pramotion
-
Handloom Every Day Challenge: చేనేతకు ‘ఐఏఎస్ బ్రాండ్’..
ఏదైనా బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలన్నా.. దానిని ప్రజల్లోకి తీసికెళ్లి సేల్ చేయాలన్నా ఆయా సంస్థలు సెలబ్రిటీలను ఎంచుకుంటారు. వారి ద్వారా అయితేనే ప్రొడక్ట్ డిమాండ్ పెరుగుతుందనే నమ్మకం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రభుత్వ పరిధిలోని చేనేత రంగాన్ని ప్రమోట్ చేసేందుకు స్వయానా ఐఏఎస్ అ«ధికారులు రంగంలోకి దిగారు. చేనేతలోని పలు రకాల చీరెలను ధరించి వాటి విశిష్టతను సోషల్ మీడియా ద్వారా వివరిస్తున్నారు. నచ్చిన చీరలో ఫొటో దిగి దానిని ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో చేనేతకు భారీ డిమాండ్ పెరిగింది. చేనేతను ప్రోత్సహించేందుకు, కార్మికులకు సేల్స్‌ను పెంచేందుకు స్వయానా రంగంలోకి దిగారు ముఖ్యమంత్రి కార్యాలయపు కార్యదర్శి స్మిత సభర్వాల్. ఇటీవల చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. తెలంగాణలోని పలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు తమ తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్టులు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారి ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. సై ్టలిష్ లుక్‌లో ఛాలెంజ్ చేసిన స్మిత సబర్వాల్ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిణి స్మిత సభర్వాల్ ఓ చక్కటి చేనేత చీరను ధరించి ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఈ చీరలో ఎంతో స్టయిలిష్ లుక్‌లో ఉన్నారు మేడం..’ అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్మిత ఆ పోస్ట్ ద్వారా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చేనేతవస్త్రాన్ని ధరించాలంటూ ఛాలెంజ్ విసిరారు. ఇలా ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు తమకు నచ్చిన చేనేత వస్త్రాల్లో సోషల్ మీడియాలో సందడి చేశారు. దేశం మొత్తం ఫిదా స్మిత సబర్వాల్ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారిలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఐటీ శాఖ సెక్రటరీ జయేష్ రంజన్, నారాయణఖేడ్ జిల్లా కలెక్టర్ హరిచందన, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శిక్తా పట్నాయక్, యాదాద్రి జిల్లా కలెక్టర్ ప్రమీలా సత్పతి, ఐపీఎస్ అధికారిణులు శిఖాగోయల్, స్వాతిలక్రా తదితరులు వారికి నచ్చిన చేనేత చీరలను ధరించి ప్రతి ఛాలెంజ్‌ను విసరడం విశేషం. వీరి ఛాలెంజ్‌లు, డ్రస్సింగ్ సెన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు లైక్‌లు కొడుతూ కామెంట్స్‌తో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వీరే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు సైతం ఈ ఛాలెంజ్‌లో పాల్గొని తమ తమ రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను ప్రచారం చేశారు. వీరి ప్రచారంతో చేనేతకు ఊరట లభించడంతో పాటు అమ్మకాలు సైతం ఊపందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మనదేశం లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వదేశీ బ్రాండ్‌కు అంబాసిడర్లుగా మారి ప్రపంచవ్యాప్తంగా నయా ట్రెండ్‌ను సృష్టించడం అభినందనీయం. – చైతన్య వంపుగాని, సాక్షి -
ఫస్ట్ ఉమన్.. డేరింగ్ అండ్ కేరింగ్ ఆఫీసర్
అస్సాం తొలి మహిళా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలిస్ (ఐజీ) గా వయొలెట్ బారువాకు ప్రభుత్వం పదోన్నతి కల్పించిన తరువాత ఆమె ట్విట్టర్ పేజీలో అభినందనలు వెల్లువెత్తాయి. వాటిలో కొన్ని... ‘ఈ పదవికి మీకంటే అర్హులైన వారు లేరు’ ‘మీ విజయం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తుంది’ ‘అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు’ ‘ఐపీయస్ చేయాలనేది నా కోరిక. మీ ఆశీర్వాదం, సలహాలు కావాలి. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను’ అస్సాంలో వరదలు ఎంత సహజమో, అల్లర్లు అంతే సహజం. వరదలకైనా టైమ్ ఉంటుందేమోగానీ, అల్లర్లు మాత్రం... అన్ని కాలాల్లోనూ ఉంటాయి. అలాంటి చోట పోలిసు ఉద్యోగం చేయడం అనేది కత్తులవంతెన మీద ప్రయాణం చేయడమంత కష్టం. అయితే డియస్పీ, ఎస్పీ, డిఐజీగా రకరకాల హోదాల్లో పనిచేసిన బారువా మాత్రం తాను రిస్క్ జాబ్ చేస్తున్నానని ఎప్పుడూ అనుకోలేదు. ఒకవేళ అలా అనుకోని ఆగిపోయి ఉంటే చారిత్రక గుర్తింపుకు నోచుకొని ఉండేవారు కాదమో! వయొలెట్ బారువా....‘బ్యూటిఫుల్ నేమ్’ అంటారు ఆమె సన్నిహితులు. వర్ణశాస్త్రం ప్రకారం వయొలెట్ కలర్‌ను జ్ఞానానికి, సున్నితత్వానికి ప్రతీకగా చెబుతారు. ‘సాహసం’ అనే మరో ప్రతీకను కూడా చేర్చారు బారువా. గౌహతి యూనివర్శిటీ నుంచి బాచ్లర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ తీసుకున్నారు బారువా. యూనివర్శిటీ రోజుల్లో కూడా చదువు ఎంత ముఖ్యమో, సమాజం కూడా అంతే ముఖ్యం అనుకునేవారు. తాను వెళ్లే దారిలో ఎక్కడైనా గొడవ జరిగితే సర్దిచెప్పడం, ఆకతాయిల పని పట్టడం జరిగేది. గౌలపర, మోరిగన్, కచర్,బర్పెట జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వహించడమంటే మాటలు కాదు. కేవలం తూటాలు, లాఠీలను నమ్ముకుంటే మాత్రమే సరిపోదు. తెలివి ఉపయోగించాలి. అల్లర్లకు అడ్రస్ అయిన ఆ నాలుగు జిల్లాల్లో శాంతిభద్రతలను పరిరక్షించడంలో బారువా విజయం సాధించారు. సీబిఐ విభాగంలోనూ తన సత్తా చాటారు. నేరపరిశోధనలో, నేరాలను అదుపులో పెట్టడంలో తనదైన ముద్ర వేసిన బారువా ఇలా అంటున్నారు... ‘నా కెరీర్లో ఏ పోస్టింగ్, టాస్క్‌కు ఇబ్బంది పడలేదు. నో చెప్పలేదు. గౌహతి పోలిస్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేయడం కంటే మారుమూల ప్రాంతాలలో పనిచేయడానికే ఆసక్తి చూపాను’ బారువా ఏ ప్రాంతంలో పనిచేసినా ‘పోలిస్ ఆఫీసర్’తో పాటు ‘కేరింగ్ ఆఫీసర్’ అని అభిమానంగా పిలుచుకుంటారు ప్రజలు. అస్సాం పోలిస్‌శాఖలో మహిళల సంఖ్య చాలా తక్కువ. అయితే అస్సాం తొలి మహిళా డీఎస్పీ, తొలి మహిళా డీఐజీ, తొలి ఐజీ అయిన బారువా స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు పోలిస్‌శాఖలో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. బారువా సాధించించిన మరో మహత్తరమైన విజయమిది! -
నగరానికి తమిళ సూపర్ స్టార్
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘కాలా’ సందడి చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తన కాలా చిత్రం ప్రమోషన్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం చెన్నై నుంచి నగరానికి వచ్చారు. రజనీకాంత్‌ను చూడడానికి ప్రయాణికులు గుంపుగా చేరడంతో దేశీయ టెర్మినల్ వద్ద సందడి చోటు చేసుకుంది. ఆయనతో పాటు చిత్రనిర్మాణ బృందం కూడా ఉంది. -
పదవీ విరమణకు ఒకరోజు ముందు పదోన్నతి
ఆదిలాబాద్: డీసీఆర్బీ ఎస్సై జి.కిష్టయ్య బుధవారం పదవీ విరమణ పొందుతున్న తరుణంలో ఆయన ఒకరోజు ముందు సీఐగా పదోన్నతి పొందారు. మంగళవారం స్థానిక పోలీసు కార్యాలయంలో కరీంనగర్ డీఐజీ పి.ప్రమోద్‌కుమార్ పదోన్నతి చిహ్నం(స్టార్)ను కిష్టయ్య భుజానికి అలంకరించారు. ఆదిలాబాద్ మండలం చాందా–టి గ్రామానికి చెందిన కిష్టయ్య 1979లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికై సుధీర్ఘకాలంపాటు సేవలు అందించారు. 1986లో హెడ్‌కానిస్టేబుల్‌గా, 1996లో ఏఎస్సైగా పదోన్నతి లభించడంతో జన్నారం, ఇంద్రవెల్లి పోలీసుస్టేషన్లలో విధులు నిర్వర్తించారు. 2010 ఎస్సై పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అప్పటి నుంచి ఎస్సైగా కొనసాగుతున్నారు. ఎస్సైగానే పదవీ విరమణ పొందుతానని ఆనుకున్న సమయంలో ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ విషయం తెలుసుకొని నేరుగా రాష్ట్ర పోలీసు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే సీఐగా పదోన్నతులు ఉత్తర్వులు జారీ చేశారు. డీఐజీ చేతుల మీదుగా పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విష్ణు వారియర్‌తోపాటు కుమురం భీం ఎస్పీ సింగెనేవార్ కల్మేశ్వర్, నిర్మల్ అదనపు ఎస్పీ దక్షణమూర్తి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎస్బీ డీఎస్పీ విశ్వప్రసాద్, సీసీ దుర్గం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
చనిపోయిన కానిస్టేబుల్‌కు పదోన్నతి
సాక్షి, ఆదిలాబాద్: ఏడాది కిందట చనిపోయిన కానిస్టేబుల్‌కు పదోన్నతి లభించింది. అంతేకాదు పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. ఇది వినడానికి వింతగా ఉన్నా జరిగింది మాత్రం సత్యం. పని చేస్తున్న కాలంలో పదోన్నతి కోసం ఎదురు చూశాడో లేదో కాని ఆ కానిస్టేబుల్‌కు మరణానంతరం ఉన్నతి లభించడం గమనార్హం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం 140 మంది పోలీసు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించారు. అందులో నిర్మల్ జిల్లా కడెం పోలీసుస్టేషన్ నుంచి జలపతి కానిస్టేబుల్‌కు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించారు. ఆయనకు నిర్మల్ జిల్లాలోనే లక్ష్మణచాందలో పోస్టింగ్ కేటాయించారు. అయితే.. జలపతి ఏడాది కిందటే మృతిచెందాడు. దండేపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన జలపతి చనిపోయిన తర్వాత ఆయన కుమారుడికి ఉద్యోగం వచ్చిందని కూడా పలువురు చెబుతున్నారు. జాబితాలో జలపతి పేరు చూసిన కడెం పోలీస్‌స్టేషన్ సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు. ఇదేం చోద్యమో అంటూ ఆశ్చర్యపోయారు. సాయంత్రం వరకు ఇది ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖలో చర్చకు దారితీసింది. ఒక వైపు పదోన్నతుల కోసం ఎదురు చూపు.. ఒక వైపు పోలీసు కానిస్టేబుళ్లు ఏళ్లకేళ్లుగా అదే పోస్టులో పని చేస్తూ పదవీ విమరణ చేస్తున్నారు. కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పిస్తున్నారన్న వార్తతో వారిలో భరోసా వ్యక్తమైంది. 1990 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లకు ఈ పదోన్నతి కల్పించారు. ఈ బ్యాచ్‌లో సుమారు 280 మంది వరకు ఉండగా 140 మందికి పదోన్నతి ఇచ్చారు. దాదాపు సర్వీసులో చేరిన 28 సంవత్సరాల తర్వాత వారికి పదోన్నతి రావడం గమనార్హం. సాధారణంగా కానిస్టేబుళ్ల సర్వీసుకు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో పొందుపరుస్తుంటారు. పదోన్నతులు కల్పించే సమయంలో కానిస్టేబుళ్ల సర్వీసు మ్యాటర్‌ను పూర్తిగా పరిశీలిస్తారు. పనిష్మెంట్, ఇతరత్రా ఆరోపణలు ఉన్న వారి నుంచి సర్వీసు క్లియర్‌గా ఉన్నవారికి మొదట ప్రాధాన్యత ఇస్తారు. అదే సమయంలో చనిపోయిన వారి పేర్లను నమోదు చేసుకుంటారు. పదోన్నతుల సమయంలో జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బంది సరైన పరిశీలన చేయకపోవడంతోనే జలపతికి పదోన్నతి లభించినట్లు చర్చించుకుంటున్నారు. వందల మంది కానిస్టేబుళ్లు పదోన్నతి కోసం ఎదురు చూస్తుంటే డీపీవో సిబ్బంది నిర్వాహకంతో ఇతరులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. చనిపోయిన వ్యక్తికి పదోన్నతి కల్పించారంటే.. జాబితా పరిశీలన సూక్ష్మంగా జరిగిందా అన్న చర్చ సాగుతోంది. సీనియార్టీ లిస్ట్, రోస్టర్ పాయింట్ ఇతర అంశాలను పరిశీలించిన పిదపనే పదోన్నతులు కల్పించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా చనిపోయిన వ్యక్తికి పదోన్నతి కల్పించడం ద్వారా ప్రస్తుతం పని చేస్తున్న మరో కానిస్టేబుల్ నష్టపోయే పరిస్థితి ఉంది. ఈ విషయంలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్‌ను వివరణ కోరగా తాను కనుక్కుంటానని చెప్పారు. -
100 మందికి ఏఎస్సైలుగా పదోన్నతి
హైదరాబాద్: సైబరాబాద్, వికారాబాద్, రాచకొండ పరిధిలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుళ్లకు శుభవార్త. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న దాదాపు వంద మంది హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఏఎస్సై)గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య శనివారం ఉత్తర్వులు జారీచేశారు. -
మా బాబాయ్‌కి ప్రమోషన్ ఇవ్వాల్సిందే..
►లేకుంటే కౌన్సెలింగ్ నిలిపివేయండి ►అధికారులపై జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ అసహనం ►కౌన్సెలింగ్ వాయిదా వేసిన అధికారులు గుంటూరు ఎడ్యుకేషన్: ‘మా బాబాయ్‌కి ప్రమోషన్ ఇవ్వకుంటే ఎవ్వరికీ ప్రమోషన్ ఇచ్చేందుకు వీలు లేదు. ప్యానెల్ జాబితాలో పేరు చేర్చి హెచ్ఎం కౌన్సెలింగ్ నిర్వహించండి... లేకుంటే మొత్తంగా నిలిపివేయండి.’ అని గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ ఆదేశించారు. తన బంధువుకు పదోన్నతి ఇవ్వని పక్షంలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిపివేయాలని విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలో ఉన్న 31 మంది స్కూల్ అసిస్టెంట్లను బుధవారం గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరానికి హెచ్ఎం కౌన్సెలింగ్‌కు రావాలని సమాచారమిచ్చారు. కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్న సమయంలో సీనియార్టీ జాబితాపై తనకు అనుమానాలున్నాయని జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ అభ్యంతరం లేవనెత్తారు. పిడుగురాళ్ల ప్రాంతంలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు హలీం బాషాను తన బాబాయ్‌గా పేర్కొన్న జానీమూన్, అతని పేరును చేర్చి పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. అయితే ఏడాది క్రితం ఆమోదం పొందిన ప్యానెల్లో తాజాగా పేర్లు చేర్చరని డీఈవోతో పాటు సంఘాల నాయకులు ఆమెకు నచ్చజెప్పారు. గురువారం పదవీ విరమణ పొందుతున్న మరో ముగ్గురు స్కూల్ అసిస్టెంట్ల పేర్లను చేర్చి ఇవాళ కౌన్సెలింగ్ నిర్వహించుకోవచ్చని సలహా ఇచ్చారు. దీంతో కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హెచ్ఎం కౌన్సెలింగ్ వాయిదా వేయడంతో ఫ్యాప్టో, జాక్టో ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు పరీక్షా భవన్‌కు చేరుకుని కౌన్సెలింగ్ హాల్లో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. చివరికి డీఈవో కలెక్టర్ కోన శశిధర్‌తో చర్చించి, గురువారం సాయంత్రం 4.00 గంటలకు యథావిధిగా కౌన్సెలింగ్ జరుపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ
- పీఆర్ డిప్లొమా ఇంజినీర్ల ఆవేదన - సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నపం కర్నూలు(అర్బన్): డిప్లొమా ఇంజినీర్లు ఏఈలుగా సర్వీసులో చేసి అదే పోస్టులో పదవీ విమరణ చేయాల్సిన దౌర్భాగ్యస్థితిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కే రవీంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే మోహన్, జీఎస్ గౌస్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని పీఆర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మొత్తం 489 డిప్యూటీ ఈఈ పోస్టుల్లో 1:3 నిష్పత్తి ప్రకారం డిప్లొమా ఇంజినీర్లు 122 మంది ఉండాలన్నారు. ప్రస్తుతం 48 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. ఈఈ ప్రమోషన్ చానల్‌ను కూడా ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించిందన్నారు. 58 ఈఈ పోస్టుల్లో 1:3 నిష్పత్తి ప్రకారం 14 మంది డిప్లొమా ఈఈలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్కరు కూడా లేక పోవడం దారుణమన్నారు. అనేక మంది ఏఈలకు సీనియారిటీ జాబితా లేదని, సర్వీస్ రెగ్యులరైజేషన్, ప్రొబేషన్, అటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేళ్ళ వర్తింపు, టీఏ బిల్లులు నెలనెలా రాకపోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. విజయవాడలో 40వ వార్షికోత్సవం... ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు విజయవాడలోని బెంజి సర్కిల్ జ్యోతి కన్వెన్షన్‌లో సంఘం 40వ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు జిలానీబాషా, మాధవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బాహుబలి ప్రమోషన్లో రానా, ప్రభాస్ కుస్తీ
చండీగడ్: ప్రతిష్టాత్మక బాహుబలి మూవీలో నటించిన ప్రత్యర్థులు మరోసారి పోటీకి తలపడ్డారు. ఈ చిత్రం మొదటి భాగంలో పోటాపోటీ నటనతో ఆకట్టుకున్న యంగ్ హీరోలు ప్రభాస్, రానా టేబుల్‌పై చేతులతో బలంగా ఓ పట్టు పట్టడం ఆసక్తికరంగా నిలిచింది. అయితే మాహిష్మతి సామ్రాజ్యంపై ఆధిపత్యం కోసం రీల్ లైఫ్‌లో హోరా హోరగా తలపడిన వీరిద్దరూ తాజాగా రియల్ లైఫ్ లో సరదాగా పోటీ పడ్డారు. బాహుబలి సిరీస్ లో రెండవ భాగం బాహుబలి ద కన్‌క్లూజన్ ప్రమోషన్ లో భాగంగా బల్లాలదేవ, బాహుబలి హల్ చల్ చేశారు. ఇలా ఓ పట్టుపట్టి అక్కడున్న వారిని అలరించారు. హ్యాండ్ సమ్ లుక్ లో అదరగొడుతున్న తమ అభిమాన హీరోలు చేసిన సందడితో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్ చండీగడ్‌లో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని బల్లాలదేవ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. బాహుబలి 2రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'బాహుబలి-ది కన్‌క్లూజన్ ' ఏప్రిల్ నెల 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను పలకరించనుంది. అయితేఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరో మద్రాస్ హైకోర్టులో ఈ సినిమా రిలీజ్ నిలిపి వేయాలని కొన్ని కన్నడ సంఘాలు పిటీషన్ దాఖలు చేశాయి. అంతేకాదు కర్నాటకలో సినిమా విడుదల అడ్డుకుంటామంటూ ఏప్రిల్ 28న బెంగుళూరు బందుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. #Prabas and I in the University of Chandigarh promoting and celebrating #BaahubaliTheConclusion pic.twitter.com/sFDoyhKJLo — Rana Daggubati (@RanaDaggubati) April 14, 2017 -
డీఈఓకు పదోన్నతి కల్పిస్తూ జీఓ జారీ
కర్నూలు(సిటీ): ప్రభుత్వ బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేస్తూ, డీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కె.రవీంద్రనాథ్‌రెడ్డికి పదోన్నతి కల్పిస్తూ విద్యాశాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాసు జీఓ ఆర్టీ నెం.23 జారీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయనకు ఒకేషనల్ విద్య జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ అమరావతికి బదిలీ చేశారు. డీఈఓ ఇన్చార్జి బాధ్యతలను ఇతరులకు అప్పగించేందుకు కలెక్టర్ సుముఖంగా లేకపోవడంతో జేడీగా బాధ్యతలు తీసుకున్నా పదో తరగతి పరీక్షలు ముగిసే వరకు డీఈఓగా రవీంద్రనాథ్‌రెడ్డినే కొనసాగించేందుకు కలెక్టర్ ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతి కోరనున్నట్లు తెలిసింది. -
8 మంది డీటీలకు పదోన్నతి
కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూ శాఖలో 8 మంది డిప్యూటీ తహశీల్దార్లకు (డీటీలకు) పదోన్నతులు ఖరారయ్యాయి. ఈ మేరకు విజయవాడలోని సీసీఎల్ఏ కార్యాలయంలో జరిగిన డీపీసీ ఆమోదం తెలిపింది. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నేతలు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్లకు జోనల్ పరిధిలో పదోన్నతులు కల్పిస్తారు. జిల్లాలో 8 మందిలో 7 మందిని తహసీల్దార్లుగా కర్నూలు జిల్లాకు కేటాయించారు. ఒకరు మాత్రం వైఎస్ఆర్ జిల్లాకు అలాట్ అయినట్లుగా అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు. పదోన్నతులు పొందిన వారిలో కలెక్టరేట్లోని బి.సెక్షన్ సూపరింటెండెంటు వెంకటేశ్వర్లు, వసుంధర (జిఎన్ఎస్ఎస్), లక్ష్మీదేవి(డీఎస్ఓ), యూనస్‌బాషా ( నంద్యాల టిజిపి), తిరపతిసాయి (కర్నూలు ఆర్డీఓ ఆఫీసు), సుబ్రమణ్యం (లీగల్‌సెల్), నాగమునీశ్వరప్రసాద్ (డీటి బనగానపల్లి), శేషారాంసింగ్( వెల్దుర్తి)లు ఉన్నారు. శేషారాంసింగ్ మాత్రం వైఎస్ఆర్ జిల్లాకు అలాట్ అయ్యారు. రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కృషి వల్లే ఏడుగురు జిల్లాకే అలాట్ అయినట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్‌బాబు, గిరికుమార్రెడ్డిలు తెలిపారు. -
పదోన్నతుల కోసం ఉపాధ్యాయుల ఎదురుచూపు
- ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలి - ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సర్వీస్ రూల్స్ లేకపోవడంతో వేల మంది ఉపాధ్యాయులు పదోన్నోతుల కోసం ఎదురు చూస్తున్నారని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌బాబు అన్నారు. శుక్రవారం ఎస్టీయూ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీసీఈ పద్ధతి సాకుతో 5 శాతం సమ్మేటివ్ పరీక్షల మూల్యాంకనాన్ని పరిశీలించడం తగదన్నారు. గురుకులాలు, ఎయిడెడ్, మోడల్ స్కూల్ టీచర్లందరికీ ఆరోగ్య కార్డులను అందజేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ టీచర్లకు ప్రతి నెలా ఒకటో తేదీ జీతాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వాణి ఎడిటర్ అప్పారావు, రాష్ట్ర కార్యదర్శి జానీ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఇ.సమ్మూర్తి, రాష్ట్ర కార్యదర్శి ఎంఎండీ షఫీ, సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాదరెడ్డి, తిమ్మన్న పాల్గొన్నారు. కేవీఆర్ స్థలానికి రక్షణ కల్పించాలి కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలానికి రక్షణ కల్పించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ప్రహరీని నిర్మించి బాలికలకు రక్షణ కల్పించాలని కోరారు. శుక్రవారం కాంపౌండ్‌వాల్ నిర్మాణాన్ని చేపట్టాలని ధర్నా చేస్తున్న విద్యార్థినులకు ఆయన తన మద్దతును ప్రకటించారు. -
43 మందికి ఏఎస్ఐలుగా పదోన్నతి
గుంటూరు : గుంటూరు రూరల్, అర్బన్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న 43 మంది హెడ్‌కానిస్టేబుళ్ళకు ఏఎస్ఐగా పదోన్నతి కల్పిస్తూ రేంజ్ ఐజి ఎన్ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్, అర్బన్ జిల్లాల పరిధిలో హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ఎం.బ్రహ్మయ్య, జి. సుబ్బారావు, పి. కోటేశ్వరరావు, బీఆర్ కోటేశ్వరరావు, ఏ. వెంకటేశ్వర్లు, షేక్ సుభాని, టీఎస్ బెనర్జీ, ఎండీ మస్తాన్‌రావు, జె. భాస్కరరావు, ఎండీ సుభాని, పీడీ ప్రసాద్, సయ్యద్ ఇబ్రహీం, జి. మీరావలి, టి నరేంద్రకుమార్, షేక్ బాబావలి, షేక్ బురాన్షరీఫ్, కె. విజయ్‌కుమార్, ఎం. వెంకటేశ్వరరావు, డి. శ్రీరాములు, వై. సుబ్బరాజు, టీఏ శ్రీనివాస్, సీహెచ్ రామకృష్ణ, ఎండీ ఉస్మాన్, జి. శివరామారావు, సీహెచ్ రామ్మోహనరావు, షేక్ ఉమర్, హెచ్ రెహమాన్, వీవీ రమణరావు, జె.వెంకటేశ్వర్లు, ఎండీ గౌస్, టీవీ నరసింహారావు, కె.మోహన్‌రావు, కె. శ్రీహరిరావు, ఎన్.పోల్సు, కేవీ సత్యనారాయణ, పి.ప్రసాద్, జీవీ కుమార్, వీఎన్ మల్లేశ్వరరావు, బి గోవర్దన్‌రెడ్డి, సాంబశివరావు, పోలేరయ్య, కే సుభాషిణిలకు పదోన్నతి లభించింది. ఈ మేరకు పోలీసు రూరల్ అసోసియేషన్ నేతలు ఐజీ సంజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
కార్మిక శాఖ డీసీగా మల్లేశ్వరకుమార్
కర్నూలు(రాజ్‌విహార్): కార్మిక శాఖ కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్(డీసీఎల్)గా యు.మల్లేశ్వర కుమార్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు డీసీఎల్‌గా పదోన్నతి కల్పించి ఇక్కడికి బదిలీ చేస్తూ కార్మిక శాఖ కమిషనర్ వరప్రసాద్ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ డీసీఎల్‌గా విధులు నిర్వహించిన సయ్యద్ సర్దార్ సాహెబ్ అఖిల్ గత రెండు నెలల కిత్రం పదవీ విరమణ పొందడంతో జేసీఎల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ అప్పటి నుంచి ఇన్చార్జీ బాధ్యతలు నిర్వహించారు. గుంటూరుకు చెందిన మల్లేశరకుమార్ 1997లో గ్రూప్–2 ద్వారా ఏఎల్‌ఓగా ఎంపికై కార్మిక శాఖలో చేరి కంభం, పిడుగురాళ్ల, ఒంగోలు, గుంటూరు, చిలకలూరిపేటలో పనిచేశారు. 2008లో పదోన్నతి రావడంతో గుంటూరు ఏసీఎల్‌గా పనిచేస్తూనే ముడు నెలల పాటు కడప డీసీఎల్‌గా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించారు. కార్మికుల సంక్షేమానికి కషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన డీసీఎల్‌కు ఏసీఎల్‌లు శేషగిరిరావు, శ్రీనివాసులు, రఘురాములు, ఆత్మకూరు ఏఎల్ఓ హేమాచారి తదితరులు అభినందలు తెలిపారు. -
టీచర్ల పదోన్నతులకు సర్వం సిద్ధం!
– 185 మందికి పదోన్నతులు – త్రిసభ్య కమిటీ ఆమోదమే తరువాయి – ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తెలుసుకున్న డీఈఓ ఉపాధ్యాయుల పదోన్నతులకు సర్వం సిద్ధమైంది. మొత్తం 185 మంది ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్)లకు పదోన్నతులు లభిస్తాయి. ఇందులో 93 స్కూల్ అసిస్టెంట్లు, 92 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు నేడో, రేపో కలెక్టర్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఆమోదానికి పదోన్నతుల ఫైల్ పంపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మరోవైపు పదోన్నతులపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని శనివారం డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించారు. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో 2931 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో దాదాపుగా 12 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం పదవి విరమణ వయస్సును రెండేళ్లు అదనంగా పెంచడంతో గత రెండేళ్లుగా పదోన్నతులకు బ్రేక్ పడింది. అంతకుముందు నెలనెలా పదోన్నతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు ఉపాధ్యాయులు పదవి విరమణ చేయడం, ఖాళీగా ఉన్న పోస్టుల్లో 70 శాతం పదోన్నతులతో భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో జిల్లాలో మొత్తం 185 మంది ఎస్జీటీలకు పదోన్నతులు లభించే అవకాశం ఏర్పడింది. ఇందులో 93 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా, 92 మందికి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి లభిస్తుంది. త్రిసభ్య కమిటీ ఆమోదానికి పదోన్నతుల ఫైల్ పదోన్నతుల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఊరట లభించింది. నేడో రేపో పదోన్నతుల ఫైల్‌ను కలెక్టర్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఆమోదానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్రిసభ్య కమిటీలో కలెక్టర్, జెడ్పీ చైర్మన్, డీఈఓ సభ్యులుగా ఉంటారు. వారు ఆమోదం తెలిపితే సెప్టెంబర్ 6, 7 తేదీల్లో పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహణ జరిగే అవకాశం ఉంది. ఆర్జేడీకి హెచ్ఎంల పదోన్నతుల ఫైల్ మరోవైపు ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు ఆర్జేడీ ఆమోదం తెలపాలి. ఇందుకు సంబంధించిన ఫైల్ ఒకటి రెండు రోజుల్లో ఆర్జేడీ వద్దకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు డీఈఓ నుంచి హెచ్ఎంల పదోన్నతి ఫైల్ వస్తే ఆమోదం తెలుపుతానని శనివారం కర్నూలుకు వచ్చిన ఆర్జేడీ ప్రేమానందం వివరించారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను సేకరించిన డీఈఓ ఇప్పటికే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను డీఈఓ బ్లాగ్‌లో ఉంచారు. విభాగాలు, సబ్జెక్టు వారీగా సీనియారిటీ జాబితా అందులో ఉంది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి శనివారం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఎస్ఎస్ఏ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ముఖ్యంగా అర్ఎంఎస్ఏ ప్రధానోపాధ్యాయుల పోస్టులపై నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని సంఘాల నాయకులు కోరారు. అందుకు డీఈఓ స్పందిస్తూ జిల్లాకు మంజూరైన 28 ఆర్‌ఎంఎస్‌ఏ హెచ్ఎం పోస్టులను రద్దు చేయడానికి కోర్టుకు వెళ్లుతామని, అంతవరకు తాత్కాలికంగా 28లో ఎలాంటి అభ్యంతరాలు లేని మూడు పోస్టులను కలుపుకుని పదోన్నతులుSకల్పిస్తామని వివరించారు. ఇందుకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా సమ్మతించారు. సబ్జెక్టుల వారీగా పదోన్నతులు కల్పించే పోస్టులు కేటగిరి మీడియం జెడ్పీ గవర్నమెంట్ మొత్తం ఎస్ఏ( ఇంగ్లిషు) తెలుగు 10 04 14 ఎస్ఏ(సోషల్) తెలుగు 23 04 27 ఎస్ఏ బయోసైన్స్ తెలుగు 07 02 09 ఎస్ఏ బయోసైన్స్ కన్నడ 02 02 ఎస్ఏ మ్యాథ్్స తెలుగు 11 04 15 ఎస్ఏ మ్యాథ్్స ఉర్దూ 0 05 05 ఎస్ఏ ఫిజికల్ సైన్స్తెలుగు 09 05 14 ఎస్ఏ పీడీ తెలుగు 0 01 01 ఎస్ఏ తెలుగు తెలుగు 05 01 06 ఎస్ఏ హిందీ తెలుగు 03 0 03 పీఎస్‌హెచ్‌ఎం తెలుగు 75 00 75 పీఎస్‌హెచ్‌ఎం కన్నడ 02 00 02 హెచ్ఎస్ హెచ్ఎం తెలుగు 15 మొత్తం 147 29 185 6, 7 తేదీల్లో కౌన్సెలింగ్ : రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈఓ సెప్టెంబర్ 6, 7 తేదీల్లో పదోన్నతులకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. త్రిసభ్య కమిటీ ఆమోదం ఈ నెలలో తెలిపితే ఇదే నెలలో జరుపుతాం. వచ్చే నెలలో ఆమోదం లభిస్తే 5న టీచర్స్ డే వేడుకలు ఉంటుండడంతో ఆరు, ఏడు తేదీల్లో జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. -
ఎస్ఏ పదోన్నతుల జాబితా సిద్ధం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సెకండరీ గ్రేడు టీచర్లుగా పనిచేస్తూ స్కూల్ అసిసెంట్ల పదోన్నతులకు అర్హత సాధించిన ఉపాధ్యాయుల తాత్కాలిక జాబితాను డీఈఓ బ్లాగ్‌లో ఉంచినట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలోని టీచర్ల సీనియారిటీపై అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో ఈనెల 5వ తేదీలోపు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలన్నారు. డీసీఈబీ కాంట్రిబ్యూషన్ చెల్లింపు గడువు పొడిగింపు అన్ని యాజమాన్యాల హైస్కూల్స్ విద్యార్థులకు సంబంధించి 2016–17 విద్యాసంవత్సరంలో పరీక్షల కాంట్రిబ్యూషన్ ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు డీసీఈబీ కార్యదర్శి ఓంకార్‌యాదవ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు డీసీఈబీ ఆన్లైన్ అకౌంట్లో ఫీజును చెల్లించవచ్చన్నారు. -
‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’కు డాక్టర్ ఆర్థో ప్రమోషన్..!
సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రానికి కో-ప్రమోటర్‌గా వ్యవహరించనున్నట్లు ప్రముఖ నొప్పి నివారిణి డాక్టర్ ఆర్థో ఉత్పత్తి సంస్థ- ఎస్బీఎస్ బయోటెక్ ప్రకటించింది. కుటుంబం మొత్తం ఐకమత్యంగా మెలగడానికి, సుఖ సంతోషాలతో జీవించడానికి చిత్రంలో కథానాయకుడు చేసే ప్రయత్నానికి సంబంధించిన కథాంశం సంస్థను ఆకర్షించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే స్ఫూర్తితో డాక్టర్ ఆర్థో కూడా పలు వయస్సుల వారికి వచ్చే నొప్పులను దూరం చేస్తూ... వారి సుఖ సంతోషాలకు పాటు పడుతోందని పేర్కొంది. ఎనిమిది రకాల సమర్థవంతమైన మూలికలతో కూడిన ఔషధం ద్వారా... నాసి రకం మందులు మనుషులపై ప్రభావం చూపకుండా తన వంతు కృషి చేస్తోందని వివరించింది. -
షీనా బోరా కేసు దర్యాప్తులో కీలక పరిణామం
-
షీనా బోరా కేసు దర్యాప్తులో కీలక పరిణామం
హత్య జరిగిన తీరేకాదు.. దర్యాప్తు జరుగుతున్న తీరులోనూ సంచలనాలు సృష్టిస్తోన్న షీనా బోరా కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు ప్రభుత్వం ఉన్నపళంగా పదోన్నతి కల్పించింది. మారియాను హోం గార్డ్స్ డీజీగా నియమిస్తూ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. భారీ ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్న నేపథ్యంలో మారియా బదిలీపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అవన్నీ ఊహాగానాలేనని, సాధారణ ప్రమోషన్లలో భాగంగానే మారియా డీజీగా నియమితులయ్యారని ముంబై పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే విషయంపై మహారాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కేపీ బక్షి మాట్లాడుతూ.. రాకేశ్ మారియా బదిలీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అహ్మద్ జావేద్‌ను ముంబై నగర నూతన కమిషనర్‌గా నియమించినట్లు, తక్షణమే ఈ నియమకాలు అమలులోకి రానున్నట్లు చెప్పారు. అయితే కొత్త కమిషనరే షీనా హత్య కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తారా? లేక ఏసీపీ స్థాయి అధికారులతోనే దర్యాప్తును ముగించేస్తారా? అనే విషయాలపై స్పష్టత రాలేదులేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.