బీహార్ కాంగ్రెస్ నేతల్లో తిరుగుబాటు ధోరణి బయటపడింది. పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను నిలదీస్తూ ఎమ్మెల్యే ప్రతిమా దాస్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. బీహార్‌లో ఉండే నేతనే రాష్ట్ర అధ్యక్ష పదవిలో నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ అఖిలేష్ సింగ్‌కు కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేలను కూడా కలవడానికి సమయం ఉండటం లేదని ప్రతిమాదాస్ ఎద్దేవా చేశారు. శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులెవరూ నామినేషన్ వేయకపోవడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొందని అన్నారు. గతంలో కాంగ్రెస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు ఉండేవారని నాడు కూడా మండలిలో భాగస్వామ్యం ఉండేదన్నారు. ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శాసనమండలిలో పార్టీకి చెందిన సభ్యులెవరికీ చోటు కల్పించకపోవడం శోచనీయమన్నారు.
రాష్ట్ర పార్టీలో ఇంకా సంస్థాగత విస్తరణ జరగలేదని, బీహార్‌లో ఉండాల్సిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఢిల్లీలో మాత్రమే కనిపిస్తారని ఆరోపించారు. అఖిలేష్ సింగ్ కారణంగానే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడారని ప్రతిమా దాస్ పేర్కొన్నారు. ఈ విమర్శలు చూస్తుంటే ప్రతిమా దాస్ కూడా పార్టీని వీడుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment