సాక్షి, హైదరాబాద్: రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ నెల 22 వ తేదీన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించగా, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. ఉత్తర తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. కొమరం భీమ్, నిర్మల, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలల్లో వర్షాలు పడే అవకాశముంది.
ఉత్తర, ఈశాన్య మధ్య తెలంగాణ జిల్లాలకు వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌కు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉంది.. పగలు అంతా సాధారణ పరిస్థితి ఉన్న.. సాయంత్రానికి వాతావరణ మారుతుందని, యంత్రాంగాలను అలెర్ట్ చేశామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
చదవండి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మరోసారి షాకిచ్చిన కూతురు భవానీ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment