labour department
-
ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో కార్మిక శాఖ అధికారుల విచారణ
కర్ణాటక కార్మిక శాఖ అధికారులు బెంగళూరు, మైసూరులోని ఇన్ఫోసిస్(Infosys) క్యాంపస్‌లను సందర్శించారు. ఇటీవల కంపెనీ ఉద్యోగులను భారీగా తొలగించిందనే ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. రెండున్నరేళ్ల క్రితం నియమితులైన సుమారు 700 మంది ట్రెయినీలను ఇన్ఫోసిస్ తొలగించిందని ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) ఆరోపించింది. అయితే, సంస్థ మూడుసార్లు నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలో సదరు ఉద్యోగులు ఉత్తీర్ణత సాధించలేదని ఇన్ఫోసిస్ తెలిపింది. దాంతో నిబంధనలకు అనుగుణంగానే వారు రాజీనామా చేసినట్లు చెప్పింది. ఈ ఉద్యోగుల సంఖ్య కూడా 350 మాత్రేమేనని కంపెనీ వాదిస్తోంది.ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, తదనుగుణంగా ఫిర్యాదుదారులకు వివరాలు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కర్ణాటక రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దాంతో ఇటీవల అధికారులు స్థానిక క్యాంపస్‌లను సందర్శించి విచారణ జరిపారు.స్నేహపూర్వక విధానాలు..కంపెనీపై వస్తోన్న ఆరోపణలకు ప్రతిస్పందనగా ఇన్ఫోసిస్ ఉద్యోగుల స్నేహపూర్వక విధానాలకు కట్టుబడి ఉందని నొక్కి చెప్పింది. నియామక ఒప్పందాలకు అనుగుణంగానే తొలగింపులు జరిగాయని కంపెనీ పేర్కొంది. ఉద్యోగులు కంపెనీకి అవసరమైన నైపుణ్యాలు, ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైతే కలిగే పరిణామాలపై స్పష్టమైన మార్గదర్శకాలున్నట్లు చెప్పింది. దానివల్లే కొందరికి లేఆఫ్స్ అనివార్యం అయ్యాయని స్పష్టం చేసింది. తమ ఉద్యోగుల నైపుణ్యాలు, పనితీరును నిర్ధారించడానికి ఈ చర్యలు ఎప్పటినుంచో అమల్లో ఉన్నాయని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: శ్రీలంక పవర్ ప్రాజెక్టుల నుంచి అదానీ బయటకుస్పష్టత కోసం ఎదురుచూపులుఈ నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేయడం, ఇన్ఫోసిస్ అమలు చేస్తున్న చర్యలు కార్మిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం కర్ణాటక కార్మిక శాఖ దర్యాప్తు లక్ష్యం. దర్యాప్తు కొనసాగుతుండటంతో ఇన్ఫోసిస్ బాధిత ఉద్యోగులు ఈ విషయంపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ పరిశ్రమలో ఉద్యోగుల సంక్షేమం-కార్పొరేట్ విధానాలను సమతుల్యం చేయడంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
సులభంగా ఈపీఎఫ్‌వో క్లెయిమ్‌ల పరిష్కారం: మాండవీయ
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి క్లెయిమ్‌ల పరిష్కారాన్ని మరింత సులభంగా మార్చాలంటూ అధికారులకు కేంద్ర మంత్రి మనుసుఖ్ మాండవీయ ఆదేశించారు. సకాలంలో ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని, ప్రజలతో స్నేహపూర్వక విధానాన్ని అనుసరించాలని కోరారు. ఈపీఎఫ్‌వో ప్రాంతీయ అధికారుల పనితీరు సమీక్ష కోసం మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పై ఆదేశాలు జారీ చేశారు. క్లెయిమ్ దరఖాస్తు తిరస్కారాలను తగ్గించడం, పరిష్కార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం, యూనివర్సల్ అకౌంట్ నంబర్ల (యూఏఎన్) యాక్టివేషన్, అధిక వేతనాలపై పెన్షన్ అమలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు కార్మిక శాఖ ప్రకటించింది. సేవల మెరుగునకు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రికి అధికారులు వివరించారు. అధిక వేతనాలపై పింఛను, పిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోరారు. జోనల్, రీజినల్ కార్యాలయాలు సేవల పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. -
ఏ బ్యాంక్‌లో అయినా ఈపీఎఫ్ పెన్షన్
న్యూఢిల్లీ: ‘ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్), 1995’ సభ్యులకు శుభవార్త. 68 లక్షల పెన్షనర్లు ఇక మీదట ఏ బ్యాంక్‌లో అయినా పెన్షన్ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అన్ని ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ (సీపీపీఎస్)ను అమల్లోకి తీసుకువచ్చినట్టు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న పింఛను పంపిణీ వ్యవస్థ కేంద్రీకృతమై లేదు. ప్రతి జోనల్/ప్రాంతీయ కార్యాలయ పరిధిలో సభ్యులకు పింఛను పంపిణీకి వీలుగా 3–4 బ్యాంకులతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చేది. సీపీపీఎస్ కింద లబ్ధిదారు ఏ బ్యాంకు నుంచి అయినా పెన్షన్ తీసుకోవచ్చని, పెన్షన్ ప్రారంభంలో ధ్రువీకరణ కోసం బ్యాంక్‌ను సందర్శించాల్సిన అవసరం ఉండదని కార్మిక శాఖ తెలిపింది. పెన్షన్‌ను మంజూరు చేసిన వెంటనే బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని పేర్కొంది. పెన్షనర్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలివెళ్లినప్పటికీ, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీవో)ను ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్‌కు బదిలీ చేసుకోవాల్సిన అవసరం తప్పుతుందని వివరించింది. రిటైర్మెంట్ అనంతరం తమ స్వస్థలాలకు వెళ్లి స్థిరపడే పింఛనుదారులకు నూతన వ్యవస్థతో ఇబ్బందులు తొలగిపోనున్నాయి. సీపీపీఎస్‌ను అన్ని ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయ పరిధిలో పూర్తి స్థాయిలో అమలు చేయడాన్ని చారిత్రక మైలురాయిగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వ్యాఖ్యానించారు. -
కార్మికా.. మేలుకో
రోజంతా రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ కుటుంబాలవి. చేతినిండా పని దొరికితేనే కడుపు నిండేది. లేకపోతే పస్తులు ఉండాల్సి వస్తుంది. భవన నిర్మాణ రంగంలో పని చేసే దినసరి కార్మికుల పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ క్రమంలోనే వారి సంక్షేమం కోసం కార్మిక శాఖ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అయితే, ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలంటే రిజిస్ట్రేషన్ కార్డు అవసరం ఉంటుంది. ఇందులో సభ్యుడిగా చేరడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ కార్డును ఎలా తీసుకోవాలి? ఇందువల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. కడప కోటిరెడ్డిసర్కిల్: భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. రిజి్రస్టేషన్ చేసుకున్న కార్మికులకు సంబంధించి కడప నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా 3,65,648 మందికి పైగా కార్మికులు ఉన్నారు. అయితే గుర్తింపు కార్డు పొందని కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ రంగంతోపాటు పెయింటర్లు, కార్పెంటర్లు, ఫ్లంబర్లుగా అనేక మంది పని చేస్తున్నారు. ప్రస్తుతం కార్మికులు రోజూ పని కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కడప నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఉదయం జెడ్పీ కార్యాలయం, అప్సర సర్కిల్లోని అడ్డాలకు చేరుకుని వేచి చూస్తుంటారు. కొందరికి పని దొరకుతున్నా, మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. అవగాహన లేమితో నష్టపోతున్న వైనం కార్మికులకు అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది గుర్తింపు కార్డులు పొందలేకపోతున్నారు. కార్డులు కలిగిన కార్మికులకు నైపుణ్యం పెంచుకునేందుకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, శిక్షణ కాలంలో రూ.300 స్టయిఫండ్ ఇస్తారు. అలాగే 60 ఏళ్లు దాటిన కార్మికులకు రూ.1000–5000 పెన్షన్ అందజేస్తారు. కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వివాహాలకు నగదు అందిస్తారు. భవన యజమానులు నిర్మాణ రిజిస్ట్రేషన్ చేసి.. పని చేసే కార్మికుల పేరిట ఒక శాతం కార్మిక శాఖకు సెస్ చెల్లించాలి. వీటిపై అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారు. ఈ విషయాలపై అధికారులు అవగాహన కల్పించి.. అన్ని పథకాలు అందేలా చూడాలని పలువురు కార్మికులు కోరుతున్నారు. వివిధ వృత్తుల్లో..భవన నిర్మాణ రంగానికి సంబంధించి పలు విభాగాల కార్మికులు పని చేస్తున్నారు. మట్టి పని, పునాది గుంతలు తీయడం, చదును, తాపీ మేస్త్రీ, కూలీలు, రాడ్‌బెండింగ్, కార్పెంటర్లు, పెయింటర్లు, సెంట్రింగ్, ఫ్లంబర్లు, ఎల్రక్టీíÙయన్లు, పాలీష్ వేసే వారు ఉన్నారు. సీలింగ్, కంకర కార్మికులు, రోడ్డు నిర్మాణ కూలీలు, క్రేన్, పొక్లెయినర్ ఆపరేటర్లు తమ పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. చెరువులు తవ్వడం, పూడిక తీయడం, బోర్‌వెల్స్, సిమెంటు ఇటుకలు తయారు చేసే వారు ఇదే రంగంపై ఆధారపడి ఉన్నారు. వీరికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతోపాటు పని భద్రత కల్పించాలి. గుర్తింపు కార్డులు పొందాలంటే కార్మిక శాఖ కార్యాలయంలో ఆధార్, రెండు ఫొటోలు, నామిని ఆధార్ కార్డుతోపాటు రూ.50 సభ్యత్వ రుసుం చెల్లించాలి. -
ఏపీ కార్మికశాఖ ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ కు కారు ప్రమాదం...
-
కొత్తగా 18.86 లక్షల మందికి ఈఎస్ఐ.. ఆసక్తికర అంశం ఏంటంటే..
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ESIC ) కిందకు డిసెంబర్ నెలలో 18.86 లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అదే నెలలో 23,347 సంస్థలు ఈఎస్ఐసీ కింద నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభింనట్లుగా తెలుస్తోంది. కొత్త సభ్యుల్లో 8.83 లక్షల మంది (47 శాతం) వయసు 25 ఏళ్లలోపే ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక నికరంగా నమోదైన మహిళా సభ్యుల సంఖ్య 3.59 లక్షలుగా ఉంది. అలాగే, డిసెంబర్లో 47 ట్రాన్స్జెండర్లకు సైతం ఉద్యోగ అవకాశాలు లభించాయి. సమాజంలోని ప్రతివర్గానికీ ప్రయోజనాలు అందించేందుకు ఈఎస్ఐసీ కట్టుబడి ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. కార్మిక శాఖ తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం.. ఈఎస్ఐసీ కింద అధికారిక ఉద్యోగ కల్పన నవంబర్‌లో 1.59 మిలియన్ల కొత్త ఉద్యోగులతో పోలిస్తే, డిసెంబర్లో నెలవారీగా 18.2 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో 17.8 లక్షల మంది, మేలో 20.2 లక్షల మంది, జూన్‌లో 20.2 లక్షల మంది, జూలైలో 19.8 లక్షలు, ఆగస్టులో 19.4 లక్షలు, సెప్టెంబర్‌లో 18.8 లక్షలు, అక్టోబర్‌లో 17.8 లక్షల మంది ఈఎస్ఐసీలో కొత్తగా చేరుతూ వచ్చారు. -
ఐటీ ఉద్యోగులకు బలవంతంగా బదిలీలు.. రంగంలోకి దిగిన కార్మిక శాఖ
చాలా కాలంగా వర్క్ ఫ్రం హోమ్ విధానానికి అలవాటు పడిన ఐటీ ఉద్యోగులను దాదాపుగా అన్ని కంపెనీలు ఆఫీసులకు పిలిపిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగులందరూ ఆఫీసుల బాట పట్టారు. అయితే ఇప్పుడు కొన్ని ఐటీ కంపెనీలు మరో ఝలక్ ఇస్తున్నాయి. ఉద్యోగులకు ముందస్తు సమాచారం లేకుండా రీలొకేట్ చేస్తున్నాయి. దీంతో కార్మిక శాఖ రంగంలోకి దిగింది. ఐటీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) దాఖలు చేసిన ఫిర్యాదుపై మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు నోటీసు జారీ చేసింది. ముందస్తు నోటీసు, సంప్రదింపులు లేకుండానే 2,000 మందికి పైగా ఉద్యోగులను టీసీఎస్ ఇతర నగరాలకు రీలొకేట్ అవ్వాలని బలవంతం చేసిందని యూనియన్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఈనెల 18న తమను కలవాలని టీసీఎస్ ప్రతినిధులను కార్మిక శాఖ ఆదేశించినట్లుగా తమకు లభించిన నోటీసును ఉటంకిస్తూ సీఎన్‌బీసీ టీవీ18 పేర్కొంది. టీసీఎస్ చర్యలపై దర్యాప్తు చేయాలని, అటువంటి అనైతిక పద్ధతుల నుంచి ఐటీ ఉద్యోగులను రక్షించాలని తాము కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను కోరినట్లు నైట్స్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలుజా ఒక ప్రకటనలో తెలిపారు. 2,000 మందికి పైగా నోటీసులు టీసీఎస్ వివిధ ప్రదేశాలలో 2,000 మందికి పైగా ఉద్యోగులకు రీలొకేషన్ నోటీసులు జారీ చేసిందని ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ తన ఫిర్యాదులో ఆరోపించింది. "టీసీఎస్ 2,000 మందికి పైగా ఉద్యోగులను ఎటువంటి నోటీసు, సంప్రదింపులు లేకుండా వివిధ నగరాలకు బలవంతంగా బదిలీ చేస్తోందని నైట్స్‌కి 180కి పైగా ఫిర్యాదులు అందాయి. ఈ చర్యలతో దీంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. బదిలీ ఆదేశాలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని కంపెనీ బెదిరిస్తోంది. ఈ బలవంతపు బదిలీల వల్ల ఉద్యోగులకు కలిగే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఒత్తిడి, ఆందోళనను కంపెనీ విస్మరిస్తోంది" అని హర్‌ప్రీత్ సింగ్ సలూజా పేర్కొన్నారు. ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్‌కు ముగింపు టీసీఎస్ ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్ విధానానికి ముగింపు పలికింది. ఉద్యోగులందరూ వారంలో ఐదు రోజులపాటు ఆఫీసులకు రావాల్సిందేనని గతేడాది అక్టోబర్ 1న అంతర్గత కమ్యూనికేషన్లో ఆదేశించింది. ప్రస్తుతం ఉద్యోగులు వారానికి మూడు రోజుల చొప్పున ఆఫీసులకు వెళ్లాల్సి ఉంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆవశ్యకతను టీసీఎస్ తమ 2023 వార్షిక నివేదికలో సైతం హైలైట్ చేసింది. ఇదీ చదవండి: కంపెనీ మారుతావా.. కట్టు రూ. 25 కోట్లు! కాగా టీసీఎస్ గతేడాది ఆగస్టు నెల చివరి నుంచే ఉద్యోగులకు రీలొకేషన్ నోటీసులు పంపుతున్నట్లు తెలుస్తోంది. అందులో కొత్త లొకేషన్లో చేరడానికి 2 వారాల సమయం ఇచ్చినట్లు చెబుతున్నారు. -
ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కంపెనీల ఆటలు ఇక సాగవు!
ఏకపక్ష తొలగింపులు, ఐడీ బ్లాక్ చేయడం, సామూహిక ఉపసంహరణ, లైంగిక వేధింపులు, అధిక పని గంటలు వంటి ఇబ్బందలు ఎదుర్కొంటున్న ఐటీ ఉద్యోగులకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ బాసటగా నిలిచింది. ఉద్యోగులను వేధించే ఐటీ కంపెనీల ఆట కట్టిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటీఈఎస్) రంగంలో కంపెనీలు ఉద్యోగుల పట్ల అనుచిత విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో వీటిని రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. చాలా ఐటీ కంపెనీల్లో ఏకపక్ష తొలగింపులు, ఐడీ బ్లాక్ చేయడం, సామూహిక ఉపసంహరణ, లైంగిక వేధింపులు, అధిక పని గంటల వంటి విషయాలు కార్మిక శాఖ దృష్టికి వచ్చాయని అదనపు లేబర్ కమిషనర్ డాక్టర్ జి.మంజునాథ్ తెలిపారు. వీటిలో కొన్నింటిని లేబర్, ఇండస్ట్రియల్ కోర్టులకు రిఫర్ చేసినట్లు చెప్పారు. ఇక మినహాయింపు లేదు! 'సన్‌రైజ్ ఇండస్ట్రీస్'గా పరిగణిస్తున్న ఐటీ కంపెనీలకు కర్ణాటక పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం-1946 నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా మినహాయింపు ఇస్తూ వస్తోంది. చివరిసారిగా 2019 మే 21న ఐదేళ్లపాటు ఈ మినహాయింపును పొడిగించింది. కానీ ఈసారి మినహాయింపును పొడిగించకుండా ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆయా కంపెనీలను శాఖ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కర్ణాటకలో మొత్తం 8,785 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 18 లక్షల మంది పనిచేస్తున్నారు. కోవిడ్ తర్వాత, కంపెనీల వేధింపులపై అనేక ఫిర్యాదులు డిపార్ట్మెంట్లో నమోదయ్యాయి. ఈ ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించడానికి, ఈ రంగంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించడానికి పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం-1946ని ఆయా కంపెనీలకు వర్తింపజేయడం అవసరమని అదనపు లేబర్ కమిషనర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: బెంగళూరులో యాక్సెంచర్ ఏఐ స్టూడియో.. ఏంటిది.. ఏం చేస్తుంది? -
ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా 16.82 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి సెప్టెంబర్ నెలలో కొత్తగా 16.82 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఇందుకు సంబంధించి గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే కొత్త సభ్యుల్లో 9 శాతానికి పైనే వృద్ధి నమోదైంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిస్లేనియస్ చట్టం కింద కొత్తగా 2,861 సంస్థలు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 16.82 లక్షల మంది కొత్త సభ్యుల్లో 9.34 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. అంటే వీరికి కొత్తగా ఉపాధి లభించింది. మిగిలిన సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారు కావడం గమనార్హం. ఇక కొత్త సభ్యుల్లో 18–21 ఏళ్ల వయసు నుంచి 2.94 లక్షల మంది, 21–25 ఏళ్ల వయసు నుంచి 2.54 లక్షల మంది ఉన్నారు. 25 ఏళ్ల వయసులోపు వారే 58.75 శాతంగా ఉన్నారు. ఈపీఎఫ్ కవరేజీ నుంచి వైదొలిగే సభ్యుల సంఖ్య గడిచిన మూడు నెలల్లో క్రమంగా తగ్గుతూ వస్తోంది. నెలవారీగా చూస్తే సెప్టెంబర్‌లో ఇలా ఈపీఎఫ్‌వో నుంచి వెళ్లిపోయిన వారు 9.65 శాతం తక్కువగా ఉన్నారు. సెప్టెంబర్ నెలలో చేరిన మహిళలు 3.50 లక్షల మంది (26.36 వాతం)గా ఉన్నారు. వార్షికంగా చూస్తే 7 శాతం వృద్ధి నమోదైంది. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది చేరారు. -
తగ్గేదేలే అంటున్న ఇన్ఫోసిస్.. ఏం జరగబోతోంది?
నాన్ కాంపిట్ అగ్రిమెంట్ వివాదంపై ఇన్ఫోసిస్ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇన్ఫోసిస్ కొత్తగా అమల్లోకి తెచ్చిన నాన్ కాపింట్ అగ్రిమెంట్ సరికాదంటూ ఇప్పటికే నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (నాసెంట్) కార్మికశాఖను ఆశ్రయించింది. దీనిపై కార్మిక శాఖకు ఇన్ఫోసిస్ తరఫున హెచ్ఆర్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ కే నారాయణ్ రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు జాతీయ మీడియాలో ప్రచురితం అయ్యాయి. ఇది చాలా కామన్ కార్మిక శాఖకు ఇన్ఫోసిస్ తెలిపిన వివరాల ప్రకారం... తమ సంస్థలో రాజీనామా చేసిన ఉద్యోగి పోటీ సంస్థల్లో ఏడాది పాటు ఉద్యోగంలో చేరకూడదనే నిబంధన కొత్తదేమీ కాదని ఇన్ఫోసిస్ తెలిపింది. ఈ నిబంధనను ‘కామన్ అండ్ స్టాండర్డ్ బిజినెస్ ప్రాక్టీస్’గా ఆ సంస్థ పేర్కొంది. ఇన్ఫోసిస్ వంటి సంస్థలు చాలా పెద్ద పెద్ద కంపెనీలకు సర్వీసులు అందిస్తుంటాయి. ఈ సందర్భంగా ఆయా కంపెనీలకు చెందిన రహస్య సమాచారం ఇన్ఫోసిస్‌కు అందుతుంది. సేవలు అందించే క్రమంలో ఈ సున్నితమైన, రహస్య సమాచారాన్ని ఉద్యోగులతో కూడా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ఫోసిస్ తెలిపింది. అంత ముప్పేమీ లేదు తమ క్లంయింట్లకు సంబంధించిన సున్నిత, రహస్య సమాచారం తెలుసుకున్న ఉద్యోగులు పోటీ కంపెనీలో చేరినప్పుడు విలువైన సమాచారాన్ని ఇతరులకు చేరవేసే ప్రమాదం ఉంటుందని ఇన్ఫోసిస్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ క్లంయిట్ల శ్రేయస్సు, నాణ్యమైన సేవలు అందివ్వడంలో భాగంగానే నాన్ కాంపిట్ అగ్రిమెంట్‌ను అమల్లోకి తెచ్చినట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. పోటీ కంపెనీల్లో పని చేయకూడదనే నిబంధన కొంత కాలానికే పరిమితం అయినందున ఉద్యోగుల భవిష్యత్తుకు వచ్చే పెను ప్రమాదమేమీ ఉండబోదని అభిప్రాయపడింది. పరిష్కారం ఎలా? నాన్ కాంపిట్ అగ్రిమెంట్‌పై ఇన్ఫోసిస్ నుంచి అందిన సమాచారంపై ఇంకా కార్మిఖ శాఖ (పూణే) ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. ఇన్ఫోసిస్ తెలిపిన అభిప్రాయాలు, నాసెంట్ ప్రతినిధులు వెలిబుచ్చిన ఆందోళనల పట్ల నిపుణులతో చర్చలు జరుపుతోంది. ఇటు ఉద్యోగులు అటు కార్పోరేట్ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే పనిలో ఉంది. త్వరలోనే ఈ నాన్ కాంపిట్ అగ్రిమెంట్‌పై కార్మిక శాఖ తన వైఖరి ఏంటో చెప్పనుంది. చదవండి: నాన్ కాంపిట్ అగ్రిమెంట్.. ముచ్చటగా మూడోసారి -
USA: సీమా నందా నియామకానికి సెనేట్ ఆమోదం
