![Here Is Why March 31 Is Important For Taxpayers - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/28/tax%20payment.jpg.webp?itok=B2R9y6i5)
మరో 4రోజుల్లో ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 ముగియనుంది. ముగుస్తున్న ఈ ఆర్ధిక సంవత్సరం ట్యాక్స్ పేయర్లకు చాలా కీలకం. అందుకే ఆర్ధిక నిపుణులు సైతం వారిని అప్రమత్తం చేస్తున్నారు. మార్చి31 లోపు ట్యాక్స్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని చెబుతున్నారు. అయితే ఇప్పుడు పన్ను చెల్లించే వారికి ముగియనున్న ఆర్ధిక సంవత్సరం ఎంత ముఖ్యమో తెలుసుకుందాం.
ఆధార్ కార్డ్, పాన్ లింకింగ్: పాన్, ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ మార్చి31 అలా చేయకపోతే పాన్ డియాక్టివేట్ అవుతుంది. అందుకు అదనంగా ట్యాక్స్ యాక్ట్ 1961కింద రూ.10వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.
ఫైనాన్షియల్ ఇయర్ 2020-2021 రిటర్న్ దాఖలు: ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31లోపు ఐటీ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే రూ.1000 నుంచి 5000 జరిమానా కట్టాల్సి ఉంటుంది.
ఐటీఆర్ ఈ-ధృవీకరణ : ఫైనాన్షియల్ ఇయర్ 2019-2020కి దాఖలు చేసిన ఐటీఆర్ ఈ-ధృవీకరణ మార్చి 31,2021 వరకు చేయబడుతుంది. అయితే ఆర్ధిక సంవత్సరం 2019కి సంబంధించి తమ ఐటీఆర్‌ను ఈ-వెరిఫై చేయని పన్ను చెల్లింపుదారులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సంస్థ 2021-2022 వరకు అంటే మార్చి 31వరకు గడువు ఇచ్చింది. ఈ తేదీల లోపు ఎప్పుడైన ఈ - ధృవీకరణ చేయాల్సి ఉంటుంది.
ముందస్తు పన్ను చెల్లింపు: ముందస్తు పన్ను చెల్లింపు కోసం చివరి వాయిదా గడువు తేదీ మార్చి15, 2022. అయితే అసెస్సీ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్నును ఎప్పుడైనా అంటే మార్చి 31,2022లో లోపు చెల్లించాల్సి ఉంటుంది.
పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి: ఆర్ధిక సంవత్సరం 2021-2022కి సంబంధించి పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31, 2022.
Comments
Please login to add a commentAdd a comment