వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా పరంగా మరో భారీ విజయాన్ని సాధించారు. పన్ను సంస్కరణ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. రిపబ్లికన్ ది టాక్స్ కట్ అండ్ జాబ్ యాక్ట్( టీసీజేఏ) బిల్లుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడింది. 1.5 లక్షల కోట్ల డాలర్ల పన్ను సంస్కరణల బిల్లుకి అమెరికా సెనేట్ తాజాగా ఆమోదముద్ర వేసింది.ఈ యాక్ట్ కింద, కార్పొరేట్ పన్ను రేటు శాశ్వతంగా 35శాతం నుంచి 20శాతానికి దిగి రానుంది. అయితే అమెరికా ఆధారిత సంస్థల భవిష్యత్ లాభాలు ప్రధానంగా పన్ను నుంచి మినహాయించబడతాయి.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్న అమెరికా పన్ను సంస్కరణల బిల్లుకి ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ పడింది. వ్యక్తిగత, కార్పొరేట్ పన్నుల్లో భారీ కోతలతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదించిన బిల్లుని సెనేట్ ఆమోదించింది. 51:49 ఓట్లతో యూఎస్ సెనేట్ బిల్లును పాస్ చేసింది. సెనేటర్ బాబ్ కార్కర్ ఒక్కరే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక రిపబ్లికన్ గా నిలిచారు. ట్రంప్ ప్రెసిడెన్సీలో ఇది అతిపెద్ద శాసనపరమైన విజయంగా నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు పుంజుకునే అవకాశముందని పేర్కొన్నారు.
అయితే ఇది సంపన్న, పెద్ద వ్యాపారులకు మాత్రమే ఈ బిల్లు ఉపయోగపడుతుందని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు అమెరికా అంతటా వర్కింగ్ ఫ్యామిలీస్‌కి వర్తించనున్న భారీ పన్నుకోతల బిల్లుకు మరో అడుగు ముందుకు పడిందంటూ ట్రంప్ ట్విట్టర్‌లో వెల్లడించారు. క్రిస్మస్ కంటేముందు ఈ పన్ను సంస్కరణల బిల్లుపై తుది సంతకం చేయడానికి ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
We are one step closer to delivering MASSIVE tax cuts for working families across America. Special thanks to @SenateMajLdr Mitch McConnell and Chairman @SenOrrinHatch for shepherding our bill through the Senate. Look forward to signing a final bill before Christmas! pic.twitter.com/gmWTny3SfS
— Donald J. Trump (@realDonaldTrump) December 2, 2017
Comments
Please login to add a commentAdd a comment