Neo
-
నవజాత శిశువులను కాపాడే అరుదైనా బ్లడ్ గ్రూప్!
రక్తమార్పిడ్లు గురించి విన్నాం. చాలామందికి ప్రమాద కారణంగానో లేదా మరే ఇతర కారణాల వల్ల రక్తం ఎక్కించాల్సి ఉంటంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ నవజాత శిశువులకు కూడా ఒక్కోసారి జననంలో ఎదురయ్యే సమస్యల కారణంగా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అయితే వారికి ఎక్కించే రక్తం విషయంలో మాత్రం వైద్యులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పైగా ఎక్కించాక ఏవైనా సమస్యల రాకుండా పలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ నవజాత శిశువులకు ఎలాంటి రక్తాన్ని ఎక్కిస్తారు? ఆ రక్తానికి ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారంటే.. అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ బీ-ని నవజాత శిశువులకు ఎక్కిస్తారు. ఆ రక్తాన్ని నియో అనే బ్లడ్‌ని బ్లూ ట్యాగ్ బ్యాగ్లె కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే? ఈ బ్లడ్ అప్పుడే పుట్టిన శిశువులకు ఇచ్చేది కాబట్టి దానిపై నియో అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. ఇక్కడ ‘నియో’ అంటే నియోనాటల్. 28 రోజుల వయసున్న చిన్నారుల గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని వాడుతుంటారు. ఇక ఈ రక్తం నవజాత శిశువులతో పాటు కొందరు రోగులకు సాయం చేస్తుంది. ఎలాంటి పరీక్షలు చేస్తారంటే.. సాధారణంగా దానం చేసిన రక్తంనతంటికీ హెచ్ఐవీ, హెపటీటిస్ బీ, సీ, ఈ, అలాగే సిఫిలిస్ వంటి పరీక్షలు చేపడతామని హెమటాలసీ డాక్టర్ ఆండీ చార్టన్ వివరించారు. ఆ పరీక్షలు అన్ని పూర్తి అయిన తర్వాత రోగులకు సరిపోతుందా? లేదా? అని అనేది తెలుసుకోవడం కోసం కొన్ని శాంపిల్స్ తీసుకుని మరిన్ని పరీక్షలను, ప్రక్రియలను చేపడతామని చెప్పారు. అంటే..కొందరి వ్యక్తులకు అంతకుముందు రక్తమార్పిడి సమయంలో వచ్చిన అలర్జిక్ రియాక్షన్ల ప్రొటీన్లు తొలగించిన తర్వాత రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుందని తెలిపారు శిశువులకు ఎక్కించాలంటే తప్పనసరిగా ఆ పరీక్ష.. నవజాత శిశువులకు, ఇమ్యూనోకాంప్రమైజ్డ్ పేషెంట్లకు(రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న రోగులకు), గర్భిణులకు, గర్భాశయంలో ఎదిగే పిండానికి ఎక్కించే రక్తానికి తప్పనిసరిగా సైటోమెగాలో(CMV) అనే వైరస్‌కు సంబంధించి పరీక్షించాల్సి ఉంటుంది. ఇది హెర్పస్ వైరస్ కుటుంబానికి చెందినది. ఈ వైరస్ చాలా సాధారణం. ఇది హానికరమైనది కాదు. స్వల్పంగా ఫ్లూ వంటి లక్షణాలను లేకపోతే ఎలాంటి లక్షణాలను ఇది కలిగి ఉండదు. కానీ, కొందరికి మాత్రం ఇది ప్రమాదకరం. ఈ వైరస్ వల్ల పిల్లలకి మూర్ఛ రావొచ్చు, కళ్లు మసకబారడం, వినికిడి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే కిడ్నీ, ప్లీహాన్ని దెబ్బతీయొచ్చు. చాలా అరుదైన కేసుల్లో ఇది ప్రాణాంతకం కావొచ్చు. ఒకవేళ రక్తంలో ఈ వైరస్ ఉంటే అది ఇలాంటి శిశువులకు, రోగులకు ఇవ్వడానికి పనికిరాదు. అయితే ఈ రక్తం దొరకడం అనేది అత్యంత అరుదు. అందువల్ల ఈ రక్తం గల దాతలు ఇచ్చేందుకు ముందుకు వస్తే ఎందరో ప్రాణాలను రక్షించిన వారవ్వుతారు. దయచేసి బీ నెగిటివ్ గ్రూప్ కల వారు తమ రక్తం ఎంతో అమూల్యమైనదని గర్వించడమే గాకుండా ఇచ్చేందుకు ముందుకు వస్తే ఎన్నో ప్రాణాలను రక్షించిన వారవ్వుతారు. (చదవండి: దంగల్ నటి సుహాని భట్నాగర్ మృతికి ఆ వ్యాధే కారణం! వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
చిన్న సంస్థల కోసం యాక్సిస్ బ్యాంక్ నియో
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించిన ‘నియో ఫర్ బిజినెస్’ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంను ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ఆవిష్కరించింది. బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్యాంకింగ్ లావాదేవీలను సులభంగా నిర్వహించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. డిజిటల్ సెల్ఫ్ ఆన్–బోర్డింగ్, బల్క్ పేమెంట్స్, జీఎస్టీకి అనుగుణమైన ఇన్వాయిసింగ్, పేమెంట్ గేట్‌వే అనుసంధానం మొదలైన ఫీచర్స్ ఇందులో ఉంటాయని బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గంభీర్ తెలిపారు. ప్రస్తుతమున్న తమ కరెంట్ అకౌంట్ ఖాతాదారులు మొబైల్ యాప్ రూపంలో, వెబ్ ఆధారిత డిజిటల్ రిజి్రస్టేషన్ ద్వారా దీన్ని వినియోగించుకోవచ్చని వివరించారు. ప్రస్తుతానికి సోల్ ప్రొప్రైటర్íÙప్ సంస్థలు, వ్యక్తులకు ఇది అందుబాటులో ఉంటుందని.. త్వరలోనే కంపెనీలు, పార్ట్నర్íÙప్స్, ఎల్ఎల్పీలకు కూడా విస్తరిస్తామని గంభీర్ వివరించారు. -
ISRO PSLV-C56: ఇస్రో మరో వాణిజ్య విజయం
సూళ్లూరుపేట: పీఎస్ఎల్వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌక ఆదివారం ఉదయం 6.31 గంటలకు విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ఏడాదిలో ఇస్రో మూడో వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకున్నట్లయింది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా తిరుపతి జిల్లా సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి దీనిని ప్రయోగించాయి. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో చేపట్టిన 58 ప్రయోగాల్లో ఇది 56వ విజయం కావడం గమన్హాం. పీఎస్ఎల్వీ సీ–56 రాకెట్‌కు శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఆదివారం ఉదయం 6.31 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల ప్రయాణాన్ని విజయవంతంగా సాగిస్తూ 23 నిమిషాల వ్యవధిలో (1,381 సెకన్లకు) సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను భూమికి 535 కిలోమీటర్లు ఎత్తులోని నియో ఆర్బిట్ (భూ సమీప కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 352 కిలోలు బరువు కలిగిన డీఎస్–ఎస్ఏఆర్ (షార్ట్ ఫర్ సింథటిక్ ఆపార్చర్ రాడార్) అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 23.58 కిలోల ఆర్కేడ్, 23 కేజీల బరువున్న వెలాక్స్–ఏఎం, 12.8 కిలోల ఓఆర్బీ–12 స్ట్రయిడర్, 3.84 కేజీల గలాసియా–2, 4.1 కేజీల స్కూబ్–11, 3.05 కేజీల బరువైన న్యూలయన్ అనే ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. షార్ నుంచి చేసిన 90వ ప్రయోగమిది. అంతరిక్ష వ్యర్థాలను తొలగించే కొత్త ప్రయోగం పీఎస్ఎల్వీ సీ–56 రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్–4)తో అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. భూమికి 535 కిలోమీటర్లు ఎత్తులో ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తర్వాత పీఎస్–4 అక్కడ నుంచి 300 కిలోమీటర్ల స్థాయికి దిగి వస్తుంది. ఈ ఎత్తులో ఉండటం వల్ల ఇది త్వరగానే భూ కక్ష్యలోకి ప్రవేశించి మండిపోతోంది. దీంతో అంతరిక్షంలో ఇలాంటి ప్రయోగాల తదుపరి చెత్త తగ్గుతుంది. ఒకవేళ 530కి.మీ.ల ఎత్తులోనే ఉంటే కింది కక్ష్యలకు వచ్చి పడిపోవడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ఇప్పుడు కిందిస్థాయిలోనే ఉంది కనుక కేవలం రెండునెలల్లో పడిపోతుంది. ఆ కీలక భాగాల తయారీదారు హైదరాబాద్ సంస్థే పీఎస్ఎల్వీ సి–56లోని కీలక భాగాలు, వ్యవస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్(ఏటీఎల్) రూపొందించినవే కావడం విశేషం. ఈ విషయాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు పావులూరి సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. పీఎస్ఎల్వీ సి–56 లాంఛ్ వెహికల్లో వాడిన నావిగేషన్ ఇంటర్ఫేస్ మాడ్యూళ్లు, ఇనెర్షియల్ సెన్సింగ్ యూనిట్లు, ఇంట్రా మాడ్యూల్ హార్నెస్, కంట్రోల్ ఎల్రక్టానిక్స్, పైరో కంట్రోల్ సిస్టమ్స్, ట్రాకింగ్ ట్రాన్స్‌పాండర్, ఇంధన వ్యవస్థల రూపకల్పనలో తమ సంస్థ భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. ఇస్రో లాంఛ్ వెహికల్స్, శాటిలైట్లు, స్పేస్ క్రాఫ్ట్ పేలోడ్స్, గ్రౌండ్ సిస్టమ్స్‌ను తాము ఉత్పత్తి చేస్తున్నామన్నారు. పీఎస్ఎల్వీ సి–56తో కలిపి ఇప్పటి వరకు అయిదు పీఎస్ఎల్వీ మిషన్లలో అత్యంత కీలకమైన సబ్ అసెంబ్లీ ప్రక్రియను ఏటీఎల్ నిపుణులు చేపట్టినట్లు వివరించారు. -
ఓరుగల్లులో మెట్రో పరుగులు!
సాక్షి, వరంగల్: అన్నీ అనుకూలిస్తే చారిత్రక ఓరుగల్లులోనూ హైదరాబాద్ మాదిరిగా మెట్రో రైలు పరుగులు తీయనుంది. ట్రై సిటీని అనుసంధానిస్తూ నిర్మించనున్న మెట్రో నియో రైలు ప్రతిపాదనలపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఇటీవల వరంగల్ మెట్రో రైలు ప్రాజెక్టుపై మహా మెట్రో ఉన్నతధికారులతో సమావేశమై చర్చించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌కు చెందిన మహా మెట్రో, హెచ్ఎండీఎ అధికారుల బృందం బుధవారం వరంగల్ నగరాన్ని సందర్శించింది. మెట్రో రైలు ప్రతిపాదన మార్గాలు, డీపీఆర్ తయారీ తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. మెరుగైన రవాణా కోసం వరంగల్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. అయితే, ప్రజారవాణా వ్యవస్థలో భాగంగా ఆర్టీసీ సిటీ బస్సులు తగినన్ని లేవనే చెప్పాలి. దీంతో ప్రజలు ఎక్కువగా ఆటోలు, సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్లోనూ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు హెచ్ఎండీఏ ట్రాన్స్పోర్ట్ హెడ్ విజయలక్ష్మి, హెచ్ఎండీఏ డిప్యూటీ డైరెక్టర్ ఎస్కే సిన్హా, ‘కుడా’ ప్లానింగ్ అధికారి అజిత్ రెడ్డితో కలిసి బుధవారం క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు. కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి పెట్రోల్ పంపు, హన్మకొండ చౌరస్తా, మలుగు రోడ్డు, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామ జంక్షన్ మీదుగా వరంగల్ రైల్వేస్టేషన్ వరకు, అక్కడి నుంచి వరంగల్ స్టేషన్ రోడ్డు మీదుగా చౌరస్తా జేపీఎన్ రోడ్డు మీదుగా పోచమ్మ మైదాన్ వరకు ప్రధాన రహదారిని మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి పరిశీలించి వివరాలు ఆరా తీశారు. మూడు కేటగిరీలపై చర్చ ట్రైసిటీలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలపై పర్యవేక్షించాక అధికారుల బృందం... జిల్లా కలెక్టరేట్లో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డితో పాటు బల్దియా ‘కుడా’ అధికారులు పాల్గొన్నారు. మహా మెట్రో, హెచ్ఎండీఏ అధికారులు మెట్రో ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను వెల్లడించారు. కేంద్ర పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇటీవల నాసిక్‌లో మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభించిందని తెలిపారు. ఈ మేరకు న్యూ మెట్రో నియో ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50శాతం నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్ షిప్(పీపీపీ) పద్ధతి, గ్లోబల్ ఫైనాన్సియల్ సంస్థలు నుంచి 60శాతం నిధులను రుణంగా తీసుకోవచ్చని వివరించారు. మిగతా 40శాతం నిధుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం వెచ్చించాల్సి ఉంటుంవదని వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ నగర జనాభా, రహదారుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెట్రో ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మెట్రో నియో రైలు మార్గాలు ఇవే... కాజీపేట రైల్వేస్టేషన్ ప్రారంభమై ఫాతిమానగర్, సుబేదారి, నక్కలగుట్ట, అంబేద్కర్ జంక్షన్, పెట్రోల్ పంపు, హన్మకొండ చౌరస్తా, మలుగు రోడ్డు, ఎంజీఎం, పోచమ్మమైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామ జంక్షన్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి స్టేషన్ రోడ్డు, వరంగల్ చౌరస్తా, జీపీఎన్ రోడ్డు, మండి బజార్, పోచమ్మమైదాన్ వరకు అనుసంధానంగా ప్రాజెక్టు నిర్మిస్తారు. -
‘నయా’ నజర్
∙హన్మకొండ వైపు ఈటల చూపు ∙అదే దారిలో కరీంనగర్ ఎంపీ వినోద్ ∙భూపాలపల్లిలో శ్రీధర్‌బాబు కార్యక్రమాలు సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజనతో పరిపాలన పరంగా భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన మార్పులతోపాటే... రాజకీయంగానూ నూతన సమీకరణలు జరుగుతున్నాయి. పునర్విభజనతో ఏర్పడే కొత్త జిల్లాల్లో తమ పట్టు పెంచుకునేందుకు పలువురు ముఖ్య నేతలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజకీయ పదవుల్లోనూ జిల్లాకు ప్రాధాన్యం దక్కింది. కీలకమైన స్పీకర్, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, కేబినెట్ స్థాయి పలు పోస్టులు జిల్లా నేతలకు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన జిల్లాల పునర్విభజనలోనూ వరంగల్ ప్రత్యేకతను సంతరించుకుంటోంది. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా... వరంగల్ జిల్లా నాలుగు జిల్లాలుగా మారబోతోంది. కరీంనగర్ జిల్లాలోని 10 మండలాలు ప్రస్తుతం ఉన్న వరంగల్ జిల్లాలో కలుస్తున్నాయి. దీంతో ఆ జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు ఇప్పుడు తమ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. టీఆర్ఎస్లో కీలక నేతగా గుర్తింపు ఉన్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా మంత్రిగా ఉన్నారు. ప్రొటోకాల్ విషయంలోనూ కరీంనగర్ జిల్లా బాధ్యతలు ఆయనకు ఉన్నాయి. ఈటల కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. వీటితో పాటు ఒక కొత్త మండలం ఏర్పాటవుతోంది. జిల్లాల పునర్విభజనలో ఆ సెగ్మెంట్లోని హుజూరాబాద్, కమలాపురం, జమ్మికుంట, ఇల్లంతకుంట(కొత్తది) మండలాలు హన్మకొండ జిల్లాలో కలుస్తున్నాయి. దీంతో మంత్రి ఈటల హన్మకొండ జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈనెల 7న జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాల పునర్విభజనలో తన నియోజకవర్గం హన్మకొండలో కలుస్తోందని, మంత్రిగా తాను ఏ జిల్లాలో బాధ్యతలు నిర్వహించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు. బహిరంగంగా ఈ మాటలు చెబుతున్నా... మరో రెండు, మూడు రోజుల్లో హన్మకొండలో జరగనున్న మరో కార్యక్రమానికి కూడా ఈటల రాజేందర్ వస్తున్నారు. రాజకీయంగా కీలకమైన హన్మకొండ జిల్లాకు మంత్రిగా తానే ఉంటానని స్పష్టం చేసేందుకే హన్మకొండలో జరిగే కార్యక్రమాలకు వస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్ లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్న బోయినపల్లి వినోద్‌కుమార్ సైతం హన్మకొండ జిల్లాపై దృష్టి పెట్టారు. కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని ఆరు మండలాలు హన్మకొండ జిల్లాలో కలుస్తున్నాయి. వినోద్‌కుమార్ 2004 ఎన్నికల్లో హన్మకొండ ఎంపీగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో హన్మకొండ నియోజకవర్గం రద్దయింది. వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ ఎస్సీ కేటగిరికి రిజర్వు అయ్యింది. హన్మకొండ లోక్‌సభ సెగ్మెంట్లో కరీంనగర్ జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం ఉండేది. దీంతో వినోద్‌కుమార్ 2009 ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లోనూ అక్కడే పోటీ చేసి గెలిచారు. గతంలో వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వినోద్‌కుమార్ తాజాగా జరుగుతున్న జిల్లాల పునర్విభజనతో మళ్లీ హన్మకొండ జిల్లాపై దృష్టి పెడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న దశాబ్దంపాటు కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సైతం రాజకీయంగా కొత్తదారిలోకి వెళ్తున్నారు. కరీంనగర్ జిల్లా మంథని శ్రీధర్‌బాబు సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం, మల్హర్రావు, మహదేవపూర్ మండలాలు కొత్తగా ఏర్పడుతున్న భూపాలపల్లి(జయశంకర్) జిల్లాలో కలుస్తున్నాయి. దీంతో శ్రీధర్‌రాబు సైతం భూపాలపల్లి రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలం టేకుమట్ల కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న జారీ చేసిన పునర్విభజన ముసాయిదాలో టేకుమట్ల మండలం ప్రస్తావన లేదు. దీంతో టేకుమట్ల కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయాలని అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యర్యంలో గత బుధవారం టేకుమట్లలో జరిగిన కార్యక్రమంలో శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భవిష్యత్తు రాజకీయ వ్యూహాలతోనే శ్రీధర్‌బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
స్మార్ట్ఫోన్ల జోరు
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెట్టింపవుతుందని శామ్సంగ్ కంపెనీ అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 4 కోట్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 8 కోట్లకు పెరుగుతాయని భావిస్తున్నామని శామ్సంగ్ మొబైల్ అండ్ ఐటీ ఇండియా హెడ్ వినీత్ తనేజా చెప్పారు. భారత వినియోగదారులు కూడా ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయనున్నారన్న అంచనాలున్నాయని వివరించారు. పెరుగుతున్న జనాభా, వినియోగదారుల అభిరుచులు, నెట్, డేటా నెట్వర్క్ విస్తరణ వంటి అంశాల కారణంగా మొబైల్, ఐటీ బిజినెస్‌ల జోరు పెరుగుతోందని వివరించారు. ఇక్కడ జరుగుతున్న శామ్సంగ్ సౌత్‌వెస్ట్ ఫోరమ్ 2014లో ఆయన మాట్లాడారు. ఇక్కడ ఆయన గెలాక్సీ నోట్ 3 నియో స్మార్ట్‌ఫోన్‌ను, రెండు ట్యాబ్లెట్లు- గెలాక్సీ ట్యాబ్ 3 నియో, నోట్ ప్రోలను ఆవిష్కరించారు. వీటితో పాటు డిజిటల్ ఇమేజింగ్ కేటగిరీలో రెండు కొత్త ఉత్పత్తులు-ఎన్ఎక్స్30 (20.3 మెగా పిక్సెల్), గెలాక్సీ కెమెరా2(16.3 మెగా పిక్సెల్)లను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. కర్వ్ ఆల్ట్రా హై డెఫినేషన్(యూహెచ్డీ) టీవీని కూడా డిస్ప్లే చేసింది. ఈ టీవీ వచ్చే నెలలో అందుబాటులోకి రావచ్చు. దీంతో పాటు గెలాక్సీ గ్రాండ్ నియో స్మార్ట్‌ఫోన్‌ను, కస్టమైజ్డ్ వాషింగ్ మెషీన్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శామ్సంగ్ కంపెనీదే అగ్రస్థానమని సీఎంఆర్ ఇండియా మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్ రివ్యూ వెల్లడించింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలానికి భారత్‌లో 1.11 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయని ఈ రివ్యూ పేర్కొంది.