న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించిన ‘నియో ఫర్ బిజినెస్’ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంను ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ఆవిష్కరించింది. బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్యాంకింగ్ లావాదేవీలను సులభంగా నిర్వహించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
డిజిటల్ సెల్ఫ్ ఆన్–బోర్డింగ్, బల్క్ పేమెంట్స్, జీఎస్‌టీకి అనుగుణమైన ఇన్వాయిసింగ్, పేమెంట్ గేట్‌వే అనుసంధానం మొదలైన ఫీచర్స్ ఇందులో ఉంటాయని బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గంభీర్ తెలిపారు. ప్రస్తుతమున్న తమ కరెంట్ అకౌంట్ ఖాతాదారులు మొబైల్ యాప్ రూపంలో, వెబ్ ఆధారిత డిజిటల్ రిజి్రస్టేషన్ ద్వారా దీన్ని వినియోగించుకోవచ్చని వివరించారు. ప్రస్తుతానికి సోల్ ప్రొప్రైటర్íÙప్ సంస్థలు, వ్యక్తులకు ఇది అందుబాటులో ఉంటుందని.. త్వరలోనే కంపెనీలు, పార్ట్‌నర్íÙప్స్, ఎల్‌ఎల్‌పీలకు కూడా విస్తరిస్తామని గంభీర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment