రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం పాత, కొత్త నేతల పోటాపోటీ
జాతీయ నాయకత్వం ఎటువైపు మొగ్గుచూపుతుందోననే చర్చ
ఈ నెలాఖరులోగా కొత్త చీఫ్ ఎంపిక ఉంటుందంటున్న పార్టీవర్గాలు
బీసీ వర్గానికి అవకాశం దక్కుతుందనే అంచనాల్లో ముఖ్య నేతలు
బరిలో ఈటల రాజేందర్, అర్వింద్ ధర్మపురి, రఘునందన్‌రావు, రామచందర్‌రావు!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవ రు నియమితులౌతారనేది ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ పదవి కోసం ఆ పార్టీ పాత, కొత్త నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. జాతీయ నాయకత్వం ఈ నెలాఖరులోగా రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. పోలింగ్ బూత్‌ల ఎన్నికలు, మండల పార్టీ అధ్యక్షుల ఎంపికను రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే పూర్తి చేసింది. జిల్లా అధ్యక్షుల నియామకం కోసం ఐదుగురు చొప్పున నాయకుల పేర్లతో జాబితాను సిద్ధం చేసి జాతీయ నాయకత్వానికి పంపించింది. వారంలోగానే వీరిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుడిని కూడా నియమిస్తారని సమాచారం.
మొగ్గు ఎటువైపో..!
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. గత రెండు, మూడేళ్లలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులు కూడా పదవిని ఆశిస్తున్నారు. పార్టీలో చేరాక గత ఎన్ని కల్లో కొందరు ఎంపీలుగా గెలిచారు. మరికొందరు ఇతర పదవుల్లో కొనసా గుతున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తు న్న కార్యకలాపాల్లో చురు గ్గా పాల్గొంటూ పార్టీ అగ్రనేతలకు చేరువైన వారు న్నారు.
అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల (2028) కల్లా పార్టీని పూర్తిగా క్రియాశీలం చేసి ప్రజల మద్ద తు కూడగట్టడంతో పాటు..రాష్ట్రంలో బీజేపీని అధి కారంలోకి తీసుకు వచ్చే సత్తా గల నేతకు పార్టీ పగ్గా లు అప్పగించాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది.
మరోవైపు పార్టీ కార్యకలాపాల్లో సై ద్ధాంతిక అంశాలకు ప్రాధాన్యత ఉన్నందున.. ఏళ్ల పాటు పార్టీ లోనే ఉంటూ, సిద్ధాంతాలకు విలువ నిచ్చే పాత నాయకులకే అధ్యక్ష పగ్గాలు అప్పగించా లని ఓ వర్గం బలంగా వాదిస్తోంది. దీంతో రాష్ట్ర అధ్యక్షు డిగా సైద్ధాంతిక నేపథ్యం ఉన్న పార్టీ పాత నే తకు అవకాశం వస్తుందా? లేక రాష్ట్రంలో రాజకీ యంగా పట్టు, ప్రజల్లో గుర్తింపు ఉన్న కొత్త నేతకు అవకాశం లభిస్తుందా? అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.
ముఖ్యనేతల మధ్య తీవ్ర పోటీ
ఎంపీలు ఈటల రాజేందర్, అర్వింద్ ధర్మపురి, రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఈ పదవి కోసం ప్రధానంగా పోటీపడుతు న్నారు. తాను పోటీలో లేనని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ ఇప్పటికే వివరణ ఇచ్చి నప్పటికీ.. మళ్లీ ఆయన్నే రాష్ట్ర అధ్యక్షుడిగా నియ మించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
కీలక నేత కిషన్‌రెడ్డికి కేంద్రమంత్రిగా, మరో నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి బీజేఎల్పీనేతగా అవకాశం కల్పించినందున. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక మాత్రం బీసీ వర్గాల నుంచే ఉంటుందనే వాదన పార్టీ ముఖ్య నాయకుల్లో బలంగా వినిపి స్తోంది. మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినందు న.. రాష్ట్ర బీసీ జనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న ముదిరాజ్ సామాజికవర్గ నేత ఈటలకు ఈ పదవి దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది.
మరోవై పు ఎంపీ రఘునందన్‌రావు పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎప్పుడు అవకాశం వచ్చినా.. బీఆర్ ఎస్, కాంగ్రెస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడు తున్నారు. దీంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం కూ డా ఉండటం కలిసొచ్చే అంశంగా పేర్కొంటున్నారు. ఆయనతో పాటు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కూ డా ఆ రెండు పార్టీలపై ఘాటుగా విమర్శలు చేస్తార న్న అభిప్రాయం ఉంది.
ఇక మాజీ ఎమ్మెల్సీ రామ చందర్‌రావు.. ఏబీవీపీ నుంచి మొదలుపెట్టి ఎప్ప ట్నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారని, సౌమ్యు డు, అందరితోనూ సఖ్యత ఉన్న నాయకుడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment