పదోన్నతుల కోసం ఉపాధ్యాయుల ఎదురుచూపు
పదోన్నతుల కోసం ఉపాధ్యాయుల ఎదురుచూపు
Published Sat, Oct 8 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
- ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
- ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సర్వీస్ రూల్స్ లేకపోవడంతో వేల మంది ఉపాధ్యాయులు పదోన్నోతుల కోసం ఎదురు చూస్తున్నారని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌బాబు అన్నారు. శుక్రవారం ఎస్టీయూ భవన్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీసీఈ పద్ధతి సాకుతో 5 శాతం సమ్మేటివ్ పరీక్షల మూల్యాంకనాన్ని పరిశీలించడం తగదన్నారు. గురుకులాలు, ఎయిడెడ్, మోడల్ స్కూల్ టీచర్లందరికీ ఆరోగ్య కార్డులను అందజేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ టీచర్లకు ప్రతి నెలా ఒకటో తేదీ జీతాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వాణి ఎడిటర్ అప్పారావు, రాష్ట్ర కార్యదర్శి జానీ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఇ.సమ్మూర్తి, రాష్ట్ర కార్యదర్శి ఎంఎండీ షఫీ, సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాదరెడ్డి, తిమ్మన్న పాల్గొన్నారు.
కేవీఆర్ స్థలానికి రక్షణ కల్పించాలి
కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలానికి రక్షణ కల్పించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ప్రహరీని నిర్మించి బాలికలకు రక్షణ కల్పించాలని కోరారు. శుక్రవారం కాంపౌండ్‌వాల్ నిర్మాణాన్ని చేపట్టాలని ధర్నా చేస్తున్న విద్యార్థినులకు ఆయన తన మద్దతును ప్రకటించారు.
Advertisement