బెంగళూరు: కర్ణాటకలో మైసూర్ నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్కాంలో సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించిన ముడా స్కాంలో సిద్ధరామయ్య అవకతవకు పాల్పడ్డారని, ఆయన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ తరుణంలో సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్‌డీ కుమారస్వామి డిమాండ్ చేశారు. అదే సమయంలో తన మిత్రపక్షమైన బీజేపీపై సైతం విమర్శలు గుప్పించారు. సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో మంత్రా అని ప్రశ్నించారు.
Mr. @siddaramaiah..
Ughe Ughe to your 'Sidvilasa'
Then: To escape from scams, you build a 'samadhi' for Lokayukta and formed ACB!
Now: The same Lokayukta is a place you found to get rid of 'Mudahagaran'!!
Isn't it Karma Mr siddaramaiah?
ACB was also dismissed by the High Court…— ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | H.D.Kumaraswamy (@hd_kumaraswamy) September 27, 2024
మోదీ కేబినెట్‌లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి.. ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య స్వయం ప్రతిపత్తి వ్యవస్థ లోకాయుక్తపై ఆంక్షలు విధించి..అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఆయన ఎత్తి చూపారు.
కర్మ సిద్ధాంతం అంటే ఇదే
గతంలో లోకాయుక్తాకు బదులు ఏసీబీని ఏర్పాటు చేయాలని సీఎం సిద్ధరామయ్య అనుకున్నారు. కానీ 2022లో హైకోర్టు రాష్ట్రంలో లోకాయుక్త లేదంటే ఏసీబీ ఏదో ఒకటి ఉండాలని తీర్పు ఇచ్చింది. దీనిపై కుమారస్వామి స్పందిస్తూ.. ఇది కర్మ కాదా..సిద్ధరామయ్య. లోకాయుక్త వద్దనుకున్నారు. ఇప్పుడు మీరు వద్దనుకున్న లోకాయుక్త ఆధ్వర్యంలో ముడా స్కామ్‌లో విచారణ ఎదుర్కోనున్నారు అంటూ సెటైర్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment