sidda ramaiah
-
సీఎం సార్.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా
బెంగళూరు: కర్ణాటకలో మైసూర్ నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్కాంలో సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించిన ముడా స్కాంలో సిద్ధరామయ్య అవకతవకు పాల్పడ్డారని, ఆయన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ తరుణంలో సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్డీ కుమారస్వామి డిమాండ్ చేశారు. అదే సమయంలో తన మిత్రపక్షమైన బీజేపీపై సైతం విమర్శలు గుప్పించారు. సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో మంత్రా అని ప్రశ్నించారు. Mr. @siddaramaiah..Ughe Ughe to your 'Sidvilasa'Then: To escape from scams, you build a 'samadhi' for Lokayukta and formed ACB!Now: The same Lokayukta is a place you found to get rid of 'Mudahagaran'!!Isn't it Karma Mr siddaramaiah?ACB was also dismissed by the High Court…— ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | H.D.Kumaraswamy (@hd_kumaraswamy) September 27, 2024మోదీ కేబినెట్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి.. ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య స్వయం ప్రతిపత్తి వ్యవస్థ లోకాయుక్తపై ఆంక్షలు విధించి..అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఆయన ఎత్తి చూపారు.కర్మ సిద్ధాంతం అంటే ఇదేగతంలో లోకాయుక్తాకు బదులు ఏసీబీని ఏర్పాటు చేయాలని సీఎం సిద్ధరామయ్య అనుకున్నారు. కానీ 2022లో హైకోర్టు రాష్ట్రంలో లోకాయుక్త లేదంటే ఏసీబీ ఏదో ఒకటి ఉండాలని తీర్పు ఇచ్చింది. దీనిపై కుమారస్వామి స్పందిస్తూ.. ఇది కర్మ కాదా..సిద్ధరామయ్య. లోకాయుక్త వద్దనుకున్నారు. ఇప్పుడు మీరు వద్దనుకున్న లోకాయుక్త ఆధ్వర్యంలో ముడా స్కామ్‌లో విచారణ ఎదుర్కోనున్నారు అంటూ సెటైర్లు వేశారు. చదవండి : ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యాకు చిక్కులు -
ముడా స్కామ్: సీఎం సిద్ధరామయ్యకు షాక్
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. ఈ కేసులో గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ.. సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ముడా స్మామ్‌లో గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఇక.. గవర్నర్ ఆదేశాలను సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా హైకోర్టు తీర్పు వెల్లడించింది. బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమై భద్రత ఏర్పాటు చేశారు.మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదంలో.. ఖరీదైన భూములు ఆయన భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వటం కర్ణాటక రాజకీయల్లో సంచలనం సృష్టించింది. ఇదిలాఉండగా... సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.చదవండి: కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం.. కోవిడ్ వేళ వెయ్యి కోట్ల స్కాం -
భద్రతా వైఫల్యం.. సీఎం సిద్ధరామయ్య వైపు దూసుకొచ్చిన అగంతకుడు
కర్ణాటక సీఎం సిద్దరామయ్య సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. సభలోకి ఓ అగంతకుడు దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగింది?కర్ణాటక అసెంబ్లీ ప్రాంగణంలో ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని సీఎం సిద్ధరామయ్యకు శాలువా కప్పేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ వ్యక్తి వేదికపైకి రాకముందే పోలీసు అధికారులు అతన్ని వెంటనే పట్టుకున్నారు. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా నిర్ధారణకు రాలేదు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆ వ్యక్తి సిద్ధరామయ్య అభిమాని అని, శాలువతో సత్కరించాలని సీఎం వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది.కాగా,సీఎం సభలో భద్రతా వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా..అగంతకుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అతను ఎవరు? ఏం చేస్తుంటారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 📍बेंगलुरुकर्नाटक के CM सिद्धारमैया की सुरक्षा में बड़ी चूक सामने आई है. दरअसल, एक कार्यक्रम के दौरान एक युवक भागते हुए उनके मंच पर पहुंच गया. जिसे कार्यक्रम में मौजूद सुरक्षाकर्मियों ने दबोचा लिया और मंच से नीचे उतारकर पुलिस के हवाले कर दिया.@siddaramaiah #Bengaluru… https://t.co/xKyZW4fVws pic.twitter.com/vDqbA1GEWf— Dainik Live (@Dainik_Live) September 15, 2024ఇదీ చదవండి : టీ తాగేందుకు రావాలని వైద్యులకు దీదీ ఆహ్వానం -
వాల్మీకి స్కాంలో ఉన్న కాంగ్రెస్ నేతలెవరు?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో వాల్మీకి స్కాం తీగ లాగితే డొంకంతా తెలంగాణ కాంగ్రెస్ నేతల వైపు కదులుతోందని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావు (కేటీఆర్) ఆరోపించారు. తెలంగాణలోని కీలకమైన కాంగ్రెస్ నేతల హస్తం ఈ వ్యవహారంలో ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. వాల్మీకి స్కామ్‌లో భారీగా అవినీతి జరిగిందని స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే అసెంబ్లీలో అంగీకరించిన నేపథ్యంలో ఈ స్కామ్‌లో ఉన్న వారందరి పేర్లు బయటకు రావాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ చానల్ ద్వారా ఆదివారం కేటీఆర్ మాట్లాడుతూ వాల్మీకి స్కాంకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. రూ. 180 కోట్లు దారిమళ్లాయి.. ఎన్నికలకు ముందు దాదాపు రూ.180 కోట్ల ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ అకౌంట్ల నుంచి ఏ కారణం లేకుండా అక్రమంగా దారి మళ్లిందని ఆయన ఆరోపించారు. ఈ సొమ్ము ఎవరి ఖాతాలోకి బదిలీ అయిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందులో రూ.45 కోట్లు హైదరాబాద్‌లోని 9 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారని, ఆ బ్యాంక్ ఖాతాలు ఎవరివో తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం బయటకు రాగానే వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ ఆత్మహత్య చేసుకోవటం మరింత అనుమానాలకు తావిస్తోందన్నారు. వీ6 పేరుతో ఉన్న బిజినెస్ సంస్థకు రూ.4.5 కోట్లు బదిలీ చేసినట్లు వార్తలు వస్తున్నాయని, అసలు ఆ సంస్థ యాజమాని ఎవరో ప్రజల ముందుంచాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ డబ్బే వాడారా? మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ డబ్బే వాడినట్లుందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. వాల్మీకి స్కాం వ్యవహారంలో హైదరాబాద్‌లో సిట్, సీఐడీ, ఈడీ దాడులు నిర్వహించినప్పటికీ సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు మీడియాలో ఆ వార్తలు బయటకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బార్లు, బంగారు దుకాణాల నుంచి భారీగా నగదు తీసుకొచ్చినట్టు సమాచారం ఉందని, ఆ బార్లు, బంగారం దుకాణాలను నడుపుతున్న వారితో కాంగ్రెస్ పారీ్టకి ఉన్న సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సిద్దిరామయ్యను తొలగిస్తే తెలంగాణ సర్కార్ కూలుతుందా? కర్ణాటక సీఎం సిద్దిరామయ్యను తొలగిస్తే తెలంగాణలో కూడా ప్రభుత్వం కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ వాల్మీకి స్కాంతోనే కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య బంధం పెనువేసుకుందా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలున్నట్లు ఆధారాలు కనబడుతున్నప్పటికీ ఈడీ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్లమెంటులో అవినీతిపై పెద్ద ఎత్తున మాట్లాడే రాహుల్ గాంధీ ఈ వాల్మీకి స్కాం విషయమై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వెంటనే రాహుల్ ఈ విషయంపై స్పందించాలని, మొత్తం వ్యవహారంలో ఉన్న పెద్ద చేపల పేర్లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. -
‘సిద్ద రామయ్యే మా రాముడు.. అయోధ్య ఎందుకెళ్లాలి?’
కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నేత హెచ్ ఆంజనేయ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను శ్రీరామునితో పోల్చడం వివాదాస్పదంగా మారింది. రామాలయం విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోందని, మత ప్రాతిపదికన దేశ ప్రజలను బీజేపీ విభజిస్తోందని కాంగ్రెస్ నేత ఆంజనేయ ఆరోపించారు. కాగా కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత బదులిచ్చారు. హిందూ దేవుళ్లు, దేవతల గురించి ఆలోచించి మాట్లాడాలని బీజేపీ నేతలు హెచ్చరించారు. మీడియాతో మాట్లాడిన హెచ్ ఆంజనేయ నూతన రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య అయోధ్యకు వెళ్లే విషయమై ప్రస్తావించారు. ఆయన (సిద్దరామయ్య) మా రాముడు.. అటువంటప్పుడు అయోధ్యలో జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎందుకు వెళతారని అన్నారు. అతను తన స్వగ్రామంలోని రామ మందిరాన్ని సందర్శించడానికి వెళ్లగలరని అన్నారు. అక్కడ బీజేపీకి చెందిన రాముని విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారు. బీజేపీ వాళ్లను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. మా రాముడు మా హృదయాల్లోనే ఉన్నాడు. బీజేపీ ఎప్పుడూ ఇలాంటి పనులనే చేస్తుంది. మతం పేరుతో ప్రజలను విభజించి, ఒక నిర్దిష్ట వర్గాన్ని రెచ్చగొట్టి, వారి ఓట్లను దక్కించుకుంటుందని ఆరోపించారు. కాగా కాంగ్రెస్ నేత ఆంజనేయ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. బీజేపీ నేత బసనగౌడ పాటిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతను ఉద్దేశించి హిందూ దేవుళ్ల గురించి ఆలోచించి మాట్లాడాలని అన్నారు. ఇలాంటి హిందూ వ్యతిరేకులు మనకు మంత్రులు కావడం మన దురదృష్టం అంటూ ఘాటుగా విమర్శించారు. -
బీజేపీ Vs సిద్ధరామయ్య: మరి మోదీ సంగతేంటీ.. కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఇతర మంత్రులు ఓ విలాసవంతమైన ప్రైవేటు జెట్‌లో ప్రయాణించడం విమర్శలకు దారి తీసింది. ఈ వీడియోపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, కాంగ్రెస్ నేతలు సైతం ప్రధాని మోదీ, బీజేపీకి కౌంటరిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సాయం కోరేందుకు ఢిల్లీ వెళ్లిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హస్తిన నుంచి బెంగళూరుకు విలాసవంతమైన చార్టర్డ్ విమానంలో వచ్చారు. కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ సిద్ధరామయ్యతో కలిసి విమాన ప్రయాణం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మంత్రి జమీర్ అహ్మద్ ట్విటర్లో ఓ వీడియోను షేర్ చేయడంతో రాష్ట్ర బీజేపీ నేతలు సీఎం సిద్ధరామయ్యను టార్గెట్ చేశారు. Bengaluru: Responding to a question on the video of himself and Karnataka minister B Z Zameer Ahmed Khan travelling on a chartered flight, Karnataka CM Siddaramaiah says, "Ask BJP people in what Prime Minister Narendra Modi travels in." pic.twitter.com/3TvdXsSUZC — ANI (@ANI) December 22, 2023 ఇక, సీఎం సిద్ధరామయ్య ప్రైవేటు జెట్‌లో విహరిస్తున్నారంటూ ప్రతిపక్ష బీజేపీ విరుచుకుపడింది. రాష్ట్రం మొత్తం తీవ్ర కరవుతో అల్లాడుతోంది. వర్షాభావ పరిస్థితులతో పంటలు కోల్పోయి.. రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. మరోవైపు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం, రాష్ట్ర మంత్రులు వారి సంపన్న, విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తున్నారు. పైగా.. కేంద్రం నుంచి కరవు సహాయక నిధుల అభ్యర్థన కోసం విలాసవంతమైన విమానంలో ప్రయాణించడం గమనార్హం. మన దురవస్థను అపహాస్యం చేయడమే ఇది. పన్ను చెల్లింపుదారుల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం కాంగ్రెస్ మంత్రులకు చాలా సులభం కర్ణాటక నేతలు తీవ్ర విమర్శలు చేశారు. On the one hand, Congress is pretending to crowdfund and didn’t even serve samosas in I.N.D.I Alliance meeting, on the other, Zameer Ahmed Khan, Cabinet Minister for Housing, Waqf and Minority Affairs in Karnataka Govt, is flaunting his pictures with CM Siddaramaiah in a private… pic.twitter.com/SkrLB5OdjI — Amit Malviya (@amitmalviya) December 22, 2023 కాగా, బీజేపీ నేతల విమర్శలను కాంగ్రెస్ గట్టిగా తిప్పి కొట్టింది. బీజేపీ నేతల ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య.. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ విధంగా ప్రయాణిస్తారు? ఏ విమానంలో రాకపోకలు సాగిస్తారు? ఈ విషయం బీజేపీ నేతలను అడగండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ఎప్పుడూ అసంబద్ధ వాదనలు చేస్తుంటారు. ఆపరేషన్ కమల్ ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసిన చరిత్ర బీజేపీ నాయకులకు ఉంది. ఆపరేషన్ కమల్ కోసం వందల కోట్ల రూపాయల డబ్బులు ఎవరు ఇచ్చారని, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ, ముంబై చుట్టు తిప్పడానికి విమానం ఎవరు ఇచ్చారని, వారాల తరబడి విలాసవంతమైన హోటళ్లలో బస చేసి సరదాగా గడిపిన ఎమ్మెల్యేల కోసం డబ్బులు ఎవరు ఖర్చు చేశారని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు కూలీ పనులు చేసి ఆపరేషన్ కమల కోసం ఖర్చు చేశారా? అని నిలదీశారు. దీంతో, బీజేపీ నేతలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చదవండి: భారతీయ విద్యార్థి నాలుగేళ్లుగా మిస్సింగ్.. ఆచూకీ చెబితే 8 లక్షల రివార్డ్ -
సీఎం బయోపిక్‌లో సేతుపతి ఫిక్స్!
విజయ్ సేతుపతి పేరు చెప్పగానే వెర్సటైల్ యాక్టర్ అనే పదం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరోగా మాత్రమే చేస్తా, లేదంటే లేదు అని మడికట్టుకుని కూర్చోలేదు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, గెస్ట్ రోల్.. ఇలా తనకు నచ్చిన ప్రతిదీ చేసుకుని పోయాడు. పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల్ని సంపాదించుకుంటున్నాడు. అలాంటి ఈ నటుడు ఇప్పుడు ఏకంగా సీఎం బయోపిక్‌లో ఛాన్స్ కొట్టేశాడట. సీఎం బయోపిక్ అనగానే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఎందుకంటే 'యాత్ర 2'లో ముఖ్యమంత్రి పాత్ర కోసం తమిళ నటుడు జీవా పేరు పరిశీలనలో ఉంది. బయటకు చెప్పట్లేదు కానీ దాదాపు ఇదే కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఇక విజయ్ సేతుపతి చేయబోయేది కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బయోపిక్‌లో అని టాక్. (ఇదీ చదవండి: సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?) ఓ సామాన్యుడిలా మొదలైన సిద్ధరామయ్య ప్రయాణం.. ముఖ్యమంత్రి పీఠం వరకు ఎలా చేరింది అనేది రెండు భాగాల సినిమాగా తీయనున్నారు. అయితే హీరోగా దక్షిణాది నటుల్లో చాలామంది పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా విజయ్ సేతుపతి ఫిక్స్ అయ్యాడట. లాయర్, రాజకీయ జీవితంతోపాటు సిద్ధరామయ్య బ్రేకప్ స్టోరీ కూడా ఇందులో చూపించబోతున్నారట. ఈ బయోపిక్‌ని ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యే విధంగా తీయబోతున్నారట. త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్న ఈ చిత్రానికి 'లీడర్ రామయ్య' పేరు ఖరారు చేశారు. కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళంలోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన 'జవాన్' వచ్చే నెలలో రిలీజ్ కానుంది. హిందీలో ఒకటి, తమిళంలో ఐదు సినిమాల్లో హీరోగా నటిస్తూ విజయ్ బిజీగా ఉన్నాడు. (ఇదీ చదవండి: హీరో విశ్వక్ సేన్‌తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!) -
విద్వేషాలను రెచ్చగొట్టేవారికి చెక్... మినిష్టర్ వినూత్న ఆలోచన
కర్ణాటక : ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టకుండా "పీస్ఫుల్ కర్నాటక" పేరుతో ఒక హెల్ప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి డి పరమేశ్వర, ఐటీ & గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గేలకు విజ్ఞప్తి చేశారు వాణిజ్యం & పరిశ్రమలు, మౌలికసదుపాయాల శాఖల మంత్రి ఎంబి పాటిల్. తేజస్వి యాదవ్ వ్యాఖ్యలు... అంతకుముందు బెంగళూరు సౌత్ ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య పార్టీ కార్యకర్తలపై దాడులు జరగకుండా రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో బీజేపీ ఒక హెల్ప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని, రాష్ట్రంలో ఎక్కడైనా కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తే వెంటనే హెల్ప్ లైన్ ను ఆశ్రయించాలని కోరారు. తేజస్వి చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మినిష్టర్ కూడా అంతే దీటుగా స్పందించారు. మినిష్టర్ పాటిల్ కౌంటర్... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి డి పరమేశ్వర, మంత్రి ప్రియాంక్ ఖర్గే గార్లకు మనవి. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టకుండా చూసేందుకు వీలుగా "పీస్ఫుల్ కర్నాటక" పేరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసే విషయాన్ని పరిగణలోకి తీసుకోగలరు.తద్వారా ఎక్కడైనా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వెంటనే ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి, పురోగతి సాధించి బ్రాండ్ కర్నాటకను రక్షించుకోవడమే మా ఎజెండా అని పాటిల్ ట్వీట్ చేశారు. -
ముళ్ల కిరీటం కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం.. ఐదేళ్లూ కొనసాగడమంటే..
బనశంకరి: కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఎన్నికకాగా 20వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతంలోనూ ఆయన ఐదేళ్లు పూర్తికాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు ఐదేళ్లు అవధి ఆ పదవిలో ఉన్నది ముగ్గురు మాత్రమే. పలువురు ముఖ్యమంత్రులు అవధి పూర్తికాకముందే అధికారం కోల్పోయారు. మరికొందరు గడువు తీరకముందే ఎన్నికలు రావడంతో అవకాశం కోల్పోయారు. 2013 నుంచి 2018 వరకు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాటు పనిచేశారు. ఎస్.నిజలింగప్ప, దేవరాజ అరస్లు గతంలోనే పూర్తికాలం పదవిలో ఉండి సత్తా చాటుకున్నారు. తరువాత ఎంతోమంది సీఎంలు అయ్యారు కానీ సంక్షోభాలలో చిక్కుకుని, లేదా హైకమాండ్ చేత మధ్యలోనే పదవీచ్యుతులయ్యారు. మైసూరు సీఎం.. ఎస్.నిజలింగప్ప కర్ణాటక.. మైసూరు రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎస్.నిజలింగప్ప ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలించారు. 1956 నుంచి 1958 వరకు కాంగ్రేస్ ప్రభుత్వంలో రెండేళ్లు పాటు సీఎంగా పరిపాలన చేశారు. 1958లో బీడీ జత్తి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మార్చి 14, 1962 నుంచి 20 జూన్ 1962 వరకు సీఎంగా ఎస్ఆర్ కంఠి ఎన్నికయ్యారు. జూన్ 21, 1962 నుంచి సీఎంగా ఎన్నికై న నిజలింగప్ప మే 29, 1968 వరకు ముఖ్యమంత్రిగా పూర్తికాలం పదవిలో ఉన్నారు. పథకాల్లో దేవరాజ్ అరస్ ముద్ర మైసూరు రాష్ట్రం కర్ణాటకగా మారిన తరువాత 1972 మార్చి 20 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవరాజ అరస్ ముఖ్యమంత్రిగా ఆసీనులయ్యారు. ఐదేళ్లపాటు ఆయన జనరంజక పాలన అందించారు. వెనుకబడిన వర్గాల బాగు కోసం అనేక పథకాలను అమలు చేశారు. 1978 ఫిబ్రవరి 28న మరోసారి ముఖ్యమంత్రి అయి 1980 జనవరి 7 వరకు పదవిలో కొనసాగారు. -
Karnataka Assembly Election 2023: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే
కాంగ్రెస్‌లో నిజానికి చాలా రోజుల తర్వాత ఆ పార్టీ ఎన్నికల పోరుకు పూర్తి సన్నద్ధతతో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ఓ వారం రోజుల ముందే కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. నిత్యం అంతర్గత పోరుతో తలమునకలై ఉండే కాంగ్రెస్ పార్టీకి ఇది శుభ పరిణామం. తొలి జాబితాను ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో ప్రకటించడం కచ్చితంగా ఖర్గే వ్యవహార శైలికి అద్దం పడుతుంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ఉన్న చిరకాల భేదాభిప్రాయాలు ఈ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారడం ఖాయమనుకున్నారు. ఎన్నికల వేళ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన ఖర్గే, ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచే వీరిద్దరి సంఘర్షణపై ఓ కన్నేసి ఉంచారు. సరిగ్గా షెడ్యూల్ ప్రకటించే సమయానికి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి ఎటువంటి వివాదలు రాకుండా చూసుకున్నారు. ఈసారి కచ్చితంగా కర్ణాలకలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పూర్తి వ్యూహ రచనతో బరిలోకి దిగుతోంది. Sno Name Of Constituencies Selected Candidates 1 Chikkodi-Sadalga Ganesh Hukkeri 2 Kagawad Bharmgoud Alagowda Kage 3 Kudachi - SC Mahendra K.Thammannavar 4 Hukkeri AB Patil 5 Yemkanmardi - ST Satish Laxmanrao Jarkiholi 6 Belgaum Rural Laxmi Ravindra Hebbalkar 7 Khanapur Dr Anjali Nimbalkar 8 Bailhongal Mahantesh Shivanand Koujalagi 9 Ramdurg Ashok M. Pattan 10 Jamkhandi Anand Siddu Nyamagouda 11 Hungund Vijayanand S. Kashappanavar 12 Muddebihal Appaji Alias CS Nadagowda 13 Basavana Bagevadi Shivanada Patil 14 Babaleswar MB Patil 15 Indi Yashvanth Rayagoud V Patil 16 Jevargi Dr Ajay Dharam Singh 17 Shorapur - ST Rajavenkatappa Naik 18 Shahpur Sharanabasappa Gowda 19 Chitapur - SC Priyank Kharge 20 Sedam Dr Sharanaprakash Patil 21 Chincholi - SC Subash V. Rathod 22 Gulbarga Uttar Kaneez Fatima 23 Aland BR Patil 24 Humnabad Rajashekar B Patil 25 Bidar South Ashok Kheny 26 Bidar Rahim Khan 27 Bhalki Eshwar Khandre 28 Raichur Rural - ST Basanagouda Daddal 29 Maski - ST Basanagouda Thurvihal 30 Kushtagi Amaregouda Patil Bayyapur 31 Kanakagiri - SC Shivaraj Sangappa Thangadagi 32 Yelburga Basavaraj Rayareddi 33 Koppal K. Raghavendra 34 Gadag H.K. Patil 35 Ron G.S Patil 36 Hubli-Dharwad-East - SC Prasad Abbayya 37 Haliyal R.V.Deshapande 38 Karwar Satish Krishna Sail 39 Bhatkal Mankal Subba Vidya 40 Hangal Srinivas V. Mane 41 Haveri - SC Rudrappa Lamani 42 Byadgi Basavaraj N. Shivannanar 43 Hirekerur U.B. Banakar 44 Ranibennur Prakash K. Koliwad 45 Hadagalli - SC P.T. Parameshwara Naik 46 Hagaribommanahalli - SC L.B.P. Bheema Naik 47 Vijayanagara H.R. Gaviyappa 48 Kampli - ST J.N. Ganesh 49 Bellary - ST B. Nagendra 50 Sandur - ST E. Thukaram 51 Challakere - ST T. Raghumurthy 52 Hiriyur D. Sudhakar 53 Hosadurga Govindappa B.G. 54 Davanagere North S.S. Mallikarjun 55 Davanagere South Shamanur Shivashankrappa 56 Mayakonda - SC K.S. Basavaraju Bhadravati 57 Bhadravati Sangameshwara B.K. 58 Sorab S. Madhu Bangarappa 59 Sagar Gopalakrishnna Bulur 60 Byndoor K Gopal Pujari 61 Kundapura M. Dinesh Hegde 62 Kapu Vinaya Kumar Sorake 63 Sringeri T.D. Rajegowda 64 Chikanayakanhalli Kiran Kumar 65 Tiptur K Shadakshari 66 Turuvekere Kanthraj B.M 67 Kunigal Dr H.D. Ranganath 68 Koratagere - SC Dr G. Parameshwara 69 Sira T.B. Jaya Chandra 70 Pavagada - SC H.V. Venkatesh 71 Madhugiri K.N. Rajanna 72 Gauribidanur Shivashankar Reddy N.H 73 Bagepalli S.N. Subba Reddy 74 Chintamani Dr M.C. Sudhakar 75 Srinivaspur K.R. Ramesh Kumar 76 Kolar Gold Field - SC Roopakala M 77 Bangarapet - SC S.N. Narayanaswamy 78 Malur K.Y. Nanje Gowda 79 Byatarayanapura Krishna Byregowda 80 Rajarajeshwarinagar Kusuma H 81 Malleshwaram Anup lyengar 82 Hebbal Suresha B.S 83 Sarvagnanagar K.J. George 84 Shivajinagar Rizwan Arshad 85 Shanti Nagar N.A. Haris 86 Gandhi Nagar Dinesh Gundu Rao 87 Rajaji Nagar Puttanna 88 Govindraj Nagar Priyakrishnna 89 Vijay Nagar M. Krishnamppa 90 Chamrajpet B.Z. Zameer Ahmed Khan 91 Basavanagudi U.B. Venkatesh 92 BTM Layout Ramalinga Reddy 93 Jayanagar Sowmya R 94 Mahadevapura - SC Nagesh T 95 Anekal - SC B. Shivanna 96 Hosakote Sharath Kumar Bachegowda 97 Devanahalli - SC K.H. Muniyappa 98 Doddaballapur T. Venkataramaiah 99 Nelamangala - SC Srinivasaiah N 100 Magadi H.C. Balakrishna 101 Ramanagaram Iqbal Hussain HA 102 Kanakapura D.K. Shivakumar 103 Malavalli - SC P.M. Narendraswamy 104 Shrirangapattana A. B. Ramesh Bandisiddegowda 105 Nagamangala N. Chaluvarayaswamy 106 Holenarasipur Shreyas M. Patel 107 Sakleshpur - SC Murali Mohan 108 Belthangady Rakshith Shivaram 109 Moodabidri Mithun M. Rai 110 Mangalore U.T. Abdul Khader Ali Fareed 111 Bantval Ramanatha Rai B 112 Sullia - SC Krishnappa G 113 Virajpet A.S. Ponnanna 114 Piriyapatna K. Ventakesh 115 Krishnarajanagara D. Ravishankar 116 Hunsur H.P. Manjunath 117 Heggadadevankote - ST Anil Kumar C 118 Nanjanagud - SC Darshan Dhruvyanarayana 119 Narasimharaja Tanveer Salt 120 Varuna Siddaramaiah 121 T. Narasipur - SC H. C. Mahadevappa 122 Hanur R. Narendra 123 Chamarajanagar C. Puttaranga Shetty 124 Gundlupet H.M. Ganesh Parasad 125 Nippani Kakasaheb Patil 126 Gokak Mahantesh Kadadi 127 Kittur Babasaheb D. Patil 128 Saundatti Yellamma Vishwas Vasant Vaidya 129 Mudhol - SC Ramappa Balappa Timmapur 130 Bilgi J.T. Patil 131 Badami Bheemasen B. Chimmannakatti 132 Bagalkot Hullappa Y. Meti 133 Bijapur City Abdul Hameed Kajasaheb Mushrif 134 Nagthan - SC Vitthal Katakadhond 135 Afzalpur M.Y. Patil 136 Yadgir Channareddy Patil Tunnur 137 Gurmitkal Baburao Chinchansur 138 Gulbarga Dakshin Allamaprabhu Patil 139 Basavakalyan Vijay Dharam Singh 140 Gangawati Iqbal Ansari 141 Nargund B.R. Yavagal 142 Dharwad Vinay Kulkarni 143 Kalghatgi Santosh S. Lad 144 Sirsi Bhimanna Naik 145 Yellapur V.S. Patil 146 Kudligi - ST Dr Srinivas NT 147 Molakalmuru - ST N.Y. Gopalakrishna 148 Chitradurga K.C. Veerendra (Pappy) 149 Holalkere - SC Anjaneya H 150 Channagiri Basavaraju V. Shivaganga 151 Tirthahalli Kimmane Rathnakar 152 Udupi Prasadraj Kanchan 153 Kadur Anand K.S 154 Tumkur City Iqbal Ahmed 155 Gubbi S.R. Srinivas 156 Yelahanka Keshava Rajanna B 157 Yeshvanthapura S. Balraj Gowda 158 Mahalakshmi Layout Keshava Murthy 159 Padmanaba Nagar V. Raghunatha Naidu 160 Melukote Darshan Puttannaiah of Sarvodaya Karnataka Party 161 Mandya P. Ravikumar 162 Krishnarajpet B.L. Devraja 163 Belur B. Shivram 164 Madikeri Dr Mantar Gowda 165 Chamunderhwari Siddhegowda 166 Kollegal - SC A.R. Krishna Murthy 167 Raichur Mohammed Shalam 168 Sidlaghatta B V Rajeev Gowda 169 V Raman Nagar - SC S. Anand Kumar 170 Arkalgud H P Sridhar Gowda 171 Mangalore City North Inayath Ali 172 Hubli-Dharwad-Central Jagadish Shettar 173 Chikkamagaluru H D Thammaiah 174 Shiggaon Yasir Ahmed Khan Pathan 175 Lingsugur Durgappa S Hoolageri 176 Hubli-Dharwad-West Deepak Chinchore 177 Shravanabelagola M A Gopalaswamy 178 Athani Laxman Savadi 179 Raybag- SC Mahaveer Mohith 180 Arabhavi Arvind Dalwai 181 Belgaum Uttar Asif Sait 182 Belgaum Dakshin Prabhavathi Mastmardi 183 Terdal Sidappa Ramappa Konnur 184 Devar Hippargi Sharanappa T. Sunagar 185 Sindgi Ashok M. Managuli 186 Gulbarga Rural - SC Revu Naik Belamagi 187 Aurad - SC Dr Shinde Bhimsen Rao 188 Manvi - ST G Hampayya Nayak 189 Devadurga - ST Shreedevi R. Nayak 190 Sindhanur Hampan Gowda Badarli 191 Shirahatti - SC Sujatha N. Doddamani 192 Navalgund N.H. Konareddy 193 Kundgol Kusumavathi C. Shivalli 194 Kumta Nivedit Alva 195 Siruguppa - ST B.M. Nagraj 196 Bellary City Nara Bharath Reddy 197 Jagalur - ST B. Devendrappa 198 Harapanahalli N. Kotresh 199 Honnali D.G. Shanthana Gowda 200 Shimoga Rural - SC Dr Sreenivas Kariyanna 201 Shimoga H.C Yogesh 202 Shikaripura G.B. Malatesh 203 Karkal Uday Shetty 204 Mudigere - SC Nayana Jyothi Jhawar 205 Tarikere G.H. Srinivasa 206 Tumkur Rural G.H. Shanmukhappa Yadav 207 Chikkaballapur Pradeep Eshwar Ayyar 'PE' 208 Kolar Kothur G. Manjunath 209 Dasarahalli Dhanajaya Gangadharaiah 210 Chickpet R.V. Devaraju 211 Bommanahalli Umapathi Srinivas Gowda 212 Bangalore South R.K. Ramesh 213 Channapatna Gangadhar S. 214 Maddur K.M. Uday 215 Arsikere K.M. Shivalinge Gowda 216 Hassan Banavasi Rangaswamy 217 Mangalore City South John Richard Lobo 218 Puttur Ashok Kumar Rai 219 Krishnaraja M.K. Somashekara 220 Chamaraja K. Harish Gowda 221 Harihar Nandagavi Srivinas 222 Mulbagal - SC Dr. B.C Muddugangadhar 223 KR Pura D.K. Mohan 224 Pulakeshnigar - SC A. C. Srinivas Source: INC Twitter -
కర్ణాటక: సీఎం పీఠం చిచ్చు... కాంగ్రెస్‌లో ఆ నేతల మధ్య కోల్డ్ వార్?
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సారి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సిద్ధరామయ్య , పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరో రకంగా చెప్పాలంటే వారి మధ్య సీఎం కూర్చి కోసం కోల్డ్ వార్ మొదలైనట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నువ్వా- నేనా కాంగ్రెస్‌లోని ఈ ఇద్దరు నేతలు సీఎం అభ్యర్థి తామే అంటూ నేరుగా ప్రకటించకపోయినా సమయం వచ్చినప్పుడు పరోక్షంగా తమ మనసులో మాటను బయటపెడుతున్నారు. ఇప్పటికీ ఈ తరహా ఘటనలు జరిగినప్పటికీ తాజాగా డీకే శివకుమార్ ఈ అంశంలోకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును తెరపైకి తేవడం రాజకీయంగా చర్చ మొదలైంది. దీంతో పాటు 'దళిత సీఎం' పార్టీలో ముందు నుంచీ ఉంటున్నవారు, మధ్యలో వచ్చినవారు.. అనే అంశాలను తెరపైకి తీసుకురావడం ద్వారా సిద్ధరామయ్య అవకాశాలను చెక్‌పెట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నంగా కొందరు భావిస్తున్నారు. సోమవారం శృంగేరిలో శివకుమార్ విలేకరులతో ఖర్గే అంశంపై మాట్లాడుతూ.... 'ఆయన (ఖర్గే) మా సీనియర్ నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు.. ఆయన సీఎం పదవి కోరలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నదే తన కోరిక. ఆయన సీనియర్ నాయకుడని, గతంలో అన్యాయం జరిగిందని కొన్ని గొంతులు వినిపిస్తున్నాయి. పార్టీ ఏం చెబితే దానికి కట్టుబడి ఉండాలని.. అధిష్టానం ఏం చెబితే అది పాటిస్తామని, సిద్ధరామయ్య తదితరులు కూడా పార్టీకి కట్టుబడి ఉంటారని.. పార్టీనే ముఖ్యమని స్పష్టం చేశారు. -
తినే ఆహారంపై షరతులు ఏంటీ
సాక్షి, బెంగళూరు: ‘నేను పశు మాంసం తింటా. వద్దని చెప్పడానికి నువ్ ఎవరు?’ అని సీఎల్పీ నేత సిద్ధరామయ్య గోహత్య నిషేధ చట్టంపై మండిపడ్డారు. సోమవారం కాంగ్రెస్ భవన్లో పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడారు. గోహత్య నిషేధం ఆర్డినెన్స్ జారీ చేయడం సరికాదన్నారు. ప్రతి ఒక్క రైతూ పశువులను పూజిస్తాడని, అయితే తినే ఆహారంపై షరతులు ఏమిటని అన్నారు. గోహత్య నిషేధం బిల్లు కొత్తదేం కాదని, గత 1964లోనే అమలు చేశారని చెప్పారు. గో చట్టానికి ఆర్డినెన్స్ సాక్షి, బెంగళూరు: ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో విధానపరిషత్‌లో ఆమోదం పొందలేకపోయిన గో హత్య నిషేధ చట్టాన్ని యడియూరప్ప ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయనుంది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపారు. మంగళవారం గవర్నర్ వజూభాయ్‌వాలా ఆమోదం కోసం పంపుతారు. చట్టంలో సవరణలు ఇవీ ఈ సందర్బంగా న్యాయమంత్రి మాధుస్వామి మాట్లాడుతూ 1964 గోవధ నిషేధ చట్టంలో 12 ఏళ్లు దాటిన పశువును వధించవచ్చనే వెసులుబాటు ఉందని, దానిని ఈ చట్టంలో రద్దు చేశామని చెప్పారు. గోహత్యకు పాల్పడేవారు, సహకరించేవారు శిక్షార్హులన్నారు. పశుమాంసం తినేవారు, చర్మాల వ్యాపారులపై ఎలాంటి నిర్బంధం ఉండబోదన్నారు. ఆస్తి పన్ను పెంపునకు ఓకే ►రాష్ట్రంలో ఆస్తి పన్నును పెంచారు. సుమారు 15 నుంచి 30 శాతం వరకు పెరగవచ్చు. కరోనా వల్ల తగ్గిన రాబడిని పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రజలపై బాదుడుకు సిద్ధమైంది. ►నవరి 1వ తేదీ నుంచి యథావిధిగా టెన్త్, పీయూసీ తరగతులు ప్రారంభం. ►నూతన సంవత్సర వేడుకలను ప్రజలు సరళంగా జరుపుకోవాలి. -
బీజేపీ ప్రభుత్వానిది పిరికి చర్య: సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు: గోవధ నివారణ, పశువుల సంరక్షణ బిల్లు-2020ను కర్ణాటక ప్రభుత్వం బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం ఆవులు, దూడలను వధించకూడదు. చట్టవిరుద్ధంగా ఆవులను అమ్మడం, రవాణా చేయడం లేదా నరకడం శిక్షార్హం అవుతుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లు ఆమోదించడంతో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని ట్విటర్లో దుయ్యబట్టారు. గోవధ బిల్లును శాసనసభలో కనీసం చర్చించకుండానే యడియూరప్ప ప్రభుత్వం ఆమోందించిందని, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. బీజేపీ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ బిల్లులు ఎజెండాలో లేవని రాష్ట్ర బిజినెస్ అడ్వయిజరీ కమిటీ తెలియజేసిందని గుర్తుచేశారు. బిల్లును చర్చించలేని పిరికి ప్రభుత్వం బీజేపీ అని, అందుకే యడియూరప్ప ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తుందన్నారు. అవినీతి నిరంకుశ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. బీజేపీ అరాచకాలను ప్రజలకు తెలియజేస్తామని ట్విటర్లో పేర్కొన్నారు. -
మాజీ సీఎంకు కరోనా పాజిటివ్
సాక్షి, బెంగళూరు : కరోనా మహమ్మారి కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కరోనా బారిన పడగా, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్షనేత మాజీ సీఎం సిద్ధరామయ్య (71) కు కరోనా సోకింది. ఈ విషయం సిద్ధరామయ్య ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, స్వల్ప లక్షణాలున్నప్పటికీ వైద్యుల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరానని ప్రకటించారు. అలాగే తనతో సన్నిహితంగా మెలిగినవారు అప్రమత్తం కావాలని, స్వీయ నిర్బంధం పాటించాలని ట్వీట్ చేశారు. సిద్దరామయ్య ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఇదే ఆసుపత్రిలో సీఎం యడ్యూరప్ప కూడా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. I have been tested positive for #Covid19 & also been admitted to the hospital on the advice of doctors as a precaution. I request all those who had come in contact with me to check out for symptoms & to quarantine themselves. — Siddaramaiah (@siddaramaiah) August 4, 2020 -
సిద్ధు బాగున్నారా.. యడ్డి పరామర్శ
సాక్షి బెంగళూరు: నిత్యం రాజకీయంగా కత్తులు దూసుకునే నాయకులు కలిశారు. మాజీ సీఎం సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి యడియూరప్ప పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతూ యాంజియోప్లాస్టీ ఆపరేషన్ చేయించుకున్న సిద్ధరామయ్య ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి యడియూరప్ప, గ్రామీణాభివృద్ధి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప, హోం మంత్రి బసవరాజు బొమ్మాయి తదితరులు సిద్ధరామయ్యను పరామర్శించారు. ‘నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఎలాంటి సమస్య లేదు. శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం మామూలుగానే ఉన్నాను’ అని సిద్దరామయ్య తెలిపారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని డాక్టర్లు సూచించినట్లు చెప్పారు. -
బీజేపీకి కర్ణాటక కిక్కు
ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతున్న కాంగ్రెస్‌కు సోమవారం వెలువడిన కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లోనూ అదే పునరావృతం అయింది. ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో కేవలం రెండే దక్కడంతో ఈ పరాజయానికి నైతికబాధ్యత వహించి కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు రాజీనామా చేశారు. అంచనా లకు మించి 12 స్థానాలు గెల్చుకున్న బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. అభ్యర్థుల ఎంపికనూ, ప్రచార బాధ్యతల్ని తన భుజస్కంధాలపై వేసుకున్న ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికలు రాజకీయంగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి. బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి. మహారాష్ట్రలో ఊహించనివిధంగా కూటమి భాగస్వామి శివసేన విప క్షాలతో చేతులు కలిపి తమకు అధికారం దక్కకుండా చేసింది. పైగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్‌లో ఇంకా మూడు దశలు పూర్తి కావలసి ఉంది. అక్కడ పాత మిత్రుల్ని వదిలించుకుని ఒంట రిగా బరిలోకి దిగాల్సివచ్చింది. ఇలాంటి సమయంలో అంచనాలను మించి ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీకి జవసత్వాలనిచ్చింది. కర్ణాటకలో నిరుడు మే నెలలో జరిగిన శాసనసభ ఎన్ని కల్లో ఈ 15 స్థానాల్లో పన్నెండింటిని కాంగ్రెస్ గెల్చుకోగా, మూడుచోట్ల జేడీఎస్ విజయం సాధిం చింది. వీరు, వీరితోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరానికి ఫిరాయించడంతో 14 నెలల పాటు పాలించిన హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం మొన్న జూలైలో కుప్పకూలింది. మరో రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందువల్ల వాటికి ఉపఎన్నికలు జరగలేదు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో తమకు గరిష్టంగా 9 స్థానాలు రావొచ్చునని బీజేపీ అంచనా వేసుకుంది. కానీ ఫలితాలు దాని అంచనాలను మించాయి. పైగా జేడీఎస్‌కు కంచుకోట అయిన ఓల్డ్ మైసూరు ప్రాంతంలోని మాండ్యా జిల్లాలో తొలిసారి బీజేపీ విజ యకేతనం ఎగరేసింది. అక్కడ కృష్ణరాజపేటె స్థానం తన ఖాతాలో వేసుకుంది. జేడీఎస్‌కు దన్నుగా ఉండే వొక్కళిగ జనాభా అధికంగా ఉన్న స్థానమిది. 224మంది సభ్యులుండే కర్ణాటక శాసనసభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస మెజారిటీ 113. ఇప్పటికే బీజేపీకి 105 స్థానా లుండగా, ఉప ఎన్నికల తర్వాత దాని బలం 117కి చేరుకుంది. ఫిరాయింపు రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటారని, అందువల్ల ఫిరాయింపుల కార ణంగా సభ్యత్వం కోల్పోయి, బరిలో నిలిచిన వారంతా ఓటమి పాలవుతారని రాజ్యాంగ నైతికతను కోరుకునే వారంతా ఆశించారు. ఈ ఫిరాయింపులతో అధికారం పోగొట్టుకున్న కాంగ్రెస్, జేడీఎస్‌లు సైతం అలాగే కోరుకున్నాయి. జనమంతా ఫిరాయింపుదార్లకు గట్టిగా బుద్ధి చెబుతారని భావిం చాయి. అయితే ప్రజలు కేవలం ఫిరాయింపుల అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని భావించడం దురాశ. ఈ ఫిరాయింపుల కారణంగా పతనమైన కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అంతక్రితం 14 నెలలపాటు ఎలా పాలించిందో కూడా వారు అంచనా వేసుకున్నారు. ఆ 14 నెలలూ రెండు పార్టీలూ పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడమే సరిపోయింది. రెండు మూడు సందర్భాల్లో అప్పటి సీఎం కుమారస్వామి కంటతడి పెట్టారు. ఏం చేద్దామనుకున్నా తనకు అడ్డంకులు ఎదురవు తున్నాయని ఆయన వాపోయారు. కేవలం బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడం కోసం కలవడం తప్ప రాజకీయంగా ఆ రెండు పార్టీలూ ఒక ఉమ్మడి ఎజెండా రూపొందించుకోలేక పోయాయి. వరస వివాదాల్లో ఆ పార్టీలు తలమునకలై ఉండగా ఉపాధి లేమి, కరువుకాటకాలు రాష్ట్రాన్ని పీల్చిపిప్పి చేశాయి. వీటన్నిటినీ ప్రజలు మరిచిపోలేదు. కనుకనే ఫిరాయింపుదార్ల అనైతిక రాజకీయాల గురించి ఎంత ప్రచారం చేసినా వారు పట్టించుకోలేదు. బీజేపీ ప్రచారం చేసిన సుస్థిర పాలన, అభివృద్ధికే వారు ఓటేశారు. ఉదాహరణకు కృష్ణరాజపేటె స్థానం నుంచి నిరుడు తమ పార్టీ అభ్యర్థిగా గెలిచి బీజేపీకి ఫిరాయించిన నారాయణగౌడపై జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గట్టిగా ప్రచారం చేశారు. రాజకీయంగా తమ గొంతు కోసిన ఆయనను చిత్తుగా ఓడించాలని ఎంతో ఉద్వేగంతో పిలుపునిచ్చారు. కానీ జనం నారాయణగౌడకే పట్టంగట్టారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెల్గాం జిల్లాలో గెలుపుపై బీజేపీ నేతల్లోనే అనుమానాలున్నాయి. పొరుగు రాష్ట్రంలోని పరిణామాలు ఈ ఉప ఎన్నికలపై ప్రభావాన్ని చూపుతాయని వారు భావించారు. కానీ అక్కడ కూడా విజయం సాధించడం వారిని ఉత్సాహపరిచింది. ఈ ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి యడియూరప్పకు రాజకీయంగా ఊపిరిపోశాయి. నిజానికి ఆయన ఒకరకంగా గడ్డుపరిస్థితిని ఎదుర్కొన్నారు. 75 ఏళ్లు దాటిన నేతలు ముఖ్య పదవుల నుంచి వైదొలగాలన్న సూత్రానికి విరుద్ధంగా బీజేపీ ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టక తప్ప లేదు. ఫిరాయింపుదార్లందరికీ టికెట్లివ్వడానికి అధిష్టానం సుముఖంగా లేదన్న వార్తలొచ్చాయి. కానీ యడియూరప్ప పట్టుబట్టి పార్టీ టిక్కెట్లు వచ్చేలా చేశారు. పైగా గెలిస్తే వీరికి మంత్రి పదవులు ఇస్తామని కూడా ప్రచారసభల్లో చెప్పారు. అది ఎంతవరకూ సాధ్యమో చూడాల్సివుంది. పార్టీ కేంద్ర నాయకులెవ్వరూ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలో మాత్రమే కాదు... దేశంలో కూడా పార్టీ ప్రతిష్టను యడియూరప్ప పెంచగలి గారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను మరింత కుంగదీసే ప్రమాదం ఉంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిస్తేజంగా ఉండటం, రాష్ట్రంలో పార్టీ సారథులు రాజీనామాలు చేయడం నైతికంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలను కుంగదీస్తుంది. రాజకీయంగా తమ భవిష్యత్తేమిటన్న గాభరా కలిగిస్తుంది. ఇప్పుడు సుస్థిర మెజారిటీ లభించింది గనుక బీజేపీ ప్రభుత్వం ఇక పాలనపై దృష్టి పెట్టాలి. ఆంతరంగిక కలహాల్లో తలమునకలైతే ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్‌లకు ఎదురైన చేదు అనుభవమే మున్ముందు బీజేపీకి కూడా తప్పకపోవచ్చు. -
మళ్లీ నోరుజారిన సిద్ధరామయ్య
శివాజీనగర: ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య నోరుజారుతూ చిక్కుల్లో పడుతున్నారు. బీదర్‌లో గతవారం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని వ్యాఖ్యానించి ఆ తరువాత నాలుక్కరుచుకున్న ఆయన మరోసారి నోరుజారారు. ముఖ్యమంత్రి కుమారస్వామిని మాజీ ముఖ్యమంత్రి అని సంబోధించి నాలుక్కరచుకున్నారు. సోమవారం నగరంలోని హారోహళ్ళిలో సంకీర్ణ అభ్యర్థి కృష్ణభైరేగౌడ తరఫున ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ నేను ఇంకా అనేకచోట్ల ప్రచారాల్లో పాల్గొనాల్సి ఉంది, అందుచేత నేను తక్కువగా మాట్లాడుతాను, తరువాత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వస్తారని వ్యాఖ్యానించారు. వెంటనే ‘మాజీ కాదు, మాజీ కాదు’ అంటూ జనంలో నుంచి కొందరు కేకలు పెట్టారు. తప్పు గుర్తించిన సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి కుమారస్వామి వస్తారని తెలిపారు. సిద్ధు ప్రసంగిస్తూ జేడీఎస్ అధినేత హెచ్.డీ.దేవేగౌడ బెంగళూరు ఉత్తర నుంచి పోటీ చేయాలని ఒత్తిడి ఉండేది. అయితే తుమకూరు ప్రజల కోరిక మేరకు అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా కృష్ణభైరేగౌడను ఎంపిక చేశామని చెప్పారు. కేంద్ర మంత్రి డీ.వీ.సదానందగౌడ నిష్క్రియాపరుడఉ, ఆయన మీకు ముఖం చూపించారా? ఆయనకు ముఖం చూపించే శక్తి లేదు అని విమర్శించారు. అందుచేత మోదీ ముఖం చూసి ఓటు వేయాలని చెబుతున్నారని అన్నారు. ఈలోగా సీఎం కుమారస్వామి ప్రచారానికి వచ్చారు. -
‘టెంపుల్’రన్‌ను తలపించిన వందరోజులు
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటకలో జేడీ(ఎస్)-కాంగ్రెస్‌ల కూటమి అధికార పగ్గాలు చేపట్టి నేటికి(గురువారానికి) వంద రోజుల పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి, జేడి(ఎస్) చీఫ్ హెచ్డి. కుమారస్వామి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ తీరుపట్ల రాహుల్ సంతృప్తిగా ఉన్నట్లు కుమారస్వామి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు, పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత హుందాగా, దూకుడుగా పనిచేయాలని సూచించినట్లు వివరించారు. కర్ణాటకలో జరుగుతున్న అభివృద్ది గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. చేసిన పనులు.. 12 ఏళ్ల తర్వాత కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి పలు పథకాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జాతీయ బ్యాంకుల్లో రైతుల రుణాల మాఫీ చేశారు. బెంగళూరులో ఇష్టారాజ్యంగా నెలకొల్పిన పరిశ్రమలపై చర్యలు తీసుకున్నారు. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోరాకు పోరాడుతున్న ఉద్యమకారులను శాంతింపచేయడానికి రెండో రాజధాని ప్రతిపాదనను తీసుకొచ్చారు. బెలగావీ నగరాన్ని రాష్ట్రానికి రెండో రాజధానిగా చేస్తామని కుమారస్వామి ప్రకటించారు. బెలగావీకి రెండో రాజధాని హోదా కట్టబెడుతూ 2006లో నాటి జేడీఎస్- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు (కర్ణాటక నీరావరీ నిగమ్, కృష్ణభాగ్య జల నిగమ్, సమాచార కమిషనర్ కార్యాలయం) బెలగావి నగరానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని 13 జిల్లాలో పర్యటించి వారి సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. కుమారస్వామి ‘టెంపుల్’రన్ కుమారస్వామి అభివృద్ధిపై కంటే సీఎం పీఠం కాపాడుకోవడానికే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఐదేళ్లు పదవిలో ఉండాలని ఇప్పటివరకు యాభైకి పైగా వివిధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, దర్గాలు తిరిగారని విమర్శిస్తున్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రి అవ్వటం నచ్చని మాజీ సీఎం సిద్ద రామయ్య అసంతృప్తిగా ఉన్నారు. జేడి(ఎస్) ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆయన తీవ్రంగా విమర్శించారు. కర్ణాటకలో భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. ఏరియల్ సర్వేలో భాగంగా కుమారస్వామి విమానంలో పేపర్ చదవటం, మంత్రి రేవన్న వరద బాధితులపై బిస్కట్ ప్యాకట్లు విసరటంపై విపక్షాలు మండిపడ్డాయి. -
మాజీ సీఎం కోసం స్పీకర్‌ను ఖాళీ చేయించారు
బెంగుళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాష్ట్ర విధాన సౌధలో ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించారు. ప్రస్తుతం స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ కార్యాలయంగా ఉన్న రెండు గదులను సిద్ధరామయ్యకు కుమారస్వామి ప్రభుత్వం కేటాయించింది. సిద్ధరామయ్యకు ఎలాంటి పదవీ లేనప్పటికి ఆయనకు కార్యాలయాన్ని కేటాయించారు. అయితే మాజీ సీఎం కోసం స్పీకర్‌ను ఖాళీ చేయించడం ఏంటని హాట్ టాపిక్‌గా మారింది. కాగా మాజీ స్పీకర్ కేబీ కోలివాడ్ ఆ కార్యాలయాన్ని వినియోగించిన కాలంలో 68 లక్షల ఖర్చుతో దాన్ని ఆధునీకరించారు. కాంగ్రెస్ మద్దతుతో కుమార స్వామి ముఖ్యమంత్రిగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో సిద్ధరామయ్యకు ఎలాంటి మంత్రి పదవి కేటాయించలేదన్న విషయం తెలిసిందే. -
ప్రకాశ్‌రాజ్ ఆవేశపరుడు.. అది నాకు నచ్చలేదు
సాక్షి, బెంగుళూరు : సిద్ధరామయ్య అసమర్థ ముఖ్యమంత్రి అని ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని సినీనటుడు సాయికుమార్ విమర్శించారు. త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన పలు సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలు రాజకీయంగా సహనం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా పవిత్ర జలం.. పవిత్ర మట్టి అంటూ మోదీని కీర్తించిన తెలుగుదేశం పార్టీ నేతలు, విమర్శించడంలో అర్థం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారని.. అది వాస్తవం అని, వైఎస్ జగన్‌ను ఫాలో అవడమే టీడీపీ విధానమా అంటూ సాయికుమార్ ప్రశ్నించారు. రాజకీయ పార్టీకి సొంత ఆలోచనలు, విధానాలు ఉండాలని టీడీపీ నేతలకు సూచించారు, తెలుగుదేశం పార్టీ, నేతలకు అవి ఏమాత్రం లేవంటూ దుయ్యబట్టారు. తన తోటి నటుడు ప్రకాశ్ రాజ్ ఆవేశపరుడంటూ వ్యాఖ్యానించారు. మోదీని టార్గెట్ చేయడం తనకు నచ్చలేదన్నారు. దేశంలో ఏది జరిగినా ప్రధాని మోదీనే కారణం అని అనడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిపోయిందని, అది వారి అవివేకం అంటూ మండిపడ్డారు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాయి కుమార్ బీజేపీ తరపున బాగేపల్లి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
తెలుగు ప్రజలు కాంగ్రెస్‌కు ఎప్పుడూ అండగా ఉంటారు
-
ఇవి భాషాప్రయుక్త ఎన్నికలు
గడచిన సంవత్సరం జూలైలో బెంగళూరు మెట్రో రైలు వ్యవస్థకు చెందిన పలు స్టేషన్లు దాడికి గురయ్యాయి. ఆ దాడులన్నీ దాదాపు ఏకకాలంలోనే జరిగాయి కూడా. కన్నడ ఆందోళనకారులు, ముఖ్యంగా కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు హిందీలో రాసి ఉన్న బోర్డుల మీద నల్ల రంగు పూశారు. హిందీ భాషకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. వెంటనే మెట్రో రైల్ అధికారులు స్పందించి పరిస్థితి మరింత విషమించకుండా బోర్డుల గురించి ఉన్న ఆంక్షలు తొలగించారు. హిందీలో ఉన్న పేర్లను ఇంగ్లిష్, కన్నడ భాషలలో రాయిం చారు. ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు సాధారణంగా వాటిని విశాల దృక్పథం లేని, సంకుచిత మనస్తత్వం కలిగిన సంస్థల, వ్యక్తుల చర్యలంటూ కొట్టి పారవేయడం జరుగుతుంది. తాము చెప్పేది విని తీరాలన్నట్టు వ్యవహ రించే రౌడీ మూకల పనిగా కూడా అలాంటి చర్యలను నిరసించడం జరు గుతూ ఉంటుంది. కానీ ఈ నిరసన మాత్రం ప్రత్యేకమైనదే. కన్నడ భాషకు తగిన గౌరవం దక్కడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన ఉద్యోగుల మద్దతు కూడా ఈ ఆందో ళనకు ఉంది. కన్నడం అంటే చులకనా? నేను గత వారం బెంగళూరులో ఉన్నప్పుడు వసంత్ శెట్టి, వల్లీశ్ అనే ఇద్దరు భాషా శాస్త్రవేత్తలను కలుసుకున్నాను. వారిద్దరిలోనూ కనిపించిన సారూ ప్యత, కర్ణాటకలో కూడా ప్రాధాన్యక్రమంలో కన్నడకు హిందీ తరువాత స్థానంలోకి ¯ð డుతున్నారనే భావనే. కన్నడిగులకు హిందీ అనుసంధాన భాష కాలేదన్నది ఆ ఇద్దరి వాదన. మరొక విషయాన్ని శెట్టి చాలా ఆర్ద్రంగా చెప్పారు. కన్నడ భాషలో మాట్లాడని బ్యాంకు సిబ్బంది, తపాలా శాఖ సిబ్బంది ఉన్నారనీ, రైల్వేశాఖలో అయితే కన్నడను అసలు పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. ఇలాంటి ధోరణే ప్రజలలో హిందీ పట్ల ఒకరకమైన భయాన్ని, తమ పట్ల తమకు అభద్రతా భావాన్ని కలిగిస్తున్నదని కూడా శెట్టి చెప్పారు. కానీ ఇది కేవలం భాషను గురించిన వ్యవహారం కాదు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భాష గురించిన అంశం కన్నడిగుల ఉనికి, ఆత్మగౌరవాలతో ముడిపడిపోయింది. దీనికి తోడు హిందీలో ప్రసంగించేవారి కంటే, కన్నడ భాషలో ప్రసంగించేవారు తక్కువ అన్న భావం బలం పుంజు కుంటోంది. వల్లీశ్ చెప్పిన మరో అంశం చాలా కలవరపాటుకు గురిచేసింది. ఇంత వైవిధ్యం ఉన్న భారత్ వంటి దేశంలో భిన్నత్వాన్నీ, అందులోని అనే కానేక అస్తిత్వాలనీ ప్రభుత్వం గౌరవించాలని ఆయన అన్నారు. విద్యావం తుడైన ఒక కన్నడిగుడి అభిప్రాయం ఎలా ఉందో సుస్పష్టంగా గమనించడా నికి ఆయన మాటలలోనే ఆ విషయం చెబుతాను. ‘మనకి ఇండియన్ అన్న ఒక్క అస్తిత్వం మాత్రమే ఉందని ఎవరూ చెప్పలేరు. ఇది అన్నింటినీ తుడిచి పెట్టేస్తుంది. ఒకే అస్తిత్వాన్ని ఇతరుల మీద కూడా ప్రయోగించలేం. నీవు ఇండియన్‌వి అయితే హిందీని ఆమోదించు, కన్నడిగుడివి అని చెబితే నీవు తక్కువ రకం ఇండియన్‌వి అన్న ఊహలు భారత్ అన్న భావనతో మమేకం కావడానికి దోహదం చేయవు.’ అని చెప్పారు వల్లీశ్. ఇలా తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారన్న అభిప్రాయం ఒక్క బెంగళూరులోనే కాదు, దక్షిణ భారత ప్రజలలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే త్రిభాషా సూత్రమనేది హిందీని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దడానికి ఉద్దేశించిన పెద్ద మాయ అన్న భావన కూడా నానాటికి పెరుగుతున్నది. ఇది ఒక్క భాషకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. రామాయణ కావ్యం గురించే చూద్దాం. వాల్మీకి రామాయణం ఒక్కటే అసలైన రామాయణమని ఔత్తరాహుల దృఢాభి ప్రాయం. కానీ దక్షిణాదిన చాలా రామాయణాలు ఉన్నాయి. తమ తమ విశ్వాసాల గురించి, జన్మభూమి గురించి ప్రతి తరం విశ్లేషించుకోవడానికి ప్రతి సంస్కృతిలోనూ ఒక రామాయణం అవతరించడం కనిపిస్తుంది. ఏక శిలా సదృశమైన సంస్కృతినే అనుసరించాలని, అది అందరికీ సరిపోతుందని బలవంతం చేస్తే దానికి వెంటనే ప్రతిఘటన తప్పదు. కన్నడ విషయంలో గుర్తించవలసిన అంశం ఏమిటంటే, మిగిలిన భాషల మాదిరిగానే ఇది కూడా కేవలం ఒక మాధ్యమమని చెప్పడానికి పరిమితం కారాదు. ఇదొక ఉద్వేగం. తెగేదాకా లాగవద్దు ఇక ప్రత్యామ్నాయ అభిప్రాయం గురించి కూడా తెలుసుకోవాలి. రాష్ట్రాలని ప్రాంతీయవాదపు దీవులుగా మలచడం భారత్ ఒకే జాతి అన్న భావనకు ఆరోగ్యకరం కాదు. భారతదేశ రాష్ట్రాలను కలిపి ఉంచే శక్తి కలిగిన భావో ద్వేగమేదీ లేదన్న అనుమానం నుంచి ఇది జనిస్తుంది. నిజానికి ఈ వ్యతిరేకత వాస్తవమే. ఒక జాతిగా మనం సురక్షితంగానే ఉన్నాం. అయితే దేశం మరింత బలమైన సమాఖ్యగా ఎదగడానికీ, మరింతగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్రా లకు అవకాశం కల్పించడానికీ సమయం ఆసన్నమైంది. అదే సమయంలో కర్ణాటక భాష సమస్యను తెగేదాకా లాగడం సరికాదు. అది హిందీ వ్యతిరేక ధోరణికి మళ్లిందంటే కర్ణాటక, బెంగళూరుల అభివృద్ధికి ఇతర ప్రాంతాల వారి ద్వారా జరిగిన కృషి మరుగున పడేటట్టు చేస్తుంది. గుర్తించవలసిన మరొక అంశం కూడా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది కన్నడ భాష ఒక్కటే కాదు. రాష్ట్రంలో ఇంకా తుళు, కొడవ, కొంకణి, ఆఖరికి హైదరాబాద్–కర్ణా టక పరిధిలో దక్కనీ ఉర్దూ కూడా ఉన్నాయి. గట్టిగా చెప్పాలంటే కన్నడ భాష ఆధిపత్యం పాత మైసూరు పరిధిలోని ఐదు లేదా ఆరు జిల్లాలకే పరిమితం. బెంగళూరుకు ఉన్న కాస్మోపోలిటన్ సంస్కృతిని కూడా మరచిపోలేం. కాబట్టి ప్రాంతీయ జ్వాలని ఒక స్థాయికి మించి మండనిస్తే దానితో చాలా చిక్కులు ఉంటాయి. బయటి ప్రాంతాల వారు వచ్చి రాష్ట్ర అభివృద్ధి యంత్రాంగానికి ఎంతో దోహదం చేశారన్న వాస్తవాన్ని గుర్తించాలి. కాబట్టి కన్నడ అస్తిత్వాన్ని రాజకీయ ప్రయోజనాలకు మించి ఎదగనిస్తే అవాంఛనీయ పరిణామాలు తప్పవు. కర్ణాటక రాష్ట్ర ఆదాయ వివరాలను ఒకసారి పరిశీలించండి. అందులో 60 శాతం ఒక్క బెంగళూరు మహా నగరం నుంచే వస్తుంది. ఉత్తర కర్ణాటక వంటి చాలా వెనుకపడిన ప్రాంతాన్ని ఆదుకుంటున్నది ఆ ఆదాయమే. ఇక ఈ ఎన్నికలలో బీజేపీని కలవరానికి గురి చేసే విషయం ఏదంటే, ఆ పార్టీ మీద ఉన్న ఉత్తరాది ముద్ర. అంటే హరియాణా, యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు పరిమితమైన పార్టీ అన్న అవగాహన. ఇదే బీజేపీ వాద వ్యతిరేక, హిందీ భాషా వ్యతిరేక అభిప్రాయాలకు ఆస్కారం ఇస్తున్నది. భాష కొన్నిసార్లు ఆధిక్యం ప్రదర్శించడానికి ఉపయోగపడే సాధనమవు తుంది. కానీ బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్ కొన్నిసార్లు భాషా వ్యతిరేక సెంటిమెంట్‌గా కూడా వ్యక్తమవుతోంది. ఇప్పుడు జరగబోతున్న కర్ణాటక శాసన సభ ఎన్నికలలో భాష కీలకమైన అంశంగా మారింది. జాతీయవాద మనే బీజేపీ కార్డుకు పదును లేకుండా చేయడానికి కాంగ్రెస్ ప్రాంతీయ అస్తి త్వాన్ని ముందుకు తేవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల రథాన్ని నడిపిస్తున్న సిద్ధరామయ్య తన రాజకీయ జీవితంలో ఎక్కు వగా, ఆఖరికి జనతా పరివార్‌లో ఉండగా కూడా అస్తిత్వ రాజకీయాలనే ప్రధానంగా ఆశ్రయించారు. అదే ఆయన బలం. జాతీయ వాదం, ఒకే జాతి, ఒకే పతాకం అనే బీజేపీ భావనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయిలో కన్నడ అస్తిత్వం అనే కార్డును ప్రయోగి స్తున్నది. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గుజరాతీ అస్మిత కార్డును ప్రయోగించిన తీరులోనే సిద్ధరామయ్య కర్ణాటకలో తన ఆయుధాన్ని ఇప్పుడు ప్రయోగిస్తున్నారు. హిందీ, హిందూ, హిందుస్తానీ పార్టీగా బీజేపీకి ఉన్న ముద్రను ఉపయోగించుకుని సిద్ధరామయ్య కన్నడ ఆత్మగౌరవం అనే కార్డును రంగం మీదకు తెచ్చారు. రాష్ట్ర పతాకం అన్న సిద్ధరామయ్య ఆలోచన కూడా మిగిలిన భారతదేశం కంటే కర్ణాటక ప్రత్యేక ఉనికిని ప్రకటించడానికేనని ఆయన ప్రత్యర్థులు చెబుతారు. నిజానికి కర్ణాటక తనకంటూ ఒక ప్రత్యేక పతాకాన్ని ఏర్పరచుకుంటే దాని గురించి మిగిలిన భారతదేశం కలతపడ వలసిన అవసరం ఉందా? క్రికెట్ రంగాన్ని చూడండి. అందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉప జాతీయతను ప్రదర్శిస్తూ ఉంటుంది. దీనిని దేశానికి అతీ తంగా ప్రదర్శిస్తున్న ఆత్మగౌరవమని అంటామా? అది కాదు. పైగా తన నగరం నుంచి లేదా ప్రాంతం నుంచి తమ ఉనికిని ప్రదర్శించడం పట్ల ఆయా ప్రాంతాల ప్రజలు ఆనందిస్తారు. చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైద రాబాద్– ఇలా. కర్ణాటక పతాకం కూడా ఇంతకంటే భిన్నమైనది కాదు. కర్ణాటక ప్రజలకు పరీక్షే సిద్ధరామయ్య పన్నిన ఉచ్చులో తాము ఇరుక్కున్నామన్న వాస్తవాన్ని కర్ణాటక బీజేపీ నాయకులు గ్రహించారన్న సంగతి వారిని కలుసుకున్నప్పుడు నాకు అవగాహనకు వచ్చింది. దీనితోనే కన్నడిగ అస్తిత్వం కోసం కాంగ్రెస్ ఏ విధంగా పాటు పడుతున్నదో తాము కూడా అదే విధంగా పాటు పడతామన్న రీతిలో బీజేపీ వ్యవహరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. హిందీ, కన్నడ భాష అంశం ఈ స్థాయికి చేరుకోవడం శోచనీయం. ఇదే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య నిధుల కేటాయింపు వివాదంలో ప్రతిఫలిస్తున్నది. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర నిధులను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. దీనికి సిద్ధరామయ్య ఇచ్చిన సమాధానం ఇది– కేంద్రానికి కర్ణాటక పన్నుల రూపంలో చెల్లిస్తున్న ప్రతి రూపాయికి తిరిగి పొందుతున్నది 47 పైసలేనని అన్నారు. ఉత్తరాది బీమారు రాష్ట్రాలు (బిహార్, ఎంపీ, రాజస్తాన్, యూపీ) తమ తమ పరిధుల లోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నిధుల కోసం తల్లడిల్లు తుండగా, వాటికి కర్ణాటక రాయితీలు కల్పిస్తున్నదని సిద్ధరామయ్య ఇక్కడ చెప్పదలిచారు. ఈ ఎన్నికలు కొన్ని చేదు వాస్తవాలను మనముందు పెడుతున్నాయి. ఎక్కువగా మాట్లాడని కర్ణాటక రాష్ట్రానికి బియ్యం సబ్సిడీని తగ్గిం చడం, గోరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చే రాష్ట్రానికి ఆ సబ్సిడీని కేటాయించడం ఎంతవరకు సబబు? ఇది ఉత్తర భారత, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య వివక్ష చూపించడం కాదా? ఈసారి కర్ణాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు ఆ రాష్ట్ర ప్రజలకు పరీక్ష వంటివని నాకు అనిపిస్తున్నది. వారి అస్తిత్వానికి, వారి ఆత్మ గౌరవా నికి, వీటిలో వారు దేనిని ఆహ్వానించారు, దేనిని తిరస్కరించారన్నదానికి వారి ఎంపిక వ్యాఖ్యానం వంటిది. అలాగే ఈ విషయాలతో సంబంధం ఉన్న వారందరూ ఈ ఎన్నికల నుంచి నేర్చుకోవాలి. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
సిద్ధుకు సారథ్యం కాంగ్రెస్‌లో సంకటం
గతంలో ఎన్నడూలేనట్లుగా సీల్డ్ కవర్ సంస్కృతికి భిన్నంగా రాహుల్‌గాంధీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించడం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంక తమ ఆశలు గల్లంతేనా అనే నిరాశ సీనియర్లలో వ్యాపించింది. అధినేత మాట కాబట్టి ఎవరూ బయటపడడం లేదు. సాక్షి, బెంగళూరు: ‘కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధరామయ్యే. ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం’ అని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ ఆదివారం రాత్రి బెంగళూరు సభలో ప్రకటించారు. ఇప్పుడిదే రాష్ట్ర కాంగ్రెస్‌లో వేడి పుట్టిస్తోంది. మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే తామే ముఖ్యమంత్రి అయిపోదామని కాంగ్రెస్‌లో చాలా మంది కలలు కంటూ కూర్చొన్నారు. ఈ తరుణంలో రాహుల్‌గాంధీ వారి ఆశలపై నీళ్లు చల్లారు. గత ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ముఖ్యమంత్రి స్థానం చేజారిపోయిందని ఇప్పటికీ చింతిస్తున్న కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు అధినేత మాటలతో నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. దళిత వర్గం కోటా నుంచి మల్లికార్జున ఖర్గే, ఎంపీ కేహెచ్ మునియప్పలు కూడా సీఎం రేసులో ఉన్నారు. పరమేశ్వర్‌కే పెద్ద దెబ్బ 2013 ఎన్నికల్లో పరమేశ్వర్ కొరటగెరెలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఇందులో సిద్ధరామయ్య హస్తం ఉందని కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటుంటారు. ఈ సారి ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధరామయ్యేనని రాహుల్ ప్రకటించడంతో పరమేశ్వరకు దిక్కుతోచలేదని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఆయనతో పాటు సీఎంసీటుపై కన్నేసిన చాలా మందికి లోలోపల చింత మొదలైంది. అదే సిద్ధరామయ్య బలం సీఎం సిద్ధరామయ్య మూలతః జేడీఎస్‌కు చెందినవారు. సుమారు ఎనిమిదేళ్ల కిందట కాంగ్రెస్‌లోకి వచ్చారు. అంతకుముందు జేడీఎస్‌లో ఉండగా సిద్ధరామయ్య అహింద ద్వారా బలం పెంచుకోవడం తెలిసిందే. కాంగ్రెస్‌లో హేమాహేమీల మధ్య తన ప్రత్యేకతను చాటుకుంటూ 2013లో ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి ఏకు మేకై కూర్చొన్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అంతేకాకుండా ఇప్పటివరకు సీఎం సిద్ధరామయ్యపై బలమైన అవినీతి ఆరోపణలు లేవు. మిగతా నాయకులు అంత బలవంతులు కాదు. దీంతో సిద్ధరామయ్యకు పార్టీలో తిరుగే లేకుండా పోయింది. కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద పెద్ద నియామకాల వరకు అన్నీ సిద్ధరామయ్య చేతిలోకి వచ్చేశాయి. దీంతో ఖర్గే, ఎస్ఎం కృష్ణవంటి సీనియర్ల ప్రభ కూడా మసకబారింది. పరిపాలనలో తనదైన ముద్రను చూపిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌కు తానే దిక్కనే స్థాయికి ఎదిగారు. -
కమలం వికసిస్తుందా... హస్తం పిడికిలి బిగిస్తుందా...
వేసవికాలం ఎండలకు సమాంతరంగా కర్ణాటకలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ బలగాలను మోహరిస్తున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ ఉపఎన్నికల్లో దెబ్బతిన్న (సాక్షి ప్రత్యేకం) బీజీపీకి కర్నాటక ఎన్నికల్లో పాగా వేయడం తక్షణ అవసరం. అలాగే నరేంద్రమోడికి వ్యతిరేకంగా భావ సారూప్యత ఉన్నా లేకున్నా శత్రువు శత్రువులని కూడగట్టుకొని బీజేపీని చావుదెబ్బకొట్టి కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడం రాహుల్ గాంధీకి తక్షణ కర్తవ్యం. ఎన్నికలు కర్ణాటక విధానసౌధ కోసం అయినా.... నమో, రాగాలకు ఇవి 2019 ఎన్నికలకు ముందు ప్రతిష్టాత్మకమైనవే.. గణాంకాలు ఏమి చెప్పినా, కుల సమీకరణాలు ఎలా ఉన్నా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి రెండు పార్టీలు సిద్ధంగా లేవు. గత అసెంబ్లీ ఎన్నికలకు (2013) ముందు కర్ణాటక జనతాపక్ష పార్టీ ఏర్పాటు చేసి 9.8 శాతం ఓట్లు 6 సీట్లు సాధించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి సొంతగూటికికి చేరి బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తన అదృష్టాన్ని, పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 75 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విమర్శలు దాడి మొదలు పెట్టేసారు. ఫిబ్రవరి 4న జరిగిన బెంగుళూరు సభలో ప్రధాని నరేంద్రమోడి సిద్ద రామయ్య ప్రభుత్వ అవినీతిని ఉద్దేశించి ‘‘10 శాతం ప్రభుత్వం’’ గా చిత్రీకరించారు. కర్ణాటకలో రాజకీయ హింస కాదు... రాజకీయ తీవ్రవాదం రాజ్యమేలుతోందని దాడికి దిగారు. గత అయిదు సంవత్సరాల్లో 23 మంది బీజేపీ నాయకుల హత్యలు జరిగాయనేది ఆ పార్టీ ఆరోపణ. అదే సమయంలో గౌరీలంకేశ్ హత్యపై ప్రధాని మౌనం ఇబ్బంది కలిగించే అంశమే. ఫిబ్రవరి 4కి ఇప్పటికి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఉత్తరప్రదేశ్, బీహార్ ఎన్నికల్లో బీజీపీ చావుదెబ్బతినడం ఆ పార్టీ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ని ప్రచారస్త్రంగా వినియోగించుకోవాలన్న ఎత్తుగడ విషయంలో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. (సాక్షి ప్రత్యేకం) యోగీ ముందు ఉత్తరప్రదేశ్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని సిద్దరామయ్య విమర్శల దాడి మొదలుపెట్టారు. బీజీపీ (2008–2013) హయాంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. అవినీతి ఆరోపణలు, కుమ్ములాటలు మత ఉద్రిక్తతలు ఆ పార్టీని చావు దెబ్బ తీసాయి. 2013 ఎన్నికల్లో అధికారం కోల్పోయి 40 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేవెగౌడ పార్టీ బీజీఎస్ తో సమానంగా సీట్లు గెలుచుకున్నప్పటికి ఆ పార్టీ కన్నా తక్కువశాతం ఓట్లతో మూడోస్థానంతో సరిపెట్టుకొంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న సిద్దరామయ్య బలమైన నాయకుడిగా నిలదొక్కుకున్నారు. అయితే శాంతిభద్రతలు, అవినీతి ఆరోపణలు, రైతుల ఆత్మహత్యలు (ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు 4000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు గణాంకాలు చెపుతున్నాయి) సిద్ధరామయ్యకు ఇబ్బందికరమైన అంశాలు. బీజీపీ ఈ అంశాలనే ప్రచారాస్త్రాలుగా వాడుకొంటున్నాయి. (సాక్షి ప్రత్యేకం) ఇక 1985 తర్వాత ఏ పార్టీ కూడా కర్ణాటకలో రెండవసారి అధికారంలోకి రాలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయలేదు. దళితులు, వెనకబడిన తరగతులు, కురబలు, ముస్లింల ఓట్లపై కాంగ్రెస్ ఆధారపడుతూ వస్తోంది. లింగాయత్‌లు, బ్రాహ్మణులు బీజేపీ అండగా ఉంటోండగా మరో బలమైన పార్టీ జేడీఎస్ వక్కళిగల ఓటుబ్యాంక్‌పై నమ్మకాన్ని పెట్టుకున్నాయి. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మంట్ల వారీగా పరిశీలిస్తే బీజేపీ 132 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ 77 సీట్లలో మెజారిటీ సాధించగా, జీజీఎస్ 15 స్థానాలకే పరిమితమైంది. అయితే అప్పటి మోడీ హవా వేరు. (సాక్షి ప్రత్యేకం) గత సంవత్సర కాలంలో 10 రాష్రాల్లో ఎన్నికలు జరగగా బీజేపీ , బీజేపీ మిత్ర పక్షాలు తొమ్మిందింటిలో పాగా వేశాయి. పంజాబ్ మినహా.. దేశంలో 21 రాష్ట్రాల్లో కాషాయం జెండా రెపరెపలాడుతోంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో లింగాయత్‌లకు ప్రత్యేక మతహోదా కల్పిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర జనాభాలో 17% లింగాయత్‌లు ఇప్పటివరకు బీజేపీకి మద్దతుగా ఉన్నారు. నాలుగు దశాబ్ధాల్లో ఐదు సంవత్సరాల పూర్తి కాలం పనిచేసిన మొట్టమొదటి కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రికార్డు సృష్టించారు. ఈ ఐదు సంవత్సరాల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు సిద్ధరామయ్య. మంత్రులపైన అవినీతి ఆరోపణలు కాంగ్రెస్‌కు సిద్ధరామయ్యకు కొంచెం చికాకు కలిగించే అంశాలే. సిద్దరామయ్య చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, కన్నడిగుల ఆత్మగౌరవ నినాదంతో తలపెట్టిన ‘ప్రత్యేక జండా’ ఉద్యమం వెనుకబడిన కులాలు, దళితులు, ముస్లింల మద్దతు కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశాలు. (సాక్షి ప్రత్యేకం) ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయలేమి, కాంగ్రెస్ సంస్కృతిలో భాగమైన గ్రూపులు. కాంగ్రెస్‌కు ప్రతిబంధకాలుగా కనపడుతున్నాయి. పది సంవత్సరాల క్రితం వింధ్య పర్వతాలకు ఈవల మొదటిసారిగా పాగా వేసిన బీజేపి బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పని ముఖ్యమంత్రిని చేసింది. తర్వాత జరిగిన వివిధ పరిణామాల వల్ల ముగ్గురు ముఖ్యమంత్రులు మారి 2013లో పీఠం కోల్పోయింది. యడ్యూరప్ప తప్ప మరో బలమైన నాయకుడిని తయారు చే సుకోలేకపోయిన బీజీపి ఈ సారి కూడా యడ్యూరప్పని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేస్తోంది. (సాక్షి ప్రత్యేకం) అలాగే బీజీపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చాణక్యం, ప్రధానమంత్రి మోడీ ఆకర్షణలో గట్టెక్కాలని బీజీపి ఆరాటం. అంతర్గత కుమ్ములాటలు కూడా అధిగమించడం బీజీపికి తక్షణ అవసరం. మూడో ప్రధానమైన పార్టీ జేడీఎస్ తండ్రీకొడుకుల పార్టీ ముద్ర నుండి బయటపడలేక పోయింది. అసంఘటితరంగ కార్మికుల్లో కుమారస్వామికి మంచిపేరే ఉంది. బీఎస్సీ, వామపక్ష పార్టీలతో పొత్తు కొంత వరకు కలిసి వచ్చే అంశం. అటు రాహుల్ గాంధీ, ఇటు అమిత్‌షా సర్వశక్తులూ ధారపోసి కర్ణాటకలో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. పంజాబ్ తర్వాత హస్తం చేతుల్లో ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటక మాత్రమే. ఉత్తరప్రదేశ్, బీహార్ ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బతిన్న బీజేపీకి కర్ణాటకలో షాక్ ఇచ్చి 2019 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవాలనేది కాంగ్రెస్ వ్యూహం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టాలనేది బీజేపీ ప్రతివ్యూహం. (సాక్షి ప్రత్యేకం) కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ గెలుపు రాహుల్ గాంధీ ఖాతాలోకి వెళుతుంది. తద్వారా జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ శక్తుల పునరేకీకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ తన మాటను చెల్లించుకునే అవకాశం దొరుకుతుంది. ఓడిపోతే... ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’’ ... షా... మోడీల నినాదానికి ప్రజల మద్దతు దొరికినట్టు అవుతుంది. ఎన్నికలు మే 12న ... ఫలితాలు మే 15న ... నడివేసవిలో కమలం వికసిస్తుందా... హస్తం పిడికిలి బిగిస్తుందా... ఎస్ . గోపీనాథ్‌రెడ్డి -
మైనారిటీ హోదా విషయంలో ఘర్షణ
సాక్షి, బెంగళూర్: లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన వీరశైవ లింగాయత్ నేతలు అన్నంత పని చేశారు. లింగాయత్ నేతల ప్రదర్శనను అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల ఘర్షణతో కర్ణాటకలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ వీరశైవ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. లింగాయత్ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. వారికి మైనారిటీ హోదా కల్పించాలన్న నాగమోహన్ దాస్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కర్ణాటక కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు కూడా పంపింది. లింగాయత్‌లకు మాత్రమే ప్రత్యేక మైనారిటీ హోదా కల్పిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని మొదటి నుంచి వీరశైవ లింగాయత్ స్వాములు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ వర్గ వారి అసమ్మతిని చల్లార్చేందుకు లింగాయత్‌లో భాగంగా వీరశైవ లింగాయత్‌లను కూడా గుర్తించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 12వ శతాబ్దానికి చెందిన వీరశైవ మతస్థాపకుడు బవసన్న అనుచరులే లింగాయత్‌లు, వీరశైవ లింగాయత్‌లు. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 17శాతం మంది ఉన్నారు. వీరికి మైనారిటీ హోదా ఇవ్వాలన్న అంశం చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది.