earnings
-
అక్కడ భర్త జీతం అంతా భార్య చేతిలో పెట్టాల్సిందేనట..!
ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ చేతినిండా డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఇదివరకటి రోజుల్లో పరిస్థితులు వేరు. భర్త సంపాదిస్తే.. భార్య ఇంటి బాధ్యతలు చూసుకునేది. తన సంపాదనలో నుంచి ఇంటి ఖర్చులు పోను.. కొంత డబ్బును భార్యకు పాకెట్‌మనీగా ఇచ్చేవాడు భర్త. అదీగాక మన దేశంలో ఎక్కడ భర్త జీతం మొత్తం తీసుకొచ్చి భార్య చేతలో పెట్టడమనేది అస్సలు జరగని పని. కానీ జపాన్‌లో మాత్రం జీతం రాగానే రూపాయి ఖర్చు చేయకుండా డబ్బు మొత్తం భార్య చేతిలో పెట్టాల్సిందేనట!ఆపై దానిపై అధికారమంతా ఆమెదే! డబ్బు నిర్వహణ మొత్తం భార్యలే చూసుకోవడం, కొంత మొత్తాన్ని భర్తకు పాకెట్‌మనీగా ఇవ్వడం అక్కడ ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ పద్ధతిని అక్కడ ‘కొజుకై’గా పిలుస్తారు. అక్కడి జనాభాలో దాదాపు 74 శాతం మంది దంపతులు ఇప్పటికీ ఈసంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అదీగాక చైనా మహిళలు పొదుపు విషయంలో ఇతర దేశాల మహిళకు స్ఫూర్తిగా ఉంటారట.ఇంటి ఖర్చుల గురించి ఇల్లాలి కంటే బాగా ఎవ్వరికీ తెలియదు. ! అందుకే మహిళల్ని హోమ్ మినిస్టర్లు అని పిలుస్తుంటారు. అయితే జపాన్‌లో భార్యలు ఉద్యోగం చేసినా, చేయకపోయినా.. ఇంటి ఖర్చుల కోసం కొంత డబ్బును భార్య చేతికిస్తారు భర్తలు.ఇది అక్కడ సర్వసాధారణం.పొదుపు మదుపుల్లో నిష్ణాతులు వారే..అక్కడ చాలావరకు ప్రతి ఇంట్లో సంపాదనంతా తెచ్చి భార్య చేతిలో పెట్టే భర్తలే కనిపిస్తారట! ఇలా భర్త సంపాదనను ఖర్చులు, పొదుపులు అనే రెండు వర్గాలుగా విభజించుకుంటారట జపాన్ మహిళలు. ఇంటికి సరిపడా నిత్యావసరాలు, రేషన్, ఇతర ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు.. వంటి వాటికి ఖర్చుల కోసం పక్కన పెట్టుకున్న డబ్బును వినియోగిస్తుంటారట అక్కడి మహిళలు!. ఇక ఇందులో నుంచే తమ భర్తకు నెలకు సరిపడా ఖర్చుల కోసం కొంత డబ్బును పాకెట్‌మనీ రూపంలో అందిస్తుంటారు. ఇలా భర్త డబ్బును మేనేజ్ చేస్తూ.. వాళ్లకు పాకెట్‌మనీని అందించే ఈ పద్ధతిని ‘కొజుకై’ అనే పేరుతో పిలుస్తున్నారు జపనీయులు. ఇంటి అవసరాల కోసం డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలిసినంతగా.. పొదుపు-మదుపులపై మహిళలకు అవగాహన ఉండదనుకుంటారు చాలామంది. ఐతే జపాన్ మహిళలు ఇందులోనూ నిష్ణాతులేనట! భర్త తెచ్చిన సంపాదనను ఇంటి అవసరాల కోసం బ్యాలన్స్డ్గా ఖర్చు చేయడంతో పాటు.. మిగిలిన డబ్బును పొదుపు చేయడంలోనూ వారు ముందుంటారట!.ఈ క్రమంలో లాభాలొచ్చే సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు కొంత డబ్బును ప్రత్యేకమైన ‘మనీ పర్సు’లో దాచుకుంటారట! అత్యవసర పరిస్థితుల్లో ఇది తమను ఆదుకుంటుందని వారి నమ్మకం. అంతేకాదు.. ఒకవేళ ఎప్పుడైనా తమ భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చినా లేదంటే తమ భర్త నుంచి విడిపోవాల్సి వచ్చినా.. పరిస్థితులు సద్దుమణిగే దాకా ఈ డబ్బు వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని జపాన్ మహిళలు చెబుతున్నారు. ఏదేమైనా ఆర్థిక విషయాల్లో జపాన్ మహిళల ముందుచూపు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం కదూ!!.(చదవండి: 115 ఏళ్ల బామ్మ..! ఆమె సుదీర్ఘకాల జీవిత రహస్యం ఇదే..!) -
టెల్కోల ఆదాయం జూమ్..
న్యూఢిల్లీ: మార్చి త్రైమాసికంలో టెలికం సంస్థల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. రిలయన్స్ జియో ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) అత్యధికంగా 10 శాతం వృద్ధి చెంది రూ. 22,985 కోట్ల నుంచి రూ. 25,331 కోట్లకు చేరింది. అటు భారతీ ఎయిర్‌టెల్‌ది 13.25 శాతం పెరిగి రూ. 15,500 కోట్ల నుంచి రూ. 20,952 కోట్లకు ఎగిసింది. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ స్వల్పంగా 2.22% పెరిగి రూ. 7,211 కోట్ల నుంచి రూ. 7,371 కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ ఆదాయం 4.41 శాతం తగ్గి రూ. 1,992 కోట్లకు, ఎంటీఎన్ఎల్ ఆదాయం 14% క్షీణించి రూ. 157 కోట్లకు పరిమితమైంది. మొత్తం టెల్కోల ఏజీఆర్ 9% వృద్ధి చెంది రూ. 70,462 కోట్లకు చేరింది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజులను లెక్కించడానికి ప్రభుత్వం ఏజీఆర్‌నే పరిగణనలోకి తీసుకుంటుంది. -
'మిలియనీర్లుగా బిచ్చగాళ్లు'..జస్ట్ 45 రోజుల్లో ఏకంగా రూ. 2.5 లక్షలు..!
బిచ్చగాళ్లని చూడగానే జాలిపడి డబ్బులిస్తాం. అందులోనూ పుణ్యక్షేత్రాల్లోనూ, ప్రుమఖ దేవాలయాల వద్ద ఉంటే భక్తులు కచ్చితంగా డబ్బులు ఇస్తారు. భక్తిపారవశ్యంతో ఇంకాస్త ఎక్కువగానే డబ్బులు ఇస్తారు. దీన్నే బిచ్చగాళ్లు క్యాష్ చేసుకుని పిల్లా జల్లాతో సహా అక్కడకి వాలిపోయి వేర్వేరుగా డబ్బులు సంపాదించడం మొదలు పెడతున్నారు. ఒక రకరంగా చెప్పాలంటే భిక్షాటననే ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారని చెప్పొచ్చు. అందుటోనూ పెట్టుబడి లేని వ్యాపారం. లాభమే గాని నష్టం అంటూ ఉండదు. దీంతో పలువురు వ్యక్తులు భిక్షాటనే వృత్తిగా లక్షల్లో డబ్బులు ఆర్జిస్తూ కోట్లకు పడగెత్తుతున్నారు. అందుకు సంబంధించిన సంచలన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎంతలా ఆ బిక్షగాళ్లు డబ్బులు ఆర్జిస్తున్నారో వింటే కంగుతింటారు. వామ్మో ఏంటీది..? అని నోటి మీద వేలేసుకుంటారు. అసలేం జరిగిందంటే..ఇండోర్‌లోని ఓ మహిళ భిక్షాటన ద్వారా కేవలం 45 రోజుల్లో రూ. 2.5 లక్షలు సంపాదించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు సులభమైన మార్గం భిక్షాటనే. దీంతో కొందరూ దీన్నే వృత్తిగా ఎంచుకుని ఇంటిల్లాపాది నెలకు లక్షలు కూడుబెడుతున్నట్లు తేలింది. సెలవు సమయాల్లో వారి ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయల్లా సుఖంగా సాగిపోతుంది. అందులోని గుళ్ల వద్ద యాచిస్తుంటారు. దీంతో ఓ పక్క ఆదాయానికి ఆదాయం, మరోవైపు పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా భోజనం లభించేస్తోంది. ఇక దీంతో వారి వ్యక్తిగత అవసరాల కంటూ పెద్ద ఖర్చు ఉండదు. అందువల్ల చాలామంది దీన్నే ఆదాయ మార్గంగా ఎంచుకుని డబ్బుల సంపాదిస్తున్న దిగ్బ్రాంతికర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇందులోకి ముక్కుపచ్చలారని పిల్లలను కూడా దించి లక్షలు సంపాదిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక అధికారులు అదుపులోకి తీసుకున్న మహిళ తన సంపాదనలో ఒక లక్ష రూపాయలను తన పుట్టింట్లో ఉంచిన ఇద్దరు పిల్లల కోసం పంపిస్తుందని, ఇక రూ. 50 వేలు పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా..మిగతా డబ్బు వ్యక్తిగత అవసరాలకు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు. ఈ వృత్తిలోనే ఆమె భర్త, చెల్లి మరో ఇద్దరు పిల్లలు కొనసాగుతున్నట్లు చెప్పారు. కుటుంబం మొత్తం ఇండోర్ నుంచి ఉజ్జయినికి వెళ్లే కూడలిలో వేర్వేరు నగరాల్లో భిక్షాటన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధికారులు ఇండోర్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చే కార్యక్రమంలో భాగాంగా తనిఖీలు చేస్తుండగా సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె చెల్లి, బావా, మరో ఇద్దరు పిల్లలు పారిపోయారు. కొద్దిసేపటిలోనే అధికారుల బృందం వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. పైగా అధికారులు వద్ద ఆ మహిళ తానేమి దొంగతనం చేయడం లేదని అడుక్కుంటాను కదా అని ధర్జాగా వాదిస్తోంది. విచారణలో ఆమె 45 రోజుల్లో రూ. 2.5 లక్షల దాక సంపాదించగలనని ఒప్పుకుంది. అంటే ఏడాదికి ఆమె ఆదాయం దగ్గర దగ్గర రూ. 20 నుంచి రూ. 27 లక్షల దాక ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ఇక సెలవు లేదా ఏదైన పర్వదినాల్లో వారి ఆదాయం మరింత ఎక్కువగానే ఉండొచ్చని చెప్పారు అధికారులు. అలాగే ఆమెను అదుపులో తీసుకునే టైంలోనే ఆమె వద్ద రూ. 19,200 లభించినట్లు తెలిపారు. అది కేవలం ఆమె ఏడు రోజుల్లో సంపాదించిన మొత్తం అని చెబుతున్నారు. ఇక ఆమె పిల్లలు ఉదయం నుంచి మధ్యాహ్నాం లోపల రూ. 600 దాక సంపాదిస్తారని అన్నారు. ఇక కుటుంబం మొత్తం మిలియనర్ రేంజ్లో ఉందని, వారికి ఇల్లు, స్మార్ట్ ఫోన్లు, బ్యాంక్ బాలెన్స్‌లు ఉన్నప్పటికీ నగరంలో భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. అంతేగాదు ఈ మహిళ గతేడాది కూడా ఇలాగే పట్టుబడిందని, కౌన్సిలింగ్ ఇచ్చామని అన్నారు. అయినప్పటికీ పోలీసులు కళ్లగప్పి ఇదే యాచక వృత్తిని అవలంభిస్తున్నట్లు తెలిపారు. ఇండోర్‌లో యాచకులు దాదాపు 7 వేల మంది దాక ఉన్నారు. వీరిలో 98.7% వరకు యాచన ద్వారా దండిగా డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఆదాయపు లెక్కల ప్రకారం.. వాస్తవానికి భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను డేటా ప్రకారం..ఏడాదికి రూ. 20 లక్షల పైన సంపాదించేవారు కొద్దిమంది మాత్రమే. దాదాపు 3.25 కోట్ల మంది పన్ను చెల్లింపుదారుల్లో కేవలం 5 లక్షల మంది వ్యక్తుల మాత్రమే 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్నట్లు డేటా చూపిస్తుంది. దీన్ని బట్టి మొత్తం పన్ను చెల్లింపుదారులు సుమారుగా 1.3%గా ఉంటుంది. ఇలా యాచక వృత్తితో లక్షల్లో డబ్బులు గడించే వారే సంగతి బయటకు పొక్కుండా, గణాంకాలకు సైతం దొరక్కుండా తప్పించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. బిచ్చగాళ్లల్లో రకాలు.. బిచ్చగాళ్లలో మూడు వర్గాలు ఉన్నారని చెబుతున్నారు అధికారులు. పెద్ద పెద్ద నగరాల్లో దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల మంది దాక భిక్షాటన చేస్తారని, అందులో పిల్లల సంఖ్యే ఏకంగా మూడువేలకు పైనే ఉన్నట్లు తెలిపారు. వారిలో ఎవ్వరూ లేని అనాధలు మొదటి వర్గం. రాష్ట్రం బయట నుంచి వచ్చి మరీ బిక్షాటన చేసేవారు రెండోవర్గం. యాచక ముఠాలో భాగమైన వారు మూడో వర్గం అని వెల్లడించారు. వారందరి దృష్టిలో యాచక వృత్తి అనేది మంచి ఆదాయ వనరు, పైగా ఎవ్వరూ తమను పట్టుకోరనే ధైర్యంతోనే ఈ యాచక వృత్తిలోకి ప్రజలు వస్తున్నట్లు తెలిపారు. దీనికి తక్షణమే అడ్డుకట్ట వేసి చర్యలు తీసుకోవాలని కౌన్సలర్ రూపాలి జైన్ చెబుతున్నారు. భిక్షాటనే సంపాదనగా భావించడం క్షమించరాని చెడు మనస్తత్వం అని అన్నారు. ఇది సమాజంలోని ఒక వర్గానికి తప్పుడు సందేశం ఇస్తుందని కూడా అన్నారు రూపాలి జైన్. (చదవండి: రియల్ ఐరన్ మ్యాన్ సూట్‌ని రూపొందించిన యూట్యూబర్! నెటిజన్లు ఫిదా) -
పారిశ్రామిక రంగం పరపతి మెరుగుపడుతుంది
న్యూఢిల్లీ: భారత పరిశ్రమల పరపతి డిసెంబర్ త్రైమాసికంలో మెరుగుపడుతుందని, రుణాలపై వడ్డీ చెల్లింపుల కవరేజీ 4.5–5 రెట్లు పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కార్పొరేట్ ఇండియా ఆదాయాలు మెరుగుపడడాన్ని ఇందుకు అనుకూలించే అంశంగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంత్సరం ద్వితీయ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) 601 లిస్టెడ్ కంపెనీల (ఫైనాన్షియల్ సరీ్వసులు మినహా) బ్యాలన్స్ షీట్లను విశ్లేíÙంచిన అనంతరం ఇక్రా ఈ వివరాలు వెల్లడించింది. కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 3.98 శాతం, అంతకుముందు త్రైమాసికంతో పోల్చిచూస్తే 0.64 శాతం మెరుగుపడినట్టు తెలిపింది. కమోడిటీల ధరలు శాంతించడాన్ని సానుకూలంగా పేర్కొంది. ముడి పదార్థాల ధరలు ఇటీవలి కాలంలో తగ్గడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ ఇవి చారిత్రకంగా చూస్తే, ఇంకా ఎగువ స్థాయిల్లోనే ఉన్నట్టు పేర్కొంది. భారత కంపెనీల నిర్వహణ మార్జిన్లు ఇంకా చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకోవాల్సి ఉందని వివరించింది. -
డబ్బుకు డబ్బు.. అవకాశాలు, గేమింగ్ ఇండస్ట్రీపై తల్లిదండ్రుల ధోరణి ఇలా
న్యూఢిల్లీ: దేశంలో ఈ స్పోర్ట్స్ పరిశ్రమ వృద్ధి బాట నడుస్తుండడం, గేమర్లకు విస్తృతమైన కెరీర్ అవకాశాలతోపాటు, ఆదాయాలను పెంచుతున్నట్టు హెచ్‌పీ ఇండియా నిర్వహించిన గేమర్స్ ల్యాండ్‌స్కేప్ స్టడీ, 2023 పేర్కొంది. దేశవ్యాప్తంగా 15 పట్టణాల నుంచి 3,000 గేమర్ల (గేమ్‌లు ఆడేవారు) అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. విశ్రాంతి కోసమే కాకుండా, ఆర్జనకు, గుర్తింపునకు గేమింగ్‌ను సాధనంగా చూస్తున్నారు. గేమింగ్ పట్ల తల్లిదండ్రుల్లోనూ సానుకూల ధోరణి నెలకొంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది. సర్వేలో 500 మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంది. ►గేమ్‌లను సీరియస్‌గా ఆడేవారు ఏటా కనీసం రూ.6 లక్షలు సంపాదిస్తున్నారు. ►2022తో పోలిస్తే 2023లో గేమింగ్‌పై ఆదాయం పెరిగింది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది సీరియస్ గేమర్లు (గేమింగ్‌ను ఉపాధిగా తీసుకున్న వారు) రూ.6–12 లక్షల మధ్య ఆదాయం సంపాదిస్తున్నామని చెప్పారు. ►67 శాతం మంది మొబైల్ ఫోన్ కంటే కంప్యూటర్లోనే గేమ్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ►స్పాన్సర్షిప్, ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్లు గణనీయమైన ఆదాయ వనరులుగా మారాయి. గేమింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇవి తెలియజేస్తున్నాయి. ►గేమింగ్‌ను ఒక అలవాటుగా 42 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు. ఈ పరిశ్రమకు ఉన్న వృద్ధి అవకాశాలతో గేమింగ్ పట్ల తమ దృక్పథంలో మార్పు వచ్చిందని 40 శాతం మంది చెప్పారు. ►అదే సమయంలో గేమింగ్ అవకాశాల పట్ల తల్లిదండ్రులకు సరైన సమాచారం కూడా లేదని తెలిసింది. దీనికి సంబంధించిన సమాచారం కోసం 49 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారు. ►గేమింగ్ కెరీర్లో స్థిరత్వం, సామాజికంగా ఒంటరి కావడంపై ఆందోళన వ్యక్తమైంది. ‘‘భారత్ ప్రపంచంలో టాప్–3 పీసీ (కంప్యూటర్) గేమింగ్ కేంద్రాల్లో ఒకటిగా మారింది. ఎప్పటికప్పుడు ఆవిష్కరణలు, అధునాతన ఉపకరణాల ద్వారా గేమర్ల సాధికారతకు మేము కట్టుబడి ఉన్నాం. గేమింగ్ పరిశ్రమను, గేమర్ల ఆకాంక్షలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం వీలు కల్పించింది’’అని హెచ్‌పీ ఇండియా మార్కెట్ ఎండీ ఇప్సితాదాస్ గుప్తా తెలిపారు. ‘‘ఈస్పోర్ట్స్ రంగం వేగంగా వృద్ధి చెందుతూ, విభిన్న ఉపాధి అవకాశాలను గేమర్లకు కల్పిస్తుండడం ప్రోత్సాహకరంగా ఉంది. భారతీయ యువత అంతర్జాతీయ ఈస్పోర్ట్స్ విభాగంలో తమ స్థానాన్ని మరింత పెంచుకోవడమే కాకుండా, పరిశ్రమలో వ్యాపార అవకాశాలను కూడా సొంతం చేసుకుంటారని భావిస్తున్నాం’’అని హెచ్‌పీ ఇండియా మార్కెట్ పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ విక్రమ్ బేడి పేర్కొన్నారు. -
IPL 2023: ఫ్రీగా చూపించినా.. వేల కోట్లు సంపాదించారు!
ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ ప్రకటనల ఆదాయం భారీ వృద్ధిని సాధించింది. ఏకంగా రూ.10,120 కోట్లు ఆర్జించింది. ఇందులో బీసీసీఐ, ఫ్రాంచైజీ యజమానులు, ప్రసారకర్తలు నేరుగా 65 శాతం ఆర్జించగా, మిగిలిన 35 శాతం ఆదాయం పరోక్షంగా వచ్చినట్లు ఓ నివేదిక పేర్కొంది. రూ. 4700 కోట్లు మార్కెట్ పరిశోధన, విశ్లేషణ సంస్థ ‘రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్’ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీకి చెందిన స్ట్రీమింగ్ రైట్స్ హోల్డర్ జియోసినిమా (JioCinema), టీవీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ ప్రకటనల ద్వారా రూ. 4700 కోట్లు ఆర్జించాయి. రూ. 1450 కోట్లు ఫ్రాంచైజీలకు, రూ. 430 కోట్లు బీసీసీఐకి దక్కాయి. బీసీసీఐ, ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్లు.. ప్రకటనల మొత్తం ఆదాయంలో 65 శాతం ప్రత్యక్షంగా ఆర్జించగా మిగిలిన 35 శాతం పరోక్ష ఆదాయం అంటే సోషల్ మీడియా, సాంప్రదాయ మీడియా, ఇతర ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వచ్చిందని నివేదిక పేర్కొంది. ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లకూ.. ఐపీఎల్ 2023లో డ్రీమ్ 11 వంటి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు రూ.2,800 కోట్లు ఆర్జించాయని నివేదిక పేర్కొంది. 2022 సీజన్లో రూ. 2,250 కోట్లు ఉన్న వీటి స్థూల ఆదాయం 24 శాతం పెరిగింది. కాగా ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ గత ఏడాది జూన్‌లో రిలయన్స్ జియో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు! -
రెడీమేడ్ బిస్కెట్స్ కు ధీటుగా ఆర్గానిక్ బిస్కెట్ల తయారీ
-
ఈ కుక్క సంపాదన రూ.8 కోట్లకుపైనే! ఫాలోవర్లు కోట్లలోనే..
ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది అంటుంటారు.. కానీ టక్కర్ బడ్జిన్ అనే ఈ కుక్కకు సంవత్సరమంతా దానిదే.. ఎందుకంటే సంవత్సరంలో ఇది సంపాదించిన మొత్తం ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు. అమెరికాలోని మిచిగాన్‌లో టక్కర్ బడ్జిన్ అనే కుక్క మిలియన్ డాలర్ల సంపాదనతో సోషల్ మీడియా టాప్ డాగ్‌గా ఉద్భవించింది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్, టిక్‌టాక్, యూట్యూబ్.. ఒక్కటేమిటి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ ఈ కుక్కకు పేజీలు ఉన్నాయి. మిలియన్లకొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ప్రింటెడ్ పెట్ మెమోరీస్ అనే సంస్థ నిర్వహించిన పరిశోధన ప్రకారం.. టక్కర్ అనే ఈ ఐదేళ్ల కుక్క.. రెండు ఏళ్ల వయసు నుంచే సంపాదించడం మొదలు పెట్టింది. తన సోషల్ మీడియా పేజీల్లో ప్రకటనలు, పెయిడ్ పోస్ట్‌లు, ఇతర మార్గాల ద్వారా ఒక మిలియన్ యూఎస్ డాలర్లు (రూ.8 కోట్లకుపైనే) సంపాదించగలిగింది. View this post on Instagram A post shared by TUCKER | The Golden Retriever (@tuckerbudzyn) ఈ కుక్కను పెంచుతున్న కోర్ట్నీ బడ్జిన్ అది సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తోందో వివరించారు. యూట్యూబ్ పెయిడ్ పోస్ట్‌కు గానూ 30 నిమిషాల ప్రీ-రోల్ కోసం 40,000 నుంచి 60,000 డాలర్లు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 3 నుంచి 8 కథనాలకు దాదాపు 20,000 డాలర్లు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కుక్కను చూసుకునేందుకు కోర్ట్నీ, ఆమె భర్త మైక్ ఇద్దరూ వారి ఉద్యోగాలను విడిచిపెట్టారు. టక్కర్, దాని పిల్ల టాడ్‌ను చూసుకునేందుకే అంకితమయ్యారు. 2018లో కేవలం ఎనిమిది వారాల వయసున్న ఆ కుక్కను ఇంటికి తీసుకువచ్చిన రోజున కోర్ట్నీ దాని కోసం ఇన్స్టాగ్రామ్ పేజీని సృష్టించడంతో టక్కర్ స్టార్డమ్ మొదలైంది. తర్వాతి నెలలో టక్కర్ మొదటి వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం టక్కర్‌కు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 25 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. టిక్‌టాక్‌లో 11.1 మిలియన్లు, యూట్యూబ్‌లో 5.1 మిలియన్లు, ఫేస్బుక్లో 4.3 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.4 మిలియన్లు, ట్విటర్లో 62,400 మంది ఫాలోవర్లను ఈ కుక్క సంపాదించుకుంది. ఇదీ చదవండి: Tax Exemption: పన్ను మినహాయింపు.. లీవ్ ఇన్క్యాష్మెంట్పై ఆర్థిక శాఖ కీలక ప్రకటన -
చూడటానికి కిరాణా కొట్టులా... కానీ నెలకు 4 కోట్ల ఆదాయం
-
జాబ్, బిజినెస్ మాకొద్దు.. సంపాదన మాత్రం లక్షల్లో.. ఆ గ్రామంలో అదే ట్రెండ్!
ప్రస్తుత రోజుల్లో గ్రాడ్యుయేట్లుగా కళాశాల నుంచి బయటకొస్తున్న విద్యార్థులు.. ఉద్యోగులుగా మారడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తుండగా.. మరి కొందరు ఐటీ రంగంలో ఇంజనీర్లుగా మారేందుకు కుస్తీ పడుతున్నారు. టీచర్లు, మార్కెటింగ్, వ్యాపారమంటూ.. విద్యార్థులు కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు చాలానే కష్టపడుతుంటారు. అయితే ఏ ఉద్యోగం చేసిన సంపాదనే ధ్యేయంగా పని చేస్తుంటాం. ఈ విషయాన్ని గుర్తించిన ఓ గ్రామంలోని యువత జాబ్, వ్యాపారాలు చేయకుండానే సంపాదించేస్తున్నారు. అదెలాగో తెలుసుకుందాం ఆ గ్రామంలో యువత ఎంచుకున్న దారి అదే ట్రండ్ మారుతోంది.. అందుకు తగ్గట్టే యువత దృక్పథంలో కాస్త మార్పు కనిపిస్తోంది. అందుకే కేవలం ఉద్యోగాలనే కాకుండా ఆఫ్‌బీట్ కెరీర్ల వైపు కూడా ఓ లుక్కేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా సోషల్‌మీడియా యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో యూట్యూబ్‌ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతోంది ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లోని తులసి గ్రామ యువత. గ్రామంలో నివసిస్తున్నప్పటికీ తమకున్న వనరులతో మంచి కంటెంట్‌ని రూపొందించి యూట్యూబ్ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ గ్రామంలో దాదాపు 400 పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామ జనాభా 3000-4000 మధ్య ఉండగా.. వారిలో 30 శాతం అనగా దాదాపు 1000 మంది యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు. అలా మొదలైంది.. ఈ స్టోరీ ఇద్దరు స్నేహితులు గ్రామంలో యూట్యూబ్ వీడియోలు చేయడం ప్రారంభించారు. యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించడం కోసం వీరిద్దరూ చేస్తున్న ఉద్యోగాలను సైతం వదులుకున్నారు. అందులో ఒకరు.. జ్ఞానేంద్ర శుక్లా ఎస్బిఐలో నెట్వర్క్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదిస్తున్న యూట్యూబర్ల గురించి తెలుసుకున్నాడు. తాను ఆ దారిలో ప్రయాణించాలనుకుని, అనుకున్నదే తడవుగా జాబ్ రిజైన్ చేసి వీడియోలపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు, అతను తన ఛానెల్లో 250 కంటే ఎక్కువ వీడియోలను అప్లోడ్ చేశాడు. మరొకరు.. కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేసిన జై వర్మ ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేశాడు. అక్కడ అతను నెలకు 12,000-15,000 రూపాయలు సంపాదించే వాడు. అయితే యూట్యూబ్‌లో వీడియోల ద్వారా దాదాపు రూ.30,000- 35,000 సంపాదన రావడంతో టీచర్ జాబ్‌కు రిజైన్ చేసి ఈ రంగంలోకి అడుగపెట్టాడు. అలా వీరిద్దరి నుంచి యూట్యూబ్ వీడియోలు మొదలయ్యాయి. ప్రస్తుతం వాళ్లిద్దరి సంపాదన ఏడాదికి లక్షల్లో ఉంది. ఇక దాదాపు ఆ గ్రామంలోని ప్రతి కుటుంబం YouTube వీడియోలలో పాల్గొంటుంది. అంతేకాకుండా అక్కడ యువత ఉద్యోగాలను పక్కను పెట్టి.. వీరినే ఫాలో అవుతూ యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం తులసి గ్రామం నుంచి 40-50 ఛానళ్లు తయారవుతున్నాయి. -
క్యూ3లో మెరుగ్గా ఉక్కు కంపెనీల లాభాలు
న్యూఢిల్లీ: సవాళ్లతో గడిచిపోయిన సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో దేశీ ఉక్కు తయారీ సంస్థల లాభదాయకత మెరుగుపడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్, తగ్గుతున్న ముడి ఉత్పత్తుల వ్యయాలు ఇందుకు దోహదపడవచ్చని భావిస్తున్నారు. ‘ఒకవైపు ఉక్కు ధరలు పడిపోతూ మరోవైపు ముడి వస్తువుల రేట్లు.. ముఖ్యంగా కోకింగ్ కోల్ ధరలు పెరిగిపోతూ ఉండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారతీయ స్టీల్ కంపెనీల ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం పడింది. అయితే, కోకింగ్ కోల్ వ్యయాలు తగ్గడం, పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాలు పుంజుకంటూ ఉండటం వంటి అంశాలతో మూడో త్రైమాసికంలో వాటి లాభదాయకత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి‘ అని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా సీనియర్ వైస్–ప్రెసిడెంట్ జయంత రాయ్ చెప్పారు. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఉక్కు రంగం లాభదాయకత ఒక మోస్తరుగా మెరుగుపడవచ్చని ఎక్యూయిట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరి తెలిపారు. సరఫరాపరమైన సవాళ్లతో పెరిగిన ముడి వస్తువుల రేట్లు ద్వితీయార్థంలో తగ్గుముఖం పట్టనుండటం, సీజనల్‌గా డిమాండ్ పుంజుకుని ఉక్కు ధర పెరగడం వంటివి ఇందుకు సహాయపడగలవని తెలిపారు. ప్రాంతీయంగా ఆశావహంగా భారత్.. ముడి వస్తువులు .. ఇతర ఉత్పత్తుల వ్యయాలు అధిక స్థాయిలో ఉండి, ఉక్కు ధరలు గణనీయంగా పడిపోవడం వల్ల సీజనల్‌గా స్టీల్ కంపెనీలకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికంగా బలహీనంగా ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ ఫైనాన్స్) కౌస్తుభ్ చౌబల్ తెలిపారు. అయినప్పటికీ, ప్రాంతీయంగా భారత్ ఆశావహంగానే ఉందని, వచ్చే 12 నెలల్లో స్టీల్ వినియోగం సింగిల్ డిజిట్ శాతంలో వృద్ధి నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. ఆటో రంగం నుండి డిమాండ్, ఇన్ఫ్రాపై ప్రభుత్వం భారీగా పెట్టుబడులు కొనసాగిస్తుండటం ఇందుకు దోహదపడగలవని వివరించారు. ద్వితీయార్థంలో అంతర్జాతీయంగా స్టీల్‌కు డిమాండ్ బలహీనంగా ఉన్నా దేశీయంగా మాత్రం బాగానే ఉండటంతో పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం వృద్ధి చెందవచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మనీష్ గుప్తా చెప్పారు. ఉక్కు ధరలు ఒక శ్రేణిలో తిరగవచ్చని పేర్కొన్నారు. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి -
చికుబుకు చికుబుకు రైలే.. మేలో ఆదాయం వేయి కోట్లకు పైనే..
కరోనా సంక్షోభ సమయం నుంచి పడుతూ లేస్తూ వస్తున్న రైల్వేశాఖ నెమ్మదిగా ట్రాక్ ఎక్కుతోంది. తాజాగా హాలిడే సీజన్‌ను ఫుల్‌గా క్యాష్ చేసుకుంది. లక్షల సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి వందల కోట్ల రూపాయల ఆదాయం సాధించింది. దీంతో పాటు సరుకు రవాణాలోనూ దుమ్ము రేపుతూ వేల కోట్ల ఆదాయం సొంతం చేసుకుంది. పూర్తిగా విభజించని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, మన్మాడ్, గుంతకల్లు డివిజన్లు ఉన్నాయి. ఇవి తెలంగాణ, ఆంధప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలతో పాటు అతి స్వల్పంగా తమిళనాడులో విస్తరించి ఉన్నాయి. ఈ ఆరు డివిజన్లకు సంబంధించి 2022 మేలో రైల్వే శాఖకు టికెట్ల అమ్మకం ద్వారా రికార్డు స్థాయిలో 423.98 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఒక్క మేలో 1.14 లక్షల మంది దక్షిణ మధ్య పరిధిలో రైళ్లలో ప్రయాణించారు. వీరి కోసం సాధారణ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను కూడా అందుబాటులో ఉంచారు. సరుకు రవాణాలోనూ దక్షిణ మధ్య రైల్వే రికార్డు సాధించింది. కేవలం సరుకు రవాణా ద్వారానే మేలో రూ.1067 కోట్ల రూపాయల ఆదాయం సాధించింది. దక్షిణ మధ్య రైల్లే పరిధిలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉండటంతో సిమెంటు పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వీటికి అవసరమైన బొగ్గును రవాణా చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలోనూ దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ప్రణాళిక అమలు చేసింది. ఫలితంగా రికార్డు స్థాయి లాభాలు వచ్చాయి. చదవండి: గుడ్‌న్యూస్! రైల్వే స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు -
మీలో ‘ఫైర్’ ఉందా..?
వృద్ధాప్యం పలకరించే వరకు (60 ఏళ్లు) సంపాదన కోసం పరుగులు పెట్టడం పాత తరం నమూనా.. 45–50 ఏళ్లకే ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం.. 50–55 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవడం.. నేటి తరం కోరుకుంటున్న విధానం. సాధ్యమైనంత త్వరగా సంపాదించాలి. భారీగా కూడబెట్టాలి. ముసలితనానికి ముందే ఉద్యోగం లేదా వృత్తి జీవితానికి స్వస్తి చెప్పి మిగిలిన జీవితాన్ని మనసుకు నచ్చినట్టు పూర్తి సంతోషంగా రైడ్ చేయాలి. ఇలా అనుకునే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే ఫైర్ (ఎఫ్ఐఆర్ఈ). ఆ ఫైర్ మీలో ఉందా..? అందుకోసం ఏం చేయాలో చర్చించేదే ఈ కథనం. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ (ఎఫ్ఐ)/రిటైర్ ఎర్లీ (ఆర్ఈ). ఫైర్ అంటే ఇదే. కావాల్సినంత ఆర్థిక స్వేచ్ఛ సాధించడం/ముందుగా రిటైర్ కావడం అన్నదే సంక్షిప్తంగా ఫైర్. జీవితాంతం కూర్చుని తినేందుకు సరిపడా, అన్ని అవసరాలను తీర్చేంత సంపదను వీలైనంత ముందుగా సమకూర్చుకోవడం ఇందులోని అంతరార్థం. ఒక ఉదాహరణ చూద్దాం. 30 ఏళ్ల వ్యక్తికి ప్రస్తుతం నెలవారీగా ఖర్చులు రూ.75,000గా ఉన్నాయని అనుకుందాం. అంటే ఏడాదికి జీవన ఖర్చు రూ.9 లక్షలు. అతని వద్ద రూ.18 లక్షల నిధి కూడా ఉంది. ఇక్కడి నుంచి ప్రతీ నెలా రూ.80,000 చొప్పున 15ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు నెలవారీ సిప్‌ను ఏటా 8 శాతం పెంచుతూ వెళ్లాడు. పెట్టుబడులు 12 శాతం రాబడి రేటు ప్రకారం వృద్ధి చెందాయని, ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉందనుకుంటే.. అప్పుడు 45 ఏళ్ల వయసు వచ్చేసరికి రూ.7.2 కోట్లు సమకూరతాయి. ఆ సమయంలో అతని వార్షిక వ్యయాలు రూ.22.8 లక్షలకు చేరతాయి. అదే సమయంలో తన ఖర్చులకు 32 రెట్లు నిధి సమకూరి ఉంటుంది. దీన్ని కదపకుండా మెరుగైన రాబడినిచ్చే సాధనంలో మరో 5–10 ఏళ్లు కొనసాగించినా నిండు నూరేళ్లపాటు నిశ్చితంగా జీవించొచ్చు. ఫైర్‌లో పలు రకాలున్నాయి. ఇందులో ఏదో ఒక ఫైర్ ఉన్నా ముందే ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించొచ్చు. నార్మల్ ఫైర్ ఇప్పటి మాదిరే జీవితాంతం రాజీ లేకుండా జీవించడం. భవిష్యత్తులోనూ విహార యాత్రలు, ఖర్చులు, రెస్టారెంట్ భోజనాలు, వినోదం, వైద్యం అన్నింటి అవసరాలను తీర్చుకునేందుకు కావాల్సినంత సమకూర్చుకోవడం. 45 ఏళ్ల వ్యక్తి అప్పటి తన వార్షిక జీవన వ్యయానికి 35 రెట్ల సంపదను సమకూర్చుకుని ఉంటే ‘నార్మల్ ఫైర్’ సాధించినట్టు అర్థం చేసుకోవాలి. లీన్ ఫైర్ లీన్ ఫైర్ అంటే మీ ఖర్చులు, జీవన విధానంలో కొంత రాజీ పడడం. నార్మల్ ఫైర్‌తో పోలిస్తే కొంత సర్దుకుపోవడం. ఈ విధానంలో తక్కువ వ్యయాలతో జీవించేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో నార్మల్ ఫైర్‌ను సాధించడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు ప్రస్తుత వ్యయాల్లో 75 శాతంతోనే సరిపెట్టుకోవాల్సి రావచ్చు. ఇది కూడా ఫైర్ కిందకే వస్తుంది. 45 ఏళ్ల వ్యక్తి తన వార్షిక వ్యయానికి 25–28 రెట్ల మేర సంపద కూడబెడితే లీన్ ఫైర్ సాధించినట్టుగా అర్థం చేసుకోవాలి. ఫ్యాట్ ఫైర్ లీన్ఫైర్కు విరుద్ధమైనదే ఫ్యాట్ఫైర్. రాజీకి చోటు లేకుండా రాజులా జీవించడం. అనుకున్నంత స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ జీవించడం. ఎందులోనూ రాజీపడక్కర్లేదు. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవక్కర్లేదు. ఈ తరహా ఫైర్ కోసం ఎక్కువ మొత్తమే కావాలి. 45 ఏళ్ల వ్యక్తి తన వార్షిక వ్యయాలకు 45–50 రెట్ల మేర నిధిని సమకూర్చుకోగలిగితే అతను ఫ్యాట్ఫైర్ సాధించినట్టే. ఇలా సమకూర్చుకున్నప్పుడు మిగిలిన జీవితాంతం 125–140 శాతం అధికంగా ఖర్చు చేస్తూ సాగిపోవచ్చు. కోస్ట్ ఫైర్ మిగిలిన జీవితానికి సరిపడా ముందుగా సమకూర్చుకోవడమే కోస్ట్ ఫైర్. దీంతో భవిష్యత్తులో ఎటువంటి అదనపు పెట్టుబడులు అవసరం లేకుండానే ఆ మొత్తం వృద్ధి మరింత వృద్ధి చెందుతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ప్రతీ నెలా రూ.2 లక్షలు సంపాదిస్తున్నట్టయితే.. 50 ఏళ్లకు ఫైర్ సాధించడం కోసం అతను రూ.6 కోట్ల నిధిని సమకూర్చుకోవాలి. అటువంటి సందర్భంలో లక్ష్య సాధనకు ప్రతీ నెలా తన ఆదాయం నుంచి 60 శాతాన్ని (రూ.1.2 లక్షలను) పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. ఇలా చేస్తే మొదటి పదేళ్లలోనే 40 ఏళ్ల వయసు వచ్చేనాటికి రూ.2.5 కోట్లు సమకూరుతుంది. దీంతో రూ.6 కోట్ల లక్ష్యాన్ని తర్వాతి 10 ఏళ్లలో చేరుకునేందుకు అతను అక్కడి నుంచి రూపాయి కూడా అదనంగా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. అప్పటి వరకు సమకూరిన రూ.2.5 కోట్ల నిధి ఏటా 10 శాతం రాబడినిచ్చే సాధనంలో ఉంచినా తదుపరి పదేళ్ల కాలంలో రూ.6 కోట్లు అవుతుంది. ముందే ఆర్థిక స్వాతంత్య్రాన్ని చేరుకుంటారు. దాంతో ఒత్తిడితో కూడిన పనిని విడిచిపెట్టి.. వేతనం తక్కువైనా నచ్చిన పనికి మారిపోవచ్చు. మీ ఫైర్ ఏది? తాము ఏ ఫైర్‌ను చేరుకుంటామన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. మీ సంపాదన, ఖర్చులు, జీవన స్థితిగతులు వీటన్నింటి పాత్ర ఉంటుంది. వీటన్నింటి మధ్య మీకున్న సౌకర్యం ఏపాటిది? ఆలోచించుకోవాలి. లీన్ఫైర్లో రాజీపడాల్సి ఉంటుంది. కొన్ని అంచనాలు, పరిస్థితులు మారినా అనుకున్నది నెరవేరకపోవచ్చు. అన్నింటిలోకి నార్మల్ ఫైర్ ఆచరణీయం. కనీసం లీన్ఫైర్తో ఆరంభించి.. కొన్నేళ్ల తర్వాత అయినా నార్మల్ ఫైర్ లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. మెరుగైన సంపాదన ఉండి, ఎక్కువ భాగాన్ని వెనకేసుకునే అవకాశం ఉన్నవారికి ఫ్యాట్ ఫైర్ ఆచరణీయం. ఫైర్ సాధిస్తే పని మానవచ్చా? అది మీ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. కావాలనుకుంటే ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వృత్తికి అంతటితో విరా మం చెప్పేసుకోవచ్చు. ఒకవేళ చేస్తున్న పని బోర్‌గా అనిపించకపోతే.. ఒత్తిళ్లతో కూడుకున్నది కాకపోతే కొనసాగడమే మంచిది. దీనివల్ల అదనపు నిధి సమకూరుతుంది. అప్పుడు మీ జీవితానికి మరింత జోష్‌ను తెచ్చుకున్నట్టుగానే భావించాలి. ఇందంతా మీ ఇష్టా అయిష్టాలపై, మానసిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. ఫైర్ ఎందుకు అవసరం? 60 ఏళ్ల వరకు ఉద్యోగంలో కొనసాగడం అంటే కష్టమైన పనే. ప్రైవేటు రంగంలో 58 ఏళ్లకే తప్పుకోవాలి. పైగా ఉద్యోగ భద్రత పాళ్లు తక్కువ. ఆరోగ్యం అందరికీ సహకరించకపోవచ్చు. వృద్ధాప్యంలోనూ సంపాదించుకునే శక్తి ఉంటుందన్న భరోసా పని చేయకపోవచ్చు. ముందుగానే ఫైర్‌ను సాధిస్తే మీపై ఒత్తిడి తగ్గిపోతుంది. మీకు నచ్చినట్టు, మీదైన దారిలో సాగిపోయే స్వేచ్ఛ లభిస్తుంది. ఎవరో ట్యూన్‌కు మీరు డ్యాన్స్ కట్టాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అభద్రతా భావం నుంచి బయటకు వస్తారు. మీ డిమాండ్లపై పట్టుబట్టే ధైర్యం లభిస్తుంది. ఫైర్ అంత ఈజీనా..? కాదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. మనదేశంలో చాలా మంది 60 దాటిపోయిన తర్వాత కూడా సంపాదన కోసం శ్రమకోరుస్తూనే కనిపిస్తుంటారు. పైగా రిటైర్మెంట్ ప్రణాళిక విషయంలో చాలా మందిలో శ్రద్ధ కనిపించదు. దీంతో 60 వచ్చినా మిగిలిన జీవితానికి చాలినంత నిధి కనిపించదు. ఆర్థిక ప్రణాళికల్లేకుండా సాగిపోవడం వల్ల అసలు తత్వం అప్పుడు కానీ బోధపడదు. ఒకవేళ ముందుగా ఫైర్ సాధించినప్పటికీ అది మంచి రాబడుల వల్ల కాదు.. సంపాదనలో అధిక మొత్తాన్ని పొదుపు చేస్తూ రావడం వల్లే. అందుకే ఫైర్ ఉంటే కాదు.. దాన్ని సాధించే పక్కా ఆచరణ, ప్రణాళికలు కూడా మీ దగ్గర ఉండాలి. ఇవి కీలకం.. ► వ్యయాలను అదుపులో పెట్టుకోవాలి. సంపాదనలో సాధ్యమైనంత తక్కువ వ్యయాలకే పరిమితం కావాలి. ఎందుకంటే ఇక్కడ ఫైర్ అన్నది సంపద. ఆ సంపదకు సంపాదన, వ్యయ నియంత్రణ కీలకం. ► నెల సంపాదన రూ.2లక్షలు. చేస్తున్న వ్యయం రూ.25వేలు. అప్పుడు వ్యయాలకు ఎనిమిదిరెట్లు అధికంగా సంపాదిస్తున్నట్టు. ఇటువంటి వారు చాలా వేగంగా ఫైర్ సాధిస్తారు. ► కొందరికి వ్యయ నియంత్రణ సాధ్యపడదు. పైగా పోనుపోను జీవనశైలిని మరింత మెరుగు పరుచుకుంటూ జీవించేస్తారు. ఇటువంటి వారు ఫైర్‌ను కోల్పోవాల్సి వస్తుంది. ► మంచి ఆదాయానికి బాటలు వేసుకోవాలి. ► ఆదాయం నుంచి కనీసం 60 శాతాన్ని అయినా ఆదా చేసుకుని ద్రవ్యోల్బణాన్ని మించి అధిక రా బడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ► రాబడులు అంచనాలను అందుకోకపోతే, ద్రవ్యోల్బణం అనుకున్నదానికంటే ఎక్కువే ఉంటే ఫైర్ కష్టంగా మారుతుంది. ► దుబారాకు దూరంగా ఉండి, సాధారణ జీవితం గడపాలి. అలా అని ఆనందం, కోర్కెల విషయంలో రాజీపడొద్దు. ► ఫైర్ సాధించిన తర్వాత.. వాటిపై క్రమం తప్పకుండా రాబడులు వచ్చేలా (క్యాష్ ఫ్లో) ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ఉండాలి. పెట్టుబడులు ఇరుక్కుపోయే వాటిల్లో ఉంచొద్దు. ► ఎవరికివారు తమకు అనుకూలమైన ఫైర్ దిశగా అడుగులు వేసేందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. ఈ విషయంలో స్పష్టత కోసం ఆర్థిక సలహాదారుల సేవలు తీసుకోవడం సూచనీయం. -
వాసి వాడి తస్సాదియ్యా! 23 ఏళ్లకే 400 కోట్ల సంపాదన!
డబ్బు సంపాదించేందుకు మార్గాలు ఎన్నో(తప్పుడు దోవలో కాకుండా) ఉన్నాయి. కావాల్సిందల్లా ఉన్నపెట్టుబడిలో తెలివి, శ్రమను సరిగ్గా ఉపయోగించడం. ఒకప్పుడు తన వీడియోలను లెక్క పెట్టుకుంటూ గడిపిన (2017లో కౌంటింగ్ టు 1, 00, 000 వీడియోతో ఫేమస్ అయ్యాడు).. జిమ్మీ డొనాల్డ్సన్, ఇప్పుడు ఏడాదికి 400 కోట్ల రూపాయలు సంపాదించే ఇంటర్నెట్ పర్సనాలిటీగా గుర్తింపు దక్కించుకున్నాడు. జిమ్మీ డొనాల్డ్సన్.. ఈ పేరు చెబితే ఈ యూట్యూబర్ గురించి తెలియదు. మిస్టర్‌బీస్ట్ అని పిలిస్తే మాత్రం చాలామంది గుర్తు పడతారు. యూట్యూబ్‌లో విలువైన స్టంట్ల ద్వారా పేరు దక్కించుకున్న అమెరికన్ ఇతను. 13 ఏళ్ల వయసులో యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేయడం ఆరంభించి.. ఛాలెంజ్, డొనేషన్ల వీడియోలతో వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయ్యాడు. ఫోర్బ్స్ జాబితాలో 2021 ఏడాదికి గానూ 23 ఏళ్ల జిమ్మీ డొనాల్డ్సన్ ‘యూట్యూబ్ హయ్యెస్ట్ ఎర్నింగ్ కంటెంట్ క్రియేటర్’గా నిలిచాడు. తన వీడియోలకు పది బిలియన్ వ్యూస్ పైగా రాబట్టుకుని.. 54 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో ఏకంగా 400 కోట్ల రూపాయలకు పైనే) వెనకేసుకున్నాడు. ముఖ్యంగా ‘స్క్విడ్ గేమ్’ స్ఫూర్తితో భారీ స్టేడియంలో అతను నిర్వహించిన హైడ్ అండ్ సీక్ ఆటకు భారీ స్పందన లభించింది. కిందటి ఏడాది మిస్టర్‌బీస్ట్ ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది 45 మిలియన్ డాలర్ల సంపాదనతో జేక్ పాల్ రెండో స్థానంలో నిలిచాడు. మనసున్నోడు కూడా.. డొనాల్డ్సన్ యూట్యూబ్ ఛానెల్‌కి 88 మిలియన్ పైగా సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. మిస్టర్ బీస్ట్ కేవలం యూట్యూబర్ మాత్రమే కాదు.. పరోపకారి కూడా. యూట్యూబ్‌లో సంపాదించిన దానిని మాత్రమే కాదు.. ఎన్జీవోలు, ఆర్గనైజేషన్లు, దాతల ద్వారా వచ్చినదంతా ఇతరులకు దానం చేస్తుంటాడు. ఇళ్లు లేనివాళ్లకు, జబ్బులతో బాధపడుతున్నవాళ్లకు, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరికైనా సరే సడన్ సర్ప్రైజ్లతో సాయం చేస్తుంటాడు. 2018 డిసెంబర్లో లక్ష డాలర్లను ఇళ్లు లేని వాళ్లకు దానం చేయడం, గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి ఆర్థిక సాయం, ఆస్పత్రులకు విరాళం.. లాంటివెన్నో ఉన్నాయి. కిందటి ఏడాది ‘మిస్టర్ బీస్ట్ బర్గర్’ (వర్చువల్ రెస్టారెంట్చెయిన్)ను స్థాపించి.. యాభై మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు ఈ కుర్రాడు. మిస్టర్ బీస్ట్కి ఇంతేసి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే అనుమానం చాలా మందికి కలగడం సహజం. డొనేషన్స్ తో పాటు పలు కంపెనీలు అతని వీడియోలకు స్పానర్షిప్ చేస్తుంటాయి. అందులో క్విడ్ లాంటి బడా కంపెనీలు కూడా ఉన్నాయి. డొనాల్డ్సన్ వీడియోలు చాలామట్టుకు ఆకట్టుకునేలా ఉంటాయి. తొలినాళ్లలో ఒక్కడే కష్టపడగా.. ఇప్పుడు అతని బాల్య స్నేహితులు తోడయ్యారు. తొలినాళ్లలో మిస్టర్ బీస్ట్ దగ్గర కెమెరామ్యాన్‌గా పని చేసిన కార్ల్ జాకోబ్స్.. ఇప్పుడు సొంతగా యూట్యూబర్‌గా ఎదిగాడు. ఇంత నేమ్-ఫేమ్ దక్కినప్పటికీ.. తన సొంత యూట్యూబ్ ఛానెల్ మిస్టర్ బీస్ట్ లాస్లో నడుస్తోందంటూ తాజాగా డొనాల్డ్సన్ ప్రకటించుకోవడం!. ఇన్స్టాగ్రామ్ మోడల్ మ్యాడీ స్పైడెల్తో డేటింగ్లో ఉన్నాడు జిమ్మీ డొనాల్డ్సన్. మ్యాడీ ఒక వీడియో గేమ్ కామెంటేటర్‌గా ( Let's Plays) ప్రారంభించి.. ఇప్పుడు ప్రపంచంలోనే క్రేజీయెస్ట్ యూట్యూబర్‌గా నిలిచాడు. ప్యూడీపై వర్సెస్ టీ సిరీస్ కాంపిటీషన్ టైంలో ప్యూడీపైకి మద్దతుగా నిలిచి మిస్టర్‌బీస్ట్ తన సబ్ సస్క్రయిబర్స్ను విపరీతంగా పెంచేసుకున్నాడు. -
ఈ కంపెనీలు 60 సెకన్లకు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా?
ఓ ఉద్యోగి నెల సంపాదన ఎంత ఉండొచ్చు. మహా అయితే నెలకు 20 నుంచి 30 వేలు ఉంటే..మరి మన దేశంలో దిగ్గజ కంపెనీలు నెలకు కాదు గంటకు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా? ఇటీవల ఆయా కంపెనీలు, ప్రముఖుల ఆదాయాలపై సర్వే నిర్వహించే ఫైన్ షాట్స్ సంస్థ..ఈ సారి మనదేశంలో పలు దిగ్గజ సంస్థలు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాయో తెలుసుకునేందుకు ఓ సర్వే నిర్వహించింది. స్టాక్ మార్కెట్లో కంపెనీల వ్యాల్యూ ఆధారంగా రిపోర్ట్‌ను విడుదల చేసింది. అందులో మనదేశానికి పలు కంపెనీలు నిమిషానికి సుమారు రూ.10లక్షలు అర్జించడం గమనార్హం. వాటిలో భారత్ పెట్రోలియం నిమిషానికి రూ.3.7లక్షల్ని సంపాదిస్తుంది. ఓఎన్జీసీ నిమిషానికి రూ.3.9లక్షల్ని అర్జిస్తుంది ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ నిమిషానికి రూ.3.9లక్షల్ని సంపాదిస్తుంది. హెచ్డీఎఫ్సీ నిమిషానికి రూ.3.56లక్షల్ని సంపాదిస్తుంది. ఇన్ఫోసిస్ నిమిషానికి రూ.3.68లక్షల్ని సంపాదిస్తుంది. ఇండియన్ ఆయిల్ కంపెనీ నిమిషానికి రూ.4.14లక్షలు సంపాదిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిమిషానికి రూ.4.24లక్షల్ని సంపాదిస్తుంది హెచ్డీఎఫ్సీ నిమిషానికి రూ.6.5లక్షల్ని సంపాదిస్తుంది టీసీఎస్ కంపెనీ నిమిషానికి రూ.6.17లక్షల్ని సంపాదిస్తుంది. రిలయన్స్ సంస్థ నిమిషానికి రూ.9.34లక్షల్ని సంపాదిస్తూ ప్రదమ స్థానంలో నిలిచింది. -
అప్పుడు సూపర్ హిట్, ఇప్పుడు జొమాటోకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో లిమిటెడ్ ఈ ఏడాది(2021–22) తొలి క్వార్టర్లో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 361 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 100 కోట్ల నష్టం మాత్రమే ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 266 కోట్ల నుంచి రూ. 844 కోట్లకు జంప్‌చేసింది. ఇక మొత్తం వ్యయాలు సైతం రూ. 383 కోట్ల నుంచి రూ. 1,260 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1లో గ్రోఫర్స్ ఇండియా లో 9.25%, హ్యాండ్స్ఆన్ ట్రేడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 9.27% చొప్పున వాటాల కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు గ్రోఫర్స్ ఇండియా ప్రయివేట్, హ్యాండ్స్ఆన్ ట్రేడ్స్ ప్రైవేట్, గ్రోఫర్స్ ఇంటర్నేషనల్ తదితరాలతో డీల్ కుదుర్చుకున్నట్లు జొమాటో వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జొమాటో షేరు ఎన్ఎస్ఈలో 4.3 శాతం పతనమై రూ. 125 వద్ద ముగిసింది. కాగా, ఇటీవల ఐపీవో లిస్టింగ్ లో జొమాటో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా జొమాటో ఐపీఓలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో .. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మార్కును టచ్ చేసి సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేసింది. సబ్స్క్రిప్షన్స్ సైతం గత 13 ఏళ్లల్లో రూ.5,000 కన్నా ఎక్కువగా వచ్చిన ఐపీఓల్లో 38.25 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన మొదటి ఐపీఓ జొమాటో నిలిచింది. కానీ క్యూ1 ఫలితాల్లో జొమాటో ఆశించిన స్థాయిలో లాభాలు రాబట్టుకోలేకపోయింది. నికర నష్టం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 361 కోట్లకు చేరడంపై ఇన్వెస్టర్లు, అటు మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బ్యాంకులకు ఆర్బీఐ భారీ షాక్, ఆ ఏటీఎంలలో డబ్బులు లేకుంటే ఫైన్ -
వివాద్ సే విశ్వాస్‌తో రూ. 53,684 కోట్లు
పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన వివాద్ సే విశ్వాస్ స్కీము ద్వారా ఇప్పటిదాకా రూ. 53,684 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. ఈ పథకం కింద దాదాపు రూ. 99,765 కోట్ల పన్ను వివాదాలకు సంబంధించి 1.32 లక్షల డిక్లరేషన్లు దాఖలైనట్లు ఆయన వివరించారు. స్కీము కింద డిక్లరేషన్ ఇవ్వడానికి 2021 మార్చి 31తో గడువు ముగిసింది. అయితే, చెల్లింపులు జరిపేందుకు ఆఖరు తేదీని ఆగస్టు 31దాకా పొడిగించారు. అదనంగా వడ్డీతో అక్టోబర్ 31 దాకా కూడా చెల్లించవచ్చు. రూ. 1.67 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్–జూన్) మధ్య కాలంలో నికరంగా రూ. 1.67 లక్షల కోట్ల మేర వస్తు, సేవల పన్నులు (జీఎస్టీ) వసూలైనట్లు లోక్‌సభకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించుకున్న రూ. 6.30 లక్షల కోట్లలో ఇది 26.6 శాతమని ఆయన పేర్కొన్నారు. 2020–21లో రూ. 5.48 లక్షల కోట్లు, 2019–20లో రూ. 5.98 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. డీఐసీజీసీ సవరణ బిల్లుకు ఆమోదం రూ. 5 లక్షల దాకా డిపాజిట్లకు బీమా భద్రత కల్పిం చేలా డిపాజిట్ బీమా, రుణ హామీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభలో గతవారమే ఇది ఆమోదం పొందింది. బ్యాంకులపై ఆర్బీఐ మారటోరియం విధించిన 90 రోజుల్లోగా ఖాతాదారులు రూ. 5 లక్షల దాకా డిపాజిట్లను తిరిగి పొందేందుకు ఇది ఉపయోగపడనుంది. 7 సంస్థలకు ఇంధన రిటైలింగ్ లైసెన్సు .. కొత్త విధానం కింద 7 సంస్థలకు ఆటోమొబైల్ ఇంధన రిటైలింగ్ లైసెన్సులు జారీ చేసినట్లు పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన బీపీతో కలిసి ఆ కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్, ఐఎంసీ, ఆన్సైట్ ఎనర్జీ, అస్సామ్ గ్యాస్ కంపెనీ, ఎంకే ఆగ్రోటెక్, ఆర్‌బీఎంఎల్ సొల్యూషన్స్ ఇండియా, మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ సంస్థల్లో ఉన్నాయి. ఆర్ఐఎల్కు గతంలోనే ఇంధన రిటైలింగ్ లైసెన్సు ఉండగా దాన్ని అనుబంధ సంస్థ రిలయన్స్ బీపీ మొబిలిటీకి బదలాయించి కొత్తగా మరో లైసెన్సు తీసుకుంది. బీపీతో కలిసి ఆర్‌బీఎంఎల్ సొల్యూషన్స్ పేరిట ఇంకో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి, దానికి కూడా లైసెన్సు తీసుకుంది. 13 రాష్ట్రాల్లో విద్యుత్ వాహన విధానాలు విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నిర్దుష్ట విధానాన్ని ఆమోదించిన లేదా నోటిఫై చేసిన 13 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణన్ పాల్ గుర్జర్ రాజ్యసభలో ఈ విషయం తెలిపారు. ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) ప్రకారం విద్యుత్ వాహనాల ఖరీదులో బ్యాటరీ ధర వాటా సుమారు 30–40 శాతంగా ఉంటుందని ఆయన వివరించారు. -
రికార్డుల బ్రాండ్ బాబు.. సంపాదనెంతో తెలుసా?
సెలబ్రిటీలను ఆరాధించడానికి.. అభిమానించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉండనక్కర్లేదు. నచ్చితే.. బ్లయిండ్‌గా ఫాలో అయిపోవడమే. ఫుట్‌బాల్ ఆటతోనే కాదు.. తన మేనరిజంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. అత్యధిక గోల్స్ రికార్డుకు అడుగు దూరంలో ఉన్న రొనాల్డో.. సోషల్ మీడియాలోనూ రికార్డుల బ్రేకర్ కూడా. వెబ్‌డెస్క్: సాకర్ వీరుడు రొనాల్డోకు ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య 92.4 మిలియన్లు. ఫేస్బుక్లో 148 మిలియన్ల ఫాలోవర్లు. ఇక ఈమధ్యే ఇన్‌స్టాలో 30 కోట్ల మిలియన్ ఫాలోవర్స్ రికార్డు దక్కించుకున్నాడు. కేవలం ఇన్‌స్టా అకౌంట్ ద్వారానే దాదాపు 2 మిలియన్ల పౌండ్ల ఆదాయం వెనకేసుకుంటున్నాడు. అతను వేసే ఒక్కో పోస్టుకి ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకుంటాడని తెలుస్తోంది(మోడల్ కైలీ జెన్నర్ పోస్ట్‌కి ఎనిమిది కోట్లకుపైనే). ఫుట్‌బాల్ ఆటగాళ్లలో అత్యధికంగా సంపాదిస్తున్న రెండో ఆటగాడు ఇతనే. మరో విశేషం ఏంటంటే.. లాక్డౌన్ టైంలోనూ అత్యధికంగా సంపాదించిన అథ్లెట్‌గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచాడు. కాస్ట్లీ యవ్వారం ఈ జువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాడి.. విలాసాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఎప్పుడూ ఒకే తరహా డైట్‌ను ఫాలో అయ్యే 36 ఏళ్ల రొనాల్డో.. ఫిట్నెస్ విషయంలో అభిమానులకు ఆరాధ్యుడే. దుబాయ్ గ్లోబ్ సాకర్ అవార్డుల కార్యక్రమానికి రొనాల్డో ఒక రోలెక్స్ వాచీతో హాజరయ్యాడు. ఇక అభిమానులు ఊరుకుంటారా? దానిని స్కాన్ చేసి ధరెంతో కనుక్కునే ప్రయత్నం చేశాడు. రీసెంట్గా ఆ వాచీ కంపెనీ ‘స్విస్’.. దాని ధరెంతో ప్రకటించింది. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారుచేసిన వాచీ అది. అందులో 30 క్యారెట్ల వైట్ డైమండ్లు పొదిగిన ఆ వాచీ ఖరీదు 3,71,000 పౌండ్లు (మన కరెన్సీలో 3 కోట్ల 82 లక్షలపైనే) విలువ ఉందని ప్రకటించింది. పైగా ఇలాంటి పీస్ ఇప్పటివరకు ఈ ఫుట్‌బాల్ స్టార్ దగ్గర మాత్రమే ఉందని వెల్లడించింది. బ్రాండ్ బాబు రొనాల్డ్ బ్రాండ్ అంబాసిడరింగ్ వాల్యూ ఏటా దాదాపు 105 మిలియనల డాలర్లు అంటే ఆశ్చర్యం కలగకమానదు. అందులో నైక్ నుంచే 45 మిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నాడు. ఇక సొంతంగా సీఆర్7 బ్రాండ్ ఉంది. ఓవరాల్ ఆటగాళ్ల ఆదాయం జాబితాలో మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ కనోర్ మెక్‌గ్రెగోర్(180 మిలియన్ల డాలర్లు), లియోనెల్ మెస్సీ(130 మిలియన్ల డాలర్లు).. ఉండగా మూడో ప్లేస్‌లో రొనాల్డో 120 మిలియన్ల డాలర్లతో నిలిచాడు. చిరకాల ప్రత్యర్థి మెస్సీ కంటే టోటల్ ఆదాయంలో వెనుకంజలో ఉన్నప్పటికీ.. బ్రాండ్ ఆదాయంలో ఓ అడుగు ముందే ఉన్నాడు రొనాల్డో. ఫిబ్రవరి 5, 1985 సాంటో అంటోనియోలో పుట్టాడు రొనాల్డో. స్కూల్ ఎడ్యుకేషన్‌లో పెద్దగా చదువుకోని రొనాల్డో.. 17వ ఏట స్పోర్ట్స్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాడు. ది సుల్తాన్ ఆఫ్ ది స్టెప్ఓవర్ బిరుదు అందుకున్నాడు. మెర్చ్ రొమిరో, గెమ్మా అటిక్సన్, ఇరినా షాయ్క్లతో డేటింగ్ చేసి.. మోడల్ జార్జినా రోడ్రిగుజ్ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు నలుగురు పిల్లలు. చదవండి: రొనాల్డో వల్లే కోకా కోలా 29వేల కోట్లు నష్టపోయిందా?.. అందులో నిజమెంత? -
ఆరేళ్ళలో అక్షయ్ సంపాదన ఎంతో తెలుసా?
ముంబై: సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్లు అంటూ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటారు. అందుకే అయన సంపాదన కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఒక్క ఏడాదిలో ఆరు సినిమాలు చేసినట్లు గతంలో పలు ఇంటర్వ్యూల్లో అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంపాదిస్తున్న స్టార్స్‌లలో అక్షయ్ పేరు కూడా ఉంటుంది. ఇంత బిజీగా ఉండే అక్షయ్ కుమార్ గత ఆరు ఆరేళ్ళలో ఎన్నో కోట్లు సంపాదించారో మీకు తెలుసా?. ఫోర్బ్స్ యొక్క తాజా నివేదిక ప్రకారం.. గత 6 సంవత్సరాలలో అక్షయ్ సంపాదన దాదాపు 1,744 కోట్లు అని తేలింది. (చదవండి: ఒక్క సినిమాకు రూ.135 కోట్లు తీసుకోనున్న హీరో?!) 2020 సంవత్సరంలో కూడా అక్షయ్ కుమార్ 48.5 మిలియన్ డాలర్లు(రూ.356.57 కోట్లు) తెలుస్తుంది. 2019 అయితే అక్షయ్ కుమార్ కి ఒక స్వర్ణ సంవత్సరం అని చెప్పాలి. 2019లో కేసరి, బ్లాంక్, మిషన్ మంగల్, హౌస్‌ఫుల్ 4, గుడ్ న్యూజ్‌తో సహా అతను ఇతర బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా 65 మిలియన్ డాలర్లు(రూ.459.22 కోట్లు) సంపాదించాడు. అలాగే 2018లో రూ.277.06 కోట్లు, 2017లో రూ.231.06 కోట్లు, 2016లో రూ.211.58 కోట్లు, 2015లో రూ.208.42 కోట్లు సంపాదించినట్టు పోర్బ్స్ తన కథనంలో పేర్కొంది. గత ఏడాదిలో అక్షయ్ కుమార్ కేవలం ఒకే ఒక్క సినిమా 'లక్ష్మీ'తో అలరించాడు. ఈ ఏడాది 2021లో ఏకంగా మరో ఏడు సినిమాలతో బాలీవుడ్ పరిశ్రమలో మరోసారి తన సత్తా ఏంటో చూపించనున్నాడు. -
ఆర్జనలో మెస్సీ నంబర్‌వన్
లండన్: అంతర్జాతీయస్థాయిలో తన జట్టుకు ఎలాంటి గొప్ప టైటిల్స్ అందించలేకపోయినా... ఆర్జనలో మాత్రం అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ లయెనల్ మెస్సీ టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. ‘ఫోర్బ్స్’ పత్రిక వివరాల ప్రకారం ఈ ఏడాది అత్యధిక మొత్తం సంపాదించిన ఫుట్‌బాల్ ఆటగాళ్లలో మెస్సీకి తొలి స్థానం దక్కింది. అతను ఈ ఏడాదిలో 12 కోట్ల 60 లక్షల డాలర్లు (రూ. 927 కోట్లు) ఆర్జించాడు. ఇందులో 9 కోట్ల 20 లక్షల డాలర్లు వేతనం ద్వారా రాగా... మిగతా 3 కోట్ల 40 లక్షల డాలర్లు వాణిజ్య ఒప్పందాల ద్వారా సంపాదించాడు. 15 ఏళ్ల నుంచి స్పెయిన్‌కు చెందిన విఖ్యాత క్లబ్ బార్సిలోనా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెస్సీ ఈ ఏడాది బార్సిలోనా జట్టు ఒక్క టైటిల్ కూడా సాధించకపోవడంతో క్లబ్‌ను వీడాలనుకుంటున్నానని తెలిపాడు. కానీ ఒప్పందం ప్రకారం మెస్సీ వచ్చే ఏడాది వరకు బార్సిలోనా జట్టుతోనే ఉండాలి. ముందుగానే వెళ్లిపోతే భారీస్థాయిలో పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మెస్సీ తన ఆలోచనను విరమించుకొని మరో ఏడాదిపాటు బార్సిలోనాతోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు. మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా గొప్ప విజయాలేమీ సాధించకపోయినా... యూరప్ ప్రొఫెషనల్ లీగ్ పోటీల్లో మాత్రం మెస్సీ మహిమతో బార్సిలోనా జట్టు 34 ట్రోఫీలు సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఫుట్‌బాలర్‌గా పేరున్న పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 11 కోట్ల 70 లక్షల డాలర్ల (రూ. 860 కోట్లు) ఆర్జనతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇటలీలో యువెంటస్ క్లబ్‌కు ఆడుతున్న రొనాల్డో వేతనం ద్వారా 70 కోట్ల డాలర్లు... ఎండార్స్మెంట్ల ద్వారా 47 కోట్ల డాలర్లు పొందాడు. మెస్సీ, రొనాల్డో తర్వాత మూడో స్థానంలో నేమార్ (బ్రెజిల్–పారిస్ సెయింట్ జెర్మయిన్–పీఎస్జీ), నాలుగో స్థానంలో ఎంబాపె (ఫ్రాన్స్–పారిస్ సెయింట్ జెర్మయిన్), సలా (ఈజిప్ట్–లివర్‌పూల్) ఉన్నారు. -
అమెరికాలో మనోళ్లు భేష్!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దేశాల్లోని పలువురు విద్యార్థులు, ఉద్యోగ, వ్యాపారులకు అమెరికా వెళ్లాలన్నది కల. దాన్ని నెరవేర్చుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ, వెళ్లిన వారిలో అంతా ఆర్థికంగా స్థితిమంతులు కాలేరు. భారతీయులు మాత్రం ఆదాయంలో ఎక్కడా తగ్గడం లేదు. వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారిలో భారతీయుల సగటు ఆదాయం అందరికంటే అధికంగా ఉండటం.. వివిధ రంగాల్లో మనోళ్లకున్న ప్రతిభాపాటవాలకు నిదర్శనం. ఏటా అక్కడి ప్రభుత్వం అమెరికన్ కమ్యూనిటీ సర్వే నిర్వహిస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్న స్థానికులు, విదేశీయుల మధ్యస్థ కుటుంబాల ఆదాయ వివరాలు నమోదుచేస్తుంది. అందులో వివిధ దేశాల నుంచి వచ్చినవారి గణాంకాలూ పొందురుస్తారు. ఈ వివరాల ప్రకారం.. అక్కడ స్థిరపడ్డ ఇండియన్ అమెరికన్ల ఆదాయం ఏటా అందరికంటే 1,00,500 డాలర్లుగా నమోదైంది. పొరుగు దేశాలైన శ్రీలంక.. నాలుగు, చైనా.. ఏడు, పాకిస్తాన్ .. ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మొత్తం మీద టాప్ 10 దేశాల్లో తొమ్మిది ఆసియా దేశాలే కాగా.. స్థానికులు ఏకంగా 9వ స్థానంలో నిలవడం విశేషం. అమెరికాలో స్థిరపడిన వివిధ దేశాల మధ్యస్థ(మధ్య తరగతి) కుటుంబాల ఆదాయం ఏటా.. ఇండియన్ 1,00,500 ఫిలిప్పో 83,300 తైవానీస్ 82,500 శ్రీలంకన్ 74,600 జపనీస్ 72,300 మలేసియన్ 70,300 చైనీస్ 69,100 పాకిస్తాన్ 66,200 వైట్–అమెరికన్లు 59,900 కొరియన్ 59,200 ఇండోనేసియన్ 57,500 స్థానిక–అమెరికన్లు 56,200 థాయ్‌లాండ్ 55,000 బంగ్లాదేశీ 50,000 నేపాలీ 43,500 లాటినో 43,000 ఆఫ్రికన్ –అమెరికన్లు 35,000 భారతీయులు బుద్ధిమంతులే కాదు, విద్యావంతులు కూడా. అమెరికాలో స్థిరపడుతున్న విదేశీయుల్లో బ్యాచ్‌లర్ డిగ్రీ ఉన్న వారిలోనూ ఇండియన్లే నంబర్‌వన్. ఈ విషయంలో అమెరికన్లు 28 శాతంతో ఆఖరిస్థానంలో నిలవడం గమనార్హం. ఇండియన్ – అమెరికన్లు 70 % కొరియన్ – అమెరికన్లు 53 % చైనీస్ – అమెరికన్లు 51 % ఫిలిప్పో – అమెరికన్లు 47 % జపనీస్ – అమెరికన్లు 46 % సగటు అమెరికన్లు 28 % -
ఆ జాబితాలో కోహ్లికి ఆరో స్థానం
లండన్: కరోనా కారణంగా గత మూడు నెలలుగా అంతర్జాతీయస్థాయిలో ఎలాంటి ఈవెంట్స్ జరగకపోయినా... పలువురు స్టార్ క్రీడాకారుల ఆదాయంలో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించడంలేదు. లాక్డౌన్ సమయంలోనూ వీరు భారీగానే ఆర్జించారు. మార్చి 12 నుంచి మే 14 మధ్య కాలంలో సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ స్టార్ క్రీడాకారులు ఎంత మొత్తం సంపాదించారనే లెక్కలను ఓ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచి టాప్–10లో స్థానం పొందిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. గత రెండు నెలల కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తమ వాణిజ్య ప్రకటనల ద్వారా కోహ్లి మొత్తం 3,79,294 పౌండ్లు (రూ. 3 కోట్ల 64 లక్షలు) ఆర్జించాడు. ఈ జాబితాలో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. రొనాల్డో మొత్తం 18 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 27 లక్షలు) సంపాదించాడు. 12 లక్షల పౌండ్లతో (రూ. 11 కోట్ల 52 లక్షలు) అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ రెండో స్థానంలో... 11 లక్షల పౌండ్లతో (రూ. 10 కోట్ల 56 లక్షలు) బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు నెమార్ మూడో స్థానంలో నిలిచారు. 5,83,628 పౌండ్లతో (రూ. 5 కోట్ల 60 లక్షలు) అమెరికా బాస్కెట్‌బాల్ ప్లేయర్ షకీల్ ఓనీల్ నాలుగో స్థానంలో... 4,05,359 పౌండ్లతో (రూ. 3 కోట్ల 89 లక్షలు) ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హామ్ ఐదో స్థానంలో నిలిచారు. జ్లాటన్ ఇబ్రహీమోవిచ్ (స్వీడన్ ఫుట్‌బాలర్; రూ. కోటీ 77 లక్షలు), డ్వేన్ వేడ్ (మాజీ బాస్కెట్‌బాల్ ప్లేయర్; రూ. కోటీ 37 లక్షలు), డానీ అల్వెస్ (బ్రెజిల్ ఫుట్‌బాలర్; రూ. కోటీ 28 లక్షలు), ఆంథోనీ జోషువా (బ్రిటన్ బాక్సర్; రూ. కోటీ 16 లక్షలు) వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది ర్యాంక్‌ల్లో ఉన్నారు. -
ఒసాకా ఆర్జన రూ. 284 కోట్లు
వాషింగ్టన్: ఏడాది కాలంలో అత్యధికంగా ఆర్జించిన క్రీడాకారిణిగా జపాన్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ నయోమి ఒసాకా గుర్తింపు పొందింది. ‘ఫోర్బ్స్’ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం 2019 జూన్ నుంచి 2020 జూన్ కాలానికి 22 ఏళ్ల ఒసాకా ప్రైజ్‌మనీ, ఎండార్స్మెంట్ల ద్వారా మొత్తం 3 కోట్ల 74 లక్షల డాలర్లు (రూ. 284 కోట్లు) సంపాదించింది. గత నాలుగేళ్లుగా టాప్ ర్యాంక్‌లో నిలిచిన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ 3 కోట్ల 60 లక్షల డాలర్ల (రూ. 273 కోట్లు) సంపాదనతో రెండో స్థానానికి పడిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో ఒసాకా 29వ ర్యాంక్‌లో, సెరెనా 33వ ర్యాంక్‌లో ఉన్నారు. 2016 తర్వాత టాప్–100లో ఇద్దరు క్రీడాకారిణులు ఉండటం ఇదే తొలిసారి. 2020 సంవత్సరానికి ఎక్కువ మొత్తం ఆర్జించిన క్రీడాకారుల పూర్తి జాబితాను వచ్చే వారం విడుదల చేస్తామని ‘ఫోర్బ్స్’ పత్రిక తెలిపింది. 2013లో ప్రొఫెషనల్‌గా మారిన ఒసాకా 2018 యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనాను... 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో క్విటోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించి ‘బ్యాక్ టు బ్యాక్’ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పదో ర్యాంక్‌లో ఉన్న ఒసాకా 15 అంతర్జాతీయ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. -
ఆర్టీఏ తొలిరోజు ఆదాయం రూ.1.82 కోట్లు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ తర్వాత సేవలు ప్రారంభించిన రవాణా శాఖకు తొలిరోజు రూ. 1.82 కోట్ల ఆదాయం సమకూరింది. గురువారం నుంచి పూర్తి స్థాయిలో రవాణా శాఖ సేవలు మొదలయ్యాయి. రవాణా శాఖ కమిషన ర్ ఎంఆర్‌ఎంరావు.. గురువారం ప్రధాన కార్యాలయంలో సేవలను దగ్గరుండి ప ర్యవేక్షించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ జిల్లాల్లోని అధికారులతో సమీక్షించారు. రవాణా కార్యాలయాల కు వచ్చే వారు కచ్చితంగా మాస్కులు ధరించటంతోపాటు, భౌతికదూరాన్ని పాటించేలా ఏ ర్పాట్లు చేయాలని ఆదేశించారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణకు వచ్చే వారు కచ్చితంగా శా నిటైజర్ వినియోగించాలని, వాటిని అందుబా టులో ఉంచాలని ఆయన ఆదేశించారు. కార్యాలయాలకు వచ్చే వారిని కచ్చితంగా థర్మల్ స్క్రీనింగ్ చేసి లోనికి అనుమతించాలన్నారు. -
స్వగ్రామం
అతడు ఒక కుగ్రామం నుండి చిన్నప్పుడే విదేశాలకు వెళ్లిపోయి అపరిమితంగా డబ్బు సంపాదించాడు. పాతికేళ్ల తర్వాత సంపాదన మీద విసుగొచ్చి తన స్వగ్రామానికి తిరిగొచ్చి గ్రామ స్వరూపం చూసి నివ్వెరపోయాడు. చిన్నప్పుడు తన స్నేహితులతో ఈత కొట్టిన కాలువగట్లు, కోతికొమ్మచ్చి ఆడిన పచ్చని చెట్లు, విశాలమైన వీధులు, మండువా లోగిళ్లు అన్నీ మాయమైపోయాయి! ఉదయాన్నే పక్షుల కిలకిలరావాలు, నాగళ్లు భుజాన వేసుకుని పొలాలకు వెళ్లే రైతులు, పచ్చని పంట పొలాలు, అన్నా.. అక్కా.. తాతా.. మామా.. అంటూ పిలుచుకునే ఆప్యాయత నిండిన జనాలు ఎక్కడా కనిపించలేదు. రహదారి విస్తరణలో ఆధునిక సౌకర్యాలతో తన చిన్ననాటి గ్రామం ఆనవాళ్లు కూడా మిగల్లేదు! ఆనాటి గ్రామాన్ని మళ్లీ పునరుద్ధరించాలని అనుకున్నాడు. తన దగ్గరున్న డబ్బుతో ఒక పెద్ద స్థలం ఖరీదు చేసి తను చిన్నప్పుడు తిరిగిన గ్రామంలా తయారు చేశాడు. విశాలమైన మట్టి రహదారులు, దగ్గర్లో చెరువులు, కాలువగట్లు, వాటిపక్కన ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి అడవుల్లో ఉన్న పచ్చని చెట్లను తీసుకొచ్చి నాటించాడు. ఒక చలనచిత్రంలో వేసే కృత్రిమ కళాకృతిలా పాత గ్రామం కనిపించేట్టు చేశాడు. ఊళ్లో తిండిదొరక్క పై ఊళ్లకు వలస వెళ్లిపోయిన తన చిన్ననాటి స్నేహితులను పిలిపించి వారికి గృహాలు కట్టించి బతకడానికి డబ్బు కూడా ఇచ్చి ఆ గ్రామంలో నివాసం ఏర్పాటు చేశాడు. కానీ ఎన్నాళ్లయినా ఉదయాన్నే పొలాలకెళ్లే రైతులు, ఆప్యాయత ఒలికించే పిలుపులు వినిపించడం లేదు! పైగా ‘విదేశాలకి వెళ్లి బాగా సంపాదించి మనకి పెట్టాడు. అలాగని విద్యుత్ సౌకర్యంలేని ఈ పల్లెటూళ్లో ఎన్నాళ్లుండగలం?’ అంటూ రుసరుసలాడసాగారు! – లోగిశ లక్ష్మీనాయుడు -
డీఎల్ఎఫ్ లాభం 76% అప్
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో క్వార్టర్లో 76 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.248 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.437 కోట్లకు పెరిగిందని డీఎల్ఎఫ్ తెలిపింది. అమ్మకాల బుకింగ్స్ దాదాపు రెట్టింపై రూ.2,435 కోట్లకు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.1,846 కోట్ల నుంచి రూ.2,661 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఏడాది లాభం.. రూ.1,319 కోట్లు.... పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.4,464 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,319 కోట్లకు తగ్గిందని డీఎల్ఎఫ్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రెంటల్ ఆదాయాన్ని విక్రయించడం వల్ల అప్పుడు విశేషమైన లాభాలు వచ్చాయని, దీంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.7,664 కోట్ల నుంచి రూ.9,029 కోట్లకు పెరిగిందని తెలిపింది. నికర అమ్మకాలు రూ.1,000 కోట్ల నుంచి రూ.2,435 కోట్లకు పెరిగాయని పేర్కొంది. రెసిడెన్షియల్ సెగ్మెంట్లో అమ్మకాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయని వివరించింది. ప్రీమియమ్, లగ్జరీ సెగ్మెంట్లలో నివసించడానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లను విక్రయించడం ఆరంభించామని పేర్కొంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) ద్వారా రూ.3,173 కోట్ల నిధులను విజయవంతంగా సమీకరించామని కంపెనీ తెలిపింది. ప్రమోటర్లు రూ.11,250 కోట్ల మేర పెట్టుబడులు అందించారని వివరించింది. మెరుగైన ఫలితాలతో బీఎస్ఈలో డీఎల్ఎఫ్ షేర్ 1.5% లాభంతో రూ.173 వద్ద ముగిసింది. -
వరుసగా మూడవదఫా రేటు కోత: బ్యాంక్ ఆఫ్ అమెరికా
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించిన 4 శాతంలోపే కొనసాగుతున్నందువల్ల వరుసగా మూడవసారి కూడా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో ప్రస్తుతం 6 శాతం) తగ్గే అవకాశం ఉందని ఫారిన్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా– మెరిలించ్ (బీఓఎఫ్ఏ–ఎంఎల్) అంచనా వేసింది. ‘‘జూన్ 3 నుంచి 6వ తేదీ వరకూ జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా మరోపావుశాతం రేటు కోత ఉంటుందని భావిస్తున్నాం’’ అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదే జరిగితే రెపో 5.75 శాతానికి దిగివస్తుంది. ఆరు నెలల్లో 75 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లవుతుంది. పారిశ్రామిక వృద్ధి రేటు ఆందోళనకర స్థాయిలో పడిపోవడం (ఫిబ్రవరిలో 20 నెలల కనిష్ట స్థాయి 0.1 శాతం), రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత 4 శాతం దిగువనే (మార్చిలో 2.86 శాతం) ఉండటం వంటి అంశాలు ఆర్బీఐ మరోదఫా రేటు కోత అంచనాలకు ఊతం ఇస్తోంది. ఈ ఏడాది ‘‘దాదాపు సాధారణ’’ వర్షపాతం నమోదవుతుందని సోమవారం భారత వాతావరణ శాఖ పేర్కొనడం తాజా విశేషం. ఇది ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే అంశం. -
మళ్లీ నిరాశ పరిచిన భారతీ ఎయిర్టెల్
న్యూఢిల్లీ: జియో రంగ ప్రవేశం తర్వాత ఆదాయం, లాభాలను కోల్పోతూ వస్తున్న టెలికం రంగ కంపెనీ భారతీ ఎయిర్టెల్ జూన్ త్రైమాసికంలోనూ కుదుటపడలేదు. మార్కెట్లో తీవ్ర పోటీ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ లాభం ఏకంగా 73% తగ్గిపోయి రూ.97 కోట్లకు పరిమితమైంది. ఆదాయం సైతం 9% తగ్గి రూ.20,080 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.367 కోట్లు, ఆదాయం రూ.21,958 కోట్లుగా ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో భారత మార్కెట్ పరంగా చూస్తే ఆదాయం 7 శాతం తగ్గి రూ.14,930 కోట్లుగా ఉంది. మార్కెట్లో ధరలు ఇప్పటికీ అనుకూలంగా లేవని కంపెనీ ఎండీ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. అయినప్పటికీ బండిల్ పథకాలు, కంటెంట్ భాగస్వామ్యం, హ్యాండ్సెట్ అప్‌గ్రేడ్ పథకాలతో మొబైల్డేటా ట్రాఫిక్ అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 355 శాతం పెరిగినట్టు ఆయన చెప్పారు. -
ఎవరు గొప్ప?
రైతు ఆరుగాలం కష్టపడి పండించిన గింజల్నే మనం తింటూ బతుకుతున్నాం. పాపం రైతెంత శ్రమపడ్డా తనకు మిగిలేదేమీ ఉండదు. ఎవరెంత డబ్బు సంపాదించినా తినేది అన్నమే తప్ప డబ్బులు కావు. రవి, శ్రీను, తేజ మంచి మిత్రులు. ఉన్న ఊళ్లోనే ఇంటర్ వరకు కలిసి చదువుకున్నారు. తేజ తండ్రి బాగా స్థితిమంతుడవడం వల్ల డొనేషన్ కట్టి కొడుకును వైద్య కళాశాలలో చేర్పించాడు. తేజకి మెడిసన్‌లో సీటు వచ్చిందని తెలిసి రవి, శ్రీను ఎంతో సంతోషించారు. వాడికి ఉన్నంత స్థోమత తనకు లేకపోవడంతో కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో నెగ్గి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించాడు శ్రీను. దాంతో రవికి ఏం చేయాలో తోచలేదు. తన పరిస్థితి మరీ దారుణం. నాన్న సంపాదన ఇంట్లో మూడుపూటలా తినడానికే సరిపోదు. అందుకే తక్కువ ఖర్చుతో చదువుకోవచ్చని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాడు. ఉన్నత చదువుల కోసం ముగ్గురూ మూడు ప్రాంతాలకు వెళ్లిపోయినా సెలవుల్లో విధిగా సొంతూరికి వస్తారు. కచ్చితంగా కలుసుకుంటారు. ఒకరితో మరొకరు తమ అనుభావాల్ని పంచుకుంటూ మురిసిపోయేవారు. ఆ ఏడు వేసవి సెలవులివ్వగానే ఎప్పటిలాగే స్నేహితులు ముగ్గురూ మళ్లీ తమ ఊరికి వచ్చారు. రావడంతోనే ఇట్టే అతుక్కుపోయారు. ‘‘రేయ్, ఇవాళ సాయంత్రం చల్లబడ్డాక మనం ఊరవతల ఉన్న చెరువు దగ్గర కలుద్దాం. అక్కడే ఎంచక్కా ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు. ఏమంటారు??’’ అన్నాడు శ్రీను. సరేనన్నారు రవి, తేజ.అనుకున్నట్లే ముగ్గురూ ఆ సాయంత్రం చెరువుగట్టు మీద చతికిలబడి మాటల్లోపడ్డారు.‘‘నువ్వెన్ని చెప్పు. మన ముగ్గురిలో నేనే గొప్ప. చదువయ్యాక పెద్ద డాక్టరునై రోగులకు వైద్యం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాను. లక్షలకు లక్షలు సంపాదిస్తాను’’ అన్నాడు తేజ.‘‘ఆ మాటకొస్తే నేనేం తక్కువ కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీరునై నీకంటే ఎక్కువగా సంపాదిస్తాను. కార్లలో, విమానాల్లో తిరుగుతాను’’ అన్నాడు శ్రీను.‘‘అలా అనుకొని మీరిద్దరూ నన్ను తక్కువ అంచనా వేయకండి. డిగ్రీ చెయ్యగానే చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చుంటానా? ఉహుం. ఐఏఎస్ రాసి మీ కంటే గొప్పవాడినవుతాను’’ అన్నాడు రవి తనేమీ వాళ్లకు తీసిపోనన్నట్లు.ఇలా వారిలో వారు నేను గొప్పంటే నేను గొప్పని వాదించుకుంటూ ఉండగా రామం మాస్టారు అటువైపుగా వస్తున్నారు. ఆయన రావడం చూసి ‘‘మనలో మనం పోట్లాడుకోవడం దేనికిరా? అదిగో అటు చూడండి. మన తెలుగు మాస్టారు ఇటే వస్తున్నారు. మనలో ఎవరు గొప్పో ఆయన్ని అడిగేస్తే తేలిపోతుంది’’ అంటూ గబగబా ముందుకెళ్లి ‘‘నమస్కారం మాస్టారు’’ అన్నాడు తేజ. ‘‘ఏంట్రా, మళ్లీ ముగ్గురూ ఇక్కడ పోగయ్యారు. కాలేజీలకు సెలవులిచ్చేశారా ఏంటి?’’ నవ్వుతూ అడిగారు రామం మాస్టారు.‘‘ఔనండి. ఇప్పుడు మాకో డౌటొచ్చింది మాస్టారు. దాన్ని మీరే తీర్చాలి. మా ముగ్గురిలో వీడేమో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వాడేమో బీయస్సీ చదువుతున్నాడు. నేను మెడిసిన్. మాలో ఎవరు గొప్పో తేల్చుకోలేక పోతున్నాం’’ అన్నాడు తేజ.‘‘బాగుందిరా మీ సందేహం. అదిగో అటు చూడండి. ఆ పొలంలో రాత్రనక, పగలనక, ఎండనక, వాననక కష్టపడి భూమిదున్ని వ్యవసాయం చేస్తున్న ఆ రైతే మనందరికంటే గొప్పవాడు’’ అన్నారు రామం మాస్టారు.‘‘అదేంటి మాస్టారు అలా అంటారు. మట్టిలో మటై్ట పొలాల్లో పని చేసుకునే రైతు నా కంటే గొప్పవాడెలా అవుతాడు? నేను డాక్టర్‌నైతే ఎందరికో వైద్యం చేసి వాళ్ల జబ్బుల్ని ఇట్టే మాయం చేస్తాను. బోలెడంత డబ్బు సంపాదిస్తాను’’ అన్నాడు తేజ. ‘‘నువ్వన్నది బాగానే ఉంది. అయితే చనిపోయిన వాణ్ని నువ్వు వైద్యం చేసి బతికించగలవా?’’ ఎదురు ప్రశ్న వేశారు మాస్టారు.‘‘చనిపోయిన వ్యకికి వైద్యమా! ’’ ఆయన అడిగిందానికి ఏం చెప్పాలో తెలియక తెల్లమొహం వేశాడు తేజ.‘‘చూడండి అబ్బాయిలూ..! ముమ్మాటికీ ఆ రైతే అందరికంటే గొప్పవాడు. అందులో సందేహమే లేదు. తను ఆరుగాలం కష్టపడి పండించిన గింజల్నే మనం తింటూ బతుకుతున్నాం. పాపం రైతెంత శ్రమపడ్డా తనకు మిగిలేదేమీ ఉండదు. ఎవరెంత డబ్బు సంపాదించినా తినేది అన్నమే తప్ప డబ్బులు కావు. అటువంటి అన్నదాతకు మీరు నేర్చుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానంతో దిగుబడి పెంచడానికి మంచి సూచనలు, సలహాలు ఇవ్వండి. అప్పుడు దేశంలో అందరూ హాయిగా జీవిస్తారు’’ అంటూ హితోపదేశం చేశారు మాస్టారు.మాస్టారు మాటలతో వారికి కనువిప్పు కలిగింది. ఆ రోజు నుంచి నేను గొప్పంటే నేను గొప్పని వాదులాడుకోవడం మానేశారు ముగ్గురు స్నేహితులు. -
శుంఠలు పదివేలు
‘ఓరి శుంఠా’ అని అనుకుంది. రొప్పుతున్నాడు. రెచ్చుతున్నాడు. గోడకు చేయి ఆనించి ఎటో ముఖం పెట్టి నిలుచున్నాడు. ఇలాంటి టైములో భలే వేగం వస్తుంది. చిన్న బ్యాగు తీసుకుంది. కొన్ని బట్టలు సర్దుకుంది. పసికందును ఒడిలో తీసుకుని తండ్రి వెంట ఇంటి నుంచి బయట పడింది. ఆటో కుదుపులు ఇస్తుంటే ఆదమరిచి నిదురిస్తున్న పాపను గుండెలకు అదుముకుంటూ ‘మెల్లగా అన్నా’ అంది డ్రైవర్‌తో. మళ్లీ పాప వైపు చూసింది. మొండిఘటం. ఎంత కంగారు పెట్టింది. ఆరునెలల క్రితం ఆ రోజు అతను ఆఫీసుకు వెళుతుంటే తనూ ఆఫీసుకు బయలు దేరుతుంటే సడన్‌గా ఏదో అయ్యింది. ఏమిటది... కడుపులో నుంచి ఏదో తన్నుకొస్తున్నట్టుగా... లోపలి నుంచి ఏదో బయట పడిపోతున్నట్టుగా. కళ్లు తిరుగుతున్నాయి. కింద నుంచి స్రావం. అత్తగారు పరిగెత్తుకుంటూ వచ్చింది.దగ్గరగా చిన్న క్లినిక్ ఉంటే ఆ డాక్టరమ్మ పరీక్షించి చూసి ‘అబార్షన్’ అంది.‘పెళ్లయిన మొదటి రెండుసార్లలో ఇలా అబార్షన్ అవడం కొంతమందిలో మామూలే. ఇక మీదట కడుపు నిలబడి మంచి పిల్లలు పుడతారు’ అని చెప్పింది.అది ఒక బాధ. ఆఫీసులో మాటలు పడాల్సి రావడం మరో బాధ. ‘ఈ ఆడవాళ్లకు ఏం పని లేదు. పురుళ్లని ఒకసారి అబార్షన్లని మరోసారి హాయిగా సెలవులు దొబ్బుతుంటారు’ అంటుంటారు కలీగ్స్. ఆడవాళ్లందరూ అన్నిసార్లు సపోర్ట్‌గా ఉంటారని చెప్పలేము. బాగా పని చేసేవాళ్లకు ఆడవాళ్లైనా మగవాళ్లైనా శత్రువులే. వాళ్లూ వంత పాడతారు. సరే. వాళ్లంటే పరాయివాళ్లు... ఎవరోలే అని అనుకోదగ్గవాళ్లు.ఇంటి మనిషి?అరె... భార్యకు అబార్షన్ అయ్యిందే దగ్గర కూర్చుని నాలుగు సాంత్వనం మాటలు మాట్లాడదామే అని లేదు. తను ఆఫీసుకు వెళ్లలేదు కనుక ఆ జీతం డబ్బు ఎలా తెచ్చుకుందామా అని హడావిడి పడి తెచ్చుకున్నాడు. అప్పుడనే ఏముంది? ఒకటో తేదీ వస్తున్నదంటే ఏమిటో రైలు బండి తప్పిపోయేవాడిలాగా కంగారు కంగారుగా ఉంటాడు. ఆ డబ్బు తెచ్చివ్వాలి. అతను తీసుకోవాలి. అప్పుడే నిశ్చింత. అసలు తనను పెళ్లి చేసుకున్నాడా ఒకటో తేదీనా అని సందేహం. ఒకటో తేదీనే అని ఇవాళ తేలి పోయింది.ఇంట్లో పెద్ద గొడవ అయ్యింది. కారణం ఉద్యోగం నుంచి ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు.పాప పుట్టి జీవితం సంతోషంగా ఉండబోతుంది అనుకుంటున్నప్పుడు ఈ దెబ్బ.ఆఫీసును కూడా అనడానికి లేదు. అబార్షన్ అని అబద్ధం చెప్పి ఒకసారి, ఆ వెంటనే మెటర్నిటీ లీవ్ అని మరోసారి వరుసగా సెలవులు వాడుకొని ప్రభుత్వాన్ని చీట్ చేసిందంటూ కేసు పుటప్ చేసి ఊస్టింగ్ ఇప్పించారు. కలీగ్స్ హస్తం ఉంది ఇందులో. కాని జరిగినదానిలో తప్పెవరిది?ఆ రోజు వీధి చివర డాక్టరు చెప్పింది నిజమే అనుకున్నారు. నెల తర్వాత కూడా పిరియడ్స్ రాకపోతే ఈసారి కాస్త పెద్ద డాక్టర్ దగ్గరకు వెళితే ఆమె అన్ని పరీక్షలు చేసి అబార్షన్ జరగలేదని, ఒక్కోసారి ఎక్కువ బ్లీడింగ్ జరిగి అబార్షన్ అనిపిస్తుందని, కాని పిండం సేఫ్‌గా ఉండి ఎదిగి పిల్లలు పుడతారని చెప్పింది.సంబరంలో మునిగి, ప్రెగ్నెన్సీని జాగ్రత్తగా చూసుకోవడంలో ఉండిపోయిందిగానీ ఆఫీసులో దెబ్బ పడుతుందని అనుకోలేదు.తీరా ఊస్టింగ్ ఆర్డర్‌తో వచ్చేసరికి అతడు మండి పడుతున్నాడు.‘పెద్ద ఉద్యోగం చేయడానికి బయలుదేరుతారు. ఏమైనా అంటే పొడుచుకొస్తూ ఉంటుంది. ఏం నీకు రూల్స్ తెలియవా? ప్రెగ్నెన్సీ రీకన్ఫర్మ్ చేశాక ఇంతకుముందు పెట్టిన అబార్షన్ లీవును వేరే లీవు కిందకో లాస్ ఆఫ్ పే కిందకో మార్చుకోవాలని నీకు తెలియదా?’‘నాకు తెలియలేదు. మీరూ ఎంప్లాయీయే కదా. మీరు చెప్పొచ్చుగా’‘నాకిదే పట్టింది. నీ ముట్లు లెక్కబెట్టుకోవడమే నా పనా’‘మరి నా జీతం నోట్లు లెక్కబెట్టుకోవడం మీ పనా?’ చెంప ఛెళ్లుమంది. తండ్రి ఉన్నాడని కూడా చూడలేదు. ‘మావయ్యా. నేను యోగ్యుణ్ణి. లక్షమంది వచ్చారు చేసుకోవడానికి. కాని మీ అమ్మాయి ఎంప్లాయి అని చేసుకున్నాను. పెళ్లికి నా షరతు కూడా అదే. ఇప్పుడు వెర్రిమొఖం వేసుకుని ఉద్యోగం పోగొట్టుకుంది. ఆమెకు ఉద్యోగం ఉంటే సరి. ఎలా తెచ్చుకుంటుందో తెచ్చుకోమనండి. లేకుంటే నాకు అక్కర్లేదు’ తెగేసి చెప్పాడు.బిడ్డను తీసుకుని బయటపడింది.పుట్టింటి ఆదరణ కూడా ఒకోసారి ముఖ్యమైపోతుంది. పాపను తల్లిదండ్రులకు అప్పజెప్పి తెల్లారి నుంచి కాలికి బలపం కట్టుకుని ఉద్యోగం కోసం తిరగడం మొదలుపెట్టింది. పై ఆఫీసర్లను కలిసి, అర్జీలు పెట్టి, తెలిసిన వారితో చెప్పించి... పెద్ద ప్రయాస. చివరకు శుభవార్త అందింది. ఉద్యోగం ఇస్తారట. అయితే పాత అనుభవం అంతా నల్లిఫై చేసి కొత్త అపాయింట్మెంట్ ఇస్తారట. మంచిదే. ఏదో ఒకటి. ఉద్యోగం అయితే ఉందిగా. మధ్యలో రెండు మూడుసార్లు అతడు వచ్చి చూసి వెళ్లాడు. రమ్మనలేదు. తాను వస్తాననలేదు.ఇప్పుడు వచ్చాడు. ఇలాంటి సందర్భాల కోసమే పావుకిలో స్వీట్ పేకట్లు ఉంటాయి. అలాంటిది తెచ్చాడు.ఆ స్వీటులోని స్వీటే పెట్టి, కొంచెం కారా ఇచ్చి తిన్నాక వీధి తలుపు చూపించింది.‘అదేమిటి?’ అన్నాడు హతాశుడవుతూ.‘నీక్కావల్సింది పెళ్లాం కాదు. పాస్బుక్కు. నీ దోవ నువ్వు చూసుకో’ ‘బాగా ఆలోచించుకో’‘ఆలోచించుకున్నా. వెళ్లవోయ్’వెళ్లిపోయాడు. లేచి తల దువ్వుకుని స్థిరంగా తొణకనిదానిౖయె లాయర్ దగ్గరకు బయలుదేరింది.కథ ముగిసింది.ఇంద్రగంటి జానకీబాల ‘జీవన రాజకీయం’ కథ ఇది.ఆఫీసుల్లో చాలా రాజకీయాలు ఉంటాయి. కాని కుటుంబంలో అందునా భర్త దగ్గర రాజకీయం ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. జీవించడానికి సంపాదనలో ఆమె సాయాన్ని ఆశించవచ్చు. కాని ఆమెనొక రాబడి యంత్రంగా మార్చడానికి రాజకీయం చేస్తే సహించాల్సిన అవసరం లేదు. కల్లబొల్లి కబుర్లు చెప్పి భార్యను కొత్తగా చదివించేవాళ్లు, ఉన్న ఉద్యోగంలో ఉంచకుండా డిపార్ట్మెంటల్ టెస్టులు రాయించేవాళ్లు, ఏదో ఒక మాట చెప్పి మస్కట్ విమానం ఎక్కించేవాళ్లూ, ఉద్యోగం చేయలే నంటున్నా బలవంతంగా చేయించి సాధించేవాళ్లు, నెల తిరిగేసరికి డబ్బు తేని పక్షాన అల్పంగా చూసేవాళ్లు వీళ్లు భర్తలా? శుంఠలు. పునః కథనం: ఖదీర్ ఇంద్రగంటి జానకీ బాల -
కోలుకుంటున్న ఫార్మా
ముంబై: ఫార్మా కంపెనీలు రానున్న మూడేళ్లలో ప్రస్తుత ఇబ్బందుల నుంచి గట్టెక్కుతాయని రేటింగ్ సంస్థ క్రిసిల్ అభిప్రాయపడింది. నియంత్రణ సంస్థల కఠినమైన నిబంధనలు, అంతకంతకూ తీవ్రమవుతున్న పోటీ కారణంగా గత కొంతకాలంగా ఫార్మా కంపెనీలు ఎగుమతుల్లో సమస్యలు ఎదుర్కొంటున్నాయని క్రిసిల్ తన తాజా నివేదికలో వివరించింది. దేశీయంగా డిమాండ్ జోరుగా ఉండటం, పశ్చిమ దేశాల్లో సంక్లిష్ట ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటం ఫార్మా కంపెనీలకు కలసిరానుందని పేర్కొంది. ఫలితంగా రానున్న మూడేళ్లలో ఫార్మా కంపెనీల ఆదాయాలు ఏడాదికి 9 శాతం చొప్పున పెరుగుతాయని ఆ నివేదిక అంచనా వేసింది. ముఖ్యాంశాలు... ►ఫార్మా కంపెనీలకు ఎగుమతులే కీలకం. ఎందుకంటే మొత్తం ఫార్మా రంగం ఆదాయంలో 45% వాటా ఎగుమతులదే. దేశీ అమ్మకాలు పుంజుకున్నా, ఎగుమతులు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1 శాతమే పెరుగుతాయి. ఆ తర్వాత మరింతగా పుంజుకుంటాయి. ►తీవ్రమైన పోటీ వల్ల ధరలు తగ్గడం, కొత్త ఔషధాలను మార్కెట్లోకి విడుదల చేయడంలో జాప్యం, అమెరికా ఎఫ్‌డీఏ కఠినమైన తనిఖీల కారణంగా ఆంక్షల విధింపు తదితర అంశాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 5% క్షీణిస్తాయి. ►అయితే తర్వాతి కాలంలో ఎగమతుల ఆదాయం పుంజుకుంటుంది. సంక్లిష్టమైన ఔషధ ఉత్పత్తులకు అమెరికా ఎఫ్‌డీఏ సత్వర ఆమోదాలు జారీ చేయనుండటం దీనికొక కారణం. ►నియంత్రణలు అధికంగా ఉన్న అమెరికా వం టి మార్కెట్లలో సంక్లిష్ట ఔషధాలకు ఏటా 2,000 కోట్ల డాలర్ల అవకాశాలుండటంతో ఫా ర్మా కంపెనీలు పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కోసం అధికంగానే నిధులు కేటాయిస్తున్నాయి. -
యూట్యూబ్‌తో ఎంత సంపాదించాడో తెలుసా?
కొంతమంది ఆదాయం కోసం ఉద్యోగం చేస్తారు. మరికొందరు వ్యాపారం చేస్తారు. ఇలా తమకు ఏది అవకాశం ఉంటే దానిద్వారా ఆదాయాన్ని సంపాదించుకుంటారు. టెక్నాలజీని వాడుకుని యువత సంపాదన కోసం సరికొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. అలాంటి మార్గంలో ఓ బ్రిటిష్ యువకుడు యూట్యూబ్ ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదించి వార్తలకెక్కాడు. అదికూడా ఎంతంటే ఏకంగా రూ.170 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే బ్రిటన్‌కు చెందిన గ్రాసరీ స్టోర్ టెస్కోలో చాలా కాలం పాటు పనిచేసిన డాన్ మిడిల్టన్ అనే యువకుడు ఉద్యోగానికి రాజీనామా చేసి, టీడీఎం పేరిట యూట్యూబ్ లో ఓ ఛానెల్‌ను ఏర్పాటు చేశాడు. ఈఛానెల్‌లో వీడియో గేమ్‌లను ఎలా ఆడాలి, కొత్త గేమ్‌లపై రివ్యూలు, వాటికి సంబంధించిన సలహాలు అందించేవాడు. దీంతో మిడిల్టన్ ఛానెల్‌కు సుమారు 16 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లుగా చేరారు. దీంతో ఇంత అతగాడి వీడియోలకు భారీ సంఖ్యలో హిట్స్ వచ్చేవి. అంతే గతేడాదికి గాను యూట్యూబ్ నుంచి ఏకంగా 16.5 మిలియన్ డాలర్లు (రూ.170 కోట్లు) సొమ్మును ఆర్జించాడు. ఈ సంపాదనతో మిడిల్టన్ ఫోర్బ్స్ పత్రికలో 'ద హయ్యెస్ట్ పెయిడ్ యూట్యూట్ స్టార్-2017' గా రికార్డులకెక్కాడు. మొత్తం టాప్ టెన్ యూట్యూబ్ స్టార్లు కలిసి మొత్తం రూ.188 కోట్లు సంపాదించగా.. అందులో డాన్ వాటానే రూ.170 కోట్లు. మిగిలిన 9 మంది కలిసి సంపాదించిన మొత్తం కేవలం రూ. 10 కోట్లు. -
తొలిసారి జియో గుట్టు విప్పిన అంబానీ
సాక్షి, ముంబై: టెలికాం రంగంలో సునామీలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో ఫలితాల్లో మాత్రం నిరాశ పర్చింది. అతి తక్కువ కాలంలో కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకున్న జియో.. ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు నష్టాలను మిగిల్చిన సంగతి విదితమే. జియోకు సంబంధించిన ఆదాయ వివరాలను ముఖ్యంగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తొలిసారిగా వెల్లడించడం విశేషం. జియో రూ. 271 కోట్ల రూపాయల నష్టాన్ని, రూ. 6,150 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని వెల్లడించారు. నష్టాలను నమోదు చేసినప్పటికీ వడ్డీలు, పన్నులు చెల్లించకముందు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ రూ.260 కోట్ల లాభాలను ఆర్జించినట్లు వెల్లడించారు. ఇటీవల వెల్లడించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను మించి రిలయన్స్ 12.17 శాతం ఏకీకృత నికర లాభం సాధించింది. అయితే, జియోకు మాత్రం రూ.271కోట్ల నష్టం వచ్చినట్లు రిపోర్ట్ చేసింది. కానీ జియోకు రూ.2వేల కోట్ల దాకా నష్టాలు రావొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో కేవలం రూ.271 కోట్లకే నష్టాలు పరిమితం కావడం తమకు సానుకూలమైన అంశమేనని కంపెనీ భావిస్తోంది. -
ట్విట్టర్ భలే బీట్ చేసింది!
ట్విట్టర్ తెలియని వారెవరూ ఉండరు. సామాజిక మాధ్యమంలో దీనికెంతో పేరుంది. అయితే కొన్ని క్వార్టర్లుగా కంపెనీ యూజర్ల బేస్ తగ్గి, లాభాలు రాక, నష్టాల్లో మునిగితేలుతోంది. ఈ కంపెనీని అమ్ముదామనుకుని శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, ఆర్థిక నష్టాలను తలకెత్తుకోవడానికి ఏ కంపెనీ ఆసక్తి చూపలేదు. ఆసక్తికరంగా ఎన్నో క్వార్టర్లలో నిరాశపరిచే ఫలితాలను ప్రకటించిన ట్విట్టర్ మొదటిసారి అంచనాలను అధిగమించింది. ఆదాయాలు, రాబడులలో అంచనావేసిన దానికంటే మెరుగ్గా బుధవారం తన ఫలితాలను ప్రకటించింది. ఈ కంపెనీ యాక్టివ్ యూజర్ల బేస్ నెలకు 328 మిలియన్లకు చేరినట్టు ట్విట్టర్ తెలిపింది. ఇది అంచనావేసిన దానికంటే ఏడు మిలియన్లు ఎక్కువని తెలిసింది. అదేవిధంగా గత క్వార్టర్ కంటే కూడా 9 మిలియన్లు ఎక్కువట. అదేవిధంగా కంపెనీ రెవెన్యూలు 548 మిలియన్ డాలర్లుగా ఉన్నాయని కంపెనీ సీఈవో జాక్ డోర్సే ప్రకటించారు. ఒక్క షేరుపై ఆర్జించే ఆదాయం కూడా 11 శాతం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ రెండూ వాల్ స్ట్రీట్ అంచనావేసిన దానికంటే ఎక్కువని తెలిసింది. అయితే ఒక్కో షేరుపై ఈపీఎస్ 1 శాతం మాత్రమే ఉంటుందని విశ్లేషకులు అంచనావేశారు. అదేవిధంగా రెవెన్యూలు కూడా 511.9 మిలియన్ డాలర్లుగానే ఉంటాయని తెలిపారు. వీరి అంచనాలను ట్విట్టర్ బీట్ చేసింది. రోజువారీ వాడకం వరుసగా నాలుగో క్వార్టర్ లోనూ ఏడాది ఏడాదికి 14 శాతం పెంచుకున్నట్టు కంపెనీ పేర్కొంది. అయితే డైలీ యాక్టివ్ యూజర్ నెంబర్ ను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఫలితాల ప్రకటనాంతరం ప్రీమార్కెట్ ట్రేడింగ్ లో కంపెనీ షేర్లు 11 శాతం పైకి ఎగిశాయి. ట్వీట్లకు తేలికగా రిప్లై ఇవ్వడానికి, సంభాషణ కొనసాగించడానికి కంపెనీ పలు మార్పులను చేపట్టినట్టు డోర్సే చెప్పారు. సెర్చ్, బ్రౌజ్, లైవ్ కంటెంట్ అందించే సామర్థ్యాన్ని పెంచామన్నారు. -
సంపాదించడం తప్పా?
ఇవాళ దేశంలో ఎవరిని కదిలించినా కరెన్సీ కబుర్లే! ఒకప్పుడు మన జేబులో విలాసంగా ఉన్న విలువైన వెయ్యి నోటు ఇవాళ చిత్తు కాగితంతో సమానమంటే, మరేదో కొత్త నోటు సంపాదిస్తే దాని విలువ రెండు వేలని అంటే - అసలు విలువ దేనిది? ఆ కాగితానిదా? లేక మనం దానికి ఇస్తున్న ప్రాధాన్యానిదా? ఇంతకీ డబ్బు సంపాదన మంచిదా? చెడ్డదా? ఎంత సంపాదిస్తే మంచి? మరెంత సంపాదిస్తే చెడు? డబ్బు సంపాదన తప్పు అని మన ధర్మం ఎక్కడా చెప్పలేదు. మానవ జీవితంలో దానికున్న విలువనూ తోసిపుచ్చలేదు. కాకపోతే, ఎలా సంపాదించాలో స్పష్టంగా చెప్పాయి. మనిషి తన జీవితంలో నాలుగు పురుషార్థాల కోసం శ్రమించాలని శాస్త్రవచనం. ఆ నాలుగూ ఏమిటంటే ధర్మం, అర్థం (డబ్బు), కామం (కోరిక), మోక్షం! ఈ చతుర్విధ పురుషార్థాల్లో - రెండోది ధన సంపాదన. మొట్టమొదటిది - ధర్మం. అంటే, జీవితాన్ని ధర్మంగా గడపాలి. అది మొదటిది. అలా ధర్మంగా జీవిస్తూ, ‘అర్థం’... అంటే డబ్బు సంపాదించాలి. అది రెండోది. అలా ధర్మమార్గాల్లో కష్టపడి సంపాదించిన డబ్బు ద్వారా, ధర్మబద్ధంగా కోరిక తీర్చుకోవాలి. అది మూడోది. ఇలా మూడింటితో, నాలుగో పురుషార్థమూ, అత్యున్నతమైన మోక్షసాధన చేయమన్నారు. అలాగే, ప్రతి గృహస్థూ నిత్యం అయిదు రకాల కర్మలు చేయాలని శాస్త్రమే చెబుతోంది. అవి - ‘బ్రహ్మ యజ్ఞం’ (పరమాత్మను సేవించడం), ‘దేవ యజ్ఞం’ (దేవతల సేవ), ‘పితృ యజ్ఞం’ (పితృదేవతల సేవ), ‘మనుష్య యజ్ఞం’ (తోటి మానవుల్ని సేవించడం), ‘భూత యజ్ఞం’ (ఇతర జీవకోటిని సేవించడం). ఈ అయిదూ నిత్యజీవితంలో ఆచరించాలంటే, ద్రవ్యం కావాలి. అంటే, గృహస్థుగా జీవితం సాగిస్తున్నవారు డబ్బు సంపాదించడం తప్పు కానేకాదు. కాకపోతే, మనిషి ఆ డబ్బును ధర్మంగా సంపాదించకపోతేనే తప్పు. అలా ధర్మంగా సంపాదించిన డబ్బును కూడా తన అవసరాలకు వినియోగించుకోగా మిగిలినది సమాజ హితం కోసం, తోటివారి బాగు కోసం వినియోగించకపోతే మరీ తప్పు. భగవంతుణ్ణీ, తోటివారినీ సేవించకుండా కేవలం తమ కోసం తాము బతికేవారు నరకంలో పడతారని ‘భగవద్గీత’ పేర్కొంది. గృహస్థుగా మన ధర్మం నిర్వహిస్తున్నప్పుడు, నిజజీవిత సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఉద్యోగ బాధ్యతలు వహిస్తున్నప్పుడు అనుకోకుండా - మాటలతోనో, చేతలతోనో, ఆలోచనలతోనో ఇతరులను బాధించే ప్రమాదం ఉంది. అది ఉద్దేశపూర్వకం కాకపోయినా దుష్కర్మే. అందుకే, నిస్వార్థంగా తోటివారికి సేవ చేస్తూ, చేసిన కర్మలన్నిటినీ భగవంతుడికి అర్పించాలి. అప్పుడు ఆ దుష్కర్మ తీరుతుందని పెద్దల మాట. అంటే, డబ్బు సంపాదించేది స్వార్థం కోసం, మన అహంకారాన్ని పెంచుకోవడం కోసం కాదు! మన నిత్యావసరాలు తీర్చుకొంటూనే, తోటి మానవుల్లో ఉన్న మాధవుణ్ణి సేవించడం కోసం! అలాగే, మనది కానిది తీసుకోవడం దొంగతనంతో సమానం. సంపాదించే క్రమంలో మరొకరికి కష్టం, నష్టం కలిగించడం, అవతలివారిని వాడుకొని వదిలేయడం పరమ తప్పు. కానీ, ఇవేవీ మనం గ్రహించడం లేదు. ఎంత సంపాదించినా, ఇంకా ఇంకా కావాలనే దురాశలో పడిపోతున్నాం. ‘నాకు, నా పిల్లలకు, వాళ్ళ పిల్లలకు...’ అంటూ తరతరాలకూ సరిపడా ఆస్తుల్ని స్వార్థంతో పోగేసుకోవడం మీద దృష్టిపెడుతున్నాం. నిజానికి, పోగు చేసుకోవాల్సింది ధర్మాన్ని ఆచరించడం ద్వారా వచ్చే పుణ్యాన్ని! అంతేతప్ప, పోయినప్పుడు వెంట రాని ఈ ఆస్తుల్ని కాదు!! అది మనం గుర్తించడం లేదు. సౌకర్యంగా జీవించడం తప్పు కాదు. దాని కోసం అక్రమ మార్గాలకు మళ్ళడం తప్పు. అధర్మంగా డబ్బు సంపాదిస్తే, అది తాత్కాలికంగా సుఖం ఇచ్చినట్లు అనిపించవచ్చు కానీ, ఆ పాపం మాత్రం వెంటాడి వేధిస్తుంది. ఎవరైనా, అవసరానికి మించి కూడబెడితే, ‘చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఎరవైనట్లు...’ అని శతకకారుడు చెప్పినట్లుగా ఆ డబ్బంతా చివరకు ప్రభుత్వాల సొమ్ము, పరుల సొమ్ము అవుతుంది. అసలు సిసలు ‘బ్లాక్ మనీ’ బయటకు రావాలని అందరూ కోరుకుంటున్నది అందుకే! - రెంటాల -
ఎగిరితే కిందకు దిగాల్సిందే!!
♦ పోటాపోటీగా ఆఫర్లిచ్చిన విమాన సంస్థలు ♦ ఫలితంగా భారీగా తగ్గిన ఆదాయాలు న్యూఢిల్లీ: విమానయాన మార్కెట్లో సాధ్యమైనంత వాటాను చేజిక్కించుకోవాలని.. ప్రయాణికుల భర్తీ రేటును పెంచుకోవాలని విమానయాన సంస్థలు పోటాపోటీగా ధరల తగ్గింపు ఆఫర్లిచ్చిన ఫలితం వాటి ఆదాయాలపై కనిపిస్తోంది. ఎయిరిండియా ఆదాయాల్లో 14% తగ్గుదల జూన్ త్రైమాసికంలో గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు ఎయిర్ ఇండియా దేశీయ కార్యకలాపాల ఆదాయం 14 నుంచి 16% మేర తగ్గింది. ఇదే కాలంలో కంపెనీ టికెట్ ధరలను 22%తగ్గించడం గమనార్హం. ఇక 2015 జూన్ త్రైమాసికంలో రాస్క్ రూ.5.83గా ఉండగా... ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అది రూ.4.99కు పడిపోయింది. గత 4 నెలల కాలంలో టికెట్ల ధరలు తగ్గగా... అదే సమయంలో విమానయాన ఇంధన చార్జీలు, విమానాశ్రయ చార్జీల్లో పెరుగుదల కారణంగా వ్యయాలు పెరిగిపోయినట్టు ఎయిర్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. ఇండిగో పరిస్థితీ అంతే... మార్కెట్ వాటా పరంగా అతిపెద్ద కంపెనీ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. జూన్ త్రైమాసికంలో రాస్క్ 12.7 శాతం తగ్గి రూ.4.15 నుంచి రూ.3.62కు క్షీణించింది. ఇంధన ధరలు పెరగడం, విమానాల అద్దె రుసుములు సైతం పెరిగిపోవడంతో కంపెనీ ఆదాయాలు జూన్ త్రైమాసికంలో 7.46 శాతం క్షీణించి రూ.591 కోట్లకు పరిమితం అయ్యాయి. ధరల పోటీ కారణంగా లాభం తగ్గినట్టు ఫలితాల సందర్భంగా ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్యఘోష్ తెలియజేశారు జెట్ ఎయిర్వేస్ క్షీణత 4.25 శాతం జెట్ ఎయిర్వేస్ దేశీయ ఆదాయాలు జూన్ త్రైమాసికంలో 4.25 శాతం క్షీణించి రూ.2,104 కోట్లకు పరిమితం అయ్యాయి. రాస్క్ సైతం రూ.4.47 నుంచి రూ.4.22కు తగ్గిపోయింది. 12 శాతం వరకు దిగొచ్చిన చార్జీలు వేసవి సీజన్లో స్పైస్‌జెట్, గో ఎయిర్ ప్రారంభించిన ధరల యుద్ధంలోకి ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా వచ్చి చేరాయి. పోటీ ఫలితంగా సగటున విమానయాన చార్జీలు 10 నుంచి 12 శాతం వరకు తగ్గాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
లాభాల్లో మారుతీ రయ్..రయ్..
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ విశ్లేషకులు అంచనాలను అధిగమించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు 23 శాతం జంప్ అయి, రూ.1,486.2 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.1,208.1 కోట్లగా ఉన్నాయి. రెవెన్యూలు 11.6 శాతం ఎగిసి, రూ.14,655 కోట్లగా రికార్డు చేసింది. అయితే రూ.15,133 కోట్ల అమ్మకాలతో కేవలం రూ.1,197 కోట్లను మాత్రమే మారుతీ సుజుకీ నికర లాభాలు నమోదవుతాయని ఎన్డీటీవీ నిర్వహించిన మార్కెట్ విశ్లేషకుల పోల్ లో తేలింది. ఈ అంచనాలను అధిగమించి, మారుతీ సుజుకీ తన లాభాల్లో దూసుకెళ్లింది. కంపెనీ సంపాదించిన ఇతరత్రా ఆదాయాలు లాభాలు పెరగడానికి దోహదంచేశాయని కంపెనీ పేర్కొంది. టర్నోవర్ ఎక్కువగా ఉండటం, ముడి సరుకుల వ్యయాల తగ్గుదల, నాన్-ఆపరేటింగ్ ఆదాయాలు పెరగటం,తక్కువ తరుగుదల ఇవన్నీ జూన్ త్రైమాసికంలో లాభాలు పెరగడానికి దోహదం చేశాయని కంపెనీ తన ఫైలింగ్‌లో తెలిపింది. జూన్ త్రైమాసికంలో ఇతరాత్ర ఆదాయలు 134 శాతం పెరిగి, రూ.483 కోట్లగా నమోదయ్యాయి. అయితే రెవెన్యూ ముందస్తు అంచనాలను మారుతీ మిస్ చేసింది. వాల్యుమ్ గ్రోత్ తక్కువగా ఉండటంతో రెవెన్యూ అంచనాలను కంపెనీ మిస్ అయినట్టు మారుతీ పేర్కొంది. మనేసర్‌లోని సుబ్రోస్ లిమిటెడ్ ప్లాంట్‌లో నెలకొన్న ప్రమాద కారణంగా ఆ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేయడంతో, కంపెనీ 10 వేల యూనిట్ల ఉత్పత్తిని కోల్పోయిందని వెల్లడించింది. దీంతో వాల్యుమ్ గ్రోత్ పడిపోయిందని నివేదించింది. జూన్ క్వార్టర్లో కంపెనీ 3.84 లక్షల వాహనాలను విక్రయించినట్టు మారుతీ పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ అమ్మకాలు 3.41 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది బేసిక్‌గా ఎగుమతులు 27 శాతం పడిపోయినా.. దేశీయ అమ్మకాలు 5.4 శాతం పెరిగినట్టు తన ఫలితాల్లో మారుతీ నివేదించింది. -
రుతుపవనాలు, బ్లూచిప్ కంపెనీల ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లాంటి బ్లూచిప్ కంపెనీల రాబడులు, రుతుపవనాల పురోగతి ఈ వారం స్టాక్ మార్కెట్లకు కీలక అంశాలుగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపుతూ మార్కెట్లను ఒడిదుడుకులకు లోను చేసే అవకాశాలున్నట్టు పేర్కొంటున్నారు. రుతుపవనాల పురోగతి వివరాలు, ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్స్, స్థూల ఆర్థిక డేటా, 2016 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసిక ఫలితాలు ఈ వారం దేశీయ సూచీలను నిర్దేశిస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్ లైన్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ విజయ్ సింగానియా తెలిపారు. బీపీసీఎల్, టాటా పవర్, సిప్లా, టెక్ మహింద్రా, బజాజ్ ఆటో, గెయిల్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్, ఎస్ బీఐ, కోల్ ఇండియాలు ఈ వారంలో మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆశించిన ఫలితాలను విడుదలచేయలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగానికి అతిపెద్ద బ్యాంకుగా ఉన్న ఎస్ బీఐ ఫలితాలపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టిసారించనున్నారని రిలయన్స్ సెక్యురిటీస్ తెలిపింది. కొన్ని వారాల వరకూ మార్కెట్లకి, ఆర్థిక వ్యవస్థకు రుతుపవనాలే కీలక అంశంగా ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గతవారం రెండు దేశీయ సూచీలు సెన్సెక్స్, నిప్టీలు నష్టాలు పాలయ్యాయి. సెన్సెక్స్ 187.67 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 65.20 పాయింట్లు నష్టపోయింది. -
మార్కెట్ ట్రెండ్ కి గణాంకాలు,ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ: బ్లూ చిప్ కంపెనీ లుపిన్, ఐటీసీ త్రైమాసిక ఫలితాలు, టోకు ధరల ద్రవ్యోల్బణ డేటా, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ వారం మార్కెట్లకు కీలక అంశాలుగా మారనున్నాయని పై విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రుతుపవనాల సెంటిమెంట్లు మార్కెట్లకు పాజిటివ్ ట్రెండ్ చూపిస్తున్నా... వారంలో విడుదలయ్యే గణాంకాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నట్టు తెలుస్తోంది. 2016 ఏప్రిల్ నెలకు సంబంధించిన టోకుధరల ఇండెక్స్ సోమవారం విడుదల కానుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్ లైన్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ విజయ్ సింగానియా తెలిపారు. మరోవైపు అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయొచ్చని ఆయన చెప్పారు. అదేవిధంగా లుపిన్, ఐటీసీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు నాలుగో త్రైమాసిక ఫలితాలు ఈ వారంలోనే విడుదల కానున్నాయి. ఓ వైపు త్రైమాసిక ఫలితాలు, టోకు ధరల ఇండెక్స్ ఫలితాలు, మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ ఈ వారం కూడా స్థిరంగా ఉండదని, ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశముందని మోతిలాల్ ఓస్వల్ సెక్యురిటీస్ విశ్లేషకుడు రవి శెనోయ్ తెలిపారు. త్రైమాసిక ఫలితాలు, రుతుపవనాల సంకేతాలు, అంతర్జాతీయ అంశాలు మార్కెట్ సెంటిమెంట్ ను ఖరారు చేస్తాయని కొటక్ సెక్యురిటీస్ ప్రైవేట్ క్లెయింట్ గ్రూప్ రీసెర్చర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెండ్ దిపెన్ షా పేర్కొన్నారు. నత్తనడకన సాగిన పారిశ్రామిక ఉత్పత్తి డేటా, ఏప్రిల్ నెల వినియోగదారుల ద్రవ్యోల్బణం పెరగడం గతవారం మార్కెట్ ను కొంత ప్రభావితం చేశాయి. ఆఖరికి 261 పాయింట్లు పెరిగి, 25,489.57 వద్ద సెన్సెక్స్ ముగిసింది. -
డీమ్యాట్‌లో పడేసి ధీమాగా ఉండండి
ఉమన్ ఫైనాన్స్ చాలామంది రకరకాల పెట్టుబడి మార్గాలలో తమ భవిష్యత్తు అవసరాల కోసం తమ సంపాదనలో కొంత భాగాన్ని మదుపు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ చాలామంది మహిళలకు తమ భర్త లేదా తమ సంపాదనలో పొదుపు చేసిన సొమ్మును ఏయే మదుపు మార్గాలలో పెట్టుబడి పెట్టారో తెలియదు. వాటికి సంబంధించిన పత్రాలు తదితర వివరాలు కూడా అంతగా పట్టించుకోరు. మదుపు చేయడం ఎంత ముఖ్యమో, వాటికి సంబంధించిన వివరాలను ఆలుమగలు ఇద్దరూ తెలుసుకొని ఉండటం కూడా అంతే ముఖ్యం. అలాగే తమ తదనంతరం ఆ పెట్టుబడులు ఎవరికి చెందాలో పొందుపరచటం కూడా చాలా అవసరం. ఇదివరకు అన్నీ పత్ర రూపేణా ఉంచేవారు. ఇప్పుడు చాలామటుకు పెట్టుబడులను ఎలక్ట్రానిక్ (పేపర్‌లెస్) రూపంలో ఉంచడానికి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో డీ-మ్యాట్ (డీ మెటీరియలైజేషన్) ఒకటి. మనం బ్యాంకులో ఏవిధంగానైతే డబ్బును ఎలక్ట్రానిక్ రూపంలో వ్యవహరిస్తామో, దాచిపెడతామో అదేవిధంగా డీ-మ్యాట్ అకౌంట్లో షేర్లు, బాండ్లు తదితరాలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరుస్తారు. డీ-మ్యాట్ ఖాతాను ఎన్ఎస్డీఎల్ (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్) / సీడీఎస్ఎల్ (సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్‌తో రిజిస్టర్ చేసుకొన్న డిపాజిటరీ పార్టిసిపేంట్స్ (డీపీ) వద్ద ప్రారంభించవచ్చు. ఈ ఖాతాలో షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు తదితరాలను పొందుపరచవచ్చు. డీ-మ్యాట్ ఖాతాని ప్రారంభించటానికి కొన్ని డీపీలు అప్లికేషన్ ఛార్జీని వసూలు చేస్తున్నాయి. మరికొన్ని డీపీలు ఫ్రీగా కూడా అందజేస్తున్నాయి. ఖాతా నిర్వహణ కోసం వార్షిక నిర్వహణ ఛార్జీని కట్టవలసి ఉంటుంది. ఫిజికల్ షేర్లు ఉంటే డీ-మ్యాట్ ఖాతాలో నమోదు చేయటానికి ఒక్కో ట్రాన్సాక్షన్‌కి నిర్ణీత రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఈ ఖాతా వల్ల ఒనగూడే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. మీ పెట్టుబడులను వివిధ పెట్టుబడి మార్గాలలో (షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, బాండ్స్) పెట్టడం, అలాగే వెనక్కి తీసుకోవటం చాలా సులభం. మీ సెక్యూరిటీస్ దొంగతనం అవుతాయేమోననే భయం ఉండదు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, గవర్నమెంట్ బాండ్స్, ట్యాక్స్ ఫ్రీ బాండ్స్... ఇలాంటివన్నీ ఒకే ఖాతాలో ఉండటం ఆ ఖాతాకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎప్పటికప్పుడు అందడం జరుగుతుంది కాబట్టి సరైన టైమ్‌లో అవసరమైన నిర్ణయాలు సులువుగా తీసుకోవచ్చు.మీ పెట్టుబడులకు సంబంధించిన వడ్డీ, డివిడెండ్ మొదలైనవి మీ డీ-మ్యాట్ ఖాతాలో నమోదు చేసిన బ్యాంకు ఖాతాకు డెరైక్టుగా క్రెడిట్ అవుతాయి. బోనస్ షేర్లు/ రైట్ షేర్లు వస్తే డెరైక్ట్‌గా మీ డీ-మ్యాట్ ఖాతాకు క్రెడిట్ అవుతాయి.మీ తదనంతరం మీ పెట్టుబడులు ఎవరికి చెందాలో వారిని నామినేట్ చేసుకోవచ్చు. ఈ కింది జాగ్రత్తలు తప్పక తీసుకోండి: మీ బ్యాంకు ఖాతాకు చెక్ బుక్ ఎలాగో ఈ డీ-మ్యాట్ ఖాతాకు డీఐఎస్ (డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్) అలాగ. కనుక ఎవరికీ ఖాళీ డీఐఎస్ ఇవ్వకండి.నామినీని తప్పక రిజిస్టర్ చేయండి.ఒకవేళ మీ బ్యాంకు ఖాతా, అడ్రస్ తదితరాలు మారితే తప్పనిసరిగా ఆ మార్పులను మీ డీ-మ్యాట్ ఖాతాలో కూడా నమోదు చేయండి. ఫోర్జరీ, దొంగతనం, మానవ తప్పిదం, ప్రకృతి వైపరీత్యం మొదలైనవాటి నుండి మీ షేర్లు, బాండ్లు మొదలైనవాటిని కాపాడాలన్నా, పెట్టుబడులను అతి తక్కువ ఖర్చుతో నిర్వహించాలన్నా, ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోళ్లు, అమ్మకాలు చేయాలన్నా డీ-మ్యాట్ ఖాతా తప్పనిసరి. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
భిక్షాటన మొత్తం 10 లక్షలు కాలిపోయాయి
సాక్షి, ముంబై: పాపం.. ఏళ్ల తరబడి భిక్షాటన చేసి సంపాదించుకున్న డబ్బు ఎలుక పుణ్యమాని తగులబడిపోయింది. అదేం చిన్నా చితకా కాదు.. ఏకంగా రూ. 10 లక్షలు. కళ్యాణ్‌లోని మారూమూల ప్రాంతంలోని చిన్న గుడిసెలో నివాసముంటున్న మహ్మద్ రెహమాన్, అతని భార్య ఫాతిమా.. సమీపంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో భిక్షాటన చేస్తూ.. ఇంత మొత్తాన్ని కూడబెట్టారు. మంగళవారం కరెంటుపోవటంతో.. దీపం పెట్టుకుని పడుకున్నారు. అయితే.. బుధవారం తెల్లవారుజామున ఎలుకలు దీపాన్ని పడగొట్టడంతో.. గుడిసెకు నిప్పంటుకుంది. ఈ దంపతులు ప్రాణాలతో బయటపడ్డా.. సంచుల్లో దాచి గోడల్లో కుక్కి పెట్టిన సంపాదన కూడా కాలిపోయింది. సంచుల్లో ఉన్న నోట్లను బట్టి రూ.10 లక్షల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
పట్టాదారుపాసుబుక్కుల మంజూరుకు లంచం డిమాండ్ రూ. 35వేలు తీసుకుంటూ పట్టుబడిన పీలేరు తహశీల్దార్ పీలేరు : ఉచితంగా సేవలందించాల్సిన ఆ అధికారి అడ్డుగోలు సంపాదనకు అలవాటు పడ్డాడు. పట్టాదారుపాసుబుక్కుల కోసం లంచం డిమాండ్ చే శాడు. అంత ఇచ్చుకోలేనని ప్రాదేయపడినా జాలి లేకుండా కాదుపొమ్మన్నాడు. చేసేదేమి లేక ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించి అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాడు. పీలేరు తహశీల్దార్ వీ.సురేష్‌బాబు శుక్రవారం లంచం తీసుకుం టూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తిరుపతి రేంజ్ ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి వివరాల మేరకు.. పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ కృష్ణారెడ్డిగారిపల్లెకు చెందిన శంకరయ్య కాకులారంపల్లె వద్ద 1.31 ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. భూమిని తనపేరిట మార్చుకుని పాసుబుక్కుల కోసం తహశీల్దార్ సురేష్‌బాబు వద్దకు వచ్చాడు. ఆయన సూచన మేరకు గత ఏప్రిల్‌లో మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత తహశీల్దార్‌ను కలవగా రూ. 50వేలు డిమాండ్ చేశాడు. తాను దళితుడినని, అంత మొత్తం ఇచ్చుకోలేనని చెప్పి నా తహశీల్దార్ మాత్రం కరుణించలేదు. అనంతరం రెండునెలలుగా పలుమార్లు కార్యాలయానికి వెళ్లి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రెండు రోజుల క్రితం రూ. 35వేలకు ఒప్పందం కుదుర్చుకుని గురువారం తిరుపతి రేంజ్ ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు రూ. 35వేలు శంకరయ్యకు ఇచ్చి తహశీల్దార్‌కు ఇవ్వాలని సూచించి పంపించారు. శుక్రవారం ఉదయం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన 20 నిమిషాల్లో రైతు నగదు ముట్టజెప్పాడు. అక్కడే మాటువేసిన అధికారులు వెంటనే తహశీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని ల్యాప్‌టాప్, రికార్డులు సీజ్ చేశారు. కార్యాలయ సిబ్బంది సెల్ఫోన్లు స్విచ్ఆఫ్ చేయించి గేట్లు మూసి తనిఖీలు నిర్వహించారు. పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీకి సం బంధించిన రికార్డులు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలోని డేటా పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. దాడిలో ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఐదేళ్ల క్రితం ఇదే కార్యాలయంలో కులధృవీకరణ పత్రం మంజూరు కోసం జూనియర్ అసిస్టెంట్ రూ. 500 తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. -
రైల్వే రాబడి పెరిగింది
న్యూఢిల్లీ: ఈయేడాది కూడా రైల్వే ఆదాయం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 2014-15 ఆర్థిక సంవత్సరానికి 12.16శాతం ఆదాయం పెరిగినట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ గణాంకాలు తెలిపాయి. 2013-14 సంవత్సరంలో రైల్వే ఆదాయం రూ.140,761.27 కోట్లుకాగా, ఈ 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,57,880.50 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఆదాయంలో సరుకు రవాణా రైళ్ల ద్వారా వచ్చింది రూ.1,07,074.79 ఉండగా.. గతంలో ఇదే గూడ్స్ సర్వీస్‌పై రూ.94,955.89 కోట్ల రాబడి వచ్చింది. ఇది 12.76శాతం ఎక్కువ. ఇక ప్రయాణీకుల సర్వీసు ద్వారా కూడా గతంలో కన్నా ఎక్కువ ఆదాయమే వచ్చింది. 2014-15లో మొత్తం 42,866.33కోట్ల ఆదాయం రాగా.. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.37,478.34 కోట్ల ఆదాయంగా ఉంది. ఇది గతంతో పోలిస్తే 14.38శాతం ఎక్కువ. -
సంపాదన ఉంటేనే టర్మ్ ఇన్సూరెన్స్
నేను రూ.10-15 లక్షల వరకూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేశాను. అయితే ఇవన్నీ కాగిత రూపంలోనే ఉన్నాయి. వీటిని డీమ్యాట్ రూపంలోకి మార్చుకోవాలా? అలాచేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రస్తుతం నా దగ్గర రూ.5 లక్షల వరకూ డబ్బులున్నాయి. దీనిని ఏదైనా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత వాటిని ఏదైనా ఈక్విటీ ఫండ్‌లోకి బదిలీ చేయాలనుకుంటున్నాను. సరైన డెట్ ఫండ్‌ను సూచించండి. -ఉమశ్, వరంగల్ ప్రత్యేకమైన ప్రయోజనాలు లేకపోయినప్పటికీ కాగిత రూపంలోని మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను డీమ్యాట్ అకౌంట్లోకి మార్చుకుంటే మంచిదే. ఇక మీ రెండో ప్రశ్నకు వస్తే..., మీరు వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి వాటి వివరాలు తెలియకుండా ఏదో ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని సలహా ఇవ్వలేను. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న మొత్తాన్ని ముందుగా ఏదైనా షార్ట్-టర్మ్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఏదైనా ఈక్విటీ ఫండ్‌లోకి బదిలీ చేయండి. కాకుంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న షార్ట్-టర్మ్ బాండ్ ఫండ్, బదిలీ చేసే ఈక్విటీ ఫండ్- ఈ రెండు ఒకే మ్యూచువల్ ఫండ్ కంపెనీకి చెందినవైతే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. నేను ఒక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)కు చెందిన డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. ఈ స్కీమ్ నుంచి డివిడెండ్ పే అవుట్ స్కీమ్‌కు మారాలనుకుంటున్నాను. ఎలా మారాలో వివరించండి? -అమరేశ్వరి, గుంటూరు మీరు ప్రస్తుతం డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఫండ్ నుంచి డివిడెండ్ పేఅవుట్(చెల్లించే) ఆప్షన్‌కు మారాలనుకుంటున్నట్లు ఒక రిక్వెస్ట్ లెటర్‌ను గానీ, చేంజ్ ఆప్షన్ స్లిప్‌ను గానీ ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థకు పంపించాలి. మీ స్కీమ్‌కు లాక్-ఇన్ పీరియడ్ ఉన్నా ఇలా మార్చుకోవచ్చు. అయితే గ్రోత్ ఆప్షన్ స్కీమ్లైతే లాకిన్ పీరియడ్ తర్వాతనే మార్చుకోవడానికి వీలవుతుంది. మీ పెట్టుబడులను 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ పూర్తయిన తర్వాత రిడీమ్ చేసుకోవచ్చు. ఇటీవలనే మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌కు సంబంధించి డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌ను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేను కొటక్ గోల్డ్ ఫండ్ యూనిట్లను విక్రయించాలనుకుంటున్నాను. నేనేమన్నా లాంగ్‌టెర్మ్, షార్ట్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలా? ఎన్ని సంవత్సరాల పెట్టుబడి తర్వాత లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది? -సరళ, హైదరాబాద్ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, దేశీయ ఈక్విటీల్లో 65 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు, ఇలా కాని వాటిని నాన్-ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. కొటక్ వరల్డ్ గోల్డ్ ఫండ్‌ను విదేశీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి దీనిని నాన్-ఈక్విటీ ఫండ్‌గా పరిగణిస్తారు.ఈ ఫండ్ నుంచి మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లలోపే ఉపసంహరించుకుంటే మీరు షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ ట్యాక్స్ శ్లాబులననుసరించి ఈ పన్ను విధిస్తారు. మూడేళ్ల త ర్వాత ఉపసంహరించుకుంటే దీర్ఘకాల క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్‌తో కలుపుకొని ఇది 20 శాతంగా ఉంటుంది. నా కొడుకు వయస్సు 20 సంవత్సరాలు. అతడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతడిపేరు మీద ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందామనుకున్నాను, రెండు మూడు జీవిత బీమా వెబ్సైట్లలో ఆన్లైన్ ద్వారా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ప్రయత్నాలు చేశాను. కానీ ఈ వెబ్సైట్లన్నీ ఆదాయ ధ్రువీకరణ అడుగుతున్నాయి. నా కొడుకు ఇంకా చదువుతున్నాడు. కాబట్టి అతడికి ఆదాయ ధ్రువీకరణ లేదు. నా కొడుక్కి వేరే మార్గాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా? -ఆంజనేయ శాస్త్రి, కర్నూలు సాధారణంగా కుటుంబంలో సంపాదించే వ్యక్తులే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఈ సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే, అతడి పై ఆధారపడ్డ వారికి ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడానికి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. సంపాదన లేని వ్యక్తికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం సరైనది కాదు. -
ఉత్సాహం ఉంటే చాలు!
వాయనం: ధరలు పెరిగినంత వేగంగా సంపాదన పెరగదు. అందుకే ప్రస్తుత రోజుల్లో ఒక్కరి సంపాదనతో సంసారాన్ని నెట్టుకురావడం చాలా కష్టమవుతోంది. భర్తతో పాటు భార్య కూడా సంపాదించాల్సి వస్తోంది. చదువుకున్నవాళ్లయితే ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఉద్యోగం చేయడానికి తగిన క్వాలిఫికేషన్ లేనివాళ్లు, బయటకు వెళ్లే వీలు లేనివాళ్ల పరిస్థితి ఏమిటి?! చింతించాల్సిన పని లేదు. సంపాదించాలని అనుకోవాలేగానీ అందుకు బోలెడన్ని మార్గాలు ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు! ఇంట్లో వంట చేస్తారుగా... దాన్నే మీ ఉపాధిగా ఎందుకు మార్చుకోకూడదు! మీరున్న ప్రాంతంలో ఆఫీసులు, కాలేజీలు వంటి వాటికి వెళ్లి, మధ్యాహ్న భోజనం బయట చేసే అలవాటు ఉన్నవారికి మంచి ఫుడ్ సప్లయ్ చేస్తానని చెప్పండి. మీలాంటి మరి కొందర్ని సమకూర్చుకున్నారంటే పెద్ద పెద్ద ఫంక్షన్లకు ఫుడ్ సప్లయ్ చేయవచ్చు. పచ్చళ్లు, పొడులు, చిరుతిళ్లు చేసి షాపులకు కూడా సరఫరా చేయవచ్చు. కొద్దిపాటి పెట్టుబడితో ఇంట్లోనే దుస్తుల వ్యాపారం చేయవచ్చు. కాకపోతే మీ దగ్గర అలవాటు పడేవరకూ ధరలు వారి వారి స్తోమతకు తగినట్టు ఉండాలి. మొదటే ఎక్కువ చెబితే, షాపుకే వెళ్లొచ్చుగా అనుకుంటారు. దుస్తులు డిజైన్ చేయడం, కుట్టడం వస్తే కనుక ఓ చిన్న బొతిక్ పెట్టేయండి. ఒక్కసారి భేష్ అనిపించుకున్నారంటే కస్టమర్లు మిమ్మల్ని వదలరు. వంటలో నిపుణులైతే కుకింగ్ క్లాసులు, కుట్టు పని తెలిస్తే డిజైనింగ్ క్లాసులు తీసుకోండి. ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, అలంకరణ సామగ్రి- బొమ్మల తయారీ... మీకు తెలిసిన ప్రతి విద్యతోనూ డబ్బు సంపాదించవచ్చు. ఇంట్లోనే సంపాదించడానికి ట్యూషన్లు చెప్పడం కూడా మంచి మార్గం. మీకు రాయడం, తర్జుమా చేయడం కనుక వస్తే... ఇంట్లోనే కూర్చుని కంటెంట్ రైటర్‌గా పని చేయవచ్చు. ఇల్లు కదలకుండా సంపాదించడానికి బేబీ కేర్ సెంటర్ పెట్టడం కూడా మంచి ఆప్షన్. కాకపోతే చంటి పిల్లల్ని చూసుకోవడానికి చాలా ఓపిక ఉండాలి. మీకంత ఓపిక ఉంటే కనుక ట్రై చేయవచ్చు. అయితే ఇది పట్టణాలు, నగరాల్లో మాత్రమే లాభదాయకం. డబ్బు సంపాదించేందుకు మాత్రమే ఏదో ఒకటి చేయమని కాదు. మీ ప్రతి భను, సమయాన్ని వృథా కానివ్వకుండా సద్వినియోగం చేసుకోవడానికి కూడా మీరు ఏదో ఒకటి చేయడం మంచిది. ఏమో... రేపు మీరో గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగే అవకాశం ఉందేమో... ఒక రాయి ఎందుకు వేసి చూడకూడదు? -
సాగు.. సంపాదన పెంచేందుకు..
రూ.85 కోట్లతో 8 చెరువుల అభివృద్ధికి ఉడా ప్రతిపాదనలు బోటింగ్, వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి సాక్షి, విజయవాడ : భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ అథారిటీ(వీజీ టీఎం ఉడా) అధికారులు మరో ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఉడా అధికారులు ఇప్పటికే రూ.1,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులు, నూతన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వం ముందుంచారు. ఇందులో భాగంగానే ఉడా పరిధిలోని ఎనిమిది ప్రధాన చెరువులను ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఆధునికీకరణ వల్ల చెరువుల ఆయకట్టు పరిధిలో సాగు విస్తీర్ణం పెరుగుతందని ప్రతిపాదనల్లో వివరించారు. చెరువుల చుట్టూ ప్రహరీలు నిర్మించి వాకింగ్ ట్రాక్‌లు, బోటింగ్, ఇతర సదుపాయాలను కల్పిస్తామని, తద్వారా ఆదాయం కూడా వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.85కోట్లు మంజూరు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. నిధులు మంజూరైతే ఏడాదిన్నర కాలంలో పనులు పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. కేంద్రం నిధులపై ఆశలు జిల్లాలోని బ్రహ్మయ్య లింగం చెరువును హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తరహాలో అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం రూ.50కోట్లు మంజూరు చేయాలని ఉడా అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో జిల్లాలో మరో ఎనిమిది ప్రధాన సాగునీటి చెరువులను గుర్తించారు. వాటి అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుకు ఇటీవల ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ ప్రాజెక్టుపై వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందించడంతో కేంద్ర టూరిజం శాఖ నుంచి నిధులు మంజూరు చేయిస్తారని ఉడా అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. అభివృద్ధి చేయనున్న చెరువులు ఇవే.. విజయవాడ పాయకాపురంలోని ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఈ చెరువులో కొంతభాగం ఆక్రమణలకు గురైంది. దీని అభివృద్ధికి రూ.15కోట్ల అం చనాలతో ప్రతిపాదనలు సిద్ధంచేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరులో 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గంగానమ్మ చెరువును రూ.20కోట్లతో ఆధునికీకరించాలని నిర్ణయిచారు. తొలుత పూడిక తొలగిం చడం, ఆ తర్వాత పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించారు. నున్న, గన్నవరం ప్రాంతాల మధ్య ఉన్న ఆరు చెరువులను ఒకే ప్యాకేజీ కింద రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ముస్తాబాద గ్రామంలోని 306 ఎకరాల చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నున్న సమీపంలో 106 ఎకరాల్లో ఉన్న పీత చెరువును, అదే ప్రాంతానికి చెందిన ధర్మ చెరువు, జంగంవాని చెరువు, పుల్లయ్య చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధంచేశారు. గన్నవరం మండలంలోని సూరంపల్లిలో సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రచెరువును కూడా అభివృద్ధి చేయటానికి ప్రతిపాదనలు తయారుచేశారు. -
ఐవోసీ లాభం రూ. 2,523 కోట్లు
న్యూఢిల్లీ: ఆయిల్ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రూ. 2,523 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో రూ. 3,093 కోట్ల నికర నష్టాలు నమోదయ్యాయి. ప్రధానంగా విదేశీ మారక లాభాలు నష్టాల నుంచి బయటపడేందుకు కారణమైనట్లు కంపెనీ చైర్మన్ బి.అశోక్ చెప్పారు. గతంలో ఈ పద్దుకింద రూ. 4,024 కోట్ల నష్టం నమోదుకాగా, తాజాగా రూ. 128 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిపారు. కాగా, ఈ కాలంలో పన్నులకు రూ. 1,028 కోట్లను కేటాయించామని, గతంలో వీటికి ఎలాంటి కేటాయింపులు చేపట్టలేద ని తెలిపారు. అయితే ఆర్బీఐ కరెన్సీ స్వాప్ విండో ద్వారా రూ. 745 కోట్లు, రైట్‌బ్యాక్ ద్వారా రూ. 348 కోట్లు, రూ. 556 కోట్లమేర వడ్డీ వ్యయాల్లో ఆదా వంటి అంశాలు లాభాలను సాధించేందుకు దోహదపడినట్లు వివరించారు. రూ. 15,328 కోట్ల ఆదాయ నష్టాలు ప్రస్తుత సమీక్షా కాలంలో ప్రభుత్వ నియంత్రిత ధరల్లో డీజిల్, ఎల్పీజీ, కిరోసిస్ అమ్మకాలవల్ల రూ. 15,328 కోట్ల ఆదాయ నష్టాలు వాటిల్లినట్లు కంపెనీ తెలిపింది. అయితే ఇందుకు ప్రభుత్వం నుంచి రూ. 6,076 కోట్లు, ఓఎన్జీసీ వంటి ఉత్పాదక సంస్థల నుంచి రూ. 8,107 కోట్లు సబ్సిడీగా లభించినట్లు వెల్లడించింది. సబ్సిడీలు సకాలంలో అందడంతో కొంతమేర రుణాలను తిరిగి చెల్లించడం ద్వారా రూ. 556 కోట్లమేర వడ్డీ వ్యయాలను తగ్గించుకున్నట్లు అశోక్ చెప్పారు. వెరసి కంపెనీ రుణభారం రూ. 86,263 కోట్ల నుంచి రూ. 68,953 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేరు 3.6% ఎగసి రూ. 341 వద్ద ముగిసింది. -
ఇలా చేస్తే... ఆల్ హ్యాపీస్..
ఆర్థిక లక్ష్యాలకు తగ్గట్టే మదుపు బోలెడంత కష్టపడితే గానీ కాస్తంత సంపాదన చేతికి రాదు. మరి మనం ఇంత కష్టపడుతుంటే.. మనం సంపాదించిన డబ్బు... అంతంత మాత్రం వడ్డీలు ఆర్జిస్తూ బ్యాంకులో దర్జాగా కూర్చుంటే ఎలా కుదురుతుంది. వేణ్నీళ్లకు చన్నీళ్లలాగా అది కూడా మరికాస్త అదనంగా రాబడి తెచ్చిపెట్టినప్పుడే కదా సంపాదించిన డబ్బుకు సార్థకత. ఇలా లెక్కలేసుకుని రకరకాల సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. ఎవరో చెప్పారని ఒక దాంట్లోను.. భారీగా రాబడి వస్తోందంటూ మరో దాంట్లోనూ పెట్టేసి ఒకోసారి చేతులు కాల్చుకుంటూ ఉంటాం. ఆర్థిక ప్రణాళికను దెబ్బతీసుకుంటూంటాం. ఇలా జరగకుండా.. పెట్టే పెట్టుబడి విషయంలోనూ, ఇతర అంశాల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ఆర్థిక ప్రణాళిక పట్టాలు తప్పకుండా చూసుకోవడాన్ని వివరించేది ఈ కథనం. మొహమాటానికి పోతే... సన్నిహితులు చెప్పారనో ... బంధువులు చెప్పారనో మొహమాటానికి పోయి నిరుపయోగకరమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కునే వారి సంఖ్య చాలానే ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్ బాగుందని.. ఆ కంపెనీ షేరు బ్రహ్మాండంగా పెరుగుతుందని ఎవరో చెబితే కొన్నిసార్లు ఇన్వెస్ట్ చేసేస్తుంటాం. సదరు సాధనం మనకు సరిపడదని తెలిసిన తర్వాత కూడా విధిలేని పరిస్థితుల్లో కొనసాగించేస్తుంటాం. అలాగని వారి మాట అస్సలు వినకూడదని కాదు. కానీ, ఆయా సాధనాల గురించి అస్సలు తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో మొహమాటాన్ని పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి. లక్ష్యం అంటూ ఉండాలి.. పెట్టుబడులకు ఏదైనా లక్ష్యం ఉండాలి. దాన్ని బట్టే ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందనేది తెలుస్తుంది. దీన్ని బట్టే.. ఏ సాధనంలో పెట్టుబడి పెట్టాలన్నది అవగాహనకు రావచ్చు. ఉదాహరణకు వాహనం కొనుక్కోవడమో లేదా ఇల్లు కొనుక్కోవడమో.. పిల్లల చదువుల కోసమో ఇలా ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఏం చేయాలన్నది నిర్దేశించుకోకుండా.. ఏదో పేరుకి ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే ఒక లక్ష్యం అంటూ విధించుకుంటారో ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలి.. ఎప్పుడు వైదొలగాలి అన్నదానిపై స్పష్టత వస్తుంది. రాబడే ప్రామాణికం కాదు.. ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొందరు మిగతా అంశాలను పక్కన పెట్టి కేవలం రాబడే ప్రామాణికంగా చూసుకుంటూ ఉంటారు. తమ చేతిలో డబ్బు ఉన్న సమయాన్ని బట్టి అప్పటికప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఎక్కువ ఇస్తుంది వంటివి లెక్కలేసుకుంటారు. స్టాక్ మార్కెట్లు బాగుంటే షేర్లవైపు వెళ్లిపోవడం... బంగారం మెరుగ్గా అనిపిస్తే కొనేయడం.. వడ్డీ రేట్లు బాగున్నాయని ఎఫ్డీలు చేసేయడం.. ఇలా ప్రణాళిక లేకుండా డబ్బును అందులోను, ఇందులోనూ తిప్పేస్తూ నానా హైరానా పడితే చివరకు చేతికి వచ్చేదేమీ ఉండదు. చాలా మంది ఇన్వెస్టర్లలో ఇలాంటి ధోరణే ఉంటుంది. దీంతో ఎప్పటికప్పుడు భారీ రాబడులు అందించే సాధనాల కోసం వెతుకుతూనే ఉంటారు. చివరికి ఆయా సాధనాలు తార స్థాయిలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుని కూర్చుంటారు. కనుక అధిక రాబడులనేవి అభిలషణీయమే అయినా.. రిస్కులు చూసుకుని అడుగేయాలి. పన్నుల భారం తగ్గించుకోవడానికి.. పన్నుల భారాన్ని తగ్గించుకునేందుకు ఆఖరు నిమిషంలో చాలా మంది వేతన జీవులు.. ఆదరాబాదరాగా బీమా పాలసీలు తీసుకోవడమో లేదా ఫండ్స్‌లోనో మరో సాధనంలోనో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆయా పాలసీలు, ఫండ్లు తమ ఆర్థిక లక్ష్యాలకు ఎంత వరకూ ఉపయోగపడతాయన్నది పట్టించుకోరు. ముందు పన్ను భారం తగ్గితే చాలనుకుంటారు. కానీ సదరు యులిప్స్ కావొచ్చు.. లేదా మరో ఫండ్ కావొచ్చు ఆ తర్వాత సరైన పనితీరు కనపర్చకపోతే.. పన్ను పరంగా వచ్చిన లాభం, అందులో పోతుంది. ఇలాంటి వాటికి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. అదేంటంటే.. మనం పెట్టే పెట్టుబడి అనేది మన లక్ష్యాలకు ఉపయోగపడేదిలా ఉండాలి. మన రిస్కు సామర్థ్యానికి తగ్గట్లుగా ఉండాలి. వాటి ద్వారా పన్నుపరమైన ప్రయోజనాలు అదనంగా రావాలి. అంతే తప్ప.. కేవలం పన్ను ఆదా అవుతుందనే ఉద్దేశంతో ఏవేవో పోగేసుకోవడం అనవసరం. ఉచిత సలహాలతో జాగ్రత్త.. ఆర్థిక ప్రణాళికలకు సంబంధించి ఉచిత సలహాలిచ్చే వారి కన్నా కొంత ఫీజు ఇవ్వాల్సి వచ్చినా ... సరైన ఫైనాన్షియల్ అడ్వైజరు సలహాలు తీసుకోవడం మంచిది. ఇక్కడ ఫీజు మాత్రమే ప్రామాణికం కాదు. సదరు అడ్వైజరు నిబద్ధతను కూడా అంచనా వేసుకున్న తర్వాతే ఎంపిక చేసుకోవాలి. అంతా ఒకే దాంట్లో.. తక్కువ కాలంలో ఎక్కువ రాబడి వచ్చేస్తుందన్న అత్యాశతో మొత్తం డబ్బంతా తీసుకెళ్లి.. ఏ సాధనం అయితే బూమ్‌లో ఉందో అందులో పెట్టేస్తుంటాం. షేర్లలో రిస్కు ఎక్కువగా ఉంటుందని బ్యాంకు ఎఫ్డీలనో, సురక్షితంగా ఉంటుంది.. ఏదో రోజు భారీగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో పూర్తిగా రియల్ ఎస్టేట్నో పట్టుకుని కూర్చుంటే లాభం లేదని ఇటీవలి పరిణామాలు చెబుతూనే ఉన్నా యి. ఇలా ఒకేదాన్ని నమ్ముకుంటేనే రిస్కు కాస్త ఎక్కువ ఉంటుం ది. కాబట్టి మీ రిస్కు సామర్థ్యాన్ని అంచనా వేసుకుని, ఏయే సాధనాలు మీ లక్ష్యాల సాధనకు ఉపయోగపడతాయో చూసుకుని వాటిల్లో సముచితంగా కేటాయింపులు జరపడం మంచిది. నేల విడిచి సాము చేయొద్దు.. ఉదయం నుంచి సాయంత్రం దాకా తొమ్మిది గంటల డ్యూటీ చేయడమే ఒకోసారి కష్టంగా అనిపిస్తుంది.. అలాంటిది ఆదాయాలపై సరైన అంచనాలు లేకపోతే ఏకంగా పదిహేను.. ఇరవై ఏళ్లపాటు ఇంటికోసం తీసుకున్న రుణభారాన్ని మేనేజ్ చేయడం ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి భవిష్యత్‌లో ఆదాయాన్ని మరీ ఎక్కువగానో మరీ తక్కువగానో అంచనా వేసుకోవద్దు. అధిక అంచనాలంటే.. జీతాలు భారీగా పెరిగిపోతాయని లెక్కలేసేసుకుని, వాటిని అందుకోవడానికి ముందే అధిక రేట్లకు ఇల్లు, కారు, ఇతర లోన్లు అంటూ తీసేసుకుంటే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఏది నిజంగా అవసరమో ఏది అనవసరమో కాస్త ఆలోచించి కేటాయించాలి. అలాగని, ఏ క్షణంలో ఆదాయం పోతుందో అన్న భయంతో చిన్న చిన్న సరదాలు కూడా పక్కన పెట్టేయాలని కాదు. పొదుపు చేయడమే కాదు సరదాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే, రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడో జరిగే రిటైర్మెంట్ కోసం దాచి పెట్టుకోవడం ఎంత ముఖ్యమో ప్రస్తుతం అప్పుడప్పుడు సరదా టూర్లు వేయడం కూడా అంతే ముఖ్యం. అయితే, దీని వల్ల పొదుపునకు భంగం కలుగుతోంది అనుకుంటే టూర్లో అనవసర ఖర్చులు కొంత తగ్గించుకుంటే సరి. కొంత ప్లానింగ్‌తో ఉంటే.. ఏదైనా మేనేజ్ చేసేయొచ్చు. చివరిగా.. పొదుపు చేయడానికైనా, మదుపు చేయడానికైనా డబ్బు చేతిలో ఉండాలంటే.. ముందు దేనిపై ఖర్చు చేస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం, వాటి వల్ల మనకు ఒరిగే ప్రయోజనాలేమిటి అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. పటిష్టమైన ప్రణాళికను వేసుకుని దానికి కట్టుబడి ఉండాలి. ముందు పొదుపు ఆ తర్వాతే ఖర్చు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఏదైతేనేం.. భయంకరమైన లెక్కలే సేసుకుని తలపోటు తెచ్చేసుకోకుండా.. సాధ్యమైనంత సింపుల్ ప్రణాళికను వేసుకుని, దానికి కట్టుబడి ఉంటే ఆర్థికంగా ఆల్ హ్యాపీసే. -
యాక్సిస్ బ్యాంక్ లాభం 18 శాతం అప్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రూ. 1,667 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,409 కోట్లతో పోలిస్తే ఇది 18%పైగా వృద్ధి. ఇందుకు కేటాయింపులు(ప్రొవిజన్లు) సగానికి తగ్గడం దోహదపడినట్లు బ్యాంక్ తెలిపింది. ప్రొవిజన్లు రూ. 712 కోట్ల నుంచి రూ. 387 కోట్లకు తగ్గాయి. ఇదే కాలానికి బ్యాంక్ ఆదాయం రూ. 9,059 కోట్ల నుంచి రూ. 9,980 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 3.86% నుంచి 3.88%కు పుంజుకున్నాయి. వడ్డీ ఆదాయం 16% వృద్ధి: యాక్సిస్ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 16% ఎగసి రూ. 3,310 కోట్లను తాకింది. గతంలో రూ. 2,865 కోట్ల వడ్డీ ఆదాయం నమోదైంది. అయితే వడ్డీయేతర(ఇతర) ఆదాయం మాత్రం రూ. 1,781 కోట్ల నుంచి రూ. 1,691 కోట్లకు క్షీణించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.1% నుంచి 1.34%కు పెరిగాయి. నికర ఎన్పీఏలు కూడా 0.35% నుంచి 0.44%కు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 0.3% క్షీణించి రూ. 2,018 వద్ద ముగిసింది. -
Q1 ఫలితాలు కీలకం
న్యూఢిల్లీ: దేశీ కంపెనీల తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్’14) ఫలితాలు, విదేశీ సంకేతాలే సమీప కాలంలో స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. గడచిన వారం ఉక్రెయిన్-రష్యా సరిహద్దులో మలేసియా విమానం కూల్చివేతపై చెలరేగిన ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయని నిపుణులు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకోనున్న పరిణామాలపై మార్కెట్లు దృష్టిపెడతాయని విశ్లేషకులు వివరించారు. ఇవికాకుండా విదేశీ స్టాక్ మార్కెట్ల నుంచి అందే సంకేతాలు కూడా కీలకంగా నిలవనున్నాయని తెలిపారు. వీటికితోడు దేశీ స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపైనా ఇన్వెస్టర్లు కన్నేస్తారని వ్యాఖ్యానించారు. నిఫ్టీ 7,700 దాటితే...: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ప్రధాన సూచీ నిఫ్టీకి ఈ వారం 7,700 పాయింట్ల వద్ద నిరోధం ఎదురవుతుందని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ తెలిపారు. అంచనా వేశారు. ఈ స్థాయి వద్ద ఎదురయ్యే అమ్మకాలను తట్టుకుని ముందుకుసాగితే కొనుగోళ్లు పుంజుకుంటాయని అభిప్రాయపడ్డారు. గడచిన వారం కనిపించిన సానుకూల సంకేతాలతో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 617 పాయింట్లు(2.5%) ఎగసిన విషయం విదితమే. రూపాయి ఎఫెక్ట్... దేశీయంగా డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపనుండగా, అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు సైతం కీలకంగా నిలుస్తాయని స్టాక్ నిపుణులు విశ్లేషించారు. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకూ ఆందోళనకర స్థాయిలో మందగించిన రుతుపవనాలు వేగం పుంజుకోవడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తున్నదని పేర్కొన్నారు. ఇటీవలి వరకూ కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వర్షాలు ఆశలు రేపుతున్నాయని వ్యాఖ్యానించారు. తాజాగా నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంతోపాటు పశ్చిమ రాజస్థాన్, సౌరాష్ర్ట, కచ్ ప్రాంతాలకు విస్తరించడం గమనార్హం. దిగ్గజాల ఫలితాలు... ఈ వారం క్యూ1 ఫలితాలు ప్రకటించనున్న దిగ్గజాలలో హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెయిర్న్ ఇండియా, ఐడియా సెల్యులర్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ ఉత్తమ ఫలితాలతో జోష్‌నివ్వడంతో సెంటిమెంట్ సానుకూలంగా మారిందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. అయితే రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, ఇజ్రాయెల్, పాలస్తీనా ఆందోళనల కారణంగా ఈ వారం మార్కెట్లు దిద్దుబాటు(కరెక్షన్)కు లోనయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అంతర్జాతీయ పరిణామాలపై దృష్టిపెడతారని చెప్పారు. విదేశీ గణాంకాలు.. అంతర్జాతీయంగా ఈ వారం పలు గణాంకాలు వెలువడనున్నాయి. చైనా తయారీ గణాంకాలు(హెచ్ఎస్బీసీ పీఎంఐ), అమెరికాకు చెందిన రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ), గృహాల అమ్మకాలు, మన్నికైన వస్తువుల ఆర్డర్లు వంటి అంశాలు వెల్లడికానున్నాయి. కాగా, దేశీయంగా కీలక గణాంకాలేవీ విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో విదేశీ అంశాలే కీలకంగా నిలవనున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ తెలిపారు. వీటికితోడు దేశీ కార్పొరేట్ ఫలితాలు మార్కెట్లను నడిపిస్తాయని చెప్పారు. ఈ నెలలో పెట్టుబడి రూ. 22,000 కోట్లు దేశీ క్యాపిటల్ మార్కెట్లపట్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) ఆసక్తి కొనసాగుతోంది. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 22,000 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. జూలై 19 వరకూ నికరంగా 367 కోట్ల డాలర్లను(రూ. 22,023 కోట్లు) ఇన్వెస్ట్చే యగా, ఈక్విటీలకు 180 కోట్ల డాలర్లను(రూ. 10,755 కోట్లు) కేటాయించారు. దీనికి అదనంగా 189 కోట్ల డాలర్ల(రూ. 11,268 కోట్లు) విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విడుదల చేసిన తాజా గణాంకాలివి. కేంద్రంలో ఏర్పడ్డ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ఎజెండా ఎఫ్ఐఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు. -
కోల్ ఇండియా లాభం రూ. 4,434 కోట్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2013-14) జనవరి-మార్చి(క్యూ4)లో ప్రభుత్వ రంగ కోల్ ఇండియా రూ.4,434 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 5,414 కోట్లతో పోలిస్తే ఇది 18% తక్కువ. బొగ్గు నాణ్యతకు సంబంధించి మరో ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీతో ఏర్పడ్డ వివాద పరిష్కారానికి రూ. 876.5 కోట్లను కేటాయించడంతో లాభాలు ప్రభావితమైనట్లు కంపెనీ పేర్కొంది. ఇదే కాలానికి ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 19,998 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 19,905 కోట్లు నమోదైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం రూ. 17,356 కోట్ల నుంచి రూ. 15,112 కోట్లకు క్షీణించింది. ఇక ఆదాయం రూ. 68,303 కోట్ల నుంచి రూ. 68,810 కోట్లకు నామమాత్రంగా పెరిగింది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియాకు 80% వాటా ఉంది. కాగా, గతేడాదిలో 462.53 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అయితే 482 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఫలితాల నేపథ్యంలో బీఎసీలో షేరు 2% నష్టంతో రూ.374 వద్ద ముగిసింది. -
ఇండియా సిమెంట్స్‌కు నష్టం రూ. 31 కోట్లు
చెన్నై: గడిచిన ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి)లో ఇండియా సిమెంట్స్ రూ. 30.6 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) క్యూ4లో రూ. 26.3 కోట్ల నికర లాభాన్ని సాధించింది. స్టాండెలోన్ ఫలితాలివి. సిమెంట్‌కు డిమాండ్ మందగించడం, సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమైనట్లు కంపెనీ వైస్‌చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ పేర్కొన్నారు. దక్షిణాదిలో డిమాండ్‌కు మించిన సరఫరా ఉండటంతో సిమెంట్ అమ్మకపు ధరలపై ఒత్తిడి పడినట్లు చెప్పారు. 2009లో ఆంధ్రప్రదేశ్‌లో సిమెంట్‌కు 24 లక్షల టన్నుల డిమాండ్ నమోదుకాగా, ప్రస్తుతం 16 లక్షల టన్నులకు పరిమితమైనట్లు తెలిపారు. కాగా, క్యూ4లో నికర అమ్మకాలు కూడా రూ. 1,191 కోట్ల నుంచి రూ. 1,080 కోట్లకు క్షీణించాయి. పూర్తి ఏడాదికి పూర్తి ఏడాదికి(2013-14) కంపెనీ రూ. 117 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. అంతక్రితం ఏడాదిలో రూ. 188 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక నికర అమ్మకాలు సైతం రూ. 5,159 కోట్ల నుంచి రూ. 5,085 కోట్లకు తగ్గాయి. సిమెంట్‌కు తగిన స్థాయిలో డిమాండ్ పుంజుకునేందుకు కనీసం ఆరు నెలల కాలం పడుతుందని శ్రీనివాసన్ అంచనా వేశారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి సిమెంట్ అమ్మకాలు పెరిగే అవకాశమున్నదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అమ్మకాలు పడిపోగా, తమిళనాడు, కేరళలో సిమెంట్‌కు మంచి డిమాండ్ ఉన్నదని చెప్పారు. దేశీ కరెన్సీ మారకంలో హెచ్చుతగ్గులు, రైల్వే రవాణా చార్జీల్లో పెరుగుదల వంటి అంశాలు కూడా ఫలితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా రూ. 166 కోట్ల ఆదాయం సమకూరినట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేరు దాదాపు 5% పతనమై రూ. 99 వద్ద ముగిసింది. -
అసహాయులకు అండ
సాయాల్లో బోలెడు రకాలుంటాయి. ఒక్కోసారి ‘మాట’ చేసినంత సాయం మరేదీ చేయకపోవచ్చు. ఈ సూక్ష్మాన్ని గ్రహించిన ఓ లా స్టూడెంట్ ఓ వేదికను ఏర్పాటు చేశాడు. దానికి ‘న్యాయ సహాయ’ అని పేరు పెట్టాడు. ‘వినడానికి పేరు, ఆలోచన చాలా బాగున్నాయి. కానీ ఆచరణలో మనమెంతవరకూ ‘న్యాయం’ చేయగలం’ అని మొదట సందేహించిన అతని తల్లి చివరకు బిడ్డ మాటను కాదనకుండా తన వంతు సేవకు సిద్ధ్దపడింది. తనలాంటి మరో నలుగురు సేవాభావం కలిగిన లాయర్లను సభ్యులుగా మార్చి, ‘న్యాయ సహాయ’ ద్వారా పేదలకు ఉచితంగా న్యాయ సలహాలిస్తూ చిన్న ‘మాట’ సాయం చేస్తోంది. ఐలయ్య హైదరాబాద్‌లోని మియాపూర్‌లో మేస్త్రీ పని చేసుకుంటూ భార్యాబిడ్డల్ని షించుకుంటున్నాడు. నాలుగంతస్తుల అపార్డుమెంటు పని సగం పూర్తయింది. ఒకరోజు ఐలయ్య స్లాబ్ పనిచేస్తుండగా ఉన్నట్టుండి పైకప్పు కూలి మీద పడింది. పనివాళ్లంతా కలిసి ఆసుపత్రిలో చేర్పించారు. మెదడుకి బలమైన గాయమైంది. కుడి కన్ను పూర్తిగా పోయింది. కుడి చేయి, కాలు పనిచేయడం మానేశాయి. ఆరునెలలు ఆసుపత్రిలో ఉండి వైద్యం చేయించారు. తనకు సంబంధం లేదన్న యజమానిపై కేసు పెట్టాడు ఐలయ్య. యజమాని తన ‘బలాన్ని’ చూపించి అందరి నోరూ మూయించాడు. ఐలయ్య వెళ్లి అడిగితే ‘ఏవో నాలుగు రూపాయిలిస్తాను... సరిపెట్టుకో’ అన్నాడు. చదువు లేని పేదవాడు ఏం చేస్తాడు! అంతా తన కర్మ అనుకుని భార్య సంపాదనతో నాలుగు ముద్దలు తింటూ పదేళ్ల వయసు పిల్లల భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇంతలో ఎవరో ఐలయ్యకు ‘న్యాయ సహాయ’ గురించి చెప్పారు. ‘‘ఐలయ్యకు జరిగిన అన్యాయం గురించి విన్నాక చాలా బాధ కలిగింది. ఏడుస్తూ...‘‘అమ్మా... మీరైనా నాకు న్యాయం చేయండమ్మా... ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. వారిని మంచి చదువులు చదివించుకుందామనుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి వారికి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకుండైంది’’ అని చెప్పాడు. క్షణం ఆలస్యం చేయకుండా అతనికి ముందు లీగల్ కౌన్సెలింగ్ ఇచ్చి వెంటనే లేబర్ కమిషనర్ దగ్గర కేసు పెట్టించాను. ప్రస్తుతం కేసు నడుస్తోంది. చట్ట ప్రకారం అతని యజమాని 15 నుంచి 20 లక్షలరూపాయల నష్ట పరిహారం చెల్లించాలి. ఇలాంటి కేసుల్లో బాధితుడి వయసు, సంపాదన, అతనిపై ఆధారపడ్డ వాళ్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని యజమానులతో కోర్టు నష్ట పరిహారం ఇప్పిస్తుంది. ఐలయ్య కేసు గెలిచే వరకూ అతనికి తగిన సలహాలిస్తూ ముందుకు నడిపించే బాధ్యత మాది’’ అని చెప్పారు లాయర్ రాజశ్రీ. కొడుకు చెప్పిన ‘న్యాయ సహాయ’ ఆలోచనను ఆచరణలో పెట్టిన తల్లి ఆమె. ‘న్యాయ సహాయ’ వేదికను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిన ఆ కుర్రాడి పేరు లింగం శెట్టి పారు.్థ ప్రస్తుతం ఇతను ఒరిస్సాలో నేషనల్ లా యూనివర్సిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అతనికి అండగా నిలిచిన అమ్మ రాజశ్రీ తనతోటి వారితో కూడా ‘న్యాయ సహాయ’ గురించి చర్చించి మరో నలుగురిని సభ్యులుగా చేర్చుకున్నారు. ‘‘నాతో పాటు కల్లూరి గీత, ఎల్. స్వర్ణలత, సి. పద్మజ, ఎన్. నర్సింహారావు ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ప్రారంభించింది కరీంనగర్‌లోనైనా మాకు హైదరాబాద్‌లో కూడా లాయర్లసాయం ఉంది. వీరితో పాటు పార్థు, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కొందరు లా విద్యార్థులు కూడా మాకు అండగా ఉన్నారు’’ అని చెప్పారు రాజశ్రీ. నిందితుల తరఫున... ‘న్యాయ సహాయ’ ఏర్పాటుకి పార్థుని కదిలించిన విషయం మన రాష్ట్రంలో వేల సంఖ్యలో జైళ్లలో మగ్గుతున్న నిందితుల సంఖ్య. వీరిలో చాలామంది కేవలం ఆరోపణలు ఎదుర్కొంటూనే నెలల తరబడి కటకటాల వెనక ఉండిపోతున్నారు. వీరి కోసం కూడా ‘న్యాయ సహాయ’ పనిచేస్తోంది. ‘‘ఇప్పటి వరకూ ఏడుగురు నిందితులకు బెయిల్ ఇప్పించాం. చాలామంది నిందితులకు నా అన్నవాళ్లు ఉండరు. అలాంటి కేసులకు సంబంధించి పోలీసులే కమ్యూనికేషన్ బాధ్యత తీసుకోవాలి. అన్నిచోట్లా అది అమలు కాదు. దీంతో చాలామంది బెయిల్‌ని పొందే హక్కుని కోల్పోతున్నారు. దీనికోసం మేం జైళ్లకు వెళ్లి కేసుల్ని పరిశీలించి అవసరమైనవారికి బెయిల్ ఇప్పించే పని కూడా చేస్తున్నాం’’ అని చెప్పారు మరో లా స్టూడెంట్ పి. దినేశ్. తప్పుదోవ పట్టించే కొందరున్న ఈ ప్రపంచంలో తప్పొప్పులు చెప్పి న్యాయ మార్గంలో నడిపించే న్యాయవాదులు కూడా ఉన్నారు. ‘‘ మేం ‘మాట‘ సాయం చేయడం న్యాయమే కాదు ధర్మం కూడా’’ అంటున్నారు రాజశ్రీ. న్యాయం కోసం పోరాడే వృత్తిలో ఉన్న లాయర్లలో మరింత మంది ఈ ధర్మానికి నిలబడితే సామాన్యుడికే కాదు, సమాజానికీ అదే పెద్ద సాయం! -
రిలయన్స్ ఇన్ఫ్రా లాభం రూ. 621 కోట్లు
ముంబై: రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనవరి-మార్చి(క్యూ4) కాలంలో రూ. 621 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 721 కోట్లతో పోలిస్తే ఇది 24% క్షీణత. ఇదే కాలంలో ఆదాయం కూడా 24% తగ్గి రూ. 4,708 కోట్లకు పరిమితమైంది. ఆదాయంలో ఈపీసీ విభాగం నుంచి రూ. 883 కోట్లు మాత్రమే లభించాయని, గతంలో రూ. 2,267 కోట్లను సాధించామని కంపెనీ సీఈవో లలిత్ జలాన్ చెప్పారు. ఇక ఇతర ఆదాయం రెట్టింపై రూ. 328 కోట్లను తాకినప్పటికీ, రూ. 51 కోట్లమేర ఫారె క్స్ నష్టాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. కాగా, పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 1,914 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం 15% తగ్గి రూ. 19,034 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 17% జంప్‌చేసి రూ. 732 వద్ద ముగిసింది. -
భారతీ ఇన్ఫ్రాటెల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: టెలికం టవర్ల సంస్థ భారతీ ఇన్ఫ్రాటెల్ జనవరి-మార్చి(క్యూ4) కాలానికి ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 64% జంప్‌చేసి రూ. 472 కోట్లను తాకింది. గతేడాది ఇదే కాలానికి రూ. 287 కోట్లను మాత్రమే ఆర్జించింది. కంపెనీలో మొబైల్ టెలికం సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు 80% వాటా ఉంది. ఇదే కాలానికి ఆదాయం 4% పెరిగి రూ. 2,790 కోట్లకు చేరింది. గతంలో రూ. 2,674 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ కాలంలో 5% అధికంగా రూ. 144.5 కోట్ల ఇతర ఆదాయం లభించింది. పూర్తి ఏడాదికి...: పూర్తి ఏడాదికి(2013-14) భారతీ ఇన్ఫ్రాటెల్ నికర లాభం రూ. 1,003 కోట్ల నుంచి రూ. 1,518 కోట్లకు ఎగసింది. ఆదాయం 5% పుంజుకుని రూ. 10,827 కోట్లయ్యింది. గతంలో రూ. 10,272 కోట్ల ఆదాయం నమోదైంది. టెలికం ఆపరేటర్ కంపెనీలు భారీ పెట్టుబడులను పెడుతున్నాయని, ప్రధానంగా డేటా నెట్‌వర్క్‌లపై దృష్టి పెడుతున్నాయని భారతీ ఇన్ఫ్రాటెల్ చైర్మన్ అఖిల్ గుప్తా చెప్పారు. దీంతో టవర్ కంపెనీల ఆదాయాలు భారీగా మెరుగుపడే అవకాశమున్నదని తెలిపారు. ఇండియాలో డేటా విభాగం వేగంగా వృద్ధి చెందుతున్నదని, టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్‌పై ఇప్పటికే రూ. 1,80,000 కోట్లను ఇన్వెస్ట్చేశాయని చెప్పారు. రిలయన్స్ జియోతో ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కుదుర్చుకున్న ఒప్పం దంలో భాగంగా తొలి దశ ఆర్డర్లు లభిస్తున్నాయని తెలిపారు. 2013-14లో రూ. 1,527 కోట్ల పెట్టుబడులను వెచ్చించామని, ఈ ఏడాది(2014-15) ఆర్డర్ల స్థాయిని బట్టి రూ. 2,000 కోట్ల వరకూ వ్యయాలుండవచ్చునని వెల్లడించారు. -
సీఎంసీ నికర లాభం 46% వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూపునకు చెందిన ఐటీ సేవల కంపెనీ సీఎంసీ మార్చితో ముగిసిన త్రైమాసిక నికర లాభంలో 45.8% వృద్ధిని నమోదు చేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.61 కోట్లుగా ఉన్న నికరలాభం 2013-14లో రూ.89.43 కోట్లకు పెరిగింది. న్యాయపరంగా ఒక కేసులో విజయం సాధించడం నికరలాభం భారీగా పెరగడానికి కారణంగా కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ కేసుతో రూ.19 కోట్ల అదనపు ఆదాయం రూ.25 కోట్ల నికరలాభం వచ్చినట్లు సీఎంసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఆర్.రమణన్ తెలిపారు. సమీక్షా కాలంలో ఆదాయం 19 శాతం వృద్ధి చెంది రూ. 523 కోట్ల నుంచి రూ.623 కోట్లకు పెరిగింది. గడిచిన మూడు నెలల కాలంలో కొత్తగా 15 క్లయింట్లు చేరగా అందులో 12 స్వదేశానికి చెందినవారేనన్నారు. ఏడాది మొత్తంమీద 64 క్లయింట్లు చేరారు. రవాణా, యుటిలిటీస్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వంటి రంగాల నుంచి డిమాండ్ ఉందని రమణన్ తెలిపారు. షేరుకు రూ. 22.50 డివిడెండ్‌ను సిఫార్సు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సీఎంసీలో 11,109 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఈ ఏడాది కొత్తగా 500 మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ. 1,604 కోట్లు
ముంబై: యాక్సిస్ బ్యాంక్ క్యూ3లో రూ. 1,604 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఇదే కాలం(అక్టోబర్-డిసెంబర్’12)లో ఆర్జించిన రూ. 1,347 కోట్లతో పోలిస్తే ఇది 19% వృద్ధి. ఇదే కాలానికి ఆదాయం కూడా రూ. 8,580 కోట్ల నుంచి రూ. 9,434 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయంలో వృద్ధి, మెరుగుపడ్డ మార్జిన్లు, ప్రొవిజన్లు తగ్గడం వంటి అంశాలు మెరుగైన పనితీరుకు దోహదపడినట్లు బ్యాంకు ఈడీ సోమనాథ్ సేన్‌గుప్తా పేర్కొన్నారు. ఈ కాలంలో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 20% పుంజుకుని రూ. 2,984 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 3.57% నుంచి 3.71%కు మెరుగయ్యాయి. కాగా, ప్రొవిజన్ల కింద రూ. 202 కోట్లను కేటాయించింది. 2% అధికంగా రూ. 1,644 కోట్ల ఇతర ఆదాయం నమోదుకాగా, ఫీజు ఆదాయం 4% పెరిగి రూ. 1,456 కోట్లకు చేరింది.బీఎస్ఈలో బ్యాంకు షేరు గురువారం స్వల్పంగా నష్టపోయి రూ. 1,177 వద్ద ముగిసింది. -
సంపాదనలో ఒక రూపాయి
ఆ అబ్బాయికి మొదటిజీతం ఏం చేయాలో అర్థంకాలేదు. కారణం...ఏదో ఒక మంచి పనికి ఖర్చుపెట్టాలని అతడి కల. తోటి స్నేహితులతో ఆలోచించాడు. పుట్టింది ఖమ్మంలోనైనా ఉద్యోగరీత్యా పునేలో ఉండాల్సివచ్చింది. మంచిపని సొంతూళ్లోనే కాదు ఎక్కడైనా చేయచ్చనుకున్నాడు. స్నేహితుల్ని వెంటబెట్టుకుని పునేలో అనాథపిల్లలుండే భారత సమాజ సేవ కేంద్రానికి వెళ్లాడు. స్కూలుకి వెళ్లడానికి ఇబ్బందిపడుతున్న అనాథవిద్యార్థులకు వ్యాన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆపనితో తన సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. ఆ అబ్బాయి పేరు...శ్రీకళ్యాణ చక్రవర్తి. ప్రస్తుతం ‘సేఫ్ హ్యాండ్స్’ పేరుతో సేవలు చేస్తున్న ఈ యువకుడితో మరో ఆరుగురు చేయి కలిపారు. ఐదు వేళ్లు... చేతికి ఐదువేళ్లున్నట్టే సేఫ్ హ్యాండ్స్‌లో కూడా ఐదు విభాగాలున్నాయి. అక్షర, సుహృత, వైద్య, ఉద్దార, ప్రదాత. అక్షర పేరుతో పదో తరగతి పాసైన పేద విద్యార్థుల్ని ఇంటర్ చదివిస్తున్నారు. చదివించడం అంటే ఫీజులు కట్టడం కాదు... వారి వెంటబడి చదివించడం. మంచి మార్కులు వచ్చేవరకూ ఊరుకోరు. ఇంటర్ పూర్తయ్యాక వారికి సేఫ్హ్యాండ్స్ తరపున సర్టిఫికెట్ ఇచ్చి స్టూడెంట్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పర్సనల్ కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. సుహృత పేరుతో అనాథపిల్లలకు బట్టలు, ఆహార సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యం కింద ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం, కళ్లద్దాలు, డెంటల్ కిట్లు పేదలకు ఇస్తుంటారు. మూడోది ఉద్దార...మూడేళ్లక్రితం మహబూబ్‌నగర్‌లో వరదతాకిడి వల్ల చాలా గ్రామాలు దెబ్బతిన్నాయి. వాటిలో ఒక గ్రామాన్ని సేఫ్హ్యాండ్స్ దత్తత తీసుకుని పూర్తిగా బాగుచేసింది. చివరిది ప్రదాత. అంధబాలలకు బ్రెయిలీ కిట్లు పంచడం దీని లక్ష్యం. ఇలా ఐదు అంశాలపై సేఫ్హ్యాండ్స్ నాలుగేళ్ల నుంచి పనిచేస్తోంది. సంస్థ భాగస్వాములు ఏడుగురే అయినా సభ్యులు నలభైమందివరకూ ఉన్నారు. ఈ సంస్థ ఉండేది ఖమ్మం జిల్లాలో అయినా అవసరాన్ని బట్టి చుట్టుపక్కల జిల్లాల్లో కూడా దృష్టిపెడుతుంది. తమ సంపాదనలో ఒక రూపాయి సమాజంకోసం అంటున్న ఇలాంటి యువకుల సంఖ్య రోజురోజుకీ పెరగాలి. -
క్యూ2 ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ: మార్కెట్ గమనాన్ని అక్టోబర్ నెల నిర్దేశించనుంది. కార్పొరేట్ కంపెనీల ద్వితీయ త్రైమాసిక ఫలితాలకు తోడు అనేక కీలకమైన గణాంకాలు, ఆర్బీఐ, ఫెడరల్ బ్యాంక్‌ల సమీక్షలు స్టాక్ మార్కెట్ల మధ్య కాలిక గమనాన్ని నిర్దేశించనున్నాయి. ఇదే సమయంలో అమెరికా షట్‌డౌన్ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకుంటుందన్న దానిపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ శుక్రవారం (అక్టోబర్ 11) విడుదల చేయనున్న ఆర్థిక ఫలితాలతో క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడి ప్రారంభం కానుండటంతో స్టాక్ మార్కెట్ కదలికలు అప్రమత్తంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వృద్ధిరేటు నెమ్మదించడంతో కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. దీనికితోడు దేశీయ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా శుక్రవారం విడుదల కానున్నాయి. కేవలం దేశీయ పరిణామాలే కాకుండా ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు కూడా మార్కెట్‌పై బాగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా బడ్జెట్ ఆమోదం పొందక, అక్కడి ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించడంతో అక్టోబర్ 17లోగా అమెరికా బడ్జెట్‌ను ఎలా ఆమోదించుకొని డెట్ ఆబ్లిగేషన్ నుంచి ఎలా గట్టెక్కుతుందన్న ఆందోళన మార్కెట్ వర్గాలను కలవరానికి గురి చేస్తోంది. ఈ పరిణామాలన్నింటి నేపధ్యంలో ఈ వారం మార్కెట్లు బాగా హెచ్చు తగ్గులకు లోను కావొచ్చని కోటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లెయింట్ గ్రూపు రీసెర్చ్ హెడ్ డిపెన్ షా అంచనా వేస్తున్నారు. ‘‘మనం త్రైమాసిక ఫలితాల సీజన్లోకి ప్రవేశించామని, దేశీయంగా చాలా కంపెనీల ఫలితాలు నిరాశపర్చే విధంగా ఉండొచ్చు’’ అని డిపెన్ షా పేర్కొన్నారు. మధ్య దీర్ఘకాలిక కదలికలను వడ్డీరేట్లు, సంస్కరణలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రభావితం చూపుతాయంటున్నారు. 5,900 కీలకం సాంకేతికంగా చూస్తే నిఫ్టీ 5,900 స్థాయి చాలా కీలకమైనదని బొనంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ నిధి సారస్వత్ పేర్కొన్నారు. నిఫ్టీ ఈ స్థాయిపైన స్థిరపడితే మరింత కొనుగోళ్ళ మద్దతు లభిస్తుందన్నారు. గడచిన వారంలో నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 5,907 వద్ద ముగిసింది. డెట్‌లో ఎఫ్ఐఐల అమ్మకాలు అమెరికా షట్‌డౌన్ ప్రభావంతో విదేశీ సంస్థాగత మదుపుదారులు (ఎఫ్ఐఐలు) దేశీయ డెట్ మార్కెట్ నుంచి భారీగా వైదొలగుతున్నారు. కానీ ఇదే సమయంలో ఈక్విటీల్లో నికర కొనుగోళ్ళు జరుపుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి 4 వరకు ఎఫ్ఐఐలు డెట్ మార్కెట్లో రూ. 5,340 కోట్ల అమ్మకాలు జరపగా, ఇదే సమయంలో ఈక్విటీల్లో రూ.1,942 కోట్ల కొనుగోళ్ళు జరిపారు. మొత్తం మీద చూస్తే గడచిన వారంలో ఎఫ్ఐఐలు రూ.3,400 కోట్లు నికర అమ్మకాలు జరిపారు. మార్కెట్‌ను నిర్దేశించేవి ఇవే... తేది- అంశం అక్టోబర్ 11- ఇన్ఫోసిస్‌తో క్యూ2 రిజల్ట్స్ ప్రారంభం అక్టోబర్ 11- పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అక్టోబర్ 14- సెప్టెంబర్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు అక్టోబర్ 17- అమెరికా బడ్జెట్ ఆమోదానికి చివరి తేది అక్టోబర్ 29- ఆర్బీఐ త్రైమాసిక సమీక్ష అక్టోబర్ 29-30 - అమెరికా ఫెడరల్ సమీక్ష