
ముంబై : మహరాష్ట్రకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
రెండ్రోజుల క్రితం భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించి పోయింది.
ఈ తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణ శాఖ ముంబైకి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బలమైన పశ్చిమ గాలుల కారణంగా శుక్రవారం ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఈ సందర్భంగా పాల్ఘర్, రాయ్‌గఢ్ పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.
👉చదవండి : సీఎం సార్.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా