలు పార్టీకి దూరమయ్యారనే ఉద్దేశంతో ఆ వర్గానికి చెందిన అచ్చెన్నాయుడికి అవకాశమిస్తే బాగుంటుందని మొదట్లో చూసినా ఇప్పుడు దానిపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు కళా వెంకట్రావులా కాకుండా దూకుడుగా ఉంటాడని, దీనివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోననే అభిప్రాయం అగ్రనాయకత్వంలో ఏర్పడినట్లు తెలిసింది. బీసీ నాయకుడికి అధ్యక్ష పదవి ఇచ్చాక ఆయన బలపడితే భవిష్యత్తులో కొత్త సమస్యలు వస్తాయని ఆలోచిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. (డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు) -
డీకే అరుణ, జితేందర్‌రెడ్డికి బీజేపీ ఝలక్
ఉమ్మడి పాలమూరు జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేజారింది. ఎన్నో దోబూచులాటల అనంతరం ఎట్టకేలకు.. ఆ పదవి పార్టీ విధేయుడు, సీనియర్ నాయకుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు వరించింది. దీంతో ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి.. రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి భంగపడ్డారు. సాక్షి, మహబూబ్‌నగర్ : పార్లమెంట్ ఎన్నికలకు ముందు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి అనూహ్యంగా కాషాయం కండువా కప్పుకోవడంతో బీజేపీ బలోపేతం కావడంతో పాటు.. వరుసగా జరిగిన పార్లమెంట్, మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఆపారీ్టఅభ్యర్థులు అధికార టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల నుంచి రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష పదవి రేసులో వీరిద్దరి పేర్లు కూడా వినిపించాయి. జితేందర్‌రెడ్డి అయితే ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యే భాగ్యం తనకూ ఉందని కార్యకర్తల సమావేశంలోనే చెప్పారు. అప్పట్లోఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో 1999లోనే బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ లోక్‌సభ ఎంపీగా గెలిచిన జితేందర్‌రెడ్డికి ఈ సారి అధిష్టానం ఆశీస్సులు ఉంటాయనే ప్రచారం జరిగింది. (బీజేపీ బండికి.. సంజయుడే సారథి) 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఆయన పార్టీ పార్లమెంటు పక్షనేతగా పని చేసినా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, ఇతర మంత్రులు, ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి పార్టీ నాయకులతో ఆయన పరిచయాలు మాత్రం తగ్గకుండా చూసుకున్నారు. గతేడాది మార్చి 27న.. టీఆర్ఎస్ ఎంపీగా కొనసాగుతూనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో జితేందర్‌రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి హామీ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగింది. బీజేపీలో చేరిన తర్వాత జితేందర్‌రెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా అనేక పర్యాయాలు అధిష్టానాన్ని ఆకర్షించేలా సీఎం కేసీఆర్ పని తీరును తీవ్రంగా విమర్శించారు. (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?) మరోవైపు సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ సైతం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నా.. ఎప్పుడూ బహిరంగంగా బయటపడలేదు. తన ముఖ్య అనుచర వర్గాల ముందు మాత్రమే పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని చెప్పారు. అయితే ఒకానొక దశలో ఈసారి అధ్యక్ష పదవి రాష్ట్రంలో మహిళకే ఇస్తారనే ప్రచారం జరిగింది. దీంతో అది కచ్చితంగా డీకే అరుణకే వరిస్తుందని బీజేపీ శ్రేణులు చర్చించుకున్నాయి. ఆమె పారీ్టలో చేరిన తర్వాత ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలోపేతానికి పట్టుసడలని కృషి చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గళమెత్తుతున్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలం ఉదండాపూర్‌లో నిర్మిస్తోన్న రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులు చేపట్టిన ఆందోళనకు రెండ్రోజుల క్రితమే మద్దతు తెలిపారు. (కార్పొరేటర్ నుంచి ఎంపీగా.. సంజయ్ ప్రస్థానం) ఈ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్ పని తీరును విమర్శించారు. ఇలా అవకాశం వచ్చిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌పై, ప్రజా వ్యతిరేక విధానాలపై గత గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా.. రాష్ట్ర పదవి జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్లకు చేజారడంతో పార్టీ శ్రేణుల్లో కాస్త నైరాశ్యం కలిగింది. అయితే వీరిద్దరి మినహా పార్టీలో చాలా మంది సీనియర్లు ఉండడం.. తాజా మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ పేరు సైతం బలంగా వినిపించింది. ఇందులో జితేందర్‌రెడ్డి, డీకే అరుణలకు పార్టీలో సీనియార్టీ లేకపోవడం.. ఒకవేళ వీరిలో ఎవరికైనా అధ్యక్ష పదవి ఇస్తే మిగిలిన సీనియర్ల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో అధిష్టానం ఆ పదవిని ఆరెస్సెస్‌లో సేవకుడిగా పని చేస్తూ.. అంచెలంచెలుగా ఎదిగిన ఎంపీ బండి సంజయ్‌కు అప్పగించినట్లు పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. అయితే డీకే అరుణ, జితేందర్‌రెడ్డికి బీజేపీ అధిష్టానం ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయని, భవిష్యత్‌లో మంచి పదవులు వరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. -
నెలాఖరున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం!
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో సంస్థాగత ఎన్నికలకు ఫుల్స్టాప్ పడినట్లే కనిపిస్తోంది. ఇటు పార్టీ పదవుల్లో నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. జాతీయ పార్టీ అధ్యక్షుడి నియామకం పూర్తయిన నేపథ్యంలో జిల్లాల్లో అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇక ఎన్నికలుండే అవకాశం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. వచ్చే వారం రోజుల్లో జిల్లా కమిటీలకు అధ్యక్షులను నియమించేందుకు రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ముందస్తు షెడ్యూల్ ప్రకారం బూత్, గ్రామ, మండల, జిల్లా కమిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆపై రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు, అనంతరం జాతీయ అధ్యక్షుడి నియామకం ఉండాల్సి ఉం ది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం మండల కమిటీలకు కూడా పూర్తి స్థా యిలో ఎన్నికలు జరగలేదు. మరోవైపు జాతీయ అధ్యక్షుడి నియమా కం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు కాకుండా సంప్రదింపులు జరిపి నియామకాలు చేపట్టేందుకు రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తె లిసింది. దీంతో వచ్చే వారం రోజుల్లో అన్ని మండలాలకు, జిల్లాలకు కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. వీలైతే ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియమించే అవకా శం ఉందని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తోపాటు ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ ప్రయత్నాల్లో ఉన్నా రు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు.. ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అ ధ్యక్ష పదవిని ఎవరికిస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్వైపే జాతీయ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. -
టీఎస్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ నిర్వాకం వల్లే రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని, టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను వాడుకొని బిల్లులు చెల్లించలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజా ధనాన్ని కేసీఆర్ దర్వినియోగం చేస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు తెలంగాణలో కూడా విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని ఎవరూ అధైర్య పడవద్దని ఆయన కోరారు. -
రాజస్తాన్ బీజేపీ చీఫ్‌గా సైనీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ మదన్‌లాల్ సైనీ రాజస్తాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ఈ నియామకాన్ని ఖరారు చేశారు. సీఎం వసుంధరా రాజే, అమిత్ మధ్య చర్చలు జరిగాక జాట్లు, రాజ్‌పుత్ వర్గాల మధ్య విభేదాలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మాలీ వర్గానికి చెందిన సైనీకి ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఇదే సామాజిక వర్గానికి చెందిన అశోక్ గెహ్లాట్ (కాంగ్రెస్ నేత, మాజీ సీఎం)కు చెక్ పెట్టవచ్చని బీజేపీ భావిస్తోంది. ‘రాష్ట్రంలోని 200 అసెంబ్లీ సీట్లలో 180, మొత్తం 25 లోక్‌సభ స్థానాలు గెలవడంపైనే దృష్టి పెడతాను’ అని సైనీ అన్నారు. ఇన్నాళ్లుగా క్రమశిక్షణతో పనిచేస్తున్నందుకే సైనీకి ఈ అవకాశం వచ్చిందని పలువురు రాజస్తాన్ బీజేపీ నాయకులు పేర్కొన్నారు. అధ్యక్షుడిగా తన అనుచరుడే ఉండాలని పట్టుబడుతున్న సీఎం వసుంధర రాజే కొంతమేర విజయం సాధించారనే చెప్పవచ్చు. గజేంద్రసింగ్ షెకావత్‌కు రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానం భావించినా.. దీనికి వసుంధర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏ వర్గానికీ చెందని, సంఘ్ పరివార్‌తో సంబంధమున్న సైనీని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు చేయడంతో ఒక రకంగా వసుంధరా తన ప్రత్యర్థులను నిలువరించినట్లే. -
చంద్రబాబు సంస్కార హీనుడు..
-
చంద్రబాబు సంస్కార హీనుడు..
సాక్షి, విజయవాడ : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో హనుమాన్ పేట ఆలపాటి ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన తొలిసారి రాష్ట్ర కార్యవర్గం భేటీ అయింది. ఈ సమావేశానికి ఎంపీ హరిబాబు, శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర పరిశీలకుడు జి. సతీష్, నేతలు పురందేశ్వరి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయా పరిణామాలపై చర్చలు జరిపారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనే దుష్పచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనతో సంబంధాలు అంటగట్టాలని చంద్రబాబు చూస్తున్నారు.. ఇదే ప్రస్తుతం బాబు ఎన్నికల ఎజెండా అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు సంస్కార హీనుడు, వ్యక్తిగత దూషణలు ఆయన నైజమని కన్నా విమర్శలు గుప్పించారు. స్టాక్ బ్రోకర్‌గా అనేక మందిని మోసం చేసిన వ్యక్తి కుటుంబరావు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాక హత్య కేసులో ముద్దాయి, మోసాలు చేసేవారు కూడా ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్నారని కన్నా మండిపడ్డారు. ఇలాంటి వారిని సీఎం ప్రోత్సహిస్తున్నారని చురకలు అంటించారు. బాబు ఎన్నికుట్రలు పడిన వాటిని తిప్పి కొడతామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ జూన్11వ తేదీన(సోమవారం) విజయవాడలో ధర్నాకు దిగుతున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. -
గొర్రెల పంపిణీ ఘనత కేసీఆర్‌దే
సదాశివపేట(సంగారెడ్డి): కురుమలు ఆర్థికంగా ఎదిగేందుకు వారికి సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యెగ్గె మల్లేశం అన్నారు. పట్టణంలోని శుక్రవారం నిర్వహించిన మల్లికార్జున స్వామి కురుమ సంఘం ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు కురుమజాతిని, కురుమల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం కురుమల జీవన స్థితిగతులను గమనించి గొర్రెలను సబ్బడీపై పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కురుమలకు గొర్రెల పంపిణీతో పాటు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తానని ప్రకటించడం హర్షించద్గ విషయమన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించేందుకు వినూత్న పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం అందజేసిన సబ్బిడీ గొర్రెలను అమ్మకుండా పోషించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కురుమసంఘం జిల్లా అధ్యక్షుడు బూరుగడ్డ పుష్పనాగేశ్, జిల్లా నాయకుడు డాక్లర్ శ్రీహరి, మహిళ కన్వీనర్ గీత, సదాశివపేట మం డల కురుమ సంఘం అధ్యక్షుడు కొత్తగొల్ల కృష్ణ, గడ్డమీది సత్యనారాయణ, మునిపల్లి మండల అధ్యక్షుడు శంకరయ్య, ప్రధాన కార్యదర్శి బండారి పాండు, ఆత్మకమిటీ చైర్మన్ సత్యనారాయణ, మల్లికార్జున కురుమ సం ఘం అధ్యక్షుడు పైతర సాయికుమార్, నాయకు లు అ నంతయ్య, రాంచందర్, చంద్రన్న, బక్కన్న, గో పాల్, శివశంకర్, రాములు, మల్లేశం, కిష్టయ్య, హనుమయ్య, జగన్నాథం, శివశంకర్, నర్సింలు పాల్గొన్నారు. -
ఏజెన్సీలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ పోస్టులను స్థానికంగా అర్హులైన గిరిజనులతోనే భర్తీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోరారు. సోమవారం బాలరాజు ఆధ్వర్యంలో గిరిజన ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, కళావతి, గిద్దా ఈశ్వరి, ఏపీ ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు, ఆ సంఘ ప్రధాన కార్యదర్శి కణితి శేఖర్, ప్రతినిధులు సరియం నాగేశ్వరావుతో కూడిన బృందం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సెక్రటరీ ఆదిత్యనా«థ్ దాస్‌ను కలిసి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆదివాసీ గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాలను భారత ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా గుర్తించి ఏజెన్సీ ప్రాంతంగా ప్రకటించిందన్నారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఏజెన్సీ ప్రాంతం, మైదాన ప్రాంతం వారికి వేర్వేరుగా చేపట్టనున్నట్టు చెప్పారు. జీవో నెంబర్ 5,2 ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్లో భాగంగా రిక్రూట్మెంట్తో పాటు ప్రమోషన్లో నియామక రోస్టర్ పాయింట్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు. ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేసినప్పుడు ప్రమోషన్లు కూడా వారితోనే పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆదిత్యనాథ్ తెలిపినట్టు ఉపాధ్యాయ సంఘం నాయకులు జలగం రాంబాబు పేర్కొన్నారు. -
కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న చంద్రబాబు
చింతలపూడి : కార్పొరేట్ శక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం జన ఆవేదన సదస్సులో భాగంగా పీసీసీ కార్యదర్శి ఎం.ధామస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పద్మశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు తాపత్రయం అంతా తన పుత్రరత్నం లోకేష్ గురించేనన్నారు. లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రి పదవి ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే మోడీ మెప్పు కోసం చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి ప్రత్యేక హోదాను మోడీ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని విమర్శించారు. ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. తుందుర్రు ఘటనలో మహిళలను తీవ్రంగా కొట్టి పోలీసులతో ఈడ్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మహిళా మంత్రి పీతల సుజాత కనీసం మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించకపోవడం అన్యాయమన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో లాభపడింది విజయ్ మాల్యా, అంబానీ, అదానీ లాంటి పారిశ్రామిక వేత్తలేనన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అడ్డగోలుగా డబ్బు పంచి గెలిచారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు రఫీయుల్లాబేగ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాబ్యాలెట్లో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 20లోగా ప్రజా బ్యాలెట్‌ను పూర్తిచేసి పంపించాలని కోరారు. అనంతరం ఏలూరుచింతలపూడి ప్రధాన రహదారిపై కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అమర్జహాబేగ్, కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్‌సెల్ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు పాల్గొన్నారు. -
ఐకమత్యంతోనే హక్కుల సాధన
అనంతపురం : వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది ఐకమత్యంతోనే హక్కులు సాధించు కోవాలని వీఆర్ఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కైకాల గోపాలరావు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని క్రిష్ణకళా మందిరంలో వీఆర్ఏల కార్యవర్గ సమావేశం జరిగింది. వీఆర్ఏలు చాలీచాలని జీతాలతో పని చేస్తున్నారనీ.. వెంటనే వారి జీతాలను ప్రభుత్వం పెంచాలని కైకాల గోపాలరావు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తహశీల్దార్ కార్యాలయాలలో వాచ్మెన్లు లేరని వారి డ్యూటీ కూడా వీఆర్ఏలు చేయాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. వాచ్మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్ఏలకు 010 కింద జీతాలు ఇవ్వాలన్నారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి అన్ని వేళలా రెవెన్యూ ఉద్యోగులు కూడా ముందుంటారని స్పష్టం చేశారు. ప్రభుత్వం వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత, పెన్షన్, ప్రమాద బీమా గుర్తింపు కార్డులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం గౌరవ సలహాదారుడు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు నీలకంఠారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు రామంజినేయులు, కోశాధికారి సుంకన్న, ప్రధాన కార్యదర్శి పుష్పరాజు, జిల్లా కార్యదర్శి రంగయ్య కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.