కార్మిక శాఖ డీసీగా మల్లేశ్వరకుమార్‌ | malleswarkumar as labour department dc | Sakshi
Sakshi News home page

కార్మిక శాఖ డీసీగా మల్లేశ్వరకుమార్‌

Published Thu, Sep 29 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

malleswarkumar as labour department dc

కర్నూలు(రాజ్‌విహార్‌): కార్మిక శాఖ కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్‌(డీసీఎల్‌)గా యు.మల్లేశ్వర కుమార్‌ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లాలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు డీసీఎల్‌గా పదోన్నతి కల్పించి ఇక్కడికి బదిలీ చేస్తూ కార్మిక శాఖ కమిషనర్‌ వరప్రసాద్‌ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ డీసీఎల్‌గా విధులు నిర్వహించిన సయ్యద్‌ సర్దార్‌ సాహెబ్‌ అఖిల్‌ గత రెండు నెలల కిత్రం పదవీ విరమణ పొందడంతో జేసీఎల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ అప్పటి నుంచి ఇన్‌చార్జీ బాధ్యతలు నిర్వహించారు. గుంటూరుకు చెందిన మల్లేశరకుమార్‌ 1997లో గ్రూప్‌–2 ద్వారా ఏఎల్‌ఓగా ఎంపికై కార్మిక శాఖలో చేరి కంభం, పిడుగురాళ్ల, ఒంగోలు, గుంటూరు, చిలకలూరిపేటలో పనిచేశారు. 2008లో పదోన్నతి రావడంతో గుంటూరు ఏసీఎల్‌గా పనిచేస్తూనే ముడు నెలల పాటు కడప డీసీఎల్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించారు. కార్మికుల సంక్షేమానికి కషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన డీసీఎల్‌కు ఏసీఎల్‌లు శేషగిరిరావు, శ్రీనివాసులు, రఘురాములు, ఆత్మకూరు ఏఎల్‌ఓ హేమాచారి తదితరులు అభినందలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement