March
-
ఉద్యోగులకు ఈ మార్చి ఇంత దారుణంగా ఉంటుందా?
ఈ మార్చి (March 2025) నెల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పాలిట దారుణంగా ఉండబోతోంది. ఈనెలలో దాదాపు 100 కంపెనీలు ఉద్యోగుల తొలగింపును (Lay Off) ప్రకటించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ఈ తొలగింపులు వివిధ పరిశ్రమలలో విస్తరించి ఉన్నాయి. ఇది మహమ్మారి అనంతరం వ్యాపారాలు ఎదుర్కొంటున్న విస్తృత ఆర్థిక సవాళ్లను ప్రతిబింబిస్తుంది.వార్నింగ్ నోటీసులుఈ మేరకు ప్రభావిత ఉద్యోగులకు ఇప్పటికే యాజమాన్యాలు వార్న్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. యూఎస్‌లోని వర్కర్ అడ్జస్ట్ మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (వార్న్) చట్టం ప్రకారం జాబ్స్ రిస్క్‌లో ఉంటే ఆయా కంపెనీలు ఉద్యోగులకు ముందస్తు నోటీసు ఇవ్వాలి. పెద్ద ఎత్తున తొలగింపులు, మూసివేతలకు ఉద్యోగులు, యాజమాన్యాలు, కమ్యూనిటీలు సిద్ధం కావడానికి ఈ చట్టపరమైన ఆవశ్యకత సహాయపడుతుంది. ఈ తొలగింపుల వల్ల ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్య ఒక్కో కంపెనీకి 10 నుంచి 500 వరకు ఉంటుంది.కొన్ని ప్రముఖ కంపెనీలు ఇవే..టెక్ లేఆఫ్స్ పతాక శీర్షికల్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, తొలగింపులు టెక్ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. జోన్ ఫ్యాబ్రిక్స్, వాల్‌గ్రీన్స్ వంటి రిటైలర్లు ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉంది. ఇంటెల్, ఫెడెక్స్, నీమన్ మార్కస్, జాన్ డీర్ ఈ జాబితాలోని ఇతర గుర్తించదగిన కంపెనీలుగా ఉన్నాయి.వచ్చే మూడేళ్లలో 150 స్టోర్లను మూసివేసే బృహత్తర వ్యూహంలో భాగంగా 66 స్టోర్లను మూసివేసే యోచనలో ఉన్నట్లు మాకీస్ ప్రకటించింది. రిటైల్ పరిశ్రమలో మార్పులకు అనుగుణంగా కాలిఫోర్నియా, ఇతర రాష్ట్రాల్లోని ఉద్యోగులను కూడా వాల్‌గ్రీన్స్ వదులుకుంటోంది.ఇది చదివారా? ఈసారి బ్యాడ్ న్యూస్ కాగ్నిజెంట్ ఉద్యోగులకు..ఆర్థిక కారకాలుఈ విస్తృతమైన తొలగింపులకు అనేక అంశాలు దోహదం చేస్తాయి. పెరుగుతున్న వడ్డీ రేట్లు రుణాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి. కంపెనీలపై ఆర్థిక ఒత్తిడిని పెంచాయి. అదనంగా, ద్రవ్యోల్బణం నిర్వహణ ఖర్చులను పెంచింది. వ్యాపారాలు లాభదాయకంగా ఉండటం సవాలుగా మారింది. వినియోగదారుల ప్రవర్తన, డిమాండ్ లో మార్పులు కూడా అనేక కంపెనీల ఆర్థిక కష్టాలకు కారణమయ్యాయి.ఆటోమేషన్.. పునర్నిర్మాణంఆటోమేషన్కు ఊతమివ్వడమే ఈ ఉద్యోగుల తొలగింపునకు ప్రధాన కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఖర్చులను తగ్గించడానికి కంపెనీలు ఉద్యోగాలను ఆటోమేటెడ్ సొల్యూషన్లతో భర్తీ చేయాలని చూస్తున్నాయి. ఆర్థిక ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా కంపెనీలు తమ కార్యకలాపాలను పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. -
World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ
అంతరించిపోతున్న వన్యప్రాణులను సంరక్షించే ఉద్దేశంతో ప్రతి ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే.. సహజ వనరుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం, వాటి పరిరక్షణకు పాటు పడాలనే భావనను పెంపొందించుకోవడం.ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం(World Wild Life Day) అనేది సమైక్యంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడటాన్ని ప్రోత్సహిస్తుంది. గతంలో అంతర్జాతీయ వన్యప్రాణుల వాణిజ్యాన్ని నిషేధించే ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తీసుకువచ్చింది. తద్వారా అంతరించిపోతున్న జాతులను రక్షించేందుకు చర్యలకు ఉపక్రమించింది. 2013, డిసెంబర్ 20న ఐక్యరాజ్యసమితి తన జనరల్ అసెంబ్లీలో ప్రతి ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.అంతర్జాతీయ వన్యప్రాణుల వ్యాపారాన్ని నిషేధించే ప్రతిపాదనపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(United Nations General Assembly) 1973 మార్చి 3న సంతకం చేసింది. దీనికి గుర్తుగా అదేరోజున ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం నిర్వహణ ద్వారా అంతరించిపోతున్న జంతువులు, మొక్కలను సంరక్షించేందుకు ప్రేరణ కలుగుతుంది. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా2014, మార్చి 3న జరుపుకున్నారు.ప్రాముఖ్యతవన్యప్రాణులు అంతరించిపోవడం అనేది పర్యావరణ సమతుల్యతను మాత్రమే కాకుండా అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. అటవీ జంతువులు, మొక్కలు, వృక్షాల సంరక్షణ తప్పనిసరి. వాటిని సంరక్షించడం ద్వారా, మనిషి భూమిపై జీవితాన్ని సక్రమంగా కొనసాగించగులుగుతాడు. ఈ అంశాలను గుర్తించేందుకే వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణలో ఐక్యరాజ్యసమితి లక్ష్యాల దిశగా మనమంతా ముందుకు సాగాలి. వన్యప్రాణుల సంరక్షణకు పరిష్కారాలను కనుగొనాలి. అంతరించిపోతున్న జాతుల పరిరక్షణపై దృష్టి సారించాలి. వన్యప్రాణుల సంరక్షణకు వివిధ దేశాలు ఉమ్మడి ప్రయత్నాలు సాగించాలి. ఇది కూడా చదవండి: సోమనాథుని సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు -
మార్చిలో 12 రోజులు స్టాక్ మార్కెట్ క్లోజ్!
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగియనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ నెలలో ట్రేడింగ్‌కు సిద్ధమవుతున్నారు. అయితే ట్రేడింగ్‌ను బాగా ప్లాన్ చేయడానికి మార్చి నెలలో స్టాక్ మార్కెట్ ఏయే రోజుల్లో పనిచేస్తుంది.. ఎప్పుడు మూసివేత ఉంటుంది అన్నది తెలుసుకోవడం మంచిది. ఈ హాలిడే క్యాలెండర్ ను స్టాక్ ఎక్స్ఛేంజీలు జారీ చేస్తాయి. తమ అధికారిక వెబ్ సైట్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.బీఎస్ఈ ప్రతి సంవత్సరం పూర్తి ట్రేడింగ్ హాలిడేస్ జాబితాను ప్రచురిస్తుంది. సాధారణంగా ఈ జాబితాలో పండుగలు, జాతీయ సెలవులు, వారాంతపు సెలవులు ఉంటాయి. బడ్జెట్ సమర్పణ వంటి ప్రత్యేక సందర్భాలు మినహా అన్ని వారాంతాల్లో స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉండవు. అందువల్ల మార్కెట్ షెడ్యూల్‌ను తెలుసుకుని తదనుగుణంగా ట్రేడింగ్‌ను ప్లాన్ చేయడానికి ఇన్వెస్టర్లు సెలవుల జాబితాపై ఆధారపడాలి.మార్చిలో స్టాక్ మార్కెట్ కు 12 రోజులు సెలవులు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈ రోజుల్లో మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్ లు చేయలేరు. వారాంతపు సెలవులతో పాటు ఈ నెలలో హోలీ, రంజాన్ పండుగకు కూడా మార్కెట్లు మూతపడతాయి. అందువల్ల మార్చిలో చివరి ట్రేడింగ్ రోజు 28వ తేదీ. ఎందుకంటే 29, 30 తేదీలు వారాంతపు సెలవులు. ఆ రోజుల్లో మార్కెట్లు పనిచేయవు.మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవులు ఇవే» మార్చి 1 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 2 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 8 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 9 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 14 శుక్రవారం హోలీ» మార్చి 15 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 16 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 22 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 23 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 29 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 30 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 31 సోమవారం ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) -
TTD : శ్రీవాణి, ఎస్ఈడీ టికెట్ల విడుదల తేదీల మార్పు
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్లోకి అనుమతిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు శ్రీవారిని 65,299 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,863 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.75 కోట్లు.మార్చి నెల శ్రీవాణి, ఎస్ఈడీ కోటా విడుదల తేదీలో మార్పుతిరుమల, 2024 డిసెంబర్ 20: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.అలాగే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది.ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పు చేయడమైనది.డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తారు.ఈ మార్పును గమనించి టీటీడీ వెబ్ సైట్లో https://ttdevasthanams.ap.gov.in/home/dashboardలో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు తెలియజేయడమైనది. -
మార్చిలోగా వొడాఫోన్ ఐడియా 5జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా దేశవ్యాప్తంగా 2025 మార్చిలోగా వాణిజ్యపరంగా 5జీ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్ బిజినెస్ హెడ్ ఆనంద్ దానీ బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ‘తెలుగు రాష్ట్రాల్లో 11,500లకుపైగా 4జీ టవర్స్ ఉన్నాయి. దశలవారీగా వీటిని 5జీకి అప్‌గ్రేడ్ చేస్తాం. స్పామ్ సందేశాలను అడ్డుకునే సాంకేతికతను పరిచయం చేశాం. ఈ సేవలను కాల్స్‌కు కూడా త్వరలో విస్తరిస్తాం. ప్రస్తుతం స్పామ్ కాల్స్ కట్టడికి సంబంధించి టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా వినియోగిస్తున్నాం’ అని తెలిపారు. సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక కోటికి పైగా చందాదార్లు ఉన్నారు. ఒక్కో వినియోగదారు నుంచి కంపెనీకి వస్తున్న సగటు ఆదాయం నెలకు రూ. 200 ఉంది. సగటున ఒక్కో కస్టమర్ డేటా వినియోగం ప్రస్తుతం నెలకు 18–20 జీబీ ఉందని ఆనంద్ చెప్పారు. దేశవ్యాప్తంగా కంపెనీ రూ.18,000 కోట్ల తాజా పెట్టుబడులు చేస్తోందని తెలిపారు. -
రేపు శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల మార్చి కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 మార్చి నెల కోటాను డిసెంబరు 18 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం డిసెంబరు 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు డిసెంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి టికెట్ తీసుకోవాలి.21న ఇతర సేవా టికెట్ల విడుదల\⇒ కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబరు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.⇒ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబర్ 21 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 23న అంగప్రదక్షిణం టోకెన్లు⇒ మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటా⇒ శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మార్చి నెల ఆన్లైన్ కోటాను డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా⇒ వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను డిసెంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల⇒ మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.తిరుమల, తిరుపతిలో గదుల కోటా విడుదల⇒ తిరుమల, తిరుపతిలో మార్చి నెల గదుల కోటాను డిసెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.⇒ డిసెంబరు 27న మార్చి నెల శ్రీవారి సేవ కోటా విడుదల చేస్తారు.⇒ https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. -
చై- శోభితల పెళ్లి ఎప్పుడంటే?
హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లల నిశ్చితార్థం ఈ నెల 8న జరిగిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ వీరి వివాహం ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అనే చర్చ ఆరంభమైంది. కాగా నాగచైతన్య, శోభితల వివాహం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మార్చిలో రాజస్థాన్‌లో జరిగే అవకాశం ఉందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ ఇద్దరి సినిమా కాల్షీట్స్, వీరి కుటుంబంలోని ముఖ్య సభ్యులు అందుబాటులో ఉండే సమయం వంటి అంశాలు చర్చించుకుని పెళ్లి తేదీ, వివాహ వేదికపై ఇద్దరి కుటుంబ సభ్యులు ఓ స్పష్టతకు వస్తారట. మరి... ఈ ఏడాది చివర్లో నాగచైతన్యతో శోభిత ఏడడుగులు వేస్తారా? లేక వచ్చే ఏడాది మార్చిలో శోభిత మెడలో చైతన్య మూడు ముళ్లు వేస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు. -
యూపీలో బీజేపీ త్రివర్ణ పతాక మార్చ్
లక్నో: ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘త్రివర్ణ పతాక మార్చ్’నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ బీజేపీ నిర్ణయించింది. ఆదివారం(ఆగస్టు11) నుంచి 13 దాకా మూడురోజులపాటు మార్చ్ జరగనుంది. ఈ విషయాన్ని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. హర్‌ఘర్‌తిరంగా క్యాంపెయిన్‌లో భాగంగా త్రివర్ణ పతాక మార్చ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు అన్నింటికంటే దేశమే ముందు అని ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కలిసి నియోజకవర్గాల్లో త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహిస్తారు. -
టెల్కోల ఆదాయం జూమ్..
న్యూఢిల్లీ: మార్చి త్రైమాసికంలో టెలికం సంస్థల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. రిలయన్స్ జియో ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) అత్యధికంగా 10 శాతం వృద్ధి చెంది రూ. 22,985 కోట్ల నుంచి రూ. 25,331 కోట్లకు చేరింది. అటు భారతీ ఎయిర్‌టెల్‌ది 13.25 శాతం పెరిగి రూ. 15,500 కోట్ల నుంచి రూ. 20,952 కోట్లకు ఎగిసింది. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ స్వల్పంగా 2.22% పెరిగి రూ. 7,211 కోట్ల నుంచి రూ. 7,371 కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ ఆదాయం 4.41 శాతం తగ్గి రూ. 1,992 కోట్లకు, ఎంటీఎన్ఎల్ ఆదాయం 14% క్షీణించి రూ. 157 కోట్లకు పరిమితమైంది. మొత్తం టెల్కోల ఏజీఆర్ 9% వృద్ధి చెంది రూ. 70,462 కోట్లకు చేరింది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజులను లెక్కించడానికి ప్రభుత్వం ఏజీఆర్‌నే పరిగణనలోకి తీసుకుంటుంది. -
దేశీయ ఫార్మా జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ పరిశ్రమ 2024 మార్చి నెలలో మెరుగైన ప్రతిభ కనబరిచింది. ఫిబ్రవరితో పోలిస్తే గత నెల 9.5 శాతం వృద్ధి నమోదు చేసింది. అన్ని ప్రధాన చికిత్సా విభాగాల్లో అమ్మకాల విలువ పెరగడం ఈ జోరుకు కారణం అని మార్కెట్ రిసర్చ్ కంపెనీ ఫార్మాట్రాక్ తెలిపింది. 2023–24లో భారతీయ ఔషధ పరిశ్రమ 6.5 శాతం వృద్ధితో రూ.1.98 లక్షల కోట్లు నమోదు చేసిందని వెల్లడించింది. ‘శ్వాసకోశ మినహా దాదాపు అన్ని చికిత్సలకు సంబంధించిన ఉత్పత్తుల విక్రయాల్లో సానుకూల విలువ పెరుగుదలను చూపించాయి. ధరల వృద్ధి శాతం సానుకూలంగా కొనసాగింది. అయితే మార్చి నెలలో పరిమాణంలో వృద్ధి శాతం చాలా తక్కువగా ఉంది. గత నెలలో కార్డియాక్ 15 శాతం, యాంటీ–ఇన్ఫెక్టివ్స్ 9, గ్యాస్ట్రో–ఇంటెస్టినల్ 9 శాతం విలువ వృద్ధి సాధించాయి. అమ్మకాల్లో ఈ మూడు విభాగాలే ఏకంగా 37.5 శాతం కైవసం చేసుకున్నాయి. విక్రయాల విలువ పరంగా యాంటీ డయాబెటిక్ 12.4 శాతం, విటమిన్స్, మినరల్స్, న్యూట్రాస్యూటికల్స్ 7.2 శాతం దూసుకెళ్లాయి’ అని వివరించింది. -
అలర్ట్.. రెండు రోజుల్లో ముగియనున్న గడువు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆర్థికపరమైన పనులకు అదే చివరి తేదీగా ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి చాలా సంస్థల నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. మార్చి 31తో గడువు ముగియనున్న కొన్నింటి వివరాలు ఈ కింది కథనంలో తెలుసుకుందాం. పెట్టుబడిదారులు దీర్ఘకాలిక లాభాలకోసం మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తూంటారు. అధికారిక ధ్రువీకరణలతో కేవైసీ నిబంధనలను పూర్తి చేయని వారు మార్చి 31లోపు రీకేవైసీని పూర్తి చేయాలి. బ్యాంకుల్లోనూ ఆధార్, పాన్ కార్డులాంటివి లేకపోతే గడువులోపు కేవైసీని అప్డేట్ చేయాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందిస్తున్న అమృత్ కలశ్ ప్రత్యేక డిపాజిట్ వ్యవధి మార్చి 31తో ముగియనుంది. దీని వ్యవధి 400 రోజులు. వడ్డీ రేటు 7.10 శాతం. సీనియర్లకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో టార్గెట్ రీచ్ అవ్వడానికి కొన్ని బ్యాంకులు హోంలోన్లపై మార్చి 31 వరకు రాయితీలు ఇస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి, అప్డేటెడ్ రిటర్నులు దాఖలు చేయడానికి గడువు ముగుస్తుంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిన వారు ఈ పనిని పూర్తి చేయాలి. 2021-22, 2022-23, 2023-24 మదింపు సంవత్సరాలకు సంబంధించి వీటిని దాఖలు చేసేందుకు ఆదాయపు పన్ను విభాగం అనుమతినిచ్చింది. ఇదీ చదవండి: అంబానీ-అదానీ దోస్త్ మేరా దోస్త్..! -
తెరుచుకోనున్న తులిప్ గార్డెన్.. 17 లక్షల పూలతో కనువిందు!
జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ మార్చి 23 నుంచి పర్యాటకుల కోసం తెరుచుకోనుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్ అధికారులు తెలిపారు. మార్చి 19 నుండి 20 రోజుల పాటు తులిప్ ఫెస్టివల్ జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ తులిప్ గార్డెన్ ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుంది. ఫ్లోరికల్చర్ అధికారి జావేద్ మసూద్ మాట్లాడుతూ మార్చి 23న ఈ గార్డెన్‌ను ప్రారంభించనున్నారని, ఇక్కడి పూలు అందరినీ తప్పక ఆకట్టుకుంటాయని అన్నారు. తులిప్ గార్డెన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉద్యానవనమని, కశ్మీర్ లోయలో పర్యాటక రంగానికి ఇది ఊతమిస్తున్నదని అన్నారు. ఈసారి జరిగే తులిప్ ఫెస్టివల్లో ఐదు కొత్త రకాల పూలను పరిచయం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 17 లక్షల తులిప్ పూలను చూడవచ్చన్నారు. కాగా ఈ గార్డెన్‌ను సిద్ధం చేయడానికి దాదాపు ఆరు నెలలు పడుతుందని, ఇందుకోసం విస్తృతమైన ప్రణాళిక ఉంటుందన్నారు. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్యపై మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని గార్డెన్ అధికారులు తెలిపారు. -
TS: మార్చిలోనే మండుతున్న ఎండలు
సాక్షి,హైదరాబాద్: మార్చినెల సగం గడవక ముందే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.గత ఏడాదితో పోల్చితే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ప్రస్తుతం రోజువారి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. రెండుమూడు రోజులుగా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో మంగళవారం 40.5 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ లో 40.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటివరకు.. రాష్ట్రంలో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్ లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 40.3 డిగ్రీల సంగారెడ్డి జిల్లాలో 39.6 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 38.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదీ చదవండి.. ఇక టీఎస్ బదులు టీజీ -
10 తర్వాత ఉత్తరాఖండ్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా!
ఉత్తరాఖండ్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ తమ అభ్యర్థులను మార్చి 10 తర్వాత ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ రెండో దశ సమావేశాలను మార్చి 10, 11 తేదీల్లో నిర్వహించనుంది. పోటీదారుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేసి, 16 మంది పేర్లను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపింది. ఇందులో ఐదుగురి పేర్లపై కేంద్ర ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. శుక్రవారం కాంగ్రెస్ హైకమాండ్ ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, నాగాలాండ్, తెలంగాణ, లక్షద్వీప్, సిక్కిం, త్రిపుర తదితర రాష్ట్రాల్లో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉత్తరాఖండ్‌ను చేర్చలేదు. కేంద్ర ఎన్నికల కమిటీ రెండవ సమావేశంలో ఉత్తరాఖండ్‌లోని ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పౌరీ గర్వాల్, హరిద్వార్, నైనిటాల్, అల్మోరా, తెహ్రీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల పేర్లపై చర్చ జరిగినట్లు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కరణ్ మహరా తెలిపారు. మొత్తం 42 మంది పార్టీ నేతలు ఐదు స్థానాల టిక్కెట్ల కోసం పోటీ పడ్డారని సమాచారం. -
1 నుంచి సీఈవో క్లబ్స్ ఇండియా సదస్సు
న్యూఢిల్లీ: సీఈవో క్లబ్స్ ఇండియా తమ వార్షిక సదస్సును మార్చి 1 నుంచి 3 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనుంది. ఇందులో 150 పైచిలుకు కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గోనున్నారు. మెడ్‌ప్లస్ హెల్త్ సరీ్వసెస్ వ్యవస్థాపకుడు మధుకర్ గంగాడి, స్టార్ హాస్పిటల్స్ ఎండీ గోపీచంద్ మన్నం, నాంగియా ఆండర్సన్ ఇండియా చైర్మన్ రాకేష్ నాంగియా తదితరులు వీరిలో ఉంటారని సీఈవో క్లబ్స్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కిశోర్ కొత్తపల్లి తెలిపారు. కొత్త సవాళ్లు, అవకాశాలు, కలిసి పనిచేసేందుకు ఆస్కారమున్న అంశాలు మొదలైన వాటి గురించి చర్చించేందుకు, వివిధ రంగాల సీఈవోలు, ఎంట్రప్రెన్యూర్లు, ఆవిష్కర్తలు, లీడర్లు మొదలైన వారితో కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. 1977లో అమెరికాలో నెలకొలి్పన సీఈవో క్లబ్స్ ఇంటర్నేషనల్ కింద 2008లో హైదరాబాద్‌లో సీఈవో క్లబ్స్ ఇండియా ఏర్పడింది. -
మార్చిలో బ్యాంక్ సెలవులు ఇవే - చూసారా..
2024 ఫిబ్రవరి ముగియడానికి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెలతో పోలిస్తే వచ్చే నెలలో (మార్చి) బ్యాంకులకు సెలవులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో ఏకంగా 14 రోజులు బ్యాంకులు మూత పడనున్నట్లు తెలుస్తోంది. మార్చి 1 - చప్చుర్ కుట్ - మిజోరాం మార్చి 6 - మహర్షి దయానంద్ సరస్వతి జయంతి మార్చి 8 - మహా శివరాత్రి / శివరాత్రి మార్చి 12 - రంజాన్ ప్రారంభం మార్చి 22 - బీహార్ డే - బీహార్ మార్చి 23 - భగత్ సింగ్ అమరవీరుల దినోత్సవం - అనేక రాష్ట్రాలు మార్చి 25 - హోలీ మార్చి 29 - గుడ్ ఫ్రైడే మార్చి 31 - ఈస్టర్ హాలిడే ఈ సెలవులు కాకుండా మార్చి 9, 23 రెండవ, నాలుగవ శనివారాలు.. 3, 10, 17, 24, 31 ఆదివారం సెలవులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 14 సెలవులు ఉన్నాయి. కాబట్టి బ్యాంకులు పనిచేయవు. బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇదీ చదవండి: స్విగ్గీ అకౌంట్‌తో రూ.97 వేలు మాయం చేశారు - ఎలా అంటే? -
రైతుల ‘చలో ఢిల్లీ’.. హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఫిబ్రవరి 13న రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు పిలుపునివ్వడాన్ని దృష్ట్యాలో పెట్టుకుని పంజాబ్ నుండి ఢిల్లీ వరకు హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్‌లోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు ఇప్పటికే తమ ట్రాక్టర్లపై నిరసన ప్రదర్శనకు బయలుదేరారు. అయితే వారిని ఢిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు ఆ దారిలోని ప్రతి కూడలిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు హర్యానా పోలీసులు. హర్యానా ప్రభుత్వం చౌదరి దల్బీర్ సింగ్ ఇండోర్ స్టేడియం, సిర్సా, గురుగోవింద్ సింగ్ స్టేడియం, దబ్వాలిని తాత్కాలిక జైళ్లుగా మార్చింది. ఆందోళనకు దిగుతున్న రైతులను వీటిలో పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే హర్యానాలోని 15 జిల్లాల్లో సెక్షన్ 144 విధించారు. ఏడు జిల్లాల్లో ఫిబ్రవరి 13 వరకు ఇంటర్నెట్ బంద్ చేశారు. డ్రోన్ల ద్వారా అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానా, పంజాబ్ సరిహద్దులను మూసివేయడానికి భారీ కాంక్రీట్ బారికేడ్లను ఏర్పాటు చేసి, పదునైన ముళ్ల తీగలను అమర్చారు. #WATCH | Ambala, Haryana: Shambhu border sealed ahead of the farmers' call for march to Delhi on 13th February. pic.twitter.com/9jbrddosnV — ANI (@ANI) February 12, 2024 మరోవైపు రైతుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు పలికింది. పంజాబ్‌లో జరిగిన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రైతుల ఉద్యమానికి మద్దతునిస్తున్నట్లు తెలిపారు. ఇదేసమయంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరుపుతోంది. గురువారం జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఫిబ్రవరి 13 న నిరసనకు దిగుతున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. అయితే ఈరోజు(సోమవారం) ముగ్గురు కేంద్ర మంత్రులు రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. -
6.3 శాతం నుంచి 6.7 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత్ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తాజా నివేదిక పేర్కొంది. ఈ మేరకు సెపె్టంబర్ నాటి అవుట్‌లుక్ 6.3 శాతం వృద్ధి అంచనాలను 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. రెండవ త్రైమాసికం (జూలై–సెపె్టంబర్) త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి ఫలితాలు అంచనాలకు మించి 7.6 శాతంగా వెలువడ్డం తమ తాజా నిర్ణయానికి కారణమని ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్– డిసెంబర్ 2023లో వివరించింది. 2022–23లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తొలుత అంచనావేసింది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది. క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా ఫలితం వెలువడింది. దీనితో ఆర్బీఐ కూడా ఇటీవలి పాలసీ సమీక్షలో తన జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతానికి పెంచింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకూ చూస్తే... రియల్ జీడీపీ విలువ రూ.76.22 లక్షల కోట్ల నుంచి రూ. 82.11 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. క్యాలెండర్ ఇయర్ మూడు త్రైమాసికాల్లో వృద్ధి 7.1 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఏడీబీ తాజా అవుట్‌లుక్ అంశాలను పరిశీలిస్తే.. ► 2024–25లో ఎకానమీ 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నాం. ► తయారీ, మైనింగ్, నిర్మాణంసహా కీలక పారిశ్రామిక రంగం కూడా రెండంకెల వృద్ధిని సాధిస్తున్నట్లు ఆర్థిక గణాంకాలు సూచిస్తున్నాయి. ► వ్యవసాయ రంగం కొంత నెమ్మదించినా.. దీనిని పారిశ్రామిక రంగం భర్తీ చేసే అవకాశం ఉంది. ► ప్రైవేటు వినియోగ వ్యయాలు, ఎగుమతుల్లో కొంత బలహీనతలు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యయాలు వ్యవస్థలో డిమాండ్ పెరుగుదలకు దోహదపడే అంశం. ► వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటును 5.5 శాతంగా కొనసాగవచ్చు. ఇది ఆర్బీఐ అంచనా 5.4 శాతం కంటే అధికం కావడం గమనార్హం. 2023, 2024 భారత్ ద్రవ్యోల్బణం లెక్కలు అంచనాల పరిధిలోనే ఉంటాయి. రెపో రేటు యథాతథ పరిస్థితి 2024 లో కూడా కొనసాగవచ్చు. ► పలు ఆగ్నేయాసియా ఆర్థిక వ్యవస్థలలో మహమ్మారి అనంతరం పరిస్థితులు మెరుగుపడినప్పటికీ, తిరిగి నిరాశాజనక పరిస్థితులు నెలకొంటున్నాయి. అధిక–ఆదాయ సాంకేతిక ఎగుమతిదారుల నుండి వస్తువుల ఎగుమతుల్లో స్థిరత్వమే తప్ప ప్రోత్సాహకరంగా లేవు. -
ఉల్లి ఎగుమతులు నిషేధించిన భారత్.. కారణం ఇదే..
దేశీయ మార్కెట్లో ఉల్లి ధరలు మళ్ళీ కొండెక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుదలవైపు దూసుకెళ్తున్న ఉల్లి ధరలు ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో హాఫ్ సెంచరీ (రూ. 50) దాటేశాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలున్నట్లు భావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరల పెరుగుదలను నియంత్రణలో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులను నిషేదించింది. దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్లను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) వెల్లడించింది. ప్రజలకు తక్కువ ధరలోనే ఉల్లి అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజు నుంచి (డిసెంబర్ 8) నిషేధం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎగుమతికి సిద్దమైన ఉల్లిని ఎగుమతి చేసుకోవచ్చని, కొత్తగా ఎగుమతి చేయడం కుదరదని డీజీఎఫ్టీ ప్రకటించింది. ఇతర దేశాల అభ్యర్థనలను భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆ దేశాలకు మాత్రమే ఉల్లి ఎగుమతి జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. లోన్ తీసుకున్న వారికి శుభవార్త ఉల్లి ధరలను అదుపు చేయడానికి కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కేంద్రం అనేకసార్లు ఎగుమతులను నిషేదించింది. అయితే 2024 మార్చి 31 తరువాత ఎగుమతులు యధాతధంగా కొనసాగుతాయా? లేదా నిషేధం ఇంకా పొడిగించబడుతుందా అనేది తెలియాల్సి ఉంది. -
కొత్త పార్లమెంట్ భవనం వద్ద రెజ్లర్లు నిరసనకు ప్లాన్..కానీ అనూహ్యంగా..
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ని అరెస్టే చేయాల్సిందే అంటూ జంతర్‌మంతర్ వద్ద భారత అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం జరగుతున్నందున్న ఒలింపియన్లు, కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్లతో సహా భారత అగ్రశ్రేణి రెజ్లర్లంతా అక్కడే నిరసనలు చేసేందుకు ప్లాన్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని, నిరసనను ఆపించేశారు. ఈ నేపథ్యంలో కొందరు రెజ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు నిర్వహిస్తున్న మహిళా మహా పంచాయత్ కోసం వేలాదిగా భద్రతా సిబ్బంది మోహరించారు. అదీగాక పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం కోసం అదనపు పోలీసులు ఢిల్లీ సరిహద్దుల వెంబడి మెహరింపు తోపాటు బహుళ బారికేడ్లు, కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేసేలా డిల్లీ మెట్రోలోని సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ భవన్ స్టేషన్లలోని అన్ని ప్రవేశ మార్గాలను అదికారులు మూసేశారు. #WATCH | Delhi: Security personnel stop & detain protesting wrestlers as they try to march towards the new Parliament from their site of protest at Jantar Mantar. Wrestlers are trying to march towards the new Parliament as they want to hold a women's Maha Panchayat in front of… pic.twitter.com/3vfTNi0rXl — ANI (@ANI) May 28, 2023 ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్ దేవేంద్ర పాఠక్ మీడియాతో మాట్లాడుతూ..రెజ్లర్ల నిరసనకు అనుమతి నిరాకరించినప్పటికీ..వారంతా కొత్త భవనం సమీపంలో మహిళా మహా పంచాయత్‌ను నిర్వహించాలని పట్టుబట్టారు. ఐతే తాము అథ్లెట్లను గౌరవిస్తాం. కానీ లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగించే పనులకు అనుమతివ్వం. అలాగే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ఎలాంటి ఆటంకాలు రానివ్వం అని చెప్పారు. మరోవైపు రెజ్లర్లకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీలోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద వేలాది మంది రైతులు తరలివస్తారని ప్రముఖ రైతు నాయకుడు రాకేష్ టికైత్ ప్రకటించారు. ఈ రైతులు వివిధ సరిహద్దు ప్రాంతాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతో భద్రత బలగాలు ఢిల్లీ సరిహద్దుల వెంబడి నిఘా ఉంచడమే గాక తనిఖీలు నిర్వహించకుండా ఎవ్వరినీ అనుమతించకుండా గట్టి పహారా నిర్వహించారు. (చదవండి: కొత్త పార్లమెంట్ భవనం కోసం షారూఖ్, అక్షయ్ కూమార్‌ల వాయిస్ ఓవర్) -
ఆస్కార్ నైన్టీసిక్స్కి డేట్ ఫిక్స్
95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగి నెలన్నర (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) అవుతోంది. అప్పుడే 96వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన ప్లాన్ మొదలుపెట్టింది కమిటీ. వచ్చే ఏడాది మార్చి 10న ఆస్కార్ వేడుక జరపనున్నట్లు ప్రకటించి, ఇందుకు సంబంధించిన కొన్ని కీలకమైన తేదీలను కూడా వెల్లడించారు నిర్వాహకులు. 96వ ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్‌ను ఈ ఏడాది డిసెంబరు 21న ప్రకటిస్తారు. నామినేషన్స్‌ను వచ్చే ఏడాది జనవరి 23న వెల్లడిస్తారు. ఆస్కార్ విజేతల ఎంపికకు ఫిబ్రవరి 22న ఓటింగ్ ఆరంభించి, 27 వరకూ కొనసాగిస్తారు. అవార్డుల ప్రదానోత్సవం మార్చి 10న జరుగుతుంది. ఇక జనరల్ ఎంట్రీ కేటగిరీలో అవార్డుల దరఖాస్తుల స్వీకరణకు నవంబరు 15 చివరి తేదీగా పేర్కొంది కమిటీ. మొత్తం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందిస్తారు. -
కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ జూమ్!
ముంబై: ప్రపంచ కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ వాటా మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) దాదాపు 11 శాతానికి పెరిగిందని ఆర్థిక సేవల దిగ్గజం– డీబీఎస్ ఒక విశ్లేషణలో తెలిపింది. సాఫ్ట్వేర్ ఎగుమతులు రికా ర్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరడం ఇందుకు దోహదపడినట్లు వివరించింది. 2021–22లో ఈ విలువ 255 బిలియన్ డాలర్లు. డీబీఎస్ సీనియ ర్ ఎకనమిస్ట్ రాధికా రావు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022–23 ట్రేడ్ డేటా విశ్లేషణ ప్రకారం, మొత్తం సేవల ఎగుమతి వాటాలో దేశం ఇప్పటికీ వెనుకబడి ఉంది. ఈ విభాగంలో మొత్తం భారత్ వాటా దాదాపు 4%మే. ► సేవల వాణిజ్యం పనితీరు పనితీరు పటిష్టంగా ఉంది. అంతర్జాతీయ ఫైనాన్షియల్ అంశాల్లో పటిష్టతకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా కలిసిన వచ్చే అంశం ఇది. కమోడిటీ ధరలు తగ్గడం కూడా భారత్‌కు విదేశీ మారకం పరంగా సానుకూలత కల్పిస్తోంది. ► 2022–23లో సాఫ్ట్వేర్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరగా, సర్వీసెస్ ట్రేడ్ మిగులు 142 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22తో పోల్చితే, ఈ విలువ 30 శాతం పెరిగింది. సర్వీసెస్ దిగుమతులు కూడా భారీగా పెరగడం దీనికి నేపథ్యం. ► వస్తు, సేవలు కలిపి 2022–23లో ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక మొత్తం దిగుమతులు 17 శాతం పెరిగి 892 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► కంప్యూటర్ సేవల ఎగుమతులు పటిష్ట స్థాయిలో ఉండడం కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2% లోపు (2022–23 జీడీపీలో) కట్టడిలో ఉండడానికి కారణం. ► బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కింద సేవల ట్రేడ్ వాటా 2019లో 3 శాతం (జీడీపీలో) ఉంటే, 2022 నాటికి ఇది 4.6 శాతానికి ఎగసింది. 2023లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ► సేవల ఎగుమతి పెరుగుదల్లో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికం సంబంధిత రంగాలు పటిష్టంగా ఉన్నాయి. మొత్తం సేవల ఎగుమతులలో వీటి వాటా దాదాపు సగం ఉంది ► సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అమెరికా 55.5% వాటాతో అగ్ర స్థానంలో ఉంటే, యూరప్ తరువాతి స్థానంలో ఉంది. ఇందులో బ్రిటన్‌ది మొదటి స్థానం. -
టోకు ద్రవ్యోల్బణం @ 29 నెలల కనిష్టం
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మార్చిలో 29 నెలల కనిష్టానికి దిగి వచ్చింది. 1.34 శాతానికి పరిమితమైంది. ఇంధనాలు, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గగా, ఆహార ఉత్పత్తుల భారం మాత్రం పెరిగింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.85 శాతంగాను, గతేడాది మార్చిలో 14.63 శాతంగాను నమోదైంది. ఇది తగ్గడం వరుసగా పదో నెల. చివరిసారిగా 2020 అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ ఆధారిత ధరల పెరుగుదల 1.31 శాతంగా నమోదైంది. ‘2023 మార్చిలో ద్రవ్యోల్బణం రేటు తగ్గడానికి ప్రధానంగా ప్రాథమిక లోహాలు, టెక్స్టైల్స్, ఆహారయేతర ఆర్టికల్స్, ఖనిజాలు, రబ్బర్.. ప్లాస్టిక్ ఉత్పత్తులు, క్రూడ్ పెట్రోలియం .. సహజ వాయువు, పేపర్ .. పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడమే కారణం‘ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం తెలిపింది. తాజాగా ఫుడ్ బాస్కెట్లో గోధుమలు వంటి ధాన్యాల ధరలు నెమ్మదించగా.. కూరగాయలు, పండ్లు, పాలు, పప్పులు మొదలైన వాటి రేట్లు పెరిగాయని ఈక్విరస్ సెక్యూరిటీస్ ఒక నోట్లో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు కూడా వడ్డీ రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం స్థిరపడేలా చూడటంపైనా, వినియోగ ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం మరింత తగ్గేలా చూడటంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందని టీఐడబ్ల్యూ క్యాపిటల్ సీఈవో మోహిత్ రాల్హన్ అభిప్రాయపడ్డారు. ► ఆహార ఉత్పత్తుల రేట్ల పెరుగుదల ఫిబ్రవరిలో 3.81 శాతంగా ఉండగా, మార్చిలో 5.48 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు ఫిబ్రవరిలో 21.53 శాతం తగ్గగా (2022 ఫిబ్రవరి ధరతో పోల్చి), మార్చిలో ఈ తగ్గుదల రేటు 2.22 శాతంగానే ఉంది. ఉల్లి విషయంలో ఫిబ్రవరిలో 40.14 శాతం ధరలు తగ్గగా, మార్చిలో తగ్గుదల రేటు 36.83 శాతంగానే నమోదైంది. ► గోధుమల ధరలు 9.16 శాతం, పప్పుల రేట్లు 3.03 శాతం పెరిగాయి. -
ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో 7% వృద్ధి
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 2023 మార్చి నాటికి సగటున రూ.40.05 లక్షల కోట్లకు చేరాయి. 2022 మార్చి నాటికి ఉన్న రూ.37.70 లక్షల కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధి చెందినట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ నికరంగా 0.72 శాతమే పెరగడం గమనార్హం. అదే కాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.5.86 లక్షల కోట్ల మేర తగ్గిపోయింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల ఏయూఎంలో రిటైల్ ఇన్వెస్టర్లకు సంబంధించిన ఏయూఎం (ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్ ఓరియెంటెడ్) 2023 మార్చి చివరికి రూ.6,83,296 కోట్లకు చేరుకుంది. ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతూ వెళ్లడం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈక్విటీ మార్కెట్ల పట్ల నమ్మకాన్ని ప్రదర్శించడంగా యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ అన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం తదితర అనిశ్చితుల్లోనూ మార్కెట్ పట్ల ఇన్వెస్టర్లు నమ్మకంగా ఉండడాన్ని ప్రస్తావించారు. 2022–23లో ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు యాంఫి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సిప్ రూపంలో నెలవారీ పెట్టుబడులు కూడా ఎప్పటికప్పుడు నూతన గరిష్టాలకు చేరుతున్నాయి. 2023–24 సంవత్సరంలోనూ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ప్రవాహం మెరుగ్గానే ఉంటుందన్న అంచనాను వెంకటేశ్ వ్యక్తం చేశారు. సిప్ ఖాతాల సంఖ్య మార్చి చివరికి 6.36 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో 21.65 లక్షలు మేర పెరిగింది. -
ఫార్మా అమ్మకాలు భేష్
న్యూఢిల్లీ: దేశీ ఫార్మా రంగం గత నెల(మార్చి)లో పటిష్ట వృద్ధిని సాధించింది. 2022 మార్చితో పోలిస్తే 13 శాతం పురోగతిని అందుకుంది. వెరసి వరుసగా రెండో నెలలోనూ రెండంకెల అమ్మకాలు నమోదయ్యాయి. ఇందుకు ప్రధానంగా మూడు రకాల చికిత్సలు దోహదపడ్డాయి. నిజానికి గతేడాది మార్చిలో ఫార్మా అమ్మకాలు 2 శాతం నీరసించాయి. కాగా.. పరిశ్రమ వర్గాల వివరాల ప్రకారం ఈ ఫిబ్రవరిలో 20 శాతంపైగా జంప్‌చేశాయి. దీంతో 2022–23లో మొత్తం ఫార్మా విక్రయాల్లో 9.3 శాతం పురోభివృద్ధి నమోదైంది. అంతక్రితం ఏడాది 14.6 శాతం పుంజుకోగా.. 2020–21లో అమ్మకాలు 2.1 శాతమే బలపడ్డాయి. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రయివేట్ వెల్లడించిన వివరాలివి. యాంటీఇన్ఫెక్టివ్స్, శ్వాససంబంధ(రెస్పిరేటరీ), నొప్పి నివారణ(పెయిన్ మేనేజ్మెంట్) విభాగాల నుంచి 30% ఆదాయం నమోదైనట్లు ఇండియా రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ కృష్ణనాథ్ ముండే పేర్కొన్నారు. ఇతర విభాగాలు అంతంతమాత్ర అమ్మకాలు మాత్రమే సాధించినప్పటికీ టాప్–10 థెరపీల నుంచి పరిశ్రమ ఆదాయంలో 87 శాతం లభించినట్లు వివరించారు. రానున్న రెండేళ్లలోనూ 10–11 శాతం వృద్ధికి వీలున్నట్లు ఈ సందర్భంగా అంచనా వేశారు. జూన్ నుంచీ స్పీడ్ గతేడాది(2022) జూన్ నుంచి ఫార్మా రంగంలో రికవరీ ఊపందుకున్నట్లు ఇండియా రేటింగ్స్ పేర్కొంది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రతికూల అమ్మకాలు నమోదుకాగా.. 2022 జూన్ నుంచి 2023 మార్చి కాలంలో 12.6 శాతం పురోగతిని సాధించాయి. అక్టోబర్, జనవరిల్లో అమ్మకాలు కొంతమేర మందగించినప్పటికీ పటిష్ట వృద్ధి నమోదైంది. పరిమాణంరీత్యా అమ్మకాలు 4.5 శాతం పుంజుకోగా.. ధరలు 5.6 శాతం మెరుగుపడ్డాయి. కొత్త ప్రొడక్టుల విడుదల 2.9 శాతం మెరుగుపడింది. విభాగాలవారీగా ఏఐవోసీడీ గణాంకాల ప్రకారం 2023 మార్చిలో రెస్పిరేటరీ విభాగం 50 శాతం జంప్‌చేయగా.. యాంటీఇన్ఫెక్టివ్స్ అమ్మకాలు 32 శాతం ఎగశాయి. పెయిన్ మేనేజ్మెంట్ 18 శాతం వృద్ధి చూపింది. ఈ బాటలో గ్యాస్ట్రోఎంటరాలజీ, విటమిన్ల విభాగాలు 8 శాతం చొప్పున బలపడ్డాయి. గుండెసంబంధ(కార్డియాలజీ), మెదడు, నాడీసంబంధ(సీఎన్ఎస్) థెరపీ అమ్మకాలు 6 శాతం, చర్మవ్యాధులు 4 శాతం, స్త్రీసంబంధ ప్రొడక్టుల విక్రయాలు 3 శాతం చొప్పున పెరిగాయి. అయితే యాంటీడయాబెటిక్ విక్రయాలు 2 శాతం వృద్ధికే పరిమితమయ్యాయి. కంపెనీల జోరిలా ఏఐవోసీడీ వివరాల ప్రకారం మార్చిలో కొన్ని ఫార్మా కంపెనీలు మార్కెట్‌ను మించి వృద్ధిని చూపాయి. ఇండొకొ రెమిడీస్ 28 శాతం, సిప్లా, ఎఫ్డీసీ 27 శాతం, అలెంబిక్ ఫార్మా 24 శాతం, గ్లెన్‌మార్క్ 22 శాతం చొప్పున పురోగతిని సాధించాయి. ఇక అబాట్ ఇండియా, ఆల్కెమ్ లేబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, జీఎస్కే ఫార్మా అమ్మకాల్లో 14–18 శాతం మధ్య వృద్ధి నమోదైంది. ఇతర సంస్థలలో ఇప్కా ల్యాబ్ 13 శాతం, టొరెంట్ ఫార్మా, లుపిన్ 9 శాతం, ఎరిస్ లైఫ్‌సైన్సెస్ 7 శాతం, అజంతా ఫార్మా, జేబీ కెమ్, జైడస్ లైఫ్‌సైన్సెస్ అమ్మకాలు 4–5 శాతం స్థాయిలో బలపడ్డాయి. సన్ ఫార్మా, ఫైజర్ అమ్మకాలు 3–2 శాతం పుంజుకోగా, గతేడాది మార్చితో పోలిస్తే సనోఫీ ఇండియా అమ్మకాలు వార్షికంగా 9 శాతం నీరసించాయి. -
డిమాండ్ పెరిగింది.. సరఫరా తగ్గింది
హైదరాబాద్: హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్లో డిమాండ్ – సరఫరా మధ్య అసమతుల్యత నెలకొందని, దీని ఫలితంగా మార్చి త్రైమాసికంలో ప్రాపర్టీల ధరలు 5.8 శాతం పెరిగినట్టు ‘మ్యాజిక్‌బ్రిక్స్ ప్రాప్ ఇండెక్స్’ నివేదిక వెల్లడించింది. 2023 జనవరి–మార్చి కాలానికి ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ఇళ్లకు డిమాండ్ త్రైమాసికం వారీగా 6 శాతం పెరగ్గా, అదే సమయంలో ఇళ్ల సరఫరా 14.2 శాతం తగ్గినట్టు తెలిపింది. పశ్చిమ హైదరాబాదులో గచ్చిబౌలి, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాలకు నివాస పరంగా అధిక డిమాండ్ నెలకొందని, ప్రధాన ఉపాధి కేంద్రాలకు, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)కు చేరువగా ఉండడమే అధిక డిమాండ్ కు కారణమని వివరించింది. ఇళ్ల మార్కెట్లో డిమాండ్ అందుబాటు ధరల నుంచి మధ్య స్థాయి (రూ.5000 – 7000 చదరపు అడుగు)కి మారిందని, ప్రస్తుతం నగరంలోని ఇళ్ల డిమాండ్, సరఫరాలో ఈ విభాగమే 50 శాతం వాటా ఆక్రమిస్తోందని తెలిపింది. విశాలమైన ఇళ్లకు ప్రాధాన్యత పెరిగిందని తెలియజేస్తూ.. 90 శాతం డిమాండ్ రెండు, మూడు పడక గదుల ఇళ్లకే ఉన్నట్టు పేర్కొంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్ధిక వ్యవస్థ 6–7 శాతం వరకు పెరుగుతుందని ఎన్నో ఏజెన్సీలు అంచనా వేశాయి. ఇటీవలి కేంద్ర బడ్జెట్ సైతం పలు ప్రోత్సాహక కార్యక్రమాలకుతోడు పిఎంఏవై, యూఐడిఎఫ్కు గణనీయమైన కేటాయింపులు చేసింది. ఈ చర్యలు ఉపాధి అవకాశాలను, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచుతాయి. సరసమైన, మధ్యస్థాయి విభాగాల్లో రాబోయే త్రైమాసికాలలో డిమాండ్ బాగుంటుందని ఆశిస్తున్నాం’’అని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సుధీర్ పాయ్ తెలిపారు. మార్చి త్రైమాసికంలో అత్యధికంగా మెహిదీపట్నం ప్రాంతంలో ప్రాపర్టీ ధరలు 4.27 శాతం పెరగ్గా (త్రైమాసికం వారీగా), కొండాపూర్‌లో 3.96 శాతం, బాలా నగర్లో 3.75 శాతం చొప్పున పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. అలాగే, బంజారాహిల్స్‌లో 3.94 శాతం, బోడుప్పల్లో 3.77 శాతం, నానక్‌రామ్ గూడలో 3.39 శాతం చొప్పున తగ్గినట్టు పేర్కొంది. -
దశాబ్ద కనిష్టానికి మొండి బాకీలు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల స్థూల మొండి బాకీలు (ఎన్పీఏ) దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 3.8 శాతానికి తగ్గే అవకాశాలు ఉన్నాయి. చివరిసారిగా 2014 మార్చి త్రైమాసికంలో ఈ స్థాయి ఎన్పీఏలు నమోదయ్యాయి. ఈమధ్యే ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 5.9 శాతం నుంచి 4.2 శాతానికి దిగి వచ్చి ఉంటాయన్న అంచనాలు నెలకొన్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఈ విషయాలు వెల్లడించింది. అధిక విలువ గల కార్పొరేట్ రుణ పద్దులకు సంబంధించిన ఎన్పీఏల పరిస్థితి మెరుగుపడుతున్నట్లు తెలిపింది. ఈ విభాగంలో స్థూల ఎన్పీఏలు 2 శాతం దిగువకు తగ్గవచ్చని పేర్కొంది. కార్పొరేట్లు తమ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రీ–పేమెంట్ సహా పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక రిస్కు నిర్వహణ, అండర్‌రైటింగ్‌ను పటిష్టం చేసుకోవడం తదితర అంశాలు కూడా బ్యాంకులు.. మొండిబాకీలను తగ్గించుకోవడానికి తోడ్పడుతున్నాయి. రిటైల్ విభాగంలో తనఖా లేని రుణాల మంజూరు పెరుగుతున్నప్పటికీ.. మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోలో వాటి వాటా చాలా తక్కువే ఉంటుందని క్రిసిల్ డిప్యుటీ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కృష్ణన్ సీతారామన్ చెప్పారు. బ్యాంకింగ్ రంగం మొత్తం రుణాల్లో రిటైల్ రుణాలు 26 శాతంగా ఉంటాయని.. వీటిలో సగం గృహ రుణాలు, నాలుగో వంతు వాటా వాహన రుణాలది ఉంటుందని తెలిపారు. అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలు మొదలైన అన్నింటి వాటా రిటైల్ పోర్ట్‌ఫోలియోలో నాలుగో వంతుగా ఉంటుందన్నారు. నెమ్మదించనున్న వడ్డీ మార్జిన్లు.. వడ్డీ రేట్ల పెంపుదలతో గత ఆర్థిక సంవత్సరం ఆసాంతం పెరుగుతూ వచ్చిన నికర వడ్డీ మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో నెమ్మదించవచ్చని సీతారామన్ తెలిపారు. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ సంక్షోభ పరిస్థితులు ఎలా ఉన్నా దేశీ బ్యాంకింగ్ రంగం ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొనగలదని పేర్కొన్నారు. భారత్‌లో వడ్డీ రేట్ల పెంపు తక్కువ స్థాయిలో ఉండటం, రికార్డు కనిష్ట స్థాయికి తగ్గుతున్న మొండి బాకీలతో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు ఆరోగ్యకరంగా ఉండటం తదితర అంశాలు ఇందు కు దోహదపడగలవని సీతారామన్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఈసారీ రుణ వృద్ధి 15 శాతం స్థాయిలో కొనసాగవచ్చని పేర్కొన్నారు. అసెట్ క్వాలిటీపై ఆందోళన తగ్గుతున్న నేపథ్యంలో నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) పెరగవచ్చని తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల ఏయూఎం 13–14 శాతం పెరగవచ్చని సీతారామన్ వివరించారు. -
మార్చిలో ‘సేవలు’ అంతంతే..!
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం మార్చిలో పేలవ పనితీరును కనబరిచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫిబ్రవరికన్నా తక్కువకు పడిపోయి 57.8కి చేరింది. సూచీ ఫిబ్రవరిలో 12 నెలల గరిష్ట స్థాయి 59.4ను చూసిన సంగతి తెలిసిందే. కొత్త బిజినెస్ ఆర్డర్లు అంతంత మాత్రంగానే పెరిగినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డి లిమా పేర్కొన్నారు. కాగా, సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన వరుసగా 20 నెలల నుంచి సూచీ వృద్ధి ధోరణిలో పయనిస్తోంది. తయారీ–సేవల రంగం కలిపినా డౌన్! కాగా, తయారీ–సేవల రంగం కలిపినా ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ ఫిబ్రవరిలో 59.0 వద్ద ఉంటే, మార్చిలో 58.4కు పడిపోయింది. మరోవైపు ఒక్క తయారీ రంగం చూస్తే మార్చిలో మంచి పురోగతి కనబరచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మార్చిలో మూడు నెలల గరిష్ట స్థాయిలో 56.4కు వద్దకు చేరింది. డిమాండ్ ఊపందుకోవడంతో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరిగినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినట్లూ వివరించింది. ఫిబ్రవరిలో పీఎంఐ 55.3గా నమోదయ్యింది. 400 మంది తయారీదారుల ప్యానల్లో కొనుగోళ్లు జరిపే మేనేజర్ల స్పందన ఆధారంగా ఈ సూచీ కదలికలను నమోదు చేస్తారు. భారత్ ఎకానమీలో సేవల రంగం వాటా 60%. పరిశ్రమల రంగం వాటా దాదాపు 15% అయితే, అందులో తయారీ రంగం వెయిటేజ్ 70% ఉంటుంది. -
మార్చిలో 3 నెలల గరిష్టానికి ‘నిరుద్యోగం’
ముంబై: దేశంలో నిరుద్యోగ సమస్య మార్చిలో తీవ్రమైంది. మూడు నెలల గరిష్ట స్థాయిలో 7.8 శాతంగా నమోదయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. 2022లో డిసెంబర్లో 8.30 శాతానికి పెరిగి న నిరుద్యోగితా రేటు జనవరిలో 7.14 శాతానికి తగ్గింది. అయితే మరుసటి రెండు నెలల్లో మళ్లీ పెరుగుదల ప్రారంమైంది. ఫిబ్రవరిలో 7.5 శాతం అన్ఎంప్లాయ్మెంట్ రేటు నమోదయితే, మార్చితో మరింత పెరిగి 7.8 శాతానికి ఎగసింది. మార్చిలో పట్టణ ప్రాంతాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 8.4 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 7.5 శాతంగా నమోదయ్యింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► మార్చిలో నిరుద్యోగం విషయంలో హర్యానా 26.8%తో అగ్ర స్థానంలో ఉంది. రాజస్తాన్ (26.4%), జమ్మూ, కశ్మీర్ (23.1%), సిక్కిం (20.7%), బీహార్ (17.6%), జార్ఖండ్ (17.5%) తరువాతి స్థానాల్లో నిలిచాయి. ► తక్కువ నిరుద్యోగితా రేటు (0.8 శాతం) ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గడ్‌లో నమోదయితే, అటుపైన పుదుచ్చేరి (1.5 శాతం), గుజరాత్ (1.8 శాతం), కర్ణాటక (2.3 శాతం), మేఘాలయ, ఒడిస్సా (2.6 శాతం) ఉన్నాయి. పండుగ సీజన్ తర్వాత డౌన్ అక్టోబర్–జనవరి పండుగ సీజన్ తర్వాత రిటైల్, సప్లై చైన్, లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ–కామర్స్ రంగాల్లో ఉపాధి తగ్గింది. ఐటీ, టెక్నాలజీ, స్టార్టప్‌ల్లో క్రియాశీలత తగ్గింది. ఇది తాజా నియామకాలలో మందగమనానికి దారితీసింది. ఇక మార్చి ఆర్థిక సంవత్సరాంతము, పరీక్షల నెల కావడంతో ప్రమాణాలు, పర్యాటకం, వినోదం, ఆతిథ్య రంగాల్లో అధిక డిమాండ్ కనిపించ లేదు.ఇది నిరుద్యోగితా శాతం పెరుగుదలకు దారితీసింది. తయారీ, ఇంజనీరింగ్, నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాల్లో కూడా ఉపాధి కల్పన అంతంతమాత్రంగానే ఉంది. ఆయా అంశాలు ఉద్యోగ మార్కెట్ వేగాన్ని తగ్గించాయి. అయితే ఏప్రిల్‌లో పురోగమనం ఉంటుందని భావిస్తున్నాం. – ఆదిత్య మిశ్రా, సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈఓ, డైరెక్టర్ తాత్కాలికమే కావచ్చు... నిరుద్యోగ డేటా ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి వాతావరణానికి అద్దం పడుతోంది. భారత్ కార్పొరేట్ రంగం వ్యయాల విషయంలో చాలా విచక్షణతో వ్యవహరిస్తోంది. ప్రతి అడుగును జాగ్రత్తగా బేరీజు వేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భారత్‌నూ ప్రభావం చూస్తుంది కాబట్టి, దేశంలో కార్కొరేట్ రంగం నియామకాలను తాత్కాలికంగా తగ్గించింది. అయితే భారత్ సవాళ్లను అధిగమించే పరిస్థితిలో ఉంది కాబట్టి, తాజా నిరుద్యోగ సమస్య తాత్కాలికమే అని నేను భావిస్తున్నాను. – రితుపర్ణ చక్రవర్తి, టీమ్‌లీజ్ సర్వీసెస్ కో–ఫౌండర్ -
మార్చిలో తయారీ రంగం పరుగు
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం మార్చిలో మంచి పురోగతి కనబరచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మూడు నెలల గరిష్ట స్థాయిలో 56.4కు వద్దకు చేరింది. డిమాండ్ ఊపందుకోవడంతో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరిగినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినట్లూ వివరించింది. ఫిబ్రవరిలో పీఎంఐ 55.3గా నమోదయ్యింది. అయితే సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సూచీ వృద్ధి బాటన కొనసాగడం వరుసగా 21వ నెల. ఉద్యోగ కల్పన విషయానికి వస్తే, మార్చిలో పేరోల్ సంఖ్యలో దాదాపు మార్పులేదు. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. -
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రోడ్డెక్కిన విపక్షాలు..ఢిల్లీలో ఉద్రిక్తత
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలన్ని రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు బ్యానర్లు చేతపట్టుకుని పార్లమెంట్ వరకు నిరసన ర్యాలీలు చేపట్టారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. రాష్ట్రపతి భవన్ వైపు పాదయాత్రతో వస్తున్న విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదానీ హిండెన్‌బర్గ్ వ్యవహారం, రాహుల్ గాంధీ అరెస్టు తదితర అంశాల నేపథ్యంలో శుక్రవారం విపక్షాలన్ని ఆందోళనకు దిగాయి. ఈ మేరకు ఈ అంశంపైనే శుక్రవారం కూడా ప్రతిపక్ష సభ్యులు ఉభయల సభల్లో ఆందోళనకు దిగడంతో ఎలాంటి చర్చలు జరగకుండానే సభలు మరోసారి వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలోనే తొలుత పార్లమెంట్ ప్రాంగణంలోనే నిరసనలు చేపట్టిన ప్రతిపక్ష ఎంపీలు..విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్వైపుకు ర్యాలీ ప్రదర్శనలు చేపట్టాయి. అయితే పోలీసులు ర్యాలీలకు అనుమతి లేదంటూ వారిని అదుపులో తీసుకున్నారు. దీంతో విజయ్ చౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదీగాక గత కొంతకాలంగా అదానీ హిండెన్‌బర్గ్ సమస్యపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేయడమే గాక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కావాలని కోరుతున్నాయి. ఐతే దీనిపై పార్లమెంట్లో చర్చ జరగనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని విపక్ష ఆరోపిస్తున్నాయి. పైగా దీని నుంచి దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌పై అరెస్టు వంటి ఎత్తుగడలను ఉపయోగిస్తుందని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటుందంటూ విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. Democracy in danger.. We stand in support with #RahulGandhi.pic.twitter.com/848QlEQcVt — WB Youth Congress (@IYCWestBengal) March 24, 2023 (చదవండి: రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు.. ప్రకటించిన లోక్‌సభ సెక్రటరీ జనరల్) -
బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు మార్చి 31న కూడా తెరిచే ఉంచాలని సూచించింది. మార్చి 31న పని వేళలు పూర్తయ్యే వరకు బ్యాంక్ బ్రాంచులను తెరిచే ఉంచాలని వెల్లడించింది. 2022- 23 ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా యాన్వల్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఆ రోజునే ఉంటుంది. ఇదీ చదవండి: Hindenburg's report: చాలా అకౌంట్లు ఫేకే! హిండెన్‌బర్గ్‌కు చిక్కిన ‘బ్లాక్’ బాగోతం ఇదే.. మార్చి 31, 2023న సాధారణ పని వేళల వరకు ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించిన ఓవర్-ది-కౌంటర్ లావాదేవీల కోసం సంబంధిత శాఖలను తెరిచి ఉంచాలని అన్ని బ్యాంకులకు సెంట్రల్ బ్యాంక్ తన లేఖలో పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరంలోపు లెక్కించాలని ఏజెన్సీ బ్యాంకులను ఆదేశించింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) ద్వారా లావాదేవీలు మార్చి 31 అర్ధరాత్రి 12 వరకు కొనసాగుతాయి. ఇదీ చదవండి: పిన్ అవసరం లేదు!.. పేమెంట్ ఫెయిల్ అయ్యే సమస్యే లేదు! అంతేకాకుండా ప్రభుత్వ చెక్కులకు సంబంధించి మార్చి 31న స్పెషల్ క్లియరింగ్ కూడా నిర్వహించాలని సూచించింది. దీనికి సంబంధించి ఆర్బీఐకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (డీపీఎస్ఎస్) కీలక ఆదేశాలు జారీ చేయనుంది. GST/TIN2.0/e రిసిప్ట్స్ లగేట్ ఫైల్స్ అప్లోడింగ్ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లావాదేవీల రిపోర్టింగ్‌కు సంబంధించి మార్చి 31 రిపోర్టింగ్ విండో ఏప్రిల్ 1 మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! -
టాటా, మారుతి, హ్యుందాయ్: కారు ఏదైనా ఆఫర్ మాత్రం భారీగానే!
సాక్షి, ముంబై: ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా , టాటా కంపెనీలు తమ పలు మోడళ్ల కార్లపై మార్చి మాసంలో భారీ తగ్గింపు లభిస్తోంది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది చక్కటి అవకాశం. మారుతి, హ్యుందాయ్, టాటా కార్లపై ప్రస్తుతం లభిస్తున్న తగ్గింపు వివరాలను చూద్దాం. (రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే ) మారుతి కార్లపై డిస్కౌంట్లు మార్చిలో రూ. 52వేల వరకు తగ్గింపుతో మారుతి సుజుకి ఇగ్నిస్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే మారుతి సియాజ్పై రూ. 28 వేల వరకు తగ్గింపు లభ్యం. ఇక పాపులర్ కారు ఆల్టోపై రూ. 38వేలు, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సోపై రూ. 49వేలు , వ్యాగన్ఆర్ కారు కొనుగోలుపై రూ. 64వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకా స్విఫ్ట్ రూ. 54వేల దాకా, డిజైర్ మోడల్ కొనుగోలుపై రూ. 10 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. (ఐటీ మేజర్‌ను నడిపించిన ఈ ధీర వనితల్ని గుర్తుపట్టారా? వీరే లేకపోతే..!) అయితే మారుతి సుజుకి బాలెనో, బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు. హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లు మార్చిలో గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఆరా వంటి మోడళ్లపై హ్యుందాయ్ డిస్కౌంట్లనుఅందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ రూ.38 వేలు దాకా, పాపులర్ ఐ20పై రూ. 20 వేలు, హ్యుందాయ్ ఆరాపై రూ.33 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే, క్రెటా, వెన్యూ, అల్కాజార్ , టక్సన్ వంటి SUV మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు. టాటా కార్లపై డిస్కౌంట్లు అత్యధికంగా అమ్ముడైన టాటా ప్యాసింజర్ వాహనం టాటా నెక్సాన్ మార్చిలో రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది. టాటా హారియర్ ,టాటా సఫారిపై రూ.45వేల రకు తగ్గింపు ఉంది. దీంతోపాటు టాటా టియాగోపై సుమారు రూ. 28వేలు, టాటా టిగోర్‌పై రూ. 30వేల వరకు తగ్గింపు ఉంది. టాటా ఆల్ట్రోజ్ రూ. 28 వేల దాకా తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. -
మార్చి 31 డెడ్‌లైన్: చేయాల్సిన కీలకమైన పనులు ఏంటో తెలుసా?
సాక్షి, ముంబై: అనేక కీలకమైన ఆర్థిక పనులకు మార్చి 31 తుది గడువు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజు మార్చి 31 చివరి రోజు లోపు ఈ పనులను పూర్తి చేయడంలో విఫలమైతే మన జేబుకు చిల్లు పడక తప్పదు. ఎలాంటి ఆర్థిక జరిమానాలు లేదా ఖాతాల డీయాక్టివేషన్ లాంటి ప్రమాదం లేకుండా, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు చేయాల్సిన పనుల్లో ముఖ్యంగా పాన్ ఆధార్ లింకింగ్, పన్ను ప్రణాళిక లాంటికొన్ని ముఖ్యమైన పనులను ఒకసారి చూద్దాం. 2023, మార్చి 31 లోపు పూర్తి చేయాల్సిన పైనాన్షియల్ టాస్క్స్ ► పాన్ -ఆధార్ కార్డ్ లింక్: మార్చి 31 లోపు పాన్ ఆధార్ కార్డ్‌లను లింకింగ్ పూర్తి చేయాలి. లేదంటే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ చెల్లదు. దీంతో ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను ఫైల్ చేయలేరు. ► అలాగే రూ. 1,000 ఫైన్. అంతేకాదు తప్పుడు లేదా చెల్లని పాన్‌ను కోట్ చేస్తే రూ. 10,000 జరిమానా . ► అప్డేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్: 2019-2020, AY 2020-21కి సంబంధించిన అప్డేట్ చేయబడిన ఆదాయ-పన్ను రిటర్న్‌ను 31 మార్చి 2023 లోపు సమర్పించడం అవసరం. గడువు ముగిసాక ఫైల్ చేయలేరు. ► ముందస్తు పన్ను చెల్లింపు: రూ. 10,000 కంటే పన్ను చెల్లించాల్సి ఉన్న చెల్లింపుదారుడు ముందస్తు పన్ను చెల్లించాలి. జూన్ 15లోగా 15 శాతం, సెప్టెంబర్ 25లోగా 45 శాతం, డిసెంబర్ 15లోగా 75 శాతం, మార్చి 15 నాటికి 100 శాతం చొప్పున నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు. అయితే, మూలధన లాభాలు వంటి అదనపు ఆదాయం ఉన్నా, ఉద్యోగాన్ని మార్చుకున్నా మీరు ముందస్తు పన్నును లెక్కించి చెల్లించాల్సి ఉంటుంది. ► 2022-2023కి సంబంధించిన మొత్తం ముందస్తు పన్నును మార్చి 15లోపు ఇంకా చెల్లించనట్లయితే, మార్చి 31, 2023లోపు చెల్లించే అవకాశం ఉంది. మార్చి తర్వాత, నెక్ట్స్ ఐటీఆర్ వరకు బకాయిపై నెలకు 1 శాతం వడ్డీని చెల్లించాలి. ► ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లయితే, అత్యధిక పరిమితి రూ. 1.5 లక్షలతో పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ► పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టండి: పీపీఎఫ్ సుకన్య సమృద్ధి యోజన, ఫిక్స్డ్ డిపాజిట్ ,ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ వంటి పన్ను ఆదా పథకాలలో పెట్టుబడుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచచ్చు ► ఫారమ్ 12బీ: ఉద్యోగం మారినట్టయితే వారు ఫారమ్ 12B పూరించడాన్ని మర్చిపోవద్దు. ► మ్యూచువల్ ఫండ్ నామినేషన్: సెబీ సర్క్యులర్ ప్రకారం, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారు మార్చి 31 లోపు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఖాతా బంద్ అవుతుంది. ► మార్కెట్ రెగ్యులేటరీ ప్రకారం మార్చి 31లోపు NSE NMF ప్లాట్‌ఫారమ్‌లో మొబైల్ నంబర్ , ఇమెయిల్ ఐడీని ధృవీకరించుకోవడం అవసరం. ► క్యాపిటల్ గెయిన్: ఇంతకుముందు ఈక్విటీలపై దీర్ఘకాలిక పన్ను రహితంగా ఉండేది. ఈక్విటీ ఫండ్‌పై దీర్ఘకాలిక మూలధన లాభం 1 లక్ష కంటే ఎక్కువ మొత్తంలో ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా పన్ను రేటు 10 శాతం. సో..పెట్టుబడులను రీడీమ్ చేయాలనుకుంటే పన్ను రహిత పరిమితి రూ. 1 లక్ష ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మార్చి 31లోపు రిడీమ్ చేసుకోవచ్చు. స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను 15 శాతం ► ప్రధానమంత్రి వయ వందన యోజన: సీనియర్ సిటిజన్లు, రిటైర్ మెంట్ ఫండ్ కోసం ప్రధానమంత్రి వయ వందన యోజన (PMVVY) వంటి పలు ఆప్షన్స్ ఉన్నాయి ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు మార్చి 31, 2023 లోపు దీన్ని ప్రారంభిస్తే మంచింది. ► ఈ పాలసీలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 10 సంవత్సరాల పథకంలో, పెట్టుబడిదారులు 7.4 శాతం చొప్పున పెన్షన్ పొందుతారు. ఈ పథకం కింద 10 సంవత్సరాల నిర్ణీత కాలానికి. రూ.9,250 నెలవారీ పెన్షన్ , రూ. 1.62 లక్షల కనీస పెట్టుబడిపై, నెలవారీ పెన్షన్ రూ. 1,000 వరకు వస్తుంది. -
గడువు సమీపిస్తోంది, ఖాతాదారులకు అలర్ట్: లేదంటే తప్పదు మూల్యం!
సాక్షి, ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) తన కస్టమర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. మార్చి 24, 2023లోపు సెంట్రల్ కేవైసీ (C-KYC)ని పూర్తి చేయాలని తన వినియోగ దారులను కోరింది. అలా చేయకపోతే భారీ మూల్యం తప్పదని కూడా హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విటర్లో ఒ కప్రకటన జారీ చేసింది. నిర్ధేశిత సమయంలోపు బ్యాంకు వినియోగదారులు సెంట్రలైజ్డ్ నో యువర్ కస్టమర్ (సీ-కేవైసీ)ని పూర్తి చేయని పక్షంలో అకౌంట్ డీయాక్టివేట్ అవుతుందని తెలిపింది. ఇప్పటికే ఎస్ఎంఎస్, నోటీసులు సంబంధిత ఖాతాదారులకు పంపించామని, వెంటనే వారు సమీప ఖాతాను సందర్శించిన అవసరమైన పతత్రాలు సమర్పించాలని సూచించింది. మార్చి 24, 2023లోపు సెంట్రల్ KYC ప్రాసెస్‌ను పూర్తి చేయని కస్టమర్లు తమ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడవచ్చు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) సీ-కేవైసీని నిర్వహిస్తుంది. దీంతో కస్టమరు బ్యాంకుకో, డీమ్యాట్ ఖాతాకో ఇలా ఏదో ఒకదానికి ఒకసారి నో యువర్ కస్టమర్ వివరాలిచ్చిన తరువాత డిజిటల్ ఫార్మాట్ సెంట్రలైజ్డ్ నంబరు కేటాయిస్తారు. కేవైసీ వివరాలకు ఈ నంబరు ఇస్తే సరిపోతుంది. అంటే కస్టమర్ ఒక్కసారి సీ-కేవైసీని పూర్తి చేశాక కొత్త ఖాతాలను తెరవడం, జీవిత బీమా, లేదా డీమ్యాట్ ఖాతా లాంటి విభిన్న ప్రయోజనాల కోసం మళ్లీ ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం లేదు. ఆ నంబరు తీసుకున్న ఆర్థిక సంస్థ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. కేవైసీ ప్రాసెస్‌ను, కేవేసీ రికార్డ్లను సమర్థవంతంగా వినియోగించు కోవడం లక్ష్యాలుగా ‘సీ-కేవైసీ’ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. pic.twitter.com/HZOMQN9pbJ — Bank of Baroda (@bankofbaroda) March 13, 2023 -
‘మార్చి 31’ గాభరావద్దు? ఈ విషయాలు తెలుసుకుంటే చాలు!
‘మార్చి’.. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి నెల. మీ ఆదాయాన్ని లెక్క వేసుకుని.. అవసరం అయితే వీలున్నంత వరకు ప్లానింగ్ చేసుకుని, ఆదాయాన్ని బట్టి పన్ను భారం లెక్కించుకోవాలి. ఆదాయం లెక్కింపునకు (అంచనా), పొదుపు .. పెట్టుబడులకు, చెల్లింపులకు, ఇతరత్రా ప్లానింగ్‌కు ఈ నెల 31 చివరి తేదీ. ఈ నేపథ్యంలో మీరు గుర్తుంచుకోవల్సిన విషయాలు ఏమిటంటే.. ♦ ఉద్యోగస్తులు కేవలం జీతాలు కాకుండా ప్రతి నెలా వచ్చే ఆదాయాలు.. ఉదాహరణకు.. ఇంటద్దె, వడ్డీ, ఇతరాలు ఉంటే లెక్కలు వేసుకోవాలి. ఇటువంటి వారు తమ అవసరాన్ని బట్టి పీఎఫ్, ఎన్ఎస్సీ, బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్, పిల్లల స్కూల్ ఫీజు, ఇంటి రుణం మీద వడ్డీ చెల్లింపు, అసలుకు కట్టాడం లాంటివి ఏమైనా చేసి ఆదాయాన్ని తగ్గించి చూపించుకుని, పన్ను భారం తగ్గించుకోవాలా? లేదా చేతిలో నగదును ’బ్లాక్’ చేసుకోవాలా? బదులుగా కేవలం పన్ను భారం చెల్లించి బైటపడి, ఊపరి పీల్చుకోవాలా? ఇదంతా ఆలోచించుకుని తగు నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో మనం ఎన్నో ఉదాహరణలు ఇచ్చాం. గుర్తుంచుకోండి. అలాగే ఒకరితో ఒకరు పోల్చుకోవద్దండి. ఎవరి వీలు వారిది. ఎవరి వెసులుబాటు వారిదే. ♦ ప్లానింగ్‌లో భాగంగా ఉద్యోగానికి సంబంధించిన జీతభత్యాలు, మిగతా ఆదాయాలను వచ్చే ఆర్థిక సంవత్సరానికి పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉండే ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 7,00,000 వరకు పన్ను భారం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆదాయాన్ని ఏప్రిల్‌కు వాయిదా వేసుకోండి. ప్రైవేట్ సంస్థల్లో యజమానిని, జీతం/బోనస్ ఎక్స్‌గ్రేషియా వచ్చే సంవత్సరం ఇవ్వమనండి. మీకు వచ్చే ఇంటద్దెను వచ్చే సంవత్సరం నుంచి పెంచండి. ♦ అలాగే క్యాపిటల్ గెయిన్స్ విషయానికొస్తే.. మీకు ముందుగానే తెలిసిపోతుంది. మీరు అంచనా వేసుకోవచ్చు. ఆ అంచనాల మేరకు స్థిరాస్తుల క్రయవిక్రయాలు వాయిదా వేసుకోండి. ఒప్పందాలు అవసరమైతే మార్చుకోండి. అయితే, ఒక జాగ్రత్త తీసుకోండి. కేవలం పన్ను భారం తగ్గించుకోవడం కోసం వాయిదా వేసుకోకండి. మిగతా విషయాలు .. అంటే అగ్రిమెంటును గౌరవించడం, మీరు అనుకున్న ప్రతిఫలం రావడం, మీ కుటుంబ అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకోండి. ♦ చివరగా.. ’మార్చి’ వచ్చిందని ’మార్చ్’ చేయనక్కర్లేదు (ముందుకు పరుగెత్తనక్కర్లేదు). గాభరా పడక్కర్లేదు. వడ్డీకి అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్ చేయనక్కర్లేదు. తలకు మించి భారం పెట్టుకోకండి. అవసరం లేకపోతే పన్ను చెల్లించండి. పన్ను భారం కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటే వీలును బట్టి చెల్లించండి. ప్రభుత్వం ఒక శాతం ఒక నెలకు చొప్పున అదనంగా కట్టవచ్చని వెసులుబాటు ఇచ్చింది. ఆలోచించి, అడుగు వేస్తూ ఆనందంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టండి. కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
మార్చిలో ముఖ్యమైన డెడ్లైన్లు.. తప్పిస్తే నష్టమే!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ఈ మార్చి 31తో ముగుస్తుంది. ఆర్థికపరంగా ఈ మార్చి నెల ముగిసేలోపు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. పాన్- ఆధార్ లింక్, ముందస్తు పన్ను చెల్లింపు, పన్ను ఆదా చేసే పెట్టుబడులు, ప్రధానమంత్రి వయా వందన యోజన దరఖాస్తుకు మార్చిలో గడువులు ముగుస్తాయి. ఇదీ చదవండి: వాహనదారులకు షాక్! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్ చార్జీలు! పాన్-ఆధార్ కార్డ్ లింక్ మార్చి 31లోపు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్‌తో లింక్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంతకు ముందు కూడా పాన్-ఆధార్ లింక్ చేయడానికి గడువును చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతం రూ. 1,000 పెనాల్టీ చెల్లించి లింక్ చేసుకోవాలి. ప్రస్తుత గడువు తప్పితే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ పని చేయదని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. ముందస్తు పన్ను చెల్లింపు ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ముందస్తు పన్ను చెల్లింపు చివరి వాయిదా చెల్లింపునకు చివరి తేదీ మార్చి 15. ముందస్తు పన్ను చెల్లింపులో ఏదైనా డిఫాల్ట్ అయితే పన్ను చెల్లింపుదారు సంబంధిత పెనాల్టీలను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. టీడీఎస్ మినహాయించిన తర్వాత రూ.10వేలు లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంచనా ఉన్న వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ముందస్తు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ఆదా చేసే పెట్టుబడులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా చేసే పెట్టుబడులకు మార్చి 31 చివరి తేదీ. పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి, ట్యాక్స్‌ను ఆదా చేయడానికి ఈ పన్ను ప్రణాళిక సహాయపడుతుంది. పన్ను చెల్లింపుదారులు గణనీయమైన మొత్తంలో పన్ను ఆదా చేసుకోవడానికి అందుబాటులో ఉన్న పన్ను ఆదా అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. ప్రధాన మంత్రి వయ వందన యోజన ఇది సీనియర్ సిటిజన్లకు భద్రతను అందించే బీమా పాలసీ కమ్ పెన్షన్ పథకం. ఈ పథకాన్ని భారతీయ బీమా సంస్థ అందిస్తోంది. ఇందులో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మార్చి 31 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంపై 10 సంవత్సరాలకు ఏటా 7.4 శాతం వడ్డీ వస్తుంది. నెలవారీ, త్రైమాసికం, లేదా వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు. ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. -
మార్చిలో థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలివే!
కంటెంట్ నచ్చితే చాలు ఏ సినిమా అయినా ఆదరించడానికి సిద్ధంగా ఉంటారు ప్రేక్షకులు. భాషకు సరిహద్దులు లేకుండా సినిమాను అక్కున చేర్చుకుంటున్నారు. ప్రాంతీయ భాషలో వచ్చిన సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్లో హిట్ చేస్తున్నారు. ఓపక్క కమర్షియల్ కంటెంట్, మరోపక్క నేటివిటీకి దగ్గరగా ఉన్న కంటెంట్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతుండగా కథలో దమ్మున్న సినిమా అంతిమంగా విజయం సాధిస్తోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారిసు, తెగింపు, పఠాన్ వంటి పెద్ద సినిమాలు 2023కి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పాయి. ఆ తర్వాత రిలీజైన హంట్, మైఖేల్, అమిగోస్ మాత్రం నిరాశపర్చాయి. ఆ వెంటనే సార్, రైటర్ పద్మభూషణ్, వినరో భాగ్యము విష్ణు కథ వరుసగా హిట్టవుతూ వచ్చాయి. మరి మార్చి నెలలో ఏయే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి? ఏయే హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుబోతున్నారో చూసేద్దాం.. మార్చి 3 బలగం ఇన్ కార్ ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు గ్రంథాలయం రిచి గాడి పెళ్లి సాచి మార్చి 10 సీఎస్ఐ సనాతన్ నేను స్టూడెంట్ సార్ ట్యాక్సీ మిస్టర్ కల్యాణ్ మార్చి 17 ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి కబ్జా మార్చి 22 దాస్ కా ధమ్కీ బెదురులంక 2012 మార్చి 30 దసరా మార్చి 31 భూతద్దం భాస్కర్‌నారాయణ -
2023 March Bank holidays: 12 రోజులు సెలవు, లిస్ట్ ఇదిగో!
సాక్షి, ముంబై: 2023 మార్చికి నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రెండు నాలుగు శనివారాలు బ్యాంకులు పనిచేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చి 2023 కోసం బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. వివిధ పండుగలు, రెండు, నాల్గవ శనివారాలు,నాలుగు ఆదివారాలతో సహా మొత్తం 12 సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు సేవల్లో ఎలాంటి అసౌకర్యం లేకుండా మార్చి నెలలో రాబోయే బ్యాంక్ సంబంధిత పనులు ఉన్న వ్యక్తులు సెలవు క్యాలెండర్‌ను సమీక్షించి ప్లాన్ చేసుకుంటే ఉత్తమం. ఇవి మన ప్రాంతానికి వర్తిస్తాయో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే ఆన్లైన్, మొబైల్, నెట్ బ్యాంకింగ్ సేవలు ఎలాగూ అందుబాటులో ఉంటాయి. మార్చి నెలలో బ్యాంకు సెలవుల జాబితా మార్చి 3 శుక్రవారం: చాప్చార్ కుట్ సందర్భంగా మణిపూర్‌లోని బ్యాంకులకు సెలవు మార్చి 5 - ఆదివారం మార్చి 7 -హోలీ (2వ రోజు) మార్చి 8 - ధూలేటి/డోల్జాత్రా/హోలీ/యోసాంగ్ 2వ రోజు మార్చి 9 -హోలీ మార్చి 11 - నెలలో రెండవ శనివారం మార్చి 12 - ఆదివారం మార్చి 19 - ఆదివారం మార్చి 22 - ఉగాది మార్చి 25 - నాలుగో శనివారం మార్చి 26 - ఆదివారం మార్చి 30 - శ్రీరామ నవమి -
ఎండకు చల్ల గొడుగు
మార్చి నెల రానేలేదింకా... వాతావరణం మారిపోయింది. ఎండకు గొడుగు పట్టాల్సిందే. ఇంట్లోనే ‘చల్ల’ గొడుగు పడదాం. పెరుగు చిలికి... లస్సీ చేద్దాం. రోజ్ లస్సీ కావలసినవి: పెరుగు – 2 కప్పులు; చల్లటి నీరు – కప్పు; చక్కెర లేదా తేనె – 3 టేబుల్ స్పూన్లు; రోజ్ సిరప్ – 2 టేబుల్ స్పూన్లు; పిస్తా – 10 (పలుకులు చేయాలి). తయారీ: మిక్సీ జ్యూస్ జార్లో పెరుగు, రోజ్‌సిరప్, చక్కెర, నీరుపోసి బ్లెండ్ చేయాలి. రుచిని బట్టి మరింత తీపి కావాలనుకుంటే మరో రెండు స్పూన్ల చక్కెర వేసి కరిగే వరకు కొద్దిసేపు బ్లెండ్ చేయాలి. గ్లాసులో పోసి పిస్తాతో గారి్నష్ చేసి సర్వ్ చేయాలి. మసాలా చాస్ కావలసినవి: పెరుగు – కప్పు; జీలకర్రపొ డి – అర టీ స్పూన్; చాట్ మసాలా – పా వు టీ స్పూన్; నల్ల ఉప్పు – చిటికెడు; అల్లం తురుము – పా వు టీ స్పూన్; పచ్చిమిర్చి – 1 ( తరగాలి); మిరియాలపొ డి – పా వు టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; పుదీనా – 5 ఆకులు; కొత్తిమీర తరుగు – టీ స్పూన్; మంచి నీరు – 4 కప్పులు. తయారీ: ఒక పా త్రలో పెరుగు, జీలకర్ర, చాట్ మసాలా, జీలకర్రపొ డి, నల్ల ఉప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల΄÷డి, ఇంగువ, ఉప్పు వేసి బీటర్‌తో బాగా చిలకాలి. ఇప్పుడు నీటిని పోసి అరనిమిషం పా టు చిలకాలి. చివరగా పుదీన, కొత్తిమీర వేసి తాగడమే. రోజూ ఉదయం బయటకు వెళ్లే ముందు ఒక గ్లాసు తాగితే ఎండ వేడిమి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. కేసర్ ఇలాచీ ... కావలసినవి: పెరుగు – 2 కప్పులు; కుంకుమ పువ్వు రేకలు – 2; తేనె– 3 టేబుల్ స్పూన్లు; యాలకులు – 6 (తొక్క వేరు చేసి గింజలనుపొ డి చేయాలి); బాదం తరుగు – టేబుల్ స్పూన్; పిస్తా – టేబుల్ స్పూన్. తయారీ: ఒక పా త్రలో బాదం, పిస్తా మినహా పైన తీసుకున్న అన్నింటినీ వేసి బీటర్‌తో రెండు నిమిషాల సేపు చిలకాలి. తీపి సరి చూసుకుని అవసరమైతే మరికొంత తేనె వేసి కలిసేవరకు చిలకాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లో పోసి పైన బాదం, పిస్తాతో అలంకరించి సర్వ్ చేయాలి. ఇది మధ్యాహ్న భోజనంలో భాగంగా తీసుకుంటే బాగుంటుంది. స్వీట్ మింట్ ... కావలసినవి: పెరుగు – కప్పు; తేనె– 2 టేబుల్ స్పూన్లు; పుదీన ఆకులు – అర కప్పు; జీడిపప్పు – 20 (వలిచినవి); బాదం – 10 (తరగాలి); పిస్తా – 10 (తరగాలి); మంచి నీరు – 4 కప్పులు. తయారీ: జీడిపప్పులను చిన్న పలుకులు చేసి, బాదం తరుగు, పిస్తా తరుగులో కలిపి పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్లో పెరుగు, పుదీన, తేనె వేసి బ్లెండ్ చేయాలి. నీటిని కలిపి మరోసారి కలిసేలా తిప్పాలి. ఈ లస్సీని గ్లాసుల్లో పోసి బాదం, పిస్తా, జీడిపప్పుతో అలంకరించి సర్వ్ చేయాలి. ఇష్టమైతే ఐస్‌క్యూబ్స్ వేసుకోవచ్చు. కేసర్ పిస్తా ... కావలసినవి: పెరుగు – కప్పు; చక్కెర లేదా తేనె – టేబుల్ స్పూన్; క్రీమ్– పా వు కప్పు; కుంకుమ పువ్వు– పది రేకలు; పిస్తా – టేబుల్ స్పూన్; మంచి నీరు – 4 కప్పులు. తయారీ: మిక్సీజార్‌లో పిస్తా, పెరుగు, క్రీమ్, చక్కెర లేదా తేనె, కుంకుమ పువ్వు నాలుగురేకలు వేసి బ్లెండ్ చేయాలి. ఈ లస్సీని గ్లాసులో పోసి ఐస్ క్యూబ్స్ వేసి పైన రెండు కుంకుమ పువ్వు రేకలతో గా ర్నీష్ చేసి సర్వ్ చేయాలి. పైనాపిల్ ... కావలసినవి: పైనాపిల్ ముక్కలు – అర కప్పు; చక్కెర – పా వు కప్పు; పెరుగు – 2 కప్పులు; క్రీమ్ – పా వు కప్పు; పుదీనా – 4 ఆకులు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; తయారీ: పెనం వేడి చేసి పైనాపిల్ ముక్కలు, చక్కెర వేసి సన్న మంట మీద కలుపుతూ మగ్గనివ్వాలి. సుమారుగా మూడు నిమిషాల సేపటికి ముక్కలు మెత్తబడతాయి. ఆ తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఒక పా త్రలో పెరుగు, క్రీమ్ వేసి బీటర్‌తో బాగా చిలకాలి. ఇందులో ఉడికించిన పైనాపిల్ మిశ్రమాన్ని వేసి చిలకాలి. ఈ లస్సీని గ్లాసులో పోసి పుదీనాతో అలంకరించి ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. చల్లగా చిక్కగా ఇష్టపడే వాళ్లు ఓ అరగంట ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన తరవాత తాగవచ్చు. -
ప్రజారోగ్యం బలోపేతం.. మూడు కీలక కార్యక్రమాల అమలుకు సన్నద్ధం
సచివాలయ సిబ్బంది తరహాలోనే ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సిబ్బంది అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ప్రతి కుటుంబాన్ని కలుసుకుని విలేజ్ క్లినిక్స్ సేవలను వివరించాలి. విలేజ్ క్లినిక్స్ ఆవశ్యకత, సిబ్బంది అందుబాటులో ఉంటున్న తీరు, సేవలపై ప్రతి కుటుంబానికీ అవగాహన కలగాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ప్రధాన కార్యక్రమాలకు మార్చి నెలలో శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు.. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వాస్పత్రుల సందర్శన.. జగనన్న గోరుముద్ద ద్వారా పిల్లలకు వారంలో మూడు రోజులు రాగి మాల్ట్ పంపిణీ.. ఇలా ఈ మూడు కార్యక్రమాలను మార్చి నెలలో ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రతి వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ను నెలలో రెండు సార్లు వైద్యులు సందర్శిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. 4 వేలు పైబడి జనాభా ఉన్న క్లినిక్‌లను నెలలో మూడు సార్లు సందర్శించేలా చర్యలు చేపట్టామన్నారు. విలేజ్ క్లినిక్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌లో (ఎస్ఓపీ) పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు, కాలుష్యం అంశాలను చేర్చామన్నారు. క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించి బాధితులకు వైద్యం అందించడంలో భాగంగా స్క్రీనింగ్, చికిత్సలపై సిబ్బందికి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మార్చి 1 నుంచి ఆస్పత్రులను సందర్శించడం ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుని ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలుంటే పరిష్కరించేలా చర్యలు చేపట్టవచ్చు. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో/జీఎంపీ ఆధీకýృత మందులు, సర్జికల్స్ మాత్రమే ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. దీన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడదు. ప్రజారోగ్య వ్యవస్థలో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలి. ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ ఇప్పటికే కొనసాగుతోంది. ఇందులో గుర్తించిన సమస్యలు, లోపాలను సరిదిద్దుకుని మార్చి 1వతేదీ తరువాత పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేసేలా సన్నద్ధం కావాలి. సచివాలయాల స్థాయిలోనే రక్తహీనత గుర్తింపు గ్రామ సచివాలయాల స్థాయిలోనే రక్తహీనత బాధితులను గుర్తించి ఆరోగ్య సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. రక్తహీనత నివారణకు వైద్యం, పౌష్టికాహారపరంగా అన్ని చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలి. డేటా అనుసంధానాన్ని సమర్థంగా చేపట్టాలి. పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు పరస్పరం అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలి. కౌమార బాలికలు, గర్భిణుల్లో రక్తహీనత నివారణకు బీ–12 సబ్ లింగ్యువల్ టాబ్లెట్లను పంపిణీ చేయాలన్న నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకోవాలి. పాఠ్య ప్రణాళికలో ఆరోగ్య అంశాలు పరిసరాల పరిశుభ్రత, సమతుల ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, కాలుష్యం తదితరాలకు సంబంధించి విలేజ్ క్లినిక్స్ సిబ్బంది సమస్యలను నివేదించగానే వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలి. మండల స్థాయి అధికారులు, జేసీ, జిల్లా కలెక్టర్ వీటిపై పర్యవేక్షణ చేయాలి. 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రోజూ దీనిపై సమీక్షించాలి. జిల్లాల్లో కలెక్టర్లు కూడా పర్యవేక్షించాలి. ఎన్సీడీ బాధితులపై ప్రత్యేక శ్రద్ధ గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ, మధుమేహం లాంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ) నియంత్రణ, నివారణ, చికిత్సలపై దృష్టి సారించాలి. బాధితుల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటున్నారో లేదో ఆరా తీయాలి. అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా బాధితులను కలిసి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించాలి. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన పేషెంట్లు డిశ్చార్జి అనంతరం ఇంటికి చేరుకున్నాక ఏఎన్ఎంలు వారిని పరామర్శించి ఆస్పత్రి సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఆ నివేదిక ఆధారంగా ఆస్పత్రులకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ఉద్దానం కిడ్నీ జబ్బులకు శాశ్వత పరిష్కారాలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాం. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ జబ్బుల నివారణలో భాగంగా తాగునీటి కోసమే దాదాపు రూ.700 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పాలకొండ ప్రాంతంలో తాగునీటికి సుమారుగా రూ.265 కోట్లు వ్యయం చేస్తున్నాం. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. తాగునీటి పథకం, ఆస్పత్రి ఈ రెండూ మార్చి కల్లా పూర్తవుతాయని అధికారులు నాకు సమాచారం ఇచ్చారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల సమస్యకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారాలు చూపుతోంది. పలాసలో నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలి. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి సమస్య నివారణ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. బోధనాస్పత్రుల్లో క్యాన్సర్‌కు అధునాతన చికిత్స ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో క్యాన్సర్‌కు అధునాతన చికిత్స, మౌలిక సదుపాయాలను కల్పించాలి. ప్రస్తుతమున్న, కొత్తగా నిర్మిస్తున్న బోధనాస్పత్రుల్లో ఈ ప³రికరాలు, చికిత్సలు ఉండాలి. గుండె జబ్బుల చికిత్స కేంద్రాలుండాలి. అన్ని చోట్ల క్యాథ్ ల్యాబ్స్ పెట్టాలి. నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ కొత్త బోధనాస్పత్రుల్లో ఇవి ఏర్పాటు కావాలి. అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో క్యాన్సర్, కార్డియాక్ సదుపాయాలు ఉండాలి. ఈ సౌకర్యాలను మెరుగు పరచుకోవడం ద్వారా క్యాన్సర్, గుండె స్పెషాలిటీల్లో మరిన్ని పీజీ సీట్లు సాధించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలోనే సరిపడా వైద్య నిపుణులు తయారవుతారు. దంత సంరక్షణపై చిన్నారులు, పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి. స్క్రీనింగ్ నిర్వహించి చికిత్స అందించడంపై ఆలోచన చేయాలి. రోగులకు మరింత నాణ్యతతో, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలి. జాతీయ స్థాయిలో వైద్య శాఖకు అవార్డులు జాతీయ స్థాయిలో కాగిత రహిత వైద్య సేవల్లో రాష్ట్ర వైద్య శాఖ ఐదు అవార్డులు సాధించినట్లు వైద్య, ఆర్యోగ్యశాఖ మంత్రి విడదల రజని, అధికారులు తెలియచేయగా సీఎం జగన్ వారిని అభినందించారు. రాష్ట్రీయ కిషోర స్వాస్త్యా కార్యక్రమం (ఆర్కేఎస్కే)–స్కూల్, వెల్నెస్ కార్యక్రమం అమలులో జాతీయ స్థాయిలో ఇటీవల వైద్య శాఖకు లభించిన రెండు అవార్డులను సీఎం పరిశీలించారు. సమీక్షలో సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వినోద్ కుమార్, ఔషధ నియంత్రణ డీజీ రవిశంకర్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి పాల్గొన్నారు. -
బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరణ
-
ఆ ఆదేశాలు సరికాదు: ఆరెస్సెస్
చెన్నై: తమిళనాడులో ఆరెస్సెస్ నిర్వహించ తలపెట్టిన కవాతుపై సందిగ్ధం నెలకొంది. నవంబర్ 6వ తేదీన(ఆదివారం) తలపెట్టిన కవాతును రద్దు చేయాలని ఆరెస్సెస్ నిర్ణయించుకుంది. మద్రాస్ హైకోర్టు కవాతు నిర్వహణకు అనుమతి ఇచ్చినప్పటికీ.. ప్రత్యేక షరతులు విధించడంపై హిందూ సంఘాల విభాగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను పక్కనపెడుతూ మొత్తం 50 ప్రాంతాలకుగానూ.. 44 ప్రాంతాల్లో కవాతు నిర్వహణకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం అనుమతులు ఇచ్చింది. మతపరమైన సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన ఆరు చోట్ల మాత్రం ఇప్పుడు మార్చ్ నిర్వహించొద్దని.. కావాలనుకుంటే మరో రెండు నెలల తర్వాత కవాతు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే.. ఆ 44 ప్రాంతాల్లో కూడా రోడ్లపై, ఇతర ప్రాంగణాల్లో కాకుండా.. మైదానాలు, స్టేడియం లేదంటే ఆడిటోరియాల్లో మాత్రమే నిర్వహించాలని షరతు విధించింది. కవాతులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని.. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మద్రాస్ హైకోర్టు, ఆరెస్సెస్‌కు స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలపై ఆరెస్సెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కశ్మీర్, వెస్ట్‌బెంగాల్, కేరళ, ఇతర ప్రాంతాల్లో రూట్ మార్చ్‌లను నిర్వహించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తమిళనాడులో మాత్రం ఇలా సమ్మేళన ప్రాంగణంలో నిర్వహించుకోవడం సబబు కాదని భావిస్తోంది. అందుకే కవాతును వాయిదా వేసుకోవడంతోపాటు మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేసేందుకు సిద్ధమైంది. అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వం కేవలం మూడు చోట్ల మాత్రమే కవాతులను నిర్వహణకు అనుమతి ఇవ్వగా.. మద్రాస్ హైకోర్టు జోక్యంతో ఆరెస్సెస్‌కు ఊరట లభించింది. ఓ ముస్లిం రాజకీయ సంఘంపై కేంద్రం నిషేధం విధించడం, కొయంబత్తూరు పేలుళ్ల నేపథ్యంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లవచ్చని తమిళనాడు పోలీస్ శాఖ.. ఆరెస్సెస్ కవాతుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇదీ చదవండి: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ -
RSS March: ఆరెస్సెస్‌కు భారీ ఊరట
చెన్నై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తమిళనాడు వ్యాప్తంగా నవంబర్ 6వ తేదీన తలపెట్టిన కవాతులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వం ఈ ఊరేగింపులకు అనుమతి ఇవ్వలేదు. తొలుత మొత్తం 50 ప్రదేశాల్లో కవాతులను నిర్వహించాలని ఆరెస్సెస్ భావించింది. అయితే స్టాలిన్ సర్కార్ మాత్రం కేవలం మూడు ప్రదేశాల్లో మాత్రమే ఊరేగింపులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆరెస్సెస్, హైకోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది హైకోర్టు. సున్నిత ప్రాంతాలుగా పేరున్న కొయంబత్తూర్, పొల్లాచ్చి, నాగర్‌కోయిల్‌తో పాటు మరో మూడు ప్రాంతాల్లో కవాతులకు అనుమతి ఇవ్వలేదు. ఊరేగింపులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని లేనితరుణంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరెస్సెస్‌కు ముందస్తుగా తెలిపింది మద్రాస్ హైకోర్టు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదికలలో మార్చ్ నిర్వహణలకు ప్రతికూలంగా ఏమీ లేదని తేల్చిచెప్పిన కోర్టు.. రెండు నెలల తర్వాత ఆ ఆరు ప్రదేశాల్లోనూ మార్చ్ నిర్వహించుకోవచ్చని ఆర్ఎస్ఎస్కు తెలిపింది. వాస్తవానికి.. అక్టోబరు 2న ఊరేగింపులకు కోర్టు అనుమతించినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. మరోవైపు కొయంబత్తూర్‌లో ఇటీవలె కారు పేలుడు ఘటన.. ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఓ ఇస్లామిక్ రాజకీయ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. వీటికి కారణాలుగా చూపుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చనే ఆందోళన హైకోర్టులో వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఇదీ చదవండి: పట్టపగలే శివసేన నేత దారుణ హత్య -
కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర
-
అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ
-
అమరావతి రైతుల పాదయాత్రకు తాడేపల్లిగూడెంలో నిరసన సెగ
-
కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపాటు... టీఆర్ఎస్పై విమర్శలు
సాక్షి ఖమ్మం: ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క చేపడుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం అంకమ్మ దేవాలయం నుంచి పునః ప్రారంభించిన సంగతి తెసిందే. ఈ క్రమంలో ఇనగాలి గ్రామంలోని రాజుదేవరపాడులో ప్రజలను పలకరిస్తూ... వారి వ్యక్తిగత సమస్యలు వింటూ.. భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..."కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పట్ల అవలంభిస్తున్న తీరుని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీల పై ఈడీ దాడులు నిర్వహించి అక్రమ కేసులు పెడితే సహించేది లేదంటూ బీజేపీ పై మండిపడ్డారు. అంతేకాదు ఈ నెల 13న అన్ని ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుందని హెచ్చరించారు కూడా. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకపాలన సాగిస్తోదంటూ విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పంచి ఇచ్చిన భూములను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం లాగేసుకుంటుందంటూ ఆరోపణలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని" అన్నారు. (చదవండి: ఒకరికి పబ్‌లు తప్పా ఏం తెల్వదు.. ఇంకొకరు విచిత్రమైన మనిషి: కేటీఆర్) -
అసలే భారంగా ధరలు..ఇప్పుడు మరింత పైపైకి..!
న్యూఢిల్లీ: టోకు ధరలు ఆందోళనకరంగా తయారయ్యాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో ఏకంగా 14.55 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే టోకు బాస్కెట్‌లోని వస్తువుల ధర 14.55 శాతం పెరిగిందన్నమాట. గడచిన నాలుగు నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. క్రూడ్, ఇతర కమోడిటీల ధరల తీవ్రత తాజా గణాంకాలపై ప్రతిబింబిస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో సరఫరాల చైన్‌కు తీవ్ర విఘాతం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనితో అసలే భారంగా ఉన్న టోకు ధరల తీవ్రత మరింత పెరిగింది. 2021 మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 7.80 శాతంగా ఉంది. 2021 ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం మొత్తం 12 నెలల్లో టోకు ధరలు రెండంకెలపైన కొనసాగడం గమనార్హం. కొన్ని ముఖ్యాంశాలు... ► ఫిబ్రవరిలో ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 8.19 శాతం ఉంటే, మార్చిలో 8.06 శాతానికి తగ్గింది. కూరగాయల ధరల స్పీడ్ కూడా నెలల వారీగా 26.93 శాతం నుంచి 19.88 శాతానికి దిగివచ్చింది. అయితే ఈ స్థాయి ధరలు కూడా సామాన్యుడిని బెంబేలెత్తిస్తాయి. ► మొత్తం సూచీలో దాదాపు 60% వాటా ఉన్న తయారీ రంగంలో టోకు ద్రవ్యోల్బణం 9.84% నుం చి (ఫిబ్రవరి) నుంచి 10.71 శాతానికి ఎగసింది. ► 20 శాతం వాటా ఉన్న ఫ్యూయల్ అండ్ పవర్ బాస్కెట్లో ద్రవ్యోల్బణం నెల వారీగా 31.50 శాతం నుంచి 34.52 శాతానికి ఎగసింది. ఒక్క క్రూడ్ పెట్రోలియంలో ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 55.17 శాతం ఉంటే మార్చిలో 83.56 శాతంగా నమోదయ్యింది. రేటు పెంపు అవకాశం... ద్రవ్యోల్బణం తీవ్రత కొనసాగితే, జూన్‌లో జరిగే ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన ద్రవ్య విధానాన్ని అవలంబించే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను పావుశాతం పెంచే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్థిక విశ్లేషణా సంస్థ ఎకోర్యాప్, రేటింగ్ సంస్థ ఇక్రా అంచనావేస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచుతూ, వృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ ఎంపీసీ రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2–6 శాతం శ్రేణిలో ద్రవ్యోల్బణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐని కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. -
భారత్ ‘తయారీ’ అంతంతే..! మార్చిలో మరీ దారుణంగా..
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం మార్చి నెలలో నెమ్మదించింది. ఉత్పత్తి, అమ్మకాల గణాంకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మార్చిలో 54గా నమోదయ్యింది. సెప్టెంబర్ 2021 తరువాత ఇంత తక్కువ స్థాయి ఇండెక్స్ నమోదుకావడం ఇదే తొలిసారి. ఫిబ్రవరిలో ఈ సూచీ 54.9 వద్ద ఉంది. అయితే సూచీ 50 లోపుకు పడిపోతే క్షీణతగా భావిస్తారు. 50 ఎగువన వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ముడి పదార్థాల ధరలు పరిశ్రమకు ప్రధానంగా అవరోధంగా మారాయి. రసాయనాలు, ఇంధనం, ఫ్యాబ్రిక్, ఆహార ఉత్పత్తులు, మెటల్ ధరలు ఫిబ్రవరికన్నా పెరిగాయి. -
మార్చిలో 122 ఏళ్లలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది. గత నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయని పేర్కొంది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో చురుకైన పశ్చిమ పవనాలు లేకపోవడం, అల్ప వర్షపాతమే ఇందుకు కారణమని విశ్లేషించింది. దీర్ఘకాలం సరాసరి వర్షపాతం 30.4 మిల్లీమీటర్లు కాగా, ఈసారి 71% తక్కువగా 8.9మి.మీ. మాత్రమే నమోదైందని వివరించింది. 1908 తర్వాత ఇదే అత్యల్ప వర్షపాతమని తెలిపింది. ‘దేశం మొత్తమ్మీద చూస్తే, 33.10 డిగ్రీల సరాసరి గరిష్ట ఉష్ణోగ్రత మార్చి 2022లో నమోదైంది. గత 122 ఏళ్లలో ఇదే అత్యధికం’ అని ఐఎండీ పేర్కొంది. దేశంలో 2010 మార్చిలో 33.09 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతగా నమోదైంది. -
మార్చి31 పన్ను చెల్లింపుదారులకు ఎంత ముఖ్యమో మీకు తెలుసా?
మరో 4రోజుల్లో ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 ముగియనుంది. ముగుస్తున్న ఈ ఆర్ధిక సంవత్సరం ట్యాక్స్ పేయర్లకు చాలా కీలకం. అందుకే ఆర్ధిక నిపుణులు సైతం వారిని అప్రమత్తం చేస్తున్నారు. మార్చి31 లోపు ట్యాక్స్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని చెబుతున్నారు. అయితే ఇప్పుడు పన్ను చెల్లించే వారికి ముగియనున్న ఆర్ధిక సంవత్సరం ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. ఆధార్ కార్డ్, పాన్ లింకింగ్: పాన్, ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ మార్చి31 అలా చేయకపోతే పాన్ డియాక్టివేట్ అవుతుంది. అందుకు అదనంగా ట్యాక్స్ యాక్ట్ 1961కింద రూ.10వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2020-2021 రిటర్న్ దాఖలు: ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31లోపు ఐటీ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే రూ.1000 నుంచి 5000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఈ-ధృవీకరణ : ఫైనాన్షియల్ ఇయర్ 2019-2020కి దాఖలు చేసిన ఐటీఆర్ ఈ-ధృవీకరణ మార్చి 31,2021 వరకు చేయబడుతుంది. అయితే ఆర్ధిక సంవత్సరం 2019కి సంబంధించి తమ ఐటీఆర్‌ను ఈ-వెరిఫై చేయని పన్ను చెల్లింపుదారులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సంస్థ 2021-2022 వరకు అంటే మార్చి 31వరకు గడువు ఇచ్చింది. ఈ తేదీల లోపు ఎప్పుడైన ఈ - ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. ముందస్తు పన్ను చెల్లింపు: ముందస్తు పన్ను చెల్లింపు కోసం చివరి వాయిదా గడువు తేదీ మార్చి15, 2022. అయితే అసెస్సీ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్నును ఎప్పుడైనా అంటే మార్చి 31,2022లో లోపు చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి: ఆర్ధిక సంవత్సరం 2021-2022కి సంబంధించి పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31, 2022. -
24 నుంచి రుచి సోయా ఎఫ్‌పీవో
ముంబై: పతంజలి ఆయుర్వేద్ గ్రూప్‌లో భాగమైన రుచి సోయా ఇండస్ట్రీస్ తాజాగా మార్చ్ 24న ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి రానుంది. దీని ద్వారా సుమారు రూ. 4,300 కోట్లు సమీకరించనుంది. ఎఫ్‌పీవోకి సంబంధించి ధరల శ్రేణిని షేరు ఒక్కింటికి రూ. 615–650గా నిర్ణయించారు. దివాలా ప్రక్రియ కింద చర్యలు ఎదుర్కొన్న తర్వాత తిరిగి లిస్ట్ అవుతున్న తొలి కంపెనీ ఇదే కావడం గమనార్హం. పతంజలికి రుచి సోయాలో ప్రస్తుతం 98.9 శాతం వాటాలు ఉన్నాయి. లోయర్ బ్యాండ్ ప్రకారం 19 శాతం – 18 శాతం వాటాలను ఎఫ్‌పీవో ద్వారా విక్రయించే అవకాశం ఉంది. మరో 6–7 శాతాన్ని 2022 డిసెంబర్‌లోగా విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాల ప్రకారం లిస్టెడ్ కంపెనీలో 25 శాతం పబ్లిక్ వాటా ఉండాలి. ఎస్బీఐ క్యాప్స్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. రుణాల చెల్లింపునకు రూ. 3వేల కోట్లు.. ఎఫ్‌పీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 3,300 కోట్లను రుణాలను తీర్చేందుకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబా రాందేవ్ చెప్పారు. రుచి సోయా, పతంజలిని అంతర్జాతీయంగా ఫుడ్ బ్రాండ్స్‌గా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. బ్రాండెడ్ ఫుడ్, న్యూట్రాస్యూటికల్స్, వంట నూనెలు, హెల్త్..వెల్నెస్ ఉత్పత్తుల కింద గ్రూప్ వ్యాపారాలు మొత్తం నాలుగు విభాగాలుగా ఉంటాయని రాందేవ్ పేర్కొన్నారు. రుచి సోయా కథ ఇదీ.. అతి పెద్ద బ్రాండెడ్ వంట నూనెల సంస్థల్లో రుచి సోయా కూడా ఒకటి. రుచి గోల్డ్ దేశీయంగా అత్యధికంగా అమ్ముడయ్యే పామాయిల్ బ్రాండ్స్‌లో ఒకటి. మహాకోష్, సన్‌రిచ్, రుచి స్టార్, రుచి సన్‌లైట్ వంటి ఇతర బ్రాండ్స్ కూడా కంపెనీకి ఉన్నాయి. ఇక న్యూట్రెలా పేరిట సోయా ఫుడ్స్‌ను కూడా విక్రయిస్తోంది. ఈ విభాగంలో 40 శాతం మార్కెట్ వాటా ఉంది. బ్యాంకులకు దాదాపు రూ. 9,345 కోట్ల మేర రుణాలు రుచి సోయా బాకీ పడటంతో 2017 డిసెంబర్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కంపెనీపై దివాలా ప్రక్రియ కింద చర్యలు ప్రారంభించింది. 2018 డిసెంబర్లో నిర్వహించిన వేలంలో రుచి సోయాను పతంజలి దక్కించుకుంది. ఇందుకోసం రూ. 4,350 కోట్లు వెచ్చించింది. టేకోవర్ తర్వాత రుచి సోయా .. బిస్కెట్లు, కుకీలు, రస్కులు, నూడుల్స్ మొదలైన ఉత్పత్తులను కూడా విక్రయించడం మొదలుపెట్టింది. -
మార్చి 31లోగా ఈ పనులు పూర్తి చేయండి… లేకపోతే మీకే నష్టం..!
ప్రతి ఏడాదిలో కొత్త నెల వచ్చింది అంటే చాలు దేశంలో కొత్త నిబనంధనలు అమలులోకి వస్తాయి. రాబోయే ఏప్రిల్ నెల నుంచి కూడా అనేక కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా, మార్చి 31కి ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభకానుంది. పాత నిబంధనలు స్థానంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేస్తాయి. అందుకే, ప్రతిఒక్కరూ తమ ఆర్థిక ప్రణాళిక విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కూడా ఇదే. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో కొన్ని ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన ముఖ్యమైన పనులను తప్పక పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పన్ను మినహాయింపుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు వర్తించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, జాతీయ పింఛన్, జాతీయ ఫించను స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్ఎస్ఎస్ ఇలా అనేక స్కీమ్‌లలో మదుపు చేసేందుకు అవకాశం ఉంది. ఇంకా సెక్షన్ 80సీ పరిమితి రూ.1,50,000 పూర్తి కాకపోతే.. అనుకూలమైన పెట్టుబడి స్కీమ్‌ను ఎంచుకోవచ్చు. ఇప్పటికే తీసుకున్న పీపీఎఫ్, ఎన్పీఎస్, ఎస్ఎస్వై స్కీమ్‌లలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకసారైనా మదుపు చేయకపోతే మార్చి 31లోపు తప్పనిసరిగా కనీస మొత్తం అయినా పెట్టుబడి పెడితే మంచిది. ఆధార్-పాన్ లింక్ మీరు ఇంకా మీ పాన్ నెంబర్‌ను మీ ఆధార్ నెంబర్‌తో లింకు చేయకపోతే మీరు మార్చి 31, 2022 వరకు చేసుకోవచ్చు. ఈ తేదీలోగా లింక్ చేయకపోతే, మీ పాన్ నెంబర్ ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. మీరు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీ పాన్ నెంబర్ పనిచేయకపోతే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర సెక్యూరిటీలు వంటి ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడి పెట్టడానికి మీకు అవకాశం ఉండదు. అలాగే, మీకు ఎటువంటి రుణాలు కూడా రాకపోవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్ ఐటీఆర్ ఫైలింగ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీరు ఇంకా ఐటీ రిటర్న్ ఫైల్ చేయకపోతే మీకు మరో మంచి అవకాశం ఉంది. లేట్ రిటర్న్ దాఖలు చేయడానికి మీకు మార్చి 31, 2022 వరకు సమయం ఉంది. ఫైల్ చేయకపోతే తర్వాత లావాదేవీల విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. 1961లోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం.. ఐటీ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేయరాదు. అలా చేస్తే.. రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కేవైసీ అప్డేట్ మీ బ్యాంకులో మీ అకౌంట్‌కు కేవైసీ పూర్తి చేసుకోండి. పాన్, ఆధార్, చిరునామా ధృవీకరణతో పాటు బ్యాంకు అడిగిన ఇతర వివరాలను మార్చి 31లోపు పూర్తి చేసుకోండి. (చదవండి: ఇక తగ్గేదే లే.. ఈవీ రంగంలో సుజుకి మోటార్ భారీ పెట్టుబడులు!) -
నల్లగొండ ఎండ దేశంలో – 1, ప్రపంచంలో – 6
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఏటా మే నెలలో దంచికొట్టే ఎండలు ఈ ఏడాది మార్చిలోనే మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే నల్లగొండ జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. దేశంలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల జాబితాలో నల్లగొండ మొదటిస్థానంలో నిలువగా, ప్రపంచంలో 6వ స్థానంలో(17వ తేదీన) నిలిచింది. ఈసారి ముందుగానే.. మార్చి నెలలోనే మండుటెండలు కాస్తుండటంతో జనాలు వేసవి తాపానికి తట్టుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లనుంచి బయటికొచ్చేందుకు జంకుతున్నారు. ఫలితంగా జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత తగ్గిన తర్వాతనే బయటికొస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. గతేడాది మేలో 40 డిగ్రీల పైచిలుకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే ఈసారి మార్చిలోనే 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై దేశంలోనే నల్లగొండ ఎండ తీవ్రతలో మొదటి స్థానంలో ఉండగా ప్రపంచంలో 6వ స్థానంలో నిలిచిందని ఎల్డొరాడో వెదర్ సంస్థ తెలిపింది. గతేడాదితో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతలు గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈసారి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు భారీగా పెరిగింది. గత సంవత్సరం మార్చి 11న గరిçష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా నమోదుకాగా, ఈనెల 11న 39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇలా గత సంవత్సరం మార్చి నెలంతా 38 డిగ్రీలలోపే గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటే ఈసారి ఇప్పటికే 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా తేదీ 2021 మార్చి 2022 మార్చి 11 36.0 39.0 12 37.5 39.5 13 38.0 39.2 14 38.2 40.0 15 38.5 41.5 16 37.8 42.4 17 38.0 43.5 18 36.0 40.0 19 35.0 39.5 -
మార్చి నెల ముగిసేలోపు ఈ పనులు వెంటనే చేసేయండి.. లేకపోతే మీకే నష్టం!
ప్రతి ఏడాది కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి చాలా కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. అందులో భాగంగానే మార్చి చివరిలో, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో చాలా పాత నిబంధనలు మారుతాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రణాళిక కూడా తప్పనిసరి. ఏడాది పూర్తవుతున్నా కొన్ని పనులు పూర్తిచేయకపోతే మనం నష్టపోవాల్సి వస్తోంది. మార్చి 31లోపు పూర్తి చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయపు పన్ను రిటర్న్ ఎవై 2021-22 కోసం ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు తేదీని మార్చి 31, 2022 వరకు పొడిగించబడింది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం.. ఐటీ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేస్తే జరిమానా రూ.10,000 వరకు విధించే అవకాశం ఉంది. జరిమానా నుంచి తప్పించుకోవడానికి మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను చివరి తేదీకి ముందే ఫైల్ చేయండి. పాన్ నెంబర్‌తో - ఆధార్ లింకు ఆధార్ లింకింగ్ గడువు తేదీ మార్చి 31, 2022 వరకు ఉంది. ప్రభుత్వం సెప్టెంబర్ 30, 2021న గడువును పొడిగించిన తర్వాత మీ పాన్ నెంబర్‌ను- ఆధార్ నెంబర్‌తో చట్టాల ప్రకారం లింకు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గడువు తేదీలోగా రెండు డాక్యుమెంట్ లింక్ చేయడంలో విఫలమైనట్లయితే మీపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 272బి కింద మీరు రూ.10,000 జరిమానా విధించవచ్చు. కేవైసీ అప్డేట్ బ్యాంక్ ఖాతాలలో కేవైసీని పూర్తి చేయడానికి గడువు మార్చి 31 వరకు ఉంది. పాన్ చిరునామా రుజువు, బ్యాంక్ సూచించిన ఇతర సమాచారంతో సహా కేవైసీ అప్డేట్'లో భాగంగా సమర్పించాలి. పన్ను ఆదా ఈ సంవత్సరానికి మీ ఆదాయాన్ని అంచనా వేయడానికి, సెక్షన్ 80C కింద పన్ను ఆదా కోసం మీరు ఎంత పెట్టుబడి పెట్టవలసి ఉంటుందో తెలుసుకోవడానికి ఇది సరైన సమయం. మీరు ఇప్పటికే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన మొదలైన పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడానికి మీరు మార్చి 31లోపు కనీస సహకారం అందించాలి. కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే ఖాతా క్లోజ్ చేసే అవకాశం ఉంది. (చదవండి: హైదరాబాద్‌లో డేటాసెంటర్.. ప్రపంచంలోనే అతి పెద్దదిగా) -
March 1: నేటి నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
చూస్తుండంగానే రోజులు చకచక గడిచిపోతున్నాయి. ఈ కొత్త ఏడాదిలో అప్పుడే 3 నెలలోకి ఎంట్రీ ఇచ్చాం. కొత్త నెలతోపాటు దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. దీంతో చాలా మందిపై ప్రభావం పడే అవకాశముంది. అందువల్ల వల్ల ఈరోజు నుంచే మారే అంశాలు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం. అమూల్ సంస్థ తన లీటర్ పాల ప్యాకెట్ ధరలను రూ.2 పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరలను మార్చి 1 నుంచి అమలలోకి రానున్నాయి. అమూల్ సంస్థ గోల్డ్, తాజా, శక్తి, టీ స్పెషల్ లాంటి వేరియంట్లలో పాల ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తోంది. అమూల్ గోల్డ్ అరలీటర్ ప్యాకెట్ ప్రస్తుతం రూ.28గా ఉండగా మార్చి 1 నుంచి రూ.30కి పెరగనుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. 19 కేజీల సిలిండర్ ధరపై రూ.105లు, 5 కేజీల సిలిండర్‌పై రూ.27లు పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధానిలో కమర్షియల్ సిలిండర్ ధర రెండు వేలు దాటింది. 19 కేజీ సిలిండర్ ధర రూ. 2,012కి చేరగా 5 కేజీల సిలిండర్ ధర రూ. 569గా ఉంది. వివిధ నగరాల వారీగా 19 కేజీల సిలిండర్ల ధరను పరిశీలిస్తే చెన్నైలో రూ. 2185, ముంబై రూ.1962 , కోల్‌కతా రూ.2089లు, హైదరాబాద్‌లో రూ.1904లుగా ఉన్నాయి అంతర్జాతీయ చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి పెరగడంతో జెట్ ఇంధన ధరలు దేశవ్యాప్తంగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి 3.3 శాతం పెరిగాయి. ప్రపంచ చమురు ధరలు పెరిగిన తర్వాత జెట్ ఇంధనం లేదా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటిఎఫ్) ధర పెరగడం ఇది ఐదోసారి. లక్ష్మీ విలాస్ బ్యాంక్ డిజిటల్'గా డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించే ఐఎఫ్ఎస్సీ కోడ్స్ మార్చి 1 నుంచి మారనున్నాయి. 2020 నవంబర్ నెలలో డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్(డీబీఎల్) విలీనం కావడంతో ఆ బ్యాంకుకు చెందిన ఐఎఫ్ఎస్సీ కోడ్స్ ఫిబ్రవరి 28, 2022 వరకు మాత్రమే చెల్లుతాయని డీబీఎస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చాలా రాష్ట్రాలలో కోవిడ్ 19 మహమ్మారి పెరగడంతో, సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో కేంద్ర ప్రభుత్వం లైఫ్ సర్టిఫికేట్ డెడ్ లైన్‌ను ఫిబ్రవరి 28, 2022 వరకు పొడిగించింది. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ లైఫ్ సర్టిఫికేట్‌ను 28.02.2022 వరకు సమర్పించవచ్చు. ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే మార్చి 1 నుంచి పెన్షన్ తీసుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ) డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ క్లోజర్ ఛార్జీలను ప్రవేశపెట్టింది. మార్చి 5, 2022 నుంచి రూ.150 ప్లస్ జీఎస్టీ ఛార్జీలను విధించనున్నట్టు ఐపీపీబీ తెలిపింది. అయితే ఈ ఛార్జీలు కేవలం కేవైసీ అప్డేషన్ లేకుండా ఏడాది తర్వాత క్లోజ్ అయ్యే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లకు మాత్రమేనని తెలిపింది. మిగతా అకౌంట్ల మూసివేతకు ఈ ఛార్జీలు వర్తించవని పేర్కొంది. ఈ కొత్త నిబంధన మార్చి 5 2022 నుంచి అమల్లోకి వస్తుంది. చక్రవాహనాల పెండింగ్ చలాన్లకు 75 శాతం రాయితీ ఇస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చని, ఈ చలాన్ల రాయితీ మార్చి 1 నుంచి 31 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. (చదవండి: Hero Electric Eddy: రూ.72 వేలకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. విడుదల అప్పుడే!) -
సామాన్యులను కలవర పెడుతున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర!
వంట గ్యాస్ ధరల మార్పు విషయంలో చమరు మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. మార్చి 1 నుంచి ఎల్పీజీ ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ ధరల విషయంలో రివ్యూ మీటింగ్ చేపడుతుంటాయి. ఈ మీటింగ్‌లో ధరల పెంచాలా? వద్దా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో ఎల్పీజీ, నేచురల్ గ్యాస్ ధరలు పెరగనున్నాయని పలు నివేదికలు ప్రజలను ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు భారత్‌లో ఎల్పీజీ ధరలు పెరగనున్నాయని పలువురు నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ ధరల పెంపు భారత్‌లోని పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. చూడలిమరి చమురు కంపెనీలు రేపు వంట గ్యాస్ ధరలను పెంచుతాయా? లేదా? అనేది. కానీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా గ్యాస్ ధర సిలిండర్ ధర రూ.100 నుంచి 200 వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. (చదవండి: అడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే జరిమానా ఎంతో తెలుసా?) -
ఒమిక్రాన్‌ను ఆపలేం!.. మార్చి నాటికి..
సాక్షి, హైదరాబాద్: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వాయువేగంతో దూసుకువెళ్తోందని.. మార్చి నాటికి ప్రపంచంలో ఏకంగా సగం మంది దాని బారిన పడతారని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది. ఈ నెల 17వ తేదీ నాటికే ప్రపంచవ్యాప్తంగా 12.5 కోట్ల మంది ఒమిక్రాన్ బారినపడి ఉంటారని అంచనా వేసింది. గతేడాది ఏప్రిల్‌లో డెల్టా వేరియంట్ తీవ్రస్థాయిలో ఉన్నప్పటితో పోలిస్తే ఇది పదిరెట్లు ఎక్కువని పేర్కొంది. డెల్టాతో పోలిస్తే.. ఒమిక్రాన్ కారణంగా ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య 50 శాతం తగ్గిందని, వెంటిలేటర్ అవసరం పడేవారి సంఖ్య 90 శాతం తగ్గిందని వివరించింది. అయితే.. కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆ మేరకు ఆస్పత్రుల్లో చేరికలు కూడా ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది. గతంలో కరోనా బారినపడిన వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరిని గుర్తించారని.. ప్రస్తుతం ఒమిక్రాన్‌లో లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం వల్ల అది సోకిన ప్రతి 20 మందిలో సగటున ఒకరినే గుర్తించగలుగుతున్నామని పేర్కొంది. లాన్సెట్ నివేదికలోని ముఖ్యాంశాలివీ.. ►గత వేరియంట్లలో లక్షణాలు లేనివారు 40 శాతం ఉంటే.. ఒమిక్రాన్ విషయంలో ఇది 80 నుంచి 90 శాతంగా ఉంటోంది. గతంలో ఆస్పత్రులకు వచ్చినవారికి ఇతర సాధారణ చికిత్సలకు ముందు పరీక్షలు చేస్తే.. 2 శాతం మందికి కరోనా ఉన్నట్టు తేలేది. ఇప్పుడది ఏకంగా పది శాతానికి చేరుకుంది. ►ఇటీవల కేసులు బాగా పెరుగుతున్నాయి. అందరూ మాస్క్‌లు, వ్యాక్సిన్, బూస్టర్ డోసుల గురించే మాట్లాడుతున్నారు. ఇటువంటి చర్యలను గతంలోనే మొదలుపెట్టి ఉంటే బాగుండేది. ►ఇప్పటికిప్పుడు 80 శాతం మాస్క్‌లు పెట్టుకున్నా.. వచ్చే నాలుగు నెలల కాలంలో కేవలం 10 శాతం మాత్రమే కేసులు తగ్గించవచ్చు. బూస్టర్ ఇవ్వడం, వ్యాక్సినే తీసుకోనివారికి ఇవ్వడం వల్ల ఇప్పటికిప్పుడు ఒమిక్రాన్‌ను నుంచి బయటపడలేం. అదెప్పుడో చేసి ఉండాలి. ►వచ్చే నాలుగు నుంచి ఆరు వారాల కాలంలో మనం తీసుకునే ఏ రకమైన చర్యతోనూ ఒమిక్రాన్ నుంచి బయటపడలేం. దాని ప్రభావానికి గురికావాల్సిందే. ఒమిక్రాన్ పీక్ స్థాయికి వెళ్లాక ఐదు వారాల్లోగా తగ్గిపోతుంది. ►ఈ నెల 17వ తేదీ నాటికి 25 దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రస్థాయిలో ఉంది. జనవరి మూడో తేదీ నాటికే ఇండియాలో సామాజికవ్యాప్తి స్థాయిలో ఉంది. మిగతా దేశాల్లో ఫిబ్రవరి రెండో వారం నాటికి కేసులు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. ►స్కూళ్ల నుంచి విద్యార్థులను దూరం చేయడం, ఉద్యోగులను కార్యాలయాలకు దూరంగా ఉంచడం వంటి చర్యలతో ఇప్పటికిప్పుడు ప్రయోజనం ఏమీలేదు. ఒమిక్రాన్ మనం తీసుకునే చర్యలకంటే స్పీడ్‌గా ఉంది. ►ఒమిక్రాన్‌ను అరికట్టేందుకు సరికొత్త వ్యూహాలను రూపొందించాలి. చైనా, న్యూజిలాండ్ దేశాల్లో సహజంగా మొదటి కేసుతోనే అప్రమత్తం అవుతారు. అసలే కేసులు రాకుండా చూడడం ఆ దేశాల వ్యూహం. ►ప్రస్తుతం వ్యాక్సినేషన్ పెరుగుతోంది. బూస్టర్ డోసులు కూడా వేస్తున్నారు. దీనితో కరోనాను ఎదుర్కొనే శక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒమిక్రాన్ వేవ్ నిలిచిపోయాక కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గిపోతుంది. ►తర్వాత కూడా కొత్త వేరియంట్లు రావొచ్చు. అవి ప్రమాదకరంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియగా చూడాల్సి ఉంది. దానికి మనం అలవాటు పడాల్సిందే. ►కరోనా భవిష్యత్తులో సీజనల్ వ్యాధిగా, సాధారణ ప్రమాదకర ఫ్లూగా మార్పు చెందే అవకాశముంది. 2017–18 ఫ్లూ సీజన్లో అమెరికాలో 52 వేల మంది చనిపోయారు. ఇలాంటి ప్రమాదకర సీజనల్ వ్యాధిగా కరోనా మారిపోతుంది. -
దేశంలో బంగారం దిగుమతుల జోరు
ముంబై: భారత్ 2021 మార్చిలో భారీగా 160 టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నట్లు రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) మంగళవారం పేర్కొంది. 2020లో ఈ పరిమాణం కేవలం 28.09 టన్నులు. సుంకాలు 5 శాతానికి తగ్గింపు, ధర తగ్గుదల, అమెరికా, బ్రిటన్ వంటి ఎగుమతుల మార్కెట్లో డిమాండ్ పెరుగుదల, భారత్‌లో పెళ్లిళ్ల సీజన్, మెరుగుపడిన వ్యాపార వినియోగ సెంటేమెంట్ వంటి అంశాలు మార్చిలో బంగారం దిగుమతులు భారీగా పెరగడానికి కారణమని మండలి పేర్కొంది. వాణిజ్య మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21) బంగారం దిగుమతులు 22.58 శాతం పెరిగాయి. విలువలో ఇది 84.6 బిలియన్ డాలర్లు (దాదాపు 2.54 లక్షల కోట్లు). 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 28.28 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు). రానున్న అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పసిడిని దిగుమతి చేసుకుంటున్న ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి. వార్షికంగా 800 నుంచి 800 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. చదవండి: ప్రీమియం వసూళ్లలో ఎల్ఐసీ రికార్డు -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా భువీ..
దుబాయ్: మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఎంపికైనట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం భువీతో పాటు జింబాబ్వే ప్లేయర్ సీన్ విలియమ్స్, అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్లు పోటీపడగా చివరికు ఈ అవార్డు భువీనే వరించింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన భువీ.. 4.65 ఎకానమీతో 6 వికెట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో అతను 6.38 ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో భువీ ఏకంగా 17 డాట్ బాల్స్ వేయడం విశేషం. ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తున్న నేపథ్యంలో వరుసగా మూడో నెల కూడా టీమిండియా ఆటగాడినే ఈ అవార్డు వరించడం మరో విశేషం. జనవరి నెలకు వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఫిబ్రవరి నెలకు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్ లీ ఎంపికయ్యారు. ఈ విభాగంలో లిజెల్ లీతో పాటు రేసులో ఇద్దరు భారత అమ్మాయిలు(రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ రౌత్) ఉన్నప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లిజెల్ వైపే ఐసీసీ మొగ్గు చూపింది. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో టీమిండియా పేసర్
దుబాయ్: మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కు నామినేట్ అయిన క్రికెటర్ల జాబితాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం ప్రకటించింది. పురుషుల విభాగంలో భారత్ తరఫున సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, జింబాబ్వే తరఫున సీన్ విలియమ్స్, అఫ్గనిస్థాన్ నుంచి రషీద్ ఖాన్లకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడిన భువీ.. 4.65 ఎకానమీతో 6 వికెట్లు, ఐదు టీ20ల సిరీస్‌లో 6.38 ఎకానమీతో 4 వికెట్లు సాధించాడు. వికెట్ల పరంగా భువీ కాస్త వెనుకపడినప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో పూర్తిగా సఫలమయ్యాడు. స్లాగ్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి, టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో 11 వికెట్లు, 3 టీ20ల సిరీస్‌లో 6 వికెట్లు సాధించి, భువీకి ప్రధాన పోటీదారుడిగా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్ సీన్ విలియమ్స్ 264 పరుగులతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. అదే జట్టుతో జరిగిన 3 టీ20ల సిరీస్‌లో అతను 128.57 స్ట్రయిక్ రేట్‌తో 45 పరుగులు సాధించాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ మహిళల విభాగంలో ఇద్దరు భారత అమ్మాయిల(రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ రౌత్)తోపాటు సౌతాఫ్రికా లిజెల్ లీ నామినేట్ అయ్యారు. కాగా, ఐసీసీ ఈ అవార్డులను ఈ ఏడాది జనవరి నుంచి ప్రకటిస్తూ వస్తుంది. పురుషుల విభాగంలో తొలి అవార్డు రిషబ్ పంత్(జనవరి) దక్కించుకోగా, ఫిబ్రవరి నెలకు గాను అశ్విన్ కైవసం చేసుకున్నాడు. మహిళల విభాగంలో జనవరి నెలకు షబ్నిమ్ ఇస్మాయిల్(దక్షిణాఫ్రికా), ఫిబ్రవరి నెలకు ట్యామి బీమౌంట్(ఇంగ్లండ్) ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. చదవండి: ముంబై ఇండియన్స్ కాకపోతే సన్‌రైజర్స్‌కే ఆ ఛాన్స్.. -
471 శాతం ఎగిసిన బంగారం దిగుమతులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్నభారత్‌లో మార్చి నెలలో రికార్డు దిగుమతులనునమోదు చేసింది. గత నెలలో భారతదేశ బంగారు దిగుమతులు 471 శాతం ఎగిసి రికార్డు స్థాయిలో160 పుంజుకున్నాయని ప్రభుత్వ వర్గాలు గురువారం రాయిటర్స్‌తో చెప్పాయి. దిగుమతి పన్నుల తగ్గింపు, పుత్తడి ధరలు రికార్డు స్థాయినుంచి దిగి వచ్చిన నేపథ్యంలో రీటైల్ కొనుగోలుదారులు, జ్యుయల్లర్ల నుంచి డిమాండ్ ఊపందుకోవడమే దీనికికారణమని పేర్కొంది. 2020 ఆగస్టులో ఆల్-టైమ్ హై దాదాపు 17శాతం పసిడి ధరలు దిద్దుబాటునకు గురైనాయి. పసిడి దిగుమతుల పెరుగుదల భారతదేశ వాణిజ్య లోటును పెంచుతుంది. అలాగే డాలరు మారకంలో రూపాయి విలువనుప్రభావితం చేస్తుంది. మార్చి త్రైమాసికంలో భారత్ రికార్డు స్థాయిలో 321 టన్నులు బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఏడాది ఇది 124 టన్నులు. ఏడాది క్రితం 1.23 బిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం బంగారం దిగుమతులు 8.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి వెల్లడించారు. రిటైల్ డిమాండ్ పెంచేందుకు, దేశంలోకి అక్రమ రవాణాను తగ్గించడానికి ఫిబ్రవరిలో బంగారంపై దిగుమతి సుంకాలను 12.5శాతం నుండి 10.75శాతానికి కేంద్రం తగ్గించింది. అధిక ధరల కారణంగా చాలా మంది వినియోగదారులు కొనుగోలును వాయిదా వేసుకున్నారనీ, ధరలు బాగా దిగిరావడంతో కొనుగోళ్లకుఎగబడ్డారని కోల్‌కతా నగరంలోని హోల్‌సేల్ వ్యాపారి జెజె గోల్డ్ హౌస్ యజమాని హర్షద్ అజ్మెరా అన్నారు. మార్చిలో, స్థానిక బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాములక పుత్తడి ధర రూ. 43,320 వద్ద ఏడాది కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో రెండోదశలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌లో భారత బంగారం దిగుమతులు 100 టన్నులకంటే తక్కువగానే ఉండనున్నాయని ఆభరణాల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను అదుపుచేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తే దిగుమతులు ప్రభావితం కానున్నాయని ఒక డీలర్ అభిప్రాయపడ్డారు. కాగా దేశంలో శుక్రవారం (ఏప్రిల్ 2) వెలువరించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు ప్రకారం ఒక్కరోజులోనే 72,330 కొత్త కేసులు నమోదయ్యాయి. -
‘మార్చి’ మసాలా?
తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం. నిజమే, అవి మాత్రమే చరిత్ర కాదు. కానీ, చరిత్ర గతిలో చోటుచేసుకునే పరిణామాల పర్యవసానంగా కొన్ని తారీఖులకు, కొన్ని మాసాలకు, కొన్ని సంవత్సరాలకు ఏదో ఒక ప్రాధాన్యతనో, ప్రత్యేకతనో ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు మార్చి నెలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజుల నుంచీ ఈ ప్రత్యేకత కొనసాగు తున్నది. మనకు సాధారణంగా వాతావరణ ఉష్ణోగ్రతలు ఏప్రిల్, మే నెలల్లో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. పొలిటికల్ టెంపరేచర్ మాత్రం మార్చిలోనే పీక్స్‌కు చేరడం రివాజుగా మారింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏటా మార్చిలోనే ప్రారంభం కావడం కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ఏడాది మొత్తంలో ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగే సీజన్ కూడా ఇదే కనుక, ఎత్తులూ-పైఎత్తులు, సవాళ్లు- ప్రతి సవాళ్లూ మార్చిలోనే మొదలయ్యేవి. గడిచిన నాలుగు సాధారణ ఎన్నికలు కూడా ఏప్రిల్, మే నెలల్లోనే జరిగాయి. వ్యూహాలు-ప్రతివ్యూహాలు, టికెట్లు-అలకలూ, పొత్తులూ-జిత్తులూ, ప్రచార శంఖారావం ఇలా కీలక విషయాలన్నీ మార్చిలోనే చోటు చేసుకునేవి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు మార్చి నెల మరింత కీలకమైనది. ఆ పార్టీ ‘హ్యాపీ బర్త్‌డే’ కూడా ఈనెలలోనే. వచ్చే 29వ తారీఖునాడు ఆ పార్టీకి 39 ఏళ్లు నిండి నలభయ్యో ఏట అడుగుపెడుతుంది. ఏ పార్టీ అయినా సరే, ఏదో ఒక నెలలో పుడుతుంది. ఏడాది తిరిగేసరికి బర్త్‌డే వస్తుంది. ఇందులో పెద్ద విశేషమేముంటుంది?. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం పెద్ద విశేషమే ఉందట! ఆ పార్టీ నలభయ్యో ఏట అడుగుపెట్టేసరికి ‘క్లినికల్లీ డెత్’ స్థితికి చేరుకుంటుందని పార్టీ పాతతరం నేత ఒకరు వ్యాఖ్యానించారు. నలభయ్యేళ్లు నిండేం తవరకు వెంటిలేటర్ మీద నెట్టుకొస్తారో మధ్యలోనే పీకేస్తారో వేచి చూడాల్సిందేనన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆయనొక్కరి అభిప్రాయమే కాదు. ఆ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న చాలామంది నాయకులు, కార్యకర్తలు ఇదే ధోరణిలో మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలో వున్న ఐదేళ్లపాటు కొన్ని వర్గాలు లేదా కొందరు వ్యక్తుల వ్యాపార ప్రయోజనాలకోసమే ప్రభుత్వం పనిచేసిందన్న అభిప్రాయం క్షేత్రస్థాయి కార్యకర్తల్లోకి వెళ్లిందని వీరు అభిప్రాయపడుతు న్నారు. ‘మేము అధికారంలో వున్న రోజులను, వైఎస్ జగన్ పరిపాలనతో జనం పోల్చి చూస్తున్నారండీ... చెప్పుకోవడానికి మాకేమున్నది గర్వకారణం. జనంలోకి వెళ్లడానికి ముఖం చెల్లడం లేదు’–ఇది సాక్షాత్తు ఒక మాజీ శాసనసభ్యుని కామెంట్. రోజూ పొద్దున్నే లేవగానే ఏ దిశవైపు నడవాలో, ఏ దిక్కున కూర్చోవాలో... ఇంకా ఇలాంటివే సలహాలు ఎవరెవరో కొత్త వాళ్లు వచ్చి ఇస్తున్నారు. మా నాయకుడు పాటిస్తున్నారు. కానీ, పార్టీ వాళ్లం మేం చెప్పే మాటలు మాత్రం వినడం లేదని దక్షిణ కోస్తా నాయకుడొకరు వాపోయారు. సొంత నియోజక వర్గం కుప్పంలోనే మీరు అవసరం లేదు, కొత్త నాయకుడిని తీసుకు రమ్మని కార్యకర్తలు ఆయన ముఖం మీదే చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలదీ అదే పరిస్థితి. ఏదో... వాళ్ల ఆశ తప్ప నాయకత్వం మారినా కూడా పార్టీ బతికే పరిస్థితి లేదు. చేయి దాటిపోయిందని గుంటూరు డెల్టా నాయకుడొకరు చెప్పు కొచ్చారు. ఎందరో ఓడిపోగా గెలిచిన ఒక కృష్ణా జిల్లా నాయకుడైతే ‘పార్టీని గెలిపించే సత్తా ఇప్పుడు మా లీడర్‌కు లేదని’ బహి రంగంగానే వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపే తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు గోడదూకే అవకాశం ఉందట. గెలిచింది ఇరవైమూడు మంది. అందులో నలుగురు ఇప్పటికే జంప్. ఈ తొమ్మిదిమంది తోడ యితే పదముగ్గురు. మిగిలేది ఇక పది మంది. చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుని హోదా గల్లంతు ఖాయం. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ నాయకులను గానీ, కార్యకర్తలను గానీ ఎవర్ని కది లించినా చెబుతున్న లెక్కలివే. ఒక నాయకుడైతే ఈ లెక్కలతో కూడా విభేదిస్తున్నాడు. నికరంగా మిగిలేది ఏడుగురేనండీ. రాష్ట్ర అధ్యక్ష పదవి లభించిన అచ్చెన్న అందులో ఒకరు. మరొకరు చంద్రబాబు. ఇంకొకరు బాలయ్య బాబు. మిగిలిన నలుగుర్నీ ఊహించగలరేమో ప్రయత్నించం డంటూ ఆ నాయకుడు ఒక పజిల్‌ను విసిరాడు. పార్టీ పుట్టిన దగ్గర్నుంచీ కీలకంగా వ్యవ హరిస్తున్న సీనియర్ మోస్ట్ బీసీ నేతను కొందరు నేతలు ఇటీవల కలిశారట. అధినాయకుని వ్యవహారం బాగాలేదు. ఆయన మాట్లాడుతున్న తీరు పట్ల జనంలో వ్యతిరేకత వస్తున్నది. ఎంత నిస్పృహతో వున్నా ఇంత దిగజారి మాట్లాడాలా? ఏం పీకు తారంటాడు... ఏం మాటలివి? వాళ్ళబ్బాయి అలాగే మాట్లాడు తున్నాడు. సీనియర్ నాయకులు మీరైనా కలుగజేసుకుని ఆయనకు చెప్పండని సూచించారట. అంతా ఆయన, వాళ్లబ్బాయి, ఆ రెండు జిల్లాల నాయకులు చూసుకుంటారు. మనకెందుకు లెమ్మని సదరు సీనియర్మోస్ట్ నిట్టూర్పు విడిచారట. పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా చంద్రబాబు వ్యవహరించిన తీరుపై కూడా అంతర్గతంగా పార్టీ వర్గాల్లో తీవ్ర అసమ్మతి వ్యక్తమైంది. ఎనభై శాతం పంచాయతీలను మా మద్దతుదార్లు గెలుచుకున్నారని వైసీపీ ప్రకటించింది. వాళ్ల ఫొటోలను కూడా వెబ్సైట్లో పెట్టారు. పార్టీ రహిత ఎన్నికల్లో ఏవిధంగా ఈ లెక్కలు చెబుతారని మా నాయకుడు ప్రశ్నిస్తే సరిపోయేది. తగుదునమ్మా అంటూ ప్రెస్‌మీట్ పెట్టి మా వాళ్లు ముప్పయ్ ఎనిమిదీ పాయింట్ మూడు మూడు శాతం గెలిచా రని ప్రకటించారు. వాళ్ళబ్బాయి ఇంకో అడుగు ముందుకువేసి నలభై రెండూ పాయింట్ నాలుగూనాలుగూ శాతం గెలిచామని ప్రకటించాడు. ఎవరీ శాతాలు? ఎక్కడున్నారు? వాళ్ల పేర్లేవి? ఫొటోలేవి? జనం నవ్వుకున్నారు. పరువు పోయిందని వాపోయారు. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఏం మాట్లాడతాడో చూడాలని వుందని ఒక నాయకుడు వ్యాఖ్యా నించారు. ఎందుకంటే ఇవి పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్ని కలు. దబాయిస్తే కుదరదు. మా అంచనాల ప్రకారం తెలుగు దేశం పార్టీకి చరిత్రలో కనీవినీ ఎరుగని దారుణమైన ఓటమి ఎదురుకాబోతున్నది. మా లెక్క ప్రకారం తొంభై శాతానికి పైగా మునిసిపాలిటీలను వైసీపీ గెలుచుకోబోతున్నది. మాకు చావు దెబ్బ తగలబోతున్నదని ఆ నాయకుడు జోస్యం చెప్పారు. ఈనెల 29న బర్త్‌డే నాటికి తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పైకెక్కడం ఖాయమన్న ఆందోళన ఆ పార్టీ కార్యకర్తల్లో వేగంగా వ్యాపిస్తున్నది. ఒక రాజకీయ పార్టీకి నలభయ్యేళ్లు రావడం పెద్ద వయ సొచ్చినట్టేమీ కాదు. తమిళనాడులో యాభైయేళ్లుగా ఒకరి తర్వాత ఒకరుగా అధికారంలో వుంటున్న రెండు ద్రవిడ పార్టీలు ఇప్పటికీ పూర్తి జవసత్వాలతో తలపడుతున్నాయి. మరి తెలుగుదేశం పార్టీకే అప్పుడే నూరేళ్లు నిండిన పరిస్థితి రావడానికి కారణం ఏమిటి? ముఖ్యంగా రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి - అధికారంలో వుండగా తెరతీసిన అవినీతి-అస్తవ్యస్త పాలన, ప్రతిపక్ష నేతగా వైఫల్యం. రెండవదీ, ముఖ్యమైనదీ– గడిచిన ఇరవై రెండు మాసాల్లో జనరంజకమైన వైఎస్ జగన్ పాలన. మానవీయ కోణంలో వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక విలక్షణమైనది. ‘రాష్ట్రంలోని యావన్మంది ప్రజలకు నిన్నటికంటే నేడు బాగుండాలి. నేటి కంటే రేపు మరింత బాగుంటుందన్న విశ్వాసం కలగాలి’. ఇదే అభివృద్ధికి గీటురాయి కావాలని ముఖ్యమంత్రి సూత్రీకరించి నట్టు విశ్వసనీయ సమాచారం. తన రాజకీయ సహచరులతో పాటు, అధికార యంత్రాంగానికి కూడా ఆయన ఈ మంత్రో పదేశం చేశారని చెబుతారు. ఈ లక్ష్యసాధనకు అనుగుణమైన వ్యూహాన్ని ఎన్నికలకు ముందే ఆయన మేనిఫెస్టో రూపంలో పొందుపరుచుకున్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మేనిఫెస్టోకు మరికొన్ని అంశాలను జోడించి తన మానవీయ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కొందరు సంక్షేమం అనే ముద్ర వేశారు. సంక్షేమం బాగానే ఉన్నది, మరి అభివృద్ధి ఏదీ? అనేది వీరి ప్రశ్న. వీరికి ఒక ఎదురుప్రశ్నను వేయవలసిన అవసరం ఉన్నది. అసలు అభి వృద్ధి అంటే ఏమిటి? అది ఎవరికోసం? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్య క్రమం సులభంగా అర్థమవుతుంది. ఒకటో తేదీనాడు సూర్యోదయంతోపాటు ఇంటి తలుపు తట్టి చేతిలో వాలే పెన్షన్ డబ్బుల వంటి సమాజ సంక్షేమ చర్యలతోపాటు, సమ్మిళిత అభివృద్ధికి దారులు తీసే ఒక ఆరు అంశాలను ఫోకస్ ఏరియాలుగా ప్రభుత్వం చేపట్టినట్టు కని పిస్తున్నది. ఈ ఆరు రంగాలు- 1. ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడగల స్థాయి మెరికల్లాంటి విద్యార్థులను తీర్చిదిద్దే విద్యా రంగం సంస్కరణలు. కాణీ ఖర్చులేకుండా పుట్టిన ప్రతిబిడ్డకూ నాణ్యమైన విద్యను అభ్యసించే హక్కును ప్రసాదించడం ఈ సంస్కరణల్లో కీలకం. ప్రతి బిడ్డకూ ఇంగ్లిష్ మాధ్యమంలో చదువుకునే అవకాశం లభించింది. తెలుగు మాధ్యమం నుంచి ఇంగ్లిష్‌లోకి మారే క్రమాన్ని సులభసాధ్యం చేస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠ శాలల రూపురేఖలు గణనీయంగా మారిపోయాయి. ‘అమ్మఒడి’ నుంచే ప్రారంభమయ్యే ప్రభుత్వ ప్రోత్సాహం అంగన్వాడీల మీదుగా కేజీ నుంచి పీజీ వరకు కొనసాగేంతవరకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాల రూపంలో వెంట నిలుస్తుంది. రానున్న కాలంలో ఈ విద్యారంగ సంస్కరణలు పెను విప్లవం సృష్టించబోతున్నాయని చెప్పడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ప్రవేశాల సంఖ్యే ఒక పెద్ద సాక్ష్యం. 2. ఆరోగ్యవంతమూ తద్వారా ఆత్మ విశ్వాసంతో కూడిన సమాజానికి బాటలు వేసే ఆరోగ్యరంగ సంస్కరణలు - ఆరోగ్యశ్రీ మరింత విస్తరించింది. ప్రతి పల్లెలో ప్రతి వాడలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. నాడు - నేడు కార్యక్రమం ప్రజారోగ్య రంగాన్ని ప్రదీప్తం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రైవేట్ ఆస్పత్రులకంటే మెరుగైన స్థితికి చేరుకుంటున్నాయి. ప్రతి గడపా ఒక డాక్టర్ డైరీలో నమోదై ఉంటుంది. 3. జనాభాలో అధిక శాతానికి ఇప్పటికీ జీవనాధారంగా మిగిలిన వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ రంగం సంక్షోభంలోకి వెళ్లడానికి కారణాలను గుర్తించి వాటిని పరిహరించే చర్యలను చేపట్టారు. ప్రతి రైతుకు రైతు భరోసా కింద ఏటా రూ.13.500లు అందుతున్నాయి. నాణ్యమైన ఉచిత విద్యుత్‌కు ఢోకా లేకుండా శాశ్వత పరిష్కారం కింద 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇన్పుట్స్ ఇంటి ముంగిటకు వచ్చాయి. రైతుకు నష్టం జరగకుండా పెద్దఎత్తున పంటల కొనుగోళ్లను ప్రభుత్వం చేపట్టింది. 4. మహిళా సాధి కారత కోసం విప్లవాత్మక చర్యలు– లక్షలాదిమంది మహిళలకు వారి పేర్ల మీద ఇళ్ల పట్టాలు అందాయి. ఆ యింట్లో ఆమె మాటకు విలువ పెరగబోతున్నది. 45 లక్షలమంది మహిళలకు వారి పిల్లలను బడికి పంపించినందుకు ప్రోత్సాహకంగా ‘అమ్మఒడి’ నగదు లభిస్తున్నది. బిడ్డ చదువులో ఆమె మాట కీలకం కాబోతున్నది. ప్రభుత్వం నామినేట్ చేసే పదవుల్లో సగం, ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో సగం మహిళలకే కేటాయించడం జరిగింది. సగం ఆకాశం తానేనన్న ఆత్మవిశ్వాసం కలుగు తున్నది. దిశ చట్టానికి కేంద్రం ఆమోదం లభిస్తే ఆమెకు ఒక ఆయుధం దొరికినట్టే. 5. వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది ప్రజలకు జీవనాధారం కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్ఎస్ఎమ్ఈ) పరిశ్రమలను పునరుజ్జీవింప జేసి ఆర్థిక రంగంలో కీలకపాత్రను పోషించేలా ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. 6. పారదర్శకమైన, అవినీతి రహితమైన ప్రభుత్వ పరిపాలన ప్రజల ఇంటి ముంగిళ్లలోకి వచ్చింది. ప్రజా సంక్షే మానికి ప్రభుత్వం ఖర్చుచేసే వ్యయంలో రూపాయికి 16 పైసలు మాత్రమే లక్ష్యాన్ని చేరుతున్నదని పాతికేళ్ల కింద దేశంలో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ పరిస్థితిని అధిగ మించడానికి ఏం చేయాలనే అంశంపై అనేక మేధోమథనాలు జరిగాయి. ఇప్పుడు ప్రతిపైసా లబ్ధిదారుని చేతికి అందుతున్న యథార్థం కళ్లముందట ఆవిష్కృ తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన వలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలు ప్రజా ప్రభుత్వానికి అసలుసిసలు చిరు నామాలుగా నిలబడ్డాయి. ప్రజలు ప్రభుత్వాన్ని వెతుక్కుంటూ వెళ్లే పరిస్థితిని తలకిందులు చేసి ప్రభుత్వం ప్రజలను వెతు క్కుంటూ వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇదీ జనజీవితాల్లో వచ్చిన గుణాత్మక మార్పు. ఈ రాజకీయ పరిణామాల పూర్వరంగంలో ప్రజావిశ్వాసం అనే రక్తప్రసరణ పూర్తిగా నిలిచిపోయిన తెలుగుదేశం పార్టీని ఈ నెలాఖరునాటికి క్లినికల్ డెత్‌గా నిర్ధారిస్తే అందుకు బాధ్యత ఎవరిది? తెలుగుదేశం శ్రేణుల్లో రానున్న రోజుల్లో విస్తృతంగా జరగబోయే చర్చ ఇదే. ఇంకో విశేషమేమిటంటే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది కూడా మార్చిలోనే. మొన్న పన్నెండో తేదీనాడే 11వ ఏట ప్రవేశించింది. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన బర్త్‌డే ఈరోజే. ఆ పార్టీకి నేటితో ఏడేళ్లు నిండుతాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఐపీవోకి కల్యాణ్ జ్యుయలర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆభరణాల సంస్థ కల్యాణ్ జ్యుయలర్స్ తాజాగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 1,175 కోట్లు సమీకరించనుంది. షేరు ధరల శ్రేణిని రూ. 86-87గా నిర్ణయించారు. లాట్ సైజు 172 షేర్లుగా ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మార్చి 16న ప్రారంభమయ్యే ఇష్యూ 18న ముగుస్తుందని కంపెనీ వ్యవస్థాపకుడు టీఎస్ కల్యాణరామన్ వివరించారు. యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ మార్చి 15నే ప్రారంభమవుతుంది. ఐపీవోలో భాగంగా కొత్తగా రూ.800 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు రూ. 375 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ప్రమోటరు టీఎస్ కల్యాణరామన్ రూ. 125 కోట్ల విలువ చేసే షేర్లు, కంపెనీలో ఇన్వెస్టరయిన వార్బర్గ్ పింకస్ అనుబంధ సంస్థ హైడెల్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ దాదాపు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నాయి. ఈ ఏడాది మార్చి 9 నాటికి సంస్థలో ప్రమోటరు, ప్రమోటరు గ్రూప్‌నకు 67.99 శాతం వాటాలున్నాయి. నిర్వహణ మూలధన అవసరాలకు... ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్, కంపెనీకి సంబంధించిన ఇతరత్రా అవసరాల కోసం వినియోగించనున్నట్లు కల్యాణరామన్ పేర్కొన్నారు. ఇష్యూలో సగభాగాన్ని అర్హత పొందిన సంస్థాగత కొనుగోలుదారులకు, 35 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం భాగాన్ని సంస్థాగతయేతర బిడ్డర్లకు కేటాయించారు. దాదాపు రూ. 2 కోట్ల విలువ చేసే షేర్లను తమ ఉద్యోగులకు కల్యాణ్ జ్యుయలర్స్ కేటాయించింది. గతేడాది ఆగస్టులోనే ఐపీవోకి సంబంధించిన పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కంపెనీ దాఖలు చేయగా, అక్టోబర్‌లో అనుమతులు లభించాయి. యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థలు ఈ ఐపీవోకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. 1993లో ప్రారంభమైన కల్యాణ్ జ్యుయలర్స్‌కి.. 2020 ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 107 షోరూమ్‌లు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో 30 స్టోర్స్ ఉన్నాయి. -
15 నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ పదిహేడో సమావేశాల నోటిఫికేషన్‌ను శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు మంగళవారం విడుదల చేశారు. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇరు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇటీవల మరణించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 16న సంతాపం ప్రకటిస్తారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలు వేర్వేరుగా సమావేశమవుతాయి. 18న ఉదయం 11.30కు తెలంగాణ 2021–22 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీ, సమయంతోపాటు ఉభయ సభలను ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనే దానిపై ఈ నెల 16న జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. భౌతిక దూరం, కోవిడ్ నిబంధనలతో.. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల తరహాలోనే ఇప్పుడు కూడా భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. సమావేశాల నిర్వహణ తీరుతెన్నులకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో సభ్యుల మధ్య దూరం ఉండేలా అదనపు సీట్లు ఏర్పాటు చేశారు. అందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. గ్యాలరీ పాసులను రద్దు చేయడంతోపాటు మీడియాకు పరిమిత సంఖ్యలో పాసులు ఇచ్చారు. ఈసారి కూడా అవే తరహా నిబంధనలను పాటించే అవకాశం ఉంది. -
మార్చి నుంచి స్పెక్ట్రం వేలం
న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్లు ఎదురుచూస్తున్న స్పెక్ట్రం వేలం నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మార్చి 1 నుంచి ఆరో విడత వేలం నిర్వహించనున్నట్లు టెలికం శాఖ ఒక నోటీసులో పేర్కొంది. జనవరి 12న ప్రీ–బిడ్డింగ్ సమావేశం నిర్వహించనుండగా, నోటీసులోని అంశాలపై సందేహాలు నివృత్తి చేసుకునేందుకు జనవరి 28 ఆఖరు తేదీగా ఉంటుందని తెలిపింది. వేలంలో పాల్గొనేందుకు ఫిబ్రవరి 5లోగా టెలికం ఆపరేటర్లు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 24న బిడ్డర్ల తుది జాబితా ప్రకటిస్తారు. రూ. 3.92 లక్షల కోట్ల విలువ చేసే 2,251.25 మెగాహెట్జ్ పరిమాణం స్పెక్ట్రంను ప్రభుత్వం వేలం వేయనుంది. 700 మెగాహెట్జ్, 800, 900, 2,100, 2,300, 2,500 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు వీటిలో ఉంటాయి. నాలుగేళ్ల విరామం తర్వాత.. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత స్పెక్ట్రం వేలాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బేస్ ధరను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రెండేళ్ల క్రితమే సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర క్యాబినెట్ గతేడాది డిసెంబర్ 17న ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం నిర్వహించబోయే వేలంలో 5జీ సేవల కోసం ఉపయోగించే 3,300–3,600 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌ను చేర్చలేదు. దేశవ్యాప్తంగా ప్రీమియం 700 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రం కోసం బిడ్డర్లు కనీసం రూ. 32,905 కోట్లు చెల్లించాల్సి రానుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో స్పెక్ట్రం వేలానికి ఒక మోస్తరుగానే స్పందన ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.30,000–రూ.60,000 కోట్ల శ్రేణిలో బిడ్లు రావొచ్చని పేర్కొన్నాయి. 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో రూ.30,000 కోట్లకు మాత్రమే బిడ్లు పరిమితం కావొచ్చనేది జేఎం ఫైనాన్షియల్స్ అంచనా. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రకారం.. రూ. 55,000–రూ. 60,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చు. నిబంధనలిలా.. మొత్తం 22 టెలికం సర్కిళ్లలో 700 మెగాహెట్జ్ బ్యాండ్, 800, 2,300 మెగాహెట్జ్ బ్యాండ్‌ను వేలం వేయనున్నారు. మిగతా ఫ్రీక్వెన్సీల్లో స్పెక్ట్రంను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేయనున్నారు. ముందస్తుగా పూర్తి చెల్లింపులు జరిపేందుకు సిద్ధపడే బిడ్డర్లు .. ఫలితాలు వెల్లడైన 10 రోజుల్లోగా కట్టేయాల్సి ఉంటుంది. ఒకవేళ విడతలవారీగా చెల్లించే విధానాన్ని ఎంచుకుంటే బ్యాండ్ ఫ్రీక్వెన్సీని బట్టి బిడ్డింగ్ మొత్తంలో నిర్దేశిత శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 1800, 2,100, 2,300, 2,500 మెగాహెట్జ్ బ్యాండ్లకు సంబంధించి 50 శాతం కట్టాలి. 700, 800, 900 మెగాహెట్జ్ బ్యాండ్ల కోసం 25 శాతం చెల్లించాలి. టెలికం శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసిన పది రోజుల్లోగా చెల్లింపులు జరపాలి. బిడ్డింగ్ మొత్తంతో పాటు సవరించిన స్థూల ఆదాయంపై (వైర్‌లైన్ సేవలు మినహా) మూడు శాతాన్ని స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద కట్టాల్సి ఉంటుంది. కొన్ని సర్కిళ్లలో వొడాఫోన్ దూరం.. తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా .. కొన్ని సర్కిళ్లలో వేలం ప్రక్రియలో పాల్గొనపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్పెక్ట్రం వినియోగ హక్కులను పునరుద్ధరించుకోవడంపై టెలికం కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టొచ్చని పేర్కొన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌కు సంబంధించి 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 12.4 మెగాహెట్జ్ పరిమాణం, 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 47 మెగాహెట్జ్ పరిమాణం, ప్రస్తుతం 800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో రిలయన్స్ జియో ఉపయోగించుకుంటున్న 44 మెగాహెట్జ్ స్పెక్ట్రం రెన్యువల్‌కు రానున్నాయి. వొడాఫోన్ ఐడియా 900, 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రంను పునరుద్ధరించుకోవాల్సి ఉంది. ఈ రెన్యువల్స్ కోసం భారతీ ఎయిర్టెల్ సుమారు రూ. 15,000 కోట్లు, రిలయన్స్ జియో రూ. 11,500 కోట్లు వెచ్చించాల్సి రావొచ్చని క్రెడిట్ సూసీ అంచనా వేస్తోంది. -
గణతంత్ర వేడుకల్లో ట్రాక్టర్ మార్చ్
ఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నెల రోజులకు పైగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమ డిమాండ్లను ఇప్పటికైనా ప్రభుత్వం అంగీకరించకపోతే జనవరి26 గణతంత్ర వేడుకల్లో దేశ రాజధాని నగరంలో ట్రాక్టర్లతో మార్చ్ నిర్వహిస్తాని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్‌కు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో కిసాన్ పరేడ్ పేరుతో రైతులు తమ నిరసనను వ్యక్తం చేయనున్నారు. ఇప్పటికే నూతన వ్యవసాయ చట్టాల రద్దు సహా నాలుగు ప్రధాన డిమాండ్లపై కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య బుధవారం జరిగిన చర్చల్లో కొంత పురోగతి చోటు చేసుకుంది. (టాయిలెట్ గదిలో రైతు ఆత్మహత్య ) రైతుల ప్రధానమైన 4 డిమాండ్లలో.. సాగు చట్టాల రద్దుకు విధివిధానాలు రూపొందించడం, కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించడమనే రెండు డిమాండ్ల అమలుపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. రైతులపై విద్యుత్ బిల్లుల భారం పెంచే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌కు, అలాగే, పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు జరిమానా విధించే ప్రతిపాదనను విరమించుకోవాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇరు వర్గాల మధ్య ఆరో విడత చర్చలు 50% అంశాలపై రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొనగా, రైతు సంఘాల నేతలు వీటిని ఖండించారు. ఈ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి లిఖితపూర్వక సయోధ్య కుదరలేదని రైతు సంఘాల అధినేత స్వరాజ్ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్ తెలిపాడు. జనవరి4న మరోసారి చర్చలు నిర్వహిస్తామని, ప్రతిష్టంభన నెలకొన్న మిగతా రెండు డిమాండ్లపై కేంద్రం నుంచి సానుకూలత రాకపోతే గణతంత్ర వేడుకల్లో మార్చ్‌తో నిరసన తెలియజేస్తామని వెల్లడించాడు. చలి తీవ్రత ఉన్నా ఏమాత్రం లెక్కచేయకుండా దేశ వ్యాప్తంగా వేలాది మంది రైతులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 50 మంది రైతులు అమరులయిన సంగతి తెలిసిందే. (రైతు సంఘాలతో చర్చల్లో పురోగతి) -
జీఎంఆర్‌కు రూ.1,127 కోట్ల నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.1,127 కోట్ల నష్టం చవిచూసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.2,353 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవరు రూ.1,994 కోట్ల నుంచి రూ.2,349 కోట్లకు చేరింది. ఎబిటా రూ.655 కోట్లుగా ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.2,198 కోట్ల నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.3,466 కోట్ల నష్టం పొందింది. టర్నోవరు రూ.7,576 కోట్ల నుంచి రూ.8,556 కోట్లకు చేరింది. ఎయిర్‌పోర్టుల ఆదాయం నాల్గవ త్రైమాసికంలో రూ.1,582 కోట్లు, ఆర్థిక సంవత్సరంలో రూ.6,191 కోట్లు నమోదైంది. -
మార్చి ఆదాయం అదుర్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ప్రభావం మొదలైన మార్చిలో ప్రభుత్వ ఖజానాకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్కలు చెబుతున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరానికి కాగ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చిలో అన్ని వనరుల ద్వారా సర్కారుకు రూ. 16,840 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ నెలలో 22వ తేదీ నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించినప్పటికీ దాదాపు రూ. 17 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, ఆ పది రోజులు ప్రభుత్వ కార్యకలాపాలు సక్రమంగా జరిగి ఉంటే ఆదాయం రూ. 20 వేల కోట్లు దాటేదని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. సగటు కంటే ఎక్కువ... 2019–20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రాబడులు రూ. 1.37 లక్షల కోట్లు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ లెక్కన నెలకు సగటున రూ. 11,500 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరంలో చివరి నెల కాబట్టి సగటుకన్నా కొంత ఎక్కువ వస్తుందని అధికారులు భావించగా ఏకంగా రూ. 16,840 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం మార్చి నెల ఆదాయంలో పన్నుల రూపేణా రూ. 9,117 కోట్లు రాగా, ఇతర వనరుల ద్వారా మరో రూ. 7,500 కోట్లకుపైగా రాబడి వచ్చిందని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో పన్నేతర ఆదాయం రూ. 3,100 కోట్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ. 1,000 కోట్లతోపాటు అప్పుల ద్వారా రూ. 3,400 కోట్లు ఖజానాకు సమకూరాయి. రిజిస్ట్రేషన్ల రికార్డు.. గత ఆర్థిక సంవత్సర ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చింది. ఆ ఏడాదిలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ. 6,146 కోట్ల రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా రూ. 500 కోట్లు అదనంగా రూ. 6,671 కోట్లు వచ్చాయి. మద్యం అమ్మకాలు కూడా గతేడాది అంచనాలకు మించి ఆదాయాన్ని తెచ్చి పెట్టాయని కాగ్ వెల్లడించింది. ఎక్సైజ్ శాఖ ద్వారా రూ. 10,901 కోట్ల అంచనా ప్రభుత్వానికి ఉండగా వాస్తవ లెక్కలను చూస్తే రూ. 11,991 కోట్లు వచ్చాయి. అమ్మకపు పన్ను ఆదాయం అంచనాలతో పోలిస్తే 94 శాతం రాగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో 89 శాతం రాబడి వచ్చింది. పన్నేతర ఆదాయం అంచనాలో కేవలం 46 శాతమే వచ్చింది. కేంద్ర పన్నుల్లో రావాల్సిన వాటా 80 శాతమే వచ్చింది. కానీ పన్ను ఆదాయం 93 శాతం వసూలు కావడం, రుణాలు అంచనాలకు మించి అందడం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఎక్కువ నిధులు సమకూరడంతో మొత్తం రాబడుల అంచనా 96 శాతం నెరవేరింది. -
3.1 శాతానికి పడిపోయిన జిడిపి వృద్ధి రేటు
-
కరోనా : క్షీణించిన మారుతి విక్రయాలు
సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ దేశీయ వాహన అమ్మకాలు మరోసారి భారీగా పడిపోయాయి. మార్చి మాసంలో సంవత్సర ప్రాతిపదికన 48 శాతం క్షీణతను నమోదు చేశాయి. ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ ఆటో అమ్మకాలను ప్రభావితం చేసింది. కరోనా వైరస్‌ను అడ్డుకనేందుకు ప్రభుత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా మార్చి 22, 2020 నుండి కార్యకలాపాలను నిలిపివేశామనీ, దీని మూలంగా మార్చి 2020 లో అమ్మకాలు 2019 మార్చిలో అమ్మకాలతో పోల్చలేమని కంపెనీ బుధవారంనాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కరోనావైరస్ ఆందోళనల మధ్య ఆటోమొబైల్ అమ్మకాలు మార్చి 15 నుండి పాతాళానికి పడిపోయాయి. దీంతో మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో కంపెనీ 76,976 యూనిట్లను విక్రయించింది, ఏడాది క్రితం 147,613 యూనిట్లుగా వుంది. ముఖ్యంగా కాంపాక్ట్ అమ్మకాల క్షీణత మారుతి దేశీయ అమ్మకాలను దెబ్బతీసింది. మారుతి ప్రసిద్ధ మోడళ్లైన స్విఫ్ట్, బాలెనో, వాగన్ఆర్ డిజైర్లను కార్ల విక్రయాలు 51 శాతం క్షీణించాయి. సంవత్సరానికి 42,000 యూనిట్లకుపైగా తగ్గిపోయాయి. మినీ కేటగిరీలో, ఆల్టో, ఎస్-ప్రెస్సో విక్రయాలు 5శాతం తగ్గి 15,988 యూనిట్లకు చేరుకుందని కంపెనీ నివేదించింది. యుటిలిటీ వెహికల్ విభాగంలో మారుతి విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్ , ఎక్స్ఎల్ 6 అమ్మకాలు 53శాతం పడిపోయి 11,904 యూనిట్లకు తగ్గింది. మధ్యతరహా సెడాన్ సియాజ్ అమ్మకాలు కూడా ఏడాది క్రితం 3,672 యూనిట్ల నుండి 1,863 యూనిట్లకు తగ్గాయి. వ్యాన్స్ విభాగంలో, ఇది 5,966 యూనిట్లను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 64 శాతం క్షీణత. కంపెనీ తన తేలికపాటి వాణిజ్య వాహనమైన సూపర్ క్యారీలో 736 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అంతకు ముందు ఏడాది ఈ సంఖ్య 2,582 యూనిట్లు. మార్చిలో కంపెనీ మొత్తం ఎగుమతులు 55శాతం తగ్గి 4,712 యూనిట్లుగా ఉన్నాయి. అయితే 2020 ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్లో 14,36,124 యూనిట్లను మారుతి విక్రయించింది, ఇది 18శాతం క్షీణత కాగా, ఎగుమతులతో సహా మొత్తం అమ్మకాలు 15,63,297 యూనిట్లు, గత ఆర్థిక సంవత్సరంలో 18,62,449 యూనిట్లు. అంటే 16శాతం క్షీణించాయి. కాగా గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మందగమనం, బలహీనమైన డిమాండ్, 2020 ఆర్థిక సంవత్సరంలో బీఎస్-6 నిబంధనలు, మూలధన కొరత వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన ఆటో పరిశ్రమకు కరోనా రూపంలో మరో భారీ దెబ్బ తగిలింది. అయితే లాక్డౌన్ తర్వాత కొన్నాళ్లపాటు బీఎస్4 వాహనాల విక్రయానికి సుప్రీం కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. -
సీఏఏపై మార్చిలో సభ
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై మార్చి మొదటి వారంలో భారీ బహిరంగసభ నిర్వహణకు బీజేపీ కసరత్తు చేస్తోంది. సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సభ నిర్వహణపై పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కసరత్తు చేస్తున్నారు. బీజేపీకి దూరంగా రఘునందన్‌రావు: లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుడు రఘునందన్‌రావును పార్టీ దూరంగా పెట్టినట్లు తెలిసింది. కేసు తేలేవరకు పార్టీకి దూరంగా ఉండాలని స్పష్టం చేసినట్లు సమాచారం. కేకే ఆంధ్రప్రదేశ్ ఎంపీనే..: తుక్కుగూడ మున్సిప ల్ చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ కె.కేశవరా వు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడేనని రాజ్యసభ అండర్ సెక్రెటరీ దీపక్ కల్రా స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు ఆయన లేఖ రాశారు. -
మార్చిలో గజ్వేల్‌కు.. కూ.. చుక్‌చుక్
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్–గజ్వేల్ మధ్య నడపనున్న రైలు మార్చిలో పట్టాలెక్కబోతోంది. తొలుత పుష్పుల్ ప్యాసింజర్ సేవలను ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసిన రైల్వే, రామాయపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై వంతెన నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈనెల 20 నుంచి ఆ పనులు మొదలుకానున్నా యి. వాటిని రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకుంది. ఫిబ్రవరి చివరినాటికి ఆ పనులు పూర్తి చేసి మార్చి మొదటి వారంలో రైలును నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్టేషన్లు... ట్రాక్ సిద్ధం సికింద్రాబాద్‌తో కరీంనగర్‌ను రైల్వే లైన్ ద్వారా అనుసంధానించే మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజె క్టులో తొలి దశ పనులు దాదాపు పూర్తయ్యాయి. మనోహరాబాద్ స్టేషన్ నుంచి ఈ కొత్త లైన్ ప్రారం భమైంది. అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వేల్ పట్టణం వరకు పనులు పూర్తి చేయటం ప్రాజెక్టు తొలిదశ. ఇందులో మనోహరాబాద్ వద్ద కొత్త స్టేషన్ భవనం సిద్ధమైంది. ఆ తర్వాత నాచారం, అప్పాయిపల్లి, గజ్వేల్‌లలో స్టేషన్లు ఉంటా యి. జనవరి నాటికి పనులన్నీ పూర్తవుతాయి. జాతీయ రహదారిని కట్‌చేసి... ఇక ఈ 32 కిలోమీటర్ల మార్గంలో ఆరు రోడ్ ఓవర్ బ్రిడ్జీలు మూడు రోడ్ అండర్ బ్రిడ్జీ, నాలుగు చోట్ల పెద్ద వంతెన పనులు పూర్తయ్యాయి. ఇక నిజామాబాద్ మీదుగా సాగే 44వ నంబర్ జాతీయ రహదారిని రైల్వే లైన్ క్రాస్ చేసే చోట వంతెన నిర్మించాల్సి ఉంది. జాతీయ రహదారిని కట్ చేసి పని చేపట్టాల్సి ఉన్నందున అనుమతి కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఈనెల 20 నుంచి అక్కడ పనులు చేసుకోవచ్చంటూ తాజాగా జాతీయ రహదారుల విభాగం అనుమతించడంతో పనులు చకచకా సాగనున్నాయి. ఫిబ్రవరిలో ట్రయల్ రన్ పూర్తి చేసి మార్చి తొలివారంలో ప్రారంభించనున్నట్లు అధికారులు చెప్పారు. -
మార్చ్‌లో భవన నిర్మాణ కార్మికులెవరూ కన్పించలేదు
-
విశాఖే ఎందుకు? ఆసలు రహస్యం
-
విశాఖలో మిలాన్ విన్యాసాలు
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను సమర్థవంతంగా నిర్వహించి తన సత్తా చాటిన తూర్పు నావికాదళం మరోసారి అంతటి కీలకమైన కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది. పలు దేశాల నావికాదళాలు పాల్గొనే మిలాన్ విన్యాసాలకు విశాఖ వేదిక కానుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ విన్యాసాలు జరగనున్నాయని తూర్పు నావికాదళం(ఈఎన్సీ) ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ ప్రకటించారు. నేవీ ప్రధాన కేంద్రంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శత్రు దేశాలకు మన సాయుధ సంపత్తి, సైనిక బలగాల శక్తి సామర్థ్యాలు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అలాగే మిత్ర దేశాలతో అనుబంధాన్ని పటిష్ట పర్చుకోవాలన్నారు. ఈ రెండు లక్ష్యాల సాధనకు సంయుక్త విన్యాసాలు దోహదపడతాయన్నారు. ఆ లక్ష్యాలతోనే 1995లో మిలాన్ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. గత ఏడాది అండమాన్ నికోబార్ దీవుల్లో నావికాదళం నిర్వహించిన ఈ విన్యాసాల్లో 12 దేశాలు పాల్గొన్నాయి. వచ్చే ఏడాది విశాఖలో నిర్వహించే మిలాన్‌లో అంతకంటే ఎక్కువ దేశాలు పాల్గొననున్నాయి. సాక్షి, విశాఖపట్నం: నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన మిలాన్ విన్యాసాలకు తొలిసారిగా విశాఖ వేదిక కానుందని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ప్రకటించారు. గతేడాది అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన ఈ విన్యాసాల్లో 12 దేశాలు పాల్గొన్నాయని.. ఈసారి అంతకు మించి భారీ ఏర్పాట్లకు ఈఎన్సీ సమాయత్తమవుతోందన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని ఇండోర్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎ.కె. జైన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ ఘోర్మడే ఆధ్వర్యంలో ఆర్మ్డ్ గార్డులు, నౌకాదళ సిబ్బంది, డిఫెన్స్ సెక్యూరిటీ సిబ్బంది, సీ క్యాడెట్లు, వివిధ నౌకలు, సబ్మెరైన్ల సిబ్బంది మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. శత్రు సైన్యాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తం గా వ్యవహరిస్తూ సముద్ర తీరంలో నిత్యం సన్నద్ధంగా ఉన్నామని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ జైన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇతర దేశాలతో సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాలు పెరుగుతుండటం శుభపరిణా మమన్నారు. ఈ బంధం మరింత బలపరచుకునేందుకు మార్చి 2020లో జరగనున్న మిలా న్ బహుపాక్షిక విన్యాసాలను భారత నౌకాదళం నిర్వహిస్తోందన్నారు. ఇండియన్ ఫ్లీట్ రివ్యూ తర్వాత అంతటి చరిత్రాత్మకమైన ఈవెంట్ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీచ్‌రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద జనరల్ నేవల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వైస్ అడ్మిరల్ నారాయణ్ ప్రసాద్ వీరమరణం పొందిన నౌకాదళ సిబ్బందికి ఘన నివాళులర్పించారు. -
3.19 శాతానికి టోకు ధరల సూచీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చి మాసంలో 3.18గా నమోదైంది. ఇంధన ధరలు, ప్రామాణిక వస్తువుల ధరలు పుంజుకోవడంతో మార్చి నెలలో పెరుగుదలను నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఇది 2.93గా ఉంది. మార్చి, 2018లో ఇది 2.74 శాతంగా ఉంది. మార్చినెలకు సంబంధించిన డబ్ల్యూపీఐ గణాంకాలను సోమవారం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రామాణిక వస్తువుల ద్రవ్యోల్బణం 2. 83గా ఉంది. ఆహారేతర ఫుడ్ ఇన్ఫ్లేషన్ 3.89గా ఉంది. అలాగే కూరగాయల నెలవారీ ప్రాతిపదికన 11శాతం పెరిగింది. మార్చి నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 28.13 శాతంగా నమోదైంది. కాగా అంతకు ముందు నెలలో ఇది 6.82 శాతంగా ఉంది. -
రికార్డు స్థాయిలో జిఎస్టీ వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. రూ.1.06లక్షల కోట్లకు వసూళ్లు సాధించినట్టు కేంద్ర గణాంకాల శాఖ సోమవారం వెల్లడించింది. మంత్ ఆన్ మంత్ 9.5 శాతంవృద్ధిని సాధించింది. జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఇంత భారీగా వసూలు కావడం విశేషం. గత నెలలో జీఎస్టీ వసూళ్లుగా రూ.97,247 కోట్లుగా నిలిచాయి. ఈ సారి రిటర్నులు పెరగడంతో ఆదాయం పెరిగిందని భావిస్తున్నారు. ఉత్పత్తి, వినియోగంలో పురోగతిని ఇది సూచిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. సెంట్రల్ జీఎస్టీ రూ. 20,353 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.27,520 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్ రూ.50,418 కోట్లు, సెస్సు రూపంలో రూ.8,286 కోట్లు మార్చినెలలో వసూలైనాయి. మార్చి 31 వరకు జీఎస్టీఆర్ -3బీను ఫైల్ చేసిన వారి సంఖ్య 75.95లక్షలుగా నిలిచింది. గత మార్చితో పోల్చుకుంటే దాదాపు 15.6శాతం వృద్ధి కనిపించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సగటు నెల వసూళ్లు రూ.98,114కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందు ఏడాది కంటే 9.2శాతం ఎక్కువ. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 11.47లక్షల కోట్లు వసూళ్లను లక్ష్యంగా నిర్ణయించగా తొలుత దీనిని రూ.13.71లక్షల కోట్లుగా నిర్ణయించి ఆ తర్వాత తగ్గించిన సంగతి తెలిసిందే. The record collection in March, 2019 of the GST touching ₹1,06,577 crore indicates the expansion in both manufacturing and consumption. — Chowkidar Arun Jaitley (@arunjaitley) April 1, 2019 -
జన మనోరథయాత్ర
త్రికాలమ్ ఒకానొక చారిత్రక ఘట్టం ఈ నెల తొమ్మిదో తేదీన ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ విపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2017 నవంబర్ 6న ఆరంభించిన ‘ప్రజాసంకల్పయాత్ర’ ఇచ్ఛాపురంలో పెద్ద బహిరంగసభతో ముగియనున్నది. కన్యాకుమారి నుంచి కశ్మీరం వరకూ జరిగిన ఆదిశంకరుడి పాదయాత్ర వివరాలు మనకు అందుబాటులో లేవు. పాదయాత్రను ఒక సాధనంగా వినియోగించి విజయాలు సాధించిన తొలి ప్రజానాయకుడు మహాత్మాగాంధీ. దక్షిణాఫ్రికాలో బొగ్గుగని కార్మికులను సమీకరించి పోరుబాటలో నడిపించడానికి గాంధీజీ చేసిన ప్రయోగం భారత స్వాతంత్య్ర సమరంలో ఒక విధానంగా స్థిరపడింది. 1930లో ఆయన ఆధ్వర్యంలో సాగిన దండి సత్యాగ్రహం దేశప్రజల్లో ఐకమత్యానికీ, స్వాతంత్య్ర పోరాటం తీవ్రతరం కావడానికీ దోహదం చేసింది. అదే మంత్రాన్ని వినోబా భావే 1950 దశకంలో భూదానోద్యమం ప్రచారానికి జయప్రదంగా ఉపయోగించారు. జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకూ జరిపిన పాదయాత్ర నడివయస్సులో ఉన్నవారికి గుర్తు ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో హరిత విప్లవ సారథి సుందర్‌లాల్ బహుగుణ ప్రజలలో అవగాహన పెంపొందించే కార్యక్రమానికి పాదయాత్రను వినియోగించుకున్నారు. ఏక్తాపరిషత్, స్వరాజ్ అభియాన్ వంటి సంస్థలు హక్కుల సాధనకోసం ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని రావడానికి పాదయాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. చంద్రశేఖర్ భారత్‌యాత్ర రాజకీయ లక్ష్యంతో, ఎన్నికలకు ముందు ప్రజలను ప్రభావితం చేయడానికి ఉద్దేశించిన పాదయాత్ర చేసిన తొలి నాయకుడు జనతాపార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్. జయప్రకాశ్‌నారాయణ్ ఆశీస్సులతో ఆవిర్భవించిన జనతా పార్టీ 1977లో ప్రభుత్వం ఏర్పాటు చేసి, 1980 ఎన్నికలలో పరాజయం చెందిన తర్వాత కొన్ని మాసాలకే విచ్ఛిన్నమైపోయింది. అటల్‌బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ అడ్వాణీలు భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. చరణ్‌సింగ్, దేవీలాల్, లాలూ ప్రసాద్‌యాదవ్, ములాయంసింగ్‌యాదవ్, దేవెగౌడ వంటి నాయకులు వేరు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. చంద్రశేఖర్ ఒంటరి. ఆ నేపథ్యంలో ప్రత్యా మ్నాయ రాజకీయాలకు అంకురార్పణ చేయాలన్న సంకల్పంతో ఆయన ‘భారత్ యాత్ర’ను ప్రారంభించారు. కన్యాకుమారి నుంచి 4,260 కిలోమీటర్లు ఆరు మాసాలలో (జనవరి6–జూన్ 25, 1983) నడిచి రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి శ్రద్ధాంజలి ఘటించడంతో యాత్ర ముగిసింది. కానీ చంద్రశేఖర్‌కు రాజకీయ ప్రయో జనం ఏదీ ఆ సందర్భంలో కలగలేదు. 1967 నుంచి ఎంపీగా ఉండిన చంద్ర శేఖర్ భారత్‌యాత్ర అనంతరం 1984లో జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ హత్య కారణంగా వీచిన సానుభూతి పవనాల ఫలితంగా ఓటమి చవిచూశారు. అనంతరం 1990 నవంబర్‌లో ప్రధాని పదవి చేపట్టి 1991 జూన్ వరకూ కొనసాగారు కానీ దానికీ, పాదయాత్రకూ సంబంధం లేదు. ప్రధాని పదవిలో రాణించడానికి అవసరమైన వ్యవధి కూడా లభించలేదు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలకు పరిష్కారాలు ఆలోచించడానికి కానీ అమలు చేయడానికి కానీ అవకాశం లేకపోయింది. 1990లో బీజేపీ నాయకుడు అడ్వాణీ చేసిన 36 రోజుల రథయాత్ర దేశాన్ని కుదిపివేసింది. ఇది రాజకీయాల కోసం మతాన్ని ఉపయోగించే ప్రయత్నం. హిందువులను మతప్రాతిపదికపైన, బాబరీమసీదును తొలగించి రామాలయ నిర్మాణం జరిపించాలనే నినాదంపైన సంఘటితం చేసే ఉద్దేశంతో సాగిన యాత్ర. మహాభారత యుద్ధంలో అర్జునుడు ఉపయోగించిన రథాన్ని పోలిన వాహనంలో చేసిన యాత్రను బిహార్ ముఖ్యమంత్రి లాలూ అడ్డుకున్నారు. అడ్వాణీని అరెస్టు చేయించారు. అయినా ఆ యాత్ర బీజేపీకి లబ్ధి చేకూర్చింది. 1984లో రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలుచుకున్న బీజేపీ 1998 నాటికి అధికారంలోకి వచ్చింది. రాజీవ్ హత్య జరిగి ఉండకపోతే 1991 ఎన్నికలలో బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించి ఉండేది. హత్య కారణంగా ఎన్నికల రెండో ఘట్టంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కలిగిన పార్టీగా అవతరించింది. 1996 ఎన్నికల అనంతరం 13 రోజుల స్వల్పకాలం వాజపేయి నేతృత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ అల్పాయుష్షు ప్రభు త్వాలకు దేవెగౌడ, గుజ్రాల్ సారథ్యం వహించారు. 1998 ఎన్నికలలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించి వాజపేయి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తంమీద రథయాత్ర ఫలితంగా బీజేపీ బలం పుంజుకొని అధికారంలోకి వచ్చిందని భావించవచ్చు. పూర్తిగా రాజకీయ, సామాజిక అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ, ప్రజలను కలుసుకొని వారి కంట నీరు తుడిచే ఉద్దేశంతో సాగిన పాదయాత్ర వైఎస్ రాజ శేఖరరెడ్డి 2003లో చేసిన ‘ప్రజాప్రస్థానం.’ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి ఆరంభించి ఇచ్ఛాపురం వరకూ 64 రోజులపాటు 1,470 కిలోమీటర్లు సాగిన యాత్రలో అన్ని వర్గాల, కులాల, మతాల ప్రజలనూ కలుసుకొని వారి వెతలు వినే అవకాశం నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్కి దక్కింది. పేదప్రజలూ, నిరుద్యోగులూ, మైనారిటీలూ, దళితులూ, ఆదివాసులూ చెప్పిన అనేక సమస్యలను అవగాహన చేసుకొని వాటికి పరిష్కారాలు ఆలోచించి నిర్దిష్టమైన రూపం ఇచ్చే సావకాశం ఆయనకు లభించింది. 2004 ఎన్నికలలో విజయం సాధించాక ఆయన ప్రభుత్వం ఏర్పడి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. జలయజ్ఞం వంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని తలకెత్తుకున్నది. విద్య, ఆరోగ్య రంగాలలో వినూత్నమైన పథకాలు తెచ్చింది. పార్టీలకూ, ప్రాంతాలకూ అతీతంగా ప్రజలందరికీ పథకాల ఫలాలు అందే విధంగా అమలు చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. ఆ పథకాల ఫలితంగానే 2009లో మహాకూటమిని ఒంటరిగా ఎదుర్కొని వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. 2009 సెప్టెంబర్ 2న ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. వైఎస్ఆర్ స్థానంలో రోశయ్య, ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశారు. 2012 అక్టోబర్ 2న టీడీపీ అధినేత చంద్రబాబు హిందూపురం నుంచి విశాఖపట్టణం వరకూ పాదయాత్ర ప్రారంభించారు. 208 రోజులపాటు సుమారు 2,800 కిలోమీటర్లు నడిచి 2013 ఏప్రిల్ 27న యాత్ర ముగించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. టీడీపీ గెలిచింది. ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకులు జరిపిన పాదయాత్రలు ఫలించాయి. చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించిన తర్వాత పక్షం రోజులకు, 2012 అక్టోబర్ 18న వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఇడు పులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర మొదలు పెట్టారు. 2013 జులై 29 వరకూ 230 రోజుల పాటు 3112 కిలోమీటర్ల దూరం నడిచి కొత్త రికార్డు నెలకొల్పారు. జగన్ జైలులో ఉన్న కారణంగా ఆయన చెల్లెలు అన్నకు సంఘీభావ సూచనగా ‘మరోప్రజాప్రస్థానం’ పేరుతో ఈ పాదయాత్ర చేశారు. వైఎస్ఆర్సీపీ విజయావకాశాలు పెంపొందించడమే తప్ప తనకు వ్యక్తిగతంగా రాజకీయ ప్రయోజనం ఆశించలేదు కనుక షర్మిల పాదయాత్రకు నిర్దిష్టమైన ఫలితం అంటూ ఉండదు. ఈ పాదయాత్ర ప్రత్యేకతలు ఏమిటి? బుధవారం ముగియనున్న జగన్ పాదయాత్ర ఇంతకు మునుపు జరిగిన పాద యాత్రల కంటే పలు విధాల భిన్నమైనది. తెలుగునాట ఇంతకు పూర్వం పాద యాత్రలో నెలకొల్పిన రికార్డులన్నంటినీ ఇది అధిగమించింది. ఆయన ఇంత వరకూ 338 రోజులపాటు 3,600 కిలోమీటర్ల పైచిలుకు నడిచారు. కాలమూ, దూరంలోనే కాదు ప్రత్యేకత. వైఎస్ పాదయాత్ర చేసిన రోజులలో రాష్ట్రంలో కరువు తాండవించింది. వ్యవసాయదారుల సమస్యలను అధికంగా ప్రస్తావించే వారు. రైతుల రుణమాఫీ, ఉచిత కరెంటు ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఆ యాత్ర ఫలితమే. చంద్రబాబు చేసిన ‘వస్తున్నా మీ కోసం’ యాత్రలో రైతుల సమస్యలనూ, ఇతర వర్గాల సమస్యలనూ ప్రస్తావించారు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే రైతులనూ, పేదలనూ విస్మరించి సింగపూర్ స్వప్నంలో మునిగారు. ఇప్పటికీ తేలలేదు. ఏడు మాసాల పాదయాత్రలో ఆలకించిన విన్నపాల ఆధారంగా ప్రజల ఎజెండా రూపొందించుకొని అమలు పరచవలసిన ముఖ్యమంత్రి సొంత ఎజెండాను తలకెత్తుకున్నారు. బహుశా ప్రజల ఆశలనూ, ఆకాంక్షలనూ చంద్రబాబు పట్టించుకోని ఫలితంగానే జగన్ పాదయాత్రకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఇదివరకు జరగనట్టు ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి రెండు రోజులకూ ఒక బహిరంగసభ జరుగుతోంది. ఇదివరకు ఎరగనట్టు ప్రతి సభకూ ప్రజలు వేల సంఖ్యలో హాజరవుతున్నారు. ఒక పాద యాత్రకు ఇంతమంది ప్రజలు హాజరుకావడం చరిత్ర. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రాష్ట్రం పొడవునా పాదయాత్ర చేయడం ప్రపంచ రికార్డు. బహిరంగ సభలతో పాటు వివిధ కులాలవారూ, వృత్తులవారూ ఆత్మీయసభ లలో జగన్‌ను కలుసుకొని తమ కష్టాలూ, సమస్యలూ చెప్పుకుంటున్నారు. ప్రతి పక్ష నాయకుడు అందరు చెప్పినవీ శ్రద్ధగా ఆలకించి పరిష్కారం సూచిస్తున్నారు. అందరి ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడితే ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలని అనుకుంటున్నారో చెబుతున్నారు. ఇసుకవేస్తే రాలని జనం ఎందుకు వస్తున్నారు? టీడీపీ ఎన్నికల వాగ్దానాలు సక్రమంగా అమలు జరగడం లేదని ప్రజలు ఆవే శంగా, ఆవేదనతో చెబుతున్న మాటలు స్పష్టం చేస్తున్నాయి. అవే అంశాలు జగన్ ఉపన్యాసాలలో విమర్శనాస్త్రాలుగా వెలువడుతున్నాయి. విమర్శ సూటిగానే, ఘాటుగానే ఉంటున్నది. ప్రత్యర్థిని చులకన చేసి మాట్లాడటం లేదు. ‘ఈ పెద్దమనిషి, చంద్రబాబునాయుడుగారు...’ అంటూనే వాక్యం ప్రారంభం అవు తున్నది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలనూ, ప్రభుత్వ వైఫల్యాలనూ పేర్కొంటూనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఏమి చేయాలని అను కుంటున్నదో కూడా స్పష్టంగా చెబుతున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం, వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాల మొత్తాన్ని నాలుగు దఫాలుగా వారికే చెల్లించడం, వృద్ధాప్య పింఛన్నూ, వికలాంగులకు ఇచ్చే పింఛన్నూ వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకు పెంచడం, పిల్లలను చదివించే తల్లులకు ప్రోత్సాహకాలు అందించే అమ్మఒడి పథకం, పేదలందరికీ ఇళ్ళు, ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, దశలవా రీగా మద్యనిషేధం అంటూ నవరత్నాల పేరుమీద తొమ్మిది పథకాలను ప్రధాన ఎజెండాగా ప్రకటించారు. ప్రతిపథకం గురించి వివరంగా చెబుతున్నారు. ఇలా ప్రజల మధ్య నిత్యం ఉండటం,వారి మాటలు వినడం, మాట్లాడటం కంటే ముఖ్యమైన కార్యక్రమం రాజకీయ నాయకులకు ఉండదు. ప్రజల సంక్షేమమే పరమావధి అని భావించే నాయకులకు ఇది మహోపకారం చేస్తుంది. 2009లో తండ్రి ఆకస్మిక మరణం నుంచి నేటి వరకూ ఆయన పట్టుమని వారం రోజులు ఇంటి దగ్గర భార్యాపిల్లలతో కలసి ఉండలేదు. మొదట్లో ఓదార్పు యాత్ర, అనంతరం జైలు జీవితం, ఆ తర్వాత ప్రత్యేకహోదా సాధనకోసం రాష్ట్ర వ్యాప్తంగా సభలు, అటుపిమ్మట పాదయాత్ర. 2018 పూర్తిగా పాదయాత్రలోనే గడిచిపోయింది. వాస్తవానికి ఇది 2017లో ఆరంభమై 2019లో పూర్తవుతున్న చరిత్రాత్మకమైన పాదయాత్ర. ‘ప్రజల సంక్షేమం కోసం నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే మీ జగన్ రెండడుగులు ముందుకేస్తాడు’ అంటూ అడుగడుగునా చెబుతున్న జగన్ 2019లో అద్భుతమైన విజయం సాధిస్తారనడంలో సందేహం ఏ మాత్రం లేదు. ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ప్రజలు ఒకసారి సంకల్పం చెప్పుకున్న తర్వాత ప్రత్యర్థుల ఎత్తుగడలూ, కూడికలూ, తీసివేతలూ, వ్యూహాలూ, ప్రలోభాలూ, కుట్రలూ, ధనప్రవాహాలూ, విషప్రచారాలూ పని చేయవు. 2004లో, 2009లో పని చేయలేదు. ఈసారీ పని చేయవు. గెలిచిన తర్వాత జగన్ ఎట్లా వ్యవహరిస్తారో ప్రజలు పరిశీలిస్తారు. శాసనసభ్యుల చేత రాజీనామా చేయించిన తర్వాతనే పార్టీలో చేర్చుకున్నట్టు, ఆచరణసాధ్యమైన వాగ్దానాలనే ప్రజలకు చేసినట్టు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్టు... ఇదే రక మైన విలువలను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తే, పాద యాత్రలో చేసిన బాసలన్నీ నిలబెట్టుకునే ప్రయత్నం నిజాయితీగా చేయగలిగితే ‘ప్రజాసంకల్పయాత్ర’ పూర్తిగా సార్థకం అవుతుంది. జగన్మోహన్రెడ్డి జన్మ ధన్యమౌతుంది. కె. రామచంద్రమూర్తి -
పోలీస్ పాదయాత్రలు!
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెవెన్యూ జిల్లా యూనిట్‌గా నిర్ణయం... గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున నగర కమిషనరేట్ నుంచి ఇన్స్పెక్టర్ల బదిలీలు... అనేక ఠాణాలకు కొత్త ఇన్స్పెక్టర్ల రాక... చాలామంది నగరానికి, ఏరియాకు పూర్తి కొత్త కావడం... అత్యంత కీలక పరిణామాల మధ్య జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలోనే కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్లకు తమ పరిధిలోని ప్రాంతాలపై పట్టు సాధించేలా చూడాలని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే ‘పాదయాత్రలు’ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని పోలింగ్ బూత్‌లను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, సున్నితమైనవిగా విభజించారు. వీటిలో పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటారు. మరోపక్క పోలింగ్ స్వేచ్ఛగా జరుగుతుందని ప్రజల్లో స్థైర్యాన్ని నింపడంతో పాటు అసాంఘిక శక్తులకు చెక్ చెప్పడానికీ భారీ కసరత్తులు చేస్తారు. ఇందుకు ఉపకరించే ఫ్లాగ్‌మార్చ్‌లుగా పిలిచే కవాతులను పోలింగ్ ముగిసే వరకు నిర్వహించనున్నారు. కేంద్ర బలగాలతో కలిసి చేసే ఈ కవాతు ఆదివారం పాతబస్తీలో జరిగింది. ఇందులో నగర పోలీసు కమిషనరే స్వయంగా పాల్గొన్నారు. ‘12’లోగా పూర్తి పరిచయం... గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నగర కమిషనరేట్ నుంచి ఎన్నికల బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా 120 మంది అనుభవజ్ఞులైన ఇన్స్పెక్టర్లు బయటి జిల్లాలు, కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. ఈ స్థాయిలోనే బయటి నుంచి కొత్త అధికారులు వచ్చి నగరంలో రిపోర్ట్ చేశారు. మరోపక్క సిటీకి చెందిన వారైనా కొందరు తొలిసారిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇన్స్పెక్టర్ల పాత్ర బందోబస్తులో అత్యంత కీలకంగా మారుతుంది. తమ పరిధిలో ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి? ఎటు నుంచి అసాంఘికశక్తులు విరుచుకుపడే అవకాశం ఉంది? అనే అంశాలపై ఇన్స్పెక్టర్లకు పట్టుండాల్సిందే. అందుకే బదిలీపై వచ్చిన ప్రతి అధికారీ రెండుమూడు నెలల్లో ఈ అంశాల్ని తెలుసుకుంటారు. ఈసారి కొత్త ఇన్స్పెక్టర్లకు–ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి మధ్య ఎక్కువగా గడువు లేకపోవడంతో పాదయాత్రలు చేపట్టాలని సీపీ ఆదేశించారు. వచ్చే నెల 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో ఆ లోగా ఏరియా మొత్తం కాలినడకన తిరగడం, స్థానికులను పరిచయం చేసుకోవడం పూర్తి చేయాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇందుకు వాహనాలను వాడద్దని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను ఎస్హెచ్ఓలు ఎంత పక్కాగా చేశారనేది తెలుసుకోవడానికి ఆకస్మిక తనిఖీలకూ కొత్వాల్ నిర్ణయించారు. 12వ తేదీ తరవాత ఇన్స్పెక్టర్ కంటే పై స్థాయి అధికారులు, ఒక్కోసారి డీసీపీ ఆకస్మికంగా ఆయా ఇన్స్పెక్టర్లు పని చేస్తున్న ఠాణాలకు వెళ్తారు. దాని పరిధిలో ఉన్న ఓ ప్రాంతం పేరు చెప్పి నేరుగా తీసుకువెళ్లమని కోరతారు. అక్కడ స్థానికులతో ఇన్స్పెక్టర్ ఏర్పాటు చేసుకున్న సత్సంబంధాల్నీ తెలుసుకుంటారు. ఈ అంశాల్లో విఫలమైన వారిపై చర్యలు తప్పవని కొత్వాల్ స్పష్టం చేశారు. ఎన్నికల విధులపై సిబ్బందికిశిక్షణ ఇవ్వండి... ఎన్నికల విధులకు సంబంధించి ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులకు ఇప్పటికే పలు విడతల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మిగతా సిబ్బందికీ అవసరమైన మేర ప్రాథమిక శిక్షణ ఇవ్వాల్సిందిగా కమిషనర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు, భద్రత ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలను అతిక్రమిస్తున్న అభ్యర్థులు, పార్టీలపై చర్యలు తీసుకోవాలంటే ఎన్నికల నిబంధనలు, కోడ్ ఆఫ్ కాండక్ట్‌పై పోలీసులకు అవగాహన ఉండాల్సిందే. ఈ నేపథ్యంలోనే సదరు ప్రక్రియపై పక్కాగా సిబ్బందికి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ప్రతి చోటా బయటి ప్రాంతం నుంచి అదనపు బలగాలు వస్తుంటాయి. వీరితో పాటు స్థానిక అధికారులకూ బందోబస్తు, భద్రత ఏర్పాట్లపై ప్రత్యేకంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉండదు. అయితే... ఎన్నికల నియమాలు, ప్రవర్తనా నియమావళులతో మాత్రం అందరికీ అంతగా పరిచయం ఉండదు. ఉన్నతాధికారులకు కొంత పట్టున్నప్పటికీ కింది స్థాయి సిబ్బందికి మాత్రం శూన్యమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు ఎన్నికల విధుల్లో ఉండే ప్రతి పోలీసు సిబ్బందికీ ఈ నియమాలు, నిబంధనలపై అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే బుక్లెట్స్ సైతం ముద్రణ... ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళి తదితర అంశాలతో కూడిన కరపత్రాలు, బుక్లెట్స్ ముద్రించి పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు ఎన్నికల నిబంధనలు, నియమాల్లోకి అంశాలను తెలుగులోకి అనువదించి కరపత్రాలు ముద్రించాలని భావిస్తున్నారు. వీటిలో విధుల్లో ఉండే పోలీసులు చేయవల్సినవి, చేయకూడనివి సైతం ‘డూస్ అండ్ డోంట్స్’ పేరుతో ఉండేలా చూసుకోవాలని నిర్ణయించారు. నోటిఫికేషన్ జారీ కావడానికి ముందే ఈ అవగాహన కార్యక్రమాల ప్రక్రియ పూర్తి చేయాలనే ఉద్దేశంతో సన్నాహాలు చేస్తున్నారు. ఈ కృతువులో రెవెన్యూ విభాగం సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి దూద్‌బౌలి: ప్రతి పౌరుడు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం చార్మినార్ వద్ద దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నందున సిటీపోలీస్ ఆధ్వర్యంలో నగరంలోని 19 నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పాతబస్తీల ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసులు ప్రజలకు ఎంతో చేరువయ్యారని, ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలన్నారు. చార్మినార్ నుంచి ప్రారంభమైన ఈ ఫ్లాగ్ మార్చ్ రాజేశ్ మెడికల్ హాల్, హరిబౌలి, మొఘల్‌పురా, ఓల్టా హోటల్, దారుషిఫా గ్రౌండ్ వరకు సాగింది. ఈ మార్చ్‌లో ఆశ్విక దళాలతో పాటు ఆర్ఏఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్, స్థానిక సివిల్ పోలీసులు, ఉన్నతాధికారులు షికా గోయల్, దేవేంద్ర సింగ్ చౌహాన్, దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిశోర్ ఝా, ట్రాఫిక్ డీసీపీ బాబురావు, చార్మినార్ ఏసీపీ అంజయ్య, ఇన్స్పెక్టర్లు,అడిషనల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు తదితరులుపాల్గొన్నారు. -
టెలికాం దిగ్గజాలకు భారీ పెనాల్టీకి రంగం సిద్ధం
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలోని టెలికాం ఆపరేటర్లకు షాకిచ్చేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తుది కసరత్తు పూర్తి చేసింది. కాల్‌డ్రాప నిబంధనలు ఉల్లఘించిన కంపెనీలకు భారీ జరిమానా విధించేలా చర్యలు తుది దశకు చేరాయి. తాజా కాల్‌డ్రాప్ నిబంధనల ప్రకారం మార్చి త్రైమాసికంలో ఆపరేటర్లపై జరిమానా విధించేందుకు సిద్ధమవుతోంది. కొత్త నిబంధనల అమలులోకి వచ్చిన నాటినుంచి రెండు త్రైమాసిక అంచనాలు పూర్తయ్యాయని ట్రాయ్ వెల్లడించింది. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పెనాల్టీ విధించే క్రమంలో చివరి దశలో ఉన్నామని ట్రాయ్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ పిటిఐకి తెలిపారు. ఈ మేరకు ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. 21 రోజుల్లోగా ఆయా సంస్థలు సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే ఆపరేటర్ల పేర్లను వెల్లడి చేయాలని తాము భావించడం లేదన్నారు. మరోవైపు ట్రాయ్ కొత్త నెట్వర్క్ క్వాలిస్ ఆఫ్ సర్వీస్ (QoS) నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైనవని, పరిశ్రమలో టెలికాం ఆపరేటర్లు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమల సంస్థ కాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ అన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో, కొన్ని సర్కిళ్లలో అనేకమంది ఆపరేటర్లపై ఫిర్యాదులు స్వల్పంగా తగ్గాయన్నారు. ప్రధాన ఆపరేటర్లు కొత్త నిబంధనలకనుగుణంగా సేవలను అందిస్తున్నారని నమ్ముతున్నామని మాథ్యూస్ చెప్పారు. కాగా కాల్ డ్రాప్స్ నివారణ కోసం టెలికాం నెట్వర్క్ సంస్థలకు మార్గదర్శకాలను ట్రాయ్ విడుదల చేసింది. 2017 అక్టోబర్ 1 నుంచి టెలికాం ఆపరేటర్ల సేవా నాణ్యతపై ట్రాయ్ నిబంధనలను కఠినతరం చేసింది. వరుసగా 9నెలల పాటు ట్రాయ్ నిర్దేశించిన ప్రమాణాలు అందుకోలేని ఆపరేటర్లకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఫైన్ విధిస్తారు. నెట్వర్క్ తీరుకు అనుగుణంగానే లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించనున్నామని ట్రాయ్ వెల్లడించింది. కాల్ కట్ అయినా, అది నమోదు కాకుండా చూసుకునేందుకు టెలికాం ఆపరేటర్లు వినియోగిస్తున్నారని ఆరోపణలున్న రేడియో లింక్అవుట్ టెక్నాలజీ (ఆర్ఎల్టీ)కి ప్రమాణాలు నిర్దేశించిన సంగతి తెలిసిందే. -
ఐపీఎల్-12వ సీజన్ మార్చిలోనే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 (ఐపీఎల్ ) సంబరం అయిపోయింది. కానీ, ప్రేక్షకులు మాత్రం అప్పుడే వచ్చే ఐపీఎల్ గురించి చర్చలు మొదలుపెట్టారు. ఈసారి ఐపీఎల్-12వ సీజన్ ముందుగానే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వరల్డ్ కప్ కూడా 2019లోనే జరగనుంది. వచ్చే ఏడాది వరల్డ్ కప్‌తో పాటు.. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మార్చిలోనే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ మే 30 నుంచి ప్రారంభమవుతుంది. ఇండియా ప్లేయర్స్ నిబంధనల ప్రకారం ఒక టోర్ని అయిపోయినత తర్వాత మరో టోర్నీలో మ్యాచ్ ఆడటానికి కనీసం 15 రోజుల విరామం ఉండాలి. దీనిలో భాగంగానే ఐపీఎల్-12వ సీజన్ త్వరగానే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్‌లోని వేల్స్ వేదికగా 2019 మే 30 నుంచి జూలై 14 వరకు వరల్డ్ కప్ జరగనుంది. అయితే ప్రతి సంవత్సరం ఐపీఎల్ ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభమై మే నెల చివరి వారంలో ముగుస్తుంది. కానీ, ఈసారి మాత్రం ఐపీఎల్ మే మూడో వారంలోనే ముగించాలి. అలా అయితేనే ఇండియన్ ప్లేయర్స్‌కు వరల్డ్ కప్‌లో ఆడేందుకు 15 రోజుల గ్యాప్ లభిస్తుంది. ఈ విధంగా చూస్తే 2019లో మార్చి 29న ఐపీఎల్ -12వ సీజన్ ప్రారంభమతుందని సమాచారం. అంతేకాక ఐపీఎల్-12ను విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఎలక్షన్ సమయంలో మ్యాచ్‌లు నిర్వహిస్తే భద్రత కష్టమవతుంది. గతంలో కూడా 2009లో ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ను సౌతాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్-11వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కప్ కైవసం చేసుకున్న విషయం విదితమే. -
శాంతించిన టోకు ధరల ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2018 మార్చి నెలలో స్వల్పంగా శాంతించింది. డబ్ల్యూపీఐ డేటాను గణాంకాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. మార్చి నెలలో ఇది 8 నెలల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఫిబ్రవరిలో 2.48 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రేటు మార్చిలో స్వల్పంగా తగ్గి 2.47 శాతంగా నమోదైంది. జనవరిలో 2.84 శాతంగా వుండగా, గత ఏడాది మార్చినెలలో ఇది 5.11 శాతంగా ఉంది. ఆహారపదార్థాలు, ప్రత్యేకించి పప్పుధాన్యాలు, కూరగాయలు ధరలు చల్లబడటంతో టోకుధరల ద్రవ్యోల్బణం కూడా ఆ మేరకు దిగి వచ్చింది. ఏప్రిల్ 16, 2018 న విడుదల చేసిన ప్రభుత్వ డేటా ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం గత నెలలోని 0.88 శాతంతో పోలిస్తే మార్చి నెలలో 0.29 శాతానికి దిగివచ్చింది. ప్రైమరీ ఆర్టికల్స్ 0.79 శాతం నుంచి 0.24 శాతానికి, మ్యానుఫ్యాక్చరింగ్ 3.04 శాతం నుంచి 3.03 శాతానికి తగ్గాయి. కూరగాయల డిఫ్లేషన్ మార్చిలో 2.70 శాతంగా ఉంది. అయితే ఫ్యూయల్ అండ్ పవర్ ద్రవ్యోల్బణం మార్చిలో 4.70శాతానికి పెరిగింది. పెరిగింది, అంతకు ముందు నెలలో ఇది 3.81 శాతంగా ఉంది. -
రైతుల ర్యాలీలో సెల్ఫోన్ల చార్జింగ్ ప్రత్యేకం
సాక్షి, న్యూఢిల్లీ : నాసిక్ నుంచి ముంబైకి 35 వేల మంది తరలి రావడం ఎంత కష్టమో అంతమందికి వారం రోజులపాటు అన్న పానీయాలు ఏర్పాటు చేయడం కూడా అంత కష్టమే. ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేటి సమాజంలో సెల్ఫోన్లు వాడకుండా ఉండాలంటే కూడా ఎంతో కష్టం. వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో నేడు రైతులకు కూడా మొబైల్ ఫోన్ల వాడకం తప్పనిసరైందని తెల్సిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఫోన్లను చార్జింగ్ చేసుకోవడ ఎలా? దీనికి కూడా రైతులే పరిష్కారం కనుగొన్నారు. స్థానికంగా లభించే పలకలాంటి సోలార్ ప్యానెళ్లను వారు సెల్‌ఫోన్ ఛార్జింగ్‌కు ఉపయోగించారు. ఆ సోలార్ ప్యానెల్ ద్వారా ఒకే సారి నాలుగైదు సెల్ఫోన్లను చార్జింగ్ చేయవచ్చట. ఒక్కసారి చార్జి చేస్తే రెండు, మూడు గంటల వరకు ఫోన్ పనిచేస్తుందట. చాలా మంది రైతులు ఇలాంటి సోలార్ ప్యానెళ్లను తమ వెంట తెచ్చుకున్నారు. మండుటెండలో కాలినడకను వారం రోజులపాటు నడిచిన రైతులకు ఇంటివారితో మాట్లాడేందుకు ఫోన్లు అందుబాటులో ఉండడం ఎంతో ఉపశమనం కలిగించి ఉంటుంది. రైతుల ర్యాలీలో తలలపై చార్జింగ్ సోలార్ ప్యానెళ్లను పెట్టుకొని కొంత మంది రైతులు ప్రత్యేకంగా కనిపించారు. -
రైల్వే కీలక నిర్ణయం
-
రైల్వే శాఖ కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: గ్రీన్ ఇనీషియేటివ్‌లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే రిజర్వేషన్‌కు సంబంధించిన చార్ట్‌ను ఇకపై రైల్వే కోచ్‌లపై అతికించడాన్ని నిలిపివేయనుంది. మార్చి 1వ తేదీ నుంచి ఈ పద్ధతిని నిలిపివేస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటికే న్యూఢిల్లీ, హజరత్ నిజాముద్దీన్, ముంబయ్ సెంట్రల్, చెన్నై సెంట్రల్ రైల్వే, సీల్దా స్టేషన్లో గత మూడు నెలలుగా ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీనిని ఏ1, ఏ రైల్వేస్టేషన్లలో ఫైలెట్ ప్రాజెక్టుగా ఆరు నెలలపాటు చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ప్రపంచంలోని అతి పెద్ద నెట్వర్క్ భారతీయ రైల్వే పేపర్‌కోసం అవుతున్న డబ్బును ఆదా చేయాలని లక్ష్యంగాపెట్టుకుంది. ఇప్పటికే ఈ పద్ధతిని అమలు చేస్తున్నప్పటికీ ఇప్పుడు అన్ని రైల్వేలలో ఆరు నెలలపాటు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రిజర్వేషన్ చార్ట్‌లకు బదులుగా డిజిటల్ బోర్డులను రైల్వేస్టేషన్లో మెరుగు పరుస్తామని రైల్వే శాఖ తెలిపింది. డిజిటలైజేషన్లో భాగంగా ఇ-టికెటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగిత రహిత కార్యకలాపాలను ప్రోత్సహించాలనే యోచనలో భాగంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో సంవత్సరానికి 28టన్నుల పేపర్‌ను ఆదా చేయడంతో పాటు రూ.1.70లక్షల ఖర్చును ఆదా చేయాలని భావిస్తోంది. కాగా ప్రయాణీకుల నుంచి వచ్చే ఆదాయం ఆధారంగా, రైల్వేలు దాని స్టేషన్లను ఏ, ఏ1, బీ,సీ,డీ, ఈ, ఎఫ్ మొత్తం 7 కేటగిరీలుగా విభజించింది. ఇందులో 17 జోన్లు ఉన్నాయి. -
మార్చి 28న తెలంగాణలో ఇంటర్ పరీక్షలు
-
మార్చి 8న ఏపీ బడ్జెట్!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. సప్తమి పర్వదినం సందర్భంగా మార్చి 8వ తేదీన (గురువారం) ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో బడ్జెట్ సమర్పిస్తారు. -
మైనింగ్ కంపెనీలకు షాకిచ్చిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: గోవాలోని మైనింగ్ కంపెనీలకు సుప్రీంకోర్టు భారీ షాక్ఇచ్చింది. గోవాలో అన్ని ఖనిజాల తవ్వకాలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెల్లడించింది. పర్యావరణ ఉల్లంఘనల నేపథ్యంలో ఇనుప ఖనిజం గనుల లీజును రద్దు చేస్తూ బుధవారం తీర్పునిచ్చింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్సు పొందిన తరువాత మాత్రమే కొత్త లీజుకు అనుమతిని ఇవ్వాలని కోర్టు పేర్కొంది. మార్చి 15 నుంచి లీజింగ్ ఆపరేషన్లు నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే తాజా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్నికోరింది. గోవా ఫౌండేషన్ (ఎన్జీవో) దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన సుప్రీం తాజా ఆదేశాలిచ్చింది. జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస దీపక్ గుప్త ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ గనుల తవ్వకంపై రెన్యువల్ రెండవ దశలో గోవా ప్రభుత్వం అనుమతినిచ్చిన లైసెన్సులను అన్నింటిని రద్దు చేసింది. దాదాపు 88 మైనింగ్ లీజులను సుప్రీం రద్దు చేసింది. మార్చి 16 తరువాత మైనింగ్ చేయడానికి వీల్లేదని మైనింగ్ కంపెనీలను అందేశించింది. అలాగే కొత్త బిడ్డింగ్ నిర్వహించాలని చెప్పింది. కాగా 2012,అక్టోబరు లో రాష్ట్రంలో మైనింగ్ లీజ్‌లను సుప్రీం కోర్టు సస్పెండ్ చేసింది, జస్టిస్ ఎంబీ షా కమిషన్ సమర్పించిన నివేదికను అనుసరించి, లక్షలాది టన్నుల ఇనుప ఖనిజం చట్టవిరుద్ధంగా తవ్వినట్లు గుర్తించింది. కాగా 2015 లో, అక్రమ మైనింగ్ ఆరోపణలున్న అదే హోల్డర్లకు గోవా ప్రభుత్వం గనుల తవ్వకానికి దాదాపు 20 సంవత్సరాల పాటు అనుమనితిచ్చింది. గనుల లీజుల ఆలస్యంతో రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టాన్ని కలిగించారనే ఆరోపణలతో ఇటీవల గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు దిగంబర కామత్‌పై గోవా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్
సాక్షి, ముంబై: బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె సైరన్ మోగించనున్నారు. వేతన సవరణను డిమాండ్ చేస్తూ యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్లు (యుఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో బ్యాంకర్లు ఈ సమ్మెకు దిగనున్నారు. భారత బ్యాంకింగ్ రంగంలోని తొమ్మిది యూనియన్లు మార్చి 15 వ తేదీన సమ్మె చేసేందుకు నిర్ణయించామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం చెప్పారు. నవంబర్ 2017 నాటి పే రివిజన్ పెండింగ్‌లో ఉందని, దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోరాటానికి దిగనున్నామని చెప్పారు. అలాగే యూనియన్ ఆధ్వర్యంలో ఇతర నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్టు వెల్లడించారు. మంగళవారం ముంబయిలో జరిగిన యుఎఫ్‌బీయూ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. -
టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ భారీ ర్యాలీ
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి వాస్తవాలు మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా?, ప్రశ్నిస్తే సహించలేరా?, మిత్రధర్మం అంటే ఇదేనా? అని టీడీపీని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. టీడీపీకి వ్యతిరేకంగా గుంటూరులో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టీడీపీ నాయకులు చేసిన విమర్శలను ఖండించారు. టీడీపీ వైఖరికి నిరసగా ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయారని వీర్రాజు ఆరోపించడంతో ఆయనపై టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. మా పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీగా గెలిచి మమ్మల్నే విమర్శిస్తావా అంటూ ఆందోళనలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సోమవారం విజయవాడలోని టీడీపీ జిల్లా కార్యాలయం ఎదురుగా సోము వీర్రాజు ఫ్లెక్సీని మహిళల చేత చెప్పులతో కొట్టించిన అనంతరం దహనం చేశారు. కాగా, తనను ఇబ్బంది పెట్టేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని సోము వీర్రాజు ఆరోపించారు. ఏపీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తున్న నిధులన్నీ కేంద్రం ఇచ్చినవేనని, అలాంటప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. -
70వ రోజు పాదయాత్ర డైరీ
-
70వ రోజు పాదయాత్ర డైరీ
ఉదయం శిరసనంబేడు దాటి కాస్త ముందుకెళ్లగానే.. నడవలేక నడవలేక నాకేసి వస్తున్న ఓ అవ్వ కనిపించింది. నడుం పూర్తిగా వంగిపోయి, చేతికర్ర సాయంతో ఎంతో కష్టంగా వచ్చిన ఆ అవ్వను చూడగానే కదిలిపోయాను. ఆ అవ్వ నావద్దకు వచ్చి నా చెంపను తడిమింది. ఏం కావాలవ్వా.. అని అడిగాను. ‘నాకేమీ వద్దు నాయనా.. నువ్వు ముఖ్యమంత్రివై మా ఊరికి రావాలి.. అదే చాలు’ అని దీవించింది. ‘నీలో నాన్నను చూసుకుంటున్నానయ్యా’ అంటూ ఎంతో మురిసిపోయింది. 80 ఏళ్లు పైబడిన ఆ అవ్వ చూపించిన ఆప్యాయతకు, ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను.? చావలి దాటాక, హైవేపై నడుస్తున్నప్పుడు.. దారి పక్కనే చాలా ఇటుక బట్టీలు కనిపించాయి. చాలామంది కూలీలు, మహిళలు నన్ను చూడాలని పరుగు పరుగున వచ్చారు. వారితోపాటు చిన్నచిన్న పిల్లలు కూడా పరుగులెడుతూ ఆతృతగా వచ్చి నన్ను కలిశారు. ఆ పిల్లలంతా మట్టికొట్టుకుని ఉన్నారు. తలలు మాసిపోయాయి. బట్టలు మాసిన చిరుగుపాతలు. ఆ పిల్లలను దగ్గరకు తీసుకుని వారి చేతులు తడిమాను. ఆ అరచేతులు కాయలు కాసి ఉన్నాయి. ఏమైందమ్మా.. అని వారి తల్లులను అడిగాను. ఆ పిల్లలు కూడా ఇటుక బట్టీలలో పనిచేస్తున్నారట. పలకాబలపం పట్టాల్సిన చిట్టిచేతులు మట్టితట్టలు మోయాల్సి వస్తో్తందని తెలిసి కలతచెందాను. ఆటపాటలతో, చదువులతో వెల్లివిరియాల్సిన బాల్యం ఇటుక బట్టీలలో వాడిపోతోందని తెలిసి చాలా బాధపడ్డాను. పిల్లలను బడులకు పంపించాలమ్మా.. అని అనగానే.. ‘తినడానికే లేదు. ఇక చదువులెక్కడ సార్.. మాకూ చదివించుకోవాలనే ఉంది. కానీ బడికెట్లా పంపం?’ అన్నారు. ఇలాంటి తల్లుల కోసమే నవరత్నాలలో పొందుపర్చిన అమ్మఒడి పథకం గురించి వివరించాను. పిల్లలను బడికి పంపితే ఆ తల్లులకు సంవత్సరానికి రూ.15,000 ఇస్తానని చెప్పాను. అది విన్నాక తమ పిల్లల్ని ఇబ్బందుల్లేకుండా బాగా చదివించుకునే రోజులు రానున్నాయన్న ఆనందం వారిలో కనిపించింది. ఆ పిల్లలను పెద్ద చదువులు చదివించి, గొప్ప స్థానాల్లో చూడాలన్న నా ఆశయాన్ని తెలియజేసినప్పుడు ఆ తల్లుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. భోజన విరామానికి ముందు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతినిధులు కలిశారు. చంద్రబాబు వారినెలా మోసం చేశాడో చెప్పారు. నాన్నగారి హయాంలో 13 వేల దేవాలయాలకు ధూప దీప నైవేద్యాల కింద రూ.2,500 ఇచ్చేవారు. బాబుగారు ఆ దేవాలయాల సంఖ్యను మూడు వేలకు కుదించివేశాడు. ఎన్నికలప్పుడు ఓట్లకోసం.. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి రూ.500 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ కార్పొరేషన్‌కు ఇస్తానన్న నిధులు ఇవ్వకపోగా, అన్యాయాన్ని ప్రశ్నించిన సదరు కార్పొరేషన్ చైర్మన్‌ను రాత్రికిరాత్రి అవమానకరంగా తొలగించి, కార్పొరేషన్‌ను చంద్రబాబు నిర్వీర్యం చేశారని వాపోయారు. మంచి పథకాలకు తూట్లు పొడవడం, అబద్ధపు హామీలతో నెట్టుకురావడం బాబుగారికి ఉగ్గుపాలతో పెట్టిన విద్యమరి. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్నికలకు ముందు ఓట్లకోసం అన్ని కులాలకూ తాయిలాలు ప్రకటించి, బూటకపు హామీలిచ్చి, అవసరం తీరాక వాటిని తీర్చకపోగా.. ప్రశ్నించిన కుల సంఘాలను బెదిరించడాన్ని ఏమనుకోవాలి? అది దేనికి సంకేతం? అదే మీ నైజమా? -
ఇతరుల ఆధార్‌తో మొబైల్ కనెక్షన్లు
విశిష్ట గుర్తింపు సంఖ్య భద్రత ప్రశ్నార్థకం ► వివరాలు తస్కరిస్తున్న అక్రమార్కులు ► ఇష్టారాజ్యంగా దుర్వినియోగం ► ఇతరుల ఆధార్‌తో మొబైల్ కనెక్షన్లు ► ఢిల్లీలో ఓ మహిళ ఆధార్ నంబర్‌తో ► 9 బోగస్ మొబైల్ కనెక్షన్లు ► ట్వీటర్లో పోస్టు చేయడంతో కలకలం ► వేలాదిగా స్పందించిన నెటిజన్లు ► అలా జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయండి: యూఐడీఏఐ సాక్షి, హైదరాబాద్ : ఆర్.డి.ప్రియా.. ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఉంటారామె.. తన మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు కొద్దిరోజుల కిందట ఎయిర్టెల్ స్టోర్‌కు వెళ్లింది.. కానీ అప్పటికే ఆమె ఆధార్‌తో ఏకంగా 9 మొబైల్ కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయని అక్కడి సిబ్బంది చెప్పడంతో ప్రియా షాక్‌కు గురైంది! ఆధార్ వివరాలు ఏమాత్రం బయటకు వెళ్లే అవకాశం లేదని, అత్యంత పకడ్బందీగా పరిరక్షిస్తున్నామని కేంద్రం చెబుతున్న మాటల్లోని డొల్లతనం ఈ ఉదంతంతో మరోసారి బయటపడింది! ఆధార్ గోప్యతపై అనేక అనుమానాలను రేకెత్తించింది. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని వివరిస్తూ ప్రియా తాజాగా ట్వీటర్లో చేసిన పోస్టు కలకలం రేపుతోంది. వాస్తవానికి ఆమె గత 18 ఏళ్ల నుంచి ఒకే మొబైల్ నంబర్‌ను వినియోగిస్తోంది. ఇప్పటివరకు ఆ నంబర్‌తో సహా ఏ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయలేదు. తీరా ఇప్పుడు అనుసంధానం చేసేందుకు వెళ్లగా 9 కనెక్షన్లు లింక్ అయి ఉన్నాయని చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ‘ఇది నా జీవితంలో అతిపెద్ద షాక్’అంటూ ఐదు రోజుల కింద ఆమె ట్వీటర్లో పేర్కొంది. వేలాది మంది ఆమె ట్వీట్‌ను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు తెరదీసింది. ఆధార్‌తో పౌరుల వ్యక్తిగత సమాచారానికి భంగం వాటిల్లుతోందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సిమ్ కార్డు జారీ లేదా ఇప్పటికే వినియోగిస్తున్న మొబైల్ నంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేసే సమయంలో టెలికం కంపెనీలు వినియోగదారుల వేలి ముద్రల(బయోమెట్రిక్)ను స్కాన్ చేసి ఆధార్ డేటాతో సరిపోల్చి చూసుకుంటాయి. అయితే తాజా ఘటనలో బాధితురాలికి సంబంధించిన బయోమెట్రిక్ డేటాతో నిర్ధారించుకోకుండానే టెలికం కంపెనీలు ఆమె ఆధార్ నంబర్‌తో 9 మొబైల్ కనెక్షన్లు ఎలా జారీ చేశాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక ఆధార్ నంబర్‌పై గరిష్టంగా 6 మొబైల్ కనెక్షన్లు మాత్రమే జారీ చేయాలని ట్రాయ్, డీఓటీ నిబంధనలు చెబుతుండగా.. 9 కనెక్షన్లు ఎలా జారీ అయ్యాయన్నది అర్థం కాని ప్రశ్నగా మారింది. అలా చేస్తే ఫిర్యాదు చేయండి ఈ వివాదం తీవ్రం కావడంతో ఆధార్ కార్డులను జారీ చేస్తున్న భారతీయ విశిష్ట గుర్తింపు యాజమాన్య సంస్థ (యూఐడీఏఐ)తోపాటు ఎయిర్టెల్ స్పందించింది. బాధితురాలు ప్రియాతో ట్వీటర్లో సంప్రదింపులు జరిపాయి. తమ ఆధార్ నంబర్‌తో ఎన్ని మొబైల్ కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయో తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని యూఐడీఏఐ పేర్కొంది. తమ ఆధార్ నంబర్‌తో మొబైల్ కంపెనీలు మోసపూరితంగా సిమ్‌కార్డులు జారీ చేస్తే ట్రాయ్, లేదా డీఓటీలకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. మరోవైపు బాధితురాలిని ‘సాక్షి’ట్వీటర్లో పలకరించగా.. ఈ ఘటనపై ఇంకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని వివరించింది. తనకు పూర్తి సమాచారం ఇస్తానని ఎయిర్టెల్ హామీ ఇచ్చిందని, కొద్దిరోజులు వేచి చూసి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది. భద్రతకు ఏదీ భరోసా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు, కార్యక్రమాలకు ఆధార్‌ను తప్పనిసరి చేశాయి. రేషన్ కార్డులు, బ్యాంక్ ఖాతా, గ్యాస్ కనెక్షన్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపకార వేతనాలు, స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఎరువులు, పాస్‌పోర్టు, సామాజిక పింఛన్లు, సంక్షేమ పథకాలు.. ఇలా ప్రతి అవసరానికి ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని తీసుకుంటున్నారు. అయితే వాటిని పకడ్బందీగా సంరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కార్యాలయాల్లో పని చేసే కొంతమంది సిబ్బంది లబ్ధిదారుల ఆధార్ జిరాక్స్ ప్రతులను తస్కరించి తమ సొంత అవసరాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని చాలాకాలంగా ఆరోపణలున్నాయి. ప్రధానంగా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల లబ్ధి కోసం రాష్ట్రంలో ఏటా లక్షల మంది విద్యార్థులు తమ దరఖాస్తులతో పాటు ఆధార్ ప్రతిని జత చేస్తున్నారు. స్కాలర్షిప్లు జారీ చేసే సంక్షేమ శాఖలు, విద్యా సంస్థల కార్యాలయాల్లో విద్యార్థుల దరఖాస్తులను కుప్పలు తెప్పలుగా పడేస్తుండడంతో వారి ఆధార్ గుర్తింపు ప్రమాదంలో పడింది. లింక్‌కు మార్చి 31 వరకు గడువు ప్రతి మొబైల్ ఫోన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను కేంద్రం చేపట్టింది. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు తమ వినియోగదారుల మొబైల్ ఫోన్ నంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు వచ్చే మార్చి 31 వరకు గడువు పొడిగిస్తూ టెలికం శాఖ ట్రాయ్ నోటిఫికేషన్ జారీ చేశాయి. వినియోగదారులు టెలికాం కంపెనీ స్టోర్‌కు వెళ్లినప్పుడు తమ ఆధార్ నంబర్‌తో ఇంకా ఏమైనా మొబైల్ కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయా? అన్న విషయాన్ని అడిగి తెలుసుకోవచ్చు. ఒకవేళ తమకు సంబంధం లేని మొబైల్ కనెక్షన్లు లింక్ అయి ఉంటే తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ట్రాయ్ అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ఆధార్ వినియోగాన్నిఇలా తెలుసుకోవచ్చు https://resident.uidai.gov.in/notification-aadhaar వెబ్సైట్ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ.. ఇప్పటివరకు ఎక్కడెక్కడ తమ ఆధార్ నంబర్ వినియోగమైందన్న సమాచారం తెలుసుకోవచ్చు. 12 అంకెల ఆధార్ గుర్తింపు నంబర్, సెక్యూరిటీ కోడ్(వెబ్సైట్లోనే ఉంటుంది)ను ఎంటర్ చేయగానే, ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్‌కు వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే ఆధార్ వినియోగ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. -
పథకాలకు ‘ఆధార్’ గడువు మార్చి 31
న్యూఢిల్లీ: అన్ని రకాల సంక్షేమ పథకాలు, సేవలకు ఆధార్ నంబరును అనుసంధానించేందుకు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. మొబైల్ నంబర్లకు ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు ఫిబ్రవరి 6ను చివరి తేదీగా ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునివ్వడం తెలిసిందే. తాజాగా ఆ తీర్పులో కూడా మార్పులు చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్.. మొబైల్–ఆధార్ అనుసంధానానికి గడువును మార్చి 31 వరకు పొడిగించింది. బ్యాంకు ఖాతా తెరిచేవారు మొదట్లోనే తమ ఆధార్ నంబరును బ్యాంకు వారికి సమర్పించాల్సిన అవసరంలేదని పేర్కొంది. ఆధార్ నంబరు లేకుంటే ఆధార్ కోసం దరఖాస్తు చేశారనే రుజువును బ్యాంకుకు చూపించాలని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే పాన్ కార్డుకు దరఖాస్తు చేయడానికి, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి మాత్రం కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందేనంది. ఆధార్ పథకాన్నే సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై జనవరి 17 నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారణను ప్రారంభిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. సంక్షేమ పథకాలకు, సేవలకు ఆధార్‌ను అనుసంధానించేందుకు గడువును పొడిగించవచ్చంటూ అటార్నీ జనరల్ వేణుగోపాల్ అత్యున్నత న్యాయస్థానానికి గురువారం తెలిపిన అనంతరం కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. -
ఆధార్-పాన్ అనుసంధానంపై గుడ్‌న్యూస్
సాక్షి న్యూఢిల్లీ: ఆధార్ గుర్తింపు కార్డుతో పాన్ కార్డు అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. మరికొద్ది రోజుల్లో ముగియనున్న ఈ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది (2018)మార్చి 31 వరకు పొడగిస్తూ ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. లింక్ చేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు గడువును మార్చి 31, 2018 వరకు పొడిగించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్,పాన్ లింకింగ్ గడువును 2018, మార్చి 31 వరకు పెంచుతున్నట్టుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. కాగా ఆదాయపు పన్ను దాఖలుకోసం శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఆధార్ నంబర్ జతచేయడాన్ని తప్పని సరి చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్-పాన్ లింకింగ్ ప్రస్తుత గడువు ఈ డిసెంబర్ 31తో ముగుస్తున్న సంగతి తెలిసిందే. CBDT extends date till 31.3.18 for linking of Aadhaar with PAN https://t.co/5mLiy2sf6b — Ministry of Finance (@FinMinIndia) December 8, 2017 -
మార్చి 31 వరకు ఆధార్ గడువు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు, ఇతర సేవలకు ఆధార్ అనుసంధానం చేసే గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. గతంలో ఆధార్ లేనివారికే అనుసంధాన గడువును మార్చి 31 వరకు పొడిగిస్తామని కోర్టుకి చెప్పిన కేంద్రం ఇప్పుడు అందరికీ గడువును మార్చి 31 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఆధార్‌తో మొబైల్ నంబర్ల అనుసంధానానికి ఫిబ్రవరి 6వ తేదీతో గడువు ముగియనుందని పేర్కొంది. ఆధార్ పథకాన్ని వ్యతిరేకించడంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న ఆధార్ నమోదు కార్యక్రమంపై స్టే విధించాలంటూ సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ వాదనలు జరిపింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు విన్పిస్తూ.. కొన్ని ఏళ్లుగా అమలవుతున్న ఆధార్ పథకంపై ఎటువంటి స్టే విధించరాదని, డిసెంబర్ 31తో ముగుస్తున్న ఆధార్ అనుసంధానం గడువును కేంద్రం పొడిగించనున్నట్లు కోర్టుకి తెలిపారు. పెళ్లయితే మతం మారదు అన్య మతస్తుడిని పెళ్లాడితే మహిళ మతం మారిపోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్శి మహిళ వేరే మతస్తుడిని వివాహమాడితే ఆమె మత గుర్తింపు మారుతుందా? అన్న కేసును సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ‘ ఇతర మతస్తుడిని పెళ్లి చేసుకున్న తరువాత సదరు మహిళ తన పుట్టింటి మతాన్ని కోల్పోతుందని చెప్పే చట్టాలేం లేవు. పైగా ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం...ఇద్దరు దంపతులు తమ సొంత మతాలనే ఆచరించొచ్చు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. లాయర్ల ‘అల్లరి’పై సీరియస్ ఇటీవల జరిగిన కొన్ని ప్రముఖ కేసుల విచారణ సందర్భంగా సీనియర్ లాయర్లు గట్టిగా అరవడం, వాగ్వాదానికి దిగి జడ్జీలను బెదిరించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు హాల్లో అరుపులు, కేకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమంది. బాబ్రీ మసీదు , ఢిల్లీ ప్రభుత్వం–కేంద్రం వివాదాల విచారణ సమయంలో సీనియర్ లాయర్ల మితిమీరిన ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయోధ్య కేసు విచారణను 2019 జూలై వరకు వాయిదా వేయాలని కోరుతూ సీనియర్ లాయర్లు కపిల్ సిబల్ తదితరులు మొండి పట్టుదలకు పోవడం తెలిసిందే. ‘లాయర్లను న్యాయ పరిరక్షకులుగా భావిస్తారు. కొందరు లాయర్లు తాము గళమెత్తి న్యాయ వ్యవస్థతోనే వాగ్వాదానికి దిగగలమని అనుకుంటున్నారు. గట్టిగా అరవడం వారి అసమర్థత, అపరిపక్వతనే సూచిస్తుంది’ అని బెంచ్ పేర్కొంది. విడిగా ఉన్న భార్యకూ భరణం విడాకులు తీసుకున్న భార్య తరహాలోనే చట్టబద్ధంగా విడిగా ఉంటున్న భార్యకు ఆమె భర్త భరణం చెల్లించాల్సిందేనని సుప్రీం ఆదేశించింది. విడిగా ఉంటున్న భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ సుప్రీంను ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు బెంచ్ ఈ తీర్పునిచ్చింది. నెలకు రూ.4 వేలు భరణం చెల్లింపును నిరాకరించడానికి హైకోర్టు చూపిన కారణాలు సహేతుకంగా లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హైకోర్టుకు సూచించింది. -
భారత్ ఆ స్టేటస్ కోల్పోయింది
నోటు రద్దు ప్రభావం ఇంకా జీడీపీ వృద్ధిరేటుకు తగలుతూనే ఉంది. జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు మందగించింది. దీంతో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ స్టేటస్ ను కూడా భారత్ కోల్పోయింది. ఈ క్వార్టర్ లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతంగానే నమోదైంది. బుధవారం విడుదల చేసిన ప్రభుత్వ డేటాలో ఈ విషయం వెల్లడైంది. ఇదే క్వార్టర్ లో చైనా జీడీపీ వృద్దిరేటు 6.9 శాతంగా ఉంది. గత క్వార్టర్ లో కూడా ప్రొవిజనల్ 7.0 శాతంగా భారత వృద్దిరేటు ఉంది. రాయిటర్స్ పోల్ ప్రకారం ఈ క్వార్టర్ లో వృద్ధిరేటు 7.1 శాతంగా ఉంటుందని అనాలిస్టులు అంచనావేశారు. కానీ అంచనాలు సైతం తప్పాయి. అంతేకాక నేడు విడుదలైన ఈ డేటా స్ట్రీట్ అంచనాలను నిరాశపరచనున్నట్టు విశ్లేషకులు చెప్పారు. ఇటీవలే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లను పూర్తిచేసుకుంది. ఈ సమయంలో జీడీపీ వృద్ధిరేటు నిరాశపరుస్తూ వచ్చింది. ప్రధాని నవంబర్ లో తీసుకున్న నోట్ల రద్దు ప్రభావం జీడీపీ గణాంకాలపై ఇంకా ప్రభావం చూపుతూనే ఉందని విశ్లేషకులు చెప్పారు. 2016-17కు సంబంధించిన మొత్తం ఏడాదిలో కూడా వృద్ధిరేటు 7.1 శాతంగా ఉంది. ఇది ప్రభుత్వ అధికారులు అంచనాలకు అనుగుణంగానే వచ్చింది. భారత జీడీపీ వృద్దిరేటు వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో సుమారు 8 శాతం పెరుగుతుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసు అంచనావేసింది. 2018లో 7.7 శాతం నమోదవుతుందని పేర్కొంది. స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వం అమలుచేయబోతున్న అతిపెద్ద సంస్కరణ జీఎస్టీ, వృద్దిరేటును 2 శాతం పెంచుతుందని ఆర్థికవేత్తలంటున్నారు. మార్చి క్వార్టర్ లో వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో వృద్ధిరేటు 5.2 శాతం కాగ, మైనింగ్, క్వారింగ్ లో 6.4 శాతం వృద్ధి ఉన్నట్టు ప్రభుత్వ డేటా పేర్కొంది. తయారీ 5.3 శాతం, విద్యుత్, గ్యాస్, మంచినీళ్ల సరఫరా, ఇతర వినియోగ సేవలు 6.1 శాతం, వాణిజ్యం, రవాణా, సమాచారం 6.5 శాతం, ఆర్థికరంగం, రియల్ ఎస్టేట్, నిపుణులు సేవలు 2.2 శాతం, డిఫెన్స్, ఇతర సేవలు 17 శాతంగా వృద్ధి చెందాయి. చీఫ్ గణాంకాల అధికారి టీసీఏ అనంత్ ఈ సీఎస్ఓ డేటాను విడుదల చేశారు. -
ఐటీసీ ఆకర్షణీయ ఫలితాలు
⇔ మార్చి క్వార్టర్లో లాభం రూ.2,669 కోట్లు ⇔ 12 శాతం వృద్ధి... అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు ⇔ రూ.4.75 డివిడెండ్ న్యూఢిల్లీ: ఐటీసీ మార్చి క్వార్టర్‌తోపాటు, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెరుగైన ఫలితాలను వెల్లడించింది. అగ్రి కమోడిటీలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు అధికమయ్యాయి. దీంతో మార్చి త్రైమాసికంలో కంపెనీ లాభం 12 శాతం అధికంగా రూ.2,669.47 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.2,380.68 కోట్లు మాత్రమే. ఆదాయం సైతం 6 శాతం పెరిగి రూ.15,009 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న ఆదాయం రూ.14,139 కోట్లు. ఎఫ్ఎంసీజీ విభాగం, సిగరెట్ల ద్వారా ఆదాయం 5 శాతం పెరిగి రూ.11,256 కోట్ల నుంచి రూ.11,840 కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా సిగరెట్ల ద్వారా ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.8,955 కోట్లుగా నమోదైంది. ఇతర ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ద్వారా ఆదాయం 6.45 శాతం పెరుగుదలతో రూ.2,886 కోట్లకు చేరింది. పండ్ల రసాలు, డైరీ, చాక్లెట్లు, కాఫీ తదితర విభాగాల్లో ముడి సరుకుల ధరలు పెరగడం, అప్పెరల్ విభాగంలో డిస్కౌంట్ల కారణంగా ఇతర ఎఫ్ఎంసీజీ విభాగం ఫలితాలపై ప్రభావం చూపినట్టు ఐటీసీ తెలిపింది. ఐటీసీ హోటల్ వ్యాపార ఆదాయం సైతం 6.48 శాతం వృద్ధితో రూ.386 కోట్లు, అగ్రి ఉత్పత్తుల ద్వారా ఆదాయం 6 శాతం పెరుగుదలతో రూ.1,918 కోట్లు... పేపర్బోర్డుల ద్వారా ఆదాయం రూ.4.38 శాతం వృద్ధితో రూ.1,372 కోట్లుగా నమోదైంది. మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఐటీసీ రూ.10,447 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది. 2015–16 ఆర్థిక సంవ్సరంలో వచ్చి రూ.9,500 కోట్లతో పోలిస్తే 10.27 శాతం వృద్ధి నమోదైంది. అమ్మకాలు 6.66 శాతం పెరుగుదలతో రూ.55,061 కోట్ల నుంచి రూ.58,731 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.4.75 డివిడెండ్‌ను కంపెనీ సిఫారసు చేసింది. -
స్ట్రీట్ అంచనాలను బద్దలు కొట్టిన రిలయన్స్
న్యూఢిల్లీ : ఆయిల్ నుంచి టెలికాం వరకు వ్యాపారాల్లో హవా చాటుతున్న రిలయన్స్ ఇంటస్ట్రీస్, స్ట్రీట్ అంచనాలు మరోసారి అంచనాలను బద్దలు కొట్టింది. ఏడాది ఏడాదికి కంపెనీ కన్సాలిడేట్ నికర లాభాలను 11.54 శాతం పెంచుకుంది. మార్చితో ముగిసిన క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.8,055కోట్లగా నమోదైనట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో కంపెనీ నికర లాభాలు రూ.7,220 కోట్లగానే ఉన్నాయి. ఏడాది ఏడాదికి కంపెనీ లాభాల వృద్ధి నమోదుచేయడం ఇది వరుసగా తొమ్మిది క్వార్టర్. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు కూడా కంపెనీకి ఒక్కో బ్యారెల్‌కు 11.5 డాలర్లగా ఉన్నాయి. ఈటీ నౌ అంచనాల ప్రకారం ఇవి 10.4 డాలర్లే ఉంటాయని తెలిసింది. స్టాండలోన్ మార్జిన్లు కూడా కంపెనీకి 17 శాతం పెరిగినట్టు వెల్లడైంది. నిర్వహణల నుంచి వచ్చిన రెవెన్యూలు ఈ క్వార్టర్ లో 12 శాతం పెరిగి రూ.74,598 కోట్లగా నమోదైనట్టు ప్రకటించింది. గత క్వార్టర్ లో ఇది రూ.66,606 కోట్లగానే ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈబీఐటీడీఏలు ఏడాది ఏడాదికి 17 శాతం పెరిగి, 12,416 కోట్లగా రికార్డైనట్టు వెల్లడించింది. సీఎన్‌బీసీ-టీవీ18 అంచనాల ప్రకారం కంపెనీ లాభాలు 8000 కోట్లగా, నిర్వహణ లాభాలు 11,485 కోట్లగా నమోదవుతాయని తెలిసింది. కానీ వారి అంచనాలను రిలయన్స్ బద్దలుకొట్టింది. వచ్చే నెలల్లో జియో నెట్ వర్క్ కోసం లక్ష టవర్లను ఏర్పాటుచేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. మార్చితో ముగిసిన క్వార్టర్‌కు జియో సబ్ స్క్రైబర్ బేస్ 108.9 మిలియన్లను తాకినట్టు కూడా కంపెనీ వెల్లడించింది. మరోవైపు స్టాక్ విలువ 1.19 శాతం పెరిగి, 4.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ అవతరించింది. ఐటీ దిగ్గజం టీసీఎస్ ను ఇది అధిగమించింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం మార్కెట్ల ముగింపుకు 4.58 లక్షల కోట్లగా ఉంది. -
మార్చిలో తగ్గిన ధరల వేగం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో ఫిబ్రవరితో పోలిస్తే తగ్గింది. 2017 ఫిబ్రవరిలో 6.55 శాతంగా ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం (2016 ఫిబ్రవరి టోకు ధరల బాస్కెట్‌తో పోల్చితే) 2017 మార్చిలో 5.7 శాతానికి తగ్గింది. 2016 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం అసలు పెరక్కపోగా –0.45 క్షీణతలో ఉంది. ప్రధాన విభాగాలను వేర్వేరుగా చూస్తే... పైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 4.63 శాతంగా ఉంది. ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 3.12 శాతంగా ఉంది. నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణం 4.91 శాతంగా ఉంది. సూచీలో ఈ విభాగం వెయిటేజ్ దాదాపు 20 శాతం. ఆహార విభాగంలో కూరగాయల ధరలు 5.70 శాతం పెరిగాయి. పండ్ల ధరలు 7.62 శాతం ఎగశాయి. గుడ్లు, మాంసం, చేపలు 3.12 శాతం పెరిగాయి. ► ఫ్యూయెల్ అండ్ పవర్: మార్చిలో ద్రవ్యోల్బణం 18.16 శాతంగా ఉంది. సూచీలో ఈ విభాగం వెయిటేజ్ 20 శాతం. ఫిబ్రవరిలో ఈ రేటు 21.02 శాతం. ► తయారీ: సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 2.99 శాతంగా ఉంది. మార్చిలో ఈ రేటు 3.66 శాతంగా ఉంది. -
దిగి వచ్చిన టోకు ధరల సూచీ..
న్యూఢిల్లీ: మార్చి నెల టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) దిగివచ్చింది. ఫిబ్రవరి నెలలో 6.55 శాతంతో పోలిస్తే మార్చినెల డబ్ల్యుపీఐ 5.70శాతంగా నమోదైంది. ఇంధన ధరలు, తయారీ వస్తువుల ధరలు తగ్గిన కారణంగా టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా శాంతించింది. 2016-17 ఆర్థికి సంవత్సరంలో పెరుగుతే వచ్చిన సూచీ నాలుగు సం.రాల గరిష్టాన్నినమోదు చేసింది. ఎనలిస్టుల అంచనాలను తారుమారుచేస్తూ టోకు ధరల సూచి దిగి రావడం విశేషం. గతేడాది ఇదేకాలంతో పోల్చితే.. డిఫ్లేషన్ నుంచి బయటపడింది. 2016 ఫిబ్రవరిలో మైనెస్ 0.45 శాతంగా ఉన్న డబ్ల్యూపీఐ ప్రతికూలత నుంచి బయకువచ్చింది. తయారీ వస్తువుల ధరలు తగ్గిన కారణంగానే సూచీ 5.70 శాతంగా నమోదయ్యిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంధన ధరలు 21.02 శాతం నుంచి 18.16 శాతానికి తగ్గడం, తయారీ వస్తువుల ధరలు 3.66 శాతం నుంచి 2.99 శాతానికి తగ్గడం లాంటి సానుకూల అంశాలతో నెలరోజుల పరంగా తగ్గుదల నమోదయ్యింది. అయితే, ఆహారోత్పత్తుల ధరలు 2.69 శాతం నుంచి 3.12 శాతం పెరగడం.. ప్రత్యేకించి పండ్ల ధరలు 7.62 శాతంగా నమోదు కావడం, గుడ్లు, మాంసం, చేపల ధరలు 3.12 శాతంగా ఉండడం వల్ల టోకు ధరల సూచీ 5.70 శాతంగా నమోదయ్యింది. లేదంటే, డబ్ల్యూపీఐ ఇంకా తగ్గేదని డేటా వెల్లడిస్తోంది. మరోవైపు 2017 సగటు ద్రవ్యోల్బణ సగటు 3.7 శాతంతోలిస్తే 2018 ఆర్థికసంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 4.8 శాతంగా ఉండనుందని కొటక్ మహీంద్రా బ్యాంకు విశ్లేషకులు అంచనా వేశారు. -
టాటా 'నానో' కథ ముగిసినట్టేనా?
రతన్ టాటా తన మానసపుత్రికగా చెప్పుకుంటున్న కారు 'నానో'. కానీ ఆ కారు మాత్రం రతన్ టాటా కలలను అందుకోలేకపోతుంది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా ఆటో ఇండస్ట్రీలోకి వచ్చి సంచలనాలు సృష్టించిన నానో, మూత పడే దిశకు వస్తోంది. మార్చి నెలలో ఈ కారు అమ్మకాలు కేవలం 174 యూనిట్లే అమ్ముడుపోయాయి. అంతేకాక, ఈ వెహికిల్ ప్లాట్ ఫామ్స్ ను కూడా కంపెనీ తగ్గించేస్తుందట. కానీ రతన్ టాటా మానసపుత్రిక తర్వాతి పరిస్థితేమిటంటే కంపెనీ అధికారులు మాత్రం నోరు విప్పడం లేదు. టాటా మోటార్స్ కు సప్లయిర్స్ గా ఉన్న ఎగ్జిక్యూటివ్ లు మాత్రం నానో తమ చర్చల్లో భాగం కాదని తేల్చేస్తున్నారు. దీంతో నానో భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుందని తెలుస్తోంది. ''టాటా మోటార్స్ సైతం నానో ప్రాజెక్ట్ పై ఇప్పడి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సహజంగానే ఈ కారు ప్రస్తావన ముగిసిపోయేలా చేయాలని వారు ఆలోచిస్తున్నారు'' అని నానో కారు పార్ట్స్ తయారుచేసే కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. టియాగో వంటి కొత్త ప్లాట్ ఫామ్స్ పైనే మేనేజ్ మెంట్ ఎక్కువగా దృష్టిసారించినట్టు పేర్కొన్నారు. కీలక మార్కెట్లలో కస్టమర్ డిమాండ్ బట్టి నానో కారును ఉత్పత్తి చేస్తామని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నానో కార్ల ఉత్పత్తి 64 శాతానికి పడిపోయి, కేవలం 7589 యూనిట్ల ప్రొడ్యూస్ చేశారు. గతేడాది టాటా గ్రూప్ లో నెలకొన్న వివాదంలో ఈ కారు ప్రస్తావనను మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రతన్ టాటా తన మానసపుత్రికగా చెప్పుకుంటున్న నానో కారు కంపెనీకి గుదిబండగా తయారైందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నానో వల్లే కంపెనీలోని ఇతర సంస్థలపై ప్రభావం పడిందని, లాభార్జించలేకపోతున్నామని విమర్శించారు. -
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర
ఎమ్మెల్యే కోమటిరెడ్డి కనగల్: త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాద యాత్ర నిర్వహించి కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తా మని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని, టీఆర్ ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తా మన్నారు. నల్లగొండ జిల్లా కనగల్ వైస్ ఎంపీపీ పీఠాన్ని ‘హస్త’గతం చేసుకున్న సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడారు. సొంత గ్రామంలో సర్పంచ్‌ను గెలిపించుకోలేని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండలో సీఎం కేసీఆర్‌ను గెలిపిస్తామనడం హాస్యా స్పదంగా ఉందన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో కేసీఆర్ నల్లగొండ నుంచి పోటీ చేస్తే ఓడిస్తామన్నారు. రైతు రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇళ్లు తదితర హామీలకు టీఆర్ఎస్ నేతలు మంగళం పాడుతున్నా రని విమర్శించారు. ఆయన వెంట నకిరే కల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు ఉన్నారు. -
స్విఫ్ట్ , బాలెనో బూస్ట్‌తో మారుతి స్పీడు
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సూజుకీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. మార్చి అమ్మకాల్లో 8.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ అమ్మకాలల్లో గణనీయమైన వృద్ధితో 7.7 శాతం కంపెనీ శనివారం వెల్లడించింది. దేశీయ అమ్మకాల్లో గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు 1,29,345 యూనిట్ల నుంచి 1,39,763 యూనిట్లను విక్రయించినట్టు పేర్కొంది. ముఖ్యంగా యుటిలిటీ కార్లు విటారా బ్రెజ్జా, ఎస్‌క్రాస్, ఎర్టిగా 32శాతం అమ్మకాలతో మారుతి టాప్ గేర్ లో దూసుకుపోయింది. దేశీయంగా గత ఏడాది మార్చిలో 1,18,895 యూనిట్లను విక్రయించిన మారుతి, ఈ ఏడాది ఆ సంఖ్యను 1,27,999కు మెరుగుపర్చుకుంది. ఎగుమతుల విషయానికి వస్తే 12.6 శాతం వృద్ధితో 11,764 యూనిట్లుగా ఉంది. ముఖ్యంగా విటారా బ్రెజ్జా, ఎస్‌క్రాస్, ఎర్టిగాల అమ్మకాలు 31.8 శాతం ఎగబాకాయి. గత ఏడాది మార్చి 2016లో 13,894 యూనిట్ల అమ్మకాలతో తో పోలిస్తే ఈ ఏడాది 18,311 యూనిట్లను విక్రయించింది. అయితే చిన్న కార్ల విభాగంలో మాత్రం కంపెనీ అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అలాగే వ్యాన్ల విభాగంలో ఈకో, ఓమ్నీల విక్రయాలు కూడా దాదాపు 10శాతం పడిపోయాయి. ఆల్టో, వేగనార్ అమ్మకాలు 16 శాతం పడిపోయాయి. మిడ్ సైజ్ సెగ్మెంట్లో సెడాన్ సియాజ్ అమ్మకాలు కూడా 10 శాతం తగ్గాయి. అయితే కాంపాక్ట్ సెగ్మెంట్లో స్విఫ్ట్, ఇగ్నిస్, రిట్జ్, సెలెరియో, బాలెనో, డిజైర్ల అమ్మకాలు 29.7 శాతం పెరిగాయి. ఇగ్నిస్, బాలెనో మోడళ్ళలో కొత్త వెర్షన్లను విడుదల చేయడంతో ఈ విభాగంలో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయని కంపెనీ వెల్లడించింది. మొత్తంగా 2015-16 సం.రంలో డొమెస్టిక్ మార్కెట్ లో 13.5ల క్షల వాహనాలతో పోలిస్తే 11 శాతం వృద్ధితో మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను మారుతీ మొత్తం విక్రయాలు 14.44 లక్షల యూనిట్లకు పెరిగాయి. -
మారుతికి స్విఫ్ట్ , బాలెనో బూస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సూజుకీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. మార్చి అమ్మకాల్లో 8.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ అమ్మకాలల్లో గణనీయమైన వృద్ధితో 7.7 శాతం కంపెనీ శనివారం వెల్లడించింది. దేశీయ అమ్మకాల్లో గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు 1,29,345 యూనిట్ల నుంచి 1,39,763 యూనిట్లను విక్రయించినట్టు పేర్కొంది. ముఖ్యంగా యుటిలిటీ కార్లు విటారా బ్రెజ్జా, ఎస్‌క్రాస్, ఎర్టిగా 32శాతం అమ్మకాలతో మారుతి టాప్ గేర్ లో దూసుకుపోయింది దేశీయంగా గత ఏడాది మార్చిలో 1,18,895 యూనిట్లను విక్రయించిన మారుతి, ఈ ఏడాది 1,27,999 వాహనాలను విక్రయించింది. ఎగుమతుల విషయానికి వస్తే 12.6 శాతం వృద్ధితో 11,764 యూనిట్లుగా ఉంది. ముఖ్యంగా విటారా బ్రెజ్జా, ఎస్‌క్రాస్, ఎర్టిగాల అమ్మకాలు 31.8 శాతం ఎగబాకాయి. గత ఏడాది మార్చి 2016లో 13,894 యూనిట్ల అమ్మకాలతో తో పోలిస్తే ఈ ఏడాది 18,311 యూనిట్లను విక్రయించింది .వ్యాన్ల విభాగంలో ఈకో, ఓమ్నీల విక్రయాలు మాత్రం దాదాపు 10శాతం పడిపోయాయి. చిన్న కార్ల విభాగంలో మాత్రం కంపెనీ అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఆల్టో, వేగనార్ అమ్మకాలు 16 శాతం పడిపోయాయి. మిడ్ సైజ్ సెగ్మెంట్లో సెడాన్ సియాజ్ అమ్మకాలు కూడా 10 శాతం తగ్గాయి. అయితే కాంపాక్ట్ సెగ్మెంట్లో స్విఫ్ట్, ఇగ్నిస్, రిట్జ్, సెలెరియో, బాలెనో, డిజైర్ల అమ్మకాలు 29.7 శాతం పెరిగాయి. ఇగ్నిస్, బాలెనో మోడళ్ళలో కొత్త వెర్షన్లను విడుదల చేయడంతో ఈ విభాగంలో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయని కంపెనీ వెల్లడించింది. మొత్తంగా 2015-16 సం.రంలో డొమెస్టిక్ మార్కెట్ లో 13.5ల క్షల వాహనాలతో పోలిస్తే 11 శాతం వృద్ధితో మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను మారుతీ మొత్తం విక్రయాలు 14.44 లక్షల యూనిట్లకు పెరిగాయి. -
గుడ్ న్యూస్: జియో మెంబర్షిప్ గడువు పొడిగింపు?
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తాజా పథకం ప్రైమ్ మెంబర్షిప్ ఇంకా తీసుకోని జియో ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఈ పథకం రిజిస్టర్ గుడువును జియో పెంచే అవకాశం ఉందట. మార్చి 31 తో ముగియనున్న ప్రైమ్ మెంబర్ షిప్ రిజిస్ట్రేషన్ గడువును ఆర్ఐఎల్ పెంచనుందట. ఈ గడువు మరో నాలుగు రోజుల్లోముగియనుండగా మరింత సమయం పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. తన కస్టమర్ల సౌలభ్యంకోసం ఈ గడువును మరో నెలపాటు పొడిగించే అవకాశం ఉందని సమాచారం. కాగా ఉచిత డాటా ప్రకనటతో టెలికాం మార్కెట్ లో సునామీ సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా టారిఫ్‌లను ప్రకటించింది. ముఖ్యంగా వన్‌టైం ఫీజు రూ. 99 తో ప్రైమ్ మెంబర్ షిప్ రిజిస్ట్రేషన్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ నమోదు కార్యక్రమం మార్చి 1 నుంచి ప్రారంభమై మార్చిలో 31న ముగియనుంది. దీని ద్వారా ప్రస్తుతం అమల్లో ఉన్న ఆఫర్లను వినియోగదారులు 2018వరకు పొందవచ్చని తెలిపింది. మరోవైపు గత ఫిబ్రవరిలో ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఏప్రిల్ నెలనుంచి ప్రత్యర్థులతో పోలిస్తే తమ వినియోగదారులు 20 శాతం ఎక్కువ డేటా సహా, ఇతర ఆఫర్లను అందించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై రిలయన్స్ జియో అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: తెలుగు రాష్ర్టాల్లో బాణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పలు ప్రాంతాల్లో ఎండ విపరీతంగా పెరిగిపోతోంది. అప్పుడే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది. ఉదయం 11 గంటలకే జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దీంతో ఇళ్లలో నుంచి బయటకు రావడానికే జనాలు జంకుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలు నమోదు కాగా కనిష్టంగా విశాఖపట్నంలో 31 డిగ్రీలు నమోదయ్యింది. తెలంగాణలో ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలు నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36 డిగ్రీలు నమోదయ్యింది. -
డా.రెడ్డీస్ ప్లాంట్‌లో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు
హైదరాబాద్: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ప్లాంట్ లో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్ఎఫ్డీఏ) తనిఖీలు మొదలుకానున్నాయి. సంస్థకు చాలా కీలకమైన శ్రీకాకుళం ప్లాంటులో యూఎస్ఎఫ్డీఏ ఈ నెలాఖరున తనిఖీలు చేపట్టనుంది. మార్చి 27 న ఈ తనిఖీలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు అమెరికా డ్రగ్ రె గ్యులేటరీ మీడియా కు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం ప్లాంట్ సక్రియాత్మక ఔషధ అంశాల (API) సరఫరా పరంగా చాలా కీలకం. ఫిబ్రవరి- మార్చి 2017లో మిర్యాల గూడ ప్లాంటులో తనిఖీలు చేపట్టిన యూఎస్ఎఫ్డీఏ 3 లోపాలు(అబ్జర్వేషన్స్) నమోదు చేసింది. ఇక విశాఖకు దగ్గర్లోగల దువ్వాడ ప్లాంటు తనిఖీల్లో భాగంగా 13 అబ్జర్వేషన్స్ నోట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ తనిఖీలుచేపట్టనుంది. నవంబర్ 2015 లో ఈ మూడు ప్లాంట్లపైనా యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ డ్రగ్‌మేకర్ చిక్కుల్లోపడింది. కాగా కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ మూడు ప్లాంట్ల వాటా 10-12 శాతంగా ఉంది. -
మహిళా బిల్లుపై ఢిల్లీలో కనిమొళి పాదయాత్ర
న్యూఢిల్లీ: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కలిగించాలని డిమాండ్ చేస్తూ... ఢిల్లీలో డీఎంకే ఉమెన్స్ వింగ్ ఆందోళన చేపట్టింది. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నా 20 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలమైన పార్టీలు తమ గొంతు విప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మండి హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకూ ఈ పాదయాత్ర కొనసాగింది. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. -
పాదయాత్రతో ప్రభుత్వానికి భయం
అందుకే ప్రాజెక్టుల బాట వదిలి కులాల బాట పట్టింది: తమ్మినేని సాక్షి, యాదాద్రి/ఘట్కేసర్: మహాజన పాదయాత్రతో రాష్ట్ర ప్రభుత్వానికి భయం పట్టుకుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆ భయంతోనే ప్రాజెక్టుల బాట వదిలి కులాలకు వరాలు కురిపిస్తుందని విమర్శించారు. మహాజన పాదయాత్ర 152 రోజులుగా 4,080 కిలోమీటర్లు పూర్తి చేసుకుని శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రతిపక్షాలను ఏకం చేసి ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ విధానాలతో తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశం లేదన్నారు. బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేసి నిధు లు కేటాయించకపోగా కులవృత్తులకు ప్రోత్సాహం పేరుతో అమలుకాని వరాలు కురిపిస్తున్నారని మండిపడ్డారు. ఘట్కేసర్లో జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ వెనకబడిన తరగతుల అభివృద్ధికి తక్షణమే బీసీ సబ్‌ప్లాన్ ను ప్రవేశపెట్టాలని, ప్రజలు పోరాడి తెచ్చు కొన్న రాష్ట్రంలోను దగా పడుతున్నారన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి సాక్షి, హైదరాబాద్: రవాణారంగంలోని కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమబోర్డు ను ఏర్పాటు చేయాలని తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. -
‘సామాజిక న్యాయాన్ని’ కేంద్ర బిందువు చేశాం
⇒ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ⇒ ప్రభుత్వం, బడ్జెట్ ఇదే అంశం చుట్టూ తిరిగాయి ⇒ తెలంగాణ వచ్చాక కూడా అణగారిన వర్గాలకు మేలు జరగలేదు ⇒ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో సాక్షి ప్రత్యేక ఇంటర్వూ్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక న్యాయ నినాదాన్ని భవిష్యత్ ఎజెండాగా ముందుకు తీసుకురావడంలో తమ పాదయాత్ర కృతకృత్య మైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం చుట్టూ రాజకీయాలు, ప్రభుత్వ చర్యలు సాగాలన్న తమ ప్రధాన లక్ష్యం నెరవేరిందన్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్లోనూ ఆయా అంశాలను పొందుపరచక తప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వా నికి ఏర్పడిందన్నారు. అయితే ప్రగతి పద్దులో రూ.88 వేల కోట్లు పెట్టి, రాష్ట్రంలో యాభైశాతం పైగా జనాభా ఉన్న బీసీలకు కేవలం రూ. 5 వేలు కేటాయించడమంటే ఏమేరకు న్యాయం చేసినట్టు అని ప్రశ్నించారు. తమ పాదయాత్రకు అన్ని రాజకీయపార్టీలు, సంఘాలు సంపూర్ణంగా మద్దతు తెలపడం శుభపరిణామమని చెప్పారు. సరిగ్గా అయిదునెలల క్రితం గత అక్టోబర్ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పార్టీలోని వివిధ సామాజికవర్గాలకు చెందిన ఎనిమిది మంది సహచరులతో కలసి తమ్మినేని మహాజన పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటివరకు 4,200 కి.మీ. సాగిన పాదయాత్ర శనివారం హైదరాబాద్‌కు చేరుకోనుంది. అనంతరం ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించ నున్న బహిరంగసభతో ముగియనుంది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రంతో ఫోన్లో సాక్షి ప్రతినిధి జరిపిన ఇంటర్వూ్యలోని ముఖ్యాం శాలు... ఆయన మాటల్లోనే... రాష్ట్రం వచ్చినా పరిస్థితి మారలేదు ‘‘తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి పథకాలు ఎక్కడా అమలు కావడం లేదు. మూడేళ్ల కాలంలో ఈ వర్గాలకు కేటాయించిన నిధులు సగం కూడా ఖర్చుకాకపోగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రవాణా తదితరాలకు దారిమళ్లాయి. రైతులు, కూలీలు, ఇతర వర్గాల వారు గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు ముందటిలాగానే ఇంకా కొనసాగుతున్నాయి. ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు టీఆర్ఎస్ సర్కార్‌కు చేతులు రాలేదు. గ్రామస్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును బేరీజు వేయడానికి పాదయాత్ర ఎంతో ఉపయోగపడింది. కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. సామాజిక న్యాయాన్ని ఎజెండాగా అంగీకరించే పార్టీలు, సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకే సామాజిక సమరసమ్మేళనం పేరిట బహిరంగ సభను నిర్వహిస్తున్నాం.ఈ సభ తర్వాత ప్రతి ఒక్క సంఘం, సంస్థలతో వేర్వేరుగా మాట్లాడి ఉమ్మడి ఎజెండాను ఖరారుచేసి ఒక ఫ్రంట్ లేదా ఐక్య వేదిక ఏర్పాటు చేసుకుంటాం. ’’అని అన్నారు. -
పంజాబ్‌కు అమరీందర్.. మణిపూర్‌లో ఉత్కంఠ
చండీగఢ్: ఈ నెల 16న పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రమాణం చేయనున్నారు. కాసేపట్లో ఆయన గవర్నర్‌ను కలవనున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధుకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించే అవకాశముంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 117 స్థానాలకుగాను 77 చోట్ల జయకేతనం ఎగరేసింది. అధికార అకాలీదళ్ ఓటమి చవిచూడటంతో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఈ రోజు గవర్నర్ ను కలసి రాజీనామా లేఖను సమర్పించారు. మణిపూర్‌లో ఉత్కంఠ: మణిపూర్‌లో కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్ మళ్లీ ఎన్నికయ్యారు. సోమవారం ఆయన గవర్నర్‌తో సమావేశం కానున్నారు. ఆయన 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో కాంగ్రెస్ 28 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు అవసరం. బీజేపీ 21, ఎన్పీఎఫ్ 4, ఇతరులు 7 సీట్లు గెలిచారు. బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల మద్దతు కీలకంకానుంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. -
27 వరకు తెలంగాణ అసెంబ్లీ.. 13న బడ్జెట్
హైదరాబాద్: ఈ నెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. శుక్రవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ నరసింహన్ ప్రసంగం అనంతరం రేపటికి వాయిదా పడ్డాయి. అనంతరం బీఏసీ సమావేశంలో సభ నిర్వహణపై చర్చించారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఆదివారం అసెంబ్లీకి సెలవు. ఈ నెల 13న సభలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 15, 16 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఈ నెల 25 సభలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు జరపాలని బీఏసీ సమావేశంలో విపక్షాలు డిమాండ్ చేయగా, గత సమావేశాల్లోనే అన్ని అంశాలు చర్చించామంటూ పాలకపక్షం వ్యతిరేకించింది. -
ఏ‘మార్చి’
మార్చి నెలాఖరు వస్తున్నా దరి చేరని లక్ష్యం ప్రతి విభాగంలోనూ వెంటాడిన నిర్లక్ష్యం నిధులూ విడుదల కాని దుస్థితి... అంకెల గారడీ ... చరమాంకంలోనూ ఇదేమి బురిడీ ఓ చిన్న కుటుంబం ... ఆ నెలలో ఇల్లు గడవాలంటే మొదటి వారంలోనే ఓ బుల్లి ప్రణాళిక వేసుకుంటారు. ఏడాదిపాటు నెట్టుకు రావాలంటే భార్య, భర్తతోపాటు కుటుంబ సభ్యులు కూడా ఖాళీ సమయంలో ఓ దగ్గర కూర్చొని బియ్యం, పప్పులతోపాటు ముఖ్య నిత్యావసర వస్తువులతో భారీ ప్రణాళికనే రచించుకొని ఆ ప్రకారం క్రయ, విక్రయాలు ఉండేటట్టు చూసుకుంటారు. ఇల్లు ... కుటుంబానికే ఇంత ముందు చూపుతో అడుగులేస్తుంటే 54 లక్షల జనాభా ఉన్న జిల్లాను పరిపాలిస్తున్న అధికారులు, పాలకులు ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి. ఆర్భాటంగా నిధులైతే కేటాయించి ఏడాదవుతున్నా సగం సొమ్ము కూడా విదల్చకుండా జిల్లా ప్రజలను ఏమార్చిన తీరుపట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాలు ... విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రగతికి నిధులు, పేద, మధ్య తరగతికి ఇళ్లు, కాపులకే ఇవ్వాల్సిన రూ.90 కోట్లు...ఇలా ఏ ఒక్క లక్ష్యం దరిదాపులకు చేరుకోని దుస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విదల్చకపోతే తామేమి చేయగలమని కొంతమంది అధికారుల ప్రశ్న. డ్వాక్రాకు టోకరా... 2016–17 ఆర్థిక సంవత్సరంలో 59,587 సంఘాలకు రూ.1346.24 కోట్లు రుణాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. అలక్ష్యం : ఆర్థిక సంవత్సరం ముగిసే రోజు దగ్గరపడ్డా ఇంత వరకు కేవలం 23,861 సంఘాలకు రూ.601.45 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు.. ఎస్సీలకు మొండిచేయే... లక్ష్యం: జిల్లాలో షెడ్యూల్ కులాల్లో ఉన్న నిరుద్యోగులు, యువతకు 5,053 మందిని ఎంపిక చేసి ఉపాధి కల్పిస్తామంటూ 4,775 యూనిట్లకు రూ.95.27 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలక్ష్యం: ఇంకా లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేయలేకపో యారు. ఒక్క ఇల్లు కడితే ఒట్టు... లక్ష్యం: గూడులేని వారికి నీడ కల్పిస్తాం. అలక్ష్యం: జిల్లాకు 24,198 ఇళ్లు కేటాయించగా కేవలం 11,896 ఇళ్లు మాత్రమే నిర్మాణం చేపట్టారు. కాపులకూ హామీల కాటే... లక్ష్యం: కాపు కార్పొరేష¯ŒS ద్వారా 4 వేల మంది లబ్ధిదారులకు సబ్సిడీతో కలిపి రూ.80 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యం. అలక్ష్యం: కానీ ఒక్క రూపాయి కూడా అందజేసిన దాఖలాలు లేవు. బ్యాంకుల మధ్యే దరఖాస్తులు తిరుగుతున్నాయి. బీసీలకూ అదే మోసం... లక్ష్యం: జిల్లాలో బీసీలకు రూ.74.38 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యం. అలక్ష్యం: ఇప్పటివరకు ఒక్కరిని కూడా ఇంతవరకూ ఎంపిక చేయలేదు. క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలు పూర్తి చేసి బ్యాంకుల ఆమోదం కోసం దరఖాస్తులు పంపించిన స్థాయిలోనే ఉండిపోయింది. ఒట్టి వ్యవ‘సాయం’ లక్ష్యం : జిల్లాలో రైతులకు బంగారం,పంట రుణాలుగా రూ.7,084 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. అలక్ష్యం : 60 శాతం మించి రుణాలు ఇవ్వలేకపోయారు. -
ఉపహార్ కేసు: రియల్టర్ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపహార్ థియేటర్ ట్రాజెడీ కేసులో ప్రధాన దోషి రియల్ ఎస్టేట్ వ్యాపారి, గోపాల్ అన్సాల్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఏడాది జైలు శిక్ష, రూ. 30 కోట్ల జరిమానాపై అన్సల్ పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం సుప్రీం కొట్టి వేసింది. జైలుకి వెళితే తన ఆరోగ్యంపై కోలుకోలేని దెబ్బపడుతుందన్న గోపాల్ అన్సల్ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. మార్చి 20వ తేదీలోపు కోర్టుముందు లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. గతనెలలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం గోపాల్ అన్సల్ కోర్టుముందు లొంగిపోవాల్సి ఉంది. రియల్టర్ల తరపున ప్రముఖ న్యాయవాది రామ్ జెట్మలానీ వాదిస్తుండగా, ఉపహార్ విషాద భాదితుల అసోసియేషన్ తరపున సీనియర్ న్యాయవాది కె టీఎస్ తులసీ తన వాదనలను వినిపించారు. తమ రిప్యూ పిటీషన్ పై సుప్రీం తీర్పుకు సమీక్ష ఉండదని వాదించారు. అయితే చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని జె ఎస్ ఖేహర్ ధర్మాసనం విచారణకు జాబితా బెంచ్ లభ్యతపై శుక్రవారం నిర్ధారించనున్నామని సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీకి హామీ ఇచ్చారు. అయితే 1997లో జరిగిన ఉపహార్ సినిమా అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. 59 మంది మృతి చెందిన నాటి ఘటనలో థియేటర్ యజమానులు సుశీల్ అన్సల్, గోపాల్ సోదరులను దోషులుగా కోర్టు తేల్చింది. వీరిలో గోపాల్ అన్సల్ (69) సుప్రీంకోర్టు ఏడాది జైలుశిక్ష, రూ. 30 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. మరోవైపు సుశీల్ అన్సల్ వయసు ఆధారిత సమస్యల కారణంగా మినహాయింపునిచ్చింది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని గోపాల్‌నున ఆదేశించిన సంగతి తెలిసిందే. 2015లో దోషులిద్దరికీ సుప్రీంకోర్టు రెండేండ్ల జైలుశిక్ష (ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా ఉన్నందుకు), చెరొకరికి రూ.30 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2008 డిసెంబర్ 19న ఢిల్లీ హైకోర్టు వారి శిక్షను ఏడాదికి తగ్గించింది. ఈ నేపథ్యంలో మృతుల బంధువుల అసోసియేషన్ దీనిపై న్యాయపోరాటానికి దిగింది. తమకున్యాయం చేయాల్సింది కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు. -
మార్చి16న ఆ ప్రభుత్వ తొలి బడ్జెట్
జయలలిత మరణం అనంతరం ఏర్పడిన రాజకీయ పరిణామాలతో అట్టుడికిన తమిళనాడులో ఇటీవలే ఓ కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కొత్తగా పదవిలోకి వచ్చిన ఈ ప్రభుత్వం మార్చి 16న తమ తొలి బడ్జెట్ తో అసెంబ్లీ ముందుకు రాబోతుంది. మార్చి 16న పళనిస్వామి ప్రభుత్వం తొలి బడ్జెట్ తమిళనాడు అసెంబ్లీ ముందుకు రాబోతుందని అధికారిక ప్రకటన వెలువడింది. మార్చి16న 10.30 గంటలకు సమావేశమవ్వాలని లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్ ధనపాల్ సమన్లు పంపారు. ఆర్థికమంత్రి డీ జయకుమార్ పళనిస్వామి ప్రభుత్వంలో తన తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. గత నెల 18న అసెంబ్లీలో చోటుచేసుకున్న తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో పళనిస్వామి ప్రభుత్వం విశ్వాసపరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాస పరీక్షను ప్రతిపక్షం డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పళనిస్వామి ప్రభుత్వాన్ని ఎలాగైనా పదవిలో నుంచి దింపేందుకు బడ్జెట్ సమావేశాలను ఓ పావుగా వాడుకునేందుకు సిద్ధమవుతోంది. -
ఈ నెల 10 నుంచి తెలంగాణ అసెంబ్లీ
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ, మండలి సమావేశాలు అదే రోజు ఉదయం 10గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శనివారం ఒక అధికారిక ప్రకటన విడుదలైంది. తొలి రోజు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. 11న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంతో ఆ రోజు సమావేశాలు ముగిస్తారు. 13న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సుమారు 15రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశముంది. -
సూపర్ మార్కెట్ లీడర్ ’డీమార్ట్’ ఐపీవో
ముంబై: రాధాకిషన్ దమానీ ప్రమోట్ చేసిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ , సూపర్ మార్కెట్ లీడర్ డీమార్ట్ త్వరలో ఐపీవోకి రానుంది. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న డీమార్ట్ మార్చి 8న పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. మార్చి 10న ముగియనున్న ఇష్యూకి రూ. 290-299 ప్రైస్ బ్రాండ్‌గా ప్రకటించింది. ఈ ఐపీవో ద్వారా రూ. 1,810-1866 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 6.23 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 1.87 కోట్ల షేర్లను విక్రయించనుంది. మరో 1.24 కోట్ల షేర్లను అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు(క్విబ్), 93.59 లక్షల షేర్లను సంపన్న వర్గాలకు రిజర్వ్ చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో 2.18 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనుంది. ఇష్యూ తరువాత డీమార్ట్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్‌కానున్నాయి. ఈ ఇష్యూకు గ్లోబల్ కోఆర్డి నేటర్‌గా, లీడ్ మేనేజర్ కొటక్ మహీంద్రా క్యాపిటల్ వ్యవహరిస్తోంది. ఇతర లీడ్ మేనేజర్లుగా యాక్సిస్ క్యాపిటల్, ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఇంగా కాపిటల్, జెఎం ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ క్యాపిటల్ అడ్వైజర్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ వ్యవహరిస్తున్నాయి. కాగా మహారాష్ట్ర, గుజరాత్‌లలో అత్యధిక శాతం స్టోర్లను ఏర్పాటు చేసినప్పటికీ ఇటీవల తెలుగు రాష్ట్రాలలోనూ వేగంగా విస్తరిస్తోంది. సుమారు 120 స్టోర్లను ఇప్పటికే నిర్వహిస్తున్న సంస్థ 2016 మార్చికల్లా రూ. 8,600 కోట్ల అమ్మకాలతో 320 కోట్ల నికర లాభం ఆర్జించింది. రూ. 5.72 ఈపీఎస్ నమోదైంది. గత రెండేళ్లలో కంపెనీ లాభార్జన సగటున 31 శాతం చొప్పున జంప్‌చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 7.6 ఈపీఎస్‌ను కంపెనీ అంచనా వేస్తోంది. ఇష్యూ ధర రూ. 300కాగా.. 40 పీఈలో షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
► రేపటి నుంచి ప్రారంభం ► 136 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు ► హాజరుకానున్న ► 99,912 మంది విద్యార్థులు ► సమస్యాత్మక కేంద్రాల్లో ► సీసీ కెమెరాలతో నిఘా ► మార్చి 9న జరగాల్సిన ► పరీక్ష 19కి వాయిదా ► జిల్లా కేంద్రంలో ► కంట్రోల్ రూమ్ ఏర్పాటు గుంటూరు : మార్చి ఒకటి నుంచి 19 వరకు జరగనున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 99,912 మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు 136 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రథమ సంవత్సర పరీక్షలకు 50,632 మంది విద్యార్థులు హాజరవుతుండగా వారిలో ఆర్ట్స్, సైన్స్ గ్రూపుల నుంచి 49,336 మంది, వృత్తి విద్యా కోర్సుల నుంచి 1,296 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు 49,280 మంది హాజరవుతుండగా వారిలో ఆర్ట్స్, సైన్స్ గ్రూపుల నుంచి 48,144 మంది, వృత్తి విద్యాకోర్సుల నుంచి 1,136 మంది విద్యార్థులు ఉన్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు... ఇంటర్మీడియెట్ పరీక్షలకు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని 136 పరీక్షా కేంద్రాల పరిధిలో 136 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అదే సంఖ్యలో శాఖాధికారులతో పాటు 30 మంది కస్టోడియన్లను నియమించింది. పరీక్షా కేంద్రాలను అణువణువునా తనిఖీ చేసేందుకు నాలుగు ఫ్లయింగ్, ఐదు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ, ఆర్ఐవో అధ్యక్షతన జిల్లా పరీక్షల కమిటీ పరీక్షల తీరును పర్యవేక్షిస్తోంది. పరీక్షల్లో అవకతవకలను నిరోధించేందుకు గాను జిల్లాలోని నాలుగు సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. దాచేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, అచ్చంపేటలోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల, నగరం మండల కేంద్రంలోని ఎస్వీఆర్ఎం ఎయిడెడ్ జూనియర్ కళాశాల, గుంటూరులోని యాదవ జూనియర్ కళాశాలలో వీటిని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా మార్చి 9 పరీక్ష వాయిదా : ఆర్ఐవో మార్చి 9న జరగాల్సిన పరీక్షలను ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా మార్చి 19వ తేదీకి వాయిదా వేసినట్లు ఆర్ఐవో టీవీ కోటేశ్వరరావు చెప్పారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మార్చి 9న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఆ రోజు జరగాల్సిన మ్యాథ్స్ 2బీ, జువాలజీ–2 పరీక్షలను ప్రభుత్వం మార్చి 19వ తేదీకి వాయిదా వేసిందని, విద్యార్థులు మార్పును గమనించాలని సూచించారు. మార్చి 18న పరీక్షలు ముగియనుండగా, వాయిదా పడిన పరీక్షను మరుసటి రోజున నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫర్నిచర్, ఫస్ట్ ఎయిడ్ కిట్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. విద్యుత్ సరఫరాలో అవరోధం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే విద్యుత్ శాఖాధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది గుర్తింపు కార్డులు విధిగా ధరించాలని స్పష్టం చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కోడ్ నంబర్, కళాశాల పేరు స్పష్టంగా కనిపించేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించామన్నారు. పరీక్షా కేంద్రాల్లో సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు జిల్లా కేంద్రంలో 0863–2228528 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులూ.. ఈరోజే పరీక్షా కేంద్రాన్ని చూసి రండి ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఒక రోజు ముందుగానే సంబంధిత పరీక్షా కేంద్రానికి స్వయంగా వెళ్లి రావాలని ఆర్ఐవో సూచించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులను అరగంట ముందుగా లోపలికి పంపుతామని తెలిపారు. నిర్దేశిత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్‌టిక్కెట్, పెన్నులు మినహా సెల్‌ఫోన్, కాలిక్యులేటర్ వంటి పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. -
మోటో రెండు స్మార్ట్ ఫోన్లు
బార్సిలోనా: లెనోవా బ్రాండ్ మోటో కొత్త స్మార్ట్ ఫోన్లను పరిచయం చేయనుంది. వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ 2017 లో మోటో 5, మోటా 5 ప్లస్ మొబైళ్లను అప్ గ్రేటెడ్ స్పెసిఫికేషన్స్‌తో, కాంపిటీటివ్ధరలతో ఫ్రెష్‌లుక్ లో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ల ఫస్ట్‌లుక్ లాంచ్ చేసింది. అయితే మోటో 5 ప్లస్ ను భారత మార్కెట్లో మార్చి 15న విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాలను ఇప్పటికే మీడియాకు పంపిస్తోంది. ఈ రెండు ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టంఆధారంగా పనిచేయనున్నాయి. అలాగే జి 5 ప్లస్ ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. జీ5 ధరను సుమారు రూ.14వేలుగాను, జీ5 ప్లస్ ధరను రూ.15, 300గాను కంపెనీ 3జీబీ, 32జీబీ వేరియంట్ ధర సుమారు రూ.19,700గాను ఉండనునున్నాయి. మోటో 5 ఫీచర్లు 5 అంగుళాల డిస్ ప్లే ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టం 1.4గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 13ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2800ఎంఏహెచ్ బ్యాటరీ మోటో 5 ప్లస్ ఫీచర్లు 5 .2 అంగుళాల డిస్ ప్లే 1.4గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ 12 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ టర్బో చార్జర్ -
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు
అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ (వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ (ఓట్ల లెక్కింపు)తేదీని మార్చి 20వ తేదీకి ఎన్నికల కమిషన్ మార్పు చేసింది. ఈ మేరకు ఈ నెల 23న ముఖ్య కార్యదర్శి వరిందర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషనర్ తొలుత విడుదల చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఓట్ల లెక్కింపు మార్చి 15న నిర్వహించాల్సి ఉంది. అయితే షెడ్యూల్లో మార్పు చేస్తూ లెక్కింపు తేదీని 20వ తేదీకి మార్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
8 నుంచి అసెంబ్లీ
10న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సర్కారు l బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి తుది కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు మార్చి 8న ప్రారంభం కాను న్నాయి. 10న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించా రు. ఈ మేరకు అవసరమైన సన్నాహాలు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశిం చారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెడతారు. మరుసటి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కేటాయింపుల కోసం వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఆర్థిక శాఖ ఇప్పటివరకు రూపొందిం చిన బడ్జెట్, ఖరారు చేసిన పద్దులను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించారు. దీనిపై ప్రగతి భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణా రావుతో సమీక్షించారు. శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలు, కేటాయింపులపై చర్చించారు. రేపటి నుంచి మంత్రులతో సమీక్ష శాఖల వారీగా బడ్జెట్ అవసరాలు, ప్రతిపాద నలు, కేటాయింపులపై శనివారం నుంచి సమీక్షించాలని సీఎం నిర్ణయించారు. ఆయా శాఖల్లో ఇప్పటివరకు అమలైన కార్యక్ర మాలు, క్షేత్రస్థాయిలో వాటి పురోగతి.. వచ్చే ఏడాది చేయాలనుకుంటున్న పనులు, కార్యక్రమాలేమిటనే దానితోపాటు పథకాలు, కార్యక్రమాలు, నిధుల వినియోగాన్ని పక్కాగా మదింపు చేసుకుని నివేదిక అందజేయాలని మంత్రులను ఆదేశించారు. ఆ నివేదికల ఆధారంగా సమీక్షించి తుది కేటాయింపులు ఖరారు చేస్తామని తెలిపారు. దీంతో మంత్రులందరూ సంబంధిత నివేదికల తయారీలో నిమగ్నమయ్యారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఫోకస్! గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కొత్త బడ్జెట్‌ను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఫోకస్ చేయని సామాజిక వర్గాలు, వివిధ కుల వృత్తులకు ప్రయోజనాలు కల్పించే పథకాలకు పెద్దపీట వేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. బడ్జెట్‌కు ముందే జనహితలో చేనేత, మరమగ్గాల కార్మికులు, ఎంబీసీలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. అంతకు ముందే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై అఖిలపక్ష ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. -
‘మార్చి 24న అసెంబ్లీ ఎదుట ధర్నా’
అనంతపురం అర్బన్ : వరస కరువులతో కుదేలైన జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్‌తో మార్చి 24న అసెంబ్లీ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ తెలిపారు. పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు, రైతులు దుస్థితిని పరిశీలించేందుకు మార్చి 3, 4వ తేదీల్లో సేలం, కోయంబత్తూరు, కొచ్చిన్, బెంగుళూరు వెళ్తున్నామన్నారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎదుట నిర్వహించే ధర్నాకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట కార్యదర్శి పి.మధు, ఏపీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డిని ఆహ్వానిస్తున్నామన్నారు. 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కనీస స్థాయిలో కూడా సహాయక చర్యలు చేపట్టలేదని ధ్వజమెత్తారు. ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టి రైతులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో అప్పుల బాధతో 243 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఐదు లక్షల మంది కూలీలు, రైతులు పొరుగు రాష్ట్రాలకు వలసవెళ్లి దుర్భర జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్న ప్రభుత్వానికి కనిపించకపోవడం దారుణమన్నారు. -
పీఎఫ్-ఆధార్ గడువు మరోసారి పెంపు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఖాతాలకు ఆధార్ అనుసంధానికి ప్రభుత్వం కల్పించిన గడువును మరోసారి పొడిగించింది. 2017 మార్చి 31వ తేదీనాటికి పీఎఫ్ చందాదారులు, పింఛన్ దారులు ఆధార్ కార్డును తప్పనిసరిగా సమర్పించాలని ఈపీఎఫ్‌వో తెలిపింది. పీఎఫ్ పథకాల ప్రయోజనాలు పొందాలంటే పీఎఫ్ చందాదారులు, పింఛనుదారులకు ఆధార్ తప్పనిసరి అని సష్టం చేసింది. సుమారు నాలుగు కోట్ల మంది ఈ వివరాలను అందించాలని కోరింది. గతంలో జనవరి 31, అనంతరం ఫిబ్రవరి 28 వరకు విధించిన గడువును ఖాతాదారులు మరియు ఫించన్ దారుల సౌలభ్యం మరోసారి పొడిగించింది. తమ ఆధార్ నంబర్‌ను, లేదా ఆధార్ కోసం దరఖాస్తు చేసిన పత్రాన్ని తమకు సమర్పించాలని తెలిపింది. -
మార్చి 13 నుంచి ఫుల్ క్యాష్
- నగదు విత్‌డ్రా పరిమితులు ఎత్తివేస్తామన్న రిజర్వు బ్యాంకు - 20 నుంచి సేవింగ్స్ ఖాతాల్లో విత్‌డ్రా పరిమితి 50 వేలకు పెంపు - ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఆర్.గాంధీ, ముంద్రా వెల్లడి ముంబై: పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు విత్డ్రాయల్స్పై విధించిన ఆంక్షలను క్రమంగా సడలిస్తున్న రిజర్వు బ్యాంకు... మార్చి 13వ తేదీ నుంచి పరిమితులను పూర్తిగా ఎత్తివేయనుంది. ఆలోగా ప్రస్తుతం వారానికి రూ. 24,000గా ఉన్న పొదుపు (సేవింగ్స్) ఖాతాల విత్‌డ్రాయల్స్ పరిమితిని ఫిబ్రవరి 20 నుంచి రూ. 50,000కు పెంచనుంది. బుధవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ ఈ విషయాలు వెల్లడించా రు. వ్యవస్థలోకి కొత్త రూ.500, రూ.2,000 నోట్ల సరఫరాను బట్టి కరెంటు ఖాతాలు, క్యాష్ క్రెడిట్ ఖాతాలు మొదలైన వాటి నుంచి విత్‌డ్రాయల్ ఆంక్షలను తొలగించినప్పటికీ.. పొదుపు ఖాతాలపై మాత్రం పరిమితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు రూ. 2,000 నోట్లకు నకిలీలు వస్తున్నాయన్న వార్తలపై ఆర్.గాంధీ స్పందిస్తూ... అవన్నీ కలర్ జిరాక్స్లేనని, సామాన్యులు కూడా సులువుగా గుర్తుపట్టొచ్చని చెప్పారు. నకిలీ కరెన్సీకి ఆస్కారం లేకుండా కొత్త నోట్లలో పటిష్టమైన సెక్యురిటీ ఫీచర్లు ఉన్నాయన్నారు. రూ. 2,000 నోట్లకు సంబంధించి బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీలు దొరికిన దాఖలాలేమీ ఇప్పటిదాకా తమ దృష్టికి రాలేదని తెలిపారు. జూన్ తర్వాతే ‘నోట్ల రద్దు’డేటా.. డీమోనిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) తర్వాత తిరిగొచ్చిన పాత రూ.500, రూ.1,000 నోట్లకు సంబంధించిన పూర్తి గణాంకాలు జూన్ తర్వాతే వెల్లడించడం సాధ్యపడుతుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా తెలిపారు. డీమోనిటైజేషన్ సమయంలో విదేశాల్లో ఉన్న వారు తిరిగొచ్చి డిపాజిట్ చేసేందుకు మార్చి 31 దాకా, ప్రవాస భారతీయులకు జూన్ 30 దాకా గడువుందని ఆయన గుర్తు చేశారు. అలాగే సహకార బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తాలను, భారత కరెన్సీ చెల్లుబాటయ్యే నేపాల్, భూటాన్ దేశాల నుంచి వచ్చే నగదును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. జూన్ 30 నాటికి ఎన్నారైల డిపాజిట్లకు గడువు ముగిసిపోతుంది కనుక.. ఆ తర్వాతే సమగ్ర వివరాలు అందుబాటులోకి రాగలవని స్పష్టం చేశారు. డీమోనిటైజేషన్‌కు ముందు మొత్తంగా దాదాపు రూ.15.45 లక్షల కోట్ల నగదు చలామణీలో ఉన్నట్లు అంచనా. అందులో 86 శాతం వాటా పాత రూ. 500, రూ. 1,000 నోట్లదే. అయితే పెద్ద నోట్ల రద్దు అనంతరం రిజర్వు బ్యాంకు రూ.9.92 లక్షల కోట్లు విలువ చేసే కొత్త కరెన్సీ నోట్లను అందుబాటులోకి తెచ్చినట్లు గాంధీ చెప్పారు. -
మార్చి 8న రాష్ట్ర బడ్జెట్
3 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 18 పనిదినాలకే పరిమితం ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంలో ప్రభుత్వం సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18) బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోజున ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. మార్చి 8వ తేదీన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలను కేవలం 18 పనిదినాలకే పరిమితం చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రారంభమై మార్చి నెలాఖరు వరకు జరుగుతాయి. అయితే ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించడానికి, చర్చించడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతోనే ప్రభుత్వం వీలైనన్ని తక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోందని అధికార పార్టీకి చెందిన నేతలే పేర్కొంటున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే అంశంపై పలు ఆందోళనలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో విశాఖ బీచ్‌లో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునివ్వడమే కాకుండా ఆయనే స్వయంగా ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖపట్టణం వస్తే విమానాశ్రయంలోనే పోలీసుల చేత ప్రభుత్వ పెద్దలు నిర్భంధించిన సంగతి తెలిసిందే. -
‘పది’ పరీక్షలకు వేళాయెనే..
తొలిసారి సీసీఈ విధానంలో పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో తొలి ప్రీ ఫైనల్ మార్చి 17 నుంచి జరిగే పబ్లిక్ పరీక్షలకు 65,029 మంది విద్యార్థులు రాయవరం : పదో తరగతి పరీక్షలకు సమయం ముంచుకొస్తోంది. మరో 45 రోజుల్లో పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది గతానికి పూర్తి భిన్నంగా పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారి సీసీఈ విధానంలో పరీక్షలు జరగనుండగా వచ్చే నెల మొదటి వారంలో తొలి ప్రీఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పబ్లిక్ పరీక్షలకు తేదీలు ఖరారు చేయడంతో పది విద్యార్థుల్లో పరీక్షల ఫీవర్ ప్రారంభమైంది. 65,029 మంది విద్యార్థులు.. జిల్లాలో 303 పరీక్షా కేంద్రాల్లో 65,029 మందికి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 32,188 మంది బాలురు, 32,834 మంది బాలికలు 10వ తర గతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నారు. 462 జెడ్పీ, 24 ప్రభుత్వ, 48 ఎయిడెడ్, 47 మున్సిపాలిటీ, 12 కస్తూర్బా, 38 ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ ఉన్నత పాఠశాలలు, రెండు మోడల్ స్కూల్స్ 15 సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులతోపాటు ప్రైవేటు ఉన్నత పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక తరగతులు జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ప్రారంభమయ్యాయి. నూతన విధానంలో.. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గత పరీక్షలకు భిన్నంగా ఈ ఏడాది నుంచి సీసీఈ విధానంలో జరగనున్నాయి. గతంలో ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయించి ఫలితాలు ప్రకటించేవారు. అయితే ఈ కొత్త విధానంలో ప్రతి సబ్జెక్టుకు 80 మార్కులకే పరీక్ష నిర్వహించనున్నారు. మిగిలిన 20 మార్కులు అంతర్గత మూల్యాంకనం ద్వారా కేటాయించనున్నారు. పరీక్షల్లో పది పాయింట్లు సాధించాలంటే అన్ని సబ్జెక్టుల్లో 91 మార్కులు తప్పనిసరిగా సాధించాలి. అలాగే ఈ ఏడాది నుంచి గణితం, సై¯Œ్స, సోషల్ పరీక్షల్లో 1,2 మార్కుల ప్రశ్నలకు చాయిస్ ఉండదు. అంతర్గత మూల్యాంకన మార్కులు ఇలా.. అంతర్గత మూల్యాంకనం ద్వారా ప్రతి సబ్జెక్టుకు 20 మార్కులు లభించనున్నాయి. నిర్మాణాత్మక మూల్యాంకనం (ఎస్ఏలో విద్యార్థికి లభించిన మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో నిర్వహించే యూనిట్ పరీక్షల స్థానంలో ఈ ఏడాది ఎఫ్ఏ పరీక్షలు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షల స్థానంలో ఎస్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యా సంవత్సరం మొత్తం మీద నాలుగు ఎఫ్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఎఫ్ఏ పరీక్ష 50 మార్కులకు నిర్వహిస్తున్నారు. ఈ 50 మార్కుల్లో లఘు పరీక్ష ద్వారా 20 మార్కులు, ప్రాజెక్టులకు 10 మార్కులు, రాత అంశాలకు 10 మార్కులు ఉంటాయి. నాలుగు ఎఫ్ఏ పరీక్షలకు కలిపి 200 మార్కులు. సమ్మేటివ్ అసెస్మెంట్లు (ఎస్ఏ) రెండు ఉంటాయి. ఒక్కోదానికి 80 మార్కులకు నిర్వహిస్తారు. రెండు ఎస్ఏ పరీక్షలను 160 మార్కులకు నిర్వహిస్తారు. ఎస్ఏ, ఎఫ్ఏ పరీక్షల మొత్తం మార్కులు 360ను 18తో భాగించి 20బమార్కులకు విద్యార్థికి అంతర్గత మూల్యాంకనం మార్కులు కేటాయిస్తారు. గతంలోకంటే భిన్నంగా ప్రతి సబ్జెక్టులోనూ 20 మార్కులు అంతర్గత మూల్యాంకనం నుంచి మిగిలిన 80 మార్కులకు విద్యార్థి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉంది. సబ్జెక్టు పబ్లిక్ పరీక్షలు తెలుగు–1 మార్చి 17 తెలుగు–2 మార్చి 18 హిందీ మార్చి 20 ఇంగ్లీష్–1 మార్చి 21 ఇంగ్లీష్–2 మార్చి 22 గణితం–1 మార్చి 23 గణితం–2 మార్చి 24 పీఎస్ మార్చి 25 ఎ¯ŒS మార్చి 27 సోషల్–1 మార్చి 28 సోషల్–2 మార్చి 30 -
మార్చి 21 నుంచి పైతరగతుల బోధన
మార్చి 15 నుంచి ఒంటి పూట బడుల్లేవ్! సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయాల్సిన విద్యా కార్యక్రమాలతో కూడిన అకడమిక్ కేలండర్ రూపకల్పనకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. నెలవారీ విద్యా కార్యక్రమాలు, సాధించాల్సిన లక్ష్యాలు, సెలవులు తదితర వివరాలతో కూడిన కేలండర్‌ను రూపొందిస్తోంది. జూన్‌లో ప్రారంభించాల్సిన పైతరగతుల బోధనను ఈసారి సీబీఎస్ఈ స్కూళ్ల తరహాలో మార్చి 21 నుంచే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. వేసవి ఎండల నేపథ్యంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ప్రతి ఏటా నిర్వహించే ఒంటి పూట బడుల విధానం లేకుండా చూడాలని భావిస్తోంది. ఆయా తేదీల్లోనూ రెండు పూటల బడులు నిర్వహిం చేలా కసరత్తు చేస్తోంది. పైతరగతుల బోధనను మార్చి 21 నుంచి ప్రారంభించి.. ఏప్రిల్ 23 వరకు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ ఆలోచనకు వచ్చింది. ఇక వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఇచ్చేలా కేలండర్లో పొందుపరుస్తోంది. -
ఆర్యూ లో ధర్నా
కర్నూలు (ఆర్యూ) : ప్రత్యేక హోదా కోసం.. రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాయలసీమ యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు వినోద్, బీవీ రమణలు మాట్లాడారు. హోదా కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇప్పకైనా రాష్ట్ర ప్రభుత్వం హోదా కోసం ఉద్యమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి మోహన్, నాయక్, రమేష్, నిర్మల్, రాము, చలపతి తదితరులు పాల్గొన్నారు. -
మార్చి 5న గురుకుల ప్రవేశ పరీక్ష
∙జిల్లాలో ఆరు కేంద్రాల్లో నిర్వహణ ∙ఆ¯ŒSలై¯ŒSలో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ రాజమహేంద్రవరం రూరల్ : ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో ఇంగ్లీషు మీడియం బోధన, వసతి, భోజనం వంటి అన్ని సౌకర్యాలతో చదువుకునేందుకు చక్కని అవకాశం ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు. ఈ విద్యాలయాల్లో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేష¯ŒS విడుదలైంది. ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 38 సాధారణ, 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశానికి ఆ¯ŒSలై¯ŒSలో దరఖాస్తుల స్వీకరణ ఈనెల ఐదవ తేదీ నుంచి ప్రారంభమైంది. ప్రవేశపరీక్ష మార్చి ఐదున ఉదయం 11 గంటల నుంచి రంపచోడవరం, రాజమహేంద్రవరం, పెద్దాపురం, కాకినాడ, రామచంద్రపురం, అమలాపురంలోని కేంద్రాల్లో నిర్వహించనున్నారు. గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన సమాచారం ఇది.. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త. 7వ వేతన సంఘం సిఫారసుల కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యాన్ని (డియర్నెస్ అలవెన్స్)మార్చినుంచి అమలు చేయవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి శుక్రవారం ప్రకటించినట్టు తెలుస్తోంది. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించ వచ్చని భావిస్తున్నారు. గత అక్టోబర్ లో వేతన సంఘం కమిటీ ఉద్యోగుల డీఏ చెల్లింపు ఫైనల్ రిపోర్టు ను సమర్పించింది. 7వ వేతన సంఘం 196 సిఫారసుల్లో 51 లను రద్దు చేయగా 37 ని పునస్సమీక్షించింది. కరవు భత్యం కంటే ఇతర భత్యాలు ఎక్కువగా ఉనాయని వీటిని సమీక్షించాలని తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన వెల్లువెత్తింది. అయితే ఆర్థిక కార్యదర్శి అశోక్ లావాసౌప్ నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. నివేదిక సమర్పణకు గడువును ప్రభుత్వం ఫిబ్రవరి 22, 2017కు పొడిగించింది. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 6 వ వేతన సంఘం సిఫార్సులు కింద డీఏ ను పొందుతున్నారు.అయితే డీఏ ఏ మేరకు ఇస్తారనేది అనేది ఇప్పటికీ అస్పష్టమే. -
మార్చి 7న జంతర్ మంతర్ వద్ద ఆందోళన
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : విశ్రాంత బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 2017 మార్చి 7న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద లక్ష మంది విశ్రాంత ఉద్యోగులతో ఆందోళన చేయనున్నట్టు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య చైర్మ¯ŒS ఎవీవీ సత్యనారాయణ అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమాఖ్య ఆధ్వర్యంలో కుమారి థియేటర్ రోడ్డులో ఉన్న సెంట్రల్ బ్యాంక్ వద్ద గురువారం నిరసన చేపట్టారు. నూరు శాతం డీఏ సౌకర్యాన్ని 2002 సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసిన వారికి కూడా వర్తింపచేయాలని, కుటుంబ పింఛను విధానాన్ని ఇతర శాఖల మాదిరిగా మెరుగుపరచాలని, దేశంలో వేతన సవరణ జరిగినప్పుడు అన్ని శాఖల విశ్రాంత ఉద్యోగులకు అమలు చేస్తున్నట్టుగా పింఛ¯ŒS కూడా అమలు చేయాలని, పింఛ¯ŒS కోసం దరఖాస్తు చేసుకోలేని వారికి అవకాశం కల్పించాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతోనే ఢిల్లీలో ఆందోళన చేపడతామని, తరువాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరణ్‌జైట్లీని కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. కార్యదర్శి కేఏపీ శర్మ, ఉపాధ్యక్షులు శ్రీనివాసమూర్తి, వీకేవీ ప్రసాద్ పాల్గొన్నారు. -
నల్లకుబేరులకు మరో గోల్డెన్ ఛాన్స్
-
నల్లకుబేరులకు మరో గోల్డెన్ ఛాన్స్
న్యూఢిల్లీ: పన్ను ఎగవేత దారులకు కేంద్రం మరో సువర్ణావకాశాన్ని కల్పించింది. కొత్త బ్లాక్ మనీ డిస్ క్లోజర్ పథకాన్ని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా శనివారం ప్రకటించారు. ఇది రేపటినుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఆదాయ వెల్లడికి గాను ఇచ్చిన ఈ అవకాశం మార్చి 31, 2017తో ముగిస్తుందని వెల్లడించారు. 50 శాతం పన్ను, జరిమానాతో ఈ గడువు లోపల ఆదాయాలను వెల్లడించాలని ఆయన సూచించారు. ఇలా వెల్లడించిన ఆదాయ సమాచారాన్ని బహిర్గతం చేయమని అదియా పేర్కొన్నారు. దీనికి సంబంధించి పన్నుల చట్టం 2016 లోని రెండవ సవరణకు దేశాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ ఆమోదం లభించిందని పేర్కొన్నారు. నల్లదనం వివరాలను ప్రజలు కూడా అందించవచ్చని తెలిపారు. దీనికోసం ఒక స్పెషల్ ఈ మెయిల్ ను కూడా క్రియేట్ చేసినట్టే కూడా ఆయన తెలిపారు. కేంద్రం ప్రభుత్వం చేపట్టిన నల్లధనంపై పోరులో ప్రజలు సమాచారం అందించాలనుకున్నవారు blackmoneyinfo@incometax.gov.in అనే మెయిల్ ఐడీకి వివరాలు అందించాలని కోరారు. దీని ద్వారా ప్రభుత్వానికి ప్రజలు నల్లధనం సమాచారం అందించవచ్చని తెలిపారు. -
ధర్నా విజయవంతం చేయండి
దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ విజయనగరం పూల్‌బాగ్ : ఈ నెల ఆరో తేదీన కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవీ ప్రభాకర్ కోరారు. దళితులను చైతన్యం చేసేందుకు దళితవాడల్లో చేస్తున్న పాదయాత్ర శుక్రవారం జొన్నలగుడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో జరగనున్న దళిత స్వాభిమాన్, సంఘర్ష్, సమ్మేళనానికి దళితులందరూ హాజరుకావాలని కోరారు. దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దళితులంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీలకు ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని.. అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద మంగళవారం చేపట్టనున్న ధర్నాకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఒమ్మి రమణ, ప్రధాన కార్యదర్శి గోకా రమేష్‌బాబు, పట్టణ కన్వీనర్ వై. పైడిరాజు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలమండ ఆనందరావు, జిల్లా కన్వీనర్ జె. మణికుమార్, ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. అప్పలరాజు దొర, బి. జ్యోతి, కె. రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. -
జియో యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పేశారు!
-
జియో యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పేశారు!
జియో యూజర్లకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పేశారు. జియో సిమ్‌పై అందిస్తున్న ఉచిత సేవలను వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నేడు జరిగిన వాటాదారుల సమావేశంలో ఈ ప్రకటనను వెలువరిచారు. ఫేస్బుక్, స్వైప్ కంటే వేగంగా జియో సేవలు దేశంలో విస్తరించాయని ముఖేష్ అంబానీ హర్షం వ్యక్తంచేశారు. ప్రస్తుతం జియో సిమ్‌ను 5 కోట్ల మంది వాడుతున్నారని, నెంబర్ పోర్టబులిటీ స్వీకరించేందుకు జియో సిద్ధంగా ఉందని వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి వంద నగరాల్లో ఇంటికే జియో సిమ్ సౌలభ్యం తీసుకొస్తామన్నారు. కాగిత రహిత సమాజం కోసం జియోను తీసుకొచ్చాం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ జియో ఉచిత సేవలను పొడిగిస్తామని చెప్పారు. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద ఈ ఉచిత సేవలు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. జియో వినియోగదారులకు మిగతా నెట్‌వర్క్‌లు సహకరించడం లేదని ముఖేష్ అంబానీ ఆరోపించారు. సంచలమైన ఆఫర్లతో సెప్టెంబర్‌లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియో ఉచిత 4జీ డేటా, వాయిస్ కాల్స్ సర్వీసులతో పాటు ఇతరాత్ర ఉచిత సేవలు డిసెంబర్ 3తో ముగియనున్న సంగతి తెలిసిందే. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద మరో మూడు నెలలు అంటే వచ్చే ఏడాది మార్చి 31వరకు జియో అందిస్తున్న సేవలన్నింటిన్నీ ఉచితంగా వాడుకోవచ్చని ముఖేష్ అంబానీ గురువారం తెలిపారు. -
పాదయాత్రకు పోలీసుల అడ్డుకట్ట
లక్ష్మిపేట భాదిత కుటుంబాల కోసం సీపీఎం యాత్ర ఉద్రిక్తత.. పాదయాత్ర చేస్తున్న దళిత నేతలను రాజాంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొది. పోలీసులకు, దళిత సంఘాల నేతలకు మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ముందుగానే పాదయాత్ర చేస్తున్నట్లు సమాచారం ఇచ్చిన తమను అడ్డుకోవడం తగదని దళిత నేతలు మండిపడ్డారు. పాదయాత్రను సైతం దురుసుగా అడ్డుకుని బలవంతంగా తమను వ్యాన్లు ఎక్కించడం అప్రజాస్వామ్యమని అన్నారు. రాజాం : వంగర మండలంలోని లక్ష్మిపేట గ్రామ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.మాల్యాద్రి పేర్కొన్నారు. లక్ష్మిపేట బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, ప్రభుత్వ తాత్సరాన్ని నిరసిస్తూ స్థానిక బస్టాండ్ వద్ద గురువారం ఆయన సీపీఎం చేపట్టిన పాదయాత్రను ప్రారంభించారు. యాత్ర బస్టాండ్ నుంచి అంబేడ్కర్ విగ్రహాం వరకు చేరుకోగానే పోలీసులు పాదయాత్రను అడ్డుకున్నారు. పాదయాత్రలో పాల్గొన్న 11 మందిని లగేజి ఆటోలపై ఎక్కించారు. రాజాం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లో ఉంచి అనంతరం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా మళ్లీ పాదయాత్రను ప్రారంభించిన ఆయన దళిత సంఘాల నేతల శాంతియుత పోరాటాన్ని పాలకులు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. లక్ష్మిపేటలో దోషులను వెంటనే శిక్షించడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 69 వెంటనే అమలు చేయాలని కోరారు. లక్ష్మిపేట బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మడ్డువలస రిజర్వాయర్ మిగులు భూములను దళితులకు మాత్రమే పంపిణీ చేయాలని కోరారు. తమ పాదయాత్రను రాజాం, సంతకవిటి, రేగిడి, వంగర, వీరఘట్టం మండలాలు మీదుగా పాలకొండ వరకు ఈ నెల 21న వరకు నిర్వహిస్తామని తెలిపారు. 21న పాలకొండలో ధర్నా చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి డి.గణేష్, సీపీఎం డివిజన్ నాయకులు సీహెచ్ రామ్మూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నేతల అరెస్టులకు ఖండన శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : లక్ష్మిపేట దళితులకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రను భగ్నం చేస్తూ యాత్రలో పాల్గొన్న కార్యకర్తల్ని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. లక్ష్మిపేట నరమేధం జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా నేటికి బాధిత కుటుంబాలకు ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, భూమిని ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, చట్టంలో ఉన్నా అమలు చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రధాన ముద్దారుు అరుున బొత్స వాసుదేవనాయుడును పార్టీలో చేర్చుకుని అందలం ఎక్కించడం ప్రభుత్వ నీతిని తెలియజేస్తోందని తెలిపారు. పాదయాత్రను భగ్నం సీపీఎం నాయకులు జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి, జిల్లా కన్వీనర్ డి.గణేష్, సీపీఎం నాయుకులు రామ్మూర్తినాయుడు, మజ్జి గణపతిలతో పాటు 24మందిని అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజల నుంచి దూరమవుతున్న టీడీపీ పోలీసులతో అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకోవడం రాక్షస పాలనవుతుందని పేర్కొన్నారు. ఈ వైఖరిని మార్చుకోకుంటే తగిన మూల్యం చెలించుకోక తప్పదని తెలిపారు. -
నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల ర్యాలీ
-
నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల ర్యాలీ
నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల ర్యాలీ న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ విపక్షాలు బుధవారం ర్యాలీ నిర్వహించాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ నేతృత్వంలో విపక్షాలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఈ ర్యాలీ చేపట్టాయి. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఈ అంశంపై చర్చించనున్నాయి. కాగా ఈ భారీ ర్యాలీలో శివసేన, నేషనల్ కాన్ఫరెన్స్, ఆప్, ఎన్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత బెనర్జీ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. మరోవైపు విపక్షాల ర్యాలీని బీజేపీ తప్పుబట్టింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమం, చారిత్రతాత్మకమని అభివర్ణించింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. -
చైనాకు ఝలక్.. దలైలామాకు ఓకే
న్యూఢిల్లీ/ధర్మశాల: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా త్వరలో భారత్‌లో అడుగుపెట్టనున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఇచ్చిన ఆహ్వానానికి అంగీకరించిన ఆయన కొత్త ఏడాదిలో(2017) మార్చి మధ్యలో అక్కడి తవాంగ్ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అయితే, ఈ పర్యటనపై ఈ నెల ప్రారంభంలోనే ప్రకటన వెలువడినప్పటికీ దీనిపై అధికారికంగా ధ్రువీకరణ జరగలేదు. దలైలామా పర్యటనతో భారత్-చైనా సంబంధాలు ఎలా ఉంటాయో అనే చర్చ ప్రారంభమైంది. అంతకుముందు అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు రానుండగా బీజింగ్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. భారత్-చైనా మధ్య ఈ ప్రాంతంపై వివాదం ఉన్న నేపథ్యంలో అమెరికా అందులో అడుగుపెట్టొద్దని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దలైలామా పర్యటన ఏ పరిణామాలకు దారి తీస్తుందో అని ఆసక్తి నెలకొంది. అయితే, భారత్ మాత్రం దలైలామా పర్యటనపై తన వైఖరి కుండబద్ధలు కొట్టింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఈ అంశంపై ప్రకటన చేస్తూ'బౌద్ధ మత గురువు దలైలామా భారత అతిథి. ఆయన దేశంలో ఎక్కడైనా పర్యటించవొచ్చు. ఆయన గతంలో అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఇప్పుడు మరోసారి పర్యటనకు వచ్చినా ఏమీ జరగబోదని భావిస్తున్నాం' అని స్పష్టం చేశారు. -
జియో కస్టమర్లకు మరో గుడ్ న్యూస్!
రిలయన్స్ జియో ఉచిత సేవలనుభవిస్తున్న కస్టమర్లకు శుభవార్త. డిసెంబర్ 3తో ముగియనుందనే ఉచిత 4జీ డేటా, వాయిస్ కాల్స్ ఆఫర్, మరో మూడు నెలలు పాటు పొడిగించే అవకాశాలున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. పరిస్థితుల డిమాండ్ బట్టి ఉచిత సేవలను విస్తరించే అవకాశముందని పేర్కొంటున్నాయి. తాజా రిపోర్టు ప్రకారం ఉచిత డేటా, వాయిస్ కాల్స్ సర్వీసులను మార్చి 2017 వరకు విస్తరించనున్నామని విశ్లేషకులకు రిలయన్స్ జియో తెలియజేసినట్టు సమాచారం. ట్రాయ్ నిబంధనల మేరకు, ఏ టెలికాం ఆపరేటర్ కూడా వెల్కమ్ ఆఫర్ కింద ఉచిత సేవలను 90 రోజుల కంటే ఎక్కువ రోజులు అందించడానికి వీలులేదు. దీంతో ట్రాయ్ నిబంధనల మేరకు ఈ సేవల కటాఫ్ తేదీని డిసెంబర్ 3గా కంపెనీ నిర్ణయించింది. కానీ వినియోగదారులకు ఇచ్చిన వాగ్దానం మేరకు సేవలందించలేని పక్షంలో, కస్టమర్ల నుంచి చార్జీలను వసూలు చేయడం కూడా న్యాయవిరుద్ధమని కంపెనీ ఓ మేరకు ఉచిత సేవలు కటాఫ్ తేదీని పెంచే ఆలోచనలు ఉన్నట్టు సిగ్నల్స్ ఇచ్చింది. ఇంటర్కనెక్షన్ సమస్యలతో కస్టమర్లు నాణ్యమైన సేవలు అందుకోలేకపోతున్నారని, తాము అందింద్దామనుకున్న సేవలను కస్టమర్లు సరిగా వినియోగించుకోలేకపోతున్నారని రిలయన్స్ జియో స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ అధినేత అన్షుమాన్ థాకూర్ తెలిపారు. డిసెంబర్ తర్వాత ఉచిత సేవలు కొనసాగించడానికి ట్రాయ్ నుంచి తమకు అనుమతి అవసరం లేదని కూడా థాకూర్ వ్యాఖ్యానించారు. జియో సేవలు లాంచ్ చేసినప్పటి నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా వివిధ రకాల ప్రమోషనల్ ఆఫర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ అందిస్తుందని సిటీ రీసెర్చ్ రిపోర్టుచేసింది. సబ్స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి ఉచిత వెల్కమ్ ఆఫర్‌ను మార్చి 2017వరకు కొనసాగిస్తారని మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషకులు చెప్పారు. ఇంటర్కనెక్షన్ పాయింట్లో మెరుగుదల కనిపించని పక్షంలో, నాణ్యత మెరుగుపరిచే వరకు కస్టమర్లు ఎలాంటి చార్జీలను చెల్లించాల్సినవసరం ఉండదు. ఇది ట్రాయ్ నిబంధనలకు, రిలయన్స్ జియోలకు మధ్య కొంత సంఘర్షణకు దారితీసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వెల్కమ్ ఆఫర్ పేరును మార్చి, ఉచిత డేటా, కాల్స్‌ను కస్టమర్లకు కొనసాగించడానికి జియో సన్నాహాలు చేస్తున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. -
మాదిగల మహా పాదయాత్రను విజయవంతం చేయాలి
హాలియా : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఈనెల 16 నుంచి 70 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న మాదిగల మహాపాద యాత్రను విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (టీఎస్) రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌మాదిగ కోరారు. శనివారం హాలియాలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాపాద యాత్ర కొలనుపాక జాంభవంతుడి ఆలయం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. చేతి వృత్తులు, చెప్పులు కుట్టే, డప్పు కొట్టే వారికి నెలకు రూ.2 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అధికార ప్రతినిధి బాకి యాదయ్య, జిల్లా ఇన్చార్జి చింతబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకమర్రి గణేష్, అనిల్‌కుమార్, తులసీదాస్, దైద రవి, పెరుమాళ్ల కుమారి, లింగాల పెద్దన్న, బొంగరాల Ðð ంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీను, పోలె చక్రవర్తి, మారుపాక నరేందర్, మాతంగి దేవయ్య, బొజ్జ భిక్షం, జిల్లా విజయ్, విక్రం, యాదయ్య, రమణయ్య, దున్న శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఊపిరున్నంతవరకు పాదయాత్ర
- 24ఏళ్లుగా దేశవ్యాప్తంగా భగీచాసింగ్ యాత్ర - గుట్కాలు, భ్రూణహత్యలు, బాల్యవివాహాలు, మద్యం నిషేధంపై పోరాటం - 1992లో హర్యానాలో యాత్ర ప్రారంభం.. 23రాష్ట్రాల్లో పూర్తి - మొత్తం 5.90లక్షల కి.మీ. ప్రయాణం - తెలంగాణలోకి అడుగు.. తాండూరు: ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు భగీచాసింగ్. 82ఏళ్లు. ఈయన భుజాన పెద్దపెద్ద బ్యాగులు.. జాతీయ జెండాలు చూస్తేంటే ఎవరో పర్వతారోహకుడు అనిపిస్తోంది కదూ. అదేమీ కాదు.. గుట్కాలు, సిగరెట్లు, భ్రూణహత్యలు, బాల్యవివాహాలు, మద్యం నిషేధించాలని 24ఏళ్లుగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తున్నాడు. భుజాన 90 కిలోల భరువున్న బ్యాగులు మోస్తూ 1992లో హర్యానాలో మొదలైన ఆయన ప్రయాణం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి 23 రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తి చేశాడు. ఆదివారం ఆయన పాదయాత్ర కర్ణాటక రాష్ట్రం చించోళి మీదుగా తాండూరు పట్టణంలోకి ప్రవేశించింది. మొదట్లో రోజుకు 40కి.మీ. పాదయాత్ర చేసిన ఆయన ప్రస్తుతం కంటిచూపు మందగించడంతో 20కి.మీ.చేస్తున్నాడు. ఎన్ని కష్టాలెదురైనా దృఢసంకల్పంతో తన యాత్ర ముందుకు సాగిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు 5.90లక్షల కి.మీ. ప్రయాణం చేసినట్టు చెప్పారు. పాదయాత్రలో భాగంగా తనను కలిసే పెద్దల నుంచి విరాళాలతోనే భోజనం, ఇతర అవసరాలకు తీర్చుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. సమాజంలో గుట్కాలు, సిగరెట్లు, మద్యం తదితర అలవాట్లతో యువత చెడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతలో మార్పు రావాలన్నదే తన తాపత్రయమన్నారు. భ్రూణహత్యలు, బాల్యవివాహాలు తదితర సామాజిక దురాగతాలను నిర్మూలించడానికి ఈ పాదయాత్ర దోహదపడాలన్నదే తన ఆశయమని వివరించారు. హైదరాబాద్ చేరుకున్నాక సీఎం కేసీఆర్‌ను కలుసుకుంటానని, తరువాత ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తానని భగీచాసింగ్ వివరించారు. ‘పాదయాత్ర ఎప్పుడు ముగిస్తానో నాకు తెలియదు.. ఎప్పటి వరకు చేస్తానో కూడా తెలియదు.. ఊపిరి ఉన్నంత వరకు కొనసాగిస్తూనే ఉంటాను’ అంటున్నారు. -
అఖిలపక్షం పాదయాత్రలో ఉద్రిక్తత
- కొడంగల్ ఎత్తిపోతల సాధన యాత్రను అడ్డుకున్న టీఆర్ఎస్ నాయకులు - పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం కోయిల్‌కొండ(మహబూబ్‌నగర్ జిల్లా) నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా కోయిల్‌కొండ మండలానికి ప్రయోజనమేమీ లేదని, ఈ ప్రాంత ప్రజలను ఎందుకు రెచ్చ గొడుతున్నారని అఖిలపక్షం చేపట్టిన పాదయాత్రను ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలంలోని శేరివెంకటాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు అడ్డుకుని నిలదీశారు. జలసాధనకమిటీ జిల్లా అధ్యక్షుడు అనంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోథకం సాధన కోసం పదిరోజులుగా పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, టీడీపీ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రెడ్డిగారి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర శేరివెంకటాపూర్ గ్రామానికి చేరుకుంది. గ్రామంలో ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తుండగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు, రైతులు అడ్డుకున్నారు. గతంలో జూరాల ద్వారా 38గ్రామాలను ముంచడానికి ప్రభుత్వం కోయిల్‌కొండ రిజర్వాయర్ అనుమతి చెప్పడం ద్వారా ఈప్రాంత మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి కృషితో ప్రాజెక్టు నిలిచిందని, మునిగే 38గ్రామాలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోథల పథకం ద్వారా కర్వెన నుంచి సాగునీరు అందించేందుకు కషిచేస్తున్నారని అన్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తవాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఈ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలకు శాంతింపజేశారు. ఈ ఘటనను నిరసిస్తూ నారాయణపేట నియోజకవర్గ వ్యాప్తంగా అఖిలపక్ష కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. -
ఊపందుకున్న జీడీపీ వృద్ధి రేటు
న్యూఢిల్లీ : భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు పెరిగింది. మార్చి త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు 7.9 శాతంగా నమోదైందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గత త్రైమాసికంలో ఈ రేటు 7.2 శాతంగా నమోదైంది. అదేవిధంగా మార్చి నెలతో ముగిసిన 2015-16 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదైందని ప్రభుత్వం గణాంకాలు ప్రకటించాయి. గత 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 7.2 శాతంగానే ఉంది. అంచనావేసిన దానికంటే ఎక్కువగానే జీడీపీ వృద్ది రేటు ఊపందుకుందని ఆర్థిక నిపుణులు తెలిపారు. కోర్ రంగ జోరు.. అదేవిధంగా కోర్ రంగ ఉత్పత్తి వరుసగా ఐదు నెల కూడా పెరిగింది. ఏప్రిల్ లో నెలల్లో ఈ రంగం 8.5శాతం వృద్ధి నమోదుచేసిందని వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.. మార్చి నెలల్లో ఈ రంగ వృద్ధి 6.4 శాతంగా నమోదైంది. అయితే గతేడాది ఇదే నెలలో ఈ రంగ వృద్ది 0.2 శాతం పడిపోయింది. ఎనిమిది పరిశ్రమ రంగాలు కోల్, క్రూడ్ ఆయిల్, నాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్ లు, ఫెర్టిలైజర్లు, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ లతో కోర్ సెక్టార్ ఇండెక్స్ ను కొలుస్తారు. పరిశ్రమ ఉత్పత్తిలో వీటి వాటా 38 శాతంగా ఉంటుంది. ఈ ఎనిమిది రంగాల్లో ఐదు రంగాలు పాజిటివ్ వృద్దినే నమోదుచేయడంతో ఏప్రిల్ నెలలో కోర్ రంగ వృద్ధి గత నెలకంటే 2.7శాతం పెరిగిందని గణాంకాలు తెలిపాయి. -
డీలా పడిన యూకో బ్యాంకు
ముంబై : యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు(యూసీఓ) వరుసగా రెండో త్రైమాసికం కూడా నష్టాలనే నమోదుచేసింది. శుక్రవారం ప్రకటించిన మార్చి త్రైమాసిక ఫలితాల్లో రూ.1,715.16 కోట్ల నికర నష్టాలను బ్యాంకు ప్రకటించింది. రుణాల ఎగవేత పెరగడం, నికర వడ్డీల ఆదాయం తక్కువగా ఉండటంతో ఈ నష్టాలను నమోదుచేసినట్టు బ్యాంకు వెల్లడించింది. రుణాలు ఇవ్వడం ద్వారా వచ్చే నికర వడ్డీల ఆదాయం(ఎన్ఐఐ) 26.85శాతం పడిపోయి రూ.933.11కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ ఆదాయాలు రూ. 1,275.67కోట్లగా ఉన్నాయి. వడ్డీల ద్వారా వచ్చే ఆదాయాల కాకుండా, ఇతరేతర ఆదాయాలు కూడా 41.47శాతం పడిపోయాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయాలు రూ.662.55 కోట్లు ఉంటే, ఈ ఏడాది ఈ క్వార్టర్లో రూ.387.80 కోట్లగానే ఉన్నాయని బ్యాంకు తెలిపింది. బ్యాంకుకు వసూలు కాని అప్పులు 142.44శాతం పెరిగి రూ.2,344.80 కోట్లగా ఉండటంతో వరుస నష్టాలను యూఎస్ఓ నమోదు చేస్తుందని బ్యాంకు తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో వసూలు కాని రుణాలు రూ.2,360.84 కోట్లగా ఉన్నాయి. బ్యాంకుకు ఉన్న మొత్తం రుణశాతంలో, స్థూల మొండిబకాయిలు మార్చి త్రైమాసికంలో 15.43శాతం పెరిగాయి. కిందటి క్వార్టర్లో ఇవి 10.98శాతమే ఉన్నాయి. నికర మొండిబకాయిల 4.3శాతం నుంచి 9.09శాతం పెరిగినట్టు బ్యాంకు ప్రకటించింది. యూఎస్ఓ ఈ త్రైమాసికంలో నమోదుచేసిన నష్టాలతో, స్టాక్ మార్కెట్లో ఈ బ్యాంకు షేర్లు 5శాతం మేర పడిపోయాయి. -
దిగి వస్తున్న ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : సోమవారం విడుదల చేసిన మార్చి నెల టోకుధరల ద్రవ్యోల్బణం సూచీ శుభసంకేతాలు అందించింది. వరుసగా 17 నెలలుగా నేలచూపులు చూస్తున్న ద్రవ్యోల్బణం ఈ నెలలో కూడా పతనమైంది. క్రమేపీ దిగి వస్తూ మార్చి నెలలో 0.85 శాతంగా నమోదైంది. దీంతో గత కొంతకాలంగా భగ్గుమంటున్న టోకు ధరలు దిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. అటు ఈనెలలో విడుదల అవుతున్న ఫలితాలన్నీ మార్కెట్ కు సానుకూల సంకేతాలను అందిండంతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఓ వైపు టోకుధరల ద్రవ్యోల్బణం క్షీణత, మరోవైపు ఇన్ఫోసిస్ షేర్ల లాభాలు, మార్కెట్లకు మంచి ఉత్సాహాన్నిచ్చాయి. దీంతో 162 పాయింట్లకు పైగా లాభపడి జోరుగా ట్రేడ్ అవుతోంది. ఫిబ్రవరి నెలలో ఈ టోకుధరల ద్రవ్యోల్బణం 0.91శాతంగా ఉంది. ఆయిల్ ధరలు, తయారీ ఉత్పత్తుల ధరలు పడిపోవడంతో టోకుధరలు తగ్గినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కిందటేడాది మార్చి కంటే క్రూడ్ ధరలు 8.30శాతం పడిపోయాయి. తయారీ ఉత్పత్తులు 0.13 శాతం కిందకు జారాయి. ఈ టోకుధరల ద్రవ్యోల్బణం లెక్కించడంలో వాణిజ్య ఆహారోత్పత్తులతో పాటు క్రూడ్, విద్యుత్, తయారీ ఉత్పత్తులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఫిబ్రవరిలో 3.35 శాతంగా ఉన్న ఆహారోత్పత్తుల ధరలు మార్చిలో 3.7శాతం కు పెరిగాయి. వాణిజ్య ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతూ ఉండటంతో, అధిక వేగంతో ధరల తగ్గుదలను (డిఫ్లేషన్) నిరోధిస్తుందని ఐసీఆర్ఏ ఎకనామిస్ట్ అదితీ నాయర్ చెప్పారు. దీనివల్ల రూపాయి విలువ కూడా పెరుగుతుందన్నారు. వినియోగదారుల సూచీలో రిటైల్ ఆహారోత్పత్తులకు ముఖ్య పాత్ర ఉండగా, టోకు ధరల సూచీలో వాణిజ్య ఉత్పత్తులను, కమోడిటీలను ప్రధాన ఉత్ప్తత్తులుగా తీసుకుంటారు.