కర్ణాటక : ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టకుండా "పీస్‌ఫుల్ కర్నాటక" పేరుతో ఒక హెల్ప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి డి పరమేశ్వర, ఐటీ & గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గేలకు విజ్ఞప్తి చేశారు వాణిజ్యం & పరిశ్రమలు, మౌలికసదుపాయాల శాఖల మంత్రి ఎంబి పాటిల్.
తేజస్వి యాదవ్ వ్యాఖ్యలు...
అంతకుముందు బెంగళూరు సౌత్ ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య పార్టీ కార్యకర్తలపై దాడులు జరగకుండా రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో బీజేపీ ఒక హెల్ప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని, రాష్ట్రంలో ఎక్కడైనా కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తే వెంటనే హెల్ప్ లైన్ ను ఆశ్రయించాలని కోరారు. తేజస్వి చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మినిష్టర్ కూడా అంతే దీటుగా స్పందించారు.
మినిష్టర్ పాటిల్ కౌంటర్...
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి డి పరమేశ్వర, మంత్రి ప్రియాంక్ ఖర్గే గార్లకు మనవి. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టకుండా చూసేందుకు వీలుగా "పీస్‌ఫుల్ కర్నాటక" పేరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసే విషయాన్ని పరిగణలోకి తీసుకోగలరు.తద్వారా ఎక్కడైనా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వెంటనే ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి, పురోగతి సాధించి బ్రాండ్ కర్నాటకను రక్షించుకోవడమే మా ఎజెండా అని పాటిల్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment