ఏప్రిల్ నుంచి బ్యాంకులు పని చేసేది ఐదురోజులేనా? | Fact Check: Will Banks Operate For 5 Days A Week Starting April 1st? | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ నుంచి బ్యాంకుల పనిదినాలు వారానికి ఐదు రోజులా?: ఇదిగో క్లారిటీ

Published Fri, Mar 21 2025 1:19 PM | Last Updated on Fri, Mar 21 2025 1:43 PM

Fact Check: Will Banks Operate For 5 Days A Week Starting April 1st?

బ్యాంకుల పనిదినాలు వారానికి ఐదు రోజులు ఉంటాయనే కొన్ని వార్తలు గత కొంతకాలంగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా మరోమారు ఈ విషయం తెరపైకి వచ్చింది. భారతదేశం అంతటా బ్యాంకులు ఏప్రిల్ 2025 నుంచి వారానికి 5 రోజుల పని దినాలను అనుసరిస్తాయని ఊహాగానాలు చెలరేగాయి. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

బ్యాంకులు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేస్తాయని.. శని, ఆదివారాల్లో మూసి ఉంటాయనే వార్తలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందిస్తూ.. ఇందులో నిజం ఏ మాత్రం లేదు. మరింత సమాచారం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ చెక్ చేయండి అని వెల్లడించింది.

బ్యాంకులు వారానికి ఐదు రోజుల పని దినాలకు మారుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో పనిచేయడం ఇప్పటికీ ప్రస్తుత బ్యాంకింగ్ పని విధానంలో భాగం. అయితే బ్యాంకింగ్ పనివేళలు తగ్గించాలని కూడా సంబంధింత యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.

ఇదీ చదవండి: ఉన్నట్టుండి తగ్గిన బంగారం ధరలు

జాతీయ, ప్రాంతీయ సెలవు దినాలు కాకుండా.. ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాల్లో బ్యాంకు శాఖలు పనిచేయవు. అయితే నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో బ్యాంకు శాఖలు తెరిచి ఉంటాయి. ఆదివారాలు అన్ని బ్యాంకులకు సెలవు దినం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement