Senate
-
అమెరికన్లకు హాని చేయాలనుకుంటే అంతు చూస్తాం
వాషింగ్టన్: అమెరికన్లకు హాని చేయాలనుకునేవారి అంతు చూస్తామని, వారు భూమ్మీద ఏ మూల దాక్కున్నా వదలబోమని ఎఫ్‌బీఐ నూతన డైరెక్టర్ కశ్యప్ పటేల్ (కాశ్ పటేల్) హెచ్చరించారు. అమెరికా ప్రజలు గర్వించదగ్గ సంస్థగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిరకాల మిత్రుడైన కాశ్ పటేల్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా సెనేట్ గురువారం ధ్రువీకరించింది. అనంతరం పటేల్... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీని పారదర్శకంగా, జవాబుదారీగా, న్యాయానికి కట్టుబడినదిగా పునర్నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తొమ్మిదో డైరెక్టర్‌గా నన్ను ధ్రువీకరించడం గౌరవంగా భావిస్తున్నా. అచంచల విశ్వాసం, మద్దతు ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ బోండీకి ధన్యవాదాలు. ‘జీ–మెన్’ నుంచి 9/11 దాడుల నేపథ్యంలో దేశాన్ని కాపాడటం వరకు ఎఫ్‌బీఐకి ఘనమైన వారసత్వం ఉంది. పారదర్శకంగా, జవాబుదారీతనంతో, న్యా యానికి కట్టుబడి ఉండే ఎఫ్‌బీఐకి అమెరికా ప్రజలు అర్హులు. రాజకీయ జోక్యంతో న్యాయ వ్యవస్థ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. ఈ రోజుతో అది ముగుస్తుంది’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బాలీవుడ్ స్టైల్లో స్వాగతం.. ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్‌ను శ్వేతసౌధం స్వాగతించింది. వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో కాశ్‌కు బాలీవుడ్స్టైల్లో స్వాగతం పలికారు. నటుడు రణ్వీర్ సింగ్ నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంలోని ‘మల్హరి’ పాటను ఎడిట్ చేసి.. రణవీర్ స్థానంలో పటేల్ ముఖాన్ని ఉంచిన వీడియోను షేర్ చేశారు. ‘‘ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్ కాశ్ పటేల్‌కు అభినందనలు’’ అని స్కావినో ట్వీట్ చేశారు. 47 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్‌ను వెంటనే 30 లక్షల మందికి పైగా చూశారు. డెమొక్రాట్ల నుంచి వ్యతిరేకత.. పటేల్ నామినేషన్ రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో ఆమోదానికి వారం రోజులు ఆలస్యమైంది. ఈ పదవికి ఆయన అనర్హుడంటూ డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేశారు. కుట్ర సిద్ధాంతాలతో ఆయన అనుబంధం, రాజకీయ శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ గతంలో ఆయన ప్రకటనలు చేశారని, ట్రంప్ ఎఫ్‌బీఐ ప్రతీకార ప్రణాళికల సమాచారాన్ని దాచిపెట్టారని, పటేల్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని డెమొక్రాట్ సెనేటర్లు ఆరోపించారు. పటేల్ అమెరికన్ల ప్రయోజనాల పరిరక్షణకు కాకుండా.. ట్రంప్ ప్రయోజనాల కోసం పని చేస్తా రని మండిపడ్డారు. అయితే సెనేట్‌లో రిప బ్లికన్లకు మెజారిటీ ఉండటం తెలిసిందే. అలాస్కాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్లు లీసా ముర్కోవ్స్కీ, మైనేకు చెందిన సుసాన్ కొలిన్స్ నుంచి వ్యతిరేకత ఎదురైంది. అయితే.. గతంలో ఇతర ట్రంప్ నామినీలను వ్యతి రేకించిన సెనేట్ మైనారిటీ నాయకుడు మిచ్ మెక్కా నెల్తో సహా మిగిలిన రిపబ్లికన్ పార్టీ మొత్తం పటేల్‌కు మద్దతు లభించింది. దీంతో.. సెనేట్ డెమొ క్రాట్లందరూ కాశ్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి నా.. 51–49 ఓట్ల స్వల్ప తేడాతో ఆయన నామినేషన్ ఆమోదం పొందింది. భారతీయ నేపథ్యం.. కాశ్ పటేల్ తల్లిదండ్రులు గుజరాతీలు. యూఎస్‌లో స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్‌లో జన్మించిన పటేల్.. తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. లాంగ్ ఐలాండ్‌లోని గార్డెన్ సిటీ హైస్కూల్ నుంచి పట్టభద్రుడయ్యారు. రిచ్మండ్ విశ్వ విద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేశారు. యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఫ్యాకల్టీ ఆఫ్ లాస్ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. అంతర్జాతీయ చట్టంలో సర్టిఫికెట్ కోసం న్యూ యార్క్‌కు తిరిగి వచ్చారు. ఆ తరువాత జాతీయ భద్రతా సలహాదారుగా, హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ (హెచ్పీఎస్సీఐ)కి సీనియర్ కౌన్సెల్‌గా పనిచేశారు. -
‘జన్మతః పౌరసత్వ రద్దు’ బిల్లు సెనేట్‌కు
వాషింగ్టన్: అక్రమంగా లేదంటే తాత్కాలిక వీసాల మీద వలస వచ్చిన వాళ్లకు అమెరికాలో పిల్లలు పుడితే వారికి సంక్రమించే జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా పార్లమెంట్ ఎగువసభ(సెనేట్)లో అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు గురువారం ప్రవేశపెట్టారు. పుట్టే పిల్లలకు ఎలాగూ పౌరసత్వం వస్తుందన్న ఏకైక కారణంతోనే అక్రమ వలసలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇది జాతీయ భద్రతను బలహీనపరుస్తోందని ఈ బిల్లును ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సభ్యులు లిండ్సే గ్రాహమ్, టెడ్ క్రజ్, కేటీ బ్రిట్‌లు సెనేట్‌లో వ్యాఖ్యానించారు. ‘‘ఇన్నాళ్లూ జన్మతః పౌరసత్వాన్ని ప్రసాదించిన ప్రపంచంలోని 33 దేశాల్లో అమెరికా కూడా ఒకటిగా కొనసాగింది. ఈ విధానం చివరకు ‘పుట్టుకల పర్యాటకం’లా తయారైంది. ఉన్నంతలో స్థితిమంతులైన చైనా, ఇతర దేశాల పౌరులు ఉద్దేశపూర్వకంగా అమెరికాకు వచ్చి ఇక్కడ పిల్లల్ని కనేసి తమ సంతానానికి అమెరికా పౌరసత్వం దక్కేలా చేస్తున్నారు. అమెరికాకు ఇంతమంది రావడానికి జన్మతః పౌరసత్వం కూడా ఒక ప్రధాన కారణం’’ అని రిపబ్లికన్ నేతలు చెప్పారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తుర్వును విపక్ష డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాలు ఫెడరల్ కోర్టులో సవాల్ చేసి ఉత్తర్వు అమలుపై స్టే తెచ్చుకున్న వేళ రిపబ్లికన్ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. -
చట్టసభల్లో ట్రంప్ తొలి విజయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయం సాధించారు. ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొందింది. దీంతో అక్రమ వలసదారులపై చర్యలకు లైన్ క్లియర్ అయినట్లయ్యింది. అలాగే రెండో దఫా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగా ఆయన సంతకంతో చట్టం రూపం దాల్చిన తొలి బిల్లు కూడా ఇదే అయ్యింది.లేకెన్ రిలే యాక్ట్ (Laken Riley Act) పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం.. దొంగతనాలు, దొపిడీలు ఇతరత్రా చిన్నచిన్న నేరాల్లో శిక్ష పడిన, లేదంటే అలాంటి కేసులు ఉన్న అక్రమ వలసదారుల్ని ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ICE) కచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి. వీలైతే వాళ్లను తిరిగి వెనక్కి పంపించేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో ఉంచడానికి వీల్లేదు. ఒకవేళ ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే.. ఫెడరల్ ప్రభుత్వంపై దావాలు వేసే హక్కును స్టేట్ అటార్నీ జనరల్‌కు ఉంటుంది. ఈ చట్టాన్ని కిందటి ఏడాది రూపకల్పన చేశారు. తొలి నుంచి రిపబ్లికన్లు ఈ చట్టానికి మద్ధతుగా నిలవగా, డెమోక్రటిక్ పార్టీ మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది.ఆ ఏడాది జనవరి 3వ తేదీన 119వ అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) ప్రారంభమైన సంగతి తెలిసిందే. జనవరి 7వ తేదీన ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)లో ఇది 264-159తో ఆమోదం పొందింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన సభ్యులంతా బిల్లుకు మద్ధుతగా ఓటేయగా, డెమోక్రటిక్(Democrtic Party) సభ్యుల్లో 48 మంది మద్దతు ప్రకటించారు. జనవరి 20వ తేదీన సవరణతో కూడిన బిల్లుకు సెనేట్ ఆమోదం లభించింది. దీనికి 12 మంది రిబ్లికన్లు సైతం మద్దతుగా ఓటేశారు. చివరకు.. జనవరి 22వ తేదీన బిల్లు పాసైనట్లు హౌజ్ ప్రకటించింది.అయితే.. లేకెన్ రిలే యాక్ట్ కిందటి ఏడాది మార్చి 27నే ప్రతినిధుల సభ ఆమోదం పొందింది. కానీ, సెనేట్‌లో డెమోక్రటిక్ సభ్యుల అభ్యంతరాలతో అది ఆచరణకు నోచుకోలేదు.అమెరికా జార్జియా స్టేట్ ఏథెన్లో కిందటి ఏడాది ఫిబ్రవరి 22న 22 ఏళ్ల వైద్య విద్యార్థిని లేకెన్ రిలే(Laken Riley) దారుణంగా హత్యకు గురైంది. వెనిజులా నుంచి అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన జోస్ ఆంటోనియా ఇబర్రా(26).. ఉదయం జాగింగ్‌కు వెళ్లిన లేకెన్ను దారుణంగా హతమార్చాడు. ఈ కేసులో దోషిగా తేలిన సదరు అక్రమవలసదారుడికి పెరోల్ లేకుండా జీవితఖైదు విధించింది న్యాయస్థానం. అయితే సదరు వ్యక్తిపై గతంలో ఓ కేసు నమోదు అయినప్పటికీ.. అరెస్ట్ మాత్రం జరగలేదు. ఆనాడు అరెస్ట్ అయ్యి ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. అలాగే నేరాలకు పాల్పడే అక్రమ వలసదారులకు ఇమ్మిగ్రేషన్ చట్టాలు కల్పిస్తున్న రక్షణ ఆ టైంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో న్యాయం కోరుతూ విద్యార్థులంతా ఆందోళనబాట పట్టడంతో.. ట్రంప్ అప్పటి నుంచి ఈ చట్టానికి మద్దతు చెబుతూ వచ్చారు.ఇదీ చదవండి: ట్రంప్ మీద కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు -
తడబడ్డ కమలాహారిస్..వీడియో వైరల్
వాషింగ్టన్:అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ తడబడ్డారు. అమెరికా 119వ కాంగ్రెస్ ప్రారంభం సందర్భంగా సెనేట్‌లో చేసిన ప్రతిజ్ఞలో జెండా అనే పదాన్ని వదిలేసి చదివారు. హారిస్ తడబడ్డ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అమెరికాలో 119వ కాంగ్రెస్ తాజాగా సమావేశమైంది. ఈ సందర్భంగా చేసే ప్రతిజ్ఞలో ‘నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జెండాకు విధేయత చూపుతాను’ అని చదవాలి అయితే హారిస్ ‘జెండా’ పదాన్ని వదిలేసి చదివారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు.హారిస్ విధేయత ప్రతిజ్ఞను సలాడ్ చేసేశారని ఒకరు కామెంట్ చేయగా సెనెట్‌లో ప్రతిజ్ఞను తప్పుగా పలికి హారిస్ దేశాన్ని అవమానించారని మరొకరు విమర్శించారు. చరిత్రలో అతి తక్కువ ఐక్యూ కలిగిన అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ అని మరో నెటిజన్ విమర్శించారు. FLAG FLUB: Vice President Kamala Harris appears to flub the Pledge of Allegiance during the opening moments of the 119th Congress. pic.twitter.com/NlyMB6iUoz— Fox News (@FoxNews) January 3, 2025 మరో వీడియోలో హారిస్ కొత్తగా ఎన్నికైన సెనేటర్లతో ప్రతిజ్ఞ చేయిస్తుండగా అక్కడే ఉన్న అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇతర సభ్యులతో కలిసి నవ్వుతూ కనిపించారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీచేసిన కమలాహారిస్ ట్రంప్ చేతిలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.JD Vance laughing as Kamala Harris swears in new U.S. Senators 🤣pic.twitter.com/LRot5mia2Z— Benny Johnson (@bennyjohnson) January 3, 2025 ఇదీ చదవండి: ప్రధానిపై విమర్శలు..మస్క్‌కు బ్రిటన్ కౌంటర్ -
యూఎస్ కాంగ్రెస్‌లోనూ రిపబ్లికన్ల హవా..సెనేట్‌పై పట్టు..!
వాషింగ్టన్:అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ల గాలి వీచింది. అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లోనూ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సత్తా చాటింది. ఈసారి ఎన్నికల్లో సెనేట్‌లో మెజార్టీకి అవసరమైన సీట్లు రిపబ్లికన్ పార్టీకి లభించాయి.మరోవైపు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో కూడా రిపబ్లికన్ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 100 సీట్లు ఉన్న సెనెట్‌లో 34 స్థానాలకు మంగళవారం(నవంబర్ 5) ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా సెనేట్‌లో డెమోక్రట్లకు ఉన్న ఒక సీటు మెజార్టీ కూడా పోయింది. తాజాగా సెనేట్‌లో రిపబ్లికన్లకు 51 మంది డెమోక్రట్లకు 42 మంది సభ్యులున్నారు.మరో 7 స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది.సెనేట్‌లో మెజారిటీతో కొత్త ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలో రిపబ్లికన్లకు పట్టు లభించనుంది.ఇక 435 స్థానాలున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్లకు 183 సీట్లు లభించాయి. దీంతో ఈసారి ట్రంప్ అధ్యక్ష పదవి గనుక చేపడితే ఆయనకు కాంగ్రెస్ నుంచి పెద్ద అడ్డంకులేవీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: డెమోక్రాట్లలో నిరాశ.. కమల ప్రసంగం రద్దు -
రికార్డు: తొలిసారి అమెరికా సెనేట్‌కు ట్రాన్స్‌జెండర్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికాలో కాంగ్రెస్ ఎన్నికల రిజల్ట్స్ కూడా బుధవారం(నవంబర్ 6) వెలువడుతున్నాయి. డెలవేర్‌లోని ఎట్ లార్జ్హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి సెనేట్‌కు డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ సారా మెక్‌బ్రైడ్ విజయం సాధించారు.దీంతో సారా అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డులకెక్కారు.రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ వేలెన్ 3తో,సారా మెక్‌బ్రైడ్ పోటీపడ్డారు.ఈ ఎన్నికలో సారాకు 95శాతం ఓట్లు పోలవగా వేలెన్కు 57.9 శాతం ఓట్లు పోలయ్యాయి.తాను ట్రాన్స్‌జెండర్‌గా చరిత్ర సృష్టించడానికి పోటీ పడలేదని డెలవేర్లో మార్పు కోసమే పోటీ చేసినట్లు సారా పేర్కొన్నారు.కాగా,సారా మెక్ బ్రైడ్ ఎల్జీబీటీక్యూ జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు.ఎన్నికల సమయంలో దాదాపు 3 మిలియన్ల డాలర్లకుపైగా ప్రచార విరాళాలు సేకరించారు. 2010 నుంచి డెలవేర్ డెమోక్రాట్లకు కంచుకోటగా ఉంది.ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలు.. సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు -
Ashwin Ramaswami: జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికైతే రికార్డే!
భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించనున్నారు. అమెరికాలోని జార్జియా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్న మొదటి జనరల్ జెడ్ (1997-2012 మధ్య పుట్టినవాళ్లు) భారతీయా అమెరికన్ అశ్విన్ రామస్వామి నిలిచారు. 34 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అశ్విన్.. జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనేట్ కోసం డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానానికి రిపబ్లికన్ షాన్ స్టిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. తన రాష్ట్రమైన జార్జియాకు సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను సెనెట్‌కు పోటీ చేస్తున్నట్లు అశ్విన్ రామస్వామి తెలిపారు. తనలా రాజకీయంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ మెరుగైన అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు. 24 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, ఎన్నికల భద్రత, టెక్నాలజీతో పాటు పలు రంగాల్లో అశ్విన్ రామస్వామి పని చేశారు. అశ్విన్ రామస్వామి ఎన్నికైతే.. కంప్యూటర్ సైన్స్‌తో పాటు న్యాయవాద డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్టసభ్యుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇక.. తన తల్లిదండ్రులు 1990లో తమిళనాడు నుంచి అమెరికా వచ్చారని అశ్విన్ తెలిపారు. తాను భారత, అమెరికా సంస్కృతులతో పెరిగిగానని.. తాను హిందువునని తెలిపారు. తనకు భారతీయ సంస్కృతిపై చాలా ఆసక్తి ఉందని.. తాను కాలేజీ సమయంలో సంస్కృతం కూడా నేర్చుకున్నట్లు వెల్లడించారు. తాను రోజూ యోగా, ధ్యానం చేస్తూ ఉంటానని అశ్విన్ పేర్కొన్నారు. చదవండి: Alexei Navalny: నావల్నీ తల, ఒంటిపై కమిలిన గాయాలు -
సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయాలి
ఇస్లామాబాద్: ఫిబ్రవరి 8వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన పాకిస్తాన్లో రాజకీయ అనిశ్చితి మరింత ముదురుతోంది. అతి శీతల వాతావరణ పరిస్థితులు, ఖైబర్ ఫంక్తున్వా వంటి ప్రావిన్సుల్లో భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఫిబ్రవరి 8వ తేదీన జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సెనేట్ తీర్మానం ఆమోదించింది. స్వతంత్ర సభ్యుడు దిలావర్ ఖాన్ చేసిన ప్రతిపాదనకు ఊహించని మద్దతు లభించింది. అయితే, పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) సెనేట్ తీర్మానాన్ని తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వు ద్వారా మాత్రమే ఎన్నికల షెడ్యూల్ మారుతుందని పేర్కొంది. -
చరిత్ర సృష్టించింది.. యూఎస్ సెనేట్ బరిలో భారత సంతతి మహిళ!
ఇటీవల అమెరికా రాజకీయాల్లో భారతీయుల ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో అమెరికా ఉపాధ్యక్ష పదవిలో భారత మూలాలున్న కమలా హారిస్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత సంతతికి చెందిన రెజనీ రవీంద్రన్ అనే కళాశాల విద్యార్ధిని విస్కాన్సిన్ నుంచి సెనేట్ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించింది. డెమొక్రాటిక్ సెనేటర్ టామీ బాల్డ్‌విన్‌పై అధికారికంగా పోటీ చేసిన ఆమె.. మొదటి రిపబ్లికన్‌గా చరిత్ర సృష్టించారు. ప్రైమరీకి ఇంకా ఏడాది మాత్రమే సమయం వున్నట్లు మిల్వాకీ జర్నల్ సెంటినెల్ పేర్కొంది. ఈ సందర్భంగా రెజనీ మాట్లాడుతూ. . "నేను చాలా మంది రాజకీయ నాయకులు, లాబీయిస్టులు, పాలసీ మేకర్స్‌ను కలిశాను. వారిలో చాలా మంది 20, 30 సంవత్సరాలుగా ఉన్నారు. మనమే వారిని ఎన్నుకుంటున్నాం, అధికారాన్ని ఇస్తున్నాం. అయితే వారు మాత్రం వాష్టింగ్టన్ డీసీలో సుఖంగా ఉంటున్నారని చురకలంటించారు. మన గురించి మరిచిపోయినప్పుడు, వారిని అక్కడికి పంపడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. రవీంద్రన్ రాజకీయాలకి కొత్త. ఆమె ఈ సంవత్సరం స్టీవెన్స్ పాయింట్ కాలేజ్ రిపబ్లికన్లలో చేరింది. ఈ వేసవి ప్రారంభంలో వాషింగ్టన్ పర్యటన తర్వాత సెనేట్‌కు పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె వచ్చే ఏడాది పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేయాలని యోచిస్తోంది. రవీంద్రన్ భారతదేశం నుంచి 2011లో యుఎస్‌కి వలస వెళ్లారు. ఆమె 2015లో అమెరికా పౌరసత్వం పొందింది. 2017లో విస్కాన్సిన్కు వెళ్లడానికి ముందు కాలిఫోర్నియాలో నివసించేది. చదవండి చికాగో రోడ్లపై దయనీయస్థితిలో ఉన్న హైదరాబాదీ మహిళకు ఉపశమనం -
అమెరికా రుణ పరిమితి బిల్లుకు సెనేట్ ఆమోదం
వాషింగ్టన్/కొలరాడో: దివాలా(డిఫాల్ట్) ముప్పు నుంచి అగ్రరాజ్యం అమెరికా బయటపడినట్లే. రుణ పరిమితి పెంపునకు సంబంధించిన బిల్లుపై (ద్వైపాక్షిక ఒప్పందం) సెనేట్ తుది ఆమోద ముద్ర వేసింది. సుదీర్ఘమైన చర్చల అనంతరం గురువారం రాత్రి ఓటింగ్ నిర్వహించారు. 63–36 ఓట్లతో బిల్లు ఆమోదం పొందింది. సంతకం కోసం అధ్యక్షుడు జో బైడెన్ డెస్క్‌కు పంపించారు. ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాల్చనుంది. దేశ రుణ పరిమితిని 31.4 ట్రిలియన్ డాలర్లకు పెంచుతూ బిల్లును రూపొందించారు. అంటే మొత్తం అప్పులు 31.4 ట్రిలియన్ డాలర్లు దాటకూడదు. బిల్లుకు సెనేట్ ఆమోదం లభించడంతో కొత్త అప్పులు తీసుకొని, పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బడ్జెట్ కట్స్ ప్యాకేజీకి సైతం సెనేట్ ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం పొందడంలో అమెరికా ఇక ఊపిరి పీల్చుకోవచ్చని సెనెట్ మెజార్టీ నాయకుడు చుక్ షూమర్ చెప్పారు. ఇది అతిపెద్ద విజయం: బైడెన్ అమెరికా తన బాధ్యతలు నెరవేర్చే దేశం, బిల్లులు చెల్లించే దేశం అని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు మరోసారి నిరూపించారని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అమెరికా తన బాధ్యతలను ఎప్పటికీ చక్కగా నెరవేరుస్తుందని చెప్పారు. బిల్లుపై త్వరగా సంతకం చేస్తానన్నారు. చర్చల్లో ఎవరికీ కోరుకున్నది మొత్తం దక్కకపోవచ్చని, అయినప్పటికీ తాము ఎలాంటి పొరపాటు చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు లఅతిపెద్ద విజయమని బైడెన్ అభివర్ణించారు. -
'ప్రేమంటే ప్రేమే!' ఆ బిల్లుపై తక్షణమే గర్వంగా సంతకం చేస్తా: జో బైడెన్
అమెరికా సెనేట్ స్వలింగ, కులాంతర వివాహాలను రక్షించడానికి సంబంధించిన కీలక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లుకు 12 మంది రిపబ్లికన్లతో సహా 61 మంది సభ్యుల్లో దాదాపు 36 మంది సభ్యుల ఆమోదం లభించింది. ఈ మేరకు సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమేర్ మాట్లాడుతూ...ఈ చట్టం చాలా కాలంగా వస్తోంది కానీ ఇప్పుడే ఆమోదం లభించింది. స్వలింగ, వర్ణాంతర వివాహాలను సమాఖ్య చట్టంలో పొందుపరిచేలా చేసింది ఈ బిల్లు. అమెరికా నిష్కళంకమైన సమానత్వం వైపు అడుగులు వేసేలా కీలకమైన బిల్లును ఆమెదించిందని అన్నారు. ఈ బిల్లు ప్రకారం యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం ఇద్దరు వ్యక్తుల వివాహం చేసుకుంటే అది ఆ రాష్ట్రంలో చెల్లుబాటు అయితే కచ్చితంగా దాన్ని గుర్తించాలి. అలాగే యూఎస్ రాజ్యంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన వివాహాల గుర్తింపుకు పూర్తి హామీ ఇస్తోంది. అంతేగాక యూఎస్ రాష్ట్రాలు తమ చట్టాలకు విరుద్ధంగా వివాహా లైసెన్స్‌ను జారీ చేయాల్సిన అవసరం ఈ బిల్లుకు లేదు. ద్వైపాక్షిక ఎన్నిక ద్వారా ఈ చట్టాన్ని రూపొందించారు. అంతేగాక స్వలింగ వివాహాలను జరుపుకోవడానికి అవసరమయ్యే వస్తువులు లేదా సేవలను అందించడానికి ఇష్టపడని సంస్థలకు మతపరమైన రక్షణను అందించే సవరణ కూడా ఉంది. ఈ బిల్లు మతస్వేచ్ఛ పునరుద్ధరణ చట్టం రక్షణను తగ్గించడం లేదా రద్దు చేయడం వంటివి చేయకుండా నిరోధించే నిబంధనను కలిగి ఉంది. జూలైలో ఆమోదించిన ఈ బిల్లుపై యూఎస్ అధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించింది. సెనేట్ నవంబర్‌లో ఎన్నికల రోజు, జనవరిలో అధికారం చేపట్టే కొత్త చట్టసభల మధ్య ఈ బిల్లును ఆమోదించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ....ఈ ద్వైపాక్షిక ఓటును ప్రశంసించడమే కాకుండా సెనేట్ ఈ బిల్లును ఆమోందించనట్లయితే గర్వంగా ఆ బిల్లుపై సంతకం చేస్తాను. స్వలింగ సంపర్కులైన యువత తాము పూర్తి సంతోషకరమైన జీవితాలను గడిపి, స్వంత కుటుంబాలను రూపొందించుకునేలా ఈ బిల్లు చేస్తోంది. సెనేట్ రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్ యాక్ట్‌ని ఆమెదించడంతో అమెరికా ఒక ప్రాథమిక సత్యాన్ని పునరుద్ఘాటించే అంచున నిలబడి ఉంది. 'ప్రేమనేది ఎప్పటికే ప్రేమే' అమెరికన్లు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకునే హక్కును కలిగి ఉండాలి. అని బైడెన్ అన్నారు. (చదవండి: చిన్నారికి అత్యవసర శస్త్ర చికిత్స...ఆ రక్తం వద్దంటూ కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు) -
US Midterm Elections 2022: అమెరికా సెనేట్‌పై పట్టు నిలుపుకున్న డెమొక్రాట్లు
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌లో అత్యంత కీలకమైన ఎగువ సభ సెనేట్‌పై డెమొక్రాట్లు పట్టు నిలుపుకున్నారు. మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింట్లో డెమొక్రాటిక్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. నెవడాకు చెందిన డెమొక్రాటిక్ సెనేటర్ కేథరిన్ కార్టెజ్ మాస్‌తో తన రిపబ్లికన్ ప్రత్యర్థి ఆడం లక్సల్ట్పై విజయం సాధించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఆడం ఓటమి ట్రంప్‌కు వ్యక్తిగతంగా ఎదురు దెబ్బే. అరిజోనాలోనూ డెమొక్రాటిక్ సెనేటర్ మార్కె కెల్లీ గెలిచారు. దీంతో 100 మంది సభ్యులున్న సెనేట్‌లో డెమొక్రాట్ల సంఖ్య 50కి చేరింది. రిపబ్లికన్లకి 49 మంది సభ్యుల బలముంది. జార్జియాలో ఫలితం వెలువడాల్సి ఉంది. -
సీన్ రివర్స్.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయ్యింది. రిపబ్లికన్ పార్టీ స్వల్ఫ ఆధిపత్యం సాధించింది. అయితే అనుకున్న మేర ఫలితం సాధించలేకపోవడం గమనార్హం. ఈ తరుణంలో డెమోక్రటిక్ పార్టీ నేత, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి రోజు అంటూ వ్యాఖ్యానించారాయన. ఓటర్లలో పేరుకుపోయిన నిరాశను అంగీకరించిన బైడెన్.. అధిక మెజారిటీ ద్వారా అమెరికన్లు తన ఆర్థిక ఎజెండాకు మద్దతు ఇచ్చారని చెప్పారు. ‘‘ఇది ఒక శుభదినం. బహుశా ప్రజాస్వామ్యానికి, అమెరికాకు మంచి రోజని భావిస్తున్న. రిపబికన్లదే పూర్తి హవా ఉంటుందని కొందరు అంచనా వేశారు. అది జరగలేదు’’ అంటూ వైట్ హౌజ్‌లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారాయన. మరోవైపు 2024 అధ్యక్ష ఎన్నికల కోసం సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ ఫలితాలు పెద్ద దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం 250 స్థానాలు ఆశించింది ఆ పార్టీ. పైగా ట్రంప్ వ్యక్తిగతంగా ప్రచారం చేసిన ప్రముఖులు ఓటమి చెందడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణంతో పాటు బైడెన్ ఎన్నిక చట్టబద్ధతను ప్రశ్నిస్తూ.. రిపబ్లికన్లు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 2018 తర్వాత మొదటిసారిగా 435 మందితో కూడిన యూఎస్ హౌజ్‌ను అతిస్వల్ఫ ఆధిక్యంతో తిరిగి కైవసం చేసుకునేందుకు ట్రాక్ ఎక్కింది. వంద మంది సభ్యున్న యూఎస్ సెనేట్‌లో ఇరు పార్టీలు 48 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక హౌజ్ ఆఫ్ రెప్రజెంటివ్స్లో రిపబ్లికన్ పార్టీ 207 సీట్లు, డెమోక్రటిక్ పార్టీ 183 స్థానాలు దక్కించుకున్నాయి(స్పష్టమైన ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది). గత 40 ఏళ్లలో ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు అత్యుత్తమమని బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
బైడెన్ ఇజ్జత్‌కా సవాల్.. ట్రంప్‌కి తాడేపేడో!
అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర (మిడ్ టర్మ్) ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. మంగళవారం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో వెలువడే ఫలితాలు ప్రస్తుత అధ్యక్షుడి మిగిలిన రెండేళ్ల పదవీ కాలంపై ప్రభావం చూపనున్నాయి. దేశ రాజకీయాలను సైతం తారుమారు చేసే అవకాశం లేకపోకపోలేదు. అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిష్టకు పరీక్షగా మారాయి. బైడెన్‌తోపాటు మాజీ అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రచారం హోరెత్తించారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడ్డారు. మధ్యంతర ఎన్నికలంటే? అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌లో రెండు సభలుంటాయి. అవి హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్. అధ్యక్షుడి పదవీ కాలం నాలుగేళ్లు. కాంగ్రెస్‌కు ప్రతి రెండేళ్లకోసారి.. అధ్యక్షుడి పదవీ కాలం మధ్యలో(సగం ముగిసినప్పుడు) ఎన్నికలు జరుగుతాయి. అందుకే వీటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సెనేటర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే మొత్తం సెనేటర్లు 100 మంది. వారి పదవీ కాలం ఆరేళ్లు. మొత్తం 435 మంది ప్రతినిధులు ఉంటారు. ఇక జనాభాను బట్టి రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల సంఖ్య మారుతుంది. వారి పదవీ కాలం రెండేళ్లు. ప్రతినిధుల సభలోని అన్ని స్థానాలతోపాటు సెనేట్‌లో మూడొంతుల్లో ఒక వంతు స్థానాలకు (35 సీట్లు) ఎన్నికలు నిర్వహిస్తారు. అంతేకాకుండా కొన్ని పెద్ద రాష్ట్రాల్లో గవర్నర్లను కూడా ఎన్నుకుంటారు. గెలిచేదెవరో? అధికార డెమొక్రటిక్ పార్టీకి కాంగ్రెస్ ఉభయ సభల్లో గత రెండేళ్లుగా మెజారిటీ ఉంది. అందుకే జో బైడెన్ మదిలోని ఆలోచనలు సులభంగా చట్టాలుగా మారుతున్నాయి. కానీ, ప్రతిపక్ష రిపబ్లికన్లతో పోలిస్తే డెమొక్రాట్ల ఆధిక్యం స్వల్పమే. కాబట్టి మధ్యంతర ఎన్నికల్లో ఇరుపక్షాల నడుమ ఉత్కంఠభరితమైన పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు, సెనేట్‌లో డెమొక్రాట్లు పాగా వేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతినిధుల సభలో 435 స్థానాలు ఉండగా, కేవలం 30 స్థానాల్లో గట్టి పోటీ ఉండనుంది. ఇక సెనేట్‌లో 35 సీట్లలో హోరాహోరీ పోరు సాగనుంది. దేశవ్యాప్తంగా అమలయ్యే చట్టాలను కాంగ్రెస్ రూపొందిస్తుంది. ఏయే చట్టాలను తీసుకురావాలో హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ) నిర్ణయిస్తుంది. ఆ చట్టాలను సెనేట్ అడ్డుకోవచ్చు లేదా ఆమోదించవచ్చు. అధ్యక్షుడు తీసుకున్న నిర్ణ యాలకు సెనేట్ ఆమోద ముద్ర వేస్తుంది. అత్యంత అరుదుగా వాటిపై విచారణ కూడా జరపవచ్చు. ప్రభావితం చేసే అంశాలేమిటి? దేశంలోకి వెల్లువెత్తుతున్న వలసలు, పెరిగిపోతున్న నేరాలు, జీవన వ్యయం వంటివి మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిపక్ష రిపబ్లికన్లకు ఉపకరించనున్నాయి. ఆగస్టులో నిర్వహించిన సర్వేలో అధ్యక్షుడు బైడెన్ పట్ల 50 శాతం కంటే తక్కువ ప్రజామోదం ఉన్నట్లు తేలింది. ఇది ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించింది. మధ్యంతర ఎన్నికలు సాధారణంగా అధ్యక్షుడి పనితీరును ప్రతిబింబిస్తాయి. ఈ ఫలితాలను ఆయన పాలనపై ప్రజాతీర్పుగా భావించవచ్చు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల పట్టు సాధిస్తే.. వాతావరణ మార్పులు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, గర్భస్రావ హక్కుల పరిరక్షణ, తుపాకీ సంస్కృతిని కట్టడి చేయడం వంటి అంశాల్లో బైడెన్ మరింత దూకుడుగా ముందుకెళ్లొచ్చు. ఏదో ఒక సభలో రిపబ్లికన్లు పైచేయి సాధిస్తే మాత్రం బైడెన్ అజెండాకు అడ్డుకట్ట తప్పదు. అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేస్తుందా? మధ్యంతర ఎన్నికల ఫలితాల ఆధారంగా.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారో ఒక అంచనాకు రావొచ్చు. రిపబ్లికన్ పార్టీ నుంచి తానే పోటీ చేయబోతున్నానని మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో నెగ్గకపోతే ఆయనకు అవకాశాలు తగ్గిపోతాయి. మిషిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా వంటి పెద్ద రాష్ట్రాలను డెమొక్రాట్లు నిలబెట్టుకుంటే బైడెన్ మళ్లీ అధ్యక్షుడు అయ్యే చాన్సుది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA: ఏడేళ్లు నివాసముంటే గ్రీన్‌కార్డు!
వాషింగ్టన్: అమెరికాలో ఉంటూ ఏళ్ల తరబడి గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న 80 లక్షల మందికి శుభవార్త ఇది. వీరికి శాశ్వత నివాస హోదా కల్పించే కార్డును మంజూరు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నలుగురు సభ్యుల బృందం సెనేట్‌లో ప్రవేశపెట్టింది. ఇమిగ్రేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ సెనేటర్లు అలెక్స్ పడిల్లా, ఎలిజబెత్ వారెన్, బెన్ రే లుజాన్, సెనేట్ మెజారిటీ విప్ డిక్ డర్బన్ బుధవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీని ప్రకారం.. అమెరికాలో వరుసగా కనీసం ఏడేళ్లపాటు నివాసం ఉన్న వలసదారు చట్టబద్ధమైన శాశ్వత నివాస అర్హత పొందవచ్చు. ‘గతంలో సవరించిన ఇమిగ్రేషన్ విధానం ఎందరికో ఇబ్బందికరంగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. మా బిల్లులో గత 35 ఏళ్లలోనే మొదటిసారిగా రిజిస్ట్రీ కటాఫ్ తేదీని సవరించాం. దీనితో మరింతమంది వలసదారులు చట్టబద్ధ శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’అని సెనేటర్ పడిల్లా చెప్పారు. ‘దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉండి పనులు చేసుకుంటూ అభివృద్ధిలో తమ వంతు తోడ్పాటునందిస్తున్న లక్షలాది మంది వలసదారులు అనిశ్చితితో భయపడాల్సిన అవసరం లేకుండా ఇకపై స్వేచ్ఛగా జీవించవచ్చు’అని ఆయన అన్నారు. ‘‘ఈ బిల్లు కార్యరూపం దాలిస్తే డ్రీమర్లు, లాంగ్ టర్మ్ వీసాదారుల సంతానం, అత్యవసర సిబ్బంది, హెచ్–1బీ వీసాలు కలిగిన అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తదితర 80 లక్షల మందికి ప్రయోజనం ఉంటుంది’’ అని వలసదారుల తరఫున పనిచేసే ఎఫ్‌డబ్ల్యూడీ డాట్ యుఎస్ అంచనావేసింది. ‘చట్టపరమైన అడ్డంకి వల్ల వలసదారులు గ్రీన్‌కార్డుకు నోచుకోలేకపోతున్నారని హౌస్ సబ్ కమిటీ సారథి లోఫ్గ్రెన్ అన్నారు. ఈ పరిణామాన్ని ఆశావహులు స్వాగతించారు. -
గన్ కంట్రోల్ బిల్లుకు అమెరికా సెనేట్ అమోదం
వాషింగ్టన్: ఆత్మరక్షణ కోసం తుపాకులు వాడటం అమెరికన్లకు రాజ్యాంగమిచ్చిన హక్కు అంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, తుపాకుల నియంత్రణకు రూపొందిన చరిత్రాత్మక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఎగువ సభ సెనేట్ ఆమోద ముద్ర వేసింది. తుపాకుల కొనుగోలుపై ఆంక్షలు విధించే అత్యంత కీలకమైన ఈ బిల్లును ఆమోదించింది. 50 మంది డెమొక్రాట్లతో పాటు తుపాకుల నియంత్రణను తీవ్రంగా వ్యతిరేకించే రిపబ్లికన్ పార్టీకి చెందిన 15 మంది సెనేటర్లు కూడా అనుకూలంగా ఓటేయడం విశేషం. దాంతో 100 మంది సభ్యుల సెనేట్‌లో 65–33 తేడాతో బిల్లు గట్టెక్కింది. దీన్ని త్వరలో డెమొక్రాట్ల ఆధిక్యమున్న దిగువ సభ (ప్రతినిధుల సభ)లో బిల్లు ప్రవేశపెడతారు. అయితే ఆమోదం లాంఛనమే. అనంతరం అధ్యక్షుడు జో బైడెన్ సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. దీనిపై బైడెన్ హర్షం వెలిబుచ్చారు. ‘‘28 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌లో చలనం వచ్చింది. తుపాకుల హింసకు అడ్డుకట్ట పడాలని కుటుంబాలకు కుటుంబాలు రోడ్డెక్కడంతో కాంగ్రెస్ సభ్యులంతా ఏకమయ్యారు’’ అని వ్యాఖ్యానించారు. బిల్లులో ఏముంది? 21 ఏళ్ల కంటే తక్కువున్న వారు తుపాకులు కొనుగోలు చేస్తే వారి నేపథ్యంపై విస్తృతంగా వివరాలు సేకరిస్తారు. పాఠశాలల్లో భద్రతను పెంపొందించడానికి, ప్రజల్లో మానసిక సమస్యల నివారణకు ఆరోగ్య కార్యక్రమాలకు 1500 కోట్ల డాలర్ల నిధుల్ని కేటాయిస్తారు. ఎవరి చేతులోనైనా తుపాకులు ప్రమాదకరమని భావిస్తే లైసెన్స్ రద్దు చేసి తుపాకులు వెనక్కు తీసుకునే అధికారాలు రాష్ట్రాలకు సంక్రమిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్ ఫ్లాగ్ చట్టాలు అమలు చేయడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. -
రహస్య భూగర్భ రైలు మార్గం: ఎక్కడ ఉందో, దాని చరిత్ర ఏంటో తెలుసా?
పూర్వం రాజులు శత్రు రాజులు తమ పై దండయాత్ర చేసినప్పుడు తప్పించుకోవడానికి లేదా ఒక వేళ యుద్ధంలో తాను ఓడిపోతే తన పరివారాన్ని రక్షించుకోవటం కోసం కోటలో ప్రత్యేకంగా భూగర్భ మార్గం(సోరంగం) కచ్చితంగా ఏర్పాటై ఉండేవి. వాటి సాయంతో తప్పించుకోవటం వంటివి చేసేవారు. లేదా రాజు రహస్యంగా దేశ సంచారం చేయాలనుకున్న ఆ రహస్య మార్గం గుండా వచ్చేవారు. ఎవ్వరికి తెలియనచ్చేవారు కాదు. అచ్చం అదేవిధంగా వాషింగ్టన్లో రహస్య భూగర్భ మార్గం ఉంది. కాకపోతే అది సొరంగాలా కాకుండా భూగర్భ రైలు మార్గం(సబ్వే). అసలు అది ఎక్కడ ఉంది దాని చరిత్ర ఏంటో తెలుకుందాం రండి వాషింగ్టన్: వాషింగ్టన్లో ఉన్న ఈ రహస్య భూగర్భ రైలు(సబ్వే) మార్గం గుండా ప్రముఖులు, సుప్రీం కోర్టు జడ్జీలు, ప్రముఖ బాలీవుడ్ ప్రయాణించేవారట. పైగా విశేషమేమిటంటే చాలామంది అమెరికన్లకు కూడా ఈ సబ్వే ఒకటి ఉందని తెలుసుంటున్నారు చరిత్రకారులు. ఒక రకంగా చెప్పాలంటే ఈ భూగర్భ రైలు యునైటెడ్ స్టేట్స్ సెనేట్ ప్రతినిధుల సమావేశమయ్యే వాషింగ్టన్ శ్వేత సౌధంలా ఉంటుందంటున్నారు. మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన లైట్ల వెలుగులో అత్యంత క్లిష్టతరమైన గందరగోళ మార్గం, పైగా ఈ మార్గంలోకి వెళ్లంగానే బయట ఏం జరుగుతోందో కూడా మనకు తెలయదని సెనేట్ హిస్టారికల్ ఆఫీస్‌లోని సహాయక చరిత్రకారుడు హిస్టారియన్ డాన్ హోల్ట్ చెబుతున్నారు. ఒక శతాబ్దానికి పైగా రాజకీయ నాయకులు ఈ సబ్వేని ఉపయోగించారని చెబుతున్నారు. సెనెటర్లు, ప్రముఖులు ఎక్కువగా తమ కుటుంబాలతో వచ్చి గడిపేవారని, పైగా ప్రముఖుల పిల్లలు ఈ రైలులో ప్రయాణించడానికీ ఎకువగా ఇష్టపడేవారని అన్నారు. చరిత్రకారుడు హోల్ట్ ఈ రైలు ఏదో ప్రత్యేకత ఉందంటున్నారు. ఈ భూగర్భ మార్గం మూడే వేల అడుగుల లోతులో ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు సెనెటర్లు విలేకర్లు సమావేశం, రాజకీయ చర్చలు, పుకార్లతో విసిగిన అధికారులకు ఈ మార్గం గుండా ప్రయాణమనేది వారికీ అత్యంత నిశబ్దంతో కూడిన ప్రశాంతమైన జర్నీలా ఉంటుందని పేర్కొన్నారు. (చదవండి: చిప్సెట్ల కొరత.. చైనాకు చెక్ పెట్టేలా ఇండియా ప్లాన్ !) అలుముకున్న కొన్ని వివాదాలు .. ఇక్కడ ఒక మాజీ పోలీస్ అధికారి విలియమ్ కైసర్ అప్పటి అధ్యక్షుడి జాన్ బ్రిక్కర్ పై కాల్పులు జరిపాడని చెప్పారు. అంతే కాక అమెరికా 27వ అధ్యక్షుడు హోవార్డ్ టాఫ్ట్ ఇక్కడే అదృశ్యమైనట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిందన్నారు. దీంతో ప్రస్తుతం సెనెటర్లకు ఈ మార్గం అంటేనే భయంగలిగించే విధంగా అయ్యిందని ప్రస్తుతం ఈ మార్గాన్ని వినయోగించటం లేదని పేర్కొన్నారు. ఎప్పుడు ప్రారంభించారంటే...... ఈ భూగర్భ రైలు మార్గం మార్చి 7, 1990లో ప్రారంభమైంది. వాషింగ్టన్‌లోని తమ కార్యాలయాలకు వెళ్లడానికీ ఈ మార్గాన్ని వినియోగించేవారు. ఈ తర్వాత కాలంలో 1960లో 75 వేల డాలర్లలతో ఎలక్ట్రిక్ మోనో రైలులో రూపోందించారు. ప్రతినిధుల సమావేశాలు కూడా జరుపుకునే ఆఫీస్ కార్యాలయంలా అత్యధునిక టెక్నాలజీతో ఆ రైలుని రూపొందించారు. తదనంతరం 1993లో 18 వేల డాలర్లతో డిస్నీ ల్యాండ్ తరహా డ్రైవర్ లెస్ రైలును సరికొత్త హంగులతో ఆవిష్కిరించారు. కానీ కాలక్రమంలో అత్యధునిక టెక్నాలజీతో రూపాంతరం చెందుతున్న ఈ భూగర్భ రైలు(సబ్వే)ను చాలా మంది సెనెటర్లు అంతగా ఇష్టపడలేదనేది చారిత్రకారుల అభిప్రాయం. ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటు ఫిర్యాదులు వచ్చాయని చరిత్రకారులు అంటున్నారు. హమిల్లన్ అనే మ్యూజికల్ అల్బమ్ సృష్టి కర్త లిన్-మాన్యువల్ మిరాండా 2017లో అవార్డు తీసుకోవడానికి వెళ్లినప్పుడు ఈ మార్గం గుండా రైడ్ చేయాలనుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు. దీంతో ఈ భూగర్భ రైలు మార్గం వార్తల్లో నిలివడమే కాక ప్రజల్లో చర్చలకు తెరలేపింది. ఏది ఏమైనప్పటికీ ఈ భూగర్భ రైలు మార్గం(సబ్వే) ప్రముఖులను ఉద్దేశించి ఆవిష్కరించినదే అయినా కొన్ని వివాదాల కారణంగా శతాబ్దాలకు పైగా రాజకీయ నాయకులు ఉపయోగించిన అత్యాధునిక టెక్నాలజీతో కూడిన చారిత్రక రహస్య భూగర్భ రైలుగా మిగిలిపోయిందని సహాయక చరిత్రకారుడు హోల్ట్ అభివర్ణించారు. (చదవండి: భయంకరమైన బావి.. నరక కూప మర్మం చేధించిన సాహసికులు) -
USA: సీమా నందా నియామకానికి సెనేట్ ఆమోదం
వాషింగ్టన్ : అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయ సంతతి మహిళకి చోటు లభించింది. కార్మిక శాఖ సొలిసిటర్గా భారత సంతతికి చెందిన పౌరహక్కుల న్యాయవాది సీమా నందా నియామకానికి అమెరికన్ సెనేట్ ఆమోద ముద్ర వేసింది. 48 ఏళ్ల వయసున్న సీమా నందా డెమొక్రాటిక్ నేషనల్ కమిటీకి సీఈఓగా కూడా పని చేశారు. ఒబామా హయాంలో కార్మిక శాఖకి సేవలు అందించారు. కాగా నందా నియామకాన్ని సెనేట్ 53–46 ఓట్లతో ఆమోదించింది. సీమా నందా నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కరోనా ముప్పు, వాతావరణంలో మార్పులతో యాజమాన్యాలు, కార్మికులు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొం టున్న తరుణంలో కార్మిక శాఖ సొలిసిటర్గా ఆమె నియామకం అత్యంత కీలకంగా మారింది. -
అమెరికాలో తొలి పాక్–అమెరికన్ జడ్జి
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక పాక్–అమెరికన్ వ్యక్తి ఫెడరల్ జడ్జిగా ఎంపికయ్యారు. దీనికి సంబంధించిన ఓటింగ్‌కు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో అమెరికా మొట్టమొదటి ముస్లిం–అమెరికన్ ఫెడరల్ జడ్జిగా పాకిస్తాన్ సంతతికి చెందిన జాహిద్ ఖురేషీ (46) నియమితులయ్యారు. న్యూజెర్సీలోని జిల్లా కోర్టులో ఆయన విధులు నిర్వహించనున్నారు. కాగా, ఖురేషీ ఎంపికకు సంబంధించి సెనెట్ 81–16 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఈ ఓటింగ్‌లో దాదాపు 34 మంది రిపబ్లికన్లు డెమొక్రాట్లతో ఏకీభవించడం గమనార్హం. దీనిపై సెనెటర్ రాబర్ట్ మెనెండెజ్ స్పందిస్తూ.. జడ్జి ఖురేషీ దేశానికి సేవ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నారని కొనియాడారు. ఆయన నియామకం ద్వారా అమెరికాలో ఏదైనా సాధ్యమే అని మరో సారి రుజువైందన్నారు. న్యూజెర్సీ కోర్టులో ఇప్పుడు వైవిధ్యం సాధ్యమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, 2019లో ఖురేషీ న్యూజెర్సీలోని ఓ కోర్టుకు మేజిస్ట్రేట్‌గా ఎంపికయ్యారు. ఇక ఖురేషీ ఎంపికపై ఇస్లాం వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుండగా, పాక్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. 46 ఏళ్ల ఖురేషీ 2004, 2006లో ఇరాక్‌లో పర్యటించాడు. అంతేకాదు ఆయన తండ్రి కూడా గతంలో ప్రాసెక్యూటర్గా పని చేశాడు. చదవండి: ట్రంప్ రీఎంట్రీ.. ఎలా సాధ్యమంటే.. -
Green Card: గ్రీన్ కార్డులకు కోటా రద్దు
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాస హక్కు(గ్రీన్ కార్డు) పొందేందుకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణుల కల సాకారమయ్యే పరిణామమిది. గ్రీన్ కార్డుల జారీకి ఇప్పటివరకు ఉన్న దేశాలవారీ కోటాను ఎత్తివేయాలనే ప్రతిపాదనకు ప్రతినిధుల కాంగ్రెస్ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. జో లోఫ్గ్రెన్, జాన్ కర్టిస్ అనే సభ్యులు ‘ది ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయ్మెంట్(ఈఏజీఎల్ఈ)చట్టం– 2021’ను సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 365 మంది వ్యతిరేకిస్తూ 65 మంది ఓటేశారు. సెనేట్ ఆమోదం కూడా పొందితే అధ్యక్షుడు బైడెన్ సంతకంతో ఈ ప్రతిపాదనలు చట్ట రూపం దాల్చుతాయి. ప్రస్తుత వలస విధానంలో భారత దేశానికి కేటాయించిన 7 శాతం కోటా.. హెచ్–1బీ వర్కింగ్ వీసాపై అమెరికాలో ఉంటున్న అత్యున్నతస్థాయి భారతీయ నిపుణులకు గ్రీన్‌కార్డు లభించడంలో ప్రధాన అడ్డంకిగా మారింది. తాజా బిల్లులో, 7 శాతం పరిమితిని ఎత్తివేయడంతోపాటు ఈ కోటాను 15 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఇమిగ్రేషన్, సిటిజన్ షిప్‌పై ఏర్పాటైన కాంగ్రెస్ ఉప కమిటీ చైర్మన్ లోఫ్గ్రెన్ మాట్లాడుతూ.. ‘తాజా నిబంధనలు అమలైతే, నైపుణ్యాల ఆధారంగా గ్రీన్‌కార్డులు అందుతాయి. అమెరికా కంపెనీలు ఉత్పత్తులు, సేవలు, ఉద్యోగాలను కల్పించేందుకు గాను అత్యున్నత స్థాయి నిపుణులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది’అని లోఫ్గ్రెన్ పేర్కొన్నారు. ప్రస్తుత నిబంధనలపై సుమారు 10 లక్షల మంది భారతీయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. -
ఆ బిల్లుకు సెనేట్ ఆమోదం
వాషింగ్టన్: ఆసియన్ అమెరికన్లతోపాటు పసిఫిక్ ఐలాండర్స్‌పై పెరుగుతున్న విద్వేష పూరిత నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు సెనేట్ గురువారం ఆమోదముద్ర వేసింది. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో పెరిగిపోయిన ఇటువంటి ఘటన లను సెనేట్‌లోని డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ముక్త కంఠంతో ఖండించారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య జనవరిలో కుదిరిన అంగీకారం ప్రకారం సెనేట్ ఈ బిల్లును 94–1 ఓట్ల తేడా తో ఆమోదించింది. తాజా పరిణామంతో విద్వేష నేరాల దర్యాప్తును వేగవంతం చేయడానికి వీలుపడుతుంది. కొద్ది వారాల్లో ఈ బిల్లు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు సమాన సంఖ్యలో ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు వెళ్లనుంది. ( చదవండి: అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా ) -
అమెరికా ఫస్ట్’ నుంచి ‘అమెరికా లాస్ట్’కు: ట్రంప్
వాషింగ్టన్: 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘అమెరికా ఫస్ట్’ నుంచి ‘అమెరికా లాస్ట్’కు దిగజారామన్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక సోమవారం తొలిసారి బహిరంగ సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఆర్లాండొలో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘మనం మళ్లీ గెలుపుబాట పట్టాలి. ముందు సెనెట్ ఎన్నికల్లో గెలుపొందాలి. తరువాత, రిపబ్లికన్ అధ్యక్షుడు వైట్‌హౌజ్‌లో మళ్లీ అడుగుపెట్టాలి’ అని మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య వ్యాఖ్యానించారు. 2022 మిడ్ టర్మ్ ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని, అలా చేయడం వల్ల కన్సర్వేటివ్ ఓట్లు చీలుతాయని ట్రంప్ పేర్కొన్నారు. రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ గెలిస్తే.. ఆయనకు అధ్యక్ష ఎన్నికల్లో మద్దతిస్తానని రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత మిట్ రోమ్నీ ఇప్పటికే ప్రకటించారు. కరోనాపై పోరు సహా అన్ని అంశాల్లో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని ట్రంప్ విమర్శించారు. అక్రమ వలసదారుల కోసం సరిహద్దులను తెరిచారన్నారు. ట్రంపిజం అంటే దృఢమైన సరిహద్దులని వ్యాఖ్యానించారు. పారిస్ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరడంపై బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. వాతావరణ సమతౌల్యత విషయంలో అమెరికా కన్నా భారత్, చైనా, రష్యాల బాధ్యత ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. ‘రష్యా, చైనా, భారత్‌లు కాలుష్యాన్ని వెదజల్లుతూ ఉంటే, ఆ భారం మనపై పడుతోంది’ అని విమర్శించారు. -
వద్దంటే వద్దు నీరానా.. ససేమిరా
అమెరికా అధ్యక్షుడు ఎవర్ని ఏ అత్యున్నత స్థాయి పదవిలో నియమించినా ఆ నియామకాన్ని సెనెట్ ఆమోదించాలి. సెనెట్‌లో వంద మంది సభ్యులు ఉంటారు. వారిలో కనీసం 51 మంది అనుకూలంగా ఓటు వేస్తేనే వారు ఆ స్థానానికి అర్హత సాధిస్తారు. సాధారణంగా అధ్యక్షుడు నియమించిన వ్యక్తిపై వ్యతిరేకత ఉండదు కానీ.. ప్రస్తుతం నీరా టాండన్ విషయంలో సెనెట్ నియామక కమిటి ఇప్పటికి రెండుసార్లు ఓటింగ్‌ను వాయిదా వేసింది. అందుకు కారణం ప్రస్తుతం సెనెట్‌లో ఉన్న 50 మంది రిపబ్లికన్లతో పాటు, డెమోక్రాటిక్ పార్టీలోని ఒకరిద్దరు ఆమెను వ్యతిరేకిస్తుండటమే! గతంలో సోషల్ మీడియాలో ఆమె ప్రదర్శించిన నోటి దుడుకుతనమే ఇప్పుడు ఆమె నియామకాన్ని ఓకే చేసే ఓటింగ్‌ను జాప్యం చేస్తున్నాయి. నీరా టాండన్ డెమోక్రాటిక్ పార్టీ సభ్యురాలు అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆమె పూర్వపు ‘ప్రవర్తనను’ వ్యతిరేకిస్తున్న వారు డెమోక్రాటిక్ పార్టీలోనూ ఉండటతో ఆమె నియామక నిర్థారణ అవకాశాలు సన్నగిల్లాయి. నీరా ప్రస్తుతం వాషింగ్టన్‌లోని ‘సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్’కు నేతృత్వం వహిస్తున్నారు. ఆర్థిక, న్యాయ విషయాల్లో నిపుణురాలిగా గుర్తింపు పొందిన నీరాను బైడెన్ తన బడ్జెట్ చీఫ్‌గా నామినేట్ చేశారు. ఆ పదవిని చేపట్టడానికి అవసరమైన సామర్థ్యాలు ఆమెకు ఉన్నప్పటికీ కేవలం ఆమె ‘ప్రవర్తన’ కారణంగా ఆ నామినేషన్‌కు ఆమోదం లభించడం కష్టమవుతోంది. అభ్యంతరం చెబుతున్నది సొంత పార్టీలోని ఒకరిద్దరే కనుక బైడెన్ మాట మీద సర్దుకుని పోతే సమస్యే లేదు. అటు, ఇటు సమానంగా పోలయినా.. ఉపాధ్యక్షురాలి ‘టై బ్రేక్’ ఓటు ఉంటుంది కనుక పరిస్థితి నీరాకు అనుకూలంగా మారవచ్చు. రిపబ్లికన్లు, డెమోక్రాటిక్‌లు నీరా నియామకాన్ని వ్యతిరేకించడానికి కారణంగా ప్రచారంలోకి తెస్తున్న ఆమె సోషల్ మీడియా వ్యాఖ్యలు, ట్వీట్లు కేవలం రాజకీయ పరమైనవే. అలాగే పక్షపాతమైనవిగా చెబుతున్న ఆమె ట్వీట్లు నిజానికి పక్షపాతరహితమైనవనీ, తన మన పర భేదం లేకండా సొంత పార్టీ విధానాలను కూడా ఖండిస్తూ ఆమె ట్వీట్లు పెడతారనీ పేరు ఉంది. కొంతమంది సెనెట్ సభ్యులనైతే ‘వరెస్ట్’ అని, ‘ఫ్రాడ్’ అని తిట్టిపోసిన ట్వీట్లూ ఉన్నాయి. వాటి సంగతి వదిలేస్తే.. ‘‘ప్రస్తుతం అమెరికా ఉన్న ఆర్థిక పరిస్థితిలో నీరా వంటి ప్రతిభగల ఆర్థిక నిపుణురాలు’’ అని అమెరికన్లలో అధికశాతం మంది విశ్వసిస్తున్నారు. ఆ కారణంగా బైడెన్ ఆమెను నామినేట్ చేశారు. ∙∙ యాభై ఏళ్ల నీరా భారత సంతతి మహిళ. బైడెన్ నియామకం కనుక ఆమోదం పొందితే బడ్జెట్ చీఫ్ అయిన తొలి నాన్–అమెరికన్ అవుతారు. నీరా మాసచుసెట్స్లో జన్మించారు. ఆమె ఐదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. తను తల్లి దగ్గరే పెరిగారు. రాజ్ అని ఒక సోదరుడు ఉన్నారు. భర్త, ఇద్దరు పిల్లలు. భర్త విజువల్ ఆర్టిస్టు. ఇంతవరకే ఆమె కుటుంబ వివరాలు. నీరా ‘లా’ చదివారు. డెమోక్రాటì క్ గవర్నర్, అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి పని చేశారు. క్లింటన్ విధేయులలో ఒకరు. హిల్లరీ క్లింటన్‌కి మంచి స్నేహితురాలు కూడా. ఒబామా తరఫున కూడా అధ్యక్ష ఎన్నికలకు ప్రచార బృంద సభ్యురాలిగా వ్యూహ రచన చేశారు. ‘సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్’ వ్యవస్థాపనలో కూడా కీలక పాత్రే వహించారు. నీరా తమను విమర్శించారని సెనెటర్లు బాధపడుతున్నారు కానీ ఆమె దేశాధ్యక్షులను కూడా వదల్లేదు. ఇజ్రాయెల్, లిబియా, సిరియా ప్రభుత్వ విధానాలను సైతం ఆమె ఘాటుగా విమర్శించారు. ఎవర్నీ లెక్క చేయని ఈ ముక్కుసూటి మనిషికి బడ్జెట్ బాధ్యతలనిచ్చి బైడెన్ మంచి నిర్ణయమే తీసుకున్నారని అంటున్నవారూ ఉన్నారు. -
బైడెన్ టీమ్ మరో భారతీయ మహిళా కిరణం
అమెరికాలో 20 లక్షల 80 వేల మంది ‘ఫెడరల్’ ఉద్యోగులు ఉన్నారు. వాళ్లందరికీ ఇప్పుడు కొత్త బాస్ మన భారతీయ మహిళ కిరణ్ అహూజా! స్వయంగా బైడెనే తన ఎంపికగా ఆమెను నియమించారు. ‘ఉద్యోగుల ప్రియబాంధవి’ గా ఆమెకు ఎంత మంచి పేరుందంటే యూఎస్‌లోని అన్ని వర్గాల ఉద్యోగులూ ‘ఈ తరుణంలో జరగవలసిన నియామకం’ అని బైడెన్‌ని అభినందిస్తున్నారు. కిరణ్ అహూజాకైతే ఈ అభినందనలు ఆమె ‘లా’ డిగ్రీ పూర్తి చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటినుంచీ పుష్పగుచ్చంలా చేతికి అందుతూ ఉన్నవే! పాలనలోని అన్ని విభాగాలు, చట్టసభలు, రక్షణ రంగంలోని సిబ్బంది అంతా యూఎస్‌లో ఫెడరల్ సిబ్బందే. ఉద్యోగులుగా అభ్యర్థుల నియామకం మొదలు, పదవీ విరమణ వరకు వారి జీతాలు, సర్వీసులు, పదోన్నతులు, సంక్షేమ సదుపాయాలు, సౌకర్యాలు.. వీటన్నిటినీ యూ.ఎస్.లోని ఒ.పి.ఎం. చూస్తుంటుంది. ఒ.పి.ఎం. అంటే ఆఫీస్ ఆఫ్ పర్సనెల్ మేనేజ్మెంట్. సిబ్బంది నిర్వహణ కార్యాలయం. ప్రధాన కేంద్రం వాషింగ్టన్ డీసీలో ఉంది. ఆ ఒ.పి.ఎం. కే ఇప్పుడు భారత సంతతికి చెందిన కిరణ్ అర్జున్‌దాస్ అహూజా డైరెక్టర్‌గా వెళ్లబోతున్నారు. సెనెట్ ఆమె నియామకాన్ని ఆమోదించగానే ఒ.పి.ఎం. ఆమె చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇక అమెరికన్ ఉద్యోగుల బాగోగులన్నీ కిరణ్‌వే. కిరణ్‌నే ఈ పదవిలో నియమించడానికి తగినన్ని కారణాలే ఉన్నాయి. అధికార శ్రేణిలోని పదోన్నతి అంచెలలో భాగంగా చూస్తే.. కిరణ్ రెండున్నరేళ్ల పాటు 2015 నుంచి 2017 వరకు ఒ.పి.ఎం. డైరెక్టర్‌కు ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’గా పని చేశారు కాబట్టి పై అంచెగా ఆమె డైరెక్టర్ అయ్యారని అనుకోవాలి. అయితే అది మాత్రమే ఆమెను ఆ స్థాయికి తీసుకెళ్లిందని చెప్పడానికి లేదు. 49 ఏళ్ల కిరణ్.. పౌరహక్కుల న్యాయవాది. రెండు దశాబ్దాలకు పైగా ప్రజాసేవల సంస్థలకు నేతృత్వం, నాయకత్వం వహించిన అనుభవం ఆమెకు ఉంది. ప్రస్తుతం ఆమె యూఎస్‌లోని పరోపకార సంస్థల ప్రాంతీయ యంత్రాంగం అయిన ప్రసిద్ధ ‘ఫిలాంథ్రోఫీ నార్త్‌వెస్ట్’ కు సీఈవోగా ఉన్నారు. ఒబామా అధ్యక్షుడిగా, బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆరేళ్లపాటు ఏషియన్ అమెరికన్లకు ప్రాధాన్యం ఇచ్చి, వారికి మెరుగైన అవకాశాలను కల్పించే ‘వైట్ హౌస్ ఇనీషియేటివ్’ కార్యక్రమానికి కిరణ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆనాటి ఆమె పని తీరును బైడెన్ ప్రత్యక్షంగా చూడటం కూడా ఇప్పుడీ అత్యంత కీలకమైన ఒ.పి.ఎం. డైరెక్టర్ పదవికి ఆమె నామినేట్ అయేందుకు దోహదపడింది. 2003–2008 మధ్య నేషనల్ ఏషియన్ పసిఫిక్ ఆమెరికన్ ఉమెన్స్ ఫోరం వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమె అందించిన సేవలూ ఈ కొత్త పదవికి అవసరమైనవే. పౌరహక్కుల న్యాయవాదిగా కిరణ్ కెరీర్ ఆరంభం కూడా అత్యంత శక్తిమంతమైనది. స్కూల్ సెగ్రెగేషన్ మీద (బడులలో పిల్లల్ని జాతులవారీగా వేరు చేసి కూర్చొబెట్టడం), జాతివివక్ష వేధింపుల మీద ‘యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్’లో కేసు వేసిన తొలి న్యాయ విద్యార్థిని ఆమె. ∙∙ కిరణ్ అహూజా జార్జియా రాష్ట్రంలోని సవానాలో పెరిగారు. ఆమె తల్లిదండ్రులు డెబ్బైలలో ఇండియా నుంచి అమెరికా వెళ్లి స్థిరపడినవారు. జార్జియా యూనివర్సిటీలోనే ఆమె ‘లా’ లో పట్టభద్రురాలయ్యారు. ఒ.పి.ఎం.లో ట్రంప్ చేసి వెళ్లిన అవకతవకల్ని సరిచేసేందుకే బైడెన్ ఈ పోస్ట్‌లో ఆమెను నియమించారని ‘వాషింగ్టన్ పోస్ట్’ రాసింది. అమెరికాకు మరొక ఆశా కిరణం అనే కదా అర్థం. కిరణ్ అర్జున్‌దాస్ అహూజా -
అమెరికా మరింత నాగరికం కాబోతోందా?
యు.ఎస్. ప్రతినిధుల సభలోకి కొత్తగా తొమ్మిదిమంది మహిళా ఫెమినిస్టులు వచ్చారు! ఇప్పటికే సభలో స్పీకర్ మహిళ. ఆమె కూడా ఫెమినిస్టే. రెండు సభల్లోనూ (ఇంకోటి సెనెట్) మహిళలకు మద్దతుగా ఉండే ‘ప్రథమ మహిళ’ కూడా ఫెమినిస్టే. ఉపాధ్యక్షురాలు స్త్రీవాది. వీళ్లందరి శక్తి యుక్తులతో అమెరికా మరింత నాగరికం కాబోతోందా? ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని మనం కేరళను అంటున్నట్లుగా.. యూఎస్ ‘బ్లాక్స్ ఓన్ కంట్రీ’ అన్నంతగా సెన్సివిలైజ్ (సహజాతీయకరణ) చెందబోతోందా? యు.ఎస్. ప్రతినిధుల సభలో ప్రస్తుతం 119 మంది మహిళా సభ్యులు ఉన్నారు. వారిలో కొత్తగా ఈ ఏడాది జనవరిలో సభలోకి అడుగుపెట్టిన వారిలో తొమ్మిది మంది స్త్రీవాదులే కావడం ఇప్పుడొక విశేషం అయింది. సాధారణంగా ప్రతి మహిళా స్త్రీవాదిగానే ఉంటారు. స్త్రీల సమస్యల్ని ఆలోచించి పరిష్కారాల కోసం మార్గాలను అన్వేషించేవారు, అవసరమైతే పోరాడే వారే స్త్రీవాదులు. అయితే ఈ తొమ్మిది మంది మరింత శక్తిమంతమైన వారు. ప్రత్యక్షంగా పోరులో పాల్గొన్నవారు. అవసరం అయితే ప్రథమ మహిళను, సభ స్పీకర్, ఉపాధ్యక్షురాలినీ ప్రభావితం చేయగలిగినవారు. ఏకాభిప్రాయాన్ని కూడగట్టుకోగలిగినవారు. చట్టాలను చేయించగలిగినవారు. నికేమా విలియం, కోరీ బుష్, మ్యారీ న్యూమేన్, మ్యారిలిన్ స్ట్రిక్‌ల్యాండ్, తెరిసా లేజర్, శారా జాకబ్స్, క్యాథీ మ్యానింగ్, డొబోరా రాస్, కొరొలీన్.. ఆ తొమ్మిది మంది శక్తి స్వరూపిణులు. మన భాషలో ‘నవ దుర్గ’లు. వీళ్లంతా కూడా డెమోక్రాటిక్ పార్టీకి చెందినవారే. స్పీకర్ నాన్సీ పెలోసీ డెమోక్రాటిక్ పార్టీనే. ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఎలాగూ అదే పార్టీ. పై తొమ్మిది మందిలో నలుగురు ‘ఉమెన్ ఆఫ్ కలర్’. అంటే నాన్–అమెరికన్లు. ∙∙∙ ఈ తొమ్మిది మందిలో ప్రతి ఒక్కరికీ ఒక పోరాట నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం ఇప్పుడు అమెరికా కొత్త ప్రభుత్వ పాలనలో.. స్త్రీ సంక్షేమం కోసం, నల్లజాతి ప్రజలతో సమభావన కోసం వీరు ప్రతిపాదించే విధానాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. నికేమా విలియమ్స్‌నే తీసుకోండి. సభలో ఎవరి పదవీకాలం అయినా రెండేళ్లు కనుక ఈ రెండేళ్లలోనూ నికేమా అనేక ఆశ్చర్యాలను చేయబోతున్నారనే అనిపిస్తోంది. సభలోకి రాకముందు జార్జియా స్టేట్ సెనెటర్‌గా ఉన్నప్పుడు ఎన్నికలలో అక్రమాలకు వ్యతిరేకంగా ప్రదర్శన జరిపి అరెస్ట్ అయ్యారు. కోరీ బుష్, మ్యారీ న్యూమేన్ తమ పురుష ప్రత్యర్థుల్ని ఓడించి సభలోకి అడుగుపెట్టినవారు. అదొక ఘన విజయం. నిజమైన జాతీయ భావన అంటే అన్ని జాతుల్ని కలుపుకుని వెళ్లడం అని ఈ ఇద్దరూ తమ ప్రసంగాలతో మెప్పించారు. కొత్తగా సభలోకి వచ్చిన ఈ తొమ్మిది మందిలో విలియమ్స్‌తో పాటు కోరీ బుష్, మ్యారిలీన్ స్టిక్‌ల్యాండ్, థెరెసా లేజర్ ‘నాన్–అమెరికన్’లు. ‘బ్లాక్ లైవ్జ్ మేటర్’ కార్యకర్తలు. శారా జాకబ్స్ స్త్రీ శిశు సంక్షేమ చట్టాల చట్టాలకు అవసరమైన సవరణలు సూచించగలరు. క్యాథీ మ్యానింగ్ స్కూళ్ల సంస్కరణ వాది. డెబోరా రాస్ మానవ హక్కుల న్యాయవాది. కరోలిన్ ఆర్థిక వ్యవహారాల నిపుణురాలు. ఈ నైపుణ్యాలు, పోరాట పటిమలు అన్నీ యూఎస్ ప్రతినిధుల సభ ప్రో–ఉమెన్ నిర్ణయాలు తీసుకునేలా చేయ గలిగినవే. ఈ స్త్రీవాదులకు ఎలాగూ మిగతా మహిళా సభ్యుల మద్దతు ఉంటుంది. అంటే.. మనమొక సమభావన కలిగిన సరికొత్త ఆమెరికా ను, ఆ కొత్త వెలుగులో సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నామనే. -
గట్టెక్కిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా అభిశంసన నుంచి గట్టెక్కారు. జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించారని అభియోగాలు ఎదుర్కొన్న ట్రంప్ సెనేట్‌లో శనివారం జరిగిన ఓటింగ్‌లో 57–43 ఓట్ల తేడాతో బయటపడ్డారు. అమెరికా చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయి, అయిదుగురు ప్రాణాలను బలితీసుకున్న క్యాపిటల్ భవనం ముట్టడి హింసాత్మకంగా మారిన ఘటనలో ట్రంప్‌ని దోషిగా నిలబెట్టడంలో డెమొక్రాట్లు విఫలమయ్యారు. గద్దె దిగిపోయిన తర్వాత కూడా అభిశంసన ఎదుర్కొన్న మొదటి వ్యక్తి ట్రంప్, అంతే కాకుండా రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడు కూడా ట్రంప్ ఒక్కరే. అధ్యక్షుడిగా ఆయన తన అధికారాలన్నీ దుర్వినియోగం చేస్తున్నారన్న అభియోగాలపై గత ఏడాది ప్రవేశపెట్టిన అభిశంసన నుంచి కూడా ట్రంప్ బయటపడ్డారు. ఒకవేళ ట్రంప్ అభిశంసనకు గురైతే ఆ తర్వాత ఆయనను భవిష్యత్ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయడానికి వీల్లేకుండా తీర్మానం ఆమోదించాలని సెనేట్‌లో డెమొక్రాట్లు భావించారు. కానీ రిపబ్లికన్ పార్టీ వారికి సహకరించలేదు. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ దిగిపోయాక ఆయనపై అభిశంసన మోపడమే సరికాదని వాదించింది. మొత్తం 100 మంది సభ్యులున్న సెనేట్‌లో రెండింట మూడో వంతు మెజారిటీ అంటే 67 ఓట్లు వస్తే ట్రంప్ అభిశంసనకు గురవుతారు. ఈ సారి సెనేట్‌లో రెండు పార్టీలకు చెరి సమానంగా 50 సీట్లు ఉన్నాయి. మరో ఏడుగురు రిపబ్లికన్ పార్టీ సభ్యులు అభిశంసనకి మద్దతునిచ్చారు. దీంతో అభిశంసనకు అనుకూలంగా 57 మంది, వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. 10 ఓట్లు తక్కువ రావడంతో ట్రంప్‌పై అభియోగాలన్నీ వీగిపోయాయి. సెనేట్‌లో విచారణ కేవలం అయిదు రోజుల్లోనే ముగిసిపోయింది. అభిశంసన విచారణకే రిపబ్లికన్ పార్టీ పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. క్యాపిటల్ భవనంపై దాడిని ఖండించినప్పటికీ, అధికారాన్ని వీడిన తర్వాత ట్రంప్‌పై విచారణ అక్కర్లేదని మొదట్నుంచి చెప్పిన ఆ పార్టీ వాదనలకి పెద్దగా ఆస్కారం లేకుండానే విచారణని ముగించింది. ఇప్పుడే రాజకీయ ఉద్యమం మొదలైంది సెనేట్‌లో అభిశంసన నుంచి బయటపడిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో తనపై నిందలు మోపినట్టుగా మరే ఇతర అధ్యక్షుడిపైన జరగలేదని పేర్కొన్నారు. ఒక మంత్రగాడిని వేటాడినట్టుగా తన వెంట బడ్డారని దుయ్యబట్టారు. నిజం వైపు నిలబడి, న్యాయాన్ని కాపాడిన తన లాయర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనను రాజకీయంగా కూడా సమాధి చెయ్యాలని డెమొక్రాట్లు భావించినప్పటికీ కుదరలేదని, అసలు ఇప్పుడే తన రాజకీయ ఉద్యమం ప్రారంభమైందని ట్రంప్ అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్‌గా నిలబెట్టడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని ధిక్కరించారు ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన రిపబ్లికన్ సభ్యులపై డెమొక్రాట్లు మండిపడ్డారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసిన వ్యక్తిని కాపాడడం వల్ల ఇప్పుడు సెనేట్ కూడా అపఖ్యాతి పాలైందని అన్నారు. ట్రంప్‌ని ద్రోహిగా నిలబెట్టలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి పారిపోవడమేనని స్పీకర్ నాన్సీ పెలోసి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికే బీటలు అమెరికాలో ప్రజాస్వామ్యం బీటలు వారిందని మరోసారి రుజువైందని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రతీ అమెరికా పౌరుడికి నిజం వైపు నిలబడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అభిశంసన నుంచి ట్రంప్‌కి విముక్తి లభించిన వెంటనే బైడెన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అమెరికా చరిత్రలో ఇలాంటి విషాదకరమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. మన దేశంలో హింసకి, తీవ్రవాదానికి స్థానం లేదు. అమెరికా పౌరులు, ముఖ్యంగా నాయకులందరూ నిజంవైపు నిలబడి అబద్ధాన్ని ఓడించాలి. అలా జరగకపోవడం వల్ల ప్రజాస్వామ్యం చెదిరిపోయిందని అర్థం అవుతోంది’’ అని బైడెన్ పేర్కొన్నారు. -
ట్రంప్ అభిశంసనపై విచారణ మొదలు
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక మాజీ అధ్యక్షుడి అభిశంసనపై సెనేట్‌లో విచారణ మొదలైంది. ట్రంప్‌పై విచారణ అర్ధరహితం అంటూ రిపబ్లికన్ పార్టీ చేసిన వాదన ఓటింగ్‌లో వీగిపోయింది. ట్రంప్‌పై అభిశంసన విచారణ రాజ్యాంగబద్ధమేనంటూ సెనేట్ 56–44 ఓట్ల తేడాతో విచారణకు ఓకే చెప్పింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు విచారణకు మద్దతు పలికారు. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ఘటనలో ట్రంప్‌ని ముద్దాయిగా తేల్చడం, అలాంటి వ్యక్తికి రిపబ్లికన్లు కొమ్ము కాస్తున్నారని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసమే డెమొక్రాట్లు అభిశంసన తీర్మానంపై విచారణకు పట్టుపట్టారు. దీంతో రెండోసారి అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా, పదవి నుంచి దిగిపోయాక అభిశంసన ఎదుర్కొన్న వ్యక్తిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోతారు. అభిశంసన తీర్మానం సెనేట్‌లో నెగ్గే అవకాశం లేదు. సెనేట్‌లో రెండింట మూడు వంతుల మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తేనే తీర్మానం పాస్ అవుతుంది. అంటే 100 మంది సభ్యులున్న సభలో 67 మంది ఓట్లు వెయ్యాలి. రెండు పార్టీలకూ చెరి 50 మంది సభ్యుల బలం ఉంది. మరో ఆరుగురు రిపబ్లికన్లు అభిశంసనకు అనుకూలంగా ఉండడంతో 56 మంది అవుతారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే సభ చైర్మన్ కమలా హ్యారిస్ తన ఓటు వినియోగించుకుంటారు. ఏది ఏమైనా 67 మంది సభ్యుల మద్దతు లభించే అవకాశాలైతే లేవు. క్యాపిటల్ భవనం దాడి వీడియోలే ఆయుధం క్యాపిటల్‌పై దాడిని ట్రంప్ ప్రోత్సహించారన్న అభియోగాలపైనే అభిశంసన ప్రక్రియ కొనసాగుతుంది. సంబంధిత వీడియోలను వినియోగించాలని డెమొక్రాట్లు వ్యూహరచన చేస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా ట్రంప్ ఆందోళనకారుల్ని ఎలా రెచ్చగొట్టారో వీడియోల ద్వారా సభ సాక్షిగా నిరూపించడానికి సభ్యులు కసరత్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించి ట్రంప్‌ని బోనులు పెట్టడమే లక్ష్యంగా తాము ముందుకు వెళతామని సెనేట్‌లో ఇంపీచ్మెంట్ మేనేజర్ జామీ రాస్కిన్ చెప్పారు. అభిశంసనపై వాదనలు వినిపించుకోవడానికి ఇరుపక్షాలకు 16 గంటల చొప్పున సమయం కేటాయిస్తారు. అనంతరం సెనేట్ సభ్యులకు ఇరుపక్షాల్ని ప్రశ్నించడానికి నాలుగు గంటల సమయం కేటాయిస్తారు. అది పూర్తయి చర్చలు జరిగాక అభిశంసనపై ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ట్రంప్ అభిశంసనపై మాట్లాడుతున్న హౌజ్ ఇంపీచ్మెంట్ మేనేజర్ జేమీ రస్కిన్ -
అభిశంసనపై వాదనలకు ట్రంప్ లాయర్ల బృందం ?
వాషింగ్టన్: ఈ నెల 8వ తేదీ నుంచి సెనేట్‌లో ప్రారంభం కానున్న తన అభిశంసన విచారణకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై జరిగిన దాడికి ట్రంపే కారణమనీ, అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ట్రంప్ సొంత రిపబ్లికన్ పార్టీకి చెందిన 10 మంది సభ్యులు మద్దతు ఇచ్చారు. దీంతో ఈ నెల 8వ తేదీన అభిశంసనపై విచారణకు మార్గం సుగమ మైంది. ట్రంప్ తరఫున ప్రముఖ లాయర్లు డేవిడ్ ష్కోయెన్, బ్రూస్ ఎల్ కాస్టర్ వాదనలు వినిపించనున్నారు. డెమోక్రాట్లు మూడింట రెండొంతుల మద్దతు సాధిస్తే అభిశంసన ఆమోదం పొందుతుంది. ఫలితంగా ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం కోల్పోతారు. అయితే, సెనేట్‌లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు చెరో 50 మంది సభ్యుల బలం ఉంది. తీర్మానం ఆమోదం పొందాలంటే డెమోక్రాట్లకు మరో 17 మంది మద్దతు అవసరం. అమెరికా చర్రితలో రెండుసార్లు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కావడం గమనార్హం. -
‘తొలి ఉమన్ ఆఫ్ కలర్’ ఆమె
జనవరి 6న యూఎస్ సెనెట్‌లో ఒక రికార్డు నమోదు అయింది. వెర్మాంట్ రాష్ట్ర సెనెటర్‌గా కేషా రామ్ అనే 34 ఏళ్ల మహిళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్రానికి సెనెటర్ అయిన ‘తొలి ఉమన్ ఆఫ్ కలర్’ ఆమె. అంటే నాన్–వైట్. అదే ఆమె సృష్టించిన రికార్డు. అయితే అంతకన్న ఆసక్తికరమైన సంగతి మరొకటి ఉంది. సూట్లు, కోట్లు, సూట్ గౌన్లతో ఉండే వంద మంది సెనెటర్ల ఆ∙పాశ్చాత్య సభలో కేషా రామ్.. సల్వార్ కమీజ్ దుస్తుల్లో తన ప్రమాణ స్వీకారానికి భారతీయతను చేకూర్చారు! కేషా రామ్ భారత సంతతి మహిళ. సర్ గంగారామ్ ముని మనవరాలు. సల్వార్ కమీజ్ వేసుకుని ఆమె సెనెట్‌కు వెళ్లడం మనకొక ముచ్చటయింది ఇప్పుడు. ప్రమాణ స్వీకారం జరిగిన మూడు వారాలకు కేషా రామ్ సల్వార్ కమీజ్‌లో ఉన్న ఫొటో మొన్న మంగళవారం ట్విట్టర్లో ప్రత్యక్షం అయింది. లాహోర్‌లోని యూఎస్ కాన్సొలేట్ జనరల్ ఆ ఫొటోను పోస్ట్ చేసింది. ‘ఆధునిక లాహోర్ పితామహులు సర్ గంగారామ్ మునిమనవరాలు కేషా రామ్ వెర్మాంట్ స్టేట్ సెనెటర్ అయ్యారు. ప్రమాణ స్వీకార సందర్భంలో ఆమె సల్వార్ కమీజ్‌లో కనిపించారు’ అని కాన్సొలేట్ ఆమె ఫొటోను పెట్టి, ట్వీట్‌ను జతపరిచింది. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ కేషా రామ్ స్పందించారు. ‘నాకొక ఫ్రెండ్ చెప్పారు. లాహోర్ ప్రజలు ప్రతిరోజూ మా గ్రేట్ గ్రాండ్‌ఫాదర్ కోసం ప్రార్థనలు జరుపుతూ ఉంటారని! మహిళల ఆరోగ్యం కోసం, విద్య కోసం ఆయన ఎంతో చేశారని ఈ రోజుకూ తలచుకుంటూ ఉంటారట’ అని ట్వీట్ చేశారు. ‘ముత్తాతగారి వారసురాలిగా నన్ను గుర్తించడం నాకెంతో సంతోషకరమైన సంగతి’ అయిందని కూడా ఆమె అన్నారు. దీంతో సహజంగానే ఈ ‘గ్రేట్’ గ్రాండ్ ఫాదర్, ‘గ్రేట్’ గ్రాండ్ డాటర్లు వార్తల్లోకి వచ్చారు. ∙∙ కేష తండ్రి ముకుల్ రామ్. 1960 లలో పై చదువుల కోసం లాహోర్ నుంచి యూఎస్ వలస వచ్చారు. లాజ్ ఏంజెలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చదివారు. తర్వాత ఉద్యోగం చూసుకుని, పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయారు. కేషా తల్లి జెవిష్–అమెరికన్. కేషా చదువు కూడా కాలిఫోర్నియాలోనే. పై చదువులు యూనివర్సిటీ ఆఫ్ వెర్మాంట్‌లో. అక్కడ ఆమె విద్యార్థి సంఘానికి అధ్యక్షురాలు కూడా. 2008లో డిగ్రీ పూర్తయింది. వెంటనే పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. వెర్మాంట్ సభకు పోటీ చేసి గెలిచి, 21 ఏళ్ల వయసులో అతి చిన్న వయసు లేజిస్లేచర్‌గా గుర్తింపు పొందారు. 2016లో వెర్మాంట్ లెఫ్ట్‌నెంట్ గవర్నరుగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడి ప్రేమరీ రేస్‌లోనే ఓడిపోయాక, కొన్నాళ్లు రాజకీయాలకు విరామం ఇచ్చారు. తిరిగి వెర్మాంట్ సెనెటర్‌గా పోటీ చేసి గెలిచారు. ఇక కేష తాతగారి గురించి ఎంత చెప్పుకున్నా తరిగేది కాదు. లాహోర్కి 64 కి.మీ. దూరంలో ఉన్న మాంగ్తన్వాల పట్టణంలో 1851లో ఆయన జన్మించారు. రూర్కీలోని ప్రఖ్యాత థాంప్సన్ ఇంజనీరింగ్ కాలేజ్ (నేటీ ఐ.ఐ.టి.రూర్కీ) లో స్కాలర్‌షిప్‌తో ఇంజినీరింగ్ డిగ్రీ చేశారు. గోల్డ్‌మెడల్ సాధించారు. 1900లో లార్డ్ కర్జన్ దగ్గర సూరింటిండెంట్గా ఉన్నారు. లాహోర్ పట్టణ నిర్మాణానికి పన్నెండేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా వ్యవహరించారు. ఆ కాలానికి ‘గంగారామ్ పీరియడ్ ఆఫ్ ఆర్కిటెక్చర్’ అని ఈనాటికీ పేరు. ఢిల్లీలో, లాహోర్‌లో ఇప్పుడున్న గంగారామ్ హాస్పిటళ్లు ఆయన పేరు మీద వెలసినవే. -
చివరి రోజుల్లో.. అవమానభారంతో...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గద్దె దిగిపోవడానికి కేవలం పది రోజులే గడువు ఉన్నప్పటికీ అంతకంటే ముందే ఆయనను సాగనంపాలని డెమొక్రాట్లు కృతనిశ్చయంతో ఉన్నారు. క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో ఇక ఆయన చేష్టలు భరించలేని స్థితికి సొంత పార్టీ రిపబ్లికన్లు కూడా వచ్చారు. దీంతో సోమవారం నాడు ట్రంప్‌పై ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టనున్న అభిశంసన తీర్మానానికి మద్దతు పెరుగుతోంది. ట్రంప్ చర్యల్ని రిపబ్లికన్ నేతలు కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ‘‘ట్రంప్ చేసిన నేరం చిన్నది కాదు. వెంటనే ఆయనను గద్దె నుంచి దింపేయాలి’’అని రిపబ్లికన్ ప్రతినిధి పాట్ టూమీ వ్యాఖ్యానించారు. డెమొక్రాట్లకి ఆధిక్యం ఉన్న ప్రతినిధుల సభలో ట్రంప్‌పై ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానం నెగ్గడం లాంఛనమే. అయితే రిపబ్లికన్లు కూడా ట్రంప్ వైఖరితో విసిగి వేసారి ఉండడంతో వారి ఆధిక్యం ఎక్కువగా ఉన్న సెనేట్‌లో ఏమవుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ఉభయ సభల్లో 150 మందికిపైగా రిపబ్లికన్ సభ్యులు ట్రంప్‌పై తీసుకురానున్న అభిశంసనకు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ట్రంప్‌ను ఎందుకు అభిశంసించాలని అనుకుంటున్నారో, దానికి సంబంధించిన ఆర్టికల్స్ రచించడం కూడా పూర్తయిందని డెమొక్రాట్ సభ్యుడు టెడ్ లూయీ చెప్పారు. ఈ ఆర్టికల్స్‌కి 180 మంది మద్దతు ఉందన్నారు. క్యాపిటల్ భవనంపై దాడికి తన మద్దతుదారుల్ని రెచ్చగొడుతూ ట్రంప్ చేసిన ట్వీట్లు, వీడియోలన్నీ ఇప్పటికే డెమొక్రాట్లు సేకరించి ఉంచారు. సోమవారం నాడు డెమొక్రాట్లు ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానంపై బుధవారం ఓటింగ్ ఉంటుంది. అప్పటికి ట్రంప్ అధ్యక్ష పీఠం వీడడానికి వారం మాత్రమే గడువు ఉంటుంది. ప్రతినిధుల సభలో నెగ్గిన వెంటనే అభిశంసన తీర్మానం సెనేట్‌కి వెళుతుంది. రిపబ్లికన్లంతా ఏకమై ట్రంప్‌ను వ్యతిరేకిస్తే.. సెనేట్ కూడా అభిశంసనని ఆమోదిస్తే ఆయన గద్దె దిగాల్సిందే. అభిశంసన తీర్మానం ఉభయ సభల్లో నెగ్గితే ట్రంప్ అవమానభారంతో ఇంటి దారి పట్టడమే కాదు, మళ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేకపోవచ్చు. అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న వ్యక్తిగా కూడా ట్రంప్ నిలిచిపోతారు. ఏకాకి అవుతున్న ట్రంప్ ఎన్నికల్లో ఓటమిని హుందాగా అంగీకరించలేకపోవడం, ప్రజాస్వామ్యానికి గుండె కాయలాంటి చట్టసభల భవనంపై దాడికి అనుచరుల్ని ఉసిగొల్పడం వంటి చేష్టలతో ట్రంప్ ఏకాకిగా మారుతున్నారు. ఆయన మద్దతుదారుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో పాటు, ఆయన కేబినెట్లోని కొందరు మంత్రులు కూడా ట్రంప్‌కి వ్యతిరేకంగా మారారు. లిసా ముర్కోవ్స్కీ, ఆర్–ఆలస్కా అనే ఇద్దరు మహిళా మంత్రులు ట్రంప్‌ని వెంటనే గెంటేయాలంటూ పిలుపునిచ్చారు. ‘‘ట్రంప్ పదవిలో కొనసాగినన్నాళ్లూ దేశానికి, ప్రజాస్వామ్యానికే కాకుండా రిపబ్లికన్ పార్టీకి కూడా ప్రమాదమేనని కాంగ్రెస్ సభ్యుడు ఆడమ్ స్కిఫ్ అన్నారు. మరోవైపు అభిశంసన ప్రక్రియని ట్రంప్ ఎలా ఎదుర్కోబోతున్నారన్నది ఎవరికీ తెలియడం లేదు. సామాజిక మాధ్యమాల్లో ట్రంప్‌ని తొలగించడంతో ఆయన ప్రత్యామ్నాయ వేదికను ఎంపిక చేసుకునే పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. -
ట్రంప్‌కు ఊహించని షాక్..!
వాషింగ్టన్: అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్‌నకు ఘోర పరాభవం ఎదురైంది. రక్షణ రంగానికి సంబంధించిన కీలక బిల్లుపై వీటో(తిరస్కరణ) అధికారాన్ని ప్రయోగించిన ఆయనకు సెనేట్ గట్టి షాకిచ్చింది. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 81-13 ఓట్ల తేడాతో వీటోను తిరగరాస్తూ బిల్లుకు ఆమోదం తెలిపింది. కాగా అమెరికా సైనికులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు ఉద్దేశించిన 740.5 బిలియన్ డాలర్ల డిఫెన్స్ పాలసీ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, డిసెంబరు 23న ట్రంప్ ఈ బిల్లును తిరస్కరించారు. ఈ క్రమంలో అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా డెమొక్రాట్ల ఆధిపత్యం గల ప్రతినిధుల సభ సోమవారం బిల్లును ఆమోదించగా.. రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న సెనేట్ శుక్రవారం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక కాంగ్రెస్ ఆమోదంతో రక్షణ విధాన బిల్లు చట్టరూపం దాల్చనుంది. (చదవండి: అమెరికా బలగాలపై దాడికి చైనా సాయం?) కాగా 2016లో అధ్యక్ష పీఠం చేపట్టిన నాటి నుంచి ట్రంప్‌నకు గతంలో ఇలాంటి అనుభవం ఎన్నడూ ఎదురుకాలేదు. పదవి నుంచి తప్పుకొనే సమయం ఆసన్నమైన నేపథ్యంలో ఆయనకు ఈ విధంగా ఊహించని షాక్ తగిలింది. ఇక ఈ విషయంపై స్పందించిన ట్రంప్.. రిపబ్లికన్ల ఆధిపత్యం కలిగిన తెలివైన నిర్ణయం తీసుకోలేక పోయిందని తనదైన శైలిలో విమర్శించారు. టెక్నాలజీ కంపెనీలకు అపరిమిత అధికారాన్ని కట్టబెట్టే సెక్షన్ 230 నుంచి విముక్తి పొందే అవకాశాన్ని కోల్పోయేలా చేసిందని మండిపడ్డారు. ఇది నిజంగా విషాదకరమైన విషయమని పేర్కొన్నారు. కాగా డిఫెన్స్ పాలసీ బిల్లు ద్వారా భారీగా ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకే గాక, అమెరికా బలగాలకు హజార్డస్ డ్యూటీ పే కింద నెలకు చెల్లించే మొత్తాన్ని 250 డాలర్ల నుంచి 275 డాలర్లకు పెంచేందుకు నిధులు చేకూరనున్నాయి. (చదవండి: అమెరికన్లను శోకంలో ముంచకండి: ఇరాన్) -
చిగురిస్తున్న భారతీయుల ‘గ్రీన్’ ఆశలు
వాషింగ్టన్: అమెరికాలో సుదీర్ఘకాలంగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది భారతీయుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల మంజూరులో దేశాల కోటాను ఎత్తివేస్తూ రూపొందించిన బిల్లుకి అమెరికా సెనేట్ బుధవారం ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. ఏటా మంజూరు చేసే గ్రీన్ కార్డుల్లో ఒక్కో దేశానికి 7 శాతం మాత్రమే ఇవ్వాలన్న పరిమితిని ఎత్తి వేస్తూ తీసుకువచ్చిన ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమి గ్రెంట్స్ యాక్ట్‌ని సెనేట్ ఆమోదించింది. అమెరికాకు వెళ్లే విదేశీయుల్లో అధిక సంఖ్యలో భారతీయులు ఉండడం, గ్రీన్ కార్డు కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడంతో వారికి ఏళ్లకి ఏళ్లు ఎదురు చూపులు తప్పడం లేదు. ఇప్పుడు ఈ బిల్లుని కొన్ని సవరణలతో సెనేట్ ఆమోదించడంతో ఇది తిరిగి ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి ఉంది. ప్రతినిధుల సభ కూడా ఆమోదించాక అధ్యక్షుడు సంతకం చేస్తే చట్ట రూపం దాలుస్తుంది. అమెరికాలో ఏటా లక్షా 40 వేల మందికి గ్రీన్ కార్డులు జారీ చేస్తారు. ఏప్రిల్ నాటికి గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న భారతీయులు 8 లక్షల మందికి పైనే. చైనాకు ఎదురు దెబ్బ తగిలేలా సవరణలు గత ఏడాది జూలై 10న ఎస్386 బిల్లుని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించింది. అయితే ప్రతినిధుల సభ ఆమోదించిన బిల్లుకు చైనా మిలటరీతోనూ, కమ్యూనిస్టు పార్టీకి చెందిన వ్యక్తుల్ని ఈ చట్టం నుంచి మినహాయిస్తూ సవరణలు చేసి సెనేట్ ఆమోద ముద్ర వేసింది. ఈ సవరణలు చైనా నుంచి వచ్చిన వారికి ప్రతికూలంగా మారాయి. అమెరికాకు వచ్చిన చైనా విద్యార్థుల్లో అత్యధికులు కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా పని చేసేవారే. అందుకే ప్రతినిధుల సభ ఈ బిల్లుని ఆమోదిస్తుందా అన్నది వేచి చూడాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సెనేట్‌లోనూ హోరాహోరీ
వాషింగ్టన్: అమెరికా సెనేట్‌లో 35 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఈ సారి సెనేట్‌లో ఎలాగైనా పై చేయి సాధించాలన్న డెమొక్రాట్ల ఆశ నెరవేరుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష ఎన్నికలతో పాటుగా అమెరికన్ కాంగ్రెస్‌లో ఉభయ సభలకి ఎన్నికలు జరిగాయి. ఎగువ సభ అయిన సెనేట్‌లో మొత్తం 100 స్థానాలకు గాను 35 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సెనేట్‌లో ప్రస్తుతం రిపబ్లికన్లదే పై చేయిగా ఉంది. 100 స్థానాలకు గాను రిపబ్లికన్ల పార్టీకి 53 సీట్లు ఉంటే, డెమొక్రాట్ల బలం 45గా ఉంది. సభలో ఇద్దరు స్వతంత్రులు కూడా ఉన్నారు. మొత్తం 35 సీట్లకు ఎన్నికలు జరిగితే అందులో 21 స్థానాలను ఆయా పార్టీలు నిలబెట్టుకునే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. మిగిలిన 14 సీట్లు కీలకంగా మారాయి. 35 సీట్లకు ఎన్నికలు జరిగితే అందులో 23 స్థానాలు రిపబ్లికన్లవి కాగా, 12 స్థానాలు డెమొక్రాట్లవి. సెనేట్‌పై ఈ సారి ఎలాగైనా పట్టు సాధించాలని డెమొక్రాట్లు భావిస్తున్నారు. వారి ఆశ నెరవేరాలంటే రిపబ్లికన్ల స్థానాలు కనీసం మూడింటినైనా గెలవాల్సి ఉంది. డెమొక్రాట్ల ఖాతాలో రెండు, రిపబ్లికన్లకి ఒకటి ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం కొలొరాడో, అరిజోనా రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు చెందిన రెండు స్థానాల్లో డెమొక్రాట్లు పాగా వేస్తే, అలబామాలోని డెమొక్రాటిక్ పార్టీకి చెందిన స్థానాన్ని రిపబ్లికన్లు సొంతం చేసుకున్నారు. కొలొరాడోలో రిపబ్లికన్ పార్టీకి చెందిన కోరి గార్డెనర్‌పై డెమొక్రాటిక్ పార్టీ మాజీ గవర్నర్ జాన్ హికెన్‌లూపర్ విజయం సాధించారు. ఇక అరిజోనాలో డెమొక్రాటిక్ అభ్యర్థి మాజీ ఆస్ట్రోనాట్ మార్క్ కెల్లీ విజయం సాధించారు. డెమొక్రాటిక్ ఖాతాలో ఉన్న అలబామాలో రిపబ్లికన్ అభ్యర్థి టామీ ట్యూబర్ విల్లె విజయకేతనం ఎగురవేశారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి మెయిల్ ఇన్ ఓట్లు ఎక్కువగా పోల్ కావడంతో తుది ఫలితలు రావడం మరింత ఆలస్యం కావొచ్చు. -
అమెరికా ఎక్స్ఛేంజీల నుంచి డ్రాగన్ అవుట్ !
వాషింగ్టన్: అమెరికా, చైనాల మధ్య వైరం రోజురోజుకు మరింతగా ముదురుతోంది. వాణిజ్య యుద్ధంగా మొదలైనది కాస్తా ఆ తర్వాత టెక్నాలజీ పోరుకు దారితీసింది. 5జీ టెలికం పరికరాల చైనా దిగ్గజం హువావేపై అమెరికా అనేక ఆంక్షలు విధించి దానితో తమ దేశ సంస్థలేవీ వ్యాపార లావాదేవీలు జరపకుండా దాదాపు అడ్డుకట్ట వేసేసింది. ఇక, కరోనా వైరస్ వివరాలను తొక్కిపెట్టి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిని వ్యాప్తి చేసిందంటూ చైనాపై మండిపడుతున్న అమెరికా ప్రస్తుతం మరో కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. తమ దేశ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయిన చైనా కంపెనీలను డీలిస్ట్ చేయడం ద్వారా బిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లు పెట్టుబడులుగా పొందుతున్న చైనీస్ సంస్థలను, పరోక్షంగా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనేట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. ‘నేను కొత్తగా మరో ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవడం లేదు. నేను..నాతో పాటు మిగతా అందరూ కూడా నిబంధనల ప్రకారం చైనా నడుచుకోవాలనే కోరుకుంటున్నారు‘ అని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా దీన్ని ప్రవేశపెట్టిన సెనేటర్లలో ఒకరైన జాన్ కెనెడీ వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో ఆలీబాబా, బైదు తదితర దిగ్గజ చైనా కంపెనీలకు డీలిస్టింగ్ గండం ఏర్పడింది. బిల్లు ఏం చెబుతోంది .. హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం అమెరికా సెక్యూరిటీస్ చట్టాలను పాటించడంలో విఫలమైనందుకు గాను నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల నుంచి చైనా కంపెనీలను డీలిస్ట్ చేయొచ్చు. గతేడాది మార్చిలోనే సెనేటర్లు జాన్ కెనెడీ, క్రిస్ వాన్ హోలెన్ దీన్ని సెనేట్‌లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం లిస్టెడ్ విదేశీ కంపెనీలు తమపై తమ దేశ ప్రభుత్వ నియంత్రణేమీ లేదంటూ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు అమెరికాలో పబ్లిక్ కంపెనీల ఖాతాలను సమీక్షించే బోర్డు పీసీఏవోబీ తమ ఖాతాలను కూడా తనిఖీ చేసేందుకు అంగీకరించాలి. వరుసగా మూడేళ్ల పాటు నిరాకరించిన పక్షంలో నిషేధం, డీలిస్టింగ్ తప్పదు. ఇది ప్రధానంగా విదేశీ కంపెనీలన్నింటికీ వర్తించేదే. అయితే, చైనా కంపెనీల ఆడిటింగ్ విషయంలోనే సహకారం దొరకడం లేదంటూ పీసీవోఏబీ చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలపైనే అమెరికా ఎక్కువ కఠినంగా చర్యలు అమలు చేయనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సేల్స్ అకౌంటింగ్ మోసాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటు న్న చైనా సంస్థ ‘లకిన్ కాఫీ’ ను డీలిస్ట్ చేస్తున్నట్లు నాస్డాక్ ప్రకటించడం దీనికి మరింత ఊతమిస్తోంది. చైనా ముందస్తు వ్యూహాలు.. అమెరికా తమ కంపెనీలపై గురిపెట్టే ప్రమాదాన్ని ముందుగానే ఊహించినా చైనా కూడా తదుపరి వ్యూహాలతో సిద్ధంగా ఉంది. హాంకాంగ్‌లో నిరసనలను అణగదొక్కే విషయంలో తమకు మద్దతుగా నిల్చిన బ్రిటన్ వైపు చూస్తోంది. ఒకవేళ అమెరికన్ ఎక్సే్చంజీల నుంచి డీలిస్ట్ అయిపోతే ప్రత్యామ్నాయంగా లండన్ ఎక్సే్చంజీలో కంపెనీలను లిస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉంది. లండన్‌లో లిస్ట్ కాదల్చుకున్న కంపెనీల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను పునఃప్రారంభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వదేశీ కంపెనీలకూ ట్రంప్ వార్నింగ్.. చైనాతో వాణిజ్య యుద్ధం మొదలైనప్పట్నుంచీ అమెరికన్ కంపెనీలను అక్కణ్నుంచి వచ్చేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. దీంతో టెక్ దిగ్గజం యాపిల్ సహా పలు కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ తదితర దేశాలకు తయారీ కార్యకలాపాలు మళ్లించడంపై కసరత్తు చేస్తున్నాయి. అయితే, ఆయా కంపెనీలను అమెరికాకే రప్పించే ప్రయత్నాల్లో ట్రంప్ ఉన్నారు. చైనా నుంచి తయారీ కేంద్రాలను స్వదేశానికే తరలించాలని.. అలా కాకుండా భారత్, ఐర్లాండ్ వంటి ఇతర దేశాలకు వెడితే వాటిపై పన్నుల మోత మోగిస్తామని ఈమధ్యే మరోమారు హెచ్చరించారు. అంతే కాకుండా.. చైనా కంపెనీల్లో తమ సంస్థలు ఇన్వెస్ట్ చేయకుండా కూడా అమెరికా చర్యలు తీసుకుంటోంది. అమెరికాలో లిస్టయిన చైనా కంపెనీల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం శ్రేయస్కరం అంటూ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌రాక్‌కు నేషనల్ లీగల్ అండ్ పాలసీ సెంటర్ సూచించింది. పర్యావరణ కార్యకర్తల ఆందోళనల కారణంగా బ్లాక్‌రాక్ ఇప్పటికే కొన్ని బొగ్గు కంపెనీల నుంచి తప్పుకుంది. ప్రభుత్వ పెన్షన్ ఫండ్‌ను నిర్వహించే థ్రిఫ్ట్ సేవింగ్స్ ప్లాన్ సంస్థ .. ఇన్వెస్ట్ చేసే విదేశీ స్టాక్స్ జాబితా నుంచి చైనా కంపెనీలను తప్పించడంలోనూ ట్రంప్ ప్రస్తుతానికి సఫలమయ్యారు. ఇది దాదాపు 500 బిలియన్ డాలర్ల నిధిని నిర్వహిస్తోంది. తమ ఇన్వెస్టర్లకు కొత్తగా అంతర్జాతీయ స్టాక్స్‌లో కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో 50 బిలియన్ డాలర్ల ఇంటర్నేషనల్ ఫండ్ పథకం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన విదేశీ స్టాక్స్ జాబితాలో చైనా కంపెనీలు లేకుండా చూసేలా ట్రంప్ ఒత్తిడి తెచ్చారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దాదాపు 170 చైనా కంపెనీలు.. అమెరికాలోని నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల్లో దాదాపు 170 చైనా కంపెనీలు లిస్టయి ఉన్నాయి. చైనా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తూ అమెరికాలో లిస్టయిన భారీ కంపెనీలు పదికి పైగా ఉన్నాయి. పెట్రోచైనా, చైనా లైఫ్, చైనా టెలికం, చైనా ఈస్టర్న్, చైనా సదరన్, హువానెంగ్ పవర్, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ చైనా, చైనా పెట్రోలియం ఈ జాబితాలో ఉన్నాయి. ఇక టెక్ దిగ్గజాల్లో బైదు, ఆలీబాబా, పిన్‌డువోడువో, జేడీడాట్‌కామ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్, బైదు, జేడీడాట్‌కామ్ సంస్థల సంయుక్త మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్ల పైగానే ఉంటుంది. -
చైనాకు అమెరికా భారీ షాక్..
వాషింగ్టన్ : ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అలీబాబా, బైదూ ఇంక్ వంటి చైనా కంపెనీలను అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ల నుంచి తొలగించేందుకు దారితీసే తీర్మానాన్ని అమెరికన్ సెనేట్ ఆమోదించింది. చైనా కంపెనీల డీలిస్టింగ్‌తో పాటు విదేశీ కంపెనీల ప్రాధాన్యతను తగ్గించేలా బిల్లును రూపొందించింది. చైనా కంపెనీల్లో అమెరికన్ల నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేలా కీలక బిల్లును ఆమోదింపచేసింది. రిపబ్లికన్, డెమొక్రాట్ సెనేటర్లు జాన్ కెన్నెడీ, క్రిస్ వాన్ హాలెన్ ప్రతిపాదించిన బిల్లును యూఎస్ సెనేట్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. చైనా దిగ్గజ కంపెనీల్లో కోట్లాది డాలర్లను పెట్టుబడుల రూపంలో కుమ్మరించడం పట్ల చట్టసభ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెన్షన్ ఫండ్లు, విద్యా సంస్ధల నిధులను సైతం ఆకర్షణీయ రాబడుల కోసం చైనా కంపెనీల్లో మదుపు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ కంపెనీలకు చెక్ చైనా కంపెనీలను టార్గెట్‌గా చేసుకున్న ఈ బిల్లులో పొందుపరిచిన అంశాలను చూస్తే..విదేశీ ప్రభుత్వ నియంత్రణలో పనిచేయడం లేదని కంపెనీలు స్పష్టం చేయని పక్షంలో వరుసగా మూడేళ్లు కంపెనీ ఆడిటింగ్‌ను పబ్లిక్ కంపెనీ అకౌంటింగ్ పర్యవేక్షక బోర్డు ఆడిట్ చేయకుండా, ఆయా కంపెనీల షేర్లను ఎక్స్ఛేంజ్ల నుంచి నిషేధించేలా ఈ బిల్లును రూపొందించారు. కాగా, నియమాలకు అనుగుణంగా చైనా నడుచుకోవాలని తాను కోరుకుంటున్నానని సెనేట్‌లో బిల్లును ప్రతిపాదిస్తూ కెన్నెడీ పేర్కొన్నారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిస్టయిన కంపెనీలన్నీ ఒకే ప్రమాణాలను కలిగిఉండాలని, ఈ బిల్లు ఆ ప్రమాణాలను తీసుకురావడంతో పాటు ఇన్వెస్టర్లు మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా పారదర్శకత అందిస్తుందని మరో సెనేటర్ వాన్ హోలెన్ అన్నారు. చదవండి : అమెరికా కీలక ముందడుగు డ్రాగన్ కంపెనీలకు గడ్డుకాలం చైనా కంపెనీలపై కొరడా ఝళిపించే బిల్లును తీసుకురావడంతో జాక్‌మాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్ నుంచి సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన బైట్‌డ్యాన్స్ లిమిటెడ్ వంటి పలు చైనా కంపెనీల లిస్టింగ్ ప్రణాళికలకు విఘాతం కలిగింది. ఈ బిల్లుతో రానున్న రోజుల్లో అమెరికన్ స్టాక్ఎక్స్ఛేంజ్ల్లో లిస్టయిన చైనా కంపెనీలన్నింటికీ ఇబ్బందులు తప్పవని బీజింగ్‌కు చెందిన స్టాక్‌మార్కెట్ నిపుణులు, పోర్ట్‌ఫోలియో మేనేజర్ హల్క్స్ వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉన్న చైనా ఆడిటర్స్పైనా బిల్లు ప్రభావం చూపనుంది.ఇక అమెరికా-చైనా ట్రేడ్‌వార్ ఉద్రిక్తతల నుంచి కరోనా మహమ్మారిపై ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా బెడిసికొట్టిన నేపథ్యంలో డ్రాగన్ కంపెనీలను టార్గెట్ చేస్తూ అగ్రరాజ్యం ఈ బిల్లును తీసుకురావడం గమనార్హం. -
ప్యాకేజీ లాభాలు
కరోనా వైరస్ కల్లోలానికి తట్టుకోవడానికి 21 రోజుల లాక్‌డౌన్‌ను కేంద్రం విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్ ప్రభావం నుంచి ప్రజలను ఆదుకోవడానికి కేంద్రం ప్యాకేజీని ప్రకటించింది. దీంతో మన స్టాక్ మార్కెట్ గురువారం జోరుగా పెరిగింది. ప్రపంచ మార్కెట్లు పతనబాటలో ఉన్నా మన స్టాక్ సూచీలు దూసుకుపోయాయి. 2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీకి అమెరికా సెనేట్ ఆమోదం తెలపడం, ఇటీవల బాగా నష్టపోయిన షేర్లలో వేల్యూ బయింగ్ చోటు చేసుకోవడం సానుకూల ప్రభావం చూపించాయి. మరోవైపు మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు భారీగా జరగడం కూడా కలసివచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,411 పాయింట్ల లాభంతో 29,947 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 324 పాయింట్లు పెరిగి 8,641 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 4.94%, నిఫ్టీ 3.89% చొప్పున పెరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడో రోజు లాభపడ్డాయి. మార్చిలో అధ్వాన పతనం... గత 3 రోజుల్లో సెన్సెక్స్ 3,966 పాయింట్లు, నిఫ్టీ 1,032 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. అయితే ఈ మార్చి సిరీస్‌లో సెన్సెక్స్ 25%, నిఫ్టీ 26% చొప్పున నష్టపోయాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒక్క నెలలో సూచీలు ఇంత అధ్వానంగా పతనం కావడం ఇదే తొలిసారి. కాగా గురువారం ఆసియా మార్కెట్లు 1–4%, యూరప్ 1–2% లాభాల్లో ముగిశాయి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరిన్ని విశేషాలు... ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 45 శాతం ఎగసి రూ.437 వద్ద ముగిసింది. భారీ షార్ట్ కవరింగ్ దీనికి తోడ్పడిందని నిపుణులంటున్నారు. ఒక్క రోజులో ఈ షేర్ ఈ స్థాయిలో లాభపడటం ఇదే మొదటిసారి. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. గత పది వారాల్లో 80% మేర నష్టపోయింది. ► బంధన్ బ్యాంక్ షేర్ 39 శాతం లాభంతో రూ.216కు పెరిగింది. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు– మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన అన్ని షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ‘కమోడిటీ’ ట్రేడింగ్ వేళలు కుదింపు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ ట్రేడింగ్ వేళలను కుదించాయి. గతంలో ఈ సెగ్మెంట్లో ఉదయం 9 గంటలకు మొదలై, అర్థరాత్రి వరకూ ట్రేడింగ్ జరిగేది. దీనిని ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకూ తగ్గించాయి. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 14 వరకూ ఈ వేళలు అమల్లో ఉంటాయి. ఎమ్‌సీఎక్స్, ఐపీఈఎక్స్లు కూడా ఇదే వేళలను పాటించనున్నాయి. 3 రోజుల్లో రూ.11 లక్షల కోట్లు పెరిగిన సంపద మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.48 లక్షల కోట్లు పెరిగింది. మూడు రోజుల వరుస లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.11.12 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.11,12,089 కోట్లు పెరిగి రూ.112.99 లక్షల కోట్లకు ఎగసింది. లాభాలు ఎందుకంటే... ► గ్రామీణ ఆర్థికానికి ఊరట 21 రోజుల లాక్డౌన్ కారణంగా కష్టాలు పడే ప్రజల కోసం కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కారణంగా గ్రామీణ ఆర్థిక రంగానికి ఊరట లభించనున్నది. దీంతో ఎఫ్ఎమ్సీజీ షేర్లు జోరుగా పెరిగాయి. మ్యారికో, హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్సూమర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, గ్లాక్సో స్మిత్‌లైన్ కన్సూమర్ హెల్త్‌కేర్, డాబర్ ఇండియా, కోల్గేట్–పామోలివ్, నెస్లే ఇండియా షేర్లు 4–8 శాతం రేంజ్లో పెరిగాయి. ► తదుపరి ప్యాకేజీపై ఆశలు మరోవైపు త్వరలోనే పారిశ్రామిక రంగాలకు కూడా ప్యాకేజీ ప్రకటించే అవకాశాలున్నాయన్న ఆశలు కూడా నెలకొన్నాయి. త్వరలోనే ఆర్బీఐ కూడా రుణాల చెల్లింపుల విషయంలో(ఈఎమ్ఐల వాయిదా, తదితర నిర్ణయాలు) వెసులుబాటునివ్వగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా ఆర్థిక రంగ, బ్యాంక్, ఎన్బీఎఫ్సీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, బీమా కంపెనీల షేర్లు 40 శాతం మేర లాభపడ్డాయి. ► షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు... మార్చి సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో భారీగా ఉన్న షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకోవడానికి కొనుగోళ్లు జోరుగా జరిగాయి. ► వేల్యూ బయింగ్: భారీ పతనంతో ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉన్న.. ముఖ్యంగా బ్యాంక్ షేర్లలో వేల్యూ బయింగ్ జోరుగా జరిగింది. ► తగ్గుతున్న చమురు ధరలు... ఇక వివిధ దేశాల్లో లాక్డౌన్ కారణంగా వినియోగం భారీగా తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నాయి. బ్యారెల్ చమురు ధర 30 డాలర్లలోపే ట్రేడవుతోంది. ముడిచమురుపై అధికంగా ఆధారపడ్డ మన దేశానికి చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్య స్థితిగతులు భేషుగ్గా ఉండనున్నాయి. -
కరోనా నివారణకు రూ.1500 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్ వైరస్ విజృంభణతో ఉత్పన్నమయ్యే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రెండు లక్షల ట్రిలియన్ డాలర్ల (దాదాపు 1500 లక్షల కోట్ల రూపాయలు) ప్రతిపాదించిన ప్రత్యేక బిల్లుకు ఆమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. సమగ్ర చర్చ అనంతరం 96–0 మెజారిటీతో బుధవారం సాయంత్రం సెనేట్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు శుక్రవారం నాడు ప్రజా ప్రతినిధుల సభ ఆమోదానికి రానుంది. ఆ సభ అనంతరం దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకంతో బిల్లు ఆమోదంలోకి వస్తోంది. కరోనా నివారణ చర్యలతోపాటు ఆస్పత్రుల నిర్మాణానికి, బాధితులను ఆదుకోవడానికి ఈ నిధులను ఖర్చు పెడతారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం చేయడంతోపాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భతి అందిస్తారు. సష్టపోయిన పేదలు, ఇతర వర్గాల ప్రజలను ఆదుకోవడంతోపాటు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు చేస్తారు. కాగా, అతిపెద్ద జనాభా గల దేశమైన భారత్‌లో కరోనా వైరస్ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
ట్రంప్ విజయగర్వం
ముందే ఊహించినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై సెనేట్‌లో అభిశంసన తీర్మానం గురువారం వీగిపోయింది. మరో తొమ్మిది నెలల్లో అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున రెండో దఫా పోటీ చేయబోతున్న ట్రంప్‌కు ఇది ముందస్తు విజయమని చెప్పాలి. దాదాపు రెండున్నర శతాబ్దాల అమెరికా చరిత్రలో ఇప్పటికి ముగ్గురు అధ్యక్షులు అభిశంసనను ఎదుర్కొనవలసి రాగా, ఆ ముగ్గురిలో ఎవరికీ రెండోసారి పోటీచేసే ఛాన్స్ రాలేదు. ఇప్పటికే ట్రంప్ అనుకూలురు, వ్యతిరేకులుగా నిట్టనిలువున చీలిపోయిన అమెరికా సమాజం వచ్చే నవంబర్‌లో జర గబోయే అధ్యక్ష ఎన్నికల సమయానికల్లా మరిన్ని వైపరీత్యాలు చవి చూడాల్సివస్తుందని తీర్మానం వీగిపోయాక ట్రంప్ చేసిన ప్రసంగం గమనిస్తే అర్థమవుతుంది. రిపబ్లికన్లను ఉద్దేశించి చేసిన ఆ ప్రసంగం ఆద్యంతమూ ప్రత్యర్థులను పరుష పదజాలంతో దూషించడం, సొంత పార్టీకి చెందిన మహిళా నేతలపై కూడా చవకబారు వ్యాఖ్యలు చేయడం కనబడుతుంది. డెమొక్రాట్ల ఆధిక్యత ఉన్న దిగువ సభ ట్రంప్ అభిశంసనను సమర్థించగా, రిపబ్లికన్లు సెనేట్‌లో తమకున్న ఆధిక్యతతో దాన్ని అడ్డుకోగలిగారు. కనుకనే అమెరికా మీడియా మొత్తం అధ్యక్ష ఎన్నికల ముందు డెమొక్రాట్లు ఇలాంటి వృధా ప్రయాసకు ఎందుకు దిగారని నిలదీసింది. కానీ సెనేట్ విజయాన్ని అత్యంత ఘనమైన విజ యంగా ట్రంప్ నమ్మమంటున్నారు. సభలో తమ పార్టీ వారెవరూ జారిపోకుండా ఆయన చూసు కోగలిగారు. ఆ ఒక్క విషయంలోనూ ట్రంప్ సమర్థతను మెచ్చుకోవాలి. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు పార్టీలకు అతీతంగా ఓటేయడం అమెరికాలో రివాజు. ఈసారి రిపబ్లికన్లలో మిట్ రోమ్నీ ఒక్కరే ఆ పని చేశారు. ఆయన గతంలో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా ఒబామాపై పోటీచేసి ఓడిపోయారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అభిశంసన తీర్మానంలో రెండు అంశాలున్నాయి. అందులో ఒకటి అధికార దుర్వినియోగానికి సంబంధించింది కాగా, రెండోది కాంగ్రెస్ అధికారాన్ని ట్రంప్ అడ్డగించారన్నది. రోమ్నీ మొదటి అంశంలో డెమొక్రాట్లతో ఏకీభవించి ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. కానీ రెండో అంశంలో ట్రంప్‌కు అనుకూలంగానే వ్యవహరించారు. అయినా ఆయనను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఆయనంత నాసిరకమైన ప్రచారాన్ని ఎవరూ నిర్వహించలేదన్నారు. ఈ విజయంతో ట్రంప్‌కు పట్టపగ్గాల్లేకుండా పోయాయని పార్టీలోని మహిళా ఎంపీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రుజువు చేశాయి. కనీసం వారంతా తన పార్టీవారని, తనకు అనుకూలంగా ఓటేసిన వారన్న ఇంగితజ్ఞానం కూడా ట్రంప్‌కు లేకపోయింది. అరిజోనా ప్రతినిధి డెబీ లెస్కోను పేరుతో మొదలుపెట్టి పలు అసందర్భ వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ ప్రతినిధి ఎలైస్ స్టెఫానిక్‌ను ‘ఆమె అందంగా వుంటారని తెలుసు. కానీ నోరు తెరిచినప్పుడు కూడా అంతే అందంగా వుంటారని తెలియలేదు. నిజానికి ఆమె మాటలతో వారిని చంపేశారు’ అని నోరు పారేసుకున్నారు. మహిళలు మాత్రమే కాదు...నల్లజాతి ఎంపీలన్నా ఆయనకు చులకనే. జిమ్ జోర్డాన్‌ను ‘ఆయన తన శరీరాన్ని చూసుకుని పొంగిపోతారనుకుంటాను. ముఖ్యంగా తన చెవులు చూసుకుని...’ అంటూ అవ మానకరంగా మాట్లాడారు. ట్రంప్ వ్యక్తిగతంగా ఎలాంటివారో కొంత వెనక్కెళ్లి చూస్తే అర్ధ మవుతుంది. కొందరు మహిళలపై చేసిన లైంగిక దాడుల గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటున్న టేప్ 2016 అధ్యక్ష ఎన్నికల ముందు ‘వాషింగ్టన్ పోస్ట్’ బయటపెట్టినప్పుడు ‘ఇది నా జీవితంలో చెడ్డరోజు. ఎందుకంటే అధ్యక్షుడిగా నా అవకాశాలను ఇది ఇబ్బందుల్లో పడేసింది’ అన్నారు. అంటే ఆయనకు చేసిన పనులపై పశ్చాత్తాపం లేదు. అది అధ్యక్ష పదవికి ఎసరు పెడుతుందన్న భయం ఒక్కటే ఉంది. అభిశంసన అంశాల్లో అధికార దుర్వినియోగం కూడా ఉందన్న సంగతిని కూడా మరిచి, ‘అప్పుడే అయిపోలేదు. ప్రతిభావంతులైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు జోయ్ బిడెన్‌కు మున్ముందు ఏం జరుగుతుందో చూడండి’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ తీర్మానం వల్ల ట్రంప్ వైదొలగవలసి వస్తుందని డెమొక్రాట్లు కూడా అనుకోలేదు. అమెరికా ప్రజలు కూడా అనుకోలేదు. కానీ ఆయనలో పరివర్తన వస్తుందని, ఇకపై బాధ్యతతో, జవాబుదారీతనంతో వ్యవహరిస్తారని ఆశించారు. అయితే అది జరగకపోగా, అందుకు విరుద్ధంగా ఆయన మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉన్నదని పార్టీలో సహ మహిళా సభ్యులపైనా, ఇతరులపైనా, ప్రత్యర్థులపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. గతంలో అభిశంసన తీర్మానాలను ఎదుర్కొన్న అధ్యక్షులు నిస్సహాయతలో పడేవారు. వారు సైతం చట్టాలకూ, రాజ్యాంగానికి లోబడి పనిచేయక తప్పదన్న అభిప్రాయం అమెరికా పౌరుల్లో కలిగేది. కానీ ట్రంప్ వాలకం చూస్తే దేశ పౌరులకు ఆయన సూపర్మాన్ అనిపిస్తుంది. తాను అన్నిటికీ అతీతుడినన్న భావన, ప్రత్యర్థులు తనను ఏం చేయలేరన్న భరోసా ఆయనలో కనిపిస్తుంది. ఇది ప్రమా దకరమైనది. ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన రికార్డుల్ని వైట్ హౌస్ విడుదల చేయాలా లేదా, అక్కడి సిబ్బంది సాక్ష్యాలను సేకరించవచ్చా లేదా అన్న అంశాలపై న్యాయస్థానాలు విచారించి నిర్ణయించేలోగానే డెమొక్రాట్లు అభిశంసనపై ఎక్కడ లేని తొందరా ప్రదర్శించారు. తీర్మానం ఓడినా, రాజకీయంగా ట్రంప్‌ను బట్టబయలు చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో అది తమకు లాభిస్తుందని భావిం చారు. ఇది ట్రంప్‌ను కాపాడటానికి సంబంధించిన సమస్య కాదని, మొత్తంగా అధ్యక్ష పదవిలో ఉండేవారి పరిమితుల్ని, జవాబుదారీతనాన్ని నిర్ణయించేదని రిపబ్లికన్లు సైతం అనుకోలేదు. ట్రంప్ వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తం చేయలేని సెనేట్ నిస్సహాయస్థితి గమనించాక, ముందూము నుపూ వచ్చే డెమొక్రాటిక్ అధ్యక్షుడు సైతం అదే మాదిరి వ్యవహరించబోరన్న గ్యారెంటీ ఏమీ లేదు. ఇది అమెరికా నమ్ముకున్న ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు తెస్తుంది. -
డొనాల్డ్ ట్రంప్‌కి ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం సెనేట్‌లో వీగిపోయింది. తద్వారా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌కు రాజకీయ విజయం లభించినట్లయింది. ట్రంప్‌పై డెమొక్రాట్లు పెట్టిన అభిశంసన తీర్మానం రిపబ్లికన్ల ఆధిక్యంలోని సెనేట్‌లో వీగిపోవడంతో ట్రంప్‌కి ఊరట లభించింది. అయితే, అభిశంసనకు గురైన అధ్యక్షులెవరూ తర్వాతి ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు. అభిశంసనను ఎదుర్కొన్నా, తిరిగి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తోన్న తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంపే అవుతారు. అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుకున్నారన్న ఆరోపణలతో ట్రంప్‌పై గత డిసెంబర్లో డెమొక్రటిక్ పార్టీ అమెరికన్ కాంగ్రెస్‌లో అభిశంసనను ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఆమోదం పొందిన అభిశంసన తీర్మానాన్ని తాజాగా సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగం 52–48 ఓట్ల తేడాతో, కాంగ్రెస్ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగం 53–47 ఓట్ల తేడాతో వీగిపోయాయి. అభిశంసనను తిప్పికొట్టేందుకు 100 మంది సభ్యుల సభలో మూడింట రెండొంతుల ఓట్లు అవసరం. సెనేట్‌లో అ«ధికార రిపబ్లికన్ పార్టీకి 53 సీట్లు, డెమొక్రటిక్ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి. ట్రంప్‌పై వెల్లువెత్తిన ఆరోపణలు.. రాబోయే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ ఇచ్చే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ను నైతికంగా దెబ్బతీసేందుకు ట్రంప్ ఉక్రెయిన్ సాయం తీసుకున్నారనీ, బదులుగా ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చినట్టు విమర్శలొచ్చాయి. ఈ ఒప్పందంలో భాగంగా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బిడెన్‌పైనా, ఆయన కొడుకు హంటర్‌పై ఉన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తును వేగవంతం చేయాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడితెచ్చారన్న విమర్శలొచ్చాయి. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్లో మాట్లాడారనీ డెమొక్రటిక్ పార్టీ ఆరోపిస్తోంది. అందుకే ట్రంప్‌పై అభిశంసన తీర్మానం తీసుకువచ్చింది. ఖండించిన ట్రంప్..: తనపై అభిశంసనకు డెమొక్రటిక్ పార్టీ చేసిన యత్నం సిగ్గుచేటని అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. 2020లోనూ, ఆ తరువాత కూడా అమెరికా ప్రజల పక్షాన నిలుస్తానని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు అధ్యక్షభవనం ప్రకటించింది. తొలి నుంచీ తనపై ఆరోపణలు అవాస్తవమని చెబుతున్న ట్రంప్.. అభిశంసనపై దేశం విజయం సాధించిందనీ, అధ్యక్షభవనం నుంచి ప్రకటన చేస్తానని ట్విట్టర్లో వెల్లడించారు. అయితే, అమెరికా ప్రజల ఆకాంక్షలనూ, రాజ్యాంగ బాధ్యతలను సెనేటర్లు విస్మరిస్తున్నారనీ, వాస్తవాలను గుర్తించడంలో వారు విఫలమవుతున్నారని డెమొక్రటిక్ పార్టీ విమర్శించింది. -
మేం ముందే చెప్పాం కదా.. ట్రంప్ నిర్దోషి!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సెనేట్‌లో ఊరట లభించింది. అధ్యక్షుడిగా ట్రంప్‌ను అభిశంసిస్తూ దిగువ సభలో ఆమోదం పొందిన తీర్మానాన్ని సెనేట్ గురువారం తిరస్కరించింది. ఈ మేరకు అభిశంసన తీర్మానం సెనేట్‌లో వీగిపోయిందని శ్వేతసౌధం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘‘డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నేటితో ముగిసింది. మేము గతంలో చెప్పినట్లుగా ట్రంప్ నిర్దోషిగా తేలారు. నిరాధారమైన అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా సెనేట్ ఓటు వేసింది. అధ్యక్షుడి రాజకీయ ప్రత్యర్థులైన డెమొక్రాట్లు, అధ్యక్ష బరిలోని నిలవాలని ఆశించి భంగపడిన ఓ రిపబ్లికన్ మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు’’ అని ప్రకటనలో పేర్కొంది. కాగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా ప్రతినిధుల సభ ట్రంప్‌ను అభింసించిన విషయం తెలిసిందే. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ నాయకుడు జో బైడన్ నుంచి ట్రంప్‌కి గట్టి పోటీ నెలకొని ఉందన్న వార్తల నేపథ్యంలో... బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్ ఉక్రెయిన్ సహకారాన్ని తీసుకోవడానికి ట్రంప్ సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే విధంగా ఆయనపై కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ప్రతిపక్ష డెమొక్రాట్లు అభింశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభలో సంఖ్యా బలం కలిగిన డెమొక్రాట్లు ఈ తీర్మానానికి ఆమోదం తెలపగా.. తదుపరి ఆ తీర్మానం సెనేట్‌కు చేరుకుంది. ఈ క్రమంలో సెనేట్‌లో మెజారిటీ కలిగిన రిపబ్లికన్లు... అభిశంసన తీర్మానాన్ని వ్యతిరేకించడంతో ట్రంప్ నిర్దోషిగా తేలారు. (ట్రంప్‌పై అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం) Office of the Press Secretary, White House: The Senate voted to reject the baseless articles of impeachment, and only the President’s political opponents – all Democrats, and one failed Republican presidential candidate – voted for the manufactured impeachment articles. https://t.co/HKZfU6IsSE — ANI (@ANI) February 5, 2020 -
ట్రంప్ - పెలోసీల మధ్య వార్ షురూ..!
వాషింగ్టన్: అమెరికా జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పీకర్ నాన్సీ పెలోసికి గత కొద్ది కాలంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు సెనేట్‌కు వచ్చిన ట్రంప్ స్పీకర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆమె తన చేతిలో ఉన్న ప్రసంగ పత్రాలను రెండు ముక్కలుగా చేసి తన నిరసన వ్యక్తం చేసింది. ఈ చర్య అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా కాలంగా వీరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. (సెనేట్ కొట్టేయాలి అంతే..) ట్రంప్‌పై అభిశంసనను సెనేట్‌లో చేపట్టింది స్పీకర్ నాన్సీనే కావడంతో ఆమెతో చేతులు కలపడానికి ట్రంప్ నిరాకరించినట్లు తెలుస్తోంది. వీరివురు ఎదురుపడిన సందర్భాల్లోనూ కనీస పలకరింపులు కూడా ఉండటం లేదు. అభిశంసనకు కారణమైన స్పీకర్‌తో గత కొద్ది నెలలుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఒకరు ప్రసంగ పత్రాలు ముక్కలు చేసి మరొకరు తమ అసహనాన్ని బయటపెట్టుకున్నారు. అయితే గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడిని ట్రంప్ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెనేట్ ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. .@SpeakerPelosi tears up of State of the Union speech.#SOTU #SOTU2020 pic.twitter.com/sIpi4G7KsL — CSPAN (@cspan) February 5, 2020 -
సెనేట్ కొట్టేయాలి అంతే..
వాషింగ్టన్: తనపై మోపిన అభిశంసన తీర్మానాన్ని సెనేట్ కొట్టేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా చరిత్రలో అభిశంసనకు గురవుతున్న మూడో అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు సృష్టించగా.. త్వరలోనే దీనిపై విచారణ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు వ్యతిరేకంగా విచారణ చేపట్టేలా ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆ తరువాత విచారణ విషయంలో కాంగ్రెస్‌ను అడ్డుకున్నారని ట్రంప్‌పై అభియోగాలు ఉన్నాయి. అయితే అభిశంసన విచారణ సాక్షులకు తనదైన ఆలోచనలు పంచిన ట్రంప్ ఆదివారం మాత్రం విచారణ జరగడానికే వీల్లేదన్నారు. టంప్‌ను కలిసిన హర్షవర్ధన్ ష్రింగ్లా వాషింగ్టన్: అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ ష్రింగ్లా (57), అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. పదవీ కాలం ముగించుకొని తిరిగి స్వదేశానికి వెళ్లనున్న భారత రాయబారిని అమెరికా అధ్యక్షుడు కలవడం ఇదే మొదటిసారి. 2019 జనవరి 9 నుంచి అమెరికాలో భారత రాయబారిగా పని చేస్తున్న ష్రింగ్లా తన పదవీకాలాన్ని ముగించుకొని భారత్‌కు తిరిగి రానున్నారు. భారత్‌లో ఈ నెల 29న విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్రంప్‌ను కలిసి తనకు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆ ముసుగుకు 8 ఏళ్లు..
సాక్షి, సిటీబ్యూరో: రాజకీయ కారణాలతో ఆవిష్కరణలకు నోచుకోకుండా ముగ్గురు మహనీయుల విగ్రహాలు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చిపోయే వారికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఏర్పా టు చేసిన విగ్రహాలు ఇంకా అలాగే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, జీహెచ్ఎంసీ ఏర్పాటుతో పాటు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కారకుడైన స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయాలని అప్పటి పాలకవర్గం నిర్ణయించి విగ్రహాన్ని సిద్ధం చేశారు. అయితే ఆవిష్కరణ జరిగేలోగా రాజకీయ సమీకరణలు మారడంతో ఆవిష్కరణ కార్యక్రమం నిలిచిపోయింది. వైఎస్ విగ్రహాన్ని అక్కడ ఉంచరాదనే తలంపుతో గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను కూడా రాజకీయానికి వాడుకోవడంతో ముగ్గురు మహనీయుల విగ్రహాలు దిక్కూమొక్కూ లేకుండా,ఎవరికీ పట్టనట్లుగా మిగిలాయి. వివరాల్లోకి వెళితే. పాలకమండలి పట్టుపట్టి.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం గ్రేటర్‌కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అప్పటి కాంగ్రెస్ కార్పొరేటర్లు పట్టుబట్టి విగ్రహం నెలకొల్పాలని నిర్ణయించారు. 2010 జులైలో వైఎస్సార్ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. సెప్టెంబర్‌లో ఆయన వర్థంతి నాటికి విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించినప్పటికీ ఆలోగా పనులు పూర్తికాక పోవడంతో వీలుపడలేదు. విగ్రహం పూర్తయ్యాక ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతుండగా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఫ్లోర్‌లీడర్ నేతృత్వంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను వైఎస్ విగ్రహం కంటే తక్కువ ఎత్తువి తెచ్చి వైఎస్ విగ్రహానికి దిగువన ఉంచడంతో ఆవిష్కరణలు ఆగిపోయాయి. దీంతో మూడు విగ్రహాలను ముసుగులతో కప్పేశారు. ఆ తర్వాత అప్పటి మేయర్ బండ కార్తీకరెడ్డి వైఎస్ విగ్రహావిష్కరణకు ప్రయత్నించారు. ఎవరి గౌరవానికీ భంగం వాటిల్లకుండా ఉండేందుకు మూడు విగ్రహాలను జీహెచ్ఎంసీ ఆవరణలోనే వేర్వేరు చోట్ల ప్రతిష్టించాలని నిర్ణయించి స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందారు. రోజులు గడిచినా ఆచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత 2011లో వైఎస్సార్సీపీ ఆవిర్భవించడంతో నగరానికి చెందిన అప్పటి కాంగ్రెస్ మంత్రి సైతం అక్కడ విగ్రహం ఏర్పాటు చేయరాదని భావించినట్లు ఆరోపణలొచ్చాయి. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో రాష్ట్రంలో, జీహెచ్ఎంసీ పాలకమండలిలో టీఆర్ఎస్ కొలువుదీరింది. ఈ నెల 2న వైఎస్ పదో వర్థంతి సందర్భంగానైనా ప్రభుత్వం ,జీహెచ్ఎంసీ పాలకమండలి తెరలు తొలగించాలని పలువురు కోరుతున్నారు. టీడీపీ రాజకీయం.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ప్రవేశద్వారం ఎదుట వైఎస్ విగ్రహాన్ని ప్రతిష్టించకుండా ఉండేందుకు అప్పటి టీడీపీ ఫ్లోర్‌లీడర్ మహాత్మాగాంధీ, అంబేద్కర్ల విగ్రహాలను తెప్పించడమే కాకుండా జగ్జీవన్‌రామ్, జ్యోతిరావుపూలే, ఎన్టీఆర్, ఒవైసీలవి కూడా ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. ఒవైసీ పేరు ప్రతిపాదించడంతో ఎంఐఎం మద్దతిస్తుందని భావించారు. అయితే ‘రాజకీయం’ అర్థం చేసుకున్న ఎంఐఎం నేతలు ఆ ఆలోచనను సున్నితంగానే తిరస్కరించారు. ముసుగు తొలగిస్తాం.. విగ్రహాల ముసుగు తొలగించేందుకు ప్రయత్నిస్తాం. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, అందరి ఆమోదంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం . –బొంతు రామ్మోహన్, మేయర్ ఇంకా జాప్యం తగదు మహానేతల విగ్రహాలను ఏళ్లతరబడి ఆవిష్కరించకుండా ఉంచడం తగదు. విగ్రహాల ఎత్తు, తదితర కారణాల వల్ల మూడూ ఒకే చోట కాకుండా వేర్వేరుస్థలాల్లో ఉంచి ఆవిష్కరించవచ్చు. – బండ కార్తీకరెడ్డి , మాజీ మేయర్ -
ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల ఆధిక్యం
వాషింగ్టన్: అమెరికాలో గురువారం కొత్త కాంగ్రెస్ కొలువుతీరింది. రిపబ్లికన్ పార్టీ నేత అధ్యక్షుడిగా ఉండగా, ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉన్న వింత పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొంది. మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్‌నకు ఈ పరిస్థితి సవాలుగా నిలవనుంది. 435 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 235 మంది డెమొక్రాట్లు, 199 మంది రిపబ్లికన్లు సభ్యులుగా ఉన్నారు. ఒక సీటుపై వివాదం నెలకొని ఉంది. సెనెట్‌లోని కొత్త సభ్యులతో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. సెనెట్‌లో రిపబ్లికన్ల ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం 100 సభ్యులకు గానూ 53 మంది రిపబ్లికన్లు, 45 మంది డెమొక్రాట్లు ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులు డెమొక్రాట్లకు మద్దతిస్తున్నారు. -
‘మధ్యంతర’ బరిలో భారతీయులు
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్‌కు మధ్యంతర ఎన్నికల పోలింగ్ మంగళవారం జరగనుంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం ఆరు లేదా ఏడు గంటలకు (భారత కాలమానంలో మంగళవారం సాయంత్రం) దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు ఓటర్ల కోసం తెరచుకోనున్నాయి. అన్నిచోట్లా 12 గంటలపాటు పోలింగ్ కేంద్రాలు తెరిచి ఉంటాయి. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లోని 100 సీట్లలో 35 సీట్లకు ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. ఈసారి అమెరికా ఎన్నికల్లో భారీ సంఖ్యలో భారతీయ అమెరికన్లు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న ఐదుగురు భారతీయ అమెరికన్లు అమీ బెరా, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్, శివ అయ్యాదురైలు మధ్యంతర ఎన్నికల్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అమీ బెరా కాలిఫోర్నియా నుంచి ఇప్పటికే మూడు సార్లు కాంగ్రెస్‌కు ఎన్నికవ్వగా, కృష్ణమూర్తి, ప్రమీల, రో ఖన్నాలు ఇప్పటికి ఒక్కసారే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచారు. వీరు నలుగురూ ప్రస్తుతం ప్రతినిధుల సభకే పోటీ పడుతున్నారు. అటు శివ అయ్యాదురై మసాచూసెట్స్ స్థానం నుంచి సెనెట్‌కు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మధ్యంతర ఎన్నికల్లో వీరంతా సునాయాసంగా విజయం సాధిస్తారని అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్‌కు ఎన్నిక కాని మరో ఏడుగురు భారతీయ అమెరికన్లు కూడా ఈ మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభకు పోటీ చేస్తున్నారు. వీరిలో హిరాల్ తిపిర్నేని, శ్రీ కులకర్ణి, అఫ్తాబ్ పురేవాల్‌లు ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇస్తున్నారని ఎన్బీసీ న్యూస్ పేర్కొంది. మొత్తం వంద మందికిపైగా పోటీ అమెరికా కాంగ్రెస్‌కే కాక పలు రాష్ట్రాల శాసనసభలు, స్థానిక మండళ్లకు కూడా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నిచోట్లా కలిపి వంద మందికి పైగానే భారతీయ అమెరికన్లు పోటీ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు దేశంలోకి విదేశీయుల రాకను(వలసలు) నియంత్రించడానికి శతవిధాల ప్రయత్నిస్తోంటే మరోవైపు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచుకోవడానికి భారతీయ అమెరికన్లు పోటీ పడుతున్నారు. రాజకీయంగా బలపడాలని భారతీయ అమెరికన్లు కోరుకుంటున్నారనీ, ఈ ఎన్నికల్లో పోటీలో నిలిచిన వారి సంఖ్యే ఇందుకు నిదర్శనమని మాజీ రాయబారి రిచ్ వర్మ అన్నారు. ‘అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల హవా పెరుగుతుండటం నమ్మశక్యంకాని నిజం’ అని అన్నారు. అమెరికా జనాభాలో భారతీయ అమెరికన్లు ఒక శాతం వరకు (40లక్షలు) ఉన్నారు. ‘సమోసా’ సత్తా చాటేనా? అమెరికా కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్న ఐదుగురు భారతీయ–అమెరికన్ సభ్యులను కలిపి ‘సమోసా కాకస్’ అని అనధికారికంగా పిలుస్తారు. కృష్ణమూర్తే ఈ పేరు ను బృందానికి పెట్టారు. తాజా మధ్యంతర ఎన్నికలతో ‘సమోసా’ బృందంలోని సభ్యుల సంఖ్య పెరుగుతుందని అంచనా. ఈ ఎన్నికలు చాలామంది కొత్త వారిని ప్రతినిధుల సభ, రాష్ట్రాల శాసన సభలకు పంపుతాయని రిచ్ వర్మ తెలిపారు. ఆరిజోనా నుంచి టెక్సాస్, ఒహయో, మిషిగాన్‌ల వరకు.. పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత అమెరికన్ కాంగ్రెస్‌లో మన బలం పెరుగుతుందన్న నమ్మకం ఉందంటున్నారు కృష్ణమూర్తి. ట్రంప్ విధానాలతో అమెరికన్లు, ముఖ్యంగా భారతీయ అమెరికన్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారనీ, తమ భయాన్ని, నిరసనను గట్టిగా చెప్పడం కోసమే ఈసారి అనేక మంది భారతీయ అమెరికన్లు బరిలోకి దిగారని వర్మ తెలిపారు. మధ్యంతరంలో పోటీ చేస్తున్న భారతీయ అమెరికన్లలో ఎక్కువ మంది డెమొక్రటిక్ పార్టీ తరఫున నిలబడ్డారు. -
పొరుగు దేశపు ఎడారిలో ఉద్యమాల ఒయాసిస్...
థార్ అనేది ఒక ఎడారి ప్రాంతమన్న సంగతి అందరికీ తెలిసిందే. మన దేశంలోనే కాదు... థార్‌లోని కొంత భాగం పొరుగున్న పాకిస్తాన్‌లోనూ విస్తరించి ఉంది. అది భౌగోళికంగా, వాతావరణపరంగానే కాదు... అమ్మాయిల చదువులు, మహిళల హక్కుల వంటి సామాజిక అంశాల్లోనూ అక్షరాలా ఎడారే. ఎడారిలోని ఆ ప్రాంతంలో తల్లడిల్లుతున్న అనేక మందికి ఒయాసిస్‌గా మారారు ఓ మహిళ. అవకాశాలన్నీ పుష్కలంగా ఉన్న మాములు మహిళ కూడా కాదామె. ఆమె అన్ని విషయాల్లోనూ వివక్షను ఎదుర్కొనే దళిత మహిళ. కానీ... పెళ్లి తర్వాత కూడా పట్టుదలతో చదివి పోస్ట్‌గ్రాడ్యుయేట్ అయ్యారు. అన్న పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని అనేక మందిని వెట్టిచాకిరి నుంచి విముక్తులను చేశారు. బాల్యవివాహాలు, పరువు హత్యలు, పనిచేసేచోట వేధింపులకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించారు.ఇలాంటి సామాజిక జాడ్యాలు కొనసాగే ఎడారిలాంటి చోట అనేక మంది అభాగినులకు అండగా మారే ఆ ఒయాసిస్ పేరే కృష్ణకుమారి. ఇదీ ఆ ఒయాసిస్ కథ... చదవండి. ఇండియా, పాకిస్తాన్... క్రికెట్ నుంచి పాలిటిక్స్ వయా కశ్మీర్! సమస్య ఏదైనా అది ఆసక్తికరమే! అన్నీ దేశభక్తిని చాటుకోవడానికి ఉపయోగపడే అంశాలే! ఆ గాలి ఇటు వీచకుండా చేసే ఉక్కపోతలో కాస్త గాలాడేలా చేసే కొన్ని అరుదైన పవనాల నుంచి అప్పుడప్పడూ కాస్త చల్లని గాలులూ వీస్తాయి! అలాంటి చల్లటి వార్తే ఇది కూడా. ఇంతకూ ఆ న్యూస్ ఏమిటంటే... కృష్ణకుమారి కొహ్లీ అనే దళిత మహిళ పాకిస్తాన్ ఎగువ సభ (సెనెట్)కు ఎన్నిక కావడం. ఆమె వివరాలు తెలుసుకునేలా కుతూహలాన్ని రేకెత్తించే అంశమది. ఇస్లామిక్ రాజ్యమైన పాకిస్తాన్లో సెనేట్‌కు ఎన్నికైన తొలి దళిత హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు కృష్ణకుమారి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరపున సింద్ ప్రావిన్స్ నుంచి ఎగువ సభకు ఎన్నికయ్యారు ఆమె. పూర్వాపరాలు... పాకిస్తాన్ సిం«ద్ ప్రావిన్స్‌లోని నాగర్పార్కర్లో పుట్టారు కృష్ణకుమారి. పేద కుటుంబం. తండ్రి జుగ్నో కొహ్లీ సహా ఆ పరివారమంతా ఉమేర్కోట్ జిల్లాలోని కున్రీ ఊళ్లోని భూస్వామి దగ్గర వెట్టి చేసేవారు. ఎనిమిదేళ్లు వచ్చేవరకు చిన్నారి కృష్ణకుమారి కూడా వెట్టి చేసింది. అంతేకాదు దాదాపు తన తల్లి, తండ్రి, అన్నతోపాటు తనూ మూడేళ్లు ఆ భూస్వామి నిర్భంధంలో మగ్గింది. తిండిలేని రాత్రుళ్లు గడిపింది. నీళ్లతో కడుపు నింపుకుంది. పిల్లల అవస్థ చూసి తమలాగే వాళ్ల బతుకులూ వెట్టితోనే వెలిసిపోతాయేమోనని ఆవేదన చెందేవాడు కృష్ణకుమారి తండ్రి. పిల్లలను చదివించాలని ఆశపడేవాడు. మొత్తానికి కృష్ణకుమారికి ఊహ వచ్చేటప్పటికీ ఆ చెర నుంచి బయటపడింది ఆ కుటుంబం. పిల్లలు చదువుకోవడానికి ఆ ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు. కిరసనాయిల్ దీపపు వెలుతురులోనే కృష్ణకుమారి, ఆమె అన్న వీర్జీ కొహ్లీ చదువుకునేవారు. అయితే ఆమె తొమ్మిదో తరగతిలో ఉండగానే మంచి సంబంధం రావడంతో ఆమెకు పెళ్లి చేశాడు జుగ్నో. చదివించాలని అంత ఆశపడిన ఆ తండ్రి పట్టుమని పదహారేళ్లు కూడా నిండని బిడ్డకు పెళ్లి చేయడానికి కారణం... నాగర్పార్కర్లో ఆడవాళ్లకు పెద్ద చదువులు చదివే హక్కు లేదు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో చదువు, సాధికారత స్త్రీ చేరుకోలేని గమ్యాలే. అయితే ఆమె భర్త లాల్‌చంద్... చదువుపట్ల కృష్ణకుమారికి ఉన్న ఆసక్తిని చూసి పెళ్లయిన తర్వాత కూడా ఆమె చదువుకోవడానికి అనుమతించాడు. దాంతో డ్రాపవుట్‌గా మిగిలిపోవాల్సిన ఆమె సోషియాలజీలో పోస్ట్గ్రాడ్యుయేట్గా నిలబడ్డారు. రాజకీయాలు.. కృష్ణకుమారి అన్న వీర్జీ మొదటి నుంచీ చురుకైన వ్యక్తి. అన్యాయం మీద గొంతెత్తేవాడు. సిం«ద్ ప్రాంతంలోని అణగారిన ప్రజల హక్కుల కోసం పిడికిలి బిగించాడు. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్‌గా పేరుపొందాడు. కృష్ణకుమారి రాజకీయాల్లోకి రావడానికి తన అన్న వీర్జీయే ప్రేరణ. ఆయన ధైర్యమే ఆమెకు స్ఫూర్తి. దాంతో కాలేజ్‌లో ఉన్నప్పటి నుంచే అన్నతోపాటు మానవహక్కుల ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడారు. బాల్యవివాహాలు, పరువు హత్యలు, పనిచేసే చోట వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తారు. మహిళల హక్కుల కోసం ఉద్యమించారు. ఉద్యమిస్తూనే ఉన్నారు.ఆ పోరాట పటిమే ఆమెను ఈ రోజు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరపున (థార్ నుంచి) ఎగువ సభలో నిలబెట్టింది. ‘‘నేను ఒక్క థార్ మహిళల ప్రథినిధిని మాత్రమే కాదు దేశంలోని మొత్తం మహిళల ప్రతినిధిని. నాగర్‌పార్కర్, థార్లలో స్త్రీలకు నేటికీ టాయ్‌లెట్ వంటి కనీస సౌకర్యాలు లేవు. బాల్యవివాహాలతో బాలికలు చదువుకు దూరమవుతున్నారు. ముక్కుపచ్చలారని వయసుకే తల్లులవుతున్నారు. అనారోగ్యంతో యవ్వనంలోనే వృద్ధాప్యాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి ఇంకెన్నో మహిళా సమస్యలెన్నిటినో సభలో ప్రభుత్వం దృష్టికి తెస్తాను. పరిష్కారం కోసం పోరాడుతాను. మహిళలు, బాలికల ఆరోగ్యం, చదువు ఈ విషయాల్లో దృష్టిపెట్టదల్చాను. వీటిల్లో కొంత మార్పు తేగలిగినా నా అభ్యర్థిత్వానికి న్యాయం చేసినట్టే. ఎన్ని ఆటంకాలెదురైనా ఆగను’’ అన్నారు కృష్ణకుమారి కొహ్లీ. మహిళల మీద దాడులు, బాల్యవివాహాలు, పరువు హత్యలు జరిగినప్పుడు నిరసనలు, ధర్నాలు, ర్యాలీల్లో ఆమె ముందుంటారు. వెట్టినుంచి విముక్తి పోరాటంలోనూ కృష్ణకుమారిది మొదటినుంచీ మొదటి అడుగే. ఆ పోరాట సమయాల్లో కృష్ణకుమారి అత్తింటి బంధువులు, పుట్టింటి బంధువులు అంతా ఆమెను దూషించేవారట. ‘ఒక స్త్రీ అయ్యుండి, తల మీద పమిట లేకుండా మగవాళ్లతో సమానంగా ఎలా వెళ్తుందో చూడండి. అసలు ఆమె ఆడమనిషేనా? కులంలోని ఆడవాళ్ల మర్యాదంతా మంటగలుపుతోంది’ అని తిట్టేవారట. కృష్ణకుమారి భర్త దగ్గరకు వచ్చి ‘నీ భార్యను అదుపులో పెట్టుకో’ అని మగవాళ్లు హెచ్చరించేవారట. ఇలాంటివి కనీసం రెండు రోజులకు ఒక్కసారైనా ఉండేవట. ‘అన్నీ విని నేను, లాల్‌చంద్ ఇద్దరం నవ్వుకునేవాళ్లం’’ అని చెప్తారు 39 ఏళ్ల కృష్ణకుమారి. అందునా స్వేచ్ఛాస్వాంత్రాలకు అంతగా ఆస్కారమూ, అవకాశమూ లేని ఆ దేశంలో సాగిస్తున్న కృష్ణకుమారి పోరాటం... ఎందరికో స్ఫూర్తిదాయకం. స్వాతంత్య్ర సమరం నుంచే.. కృష్ణకుమారి కుటుంబానికి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న నేపథ్యం ఉంది. ఆమె పూర్వీకుల్లో ఒకరైన రూప్లో కొహ్లీ 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటులో పాలుపంచుకున్నారు. సిం«ద్‌లోని నాగర్పార్కర్లోని తిరుగుబాటును అణచడానికి బ్రిటిషర్స్ దాడి చేసినప్పుడు రూప్లో బ్రిటిష్ సైన్యానికి ఎదురొడ్డి పోరాడారు. ఆ సాహసమే ఈ అన్నచెల్లెళ్లకు వచ్చినట్టుంది అంటారు కృష్ణకుమారి సన్నిహితులు. – శరాది -
‘స్వేచ్ఛా ప్రతిమ’...
అమెరికా నిర్వచనం చెప్పమంటే స్వేచ్ఛ ‘ప్రతిమ’ రూపంలో ఉన్న ఒక దేశం అన్నారట ఎవరో. షెర్రీ జాన్సన్ వంటి వారి గాథలు వింటే ఆ మాట నిజమే అనిపిస్తుంది. నాగరికతకు మారుపేరుగా నిలిచిన అగ్రదేశంలో బాల్యవివాహాలకు చట్టబద్ధత ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. తల్లిదండ్రులు, జడ్జి సమ్మతి ఉంటే చాలు అక్కడి చట్టాల ప్రకారం మైనర్లు కూడా పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఇలాంటి చట్టాల వల్ల కొంతమంది అమ్మాయిలు తాము కలలోనైనా ఊహించలేని పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. ఆ కోవకు చెందిన వారే షెర్రీ జాన్సన్. ఎనిమిదేళ్ల ప్రాయం మొదలు పలుమార్లు అత్యాచారానికి గురై, తల్లిగా మారి, పదకొండేళ్ల వయస్సులో అత్యాచారం చేసినవాడినే పెళ్లిచేసుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారు. తల్లి కోసం కన్నీళ్లను దిగమింగారు. కష్టాలను మౌనంగా భరించారు. కానీ ఇక అలా ఉండటం ఆమెకు నచ్చలేదు. తనకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగకూడదని, బాల్య వివాహాలను నిషేధించాలని పోరాటం చేస్తున్నారు. ఈ న్యాయపోరాటంలో ఆమెకు ఎంతో మంది తోడ్పాటునందిస్తున్నారు. వారిలో దక్షిణ ఫ్లోరిడా సెనేటర్లు లారెన్ బుక్, లిజ్బెత్ బెనాక్విస్తో(సెనేట్‌లో బాల్య వివాహాలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టారు) ముందున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన మీ టూ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, లైంగిక హింసకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఇక్కడ విశేషమేమిటంటే వారు కూడా షెర్రీ మాదిరిగానే బాల్యాన్ని కోల్పోయి, వేధింపులకు గురైనవారే. ఆమె బాల్యం... అంతులేని విషాదం షెర్రీ కథ వింటే కళ్లు చెమర్చకమానవు. ఫ్లోరిడాలోని టంపా సిటీలో తల్లితో పాటు చర్చ్ ఆవరణలోని గదిలో నివసించేది. వారిద్దరూ వారానికి ఆరు రోజులపాటు చర్చిలో సేవ చేసేవారు. చర్చి పెద్దలు చెప్పినట్లుగా నడుచుకువాలనే ఎన్నో నిబంధనల నడుమ ఆమె బాల్యం మొదలైంది. బాల్యానికి సంబంధించి తల్లి చేసే బిస్కెట్లు తింటూ, కలర్ పెన్సిళ్లతో డ్రాయింగ్ చేయడం వంటి అతికొన్ని ఙ్ఞాపకాలు మాత్రమే ఆమెకు మిగిలాయి. మిగతాదంతా అసలు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేని పసిప్రాయంలో ఆమె గోడు వినేవారే కరువయ్యారు. వల వేసి.. వంచించి భోజనం చేయాలంటే చర్చ్ బిషప్ ఇంటిలో నివసించే తన ఆంటీ ఇంటికి ప్రతిరోజూ వెళ్లాల్సిందే. ఈ క్రమంలో షెర్రీపై కన్నేసిన బిషప్ ఆమె ఆంటీ లేని సమయం చూసి అత్యాచారం చేసాడు. అప్పుడు ఆమె వయస్సు ఎనిమిదేళ్లు. అసలు అతను ఎందుకు అలా ప్రవర్తించాడో అర్థం చేసుకోలేని పసిప్రాయం. క్రూర మృగాళ్లు.. బిషప్తో పాటు, అతని సహాయకుడు కూడా షెర్రీని బలాత్కారం చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పాలని షెర్రీ ఎన్నోసార్లు ప్రయత్నించినా అరణ్యరోదనగానే మిగిలింది. తన మాటలు తల్లి పట్టించుకోకపోవడంతో ఎదిగే క్రమంలో అత్యాచారానికి గురౌవడం కూడా ఒక భాగమనే నిర్ణయానికి వచ్చింది పాలబుగ్గల షెర్రీ. తోటి విద్యార్థులంతా నీ దగ్గర చేపల వాసన వస్తుందంటూ గేలి చేస్తుంటే కుమిలి కుమిలి ఏడ్వడం కూడా ఆమెకు అలవాటయింది. బడిలో బయటపడిన నిజం.. విద్యార్థుల సాధారణ చెకప్‌లో భాగంగా షెర్రీని కూడా పరీక్షించి బయటకు వెళ్లమని చెప్పింది నర్స్. కాసేపటి తర్వాత వస్తువులన్నీ తీసుకుని బయటకు రావాల్సిందిగా షెర్రీని ఆదేశించింది స్కూలు యాజమాన్యం. ఆమె తల్లికి ఫోన్ చేసి, ఇంటికి తీసుకువెళ్లాలని కోరారు. కూతురు ఏం తప్పు చేసిందోనని కంగారుగా స్కూలుకు చేరిన తల్లికి తాను చేసిన తప్పేమిటో అప్పుడు అర్థమయింది. పదేళ్ల షెర్రీ ఏడు నెలల గర్భవతి అని తెలుసుకుని నిర్ఘాంతపోయింది, కూతురిని నిందించింది. పేగు బంధం.. కనుమరుగైన వేళ కూతురు గర్భానికి కారణం బిషప్ అనుచరుడని చర్చిలో ఉన్నవారందరికీ తెలిసేలా చేసి, ప్రసవం కోసం మరో మృగాడు బిషప్తో షెర్రీని దూరంగా పంపివేసింది ఆమె తల్లి. అమ్మతనానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. బాల్యానికి సంకెళ్లు.. ఆదరించి, ఆలనాపాలనా చూసుకునే తల్లి పక్కనలేక, శరీరంలో వస్తున్న మార్పులకు కారణం చెప్పేవారు లేక హాస్పిటల్ బెడ్‌పై నరకయాతన అనుభవించింది షెర్రీ. 1970లో పదేళ్ల పసిప్రాయంలో తన మొదటి బిడ్డకి జన్మనివ్వడంతో చదువుకోవాలనే ఆమె ఆశకు సంకెళ్లు పడ్డాయి. అక్కున చేర్చుకోవాల్సింది పోయి.. కూతురుకి ఈ గతి పట్టించిన మగాళ్లకు శిక్ష పడేలా చేయాల్సిన షెర్రీ తల్లి, ఆమె బాల్యాన్ని వివాహమనే బందీఖానాలో పడేసేందుకు ప్రయత్నాలు చేసింది. అత్యాచారం చేసిన వాడినే పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టింది. కోర్టు ఇందుకు నిరాకరించినా చట్టాన్ని అడ్డు పెట్టుకుని కూతురి బాల్యాన్ని, బతుకుని చిదిమేసింది. అలా పదకొండేళ్ల ప్రాయంలో 20 ఏళ్ల వ్యక్తికి భార్యగా మారింది షెర్రీ. ఆనాడు కోర్టులో తల్లికి, జడ్జికి జరిగిన సంభాషణ ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతుందని 58 ఏళ్ల షెర్రీ చెప్తుందంటే ఆమె ఎంత క్షోభ అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు. అంతటితో ఆగలేదు.. కూతురి పెంపకంలో షెర్రీకి, ఆమె తల్లి సాయం చేస్తుండటం వల్ల మళ్లీ స్కూలుకు వెళ్లే అవకాశం దక్కింది. కానీ ఆమె భర్త నుంచి విముక్తి మాత్రం లభించలేదు. ఒకరి తర్వాత ఒకరికి జన్మనివ్వడమే షెర్రీ నిరంతర కర్తవ్యంగా మారింది. ఏ ప్రేమకు నోచుకోలేదు.. పదేళ్ల ప్రాయం నుంచే పిల్లల డైపర్లు వాష్ చేస్తూ, వారి ఆలనా పాలనా చూస్తూ గొడ్డు చాకిరీ చేసేది. తన పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూంటే తాను వారితో ఆడుకుంటూ కోల్పోయిన బాల్యాన్ని వెదుక్కునేది. భర్తకు మాత్రం ఆమె శరీరంతో తప్ప, మనసుతో సంబంధం ఉండేది కాదు. ప్రేమగా మాట్లాడేవాడు కూడా కాదు. కేవలం తన కోరికల్ని తీర్చే సాధనంగా భావించి చిత్ర హింసలకు గురిచేసేవాడు. ఆ విధంగా 17 ఏళ్లకే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది షెర్రీ. అతనితో విసిగిపోయిన షెర్రీ విడాకులకు దరఖాస్తు చేసి 19 ఏళ్ల వయసులో ఆ నరకం నుంచి బయటపడింది. రెండో‘సారీ’... మోడువారిన జీవితం చిగురిస్తుందనే ఆశతో.. విడాకులు తీసుకున్న తర్వాత 37 ఏళ్ల వయసున్న మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ ఆమె ఆశ ఆవిరైంది. అతను కూడా మొదటి భర్త మాదిరిగానే శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. పిల్లల కోసం అదంతా మౌనంగా భరించింది. 27 ఏళ్ల వయసుకే ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిల బాధ్యత ఆమెకు అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. మౌనం వీడి.. పోరాటానికి సిద్ధపడి తనకు అన్యాయం జరగటానికి ఒక విధంగా తన మౌనమే కారణమని భావించిన షెర్రీ.. ఇకనైనా పోరాట పంథా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. గత ఐదేళ్లుగా అందుకోసం శ్రమిస్తూనే ఉంది. ఆమె ప్రయత్నాలు ఫలించినట్లయితే ఎంతో మంది చిన్నారులు వివాహమనే చెర నుంచి విముక్తులవుతారు. ఫ్లోరిడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. మైనర్ వివాహాలను అరికట్టేందుకు చట్టం చేసే మొదటి రాష్ట్రంగా నిలవబోతోంది. ఆత్మకథతో ప్రయాణం... బిల్లు ఆమోదం పొందినట్లయితే తన ఆత్మకథ..‘ఫర్గివింగ్ ద అన్ఫర్గివబుల్ ’ను నాటక రూపంలో ప్రదర్శించాలనే యోచనలో ఉన్నారు. అలాగే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బస్ టూర్ ప్లాన్ చేసి, బడ్జెట్‌ను కూడా నిర్ణయించేశారు. ఇందుకోసం తన స్నేహితురాలు లారెన్ బుక్ సహాయం తీసుకుంటున్నారు. - సుష్మారెడ్డి యాళ్ళ -
‘డ్రీమర్ల’కు సెనెట్ నో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆ దేశ ఎగువసభ సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. బాల్యంలోనే తల్లిదండ్రులతో అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన 18 లక్షల మంది(డ్రీమర్ల)కి పౌరసత్వం కల్పించేందుకు ట్రంప్ మద్దతిచ్చిన బిల్లును 60–39 ఓట్లతో శుక్రవారం సెనెట్ తిరస్కరించింది. డ్రీమర్లకు పౌరసత్వం కల్పించినందుకు ప్రతిగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి, భద్రతా ఏర్పాట్లకు రూ.16.08 లక్షల కోట్లు(25 బిలియన్ డాలర్లు) కేటాయించాలని ట్రంప్ డెమొక్రాట్లతో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలోకి కుటుంబ ఆధారిత వలసలతో పాటు దేశాలవారీగా చేపట్టే లాటరీ వీసా పద్ధతి రద్దయ్యేది. తద్వారా హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు లబ్ధి చేకూరేది. అమెరికాలో వలసలపై సెనెట ర్లు షుమర్–రౌండ్స్–కొలిన్స్ ప్రతిపాదిం చిన మరో బిల్లును ఎగువ సభ 54–45 మెజారిటీతో తిరస్కరించింది. డ్రీమర్ల బిల్లును సెనెట్ తిరస్కరించిన నేపథ్యంలో త్వరలో మరో ఒప్పందం కుదరకుంటే మార్చి 5 తర్వాత 18 లక్షల మందిని బలవంతంగా విదేశాలకు పంపిస్తారేమోనన్న భయాలు నెలకొన్నాయి. సెనెట్‌లో ఏదైనా బిల్లు ఆమోదం పొందేందుకు 60 ఓట్లు రావడం తప్పనిసరి. -
టాక్స్ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
వాషింగ్టన్: వివాదాస్పద పన్ను సంస్కరణల బిల్లు ఫైన్ కాపీని అమెరికన్ సెనేట్ ఎట్టకేలకు ఆమోదించింది. దీంతో అమెరికా చట్టసభల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పట్టును మరోసారి నిరూపించుకున్నారు. టాక్స్ కట్, జాబ్స్ యాక్ట్ బిల్లు కు హౌస్‌లో తుది ఆమోదం తరువాత వైట్ హౌస్‌లో ప్రెస్‌మీట్ నిర్వహిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. కార్పొరేట్ ట్యాక్స్‌ను ప్రస్తుత 35 శాతం నుంచి 21 శాతం వరకూ తగ్గించే ప్రతిపాదనలతో కూడినది ఈ పన్ను సంస్కరణల బిల్లు. ఇది భారీ విజయమని అధికారి పక్ష సభ్యులు హర్షం వ్యక్తం చేయగా...బిల్లుఆమోదం సందర్భంగా సభలో ప్రతిపక్షల సభ్యుల కిల్ ద బిల్ నినాదాలు మిన్నంటాయి. 12 మంది రిపబ్లికన్ సభ్యులు దీనిని వ్యతిరేకించగా డెమొక్రాట్లు ఓటు వేయలేదు. కాగా 1.5 ట్రిలియన్ డాలర్ల(రూ. 96.7 లక్షల కోట్లు ) పన్ను ప్రణాళిక బిల్లుపై అధికార రిపబ్లికన్లలో కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు పలు ఆర్థిక వేత్తలు, నిపుణులు కూడా ప్రతికూల అభిప్రాయాలను వెల్లడించారు. అమెరికా ప్రజల ఆదాయాల్లో కనిపించే అసమానతలను ఇవి తగ్గించకపోగా, మరింత పెంచుతాయని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తుండడంతో ఈ బిల్లు వివాదాస్పదంగా మారింది. The United States Senate just passed the biggest in history Tax Cut and Reform Bill. Terrible Individual Mandate (ObamaCare)Repealed. Goes to the House tomorrow morning for final vote. If approved, there will be a News Conference at The White House at approximately 1:00 P.M. — Donald J. Trump (@realDonaldTrump) December 20, 2017 -
ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ!
అలబామా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అలాబామా ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి డౌగ్ జోన్స్ విజయం సాధించారు. గత 25 ఏళ్లుగా అధికార రిపబ్లికన్ పార్టీకి కంచుకోటగా ఉన్న అలబామాలో డెమొక్రాట్లు విజయం సాధించడం ఇదే తొలిసారి. ట్రంప్ మద్దతుతో బరిలోకి దిగిన రిపబ్లికన్ అభ్యర్థి రాయ్ మూర్‌ను ఓడించి.. డౌగ్ జోన్స్ విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి మూర్ ససేమిరా అంటుండటం గమనార్హం. హోరాహోరీ పోరు..! సంప్రదాయవాద ఓటర్లు అధికంగా ఉన్న అలబామాలో గత 25 ఏళ్లలో ఒక డెమొక్రాట్ అభ్యర్థి విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇక్కడ తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అయితే, ట్రంప్ మద్దతుతో బరిలోకి దిగిన రాయ్ మూర్కు వ్యతిరేకంగా లైంగిక వేధింపులు ఆరోపణలు వెలుగుచూడటం, బాలికలపై ఆయన లైంగిక వేధింపులు పాల్పడ్డట్టు కథనాలు రావడం రిపబ్లికన్లను కుదిపేసింది. ఈ క్రమంలో ఉదారవాద డెమొక్రాట్లకు బ్లాక్ ఓటర్ల అండ లభించడంతో డౌగ్ జోన్స్ విజయం సాధించినట్టు భావిస్తున్నారు. అలబామాలో డెమొక్రాట్ విజయం.. డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఈ విజయంతో అమెరికా సెనెట్ పెద్దలసభ (అప్పర్ చాంబర్)లో రిపబ్లికన్ పార్టీ మెజారిటీ 51-49కి తగ్గిపోయింది. వచ్చే ఎడాది జరగనున్న కాంగ్రెషనల్ ఎన్నికల్లో పెద్దలసభలో రిపబ్లికన్లు మెజారిటీ కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే.. అధ్యక్షుడు ట్రంప్ అజెండా అమలుకు సెనెట్ ఆమోదం లభించడం కష్టమే. -
సెనేట్‌లో ట్రంప్‌కు గెలుపు
వాషింగ్టన్: కీలకమైన పన్ను సంస్కరణల బిల్లు అమెరికన్ సెనేట్‌లో అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది. దీంతో ఎట్టకేలకు అమెరికా చట్టసభల్లో అధ్యక్షుడు ట్రంప్ తన పట్టు నిరూపించుకున్నారు. 1.5 ట్రిలియన్ డాలర్ల(రూ. 96.7 లక్షల కోట్లు ) పన్ను ప్రణాళిక బిల్లుపై అధికార రిపబ్లికన్లలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేయడం, చివరి నిమిషంలో మార్పులు చేర్పుల నేపథ్యంలో ఒక దశలో బిల్లు ఆమోదం పొందుతుందా? అన్న సందిగ్ధం కొనసాగింది. శుక్రవారం రాత్రంతా సెనేట్‌లో బిల్లుపై సుదీర్ఘ చర్చ కొనసాగగా చివరకు 51–49 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఈ బిల్లును ఇంతకుముందే ప్రతినిధుల సభ ఆమోదించగా.. ఈ రెండింటిని సమన్వయం చేసి వైట్‌హౌస్‌కు పంపుతారు. గత 31 ఏళ్లలో అమెరికాలో ఇదే అతి పెద్ద పన్ను సంస్కరణ కావడం గమనార్హం. ఈ ఏడాది చివరికల్లా పన్ను సంస్కరణల చట్టాన్ని అమల్లోకి తేవాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. అదే జరిగితే అమెరికన్ కాంగ్రెస్‌లో ట్రంప్ సాధించిన తొలి విజయంగా పన్ను సంస్కరణల చట్టం నిలిచిపోతుంది. సెనేట్ ఆమోదం పొందాక ట్రంప్ ట్వీటర్లో స్పందిస్తూ.. ‘క్రిస్మస్కు ముందే తుది బిల్లుపై సంతకం కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పారు. బిల్లు ఆమోదం కోసం మొదటి నుంచి ట్రంప్ ఎంతో పట్టుదలగా ఉండటంతో జోరుగా లాబీయింగ్ కొనసాగింది. పదేళ్ల కాలానికి 1.5 ట్రిలియన్ డాలర్ల పన్ను ప్రణాళికను రిపబ్లికన్లలో కొందరు వ్యతిరేకించారు. దీంతో అర్ధరాత్రి వరకూ వారిని బుజ్జగించేందుకు ట్రంప్ అనుకూల వర్గం శ్రమించింది. బిల్లుకు చేతిరాతతో సవరణలు చేర్చడంపై డెమొక్రాట్లు అభ్యంతరం చెప్పారు. రిపబ్లికన్లలో బాబ్ కార్కర్ ఒక్కరే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లులో కార్పొరేట్ పన్నును 20 శాతానికి తగ్గించారు. అన్ని ఆదాయ వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా పన్ను రేట్లను తగ్గించారు. చట్టంలో ధనికులకే పట్టం.. ఈ చట్టంతో ఎక్కువ లాభపడేది ధనికులేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక అసమానతల్ని తగ్గిస్తానని గతేడాది ఎన్నికల ప్రచారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే తాజా చట్టంతో ప్రజల ఆదాయాల్లో అసమానతలను తగ్గకపోగా, మరింత పెరుగుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్ పన్నును 35 నుంచి 20 శాతానికి తగ్గించడమే ఈ బిల్లులోని ప్రధానాంశం. దీనివల్ల ధనికులు అడ్డగోలుగా లాభపడతారని అంచనా వేస్తున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే పెట్టుబడిదారులు, ఎగ్జిక్యూటివ్‌ల చేతుల్లోని షేర్ల విలువ ఆకాశం వైపు పరుగులు పెట్టి వారి సంపద పెరుగుతుంది. కంపెనీల యజమానులు పన్నులు ఎగవేయడానికి కొత్త దారులు తెరుచుకుంటాయి. అమెరికా సమాజంలో ఆర్థిక తారతమ్యాల్ని తగ్గించే లక్ష్యంతో రూపొందించిన చట్టం చివరికి వ్యతిరేక ఫలితాలిస్తాయని భయపడుతున్నారు. ఈ బిల్లు చట్టమైతే సంపన్నులు, వారి పిల్లలు ఎక్కువ లబ్ధిపొందుతారు. వారసత్వంగా వారికి సంక్రమించే ఆస్తులపై పన్ను రేటు తగ్గిపోతుంది. దిగువ, మధ్యస్థాయి కార్మికులకు దక్కే వనరులు తగ్గడం వల్ల వారు పిల్లల అవసరాలపై చేసే వ్యయం తగ్గుతుంది. ఆరోగ్య బీమా లేని అమెరికన్ల సంఖ్య పెరగొచ్చని న్యూయార్క్ వర్సిటీ ప్రొఫెసర్ బ్యాచెల్డర్ చెప్పారు. కొత్త బిల్లులో వ్యక్తిగత ఆదాయపన్ను రేట్ల ప్రతిపాదనలు ధనికులకు అనుకూలంగా ఉన్నాయి. సామాన్యులకు వ్యక్తిగత ఆదాయపన్ను భారం ఒక్కొక్కరికి 50 డాలర్లు తగ్గుతుంది. ఒక్క శాతమున్న అగ్రశ్రేణి ధనికుల్లో ఒక్కొక్కరికి 34,000 డాలర్ల మేరకు పన్ను భారం తగ్గుతుంది. ఎస్టేట్ పన్ను రేట్లను పూర్వస్థాయికి తీసుకెళ్లే ప్రతిపాదనలు ధనికులకే లాభంగా ఉన్నాయి. చట్టంతో పేద, మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం తగ్గకపోవగా, దీర్ఘకాలంలో పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
డొనాల్డ్ ట్రంప్ మరో భారీ విజయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా పరంగా మరో భారీ విజయాన్ని సాధించారు. పన్ను సంస్కరణ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. రిపబ్లికన్ ది టాక్స్ కట్ అండ్ జాబ్ యాక్ట్( టీసీజేఏ) బిల్లుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడింది. 1.5 లక్షల కోట్ల డాలర్ల పన్ను సంస్కరణల బిల్లుకి అమెరికా సెనేట్ తాజాగా ఆమోదముద్ర వేసింది.ఈ యాక్ట్ కింద, కార్పొరేట్ పన్ను రేటు శాశ్వతంగా 35శాతం నుంచి 20శాతానికి దిగి రానుంది. అయితే అమెరికా ఆధారిత సంస్థల భవిష్యత్ లాభాలు ప్రధానంగా పన్ను నుంచి మినహాయించబడతాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్న అమెరికా పన్ను సంస్కరణల బిల్లుకి ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ పడింది. వ్యక్తిగత, కార్పొరేట్ పన్నుల్లో భారీ కోతలతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదించిన బిల్లుని సెనేట్ ఆమోదించింది. 51:49 ఓట్లతో యూఎస్ సెనేట్ బిల్లును పాస్ చేసింది. సెనేటర్ బాబ్ కార్కర్ ఒక్కరే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక రిపబ్లికన్ గా నిలిచారు. ట్రంప్ ప్రెసిడెన్సీలో ఇది అతిపెద్ద శాసనపరమైన విజయంగా నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు పుంజుకునే అవకాశముందని పేర్కొన్నారు. అయితే ఇది సంపన్న, పెద్ద వ్యాపారులకు మాత్రమే ఈ బిల్లు ఉపయోగపడుతుందని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు అమెరికా అంతటా వర్కింగ్ ఫ్యామిలీస్‌కి వర్తించనున్న భారీ పన్నుకోతల బిల్లుకు మరో అడుగు ముందుకు పడిందంటూ ట్రంప్ ట్విట్టర్లో వెల్లడించారు. క్రిస్మస్ కంటేముందు ఈ పన్ను సంస్కరణల బిల్లుపై తుది సంతకం చేయడానికి ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. We are one step closer to delivering MASSIVE tax cuts for working families across America. Special thanks to @SenateMajLdr Mitch McConnell and Chairman @SenOrrinHatch for shepherding our bill through the Senate. Look forward to signing a final bill before Christmas! pic.twitter.com/gmWTny3SfS — Donald J. Trump (@realDonaldTrump) December 2, 2017 -
అమెరికా రక్షణ బడ్జెట్ 45 లక్షల కోట్లు
వాషింగ్టన్: వచ్చే ఏడాదికి అమెరికా భారీ రక్షణ బడ్జెట్‌ను ప్రకటించింది. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ చట్టం–2018(ఎన్డీఏఏ) పేరిట రూపొందించిన 700 బిలియన్ డాలర్ల(సుమారు రూ.45.44 లక్షల కోట్లు) ఈ బడ్జెట్‌ను అమెరికా కాంగ్రెస్ శుక్రవారం ఆమోదించింది. సైనిక, భద్రత సాయం పొందడానికి ఇందులో పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలు విధించారు. అదే సమయంలో భారత్‌తో రక్షణ సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని ప్రతిపాదించారు. ఈ బిల్లుకు అమెరికా పార్లమెంట్‌లోని ఉభయ సభలు ప్రతినిధుల సభ, సెనేట్ మూజువాణి ఓటుతో పచ్చజెండా ఊపాయి. ఇటీవలే దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన దక్షిణాసియా వ్యూహానికి ఇందులో చోటు కల్పించారు. తదుపరి దశలో ట్రంప్ సంతకం చేసిన తర్వాత∙ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. అతి త్వరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఆ హోదా భారత్‌కే ప్రత్యేకం భారత్‌కు అమెరికా కల్పించిన ‘ప్రధాన రక్షణ భాగస్వామి’ హోదాపై ఉమ్మడి నిర్వచనం ఇవ్వాలని విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులను బిల్లు కోరింది. ప్రస్తుత లక్ష్యాలు, ఆశయాల ఆధారంగా భారత్‌తో రక్షణ సంబంధాల బలోపేతానికి ముందుచూపుతో కూడిన వ్యూహాన్ని సిద్ధం చేయాలని పెంటగాన్‌కు సూచించింది. దాని ప్రకారం...ఉభయ దేశాలు అఫ్గానిస్తాన్‌తో కలసి పనిచేసి ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొల్పడానికి కృషిచేయాలి. అఫ్గాన్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడులు పెట్టడం, విపత్తు సాయం లాంటివి అందులో ఉంటాయి. 2017 రక్షణ బడ్జెట్లోనే భారత్‌కు అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామి హోదా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గౌరవం భారత్‌కే ప్రత్యేకమని, దీని వల్ల రెండు దేశాల మధ్య రక్షణ వ్యాపారం, సాంకేతిక సహకారం అమెరికా మిత్ర దేశాలతో సమాన స్థాయికి చేరుతుందని కాంగ్రెస్ సభ్యులు అభిప్రాయపడ్డారు. సర్టిఫికెట్ ఇస్తేనే నిధులు ఈ బిల్లు ప్రకారం సంకీర్ణ మద్దతు ఫండ్ (సీఎస్ఎఫ్) కింద పాక్‌కు అమెరికా 350 మిలియన్ డాలర్ల(సుమారు రూ.2,272 కోట్లు) సాయం అందించనుంది. ఈ సాయం పొందాలంటే ఉగ్రసంస్థ హక్కానీ నెట్‌వర్క్‌పై పాక్ కఠిన చర్యలు తీసుకుంటోందని అమెరికా రక్షణ మంత్రి సర్టిఫికెట్ ఇవ్వాలి. అమెరికా గత రక్షణ మంత్రులు పాక్‌కు ఆ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఉగ్ర సంస్థలపై ఆ దేశం చర్యలు తీసుకోవడం అమెరికాకు ముఖ్యమని ఈ బిల్లుతో పాటు ఆమోదం పొందిన అనుబంధ కాన్ఫరెన్స్ రిపోర్టు పేర్కొంది. నిధులను పాక్ ఉగ్ర కార్యకలాపాలకు వాడకుండా పరిశీలిస్తూ ఉండాలని కోరింది. నిధులను బలూచీ, సింధి లాంటి మైనారిటీలపై వేధింపులకు పాల్పడటానికి వాడొద్దు. -
ఒబామాకేర్కు ప్రత్యామ్నాయం లేదు!
సెనట్లో మూడో సారీ వీగిన ట్రంప్కేర్ బిల్లు అమెరికా పౌరులందరూ తప్పనిసరిగా ఆరోగ్యబీమా పాలసీ కలిగి ఉండేలా నిర్దేశించిన ఒబామాకేర్ చట్టాన్ని(అఫర్డబుల్ కేర్ యాక్ట్) తొలగించి, దాని స్థానంలో కొత్తది అమల్లోకి తేవడానికి ఈ వారం అమెరికా సెనెట్‌లో జరిగిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2010లో ఒబామాకేర్ బిల్లు చట్ట రూపందాల్చి నాలుగేళ్లకు అమల్లోకి వచ్చింది. అప్పటి వరకూ ఆరోగ్య బీమా కవరేజీలేని అమెరికన్లు లక్షలాది మందికి ఇది ఆసరా అయింది. అయితే, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. కిందటేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ చట్టాన్ని రద్దుచేసి కొత్త బిల్లు తెస్తామని రిపబ్లికన్లు ప్రచారం చేశారు. నవంబర్ ఎన్నికల్లో గెలిచిన ఈ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ తన హామీ మేరకు ఒబామాకేర్ రద్దుకు చేసిన ప్రయత్నాలు అమెరికా కాంగ్రెస్ దిగువసభ ప్రతినిధులసభలో సఫలమయ్యాయి. ఒబామాకేర్ స్థానంలో అమలుకుద్ధేశించిన కొత్త బిల్లు మొన్న మే నాలుగున 217-213 ఓట్లతో ఈ సభ ఆమోదం పొందింది. బీమా పాలసీ లేని వారు ట్యాక్స్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందనే నియమంతోపాటు ఇంకా అనేక నిబంధనలు పౌరులకు, సంస్థలకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. పాలసీలేని ప్రజలు అపరాధసుంకం చెల్లించాలనే రూలును ప్రత్యామ్నాయ బిల్లుల్లో తొలగించారు. అలాగే, 50 మందికి పైగా సిబ్బంది ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు ఆరోగ్యబీమా పథకాలు కల్పించకపోతే పెనాల్టీ కట్టాలనే నిబంధనను కూడా రిపబ్లికన్ల బిల్లుల్లో తొలగించారు. ఒబామాకేర్ చట్టం సంపన్నులపై వైద్యసౌకర్యాల పన్నును పెంచడమేగాక వైద్యపరికరాలు, ఆరోగ్యబీమా, శరీరం రంగు మారడానికి సాయపడే కంపెనీలపై విధించిన కొత్త పన్నులను కూడా కొత్త బిల్లుల్లో తొలగించారు. ప్రత్యామ్నాయ బిల్లు ఆమోదంపొందితే కోటిన్నర మందికి అమెరికన్లకు బీమా ఉండదు! ఎగువసభ సెనెట్‌లో పాలకపక్షమైన రిపబ్లికన్లకు స్పష్టమైన మెజారిటీ ఉన్నాగాని వారిలో ముగ్గురు ఒబామాకేర్కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం ఓటేయడంతో అది వీగిపోయింది. ఒకవేళ తాజా బిల్లుపై వ్యతిరేకంగా, అనుకూలంగా 50 చొప్పున సమానంగా ఓట్లు పడితే నిర్ణాయక ఓటు వేయడానికి సెనెట్ ఎక్స్ అఫీషియో చైర్మన్ అయిన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఓటింగ్ సమయంలో సభలో ఉన్నారు. ఆనారోగ్యంతో కొన్నిరోజులు సభకు దూరంగా ఉన్న సీనియర్ సెనటర్, 2008 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జాన్ మెకెయిన్ ఓటింగ్‌లో పాల్గొని డెమొక్రాట్లతో కలిసి బిల్లును వ్యతిరేకించడంతో వారంలో వీగిపోయిన మూడో ప్రత్యామ్నాయ బిల్లుగా చరిత్రకెక్కింది. ఇదే వారం రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన రెండు ప్రత్యామ్నాయ ఆరోగ్యబీమా బిల్లులు కూడా మెజారిటీ ఆమోదం పొందడంలో విఫలమయ్యాయి. సెనట్లో మెజారిటీ మద్దతు కూడగట్టడంలో వరుసగా విఫలమైన బిల్లుల్లో ఏది చట్టమైనా 2026 నాటికి కోటీ 60 లక్షల మంది ఆరోగ్యబీమా సౌకర్యం కోల్పోయేవారని, బీమా ప్రీమియం 20శాతం పెరిగేదని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనావేసింది. ఎన్ని లోపాలున్నాగాని 2014 నుంచి కట్టు దిట్టంగా అమలవుతున్న ఒబామాకేర్ చట్టం ఫలితంగా అమెరికాలో అసలు ఆరోగ్య బీమాలేని వారి సంఖ్య 8 శాతానికి పడిపోయింది. ఒబామా హయాంలో రూపుదిద్దుకున్న ఈ చట్టాన్ని వ్యతిరేకించినవారు దాన్నిచులకనచేసి మాట్లాడుతూ ‘ఒబామాకేర్’అని పిలవడం ప్రారంభించగా, కొన్నాళ్లకు ఆయన మద్దతుదారులు ఎంతో అభిమానంతో ఈ మాటలను స్వీకరించి వాడుకలో ప్రచారం కల్పించడం విశేషం. ప్రస్తుతం సెనెట్‌లో మెజారిటీ పక్షమైన రిపబ్లికన్లకు ఒబామాకేర్కు ప్రత్యామ్నాయంగా తీసుకురావడానికి మరే బిల్లు రెడీగా లేదు. దీంతో ఒబామాకేర్ తొలగిచడానికి ఎంతకాలం పడుతుందో చెప్పడం కష్టం. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
రిపబ్లికన్ల ఖాతాలోకి సెనెట్, హౌస్
అమెరికా కాంగ్రెస్‌లో ఇక రిపబ్లికన్లదే ఆధిపత్యం గవర్నర్ పదవుల్ని చెరిసగం పంచుకున్న రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికా కాంగ్రెస్‌లోని సెనెట్(100), హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స కూడా రిపబ్లికన్‌స ఖాతాలో చేరా యి. సెనెట్‌లో 33, ప్రతినిధుల సభలో లో 431 స్థానాలకు ఎన్నికలు జరిగారుు. సెనెట్‌లో..: అమెరికా సెనెట్‌ను ఈ సారైనా దక్కించుకోవాలన్న డెమోక్రాట్ల ఆశలు గల్లంతయ్యాయి. ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, ఇండియానా, జార్జియా, విస్కాన్సన్, అలబామా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా వంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో అమెరికన్ కాంగ్రెస్‌లో ట్రంప్ ఆధిపత్యం చెల్లుబాటయ్యేందుకు వీలుచిక్కనుంది. ఇల్లినాయి, కాలిఫోర్నియా, మేరీలాండ్, కనెక్టికట్ వంటి రాష్ట్రాల్లో డెమోక్రటిక్ అభ్యర్థులు గెలుపొందారు. అమెరికా ఎన్నికలకు ముందు సెనెట్‌లో డెమోక్రాట్లకు 44 మంది ఉండగా... ఇద్దరు స్వతంత్రులు ఆ పార్టీకి మద్దతిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీకి 54 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం 100 సీట్లలో మూడో వంతు సీట్లకు ఎన్నికలు జరిగాయి. అందులో 24 సీట్లు రిపబ్లికన్లు ప్రాతినిధ్యం వహిస్తున్నవే... 33 స్థానాల్లో రిపబ్లికన్లు 21, డెమోక్రాట్లు 12 గెలుచుకున్నారు. దీంతో సెనెట్‌లో రిపబ్లికన్ల బలం 51కి చేరింది. డెమోక్రాట్ల బలం 48గా ఉంది. ప్రతినిధుల సభలోనూ...: మొత్తం 435 స్థానాలు ఉండగా... ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలతో పాటే వీటికి ఎన్నికలు నిర్వహించారు. రిపబ్లికన్లు 238 గెలుచుకోగా, డెమోక్రాట్లు 193 స్థానాలతో సరిపెట్టుకున్నారు. నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగాలి. రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. గవర్నర్ ఎన్నికల్లో చెరిసగం: 12 రాష్ట్రాలకు గవర్నర్ పదవి కోసం ఎన్నికలు జరగగా రిపబ్లికన్లు 6, డెమోక్రాట్లు 6 రాష్ట్రాల్ని గెలుచుకున్నారు.రిపబ్లికన్లు గెలిచినవి: న్యూహ్యాంప్‌షైర్, ఇండియానా, వెర్మాంట్, మిస్సోరీ, ఉటావా, నార్త్‌డకోటా. డెమోక్రాట్లు గెలిచినవి: ఓరెగాన్, వాషింగ్టన్, నార్త్ కరోలినా, మోంటానా, వెస్ట్ వర్జినీయా, డెలావేర్.ఒబామాతో ట్రంప్ భేటీ: అధ్యక్ష అధికారాలను సజావుగా కాబోయే అధ్యక్షుడిగా బదిలీ చేయడమే లక్ష్యంగా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాతో కాబోయే అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయ్యారు.