tax act bills
-
నవంబర్ నుంచి కొత్త రూల్స్ ఇవే
-
ఇలా చేస్తే ఏ స్థిరాస్తి అమ్మినా .. పన్ను భారం లేకుండా..
గతంలో ఏ ఆస్తి అమ్మితే ఆ ఆస్తినే మళ్లీ కొంటే పన్ను భారం ఉండదని తెలుసుకున్నాం. ఈవారం ఏ మూలధన ఆస్తి అమ్మినా మీకు మినహాయింపు రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. 54 ఉఉ ప్రకారం సారాంశం ఏమిటంటే.. ♦ ఇది వ్యక్తులకు, హిందూ కుటుంబాలకు వర్తిస్తుంది ♦ ఏ మూలధన ఆస్తి (దీర్ఘకాలికం) అమ్మినా, వచ్చిన లాభాలను ఇన్వెస్ట్ చేయాలి ♦అమ్మినా 6 నెలల్లోగా చేయాలి ♦01–04–2019కి ముందు జారీ చేసిన యూనిట్లలో లేదా గవర్నమెంటు నోటిఫై చేసిన వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ♦గరిష్ట పరిమితి రూ. 50,00,000 ♦ఎంత ఇన్వెస్ట్ చేశారో అంతకే మినహాయింపు ఉంటుంది ♦వీటిలో లాక్–ఇన్ పీరియడ్ 3 సంవత్సరాలు ♦3 సంవత్సరాల లోపల ఈ యూనిట్లు లేదా నోటిఫై చేసిన వాటిని అమ్మినా / బదిలీ చేసినా మినహాయింపు రద్దు అయిపోతుంది. 54 ఉఇ ప్రకారం ముఖ్యమైన విశేషాలు ఏమిటంటే.. ♦ఈ సెక్షన్ అందరికీ వర్తిస్తుంది ♦2018–19 అసెస్మెంట్ వరకూ ఏ మూలధన ఆస్తి అమ్మినా వర్తించింది (దీర్ఘకాలికం). ♦2019–20 అసెస్మెంట్ నుండి కేవలం భూమి, భవనం, జాగాతో కలిపి ఇల్లు (భవనం, ఫ్లాటు అన్నీ వస్తాయి) అమ్మగా ఏర్పడ్డ దీర్ఘకాలిక మూలధన లాభాలకు మాత్రమే వర్తిస్తుంది ♦బదిలీ జరిగిన తేదీ నుండి ఆరు (6) నెలల్లోగా ఇన్వెస్ట్ చేయాలి ♦నేషనల్ హైవే అథారిటీ, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ జారీ చేసిన బాండ్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ♦ఈ బాండ్ల కాలపరిమితి 5 సంవత్సరాలు ♦వీటి మీద వచ్చే వడ్డీపై పన్ను వర్తిస్తుంది ♦ఇక 5వ పాయింట్లో చెప్పిన రెండూ కాకుండా ప్రభుత్వ రంగ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ జారీ చేసే బాండ్లను కూడా కేంద్రం నోటిఫై చేసింది. మినహాయింపు కావాలంటే వీటిలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. ♦మీరు అన్నింట్లోనూ పెట్టుబడి పెట్టొచ్చు లేదా ఏదైనా ఒక దానిలోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ♦మీరు కొన్న బాండ్లు కొన్న తేదీ నుండి 5 సంవత్సరాల వరకు బదిలీ చేయకూడదు. అలా చేస్తే మినహాయింపును రద్దు చేస్తారు. ♦ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా లాభానికి వర్తించే దానికి మించి మినహాయింపు ఇవ్వరు. తక్కువ చేస్తే, చేసినంత మేరకే ఇస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,00,000 దాటి ఇన్వెస్ట్ చేయరాదు ♦అలా అని మొదటి సంవత్సరం రూ. 50,00,000, రెండో ఏడాది రూ. 50,00,000 చేయడానికి వీలు లేదు (డిసెంబర్ తర్వాత అమ్మినప్పుడు ఇలాంటి అవకాశం ఉంది). ♦ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కు 80సి మినహాయింపు లేదు. ♦వీటిని తనఖా పెట్టి అప్పు తీసుకుంటే ఆ అప్పుగా వచి్చన మొత్తం అంతా కూడా అమ్మకం ద్వారా వచ్చినట్లు లెక్క. అలా అప్పు తీసుకోకండి. ♦చివరగా కేవలం పన్ను భారాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆలోచించకండి. మీ కుటుంబానికి సంబంధించిన ప్రాధాన్యతలు, మీ బాధ్యతలు ..పెళ్లి / చదువు / ముఖ్యమైనవి / రుణాలు చెల్లించడం మొదలైనవి చేయడం కూడా మంచి ప్లానింగే. చింత ఉండదు. శాంతి నెలకొంటుంది. -
మార్చి31 పన్ను చెల్లింపుదారులకు ఎంత ముఖ్యమో మీకు తెలుసా?
మరో 4రోజుల్లో ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 ముగియనుంది. ముగుస్తున్న ఈ ఆర్ధిక సంవత్సరం ట్యాక్స్ పేయర్లకు చాలా కీలకం. అందుకే ఆర్ధిక నిపుణులు సైతం వారిని అప్రమత్తం చేస్తున్నారు. మార్చి31 లోపు ట్యాక్స్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని చెబుతున్నారు. అయితే ఇప్పుడు పన్ను చెల్లించే వారికి ముగియనున్న ఆర్ధిక సంవత్సరం ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. ఆధార్ కార్డ్, పాన్ లింకింగ్: పాన్, ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ మార్చి31 అలా చేయకపోతే పాన్ డియాక్టివేట్ అవుతుంది. అందుకు అదనంగా ట్యాక్స్ యాక్ట్ 1961కింద రూ.10వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2020-2021 రిటర్న్ దాఖలు: ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31లోపు ఐటీ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే రూ.1000 నుంచి 5000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఈ-ధృవీకరణ : ఫైనాన్షియల్ ఇయర్ 2019-2020కి దాఖలు చేసిన ఐటీఆర్ ఈ-ధృవీకరణ మార్చి 31,2021 వరకు చేయబడుతుంది. అయితే ఆర్ధిక సంవత్సరం 2019కి సంబంధించి తమ ఐటీఆర్‌ను ఈ-వెరిఫై చేయని పన్ను చెల్లింపుదారులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సంస్థ 2021-2022 వరకు అంటే మార్చి 31వరకు గడువు ఇచ్చింది. ఈ తేదీల లోపు ఎప్పుడైన ఈ - ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. ముందస్తు పన్ను చెల్లింపు: ముందస్తు పన్ను చెల్లింపు కోసం చివరి వాయిదా గడువు తేదీ మార్చి15, 2022. అయితే అసెస్సీ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్నును ఎప్పుడైనా అంటే మార్చి 31,2022లో లోపు చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి: ఆర్ధిక సంవత్సరం 2021-2022కి సంబంధించి పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31, 2022. -
పన్నుల వేటలో ‘బల్దియా’
జనగామ: పన్నుల వసూళ్లపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి, వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వందశాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మొండి బకాయిలను సైతం వసూలు చేసేలా పక్కా ప్రణాళికను రూపొందించారు. కమిషనర్ రవీందర్ యాదవ్ నేతృత్వంలో డిమాండ్ నోటీసులు సిద్ధం చేసి యజమానులకు అందిస్తున్నారు. జనగామ మునిసిపల్ పరిధిలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి (గృహ), కమర్షియల్, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.3.97 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. పన్నులను వంద శాతం వసూలు చేయాలని ప్రభుత్వం ఖచ్ఛితమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో అధికారులు పరుగులు పెడుతున్నారు. పన్నులు చెల్లించే క్రమంలో బకాయిదారులను బెదిరించే కంటే బుజ్జగించడమే మేలుగా భావించిన బల్దియా అధికారుల ఆలోచన సత్ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. రూ. కోట్లలో పేరుకుపోతున్న బకాయిలతో అభివృద్ధి సాధ్యం కాదని తేల్చుకున్న పురపాలక శాఖ అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రూ.3.97 కోట్లు పట్టణ పరిధిలో 11,388వేల గృహ, కమర్షియల్ భవనాలు ఉన్నాయి. ఇందులో 9,151 నివాస గృహాలు, 879 దుకాణాలు, 81 ప్రభుత్వ కార్యాలయాలు, 1,277 నివాస గృహాలతో కలిపి ఉన్న వ్యాపార సంస్థలు ఉన్నాయి. వీటిపై రూ.3.97,25 కోట్ల పన్నులు రావాల్సి ఉంది. ఆరు వేల నివాస గృహాలతో పాటు వ్యాపార సంస్థలకు డిమాండ్ నోటీసులు అందించారు. ‘పన్నులు చెల్లించండి.. పట్టణాభివృద్ధికి సహకరించండి’ అంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.30 లక్షలకు పైగా పన్నులు వసూలు చేశారు. పేరుకుపోయిన ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు ఆస్తి పన్ను విషయంలో గృహ వినియోగ దారులతో కాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి వేరుగా వసూలు చేస్తుంది. ప్రభుత్వ శాఖల నుంచి రూ.10.49 లక్షలకు పైగా పన్నులు రావాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పన్నులను ముక్కు పిండి వసూలు చేసేందుకు అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించండి పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి.అధికారులు ఇంటింటికీ తిరుగుతూ పన్నులు వసూలు చేయడంలో అంకితభావంతో పనిచేయాలి. వందశాతం టార్కెట్ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలి. ఆస్తి, ఇతర పన్నులను సకాలంలో చెల్లించి ప్రతి ఒక్కరూ అభివృద్ధికి తమతో పాటు కలిసి రావాలి. ప్రభుత్వ శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పన్నులను చెల్లించాలి. – నాగారపు వెంకట్, మునిసిపల్ చైర్పర్సన్ -
ట్రంప్ ‘క్రిస్మస్ గిఫ్ట్’ ఇదేనట!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు క్రిస్మస్ గిఫ్ట్ అందిస్తున్నట్టు చెప్పారు. దేశ ప్రజలకు ఉద్యోగాలు, పన్నుల చెల్లింపులో భారీ ఊరటనందించే పన్ను చట్టంపై కాంగ్రెస్ లో ఒక ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. 2016 ఎన్నికల ప్రచారం సందర్భంగా తానిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఇంకా కొన్ని రోజుల దూరంలోనే ఉన్నామని ఆయన తెలిపారు. ఈ పన్ను సంస్కరణ అమెరికన్ కుటుంబాలకు, దేశీయ కంపెనీలకు క్రిస్మస్ గిఫ్ట్ కానుందని పేర్కొన్నారు. ఇది నిజంగా అద్భుతమైన విజయాన్ని అందించడమేనని ట్రంప్ వెల్లడించారు. తమ కొత్త పన్ను సంస్కరణ చట్టం దేశంలోని అనేకమందికి భారీ ప్రయోజనాలు కలగనున్నాయన్నారు. అమెరికాలోని పెద్ద, చిన్న వ్యాపారస్తులు చెల్లించే పన్నులు గణనీయంగా తగ్గి, మరిన్ని ఉద్యోగాల కల్పనకు దారి తీయడంతో పాటు, ప్రపంచ దేశాలతో పోటీ పడతారని ట్రంప్ ఉటంకించారు. ట్రిలియన్ల కొద్దీ విదేశీ డాలర్లు... అమెరికాకు తీసుకొచ్చే ప్రణాళికలో ఉన్నట్టు చెప్పారు. మరిన్ని ఉద్యోగాలు, భారీ వేతనాలు, భారీ పన్నుల ఉపశమనం కలగనుందన్నారు. ముఖ్యంగా ఆపిల్ లాంటి దిగ్గజ కంపెనీలు విదేశీ బిలియన్ల డాలర్లను దేశానికి తీసుకు రానున్నాయని ట్రంప్ తెలిపారు. ఆ డబ్బును దేశీయంగా ఖర్చు చేస్తామని, దీంతో ఉద్యోగాలు కల్పన లాంటి మరెన్నో ప్రయోజనాల చేకూరనున్నాయని వివరించారు. ప్రస్తుత పన్ను విధానం భారంతో పాటు, సంక్లిష్టతతో కూడుకొని ఉందన్నారు. పారిశ్రామిక ప్రపంచంతో పోలిస్తే..అమెరికాలో అత్యధికంగా 35 శాతం పన్ను చెల్లిస్తున్నారని దీన్నితాము బాగా తగ్గిస్తున్నామని ట్రంప్ తెలిపారు. -
సెనేట్‌లో ట్రంప్‌కు గెలుపు
వాషింగ్టన్: కీలకమైన పన్ను సంస్కరణల బిల్లు అమెరికన్ సెనేట్‌లో అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది. దీంతో ఎట్టకేలకు అమెరికా చట్టసభల్లో అధ్యక్షుడు ట్రంప్ తన పట్టు నిరూపించుకున్నారు. 1.5 ట్రిలియన్ డాలర్ల(రూ. 96.7 లక్షల కోట్లు ) పన్ను ప్రణాళిక బిల్లుపై అధికార రిపబ్లికన్లలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేయడం, చివరి నిమిషంలో మార్పులు చేర్పుల నేపథ్యంలో ఒక దశలో బిల్లు ఆమోదం పొందుతుందా? అన్న సందిగ్ధం కొనసాగింది. శుక్రవారం రాత్రంతా సెనేట్‌లో బిల్లుపై సుదీర్ఘ చర్చ కొనసాగగా చివరకు 51–49 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఈ బిల్లును ఇంతకుముందే ప్రతినిధుల సభ ఆమోదించగా.. ఈ రెండింటిని సమన్వయం చేసి వైట్‌హౌస్‌కు పంపుతారు. గత 31 ఏళ్లలో అమెరికాలో ఇదే అతి పెద్ద పన్ను సంస్కరణ కావడం గమనార్హం. ఈ ఏడాది చివరికల్లా పన్ను సంస్కరణల చట్టాన్ని అమల్లోకి తేవాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. అదే జరిగితే అమెరికన్ కాంగ్రెస్‌లో ట్రంప్ సాధించిన తొలి విజయంగా పన్ను సంస్కరణల చట్టం నిలిచిపోతుంది. సెనేట్ ఆమోదం పొందాక ట్రంప్ ట్వీటర్లో స్పందిస్తూ.. ‘క్రిస్మస్కు ముందే తుది బిల్లుపై సంతకం కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పారు. బిల్లు ఆమోదం కోసం మొదటి నుంచి ట్రంప్ ఎంతో పట్టుదలగా ఉండటంతో జోరుగా లాబీయింగ్ కొనసాగింది. పదేళ్ల కాలానికి 1.5 ట్రిలియన్ డాలర్ల పన్ను ప్రణాళికను రిపబ్లికన్లలో కొందరు వ్యతిరేకించారు. దీంతో అర్ధరాత్రి వరకూ వారిని బుజ్జగించేందుకు ట్రంప్ అనుకూల వర్గం శ్రమించింది. బిల్లుకు చేతిరాతతో సవరణలు చేర్చడంపై డెమొక్రాట్లు అభ్యంతరం చెప్పారు. రిపబ్లికన్లలో బాబ్ కార్కర్ ఒక్కరే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లులో కార్పొరేట్ పన్నును 20 శాతానికి తగ్గించారు. అన్ని ఆదాయ వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా పన్ను రేట్లను తగ్గించారు. చట్టంలో ధనికులకే పట్టం.. ఈ చట్టంతో ఎక్కువ లాభపడేది ధనికులేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక అసమానతల్ని తగ్గిస్తానని గతేడాది ఎన్నికల ప్రచారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే తాజా చట్టంతో ప్రజల ఆదాయాల్లో అసమానతలను తగ్గకపోగా, మరింత పెరుగుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్ పన్నును 35 నుంచి 20 శాతానికి తగ్గించడమే ఈ బిల్లులోని ప్రధానాంశం. దీనివల్ల ధనికులు అడ్డగోలుగా లాభపడతారని అంచనా వేస్తున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే పెట్టుబడిదారులు, ఎగ్జిక్యూటివ్‌ల చేతుల్లోని షేర్ల విలువ ఆకాశం వైపు పరుగులు పెట్టి వారి సంపద పెరుగుతుంది. కంపెనీల యజమానులు పన్నులు ఎగవేయడానికి కొత్త దారులు తెరుచుకుంటాయి. అమెరికా సమాజంలో ఆర్థిక తారతమ్యాల్ని తగ్గించే లక్ష్యంతో రూపొందించిన చట్టం చివరికి వ్యతిరేక ఫలితాలిస్తాయని భయపడుతున్నారు. ఈ బిల్లు చట్టమైతే సంపన్నులు, వారి పిల్లలు ఎక్కువ లబ్ధిపొందుతారు. వారసత్వంగా వారికి సంక్రమించే ఆస్తులపై పన్ను రేటు తగ్గిపోతుంది. దిగువ, మధ్యస్థాయి కార్మికులకు దక్కే వనరులు తగ్గడం వల్ల వారు పిల్లల అవసరాలపై చేసే వ్యయం తగ్గుతుంది. ఆరోగ్య బీమా లేని అమెరికన్ల సంఖ్య పెరగొచ్చని న్యూయార్క్ వర్సిటీ ప్రొఫెసర్ బ్యాచెల్డర్ చెప్పారు. కొత్త బిల్లులో వ్యక్తిగత ఆదాయపన్ను రేట్ల ప్రతిపాదనలు ధనికులకు అనుకూలంగా ఉన్నాయి. సామాన్యులకు వ్యక్తిగత ఆదాయపన్ను భారం ఒక్కొక్కరికి 50 డాలర్లు తగ్గుతుంది. ఒక్క శాతమున్న అగ్రశ్రేణి ధనికుల్లో ఒక్కొక్కరికి 34,000 డాలర్ల మేరకు పన్ను భారం తగ్గుతుంది. ఎస్టేట్ పన్ను రేట్లను పూర్వస్థాయికి తీసుకెళ్లే ప్రతిపాదనలు ధనికులకే లాభంగా ఉన్నాయి. చట్టంతో పేద, మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం తగ్గకపోవగా, దీర్ఘకాలంలో పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
డొనాల్డ్ ట్రంప్ మరో భారీ విజయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా పరంగా మరో భారీ విజయాన్ని సాధించారు. పన్ను సంస్కరణ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. రిపబ్లికన్ ది టాక్స్ కట్ అండ్ జాబ్ యాక్ట్( టీసీజేఏ) బిల్లుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడింది. 1.5 లక్షల కోట్ల డాలర్ల పన్ను సంస్కరణల బిల్లుకి అమెరికా సెనేట్ తాజాగా ఆమోదముద్ర వేసింది.ఈ యాక్ట్ కింద, కార్పొరేట్ పన్ను రేటు శాశ్వతంగా 35శాతం నుంచి 20శాతానికి దిగి రానుంది. అయితే అమెరికా ఆధారిత సంస్థల భవిష్యత్ లాభాలు ప్రధానంగా పన్ను నుంచి మినహాయించబడతాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్న అమెరికా పన్ను సంస్కరణల బిల్లుకి ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ పడింది. వ్యక్తిగత, కార్పొరేట్ పన్నుల్లో భారీ కోతలతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదించిన బిల్లుని సెనేట్ ఆమోదించింది. 51:49 ఓట్లతో యూఎస్ సెనేట్ బిల్లును పాస్ చేసింది. సెనేటర్ బాబ్ కార్కర్ ఒక్కరే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక రిపబ్లికన్ గా నిలిచారు. ట్రంప్ ప్రెసిడెన్సీలో ఇది అతిపెద్ద శాసనపరమైన విజయంగా నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు పుంజుకునే అవకాశముందని పేర్కొన్నారు. అయితే ఇది సంపన్న, పెద్ద వ్యాపారులకు మాత్రమే ఈ బిల్లు ఉపయోగపడుతుందని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు అమెరికా అంతటా వర్కింగ్ ఫ్యామిలీస్‌కి వర్తించనున్న భారీ పన్నుకోతల బిల్లుకు మరో అడుగు ముందుకు పడిందంటూ ట్రంప్ ట్విట్టర్లో వెల్లడించారు. క్రిస్మస్ కంటేముందు ఈ పన్ను సంస్కరణల బిల్లుపై తుది సంతకం చేయడానికి ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. We are one step closer to delivering MASSIVE tax cuts for working families across America. Special thanks to @SenateMajLdr Mitch McConnell and Chairman @SenOrrinHatch for shepherding our bill through the Senate. Look forward to signing a final bill before Christmas! pic.twitter.com/gmWTny3SfS — Donald J. Trump (@realDonaldTrump) December 2, 2017 -
ఈ హితవచనాలు వింటారా?
పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అడ్వాణీ బుధవారం చేసిన వ్యాఖ్యలతో నూటికి నూరుపాళ్లూ ఏకీభవిస్తారు. గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం పార్లమెంటులో సాగుతున్న పరిణామాల పట్ల మరో వేదికపై ఆందోళన వ్యక్తం చేశారు. గత నెల 8న పెద్ద నోట్ల రద్దు గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వారం రోజులకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఆ వారం రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న ఉదంతాలపై సహజంగానే ప్రతిపక్షాలు విరుచు కుపడతాయని అందరూ ఊహించారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ కుండా పెద్ద నోట్లు రద్దు చేసి, కనీసం జనం ఇబ్బందులు పడుతున్నారన్న గ్రహింపు కూడా లేనట్టు ప్రవర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిలదీయాల్సిందే. సంజాయిషీ కోరవలసిందే. కానీ అందుకు పార్లమెంటును స్తంభింపజేయడమే ఏకైక మార్గమ న్నట్టు విపక్షాలు వ్యవహరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇదే బాగుందని పిస్తున్నట్టుంది. లోక్‌సభలో మెజారిటీ ఉన్నది గనుక కీలకమైన బిల్లులు ఆగిపోతా యన్న చింత ఎటూ లేదు. ఎవరెంత గొంతు చించుకుంటున్నా, సభలో ఎంత గంద రగోళం సాగుతున్నా అవేమీ పట్టనట్టు కావాలనుకున్న బిల్లులు సభా ప్రవేశం చేస్తు న్నాయి. మూజువాణి ఓటుతో ఆమోదం పొందుతున్నాయి. నామమాత్రంగా చర్చలు సాగుతున్నాయి. ఎవరికి వినబడుతుంది... వినబడదన్న విచక్షణ లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన డబ్బుపై భారీ మొత్తంలో జరిమానా విధించే పన్ను చట్టాల(రెండో సవరణ) బిల్లు ఎలాంటి చర్చకూ తావు లేకుండానే లోక్‌సభలో అయిందనిపించారు. ఒకరిద్దరు సభ్యులు బిల్లుకు సవర ణలు ప్రతిపాదించినా స్పీకర్ వాటన్నిటినీ తోసిపుచ్చారు. నిజానికి బిల్లుపై చర్చకు అవకాశం వచ్చినప్పుడు అధికార పక్షం ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. ఒకపక్క పెద్ద నోట్ల రద్దు అనంతరం నల్ల కుబేరులు తమ దగ్గరున్న అక్రమ ధనాన్ని సక్రమం చేసుకోవడానికి పాట్లు పడుతున్నారని కేంద్రం అనడమే కాదు... అలాంటివారికి లబ్ధి చేకూర్చేందుకే విపక్షాలు పార్లమెంటును స్తంభింపజేస్తున్నాయని ఆరోపి స్తోంది. బిల్లుపై చర్చకు సిద్ధపడి ఉంటే అందులో నిజమెంతో, విపక్షాల అభ్యంతరా లేమిటో ప్రజలకు వెల్లడయ్యేది. ఇప్పుడు పార్లమెంటు సాగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన నేతలిద్దరూ రాజకీయాల్లో తల పండినవారు. అడ్వాణీ ప్రస్తుత లోక్‌సభలో కూడా సభ్యుడు. పార్లమెంటులో ప్రతిష్టంభన ఎందుకు ఏర్పడుతుందో, అందుకు దారితీసే పరిస్థితు లేమిటో ఇద్దరికీ తెలియందేమీ కాదు. 2012 మే నెలలో వజ్రోత్సవం సందర్భంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించినప్పుడు సైతం పార్లమెంటు ప్రతిష్టం భనపై చర్చ జరిగింది. ఆనాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ కూడా ఈ ధోరణిపై ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర ఆర్ధిక మంత్రిగా యూపీఏ ప్రభుత్వంలో ఉన్నారు. అద్వానీ విపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఆందోళన వ్యక్తం చేయడానికి నేపథ్యం ఉంది. అంతకు కొన్ని నెలల ముందు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై జాయింట్ పార్లమెం టరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలన్న ఏకైక డిమాండ్‌తో పార్లమెంటు నిరవ దిక వాయిదాలతో గడిచి, ఆ స్థితిలోనే ముగిసిపోయింది. తమ డిమాండ్‌ను అంగీ కరిస్తే తప్ప సభను సాగనీయబోమని అప్పుడు విపక్షంలో ఉన్న బీజేపీ తెగేసి చెప్పింది. ఆ విషయంలో కాస్తయినా పట్టు సడలించుకోని యూపీఏ సర్కారు బడ్జెట్ సమావేశాలకల్లా దిగొచ్చి వారి డిమాండ్‌ను అంగీకరించింది. వజ్రోత్సవ సమావేశంలో వాయిదాలు సరికాదని చెప్పిన మన్మోహన్ ఇవాళ రాజ్యసభలో ఉన్నా తమ పార్టీకి హితవు చెప్పలేకపోతున్నారు. సభ సజావుగా సాగితే ఆ విషయంలో ప్రతిష్ట దక్కేది అధికార పక్షానికే. తమ వైపు లోటుపాట్లేమీ లేనప్పుడు, దేన్నయినా ఎదుర్కొనగలిగే స్థితిలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల డిమాండ్‌ను అధికార పక్షం తోసిపుచ్చదు. పైగా చర్చకు చోటిచ్చి ఆ డిమాండ్‌లోని నిరర్ధకతను ప్రజలకు వెల్లడయ్యేలా చేయడానికి ఉత్సాహపడు తుంది. కానీ ప్రభుత్వ వాలకం చూస్తుంటే దానికి ఆ ఉత్సాహం ఉన్నట్టు కనబడదు. అలాగని పెద్ద నోట్ల రద్దుపై మోదీ అసలు మాట్లాడటం లేదని కాదు. భిన్న వేదికల నుంచి ప్రసంగిస్తూనే ఉన్నారు. ఏటీఎంల ముందూ, బ్యాంకుల ముందూ ఓపిగ్గా గంటల తరబడి నించుంటున్నందుకు వారిని అభినందిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో విపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారు. వారిని అవహేళన చేస్తున్నారు. సభా సమావేశాలున్నప్పుడు తీసుకునే నిర్ణయాలను ఆ సభలోనూ... అవి లేన ప్పుడు తీసుకున్న నిర్ణయాలను తదుపరి జరిగే సమావేశాల్లోనూ ప్రభుత్వం ప్రకటించాలన్న సంప్రదాయం ఉంది. రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ బదులు తానే నోట్ల రద్దును ప్రకటించిన మోదీ అందుకు దారితీసిన పరిస్థితులపై సభలో మాట్లాడటా నికి ఎందుకు వెనకాడుతున్నారు? విపక్షాల డిమాండ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకో వడం సబబేనా? ఇప్పటికైనా ప్రణబ్, అడ్వాణీల హిత వచనాలను రెండు పక్షాలూ చెవి కెక్కిం చుకోవాలి. ఇరుపక్షాలూ ఆ వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పేందుకు ప్రయ త్నిస్తున్నాయి. అవతలి పక్షాన్నుద్దేశించి అన్నట్టు తేల్చేస్తున్నాయి. ఇది సరికాదు. అత్యున్నత పదవిలో ఉండటం వల్ల కావొచ్చు... పార్లమెంటు సభ్యులు నినాదాలకూ, ఆందోళనలకూ దూరంగా ఉండి తమ పని తాము చేయాలని ప్రణబ్ చెప్పి ఉండొచ్చు. కానీ అడ్వాణీ మాత్రం తాను ఇరుపక్షాలనూ ఉద్దేశించి మాట్లాడుతున్నానని నేరుగా అన్నారు. స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలపై జనంలో ఉన్న అసంతృప్తికి అడ్వాణీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. దీన్ని గమ నించుకుని అధికార, విపక్షాలు రెండూ తమ తమ వైఖరులను సరిదిద్దుకోవాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నిజంగా విశ్వాసం ఉంటే అందుకనుగుణంగా అవి ప్రవర్తించాలి.