వాషింగ్టన్ : అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయ సంతతి మహిళకి చోటు లభించింది. కార్మిక శాఖ సొలిసిటర్గా భారత సంతతికి చెందిన పౌరహక్కుల న్యాయవాది సీమా నందా నియామకానికి అమెరికన్ సెనేట్ ఆమోద ముద్ర వేసింది. 48 ఏళ్ల వయసున్న సీమా నందా డెమొక్రాటిక్ నేషనల్ కమిటీకి సీఈఓగా కూడా పని చేశారు. ఒబామా హయాంలో కార్మిక శాఖకి సేవలు అందించారు. కాగా నందా నియామకాన్ని సెనేట్ 53–46 ఓట్లతో ఆమోదించింది. సీమా నందా నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కరోనా ముప్పు, వాతావరణంలో మార్పులతో యాజమాన్యాలు, కార్మికులు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొం టున్న తరుణంలో కార్మిక శాఖ సొలిసిటర్గా ఆమె నియామకం అత్యంత కీలకంగా మారింది. -
వాళ్ల విషయంలో స్పందిస్తున్న కార్మికశాఖ
సాక్షి, మేడ్చల్ జిల్లా: వలసజీవుల సమాచారాన్ని కార్మికశాఖ సేకరిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు పొట్టకూటి కోసం వెళ్లి తిరిగొచ్చిన కార్మికుల వివరాలను ఆరా తీస్తోంది. ఈ మేరకు మున్సిపల్ సర్కిళ్లు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల్లో కార్మికుల సమాచారాన్ని రాబడుతోంది. బతుకు దెరువు కోసం వెళ్లిన వారిలో ఇప్పటి వరకు ఎంత మంది స్వస్థలాలకు చేరారనే విషయాన్ని క్షేత్రస్థాయి సర్వేలో తెలుసుకుంటోంది. వివరాలను సేకరిస్తున్న కార్మికశాఖ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కార్మిక శాఖ ఈ సమాచారాన్ని సేకరిస్తోంది. జీవనోపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన కార్మికులు, కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు? ఏ రాష్ట్రం నుంచి తిరిగి వచ్చారు? తదితర వివరాలను సమీకరిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామికవాడలతోపాటు ఎంపిక చేసిన ప్రాంతాలు, బస్తీల్లో కార్మిక శాఖకు చెందిన సిబ్బంది, ఆయా పురపాలక సంఘాలు, జీపీల ఉద్యోగుల సాయంతో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో వలస కార్మికులు, కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటంతోపాటు ఆర్థిక సాయం, బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే. భవన నిర్మాణ రంగంతోపాటు వివిధ పరిశ్రమల్లో పనుల కోసం వచ్చిన వలస కార్మికులు, కూలీలు, వారి కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నట్లు కరోనా తరుణంలో అధికార యంత్రాంగం గుర్తించి అన్ని విధాల సహకారాలు అందించింది. సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న దశలో వలస కార్మికులు, కూలీల వివరాల నేపథ్యంలో మరోసారి వారికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ( చదవండి: కోవిడ్ వ్యాక్సిన్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ) -
ఉపాధి పనుల్లో... వలస కార్మికులకు కోటా
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధి హామీ పనుల్లో వలస కార్మికులకు కోటా ఏర్పాటు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నియమించిన అధ్యయన బృందం సిఫారసు చేసింది. భారతదేశంలో వలస కార్మకుల సామాజిక భద్రత, ఆరోగ్య హక్కులపై పరిశోధన, అధ్యయనం చేయాలంటూ అక్టోబరు 18, 2019న ఢిల్లీలోని కేరళ డెవలప్మెంట్ సొసైటీకి ఎన్హెచ్ఆర్సీ సూచించింది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, మహారాష్ట్రల్లోని నాలుగు జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన మొత్తం 4,400పై ఈ అధ్యయనం నిర్వహించారు. అనంతరం అధ్యయన బృందం కేంద్ర కార్మికశాఖ, గ్రామీణాభివద్ధిశాఖ, వినియోగదారుల వ్యవహారాలు శాఖలతోపాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పలు సిఫారసులు చేసింది. ఈ అధ్యయనాన్ని ఎన్హెచ్ఆర్సీ ఇటీవల ఆమోదించింది. కార్మికశాఖకు సిఫారసులు జాతీయ స్థాయిలో వలస కార్మికుల సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం నిమిత్తం అంతర్ రాష్ట్రాల వలస మండలి ఏర్పాటు చేయాలి. అంతర్ రాష్ట్ర వలస కార్మికులకు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించాలి. 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా రాష్ట్ర, కేంద్ర స్థాయిలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేయాలి. గ్రామీణాభివద్ధి శాఖ: ఉపాధి హామీ పథకంలో వలస కార్మికులకు కోటా కేటాయించాలి. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని వలస కార్మికుల కోసం మెరుగుపరచాలి. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ వారు వన్ నేషన్–వన్ రేషన్ కార్డు ఫాస్ట్ ట్రాక్‌లో అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు: కార్మిక విభాగాలు తప్పనిసరిగా వలస కార్మికుల జాబితా రూపొందించాలి. వలస కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించాలి. వాటిని పనిచేసే చోట ఏర్పాటు చేసేలా చూడాలి. విద్యాహక్కు చట్టం, 2009 ప్రకారం వలస కార్మికుల పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. వలసకార్మికుల నైపుణ్యాన్ని గుర్తించి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. వలస కార్మికుల సొంత రాష్ట్రాలు కానీ, పనిచేసే చోట అక్కడి రాష్ట్రాలువారికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ వలస కార్మికుల కోసం వారి సొంత నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకొనేలా రిమోట్ ఓటింగ్ హక్కు కల్పించాలి. ( చదవండి: వలసపక్షుల బెంగ ) -
వలస కార్మికుల కోసం హెల్ప్‌డెస్క్
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ కార్మిక శాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు లాక్డౌన్ కారణంగా వారి సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు వీలు లేకుండాపోయింది. ఇలాంటి వారికి సహాయపడేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్టు తెలంగాణ సంయుక్త కార్మిక కమిషనర్ ఎన్. చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు. పారిశ్రామిక రంగ కార్మికుల వేతన చెల్లింపులు, సంక్షేమం, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వలస కార్మికులు సమస్యల పరిష్కారం కోసం 94925 55379 (వాట్సప్)లో సంప్రదించాలని ఆయన సూచించారు. covid19cotr@gmail.comకు ఈ-మెయిల్ కూడా పంపొచ్చని చెప్పారు. హెచ్చార్సీ కేసుల విచారణ వాయిదా లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో కేసుల విచారణను వాయిదా వేస్తున్నట్టు మానవ హక్కుల సంఘం(హెచ్చార్సీ) ప్రకటించింది. వాయిదా వేసిన కేసులను మే 9 నుంచి విచారిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని 99631 41253, 90002 64345 నంబర్లలో సంప్రదించవచ్చు. (లాక్డౌన్.. మరిన్ని సడలింపులు ప్రకటించిన కేంద్రం) -
డీఐఎంఎస్‌లో ఏసీబీ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: కార్మిక శాఖ పరిధిలోని బీమా వైద్య సేవల విభాగాన్ని (ఐఎంఎస్) అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) జల్లెడ పడుతోంది. ఔషధ కొనుగోళ్లు, వైద్య పరీక్షల కిట్ల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం అంతర్గత పరిశీలనలో స్పష్టం కావడంతో వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది. కొనుగోళ్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో గతంలో విజిలెన్స్ విభాగం ప్రత్యేక పరిశీలన నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా.. తాజాగా మరింత లోతైన అధ్యయనం కోసం ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దింపింది. ఆర్థికపరమైన అంశాలను నిగ్గు తేల్చడంలో ఏసీబీ సమర్థవంతమైనది కావడంతో ఆ బాధ్యతను ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. ఈ క్రమంలో బీమా వైద్య సేవల విభాగం సంచాలక కార్యాలయం నుంచి కీలక పత్రాలను పరిశీలించారు. వారికి అవసరమైన సమాచారాన్నంతా రికార్డు చేసుకున్నారు. అదేవిధంగా గత ఐదేళ్లలో కొనుగోలు చేసిన సరుకులు, పరికరాల తాలూకు బిల్లులతోపాటు టెండర్లు, కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని సైతం సేకరించారు. ప్రస్తుతం వాటిని విశ్లేషిస్తున్నారు. నిబంధనల ప్రకారమే జరిగాయా లేక అవకతవకలు జరిగాయా అనే కోణంలో లోతైన పరిశీలన చేస్తున్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఆ శాఖ జరిపిన లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పరిశీలన నివేదికను తిరిగి విజిలెన్స్‌కు ఇవ్వనున్నట్లు తెలిసింది. డీఐఎంఎస్‌లో వణుకు.. అవినీతి ఆరోపణలతో ఏసీబీ యంత్రాంగం బీమా వైద్య సేవల సంచాలకుల (డీఐఎంఎస్) కార్యాలయంలో తనిఖీలు నిర్వహించడంతో ఆ విభాగంలోని ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్వహణంతా ఈ శాఖ ద్వారానే జరుగుతుంది. ఈఎస్ఐ ఉద్యోగుల వైద్య సేవలకు సంబంధించి మెడికల్ రీయింబర్స్మెంట్ పంపిణీ కూడా ఇదే శాఖ నిర్వహిస్తోంది. వైద్య బిల్లులు కోసం వచ్చే కార్మికుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నయనేది ఈ కార్యాలయంపై ప్రధాన ఆరోపణ. మరోవైపు మందులు, మెడికల్ కిట్ల కొనుగోళ్లలో అవకతవకలను విజిలెన్స్ సైతం ప్రాథమికంగా నిర్ధారించడంతో కార్యాలయ అవినీతి భాగోతం బట్టబయలైంది. తాజాగా ఏసీబీ అధికారుల తనిఖీలతో ఉద్యోగులంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అన్ని సెక్షన్లకు అవినీతి మరకలు ఉండటంతో కొందరు సిబ్బంది సెలవులు పెట్టేశారు. మరికొందరు కార్యాలయానికి వచ్చినప్పటికీ ఎవరితోనూ మాట్లాడకుండా కుర్చీకే పరిమితమయ్యారు. తాజాగా డీఐఎంఎస్ కార్యాలయంలోకి ఇతరులను అనుమతించకపోవడం గమనార్హం. -
ఇక ఆఫీస్‌కు నో జీన్స్-టీ షర్ట్
జైపూర్ : రాజస్థాన్ లేబర్ డిపార్ట్మెంట్ జారీ చేసిన సర్క్యులర్ ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఇక మీదట ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చే సమయంలో జీన్స్, టీ షర్ట్ వంటి అభ్యంతరకరమైన దుస్తులు ధరించ కూడదని సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నెల 21న లేబర్ కమిషనర్ గిర్రియాజ్ సింగ్ కుష్వాహా ఈ సర్క్యులర్‌ను జారీ చేశారు. ఈ విషయం గురించి గిర్రియాజ్ ‘కొంతమంది ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేటప్పుడు జీన్స్, టీ షర్ట్ లాంటి అభ్యంతరకర దుస్తులు ధరించి వస్తున్నారు. ఇలాంటి దుస్తులు ధరించి విధులకు హాజరవ్వడం అంటే వారు తమ ఉద్యోగానికి, ఆఫీస్‌కు మర్యాద ఇవ్వనట్లే. ఈ పరిస్థితిని మార్చడం కోసం ఈ నోటీస్‌ను జారీ చేయాల్సి వచ్చింది. ఇక మీదట ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేటప్పుడు ప్యాంట్, షర్ట్ మాత్రమే ధరించే రావాలి’ అన్నారు. అయితే ఈ నోటీస్ గురించి ఇంతవరకూ ఉద్యోగుల నుంచి తనకు ఎటువంటి ఫీడ్‌బ్యాక్ అందలేదని తెలిపారు. ఈ విషయం గురించి ‘ఆల్ రాజస్థాన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ ప్రెసిడెంట్ గజేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ నోటీస్‌ను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. జీన్స్, టీ షర్ట్ ధరించడం అభ్యంతకరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి సర్వీస్ రూల్స్ రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఈ నోటీస్‌ను విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా కమిషన్‌ను కోరాతామని చెప్పారు. -
వలస కార్మికుల నమోదుపై సమావేశం
రాయగడ : ఇతర రాష్ట్రాల వ్యాపారులు, పరిశ్రమలు, ఇటుకబట్టీల్లో దళారుల వల్ల మోసపోతూ ఇబ్బందులకు గురవుతున్న వలసకార్మికుల పేర్లు కానీ, చిరునామా కానీ దళారుల పేర్లు కానీ లభించక అటు కార్మికులు ఇటు ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది తెలుసుకున్న రాయగడ జిల్లా పోలీసు అధికారి ఎస్పీ రాహుల్ పీఆర్ దీనిపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రణాళికను తయరు చేశారు. ఈ మేరకు ఇకపై కార్మికశాఖ మాత్రమే కాకుండా ప్రతి గ్రామపంచాయతీలో సర్పంచ్, సమితి మెంబర్, వార్డుమెంబర్, ద్వారా గ్రామం నుంచి వలస వెళ్లేవారి పేర్లు, అడ్రస్‌లు, వెళ్లేసమయం, ఏ ప్రాంతానికి వెళ్లేది, మధ్యవర్తి ఎవరు, వారి ఫోన్ నంబర్లు నమోదు చేయడం అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికుల వివరాలు నమోదు చేసి పోలీసుల ద్వారా కార్మికశాఖకు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎయిడ్ ఈటీ ఏక్షన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ ఉమ్రిడాన్యాల్ సహాయంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయగడ జిల్లా కేంద్రంలో కార్మిక చైతన్య కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. చట్టాలపై చర్చ కార్యక్రమంలో 16పోలీస్స్టేషన్లు, 32అవుట్‌పోస్టుల అధికారులు, కార్మికశాఖ అధికారులు, జిల్లా సంక్షేమశాఖ అధికారులు, డీఎస్ఎస్ విభాగం, చైల్డ్‌లైన్ విభాగంతో సహా ఇతర సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. సచేతన కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ది బాండెడ్ లేబర్ సిస్టమ్ ఎబొలేషన్ యాక్ట్–1976, ఒడిశా ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్‌మన్ మాన్యువల్‌లో ఉన్న నిబంధనలు, సూచనలు, చట్టపరమైన చర్యలు, వాటికి సంబంధించి చర్చించారు. జిల్లాలోని కాశీపూర్‌సమితి, రేంగ, టికిరి, చందిలి పంచాయతీ, ముకుందప్రాంతాల నుంచి కేరళ రాష్ట్రానికి వలస కార్మికుల సంఖ్య అధికమని సమావేశంలో తెలియవచ్చింది. ఇంటర్‌స్టేట్ మైగ్రేషన్ వల్ల ప్రభుత్వం అనేక కొత్త ఇబ్బందులను ఎదుర్కొంటోందని వివరిస్తూ ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే కార్మికులకు రాయగడలో దళారులు ఉండగా ప్రధాన కేంద్రం బల్లుగాం అని వివరించారు. కార్యక్రమంలో ఎస్పీ రాహుల్‌పీఆర్ సహా కలెక్టర్ గుహపూనాంతపస్‌కుమార్, గుణుపురం ఐటీడీఏ పీఓ ఘొరచంద్‌గొమాంగో, రాయగడ ఐటీడీఏ పీఓ మురళీధర్‌స్వొంయి, రాయగడ సబ్‌కలెక్టర్ ప్రవీర్‌కుమార్ నాయక్, గుణుపురం సబ్‌కలెక్టర్ అమృతరుతురాజు, డీఎల్ఓ ప్రదీప్‌కుమార్‌భొయి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బ్యాడ్మింటన్‌లో ఆర్టీసీ కర్నూలు జట్టు రాష్ట్ర విజేత
కర్నూలు (రాజ్‌విహార్): కార్మిక శాఖ అధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ఆర్టీసీ కర్నూలు ఉద్యోగులు తమ ప్రతిభను కనబర్చారు. మేడే సందర్భంగా గత నెలలో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఆర్టీసీ రీజియన్ క్రీడాకారులు ఆదోని డిపోలో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేస్తున్న వెంకట్రావు, నందికొట్కూరు, డోన్ డిపోలో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ప్రసాద్ రావు, భరణీ కుమార్‌లు జోనల్ స్థాయిలో విజేతగా నిలిచారు. వీరు ఏప్రిల్ 29, 30 తేదీల్లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సెమీఫైనల్లో విశాఖపట్నం జట్టుపై విజయం సాధించగా ఫైనల్లో అద్దంకి డిపో జట్టుపై విజేతగా నిలిచారు. వీరికి కార్మిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన మేడే వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి పీతాని సత్యనారాయణ మెమొంటో, బహుమతులు ఇచ్చి అభినందించారు. వీరికి స్థానిక అధికారులు, ఉద్యోగులు అభినందనలు తెలిపారు. -
ఏపీ కార్మిక శాఖలో కోట్ల స్కాం
-
కార్మికశాఖలో విభజన పూర్తి
- జిల్లా స్థాయిలో డీసీఎల్ పోస్టులు రద్దు - చిన్న జిల్లాలు కావడంతో ఏసీఎల్లకే పగ్గాలు - అన్ని జిల్లాలకు ఎంప్లాయిమెంట్ అధికారుల నియామకం సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కార్మికశాఖలో విభజన పూర్తి చేశారు. జిల్లాస్థాయి అధికారుల ఎంపిక, క్యాడర్ల ఏర్పాట్లు తదితర ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఈ మేరకు ఏయే జిల్లాకు ఎవరెవరు వెళ్లాలనే దానిపై ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అక్టోబర్ 3నుంచి నూతనంగా ఏర్పడబోయే జిల్లాలకు వెళ్లాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించారు. అయితే పునర్విభజన నేపథ్యంలో జిల్లాలు చిన్నవి కావడంతో క్యాడర్ పోస్టుల హోదాను తగ్గించారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మినహా మిగతా జిల్లాలకు బాధ్యులుగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్(డీసీఎల్) స్థాయి అధికారులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ హోదాను తగ్గించి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (ఏసీఎల్) స్థాయి అధికారులకే బాధ్యతలు అప్పగించాలని కార్మికశాఖ నిర్ణయించింది. అం దుకు అనుగుణంగా నూతన జిల్లాలకు ఏసీఎల్ స్థాయి అధికారులకు ఎంపిక చేసిన జిల్లాల బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అలాగే దసరా నాటికి నూతన జిల్లాల్లో కార్యాలయాలు ఎంపిక చేసుకోవడంతో పాటు పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖ ఆదేశాలిచ్చింది. అదేవిధంగా జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారుల విషయంలో కూడా కార్మికశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నూతనంగా ఉద్యోగులెవరినీ చేర్చుకోకపోవడంతో ఉన్న వారితోనే సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జూనియర్ అధికారులకు నూతన జిల్లా బాధ్యతలు అప్పగించాలని కార్మికశాఖ స్పష్టం చేసింది. -
కార్మిక శాఖ డీసీగా మల్లేశ్వరకుమార్
కర్నూలు(రాజ్‌విహార్): కార్మిక శాఖ కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్(డీసీఎల్)గా యు.మల్లేశ్వర కుమార్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు డీసీఎల్‌గా పదోన్నతి కల్పించి ఇక్కడికి బదిలీ చేస్తూ కార్మిక శాఖ కమిషనర్ వరప్రసాద్ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ డీసీఎల్‌గా విధులు నిర్వహించిన సయ్యద్ సర్దార్ సాహెబ్ అఖిల్ గత రెండు నెలల కిత్రం పదవీ విరమణ పొందడంతో జేసీఎల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ అప్పటి నుంచి ఇన్చార్జీ బాధ్యతలు నిర్వహించారు. గుంటూరుకు చెందిన మల్లేశరకుమార్ 1997లో గ్రూప్–2 ద్వారా ఏఎల్‌ఓగా ఎంపికై కార్మిక శాఖలో చేరి కంభం, పిడుగురాళ్ల, ఒంగోలు, గుంటూరు, చిలకలూరిపేటలో పనిచేశారు. 2008లో పదోన్నతి రావడంతో గుంటూరు ఏసీఎల్‌గా పనిచేస్తూనే ముడు నెలల పాటు కడప డీసీఎల్‌గా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించారు. కార్మికుల సంక్షేమానికి కషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన డీసీఎల్‌కు ఏసీఎల్‌లు శేషగిరిరావు, శ్రీనివాసులు, రఘురాములు, ఆత్మకూరు ఏఎల్ఓ హేమాచారి తదితరులు అభినందలు తెలిపారు. -
నిజమే.. అధికారులెవరూ ఆఫీసులో లేరు
- ‘రిజిస్ట్రేషన్ల శాఖకు సుస్తీ’పై స్పందించిన కమిషనర్ - విచారణకు ఆదేశించిన స్పెషల్ సీఎస్ సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారులందరూ వివిధ పనుల నిమిత్తం శుక్రవారం కార్యాలయానికి రాలేదని ఆ శాఖ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ అహ్మద్ నదీమ్ అంగీకరించారు. పలు సమస్యలతో ఆఫీసుకు వచ్చిన వారిని పట్టించుకునే వారు లేకపోవడంపై ‘రిజిస్ట్రేషన్ల శాఖకు సుస్తీ’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అహ్మద్ వివరణ ఇచ్చారు. కార్మిక శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న తనకు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించిందని, శుక్రవారమంతా కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలోనే ఉండటం వలన రిజిస్ట్రేషన్ల శాఖకు వెళ్లలేకపోయానని తెలిపారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్స్‌లో ఒకరు బెంగళూరులో వర్క్‌షాప్‌కు వెళ్లగా, మరొకరు అనారోగ్య కారణాలతో సెలవు పెట్టారని పేర్కొన్నారు. జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ (జేఐజీ), అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఏఐజీ) శుక్రవారం కార్యాలయానికి వచ్చారని తెలిపిన కమిషనర్, వారు మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యాలయంలో లేకపోవడాన్ని ప్రస్తావించ లేదు. మొత్తం 54 మంది ఉద్యోగుల్లో 47 మంది హాజరయ్యారని చెబుతున్న కమిషనర్, వారిలో సగం మంది సీట్లలో లేకపోవడాన్ని కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. మరోవైపు ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర విచారణకు ఆదేశించడం రిజిస్ట్రేషన్ల శాఖలో అలజడి రేపింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు పత్తా లేకపోవడంపై స్పెషల్ సీఎస్ సీరియస్‌గా ఉన్నారని, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారని తెలిసింది. -
కార్మిక శాఖలో సంస్కరణలు: దత్తాత్రేయ
హైదరాబాద్: కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో రెండు రోజులపాటు సాగే ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్(ఏఐఎస్బీఐఎస్ఎఫ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్(ఎస్‌బీఐఎస్‌యూ) ైెహ దరాబాద్ సర్కిల్ సర్వసభ్య సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు. 1925, 1948, 1949లో రూపొందించిన కార్మిక చట్టాలే ఇప్పటికీ అమలులో ఉన్నాయని, వాటిని మార్చాలని కేంద్రం భావిస్తోందన్నారు. ప్రధానంగా ప్రజల, దేశ సంక్షేమం కోరే సంస్థల్లో పనిచేసే కార్మికులందరినీ ఒక కుటుంబంగా పరిగణిస్తూ ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తున్నామన్నారు. ఉద్యోగినుల మెటర్నిటీ సెలవులు 12 వారాల నుంచి 28 వారాలకు పెంచాలని కేంద్రం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ సీసీ ముంబై డీఎండీ, సీడీవో అశ్వినీ మెహ్రా, యూఎన్ఐ గ్లోబల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బ్రదర్ ఫిలిప్ జెన్నింగ్స్, ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ హరిదయాళ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఎన్నికల్లో సీక్రెట్ బ్యాలెట్
- ఫిబ్రవరి 9న తుది ఓటరు జాబితా.. -18న పోలింగ్, కౌంటింగ్ - మార్చి 4న అధికారికంగా ఫలితాలు వెల్లడి సాక్షి, విజయవాడ బ్యూరో : ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగనుంది. ఒక్కో ఓటరు రెండు ఓట్లు వేయనున్నారు. తెల్ల రంగు బ్యాలెట్(క్లాజ్ 3) రాష్ట గుర్తింపునకు, గులాబి రంగు బ్యాలెట్(క్లాజ్ 6) జిల్లా గుర్తింపునకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన మార్గదర్శకాలను కార్మిక శాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 13జిల్లాల్లోను ప్రస్తుతం ఉన్న 57,800ఓటర్లకు సంబంధించిన జాబితాలను ఈ నెల 29న అన్ని డిపోల్లోను ముసాయిదా ఓటరు జాబితాలను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీలోపు దానికి సంబంధించిన అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 6వ తేదీన అభ్యంతరాల పరిశీలన చేస్తారు. బదిలీలు, పదవి విరమణ, వృతులకు సంబంధించిన ఓట్లను తొలగింపులు, చేర్పులు, మార్పులు చేసి ఫిబ్రవరి 9న తుది ఓటరు జాబితాలను ఆర్టీసీ డిపోల వారీగా ప్రకటిస్తారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ మొత్తం కార్మిక శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. ఎన్నికల సిబ్బందికి, సామాగ్రి చేరవేతకు ఆర్టీసీ బస్సులను సమకూర్చాల్సి ఉంటుంది. ఆయా డిపోల పరిధిలోని డిపో మేనేజర్లు ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చూడాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 18న ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు డిపోలవారీగా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 6గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నేరుగా ఓటు హక్కు వినియోగించుకోలేని పోలింగ్ సిబ్బంది, ఆఫీసు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులు ఫిబ్రవరి 23, 24తేదీల్లో పోస్టల్ బ్యాలెట్‌ను అందజేయవచ్చు. ఆ రెండు రోజుల్లోను ఏ రోజు వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను అదే రోజు లెక్కిస్తారు. పోలింగ్ రోజునే ఓట్ల లెక్కింపుతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంఘం ఏమిటన్నది తేలిపోనుంది. అయితే మార్చి 4 ఉదయం 11గంటలకు గుర్తింపు సంఘం ఏమిటన్నది అధికారికంగా ప్రకటించనున్నారు. -
ఆర్టీసీలో ఎన్నికల కోలాహలం
- ఫిబ్రవరి 18న గుర్తింపు సంఘం ఎన్నికలు - యూనియన్లకు గుర్తులు ఖరారు చేసిన కార్మిక శాఖ - వైఎస్సార్ సీపీ మజ్దూర్ యూనియన్‌కి టేబుల్ ఫ్యాన్ గుర్తు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 18న అన్ని జిల్లాల్లోనూ పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. సోమవారం బస్‌భవన్‌లో కార్మిక శాఖ అధికారులు, యూనియన్ నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించి సమావేశంలో ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేశారు. ఏపీలోని అన్ని డిపోల్లో ఫిబ్రవరి 18న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఫలితాల్ని అదే డిపోల్లో ప్రకటించే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫిబ్రవరి 23, 24 తేదీల్లో కార్మిక శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో లెక్కిస్తారు. గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై ఈ నెల 7న తొలిసారిగా సమావేశం జరిగింది. ఏపీ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సూర్యప్రకాష్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 29న డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టులు యూనియన్లకు అందజేస్తారు. ఫిబ్రవరి 2న ఓటర్ లిస్టులపై అభ్యంతరాల్ని ఆయా డిపోల్లో మేనేజర్లకు తెలియజేయాలి. తుది అభ్యంతరాలపై ఫిబ్రవరి 5న పరిశీలిస్తారు. ఫిబ్రవరి 9న తుది ఓటర్ల జాబితాలను కార్మిక శాఖ కమిషనర్ అన్ని డిపోలు, యూనిట్లకు అందజేస్తారు. గుర్తింపు ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు సెల్ఫోన్లు, కెమెరాలను పోలింగ్ బూత్‌లలోకి అనుమతించరు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎనిమిది సంఘాలు పోటీలో ఉంటాయి. యూనియన్లకు గుర్తులు ఖరారయ్యాయి. వైఎస్సార్ సీపీ మజ్దూర్ యూనియన్‌కు టేబుల్ ఫ్యాన్ గుర్తు కేటాయించారు. ఎంప్లాయిస్ యూనియన్‌కు బస్సు, ఎన్‌ఎంయూకి కాగడా, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు స్టార్, కార్మిక పరిషత్తుకి టైర్, ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్‌కి పావురం, యునెటైడ్ వర్కర్స్ యూనియన్‌కి స్టీరింగ్, కార్మిక సంఘ్ పిడికిలి గుర్తులను కేటాయించారు. డమ్మీ బ్యాలెట్లను ఫిబ్రవరి 9న పోటీలో ఉన్నవారికి అందించనున్నారు. -
15న కార్మికులకు సెలవు దినం
సాక్షి, హైదరాబాద్: ఫ్యాక్టరీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1974 కింద ఏర్పాటైన పరిశ్రమలు, షాపులు తదితర ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ నెల 14కు బదులుగా 15ను సంక్రాంతి సెలవు దినంగా మార్చారని జంటనగరాల కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఇ.గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా దుకాణాలు, పరిశ్రమల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి ఆ రోజును వేతనంతో కూడిన సెలవుదినంగా ప్రకటించాలని ఆయన సూచించారు. -
సెస్ చెల్లించకుంటే చర్యలు
సాక్షి, కాకినాడ : వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కార్మిక శాఖకు చెల్లించాల్సిన ఒక శాతం సెస్‌కు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించకపోతే చర్యలు తప్పవని ఆ శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు హెచ్చరించారు. వందల కోట్లలో పేరుకుపోయిన బకాయిల వసూళ్లలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. సెస్ వసూలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అసంఘటిత కార్మికుల సంక్షేమం వంటి అంశాలపై సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో బకాయిలు రూ.5 కోట్లకు పైగా పేరుకుపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిలో ఎక్కువ మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీల నుంచి రావాల్సి ఉందని గుర్తించి సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కాకినాడ సీ పోర్ట్స్ వంటి ప్రైవేటు సంస్థలు సెస్ చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వపరంగా రూ.50 వేలకు పైబడి ఎలాంటి పనులు జరిగినా ఆ మొత్తంలో ఒక శాతం లేబర్‌సెస్ కింద చెల్లించాల్సిందేనన్నారు. రూ.10 లక్షల లోపు అంచనా వ్యయంతో నిర్మించుకునే వ్యక్తిగత గృహాలు, బహుళ అంతస్తుల సముదాయాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. గత నెల రోజులుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌తో జిల్లాలో 1100 సంస్థల నుంచి రూ.1.11 కోట్లు వసూలైందన్నారు. 2007 నుంచి శాఖల వారీగా వసూలైన సెస్, బకాయిలు, చెల్లించిన సంస్థలు, చెల్లించనివి వంటి వివరాలతో 15 రోజుల్లో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. బకాయిలను నెల రోజుల్లోగా వసూలు చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో పరిశ్రమల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు కళాశాలలు, విద్యాసంస్థలు పెరిగాయని, వాటి నుంచి సెస్ వసూలు చేయాలన్నారు. 5 లక్షల మంది కొబ్బరి కార్మికుల కోసం పైలట్ ప్రాజెక్టు అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కమిషనర్ చెప్పారు. ప్రతి జిల్లాలో కార్మికభవన్లు నిర్మించడంతో పాటు వర్కర్స్ ఫెసిలిటేషన్ సెంటర్లు, అడ్డా డెవలప్మెంట్ సెంటర్లు, సబ్సిడైజ్డ్ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కార్మికుల పిల్లలకు వివాహ సమయంలో ఇచ్చే రూ.5 వేల బహుమతి సొమ్మును రూ.15 వేలకు పెంచామని, కార్మికుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు అంత్యక్రియల ఖర్చులకు ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంచామని చెప్పారు. కార్మికుల పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అసంఘటిత కార్మిక చట్టం కింద కోనసీమలో 5 లక్షలమంది కొబ్బరి కార్మికులకు లబ్ధి చేకూరే పైల ట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్టు తె లిపారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పైల ట్ ప్రాజెక్టుగా జిల్లాలో ఐదు మండలాలను ఎంపిక చేసుకొని 2015 కల్లా బాలకార్మికులు లేనివిగా ప్రకటించేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలని కోరారు. కార్మికశాఖ జాయింట్ కమిషనర్ వరహాలరెడ్డి, డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ప్రకాశరావు, జెడ్పీ సీఈఓ సూర్యభగవాన్, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డీఈఓ శ్రీనివాసులురెడ్డి, ఐసీడీఎస్ పీడీ నిర్మల పాల్గొన్నారు. -
భత్యాలను మూలవేతనంలో కలపొద్దు
ఈపీఎఫ్ఓకు కార్మిక శాఖ ఆదేశం న్యూఢిల్లీ: భవిష్య నిధి (పీఎఫ్)కి సంబంధించిన కోతలకు గాను భత్యాలన్నిటినీ మూలవేతనంలో కలిపే ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర కార్మిక శాఖ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)ను ఆదేశించింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓకు కార్మిక శాఖ నుంచి ఓ లేఖ అందింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపారుు. ఈపీఎఫ్ఓ ప్రతిపాదనకు ఆమోదం లభించినట్టరుుతే సంస్థ నిర్వహించే పలు పథకాల కింద సంఘటిత రంగంలోని సుమారు ఐదు కోట్ల మంది కార్మికుల పొదుపు మొత్తాలు పెరిగేవని నిపుణులంటున్నారు. పీఎఫ్ ఖాతాదారులు ఇంటికి తీసుకెళ్లే వేతనం తగ్గడంతో పాటు యూజమాన్యాలపై ఆర్థిక భారాన్ని పెంచేదని చెబుతున్నారు. పీఎఫ్ కోతలకు సంబంధించి మూలవేతనాల అర్ధాన్ని పున ఃనిర్వచించిన ఈపీఎఫ్ఓ 2012 నవంబర్ 30న ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగులకు సాధారణంగా, తప్పనిసరిగా, ఒకేరకంగా చెల్లించే భత్యాలన్నిటినీ మూల వేతనాలుగానే పరిగణించాలని తెలిపింది. అరుుతే ఈ సర్క్యులర్ అమలును నిలిపివేసిన ఈపీఎఫ్ఓ ఈ అంశంపై అధ్యయనం చేసి తదుపరి చర్యలను కార్మిక శాఖకు సిఫారసు చేసేందుకు గాను ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కార్మిక శాఖ భత్యాలను మూలవేతనంలో కలిపే ప్రతిపాదనను విరమించుకోవాలంటూ ఈపీఎఫ్ఓకు ఆదేశాలిచ్చింది.