మార్చి క్వార్టర్‌లో జియో రూ. 25,331 కోట్లు
న్యూఢిల్లీ: మార్చి త్రైమాసికంలో టెలికం సంస్థల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. రిలయన్స్ జియో ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) అత్యధికంగా 10 శాతం వృద్ధి చెంది రూ. 22,985 కోట్ల నుంచి రూ. 25,331 కోట్లకు చేరింది. అటు భారతీ ఎయిర్‌టెల్‌ది 13.25 శాతం పెరిగి రూ. 15,500 కోట్ల నుంచి రూ. 20,952 కోట్లకు ఎగిసింది.
వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ స్వల్పంగా 2.22% పెరిగి రూ. 7,211 కోట్ల నుంచి రూ. 7,371 కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ ఆదాయం 4.41 శాతం తగ్గి రూ. 1,992 కోట్లకు, ఎంటీఎన్‌ఎల్ ఆదాయం 14% క్షీణించి రూ. 157 కోట్లకు పరిమితమైంది. మొత్తం టెల్కోల ఏజీఆర్ 9% వృద్ధి చెంది రూ. 70,462 కోట్లకు చేరింది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజులను లెక్కించడానికి ప్రభుత్వం ఏజీఆర్‌నే పరిగణనలోకి తీసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment