USA: సీమా నందా నియామకానికి సెనేట్‌ ఆమోదం | US Senate Nod To Seema Nanda As Solicitor For Department Of Labour | Sakshi
Sakshi News home page

Seema Nanda నియామకానికి సెనేట్‌ ఆమోదం

Published Sat, Jul 17 2021 9:21 AM | Last Updated on Sat, Jul 17 2021 11:46 AM

US Senate Nod To Seema Nanda As Solicitor For Department Of Labour - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలోని జో బైడెన్‌ ప్రభుత్వంలో మరో భారతీయ సంతతి మహిళకి చోటు లభించింది. కార్మిక శాఖ సొలిసిటర్‌గా భారత సంతతికి చెందిన పౌరహక్కుల న్యాయవాది సీమా నందా నియామకానికి అమెరికన్‌ సెనేట్‌ ఆమోద ముద్ర వేసింది. 48 ఏళ్ల వయసున్న సీమా నందా డెమొక్రాటిక్‌ నేషనల్‌ కమిటీకి సీఈఓగా కూడా పని చేశారు. ఒబామా హయాంలో కార్మిక శాఖకి సేవలు అందించారు.

కాగా నందా నియామకాన్ని సెనేట్‌ 53–46 ఓట్లతో ఆమోదించింది. సీమా నందా నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కరోనా ముప్పు, వాతావరణంలో మార్పులతో యాజమాన్యాలు, కార్మికులు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొం టున్న తరుణంలో కార్మిక శాఖ సొలిసిటర్‌గా ఆమె నియామకం అత్యంత కీలకంగా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement