ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్‌కు మరో ఆటంకం? | Yellow Alert of Snowfall in Uttarakhand | Sakshi
Sakshi News home page

ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్‌కు మరో ఆటంకం?

Nov 26 2023 7:08 AM | Updated on Nov 26 2023 9:21 AM

Yellow Alert of Snowfall in Uttarakhand - Sakshi

ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంతాలలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరాఖండ్‌లో రాబోయే మూడు రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. దీంతో అక్కడి సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు జరుగుతున్న సహాయక చర్యలపై ప్రభావం పడనుంది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత  పెరుగుతోంది. 

శ్రీనగర్‌తో పాటు ప్రదేశాలలో కనిష్ట ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయి కంటే తక్కువగా ఉంది. హిమాచల్‌లో ఆదివారం నుంచి వర్షం, మంచు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 26 నుండి ఉత్తరాఖండ్‌తో పాటు హిమాలయ ప్రాంతంలో మంచు కురవనుందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ బిక్రమ్ సింగ్ తెలిపారు. ఫలితంగా పర్వత ప్రాంతాలు మేఘావృతమై ఉంటాయి. సోమవారం ఉత్తరకాశీ, చమోలి, రుద్రప్రయాగ, పితోరాఘర్‌తో సహా 3500 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశాలు ఉన్నాయి. 

పహల్గామ్ కాశ్మీర్‌లోని అతి శీతల ప్రాంతం. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత -3.4 డిగ్రీల సెల్సియస్, శ్రీనగర్, గుల్మార్గ్‌లలో -1.0 డిగ్రీల సెల్సియస్. ప్రస్తుత శీతాకాలంలో శ్రీనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే దిగువకు వెళ్లడం ఇది రెండోసారి. జమ్మూలో కూడా తేలికపాటి సూర్యరశ్మి ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చాలా చలిగా ఉంటుంది. పగటిపూట కాస్త ఉపశమనం కలుగుతోంది. రానున్న 24 గంటల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో 25 స్వైన్‌ కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement