- ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సడిమెల యాదగిరి
మెదక్: పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సడిమెల యాదగిరి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్‌లో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను రాష్ట్రపతి త్వరగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.
రాష్ట్రంలోని ఎంఈఓ, డిప్యూటీఈఓ, జూనియర్ లెక్చరర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాతపెన్షన్ విధానం అమలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. భాషా పండితులను, పీఈటీలను అప్‌గ్రేడ్ చేయాలని, 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, మíß ళా ఉపాధ్యాయులకు రెండేళ్ల చైల్డ్‌కేర్ లీవ్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.
అలాగే పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, కామన్‌స్కూల్ విధానం అమలు చేయాలని తీర్మానం చేశారు. సమస్యల పరిష్కారానికై ఈనెల 27న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి హరికిషన్, రాష్ట్ర, జిల్లా నేతలు ప్రభాకర్, సదన్‌కుమార్, మల్లారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.