Yellow
-
మానుషి చిల్లర్ బెడ్రూం పోజులు.. డైమండ్ లాంటి నవ్వు (ఫొటోలు)
-
పసుపు చీరలో ముద్దబంతిలా మెరిసిపోతున్న కావ్య థాపర్ (ఫొటోలు)
-
ముంబైని మరోసారి ముంచెత్తనున్న భారీ వర్షాలు
ముంబై : మహరాష్ట్రకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండ్రోజుల క్రితం భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించి పోయింది. ఈ తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణ శాఖ ముంబైకి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బలమైన పశ్చిమ గాలుల కారణంగా శుక్రవారం ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఈ సందర్భంగా పాల్ఘర్, రాయ్‌గఢ్ పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.👉చదవండి : సీఎం సార్.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా -
తెలంగాణకు రెండురోజులు వర్ష సూచన
సాక్షి,హైదరాబాద్: మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బలపడింది.సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది.దీని ప్రభావంతో మంగళ,బుధ వారాల్లో తెలంగాణలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే చాన్సుందని వాతావరణ కేంద్రం తెలిపింది.గంటకు 40 నుంచి 50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కొమరంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ ,రంగారెడ్డి,వికారాబాద్,సంగారెడ్డి,మెదక్,కామారెడ్డి,మహబూబ్‌నగర్,నాగర్‌కర్నూల్,వనపర్తి,నారాయణపేట,జోగులాంబ గద్వాలకు భారీ వర్షసూచన ఉంది.దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇదీ చదవండి: రాష్ట్రంలో ప్రజారోగ్యం అస్తవ్యస్తం -
తెలంగాణ: మూడు రోజులు వర్ష సూచన.. ఎల్లో అలెర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు రోజు వర్షాలు కురవనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఆవర్థనం, ద్రోని కొనసాగుతోంది. ఆవర్థనం, ద్రోని కారణంగా రాష్టానికి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మరో ముడు రోజులు రాష్టానికి వర్ష సూచన ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.ఈరోజు ఆదిలాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందిరేపు కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. -
ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఢిల్లీలో భారీ వర్షం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఢిలీ, నోయిడాతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వాన పడుతోంది. దీంతో దక్షిణ ఢిల్లీలోని ఆర్కేపురం, దానికి సమీపంలోని ప్రాంతాల్లో వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.Early morning rain 🌧⛈️#delhirains pic.twitter.com/QsbDjbzmax— Deepak (@Deepak_020418) July 24, 2024 ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, మీరట్, బాఘ్పట్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ, సివిల్ లైన్స్, కాశ్మీరీ గేట్, సీలంపూర్, షహద్ర, వివేక్ విహార్, పటేల్ నగర్, రెడ్ ఫోర్ట్, ప్రీత్ విహార్, బుధ జయంతి పార్క్ , ప్రెసిడెంట్ హౌస్ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్లు ఐఎండీ ‘ఎక్స్’లో పేర్కొంది. ఇక.. గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27 డిగ్రీలు నమోదు అవుతోంది. #DelhiRains Heavy Raining near Laxmi Narayan Mandir (Birla Mandir), New Delhi. pic.twitter.com/xEuRGYsRAN— Pramod Kumar (@kumarpramod22) July 24, 2024ఇక.. సోమవారం ఒక్కసారిగా వాతావరణ మారిపోయి.. దట్టమైన మబ్బులు కమ్ముకొని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. Good Morning 😊 #delhirains pic.twitter.com/H1mFGpltT3— Yuvi 💫(Martyn)🇮🇳 (@martyn_spamfam) July 24, 2024 -
ఫ్యావరెట్ ఎల్లో లెహెంగాలో.. ‘శ్రీవల్లి’ లుక్స్ అదుర్స్ (ఫోటోలు)
-
అమ్మ బాబోయ్.. యాంకర్ రష్మీ అందాల అరాచకం చూశారా! (ఫోటోలు)
-
తెలంగాణను తాకనున్న భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..
-
Meena Durairaj: యెల్లో..యెల్లో..మీనా బ్యూటిఫుల్లో..! (ఫోటోలు)
-
రైల్వే స్టేషన్లలోని బోర్డులకు పసుపు రంగు ఎందుకు?
భారతీయ రైల్వే.. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్ కలిగివుంది భారతీయ రైళ్లలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. అలా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు పలు రైల్వే స్టేషన్లలో పసుపు రంగు బోర్డులు మనకు కనిపిస్తాయి. వాటిపై ఆ రైల్వే స్టేషన్ పేరు, సముద్ర మట్టానికి అది ఎంత ఎత్తులో ఉన్నదీ రాసివుంటుంది. అయితే రైల్వే సైన్ బోర్డులకు పసుపు రంగునే ఎందుకు వేస్తారో తెలుసా? దీని వెనుక గల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు రంగు ప్రత్యేకత ఏమిటంటే అది చాలా దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైలు స్టేషన్‌కు చేరుకోకముందే డ్రైవర్ దూరం నుండి పసుపు రంగును బోర్డును చూడగలుగుతాడు. తద్వారా అతనికి స్టేషన్ రాబోతున్నదని తెలుస్తుంది. ఇలా స్టేషన్ బోర్డు చూసిన తర్వాత రైలు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉంటారు. పసుపు రంగు అనేది సూర్యకాంతితో అనుసంధానమై ఉంటుంది. ఈ రంగును ఇతర రంగులతో పోలిస్తే ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రంగు చూపరుల మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీనికి తోడు పసుపురంగు బోర్డుపై నలుపు రంగులో రాసే అక్షరాలు దూరం నుండి స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కళ్లకు ఒత్తిడిని కూడా కలిగించదు. ఇదేవిధంగా విద్యాసంస్థల బస్సుల కూడా పసుపు రంగులో ఉండటాన్ని గమనించే ఉంటాం. దీనికి కారణం దూరం నుండి ఈ రంగు కనిపించడం. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తారు. రైలు లోకో పైలట్‌కు స్టేషన్‌కు సంబంధించిన పసుపురంగు బోర్డు కనిపించగానే హారన్ మోగిస్తాడు. దీంతో రైలులోని ప్రయాణికులు కూడా స్టేషన్ రాబోతున్న విషయాన్ని తెలుసుకోగలుగుతారు. -
ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్‌కు మరో ఆటంకం?
ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంతాలలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరాఖండ్‌లో రాబోయే మూడు రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. దీంతో అక్కడి సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు జరుగుతున్న సహాయక చర్యలపై ప్రభావం పడనుంది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. శ్రీనగర్‌తో పాటు ప్రదేశాలలో కనిష్ట ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయి కంటే తక్కువగా ఉంది. హిమాచల్‌లో ఆదివారం నుంచి వర్షం, మంచు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 26 నుండి ఉత్తరాఖండ్‌తో పాటు హిమాలయ ప్రాంతంలో మంచు కురవనుందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ బిక్రమ్ సింగ్ తెలిపారు. ఫలితంగా పర్వత ప్రాంతాలు మేఘావృతమై ఉంటాయి. సోమవారం ఉత్తరకాశీ, చమోలి, రుద్రప్రయాగ, పితోరాఘర్తో సహా 3500 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశాలు ఉన్నాయి. పహల్గామ్ కాశ్మీర్‌లోని అతి శీతల ప్రాంతం. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత -3.4 డిగ్రీల సెల్సియస్, శ్రీనగర్, గుల్మార్గ్లలో -1.0 డిగ్రీల సెల్సియస్. ప్రస్తుత శీతాకాలంలో శ్రీనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే దిగువకు వెళ్లడం ఇది రెండోసారి. జమ్మూలో కూడా తేలికపాటి సూర్యరశ్మి ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చాలా చలిగా ఉంటుంది. పగటిపూట కాస్త ఉపశమనం కలుగుతోంది. రానున్న 24 గంటల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో 25 స్వైన్ కేసులు -
ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
-
ఢిల్లీని కుదిపేస్తున్న కుంభవృష్టి.. 40 ఏళ్లలో ఇదే తొలిసారి..
ఢిల్లీ: ఎడతెరిపిలేని వర్షాలు దేశ రాజధానిని కుదిపేస్తున్నాయి. ఢిల్లీలో రెండో రోజూ భారీగా వర్షం కురుస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 153 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. గత 40 ఏళ్లలో ఒకే రోజులో ఈ స్థాయిలో వర్షం సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1982 జులైలో మొదటిసారి ఇంత భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమయ్యాయి. రానున్న మరో 2-3 రోజులపాటు తీవ్ర స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో దేశ రాజధానిలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు అధికారులు. #WATCH | Delhi wakes up to rain lashing several parts of the city; visuals from Mayur Vihar Phase II area pic.twitter.com/WVXuHMyR0E — ANI (@ANI) July 9, 2023 భారీ వానల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల మీద వరద నీరు చేరడంతో అండర్ పాస్‌లను అధికారులు మూసివేశారు. రానున్న నాలుగు, ఐదు రోజుల్లో జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం విశేషంగా కొనసాగుతోంది. పంజాబ్, హర్యానాల్లో ఊహించినదానికంటే ముందుగానే వచ్చాయి. పంజాబ్, హర్యానా, ఛండీగఢ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. వర్షాల కారణంగా ఢిల్లీలో ఇప్పటికే 15 ఇల్లు కూలిపోగా.. ఓ వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఢిల్లీలో భారీ వర్షం.. ఇండియా గేట్, నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్ -
తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 22 వ తేదీన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించగా, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. ఉత్తర తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. కొమరం భీమ్, నిర్మల, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలల్లో వర్షాలు పడే అవకాశముంది. ఉత్తర, ఈశాన్య మధ్య తెలంగాణ జిల్లాలకు వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌కు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉంది.. పగలు అంతా సాధారణ పరిస్థితి ఉన్న.. సాయంత్రానికి వాతావరణ మారుతుందని, యంత్రాంగాలను అలెర్ట్ చేశామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మరోసారి షాకిచ్చిన కూతురు భవానీ రెడ్డి -
Operation Kaveri: సూడాన్ నుంచి వచ్చిన వారిలో ఎల్లో ఫివర్
బనశంకరి: సూడాన్ నుంచి వెనక్కి వస్తున్న భారతీయులకు ప్రమాదకరమైన ఎల్లో ఫివర్ భయం పట్టుకుంది. సూడాన్ నుంచి ఇటీవల బెంగళూరుకు చేరుకున్న 362 మందిలో 45 మంది ఎల్లో ఫివర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. అధికారులు వీరిని బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్‌కు తరలించారు. చర్మం, కళ్లు పచ్చగా మారడం, జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, వాంతులు ఈ జ్వరం లక్షణాలు. పరిస్థితి విషమిస్తే 15 రోజుల్లో అంతర్గత రక్తస్రావం సంభవించి, అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఒక్కోసారి మరణానికి కూడా దారితీయవచ్చు. మరోవైపు, ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా సూడాన్ నుంచి మరో 365 మంది భారతీయులను శనివారం తీసుకువచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. దీంతో, ఇప్పటి వరకు 1,725 మంది స్వదేశానికి తరలించినట్లయిందని పేర్కొన్నారు. -
‘విజయ్‌కుమార్ స్వామి.. రామోజీ వియ్యంకుడి విమానంలోనే వచ్చారు’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కొన్ని పత్రికలు బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వంపైన, దేవుళ్లపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్లో మీడియా దుర్మార్గపు రాతలు ఎల్లోమీడియా పత్రికలు, ఛానెళ్లు విజయకుమార్ స్వామి గురించి రకరకాల కథనాలను ప్రచారం చేస్తున్నాయి. విజయకుమార్ స్వామిని లాబీయిస్టుగా పోలుస్తూ, లాబీయింగ్‌కు వాడుకుంటున్నామని దుర్మార్గమైన రాతలు రాస్తున్నారు. అంటే, స్వామిజీలను, దేవుళ్లను వారి స్వార్థ రాజకీయాలకు వాడుకునే దిగజారుడు కార్యక్రమానికి ఎల్లోమీడియాతో పాటు, ఆ పత్రికలు ఎవరినైతే కొమ్ముకాస్తున్నాయో వారే ఈ కథనాలను రాయిస్తున్నారనేది అందరూ గమనిస్తున్నారు. వీరి రాతల యొక్క ముఖ్య ఉద్దేశమేమంటే, జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నపళంగా దిగిపోవాలని కలలు కంటూ, చంద్రబాబును అర్జెంట్‌గా అధికారంలోకి తీసుకురావాలని.. ఆ తర్వాత దోచుకోవచ్చు, పంచుకోవచ్చనేది వారి ఆరాటంగా కనిపిస్తుంది. ఎల్లోమీడియా నీచమైన రాతల్ని ఖండిస్తున్నాం. ఆ ప్రత్యేక విమానం రామోజీ బంధువుదే కదా.. ఈ సందర్భంగా ఈ అంశంపై నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. అసలు విజయకుమార్ స్వామి ఎవరిద్వారా విజయవాడకు వచ్చారు..? ఇక్కడకు ఎందుకు వచ్చారు..? ఆయన ప్రత్యేక విమానంలో వచ్చారు కదా.. ఆ విమానం ఎవరిది..? ఆయన వచ్చిన విమానం రామోజీరావు బంధువు (వియ్యంకుడు) నవయుగ విశ్వేశ్వరరావుదే కదా.. ఆయనతో పాటు విశ్వేశ్వరరావు కొడుకు శశిధర్, విజయకుమార్ స్వామి ఉంది నిజం కాదా..? మరి మీరు.. మార్గదర్శి కేసుల నుంచి బయటపడేందుకే స్వామీజీని పిలిపించారా..? అసలు, రామోజీరావు బంధువు విమానంలో విజయకుమార్‌స్వామిని ఎందుకు ఇక్కడకు తెచ్చుకున్నారనేది మాకు తెలియదు. కానీ, ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు అందజేయడాన్ని.. లాబీయింగ్ అని పేరుపెట్టి అదే రామోజీ మీడియాలో కథనాలు రాయడం ఎంత దుర్మార్గమో అందరూ ఆలోచించాలి. అసలు, మీరు విజయకుమార్ స్వామిని విజయవాడకు ఎందుకు తీసుకొచ్చారు..?. మీ మార్గదర్శి కేసుల నుంచి బయట వేయించుకునే కార్యక్రమానికి తెచ్చుకున్నారా..?. ఇదే రామోజీరావు బంధువులు 2017–18లో హైదరాబాద్‌లో గృహప్రవేశం జరిగితే, విజయకుమార్‌స్వామి కూడా వచ్చారు. అప్పుడు కూడా నవయుగ విశ్వేశ్వరరావు, శశిధర్‌తో వచ్చారు కదా..? మరి, అప్పుడు ఎందుకు వచ్చారనుకోవాలి. - మీరు చేసేవన్నీ దైవకార్యాలనుకోవాల్నా..? దానికి సమాధానం చెప్పండి..? ఇంత నిసిగ్గుగా కథనాలు రాస్తారా..? ముఖ్యమంత్రికి స్వామీజీల ఆశీస్సులు ఇప్పిస్తే తప్పేంటి..? నాకు 2007 నుంచి విజయ్‌కుమార్ స్వామితో పరిచయం ఉంది. నాకు చాలామంది స్వామీజీలు తెలుసు. ఈ విజయకుమార్ స్వామి అంటే నాకు ప్రత్యేక గౌరవం ఉంది. ఆయన మంచి భక్తిపరులు. ఎల్లోమీడియా ప్రచురించినట్లు ఆ స్వామివారితో మాజీ రాష్ట్రపతులు, ప్రస్తుత రాష్ట్రపతితోనూ పరిచయాలున్నట్లు అందరికీ తెలిసిందే కదా.. ఆ విధంగా నాకున్న పరిచయంతో మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా కలపాలని తీసుకెళ్లాను. ముఖ్యమంత్రికి స్వామివారి ఆశీస్సులు ఉంటే రాష్ట్రానికి, ప్రజలకు మేలు కలుగుతుందని భావించాను. దానికోసమే నేను ఎంతోమంది స్వామీజీలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి కలిపిన సందర్బాలు అనేకం ఉన్నాయి. అందులో భాగంగానే చినజీయర్‌స్వామిని, స్వరూపానంద స్వామివారిని, మంత్రాలయం రాఘవేంద్ర మఠం స్వాములను, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, కనదుర్గమ్మ దేవస్థానం వేదపండితుల్ని పిలిపించి ఆశీర్వచనాలు ఇప్పించాను. విజయకుమార్ స్వామి గారు విజయవాడకు వస్తున్నారని తెలిసి.. నేను ప్రత్యేకంగా ఆయన్ను రిక్వెస్టు చేసిన మీదట వారు అందుకు అంగీకరించారు. నేను ఆరోజు విజయవాడలో లేనప్పటికీ, ఏర్పాట్లు అన్నీ చేయడంతో స్వామివారు వచ్చి ముఖ్యమంత్రికి ఆశీస్సులు అందించి వెళ్లారు. మీకైతే ఆశీస్సులు.. మాకైతే లాబీయింగా..? స్వామీజీలపై వాళ్లకు నమ్మకం ఉందో లేదో మాకు తెలియదు. మాకైతే పూర్తిగా నమ్మకం ఉంది. ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి, ప్రజలకు మేలు కలుగుతుందనే నమ్మకంతోనే.. మేం స్వామీజీల ఆశీస్సులు తీసుకుంటాం. మేమేదో లాబీయింగ్ చేస్తున్నామంటున్నారు కదా.. మరి, ఈ రామోజీరావులాంటి వాళ్లు ఏం చేయడానికి విజయకుమార్ స్వామిని రప్పించుకున్నారు. మేము స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే.. దానికి లాబీయింగ్ అని పేరెట్టి దుర్మార్గపు రాతలు రాస్తారా..?. అదే, మీ కోసం స్వామీజీలు వస్తే.. దానికి దైవాశీస్సులు అని పేరుపెట్టి చెప్పుకుంటారా..?. ఎల్లో మీడియా వక్రభాష్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుంది. ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టకముందే.. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోండి. విజయకుమార్ స్వామి వారు చాలా సింపుల్‌గా ఉండే వ్యక్తి. ఎవరి అవసరాలకు తగ్గట్టు వారు ప్రత్యేక విమానాల్లో ఆయన్ను తెచ్చుకుంటూ ఉంటారు గానీ అది మాకు సంబంధంలేదు. ఆయన మైసూరులో ఉంటారు. 2007 నుంచి ఆయనపై నమ్మకంతో నేను కలుస్తూ ఉంటాను. విజయకుమార్ స్వామి వారంటే ఒక దైవాంశసంభూతులుగా మాకు నమ్మకం. కనుక, ఎల్లోమీడియాకు చెందిన ఒక పత్రిక రాసిందని, తర్వాతి రోజు మరో పత్రిక కథనాలు రాయడాన్ని ఖండిస్తున్నాను. రాజకీయలబ్ధి కోసం నీచకార్యక్రమాలకు పాల్పడవద్దని ఎల్లోమీడియా పత్రికలకు, టీడీపీ నేతలకు హితవు పలుకుతున్నాను. వ్యక్తుల టార్గెట్ గా దర్యాప్తు వివేకానందరెడ్డి హత్యకేసులో ఒక పక్షపాత ధోరణితో సీబీఐ విచారణ జరుగుతున్నట్లు కొన్ని ఆధారాలు, పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ముందునుంచీ అవినాశ్‌రెడ్డి చెప్పే వాదనలను సీబీఐ పట్టించుకోకపోవడం.. ఎల్లోమీడియా కథనాల ప్రకారం సీబీఐ నడుస్తుందనే అభిప్రాయం ఉంది. ఇది కళ్లముందు జరుగుతున్న వాస్తవం. రాజకీయకోణంలో ఒకరిద్దరు వ్యక్తుల్ని టార్గెట్ చేసినట్లే సీబీఐ వ్యవహరిస్తుందనేది ఇప్పటికే అవినాశ్‌రెడ్డి కోర్టు దృష్టికి కూడా తెచ్చారు. ఏదిఏమైనా ఈ కేసులో నిజనిజాలు నిగ్గుతేలాలి. న్యాయవ్యవస్థపై మాకు పూర్తిగా నమ్మకం ఉంది. చదవండి: మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు -
తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యాయి. తూర్పు విదర్భ నుంచి ఉత్తర కోస్తా కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని యెల్లో అలెర్ట్ ద్వారా వాతావరణ శాఖ తెలిపింది. సిద్దిపేట రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యాయ్యి. ద్రోణి ప్రభావంతో.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగండ్ల వానకు సైతం ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే.. మిగతా ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ నమోదు కావొచ్చని, హైదరాబాద్‌లో మాత్రం 34-38 మధ్య నమోదు కావొచ్చని తెలిపింది. హైదరాబాద్‌లోనూ వర్ష ప్రభావం ఉండొచ్చని తెలిపింది. -
ఐఫోన్ ఎల్లో వేరియంట్‌పై భలే డిస్కౌంట్!
మనలో చాలా మందికి ఐఫోన్లంటే బాగా క్రేజ్. ప్రతి ఒక్కరూ ఐఫోన్ కొనాలని కలలు కంటారు. కానీ వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో కొనలేకపోతుంటారు. అయితే పలు ఐఫోన్ మోడళ్లపై ఇటీవల భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వీటిని గరిష్టంగా ఉపయోగించుకుంటే తక్కువ ధరకే కలల ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇదీ చదవండి: Realme C33 2023: తక్కువ ధరలో రియల్మీ ఫోన్లు... కిర్రాక్ ఫీచర్లు! ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లు గతేదాది ఐదు రంగుల్లో విడుదలైంది. మళ్లీ ఈ మధ్య మరో కలర్ వేరియంట్‌ను యాపిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే ఎల్లో వేరియంట్. యాపిల్ డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన రెడింగ్టన్ ఐఫోన్ 14 సిరీస్ ఎల్లో వేరియంట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లపై రూ.15,000 వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది. స్టోర్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, పాత ఐఫోన్ల ఎక్సేంజ్ ద్వారా ఈ తగ్గింపు లభిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా ఈ తగ్గింపులు పొందవచ్చు. ఇదీ చదవండి: 100 సీసీ హోండా షైన్ వచ్చేసింది! ధర దాని కంటే తక్కువే.. ఈ ఐఫోన్ 14 ఎల్లో వేరియంట్ మార్చి 10 నుంచి ప్రీ ఆర్డర్ కోసం అందుబాటులోకి వచ్చింది. మార్చి 14 నుంచి రిటైల్ స్టోర్లలో విక్రయిస్తున్నారు. ఐఫోన్ 14 ఎల్లో వేరియంట్ ధర రూ. 79,990. ఐఫోన్ 14 ఎల్లో వేరియంట్ ప్లస్ ప్రారంభ ధర రూ. 89,990. అయితే ఇందులో రంగు తప్ప ఎటువంటి అప్డేట్లు ఇవ్వలేదు. 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, A15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. ఇక ఐఫోన్ 14 ప్లస్‌లో 6.7 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఇందులో మూడు వేరియంట్లు 128జీబీ స్టోరేజ్ 6జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ 6జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ 6జీబీ ర్యామ్ అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: మూత పడనున్న మరో బ్యాంక్? భారీగా పతనమైన షేర్లు.. -
నయా కలర్ ఆప్షన్.. ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్!
మార్కెట్లో 'ఐఫోన్స్'కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఇందులో కస్టమర్లు ఆధునిక ఫీచర్స్ ఉన్న వాటిని మాత్రమే కాకుండా, లేటెస్ట్ కలర్ ఆప్షన్ కూడా ఎంపిక చేసుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇప్పుడు ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మొబైళ్లను కొత్త ఎల్లో కలర్ ఆప్షన్లో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు పింక్, వైట్, గ్రే మొదలైన కలర్స్‌లో అందుబాటులో ఉన్న ఐఫోన్స్ రానున్న రోజుల్లో 'ఎల్లో' ఆప్షన్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 14 సిరీస్ నయా కలర్ పొందుతున్నట్లు జపాన్‌కు చెందిన బ్లాగ్ మ్యాక్ఒటాకర వెల్లడించింది. (ఇదీ చదవండి: సుజుకి జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్: కేవలం 300 మందికి మాత్రమే!) గతంలో ఎల్లో కలర్ అనేది ఐఫోన్ 11 సిరీస్‌లో ఉండేది. అయితే నాలుగేళ్ల తరువాత కంపెనీ మళ్ళీ ఐఫోన్ 14లో ఈ కలర్ తీసుకురావాలని సంకల్పించింది. అయితే ఈ కొత్త కలర్ ప్రొడక్ట్ ప్లానింగ్ వచ్చే వారంలో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఐఫోన్ 13కి గ్రీన్ కలర్ అందించింది. నిజానికి యాపిల్ కంపెనీ సెప్టెంబర్ నెలలో కొత్త సిరీస్ మొబైల్స్ లాంచ్ చేస్తుంది. ఆ తరువాత సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఆ సిరీస్‌లో కొత్త కలర్ వేరియంట్లను ప్రవేశపెడుతుంటుంది. 2022 మార్చిలో కంపెనీ ఐఫోన్ 13 సిరీస్‌కు గ్రీన్ కలర్, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ ఫోన్లకు 2021 ఏప్రిల్‌లో పర్పుల్ కలర్ ఆప్షన్ అందించింది. కొనుగోలుదారులను ఆకర్శించడానికి కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కలర్స్ విడుదల చేస్తుంది. -
కుప్పంలో పచ్చ బ్యాచ్ వీరంగం
-
HYD: హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, యూసఫ్‌గూడ, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, ఉప్పల్, బోడుప్పల్, బేగంపేట్, సికింద్రాబాద్, ఆల్వాల్.. ఇలా చాలా చోట్ల సోమవారం పొద్దుపొద్దున్నే చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వాన పడుతోంది. ఆకాశం భారీగా మేఘావృతం అయి ఉండడంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. దసరా సెలవుల తర్వాత విద్యాసంస్థలు మొదలు అవుతుండడం, మరోవైపు ఆఫీస్ వేళలు కావడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం సైతం ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. శనివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం.. నగరాన్ని ముంచెత్తింది. అయితే ఆదివారం కాస్త ఉపశమనం ఇవ్వడంతో వరుణుడి గండం తొలగిందని అంతా అనుకున్నారు. అయితే.. మరో రెండు రోజులపాటు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్ష ప్రభావం కనిపిస్తోంది. కామారెడ్డి, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
ఈ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షం.. వాతావరణ శాఖ వార్నింగ్!
కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు, తెలంగాణలో సైతం ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. కాగా, రాగల మూడు రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇందులో భాగంగా, శుక్రవారం వరకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. మరోవైపు.. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొమురంభీమ్ ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. pic.twitter.com/Zgzs9NCqwN — IMD_Metcentrehyd (@metcentrehyd) September 29, 2022 -
పసుపు పుచ్చకాయలు.. ఇకపై మన దేశంలోనే!
సాక్షి, అమరావతి: వేసవి తాపాన్ని తీర్చే.. రుచికరమైన.. అందరూ ఇష్టంగా తినే ఫలాలలో ఒకటి పుచ్చకాయ. అయితే పుచ్చకాయ ఎలా ఉంటుంది అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు? ఆకుపచ్చ చారలుండే తొక్క, లోపల ఎరుపు/గులాబీ రంగు గుజ్జు, అందులో నల్లటి విత్తనాలు.. అనే కదా. కానీ ఈ ‘వెరైటీ’ పుచ్చకాయలో మాత్రం గుజ్జు పసుపు పచ్చ రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. అయితే, అది సహజ సిద్ధమైన రంగేనా? లేక రసాయనాలు వాడతారా? అంటే నూటికి నూరుపాళ్లు సహజసిద్ధంగా వచ్చిన రంగే అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విత్తన తయారీ సంస్థలు. అంతేకాదు.. ఆకుపచ్చ తొక్క, ఎరుపు, గులాబీ, పసుపు రంగు కండతో విత్తనాలు లేని (సీడ్ లెస్) పుచ్చకాయలు కూడా త్వరలో మార్కెట్‌కు రానున్నాయని వివరిస్తున్నారు. పసుపు రంగు ఎలా వస్తుందంటే.. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో 1,200కి పైగా పుచ్చ రకాలున్నాయి. వాటిల్లో పసుపు రంగు కాయ ఒకటి. ఈ పసుపు పుచ్చకాయలు కూడా ఎరుపు/గులాబీ రంగు కాయల మాదిరిగానే ఆకుపచ్చ చారలతో ఉంటాయి. లోపల కండ మాత్రం పసుపు రంగులో ఉంటుంది. పసుపు పుచ్చకాయల్లో లైకోపీన్ అనే పదార్థం ఉండదు కనుక అవి ఎప్పుడూ ఎర్రటి రంగును తీసుకోవని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. చిత్రమేమిటంటే పసుపు పుచ్చకాయల సాగు ఎరుపు/గులాబీ పుచ్చ కంటే ముందు నుంచే ఉంది. ఇదో సంకర విత్తనం. ఆఫ్రికా నుంచి వచ్చింది. సంప్రదాయ పుచ్చకాయలకు ఇదో ప్రత్యామ్నాయం. పర్పుల్ కాలే, ఆరెంజ్ కాలీఫ్లవర్, బ్లూ బంగాళాదుంపలు మాదిరే ఇదీనూ. ఎల్లో గోల్డ్–48 రకం విడుదల.. రెండేళ్ల క్షేత్రస్థాయి ప్రయోగాలు, పరిశోధనల అనంతరం దేశంలో పసుపు పుచ్చ రకాన్ని మార్కెట్‌కు వాణిజ్యపరమైన వినియోగం కోసం విడుదల చేస్తున్నట్టు జర్మనీకి చెందిన బేయర్ కంపెనీ ప్రకటించింది. ఎల్లో గోల్డ్–48 పేరిట మార్కెట్లో ఈ విత్తనం దొరుకుతుంది. దేశంలో విడుదలైన తొలి పసుపు పుచ్చ వంగడం ఇదే. అత్యున్నత జెర్మీప్లాసమ్ నుంచి ఈ వంగడాన్ని అభివృద్ధి చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పంట ప్రయోగాలు నిర్వహించిన అనంతరం దీన్ని మార్కెట్‌కు విడుదల చేశారు. దీంతో పాటు డిజర్ట్ కింగ్ ఎల్లో, ఎల్లో డాల్, బటర్‌కప్, ఎల్లో ఫ్లెష్‌బ్లాక్ డైమండ్ వంటి రకాలను పేరున్న విత్తన కంపెనీలు ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు విడుదల చేస్తున్నాయి. ‘సేంద్రీయ’ సాగు చేస్తే మంచి లాభాలు.. ఎల్లో గోల్డ్–48 అధిక దిగుబడి ఇచ్చే వంగడం. తెగుళ్లను, ఇతర క్రిమికీటకాలను తట్టుకుంటుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య సాగు చేయవచ్చు. ఏప్రిల్ నుంచి జూలై వరకు దిగుబడి వస్తుంది. పంట కాలం గరిష్టంగా నాలుగు నెలలు. కాయ తియ్యగా, తేనె లాంటి రుచిని కలిగి ఉంటుంది. పోషక విలువలూ ఎక్కువే. పుచ్చ వేసవి కాలపు పంటే అయినా ఇప్పుడు అన్ని కాలాలలోనూ సాగు చేస్తున్నారు. పసుపు పుచ్చను సేంద్రీయ పద్ధతిలో సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు. రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఈ రకాన్ని సాగు చేసేందుకు ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నారు. -
టీడీపీ ఆగడాలు: పంచాయతీ భవనాలకు ‘పచ్చ’ రంగు
పర్చూరు: అధికార పక్షంలో ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వ పథకాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ‘పచ్చ’ రంగులు వేసుకొని తరించిన నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలోను వారి ఆగడాలు ఆగడం లేదు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామ సర్పంచ్‌గా 26 ఓట్ల మెజార్టీతో టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. దీంతో ఆ పార్టీ నేతలు ఏకంగా పంచాయతీ కార్యాలయానికి గురువారం పచ్చ రంగు వేసేశారు. విషయం తెలుసుకున్న పంచాయతీ సెక్రటరీ శుక్రవారం పచ్చ రంగును తొలగించి తెలుపు రంగు వేయించారు. ఏడుగుండ్లపాడులో.. ఒంగోలు: సచివాలయాలకు పార్టీ రంగులు వేస్తున్నారంటూ తెలుగుదేశం నేతలు నానా యాగీ చేసి కోర్టును ఆశ్రయించారు. కానీ ప్రస్తుతం మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో టీడీపీ మద్దతుదారు సర్పంచ్‌గా గెలుపొందడం, శనివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందంటూ టీడీపీ నేతలు గ్రామ సచివాలయం బోర్డుకు పసుపు రంగులు వేశారు. చదవండి: బాబు వ్యూహం.. కేశినేనికి చెక్! బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం! -
కోల్‌కతా నగర వీధుల్లోకి ఎల్లో టాక్సీలు
కోలకతా(పశ్చిమ బెంగాల్): తిరిగి తమ సేవలను అందించేందుకు ఎల్లో టాక్సీలు సోమవారం నుంచి కోల్‌కతా నగర వీధుల్లోకి రానున్నాయి. అయితే మీటరుపై ప్రస్తుతం ఉన్న ఛార్జీల కంటే 30 శాతం పెంచినట్లు బెంగాల్ టాక్సీ అసోసియేషన్(బీటీఏ) కార్యదర్శి బిమల్ గుహా శుక్రవారం వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ సీనియర్ అధికారులు గురువారం సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎల్లో టాక్సీల ప్రస్తుత రేటు కంటే మీటర్ రీడింగులపై 30 శాతం పెంపును అధికారులు ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. (లాక్డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం) ఇక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గరిష్టంగా ఇద్దరు ప్రయాణికులను మీటర్ టాక్సీల్లో ఎక్కడానికి అనుమతిస్తామని, వారు వెనుక సీట్లో కూర్చోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. కాగా కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడవ దశ లాక్డౌన్ ముగిసిన తరువాత నగరంలో టాక్సీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ విధించినప్పటీ నుంచి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని టాక్సీలు మాత్రమే నగరంలో ప్రయాణించడానికి ప్రభుత్వం అనుమతించిందన్నారు. ఇక మే 18 నుంచి చార్జీల పెంపుతో ఎల్లో టాక్సీలు సేవలు అందించనున్నాయని ఆయన వెల్లడించారు. -
ముఖమా! ముత్యమా!
మార్చి, ఏప్రిల్, మే.. మూడు నెలలు ఎండలు దంచి కొట్టాయి. రోట్లో స్వయానా మనమే ఎండు మిరపకాయలు దంచి కొట్టినా ఇంతగా మంటెత్తిపోదేమో. ప్రచండుడు ప్రతాపం చూపించాడు. రెండు మూడు రోజుల్లో రుతు ³వనాలు అంటున్నారు. వానలే వానలు. సంతోషమే కదా. భూమి చల్లబడుతుంది. మన ఇళ్లూ, ఒళ్లూ చల్లబడతాయి. అయితే ఇన్నాళ్లూ ఎండలకు ఛాయ తగ్గిన మోము మాటేమిటి? మెల్లిగా మునుపటి మెరుపులోకి తెచ్చుకోవలసిందే. అయితే అందుకోసం గొడుగు వేసుకుని సూపర్ బజార్‌కి పరుగెత్తే పని లేదు. ఇంట్లో ఉండి, ఇంట్లో ఉండేవాటితో ముఖ కాంతిని చల్లని చంద్రకాంతిలా వెలిగించుకోవచ్చు. ‘ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేల్ తలపెట్టవోయ్’ అంటున్నారా.. ఇంటి క్రీమ్‌లు అనగానే! క్రీమ్‌లు కావివి. కీర దోసకాయలు, బేసన్ ఫ్లోర్.. (సెనగపిండి), పసుపు, పెరుగు, తేనె, నిమ్మ, పాలు. అంతే! అన్నిటినీ కలిపి ముఖానికి టచింగ్ ఇవ్వమనడం లేదు. కాంబినేషన్లతో మూడు రకాలుగా ప్రయోగిస్తే చాలు. వా..డా..య్.. అంటూ మీ ముఖంలోకి కాటుక లేని అందమైన చంద్రముఖి వచ్చేస్తుంది. దోస్కాయ్ తీస్కోండి దోసంటే కీర దోస. రౌండ్‌గా చక్రాల్లా కొయ్యండి. రౌండ్‌గా ఎలా కొయ్యాల్రా దేవుడా అని కంగారు పడకండి. కళ్లు మూసుకుని కోసినా.. కీర చక్రాలు చక్రాలుగానే వస్తుంది. ఆ చక్రాలను కళ్ల మీద పెట్టుకోనవసరం లేదు. మెల్లిగా ముఖమంతా రుద్దండి. ఒకే చక్రాన్ని కాదు. ముఖానికంతటికీ చాలినన్ని చక్రాలు. ఇప్పుడు ముఖమంతా కీరా అయింది కదా. అదే.. కీరా రుద్దడంతో తడితడిగా అయింది కదా. ఆ తడిని పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయండి. వెంటనే మెరిసిపోతుందా ముఖం?! మెరుపు కనిపిస్తుంది.. మంచి మెరుపు కోసం వారానికి రెండుసార్లైనా కీరాను కొయ్యాల్సిందే. సెనగ ప్యాక్ వేస్కోండి కీరాతో రుద్ది కడిగాక సెనగ ప్యాక్ వెయ్యమని కాదు. అది వేరు. ఇది వేరు. ఇదింకో టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనే మాట బాగోలేదా! అయితే సౌందర్యసాధనం అందాం. రెండు టేబుల్స్పూన్ల సెనగ పిండి తీసుకోండి. బజ్జీలు వేసే సెనగపిండే. ఇక రెండు టేబుల్స్పూన్లంటే రెండు రెండు చిన్న కూరగరిటెలంత. టీస్పూన్ లెక్క వేరు. కాఫీని, టీని కలపడానికి ఉపయోగించే స్పూన్ టీస్పూన్. సరే, ఇవి మీకు తెలియనివా కానీ, ఇప్పుడేం చేస్తారంటే సెనగపిండిలో టీ స్పూను పసుప్పొడి కలపండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ పెరుగు వెయ్యండి.మూడింటినీ మిక్స్ చెయ్యండి. బాగా పేస్ట్‌లా వచ్చేయాలి. ఆ పేస్ట్‌ని బ్రష్‌తో ముఖానికికంతటికీ అద్దండి. మళ్లీ ఈ బ్రెష్ ఎక్కడి నుంచి తేవాలి! ఫేస్‌ప్యాక్ బ్రెష్ అని బయట అమ్ముతారు కానీ.. అక్కర్లేదు, వేళ్లతో మృదువుగా ముఖానికి పామేయండి. అదంతా ఆరిపోయేవరకు ఆగి, ఆ తర్వాత శుభ్రంగా కడిగేయండి. చల్లని నీళ్లతోనే. ముఖం తళతళ. మార్పు ఇమ్మీడియెట్‌గా కనిపిస్తుంది. తేనె, నిమ్మ రాస్కోండి రెండు చిన్నగరిటెల తేనె, ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి. మంచి వాసనొస్తుంది. తినబుద్ధవుతుంది. తినకండి. మనం పెట్టుకున్న పని వేరే కదా. ఆ సెషన్ (తినే సెషన్) మరోసారెప్పుడైనా పెట్టుకుందాం. ఇప్పుడైతే ముఖానికి పూసుకోండి. పావు గంట తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.ఈ మూడు ట్రిక్లలో (మీ ముఖం ఎలా ఇంతగా మెరిసిపోతుంది అని అడిగినవారికి చెప్పకపోతే అది ట్రిక్కే కదా).. ‘చల్లటి నీరు’ అనే మాట కనిపించింది కదా. చల్లటి నీరు అంటే ఫ్రిజ్‌లోని వాటర్ కాదు. ముఖానికి హాయినిచ్చేంత చల్లగా ఉండే నీరు. ఎటూ వర్షాలు మొదలై వాతావరణ చల్లబడబోతోంది కాబట్టి ట్యాంకులోని నీళ్లు, తొట్లలోని నీళ్లు, బిందెల్లోని నీళ్లు చల్లగానే ఉంటాయి. అవి చాలు. ఓ మగ్గు నీటితో మెరిసేయొచ్చు.. ఒకవేళ వర్షాలొచ్చినా.. మీ కాలనీలో నీళ్లు రాకపోతుంటే.గుర్తుంచుకోండి.. ఈ మూడు ఒకేసారి, ఒకే రోజు చేయవలసినవి కాదు. మీ మూడ్‌ని బట్టి, మీ టైమ్‌ని బట్టి, కిచెన్‌లో మీకు అందుబాటులో ఉన్నవాటిని బట్టి ఏదో ఒకటి ఎంచుకుని చెయ్యండి. ఇంకో రోజు ఇంకోటి.. తర్వాత ఇంకోటి.. ఇలా!వెలిగిపోతున్న మీ ముఖాన్ని చేసి, అంత కాంతిని భరించలేక సూర్యుడే తన కళ్లకు చెయ్యడ్డు పెట్టకోవాలి. దెబ్బకు దెబ్బ తియ్యకుండా ఊరుకుంటామా మరి. -
కడప పసుపు @ తూములూరు
కొల్లిపర: వైఎస్సార్ కడప జిల్లా నుంచి కొల్లిపర మండలంలోని తూములూరు గ్రామానికి పసుపు విత్తనం దిగుమతులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు పది వేల పుట్ల వరకు మేలురకం విత్తనం దిగుమతి చేసుకున్నారు. జూన్ చివరి నుంచి గ్రామంలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. పుట్టి సుమారు రూ.4000 వరకు పలికే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొల్లిపర మండలంలోని రైతులు వైఎస్సార్ కడప జిల్లా నుంచి పసుపు విత్తనాన్ని దిగుమతి చేసుకుని ఇక్కడి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. పసుపు విత్తన క్రయవిక్రయాలకు తూములూరు గ్రామం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. 35 ఏళ్లుగా కడప జిల్లాలో పండిన పసుపును విత్తనం నిమిత్తం తూములూరు గ్రామానికి తెచ్చి విక్రయిస్తున్నారు. ఏటా 17 వేల నుంచి 18 వేల పుట్ల వరకు వచ్చి పసుపు విత్తనం గ్రామానికి దిగుమతి అవుతుంది. ఒక పుట్టికి 225 కిలోలు ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఒడిశా నుంచి రైతులు ఇక్కడ వచ్చి కొనుగోలు చేస్తారు. నాణ్యమైన విత్తనంతో పాటు సరైన కాటా, నమ్మకం ఉండటంతో విత్తనం అమ్మకానికి మార్కెట్ ఏర్పడింది. పసుపు వ్యాపారానికి ప్రతి ఏటా కాటా పాట జరుగుతుంది. దీనికి సంబంధించిన రాబడి గ్రామ పంచాయతీకి చెల్లిస్తారు. దీని ద్వారా గ్రామంలో 250 మందికి మూడు నెలలు పాటు ఉపాధి లభిస్తోంది. పసుపు విత్తనంలో రకాలు.. పసుపు విత్తనంలో పలు రకాలు ఉన్నాయి. టేకూరుపేట, బాక్రాపేట, సేలం, సుగంధ, కడప, ప్రగడవరం వంటి రకాలు ఇక్కడ దిగుమతి అవుతాయి. ప్రగడవరం రకం ఏలూరు, ద్వారకాతిరుమల ప్రాం తాల్లో, సుగంధ రకం జిల్లాలోని పల్నాడు, కృష్ణా జి ల్లా నందిగామ ప్రాంతాలకు ఎగుమతి అవుతా యి. సేలం రకం లంక గ్రామాలతో పాటు కొల్లిపర మం డల పరిసర ప్రాంతాల్లో విస్తారంగా పండిస్తారు. నాలుగేళ్లుగా నిరాశే.... గత నాలుగేళ్లుగా ఎండు పసుపుకు గిట్టుబాటు ధర లేక పోవటంతో రైతుల్లో ఆసక్తి కొరవడింది. కౌలు ఎకరాకు రూ.50 వేలకు ఉండడం, కూలీ రేట్లు, ఎరువుల ధరలు ఆమాంతం పెరగటంతో రైతులు పసుపు సాగు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. గతేడాది కడప వ్యాపారస్తులు 17 వేల పుట్లు నిల్వ ఉంచగా, ఆశించిన ధర పలకకపోవడంతో నష్టాలను చవిచూశారు. ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లో ఎండు పసుపు ధర రూ.5,500 పలికింది. ప్రస్తుతం మోడల్ ధర రూ.5 వేలు ఉంది. ప్రస్తుతం కడపలో క్వాలిటీని బట్టి పుట్టు రూ.3 వేల నుంచి రూ.4,500 ధర పలుకుతోంది. కడప విత్తనానికి గిరాకీ.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రైతులు విత్తన మా ర్పిడికి వైఎస్సార్ కడప జిల్లాలో పండిన పసుపు ను వాడతారు. దీంతో క డప పసుపు విత్తనానికి గిరాకీ ఉంది. గిట్టుబాటు ధర, అన్ని సౌకర్యాలు ఉండటంతో ఇక్కడ క్రయవిక్రయాలకు ఆసక్తి చూపుతాం. మహారాష్ట్ర సాంగ్లీ ప్రాంతంలో పసుపు కాయలను, ఇక్కడ పసుపు కొమ్ములను విత్తనంగా సాగు చేస్తారు. కొమ్ముల ను ఇక్కడికి, కాయలను సాంగ్లీకి ఎగుమతి చేస్తాం.-ఎ.సుబ్బన్న, రైతు, మైదుకూరు, కడప జిల్లా -
పసుపుతో జ్ఞాపకశక్తికీ మేలే!
పసుపులోని కర్కుమిన్ పదార్థం జ్ఞాపకశక్తిని పెంచేందుకు మాత్రమే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు దోహదపడుతుందని అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు. మతిమరుపు లేని... ఈ లక్షణాలతో కూడిన వ్యాధి అయిన అల్జైమర్స్ రోగులపై జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ అంచనాలకు రాగలిగామని శాస్త్రవేత్తలు చెప్పారు. భారతీయుల్లో అల్జైమర్స్ వ్యాధిగ్రస్తులు తక్కువగా ఉండేందుకు పసుపు వాడకం ఒక కారణం కావచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ గారీ స్మాల్ తెలిపారు. పరిశోధనల్లో భాగంగా తాము 50 –90 ఏళ్ల మధ్య వయసువారికి రోజూ 90 మిల్లీగ్రాముల కర్కుమిన్ రెండు సార్లు ఇచ్చామని.. కొందరికి ఉత్తుత్తి మాత్రలు ఇచ్చామని చెప్పారు. దాదాపు 18 నెలలపాటు కర్కుమిన్ అందించిన తరువాత వారి మెదడు పనితీరుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించామని.. ఆ తరువాత ఆరు నెలలకు ఒకసారి ఇవే పరీక్షలు నిర్వహించామని వివరించారు. ఫలితాలను పరిశీలించినప్పుడు కర్కుమిన్ తీసుకున్న వారి జ్ఞాపకశక్తి పెరిగినట్లు.. ఉత్తుత్తి మాత్రలు తీసుకున్న వారిలో లేనట్లు తెలిసిందని అన్నారు. అంతేకాకుండా కర్కుమిన్ తీసుకన్న వారి మూడ్‌లోనూ ఎన్నో సానుకూల మార్పులు కనిపించాయని చెప్పారు. మరింత విస్త్తృత స్థాయి పరిశోధనలు నిర్వహించడం ద్వారా ఈ ఫలితాలను ధ్రువీకరించుకుంటే.. జ్ఞాపకశక్తిని పెంచేందుకు పసుపు ఓ మంచి ఆయుధం కాగలదన్నమాట! -
కేంద్ర పథకానికి పచ్చ రంగు
వ్యవసాయ కూలీలు పనుల సమయంలో ఖాళీగా లేకుండా, పనుల కోసం వలస పోకుండా తమ ప్రాంతాలలోనే పనులు చేసుకొని ఉండాలన్న ఉద్దేశంతో గతంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలులోకి తెచ్చింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు రాజకీయ రంగు పూసి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుంది. పథకాల అమల్లో లోపాలుంటే మాత్రం దాన్ని అమలు చేసే వారిపై నెడుతుంది. రామభద్రపురం: కేంద్ర పథకాలకు రాష్ట్రంలో అధికార తెలుగుదేశం ప్రభుత్వం తమ రంగు వేస్తూ ప్రయోజనం పొందేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఉపాధి హామీ జాబ్ కార్డులను పూర్తిగా పసుపు రంగుతో ముద్రించి జారీ చేసింది. తెలుగుదేశం ప్రచార కార్డులుగా పసుపు రంగుతో ముద్రించిన జాబ్‌కార్డులను ఇప్పటికే జిల్లాలోని ఏపీఓలు క్షేత్ర స్థాయి అధికారులకు అందజేశారు. వీటిని జన్మభూమి గ్రామ సభలలో ఉపాధి హామీ వేతనదారులకు అందజేస్తున్నారు. జిల్లాలో 5,03,038 జాబ్‌కార్డులుండగా, సుమారుగా 11 లక్షలు వేతనదారులున్నారు. వారిలో 3,50,000 పైబడి జాబ్‌కార్డుదారులు పనులుకు వెళ్తున్నట్టు సమాచారం. వీరికి గతంలో మాదిరిగా కాకుండా కొత్తగా పసుపు పచ్చరంగులో ఉపాది పనులకు పోతున్న వేతనదారులకు మాత్రమే ఫోటోలతో ముద్రించిన జాబ్‌కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న జాబ్‌కార్డులు స్థానంలో కొత్త వాటికి ఆధార్ అనుసంధానం చేసి అందజేస్తున్నారు. వీటిని పుస్తక రూపంలో ముద్రించి కుటుంబంలో ఉపాధి పనులకు వెళ్తున్న వారి వివరాలను ముద్రించారు. కార్డు ఐదేళ్లు ఉపయోగపడేలా రూపొందించారు. అలాగే పనులు చేసే ముందుగా ఒక ఫోటో, 60 శాతం పనులు పూర్తి చేసిన తరువాత మరో ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఉపాధి పనుల్లో అక్రమాలకు తావు లేకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఈ జాబ్ కార్డులు కీలకంగా మారనున్నాయని సమాచారం. హౌసింగ్ పథకంలో ఇళ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల తవ్వకం, గ్రామాల్లో సీసీ రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పశుగ్రాస క్షేత్రాలు నాడెఫ్ తొట్లు, చెరువులు తవ్వకం, పూడికతీత పనులు, వర్మీ కంపోస్టులు, మట్టి రోడ్ల నిర్మాణం ఇలా అన్ని పనులకు జాబ్‌కార్డుల అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్తగా అందజేస్తున్న జాబ్‌కార్డులు టీడీపీ ప్రచార కార్డులుగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ నాయకులు పెదవి విరుస్తున్నారు. సొంత పథకాలుగా ప్రచారం తగదు... రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ ప«థకాలను అమలు చేస్తాయి. ఆ పథకాలను కేంద్రం ఇచ్చిన వాటా ఎంత ఉంది, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేయాలి. అలా కాకుండా సొంత పథకాలుగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది. –పెద్దింటి జగన్మోహనరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిర్వీర్యం చేస్తోంది... రాష్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ పథకానికి 80 శాతం నిధులు ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవడం తప్ప కనీసం ఏ పథకానికి కేంద్రం ప్రభుత్వ పేరు చెప్పడం లేదు. –ఆర్.లక్ష్మణరావు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు -
పసుపు క్యాన్ కొంటేనే ‘సుజలధార’
కాశీబుగ్గ : పసుపు క్యాన్‌కు రూ.400 చెల్లిస్తేనే ఎన్టీఆర్ సుజల తాగునీరు అందించే కార్డు అందజేస్తామని నిర్వాహకులు తేల్చిచెప్పడంతో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలు విస్తుపోతున్నారు. మున్సిపాలిటీలో 11 చోట్ల, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 6 చోట్ల సుజలధార పథకాలు ఏర్పాటు చేశారు. తాగునీరు కావాలంటే రూ.400 చెల్లించి పసుపు ట్యాంకు తమ వద్దే కొనుగోలు చేయాలని నిర్వాహకులు చెబుతుండటంతో ప్రజలు మండిపడుతున్నారు. తమవద్ద పాత క్యాన్లు ఉన్నాయని చెబుతున్నా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు కూడా ముఖం చాటేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక జన్మభూమి కమిటీ సభ్యులు తమ చేతికి మట్టి అంటకుండా కొంతమంది వ్యక్తులను నియమించి ఈ ట్యాంకులను ఒకొక్కటి రూ.400 చొప్పున అమ్ముతున్నారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రి, పురుషోత్తపురం, పలాస హైస్కూల్, మున్సిపల్ కార్యాలయాల వద్ద ఈ వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రెండు రూపాయలకే 20 లీటర్లు తాగునీరు అందిస్తామని ఏర్పాటుచేసి ప్రారంభించిన నిర్వాహకులు ఇప్పుడు పసుపు క్యాన్ కొనుగోలు చేస్తేనే తప్ప కార్డు ఇవ్వమని చెబుతుండటం తగదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలనని పలువురు కోరుతున్నారు. -
రైళ్లకు పసుపు రంగు వేయండి: ప్రపంచ బ్యాంకు
న్యూఢిల్లీ : దేశంలో రైల్వే ప్రమాదాలను నివారించేందుకు రైళ్లన్నింటికీ ప్రకాశవంతమైన పసుపు రంగును వేయాలని ప్రపంచ బ్యాంకు రైల్వే శాఖకు సూచించింది. రైల్వే ఉద్యోగులందరూ ప్రకాశవంతంగా ఉండే దుస్తుల్ని ఎల్లప్పుడూ ధరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ‘భారత రైల్వేల్లో భద్రతను పటిష్టం చేయడం’ అన్న అంశంపై ప్రపంచ బ్యాంకు నివేదికను సమర్పించింది. దేశంలో రైలు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాల్సిందిగా రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ బ్యాంకు సహా పలు అంతర్జాతీయ సంస్థలను కోరారు. ఈ నివేదికలోని ఇతర కీలకాంశాలు ♦ ప్రతి రైలులో అగ్ని ప్రమాదాలను నివారించే పరికరాలను ఏర్పాటు చేయాలి. ♦ ప్రమాదాల సమయంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి వీలుగా అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికను రూపొందించుకోవాలి. ♦ ప్రతి రైలు ముందు శక్తిమంతమైన డిచ్ లైట్లను ఏర్పాటు చేయాలి. ♦ ఉద్యోగులు ధరిస్తున్న హెల్మెట్లు, బూట్లు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి అనుకూలమో? కాదో? పరిశీలించాలి. -
ఇంటిప్స్
ప్రాచీన కాలం నుంచి పసుపుని యాంటీసెప్టిక్‌గా వినియోగిస్తున్నారు.మన పెద్దవాళ్లు ఏ చిన్న దెబ్బ తగిలినా వెంటనే పసుపు తెమ్మని తొందరపెట్టడం ప్రతి ఇంట్లో సహజంగా జరిగే విషయమే. గాయాన్ని త్వరగా మాన్పే గుణం పసుపులో ఉంది. అలాగే గొంతు సంబంధ వ్యాధులు, చర్మవ్యాధులకు పసుపు బాగా పనిచేస్తుంది. పసుపు నీళ్లతో ఆవిరిపడితే దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్కు అద్భుతంగా పనిచేస్తుంది. లేదంటే గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకుని పుక్కిలిస్తే (గార్గిలింగ్) గొంతు సంబంధ వ్యాధులు త్వరగా తగ్గుతాయి. -
పసుపు రైతుల ఆశాకిరణం ‘పీతాంబర్’!
- సరికొత్త పసుపు వంగడం సీఐఎం - పీతాంబర్ విడుదల - హెక్టారుకు 60-65 క్వింటాళ్ల పచ్చి పసుపు దిగుబడినిచ్చే.. సాధారణ వంగడాలకన్నా - ఇది 50% అధికం..పసుపులో కుర్కుమిన్ శాతం 12.5.. సాధారణ వంగడాలకన్నా ఇది కనీసం 50% అధికం.. అంతర్జాతీయ మార్కెట్లో ఆదరణ కోల్పోతున్న దేశవాళీ పసుపు సాగు చేసే రైతులకు కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ (సి.ఐ.ఎం.ఎ.పి.- సీమాప్) రూపొందించిన ‘సీఐఎం-పీతాంబర్’ రకం పసుపు విత్తనం భవిష్యత్‌పై ఆశలను రేకెత్తిస్తోంది. గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కొత్త పసుపు వంగడాన్ని ఆవిష్కరించారు. లక్నో (ఉత్తరప్రదేశ్)లోని ‘సీమాప్’ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ కే గుప్త ఈ కొత్త వంగడాన్ని రూపొందించారు. వచ్చే ఖరీఫ్ నుంచి ఈ వంగడం రైతులకు అందుబాటులోకి రానుంది. పూర్తిగా రైతులందరికీ అందుబాటులోకి రావడానికి ఐదేళ్లు పట్టొచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు సాగులో ఉన్న వంగడాల దిగుబడి ఎకరానికి 40-45 క్వింటాళ్ల పచ్చి పసుపు దిగుబడి వస్తుండగా.. ‘సీఐఎం-పీతాంబర్’ రకం హెక్టారుకు పచ్చి పసుపు 60-65 క్వింటాళ్ల దిగుబడినిస్తుందని ‘సీమాప్’ హైదరాబాద్ ఇన్చార్జి శాస్త్రవేత్త డాక్టర్ జొన్నల కోటేశ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. ఇప్పుడు సాగులో ఉన్న వంగడాల్లో కుర్కుమిన్ 3% నుంచి అత్యధికంగా ఉంది. 7-8% వరకు ఉంది. ‘సీఐఎం-పీతాంబర్’ రకంలో కుర్కుమిన్ 12.5 శాతం వరకు ఉంటుందన్నారు. 180-190 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. పసుపు ఆకుమచ్చ తెగులును ఈ వంగడం సమర్థవంతంగా తట్టుకుంటుందని, రైతుకు రెండింతలు లాభాలను అందిస్తుందని డాక్టర్ కోటేశ్‌కుమార్ చెప్పారు. పసుపు ఉత్పత్తిలో భారత్‌దే అగ్రస్థానం. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 80 శాతం మన దేశంలోనే జరుగుతోంది. దేశం మొత్తం ఉత్పత్తిలో 60 శాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే పండుతోంది. తెలుగు రాష్ట్రాల తర్వాత స్థానాల్లో తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, పశ్చిమబెంగాల్, గుజరాత్, కేరళ ఉన్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో పసుపు సాగు విస్తీర్ణం కొద్ది సంవత్సరాలుగా తగ్గిపోతోంది. అందుబాటులో ఉన్న వంగడాలతో నాణ్యమైన పసుపు పండించలేకపోవడం, అధిక దిగుబడులు సాధ్యం కాకపోవడం, ధరలు అస్తుబిస్తుగానే ఉండటం పసుపు రైతులకు శాపంగా మారింది. ‘ఫ్యూచర్స్ ట్రేడింగ్’లో గిరికీలు కొడుతున్న పసుపు ధరలు ఆకాశానికి ఎగసినపుడు సాగు విస్తీర్ణం పెరుగుతూ, ధరలు పడిపోయినపుడు తగ్గుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో లక్నోలోని సీమాప్ శాస్త్రవేత్త ఎనిమిదేళ్లు కృషి చేసి ‘సీఐఎం-పీతాంబర్’ పసుపు వంగడాన్ని రూపొందించారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 130 రకాల పసుపు వంగడాలపై విస్తృత పరిశోధనలు చేశారు. అధిక కురుకుమినాయిడ్స్ (కుర్కుమిన్) కలిగి, అధికోత్పత్తినిచ్చే అత్యుత్తమమైన క్లోన్‌ను గుర్తించి, సీఐఎం-పీతాంబర్గా నామకరణం చేశారు. ఈ అద్భుత వంగడం ద్వారా భవిష్యత్తులో అత్యంత నాణ్యమైన పసుపు ఉత్పత్తి కానుంది. కాబట్టి విదేశాలకు ఎగుమతులు పెరుగుతాయని, దేశీయంగానూ డిమాండ్ ఏర్పడి పసుపు రైతుల నికరాదాయం పెరుగుతుందన్న భరోసా కలుగుతోంది. - బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా వచ్చే ఖరీఫ్ నుంచి విత్తనోత్పత్తి ప్రారంభం! ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నేలలు పీతాంబర్ పసుపు వంగడం సాగుకు అనుకూలమే. ఈ పసుపు విత్తనాన్ని లక్నోలోని సీమాప్ కేంద్ర కార్యాలయంలో అభివృద్ధి చేశారు. విత్తనోత్పత్తి కూడా అక్కడే చేపట్టారు. 2017 ఖరీఫ్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో విత్తనోత్పత్తి ప్రారంభమవుతుంది. తొలుత కొద్దిమంది రైతులకు కిలో, రెండు కిలోల చొప్పున అందించే అవకాశం ఉంది. 2018-2019లో మరింత మంది రైతులకు ఈ వంగడం అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వపరంగా టిష్యూకల్చర్ ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ మంది రైతులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. - డా. జొన్నల కోటేశ్‌కుమార్ (94934 08227),ఇన్చార్జ్ సైంటిస్ట్, కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ (సీమాప్), బోడుప్పల్, హైదరాబాద్ -
ఇంటిప్స్
ఆకుకూరలు వండిన తర్వాత కూడా రంగు మారకుండా పచ్చగానే ఉండాలంటే... మొదట నూనె వేసినప్పుడు అందులో చిటికెడు పసుపు వేసి, ఆపైన మిగతా పదార్థాలన్నీ వేయాలి. కొబ్బరి ఎండిపోయినట్టుగా అనిపిస్తే... దాన్ని తురిమి, కొద్దిగా నీళ్లతో తడిపి పక్కన పెట్టాలి. కాసేపటికి తాజా కొబ్బరిలా అయిపోతుంది.వడియాలు, అప్పడాల వంటివి వేయించాక నూనె నల్లబడిపోయి మళ్లీ వాడటానికి వీలు కాకుండా అయిపోతే... అందులో కాస్త వైట్ వెనిగర్ వేసి స్టౌమీద పెట్టి, కాసేపు సిమ్‌లో ఉంచి వెచ్చబెట్టాలి. కాసేపటికి నూనె మామూలు రంగులోకి వచ్చేస్తుంది. మరోసారి వాడుకోడానికి వీలవుతుంది. {Vేవీ ఐటమ్స్ చేసేటప్పుడు నాలుగు జీడిపప్పులను పాలతో కలిపి పేస్ట్ చేసి వేస్తే... గ్రేవీ చిక్కగా ఉండటంతో పాటు చక్కని సువాసన వస్తుంది. -
పెసర.. ఎంతో ఆసర
సాగు.. భలే బాగు సస్యరక్షణ చర్యలు తప్పనిసరి తెగుళ్ల నివారణే ముఖ్యం సకాలంలో స్పందించకుంటే పంటకు తీవ్ర నష్టం : ఏడీఏ.వినోద్‌కుమార్ జహీరాబాద్ టౌన్: రైతులు ఈ సారి ఖరీఫ్ సీజన్లో సోయాబిన్, పత్తి, కంది తదితర పంటలతో పాటు పెసర పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అడపా దడపా వానలు కురుస్తుండటంతో పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కాత గట్టి పడుతోంది. అయితే తెగుళ్లు బెడద ఎక్కువైంది. పంట కాత దశలో ఉండగా తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గే అవకాశం ఉందని జహీరాబాద్ వ్యవసాయ డివిజన్ ఏడీఏ వినోద్‌కుమార్ (8886612477) తెలిపారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడుతే అధిక దిగుబడి వస్తుందన్నారు. పెసర పంటలో తెగుళ్ల నివారణ చర్యల గురించి ఆయన వివరించారు. పెసరలో రకాలు: * జహీరాబాద్ ప్రాంత నేలకు ఎల్జీజీ 407, ఎల్జీజీ 450, ఎల్జీజీ 460,టీఎం 92 రకాలు అనుకూలం * వాన కాలం ప్రారంభంలో తొలకరి వర్షాలు కురిసిన తరువాత నేలలో తేమ చేరినప్పుడు విత్తనాలు నాటాలి. * ఎకరాకు 10-12 కిలోల విత్తనాలు అవసరం. * వరి పంట సాగుచేసిన పొలంలో పెసర పంట వేసుకోవచ్చు * వరి పంటకు వేసిన ఎరువులు నేలల్లో నిలువ ఉంటాయి కాబట్టి పెసరకు ప్రత్యేకంగా ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. *పచ్చి రొట్టె దున్నిన పొలంలో పెసర పంట వేస్తే పెద్దగా ఎరువుల అవసరం ఉండదు. * పెసర పైరు 25-30 రోజలు ఉన్నప్పుడు ఎకరాకు 10-15 కిలోల యూరియా వేయాలి. *పెసర రకాన్ని బట్టి 60-70 రోజుల్లో అధిక శాతం కాత ఎండి కోతకు వస్తుంది. తెగులు నివారణ: * పెసర పంటకు తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది. *మారుక మచ్చ పురుగును పూత పురుగు లేదా గూడ పురుగు, బూజు పురుగు కూడా పిలుస్తారు. * మారుక మచ్చ పిల్ల పురుగులు మొగ్గలోకి చొచ్చుకపోయి లోపలిభాగాలను తింటాయి.తరువాత దశలో లేత ఆకులను, లేత పిందెలను, కాయలను కలిపి గూడుగా చేసుకుంటాయి. * గూడు లోపలనే ఉంటూ లోపలి పదార్థాలను తినడ వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. *కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి Ððవెళ్లి కాయలోని గింజలను తిని డొల్లగా మారుస్తుంది. * అందుకని పూత దశలో పైరుకు ఐదుశాతం వేప గింజల కషాయం లేదా 5 మి.లీ. వేప నూనేను లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. *ఇలా చేయడం వల్ల తల్లి పురుగులు గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. * పిల్ల పురుగులు అధికంగా ఉంటే లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా థయోగికార్బ్ గ్రాము లేక ఎసిఫేట్ గ్రాము చొప్పున కలిపి పంటకు పిచికారి చేయాలి. *పంటలో గూళ్లు కనిపిస్తే లీటరు నీటికి ఎసిఫెట్ 1.5 మి.లీ లేదా నోవాల్యురాన్ 75 మి.లీ. మందుతో మి.లీ డైక్లోరోవాస్‌ను కలిపి పైరుపై పిచికారి చేయాలి. * పురుగు ఉధృతి అధికంగా ఉంటే స్పైనోసాడ్ 0.4 మి.లీ లేదా ఇమామిక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ప్లూబెండ్మైడ్ 0.3 మి.లీ చోప్పున లీటరు నీటిని కలిపి పంటపై పిచికారి చేయాలి. పొగాకు లద్దె పురుగు: *ఈ పురుగు పెసర పంట ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తింటాయి. * దీంతో ఆకులు జల్లడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రం చేసి పువ్వులను పిందెలాను తింటాయి. * పొగాకు లద్దె పురుగు రాత్రి పూట ఆశిస్తాయి. పగలు మొక్కల మొదళ్లో, పొలం నెర్రల్లో ఉంటాయి. *ఈ పురుగు నివారణకు మోనోక్రోటీపాస్ 1.5 మి.లీ లేదా క్లోరీపైరి ఫాస్ 2.5 మి.లీ నిటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. ఎల్లో మొజాయిక్ తెగులు: * తెల్లదొమ నుంచి ఈ తెగులు ఆశిస్తుంది.ఈ తెగుల కారణంగా మొక్క ఆకులు, కాయల మీద పసుపు పచ్చ పొడలు ఏర్పాడుతాయి. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది. *పెసర పంటకు ఈ తెగులు ఆశిస్తే లీటరు నీటిలో 1.6 మిలీ మెనోక్రాటోఫాస్, లేదా 2 మి.లీ డైమిథోయేట్ చొప్పున కలిపి పిచికారి చేయాలి -
రోడ్డుపై తెలుపు, పసుపు లేన్లు ఎందుకో తెలుసా?
పరాయి దేశాల సంగతేమోగానీ.. భారత దేశంలో మాత్రం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే సంఘటనలు కోకొల్లలే.. ఇలా చేయకపోవడానికి గల కారణం లెక్కలేనితనం ఒకటి కాగా ట్రాఫిక్ నిబంధనలు తెలియకపోవడం మరో ప్రధాన విషయం. ట్రాఫిక్ కూడళ్లలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ లైట్లు ఎందుకుంటాయో అనే విషయం సాధారణంగా తెలిసిందే. అయితే, రోడ్లపై అక్కడక్కడ పొడవైన తెల్లగీతలు, రోడ్డు మధ్యలో పసుపు గీతలు, మధ్యమధ్యలో ఖండించిన తెలుపు, పసుపు గీతలు మనకు దర్శనం ఇస్తుంటాయి. వీటి గురించి అసలు ఎంతమందికి తెలుసు? వాటి అర్థం ఏమిటో ఒకసారి పరిశీలిస్తే.. పొడవైన తెల్లగీత: ఇది మీరు ఏ మార్గంలో ప్రయాణం ప్రారంభించారో అదే మార్గంలో కచ్చితంగా వెళ్లాలని సూచిస్తుంది. మధ్యలో ఖండించిన తెలుపు లేన్లు: ఈ తరహా లేన్లు మీ మార్గాన్ని అప్పుడప్పుడ మార్చుకునేందుకు అనుమతిస్తాయి. కానీ, వెనుక, ముందు ఉన్న వాహనాలకు హెచ్చరికలు చేసి ఆ పని చేయాలి. రోడ్డు మధ్యలో పొడవైన పసుపు రేఖ: సాధారణంగా రోడ్డుపై వాహనాలను క్రాస్ చేస్తూ వెళ్లడం మాములే. అయితే.. ఈ పసుపు లైన్ మాత్రం ఎట్టి పరిస్థితిల్లో క్రాస్ చేయకూడదు. అయితే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నిబంధన ఈ సింబల్‌కు పెట్టుకుంటారు. తెలంగాణలో అయితే, ఈ సింబల్ క్రాస్ చేయకూడదని నిబంధన ఉంది. రోడ్డు మధ్యలో డబుల్ పసుపు లేన్లు: ఈ లేన్లు దాటి వెళ్లే ప్రయత్నం చేయకూడదు. ఖండించిన పసుపు లేన్: ఈ లేన్ ఉంటే వాహనాలకు హెచ్చరిక చేస్తూ పాసింగ్ చేయొచ్చు. ఖండించని.. ఖండించిన పసుపు లేన్లు ఉంటే..: మీరు ఖండించిన పసుపు లేన్ ఉంటే వాటిని క్రాస్ చేసి డ్రైవింగ్ చేయొచ్చు. అదే ఖండించని లేన్ వైపు ఉంటే మాత్రం అలాగే కొనసాగాలి. క్రాసింగ్‌కు అనుమతించదు. -
కేసముద్రం మార్కెట్ లో పసుపు కళకళ
కేసముద్రం: వరంగల్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం పసుపు అధికంగా వచ్చింది. ఈ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి పెద్ద మొత్తంలో రావడం ఇదే తొలిసారి. సుమారు 6 వేల బస్తాల పసుపు అమ్మకానికి వచ్చింది. దీంతో మార్కెట్లో పసుపు కళకళ కనిపించింది. కాడి రకం క్వింటాకు గరిష్ట ధర రూ.8600, కనిష్ట ధర రూ.7600, గోళా రకానికి గరిష్ట ధర రూ.8163, కనిష్ట ధర రూ.7500 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. -
‘పసుపు’ పండింది
♦ పసుపు పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ♦ రూ. 30.81 కోట్లు అవసరం ♦ తొలి విడతలో రూ. 15 కోట్లు కేటాయింపు ♦ పార్క్ పూర్తయితే చేకూరే ప్రయోజనాలెన్నో.. ♦ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు పసుపు సాగును ప్రోత్సహించేందుకు జిల్లాలో పసుపు పార్క్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ ప్రాంత రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పార్క్ ఏర్పాటుకు రూ. 30.81 కోట్లు అవసరం కాగా.. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 15 కోట్లను కేటాయించడంతో వేగంగా పనులు పూర్తవుతాయని ఆశిస్తున్నారు. పసుపు పార్క్ ఏర్పాటుతో జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పసుపు రైతులకూ ప్రయోజనం చేకూరనుంది. మోర్తాడ్ : పసుపు పంటను సాగు చేసే రైతులను ప్రోత్సహించడానికి పసుపు పార్క్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అత్యధికంగా ఆర్మూర్ ప్రాంతం లో పసుపు పంట సాగవుతుంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత రైతులు కొన్నేళ్లు గా డిమాండ్ చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పా టు ఆంశం కేంద్రంతో ముడిపడి ఉన్న అంశం. దీంతో పసుపు బోర్డు ఏర్పాటుకు ఇప్పట్లో అవకాశాలు కనిపించకపోవడంతో బోర్డు తరహా లోనే పసుపు పార్క్‌ను ఏర్పాటు చేస్తే కొంతైనా రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం వేల్పూర్ మండలంలోని పడిగెల శివారులో 40 ఎకరాల భూమిని సేకరించింది. భూ సేకరణ కోసం రూ. 5 కోట్లను ఖర్చు చేసింది. భూమిని స్పైసిస్ పార్క్ పేరున రిజిస్టర్ చేసినప్పటికీ.. పసుపు పార్క్ ఏర్పాటు కోసం కేంద్రం నిధులు మంజూ రు చేయలేదు. అంతేకాక గతంలో ఏర్పాటు చేసిన స్పైసిస్ పార్క్‌లతోనే సరిపెట్టుకోవాలని, కొత్త వాటిని ఇప్పట్లో ఏర్పాటు చేసే పరిస్థితి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో పసుపు పార్క్‌పై రైతులు ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. పసుపు పార్క్‌ను ఎలాగైనా ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఆయనను ఒప్పించడంలో సఫలమయ్యారు. పసుపు పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చింది. పసుపు పార్క్ ఏర్పాటుకు రూ. 30.81 కోట్లు అవసరం కాగా.. తొలి విడతలో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.15 కోట్లను కేటాయించింది. మిగిలిన రూ.15.81 కోట్లను 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేటాయించనున్నట్లు ప్రకటించింది. మూడు జిల్లాలకు లాభం.. వేల్పూర్ మండలం పడిగెల్ వద్ద ఏర్పాటు చేయనున్న పసుపు పార్క్ వల్ల మన జిల్లాలోని రైతాంగంతోపాటు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పసుపు రైతులకూ ప్రయోజనం చేకూరనుంది. ఏటా మన జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాల్లో పసుపు పంట సాగు అవుతుంది. బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, నందిపేట్, ఆర్మూర్ మండలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, కరీంనగర్ జిల్లా మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాల్లో పసుపు సాగు చేస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పండించే పసుపులో 25 శాతం మన జిల్లాలోనే సాగవుతుందని అంచనా. ప్రయోజనాలివి.. ♦ పసుపు పార్క్ ఏర్పాటు వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. రైతులు పండిం చిన పసుపును నిజామాబాద్, ఈరోడ్, సాంగ్లీ, బసుమతినగర్ ప్రాంతాలలో విక్రయిస్తున్నారు. పసుపు పార్క్ ఏర్పాటైతే రైతులు దూర ప్రాంతాలలోని మార్కెట్లకు వెళ్లి విక్రయించాల్సిన అవసరం ఉండదు. దూర ప్రాంతాలలోని వ్యాపారులే పసుపు పార్క్‌కు వచ్చి రైతుల నుంచి పసుపును కొనుగోలు చేస్తారు. ♦ పంట సాగుకు అవసరమైన మేలు రకం వంగడాలను ఉత్పత్తి చేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపే అవకాశం ఉంటుంది. పసుపును పొడి చేసి తరలించే అవకాశాలు ఉన్నాయి. ♦ పసుపు సాగులో మెలకువలపై రైతులకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతారు. ♦ రైతులు సేద తీరడానికి విశ్రాంతి గది, రెస్టారెం ట్, పసుపును నిలువ చేయడానికి గిడ్డంగులు, పసుపును శుద్ధి చేయడానికి అవసరమైన యంత్రాలు ఏర్పాటు చేస్తారు. ♦ పసుపు పంటకు ధరను నిర్ణయించే అవకాశం పసుపు పార్క్ వల్ల ప్రభుత్వానికి ఏర్పడనుంది. ఇప్పటి వరకు పసుపు ధరలపై అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం ఉంది. ఒక్కోసారి పసుపు ధర దారుణంగా పడిపోతుండడంతో రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదు. పసుపు పార్క్ ఏర్పాటైన తరువాత ప్రభుత్వం ధరను నిర్ణయిస్తుంది. దీంతో అంతే ధరకు వ్యాపారులు లేదా ప్రభుత్వ పరిధిలోని సంస్థలు పసుపును కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో రైతులు నష్టపోకుండా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం ప్రభుత్వం పసుపు పార్క్ ఏర్పాటుకు ముందుకు రావడం మంచి నిర్ణయం. పార్క్ ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. - పెద్దకాపు శ్రీనివాస్ రెడ్డి, రైతు, దోంచంద త్వరగా పనులు చేపట్టాలి పసుపు పార్క్ పనులు త్వరగా చేపట్టాలి. సకాలంలో పనులు పూర్తి చేయాలి. పనులు పూర్తి చేసి పార్క్‌ను అందుబాటులోకి తెస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. - రొక్కం మురళి, రైతు, తిమ్మాపూర్ -
నిజామాబాద్ జిల్లాలో పసుపు పార్కు
రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టాలని సీఎం నిర్ణయం రూ.30.81 కోట్ల వ్యయ అంచనా.. ఈ ఏడాది రూ.15 కోట్లు సాక్షి, హైదరాబాద్: పసుపు రైతులకు ప్రయోజనం కలిగించేలా నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పడిగల్ గ్రామంలో పసుపు (టర్మరిక్ స్పైస్) పార్కును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేసి నిజామాబాద్‌తోపాటు పొరుగు జిల్లాల్లోని పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాల రైతులకు బాసటగా నిలవాలని సీఎం భావిస్తున్నారు. వాస్తవానికి ఈ పార్కును కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయాల్సి ఉంది. 11వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రతి రాష్ట్రంలో ఒక స్పైస్ పార్కు ఏర్పాటు చేయాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్పైస్ పార్కులు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన పార్కును గుంటూరు జిల్లాలో నిర్మించారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో కూడా స్పైస్ పార్కు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు పడిగల్ గ్రామంలో ప్రభుత్వం రూ.5 కోట్ల వ్యయంతో 40 ఎకరాల భూమిని కూడా సేకరించి, అక్కడ స్పైస్ పార్కు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. దీనికి మొదట ఎన్డీఏ ప్రభుత్వం సమ్మతించి సర్వే కూడా చేయించింది. ప్రాసెసింగ్ యూనిట్, గోదాములు, పరిపాలనా భవనం, కంప్యూటర్ ట్రేడింగ్ సెంటర్లతో కూడిన పార్కు ఏర్పాటుకు సమగ్ర నివేదిక రూపొందించింది. దీనికి మొత్తం రూ.30.81 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ చివరికి కేంద్రం చేతులెత్తేసింది. దీంతో ఈ పార్కును రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేపట్టాలని, ఇప్పటికే స్థల సేకరణ జరిగినందున పడిగల్లోనే ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి ఈ ఏడాది రూ.15 కోట్లు, వచ్చే ఏడాది రూ.15.81 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ పార్కు ఏర్పాటుతో సుగంధ ద్రవ్యాల పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు తరలివచ్చే అవకాశముంటుంది. కాగా కేంద్రం మాట తప్పినా... పసుపు రైతులకు అండగా ఉండేలా పసుపు పార్కు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. స్పైస్ పార్కు ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి, ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. -
మార్చాల్సింది రంగు కాదు..ప్రభుత్వ తీరు
-
పసుపు ఎంత చాయ...
బ్యూటిప్స్ కాస్తంత పసుపు ఉంటే చాలు... అందం, ఆరోగ్యం తేలికగా కాపాడుకోవచ్చు. సహజ చర్మకాంతికి పసుపును మించిన ఔషధమేదీ లేదు. ఎండకు కమిలిపోయి పొడిదేరిన ముఖానికి పసుపులో పాలమీగడ, తేనె కలిపి ఫేస్‌ప్యాక్‌లా పట్టించి, అరగంటసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. తరచు ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. తరచు మొటిమలతో బాధపడుతున్నట్లయితే, పసుపు, వేపాకు కలిపి ముద్దగా నూరుకోవాలి. ఆ ముద్దలో కొద్దిచుక్కల రోజ్‌వాటర్, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట ఆరనిచ్చాక, గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేస్తే మొటిమలు మాయమవుతాయి. ముఖంపై ముడతలు వస్తుంటే, వయసు మళ్లినట్లు కనిపిస్తారు. చిన్న వయసులోనే ఇలాంటి సమస్య ఎదురైతే ఇబ్బందే. పసుపులో కొద్దిగా టొమాటో గుజ్జు, పచ్చిపాలు కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి, పొడిగా ఆరిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తలలో చుండ్రు ఇబ్బంది కలిగిస్తుంటే, పసుపులో వేపాకులు కలిపి గుజ్జుగా చేయాలి. దీనికి కలబంద గుజ్జు చేర్చి, తలకు పట్టించాలి. అరగంట ఆరనిచ్చాక కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే చుండ్రు మాయమవుతుంది. -
అర్ధరాత్రి సూర్యోదయం
విదేశాలలో... ‘ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్’ అని పేరున్న నార్వేలోనిదీ సూర్యోదయ దృశ్యం. ఇక్కడ మే నెల నుండి ఆగష్టు వరకు రాత్రి 11 గం.కి కూడా పట్టపగలులా ఉంటుంది. పన్నెండు గంటల తర్వాత చీకటి పడినట్టే పడి.. ఆ వెంటనే సూర్యోదయమౌతుంది. ఒక్కోసారి 4 గంటలకు సూర్యోదయం అవుతుంది. ఆ విధంగా వేసవిలో 4 గంటలే చీకటిగా ఉంటే, జూన్ జులైలో రెండు గంటలు మాత్రమే చీకటి. అక్టోబర్ నుండి ఈ దృశ్యం పూర్తిగా మారుపోతుంది. రోజులో 3-4 గంటలు మాత్రమే వెలుతురు. ఉత్తర ఐరోపాకు చెందిన నార్వే స్కాండినేవియా ద్వీపకల్పం పశ్చిమ ప్రాంతంలో ఉంది. ధ్రువప్రాంతం కావడంతో ఇక్కడి వాతావరణ పరిస్థితులు రోజుకు మూడు, నాలుగు సార్లు మారుతూ ఉంటాయి. అప్పుడే ఎండ, అప్పుడే చలి, ఆ వెంటనే వాన... ఇలా ఒకేరోజు మూడు రుతువులను చూడవచ్చు. ఉత్తర నార్వేలో జూన్ 21, దక్షిణ నార్వేలో డిసెంబర్ 22న రోజంతా ఎండకాస్తూనే ఉంటుంది. ధృవప్రాంతం కావడంతో సూర్యకిరణాల వెలుగులు ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ.. ఇలా హరివిల్లు రంగులు దర్శనమిస్తుంటాయి. -
అడగండి చెబుతాం...
హాకీలో ఆటగాళ్లకు శిక్ష విధించే గ్రీన్, ఎల్లో, రెడ్ కార్డులను ఎప్పుడు వాడతారు? ప్రశ్న అడిగిన వారు: స్వరూప్ కుమార్, నెల్లూరు సాధారణంగా హాకీ మైదానంలో ఆటగాళ్లు క్రమశిక్షణ తప్పకుండా అదుపులో ఉంచేందుకు రిఫరీలు ఈ కార్డులను ఉపయోగించి హెచ్చరిస్తారు. ఇందులో అన్నింటికంటే తక్కువ రకమైన శిక్షగా గ్రీన్ కార్డును చెప్పవచ్చు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాడిని ఆపే ప్రయత్నంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు భావిస్తే దీంతో హెచ్చరిస్తారు. గ్రీన్ కార్డు చూసిస్తే ఆటగాడు రెండు నిమిషాల పాటు మైదానం వీడాల్సి ఉంటుంది. ఆ తర్వాతి స్థాయిలో ఎల్లో కార్డ్‌ను జారీ చేస్తారు. ప్రత్యర్థి పట్ల దురుసుగా ప్రవర్తించడం, స్టిక్‌తో కాకుండా శరీరంతో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఎల్లో కార్డు చూపించి ఆటగాడిని బయటికి పంపిస్తారు. ఇందులో కనీసం 5 నిమిషాల పాటు మైదానం వీడాలి. అంతకంటే ఎక్కువ సమయం కూడా శిక్షించవచ్చు. రెడ్ కార్డు అన్నింటిలోకి పెద్ద శిక్ష. ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ఆటగాడిపై శారీరకంగా దాడి చేసేందుకు ప్రయత్నించడం, రక్తమోడటంలాంటిది ఏదైనా జరిగితే రెడ్ కార్డు చూపిస్తారు. రెడ్ కార్డు శిక్షకు గురైతే చూపిస్తే ఆ మ్యాచ్ మొత్తంలో అతను ఆడటానికి వీలుండదు. దాంతో పాటు తర్వాతి మ్యాచ్ కూడా ఆడకుండా నిషేధం విధిస్తారు. అయితే శిక్షల్లో స్థాయి భేదాలు అంతా రిఫరీ నిర్ణయంపైనే ఆధార పడి ఉంటుంది. ఏ కార్డు ద్వారానైనా ఆటగాడు బయటికి వెళితే మిగతా 10 మంది సభ్యులతోనే సదరు జట్టు మ్యాచ్‌ను ఆడాల్సి ఉంటుంది. ఇది ఆ మ్యాచ్ ఫలితంపై కూడా ప్రభావం చూపవచ్చు.