stu
-
ఎస్టీయూ సంబరాలు
కర్నూలు సిటీ: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో కత్తి నరసింహారెడ్డి గెలుపొందడంతో బుధవారం ఎస్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షన్మూర్తి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్‌రెడ్డి, తిమ్మన్న తదితరులు డీఈఓ తాహెరా సుల్తానాను కలిసి స్వీట్లు అందజేశారు. అనంతరం డీఈఓ కార్యాలయంలో ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై కత్తి నరసింహారెడ్డి చేసిన పోరాటాలే ఎన్నికల్లో గెలిపించాయన్నారు. ఎన్నిక హామీలు నెరవేర్చుకునేందుకు భవిష్యత్తు ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. -
16న జిల్లాస్థాయి విద్యా సదస్సు
కర్నూలు సిటీ: ఎస్టీయూ ఏర్పడి 70 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల16న జిల్లా స్థాయి విద్యాసదస్సు ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీవీఎస్ ప్రసాద్‌రెడ్డి, తిమ్మన్న తెలిపారు. శుక్రవారం స్థానిక సలాంఖాన్ భవన్లో ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశ«ంలో వారు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ విద్య– పరిరక్షణ అనే అంశంపై 16వ తేది ఉదయం 10 గంటలకు జెడ్పీ ఆవరణలోని మండల పరిషత్ కార్యాలయంలో సదస్సు నిర్వహించనున్నామన్నారు. మొదట కలెక్టరేట్ నుంచి జెడ్పీ వరకు మహార్యాలీ జరుగుతుందన్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సన్మూర్తి, జోసెఫ్ సుధీర్‌బాబు, యూటీఎఫ్, ఏపీటీఎఫ్–1938, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఎస్టీయూ నాయకులు సుధాకర్‌గౌడు, వెంకట్రాముడు, రహీం, హనుమంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ పాఠశాలల సమస్యలపై స్పెషల్ డ్రైవ్
కర్నూలు సిటీ: జిల్లా వ్యాప్త ఆదర్శ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు డీఈఓ హామీ ఇచ్చినట్లు ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మన్న తెలిపారు. మంగళవారం ఎస్టీయూ నాయకులు డీఈఓను కలిసి పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాళ్లకు సంబంధించిన సంపాదిత సెలవులు సర్వీస్ రిజిస్టర్లో నమోదు.. గోనుగండ, జూపాడుబంగ్లా మోడల్ స్కూల్లో పని చేస్తున్న మహిళ టీచర్ల మాతృత్వ సెలవులు, సి.బెళగల్ స్కూల్లోని తెలుగు టీచర్ జీతం రాని విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. వీరి వెంట ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి రఫీ, తదితరులు ఉన్నారు. -
సీపీఎస్ రద్దుకు జాతీయ స్థాయిలో పోరాటం
కర్నూలు సిటీ: ఉద్యోగులకు శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని రద్దు చేసేవరకు పోరాడతామని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షన్మూర్తి అన్నారు. స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ వల్ల ఉపాధ్యాయుడు చనిపోయినా, పదవి విరమణ పొందినా ఆర్థిక ప్రయోజనం అగమ్యగోచరంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ విధానం రద్దు కోసం చేస్తున్న పోరాటాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా డీల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేశామని, అయినా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదన్నారు. జాతీయ అధికార, ప్రతిపక్ష పార్టీ దృష్టికి తీసుకెళ్లి పోరాటాలు చేస్తామని ప్రకటించారు. సర్వీస్ రూల్స్ సమస్య త్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. ఆదర్శ స్కూల్ టీచర్ల సమస్యలపై కూడా పోరాడతామన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఇటీవలే ఎన్నికైన షన్మూర్తిని జిల్లా కమిటీ ఈ సందర్భంగా ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్‌రెడ్డి, తిమ్మన్న, గౌరవాధ్యక్షులు రమేష్, ట్రెజరర్ గోకారి తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతుల కోసం ఉపాధ్యాయుల ఎదురుచూపు
- ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలి - ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సర్వీస్ రూల్స్ లేకపోవడంతో వేల మంది ఉపాధ్యాయులు పదోన్నోతుల కోసం ఎదురు చూస్తున్నారని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌బాబు అన్నారు. శుక్రవారం ఎస్టీయూ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీసీఈ పద్ధతి సాకుతో 5 శాతం సమ్మేటివ్ పరీక్షల మూల్యాంకనాన్ని పరిశీలించడం తగదన్నారు. గురుకులాలు, ఎయిడెడ్, మోడల్ స్కూల్ టీచర్లందరికీ ఆరోగ్య కార్డులను అందజేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ టీచర్లకు ప్రతి నెలా ఒకటో తేదీ జీతాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వాణి ఎడిటర్ అప్పారావు, రాష్ట్ర కార్యదర్శి జానీ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఇ.సమ్మూర్తి, రాష్ట్ర కార్యదర్శి ఎంఎండీ షఫీ, సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాదరెడ్డి, తిమ్మన్న పాల్గొన్నారు. కేవీఆర్ స్థలానికి రక్షణ కల్పించాలి కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలానికి రక్షణ కల్పించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ప్రహరీని నిర్మించి బాలికలకు రక్షణ కల్పించాలని కోరారు. శుక్రవారం కాంపౌండ్‌వాల్ నిర్మాణాన్ని చేపట్టాలని ధర్నా చేస్తున్న విద్యార్థినులకు ఆయన తన మద్దతును ప్రకటించారు. -
సీపీఎస్ రద్దయ్యేంత వరకు ఉద్యమం
– ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దయ్యేంత వరకు ఉద్యమిస్తామని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మన్న పేర్కొన్నారు. సలాంఖాన్ ఎస్టీయూ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తలసమావేశంలో వారు మాట్లాడారు. సెప్టెంబర్‌లో సీపీఎస్‌రద్దు కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర భారీ ధర్నా నిర్వహించినట్లు చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి పది లక్షల మంది ఉపాధ్యాయుల వినతిపత్రాలు సమర్పించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు గ్రాట్యూటీ చెల్లించుటకు ఒప్పుకుందని, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గ్రాట్యూటీ చెల్లింపు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరెడ్డి, నాయకులు ఎంఎండీ షఫీ, సుబ్బారాయుడు, ప్రసాదరావు, టీకీ జనార్దన్ పాల్గొన్నారు. -
హైస్కూల్స్‌లో టీచర్ల కొరత
– ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి – ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ యాళ్లూరు(గోస్పాడు): ఉపాధ్యాయుల కొరత కారణంగా ఉన్నత పాఠశాలల్లో బోధన కుంటుపడుతోందని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి అన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి ఉపాధ్యాయుల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. యాళ్లూరు ఉన్నత పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉపా«ధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్రమూల్యాంకన విధానానికి అనుగుణంగా క్రమబద్ధీకరణ కమిటీ సిఫార్సుల మేరకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 55, 61 ఉత్తర్వులను రద్దు చేసి కొత్త స్టాప్ ప్యాట్రన్ ఉత్తర్వులను విడుదల చేయాలన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ ఈఓ, డైట్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టులను అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయాలన్నారు. సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యూటీ వర్తింపు ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయని నరసింహారెడ్డి తెలిపారు. ఒప్పంద అధ్యాపకులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు శివశంకర్‌రెడ్డి, శ్రీనివాసులు, ప్రసాదరెడ్డి, సుబ్బయ్య, బాబురావు, హెచ్ఎం పుల్లారెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యారంగ పరిరక్షణకు కృషి
– ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు ఆమనగల్లు: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ నిరంతరం కృషి చేస్తుందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు బి.భుజంగరావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో గురువారం నిర్వహించిన ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్కారు చర్యలు తీసుకోవాలని, భవనాలు నిర్మించడమే కాకుండా మౌలిక వసతులు కల్పించాలని, పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య, ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉన్న పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతినేలా విద్యాశాఖ మంత్రి కడియం చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. నవంబర్‌లో ఎస్టీయూ 70 ఏళ్ల వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కసిరెడ్డి పురుషోత్తంరెడ్డి, నాయకులు సదానందం గౌడ్, రవి,శివప్రసాద్,కిష్టారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సమద్, సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్, సత్యనారాయణ, యూనిస్, పాషా, పర్వత్‌రెడ్డి, సుదర్శన్ పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా కోసం ఎస్టీయూ నిరసన
గుంటూరు ఎడ్యుకేషన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు పిలుపునిచ్చారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలుపర్చేందుయు నిరాకరించిన బీజేపీ ప్రభుత్వం, హోదా కోసం పోరాటం చేయని టీడీపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎస్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులోని శంకర్‌విలాస్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకూ ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సుధీర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ, విభజన హామీలు, ఉద్యోగ అవకాశాల కల్పనకు, రాష్ట్ర ప్రగతికై పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఆగస్టు 2న ప్రత్యేక హోదా సాధన సమితి తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్ధతు ప్రకటిస్తున్నట్లు సుధీర్ బాబు ప్రకటించారు. అనంతరం బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎస్. రామచంద్రయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం
ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద్‌గౌడ్ సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తేనే పరిష్కారం లభిస్తుందని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద్‌గౌడ్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ఇందిరాపార్క్ వద్ద ఈనెల 27న భారీ ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉపాధ్యాయుల, విద్యార్థి సంఘ నేతలు తప్పకుండా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఎస్టీయూ భవన్లో జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమించాల్సి వస్తుందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్త పద్ధతులను అమల్లోకి తెస్తున్నప్పటికీ.. వాటికి అవసరమైన నిధులతోపాటు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు పరమేష్, ఏవీ.సుధాకర్, రాజశ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీ యూ ధర్నాను విజయవంతం చే యాలి
నడిగూడెం : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 27 హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఎస్టీయూ ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. శనివారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో ధర్నా వాల్‌పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎండీ.సలీం షరీఫ్, ఎస్టీయూ మండల అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎండీ.జానిపాషా, నాయకులు చందూలాల్, శ్రీనివాస్, కవిత, రమాదేవి, పాల్గొన్నారు. -
విద్యా సమస్యలపై మహాధర్నా
గద్వాల : విద్యారంగంలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నామని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి యూనస్‌పాష తెలిపారు. గురువారం స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల ఆవరణలో మహాధర్నా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించాలని, ఆంగ్ల మాధ్యమంలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు లక్ష్మణ్, విజయభాస్కర్‌రెడ్డి, కిషోర్‌చంద్ర, హుసేన్, రాజేష్, నాగరాజు, భీమన్న, శ్రీహరి, గౌరీశంకర్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పాత పింఛన్ విధానం కొనసాగించాలి
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ ‘చలో హైదరాబాద్’ కరపత్రాల ఆవిష్కరణ మొయినాబాద్ రూరల్: ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి, సీపీఎస్‌ను రద్దు చేయాలని తెలంగాణ రాష్ర్ట ఉపాధ్యాయ సంఘం జిల్లా అధక్షుడు పి.ప్రవీణ్‌కుమార్ అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27న ఇందిరాపార్క్‌లో నిర్వహించనున్న చలో హైదరాబాద్ ధర్నా కరపత్రాలను.. మండల పరిధిలోని అమ్డాపూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ- 2003 ఉపాధ్యాయులకు పాత పెన్సన్ పద్ధతిని కొనసాగించాలన్నారు. ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని, అంతర్ జిల్లాల బదీలలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగదు రహిత హెల్త్ కార్డులను అమలు చేయాలన్నారు. విద్యాహక్కు చట్టం మేరకు అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. పూర్తి స్థాయిలో ఎంఈఓలను నియమించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషిచేయాలని సూచించారు. జీఓ 302ను పునరుద్ధరించి ఉపాధాయులకు పదోన్నతులు కల్పించాలన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్, రాష్ర్ట ఉపాధ్యక్షుడు పరమేశ్, జిల్లా కోశాధికారి క్రిష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శశిధర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు విఠల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శివయ్య, మహిళా అధ్యక్షురాలు జ్యోతి, ఉపాధ్యాయులు అలివేలుమంగ, మల్లేశ్ తదితరలు ఉన్నారు. -
పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలి
పెద్దశంకరంపేట: విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో ఈ నెల 27న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్టీయు రాష్ట్ర కౌన్సిలర్ బి.శ్రీనివాస్ కోరారు. మంగళవారం పేటలో ఎస్టీయూ చలో హైదరాబాద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, డీఎస్సీ నిర్వహించాలని, విద్యకు బడ్జెట్లో 30 శాతం నిధులు కెటాయించడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయు మండల అధ్యక్షులు లింగారెడ్డి, ప్ర«ధానకార్యదర్శి రాధాక్రిష్ణ, కుమార్, శంకర్, నారాయణ, సిద్దిరాములు, సంగారెడ్డి, విఠల్‌నాయక్ తదితరులున్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సడిమెల యాదగిరి మెదక్: పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సడిమెల యాదగిరి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను రాష్ట్రపతి త్వరగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని ఎంఈఓ, డిప్యూటీఈఓ, జూనియర్ లెక్చరర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాతపెన్షన్ విధానం అమలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. భాషా పండితులను, పీఈటీలను అప్‌గ్రేడ్ చేయాలని, 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, మíß ళా ఉపాధ్యాయులకు రెండేళ్ల చైల్డ్‌కేర్ లీవ్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. అలాగే పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, కామన్‌స్కూల్ విధానం అమలు చేయాలని తీర్మానం చేశారు. సమస్యల పరిష్కారానికై ఈనెల 27న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి హరికిషన్, రాష్ట్ర, జిల్లా నేతలు ప్రభాకర్, సదన్‌కుమార్, మల్లారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పదోవేతన సంఘ సిఫార్సులు సవరించాలి
రాజమండ్రి: పదో వేతన సంఘం చేసిన సిఫార్సులను సవరించకపోతే మరో ఉద్యమం చేస్తామని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నర్సింహారెడ్డి అన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని సూర్యాహోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. క్లస్టర్ పాఠశాలలను ఏర్పాటు చేస్తే ఉద్యమం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.