five days
-
తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు: ఐఎండీ
సాక్షి,హైదరాబాద్: జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఆవర్తనం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.రాబోయే ఐదు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది.కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. -
ఎండలతో బీ కేర్‌ఫుల్ ..ఐఎండీ తాజా వార్నింగ్
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో ఎండలు మరింతగా మండుతాయని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్26) అలర్ట్ జారీ చేసింది. తూర్పు,దక్షిణ భారతాల్లో రానున్న ఐదు రోజుల పాటు హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో పౌరులు బయటికి వెళ్లేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అయితే ఏప్రిల్ 28 నుంచి 30 మధ్య ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
బ్యాంక్ ఉద్యోగులకు తొందరలోనే రెండు శుభవార్తలు!
బ్యాంక్ ఉద్యోగులకు 2024 సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం కావచ్చు. తొందరలోనే రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ తన సమ్మతిస్తే జూన్ నాటికి బ్యాంకు ఉద్యోగులకు 5 పని దినాల విధానం అమల్లోకి రావచ్చు. అలాగే జీతాల పెంపును కూడా పొందవచ్చు. బ్యాంక్ ఉద్యోగుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, బ్యాంకింగ్ రంగానికి వారానికి ఐదు రోజుల పనిని సిఫార్సు చేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. ప్రస్తుతం ఆదివారాలు, షెడ్యూల్డ్ సెలవులు అదనంగా ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులకు సెలవులు ఇస్తున్నారు. ఐదు రోజుల పని విధానం మొత్తం బ్యాంకింగ్ ఖర్చులను తగ్గించదని, కస్టమర్లకు బ్యాంకింగ్ అవర్స్‌లోగానీ, ఉద్యోగులకు మొత్తం పని గంటలలో గానీ తగ్గింపు ఉండదని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తన ప్రతిపాదనలో హామీ ఇచ్చింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో కుదిరిన ఒప్పందం ద్వారా ఈ ప్రతిపాదన చేసింది. ఈ విషయాన్ని సానుకూలంగా సమీక్షించాలని, తదనుగుణంగా ముందుకు సాగేలా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను ఆదేశించాలని అసోసియేషన్ ఆర్థిక మంత్రిని అభ్యర్థించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీలలో ఐదు రోజుల పని విధానం ఇప్పటికే ఆచరణలో ఉందని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ గుర్తు చేసింది. జీతాల పెంపు గత సంవత్సరం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీ యూనియన్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MOU) ఫలితంగా దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 17 శాతం వేతనాల పెంపుదలకు రూ. 12,449 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ పథకానికి ఆమోదం లభిస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోని 3.8 లక్షల మంది అధికారులతో సహా దాదాపు తొమ్మిది లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలుగుతుంది. -
‘అసలే ఎన్నికలు’, బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పనుందా?
ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారానికి ఐదు రోజుల పని దినాలను కేంద్ర ఆర్థిక శాఖ అతి త్వరలోనే అమలు చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటు వేతనాల్ని సగటున 15 శాతం పెంపుపై బ్యాంకులు - బ్యాంకు యూనియన్ సంఘాలు చర్చిస్తున్నాయి. ఐదు రోజుల పనిదినాలను కల్పించేందుకు భారత బ్యాంకుల సంఘం (ఐబీఏ) కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపింది. తాజాగా, ఉద్యోగులు వేతనాల్ని 15 శాతం పెంపును ప్రతిపాదించింది. అయితే, పనిదినాల మార్పులతో పాటు వేతనాల శాతాన్ని మరింత పెంచాలని బ్యాంకు యూనియన్లు కోరుతున్నాయి. ఇప్పటికే పీఎన్బీ వంటి కొన్ని బ్యాంకులు వేతనాల పెంపుకు పెద్దమొత్తంలో కేటాయింపులు జరుపుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల వేతనం 10 శాతం పెరిగేలా బడ్జెట్ కేటాయించడానికి బదులుగా, 15శాతం పెరుగుదల కోసం నిధులను కేటాయించింది. నిశితంగా పరిశిలీస్తున్న కేంద్రం ‘ఇటీవలి కాలంలో బ్యాంకుల లాభాలు బాగా పెరిగాయని, కొవిడ్ సమయంలో పనిచేయడం, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు రుణదాతలను తిరిగి గాడిలో పెట్టడానికి ఉద్యోగులు చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుంటే తమకు మెరుగైన పరిహారం లభిస్తుందని’ ఉద్యోగులు, యూనియన్లు వాదించుకుంటున్నాయి. ఈ చర్చలను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. అసలే ఎన్నికలు అధిక సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు ఉన్నందున వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కంటే ముందే వేతన సెటిల్ మెంట్‌తో పాటు వారానికి ఐదురోజుల పనికి కేంద్రం ఆమోదం తెలుపుతుందని బ్యాంక్ ఉద్యోగులు, యూనియన్ సంఘాలు అంచనా వేస్తున్నాయి. -
బ్యాంకుల్లో ఊహించని మార్పులు.. వారానికి 5 రోజులే పని..ఇంకా
గత కొంత కాలంగా వారంలో ‘ఐదురోజులే పనిదినాల’పై ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు ఆ డిమాండ్లు, ప్రతిపాదనలు చివరి దశకు వచ్చాయి. ఐదు రోజుల పనిదినాలపై మరో ఐదు రోజుల్లో ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగుల భవితవ్యం తేలనుంది. జులై 28న కేంద్రం సైతం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వారానికి ఐదు రోజులే పనిదినాలు. ఈ సంస్కృతి ప్రైవేట్ రంగ సంస్థల్లో గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ కార్పొరేట్ వర్క్ కల్చర్ ప్రభుత్వ కార్యాలయాలకు పాకింది. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు వారానికి ఐదు రోజుల పనిదినాల్ని కొనసాగిస్తుండగా.. తమకు వారాంతంలో రెండు రోజుల సెలవుల సంస్కృతిని కొనసాగించాలని ప్రభుత్వ బ్యాంక్ రంగ సంస్థలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే శుక్రవారం ( ఏప్రిల్28న).. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబీఏ) యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ)లు సమావేశం కానున్నాయి. ఈ భేటీలో ఐదు రోజుల పని, వేతన పెంపు, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి చర్చించనున్నాయి. వీటన్నింటికంటే వారానికి ఐదురోజుల పనిదినాలపై ప్రధానంగా దృష్టిసారించనున్నాయి. ప్రస్తుతం, బ్యాంకుల్లో మొదటి, మూడవ శనివారం కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. యూఎఫ్‌బీయూ బ్యాంక్ ఉద్యోగులు వారినికి రెండురోజుల సెలవులిస్తూ వారానికి ఐదు రోజులు పనిచేసే వెసలు కల్పించాలని కోరుతుంది. వారానికి ఐదు రోజుల పని కల్పించాలన్న యూఎఫ్‌బీయూ డిమాండ్‌పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో ఆర్ధిక శాఖ తెలిపింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ కేంద్రానికి ప్రతిపాదన పంపింది. ప్రతిపాదన ప్రకారం, వారంలో ఒకరోజు పని తగ్గుతున్నందున, దీనికి బదులుగా 5 రోజుల పాటు, సిబ్బంది పనివేళలను రోజూ మరో 40 నిమిషాల పాటు పెంచాలని ఐబీఏ భావిస్తోంది. దీంతో పాటు పదవీ విరమణ చేసిన వారికి రూ.2లక్షల వరకు ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీకి యూబీఎఫ్‌యూ అంగీకరించింది. దీనికి అదనంగా టాపప్ పాలసీని రూ.10లక్షల వరకు తీసుకునేందుకు ఆప్షనల్ విధానంలో అనుమతించాలని కోరుతోంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే..బ్యాంక్ ఉద్యోగులు ఇకపై ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయాల్సి వస్తుందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. చదవండి👉 భారత్‌లో టెస్లా కార్ల తయారీ.. ఎలాన్ మస్క్‌కు మెలిక పెట్టిన కేంద్రం! -
తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 22 వ తేదీన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించగా, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. ఉత్తర తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. కొమరం భీమ్, నిర్మల, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలల్లో వర్షాలు పడే అవకాశముంది. ఉత్తర, ఈశాన్య మధ్య తెలంగాణ జిల్లాలకు వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌కు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉంది.. పగలు అంతా సాధారణ పరిస్థితి ఉన్న.. సాయంత్రానికి వాతావరణ మారుతుందని, యంత్రాంగాలను అలెర్ట్ చేశామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మరోసారి షాకిచ్చిన కూతురు భవానీ రెడ్డి -
అదరహో..! ఐదు రోజుల పాటు నిర్విరామంగా బాలిక డ్యాన్స్.. గిన్నీస్ రికార్డ్..
మహారాష్ట్ర: మహారాష్ట్రకు చెందిన ఓ బాలిక అరుదైన ఘనత సాధించింది. నిరంతరాయంగా 127 గంటలపాటు డ్యాన్స్ చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించింది. డ్యాన్స్ మారథాన్‌లో ఐదు రోజులపాటు నిర్విరామంగా క్లాసికల్ కథక్ నృత్యం చేసింది. మే 29 నుంచి జూన్ 3 వరకు ఈ మారథాన్‌లో పాల్గొని ఇప్పటివరకు ఉన్న 126 గంటల రికార్డ్‌ను అధిగమించింది. సృష్టి సుధీప్ జగతాప్(16) లాతూర్కు చెందిన బాలిక. నృత్యంలో మంచి ప్రతిభను చూపించింది. ఏదైనా గొప్పగా సాధించాలనే తన కలను నెరవేర్చుకుంది. నిర్విరామంగా ఐదు రోజుల పాటు క్లాసికల్ కథక్ నృత్యం చేసి గిన్నిస్ రికార్డును సాధించింది. అయితే.. ఈ అంశంలో ఇప్పటివరకు నేపాలీ డ్యాన్సర్ బందన 2018లోనే 126 గంటలపాటు నృత్యం చేసింది. ఆ రికార్డును ఇప్పుడు సుధీప్ జగతాప్ అధిగమించింది. అయితే.. ఈ డ్యాన్స్‌లో కేవలం ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సుధీప్ కేవలం రాత్రిళ్లు మాత్రమే ఈ అవకాశాన్ని వాడుకుని నృత్యం చేసింది. సుధీప్ ఎల్లప్పుడూ తన కాళ్లలో కదలికలను ఆపలేదని నిర్వహకులు తెలిపారు. తన తల్లిదండ్రులు ఎల్లప్పుడు తన పక్కనే ఉన్నారని సుధీప్ జగతాప్ చెబుతోంది.రాత్రిళ్లు నిద్ర రాకుండా ముఖంపై నీళ్లు చల్లేవారని తెలిపింది. చివరి గంటవరకు తన శరీరం కదలలేని పరిస్థితికి చేరినప్పటికీ లక్ష్యం మీదే దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. తాతయ్యతో పాటు యోగా తరగతులకు వెళ్లి యోగ నిద్ర సాధన చేశానని తెలిపింది. భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచ వేదికకు తీసుకువెళ్లడమే ధ్యేయమని అంటోంది. ఇదీ చదవండి:Aryan Dubey Rebirth Story: ‘ఆవిడ మా ఆవిడే..’ పునర్జన్మ చెబుతూ హడలెత్తిస్తున్న కుర్రాడు! -
బ్యాంక్ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వారానికి 5 రోజులే పని దినాలు!
కేంద్ర ప్రభుత్వం త్వరలో బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేసేలా కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వలు వెలువరించనున్నట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాల్ని వెలువరించాయి. కేంద్ర ఆర్ధిక శాఖ అమలు చేస్తున్న ఐదు రోజుల పనిదినాల్ని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ( ఐబీఏ), యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ (యూఎఫ్బీఈఎస్) అంగీకరించినట్లు సమాచారం. అయితే అందుకు బదులుగా ఉద్యోగులు రోజుకు 40 నిమిషాల పాటు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. అదనంగా పనిచేసేందుకు సైతం బ్యాంక్ యూనియన్లు అంగీకరించాయి. దీంతో ఐబీఏ అంగీకరించిన ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపించింది. ఈ మేరకు వేజ్ బోర్డు సవరణలు చేసి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే.. బ్యాంకు ఉద్యోగులు ఇకపై ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయాల్సి వస్తుందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. చదవండి👉 గూగుల్ సరికొత్త సంచలనం.. లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ అవసరం లేదు! -
చల్లని కబురు.. 5 రోజులు ఎండల నుంచి ఉపశమనం: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశంలో వారం రోజులుగా ఎండలు, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రానున్న అయిదు రోజుల్లో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో వడగాలులు వీసేందుకు అవకాశాలు లేవని అంచనా వేసింది. తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మొత్తమ్మీద ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్ణాటక, యూపీ, పంజాబ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన గాలి వాన కురుస్తుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. (మువ్వన్నెల జెండాకు అవమానం.. చికెన్ శుభ్రం.. వీడియో వైరల్.. అరెస్ట్) -
పాత సంప్రదాయం.. కొత్త ఆలోచనలతో.. ఐదు రోజుల పెళ్లిళ్లు..
(బి. జనార్దన్‌రెడ్డి) పెళ్లంటే.. జీవితంలో ఒకసారి జరిగే మధుర ఘట్టం.. ఓ కొత్త జీవితానికి ఏడడుగులు శుభ తరుణం. పాతకాలంలో పెళ్లిళ్లు ఐదు రోజులపాటు జరిగేవి. వారం రోజుల ముందు నుంచే బంధువులతో పెళ్లి ఇళ్లు సందడిగా ఉండేవి. ఊరంతా హడావుడి కనిపించేది. రానురాను ఆ సందడి మాయమైంది. ఉదయం పెళ్లి జరిగితే సాయంత్రానికి ఆ సందడి ముగిసిపోతుంది. అతిథులు కూడా ఇలా వచ్చి కనిపించి వెళ్లిపోతున్నారు. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆచారాలకు మళ్లీ ఊపొచ్చింది. పాత సంప్రదాయాలను కొత్తతరం అందిపుచ్చుకుంటోంది. ఐదురోజుల పెళ్లిళ్లు మళ్లీ మొదలయ్యాయి. మెహందీ ఫంక్షన్‌తో మొదలు.. ఐదు రోజులపాటు పెళ్లి ఇల్లు కళకళలాడిపోతోంది. ఇది నిజంగా శుభపరిణామమే. పాశ్చాత్య సంస్కృతి అందరినీ ఆవహించేసి సంప్రదాయాలను దూరం చేస్తున్న వేళ నవతరం ఈ దిశగా అడుగులు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఒకప్పుడు పెళ్లంటే నెల, 15 రోజుల ముందే బంధువులు, ఆత్మీయులు వచ్చి తలోపని చేసేవారు. కానీ, ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో అందుకు అవకాశం లేదు. అందుకనే, ఇలాంటి వెతలు తీర్చేందుకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు వెలిశాయి. సంప్రదాయాలను పాటించాలని ఆసక్తి ఉన్నవారికి ఈవెంట్ ఆర్గనైజ్ సంస్థలు అన్నీ సమకూర్చి పెళ్లికి నిండుదన్నాన్ని తీసుకువస్తున్నాయి. ఇప్పటి వరకు పెద్ద నగరాలకే పరిమితమైన ఈవెంట్ మేనేజ్మెంట్స్ చిన్న పట్టణాలకు కూడా విస్తరించాయి. సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల ఇళ్లలోనే జరిగే ఐదు రోజుల పెళ్లిళ్లపై ఇప్పుడు అప్పర్ మిడిల్‌క్లాస్ ఫ్యామిలీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఒక్కో కార్యక్రమం ఒక్కో రోజు నిర్వహిస్తున్నారు. ఈ తరహా పెళ్లిళ్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొన్నిచోట్ల ఈ నెలలో జరిగాయి. పెళ్లి ముహూర్తాలు ఈ నెల 21తో ముగియగా.. జనవరి చివరి వారం నుంచి మళ్లీ మొదలవుతున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకకు కొందరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈవెంట్స్ వారిది ప్రధాన పాత్ర ఏ శుభకార్యమైనా ప్రజల ఆలోచనా విధానం.. అభిరుచికి తగ్గట్టుగా తగిన ఏర్పాట్లు చేసి అతిథులతో ఆహా అనేలా చేస్తున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు. పెళ్లిళ్ల కోసం ఎవరినీ సంప్రదించకుండా మొత్తంగా ఈవెంట్ మెనేజ్మెంట్దే బాధ్యతగా జనం ఒప్పందం చేసుకుంటున్నారు. బాజాభజంత్రీలు మొదలు.. వ«ధూవరులను ముస్తాబు చేయడం, పురోహితుడు, ఫంక్షన్‌హాల్ సహా కల్యాణం, రిసెప్షన్, వ్రతాలు ముగిసే వరకు వారే చూసుకుంటున్నారు. పెళ్లి పనులన్నీ సులువుగా అవుతుండడంతో ప్రజలు కూడా ఈవెంట్ సంస్థలపై ఆధారపడుతున్నారు. గతంలో పెళ్లి పనుల్లో వివిధ కుల వృత్తుల వారు భాగస్వామ్యం అయ్యేవారు. ఇప్పుడు అన్నీ పనులూ ఈవెంట్స్ మేనేజర్లే చూసుకుంటున్నారు. ప్రజల అభిరుచి మేరకు.. శుభకార్యాల నిర్వహణలో ప్రజల ఆలోచన విధానం మారుతోంది. స్టేటస్‌కు తగిన విధంగా వివాహాది శుభకార్యాలు చేయాలని భావిస్తున్నారు. అవసరమైన ఏర్పాట్లు, సామగ్రి అంతా ఒకేచోట దొరికేలా చూసుకుంటున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్లకు మంచి ఆదరణ ఉంటోంది. వారి అభిరుచి మేరకు ఏమి కావాలో అడిగి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది చిన్నవి, పెద్దవి కలిపి 150 వరకు ప్రోగ్రామ్‌లు చేశాం. – పద్మజ, ఈవెంట్ మేనేజర్, సూర్యాపేట సంప్రదాయాలు కోరుకుంటున్నారు తమ పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేయడానికి తల్లిదండ్రులు ఖర్చుకు వెనకాడడం లేదు. మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. పెళ్లికి కావాల్సిన వివిధ వస్తువులను కూడా సమకూరుస్తున్నాం. దీంతో పెళ్లి చేసేవారు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటున్నారు. పెళ్లిలో అన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఉండాలని కోరుకుంటున్నారు. సంప్రదాయానికి కొంత కొత్తదనం జోడించి నిండుదనం తీసుకొస్తున్నాం. – శ్రవణ్, కేపిఆర్ ఈవెంట్ మేనేజర్, నల్లగొండ ఈవెంట్ ఆర్గనైజ్ సంస్థల చార్జీలు ఇలా.. సంగీత్ : రూ.50 వేల నుంచి రూ.6 లక్షల వరకు మెహందీ : రూ.30 వేల నుంచి రూ.2 లక్షలు హల్దీ : రూ.30 వేల నుంచి రూ.2 లక్షలు కల్యాణం : రూ.