యాక్సిస్ బ్యాంక్ లాభం రూ. 1,604 కోట్లు | Axis Bank net profit rises 19% but NPA rises | Sakshi
Sakshi News home page

యాక్సిస్ బ్యాంక్ లాభం రూ. 1,604 కోట్లు

Published Fri, Jan 17 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

Axis Bank net profit rises 19% but NPA rises

ముంబై: యాక్సిస్ బ్యాంక్ క్యూ3లో రూ. 1,604 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఇదే కాలం(అక్టోబర్-డిసెంబర్’12)లో ఆర్జించిన రూ. 1,347 కోట్లతో పోలిస్తే ఇది 19% వృద్ధి. ఇదే కాలానికి ఆదాయం కూడా రూ. 8,580 కోట్ల నుంచి రూ. 9,434 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయంలో వృద్ధి, మెరుగుపడ్డ మార్జిన్లు, ప్రొవిజన్లు తగ్గడం వంటి అంశాలు మెరుగైన పనితీరుకు దోహదపడినట్లు బ్యాంకు ఈడీ సోమనాథ్ సేన్‌గుప్తా పేర్కొన్నారు. ఈ కాలంలో నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 20% పుంజుకుని రూ. 2,984 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 3.57% నుంచి 3.71%కు మెరుగయ్యాయి.  కాగా, ప్రొవిజన్ల కింద రూ. 202 కోట్లను కేటాయించింది. 2% అధికంగా రూ. 1,644 కోట్ల ఇతర ఆదాయం నమోదుకాగా, ఫీజు ఆదాయం 4% పెరిగి రూ. 1,456 కోట్లకు చేరింది.బీఎస్‌ఈలో బ్యాంకు షేరు గురువారం స్వల్పంగా నష్టపోయి రూ. 1,177 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement