demanded
-
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. అఖిలపక్ష భేటీలో వైఎస్సార్సీపీ డిమాండ్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ తరపున ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితులను వైఎస్సార్సీపీ వివరించింది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ డిమాండ్ చేయగా, టీడీపీ మాత్రం మౌనంగా ఉంది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్ చేసింది.ఢిల్లీ వేదికగా టీడీపీ దాడులను ఎండగడతాం: విజయసాయిరెడ్డిఅఖిల పక్ష భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో 45 రోజుల్లో 39 హత్యలు, 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయని.. ఢిల్లీ వేదికగా టీడీపీ దాడులను ఎండగడతామన్నారు. ఢిల్లీలో బుధవారం వైఎస్ జగన్ నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. బ్లాక్ మెయిల్ చేసే మీడియాను అడ్డుకునే చట్టం తీసుకురావాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న (శనివారం) ఆయన తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో అనునరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు.రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసాలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణకాండను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఈ నెల 24వ తేదీ బుధవారం నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని వైఎస్ జగన్ చెప్పారు.గత 45 రోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో వివరించి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటంలో కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోదామని ఎంపీలకు సూచించారు. ధర్నా అనంతరం పార్లమెంట్‌కు హాజరై రాష్ట్రంలో సాగుతున్న ఆటవిక పాలనపై గళమెత్తాలని దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కక్షతో చేస్తున్న దురాగతాలను తమ సభల్లోని సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లాలని ఉద్భోధించారు. -
కాంగ్రెస్‌ను వీడనున్న మరో ఎమ్మెల్యే?
బీహార్ కాంగ్రెస్ నేతల్లో తిరుగుబాటు ధోరణి బయటపడింది. పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను నిలదీస్తూ ఎమ్మెల్యే ప్రతిమా దాస్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. బీహార్‌లో ఉండే నేతనే రాష్ట్ర అధ్యక్ష పదవిలో నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ అఖిలేష్ సింగ్‌కు కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేలను కూడా కలవడానికి సమయం ఉండటం లేదని ప్రతిమాదాస్ ఎద్దేవా చేశారు. శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులెవరూ నామినేషన్ వేయకపోవడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొందని అన్నారు. గతంలో కాంగ్రెస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు ఉండేవారని నాడు కూడా మండలిలో భాగస్వామ్యం ఉండేదన్నారు. ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శాసనమండలిలో పార్టీకి చెందిన సభ్యులెవరికీ చోటు కల్పించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర పార్టీలో ఇంకా సంస్థాగత విస్తరణ జరగలేదని, బీహార్‌లో ఉండాల్సిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఢిల్లీలో మాత్రమే కనిపిస్తారని ఆరోపించారు. అఖిలేష్ సింగ్ కారణంగానే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడారని ప్రతిమా దాస్ పేర్కొన్నారు. ఈ విమర్శలు చూస్తుంటే ప్రతిమా దాస్ కూడా పార్టీని వీడుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. -
‘అంబులెన్స్‌లో డీజిల్ లేదు...రూ. 800 ఇస్తేనే తీసుకెళ్తా’.. రోగి మృతి
సాక్షి, నిజామాబాద్: మెరుగైన చికిత్స కోసం ఓ రోగిని బాన్సువాడ నుంచి నిజామాబాద్‌కు తరలించారు. అయితే డీజిల్‌కు డబ్బులు ఇవ్వలేదని అంబులెన్స్ డ్రైవర్ రోగిని తీసుకెళ్లలేదు. దీంతో పరిస్థితి విషమించి ఆ రోగి మృతి చెందిన ఘటన బాన్సువాడ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన సాయిలు (40) వాంతులు, విరోచనాలతో మూడురోజుల క్రితం బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చేరాడు. సోమవారం తెల్లవారుజామున సాయిలుకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. విధుల్లో ఉన్న వైద్యుడు పరిస్థితి గమనించి నిజామాబాద్ ఆస్పత్రికి తరలించాలని సాయిలు కుమారుడికి సూచించారు. వైద్య సిబ్బంది ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్‌కు ఫోన్ చేసి పిలిపించారు. అయితే డ్రైవర్ అంబులెన్స్‌లో డీజిల్ లేదని...రూ.800 ఇవ్వాలని సాయిలు కుమారుడికి చెప్పాడు. తన వద్ద రూ.50 ఉన్నాయని, ఎలాగైనా తన తండ్రిని నిజామాబాద్‌కు తీసుకెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్‌ను ప్రాధేయపడ్డాడు. డబ్బులు ఇస్తేనే తీసుకెళ్తానని చెప్పి అంబులెన్స్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోగా, కొద్దిసేపటి తర్వాత సాయిలు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. సాయిలు మృతికి కారణమైన వైద్య సిబ్బందిపై, అంబులెన్స్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి వచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకోలో కొత్తకొండ భాస్కర్, కాసుల బాల్‌రాజ్, గుడుగుట్ల శ్రీనివాస్, ఖలేక్, హన్మాండ్లు, మంత్రి గణేశ్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: లవ్ ఫెయిల్యూర్.. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే -
దరఖాస్తుదారులు ఓపిక పట్టాలి.. వీసాల జారీపై దృష్టి పెట్టాం: అమెరికా
న్యూఢిల్లీ: అమెరికా వీసాల కోసం భారత్‌లో విపరీతమైన డిమాండే సుదీర్ఘమైన వెయిటింగ్ పీరియడ్‌కు కారణమని యూఎస్ చార్జ్ డి అఫైర్స్ రాయబారి ఎలిజబెత్ జోన్స్ అన్నారు. ‘‘దీన్ని వీలైనంతగా తగ్గించడానికి అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది’’ అని శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమె మీడియాకు తెలిపారు. ‘‘భారీగా కౌన్సెలర్లను నియమించుకుంటున్నాం. వారందరికీ వాషింగ్టన్లో యుద్ధ ప్రాతిపదికన శిక్షణ నడుస్తోంది. వారిలో వీలైనంత మందిని భారత్‌కు రప్పించుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. వచ్చే వేసవికల్లా ఢిల్లీ, ఇతర కాన్సులేట్లలో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులోకి వస్తారు’’ అని చెప్పారు. దరఖాస్తుదారులంతా ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమెరికా వీసాకు తొలిసారిగా దరఖాస్తు చేసుకుంటున్న వారు ఇంటర్వ్యూల కోసం ఏకంగా మూడేళ్ల దాకా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది! -
రఘువీరా రెడ్డిని స్తంభానికి కట్టిపడేసింది...ఎవరు?ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: మాజీ వ్యవసాయ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయాలను పక్కన పెట్టి, వ్యవసాయ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆయన రైతుగా కనిపించి ఇటీవల అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ అభిమానులను ఫిదా చేసిన డా.రఘువీరా తాజాగా మరోసారి ఆకట్టు కుంటున్నారు. మనవరాలు సమైరా స్తంభానికి కట్టిపడేసి మరీ తనతో ఆడుకోవడానికి నేను ఇంట్లో ఉండాలని డిమాండ్ చేసిందంటూ పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా రఘువీరా ట్విటర్, ఫేస్బుక్లో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశారు. (HBD Nivetha Thomas: ఈ విషయాలు తెలుసా మీకు?) తనకు సమయాన్ని కేటాయించడం లేదని అలిగిన ఆయన మనవరాలు సమైరా రఘువీరారెడ్డిని తాళ్లతో స్థంభానికి కట్టి వేసిన దృశ్యంపై సోషల్ మీడియా యూజర్లు స్పందిస్తున్నారు. తాళ్లతో కట్టేసి మరీ తనతో ఆడుకోమని డిమాండ్ చేయడం భలే వుంది. చాలా హృద్యంగా, కట్టిపడేసేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. డౌన్ టు ఎర్త్ అనేది రఘు వీరారెడ్డికి సరిపోయే మాట అంటున్నారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా సేవలు అందించి, విభజన అనంతరం పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన రఘువీరారెడ్డి ప్రస్తుతం సాధారణ రైతుగా జీవితాన్ని గడిపేస్తున్నారు. -
చిత్రపురిలో భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి
కవాడిగూడ (హైదరాబాద్): చిత్రపురి భూ కబ్జాలపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించి పేద సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలను అప్పగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చే శారు. చిత్రపురి సొసైటీలో వందకోట్ల రూపాయల అవి నీతి జరిగిందని అధికారులు నివేదికలు ఇచ్చినా చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో పేద సినిమా కార్మికుల న్యాయపోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. పేదల ఇళ్ల స్థలాలను కొందరు ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటున్నారని అన్నారు. చిత్రపురి పేద సినీ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుం దని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రస్తుత సొసైటీ పాలక మండలి సభ్యులు కార్మికుల సొంతింటి కలను నిర్వీర్యం చేస్తూ పేదల స్థలాలను ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కేటాయించి ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నా రని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి సొసైటీలో జరిగే అవినీతి పై చర్యలు చేపట్టి పేద సినిమా కార్మికులకు న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సినిమా కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయమైందన్నారు. హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
అవి అనువైన భవనాలు కావు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్ ప్రాంగణంలోని పాత భవనాలు జాతీయ అంటు వ్యాధులని యంత్రణ సంస్థ (ఎన్సీడీసీ) ఏర్పాటు చేసే పరిశోధన కేంద్రానికి అనువైనవి కావని కేంద్రం స్పష్టం చేసింది. తమకు అనువైనచోట రెండెకరాలు కేటాయిస్తే అందులో భవనాలు నిర్మించుకుంటా మని కోరింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఎన్సీడీసీ అధికారులు రెండ్రోజులుగా హైదరాబాద్‌లో తమ పరిశోధన కేంద్రానికి అనువైన స్థలాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కోఠిలోని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన భవనాలను పరిశీలించారు. అవి పరిశోధన సంస్థకు యోగ్యంకావని నిర్ధారించారు. ఇటు యాచారం, శామీర్‌పేట, మానసిక చికిత్సాలయంలలో ఉన్న స్థలాలనూ పరిశీలించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో శుక్రవారం సమావేశమయ్యారు. స్థలం గుర్తించే వరకు కోఠిలోని ఆరోగ్య కుటుం బ సంక్షేమ కమిషనరేట్‌లోని భవనాలను ఉపయోగించుకోవాలని వారిని ఆయన కోరారు. కేంద్ర బృందంతో భేటీ అనంతరం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావుతో కలసి మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. అన్ని రకాల వైరస్‌లను గుర్తించడం, వాటిపై పరిశోధన చేసేందుకు రాష్ట్రంలో ఎన్సీడీసీ ఏర్పాటవుతోందన్నారు. కాగా, కేంద్ర బృందంతో భేటీ కోసం మంత్రి ఈటల రాజేందర్ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యా లయానికి వచ్చారు. ఆ సమయంలో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో మరో సమావేశంలో ఉం డిపోయారు. కీలక సమావేశానికి ఉన్నతాధికారులెవ రూ హాజరుకాకపోవడంపై మీడియా ముందే ఈటల అసహనం వ్యక్తం చేశారు. ‘మిగతా అధికారులంతా ఏమయ్యారు’అని ఆయన అక్కడి అధికారులను ప్రశ్నించారు. కోఠిలో నిత్యం ఉండే కీలక అధికారులు ఒకరిద్దరు మినహా ఎవరూ మంత్రి సమావేశానికి రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
‘నవయుగ’ ముందు ఆందోళన
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పనుల్లో తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు సబ్‌కాంట్రాక్టర్లు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ముందు ఆందోళన నిర్వహించారు. సుమారు వంద మంది వరకు కాంట్రాక్టర్లు ఉదయం గేటు ముందు బైఠాయించారు. కార్యాలయానికి వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో సుమారు రూ.150 కోట్ల బిల్లులు బకాయి పడ్డారని, ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు వచ్చినా.. నవయుగ కంపెనీ వాటిని తమకు చెల్లించడం లేదని ఆరోపించారు. వ్యవహారాన్ని సెటిల్ చేస్తామంటూ చైర్మన్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు గత కొంతకాలంగా తమను కార్యాలయం చుట్టూ తిప్పిస్తున్నారని దుయ్యబ ట్టారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు చైర్మన్‌తో అపాయింట్మెంట్ ఉందని చెప్పడంతో తామంతా ఇక్కడకు వచ్చామని, తీరా వచ్చాక చైర్మన్ లేడంటూ బయటకు పంపించారని ఆరోపించారు. తామంతా రోడ్డున పడ్డామని, ఇక ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. 11 నెలల నుంచి బిల్లులు చెల్లించడం నిలిపివేశారని ఆరోపించారు. మట్టి పనులు చేశాం.. తాను విజయవాడకు చెందిన కాంట్రాక్టర్‌నని, పోలవరం ప్రాజెక్టులో మట్టి పనులు చేశానని రాము అనే బాధిత కాంట్రాక్టర్ చెప్పారు. ఇందుకుగానూ రూ. 1.80 కోట్లు తనకు రావాల్సివుందన్నారు. గత జనవరి నుంచి మొన్నటి ఆగస్టు వరకు బిల్లుల చెల్లింపు జరగలేదని, ఎన్నిసార్లు అడిగినా ఎండీని అడుగుతామం టూ చెబుతున్నారని ఆరోపించారు. బిల్లులు బకాయిపడటంతో తనలాగే 50 మంది కాంట్రాక్టర్లు రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. సబ్ కాంట్రాక్టు తీసుకున్నాం.. పోలవరం ప్రాజెక్టులో ఎర్త్‌వర్క్ కోసం తాను నవయుగ నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకోవడం జరిగిందని కిరణ్ అనే కాంట్రాక్టర్ తెలిపారు. రూ. 4.50 కోట్లు బకాయి పడ్డారని వెల్లడించారు. బకాయిలపై ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని, చైర్మన్‌ను కలవడంలో తాత్సారం చేస్తున్నారని, అందుకే బాధితులమంతా ఇక్కడకు వచ్చామని తెలిపారు. -
జీఎస్టీ పన్నుపై రాందేవ్ గుర్రు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్న ప్రతిష్టాత్మక జీఎస్టీ బిల్లుపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక జీఎస్టీ చారిత్రాత్మకమని కొనియాడారు. అయితే ఇటీవల పన్నురేట్ల ఖరారులో ఆయుర్వేదంపై అధిక పన్ను నిర్ణయిండంపై తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. భారతదేశంలో ఆయుర్వేదం పునరుద్ధరణను ఇది నాశనం చేస్తుందని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రస్తుతం అమల్లో ఉన్న 5శాతానికి బదులుగా ఆయుర్వేద ఉత్పత్తులపై 12 శాతం పన్నురేటు నిర్ణయించడం సరైంది కాదన్నారు. దీన్ని సమీక్షించాలకోరారు. ఈ పన్ను రేటుపై మార్పులు చేయాలని శుక్రవారం ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా అల్లోపతి, హోమియోపతిపై యధావిధంగా 5శాతం ఉంచి ఆయుర్వేదంపై 12 శాతం విధించడంపై బాబా రాందేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న ఆయుర్వేద వైద్య విధానాన్ని పతంజలి ద్వారా తిరిగి తాము వెలుగులోకి తీసుకొస్తున్నామని బాబా చెప్పారు. అలాగే బీడీలు, సిగరెట్లు లాంటి హానికరమైన వస్తువులు, ఇతర విలాస వస్తువులపై టాక్స్ అధికంగా ఉండాలి తప్ప, మందులపై పన్ను రేటు స్వల్పంగా ఉండాలని బాబా కోరుకున్నారు. ప్రభుత్వం ఆయుర్వేదానికి వ్యతిరేకం కాదని, ఈ నేపథ్యంలో తప్పనిసరిగా తన అభ్యర్థనను మన్నిస్తుందన్న విశ్వాసాన్ని రాందేవ్ వ్యక్తం చేశారు. మరోవైపు ఆయుర్వేద కేటగిరీపై అధిక జీఎస్టీ తమకు ఆశ్చర్యాన్నికలిగించిందన్నారు పతంజలి ఆయుర్వేవ్ లిమిటెడ్, పతంజలి యోగపీఠ్ ప్రతినిధి ఎస్.కె. టిజారవాలా. 12 శాతం పన్ను రేటు విధించడం చాలా నిరాశ కలిగించిందని, ఇది బాధాకరమైనదని పిటిఐతో చెప్పారు. సరసమైన ధరలో సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్య విధానమన్నారు. మంచి ఆరోగ్యం , ఆరోగ్యకరమైన జీవనము సామాన్య మానవుడి ప్రాథమిక హక్కు అని పేర్కొన్న ఆయన వీటికి దూరం చేసి 'అచ్చె దిన్'ని ఎలా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ఆయుర్వేదిక్ ఔషధ తయారీదారుల అసోసియేషన్ (అమామ్) కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ఆయుర్వేద ఉత్పత్తులను భారీగా ప్రోత్సహమిస్తున్న భారత ప్రభుత్వం అధిక పన్ను రేటుతో దేశీయంగా ఆయుర్వేదాన్ని దూరం చేస్తే ఎలా అని అమామ్ జనరల్ సెక్రటరీ ప్రదీప్ ముల్తా పేర్కొన్నారు. -
కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాల్సిందే
కల్వకుర్తి : రెవెన్యూ డివిజన్ కోసం ఆచారి చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా అఖిల పక్షం ఆధ్వర్యంలో శుక్రవారం రెండు జాతీయ రహదారుల జంక్షన్లో మూడుగంటల పాటు రాస్తారోకో చేశారు. జేపీనగర్ వద్ద చౌరస్తాలో డప్పులు, వాయిద్యాలు, నృత్యాలు, పాటలతో రెవెన్యూ డివిజన్ అవశ్యకత చాటిచెప్పారు. ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎడ్మకిష్టారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఆనంద్‌కుమార్, బీజేపీ తాలూకా బాధ్యులు శేఖర్‌రెడ్డి, టీడీపీ నాయకులు బాలస్వామి గౌడ్, నగరపంచాయతీ చైర్మన్ శ్రీశైలం, ఎడ్మసత్యం, సీపీఎం, సీపీఐ, జేఏసీ, బార్అసోసియేషన్, ప్రజాసంఘాలు కలిసి ఉద్యమించారు. ఉద యం 10 నుంచి 1గంట వరకు జాతీయ రహదారిపై బస్సు లు, లారీలు, తదితర వాహనాలు నిలిచిపోయాయి. సీఐ వెంకట్, ఎస్ఐలు, తహసీల్దార్ మంజుల తదితరులు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. రెవెన్యూ డివిజన్‌పై ప్రకటన, చారకొండ, కడ్తాల్ మండలాలుగా చేయాలని నిన దించారు. ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రసంగించిన తర్వాత స్వచ్ఛందంగా రాస్తారోకో విరమిం చారు. హైదరాబాద్–శ్రీశైలం, దేవరకొండ–జడ్చర్ల జాతీ య రహదారులపై రాస్తారోకో చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో నాయకులు భూపతిరెడ్డి, విజయ్‌గౌడ్, పవన్‌కుమార్‌రెడ్డి, వైస్ చైర్మన్ షాహిద్, పీఏసీఎస్ ౖవైస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, వివిధ పార్టీల, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సాంఘిక బహిష్కరణ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ఎల్లారెడ్డి : మోర్తాడ్ మండలం ధర్మారంలో గౌడ కుటుంబాల సాంఘిక బహిష్కరణకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డి గౌడ సంఘం సభ్యులు గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. గౌడ సంఘం మండలాధ్యక్షుడు సాయాగౌడ్ నేతృత్వంలో వారు కార్యాలయ సూపరింటెండెంట్ బాల్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ధర్మారం గ్రామంలో 12 మంది గీత కార్మిక కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ విధించి వారికి వైద్యం కూడా అందనివ్వడం లేదని, వారి పిల్లలను పాఠశాలల్లోకి రానివ్వడం లేదని ఇది అమానుష చర్య అని సంఘం అధ్యక్షుడు అన్నారు. ఘటనపై ప్రభుత్వం పూర్తి విచారణ జరిపించి బా«ధ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పామయ్యగారి ఈశ్వర్‌గౌడ్, వినోద్‌గౌడ్, ప్రశాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సడిమెల యాదగిరి మెదక్: పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సడిమెల యాదగిరి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను రాష్ట్రపతి త్వరగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని ఎంఈఓ, డిప్యూటీఈఓ, జూనియర్ లెక్చరర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాతపెన్షన్ విధానం అమలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. భాషా పండితులను, పీఈటీలను అప్‌గ్రేడ్ చేయాలని, 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, మíß ళా ఉపాధ్యాయులకు రెండేళ్ల చైల్డ్‌కేర్ లీవ్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. అలాగే పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, కామన్‌స్కూల్ విధానం అమలు చేయాలని తీర్మానం చేశారు. సమస్యల పరిష్కారానికై ఈనెల 27న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి హరికిషన్, రాష్ట్ర, జిల్లా నేతలు ప్రభాకర్, సదన్‌కుమార్, మల్లారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఏపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన అశోక్ బాబు
నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వంపై ఏపీఎన్జీఓ నేత అశోక్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన హెల్త్‌కార్డులను ఆసుపత్రులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఆదివారం నెల్లూరు జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుదల వ్యవహారంలో కూడా పీఆర్సీపై ప్రభుత్వ స్పందన తీరు సరిగా లేదన్నారు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని అశోక్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను బలవంతంగా విజయవాడకు తరలించాలని చూస్తే ఊరుకునేది లేదని ఈ సందర్బంగా అశోక్ బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
భద్రత పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ: పండుగ సీజన్ కావడంతో మార్కెట్లలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ప్రజలకు భద్రత పెంచాలని విధానసభ ప్రతిపక్ష నాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్రా డిమాండ్ చేశారు. దేశంలో పలుచోట్ల ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉంటున్నా దేశరాజధాని నగరంలో భద్రత గాలిలో దీపంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో బాంబుపేలుళ్లు జరిగిన ఘటనలు నమోదవుతున్నా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదన్నారు. ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఢిల్లీ నగరం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రతిరోజూ హెచ్చరిస్తున్నా ప్రయోజనం ఉండడం లేదన్నారు. దేశంలో ఉగ్రవాదుల దాడులకు ఢిల్లీ నగరం కేంద్రం అవుతోందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ఉదాసీన ధోరణితో ప్రజ లకు ముప్పు పొంచి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే బంగ్లాదేశ్, నైజీరియా, పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్‌కి చెందిన లక్షల మంది ఢిల్లీలో అక్రమం గా నివసిస్తున్నారన్నారు. నగరంలో జరుగుతున్న ఎన్నో నేరాల్లో వీరిపాత్ర ఉంటుందన్నారు. ఇటీవల సైబర్ క్రైంలలో నైజీరియన్ల పాత్ర అధికంగా ఉన్నట్టు రుజువైందన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఈ అంశంలో జోక్యం చేసుకుని భద్రత కట్టుదిట్టం చేయకపోతే పాట్నాలో జరిగిన ఉగ్రదాడులు ఢిల్లీలోనూ జరుగుతాయని అనుమానం వ్యక్తం చేశారు. చుక్కలనంటుతున్న ధరలతో జనం ఉక్కిరిబిక్కిరి: గోయల్ పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలతో నగరంలో పండుగ శోభ కనిపించడం లేదని విజయ్‌గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ఈ దీపావళి సామాన్యుల ఇళ్లలో చీకట్లే మిగిల్చేలా ఉందన్నారు. ఉల్లిధరలు ఇప్పటికే కంటనీరు తెప్పిస్తున్నాయన్నారు. పెట్రోలు,పాలు,పప్పులు, ఆటా,బియ్యం తదితరాలు రేట్లు రెట్టింపు అయ్యాయన్నారు. కూరగాయల ధరలు నెల రోజుల్లో 200 నుంచి 300 శాతం పెరిగాయని పేర్కొన్నారు. ‘ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కంటితుడుపుగా ఉన్నాయి. కేవలం 350 సఫల్ కేంద్రాల్లో, 150 మొబైల్వ్యాన్లలో ఉల్లి సరఫరా చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్నట్టు సీఎం మాట్లాడుతున్నారు. ఢిల్లీలోని కోటి 67 లక్షల మందికి ఎలా చేరవేస్తారు. మొబైల్వ్యాన్లు లెక్కకు మాత్రమే తిరుగుతున్నాయి పేదలకు ఎలాంటి ఉపయోగం లేదు. సఫల్ కేంద్రాల్లోనూ పాడైపోయిన ఉల్లినే విక్రయిస్తున్నారు ’అని గోయల్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా దేశవ్యాప్తంగా ఉల్లి కొరత నెలకొందని విమర్శించారు. దేశీయ ఉల్లి రూ.40-45కే అందుబాటులో ఉండగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఉత్పత్తులను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారన్నారు.