లక్ష నుంచి రూ.15లక్షలు (ఫంక్షన్‌హాల్, భోజనం ఖర్చు కాకుండా) వినియోగించే మ్యాన్‌పవర్ సంగీత్ : 5 నుంచి 30 మంది మెహందీ : 10 మంది హల్దీ – 10 మంది వివాహం : 30 నుంచి వంద మంది (సప్లయర్స్ కాకుండా) ప్రస్తుత ఐదు రోజుల పెళ్లిళ్లలో నిర్వహించే కార్యక్రమాలు ఇవీ.. సంగీత్: ఇది పెళ్లి కూతురు ఇంటి వద్ద జరుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే అమ్మాయి బ్యాచ్‌లర్ పార్టీ. అమ్మాయి రేపటి నుంచి మరో కుటుంబంలోకి వెళ్లిపోతుంది కాబట్టి తన కుటుంబంతో ఒకరోజు ఆడిపాడుతుంది. రాజుల కాలంలో అయితే కచేరి నిర్వహించే వారు. ప్రస్తుతం అమ్మాయి కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు కలిసి నృత్యాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కొందరు వరుడి కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానిస్తున్నారు. అంతా కలిసి పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మెహందీ: గతంలో పెళ్లికూతురిని చేయడానికి ముందు ఇంట్లో వారే పెళ్లి కూతురికి చెట్టు నుంచి కోసి తెచ్చిన గోరింటాకు పెట్టేవారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇంట్లో ప్రత్యేక సెట్టింగ్ వేసి ఈవెంట్స్ వారితో పెళ్లి కూతురికి గోరింటాకు పెడుతున్నారు. ఈ కార్యక్రమం జరుగున్నంతసేపు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఒక రోజు మొత్తం నిర్వహిస్తున్నారు. హల్దీ: పెళ్లి కూతురుకు పసుపు పెట్టడం. అమ్మాయి, అబ్బాయి ఇళ్లలోనూ మంగళస్నానం కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనికి కూడా భారీ సెట్టింగ్ పెడుతున్నారు. వివాహం: పెళ్లిలో ప్రతిఒక్క ఘట్టం సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్నారు. వివాహ తంతులో సంప్రదాయంగా వాడే వస్తువులకు ప్రత్యేక డిజైన్లు వేస్తున్నారు. వరుడిని గుర్రంపై పెళ్లి మండం వరకు, ఆ తర్వాత ముత్యాల పందిరితో స్టేజీపైకి తోడ్కొనివస్తున్నారు. వధువును గంపలో కూర్చోబెట్టుకుని తీసుకువస్తున్నారు. సంప్రదాయంతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లు మరికొన్ని ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వ్రతం, రిసెప్షన్: చివరగా వ్రతంతో పెళ్లి వేడుక ముగుస్తుంది. వ్రతాలకు అవసరమయ్యే వస్తువులను కూడా ఈవెంట్స్ ఆర్గనైజర్లే సమకూరుస్తున్నారు. రిసెప్షన్ పెళ్లి కంటే ఎక్కువ ఆర్బాటంగా చేస్తున్నారు. మేళతాళాల్లోనూ స్పెషలే.. వివాహాలకు సన్నాయి బృందాలు, సాధారణ బ్యాండ్ వాయించడం ఇప్పటి వరకు ఉన్న ఆనవాయితీ. ప్రస్తుతం ఇందులోనూ కొత్త ట్రెండ్ వచ్చింది. కేరళ బ్యాండు, పంజాబీ బ్యాండ్‌కు బాగా క్రేజీ ఉంది. ►పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో కొన్ని సామాజిక వర్గాల ఆచారాల ప్రకారం అదనపు కార్యక్రమాలు కూడా చేస్తారు. ప్రతి కార్యక్రమానికి ఒక డ్రెస్ కోడ్ పెడుతున్నారు. ఇంటిళ్లిపాదీ, బంధువులు ఈ కార్యక్రమాలకు ప్రత్యేక దుస్తులతో హాజరవుతున్నారు. ఎంతో సంతోషంగా ఉంది మా పాప పెళ్లి వేడుక ఐదు రోజులు ఎంతో ఆనందంగా చేశాం. ఎలాంటి టెన్షన్ లేకుండా ఈవెంట్ ఆర్గనైజ్ వారి సహకారంతో సంప్రదాయబద్ధంగా వేడుక పూర్తిచేశాం. దగ్గరి బంధువులు, మిత్రుల రాకతో ఒక రోజు ముందు నుంచే.. సందడి నెలకొంది. ఐదు రోజుల పెళ్లంటే కష్టమని అందరూ చెప్పారు. కానీ, పాత సంప్రదాయం మళ్లీ తీసుకురావాలనే కోరికతో కష్టమేమీ లేకుండా నిర్వహించాం. మాతో పాటు బంధువులంతా సంతోషం వ్యక్తం చేశారు. – మంగళగిరి రామ్మోహన్–రూపాదేవి, నల్లగొండ కష్టమైనా.. ఇష్టంగానే చేశాం ప్రస్తుత కాలంలో ఐదు రోజుల పెళ్లి చేయడం కొంచెం కష్టమే. గ్రామీణ ప్రాంతాలలో ఇబ్బంది ఉండదు. పట్టణాల్లో బంధువులకు స్నేహితులకు వసతి కల్పించడం.. ఐదు రోజుల కార్యక్రమాలను ఇబ్బంది లేకుండా జరిపించడానికి కష్టపడాల్సి వచ్చింది. మా కూతురి పెళ్లి వేడుక ఐదు రోజులు జరిపించాం. ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు అన్ని రోజులు మాతో కలిసి ఉండడం ఆనందంగా ఉంది. – దొంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి – ప్రమీల, కోదాడ నాడు సంప్రదాయాలకే ప్రాధాన్యం ఆ కాలంలో ఐదు రోజుల పెళ్లిళ్లు చేసేటప్పుడు సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇంటి పెద్దలు ముందుండి ఏ కార్యక్రమం ఎలా చేయాలో పద్ధతిగా చెప్పేవారు.. చేయించేవారు. బంధువులు ఇరుగుపొరుగువారు మమేకమై కార్యక్రమాలను ఆనందోత్సాహాలతో నిర్వహించేవారు. కాలం మారింది ఇప్పుడు ఐదు రోజుల పెళ్లిళ్లు భారీ సెట్టింగ్‌లు ఈవెంట్ మేనేజర్లతో కార్యక్రమాలు చేస్తున్నారు. –శ్రీరామకవచం సరోజినీదేవి, కోదాడ -
Sovereign Gold : 22 నుంచి ఐదు రోజులు కొత్త గోల్డ్ బాండ్ స్కీమ్
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2022–23 రెండవ సిరీస్ సోమవారం ప్రారంభమవుతోంది. ఐదు రోజుల పాటు (ఆగస్టు 22 నుంచి 26 వరకూ) చందాదారులకు అందుబాటులో ఉండే ఈ స్కీమ్ బాండ్ ఇష్యూ ధర గ్రా ముకు రూ.5,197 అని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే, రూ.50 డిస్కౌంట్‌తో రూ.5,147కే బాండ్ లభిస్తుందని ప్రకటన పేర్కొంది. కేంద్రం తరఫుల ఆర్బీఐ చేసే ఈ బాండ్లు స్టాక్ ఎక్సే్చంజీలతోపాటు నిర్దిష్ట బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కూడా లభ్యమవుతాయి. దేశంలో భౌతిక పసిడికి డిమాండ్ తగ్గించి, ఇందుకు సంబంధించిన డబ్బును పొదుపు పథకాల్లోకి మళ్లించడానికి 2015 నవంబర్‌లో కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. -
AP: వారానికి ఐదు రోజుల పని.. మరో ఏడాది పొడిగింపు
సాక్షి, అమరావతి: సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వ పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు. చదవండి: మీకు తెలుసా?.. చెప్పింది చేస్తే.. నష్టపోవాల్సిందే! వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో వారానికి ఐదురోజుల పని విధానాన్ని ఈ ఏడాది జూన్ 27వ తేదీ నుంచి ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదురోజుల పని విధానంలో ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకు పని చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులు పని చేసే విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించిన సీఎం వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. -
సోమవారం నుంచి తాజా గోల్డ్ బాండ్లు
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ల స్కీమ్ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఐదు రోజుల పాటు (ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4వ తేదీ) అమల్లో ఉండే ఈ బాండ్ స్కీమ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) సిరీస్‌లో పదవది. గ్రాము ధర రూ.5,109 అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం జారీ చేసిన ప్రకటన పేర్కొంది. ఆన్లైన్లో కొనుగోలుకు గ్రాముకు రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ సందర్భంలో గ్రాము ధర రూ.5,059గా ఉంటుందన్నమాట. జనవరి 10 నుంచి 14వ తేదీ వరకూ అమలయిన తొమ్మిదివ సిరీస్ జారీ ధర గ్రాముకు రూ.4,786 కావడం గమనార్హం. ఎనిమిదవ సిరీస్ ధర రూ. 4,791. భారత ప్రభుత్వం తరఫున బాండ్లను ఆర్బీఐ జారీ చేస్తుంది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్), నిర్దిష్ట పోస్టాఫీసులు, బ్యాంకులు, స్టాక్ ఎక్సే్ఛంజీలు– ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో గోల్డ్ బాండ్లు లభ్యం అవుతాయి. భౌతికంగా బంగారం కొనుగోళ్లు తగ్గించడం, తద్వారా దేశంపై దిగుమతుల బిల్లు భారంగా మారకుండా చూడ్డం లక్ష్యంగా 2015 నవంబర్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను కేంద్రం ప్రకటించింది. సబ్స్క్రిప్షన్ పీరియడ్‌కు ముందు వారంలోని చివరి మూడు పనిదినాల్లో ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా బాండ్ ధర నిర్ణయమవుతుంది. -
Chhattisgarh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం తీపికబురు.. ఇక నుంచి..
ఛత్తీస్‌ఘడ్: భారతదేశమంతట 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్.. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదురోజుల పని దినాలతో పాటు పలు విధానపర నిర్ణయాలను ప్రకటించారు. అదే విధంగా, పెన్షన్ పథకంలో రాష్ట్రప్రభుత్వం వాటాను 10 నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులలో సామర్థ్యం, ఉత్పాదకతను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భూపేష్ బఘెల్ తెలిపారు. ఆయా నివాస ప్రాంతంలో వ్యాపారాలు చేసే చిరువ్యాపారుల కోసం ప్రత్యేకంగా చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ప్రవేశపెడుతన్నట్లు పేర్కొన్నారు. ఇది చిరువ్యాపారులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రజా భద్రతకు ఇబ్బందులు కల్గించే ఎలాంటి అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బిల్డింగ్ కోడ్‌లోని నిబంధలను అందరు పాటించాలని సూచించారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లలో సెకండ్ బిల్డింగ్ పర్మిషన్ పథకానికి అనుగుణంగా ప్రణాళిక నిబంధనలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉపాధి కల్పనతోపాటు రవాణా సౌకర్యాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా రవాణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ నిబంధలను సులభతరం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. మహిళల భద్రత కోసం మహిళ సేఫ్టీ సెల్స్‌ను ఏర్పాటు చేస్తామని భూపేష్ బఘెల్ ప్రకటించారు. ఛత్తీస్‌ఘడ్ ప్రాంతంలో దట్టమైన అడవులతో కూడి ఉంటుంది. ఈ క్రమంలో గిరిజనులు ఎక్కువగా జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడతారు. వీరి కోసం అటవీ వాసులకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయనున్నట్లు సీఎం తెలిపారు. పారిశ్రామిక విధానంలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ పార్కుల్లోని ప్లాట్లలో 10 శాతం భూమిని ఓబీసీ వర్గానికి రిజర్వు చేయనున్నట్లు తెలిపారు. ప్రధానంగా రైతుల కోసం 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి పప్పుధాన్యాలకు కూడా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని సీఎం తెలిపారు. అలాగే కార్మికులకు జన్మించిన మొదటి ఇద్దరు ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 20,000 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు భూపేష్ బఘెల్ తెలిపారు. చదవండి: టెన్షన్.. టెన్షన్..! పశ్చిమ యూపీలో ఒక్కో ఓటుకై పార్టీల ఆరాటం -
Heavy Rains: మరో ఐదు రోజులు కుండ పోతే!
సాక్షి, చెన్నై: రాష్ట్రాన్ని మరో ఐదురోజులపాటూ భారీవర్షాలు ముంచెత్తనున్నాయి. దీంతో సహాయక చర్యలు, కంట్రోలు రూం ఏర్పాటుతో ప్రభుత్వ యంత్రాగం సన్నద్ధమైంది. ఏటా అక్టోబరు రెండోవారంలో రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమై డిశంబర్ వరకు కొనసాగుతాయి. గత ఏడాది అక్టోబరు 28వ తేదీన ఆలస్యంగా ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల ఆరుశాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది అక్టోబరు 25వ తేదీన ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈక్రమంలో దక్షిణ తమిళనాడు, డెల్టాజిల్లాల్లో మరో ఐదురోజులపాటూ ఉరుములు, పిడుగుపాటుతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉంది. చెన్నైలో శనివారం కుండపోతగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయం కావడంతో ఇళ్లలోకి మోకాలి లోతు వరదనీరు ప్రవేశించింది. చెన్నై శివార్లు మీంజూరులో వంద ఎకరాల పంట వర్షార్పణమైంది. వరదనీరు వరి పంటపొలాల్లో ప్రవహించడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. పంటపొలాల్లో నిల్వ ఉన్న నీటిని.. తరలించేందుకు అధికారులు రోడ్లను తెగ్గొట్టంతో ప్రజలు మరింత అవస్థలకు గురయ్యారు. చెంబరబాక్కం జలాశయ మొత్తం నీటిమట్టం 24 అడుగులు కాగా, ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల నీటిమట్టం 21.15 అడుగులకు చేరుకుంది. ఈ నీటిమట్టం 22 అడుగులకు చేరినపక్షంలో ఉపరితల నీటి విడుదలకై క్రస్ట్ గేట్లు ఎత్తివేయక తప్పదని అధికారులు చెప్పడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెంబరబాక్కం నీటి పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. చదవండి: (చికెన్ ముక్క గొంతులో చిక్కుకుని..) అల్పపీడనద్రోణి బంగాళాఖాతంలో ఈనెల 9వ తేదీన ఏర్పడే అల్పపీడన ద్రోణి 48 గంటల్లో బలపడి ఉత్తర తమిళనాడు దిశగా పయనిస్తుందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం సంచాలకులు బాలచంద్రన్ తెలిపారు. దీని ప్రభావం వల్ల 10 – 12 తేదీవరకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు వెంటనే తీరానికి చేరుకోవాలని ఆయన సూచించారు. బంగాళాఖాతం నడిసంద్రం పశ్చిమాన, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఉపరితలద్రోణి కారణంగా తమిళనాడులో మరో ఐదురోజులపాటూ భారీ వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు. కంట్రోల్ రూంల ఏర్పాటు రుతుపవనాల వల్ల ఎదురయ్యే విపత్కర పరిస్థితులలో రక్షణ చర్యలు చేపట్టేందుకు 8,462 అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛదం సేవకులు సిద్ధంగా ఉన్నారు. సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం కంట్రోలు రూం ఏర్పాటు చేసి 044–24331074/ 24343662/1070/ 9445869843 ఫోన్ నెంబర్లను ప్రకటించింది. అల్పపీడన ద్రోణి వల్ల ఏర్పడే ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం అధికారులతో సమావేశమయ్యారు. -
అధికారులకు దిశానిర్దేశం
సాక్షి, మంచిర్యాల: డీజీపీ మహేందర్‌రెడ్డి కుమురం భీం జిల్లా పర్యటన ఆదివారం ముగిసింది. ఈ నెల 2న మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్లో ఆసిఫాబాద్ చేరుకున్న డీజీపీ ఆదివారం వరకు అక్కడే గడిపారు. నెలన్నర వ్యవధిలో రెండుసార్లు ఆసిఫాబాద్ వచ్చిన డీజీపీ.. క్షేత్ర స్థాయిలోని పరిస్థితులు, పోలీసుల పనితీరును నేరుగా తెలు సుకున్నట్లు తెలుస్తోంది. దళ సభ్యుల సం చారం నేపథ్యంలో అప్రమత్తతపై మరో మారు స్థానిక పోలీసులకు దిశానిర్దేశం చేసినట్లుగా పర్యటన సాగింది. ఉమ్మడి జిల్లాలో నక్సల్స్ సానుభూతిపరులు, కూంబింగ్‌లో బలగాలు వ్యవహరించాల్సిన తీరు, కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు వంటివి చర్చకు వచ్చి నట్లు సమాచారం. మావోయిస్టులను ఆదిలో నిలువరించేందుకు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. గత ఐదు రోజులుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, ప్రాణహిత తీరం, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. అత్యంత గోప్యంగా పర్యటన డీజీపీ ఆసిఫాబాద్ పర్యటన గోప్యంగా సాగింది. ఈ ఐదు రోజుల్లో ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడలేదు. తొలి రోజు హెలికాఫ్టర్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మావోయిస్టు సంచారం ఉన్న అటవీ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత రెండు రోజులపాటు జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీసులోనే రామగుండం పోలీసు కమిషనర్, ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ, ఓఎస్డీ ఉదయ్‌కుమార్ రెడ్డి, ఆదిలాబాద్ ఎస్పీ విష్ణువారియర్‌తో సమీక్షలు నిర్వహించారు. ఈ నెల 4న రాత్రి పది గంటలకు మారుమూల తిర్యాణి పోలీస్‌స్టేషన్‌కు రోడ్డు మార్గాన వెళ్లి వచ్చారు. గత జూలైలో ఈ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంగీ అడవుల్లో మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య ఫైరింగ్ జరిగింది. రెండు సార్లు దళ సభ్యులు చిక్కినట్లే చిక్కి తృటిలో తప్పించుకున్నారు. అలాంటి మారు మూల ప్రాంతానికి డీజీపీ రాత్రి వెళ్లడంతో ఏదో జరుగుతోందని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అదే రాత్రి డీజీపీ ఆసిఫాబాద్ చేరుకున్నారు. ఈనెల 5న ఎస్పీ క్యాంపు ఆఫీ సులో ఉమ్మడి జిల్లాలోని మావోయిస్టు ప్ర భా వం ఉన్న ఎస్సై, సీఐ, డీఎస్పీలతో సుదీర్ఘంగా సమీక్షించారు. అదేరోజు చివరగా కుమురం భీం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో ప్రత్యేకం గా సమావేశమయ్యారు. ఐదో రోజు మధ్యా హ్నం 3 గంటలకు రోడ్డు మార్గాన ఆసిఫాబా ద్ నుంచి హైదరాబాద్ బయలుదేరివెళ్లారు. -
‘సగం’ మందికి చేరిన బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీ వేగంగా జరుగుతోంది. గడిచిన రెండు మూడు రోజులుగా సర్వర్ సమస్యల కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తగా, ఆదివారానికి సమస్య కొలిక్కి రావడంతో పంపిణీ కార్యక్రమం సజావుగా కొనసాగింది. శనివారం ఒక్క రోజే గరిష్టంగా 10.04 లక్షల మంది కార్డుదారులు రేషన్ బియ్యాన్ని తీసుకోగా ఆదివారం మధ్యాహ్నానికి 6.50 లక్షల మంది రేషన్ తీసుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 87.59 లక్షల కుటుంబాల్లో 2.80 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు 45.11 లక్షల కుటుంబాల్లో 1.60 కోట్ల మంది 1.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి. నిజానికి సాధారణ రోజుల్లో ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున నెలకు 1.57 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని శాఖ పంపిణీ చేస్తుంటారు. ఈ ప్రక్రియ ప్రతి నెలా 15 రోజుల పాటు కొనసాగుతుంది. కానీ ప్రస్తుతం ఒక్కో లబ్ధిదారుడికి 12 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా ఇప్పటికే నెల కోటాను దాటి 1.67 లక్షల మెట్రిక్ టన్నుల పంపిణీని పూర్తి చేసింది. ఆదివారం సైతం చాలా రేషన్ దుకాణాల వద్ద జనం గుంపులుగా కనిపించినా డీలర్లు వేగంగానే పంపిణీ ప్రక్రియ పూర్తి చేశారు. 15 తర్వాత కిలో కందిపప్పు.. కేంద్ర ప్రభుత్వం సైతం రేషన్ లబ్ధిదారులకు కిలో కందిపప్పు ఇచ్చేందుకు సమ్మతించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 87.59 లక్షల కుటుంబాలకు కిలో చొప్పున మొత్తంగా 26,685 మెట్రిక్ టన్నుల మేర కందిపప్పు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కందిపప్పును కేంద్ర సంస్థ అయిన నాఫెడ్.. పౌర సరఫరాల సంస్థకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మరో వారం పది రోజుల్లో పూర్తవగానే ఈ నెల 15 తర్వాత నుంచి కందిపప్పును పంపిణీ చేయనున్నారు. -
రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షం
అనంతపురం అగ్రికల్చర్ : రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షం కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 12 మి.మీ. మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 నుంచి 39 డిగ్రీలు, కనిష్టం 26 నుంచి 27 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 59 నుంచి 65, మధ్యాహ్నం 28 నుంచి 33 శాతం మధ్య రికార్డు కావచ్చని తెలిపారు. గంటకు 12 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
మోదీ షాక్: ఆ బ్యాంకుకు భారీగా పాత నోట్లు
మల్లాపురం : మలబార్ జిల్లా సహకార బ్యాంకులో సీబీఐ అధికారులు జరిపిన అకస్మాత్తు తనిఖీల్లో భారీగా పాత నోట్లు వెలుగులోకి వచ్చాయి. నవంబర్ 8న పెద్ద రూ.500, రూ.1000 నోట్లు రద్దుచేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన అనంతరం మొదటి ఐదు రోజుల్లోనే రూ.169 కోట్ల రద్దయిన నోట్లు ఆ బ్యాంకుల్లో జమ అయినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించిన డిపాజిట్‌దారుల డాక్యుమెంట్లు సమర్పించాలని సీబీఐ బ్యాంకును ఆదేశించింది. అయితే బ్యాంకు అధికారులు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి ఈ డిపాజిట్లు చేసుకున్నట్టు తెలిసింది. బ్యాంకుకు సంబంధించిన 54 శాఖల్లో, 296 కోపరేటివ్ సొసైటీల్లో నవంబర్ 10 నుంచి 14 వరకు మొత్తం రూ.169 కోట్ల రద్దయిన నోట్లు జమ అయినట్టు ఇన్వెస్టిగేషన్ టీమ్ గుర్తించింది. వీటిని శాఖల వారు రూ.84 కోట్లను, సొసైటీలు రూ.85 కోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు తెలిసింది. కానీ నవంబర్ 10న బ్యాంకుల్లో జమైన మిగతా రూ.97 కోట్లకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు. దీంతో ఈ నగదుపై క్లారిటీ ఇవ్వాలని బ్యాంకు అధికారులను సీబీఐ ఆదేశించింది. పెద్ద నోట్లు రద్దుచేసినప్పటి నుంచి జిల్లా సహకార బ్యాంకులు మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నాయనే ఆరోపణలతో సీబీఐ ఈ రైడ్స్ నిర్వహించింది. అయితే బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేసే ప్రతి వ్యక్తికి ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడం తమ బాధ్యత కాదని, కానీ తాము కేవైసీ నిబంధనలను పాటిస్తున్నామని మలబార్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ మీనన్ చెప్పారు. కస్టమర్ల వివరాలను ఇన్వెస్టిగేషన్ టీమ్‌తో పంచుకుంటామన్నారు. అయితే కేవైసీ నిబంధనలు పాటించాలని తమకు ఆర్బీఐ దగ్గర్నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేన్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో పసికందు మాయం
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులే !
-
శాంతిచనున్న ప్రచండభానుడు
-
మరో ఐదు రోజులు వర్షాలు
సాధారణం కంటే తగ్గిన ఎండలు హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షద్వీప్ వరకు తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటం... కొన్నిచోట్ల ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదవుతున్నాయి. ఉపరితల ద్రోణి కారణంగా మరో 5 రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం డెరైక్టర్ వై.కె.రెడ్డి ఆదివారం విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. గత 24 గంటల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లా చింతకాని, నల్లగొండ జిల్లా కంపాసాగర్‌లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. సూర్యాపేట, అశ్వారావుపేటల్లో 4 సెం.మీ. వర్షం కురిసింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3 నుంచి 6 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణంగా 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా... 34 డిగ్రీలు మాత్రమే ఉంది. హైదరాబాద్, హకీంపేట్, మహబూబ్‌నగర్‌లలో 5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తారంగా వర్షాలు: రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో (శనివారం ఉదయం 8.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకూ) కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఆదివారం అత్యధికంగా 98.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 48 గంటల్లో జడివాన: కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా వచ్చే 48 గంటల్లో జడివాన లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. అండమాన్‌లో నైరుతీ రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీనివల్ల ఊహించిన విధంగానే ఈనెల 30వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళ చేరతాయని తెలిపారు. -
బైక్ ఆసరాతో బతికి.. ఐదు రోజుల తర్వాత బయటకు
కఠ్మాండు: పెను భూకంపం తాకిడికి దెబ్బతిన్న నేపాల్ శిథిలాల నుంచి చనిపోయిన వారి మృతదేహాలే కాదు.. కొన ఊపిరితో ఉన్నవారు కూడా బయటపడుతున్నారు. దాదాపు ఐదు రోజులు గడిచిన తర్వాత భారీ శిథిలాల కిందనుంచి గురువారం ఓ పద్దెనిమిదేళ్ల యువకుడిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. పెంబా తమాంగ్ అనే యువకుడు భూకంపం వచ్చిన సమయంలో కూలిపోయిన తొమ్మిది అంతస్థుల భవనం కింద పడిపోయాడు. భవనం కూలిన సమయంలో ఓ బైక్‌ను ఆసరాగా చేసుకొని దానికింద ఐదురోజులుగా ప్రాణాలు నిలుపుకున్నాడు. రోజువారిగా సహాయక చర్యలు చేపడుతున్నసిబ్బందికి దాహం దాహం అంటూ అతడి కేకలు వినిపించడంతో దాదాపు ఐదుగంటలపాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. అతడికి అక్కడక్కడా గాయాలయ్యాయి. -
నేటి నుంచి బొగ్గు కార్మికుల సమ్మె!
న్యూఢిల్లీ: కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్సీసీఎల్) కార్మికులు మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు సమ్మె బాట పడుతున్నారు. సమస్యల పరిష్కారానికి మంగళవారంనాడు ప్రభుత్వం ఒక సమావేశాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, కార్మికులు సమ్మెను ప్రారంభిస్తున్నారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ, హెచ్ఎంఎస్ కార్మిక సంస్థలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. బొగ్గు రంగం ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, కోల్ ఇండియా పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలను నిరసిస్తూ కార్మికులు సమ్మె బాట పడుతున్నారు. ప్రతిపాదిత సమ్మె వల్ల విద్యుత్ సంస్థల ఉత్పత్తికి ఎటువంటి విఘాతం రాకుండా, సరఫరాలను పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా బొగ్గు కార్మికుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు విద్యుత్ కార్మికుల సంఘం ఈఈఎఫ్‌ఐ ఒక ప్రకటనలో తెలిపింది. కోల్ ఇండియా సీఎండీగా భట్టాచార్య బాధ్యతలు... కోల్ ఇండియా పూర్తి స్థాయి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా సుతీర్థ భట్టాచార్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతక్రితం భట్టాచార్య సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీగా పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వంలో చేరేందుకు 2014 మే నెలలో ఎస్.నరసింగరావు రాజీనామా చేసిన నాటి నుంచి, ఈ సంస్థ అత్యున్నత స్థాయి పదవి ఖాళీగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం సీఐఎల్ బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 482 మిలియన్ టన్నులు (ఎంటీ). అయితే 462 ఎంటీలు మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. 2019 నాటికి బిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్య సాధన లక్ష్యం. లక్ష్యాలను సాధించడమే కొత్త సీఎండీ ముందున్న ప్రధాన సవాలని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
కోర్టు పనిగంటలు ముగిసే వరకూ నిల్చుండాలి
తాగి డ్రైవింగ్ చేసిన వ్యక్తికి ఢిల్లీ కోర్టు శిక్ష ఖరారు న్యూఢిల్లీ: తాగిన మైకంలో డ్రైవింగ్ చేసిన వ్యక్తికి కోర్టు పనిగంటల సమయం పూర్తి అయ్యే వరకూ నిలబడి ఉండాలనే శిక్ష విధించింది. ఇది ఐదు రోజుల పాటు కొనసాగుతోందని ఢిల్లీ కోర్టు సోమవారం పేర్కొంది. నగరంలో తాగిన మైకంలో వాహనాల నడపడం వల్ల ప్రాణాంతకమైన సంఘటలు చోటు చేసుకొంటున్నాయి. ఇవి రోజురోజుకూ నగరంలో తీవ్రమవుతున్నాయని పేర్కొంది. అదనపు సెషన్స్ జడ్జి మాని మల్హోత్రా కింది కోర్టు విధించిన శిక్షను సడలిస్తూ తీర్పు చెప్పారు. తాగిన మైకంలో వాహనాన్ని నడిపిన ఢిల్లీకి చెందిన అమిత్‌కుమార్‌కు 10 రోజుల జైలు శిక్ష, 1,000 జరిమానాను కింది కోర్టు విధించింది. అయితే శిక్షను మార్పు చేస్తూ 5 రోజుల పాటు కోర్టు పనివేళలు ముగిసే వరకూ నిలబడి ఉండే విధంగా మార్పు చేసింది. కింది కోర్టు తీర్పుపై నిందితుడు సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు పరిశీలించిన కోర్టు నిందితుడు ఇంటి యజమాని కావడంతో ఆ కుటుంబం ఆసరా కోల్పోతున్న దృష్ట్యా శిక్షను సడలించినట్లు జడ్జి పేర్కొన్నారు. నేటి నుంచి 21 వ తేదీ వరకూ కోర్టు పనివేళల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిందితుడు నిలబడి ఉండాలని, ఈ సమాచారాన్ని ప్రతిరోజు కోర్టు సిబ్బంది రికార్డును నమోదు చేస్తారని పేర్కొంది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం.. తాగిన మైకంలో మొదటి సారి తప్పుచేసిన వ్యక్తికి ఆర్నెళ్ల జైలు, రూ. 2,000 జరిమానా విధించాల్సి ఉంటుందని, కానీ కింది కోర్టు శిక్షను తగ్గించి విధించిందని జడ్జి తెలిపారు. నిందితుడు 114.3 ఎంజీ అల్కాహాలు సేవించి డ్రైవ్ చేయడం అతడి ప్రాణాలకే ముప్పు కాకుండా, రోడ్డు పై వెళ్లేవారికి కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇది తీవ్రమైందని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సెప్టెంబర్ 6వ తేదీ 2014 న నిందితుడు తాగిన మైకంలో డ్రైవింగ్ చేస్తూ ఎస్పీఎం మార్గంలో పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం కుమార్ తన నేరాన్ని కింది కోర్టులో ఒప్పుకొన్నాడు. ఈ మేరకు మోటార్ వాహనాల చట్టం ప్రకారం 10 రోజుల జైలు శిక్ష, రూ. 1000 జరిమానాను విధించిందని పేర్కొన్నారు. దీనిపై నిందితుడు సెషన్ కోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు తీర్పును సడలించింది.