ఐకమత్యంతోనే హక్కుల సాధన
ఐకమత్యంతోనే హక్కుల సాధన
Published Mon, Dec 12 2016 12:44 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
అనంతపురం : వీఆర్‌ఏలు, రెవెన్యూ సిబ్బంది ఐకమత్యంతోనే హక్కులు సాధించు కోవాలని వీఆర్‌ఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కైకాల గోపాలరావు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని క్రిష్ణకళా మందిరంలో వీఆర్‌ఏల కార్యవర్గ సమావేశం జరిగింది. వీఆర్‌ఏలు చాలీచాలని జీతాలతో పని చేస్తున్నారనీ.. వెంటనే వారి జీతాలను ప్రభుత్వం పెంచాలని కైకాల గోపాలరావు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తహశీల్దార్ కార్యాలయాలలో వాచ్‌మెన్లు లేరని వారి డ్యూటీ కూడా వీఆర్‌ఏలు చేయాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. వాచ్‌మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్‌ఏలకు 010 కింద జీతాలు ఇవ్వాలన్నారు. వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి అన్ని వేళలా రెవెన్యూ ఉద్యోగులు కూడా ముందుంటారని స్పష్టం చేశారు. ప్రభుత్వం వీఆర్‌ఏలకు ఉద్యోగ భద్రత, పెన్షన్, ప్రమాద బీమా గుర్తింపు కార్డులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం గౌరవ సలహాదారుడు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు నీలకంఠారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు రామంజినేయులు, కోశాధికారి సుంకన్న, ప్రధాన కార్యదర్శి పుష్పరాజు, జిల్లా కార్యదర్శి రంగయ్య కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.
Advertisement